Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్ర్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథాంగాక్షరార్చనమ్‌

అగ్ని రువాచ :

యదా జన్మర్‌క్షగశ్చంద్రో భానుః సప్తమరాశిగః | పౌష్ణః కాలః సవిజ్ఞేయ స్తదా శ్వాసం పరీక్షయేత్‌. 1

కంఠోష్ఠౌ చలతః స్థానాద్యస్య వక్రాచ నాసికా | కృష్ణాచ జిహ్వాసప్తాహం జీవితం తస్యవైభ##వేత్‌. 2

తారోమేషో మిషం దన్తీనరో దీర్ఘోఘనారసః | క్రుద్ధోల్కాయ మహోల్కాయ వీరోల్కాయ శిఖాభ##వేత్‌. 3

ఉల్కాయ సహస్రాల్కాయ వైష్ణవో7ష్టాక్షరోమనుః | కనిష్ఠాదిత దష్టానామంగులీనాం చ పర్వసు. 4

జ్యేష్ఠాగ్రేణ క్రమాత్తారం మూర్ధన్యష్టాక్షరం న్యసేత్‌ | తర్జన్యాం తారమంగుష్ఠలగ్నే మధ్యమయాచతత్‌. 5

తలే7ంగుష్ఠే తదుత్తారం బీజోత్తారం తతోన్యసేత్‌ | రక్తగౌరధూమ్ర హరిజ్జాతరూపాః సితాస్త్రయః. 6

ఏవంరూపానిమాన్‌ వర్ణాన్భావ బద్ధాన్య సేత్ర్కమాత్‌ | హృదాస్యనేత్ర మూర్ధాం ఘ్రితాలు గుహ్యకరాదిషు.

అంగానిచన్య సేద్బీజాన్న్యస్యాథ కరదేహయోః | యథాత్మని తథాదేవేన్యాసః కార్యః కరం వినా. 8

హృదాదిస్ఠాన గాన్వర్గాన్గంధపుషై#్పః సమర్చయేత్‌ | ధర్మాదగ్న్యాద్య ధర్మాది గాత్రేపీఠే7బుజేన్యసేత్‌. 9

యత్ర (పద్మ) కేసర కింజల్కవ్యాపి సూర్యేందు దాహినామ్‌ |

మండలం త్రితయం తావద్భే దైస్తత్ర న్యసేత్ర్కమాత్‌. 10

గుణాశ్చతత్ర సత్త్వాద్యాః కే సరస్థాశ్చ శక్తయః | విమలోత్కర్షణీజ్ఞాన క్రియాయోగాశ్చవై క్రమాత్‌. 11

ప్రహ్వీ సత్యా తథే శానానుగ్రహా మధ్యతస్తతః | యోగపీఠ సమభ్యర్చ్య సమావాహ్య హరిం యజేత్‌. 12

పాద్యార్ఘ్యాచమనీయంచ పీతవస్త్ర విభూషణమ్‌ | ఏతత్పంచోపచారం చ సర్వం మూలేన దీయతే. 13

వాసుదేవాదయః పూజ్యాశ్చత్పారో దిక్షు మూర్తయః | విదిక్షు శ్రీసరస్వత్యైరతి శాన్త్యైచ పూజయేత్‌. 14

శంఖం చక్రం గదా పద్మం ముసలం ఖడ్గశార్‌జ్గకే | వనమాలాన్వితం దిక్షు విదిక్షు చయజేత్క్రమాత్‌. 15

