Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకవింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథాఘోరాస్త్రాది శాంతికల్పః

ఈశ్వర ఉవాచ :

అస్త్రయాగః పురాకార్యః సర్వకర్మసు సిద్ధిదః | మధ్యేపూజ్యం శివాద్యస్త్రం వజ్రాదీన్పూర్వతః క్రమాత్‌. 1

పంచచక్రం దశకరం రణాదౌ పూజితం జయే | గృహపూజా రవిర్మధ్యే పూర్వాద్యాః సోమకాదయః. 2

సర్వ ఏకాదశ స్థాస్తు గృహాః స్యుర్గ్రహపూజనాత్‌ | అస్త్రశాంతి ప్రవక్ష్యామి నర్వోత్పాత వినాశినీమ్‌. 3

గ్రహరోగాది శమనీం మారీ శత్రు విమర్దినీమ్‌ | వినాయకోపతప్తిఘ్న మఘోరాస్త్రం జపేన్నరః. 4

లక్షం గ్రహాది నాశః స్యాదుత్పాతే తిలహోమకమ్‌ | దివ్యేలక్షం తదర్ధేన వ్యోమజోత్పాత నాశనమ్‌. 5

ఘృతేన లక్షపాతేన ఉత్పాతే భూమిజేహితమ్‌ | ఘృత గుగ్గులు హోమేచ సర్వోత్పాతాది మర్ధనమ్‌. 6

దూర్వాక్షతాజ్య హోమేన వ్యాధయో7థ ఘృతేనచ | సహస్రేణతు దుఃస్వప్నా వినశ్యంతిన సంశయః. 7

అయుతాద్గ్రహ దోషఘ్నో జవాఘృత విమిశ్రితాత్‌ | వినాయకార్తి శమనమయుతేన ఘృతస్యచ. 8

భూతవేతాళ శాంతిస్తు గుగ్గులోరయుతేన చ | మహావృక్షస్య భంగేతు వ్యాలకంకే గృహెస్థితే. 9

ఆరణ్యానాం ప్రవేశేచ దూర్వాజ్యాక్షత హావనాత్‌ | ఉల్కాపాతే భూమికమ్పే తిలాజ్యేనా హుతాచ్ఛివమ్‌. 10

రక్తస్రావే తు వృక్షాణామయుతాద్గుగ్గులోః శివమ్‌ | అకాలే ఫల పుష్పాణాం రాష్ట్ర భంగేచ మారణ. 11

ద్విపదాదేర్యదా మారీలక్షార్దాచ్చ తిలాజ్యతః | హస్తిమారీ ప్రశాంత్యర్థం కరిణీ దంతవర్ధనే. 12

హస్తిన్యాం మదదృష్టౌచ అయుతాచ్ఛాన్తిరిష్యతే | ఆకాలే గర్భపాతేతు జాతం యత్ర వినశ్యతి. 13

వికృతాయత్ర జాయన్తే యాత్రాకాలే7యుతం హునేత్‌ | తిలాజ్య లక్షహోమన్తు ఉత్తమా సిద్ధిసాధనే. 14

మధ్యమాయాం తదర్ధేన తత్పాదాదధమాసుచ | యథా జపస్తథా హోమః సంగ్రామే విజయో భ##వేత్‌. 15

అఘోరాస్త్రం జపేన్న్యస్య ధ్యాత్వా మూర్జితమ్‌. 15

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే7ఘోరాస్త్రాది శాంతికల్ప నిరూపణం నామైకవింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను. సమస్త కర్మల యందుసు ముందుగా సర్వసిద్ధి ప్రదమగు అస్త్రయాగము చేయవలెను. మధ్యభాగమున శివాది అస్త్రమును పూర్వాది దిక్కులందు క్రమముగ ఇంద్రాది దిక్పాలకుల అస్త్రములను పూజించవలెను. శంకరునకు ఐదు ముఖములు పది హస్తములున్నవి. అట్టి శంకరుని యుద్ధ ప్రారంభము పూజించినచో జయము కలుగును. మధ్య యందు రవిని పూర్వాది దిక్కు లందు చంద్రాదులను వుంచి గ్రహ పూజ చేయవలెను. గ్రహ పూజ చేయుటచే గ్రహములన్నియు ఏకాదశ స్థానమునందున్న లాభ రూప ఫలమును ఇచ్చును. సమస్త ఉత్పాతములను నశింపచేయు అస్త్రశాంతిని చెప్పెదను. ఇది గ్రహరోగాదులను మారి శత్రు భయాదులను తొలగించును. వినాయకుల వలన కల్గిన బాధలను తొలగించును. నరుడు లక్ష పర్యాయములు అఘోరాస్త్రము జపించినచో గ్రహములు నశించును. దివ్య ఉత్పాతములు కలిగి నపుడు అర్ధ లక్ష హోమములు చేయవలెను. లక్ష ఆజ్యాహుతులు చేసినచో భూమి జోత్పాతములు నశించును. గుగ్గులు మిశ్రఘృతమును హోమము చేసినచో అన్ని ఉత్పాతములు నశించును. దూర్వలు అక్షతలు ఆజ్యము. హోమము చేసిన సర్వరోగములు నశించును. ఘృతముతో సహస్ర హోమము చేసినచో దుస్స్వప్నములు నశించును. ఇందు సంశయము లేదు పది వేలు హోమము చేసినచో గ్రహ దోషములు తొలగును. యవఘృత హోమముచే వినాయక బాధలు తొలగును. పదివేల ఆజ్య హోమములు పది వేల గుగ్గులు హోమములు చేసినచో భూతవేతాళ శాంతి కలుగును. ఏదైన మహా వృక్షము పడిపోయినను ఇంటిలో సర్ప శవము వచ్చినను ఘృత, అక్షతల హోమములచే విఘ్నశాంతి కలుగును. అరణ్య ప్రవేశము చేయవలసినపుడు కూడ ఇట్లు చేయవలెను. ఉల్కాపాతము గాని, భూకంపము గాని కల్గినపుడు తిలఘృత హోమములు చేసిన మంగళమగును, వృక్షము నుండి రక్తము కారినను ఆకాలమున పుష్ప ఫలములు పుట్టినను రాష్ట్ర భంగము కల్గినను తిలమిశ్ర ఘృతముతో అర్ధ లక్ష హోమములు చేయవలెను. ఏనుగులకు మహా మారి వచ్చినపుడు ఆడ ఏనుగులకు దంతములు వచ్చినను లేదా వాటికి గండస్థలము నుండి మదము కారినను పది వేల హోమము చేసినచో శాంతి కలుగును. అకాలమున గర్భ పాతమైనను పుట్టిన వెంటనే శిశువు మరణించినను వికృతాంగములు గల శిశువు జన్మించినను సమయమునకు పూర్వమే శిశువు జన్మించినను పది వేల హోమములు చేసిన దోషము శమించును. సిద్ధిని సాధించుటకు తిల మిశ్రమములగు ఘృతముతో ఒక లక్ష హోమములు చేయుట ఉత్తమము. అర్ధ లక్ష హోమములు చేసినచో మధ్యమ సిద్ధయు ఇరువది ఐదు వేల హోమము చేసినచో అధమ సిద్ధయు కల్గును. జపాను సారముగ హోమము చేసినచో యుద్ధము నందు విజయము లభించును. తేజశ్శాలి యగు పంచ ముఖుని ధ్యానించుచు న్యాస పూర్వకముగ అఘోరాష్ట్ర జపము చేయవలెను.

అగ్ని మహాపురాణమునందు అఘోరాస్త్రాది శాంతి కల్ప నిరూపణ మను మూడువందల ఇరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page