Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టపంచాశదధిక ద్విశతతమో7ధ్యాయః.

అథ వాక్పారుష్యాదిప్రకరణమ్‌

అగ్ని రువాచ :

నత్యాసత్యాన్యథాస్తోత్రైర్న్యూనాంగేంద్రియరోగిణామ్‌ | క్షేపం కరోతి చేద్దండ్యః పణానర్దత్రయోదశ.1

అభిగన్తాస్మి భగినీం మాతరం వాతవేతి చ | శపన్తం దాపయేద్రాజా పంచవింశతికం దమమ్‌.2

అర్థో7ధమేషుద్విగుణః పర స్త్రీ షూత్తమేషు చ | దండ ప్రణయనం కార్యం వర్ణజాత్యు త్తరాధరైః.3

ప్రాతిలోమ్యాపవాదేషు ద్విగుణ త్రిగుణాదమాః | వర్ణానామానులోమ్యేన తస్మాదేవార్థహానితః.4

బాహుగ్రీవానేత్రసక్థి వినాశే వాచికే దమః | శక్తస్తతో7ర్థికః పాదనాసాకర్ణకరాదిషు.5

అశక్తస్తు వదన్నేవం దండనీయః పణాన్దశ | తథాశక్తః ప్రతిభువం దద్యాత్‌క్షేమాయ తస్యతు.6

పతనీయకృతేక్షే పే దండో మధ్యమసాహసః | ఉపపాతక యుక్తేతు దాప్యఃప్రథమ సాహసమ్‌.7

త్రైవిద్యనృపదేవానాం క్షేప ఉత్తమ సాహసః | మధ్యమోజ్ఞాతి పూగానాం ప్రథమో గ్రామదేశయోః.8

అగ్నిదేవుడు పలికెను : అవయవలోపము ఇంద్రియలోపము కలవారిని రోగపీడితులను, సత్యవచనములచేతగాని, అసత్యవచనముల చేతగాని విపరీత స్తోత్రములచేగాని ఆక్షేపించువారిని పదమూడున్నర పణములచే దండించవలెను. నీ సోదరిని, తల్లిని చెరిచెదను యని తిట్టువానికి ఇరువదియైదు పణముల దండము విధించవలెను. తిట్టబడినవాడు అధముడు అయినచో సగము దండము, పరస్త్రీగాని, ఉత్తములుగాని అయినచో రెట్టింపు దండము విధించవలెను. వర్ణజాతుల ఉత్తమత్వ అధమత్వములను పరిశీలించి, దండమును నిర్ణయించవలెను. నిమ్నవర్ణమువాడు ఉచ్చవర్ణము వానిని తిట్టినపుడు రెండురెట్లు మూడు రెట్లు దండములను, ఉత్తమవర్ణమువాడు నిమ్నవర్ణము వానిని తిట్టినపుడు సగము తగ్గించియు దండము విధించవలెను. మాటలతో ''నీచేతులను, మెడను, నేత్రములను, తొడలను విరుగగొట్టెదను'' యని తిట్టినచో నూరు పణముల దండము విధించవలెను. పాదములు, ముక్కు, చెవులు, చేతులు, విరచెదను.''అని తిట్టినవానికి దానిలో సగము దండము విధించవలెను. ఇట్లు తిట్టినవాడు అసమర్థుడైనచో పది పణములు దండించవలెను. సమర్థుడైన వాడు దండము చెల్లించి తిట్ట బడినవాని క్షేమము కొరకై (ప్రతిభూ) జామీను ఇవ్వవలెను. ''నీవు పతితుడవు'' యని తిట్టిన వానికి మధ్యమ సాహస దండము. ఉపపాతకములు చేసినావు యని తిట్టినవానికి ప్రథమ సాహసదండము. వేదవేత్తలను రాజును దేవతలను తిట్టిన వానికి ఉత్తమ సాహస దండము. జ్ఞాతులను సంఘమును తిట్టినవానికి మంధ్యదండము. గ్రామమును దేశమును తిట్టినవానికి ప్రథమ సాహసదండము.

అసాక్షిక హతే చిహ్నైర్యుక్తి భిశ్చాగమేన చ | ద్రష్టవ్యో వ్యవహారస్తుకూగచిహ్న కృతాద్భయమ్‌. 9

భస్మపంకరజః స్పర్శే దండో దశపణః స్మృతః | అమేధ్యపార్‌ష్ణినిష్ఠ్యూత స్పర్శనే ద్విగుణః స్మృతః.10

సమేష్వేవం పరస్త్రీషు ద్విగుణస్తూ త్తమేషుచ | హీనేష్వర్థం దమో మోహమదాదిభిరదండనమ్‌.11

విప్రపీడాకరం ఛేద్య మంగమబ్రాహ్మణస్యతు | ఉద్గుర్ణే ప్రథమోదండః సంస్పర్శేతు తదర్దికః.12