అభ్యర్చ్యచ బహిస్తార్‌క్ష్యం దేవస్య పురతో7ర్చయేత్‌ | విష్వక్సేనంచ సోమేశం మధ్యే ఆవరణాద్బహిః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే7ంగాక్షర పూజావిధిర్నామత్ర్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు చెప్పెను. చంద్రుడు జన్మ నక్షత్రము నందును సూర్యుడు సప్తమ రాశి యందును వున్నచో యది పౌష్ణ కాలము. అపుడు శ్వాసను పరీక్షించ వలయును. ఎవని కంఠము ఓష్ఠములు స్థానము నుండి చలించినవో నాసిక వక్రమైనదో జిహ్వ నల్లపడినదో అతడు ఏడు దినములకు మించి జీవించడు. తార (ఓం) మేష (న) విష (మ) దంతీ (ఓ) దీర్ఘ స్వర యుక్త (న, ర, లు) య నాలు రసము (య) ఇది మహావిష్ణువు యొక్క అష్టాక్షర మంత్రము (ఓం నమోనారాయణాయ ''క్రుద్ధోల్కాయ'' మహోల్కాయ ''వీరోల్కాయ'' ''ద్యుల్కాయ'' ''సహస్రోల్కాయ'' అను మంత్రములతో హృదయ శిరః శిఖా భుజద్వయ సకల దిగ్భాగము లందు న్యాసము చేయవలయును. కనిష్ఠ మొదలు కనిష్ఠవరకు ఎనిమిది వ్రేళ్ళ పర్వము లందును అష్టాక్షర మంత్రముయొక్క ఎనిమిది అక్షరములను ఒక్కొక్క దానిని ప్రణవము ''నమః'' తో సంపుటితము చేసి అంగుష్ఠాగ్ర భాగముచే క్రమముగ న్యాసము చేయవలయును. తర్జని యందు మధ్యమాయుక్త మగు అంగుష్ఠము నందు కరతలము నందు మరల అంగుష్ఠము నందు ప్రణవ న్యాసమునకు ఉత్తార మనిపేరు. అందుచే వెనుక చెప్పిన న్యాసము చేసిన పిమ్మట బీజోత్తార న్యాసము చేయవలయును. ఈ మంత్రము నందలి మొదటి ఐదు అక్షరముల వర్ణములు వరుసగ రక్త గౌర. ధూమ్ర హరిత, సువర్ణ రూపములు. చివరి మూడు వర్ణముల రంగు శ్వేతము. వర్ణములను ఈ రూపములలో భావనచేసి క్రమముగా హృదయము ముఖ నేత్ర శీర్ష చరణములు, గుహ్య హస్తాదు లందు న్యాసము చేయవలయును. హస్తము లందును, దేహము నందును బీజ న్యాసము చేసి మరల అంగన్యాసము చేయవలయును. తన శరీరము నందు చేసినట్లే దేవ విగ్రహము నందు కూడ కరన్యాసము తప్ప ఇతర న్యాసములు చేయవలయును. దేవతా విగ్రహము యొక్క హృదయాద్యంగము లందు న్యాసము చేసిన వర్ణములను గంధ పుష్పములతో పూజించవలయును. దేవ పీఠముపై ధర్మాదులను అగ్న్యాదులను అధర్మాదులను వాటి వాటి స్థానమున న్యాసము చేయవలయును. పిదప దానిపై కమలము కూడ న్యాసము చేయవలయును. ఆ పీఠముపైననే కమల దళములు, కేసరములు కింజల్కవ్యాపి, సూర్యమండల చంద్రమండల, అగ్ని మండలములు వేరువేరుగ, క్రమముగ న్యాసము చేయవలయును. అచట సత్త్వాది గుణత్రయమును కేసరములపై నున్న విమలా - ఉత్కర్షిణీ - జ్ఞాన - క్రియా - యోగ - ప్రహ్వీ - సత్యా - ఈశాన - యను ఎనిమిది శక్తులను భావన చేయవలయును. ఈ ఎనిమిది శక్తులును ఎనిమిది దిక్కులందుండును. తొమ్మిదవదగు అనుగ్రహశక్తి మధ్య యందుండును. పాద్య అర్ఘ్య అదమనీయ పీతాంబర అలంకారములు అనునవి ఐదు ఉపచారములు. వీటిని నన్నింటిని మూల మంత్రముతో సమర్పించవలెను. పీఠము యొక్క పూర్వాది దిక్కుల యందు వాసుదేవాది మూర్తి చతుష్టయమును ఆగ్నేయాది విదిక్కుల యందు క్రమముగా శ్రీ సరస్వతీ రతి, శాంతులను పూజించవలెను. ఇట్లే దిక్కు లందు శంఖ చక్ర గదా పద్మములను విదిక్కు లందు ముసల ఖడ్గ శార్జ వనమాలలను పూజించవలెను. మండలము వెలువల గరుత్మంతుని పూజించి నారాయణుని ఎదుట నున్న విష్వక్సేనుని మధ్య భాగమున సోమేశుని, ఆవరణము వెలుపల ఇంద్రాది పరిచారక వర్గముతో శ్రీ మహా విష్ణువును పూజించిన సాధకునకు సర్వ ఫలములు సిద్ధించును.

అగ్ని మహా పురాణమున అంగాక్షర పూజా విధి యను మూడు వందల మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page