Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచనవత్యధిక ద్విశతతమోధ్యాయః

అథ దష్ట చికిత్సా

అగ్నిరువాచ :

మంత్రధ్యా నౌషధైర్దష్ట చికిత్సాం ప్రవదామితే |

ఓం నమో భగవతే నీలకంఠాయేతి జపనాద్విషహానిః స్యాదౌషధం జీవరక్షణమ్‌. 1

సాజ్యం సకృద్రసం పేయం ద్వివిధం విషముచ్యతే | జంగమం సర్పమూషాది శృంగాది స్థావరం విషమ్‌.

శాంత స్వరాన్వితో బ్రహ్మా లోహితం తారకం శివః | వియతేర్నామ మంత్రోయం తార్యక్ష శబ్దమయఃస్మృతః.

ఓం జ్వల మహామతే హృదయాయ గరుడవిడాల

శిరసే గరుడ శిఖాయై గరుడ విష భంజన ప్రభేదన

ప్రభేదన విత్రాసయ విత్రాసయ విమర్థయ విమర్దయ

కవచాయ అప్రతిహత శాసనం వం హూం ఫట్‌ అస్త్రాయ

ఉగ్రరూపధారక సర్వభయంకర భీషయ సర్వం దహదహ

భస్మీకురుకురు స్వాహా.

నేత్రాయసప్త వర్గాంతయుగ్మాష్ట దిగ్దల స్వర |

కేసరాది వర్ణరుద్దం వహ్నిరా భూత కర్ణికం మాతృకాంబుజమ్‌.

కృత్యా హృదిస్థం తన్మంత్రీ వామ హస్తతలేస్మరేత్‌ | అంగుష్టాదీన్‌ న్యసేద్వార్ణాన్వియ

తే ర్బేదితాః కలాః. 4

పీతం వజ్ర చతుష్కోణం పార్థవం శక్రదైవతమ్‌ | వృత్తార్దమాప్యం పద్మార్ధం శుక్లం వరుణ దైవతమ్‌. 5

త్ర్యస్త్రం (స్రం) స్వస్తిక యుక్తంచ తైజసం వహ్ని దైవతమ్‌ |

వృత్తం బిందు వృతం వాయుదైవతం కృష్ణమానిలమ్‌. 6

అగ్ని దేవుడు చెప్పెను. మంత్ర, ధ్యాన, ఔషధములతో పాముకరచిన వానికి చికిత్సను. నీకు చెప్పెదను. ''ఓం నమోభగవతే నీలకంఠాయ'' అను మంత్రమును జపించుటచే విషము నశించును. గోమయరసమును ఘృతముతో త్రాగించినచో ఇది ప్రాణమును రక్షించును. విషము రెండు విధములు. సర్పమూషకాది విషము జంగమ విషము. శృంగాది విషము స్థావర విషము. శాంత స్వరముతో బ్రహ్మ (క్షౌం) లోహితము (హ్రీం) తారకము (ఓం) శివము (హౌం) ఈ అక్షరములతో వియతి నామమంత్ర మున్నది. దీనికి శబ్దమయ తార్యుక్షడు యనిపేరు. ''ఓంజ్వల'' మొదలు ''అప్రతిహతశాసనం'' ''వం హూంఫట్‌ హస్త్రాయఫట్‌'' యనునది మంత్రము ''ఉగ్రరూపధారక'' మొదలు ''స్వాహానేత్రాయ'' వరకు కూడ మంత్రము. మాతృకాన్వయకమలము వ్రాసిదానికి ఎనిమిది దిక్కులందును ఎనిమిది దళములుండునట్లు చూడవలెను. పూర్వాది దిక్కులందు రెండేసి స్వరములు వ్రాయవలయును. కవర్గము మొదలు ఏడు వర్గముల చివరి రెండేసి అక్షరములు కూడ ఒక్కక్క దళముపై వ్రాయవలయును. ఈ కమలము యొక్క కేసర భాగమును వర్గముల ఆద్యక్షరములచే కప్పి కర్ణిక యందు అగ్ని బీజమును (''రం) వ్రాయవలయును, సాధకుడు ఆ కమలమును హృదయము నందుంచుకొని ఎడమ చేతిలో దానిని భావన చేయవలయును. అంగుష్ఠాదులందు వియతి మంత్ర వర్ణముల న్యాసముచేసి వాటిచే భిన్నములగు కళలను భావన చేయవలయును. పిమ్మట పసుపు పచ్చనిరంగుతో భూపురము అను చతుష్కోణ మండపముచేసి దానికి నాల్గువైపులను వజ్ర చిహ్నము వుంచవలెను. ఈ మండలమునకు ఇంద్రుడు దేవత అర్ధచంద్రా కార వృత్తము జల దేవతా సంబంధమైనది. కమలములోని సగము భాగము శుక్లవర్ణము. దాని దేవత వరుణుడు. పిదప స్వస్తిక చిహ్నముతో గూడిన త్రికోణాకారము తేజోమయమగు వహ్ని దేవతా మండల చింతన చేయవలయును. వాయుదేవతా మందలము బిందు యుక్తమై వృత్తాకారమై నల్లని మాలలతో ప్రకాశించుచుండును.

