Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టవింశత్యుత్తర త్రిశతతమోధ్యాయః.

అథ చ్ఛందస్సారః

అగ్ని రువాచ :

ఛందో వక్ష్యే మూలజైసై#్తః పింగలోక్తం యథాక్రమం | సర్వాదిమధ్యాన్తగణౌమ్నౌభ్యౌజ్రౌస్తౌత్రికాగణాః. 1

హ్రస్వోగురుర్వా పాదాన్తే పూర్వో యోగాద్విసర్గతః | అనుస్వారాద్వ్యంజనాత్స్యా జ్జిహ్వామూలీయతస్తథా. 2

ఉపధ్మానీయతోదీర్ఘోగురుర్‌ గ్లౌనౌ గణావిహ | వసవోష్టౌ7చ చత్వారో వేదాదిత్యదిలోకతః. 3

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అష్టవింశత్యుర త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను : ఇపుడు వేదమూలమంత్రాను సారముగ పింగలోక్త ఛందస్సులను క్రమముగా వర్ణించెదను. మ, న, భ, య, జ, ర, స, త, గణములు యని గణములు ఎనిమిది. అన్ని గణములందును మూడేసి అక్షరములుండును. మగణములో అన్ని అక్షరములుగురువులు. నగణములో అన్ని అక్షరములు లఘువులు. ఆది గురువు భగణము. ఆది లఘువుయగణము, అంత్యగురువు సగణము, అంత్యలఘువు తగణము. పాదాంతమునందున హ్రస్వాక్షరము వికల్పముగా గురువగును. విసర్గ అనుస్వార సంయుక్తాక్షర జిహ్వామూలీయ ఉపధ్మానీయములకు అవ్యవహిత పూర్వమునందున్న హ్రస్వము కూడ గురువు. దీర్ఘము గురువు గురువునకు ''గ'' లఘువునకు ''ల'' యని సంకేతము. వసు శబ్దము ఎనిమిదికి, వేద శబ్దము నాలుగుకు, సంజ్ఞయగును. ఈవిషయములను లోకాను సారము తెలుసుకొనవలెను.

అగ్ని మహాపురాణమున ఛందస్సారమను మూడువందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page