Sri Devi Bhagavatam-1    Chapters   

అథ తృతీయో%ధ్యాయః

కారణాని బహూన్యత్రాప్యవతారే హరేః కిల | సర్వేషాం చైవ దేవానా మంశావతరణ ష్వపి. 1

వసుదేవావతారస్య కారణం శృణు తత్త్వతః | దేవక్యాశ్చైవ రోహిణ్యా అవతారస్య కారణమ్‌. 2

ఏకదా కశ్యపః శ్రీమా న్యజ్ఞార్థం ధేను మాహరన్‌ | యాచితో%యం బహువిధం న దదౌ ధేను ముత్తమామ్‌. 3

వరుణస్తు తతో గత్వా బ్రహ్మాణం జగతః ప్రభుమ్‌ | ప్రణమ్యోవాచ దీనాత్మా స్వదుఃఖం వినయావ్వితః. 4

కిం కరోమి మహాభాగ మత్తో%సౌ న దదాతి గామ్‌ | శాపో మయా విసృష్ణో%సై#్మ గోపాలో భవ మానుషేజ 5

భార్యే ద్వే అపి తత్రైవ భ##వేతాం చాతిదుఃఃతే | యతో వత్సా రుదంత్యత్ర మాతృహీనాః సుదుఃఃతాః. 6

మృతవత్సా%దితి స్తస్మా ద్భవిష్యతి ధరాతలే | కారాగారనివాసా చ తేనా పి బహుదుఃఃతా. 7

తచ్ఛ్రుత్వా వచనం తస్య యాదోనాధస్య పద్మభూః | సమాహూయ మునిం తత్ర తమువాచ ప్రజాపతిః. 8

కస్మాత్త్వయా మహాభాగ లోకపాలస్య ధేనవః | హృతాః పునర్న దత్తాశ్చ కిమన్యాయం కరోషి వై. 9

జానన్న్యాయం మహాభాగ! పరవిత్తాపరహారణమ్‌ | కృతవా న్కథ మన్యాయం సర్వజ్ఞో%సి మహాతమే! 10

అహో! లోభస్య మహిమా! మహతో%పి న ముంచతి | లోభం నరకదం నూనం పాపాకర మసమ్మతమ్‌. 11

కశ్యపో%పి నతం త్యక్తుం సమర్థః కిం కరోమ్యహమ్‌ | సర్వదైవాధి కస్తస్మా ల్లోభో వై కలితో మయా. 12

ధన్యాస్తే మునయః శాంతా జితో యై ర్లోభ ఏవ చ | వైఖానసైః శమపరైః ప్రతిగ్రహ పరాఙ్ముభైః. 13

సంసారే బలవాన్‌ శత్రు ర్లోభో%మేధ్యవరః సదా | కశ్యపో%పి దురాచారః కృతస్నేహో దురాత్మనా. 14

మూడవ అధ్యాయము

అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణము

వ్యాస మునీశుడు జనమేజయునితో నిట్లనియెను : శ్రీహరి యొక్కయు సకల దేవతల యొక్కయు నవతారములకు కారణము లనేకములు గలవు. ఇపుడు దేవకీ రోహిణీ వసుదేవుల సంభవమునకు యధార్థ హేతువుల వచింతును, ఆలకింపుము. మున్నొకప్పుడు కశ్యపమహర్షి తన యాగము కొఱకు వరుణదేవుని ధేనువు నపహరించెను. వరుణు డెంతగ వేడిను కశ్యపుడు దాని నతనికి తిరిగి యీయలేదు. అంత వరుణుడు జగత్ర్పభువైన బ్రహ్మ సన్నిధి కేగి యతనికి సవినయముగ దీనముగ దోసిలియొగ్గి తన దుఃఖము నిట్లు వెల్లడించెను: మహానుభావా! కశ్యపుడు నా గోవు నపహరించి యున్మత్తుడై యీయకున్నాడు. ఇక నేనేమి సేయవలయును? మనుష్య లోకమున గోపాలుడవు గమ్మని నే నతని శపించితిని. (అతని యిరువురు భార్యలు నతి దుఃఃతులై యతని చెంతనే యుండగలరు. తల్లిలేని ఆవుల దూడలు ఇచట బాధపడుచున్నవి. కావున ఆ తరుణమున నదితి దుఃఃతయై కారాగారమున వసించి మృతపుత్త్ర యగు గాక యని శపించితిని అనిన వరుణుని వచనము లాలించి కశ్యపుని పిలిచి బ్రహ్మ యతనితో నిట్లు పలికెను: మహానుభావా! నీ వా లోకపాలుని ధేనువులను గ్రహించి మరల నతని కేల యీయకున్నావు? ఇట్టి యన్యాయమున కేల యొడిగట్టితివి? నీవు సర్వజ్ఞుడవు. నీకు న్యాయము తెలియును. ఐనను పరుల సొత్తపహరించి నీ వవినీతి కేల పాల్పడితివి? ఆహా! లోభము మహిమ యేమని చెప్పవచ్చును? అది మహాత్ములను సైతము విడువదు. అది పాప నిలయము - నరకప్రదము - సుజనులకు సమ్మతము గానిది. కశ్యపు డంతటివాడే దానిని వదలజాలకుండెను. ఇక నేమి చేతును? సకల దైవములకన్న లోభము మిన్న యని నాకు దోచుచున్నది. ఈ లోకము లందు వైఖానస మహర్షులే ధన్యజీవులు. ఏలన, వారు ప్రతిగ్రహ విముఖులు - ఆత్మ చింతనపరులు - శాంతులు - జిత లోభులు. ఈ ప్రపంచము నందు లోభము కడు చెడ్డది. మహా శత్రువు - అపవిత్ర వస్తువు. అది కశ్యపు నంతటి వానిని దన సాంగత్యమున దురాచారునిగను సామాన్యునిగను మోహవశునిగను జేసినది.