ఉద్గూర్ణే హసన్తపాదేతు దశవింశతికౌదమౌ | పరస్పరంతు సర్వేషాం శాస్త్రే మధ్యమసాహసః. 13

పాదకేశాంశుకకరోల్లుంచనేషు పణాన్దశ | పీడాకర్షాంశుకా వేష్టపాదాధ్యాసేశతందమః.14

శోణితేన వినాదుఃఖం కుర్వన్కాష్ఠాదిభిర్నరః | ద్వాత్రింశతం పణాన్దాప్యోద్విగుణం దర్శనే7సృజః. 15

కరపాదదతో భంగే ఛేదనే కర్ణనాసయోః | మధ్యో దండో వ్రణోద్భేదే మృతకల్పహతే తథా.16

చేష్టాభోజనవాగ్రోధేనేత్రాది ప్రతిభేదనే | కంధరాబాహుసక్థ్నాం చ భంగే మధ్యమసాహసః17

ఏకం ఘ్నతం బహూనాంచ యథోక్తాద్ద్విగుణోదమః |

కలహాప హృతం దేయం దండస్తు ద్విగుణః స్మృతః.18

దుఃఖ ముత్పాదయేద్యస్తు ససముత్థానజం వ్యయమ్‌ |

దాప్యో దండంచ యో యస్మిన్కలహే సముదాహృతః.19

తరికః స్థలజం శుల్కం గృహ్ణన్దండ్యః పణాన్దశ | బ్రాహ్మణ ప్రాతివేశ్యానా మేత దేవానిమంత్రేణ.20

అభిఘాతే తథా భేదే ఛేదే కుడ్యావపాతనే | పణాన్దప్యః పంచదశ వింశతిం తత్త్రయం తథా.21

దుఃఖోత్పాది గృహే ద్రవ్యం క్షిపన్ప్రాణహరం తథా |

షోడశాద్యః పణాన్దాప్యో ద్వితీయోమధ్యమం దమమ్‌. 22

దుఃఖేచే శోణితోత్పదే శాఖాంగచ్ఛేదనే తథా | దండః క్షుద్రపశూనాం స్యాద్ద్విపణప్రభృతిః క్రమాత్‌.23

లింగస్య ఛేదనే మృత్యౌ మధ్యమే మూల్యమేవచ | మహాపశూనామేతేషు స్థానేషు ద్విగుణాదమాః.24

ప్రరోహి శాఖినాం శాఖాస్కంధ సర్వవిదారణ | ఉపజీవ్య ద్రుమాణాంతు వింశ##తేర్ద్విగుణోదమః. 25

యఃసాహసం కారయతి సదాప్యో ద్విగుణం దమమ్‌ |

యస్త్వేవ ముక్త్వాహం దాతాకారయేత్స చతుర్గుణమ్‌. 26

ఎవరినైన కొట్టినపుడు సాక్షులులేనిచో ఆయభియోగమును రాజు చిహ్నము యుక్తి, శాస్త్రము, వీటిని బట్టి పరిశీలించవలెను. దెబ్బతగిలినట్లు అసత్యమగు చిహ్నములు చేసికొనెనా ! అని పరిశీలించలెను. ఇతరునిపై భస్మము పంకము పరాగము చల్లిన వానికి పది పణముల దండము. అమేధ్యమును ఉమ్మితగల్చిన వానికిని మనవతో తన్నిన వానికిని రెట్టింపు దండము. ఇది సముల విషయమునను చెప్పబడినది. పరస్త్రీల విషయమునను ఉత్తముల విషయమునను ఈ అపరాధము చేసినచో రెట్టింపుదండము. తనకంటె హీనుల విషయమున చేసినచో సగము దండము. మోహముచేత గాని మదాదుల చేతగాని చేసినచో దండములేదు. ఒక విప్రునకు ఏ అంగముచే ఆబ్రాహ్మణుడు పీడ కల్గించునో ఆ అంగమును ఛేదించవలెను. బ్రాహ్మణుని చంపుటకు ఆయుధ మెత్తినచో ప్రథమ సాహస దండము. ఆయుధమును స్పృషించినచో సగము దండము. కొట్టుటకై హస్తముగాని పాదముగాని ఎత్తిన వానికి వరుసగా పది ఇరువది పణముల దండము. ఒకరినొకరు కొట్టుకొనుటకై ప్రయత్నించినపుడు అందరికిని మధ్యమ సాహసదండము. పాదము, కేశములు, వస్త్రము, హస్తములు, పట్టిలాగినచో పదిపణములదండము, పీడించినను లాగినను బట్టతో చుట్టబెట్టినను తన్నినను నూరు పణముల దండము. కాష్ఠాదులచే కొట్టినపుడు రక్తమురాకున్నచో ముప్రదిరెండు పణముల దండము రక్తము కనబడినచో రెట్టింపు దండము హస్తములను కాని పాదము లను కాని, దంతములను దాని విరుగగొట్టిన వానికి కర్ణములను నాసికను ఛేదించిన వానికిని గాయము కలుగునట్లు కొట్టిన వానికిన్ని చచ్చెనా యన్నట్లు కొట్టినవానికి మధ్యమదండము. ఇతరుల చేష్టను, భోజనమును, వాక్కును అడ్డుగొనినప్పుడున్ను నేత్రాదును, పీడించినపుడున్ను కంఠము బాహువులు తొడలు వించినపుడున్ను మధ్యమ సాహస దండము. చాలమంది కలసి ఒకనిని కొట్టినచో వారికి వెనుక చెప్పిన దండమునకు రెట్టింపు దండము ప్రత్యేకముగా విధించవలెను. కలహములో అపహరింపబడిన వస్తువును, దాని స్వామికి ఇప్పించి దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. అన్యునకు దుఃఖము కల్గించు వానిచే చికిత్సాదులకు యెంత వ్యయమగునో అంతధనము ఇప్పించవలెను. ఏకలహమునకు ఏదండము విధింప బడినదో ఆదండమును కూడ విధించవలెను. నావచే దాటించువాడు స్థల శుల్కమును తీసుకున్నచో పది పణములదండము. దేవకార్యాదులు వచ్చినపుడు సమర్థుడై యుండి కూడ చుట్టుప్రక్కలవున్న బ్రాహ్మణులను నిమంత్రణము చేయనివానికి పది పణముల దండము. ఇతరుల గోడను కొట్టినను భేదించినను రంధ్రము చేసినను దానిని పడగొట్టినను వరుసగ ఐదు, పది, ఇరువది, ముప్పది ఐదు పణములు ఇప్పించవలెను. ఇతరుల గృహమునందు దుఃఖోత్పాదకములగు వస్తువులను ప్రాణహర ములగు వస్తువులను పడవేయువారికి పదహారు పణముల దండము మధ్యమ సాహస దండము విధించవలెను. క్షుద్ర పశువు లకు పీడ కల్గించినను, వాటి శరీరమునుండి రక్తము స్రవించినట్లు చేసినను, కొమ్ములు ఛేదించినను, వరసగ రెండు నాలుగు ఎనిమిది పణముల దండము. వాటి లింగమును ఛేదించగ అవి మరణించినచో మధ్యమ సాహస దండము విధించి వాటి మూల్యమును ఇప్పించవలెను. మహా పశువుల విషయమున ఈ అపరాధము చేసినపుడు రెట్టింపు దండము. ప్రరోహి ( కొమ్ము తీసి పాతగ మొలచునది) వృక్షముల శాఖలను మ్రానును మొత్తము వృక్షమును చీల్చివేసినపుడు ఇరువది పణముల దండము. ఉప జీవ్య వృక్షములను (ఫలవృక్షములు) ఇట్లు చేసినచో రెట్టింపు దండము. సాహసమును చేయించినవానికి చేసినవానికంటే రెట్టింపు దండము నేను నీకు ధనము నిచ్చెదను నాహసమును చేయుము యని చెప్పి చేయించినవానికి నాలుగు రెట్లు దండము.

