Sri Devi Bhagavatam-1    Chapters   

అథ పంచమో%ధ్యాయః

తథా చింతాతురా న్వీక్ష్య సర్వాన్సర్వార్థ తత్త్వవిత్‌ | ప్రాహ ప్రేమభరోద్ర్భాంతా న్మాధవో మేదినీపతే. 1

విష్ణురువాచ: కిం మౌన మాశ్రితా యూయం బ్రువంతు కారణం సురాః |

సదసద్వా%పి యచ్ఛ్రుత్వా యతిష్యే తన్నివారణ. 2

దేవాఊచుః: కి మజ్ఞాతం తవ విభో త్రిషులోకేషు వర్తతే | సర్వం వేద భవాన్కార్యం కిం పృచ్ఛసి పునఃపునః. 3

త్వయా పూర్వం బలి ర్బద్ధః శక్రో దేవాధిపః కృతః | వామనం వపు రాస్థాయ క్రాంతం త్రిభువనం పదైః. 4

అమృతం త్వాహృతం విష్ణో దైత్యాశ్చ వినిపాతితాః | త్వం ప్రభుః సర్వదేవానాం సర్వాపద్వినివారణ. 5

విష్ణురువాచ: న ఖేతవ్యం సురవరా వేద్మ్యుపాయం సుసమ్మతమ్‌ |

తద్వధాయ ప్రవక్ష్యామి యేన సౌఖ్యం భవిష్యతి. 6

అవశ్యం కరణీయం మే భవతాం హిత మాత్మనా | బుద్ధ్యా బలేన చార్ధేన యేనకేన చ్ఛలేన వా. 7

ఉపాయాః ఖలు చత్వారః కథితా స్తత్త్వదర్శిభిః | సామాదయః సుహృత్స్వేవ దుర్హృదేషు విశేషితః.8

బ్రహ్మణా%స్య వరో దత్త స్తపసా%%రాధితేన చ | దుర్జయత్వం చ సంప్రాప్తం వరదానప్రభావతః. 9

అజేయః సర్వభూతానాం త్వష్ట్రా సముపపాదితః | తతో బలేన వృద్ధిం స ప్రాప్తం వరదానప్రభావతః. 10

దుఃసాధ్యో%సౌ సురాః శత్రు ర్వినా సామ ప్రతారణమ్‌ | ప్రలోభ్య వశ మానేయో హంతవ్య స్తుతతః పరమ్‌. 11

గచ్ఛధ్వం సర్వ గంధర్వా యత్రా%సౌ బలవత్తరః | సామ తస్య ప్రయుంజధ్వం తత ఏనం విజేష్యథ. 12

సంగమ్య శపథా న్కృత్వా విశ్వాస్య సమయేన హి | మిత్రత్వం చ సమాధాయ హంతవ్యః ప్రబలో రిపుః. 13

అదృశ్యః సంప్రవేక్ష్యామి వజ్రమస్య వరాయుధమ్‌ | సాహాయ్యం చ కరిష్యామి శక్రస్యాహం సురోత్తమాః. 14

సమయం చ ప్రతీక్షధ్వం సర్వథైవాయుషః క్షయే | మరణం విబుధా స్తస్య నాన్యథా సంభవిష్యతి. 15

