Sri Devi Bhagavatam-1    Chapters   

అథ ద్వితీయః స్కంధః

అథ ప్రథమో%ధ్యాయః

మత్స్యగంధ జన్మవృత్తాంతము

ఋషయ ఊచుః : ఆశ్చర్యకరమేత త్తే వచనంగర్భ హేతుకమ్‌ | సందేహో%త్ర సముత్పన్నః సర్వేషాంనస్తపస్వినామ్‌. 1

మాతా వ్యాసస్య మేధావి న్నా మ్నా సత్యవతీతి చ | వివాహితా పురా జ్ఞాతా రాజ్ఞా శంతనునా యథా. 2

తస్యాః పుత్రః కథం వ్యాసః సతీ స్వభవనే స్థితా | ఈదృశీ సా కథం రాజ్ఞా పునః శంతనునా వృతా. 3

తస్యాం పుత్రా వుభౌ జాతౌ తత్త్వం కథయ సుప్రత | విస్తరేణ మహాభాగ కథాం పరమపావనీమ్‌. 4

ఉత్పత్తిం వేదవ్యాసస్య సత్యవత్యా స్తథా పునః | శ్రోతుకామ ః పున ః సర్వే ఋషయః సంశితవ్రతాః. 5

సూతః : ప్రణమ్య పరమాం శక్తిం చతుర్వర్గప్రదాయినీమ్‌ | ఆదిశక్తిం వదిష్యామి కథాం పౌరాణికీం శుభామ్‌. 6

యస్యోచ్చారణమాత్రేణ సిద్ధి ర్భవతి శాశ్వతీ | వ్యాజేవాపి హి బీజస్య వాగ్భవస్య విశేషతః. 7

సమ్య క్సర్వాత్మనా సర్వై ః సర్వకామార్థ సిద్ధయే | స్మర్తవ్యా సర్వథా దేవీ వాంఛితార్థప్రదాయినీ. 8

ఋషులిట్లనిరి : సూతమహర్షీ! నీ పరమవచనములు రహస్యభరితములు. అవి తాపసులమగు మాకాశ్చర్య సందేహములు గొల్పుచున్నవి. తొల్లి శ్రీవ్యాసుని తల్లియగు సత్యవతిని శంతనుడు వివాహము చేసికొనెనంటివి. ఆ సత్యవతి తన పుట్టింటనుండగ నామెకు వ్యాసుడెట్లు జన్మించెను? వ్యాసుడు జన్మించినమీద నామెను శంతనుడెట్లు పెండ్లి చేసికొనెను? ఆ సత్యవతి కిరువురు కొమరు లెవరివలన గల్గిరి? మున్నగు విషయములు దెలుపు పరమపావన కథ యంతయును మాకు తేటతెల్ల మొనరింపము. నియతవ్రతులమగు మేము ఆ సత్యవతీ వ్యాసుల జన్మవృత్తాంతములు విన నుత్సమించుచున్నవారము. సూతుడిట్లనియె : ఆది పరాశక్తి అమృతయోని; ధర్మార్థ కామమోక్షప్రదాయిని; అట్టి పరమసత్యజ్యోతికి శిరమువంచి దోయిలించి యీ వరేణ్యమైన శ్రీదేవి పురాణగాథ ప్రవచింతును. ఆ శ్రీదేవీయొక్క వాగ్బీజము నుచ్చరించిన మాత్రమున శాశ్వత బ్రహ్మలోకసిద్ధి కరతలామలకమగును. ఆ యేకైక దేవియే కామితార్థప్రదాయిని. కాన నెల్లవాంఛితము లీడేరుటకా శ్రీదేవినే సర్వాత్మభావమున నెల్లరు నెల్లవేళల సంస్మరించుట యుక్తము.

