Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచదశాధిక త్రిశతతమోధ్యాయః

అథ స్తంభనాది మంత్రాః

అగ్ని రువాచ :

స్తంభనం మోహనం వశ్యం విద్వేషోచ్చాటనంవదే | విషవ్యాధి మరోగంచ మారణం శమనం పునః. 1

భూర్జేకూర్మం సమాలిఖ్య తాడనేన షడంగులమ్‌ | ముఖపాద చతుష్కేషుతతో మంత్రస్యసేద్‌ ద్విజః. 2

చతుష్పాదేషు క్రీంకారం హ్రీంకారం ముఖమధ్యతః | గర్భేవిద్యాం తతోలిఖ్య సాధకం పృష్ఠతోలిఖేత్‌. 3

మాలామంత్రైస్తు సంవేష్ట్య ఇష్టకోపరిసంన్యసేత్‌ | పిధాయ కూర్మపృష్ఠేన కరాలే నాభిసంపఠేత్‌. 4

మహాకూర్మం పూజయిత్వా పాదప్రోక్షన్తు నిక్షిపేత్‌ | తాడయేద్వామ పాదేనస్మృత్వా శత్రుంచ సప్తధా. 5

తతః సంజాయతే శత్రోః స్తంభనం ముఖరాగతః |

అగ్నిదేవుడు పలికెను. ఇపుడు స్తంభనమోహన వశీకరణ, విద్వేషణ ఉచ్చాటన ప్రయోగములను విషవ్యాధి ఆరోగ్య మారణ శమన ప్రయోగములను చెప్పెదను. భూర్జ పత్రముపై ఆరు అంగుళముల కూర్మ చక్రమును తాడనముతో వ్రాయవలెను. దాని ముఖ ముఖము నందును, పాదము లందును మంత్ర న్యాసము చేయవలెను. పాదములందు క్రీం, ముఖమునందు హ్రీం, గర్భ స్థానమున త్వరితా విద్యను వ్రాసి పృష్ఠ భాగమున సాధ్య నామము వ్రాయవలెను. మాలామంత్రములతో వేష్టితముచేసి ఆయంత్రమును ఇటుకపై స్థాపించి దానిని కప్పి కూర్మ పీఠమునందున్న కరాళ మంత్రముతో అభిమంత్రించవలెను. మహా కూర్మమును పూజించి శత్రువునుద్దేశించి చర్మోదకమును చిమ్మి శత్రువును స్మరించుచు వానిని ఏడు పర్యాయము ఎడమ పాదముతో తన్న వలెను. అపుడు శత్రువునకు ముఖ భాగస్తంభనము కలుగును.

కృత్వాతుభైరవం రూపం మాలామంత్రం సమాలిఖేత్‌. 6

ఓం శత్రుముఖస్తంభనీ కామరూపా ఆలీఢకరీ హ్రీం ఫేం

ఫేత్కారిణి మమ శత్రూణాం దేవదత్తానాం ముఖ స్తంభయ స్తంభయ మమ

సర్వవిద్వేషిణాం ముఖస్తంభనం కురు కురు ఓం హ్రూం ఫేం ఫేత్కారిణి స్వాహా.

ఫట్‌ హేతుంచ సమాలిఖ్య తజ్జపాన్తం మహాబలమ్‌ | వామేనైవ నగం శూలం సంలిఖేద్ధక్షిణకరే. 7

లిఖేన్మంత్ర మఘోరస్య సంగ్రామే స్తంభ##యేదరీన్‌ |

ఓం నమో భగవత్యై భగమాలిని విస్ఫుర విస్ఫుర స్పన్ద స్పన్ద నిత్య క్లిన్నే

ద్రవ ద్రవ హూంసః క్రీంకారాక్షరే స్వాహా | అనేన తిలకం కృత్వా రాజాధీనాం వశీకరమ్‌.

