Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకోనాశీత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ సిద్ధౌషధాని

అగ్నిరువాచ :

ఆయుర్వేదం ప్రవక్ష్యామి సుశ్రుతాయ యమబ్రవీత్‌ | దేవోధన్వన్తరిః సారం మృతసంజీవనీ కరమ్‌. 1

సుశ్రుత ఉవాచ :

ఆయుర్వేదం మమ బ్రూహి నరాశ్వేభరుగర్దనమ్‌ | సిద్ధయోగాత్సిద్ధమంత్రాన్మృత సంజీవనీకరమ్‌. 2

ధన్వన్తరి రువాచ :

రక్షన్బలం హి జ్వరితం లంఘితం భోజయేద్భిషక్‌ |

సవిశ్వం లాజమండలం తు తృడ్‌ జ్వరాన్తం శృతంజలమ్‌. 3

ముస్త పర్పట కోశీర చందనో దీచ్యనాగరైః | షడహేచ వ్యతిక్రాంతే తిక్తకం పాయయేద్ధృవమ్‌. 4

స్నేహయేత్త్యక్తదోషం తుతతస్తంచ విరేచయేత్‌ | జీర్ణాః షష్టిక నీవార రక్తశాలి ప్రమోదకాః.

5

తద్విధాస్తే జరేష్విష్టా యవానాం వికృతి స్తథా | ముద్గా మసూరాశ్చణకాః కులత్థాశ్చ సుకుష్టకాః. 6

ఆఢక్యో నారకాద్యాశ్చ కర్కోటక కటోల్బకమ్‌ | పటోలం సఫలం నింబం పర్పటం దాడిమం జ్వరే. 7

ఆధోగే వమనంశస్తమూర్ధ్వగేచ విరేచనమ్‌ | రక్తపిత్తే తథా పానం షడంగం శుంఠివర్జితమ్‌.

8

సక్తగోధూమలాజాశ్చ యవశాలి మసూరకాః | సకుష్ఠ చణకా ముద్గా భక్ష్యా గోధూమకాహితాః. 9

సాధితా ఘృతదుగ్ధాభ్యాం క్షౌద్రం వృషరసో మధు | అతీసారే పురాణానాం శాలీనాం భక్షణం హితమ్‌. 10

అగ్నిదేవుడు పలికెను. ధన్వంతరిచే సుశ్రుతునకు చెప్పబడినదియు మృత సంజీవనమును శ్రేష్ఠమును అగు ఆయుర్వేదమును గూర్చి చెప్పెదను. సుశ్రుతుడు పలికెను. మనుష్య, అశ్వ, గజరోగములను తొలగించు ఆయుర్వేదమును మృత సంజీవనకరములగు సిద్ధయోగములను సిద్ధమంత్రములను నాకు చెప్పుము. ధన్వంతరి పలికెను. జ్వరము వచ్చినవాని బలము చూచుకొని వైద్యుడు లంగనమును చేయించవలెను. పిదప శుంఠితో కూడి నదియు, దాహమును జ్వరమును తగ్గించు, లాజలగంజిని కాచిన జలమును ముస్త, పర్పట, కోశరి, చందన, ఉదీచ్య నాగరములు వేసి కాచి ఇవ్వవలెను. ఆరుదినములు గడచిన తరవాత, తిక్తకషాయమును తప్పక త్రాగించవలెను. జ్వరము తగ్గిన తరవాత, చెమటపట్టునట్లు చేసి, విరేచనమునకు మందు ఇవ్వవలెను. షష్టికనీవారములు రక్తశాలులు ప్రమోదకములు. ఇట్టి పాతధాన్యములు జ్వరమునందు మంచివి. యవలతో చేసిన పదార్థములు మంచివి. ముద్గ - మసూర - చణక - కులుత్థ - కుష్ఠక - ఆఢకి - నారకాదులును కర్కోటక - కట - ఉల్చకములును ఫలములతో కూడిన పటోలము, వేప, దాడిమము ఇవి జ్వరమునందు హితకరములు. రక్తపిత్థము అధోగతిగలదియైనచో, వమనము ఊర్ధ్వగతి కలదియైనచో విరేచనము ప్రశస్తము. శుంఠి చేర్చక తయారుచేసిన షడంగక్వాథము ఇవ్వవలెను. ఈరోగమున సక్తు-గోధూమ-లాజయవ-గాలి-మసూర-మకుష్ట-చణక - ముద్గములు - హితకరములు. పాలు నెయ్యి చేర్చి చేసిన గోధుమ పదార్థములు బలవర్థకములగు రసము తేనె, శ్రేష్ఠమైనది అతిసారరోగమునందు పాత బియ్యమును భక్షించుట హితకరము.