రాజోపరిచరో నామ ధార్మికః సత్యసంగరః చేదిదేశపతిః శ్రీమా న్బభూవ ద్విజపుజకః. 9

తపసా తస్య తుష్టేన విమానం స్ఫాటికం శుభమ్‌ | దత్త మింద్రేణ తత్తసై#్మ సుందరం ప్రియకామ్యమా. 10

తేన రూఢస్తు సర్వత్ర యాతి దివ్యేన భూపతిః | స భూమా వుపరిస్థో%సౌ తేనోపరిచరో వసుః 11

విఖ్యాతః సర్వలోకేషు ధర్మనిత్యః సభూపతిః | తస్య భార్యా వరారోహా గిరికా నామ సుందరీ. 12

పుత్రా శ్చాస్య మహావీర్యా ః పంచాస న్న మితౌజనః | పృథ గ్ధేశేషు రాజానః స్థాపితా స్తేన భూభుజా. 13

వసోస్తు పత్నీ గిరికా కామా న్కాలే న్యవేదయత్‌ | ఋతుకాల మనుప్రాప్తా స్నాతా పుంసవనే శుచిః. 14

తదహః పితర శ్చైన మూచు ర్జహి మృగానితి | తచ్ఛ్రుత్వా చింతయామాన భార్యా మృతుమతీం తథా. 15

పితృవాక్యం గురుం మత్వా కర్తవ్య మితి నిశ్చితమ్‌ | చచార మృగయాం రాజా గిరికాం మనసా స్మరన్‌ 16

వనే స్థితః స రాజర్షి శ్చిత్తే సస్మార భామినీమ్‌ | అతీవ రూపసంపన్నాం సాక్షా చ్ఛ్రియమివాపరామ్‌. 17

తస్య రేత్యః ప్రచస్కంద స్మరత స్తాం చ కామినీమ్‌ | వటప్రతే తు త ద్రాజా స్కన్న మాత్రం సమాక్షిపత్‌. 18

ఇదం వృథా పరిస్కన్నం రేతో వై న భ##వే త్కథమ్‌ | ఋతుకాలం స విజ్ఞాయ మతిం చక్రే నృప స్తదా. 19

అమోఘం సర్వథా వీర్యం మమ చైత న్న సంశయః | ప్రియాయై ప్రేషయా మ్యేత దితి బుద్ధి మకల్పయత్‌ 20

తొల్లి ఉపరిచరుడను రాజు చేదిదేశ మేలుచుండెను. అతడు పరమధార్మికుడును సత్యనిత్యుడును ద్విజపూజకుడునై వన్నెకెక్కెను. ఇంద్రు డారాజు తపమునకు సంప్రీతిజెంది యతనికొక చక్కని స్ఫటిక విమానము ప్రదానము జెసెను. ఆ రాజా దివ్యవిమానమెక్కి భూమిపై దిగక అంతరిక్షమందే యెల్లెడల సంచరించుటవలన నతని కుపరిచవసువను నామమేర్పడెను. ఆ భూపతి ధర్మనిత్యుడని లోకములలో ప్రసిద్ధి వహించెను. అతని భార్య గిరిక. ఆ యము మిక్కిలి యందాల రాశి. వారి కమితవీర్యులు తేజోవంతులనగు నైదుగురు కొమరులు గలిగిరి. రాజు తన కొడుకుల నాయాదేశములకు పాలకులుగ నియమించెను. అంతనొకనాడు గిరిక ఋతుమతియై పుంసవనమున పవిత్రురాలై తన పతితో నెమ్మదిలోని తీరని కామవాంఛను దెలిపినది. అదేనా డా రాజు పితరు లతనిని శ్రాద్ధమునకై మృగములను కొనితెమ్మని కోరిరి అతడు యవశ్యకర్తవ్యమని నిశ్చయించుకొని లోలోన గిరికను తలపోయుచునే వేటకేగెను. అతడు వనమందుండియు తన భార్యను తలపోయుచునే యుండెను. ఆ రాజదేపనిగ తన ప్రియతమను తలచుచుండుటవలన నతని రేతస్సు స్ఖలితమయ్యెను. ఆతడు వెనువెంటనే దానినొక మఱ్ఱియాకున భద్రపఱచెను. 'ఈ నా వీర్య మమోఘమైనది. ఇది వ్యర్థము గారాదు. ఇపుడు నీ భార్య ఋతుస్నాతయై యున్నది. నా యీ యమోఘవీర్యమును నా ప్రియకంపవలయును' అని రాజు నిశ్చయించుకొనెను.

