Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ లక్ష్మ్యాదిపూజా

అగ్ని రువాచ :

వక్షః సవహ్నిర్వామాక్షౌదండీశ్రీః సర్వసిద్ధిదా | మహాశ్రియే మహాసిద్దే మహావిద్యుత్ర్పభేనమః. 1

శ్రియేదేవి విజయే నమః గౌరి మహాబలే బంధ బంధ నమః

హూం మహాకాయే పద్మహస్తే హ్రూంఫట్‌ శ్రియైనమః

హ్రూం శ్రియేఫట్‌ శ్రియైనమః (శ్రియైఫట్‌ శ్రీం నమః)

శ్రియే శ్రీద నమః స్వాహా శ్రీఫట్‌.

అస్యాంగాని నవోక్తాని తేష్వేకంచ సమాశ్రయేత్‌ | త్రిలక్ష మేకలక్షం వా జప్త్వాక్షాబ్జైశ్చ భూతిదః. 2

శ్రీగేహే విష్ణుగేహే వాశ్రియం పూజ్యధనం లబేత్‌ | ఆజ్యాక్తైన్తండులైర్లక్షం జుహుయాత్ఖాదిరానలే. 3

రాజా వశ్యోభ##వేద్వృద్ధిః శ్రీశ్చస్యా దుత్తరోత్తరమ్‌ | నర్షపాంఖో7భిషేకేన నశ్యన్తే నకలాగ్రహాః. 4

బిల్వలక్షహుతా లక్ష్మీర్విత్తవృద్ధిశ్చ జాయతే | శక్రవేశ్మ చతుర్ద్వారం హృదయే చింతయేదథ. 5

బలాకాం వామనాం శ్యామాం శ్వేతపంకజ ధారిణీమ్‌ |

ఊర్ద్వబాహుద్వయాం ధ్యాయేత్ర్కీడన్తీం ద్వారిపూర్వవత్‌. 6

ఊర్ద్వీకృతేన హస్తేన రక్త పంకజ ధారిణీమ్‌ | శ్వేతాంగీం దక్షిణ ద్వారి చిన్తయేద్వనమాలినీమ్‌. 7

హరితాం దోర్ద్వయేనోర్ద్వ ముద్వహన్తీం సితాంబుజమ్‌ |

ధ్యాయే ద్విభీషికాం నామ శ్రీదూతీం ద్వారి పశ్చిమే. 8

శంకరీ ముత్తరే ద్వారి తన్మధ్యే7ష్టదలపంకజమ్‌ | వాసుదేః సంకర్షణః ప్రద్యుమ్నశ్చా నిరుద్ధకః. 9

ధ్యేయాస్తే పద్మపత్రేషు శంఖచక్ర గదాధరాః | అంజన క్షీర కాశ్మీర హేమాభాస్తే సువాసనః. 10

ఆగ్నేయాదిషు పత్రేషు గుగ్గులుశ్చ కురంటకః దమకః సలిలంచేతి హస్తినో రజతప్రభాః. 11

హేమకుంభ ధరాశ్చైతే కర్ణికాయాం శ్రియంస్మరేత్‌| చతుర్భుజాం సువర్ణాభాం సపద్మోర్ద్వభుజద్వయమ్‌. 12

దక్షిణాభయ హస్తాభ్యాం వామహస్త వరప్రదామ్‌ | శ్వేతగంధాంశుకామేక రౌమ్యమాలాస్త్ర ధారిణీమ్‌. 13

