Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టాశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

అథాశ్వవాహనసారః

ధన్వన్తరి రువాచ |

అశ్వవాహన సారంచ వక్ష్యే చాశ్వ చికిత్సనమ్‌ | వాజినాం సంగ్రహః కార్యోదర్మకర్మార్థసిద్ధయే. 1

అశ్వినీ శ్రవణం హస్త ముత్తరాత్రితయం తథా | నక్షత్రాణి ప్రశస్తాని హయానామాది వాహనే. 2

హేమన్తః శిశిరశ్చైవ వసన్త శ్చాశ్వవాహనే | గ్రీష్మే శరది వర్షాసు నిషిద్ధం వాహనం హయే. 3

తీవ్రైర్నచ పరైర్దండైరదేశేన చ తాడయేత్‌ | కీలాస్థి సంకులే చైవ విషమే కంటకాన్వితే 4

వాలుకాపంక సంఛన్నే గర్తాగర్త ప్రదూషితే | అచిత్తజ్ఞో వినోపాయయైర్వాహనం కురుతేతుయః. 5

నవాహ్యతే హయేనైవ పృష్ఠస్థః కటికాం వినా | ఛందం విజ్ఞాపయేత్కోపి సుకృతీ ధీమతాం వరః. 6

ధన్వంతరి చెప్పెను. ఇపుడు అశ్వవాహనసారమును అశ్వచికిత్సను చెప్పెదను. ధర్మకర్మ అర్థముల సిద్ధికై అశ్వ సంగ్రహణము చేయవలయును. తొలిసారి అశ్వారోహణము చేయుటకు, అశ్వినీ, శ్రవణ, హస్త ఉత్తరాషాఢా, ఉత్తర భాద్రపద, ఉత్తర ఫల్గుణీ నక్షత్రములు, ప్రశస్తములు, అశ్వము నెక్కుటకు, హేమంత, శిశిర, వసంతములు, మంచివి. గ్రీష్మశరత్‌ వర్షఋతువులందు అశ్వముపై నెక్కుటనిసిద్ధము తీవ్రమైన దండములతో కాని ప్రదేశమునందు గుఱ్ఱమును కొట్టకూడదు. అశ్వము యోక్క మనస్సు తెలుసుకొనజాలక ఉపాయములు తెలియక అశ్వముపై ఎక్కి దానిని మొలలు ఎముకలతో నిండిన దుర్గమైన కంటక యుక్త మార్గము నందును ఇసుకతో వరదతో నిండిన మార్గము నందును, గోతులు మెరకలతో గూడిన మార్గము నందును నడిపించుచు కటిక (జీను) లేకుండ దాని వీపుపై ఎక్కిన మూర్ఖుడు అశ్వము నకే వాహన మగును. బుద్ధిమంతుడు శ్రేష్ఠుడగు ఏ ఒక్కడో అశ్వ శాస్త్రమును చదువకుండగనే, కేవలము అభ్యాసము చేతను నిశ్చయ బుద్ధి చేతను అశ్వమునకు తనయభిప్రాయము తెలుపు గలుగును.

ఆభ్యాసాద భియోగాచ్చ వినాశాస్త్రం స్వవాహకః |

స్నాతస్యప్రాఙ్ముఖస్యాథ దేవాస్వపుషియోజయేత్‌ 7

ప్రణవాదినమోతేన స్వబీజేన యథాక్రమమ్‌ | బ్రహ్మచిత్తే బలే విష్ణుర్వైనతేయః పరాక్రమే. 8

పార్శ్వేరుద్రా గురుర్బద్ధౌ విశ్వేదేవాశ్చ మర్మసు | దృగావర్తే దృశీన్ద్వర్కౌ కర్ణయోరశ్వినౌతథా. 9

జఠరేగ్నిః స్వధాస్వేదే బాగ్జిహ్వాయాం జవేనిలః | పృష్ఠతో నాకపృష్ఠస్తు ఖురాగ్రే సర్వపర్వతాః. 10