ఆర్యాక్రోశాతిక్రమకృద్ర్భాతృ జాయా ప్రహారదః | సందిష్టస్యా ప్రదాతాచ సముద్ర గృహ భేదకః.27

సామంతకులికాదీనామపకారస్య కారకః పంచాశత్పణికో దండ ఏషామితి వినిశ్చయః.28

స్వచ్ఛందవిధవాగామీవిక్రుష్టే నాభిధావకః | ఆకారణ చ విక్రోష్టా చాండాలశ్చోత్తమాన్స్ప్పశన్‌. 29

శూద్రఃప్రవ్రజితానాంచ దైవేపైత్యైచ భోజకః | ఆయుక్తం శపథం కుర్వన్నయోగ్యోయోగ్య కర్మకృత్‌.

వృషక్షుద్ర పశూనాంచ పుంస్త్వస్య ప్రతిఘాతికృత్‌ | సాధారణస్యాపలాపీ దాసీ గర్భవినాశకృత్‌.31

పితాపుత్రస్వసృభ్రాతృదమ్పత్యాచార్య శిష్యకాః | ఏషామపతి తాన్యో7న్యాత్యాగీచ శతదండభాక్‌.32

వసానస్త్రీన్పణాన్దండ్యో నేజకస్తు పరాంశుకమ్‌ | విక్రయావక్రయాధానయాచితేషు పణాన్దశ.33

తులాశాసన మానానాం కూడ కృన్నాణ కస్యచ | ఏభిశ్చ వ్వవహర్తాయః సదాప్యో దండ ముత్తమమ్‌.34

అకూటం కూటకం బ్రూతే కూటం యశ్చాప్య కూటకమ్‌ | సనాణక పరీక్షీ తు దాప్యః ప్రథమ సాహసమ్‌.35

భిషజ్‌ మిథ్యాచరన్దాప్యస్తిర్యక్షు ప్రథమం దమమ్‌ | మానుషే మధ్యమం రాజమానుషే షూత్తమం తథా.

అబధ్యం యశ్చ బధ్నాతి బధ్యం యశ్చప్రముంచతి | ఆ ప్రాప్త వ్యవహారంచ సదాప్యో దమముత్తమమ్‌.37

మానేన తులయా వాపి యోంశమష్టమకం హరేత్‌ | ద్వావింశతి పణాన్‌ దాప్యోవృద్ధౌహానౌచ కల్పితమ్‌.38

భేషజ స్నేహ లవణ గంధధాన్య గుడాదిషు | పణ్యషు ప్రక్షిపన్హీనం పణాన్దాప్యస్తుషోడశ.39

సంభూయ కుర్వతామర్ఘ్యం సబాధం కారుశిల్పినామ్‌ |

అర్థ(ర్ఘ)స్య హ్రాసం వృద్ధిం వాసహస్రో దండ ఉచ్యతే.40

రాజని స్థాప్యతేయో7ర్థః ప్రత్యహం తేన విక్రయః | క్రయోవానిస్రవస్త స్మాద్వణిజాం లాభకత్స్మృతః.