ఆంగుష్ఠాద్యంగు శీమధ్యేపర్యస్తేషు స్వవేశ్మసు | సువర్ణ నాగవాహేన వేష్టితేషు న్యసేత్ర్కమాత్‌. 7

వియతేశ్చతురో వర్ణాన్సుమండల సమత్విషః | అరూపేరవ తన్మాత్రేచకాశేశివదైవతే. 8

కనిష్ఠా మధ్యపర్వస్థేన్యసేత్త స్యాద్యమక్షరమ్‌ | నాగానామాది వర్ణాంశ్చ స్వమండల గతాన్‌న్యసేత్‌. 9

భూతాదివర్ణాన్‌విన్యసే దంగుష్ఠాద్యన్త పర్వసు | తన్మాత్రాది గుణాభ్యర్ణానంగులీషు స్యసేద్బుధః. 10

స్వర్శనాదేవ తార్యేక్షణ హస్తేహన్యాద్విషద్వయమ్‌ | మండలాదిషు తాన్వర్ణాన్వియతేః కవయో జితాన్‌. 11

శ్రేష్టంద్వ్యంగులిభిర్థేహ నాభిస్థానేషు పర్వసు | ఆజామతః సువర్ణాభమా నాభేస్తుహినప్రభమ్‌. 12

కుంకుమారుణ మాకంఠాదాకే శాన్తాత్సితే తరమ్‌ | బ్రహ్మాండ వ్యాపినం తార్యాక్షచన్ద్రాఖ్యం నాగభూషణమ్‌.

నీలోగ్రనాసమాత్మానం మహాపక్షం స్మరేద్బుదః | ఏవం తార్యాక్షత్మనో వాక్యాన్మంత్రః స్యాన్మంత్రిణోవిషే.

ముష్టిస్తార్యాక్షకరస్యాంతః స్థితాంగుష్ఠవిషావహా | తార్యక్షం హస్తంసముద్యమ్య తత్పంచాంగుళి చాలనాత్‌. 15