ధ్యాత్వాసపరివారాం తామభ్యర్ఛ్య సకలంలభేత్‌ |

అగ్నిదేవుడు పలికెను వాంత (శ్‌) వహ్ని (ర్‌) వామనేత్ర (ఈ) దండ (ం) ముల యోగముచే ఏర్పడిన శ్రీం అను బీజము శ్రీ దేవీ మంత్రము. సర్వసిద్ధి ప్రదము. మహాశ్రియే మహాసిద్ధే మహావిద్యుత్ర్పభే శ్రియేదేవి విజయే గౌరి మహాబలే బంధ నమః హుం మహాకాయే పద్మ హస్తేహుంఫట్‌ శ్రియై నమః హ్రూం శ్రియై ఫట్‌ శ్రియైనమః శ్రియే శ్రీద నమః స్వాహా శ్రీఫట్‌" ఇవి శ్రీ మంత్రమునకు తొమ్మిది అంగ న్యాసములు చెప్పబడినవి. వీటిలో ఒక దానిని గ్రహించవలెను. పద్మాక్షమాలతో ఈ మంత్రమును మూడు లక్షలుగాని, ఒక లక్షగాని జపించినచో ఐశ్వర్యము లభించును. లక్ష్మీ ఆలయమునందుగాని విష్ణ్వాలయము నందుగాని శ్రీదేవిని పూజించినచో ధనము లభించును. ఖదిర కాష్ఠముతో ప్రజ్వలించుచున్న అగ్నిలో ఘృత మిశ్రతండులములతో నూరు హోమములు చేసినచో రాజువశుడగును. లక్ష్మికి ఉత్తరోత్తర వృద్ధి కలుగును శ్రీ మంత్రముతో అభిమంత్రించిన వర్షవ జలముతో స్నానము చేయగ సకల విధ గ్రహబాధలు నశించును. ఒక లక్ష బిల్వ ఫలములు హోమము చేసిన లక్ష్మి లభించును. ధన వృద్ధి కలుగును. నాలుగు ద్వారములు గల ఒక శక్ర వేశ్మను భావనచేయవలయును. పూర్వ ద్వారముపై క్రీడించుచున్నదియు, రెండు భుజములు పైకి ఎత్తి వున్నదియు, శ్వేతకమలమును ధరించినదియు, శ్యామ వర్ణయు వామనాకృతి కలదియు అగు బలాకీని ధ్యానము చేయవలయును. దక్షిణ ద్వారమున పైకి ఎత్తిన ఒక హస్తమున రక్త కమలము ధరించి యున్న శ్వేత శరీరయగు వనమాలిని ధ్యానించవలెను. పశ్చిమ ద్వారమున పైకి ఎత్తిన రెండు చేతులలో శ్వేత పుండరీకమును ధరించినదియు, హరిత వర్ణయు, విభీషిక యను పేరు కలది యగు శ్రీ దూతిని ధ్యానించవలెను. ఉత్తర ద్వారమున శాంకరిని ధ్యానించవలెను. శక్ర వేశ్మ మధ్యమున అష్టదళ కమలము నిర్మించి దాని దళములపై వరుసగా శంక చక్ర గదా పద్మములను ధరించిన వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్నుని అనిరుద్ధులను ధ్యానించవలెను. వారి శరీర కాంతి వరసగా అంజన దుగ్ధ కేసర సువర్ణములతో సమానము, వీరు సుందర వస్త్రాలంకృతులు, ఆగ్నేయాది దళము లందు గుగ్గులు కురంటజ దమక, సలిలులు యను దిగ్గజములను భావన చేయవలెను. ఈ దిగ్గజములు స్వర్ణ కలశములను ధరించి యుండును. కమల కర్ణిక యందు శ్రీ దేవిని స్మరించవలెను. చతుర్భుజ యగు ఆమె శరీరము సువర్ణ కాంతి కలని పైకి ఎత్తిన రెండు హస్తము లందును కమలములును దక్షిణా హస్తమున అభయ ముద్రయు వామ హస్తమున వరముద్రయు యుండును. శుభ్రమైన సుగంధములైన వస్త్రములను తెల్లని మాలను ధరించి యుండును. అట్టి శ్రీదేవిని ధ్యానించి సపరివారముగా ఆమెను పూజించినవాడు సకల ఫలములను పొందును.