అనభిష్యన్ధి యచ్చాన్నం లోధ్రవల్కల సంయుతమ్‌ | మారుతం వర్జయేద్యత్నః కార్యో గుల్మేషు సర్వతా.

వాట్యం క్షీరేణ చాశ్నీయాద్వా సూక్తం ఘృతసాధితమ్‌ | గోధూమ శాలయస్తిక్తా హితా జఠరిణామథ. 12

గోధూమ శాలయో ముద్గా బ్రహ్మరక్షఖదిరో7భయా | పంచకోలం జాంఘలాశ్చ నింబధాత్ర్యః పటోలకాః. 13

మాతులుంగ రసాజాతి శుష్క మూలక సైంధవాః | కుష్ఠినాం చతథాశస్తం పానార్థే ఖదిరోదకమ్‌. 14

మసూరముద్గౌ పేయార్థే భోజ్యా జీర్ణాశ్చ శాలయః | నింబపర్పటకైః శాకైర్జాంగలానాం తథారసః. 15

విడంగం మరిచం ముస్తం కుష్ఠంలోధ్రం సువర్చికా | మనః శిలాచ వాలేయః కుష్ఠహా మూత్ర పేషితః. 16

అపూపకుష్ఠ కుల్మాష యవాద్యా మేహినాం హితాః | యవాన్న వి కృతిర్ముద్గా కులత్థా జీర్ణశాలయః. 17

తిక్తరూక్షాణి శాకాని తిక్తాని హరితాని చ | తైలాని తిలశిగ్రుకవిభీత కేఙ్గు దానిచ. 18

ముద్గాఃసయవ గోధూమా ధాన్యం వర్ష స్థితం చయత్‌ | జాంగలస్య రసః శస్తో భోజనే రాజయక్ష్మిణామ్‌.

కులత్థ ముద్గ కోలాద్యైః శుష్క మూలక జాంగలైః | పూపైర్వా విష్కిరైః సిద్ధైర్దధి దాడి మసాధితైః 20

మాతులుంగ రస క్షౌద్రద్రాక్షావ్యోషాది సంస్కృతైః | యవగోధూమ శాల్యన్నైర్భో జయేచ్ఛ్వాస కాసినామ్‌.

దశమూల బలారాస్నాకులత్థెరుపసాధితాః | పేయాః పూపరసాః క్వాథాః శ్వాసహిక్కా నివారణాః. 22

గుల్మరోగమునందు కఫకరము కానిదియు. లోధ్రవృక్షపు బెరడుతోచేసిన క్వాథము కలిసినదియు అగు. అన్నము మంచిది. వాయుకరములగు అన్నమును త్యజించవలయును. ఉదరరోగమున క్షీరముతో కలిపి ఘృతసాధితమగు వాట్యమును తినవలెను. గోధుమలు, బియ్యము, తిక్త, ఔషధములు వీరికి మంచివి. గోధుమలు, బియ్యము, ముద్గములు, పలాశబీజములు, ఖదిరము, అభయ పంచకోశము, జాంగలము నింబ పటోలకములు, ఉసిరి, మాతులుంగరసము, జాజి, శుష్కమూలకము, సైంధవము, ఇవి కుష్ఠరోగములకు హితకరములు. త్రాగుటకు ఖదిరోదకము మంచిది పేయమునకు మసూర ముద్గములు ఉపయోగించవలెను. తినుటకు పాత బియ్యము హితకరము! నింబ పర్పటక శాకములు జాంగలరసము, విడంగ - మరిచ - ముస్త - కుష్ఠ - లోధ్ర - సువర్చికా - మనశ్శిలా - వచలు, గోమూత్రమున నూరినవి కుష్ఠమును తొలగించును. మేహవ్యాధి కలవారికి ఆపూప కుష్ఠ కుల్మాష యవాదులు హితకరములు యవలతో చేసిన పదార్థ ములు పెసలు ఉలవలు - పాత బియ్యము, తిక్తరూక్ష, శాకములు, తిక్తములు, హరితములగు శాకములు, తిలసిగ్రుక - విభీతక - ఇంగుదీతైలములు హితకరములు రాజయక్ష్మరోగులకు ముద్గయవ గోధూములు ఒక సంవత్సరము నిల్వయున్న ధాన్యము జాంగలరసము భోజనమునందు ప్రశస్తము శ్వాసకాస రోగులకు కులుత్థ-ముద్గ కోల, - శుష్కమూలక జాంగల అపూప - దధులు దాడిమరస సాధితములగు విష్కిల జాంగలరసమాతు లుంగరస, క్షౌద్ర, ద్రాక్షాదులు, వ్యోష సంస్కృతములగు యవ, గోధూమ శాల్యన్నములు హితకరములు. దశమూల, బల, రాస్నలు, కుళుత్థనిర్మితములగు పేయములు పూపరసక్వాథములు శ్వాసను ఎక్కిళ్ళను తొలగించును.

