Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుస్త్రింశదధిక ద్విశతతమోధ్యాయః

అథ షాడ్గుణమ్‌

పుష్కర ఉవాచ :

సామ భేదౌ మయా ప్రోక్తౌ దానదండౌ తథైవచ | దండః స్వదేశే కథితం పరదేశే బ్రవీమితే. 1

ప్రకాశశ్చా ప్రకాశశ్చ ద్వివిధో దండ ఉచ్యతే | లుంఠనం గ్రామఘాతశ్చ సస్యఘాతో7గ్ని దీవనమ్‌. 2

ప్రకాశో7థ విషం వహ్నిర్వివిధైః పురుషైర్వధః | దూషణం చైవసాధూనాముదకానాం చ దూషణమ్‌. 3

దండప్రణయనం ప్రోక్తముషేక్షాం శృణు భార్గవ | యదామన్యేత నృపతీ రణన మమవిగ్రహః 4

అనర్థాయానుబంధః స్యాత్సంధినా చ తథాభ##వేత్‌ | సామలబ్ధాస్పదం చాత్రదానం చార్థక్షయంకరమ్‌. 5

భేదదండానుబంధః స్యాత్తదోపేక్షాం సమాశ్రయేత్‌ | నచాయం మమశక్నోతి కించిత్కర్తుముపద్రవమ్‌. 6

న చాహమస్య శక్నోమి తత్రోపేక్షాం సమాశ్రయేత్‌ | అవజ్ఞోప హతస్తత్రా రాజ్ఞా కార్యోరిపుర్భవేత్‌. 7

పుష్కరుడు చెప్పెను : పరశురామా ! సామదానభేద దండోపాయములను గూర్చి వెనుక చెప్పబడినది. తన రాజ్యమునందు దండమును ఎట్లు ప్రయోగించవలెనో కూడ చెప్పబడినది. ఈ నాలుగు ఉపాయములను శత్రు దేశము నందెట్లు ఉపయోగించవలెనో చెప్పెదను. గుప్తము, ప్రకాశము అని దండము రెండు విధములు. గ్రామమును మట్టిలో కలిపివేయుట, పంటకు నష్టము కలిగించుట, నిప్పుపెట్టుట - ఇవి ప్రకాశదండములు విషము పెట్టుట, రహస్యముగా నిప్పుల అంటించుట, అనేక విధముల మనుష్యులచే చంపించుట, సత్పురుషులపై దోషారోపణము చేయుట నీరు దూషితము చేయుట - ఇవి గుప్త దండములు. భృగునందనా ! ఉపేక్షను గూర్చి వినుము - ''యుద్ధము చేయుటకు, నాకెవ్వరి తోను విరోధము లేదు. వ్యర్థముగా విరోధము అనర్థ మూలము. సంధి చేసికొన్నను ఇట్లే అగును. సామప్రయోగము చేసితిని గాని ప్రయోజనము కలుగలేదు. దానముచే కేవలము ధనక్షయము కలుగును. భేదదండములచే గూడ ప్రయోజన మేమియు ఉండదు.'' అని రాజుకు తోచినచో ఉపేక్షను, ఆశ్రయించవలెను. ''ఈతడు నాకు శత్రువైనను నాకేమియు నష్టము లేదు. ఇపుడు నేను కూడ అతనిని ఏమియు చేయజాలను.'' అను నమ్మిక కలిగినప్పుడు గూడ ఉపేక్షను అవలంబించవలెను. తన శత్రువును అనాదరము చేతనే తొలగించుకొనవలెను.

మాయోపాయం ప్రవక్ష్యామి ఉత్పాతైరనృతైశ్చరన్‌ | శత్రోరుద్వేజనం శత్రోః శిబిరస్థస్య పక్షిణః. 8

స్థూలస్య తస్య పుచ్ఛస్తాం కృత్వోల్కాం విపులాం ద్విజ |

విసృజేచ్చ తతశ్చైవ ముల్కాపాతం ప్రదర్శయేత్‌. 9

ఏవమన్యే దర్శనీయా ఉత్పాతా బహవో7పిచ | ఉద్వేజనం తథా కుర్యాత్కుహకైర్వివిధైర్ద్విషామ్‌. 10