తారాశ్చ రోమకూపేషు హృధిచాంద్రమసీకలా | తేజస్యగ్నీ రతిః శ్రోణ్యాం లలాటే చ జగత్పతిః. 11

గ్రహాశ్చ హేషితేచైవ తథై వోరసి వాసుకిః | ఉపోషితో ర్చయేత్సాదీ హయందక్షశ్రుతౌజ సేత్‌. 12

అశ్వమునకు స్నానము చేయించి పూర్వాభి ముఖముగా నిలబెట్టి ప్రారంభమున ఓం అంతమున నమః, యను శబ్దములు చేర్చి ''స్వ'' బీజాక్షర యుక్తములగు మంత్రములు చెప్పుచు క్రమముగ దేవతా న్యాసము చేయవలయును. అశ్వము యొక్క చిత్తమున బ్రహ్మ, బలమున మహా విష్ణువు పరాక్రమమున గరుత్మంతుడు పార్శ్వ భాగమున రుద్రగణము బుద్ధి యందు బృహస్పతి. మర్మ స్థానమున విశ్వే దేవులు, నేత్రావర్త నేత్రము లందు చంద్ర సూర్యులు చెవులందశ్వినీ కుమారులు జఠరాగ్ని యందు స్వధా జిహ్వవై సరస్వతీ, వేగమున వాయుదేవుడు, పృష్ట భాగమున స్వర్గ పృష్ఠము ఖురాగ్రము లందు సర్వ పర్వతములు రోమ కూపము నందు నక్షత్ర గణము హృదయము నందు చంద్ర కళ, తేజము నందు అగ్ని పిరులందు రతి, లలాటమున జగత్పతి. హ్రేషితమున నవగ్రహములు వక్ష స్థలమున వాసుకి న్యాసము చేయబడవలెను. ఆ అశ్వము నెక్కువాడు అశ్వమును పూజించి దాని కుడిచెవిలో ఈ క్రింది మంత్రమును చెప్పవలెను.

హయ గంధర్వరాజస్త్వం శృణుష్వవచనం మమ | గంధర్వ కుల జాతస్త్వం మా భూ స్త్వం కులదూషకః.

ద్విజానాం సత్యవాక్యేన సోమస్య గరుడస్యచ | రుద్రస్యవరుణసై#్యవ పవనస్య బలేనచ. 14

(అ) 28/2

హుతాశనస్య దీప్త్యాచ స్మరజాతిం తురంగమ | స్మర రాజేంద్రపుత్రస్త్వం సత్యవాక్యమనుస్మర. 15

స్మరత్వం వారుణీంకన్యాం స్మరత్వం కౌస్తుభం మణిమ్‌ | క్షీరోదసాగరేచైవ మథ్యమానే సురాసురైః. 16

తత్రదేవకులేజాతః స్వవాక్యం పరిపాలయ | కులేజాత స్త్వమశ్వానాం మిత్రంమేభవ శాశ్వతమ్‌. 17

శృణుమిత్ర త్వమేతచ్చ సిద్ధోమే భవవాహన | విజయం రక్షమాంచైవ సమరేసిద్ధి మావహ. 18

తవపృష్ఠం సమారుహ్య హతాదైత్యాః సురైఃపురా | ఆధునాత్వాం సమారుహ్య జేష్యామి రిపువాహినీమ్‌. 19

కర్ణజాపం తతఃకృత్వా విముహ్యచ తథాప్యరీన్‌ | పర్యానయేద్వయంసాదీ వాహయేద్యుధ్యతోజయః. 20

నంజాతాః స్వశరీరేణ దోషా ప్రాయేన వాజినామ్‌ | హన్యన్తే తిప్రయత్నేన గుణాః సాదివరైః పునః. 21