స్వదేశ పణ్యతు శతం వణి గ్గృహ్ణీత పంచకమ్‌ | దశకం పారదేశ్యే తు యః సద్యః క్రయవిక్రయీ.42

పణ్యస్యోపరి సంస్థాప్య వ్యయం పణ్యసముద్భవమ్‌ | ఆర్థో7నుగ్రహకృత్వార్యః క్రేతుర్విక్రేతురేవచ.43

పూజ్యులను తిట్టినవానికి వారి ఆజ్ఞ అతిక్రమించిన వానికి సోదరుని భార్యను కొట్టినవానికి, ఇచ్చెదననిచెప్పి ఇవ్వనివానికి, భూగృహమును భేదించినవానికి, ఇరుగుపొరుగువారికిని కూలీనులకు అపకారము చేయువానికి ఏబది పణముల దండుమ స్వేచ్ఛాపూర్వకముగ విధవాసంగముచేసిన వానికి, కష్టములోనున్నవారి అరచినపుడు, పరుగెత్తని వానికి ఆకారణముగా తిట్టువానికి, ఉత్తములను స్పృశించుచండాలునకు, దేవ పితృకార్యములందు సన్యాసులకు భోజనము పెట్టు శూద్రునకు, అనుచితముగా ఒట్లు పెట్టువానికి, తనకు చేయు అధికారములేని పనులు చేయువానికిని వృషభములు క్షుద్రపశుశుల పుంస్త్వమును చెడగొట్టినవానికిని, సాధారణ విషయములందు మోసముచేయువానికిని , దాసీ గర్భమును నశింపచేసినవానికిని, నూరుపణముల దండము విధించవలెను. తండ్రి, కుమారుడు, సోదరి, సోదరుడు, దంపతులు, ఆచార్యుడు, శిష్యుడు, వీరిలో పతితుడుకాని వారిని కూడ పరిత్యసించువారికి నూరుపణముల దండము. ఇతరుల వస్త్రములను ధరించిన చాకలివానికిని మూడుపణముల దండము. అమ్మివేసినను అద్దెకిచ్చినను కుదువపెట్టినను పదిపణములు దండము. తుల (తక్కెడ) శాసనములు, కొలతలు, వీటిలో కపటము చేయువానికిని, నాణములలో మోసముచేయువానికి , వీటితో వ్యవహరించువానికిని ఉత్తమ సాహసదండము విధించవలెను. మంచిదానిని చెడ్డదనియు, చెడ్డదానిని మంచిదనియు చెప్పు నాణక పరీక్షకునకు ప్రథమ సాహస దండము. జంతువుల విషయమున తప్పుడు వైద్యము చేయు వైద్యునకు ప్రథమ సాహస దండము , మనుష్యులకు చేసినచో మధ్యమ దండము. రాజ పురుషులకు చేసినచో ఉత్తమ దండము. బంధించకూడని వానిని బంధించినను, బంధింప తగిన వానిని విడిచి పెట్టినను అట్టి అధికారికి ఉత్తమ దండము. కొలతలోగాని, తూకములోగాని ఎనిమిదవ వంతుహరించిన వానిచే ఇరువది రెండు పణములు ఇప్పించవలెను. అష్టమాంశము కన్న అధికము అయినను తక్కువైనను దండమును కూడ మర్చవలెను. మందులు, తైలములు, లవణము, గంధము, ధాన్యము, గడము మొదలైన పణ్య వస్తువలలో తక్కువరకము వస్తువు కల్పిన వానికి పదహారు పణముల దండము, కొందరు శిల్పులు కలిసి పనిచేయుచు మూల్యములో హ్రాసము గాని వృద్ధిగాని కల్పించినచో వారికి వేయి పణముల దండమును విధించవలెను. వ్యాపారులు రాజుచే ప్రతిదినము నిర్ణయింపబడిన మూల్యమునకే క్రయ విక్రయములు చేయవలెను. దానిలో వచ్చు లాభము వర్తకులకు చెందును. వర్తకులు స్వదేశమునందు లభించు పణ్యముపై (అమ్మేవస్తువు) సూటికి ఐదువంతులు విదేశీయ వస్తువులపై, నూటికి పది వంతులు లాభము తీసుకొనవచ్చును. ఇది వెంటనే అమ్ముడుబోవు వస్తువులకు వర్తించును. వర్తకము చేయుటలో కలుగు వ్యయమును పణ్యము పై వేసి అమ్మువారికి కొను వారికిని కూడ లాభము కలుగునట్లు మూల్యము నిర్ణయించవలెను.