సాంవత్సరాస్తాపసాశ్చ నాశం బ్రూయుః పరస్యచ | జిగీషుః పృథివీం రాజా తేన చోద్వేజయేత్‌పరాన్‌. 11

దేవతానాం ప్రసాదశ్చ కీర్తనీయః పరస్యతు | ఆగతం నో7మిత్రబలం

ప్రహరధ్వమభీతవత్‌. 12

ఏవం బ్రూయాద్రణ ప్రాప్తే భగ్నాః సర్వేపరేఇవ | క్ష్వేడాః కిలకిలాః కార్యా వాచ్యః శత్రుర్హతస్తథా. 13

దేవాజ్ఞా బృంహితో రాజా సన్నద్ధః సమరంప్రతి |

ఇపుడు మాయ అను ఉపాయము చెప్పెదను. అసత్యమైన ఉత్పాతములుచూపి శత్రువులలో భయాందోళనము కలిగించవలెను. స్థూలమైన ఒక పక్షితోకకు చాల పొడవైన మండుచున్న ఉల్కను (కొరవి) కట్టి దానిని శత్రువుల గుడారము వైపువిడువవలెను. దానిని చూచి శత్రువులు ఉల్కాపాతమను భ్రాంతిచెందునట్లు చేయవలెను. ఈ విధముగనే అనేకమైన ఉత్పాతములు చూపవలెను. అనేక విధములైన మాయలు చూపు మదారీలను పంపి వారిద్వారా శత్రువులలో ఉద్వేగము కలిగించవలెను. తపస్వుల చేతను, జ్యోతిష్కులచేతను ''నీకు ఆపద రానున్నదని'' చెప్పించవలెను. భూమిని జయించ దంచిన రాజు ఈ విధముగ అనేకోపాయములచే శత్రులను భయభీతులను చేయవలెను. తనకు దేవతానుగ్రహమున్నట్లును దేవతలు తనకు వరప్రదానము చేసినట్లును వారికి తెలియునట్లు చేయవలెను. యుద్ధము ప్రారంభ##మైనచో తన సైనికులతో -- ''వీరులారా! నిర్భయముగా పోరాడుడు. మన మిత్రసేన వచ్చినది శత్రువులు పారిపోవుచున్నారు'' అని గర్జించి చెప్పుచు హర్షధ్వనులు చేయవలెను. ''నా శత్రువు హతుడైనాడు'' అని చెప్పవలెను. దేవతాదేశముచే వృద్ధిని పొందిన రాజు కవచాదులతో సన్నద్ధుడై యుద్ధభూమిపై ప్రవేశించవలెను.

ఇంద్రజాలం ప్రవక్ష్యామి ఇంద్రం కాలేన దర్శయేత్‌. 14

చతురఙ్గం బలం రాజా సహాయార్థం దివౌకసామ్‌ | బలంతు దర్శయేత్ర్పాప్తం రక్తవృష్టిం చరేద్రిపౌ. 14

ఇపుడు ఇంద్రజాలమును గూర్చి చెప్పెదను. రాజు సమయానుసారముగ ఇంద్రజాలము ప్రదర్శించవలెను. తమ సాహాయ్యమునకై దేవతల చతురంగ సైన్యము వచ్చినట్లు శత్రువులకు చూపవలెను. శత్రుసేనపై రక్తవర్షము కురిపించి మాయచే, శత్రువుల భిన్నములగు శిరస్సులు భవనముపైన కనబడునట్లు చేయవలెను.

ఛిన్నాని రిపుశీర్షాణి ప్రాసాదాగ్రేషు దర్శయేత్‌ |

షాడ్గుణ్యం సమ్ప్రవక్ష్యామి తద్వరౌ సంధివిగ్రహౌ. 17

నంధిశ్చ విగ్రహశ్చైవ యానమాసన మేవచ | ద్వైధీభావః సంశ్రయశ్చ షడ్గుణాః షరికీర్తితాః. 17

పణబంధః స్మృతః సంధిరపకారస్తు విగ్రహః | జిగీషోః శత్రువిషయే యానం యాత్ర7భి ధీయతే. 18

విగ్రహేణ స్వకే దేశే స్థితి రాసనముచ్యతే | బలార్ధేన ప్రయాణంతు ద్వైధీ భావః స ఉచ్యతే. 19