ద్రోణాబ్జ పుష్పం శ్రీవృక్షవర్ణం మూర్ద్నిన ధారయేత్‌. 14

లవణామలకం వర్జ్యం నాగాదిత్య తిథౌక్రమాత్‌ | పాయసాశీ జపేత్సూక్తం శ్రియస్తే నాభిషేచయేత్‌. 15

ఆవాహాది విసర్గాన్తం మూర్ద్నిధ్యాత్వార్చ యేచ్ర్ఛియమ్‌|బిల్వాజ్యాబ్జ పాయసేన పృథక్‌యోగః శ్రియేభ##వేత్‌.

విషం మహిషకాలాగ్ని రుద్రజ్యోతిర్వకద్వయమ్‌ |

ఓం హ్రీం మహామహిషమర్దిని ఠఠ మూలమంత్రం మహిష హింసకేనమః |

మహిషశత్రం భ్రామయ భ్రామయ ఓం హ్రూం ఫట్‌ ఠఠ.

మహిషం హేషయ హేషయ మహిషం ప్రేషయ షయ హ్రూం

మహిషం హనహన దేవి హ్రూం మహిషనిషూదని ఫట్‌.

దుర్గాహృదయ మిత్యుక్తం సాంగం సర్వార్థ సాధకమ్‌. 17

యజేద్య థోక్తాం తాందేవీం పీఠంచైవాంగ మధ్యమమ్‌|

ఓం హ్రీం దుర్గేరక్షణి స్వాహా చేతిదుర్గాయైనమః వరనర్ణైనమః|

అర్ఘ్యాయైకనక ప్రభాయై కృత్తికాయై అభయ ప్రదాయై కన్యకాయై సురూపాయై.

పత్రస్థాః పూజయేదేతా మూర్తీరాద్యైః స్వరైః క్రమాత్‌. 18

చక్రాయ శంఖాయ గదాయై ఖడ్గాయ ధనుషే బాణాయ |

అష్టమ్యాద్యై రిమాందుర్గాంలోకే శాంతాంయజేదితి|దుర్గాయోగఃసమాయః శ్రీస్వామి రక్తజయాదికృత్‌. 19

సంసాధ్యేశాన మంత్రేణ తిలహోమీ వశీకరః | జయః పద్మైస్తుదూర్వాభిః శాన్తికామః పలాశ##జైః

పుష్టిః స్యాత్కాక పక్షేన మృతిద్వేషాదికం భ##వేత్‌ | గృహక్షుద్ర భయాపత్తిం సర్వామేవ మనుర్హరేత్‌. 21

ఓం దుర్గే దుర్గే రక్షణిస్వాహా | రక్షాకరీయ ముదితా జయదుర్గాంగ సంయుతా |

శ్యామాంత్రిలోచనాం దేవీంధ్యాత్వాత్మానం చతుర్భుజమ్‌. 22

శంఖచక్రాబ్జ శూలాసి త్రిశూలా రౌద్రరూపిణీమ్‌ | యుద్ధాదౌ సంజయేదేతాం యజేత్ఖడ్గాది కేజయే. 23

ఓం నమోభగవతి జ్వాలామాలిని గృధ్రీగణ పరివృతే చర రక్షణీ స్వాహా.

యుద్దర్థేచ జపేన్మంత్రం శత్రూంజయతియోధకః. 25

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే లక్ష్మ్యాది పూజావర్ణనంనామాష్టాధిక త్రిశతతమో7ధ్యాయః.

