Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తవింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అథః దేవాలయాది మహాత్మ్యమ్‌

ఈశ్వర ఉవాచ :

వ్రతేశ్వరాంశ్చ సత్యాదీనిష్ట్వా వ్రత సమర్పణమ్‌ | అరిష్టశమనే శస్తమరిష్టం సూత్రనాయకమ్‌. 1

హేమరత్నమయంభృత్యై మహాశంఖం చ మారణ | ఆప్యాయనే శంఖ సూత్రం మౌక్తికం పుత్రవర్దనమ్‌.

స్ఫాటికం భూతిదం కౌశం ముక్తిదం రుద్రనేత్రజమ్‌ | ధాత్రీఫల ప్రమాణన రుద్రాక్షం చోత్తమం తతః. 3

నమేరుం మేరుహీనం వా సూత్రం జప్యన్తు మానసమ్‌ | అనామాంగుష్ఠమాక్రమ్య జపంభాష్యన్తు కారయేత్‌. 4

తర్జన్యం గుష్ఠమాక్రమ్య నమేరుం లంఘయేజ్జపే | ప్రమాదాత్పతితేసూత్రే జప్తవ్యన్తు శతద్వయమ్‌. 5

సర్వవాద్యమయీఘంటాతస్యా వాదనమర్థకృత్‌ | గోశకృన్మూత్ర వల్మీక మృత్తికా భస్మవారిభిః. 6

పరమేశ్వరుడు చెప్పెను. వ్రతేశ్వరులను సత్యాది దేవతలను పూజించి వారికి వ్రతము సమర్పించవలెను. అరిష్టశాంతికి అరిష్టమూలమాల ఉత్తమము కల్యాణ ప్రాప్తి సువర్ణ రత్నమాలా, మారణకర్మకు మహా శంఖమాలా, శాంతి కర్మకు శంఖమాలా పుత్ర ప్రాప్తికి మౌక్తికమాలా ఉపయోగించి జపము చేయవలెను. స్ఫటికమాల ఐశ్వర్య ప్రదము రుద్రాక్షమాలా ముక్తి ప్రదము. ఉసిరికాయ ప్రమాణము గల రుద్రాక్షము ఉత్తమము. మేరు సహితములు, లేదా, మేరు రహితమగు మాలను జపమునందు ఉపయోగించవచ్చును. మానసిక జపము చేయుచున్నపుడు మాలయందలి పూసలను అనామికాంగుష్ఠములతో జరపవలెను. ఉపాంశు జపమునందు తర్జన్యం గుష్ఠములను కలిపి గణన చేయవలెను. జప సమయమున ఎన్నడును మేరువును దాటరాదు. ప్రమాద వశమున మాల జారిపడినచో రెండు వందల పర్యాయము జపము చేయవలెను. ఘంట సర్వవాద్యమయము ఘంటావాదనము సకల ప్రయోజన ప్రదము గృహము నందును మందిరము నందును శివలింగమును గోమయ గోమూత్ర వల్మీక మృత్తికా భస్మ జలములతో శుద్ధి చేయవలెను.

వేశ్మాయతన లింగాదేః కార్యమేవ విశోధనమ్‌ |

స్కందోం నమః శివాయేతి మంత్రఃసర్వార్థ సాధకః. 7

గీతః పంచాక్షరో వేదేలోకే గీతః షడక్షరః | ఓమిత్యన్తే స్థితః శంభుర్ముద్రార్థం వటబీజవత్‌. 8

క్రమాన్నమః శివాయేతి ఈశాన్యాద్యాని వై విదుః | షడక్షరస్య సూత్రస్య భాష్యాద్విద్యాకదంబకమ్‌. 9

యదోం నమః శివాయేతి ఏతావత్పరమంపదమ్‌ | అనేన పూజయేల్లింగం లింగేయస్మాత్‌ స్థితః శివః. 10

అనుగ్రహాయ లోకానాం ధర్మ కామార్థ ముక్తిదః | యోనపూజయతే లింగం న స ధర్మాధి భాజనమ్‌. 11

లింగార్చనాద్భుక్తి ముక్తిర్యావజ్జీవమతోయజేత్‌ | వరం ప్రాణపరిత్యాగో భుం జీతా పూజ్యనైవతమ్‌. 12

రుద్రస్య పూజనాద్రు ద్రో విష్ణుఃస్యాద్విష్ణు పూజనాత్‌ |

సూర్యస్స్యాత్‌ సూర్యపూజాతః శక్త్యాదిః శక్తి పూజనాత్‌. 13

సర్వయజ్ఞ తపోదానే తీర్థేవేదేషు యత్ఫలమ్‌ | తత్ఫలం కోటిగుణితం స్థాప్యలింగం లభేన్నరః. 14