బ్రహ్మా%పి తం శశాపా%థ కశ్యపం మునిసత్తమమ్‌ | మర్యాదారక్షణార్థం మి పౌత్రం పరమవల్లభమ్‌. 15

అంశేన త్వం పృథివ్యాం వై ప్రాప్య జన్మ యదోఃకులే | భార్యాభ్యాం సంయుత స్తత్ర గోపాలత్వం కరిష్యసి. 16

ఏవం శప్తః కశ్యపో%సౌ వరుణన చ బ్రాహ్మణా | అంశావతరణార్థాయ భూభారహరణాయ చ. 17

తథా దిత్యా%దితిః శప్తా శోక సంతప్తయా భృశమ్‌ | జాతా జాతా విశనశ్యేరం స్తవ పుత్రాస్తు సప్త వై. 18

జనమేజయః : కస్మా ద్దిత్యా చ భగినీ శ##ప్తేంద్ర జననీ మునే | కారణం వద శాపే చ శంకాస్తి ముని సత్తమ: 19

పారీక్షితేన పృష్ట స్తు వ్యాసః సత్యవతీ సుతః | రాజానం ప్రత్యువాచేదం కారణం నుసమాహితః. 20

రాజ! న్దక్షసుతే ద్వే తు దితిశ్చాదితి రుత్తమే కశ్యపస్య ప్రియే భార్యే బభూవతు రురుక్రమే. 21

ఆదిత్యాం మఘవా పుత్రో యదా%%భూ దతివీర్యవాన్‌ | తదా తు తాదృశం పుత్త్రం చకమే దితి రోజసా. 22

పతిమా హాసితాపాంగీ పుత్రం మే దేహి మానదః ఇంద్రత్యుబలం వీరం ధర్మిష్టం వీర్య వత్తమమ్‌. 23

తా మువాచ మునిః కాంత స్వస్థా భవ మయా దితే | వ్రతాంతే భవితా తుభ్యం శతక్రతు సమః సుతః. 24

సా తథేతి ప్రతిశుత్య చకార వ్రతముత్తమమ్‌ | నిషిక్తం మునినా గర్భం బిభ్రాణా సుమనోహరమ్‌. 25

భూమౌ చకార శయంన వయోవ్రత పరాయణా | పవిత్రా ధారణాయుక్తా బభూవ వరవర్ణినీ. 26

ఏవం జాతః సుసంపూర్ణో యుదా గర్భో%తి వీర్యవాన్‌ | శుభ్రాంశుమతి దీప్తాంగీదితిం దృష్ట్వా తు దుఃఃతా. 27

మఘవత్పదృశః పుత్త్రో భవిష్యతి మహాబలః | దిత్యా స్తదా మమసుత స్తేజోహీనో భ##వేత్కిల. 28