సహజాః ఇవదృశ్యంతే గుణాఃసాదివరోద్భవాః | నాశయంతి గుణానన్యే సాదినః సహజానపి. 22

గుణానేకో విజానాతి వేత్తిదోషాంస్తథాపరః | ధన్యోధీమాన్హయం వేత్తినోభయం వేత్తిమందధీః. 23

అకర్మజ్ఞోను పాయజ్ఞో వేగాసక్తో తికోపనః | ఘనదండరతిచ్ఛిద్రేయః సమోపి నశస్యతే. 24

ఉపాయజ్ఞోథ చిత్తజ్ఞో విశుద్ధో దోషనాశనః | గుణార్జన పరోనిత్యం సర్వకర్మ విశారదః. 25

ప్రగ్రహేణ గృహీత్వాథ పవిష్టో వాహభూతలమ్‌ | సవ్యాపసవ్యభేదేన వాహనీయః స్వసాదినా. 26

ఆరుహ్య సహసానైవ తాడనీయో హయోత్తమః | తాడనాద్భయ మాప్నోతి భయాన్మోహశ్చ జాయతే. 27

ప్రాతఃసాదీ ప్లుతేనైవ వల్గా ముద్ధృత్య చాలయేత్‌ | మందం మందం వినానాలం ధృతవల్గో దినాంతరే. 28

''ఓ అశ్వమా ! నీవు గంధర్వ రాజువు నా మాట వినుము. నీవు గంధర్వ కులమున పుట్టిన దానవు. నీవు కులమును దూషితము చేయకుము. బ్రాహ్మణుల సత్యవచనముచే సోమ, గరుడ, రుద్ర, వరుణ, పవనములు, బలము అగ్నితేజము, గల నీ జాతిని స్మరించుము నీవు రాజేంద్ర పుత్రుడవు అను సత్య వాక్యమును స్మరించుము. నీవు వారుణి కన్యను కౌస్తుభ మణిని స్మరించుము. దైత్య దేవతలచే క్షీర సముద్రము మథింపబడినపుడు, నీవు దేవ కులమున పుట్టితివి. నీ వాక్యమును నిలబెట్టకొనుము. నీవు అశ్వ వంశమున పుట్టితివి నీవు నాకు శాశ్వతముగ మిత్రుడు వగుము ఓ మిత్రమా! నా వాక్యమ్ము వినుము. నాకు వాహనము కమ్ము. నన్ను రక్షించుచు నాకు విజయమును. సమకూర్చుము. పూర్వము దేవతలు నీ పృష్టమును అధిరోహించి దైత్యులను సంహరించిరి నేడు నీపై ఎక్కి నేను శత్రు సేనను జయించెదను'' ఈ విధముగ అశ్వారోహకుడు అశ్వము చెవిలోజపించి శత్రువులను మోహింప చేయుచు అశ్వమును యుద్ధ స్థలమునకు తీసుకొని వచ్చి దానిని అధిరోహించి జయము సంపాదింప వలెను. ఉత్తమ అశ్వారోహకుడు అశ్వముల శరీరము నందు ఉత్పన్నములగు దోషములను ప్రయత్న పూర్వకముగ తొలగించి గుణములను వికసింప చేయును. ఉత్తముడగు అశ్వారోహకునిచే, అశ్వము నందు సమకూర్చబడిన గుణములు వాటికి సహజములు వలె కనబడును. కొందరు అశ్వారోహకులు వాటి సహజ గుణములను కూడ నశింప చేయుదురు. ఒకడు అశ్వ గుణములను గ్రహించును. మరియొకడు దోషములను గ్రహించు అశ్వ రహస్యము తెలుసుకొన గల్గిన ధీమంతుడు ధన్యుడు మందబుద్ధి గుణ దోషములు రెండింటిని తెలుసుకొన జాలడు. కర్మ, ఉపాయము తెలియనివాడును అశ్వమును వేగము నడిపింప ప్రయత్నించు వాడును కోపవంతుడును. చిన్న అపరాధమునకు కూడ కఠోర దండము నిచ్చు వాడును అగు అశ్వారోహకుడు, కుశలుడైనను ప్రశంసనీయుడు కాదు. ఉపాయములు తెలిసిన వాడును చిత్తమును గహ్రించ గల్గిన వాడును విశుద్ధుడును దోషములు తొలగించు వాడును గుణములును సంపాదించువాడును అగు అశ్వారోహకుడు నిత్యము సర్వ కర్మలందు నేర్పు కలవాడు అయి వుండును. అట్టి వాడు అశ్వమును కళ్లెము పట్టుకొని బాహ్య భూమికి తీసుకొని వెళ్ళి దాని పృష్టముపై ఎక్కి కుడి వైపునకు ఎడమ వైపునకు నడిపించ వలెను. ఉత్తమ అశ్వమును ఎక్కి వెంటనే దానిని కొరడాతో కొట్టకూడదు. అటు చేసినచో అది భయపడి పోవును. మోహమును కూడ పొందును అశ్వారోహకుడు ప్రాతః కాలమున కళ్లెమును పట్టుకొని గుర్రమును లేవదీసి ప్లుత గతితో నడిపించవలెను. సంధ్యాకాలమున డెక్కలకు నాలములు లేని గుర్రమును కళ్లెము పట్టుకొని మెల్లగ నడిపించవలెను.