కుర్యాద్విషస్యస్తంభాదీంస్త దుక్త మదవీక్షయా |

ఈ నాలుగు వియతి వర్ణములను అంగుష్ఠాది అంగుళీ మధ్య పర్వము లందు సువర్ణ మయ నాగు వాహనముచే చుట్టబడిన స్థానము నందు వున్నట్లు భావన చేసి ఆ నాలుగు పర్వము లందు పృథివ్యాది భూతములను నాల్గింటి న్యాసముచేయవలయును. పిదప రూపరహిత శబ్ద తన్మాత్రమగు శివ దేవుని యొక్క ఆకాశ తత్వమును కనిష్ఠికా మధ్య పర్వమున వున్నట్లు భావన చేసి దాని లోపల వేదమంత్ర ప్రథమాక్షరమును న్యాసము చేయవలయును. నామముల ఆధ్యక్షరములను వాటి మండలములపై న్యాసము చేయవలయును. పృథివ్యాది భూతముల మొదటి అక్షరములను అంగుష్ఠాదుల చివరి పర్వములపై న్యాసము చేసి విద్వాంసుడు గంగాది తన్మాత్రల అక్షరములను ఐదు అంగుళిలపై న్యాసము చేయవలయును. ఇట్లు చేసిన వాడు తార్యక్ష మంత్రము ఉచ్చరించుచు పాము కరచిన వానిని స్పృశించగానే రెండు విధముల విషము నశించును. వియతి మంత్రము యొక్క నాలుగు అక్షరములను తన శ్రేష్ఠమైన రెండు అంగుళులతో నాభి స్థాన మందును పర్వము నందును న్యాసము చేయవలయును. గరుత్మంతుడు మోకాళ్ళ వరకు బంగారు ఛాయ కల్గి యుండును. మోకాళ్ళ నుండి నాభి వరకు మంచు వంటి తెల్లటి కాంతికలిగి యుండును. నాభి నుండి కంఠము వరకు ఎర్ర గాను కంఠము నుండి కేశముల వరకు నల్ల గాను వుండును. ఇతడు బ్రహ్మాండము నంతను వ్యాపించి యుండును. చంద్రుడను పేరు గల ఇతడు సర్పాలంకారములను ధరించి యుండును. అతని నాసికాగ్ర భాగము నీల వర్ణము రెక్కలు చాల విశాలమైనవి. మంత్రవేత్త తనను గరుడ స్వరూపునిగా భావించవలయును. అట్టి వాని వాక్యము చేతనే విషము తొలగి పోవును. గరుడుని చేతి పిడికిలి రోగి యొక్క చేతిలో వున్నచో అది అతని అంగుష్ఠము నందలి విషమును తొలగించును. ఆ మంత్రవేత్త గరుడ స్వరూప మగు తన హస్తమును పైకి ఎత్తి ఐదు వ్రేళ్ళను కదల్చినంత మాత్రముననే విషము వల్ల కలిగిన మదాదులను చూచుచు వివస్థంబనాదికము చేయకలుగును.

ఆకాశ##దేశ భూబీజః పంచార్ణాధిపతిర్మనుః 16

సంస్తంభ##యేతి విషతోభాషయా స్తంభ##యేద్విషమ్‌ |

వ్యత్యస్తభూషయా భీజోమంత్రోయం సాధుసాధితః. 17

సంప్లవఃప్లావయ యమఃశబ్దాద్యః సంహరేద్విషమ్‌ | దండముత్థాపయేదేష సుజప్తాం భోభిషేకతః. 18

సుజప్త శంఖ భేర్యాది నిఃస్వన శ్రవణనవా | సందహత్యేవ సంయుక్తో భూతే జోవ్యత్యయాత్థ్సితః. 19

భూవాయువ్యత్యయాన్మంత్రో విషం సంక్రామయత్యసౌ | అంతస్థో నిజవేశ్మస్థో బీజాగ్నీందు జలాత్మభిః. 20

ఏతత్కర్మ నయేన్మంత్రీ గరుడాకృతి విగ్రహః | తార్యక్షవరుణ గేహస్థస్తజ్జ పాన్నాశ##యే ద్విషమ్‌. 21

శ్రీజానుదండీ ముదితం స్వధాశ్రీ బీజలాంఛితమ్‌ | స్నానపానాత్సర్వవిషం జ్వరరోగావ మృత్యుజిత్‌. 22

పక్షి పక్షి మహాపక్షి మహాపక్షి విధిస్వాహా

పక్షి పక్షి మహాపక్షి మహాపక్షి క్షి, క్షి స్వాహా.

ద్వావేతొ పక్షిరాణ్మంత్రౌ విషఘ్నావభిమంత్రణాత్‌|

పక్షిరాజాయ విద్మహే పక్షి దేవాయ ధీమహి తన్నో గరుడఃప్రచోదయాత్‌.