ఉదాసీనో మధ్యమోవా సంశ్రయాత్సంశ్రయః స్మృతః. 20

ఇపుడు ఆరుగుణములను గూర్చి చెప్పెదను. సంధి - విగ్రహములు ప్రధానమైనవి. సంధి - విగ్రహ - యాన - ఆసన - ద్వైధీభావ - సంశ్రయములు ఆరు గుణములు. కొన్ని షరతులపై శత్రువుతో కలియుట 'సంధి'. యుద్ధాదులచే వానికి నష్టము కలిగించుట 'విగ్రహము'. శత్రువుపై దండెత్తి వెళ్ళుట 'యానము' విగ్రహము ప్రారంభించి తన దేశమునందే ఉండుట 'ఆసనము' సగము సేనతో యుద్ధమునకు వెళ్ళుట ద్వైధీభావము. ఉదాసీనుని గాని, మధ్యస్థునిగాని శరణుజొచ్చుట 'సంశ్రయము'.

సమేన సంధి రన్వేష్యో7హీనేన చ బలీయసా. 20

హీనేన విగ్రహః కార్యః స్వయం రాజ్ఞా బలీయసా | తత్రాపి శుద్ధ పార్‌ష్ణిస్తు బలీయాంసంసమాశ్రయేత్‌. 21

ఆసీనః కర్మ విచ్ఛేదం శక్తః కర్తుం రిపోర్యథా | అశుద్ధ పార్‌ష్ణిశ్చాసీత విగ్భహ్య వసుధాధిపః. 22

ఆశుద్ధ పార్‌ష్ణి బలవాన్ద్వైధీభావం సమాశ్రయేత్‌ | బలినా విగృహీతన్తుయోసందేదేహేన పార్థివః. 23

సంశయస్తేన వక్తవ్యో గుణానామధమో గుణః | బహుక్షయవ్యయాయాసం తేషాం యాసం ప్రకీర్తితమ్‌. 24

బహులాభకరం పశ్చాత్తదా రాజా సమాశ్రయేత్‌ | సర్వశక్తి విహీనస్తు తదా కుర్యాత్తు సంశ్రయమ్‌. 25

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఉపాయ షాడ్గుణ్యాదికం నామ చతుస్త్రింశ దధిక ద్విశతతమో7ధ్యాయః.

తన కంటే దుర్బులునితో కాక, తనతో సమానబలునితో, అధిక బలునితోను సంధి చేసి కొనవలెను. తాను బలవంతుడై శత్రువు దుర్బులుడైనపుడు అతనితో విగ్రహమే చేయవలెను. హీనావస్థలోనున్నను, తన పార్‌ష్ణిగ్రాహకుడు మంచివాడైనచో బలవంతుడగు రాజును ఆశ్రయించవలెను. యుద్ధమునకు వెళ్లకపోయినను శత్రుకార్యములను నశిపంచేయగల రాజు, పార్‌ష్ణిగ్రాహకుడు మంచివాడు కాకున్నను, విగ్రహము చూపి ఊరక కూర్చుండవలెను. లేదా పార్‌ష్ణిగ్రాహకుడు మంచివాడు కానప్పుడు ద్వైధీభావమును అవలంబించవలెను. బలవంతుడగు రాజుచేతిలో పడిపోయెదమను భయమున్నపుడే సంశ్రయము అవలంబించవలెను. ఇది సామాది గుణము లన్నింటి కంటెను అధమమైనది. సంశ్రయమునకు తగిన పరిస్థితులలో ఉన్న రాజు యానమవలంబించినచో జనమును, ధనమును కూడ కోల్పోవును. ఎవరినైన ఆశ్రయించుటచే అధిక లాభము కలుగునను ఆశ యున్నచో సంశ్రయమును అవలంబించవలెను. అన్ని విధముల శక్తి క్షీణించినపుడు మాత్రమే ఇతరులను శరణు వేడవలెను.

అగ్ని మహాపురాణమునందు షాడ్గుణ్యవర్ణన మను రెండువందల ముప్పదినాల్గవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page