ప్రోక్తమాశ్వాసనం సామ భేదోశ్వేన నియోజ్యతే | కళాది తాడనం దండోదానం కాల సహిష్ణుతా. 29

పూర్వ పూర్వ విశుద్ధౌతు విదధ్యాదుత్తరోత్తరమ్‌ | జిహ్వాతలే వినాయోగం విదధ్యాద్వాహనేహయే. 30

గుణోత్తర సతాం వల్గాం నృక్కణ్యాసహగాహయేత్‌ | విస్మార్య వాహనం కుర్యాచ్ఛిథిలానాం శ##నైః శ##నైః.

హయంజిహ్వాంగ మాహీనే జిహ్వాగ్రంథిం విమోచయేత్‌ | గాడతాం మోచయేత్తావద్యావత్త్సోభంన ముంచతి.

కుర్యాచ్చతమురస్త్రాణ మవిలాలంచ ముంచతి | ఊర్ధ్వాననః స్వభావాద్య స్తస్యోరస్త్రాణ మశ్లథమ్‌. 33

విధాయ వాహయేద్దృష్ట్యా లీలయాసాది సత్తమః | తస్య సవ్యేన పూర్వేణ సంయుక్తం సవ్యవల్లయా. 34

యః కుర్యాత్పశ్చిమం పాదం గృహీతస్తేన దక్షిణః | క్రమేణానేన యో సేవాం కురుతేవామ వల్గయా. 35

పాదౌ తేనాపి పాదఃస్యాద్గృహీతో వామఏవహి | ఆగ్రేచేచ్చరణ త్యక్తే జాయతే సుదృఢాసనమ్‌. 36

¸°హృతౌ దుష్కరే చైవ మోటకే నాటకాయనమ్‌ | సవ్యం హీనం ఖలీకారో హననే గుణనేతథా. 37

స్వభావం హి తురంగస్య ముఖవ్యా వర్తనం పునః | నచై వేత్థంతురంగాణాం పాదగ్రహణ హేతవః. 38

విశ్వస్తం హయమాలోక్య గాఢమాపీడ్య చాసనమ్‌ | రోకయిత్వా ముఖేపాదం గ్రాహ్యతో లోకసంహితమ్‌. 39

గాఢమాపీడ్య రాగాభ్యాం వల్లమాకృష్య గృహ్యతే | తద్భంధనా ద్యుగ్మ పాదం తద్వద్వల్గనముచ్యతే. 40

సంయోజ్య వల్గయా పాదాన్వల్గామామోక్ష్య వాంఛితమ్‌ | వాహ్యపార్‌ష్ణి ప్రయోగాత్తు యత్రతన్మోటనం మతమ్‌.