శుక్రప్రస్థాపనే కాలం మహిష్యాః ప్రసమీక్ష్య నః | అభిమంత్య్రాథ తద్వీర్యం వటపర్ణపుటే కృతమ్‌. 21

పార్శ్వస్థం శ్యేన మాభాష్య రాజోవాచ ద్విజం ప్రతి | గృహాణదం మహాభాగ గచ్ఛ శీఘ్రం గృహం మమ. 22

మత్ప్రియార్థ మిదం సౌమ్య గృహీత్వా త్వం గృహం నయ | గిరికాయై ప్రయచ్ఛాశు తస్యా స్త్వార్తవ మద్యవై. 23

సూతః : ఇత్యుక్త్వా ప్రదదౌ పర్ణం శ్యేనాయ నృపసత్తమః | స గృహీత్వోత్పపాతాశు గగనం గతివిత్తమః. 24

గచ్ఛంతం గగనే శ్యేనం ధృత్వా చంచుపుటే పుటమ్‌ |త మపశ్య దథాయాంతం ఖగం శ్యేన స్తథా%పరః. 25

ఆమిషం స తు విజ్ఞాయ శీఘ్ర మ భ్యద్రవ త్ఖగమ్‌ | తుండయుద్ధ మథకావే తా వుభౌ సంప్రచక్రతుః. 26

యుధ్యతో రపత ద్రేత స్తచ్చాపి యమునాంబసి | ఖగౌ తౌ నిర్గతౌ కామం పుటకే పతితే తదా. 27

ఏతస్మి న్సమయే కాచి దద్రికా నామ చాప్సరాః బ్రాహ్మణం సమనుప్రాప్తం సంధ్యాందనతత్పరమ్‌. 28

కుర్వంతీ జలకేళిం సా జలే మగ్నా చచార సా | జగ్రాహ చరణం నారీ ద్విజస్య వరవర్ణినీ. 29

ప్రాణాయామపరః సో%థ దృష్ట్యా తాం ఆమచారిణిమ్‌ | శశాప భవ మత్సీ త్వం ధ్యానవిఘ్నకరీ యతః. 30