గృహీత మూల్యం యః పణ్యం క్రేతుర్నైవ ప్రయచ్ఛతి |

సోదయం తస్య దాస్యో7సౌ దిగ్లాభం వాదిగాగతే.44

విక్రీతమపి విక్రేయం పూర్వే క్రేతర్యగృహ్ణతి | హానిశ్చేత్ర్కేత్రదేషేణ క్రేతురేవ హిసాభ##వేత్‌.45

రాజదైవోవ ఘాతేన పణ్య దోషముపాగతే | హానిర్విక్రేతురేబాసౌ యాచి తస్యా ప్రయచ్ఛతః.46

అన్యహస్తేచ వక్రీతం దుష్టం వా7దుష్ట వద్యది | విక్రీణీతే దమస్తత్ర తన్మూల్యాద్ద్విగుణో భ##వేత్‌.47

క్షయం వృద్ధించ వణిజా పణ్యానామవిజానతా | క్రీత్వానానుశయః కార్యః కుర్వన్‌ షడ్బాగ దండభాక్‌.47

సమవాయేన వణిజాం లాభార్థం కర్మకుర్వతామ్‌ | లాభాలాభైయథా ద్రవ్యం యథావా సంవిదాకృతౌ.49

ప్రతిషిద్ధమనాదిష్టం ప్రమాదాద్యచ్చ నాశితమ్‌ | స తద్దద్యాద్విప్లవాచ్చ రక్షితాద్దశమాంశభాక్‌.50

అర్ఘప్రక్షేపణాద్వింశం భాగం శుల్కం నృపో హరేత్‌|

వ్యాసిద్దం రాజయోగ్యంచ విక్రీతం రాజగామితత్‌.51

మిథ్యావదన్పరీ మాణం శుల్యస్థానాదపక్రమన్‌ | దాప్యస్త్వష్ట గుణం యశ్చ సవ్యాజక్రయ విక్రయీ.52

దేశాన్తరగతే ప్రేతే ద్రవ్యం దాయాద బాంధవాః | జ్ఞాతయో వా హరేయుస్తదాగతా సై#్త్రర్వినా నృపః.53

జిహ్మంత్యజేయుర్నిగ్లోభమ శక్తో7న్యేన కారయేత్‌ | అనేన విధిరాఖ్యాత ఋత్విక్‌ కర్షకర్మిణామ్‌.54

పణ్యము మూల్యము తీసుకొని పణ్యమును గ్రాహకునకు ఇవ్వని వానిచే వృద్ధి సహితముగ ఇప్పించవలెను. గ్రాహకుడు విదేశము నుండి వచ్చినచో అతనికి ఆ దేశమునందు ఎంత లాభము వచ్చునో అంతధనముతో ఇప్పించవలెను. గ్రాహకుడు కొన్నవస్తువును ఏకారణము చేతనైనా, తీసుకొనకున్నచో దానిని మరియొకనికి అమ్మవచ్చును. కాని దానిపై నష్టము వచ్చినచో అది (మొదటి) గ్రాహకుని నుండి తీసుకొనవలెను. రాజోపఘాతము చేతగాని, దైవోపఘాతము చేతగాని, పణ్యము పాడైపోయినచో అనష్టమును గ్రాహకుడు అడిగినను ఇవ్వని విక్రేతయే భరించవలెను. ఒకరికి అమ్మిన దానిని మరియొకనికి అమ్మినను, చెడ్డదానిని మంచిదని చెప్పి అమ్మినను దాని మూల్యమునకు రెట్టింపు దండము విధించవలెను. పణ్యముల లాభనష్టములు తెలియని వర్తకుడు ఏదైనా వస్తువును కొన్నపుడు వెనుకాడకూడదు. ఇట్లు చేసి నచో ఆరవవంతు దండము విధించవలెను. లాభముకోరి కొందరు వర్తకులు కలిసి వ్యాపారము చేయునపుడు వారు లాభా లాభములను , ద్రవ్యమును బట్టి గాని మొదట అనుకొనిన మాటను బట్టిగాని చేసుకొనవలెను. వారిలో ఒకరు మిగిలిన వారి అనుమతిలేకుండగను, వారు నిషేధించినను లేదా తన ప్రమాదమువలనను వస్తువును పాడుచేసినచో ఆనష్టమును ఆతడే భరించవలెను. వారిలో ఒకడు ఒక వస్తువును ప్రమాదము నుండి రక్షించిరచో దానిలో పదవవంతు అతనికి చెందును. వస్తువుల నర్ణీత మూల్యములో ఇరువదవ భాగమును రాజు శుల్కముగా గ్రహించవలెను. రాజు నిషిద్ధమైన వస్తువుగాని, రాజయోగ్యమైన వస్తువును గాని ఎవరైనా విక్రయించుచున్నచో , దానిని రాజు స్వాధీనము చేసుకొనవచ్చును. అసత్య పరిమాణ మును చూపి కాని, పన్ను తీసుకొను స్థానమునుండి తొలగిపోయిగాని, మోసముతో గాని క్రయ విక్రయములు చేయు వానికి ఆ వస్తు మూల్యమునకు ఎనిమిది రెట్లు దండము విధించవలెను. కలిసి వ్యాపారము చేయువారిలో ఒకడు దేశాంతరము వెళ్ళినను మరణించినను ఆతని ద్రవ్యమును ఆతని దాయాదులు బంధులు జ్ఞాతులు గ్రహించవలెను. వారెవ్వరులేనిచో రాజు గ్రహించవలెను. సంఘములోని ఒకడు వక్రముగ ప్రవర్తించినచో ఆతనికి లాభము పంచకుండగ పంపివేయవలెను. స్వయముగ వ్యాపారము చేయలేనివాడు ఇతరులచే చేయించవలెను. ఋత్విక్కులు, కర్షకులు, కర్మచారులు, వారి విషయములో కూడ ఇదే విధానము.