వెనుక చెప్పిన కర్ణ జపముచేతను అశ్వ సంచాలనమున అనుసరించవలసిన పద్ధతుల చేతను, అశ్వమునకు అశ్వాసనము ఏర్పడును దాని విషయమున సామ నీతిని అవలంబించ వలయును. కొరడా మొదలగు వాటితో దండము విధించవలెను. మరియొక అశ్వముతో కలిపి రథమునకుకట్టిన దాని విషయమున భేదము ఉపయోగించ వలయును. కాలమునకు వేచి యుంటయే దానము. పూర్వ పూర్వ ఉపాయములు సఫలము గానప్పుడు ఉత్తరోత్తరోపాయములను అనుసరించవలెను, జిహ్వకు క్రింద యోగము లేకుండగ హయమునకు త్రాడు కట్టవలెను. నూరు పేటలు గల నూలుతో చేసిన కళ్లెమును చెలివిల దగ్గర కట్టవలెను. పిదప మెల్లమెల్లగ వాహనమును విస్మరింప వేసి కళ్లెమును శిథిలము చేయవలయును. గుర్రము నాలుక అహీనావస్థ పొందినపుడు జిహ్వా గ్రంధిని విప్పవలెను. అశ్వము స్థిరత్వమును విడువనంత వరకు కళ్ళెమును ఎక్కువగా విడువ కూడదు. అశ్వ ముఖమునుండి లాతాజలము కారునంత వరకు ఉరస్త్రాణమును బిగించి వుంచవలెను. స్వభావముచే ముఖమునుపైకి ఎత్తి వుంచుచు అశ్వము యొక్క ఉరస్త్రాణమును గట్టిగా బిగించి వుంచి ఉత్తముడగు అశ్వారోహకుడు ఆ అశ్వమును తన కంటితో అవలీలగా నడిపింప గలుగును. మొదట అశ్వము యొక్క వెనుకటి కుడిపాదముతో కుడి వల్గను సంయోజితము చేసి ఆపాదమును తన వశము నందుంచ కొనవలెను. ఇదే విధముగ ఎడమ వల్గతో ఎడమ పాదమును కట్టవలెను. దీనితో దాని ఎడమ పాదముకూడ నియంత్రణము లభించును. ఈ విధముగ ముందు పాదములు విడువబడినచో ఆసనము సుదృఢ మగును. దుష్కర రమోటన కర్మ యందు పాదములు అపహృతములైనను ఎడమ పాదమున హీనావస్థ వచ్చినను అట్టి స్థితికి నాటకాయనముయని పేరు. హనన గుణన కర్మలచే ఖలీ కారముకలుగును. మాటి మాటికి ముఖ వ్యావర్తనము అశ్వ స్వభావము. ఇవన్నియు అశ్వముల పాదగ్రహణమునకు కారణము కావు. అశ్వము పూర్తిగా విశ్వాసము కలదియైన పిమ్మట ఆసనమును గట్టి వత్తి దాన పాదమును దాని ముఖముతో నొక్కిపట్టినచో దాని గ్రాహ్యత్వము హితకారి యగును. రాగముతో గట్టిగా నొక్కి పట్టి కళ్లెము లాగి దాని బంధనముతో అశ్వము యొక్క రెండు పాదములను గ్రహించి ఆకర్షించినచో దానికి ''ఉద్వక్కనము'' యని పేరు. కళ్ళెము గుర్రము నాలుగు పాదములనుకట్టి ఇష్టానుసారము శిథిలము చేయుచు మణ వలచే గుర్రమును కొట్టినచో దానికి మోట్టనం యని పేరు.