శుష్కమూలకకౌలత్థ మూలజాంగలజైరసైః | యవగోధూమ శాల్యన్నం జీర్ణం సోశీరమాచరేత్‌. 23

శోథవాన్సగుడాం పథ్యాం ఖాదేద్వా గుడనాగరమ్‌ | తక్రంచ చిత్రకం చోభౌ గ్రహణీ రోగనాశనౌ. 24

పురాణ యవగోధూమశాలయో జాంగలోరసః | ముద్గామలక ఖర్జూరమృ ద్వీకా బదరాణిచ. 25

మధుసర్పిః పయః శక్రం నింబపర్పటకౌ వృషమ్‌ | తక్రారిష్టాశ్చ శస్యన్తే సతతం వాతరోగిణామ్‌. 26

హృద్రోగిణో విరేచ్యాస్తు పిప్పల్యో హిక్కినాం హితాః | తక్రార నాలసింధూని యుక్తాని శిశిరాంభసా. 27

ముక్తాః సౌవర్చలాజాది మద్యంశస్తం మదాత్యయే | సక్షౌద్ర పయసాలాక్షాం పిబేచ్ఛ క్షతవాన్నరః. 28

క్షయం మాంసరసాహారో వహ్ని సంరక్షణాజ్జయేత్‌ | శాలయో భోజనే రక్తా నీవారకలమాదయః. 29

యావన్న వికృతిర్మాంసం శాకం సౌవర్చలం శటీ | పద్యా తథై వార్శసాం యన్మండం తక్రంచ బారిణా.

ముస్తాభ్యాసస్తథా లేపశ్చిత్రకేణ హరిద్రయా | యావన్న వికృతిః శాలిర్వా సూక్తం ససువర్చలమ్‌. 31

త్రపుషైర్వారు గోధూమాః క్షీరేక్షు ఘృత సంయుతాః |

మూత్రకృచ్ఛ్రే చశస్తాః స్యుః పానేమండసురాదయః. 31

లాజా సక్తుస్తథా క్షౌద్రం శూన్యం మాంసం పరూషకమ్‌ | వార్తాకులావశిఖినశ్ఛర్దిఘ్నాః పానకాని చ. 33

శాల్యన్నం తోయపయసీ కేవలోష్ణే శృతే7పివా | తృష్ణాఘ్నే ముస్తగుడ యోర్గుటికావా ముఖే ధృతా. 34

యవాన్నవికృతిః పూపం శుష్కమూలకజం తథా | శాకం పటోలవేత్రాగ్రమూరుస్తంభవినాశనమ్‌. 36

ముద్గాఢక మసూరాణాం సతిలైర్జాంగలై రసైః | ససైంధవ ఘృతద్రాక్షాశుంఠ్యామలక కోలజైః. 36

యూషైః పురాణ గోధూమ యవ శాల్యన్న మభ్యసేత్‌ | విసర్పీ ససితాక్షాద్ర మృద్వీకాదాడిమోదకమ్‌. 37