ఇట్లు పలికి బ్రహ్మ కూడ తన మనుమడును మునివరుడును మిక్కిలి యిష్టుడగు నగు కశ్యప మునిని ధర్మరక్షణ కొఱ కిటుల శపించెను. నీవు నీ యంశముతో నిలపై యదువంశమున నీ భార్యలతో గూడి జన్మమందుము. అట గోపాలక వృత్తితో మనుమ.'' ఇట్లు భూభార మడగుటకును కశ్యపుడు నిజాంశమున జన్మించుటకును వరుణ బ్రహ్మల శాపములు మూలకారణము. ఇట్లే దితియు. నీ యేడుగురు కుమారులును పుట్టగనే మరణింతు'రని యదితిని శపించెను. ఇది విని మునిసత్తమా! దితికి గలిగిన శోకమునకు నామె తన సోదరి యింద్రజనని యగు నదితికి శాప మొసంగుటకును గల హేతువేమో తెలుపుము. నాకీ విషయమై శంక కలుగుచున్నది అని జనమేజయుడు ప్రశ్నింపగా, సత్యవతీ సుతుడగు వ్యాసుడు సావధానముగ రాజున కిట్లు సమాధానమిచ్చెను: భూమిపతీ! దక్ష ప్రజాపతి కిరువురు పుత్రికలు - దితి - అదితి యనబడువారు. గొప్ప నడువడి కల ఆ ఇరువురును కశ్యపునకు ప్రియ భార్యలైరి. అదితికి మహావీర్యవంతుడైన ఇంద్రుడు జన్మించెను. తనకు నంతటి తేజోవంతుడైన సుతుడు గావలయునని దితి అభిలషించెను. మానదా! ధర్మిష్ఠుడు - ఇంద్ర తుల్యుడు - వీర్యవంతుడు నైన పుత్రుని నాకు ప్రసాదింపుము' అని కశ్యపుని వేడెను. ప్రియుడగు కశ్యపు డామెతో ఓ అదితీ! నీవు శాంతించుము: నేను చెప్పు నియమవ్రతమనుష్ఠింపుము. అపుడు నీ కింద్రతుల్యుడు జన్మింపగలడు' అనెను. ఆమె దాని కొడంబడి యుత్తమవ్రత మాచరించెను. ముని దితికి మనోహరమగు గర్భము నిలిపెను. దాని నామె జాగ్రత్తగ భరించెను. ఆ వరవర్ణిని యేకాగ్రచిత్తమున పవిత్రభావములతో పాలు మాత్రము త్రాగుచు నేలపై పరుండుచు పయోవ్రతము సలిపెను. అంతలో వీర్యవంతమైన దితి గర్భము సంపూర్ణమయ్యెను. ఆమె యంగము లుజ్జ్వలములై తెల్లగనయ్యెను. అది గని యదితి యిట్లు చింతించెను. దితి కింద్రుని బోలు కొడుకు పుట్టినచో నా సుతుడు బలహీనుడగును.'

ఇతి చింతాపరా పుత్త్రమింద్రం చోవాచ మానినీ | శత్రుస్తే%ద్య సుముత్పన్నో దితిగర్భే%తి వీర్యవాన్‌. 29

ఉపాయం కురు నాశాయ శత్రో రద్య విచింత్య చ | ఉత్పత్తి రేవ హంతవ్యా దిత్యా గర్భస్య శోభనః. 30

వీక్ష్య తా మసితా పాంగీం సపత్నీ భావమాస్థితామ్‌ | దునోతి హృదయే చింతా సుఖమర్మ వినాశినీ. 31

రాజ యక్ష్మేవ సంవృద్ధో నష్టో నైన భ##వే ద్రిపుః | తస్మా దంకురితం హన్యా ద్బుద్ధిమా నమితం కిల. 32

లోహశంకురివ క్షిప్తో గర్భో వై హృదయే మమ | యేనకేనాప్యుపాయేన పాతయాద్య శతక్రతో. 33

సామదాన బలేనాపి హింసనీయ స్త్వయా సుతః | దిత్యా గర్భో మహాభాగః మమ చే దిచ్ఛసి ప్రియమ్‌. 34

శ్రుత్వా మాతృవచః శక్రో విచంత్య మనసా తతః | జాగామాపరమాతుః స సమీప మమరాధిపః 35

వవందే వినయా త్పాదౌ పాపమతి ర్నృప! ప్రోవాచ వినయేనాసౌ మధురం విషగర్భితమ్‌. 36

మాత స్త్వం వ్రతయుక్తా%సి క్షీణదేహా%తిదుర్బలా | సేవార్థ మిహ సంప్రాప్తః కిం కర్తవ్యం వదస్వ మే. 37

పాదసంవాహనం తే%హం కరిష్యామి పతివ్రతే | గురుశుశ్రూషణాత్పుణ్యం లభ##తే గతి మక్షయామ్‌.38

న మే కిమపి భేదోస్తి తథా%దిత్యా శ##పే కిల | ఇత్యుక్త్యా చరణౌ స్పృష్ట్వా సంవాహనవరో%భవత్‌. 39