ప్రలయా విప్లవే జ్ఞాత్వా క్రమేణానేన బుద్ధిమాన్‌ | మోటనేన చతుర్థేన విధిరేష విధీయతే. 42

నాధత్తేధశ్చయః పాదం యోశ్వోలఘుని మండలే |

మోటనోద్వక్క నాభ్యాంతు గ్రాహయేత్పాదమీశితమ్‌. 43

వంటయిత్వాసనే గాఢం మందమాదాయ యోవ్రజేత్‌ | గ్రాహ్యతే సంగ్రహాద్యత్ర తత్సం గ్రహణముచ్యతే.

హత్వాపార్శ్వే ప్రహారేణ స్థానస్థో వ్యగ్రమానసమ్‌ | వల్లామాకృష్య పాదేన గ్రాహ్యకంట కపాయనమ్‌. 45

ఉల్కేణా (నా) యోంఘ్రిణానేన పార్‌ష్ణిపాదాంస్తు రంగమః | గృహ్యతేయత్ఖలీకృత్య ఖలీకారః సచేష్యతే.

గతిత్రయే ప్రియః పాదమాదత్తే నైవ వాంఛితః | హత్వాతు య (త్ర) దండేన గ్రాహ్యతే గహనం హితత్‌.

ఖలీకృత్య చతుష్కేణ తురంగో వల్గయాన్యయా | ఉచ్ఛ్వాస్య గ్రాహ్యతేన్యత్ర తత్స్యాదుచ్ఛ్వాసనంపునః.

స్వభావం బహిరస్యన్తం తస్యాం దిశి పదాయనమ్‌ | నియోజ్యగ్రాహయేత్తత్తు ముఖవ్యావర్తనం మతమ్‌. 49

గ్రాహయిత్వాతతః పాదం త్రివిధాసుయథాక్రమమ్‌ | సాధయేత్పంచ ధారాసు క్రమశో మండలాదిషు. 50

ఆజానూర్ధ్వాననం వాహం శిథిలం వాహయేత్సుధీః | అంగలేషులాఘవం యావత్తా వత్తం వాహయేద్ధయమ్‌. 51

మృదుః స్కంధేలఘుర్వక్రే శిథిలః సర్వసంధిషు | యదాససాదినో వశ్యః సంగృహ్ణీ యాత్తదా హయమ్‌. 52

సత్యజేత్పశ్చిమం పాదం యదా సాధుర్భవేత్తదా | తదాకృష్టిర్విధాతవ్యా పాణిభ్యామిహ వల్గయా. 53

తత్రత్రికోయథాతిష్ఠే దుద్గ్రీవోశ్వః సమాననః | ధరాయాం పశ్చిమౌ పాదావన్తరిక్షే యదాశ్ర¸°. 54

తదాసంధారణం కుర్యాద్గాఢ వాహంచ ముష్టినా | సహసైవం సమాకృష్టోయస్తురంగోనతిష్ఠతి. 55

శరీరం విక్షిపన్తంచ సాధయేన్మండల భ్రమైః | క్షీపేత్స్కంధం చ యోవాహః సచస్థాప్యోహి వల్గయా. 56