అయిదవ అధ్యాయము

శ్రీదేవి దేవతలకు ప్రత్యక్షమగుట

సర్వార్థతత్వవిదుడు మాధవుడునగు హరి చింతాధీనులు ప్రేమభరమున ఉద్ర్భాంతులునగు దేవతలను గాంచి హరి ఇట్టులనియెను : ఓ సురలారా! మీరు మౌనముగానుండుటకు కారణమేమో తెలుపుడు. మీకు గల్గిన మంచి చెడ్డలు తెలుపుడు. చెడు తొలగింప యత్నింతును. అన దేవతలిట్లనిరి: ప్రభూ! ఈ ముల్లోకములందు నీకు దెలియనిదేమున్నది? అన్ని తెలిసియును మాటామాటికి మమ్మేల ప్రశ్నింతువు? పూర్వము నీవు వామనమూర్తివై త్రిభువనము లాక్రమించి బలిని బంధించితివి. ఇంద్రుని దేవపతిగ జేసితివి. మునుపు దనుజులను మోహపెట్టి వారినణచివేసి యమృతము గైకొంటివి. కనుక సకలదేవతల బాధలు బాపుటకు నీవొక్కడవే సమర్థుడవు. అన విష్ణువిట్లనెను : మీరు భయపడకుడు. వగవకుడు. వానిని చంపుటకొక చక్కని యుపాయము నెఱుగుదును. దానివలన మీకు తప్పక సుఖముగల్గును. దానిని తెల్పుదును. వినుడు. బుద్ధిబలము-అర్థము- మోసము-వీనిలో దేనివలననైన మీకు మేలు చేకూర్చుట నా పరమ కర్తవ్యము. సామాది చుతురుపాయములు మిత్రులందును విశేషముగ శత్రులందు నుపయోగించవలయునని తత్త్వవిదులందురు. మున్ను వీనిచే బ్రహ్మ యారాధింపబడి వరమిచ్చెను. దాని ప్రభావమున నతడు దుర్జయుడయ్యెను. అతడు విశ్వకర్మచేత సృజింపబడి భూతములన్నిటి కజయుడయ్యెను. ఆ బలమువలన నతడు శత్రులకసాధ్యుడయ్యెను. అమరులారా! అతడు సామాదులచే వశుడుగాడు. మొదట లోభ##పెట్టి వశము చేసికొని పిదప చంపవలయును. కనుక నిపుడు గంధర్వాదులందఱు నతడున్నచోటికేగి యతని పట్ల సామోపాయమవలంబింపవలయును. పిదప నతనిని గెల్చుట సుకరము. మొదట నతడేమన్నను కాదనక నెయ్యము చూపవలయును. పిదప చంపవలయును. నేనింద్రుని వజ్రాయుధములో నదృశ్యుడనై దాగియుందును. ఇట్లు నేనింద్రునకు సాయమొనర్పగలను. విబుధులారా! అతని యాయువు తీరు కాలమున కెదురుచూడుడు. అంతేకాని వేరుపాయమున నతడు చావడు.

గచ్ఛధ్వమృషిభిః సార్ధం గంధర్వాః కపటావృతాః | ఇంద్రేణ సహ మిత్రత్వం కురుధ్వం వాక్యదానతః. 16

యథా స యాతి విశ్వాసం తథా కార్యం ప్రతారణమ్‌ | గుప్తో%హం సంప్రవేక్ష్యామి పవిం సంఛాదితం దృఢమ్‌. 17

విశ్వస్తం మఘవా శత్రుం హనిష్యతి న చాన్యథా | విశ్వాసస్య కృతే కృత్వా శక్ర స్తు పృష్ఠతః. 18

మత్సహాయో%థ వజ్రేణ శాతయిష్యతి పాపినమ్‌ | న దోషో%త్ర శ##ఠే శత్రౌ శాఠ్యమేవ ప్రకుర్వతః. 19

నాన్యథా బలవా న్వధ్యః శూరధర్మేణ జాయతే | వామనం రూప మాధాయ మయా%యం వంచితో బలిః. 20

కృత్వా చ మోహినీ వేషం దైత్యాః సర్వే%పి వంచితాః | భవంతః సహితాః సర్వే దేవీం భగవతీం శివామ్‌. 21

గచ్ఛధ్వం శరణం భావైః స్తోత్రమంత్రైః సురోత్తమాః | సాహాయ్యం సా యోగమాయా భవతాం సంవిధాస్యతి. 22

వందామహే సదా దేవీం సాత్త్వికీం ప్రకృతిం పరామ్‌ | సిద్ధిదాం కామదాం కామాం దురాపామకృతాత్మభిః. 23

ఇంద్రో%పి తాం సమారాధ్య హనిష్యతి రిపుం రణ | మోహినీ సా మహామాయా మోహయిష్యతి దానవమ్‌. 24

మోహితో మాయయా వృత్రః సుఖసాధ్యో భవిష్యతి | ప్రసన్నాయాం పరాంబాయాం సర్వం సాధ్యం భవిష్యతి. 25

నోచే న్మనోరథావాప్తి ర్న కస్యా%పి భవిష్యతి | అంతర్యామి స్వరూపా సా సర్వకారణకారణా. 26

తస్మా త్తాం విశ్వజననీం ప్రకృతిం పరమాదృతాః | భజధ్వం సాత్త్వికై ర్భావైః శత్రునాశాయ సత్తమాః. 27

పురా మయా%పి సంగ్రామం కృత్వా పరమదారుణమ్‌ | పంచవర్షసహస్రాణి నిహతౌ మధుకైటభౌ. 28

స్తుతా మయా తదా%త్యర్థం ప్రసన్నా ప్రకృతిః పరా | మోహితౌ తౌ తదా దైత్యౌ ఛలేన చ మయాహతౌ. 29

విప్రలబ్ధౌ మహాబాహూ దానవౌ మదగర్వితౌ | తథా కురుధ్వం ప్రకృతే భావసంయుతాః. 30

సర్వథా కార్యసిద్ధిం సా కరిష్యతి సురోత్తమాః | ఏవం తే దత్తమతయో విష్ణునా ప్రభవిష్ణునా. 31