గ్రాహకైర్గృహ్యతే చౌరో లోప్త్రేణాథ పదేనవా | పూర్వకర్మాపరాధీవా తథైవా శుద్ధవాసకః. 55

అన్యే7పి శంకయా గ్రాహ్యా జాతి నామాది నిహ్నవైః ద్యూతస్త్రీ పానసక్తాశ్చ శుష్కభిన్న ముఖస్వరాః

పరద్రవ్యగృహాణాంచ పృచ్ఛకా గూఢచారిణః | నిరాయా వ్యయ వస్తశ్చవి నష్టద్రవ్య విక్రయాః.57

గృహీతఃశంకయా చౌర్యే నాత్మానాం చేద్విశోధయేత్‌ |

దాపయిత్వా హృతం ద్రవ్యం చౌరదండేన దండయేత్‌. 58

చౌరం ప్రదాప్యాప హృతం ఘాతయే ద్వివిధైర్వధైః |

సచిహ్నం బ్రాహ్మణం కృత్వాస్వరాష్ట్రాద్విప్రవాసయేత్‌.59

ఘాతితే7పహృతే దోషోగ్రామ భర్తురనిర్గతే | స్వసీమ్ని దద్యాద్గ్రామస్తు పదం వాయత్ర గచ్ఛతి.60

పంచగ్రామీ బహిః క్రోశాద్దశగ్రామ్యథవాపునః | వన్దిగ్రాహాంస్తథా వాజికుంజరాణాంచ హారిణః.61

ప్రసహ్య ఘాతినశ్చైవ శూలమారోప యేన్నరాన్‌ | ఉత్‌క్షపక గ్రంథిభేదౌ కరసందంశ హీనకౌ. 62

కార్యౌ ద్వితీయా పరాధే కరపాదైక హీనకౌ | భక్తావధాశాగ్న్యుదక మంత్రోపకరణ వ్యయాన్‌.63

దత్వా చౌరస్య హస్తుర్వా జానతోదమ ఉత్తమః | శస్త్రావపాతే గర్భస్యపాతనే చోత్తమో దమః.64

ఉత్తమోవా7ధమో వాపి పురుషస్త్రీ ప్రమాపణ | శిలాం బద్ధ్వాక్షి పేదప్సు నరఘ్నీం విశదాం స్త్రియమ్‌.65

చోరుని అపహరించబడి ధనమును బట్టిగాని, ఆతని పద చిహ్నములను బట్టిగాని, రాజభటులు పట్టుకొనవలెను. పూర్వము అపరాధముచేసినవానిని ఆశుద్ధమైన నివాసము కలవానిని, తమజాతినామము మొదలగువాటిని కప్పి పుచ్చువారిని శంకచే బందీలుగా పట్టుకొనవచ్చును. ద్యూతము, స్త్రీ, పానము ఈ వ్యసనములు కలవారును ప్రశ్నించగ ఎండిపోయిన ముఖముగలవారును, కంఠస్వరము మారిపోయినవారును, ఇతరుల ద్రవ్య గృహాదులను గూర్చి ప్రశ్నించువారును, రహస్యముగ సంచరించువారును, ఆదాయము, లేకున్నరు వ్యయము చేయు వారును, నష్టమైనద్రవ్యములను అమ్మువారును చోరులుగా బంధింపబడవలెను. చౌర్యశంకచే పట్టుకొనబడినవాడు తాను నిరపరాధియని నిరూపించుకొనజాలనిచో వానిచే అపహృత ద్రవ్యమును ఇప్పించి వానిని చోరదండముచే శిక్షించవలెను. అపహృతధనమును ఇప్పించి అనేక విధములు వానిని కొట్టించవలెను. చౌర్యము చేసినవాడు బ్రాహ్మణుడైనచో వానినుదుట గుర్తువేసి రాజ్యమునుండి బహిష్కరించలెను. గ్రామములో ఎవరినైన కొట్టినను, ధనము అపహరింపబడినను, అపరాధిజాడలు తెలియనపుడు అదిగ్రామాధిపతి దోషము. ఆతడే చోరునిపట్టి రాజుకు అప్పచెప్పవలెను. చోరుడు ఏ గ్రామమునకు పారిపోయెనో అచ్చట వాని గుర్తు తెలసి ఆతడు చౌర్యము చేసిన గ్రామము యొక్క అధిపతి ఒప్పచెప్పవలెను. క్రోశడు దూరమునకు బయటవున్న పంచగ్రామాధికారిగాని, దశగ్రామాధికారిగాని, అశ్వగజాద్యపహారులకును ఇతరులను చంపినవారిని పట్టి శూలముపై గ్రుచ్చి చంపవలెను. ఏదైన వస్తువును ఎత్తుకొని పోయినవానికిని వానికిని పెట్టెలు, బ్రద్దలుకొట్టిన వానికిని వరుసగా బొటనవ్రేలు, తర్జనీ, ఖండించవలెను. ఆ అపరాధము రెండవసారి చేసినచో ఒక హస్తము, ఒక పాదము ఖండించవలెను. చోరునికిగాను, ఘాతకునకుగాను తెలిసికూడ భోజనము, అగ్ని, జలము, ఇతర ఉపకరణములు ఆలోచన, మార్గవ్యయము ఇచ్చినవానికి ఉత్తమ సాహసదండము విధించవలెను. ఇతరుల శరీరముపై ఆయుధము ప్రయోగించినను, గర్భపాతనము చేయించినను ఉత్తమ దండము ఎవరినైన పురుషునిగాని, స్త్రీనిగాని చంపినపుడు వానికి ఉత్తమ సాహసదండముగాని, అధమ సాహసదండము గాని వాని శీలాచారములనుబట్టి ఇవ్వవలెను. పురుషుని చంపి స్త్రీని, విషమును ఇచ్చిన స్త్రీని మెడలకు రాయి కట్టి నీళ్లలో పడవేయవలెను.