గర్దభస్య రజోగృహ్య కుసుమం సూతకస్య చ. 9

నారీరజః క్షిపేద్రాత్రౌ శయ్యాదౌ ద్వేషకృద్భవేత్‌ | గోఖురంచ తథాశృంగమశ్వస్యచఖురంతథా. 10

శిరః సర్పస్య సంక్షిప్తం గృహేషూచ్చాటనం భ##వేత్‌ | కరవీర శిఫాపీతా సంసిద్ధార్థా చ మారణ. 11

వ్యాల ఛుంచ్ఛున్ధరీ రక్తం కరవీరం తదర్థకృత్‌ | సరటం షట్‌ పదం చాపి తథా కర్కట వృశ్చికమ్‌. 12

చూర్ణీకృత్యక్షిపేత్తైలే తదభ్యంగశ్చ కుష్ఠకృత్‌ |

భైరవమూర్తి వ్రాసి దాని నలువైపుల ''ఓం శత్రు ముఖ మొదలు, స్వాహా, వరకును వున్న మూలోక్త మంత్రమును వ్రాయవలెను. పిదప షట్‌ యనియు ప్రయోగోద్దేశ్యమును వ్రాసి ఆమంత్రమును జపించుచు, భైరవుని వామహస్తమున సగమును దక్షిణ హస్తమున శూలమును వ్రాసి అఘోర మంత్రమును వ్రాయవలెను. దీని వలన యుద్ధమునందు శత్రువులు స్తంభితులగుదురు. ''ఓం నమో భగవత్యై మొదలు స్వాహా వరకును వున్న మూలోక్త మంత్రమును జపించుచు గోరోజనాదికముతో తిలకము ధరించినచో మానవుడు సమస్త జగత్తును మోహింపచేయును. ''ఓం ఫేం'' మొదలు స్వాహా వరకును వున్న మూలోక్త మంత్రముతో తిలకము ధరించినవాడు రాజాదులను వశము చేసుకొనును. గర్దభధూళి తీసుకుని శవముపై వేసిన పువ్వులు స్త్రీరజోయుక్త వస్త్రఖండము తీసుకొని రాత్రి శత్రువు శయ్యాదులపై విసరి నచో స్వజన విద్వేషము కలుగును. అపుడెక్క కొమ్ము గుర్రపుడెక్క, సర్ప శిరస్సు వాటిని నూరి కలిపి శత్రువు ఇంటిపై వేసినచో వారి ఉచ్చాటనము కలుగును. పచ్చని కరవీరశివ. మారణ ప్రయోగము నందు ఉపయుక్తమైనది. సర్పము, రక్తము, చుంచు రక్తము కరవీర బీజము, మారణ సాఢకములు. చచ్చిన తొండ తుమ్మెద పీత. తేలు, వీటిని చూర్ణము చేసి తైలములో వేసి ఆ తైలమును శరీరమునకు పూసినచో కుష్టరోగము కలుగును.

ఓం నవగ్రహాయ సర్వ శత్రూన్మమసాధయ7సాధయ

మారయ మారయ ఆసోం ఆసోం మం ఋం చుం ఓం శంవాం కీం ఓం స్వాహా |

అనేనార్క శ##తైరర్చ్య శ్మశానే తునిధాపయేత్‌. 13

భూర్జేవా ప్రతిమాయాంవా మారణాయ రిపోర్త్రహాః

ఓం కుంజరీ బ్రహ్మాణీ | ఓం మంజరీ మాహేశ్వరీ |

ఓం వేతాళీ కౌమారీ | ఓంకాలీ వైష్ణవీ | ఓం అఘోరా

వారాహీ | ఓం వేతాలీ ఇంద్రాణీ ఊర్వశీ | ఓం వేతాళీ

చండికా | ఓం జయానీ యక్షిణీ | నవమాతరో హేమమ

శత్రుం గృహ్ణత. గృహ్ణత భూర్జేనామ రిపోర్లిఖ్య శ్మశానే పూజితే మ్రియేత్‌. 14

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే స్తంభన మంత్ర నిరూపణం నామ పంచదశాధిక త్రిశతతమో7ధ్యాయః.

''ఓం నవగ్రహాయ'' మొదలు స్వాహా వరకును వున్న మూలోక్త మంత్రమును భూర్జ పత్రముపై కాని నవగ్రహప్రతిమపై గాని వ్రాసి నూరు జిల్లెడు పూవులతో పూజించి ఆ యంత్రమును శ్మశానమున పాతినచో గ్రహములు శత్రువును నశింపచేయును. ''ఓం కుంజరీ'' మొదలు గృహ్ణత వరకునువున్న మూలోక్త మంత్రమును భూర్జ పత్రముపై వ్రాసి శత్రుపదస్థానమున శత్రునామము వ్రాసి శ్మశానమునందు ఆయంత్రమును పూజించినచో శత్రువు నశించును.

అగ్నిమహాపురాణమున స్తంభన మంత్ర నిరూపణమను మూడువందల పదిహేనవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page