సంవాహన సుఖం ప్రాప్య నిద్రా మాప సులోచనా | శ్రాంతా వ్రతకృశా సుప్తా విశ్వస్తా పరమా సతీ. 40

తాం నిద్రావశ మాపన్నాం విలోక్య ప్రావిశత్తనుమ్‌ | రూపం కృత్వా%తిసూక్ష్మం చ శస్త్రపాణిః సమాహితః. 41

ఉదరం ప్రవివేశాశు తస్యా యోగబలేన వై | గర్భం చకర్త వజ్రేణ సప్తధా పవినాయకః. 42

రురోద చ తదా బాలో వజ్రేణభిహత స్తథా | మా రుదేశి శ##నై ర్వాక్య మువాచ మఘవా నముమ్‌. 43

ఇట్లు చింతించి మానవతి యగు నదితి తన కుమారుడగు నింద్రుని బిలిచి ఇట్లనెను. దితి గర్బమున నీకొక వీర్యవంతుడైన శత్రువు పుట్టగలడు. కాన ముందుగ నిపుడే వైరి నాశమున కుపాయము పన్నుము. చక్కగ విచారింపుము. దితి గర్బము నుండి బాలుడు పుట్టుటకు ముందే యతనిని చంపుము. నా సవతిని జూచినప్పుడెల్ల నా మనస్సు కలత జెందును. నా సుఖ మర్మములు ఛేదించినట్లగును. నాకు చిత్తశాంతి కలుగుట లేదు. రాజ యక్ష్మరోగము పగిది శత్రువు పెచ్చుమీఱినచో నతడు నశించడు. కావున ధీశాలి తన పగతుని మొక్క దశలోనే త్రుంచవలయును. ఓ యింద్రా! దితి గర్భ మినుపములికివలె నా యెదలో పడినది. దాని నేయుపాయముననైన సరే తొలగించి వేయుము. నా వాత్సల్యము బడయుగోరుదువేని సామదాన బలములలో దేనితో నైనను నీవు దితి గర్బమును హింసింపవలయును.' అనగా, అమరపతి యగు నింద్రుడు తన తల్లి మాటలు విని యాలోచించి తన సవతి తల్లి కడ కరిగెను. అతడు పాప బుద్ధితో నతి వినయము నటించి దితి పాదములకు నమస్కరించి విషగర్భితమైన తీయని మాటలతో ఆమె కిట్లనెను. మాతా! వ్రత నియమముల వలన నీ దేహము కృశించినది. కాన నీ సేవకు వచ్చితిని. నా కర్తవ్యమేదియో తెలుపుము. ఓ పతివ్రతా! నీకు పాదము లొత్తుదును. గురుసేవ వలన నక్షయ పుణ్యగతులు లభించును గదా? తల్లీ! నీవు - నా తల్లి అదితి - మీ యిరువురి యందు నా కెట్టి భేదము లేదు' అని ప్రతిన చేసి ఇంద్రు డామెపాదము లొత్తసాగెను. పరమపతివ్రతయు కృశాంగియు సులోచనయునగు దితి యతని పలుకులు నమ్మెను. ఆమె యలసట జెందుట వలన సంవాహన సుఖమున వెంటనే నిదురించెను. ఆమె నిద్రాపరవశురాలగుట గని యింద్రుడు శస్త్రము చేతబూని పదిలముగ సూక్ష్మరూపమున నామె శరీరమున ప్రవేశించెను. అట్లు వ్రజపాణి తన యోగబలముతో నామె యుదరము లోనికి జొచ్చి గర్భము నేడు విధములుగ వజ్రముచే ఖండించెను. లోని బాలుడు వజ్రము దెబ్బతిని యేడ్చుచుండెను. ఇంద్రు డతనితో నేడువ వలదని మెల్లమెల్లగ బలికెను.

శకలాని పునః సప్త సప్తధా కర్తితాని చ | తదా చైకోనపంచాశ న్మరుతశ్చా భవన్నృప! 44

తదా ప్రబుద్ధా సుదతీ జ్ఞాత్వా గర్భం తథాకృతమ్‌ | ఇంద్రేణ చ్ఛలరూపేణ చుకోప భృశదుఃఃతా. 45

భగినీకృతం తు సా బుద్ధ్వా శశాప కుపితా తదా | అదితిం మఘవంతం చ సత్యవ్రతపరాయణా. 46

యథా మే కర్తితో గర్భస్తవ పుత్త్రేణ ఛద్మనా | తథా తన్నాశమాయాతు రాజ్యం త్రిభువనస్య తు. 47