వహ్నిస్థో పార్శ్వ తత్పూర్వౌ దంత శ్రీకౌచ దండినౌ. 23

సకాలీ లాంగలీ చేతి నీలకంఠాద్య మీరితమ్‌ | వక్షః కంఠశిఖాశ్వేతం న్యసేత్త్సంభే సుసంస్కృతౌ. 24

హరహర హృదయాయ నమః కపర్ధినే చ శిరసి

ఆకాశము మొదలు భూ బీజము వరకు వున్న ఐదు బీజములకు పంచాక్షర మంత్ర రాజము అని పేరు. (హం, యం, రం, వం, లం,) అధికమైన విషమును స్థంభింప చేయవలసి వచ్చినపుడు ఈ మంత్రమును ఉచ్చరించినంత మాత్ర ముననే విషము శమించును. దీనికి వ్యత్యస్త భూషణ బీజ మంత్ర మని పేరు. దీనిని బాగుగ సాధన చేసి ప్రారంభమున సంప్లవము, ప్లావయ ప్లావయ అను వాక్యము చేర్చినచో విష సంహార మగును. ఈ మంత్రమును బాగుగ జపించి అభి మంత్రించిన జలముతో స్నానము చేయించినంత మాత్రముననే రోగిని లేచినట్లు చేయును. లేదా మంత్రము జపించుచు చేసిన శంఖ భేర్యాది ధ్వనిని విన్నంత మాత్రముననే నిస్సందేహముగ విషము నశించును. భూ బీజ తేజో బీజములను తారుమారు చేసి ఆ మంత్రమును ఏర్పరచినచో దాని ప్రయోగము వలన కూడ విషము నశించును. భూ బీజ వాయు బీజములను తారుమారు చేసి మంత్రము ఏర్పరచి ప్రయోగించినచో ఆ విషము మరియొకని చేరును., మాంత్రికుడు రోగి దగ్గరగా వుండి కాని, తన యింటిలో వుండి కాని, గరుడ స్వరూపమును చింతించుచు తానే గరుత్మంతుడని భావన చేయుచు రం, వం, అను రెండు బీజములనే ఉచ్చరించినచో సాఫల్యమును పొందును. గరుత్మంతుని ఆలయము నందు కాని వరుణుని ఆలయ మందు కాని కూర్చండి ఈ మంత్రమును జపించినచో విషమును నశింప చేయగలుగును. ఈ మంత్రమునకు ''స్వధా'' శ్రీ బీజములను చేర్చినచో దీనికి ''బౌము దిండి'' మంత్రము యని పేరు. దీనిని జపించుచు స్నానము చేసి జలము త్రాగినచో సాధకుడు అన్ని విధములగు విషముల పైనను జ్వరముల పైనను రోగముల పైనను అపమృత్యువు పైసను విజయము సాధించును. ''పక్షి పక్షి మొదలు క్షి క్షి స్వాహా'' వరకు వున్న మూలోక్త మంత్రములు గరుడ మంత్రములు. ఈ మంత్రము నుచ్చరించుచు అభి మంత్రించినచో విషము నశించును. ''పక్షిరాజాయ మొదలు'' ప్రచోదయాత్‌'' వరకు గరుడ గాయత్రి మంత్రము పైన చెప్పిన రెండు పక్షి రాజ మంత్రములకును రంబీజము చేర్చి వాటి పార్శ్వము నందుకూడ రంచేర్చి పిమ్మట దంత శ్రీ-దండి - కాల - లాంగలీ - లను చేర్చి దాని మొదట నీలకంఠ మంత్రము చేర్చవలయును. ఈ మంత్రమును వక్ష స్థలము నందును, కంఠమునందును శిఖ యందును న్యాసము చేయవలయును. పైరెండు మంత్రములను సంస్కరించి స్తంభముపై వ్రాయవలయును.

నీలకంఠాయవై శిఖాం కాలకూట విషభక్షణాయ స్వాహా

అథ వర్మచ కంఠేనేత్రం కృత్తివాసాస్త్రి నేత్రకమ్‌ |

పూర్వాదై రాననైర్యుక్తం శ్వేతపీతా రుణాసితైః.