సా శస్తా విప్రమేఖ్యేన బభూవ యమునాచరీ | శఫరీరూపసంపన్నా హ్యద్రికా చ వరాప్సరాః. 31

అతడు తన భార్యకు వీర్యము పంపదగిన సమయమెఱింగి దాని నభిమంత్రించి యొక మఱ్ఱియాకు దొన్నెలో నుంచెను. ఆ సమయమున తన సమీపమున నొక డేగ యుండెను. రాజు దానితో 'ఓ మహాభాగా! ఈ దొన్నెను తీసికొని త్వరితముగ మా యింటి కేగుము. అచట నా ప్రియ గిరిక గలదు. ఆమె యిపుడు ఋతుమతి. నీవు మా యింటికేగి దీని నామె కిమ్ము' అని పలికి డేగకు ఆ దొన్నె నిచ్చెను. ఆ డేగకు రాజమార్గము దెలియును. అది దొన్నెను తీసికొని వినువీధి కెగిరెను. అది తన ముకుపుటములతో దొన్నెను గట్టిగ పట్టుకొని యెగురుచుండగ నింకొక డేగ చూచి ఆ దొన్నె మాసమని తలచి దాని వెంటబడెను. అత్తఱి రెండు డేగలకు ఆకసమకుననే తుండ యుద్ధము జరిగెను. అటు లారెండును బోరాడు చుండగ వీర్యమున దొన్నె యమునానదిలో బడెను. వెంటనే యవి తమ తమ చోటులకు వెళ్ళినవి. అదే సమయమున అద్రికయను నొక దేవకన్యక యమునలో సంధ్యావందన మాచరించు నొక బ్రాహ్మణుని సమీపించినది. ఆ వరాంగన నీట మునుగుచు తిరుగుచు జలకేళి సలుపుచు వచ్చి వచ్చి యా బాపని పాదములు పట్టినది. అపుడా బ్రాహ్మణుడు ప్రాణాయమ మొనర్చుచుండెను. అతడా కామచారిణినిగని 'నా ధ్యానమున కాటంకము గలిగించితివి. కాన నీవు చేపవుగమ్ము' అని శపించెను. అపుడా యచ్చర విప్రశాపమున చేపయై యమునలో జరించుచుండెను.

శ్యేనపాదపరిభ్రష్టం త చ్ఛుక్ర మథ వాసవీ | జగ్రాహ తరసా%భ్యేత్య సా%ద్రికా మత్స్యరూపిణీ. 32

అథ కాలేన కియతా మత్సీం తాం మత్స్యజీవనః | సంప్రాప్తే దశ##మే మాసి బబంధ తాం మనోరమామ్‌. 33

ఉదరం విదరాశు స తస్యా మత్స్య జీవనః యుగ్మం వినిఃసృతం తస్మా దుదరా న్మానుషాకృతి. 34

బాల ః కుమార ః సుబగ స్తథా కన్యా శుభాననా | దృష్ట్యా%శ్చర్య మిదం సో%థ విస్మయం పరమం గతః. 35

రాజ్ఞే ఏఇవేదయామాస పుత్రౌ ద్వౌ తు ఝషోద్భనౌ | రాజా%పి విస్మయావిష్ఠః సుతం జగ్రాహ తం శుభమ్‌. 36

స మత్స్యో నామ రాజా %ధార్మికః సత్యసంగరః | వసుపుత్రో మహాతేజాః పిత్రా తుల్యపరాక్రమః 37

కాళికా వసునా దత్తా తరసా జలజీవినే | నామ్నా కాళీతి విఖ్యాతా తథా మత్స్యోదరీతి చ. 38

మత్స్యగంధేతి నామ్నా వై గుణన సమజాయత | వివర్ధమానా దాశస్య గృహే సా వాసవీ శుభా. 39

ఋషయ ఊచుః : అద్రికా మునినా శప్తా మత్సీ జాతా వరాప్సరాః | విదారితాచ దాశేన మృతాచ భక్షితా పునః. 40

కిం బభూన పున స్తస్యా అప్సరాయా వదస్వ తత్‌ | శాపస్యాంతం కథం సూత కథం స్వర్గ మవాప సా. 41

డేగనుండి పడిన రాజవీర్యమును చేపరూపమందున్న యద్రిక గ్రహించెను. కొంతకాలమునకు దానికి పది నెలలు నిండెను. అంత మత్స్యజీవను లాచేపను వలలో బంధించిరి. వారా మీనము పొట్టచీల్చి చూడగ నందుండి మానవాకృతులు గల యిద్దఱు శిశువులు వెడలిరి. వారిలో నొకడు చక్కని బాలుడు. ఒకతే శుభాననయగు కన్య. ఆ జాలరివాడు వారిని వీక్షించి యాశ్చర్యమందెను. అతడు వారిరువురను రాజున కప్పగించెను. రాజా బాలుని తన పుత్త్రునిగ నంగీకరించెను. వసు సుతుడగు నా బాలుడు తన తండ్రివలెనే తేజో విక్రమసంపన్నుడై సత్యదర్మవంతుడై మత్స్యదేశమునకు రాజయ్యెను. రాజా కన్నియను మత్స్యజీవనున కొసంగెను. ఆమె యచట కాళి మత్స్యోదరి యను పేరుతో వన్నెకెక్కినది. ఆమెనుండి చేపల వాసన వెడలుటచే నామెకు మత్స్యగంధయను పేరు ఏర్పడెను. వాటి నుండి ఆమె మత్స్యరాజు నింటనే పెరుగుచుండెను. ఋషులిట్లనిరి: అద్రిక విప్రునివలన చేపగ శపింపబడినది గదా ! దాశరాజా చేపను పొట్టచీల్చి తినెను. ఆ యద్రిక తుదకేమైనది; ఆమె శాపమెట్లు తీరినది; ఆమె దివి కెట్లేగినది? అదంతయును మాకు వివరింపుము.