నిషాగ్నిదాం నిజగురు నిజాపత్య ప్రమాపణీమ్‌ | వికర్ణ కరనా సౌష్ఠీం కృత్వాగోభిఃప్రమాపయేత్‌.66

క్షేత్ర వేశ్మవనగ్రామ వివీతఖల దాహకాః | రాజపత్న్యభిగామీచ దగ్దవ్యాస్తు కటాగ్నినా.67

పుమాన్సం గ్రహణ గ్రాహ్యః కేశాకేశి పరస్త్రియాః | స్వజాతా వుత్తమో దండఅనులోమ్యేతు మధ్యమః.

ప్రాతిలోమ్యేవధః పుంసాం నార్యాః కర్ణావ కర్తనమ్‌ | నీలీస్తన ప్రావరణ నాభికేశావమర్ణనమ్‌.69

ఆదేశకాల సంభాషం సహా వస్థాన మేవచ | స్త్రీనిషేదే శతం దద్యాద్ద్విశతంతు దమంపుమాన్‌ 70

ప్రతిషేదే తయోర్దండో యథాసంగ్రహణ తథా| పశూన్గచ్ఛంశ్ఛతం దాప్యో హీనాం స్త్రీంగాశ్చ మధ్యమమ్‌.

అవరుద్ఠాసు దాసీషు భుజిష్యాసు తథైవచ | గమ్యాస్వపి పుమాన్దాప్యః పంచాశత్పణికందమమ్‌.72

ప్రసహ్య దాస్యభిగమే దండోదశపణఃస్మృతః | కుబంధేనాంక్య గమయేదంత్యా ప్రవ్రజితాగమే.73

న్యూనం వాప్యధికం వాపి లిఖేద్యోరాజశాసనమ్‌ | పారదారికచౌరం వా ముంచతో దండ ఉత్తమః.74

అభ##క్షెర్దూషన్విప్రం దండముత్తమ సాహసమ్‌ | కూటస్వర్ణ వ్యవహారీ విమాంసస్య చ విక్రయీ.75

అంగహీనశ్చ కర్తవ్యో దాప్యశ్చోత్తమ సాహసమ్‌ | శక్తోహ్యమోక్షయన్‌ స్వామి దంష్ట్రిణః శృంగిణస్తథా

ప్రథమం సాహసం దద్యాద్వికృష్టే ద్విగుణం తథా |

అచౌ(జా) రం చౌరే7భి వదన్దాప్యః పంచశతందమమ్‌.77

రాజ్ఞో7నిష్టప్రవక్తారం తసై#్యవాక్రోశకం తథా | మృతాంగ లగ్నవిక్రేతుర్గురోస్తాగడయితు స్తథా.78

తన్మంత్రస్య చ భేత్తారం ఛిత్త్వా జిహ్వాం ప్రవాసయేత్‌ | రాజయానాసనా రోఢుర్దండో మధ్యమసాహసః

ద్వినేత్ర భేదినో రాజద్విష్టా దేశకృతస్థథా| విప్రత్వేన చ శూద్రస్య జివితో7ష్టశతోదమః.80

యోమన్యేతా జితో7స్మీతి న్యాయేనాపి పరాజితః| తామాయాన్తం పునర్జిత్వా దండయేద్ద్విగుణం దమమ్‌.81

రాజ్ఞా7న్యాయేన యో దండో గృహీతో వరుణాయతమ్‌|

నివేద్య దద్యాద్విప్రేభ్యఃస్వయం త్రింశద్గుణీకృతమ్‌.82

ధర్మశ్చార్థశ్చ కీర్తిశ్చ లోకపం క్తిరుపగ్రహః |

ప్రజాభ్యోబహుమానంచ స్వర్గస్థానం చ శాశ్వతమ్‌ | పశ్యతో వ్యవహారాంశ్చ గుణాఃస్యుఃసప్తభూపతేః.83

