Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః

అథ రాజవంశవర్ణనమ్‌

అగ్నిరువాచ :

తుర్వసోశ్చ సుతోవర్గో గోభానుస్తస్య చాత్మజః | గోభానో రాసీత్త్రైశానిసై#్త్ర శానేస్తు కరంధమః. 1

కరంధమాన్మరుత్తో7భూద్ధుష్యన్తస్తస్య చాత్మజః | దుష్యన్తస్య వరూథో7భూద్గాండీరస్తు వరూథతః. 2

గాండీరాచ్చైవ గాంధారః పంచజాన పదాస్తతః | గాంధారాః కేరళాశ్చోలాః పాండ్యాః కోలామహాబలాః. 3

ద్రుహ్యస్తు బభ్రుసేతుశ్చ బభ్రుసేతోః పురోవసుః | తతోగాంధారైర్ఘర్మో ఘర్మాద్ఘృతో7వత్‌.

4

ఘృతాత్తు విదుషస్తస్మాత్ప్రచేతాస్తస్య వైశతమ్‌ | ఆనద్రశ్చ సభానరశ్చాక్షుషః పరమేషుకః. 5

సభానరాత్కాలానలః కాలానలజః సృంజయః | పురంజయః సృంజయస్య తత్పుత్రో జనమేజయః. 6

తత్పుత్రస్తు మహాశాలస్తత్పుత్రో7భూన్మ హామనాః | తస్మాదుశీనరో బ్రహ్మన్నృగాయాంతునృగస్తతః. 7

నరాయాంతు నరశ్చాసీత్కృమిస్తు కృమితః సుతః | దశాయాం సువ్రతో జజ్ఞే దృషద్వత్యాం బిస్తథా. 8

శిబేః పుత్రాస్తు చత్వారః పృథుదర్భశ్చ వీరకః | కైకేయో భద్రకస్తేషాం నామ్నాజనపదాః శుభాః. 9

తితిక్షురుశీనరజస్తితి క్షోశ్చ రుషద్రథః | రుషద్రథాదభూత్పైలః పైలాచ్ఛ సుతపాఃసుతః. 10

మహాయోగీ బలిస్తస్మాదంగా వంగశ్చ ముఖ్యకః | పుండ్రః కలింగో బాలేయో బలేర్యోగీ బలాన్వితః. 11

అంగాద్దధివాహనో7భూత్తస్మాద్ది విరథోనృపః | దివిరథాద్ధర్మరథస్తస్య చిత్రరథఃసుతః 12

చిత్రరథాత్సత్యరథో లోమపాదశ్చ తత్సుతః | లోమపాదాచ్చతురంగః పృథులాక్షశ్చ తత్సుతః. 13

పృథులాక్షాచ్చ చమ్పో7భూచ్చంపాద్ధర్యంగ కో7భవత్‌ |

హర్యంగాచ్చ భద్రరథో బృహత్కర్మాచ తత్సుతః. 14

తస్చాదభూద్బృహ ద్భానుర్బృహద్భానోర్బృ హాత్మవాన్‌ |

తస్మాజ్జయద్రథోహ్యా సీజ్జయద్రథాద్బృహద్రథః. 15

బృహద్రథాద్విశ్వజిచ్చ కర్ణో విశ్వజితో7భవత్‌ | కర్ణస్య వృషసేనస్తు పృథుసేనస్తదాత్మజః.

ఏతే 7ంగ వంశజాభూపాః పురోర్వంశం నిభోధమే. 17

ఇత్యది మహాపురాణ ఆగ్నేయే రాజవంశవర్ణనం నామ సప్తసప్తత్యధిక ద్విశతతమో7ధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. తుర్వసునికి వర్గుడు వానికి గోభానుడు వానికి త్రైశాని, వానికి కరంధముడు, వానికి మరుత్తుడు, వానికి దుష్యంతుడు, వానికి వరూథుడు, వానికి గాండీరుడు, వానికి గాంధారుడు పుట్టెను. గాంధారునకు ఐదుగురుపుత్రులు పుట్టిరి. వీరి నామధేయములననుసరించి గాంధార-కేరళ-చోళ-పాండ్య-కోల-దేశములు ఏర్పడినవి. వీరందరును మహాబలవంతులు. దృహ్యునికి బభ్రుసేతువు వానికి పురోవసువు, వానికి గాంధారుడు, వానికి ధర్ముడు, వానికి ఘృతుడు వానికి విదుషుడు, వానికి ప్రచేతసుడు, పుట్టిరి. ప్రచేతసుని నూర్గురి కుమారులలో ఆనద్ర-సభానర-చాక్షుష-పరమేశువులు-ప్రధానులు సభానరునకు కాలానలుడు, వానికి సృంజయుడు, దానికి పురంజయుడు, వానికి జనమే జయుడు, వానికి మహాశాలుడు, వానికి మహామానసుడు, వానికి ఉశీనరుడు. పుట్టెను. మహామానసుని భార్యయగు నృగకు నృగుడను కుమారుడు పుట్టెను. నృగునకు నరయను భార్యయందు నరుడును కృమియను భార్యయందు కృమియు, దశయను భార్యయందు సువ్రతుడు దృషద్వతియందు శిబి జనించెను. శిబికి పృథుదర్భుడు వీరకుడు-కైకేయుడు-భద్రకుడు అను నలుగురు పుత్రులు జనించిరి. వీరిపేర్లతో నాలుగుదేశములు ప్రసిద్ధములైనవి. ఉశీనరునికి తితిక్షువు వానికి రుషధ్రథుడు, వానికి పైలుడు, వానికి సుతకుడు, వానికి మహాయోగియైన బలిజన్మించెను. బలికి, అంగ-వంగ-ముఖ్మక-పుండ్ర-కళింగులను పుత్రులు పుట్టిరి. వీరందరికిని బాలేయులని పేరు. యోగియైన బలి మహాబలవంతుడు. అంగునికి దధివాహనుడు వానికి దివిరథుడు వానికి ధర్మరథుడు, వానికి చిత్రరథుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు వానికి చతురంగుడు వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి సత్యరథుడు, వానికి లోమపాదుడు వానికి చతురంగుడు వానికి పృథులాక్షుడు, వానికి చంపుడు, వానికి హర్యంగుడు, వానికి భద్రరథుడు, వానికి బృహత్కర్మ వానికి బృహద్భానుడు, వానికి జయద్రథుడు, వానికి బృహద్రథుడు, వానికి విశ్వజిత్తు, వానికి కర్ణుడు, వానికి వృషసేనుడు పుట్టెను. అంగవంశమునందు పుట్టినరాజులను గూర్చిచెప్పితిని. ఇపుడు పురువంశవర్ణనము వినుము.

అగ్ని మహాపురాణమున రాజవంశవర్ణనమను రెండువందల డెబ్బది యేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page