శుష్కమూల కుశుత్థ - మూల జాంగలజరసములు, పాతయవలు, గోధుమలు, పాతవరి - ఉశీరముతో కలిపి తీసుకొన్నచో శ్వాసకాసములు తొలగును. శోథరోగి గుడ సహిత పథ్యనుకాని. గుడ నాగరముగాని తినవలెను. తక్రము, చిత్రకము, ఈ రెండును గ్రహణీరోగమును తొలగించును. సర్వదా వాతరోగముతో బాధపడు వారికి పాత యవలు గోధూమలు వరి, జాంగలరసము, ముద్గ ఆమలక, ఖర్జూరమృద్వీకా బదరములు, మధువు, నెయ్యి, పాలు, శక్రము, నింబము, పర్పటకము, బలకారక ద్రవ్యములు, తక్రారిష్టములు హితకరములు హృదయరోగము కలవారికి విరేచనము చేయించవలెను. ఎక్కిళ్ళకు పిప్పలి మంచిది. మజ్జిగ ఆరణాలము, సీధువులను చల్లటి నీటితో తీసుకొనవలెను. ఎక్కిళ్ళకు మంచిది. మదాత్యయరోగమున ముత్యములు, సౌవర్చలాజాదికము మద్యము హితకరమైనది గాయపడినవాడు క్షౌద్రము పాలు కలిపిన లాక్షను త్రాగవలెను. మాంస రసాహారము అగ్ని సంరక్షమై క్షయ రోగమును జయించును. క్షయరోగికి భోజనమున ఎర్రవరి నీవారములు కలవములు మొదలగునది హితకరములు. హర్షరోగమున యవాన్న వికృతులు మాంసము. శాకము, సౌవర్చలము, శటి, మండము జలముకలిపిన తక్రము మంచివి. మూత్ర కృచ్ఛ్రరోగమున ముస్తాభ్యాసము, హరిద్రా చిత్రకలేపము, యవాన్న వికృతులు, వరి వాస్తూకము, సువర్చలము త్రప్సు, క్షీరేక్షుఘృత మిశ్రితములగు గోధుమలు తినుటకు మంచివి. మండసురాదులు తాగుటకు మంచివి. వమనరోగమునకు లాజలు, సక్తువులు, మధువు శూన్య మాంసము, పరూషకము, వార్తాకము, నెమలి రెక్కలు కొన్ని పానకములు మంచివి వరి అన్నము కాచిన నీరు, పాలు దాహమును కట్టును. ముస్తా గుడములతో చేసిన గుటికను ముఖమునందుంచు కున్నను దాహము తొలుగును. యవాన్న వికృతులు పూపము, శుష్కమూలకము, శాకము వేత్రాగ్రము, ఇవి మోకాలు పట్టుకొనుటను తొలగించును. విసర్పరోగము కలవాడు. ముద్గ ఆఢక, మసూరముల గంజి తిలయు జాంగలరసము, సైంధవ యుక్త ఘృతము, ద్రాక్ష, శుంఠి, ఉసిరి, కోలము వీటి యూషములతో పాత గోధుమలు, యవలు వరి వీటి అన్నమును తినవలెను. విసర్పి మధు ద్రాక్షా దాడిమములతో చేసిన జలమును పంచదార కలిపి త్రాగవలెను.

రక్తయష్టికగోధూమ యవ ముద్గాదికంలఘు | కాకమాచీ చ వేత్రాగ్రం వాస్తుకంచ సువర్చలా. 38

వాతశోణితనాశాయ తోయం శస్తం సితం మధు | నాసా రోగేషు చ హితం ఘృతం దూర్వా ప్రసాదితమ్‌.

భృంగరాజ రసే సిద్ధం తైలం ధాత్రీ రసే7పివా | నస్యం సర్వా మయేష్విష్టం మూర్ధ్వజంతూద్భవేషుచ.

శీతతోయాన్న పానంచ తిలానాం విప్రభక్షణమ్‌ | ద్విజదార్ఢ్యకరం ప్రోక్తం తథా తుష్టికరం పరమ్‌. 41

గండూషం తిలతైలేన ద్విజదార్ఢ్యకరం పరమ్‌ | విడంగ చూర్ణం గోమూత్రం సర్వత్ర కృమినాశ##నే. 42

ధాత్రీ ఫలాన్య థాజ్యంచ శిరో లేపనముత్తమమ్‌ | శిరోరోగ వినాశాయ స్నిగ్ధముష్టం చ భోజనమ్‌. 43

తైలం వా బస్త మూత్రంచ కర్ణపూరణ ముత్తమమ్‌ | కర్ణశూల వినాశాయ సర్వశుక్తాని వాద్విజ. 44

గిరి మృచ్చం దనం లాక్షాం మాలతీం కాలికాం తథా | సంయోజ్య యా కృతావర్తిః క్షతశుక్రహరీతుసా. 45

వ్యోషం త్రిఫలయా యుక్తం తుచ్ఛకం చ తథా జలమ్‌ | సర్వాక్షి రోగశమనం తథైవ చరసాంజనమ్‌. 46

ఆజ్య భృష్టం శిలాపిష్టం లోద్రకాంజిక సైంధవైః | ఆశ్చ్యోతన వినాశాయ సర్వనేత్రామయే హితమ్‌. 47

గిరిమృచచందనైర్లోపో బహిర్నేత్రస్య శస్యతే | నేత్రామయ విఘాతార్థం త్రిఫలాం శీలయేత్సదా. 48