సూతః : శప్తా యదా సా మునినా విస్మితా నంబభూవ హ | స్తుతిం చకార విప్రస్య దీనేన రుదతీ తదా. 42

దయావా న్బ్రాహ్మణః ప్రాహ తాం తదా రుదతీం స్త్రియమ్‌| మాశోకంకురు కల్యాణి శాపాంతం తే మదమ్యహమ్‌. 43

మత్క్రోధశాపభోగేన మత్స్యయోనిం గతా శుభే | మానుషా జనయిత్వా త్వం శాపమోక్ష మవాప్ప్యసి. 44

ఇత్యుక్తా తేన సా ప్రాప మత్స్యదేహం నదిజలే | బాలకౌ జనయిత్వా సా మృతా ముక్తా చ శాపతః. 45

సంత్యజ్య రూపం మత్స్యస్య దివ్యం రూప మవాప్య చ | జగామామరమార్గం చ శాపాంతే వరవర్ణినీ. 46

ఏవం జాతా వరా పుత్రీ మత్స్యగంధా వరాననా | పుత్రీవ పాల్యమానా సా దాశ##గేహే వ్యవర్థత. 47

మత్స్యగంధా తదా జాతా కిశోరీ చాతిసుప్రభా | తస్య కార్యాణి కుర్వాణా వాసవీ చాతిసుప్రభా. 48

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ ద్వితీయస్కందే మత్స్యగంధోత్పత్తిర్నామ ప్రథమోధ్యాయః

సూతుడిట్లనియె: ఆ విప్రుడు శపించిన నాడే యామె విస్యయముతో నతిదీరముగ నేడ్చుచు విప్రుని స్తుతించెను. ఆమె విలాపమునకు బ్రాహ్మణుని గుండె నీరైనది. అతడు దయతో నామె కిట్లనియెను: 'ఓ కల్యాణీ! శోకింపకుము. శాపాంతము దెల్పుదును. వినుము. ఓ శుభాంగీ! నాశాపవవమున నీవు చేప వగుదువు. ఇద్దఱిని గందువు. ఆ పిదప నీశాపము తీరిపోవును.' ఇట్లామె శపింపబడి నదిలోని చేపయైనది. ఇద్దఱిని గన్నది. పిదప శాపముక్తి బడసినది. ఆమె శాపము దీరిన పిదప చేపరూపు వదలి దివ్యరూపమున దేవమార్గమున నరిగెను ఆ మత్స్యగంధయను కన్నియ దాశరాజు నింట నతని కూతురుగ బెరిగి పెద్దదగుచుండెను. శుభాంగియగు నామత్స్యగంధ చిఱుతప్రాయమున తన తండ్రి యింటినే యుండి పనులెల్ల చక్కబెట్టుచుండెను.

ఇది శ్రీదేవీ భాగవత మహాపురాణమందలి ద్వితీయస్కంధమందు మత్స్యగంధోత్పత్తియను ప్రథమాధ్యాయము

Sri Devi Bhagavatam-1    Chapters