యథా గుప్తేన పాపేన మమ గర్భో నిపాతితః | ఆదిత్యా పాపచారిణ్యా యథా మే ఘాతితః సుతః. 48

తస్యాః పుత్రా స్తు నశ్యంతు జాతా జాతాః పునః పునః | కారాగారే వసత్వేషా పుత్రశోకాతురా భృశమ్‌. 49

అస్య జన్మని చాప్యేవం మృతావత్యా భవిష్యతి | ఇత్యుత్సృష్టం తదా శ్రుత్వా శాపం మరీచినందనః. 50

ఉవాచ ప్రణయోపేతో వచనం శమయన్నివ | మా కోపం కురు కళ్యాణిః పుత్త్రాస్తే బలవత్తరాః. 51

భవిష్యంతి సురాః సర్వే మరుతో మఘవత్సఖాః | శాపో%యం తవ వామోరుః త్వష్టావింశే%థ ద్వాపరే. 52

అంశేన మానుషం జన్మ ప్రాన్య భోక్ష్యతి భామినీ | వరుణనాపి దత్తో%స్తి శాపః సంతాపితేన చ. 53

ఉభయోః శాపయోగేన మానుషీయం భవిష్యతి | పతినా%%శ్వాసితా దేవీ సంతుష్టా సా%భవత్తదా. 54

నోవాచ విప్రయం కించిత్తతః సా వరవర్ణినీ | ఇతి తే కథితం రాజ న్పూర్యశాపస్య కారణమ్‌. 55

అదితిర్దేవకీ జాతా స్వాంశేన నృపసత్తమ!

ఇతి శ్రీదేవీ భాగవతే మహాపురాణ చతుర్థస్కంధే తృతీయో%ధ్యాయః.

ఆ యేడు భాగముల నొక్కొక్క దానిని మరల నేడుగ ఖండించెను. అంత వారు నలువది తొమ్మిదిమంది మరుత్తులై జన్మించిరి. ఆ పిదప దితి మేలుకాంచి తన గర్భమట్లగు టెఱిగి దుఃఃంచి యింద్రునిపై కుపితురాలయ్యెను. అంతయు స్వసోదరీకృతమని సత్యవ్రతపరాయణ యగు దితి యెఱింగి రోషముతో నింద్రుని నదితిని ఇంద్రుడు కపటముతో నా గర్భముచే ఛేదించెను. అటులే యతని త్రైలోక్యరాజ్యవైభవము నశించుగాక! పాపచారిణి యగు నదితి పాపమతితో నా గర్భపాత మొనరించెను. నా సుతుడు హతుడయ్యెను. అదేవిధముగ నామె కొడుకులును పుట్టుటే తడవుగ మాటిమాటికి నశింతురుగాత! ఆమె పుత్త్ర శోకార్తయై కారాగారమందు కాలము గడపుచుండుగాత! ఆమె జన్మాంతర మందుకూడ మృత సంతానవతి యగు గాత' మని శపించెను. దితి ఇచ్చిన శాపమును కశ్యపుడు వినెను. పిమ్మట కశ్యపుడు ప్రేమగదుర దితిని శాంతిల్ల జేయుచు నామె కిట్లనెను: కల్యాణీ! కోపింపకుము. నీకు బలశాలురగు తనయులు గలుగుదురు. నీ కొడుకు లింద్రసములగుదురు. వారు మరుత్తులనబడు దేవతలగుదురు. నీ విచ్చిన శాప మదితి కిరువది యెనిమిదవ మన్వంతరము నందలి ద్వాపరమున గలిగి తీరును. ఆనా డదితి మానవ జన్మమెత్తి నీ శాప మనుభవించును. వరుణుడును సంతప్తుడై యామెకు ముందే శాపమిచ్చెను. మీ యిరువురి శాపమున నీమె మానవ జన్మ మెత్తగలదు అని యిట్లు తన పతి తన్నూరడింపగ దితి సంతుష్టిజెందెను. నాటినుండి యా వరవర్ణిని యెట్టి యప్రియమును బలుకలేదు. రాజా! ఈ విధముగ నీకు దేవకీ వసుదేవుల పూర్వశాప కారణములు వివరించితిని. నృపసత్తమా! ఈ కారణముగ నదితి స్వాంశముతో దేవకిగ జన్మించెను అని వ్యాసుడు జనమేజయునితో పలికెను.

ఇది శ్రీదేవీ భాగవతమందలి చతుర్థస్కంధమందు అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగ జన్మించుటకు కారణమను తృతీయాధ్యాయము సమాప్తము.

Sri Devi Bhagavatam-1    Chapters