వాత రక్త రోగి ఎర్రవరి, గోధుమలు, ముద్గములు మొదలగు అన్నములు, లఘువుగా తినవలెను. కాక మారి, వేత్రాగ్రము, వాస్తుకము, సువర్చలా, మొదలగు శాకములు, మధుశర్కరా మిశ్రితమగు జలము. తీసుకొనవలెను. నాసికా రోగమునకు దూర్వా సిద్ధమగు ఘృతము హితము. భృంగరాజరసముతోగాని, ఆమలకరసముతో కాని శోధితమైన తైలమును నశ్యముగా, ఇచ్చినచో సమస్త శిరోరోగములకు హితకరములు శీతల జల అన్నపానములు తిలభక్షణము దంతములను దృఢము చేసి గొప్ప తృప్తిని కలిగించును. తిల తైలముతో గండూషము దంతములకు దార్డ్యము నిచ్చును. విడంగ చూర్ణము, గోమూత్రము అన్ని విధముల క్రిమినాశనమునకు ఉపయోగించును. ఉసిరి పండ్లు నూరి నేతిలో కలిపి శిరస్సుకు మర్దించినచో శిరో రోగములు నశించును. స్నిగ్ధము, ఉష్ణము అయిన భోజనము కూడ శిరోరోగము నకు మంచిది. కర్ణశూలము తొలగించుటకు చెవులలో తైలముగాని, మేకమాత్రముగాని, నింపవలెను. ఇదిసకలశిరోరోగములకు మంచిది. గిరి మృత్తిక, లాక్షి, చందనము, మాలతీకలిక, వీటిని కలిపినూరి చేసినవర్తి క్షతమును శుక్రదోషమును హరించును. వ్యోషము త్రి ఫలమున, తుచ్ఛకమును జలమును కలిపి కంటిలో వేసినచో సర్వనేత్రరోగ నాశకము. రసాంజనము కూడ ఇందుకు మంచిది. లోధ్రకాంజిక సైంధములను నేతిలో వేయించి శిలపై నూరి నేత్రమునకు లేపము చేసినచో అన్ని నేత్ర రోగుములు తొలగును. నీళ్ళు కారుట తగ్గును. గిరి మృత్తికా చందనము వీటినిపైన రాసినచో కండ్లకు మంచిది. నేత్రరోగనాశనమునకైన సర్వదా త్రిఫలను సేవించవలెను.

రాత్రౌతు మధు సర్పిర్భ్యాం దీర్ఘమాయుర్జిజీవిషుః | శతావరీరసే సిద్ధౌ వృష్యౌక్షీరఘృతౌస్మృతౌ. 49

కలంబికాని మాషాశ్చ వృష్యౌక్షీరఘృతౌతథా | ఆయుష్యా త్రిఫలాజ్ఞేయా పూర్వవన్మధుకాన్వితా. 50

మధుకాదిరసోపేతా వలీపలిత నాశినీ | వచా సిద్ధ ఘృతం విప్ర భూత దోషవినాశనమ్‌. 51

కవ్యం బుద్ధిప్రదం చైవ తథా సర్వార్థ వాధనమ్‌ | బలాకల్క కషాయేణ సిద్ధమభ్యంజ(తే)నే హితమ్‌. 52

రాస్నాసహచరైర్వాపి తైలం వాత వికారిణామ్‌ | అనభిష్యంది యచ్చాన్నం త ద్ర్వ ణషుప్రశస్యతే. 53

సక్తుపిండీ తథై వావ్లూ పాచనాయ ప్రశస్యతే | పక్వస్వ చ తథా భేదే నింబచూర్ణం చ రోపణ. 54

తథా శూచ్యుపచారశ్చ బలికర్మ విశేషతః | సూతికాచ తథారక్షా ప్రాణినాంతు సదాహితా. 55

భక్షణం నింబ పత్రాణాం సర్పదష్టస్య భోజనమ్‌ | తాలనింబదలం కేశ్యం జీర్ణం తైలం యవాఘృతమ్‌ 56

ధూపో వృశ్చిక దష్టస్య శిఖిపత్రఘృతేన వా | అర్క క్షీరేణ సంపిష్టం లోపా బీజం పలాశజమ్‌. 57

వృశ్చికార్తస్య కృష్ణా వా శివాచ ఫలసంయుతా | ఆర్కక్షీరం తిలం తైలం పలలంచ గుడం సమమ్‌. 58