ఇత్యాది మహాపురాణ అగ్నేయే వాక్పారుష్యాదిప్రకరణం నామాష్ట పంచాశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

విపము పెట్టిన దానికిని, దహనముచేసిన స్త్రీకిని తనకు పూజ్యుడైనవారిని, సంతానమును చంపిన స్త్రీకిని, హస్తములు ముక్కుచెవులు ఖండించి ఎద్దులచే చంపించవలెను. పొలములను, గృహములను, వనములను, గ్రామములను, వివీతములను, కళ్లములను కాల్చినవారిని, రాజభార్య సంగముచేసినవారిని ఊకనిప్పుతో కాల్చిచంపవలెను. కేశగ్రహణపూర్వముగ పరస్త్రీని సంగ్రహించినవాడు స్వజాతియైనచో ఉత్తమదండము. అనులోమ్యము అయినచో మధ్యమదండము పొందఅర్హుడు. ప్రాతిలోమ్యము అయినచో పురుషుని చంపవలెను. స్త్రీకి చెవులు కోయవలెను. పరస్త్రీయొక్కవస్త్రము కట్టుముడి స్తనములు, కంచుకం, నాభికేశములను స్పృశించినవానిని అనుచిత దేశకాలములందు సంభాషణముచేయువానిని, ఒకే ఆసనముపై కూర్చున్నవానిని వ్యభిచార దోషముకై దండించవలెను. వలదన్నను సంభాషణాదులు చేసిన స్త్రీకి నూరు పణములు, అట్టి పురుషునకు రెండువందల పణములు దండము. నిషేధించినను వారిరువురును సంభాషణాదులు చేసినచో వ్యభిచారముచేసినచో ఎట్టి దండమో అట్టి దండము. పశుసంగమము చేసినవానికి నూరుపణముల దండము. నీచస్త్రీ సంగమము, గో సంగమము చేసినవానికి మధ్యమ సాహసదండము. కొనబడిన స్త్రీలు, దాసీస్త్రీలు, ఉంచుకొన్న స్త్రీలు, గమ్యలగుస్త్రీలు, వీరితో సంగమము చేసిన పురుషునకు ఏబది పణములు దండము. బలాత్కరించి దాసీ సంగమము చేసినవానికి పది పణముల దండము. అంత్యజాతి స్త్రీతోడను, సన్యాసితోడను సంగమముచేసిన వాని లలాటమున భగచిహ్నముంచి దేశమునుండి పారద్రోలవలెను. రాజశాసనమును న్యూనముగాగాని, అధికముగాగాని వ్రాయువానికి వ్యభిచారిని, చోరుని విడిచిపెట్టిన వానికిని ఉత్తమ సాహసదండము. బ్రాహ్మణునిచే అభక్షములు తినుపించువానికి ఉత్తమసాహసదండము. కల్తీ బంగారము అమ్మువానికిని చెడ్డమాంసము అమ్మువానికిని అంగములు ఖండించి ఉత్తమ సాహసదండము విధించవలెను. సామర్థ్యమున్నను కోరలు, కొమ్ములు గల తన పశువులచే పీడింపబడుచున్న వానిని విడిపింపని పశుస్వామికి ప్రథమ సాహసదండము. ఆక్రమించిన వాడు ఏడ్చుచున్నను విడిపించనిచో రెట్టింపు దండము. చోరుడుకానివానిని చోరుడని చెప్పినవానికి ఐదువందలపణముల దండము. రాజునకు ఆప్రియముపల్కువానికిని రాజనిందకులకును మరణించినవాని శరీరమునందల వస్త్రాదులను అమ్మువానికిని గురువును కొట్టిన వానికిని రాజమంత్రమును ప్రకటించిన వానికిని నాలుక కోసి దేశమునుండి బహిష్కరించవలెను. రాజుయొక్క వాహనమును ఆసనమును కూర్చున్నవానికి మధ్యమ సాహసదండము. రెండు నేత్రములను పీకి వేసిన వానికిని, రాజశత్రువుల ఆజ్ఞను నిర్వహించు వానికిని బ్రాహ్మణ వేషముతో జీవించు శూద్రునకు ఎనిమిది వందలపణములదండము. న్యాయానుసారము పరాజితుడైనను, పరాజితుడను కాను అని చెప్పుచు, వచ్చినచో వానిని మరల జయించి రెట్టింపు ధనము దండము విధించవలెను. రాజు అన్యాయముగ దండము విధించి, ధనము తీసుకొన్నచో దానిని వరుణనకు నివేదించి దానిని ముప్పది రెట్లు చేసి బ్రాహ్మణులకు ఇవ్వవలెను. ధర్మపూర్వకముగ, లోక వ్యవహారములు చూచు రాజునకు ధర్మము, అర్థము, కీర్తి లోకపంక్తి అర్థసంగ్రహము ప్రజాగౌరవము శాశ్వత స్వర్గనివాసము అను ఏడు గుణములు లభించును.

అగ్ని మహాపురాణమునందు ''వాక్పారుష్యాది'' ప్రకరణమను రెండువందల యేబది ఎనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page