బుద్ధిమంతుడగు అశ్వారోహకుడు ఈ విధముగ ప్రళయఅవిప్లవములను కెలుసుకొనవలెను. మరల చతుర్థ మోటనముచే ఈ విధిని సంపాదించవలెను. మోటన ఉద్వక్కనములనే లఘుమండలములందు తన పాదములను ఉంచని అశ్వము సఫలమని గ్రహించవలయును. దానికి ఈ విధముగ పాదగతి నేర్పవలెను. ఆసనమునందు గట్టిగ బిగించికట్టి శిక్షణ యిచ్చినను మందగతితో నడుచుదానిని మరల మట్టిఇష్టమగు విధమున నడిపించవలెను. ఈ శిక్షణా పద్ధతికి సంగ్రహణము యని పేరు. స్థానస్థితమైనను వ్యగ్రచిత్తమగు అశ్వమును పార్శ్వభాగమున కళ్లెముతోలాగి కళ్లెముతోలాగి కళ్లెమునందలి ఇనుపగొళ్లెమును నములునట్లు చేసి, ఈ విధముగా పాదప్రహారముచే ఖలీకృతమై యది నడక నేర్చుకొనునట్లు చేసినచో అట్టి శిక్షణమునకు ఖలీకారమని పేరు. త్రివిధ గతులచే కూడ ఇష్టమగు నడక నడవనిచో దానిని దండముతో కొట్టి అట్లు నడిపించు పద్ధతికి హాననము యని పేరు. రెండవ కళ్లెములో నాల్గు పర్యాయములు కలీకృతముచేసి ఆ అశ్వమును మరొక చోటునకు తీసుకొని పోయి దానిచే నిట్టూర్పులు విడ్పించినచో దానికి ఉచ్ఛ్వాసము యనిపేరు. తన ముఖమును బయటకు త్రిప్పుట అశ్వస్వభావము దానిని ప్రయత్నపూర్వకముగ ఆ వైపునకే త్రిప్పునట్లుచేసి అట్లేనియమంచి దానికి గతినేర్పినచో ముఖవ్యావర్తనమని పేరు. క్రమముగ మూడు గతులలో చాలనము నేర్పిన పిమ్మట మండలాది పంచదారలందు నడచుట నేర్పవలెను పైకి ఎత్తిన ముఖమునుండి మోకాళ్ళవరకు అశ్వము శిథిలమైనపుడు దాని శిక్షణము ఇచ్చుటకై బుద్ధిమంతులు దానిని అధిరోహించి దాని అవయవములు తేలిక అగువరకు దానిని పరుగెత్తించవలెను. దాని మెడకోమలముగను, ముఖము తేలికగను, శరీరసంధులన్నియు శిథిలములగును. అయినపుడు అది ఆరోహమునకు వశమగును. అట్టి అవస్థలో ఆ అశ్వమును సంగ్రహించవలెను. మొదట నేర్పిన గతిని విడువని అశ్వము మంచిది. అపుడు రెండుచేతులతో కళ్లెములాగి గుర్రము కంఠము పైకెత్తి ఒక్క పాదముతో భూమిపై నిలబడునట్లు చేయవలయును. నేలపై అనివున్న వెనుకటికాళ్లు ముందరికాళ్లకు ఆశ్రయము అయినపుడు ఆ అశ్వమును ముష్టితో సంధారణము చేయవలయును. ఇట్లు లాగిన వెంటనే నిలబడక శరీరమును విక్షిప్తము చేయు గుర్రమును మండలాకారమున పరుగెత్తించి వశము చేసుకొనవలెను. మేడను ఊపు గుర్రమును కళ్ళెము లాగి నిలబెట్ట వలెను.

గోమయం లవణం మూత్రం క్వథితం మృత్సమన్వితమ్‌ | అంగలేపో మక్షికాది దంశ శ్రమ వినాశనః. 57

మధ్యే భద్రాది జాతీనాం మండోదేయో హి సాదినా | దంశనం సూక్ష్మకీటస్య నిరుత్సాహః క్షుధాహయః. 58

యథావశ్యస్తథా శిక్షా వినశ్యన్త్యతి వాహితాః | అవాహితాన సిధ్యన్తి తుంగవక్రాంశ్చ వాహయేత్‌. 59

సమ్పీడ్య జానుయుగ్మేన స్థిరముష్టిస్తురంగమమ్‌ | గొమూత్రా కుటిలావేణీ పద్మమండలమాలికా. 60

పంచోలూఖలికాః కార్యా గర్వితాస్తే హి కీర్తితాః | సంక్షిప్తం చైవ విక్షిప్తం కుంచితం చ యథాచితమ్‌. 61

వల్గితా వల్గితౌ చైవ షోఢా చేత్థముదాహృతమ్‌ | వీథీ ధనుఃశతం యావదశీతిర్నవతిస్తథా. 62

భద్రః సుసాధ్యో వాజీ స్యాన్మందో దండైక మానసః |

మృగ జంఘో మృగోవాజీ సంకీర్ణస్తత్సమన్వయాత్‌. 62

శర్కరామధులాజాదః సుగంధోశ్వః శుచిర్ద్విజః | తేజస్వీ క్షత్రియశ్చాశ్వో వినీతో బుద్ధిమాంశ్చయః. 64