పానాజ్జయతి దుర్వారం శ్వవిషం శీఘ్రమేవతు | పీత్వామూలం త్రివృత్తుల్యం తండులీయస్య సర్పిషా. 59

సర్పకీటవిపాణ్యాశు జయత్యతిబలాన్యపి | చందనం పద్మకం కుష్ఠం లతాంబూశిరపాటలా. 60

నిర్గుండీ శారివాసేలుర్లూతా విషహరో గదః | శిరో విరేచనం శస్తం గుడనాగరకం ద్విజ. 61

స్నేహపానే తథావస్తౌ తైలం ఘృతమనత్తమమ్‌ | స్వేదనీయః పరోవహ్నిః శీతాంభః స్తంభనం పరమ్‌. 62

త్రివృద్ధిరేచనే శ్రేష్ఠా వమనే మదనం తథా | బస్తిర్విరేకో వమనం తైలం సర్పిస్తథామధు.

వాతపిత్త బలశానాం క్రమేణ పరమౌషధమ్‌. 63

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సిద్ధౌషధాది కథనం నామైకోనాశీత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

దీర్ఘాయుర్దాయముకోరువాడు త్రిఫలను మధుఘృతములతో సేవించవలెను. శతావరి రససోదితములగు క్షీరఘృతములు బలవర్ధకములు. మాషములు పాలు నెయ్యి ఇవి కూడ బలవర్ధకములు. వెనుక చెప్పినట్లు మధుకామిశ్రితమగు త్రిఫల ఆయుర్వర్ధకము. మధుకాదిరసమిశ్రితమగు త్రిఫల బళులను పలితమును నశింపచేయును వచాసిద్ధమగు ఘృతము భూత దోషమును నివారించును. దానితోచేసిన కవ్యము బుద్ధి ప్రదము. సర్వమనో రథసాధకము. బలాకల్కకషాయముతో చేసినది అభ్యంజనమునకు మంచిది. రాస్నతోగాని, సహచరితోగాని సిద్ధమైన తైలము వాతరోగులకు మంచిది. వ్రణములకు శ్లేష్మచేయని ఆహారము మంచిది. జీర్ణమునకు సక్తుపిండి ఆవ్లు, ప్రశస్తములు. వేప చూర్ణము వ్రణము పక్వమైనపుడు దానిని చితికించుటకును, మాన్పుటకును మంచిది. అట్లే సూదితో చికిత్సకూడ వ్రణమునకు మంచిది. బలికర్మ విశేషముచే సూతికకు లాభమగును. రక్షాకర్మ ప్రాణులకు సర్వదా హితకరము సర్పదష్టునకు నింబపత్ర భక్షణము ఔషధము. తాళ నింబ పత్రములు పురాణ తైలము లేదా పురాణ ఘృతము కేశములకు మంచిది. తేలుకుట్టిన వానికి నెమలి పింఛము, ఘృతము, వీటితో ధూపము మంచిది. లేదా జిల్లెడు పాలతో నూరిన పలాశ బీజముల లేపము తేలువిషమును దింపివేయును. తేలుకుట్టిన వానికి కృష్ణాఫలములు కాని శివాఫలములుకాని, తినిపించవలెను. జిల్లెడు పాలు తిలలు తైలము పలలము గుడము వీటిని సమాన మాత్రలో వేసి త్రాగించినచో భయంకరమగు కుక్క విషము శీఘ్రముగ నశించును. మూలమును, త్రివృత్తును, సమాన మాత్రలో నేతితో త్రాగినచో మనుష్యుడు బలవంతుడై సర్వకీట విషములను జయించును. చందనము పద్మము, కుష్ఠము, లతాంబు , ఉషీరము, పాటల, నిర్గుండి, శారిబ సేలు, ఇవి సాలెపురుగు విషమును తొలగించును. గుడ సహితమగు శుంఠి శిరో విరేచనమునకు మంచిది, స్నేహపానమునకు బస్తిక్రీపును తైలఘృతములు అత్యుత్తమములు. అధికాగ్నికి స్వేదనము, (చెమట పట్టించుట) స్తంబనమునకు చల్లటి నీరు శ్రేష్ఠము, రేచనమునకు త్రివృద్ధియు, వమనమునకు మదనమును శ్రేష్ఠము. వస్తి విరేచనవమనములు తైలఘృత మధువులు క్రమముగ వాతపిత్థ కఫములకు పరషమౌధములు.

అగ్ని మహాపురాణమున సిద్ధౌషధాది కథనమను రెండువందల డెబ్బది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page