త్రిసంధ్యం యోర్చయేల్లింగం కృత్వాబిల్వేన పార్థివమ్‌ | శ##తైకాదశికం యావత్కుల ముద్ధృత్య నాకభాక్‌. 15

భక్త్యా విత్తాను సారేణ కుర్యాత్ర్పాసాద సంచయమ్‌ | అల్పే మహతివా తుల్యఫలమాఢ్య దరిద్రయోః. 16

భాగద్వయంచ ధర్మార్థం కల్పయేజ్జీవ నాయచ | ధనస్య భాగమేకన్తు అనిత్యం జీవితంయతః. 17

త్రిసప్త కులముద్ధృత్య దేవాగారకృదర్థ భాక్‌ | మృత్కాష్ఠేష్టకశైలాద్యైః క్రమాత్కోటి గుణంఫలమ్‌. 18

అష్టేష్టక సురాగారకారీ స్వర్గమవాప్నుయత్‌ | పాంసునా క్రీడమానో7పి దేవాగారకృదర్థభాక్‌. 19

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దేవాలయాది మాహాత్మ్య నిరూపణంనామ సప్తవింశత్యధిక త్రిశతతమోధ్యాయః.

స్కంధా ! ''ఓం నమశ్శివాయ'' యను మంత్రము సకలా భీష్టప్రదము. ఇది వేదమునందు పంచాక్షరమనియు లోకమున షడక్షరమనియు చెప్పబడినది. వట బీజములో వటవృక్షమున్నట్లు ఓంకారము నందు శివుడు సమ్మితుడై వుండును ''ఓం నమః శివాయ ఈశానః సర్వ విద్యానాం '' మొదలకు మంత్రములు సమస్త విద్యాసముదాయము. ఈషడక్షర మంత్రముకు భాష్యము ''ఓం నమః శివాయ'' యను మంత్ర మే పరమ పదము. ధర్మార్థకామ మోక్షముల నిచ్చు శివుడు లోకాను గ్రహార్థమై లింగములో నున్నాడు. అందుచే ఈ మంత్రముచే శివలింగమును పూజించవలెను. శివలింగమును పూజించని వాడు ధర్మదూరుడగును. లింగ పూజనము భుక్తిముక్తి ప్రదముగాన, ఆజీవితాంతము శివలింగమును పూజించవలెను. ప్రాణములు పోయినను శివలింగ పూజ చేయకుండగ భోజనము చేయకూడదు. రుద్ర పూజచే రుద్ర సారుప్యము, విష్ణు పూజచే విష్ణు సారూప్యము, సూర్య పూజచే సూర్య సారుప్యము, శక్తి పూజచే శక్తి సారూప్యము, లభించును. సంపూర్ణ యజ్ఞ తపోదాన ఫలములు లభించును. లింగస్థాపన చేసిన వానికి కోటిరెట్లు ఫలము లభించును. ప్రతిదినము త్రికాలములందును. పార్థివ లింగము నిర్మించి దానిని బిల్వ పత్రములతో పూజించువాని నూట పదకొండు తరముల వారు స్వర్గమును పొందుదురు. విత్తాను సారముగా భక్తి పూర్వకముగా దేవతా మందిరములు కట్టించవలెను. దేవాలయ నిర్మాణమున యథాశక్తిగా అల్పము ఖర్చు పెట్టిన దరిద్రునకును, అధికముగా ఖర్చు పెట్టిన ధనికునకు సమాన ఫలము లభించును. సంపాదించిన ధనము నందలి రెండు భాగములను ధర్మకార్యము నందు వ్యయించి జీవన నిర్వాహము నకు రెండు భాగము లుంచుకొనవలెను. జీవనము అనిత్యము కదా ! దేవతా మందిరమును నిర్మించువాడు ఇరువది యొక్క తరముల వారిని ఉద్ధరించి అభీష్టములను పొందును. మట్టి కర్ర ఇటుక శిల వీటితో మందిర నిర్మాణము వరసగా కోటి గుణ ఫలము కలది. ఎనిమిది ఇటుకలతోనైనను మందిరము నిర్మించువాడు స్వర్గలోకమును పొందును. ఆడుకొనుచు ధూళితో మందిరము కట్టు వానికి కూడ అభీష్టమనోరథసిద్ధి కలుగును.

అగ్ని మహాపురాణమున దేవాలయ మాహాత్మ్య వర్ణనమను మూడువందల ఇరువదియేదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page