శూద్రోశుచిశ్చలో మందో విరూపో విమతిః ఖలః |

వల్గయా ధార్య మాణాశ్వో లాలకం యశ్చదర్శయేత్‌. 65

ధారాసు యోజనీయోసౌ ప్రగ్రహగ్రహమోక్షణౖః | అశ్వాది లక్షణం వక్ష్యే శాలి హోత్రోయథావదత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే అశ్వవాహన సార వర్ణనం నామాష్టశీత్యధిక ద్విశతతమోధ్యాయః.

గోమయము, ఉప్పు, గోమూత్రము వీటితో క్వాథము చేసి దానిలో మట్టికలిపి అశ్వశరీరమున పూయవలయును. దాని వలన మక్షికాది పీడ కలుగదు. అలసట తొలగిపోవును. ఆశ్వారోహకుడు భద్రాది జాతికి చెందిన గుర్రములకు గంజి ఇవ్వవలెను దీనివలన సూక్ష్మకీటక దంశనము ఉత్సాహ శూన్యత్వము ఆకలి తగ్గును. అశ్వము ఎట్లు వశమగునో అంత శిక్షణమే ఇవ్వవలయును. ఎక్కువగా నడిపించిన అశ్వములు నశించున. పూర్తిగా నడిపించినచో అవి సిద్ధముగాకుండ పోవును. వాటిముఖములను పైకి ఎత్తునట్లు చేసి వాటిపై సవారీ చేయవలయును. స్థిరముష్టికలవాడై గుర్రమును రెండు మోకాళ్ళతో అదిమిపట్టి ముందుకు నడిపించవలెను. గోమూత్రాకృతి వక్రతవేణి పద్మమండలము మాలికాయను చిహ్నములున్న అశ్వము పంచోలూక ఖలికయని చెప్పబడును. అట్టి గుర్రములు కార్యమునందు అగర్వితములై వుండును. వీటికి సంక్షిప్తము, విక్షిప్తము, కుంచితము, అంచితము. వల్గితము, ఆవల్గితము యను ఆరులక్షణములు చెప్పబడినవి, మార్గముపై నూరుధనుస్సుల దూరము పరుగెత్తిన పిమ్మట భద్రజాతీయాశ్వము సురాధ్యమగును. మందాశ్వము ఎనుబది ధనుస్సుల దూరము దండైక మానసము తొంబది ధనుస్సుల దూరము నడిపించిన పిమ్మట సాధ్యమగును. మృగజింఘ్మము సంకరజాతికి చెందిన అశ్వము. దానిని ఎనుబదిలేక తొంబది ధనుస్సుల దూరము నడిపించినచో సాధ్యమగును. శర్కర మదువు, లాజలు, తినుఅశ్వము బ్రాహ్మణజాతీయము. ఇదిపవిత్రము సుగంధయుక్తము అయివుండును. క్షత్రి యాశ్వము తేజశ్శాలి యైయుండును. వైశ్యాశ్వము వినయబుద్ధి సంపన్నమై, శూద్రాశ్వము, అపవిత్రము, చంచలము, మందము, కురూపము, బుద్ధిహీనము, దుష్టము అయివుండును కళ్ళెము పట్టుకొనుగనే లాలాజలమును శ్రమించు గుర్రమునకు ఆ కళ్ళెము త్రాడు యిప్పిదానిని జలధారచే స్నానము చేయించవలయును. ఇపుడు శాలిహోత్రుడు చెప్పిన విధమున అశ్వలక్షణములను చెప్పెదను.

అది మహాపురాణమున అశ్వవాహనసార వర్ణనమను రెండు వందల యెనుబదియెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page