అభయం వరదం చాపం వాసుకించ దదద్బుజైః | యస్యోపరీత పార్శ్వస్థ గౌరీరుద్రోస్య దేవతా. 25

పాదజాను గుహానాభిహృత్కంఠానన మూర్ధసు | మంత్రార్ణాన్న్యస్య కరయోరంగుష్ఠాద్యంగులీషుచ. 26

తర్జన్యాదిత దంతాసు సర్వమంగుష్ఠయోర్న్యసేత్‌ | ధ్యాత్వైవం సంహరేతిక్షప్రం బద్ధయాశూలముద్రయా. 27

కనిష్ఠాజ్యేష్టయాబద్దాతిస్రోన్యాః ప్రసృతేర్జవాః | విషనాశే వామహస్తమన్యస్మిన్దక్షిణం కరమ్‌. 28

ఓం సమోభగవతే నీలకంఠాయ చిఃఅమలకంఠాయ చిఃసర్వజ్ఞ కంఠాయః చీః క్షీవ ఓంస్వాహా.

అమలనీకంఠాయనైక నర్వవిషాపహాయ.

నమస్తే రుద్రమన్యవ ఇతి సంమార్జనా ద్విషం | వినశ్యతి న సందేహః కర్ణజాప్యాత్‌ ఉపానహా వా.

యజేద్రు ద విధానేన నీలగ్రీవం మహేశ్వరమ్‌ | విషవ్యాధి వినాశః స్యాత్కృత్వా రుదవిధానకమ్‌. 29

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే దష్టచికిత్సనంనామ పంచనవత్యధిక ద్విశతతమోధ్యాయః.

పిదవ "హర హర హృదయా యనమః" యని హృదయ న్యాసము "కపర్ది స్వాహా, శిరసే స్వాహా నీలకంఠాయ స్వాహా శిఖయైవ షట్‌ అను న్యాసములను చేసి కాలకూట విష భక్షణాయ" హుం ఫట్‌, కవ చాయహుం యని చెప్పుచు భుజములను కంఠములను స్పృశించ వలయును. "కృత్తి వాససే వౌషట్‌" యని నేత్రత్రయము నందు న్యాసము చేయవలయును. పూర్వాది దిక్కులందు క్రమముగ శ్వేత, పీత, అరుణ, శ్యామ ముఖములు కలవాడును నాలుగుహస్తము లందును క్రమముగ ఆభయ వరద, ముద్రలు, ధనుస్సు, వాసుకీ ధరించిన వాడును, కంఠమునందు యజ్ఞోపవీతముతో ప్రకాశించుచుండువాడును. పార్శ్వమున పార్వతితో కూడిన రుద్రుడు దాని దేవత. మంత్రాక్షరములను పాదములు మోకాళ్ళు గుహ్య భాగము నాభి హృదయము, కంఠము, శిరస్సు వీటిపై న్యాసము చేసి రెండు హస్తముల ఆంగుష్ఠాద్యంగుళులపై కూడ న్యాసము చేయవలయును. అనగా తర్జని మొదలు తర్జని వరకు న్యాసము చేసి సంపూర్ణ మంత్రము అంగష్టుములపై న్యాసము చేయవలయును. ఈ విధముగా ధ్యాన న్యాసములు చేసి శీఘ్రముగ శూల ముద్రను బందించి విష సంహారము చేయవలయను. కనిష్ఠ అంగుళిని జేష్ఠాగుళితో బంధించి మిగిలిన మూడు వ్రేళ్ళను చాపినచో అధి శూల ముద్ర. విషమును నశింప చేయుటకు ఎడమ చేతిని, ఇతర కార్యము లందు కూడి చేతిని ప్రయోగించవలయును. "ఓం నమో భగవతే" మొదలు "రుద్ర మన్యవే" వరకు వున్న మూలోక్త మంత్రమును జపించుచు తుడిచినచో విషము నశించును. సందేహము లేదు. ఈ మంత్రమును రోగి చెవిలో జపించుటచే గాని మంత్రము జపించుచు రోగి ప్రక్క నేలపై చెప్పుతో కొట్టుటచేత గాని విషము దిగిపోవును. రుద్ర విధానము ననుసరించి నీల గ్రీవుడైన మహేశ్వరుని ఆరాధించినచో విష వ్యాధి తొలగి పోవును.

అగ్ని మహా పురాణమున దష్ట చికిత్సన మను రెండు వందల తొంబది యైదవ అధ్యయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page