పూజా సమయమున ద్రోణపుష్పమును కమలమును బిల్వ పత్రమును శిరస్సున ధరింకూడదు. పంచమీ సప్తముల యందు వరుసగా లవణమును ఆ మలకమును త్యజించవలెను. పాయసమును మాత్రము భుజించుచు శ్రీ సూక్తము జపించి ఆ నూక్తముతోనే అభిషేకము చేయవలెను. ఆవాహనాది విసర్జన పర్యంతమ అన్ని ఉపచారములను శ్రీ సూక్తఋక్కులతో చేసి ధ్యాన పూర్వకముగ శ్రీ దేవిని పూజించవలెను. బిల్వ ఘృత కమల పాయసములు కలిపి గాని వేర్వేరుగా కాని లక్ష్మి నుద్దేశించి హోమమును చేయవచ్చును. ఈ హోమము లక్ష్మి ప్రాప్తికిని మంచిది. విష (మ) హిమజ్జా(ష) కాల (మ) అగ్ని (ర) అతి (న) నిష్ఠ (ఇ) ని స్వాహా (మహిష మర్దిని స్వాహా). ఇది మహిష మర్దిని అష్టాక్షర మంత్రము. "ఓం హ్రీం మహా మహిష మర్దిని స్వాహా" ఇది మూల మంత్రము. మహిష మర్దిని మహిష శత్రుంభ్రామయ. "ఓం హ్రూం ఫట్‌" మహిషం హేషయ హేషయ మహిషం హ్రేషయ హ్రేషయ హ్రూం మహిషం హనహన దేవి హ్రూం మహిషనిఘాదని ఫట్‌." ఇది అంగ సహితమగు దుర్గా హృదయము. సర్వకార్య సాధకము. పీఠముపై అష్ట దళ కమలముపై దుర్గాదేనిని ఈ క్రింది విధముగా పూజించవలెను. ఓం హ్రీం దుర్గే రక్షణి స్వాహ. ఇది దుర్గా మంత్రము. అష్ట దళ పద్మముపై దుర్గా వర వర్ణినీ ఆర్యా, కనకప్రభా, కృత్తికా, అభయప్రదా కన్యకా, సురూప అను శక్తుల ఆద్యక్షరములకు బిందువు చేర్చి ఆ బీజ మంత్రములతో కూడి నామ ఘంత్రములతో పూజించవలెను, చక్ర శంఖ గదా ఖడ్గ బాణ ధనుష్‌, అంకుశ ఖేటములను కూడ పూజించవలెను. అష్టమ్యాది తిథులందు లోకేశ్వరీ దుర్గను పూజించవలెను. ఈ దుర్గోపాసన పూర్ణాయుర్దాయమును లక్ష్మిని యుద్ధము నందు జయమును ఇచ్చును. వశము చేసుకొనవలసిన వాని నామము చేర్చి ఈ మంత్రముతో తిలహోమము చేయువాడు వశము చేసుకొనును. కమల హోమముచే విజయము లభించును. శాంతి కోరువాడు దూర్వా హోమము చేయవలయును. పలాశ సమిధలచే పుష్టి కలుగును. కాక పక్షములు హోమము చేసినచో మారణ విద్వేషణ కర్మలు సిద్ధించును. ఈ మంత్రము సకల గ్రహ క్షుద్ర భయ ఆపదలను నశింప చేయును. "ఓం దుర్గే దుర్గే రక్షణి స్వాహ". ఇది అంగసహిత మగు రక్షను ఇచ్చు జయ దుర్గా మంత్రము. శ్యామాంగియు త్రినేత్రియు చతుర్భుజయు శంఖ, ఛక్ర, శూల, ఖడ్గ, ధారిణియు రౌద్ర రూపిణియు అగు రణ చండి నేనే యని ధ్యానము చేయవలెను. యుద్ధ ప్రారంభమున ఈ జయ దుర్గా మంత్రము జపించవలెను. ఖడ్గాదులపై దుర్గా పూజను చేసినచో విజయము లభించును. యుద్ధము నందు ఓం నమో భగవతి జ్వాలామాలిని| గృధ్ర గణ పరివృతే చరా చర రక్షిణి స్వాహా యను మంత్రమును జపించవలెను. విజయము లభించును.

అగ్ని మహా పురాణమున లక్ష్మ్యాది పూజా వర్ణన మను మూడు వందల యెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page