ఇపుడు గంధర్వాదులు ఋషులు నింద్రునితోగలిసి వెళ్ళి మంచి మాటలతో నేస్తము చేసికొనవలయును. అతనికి నమ్మకము గల్గించవలయును. అపుడు నే నింద్రుని వజ్రాయుధములో రహస్యముగ దాగియుండి యతనిని చంపింతును. విశ్వాసఘాతుకుడనగుదునను పాపభీతి వెనుకకు నెట్టవలయును. అతనికి తనపై నమ్మిక కుదిరిన వెంటనే యింద్రుడతనిని చంపవలయును. ఇతర విధముల నతడు చావడు. నా సాయముగల వజ్రముతో వృత్రుని చంపవలయును. శత్రుడు మోసగాడైనచో వానిని మోసముతోడనే చంపవలయును. బలిశాలియగు వైరి వంచనచే జంపబడును - శూర ధర్మమున చావడు. తొల్లి నేను బలిని వామన రూపముతో మోసగించితిని. తొలుత నా మోహినీ వేషమునకు దానవులు మోసపోయిరి. కనుక నిపుడు మీరెల్లరును శ్రీ శివాభగవతీ దేవిని సంసేవింపుడు. ఆ తత్లిని మీరు మంత్ర స్తోత్రములతో శరణుబొందుడు. యోగమాయ మీకు తప్పక తన చేయూత నీయగలదు. నేను ప్రతి దినము దుర్మతుల కలవిగాని పరాప్రకృతిని సిద్ధికామ ప్రదాయినని సర్వకామ కళాస్వరూపిణిని భజింతును. ఆ దేవి నింద్రుడు నారాధించి రణమందున పగఱ గెలువగలడు. ఆ మహామాయా - జగన్మోహినీ దేవి దానవులను మోహపెట్టును. వృత్రుడు మాయామోహితుడైనచో నతడు అనాయాసముగ చంపబడగలడు. శ్రీపరాభట్టారిక యానందించినచో సర్వమును సుసాధ్యముగాగలదు. అట్లుగానిచో నెవని కోరికలు తీరును? ఆమె సర్వకారణ కారణ సర్వాంతర్యామి స్వరూపిణి కావున మీరా త్రిభువన జనయిత్రిని పరాప్రకృతిని పరమభక్తితో సాత్త్వికమగు భావముతో శత్రు నాశమునకు భజింపుడు. పూర్వము నేనైదు వేలేండ్లు దారుణముగ పోరాడి మధుకైటభులను సంహరించితిని. అలనాడు నేను పరాప్రకృతిని సంస్తుతించితిని. ఆ తల్లి సుప్రసన్నయయ్యెను. అంత వారు మాయా మోహితులై మోసముతో నాచేత మడిసిరి. ఆ మదమత్త రాక్షసులట్లు నా చేతిలోచచ్చిరి. కనుక మీరును పరమ భావముతో ఆ పరాప్రకృతి నారాధింపుడు. దేవతలారా! ఆ జగన్మాత తప్పక మీకు కార్యసిద్ధి చేకూర్చగలదు అని పల్కిన ప్రభవిష్ణుడగు విష్ణుని ప్రియహిత వచనములు సురలు వినిరి.

జగ్ము స్తే మేరుశిఖరం మందారద్రుమమండితమ్‌ | ఏకాంతే సంస్థితా దేవాః కృత్వా ధ్యానం జపంతపః. 32

తుషువు ర్జగతాం ధాత్రీం సృష్టిసంహారకారిణీమ్‌ | భక్త కామదుఘా మంబాం సంసారక్లేశనాశినీమ్‌. 33

దేవి! ప్రసీద పరిపాహి సురాన్ర్పతప్తా న్వృత్రాసురేణ సమరే పరిపీడితాం శ్చ.

దీనార్తినాశనపరే! పరమార్థ తత్త్వే ప్రాప్తాం స్త్వదంఘ్రి కమలం శరణం సదైవ. 34

త్వం సర్వం విశ్వజననీ పరిపాలయాస్మా న్పుత్రానివాతి పతితాన్రివు సంకటే%స్మిన్‌.

మాతర్నతే%స్త్యవిదితం భువనత్రయే%పి కస్మా దుపేక్షసి సురానసుర ప్రతప్తాన్‌. 35

త్రైలోక్య మేతదఃలం విహితం త్వయైవ బ్రహ్మ హరిః పశుపతి స్తవ వాసనోత్థాః |

కుర్వంతి కార్య మఃలం స్వవశా న తే తే భ్రూభంగచాలన వశాద్విహరంతికామమ్‌. 36

మాతా సుతా న్పరిభవా త్పరిపాతి హీనా న్రీతి స్త్వయైవ రచితా ప్రకటాపరాధాన్‌ |

కస్మా న్న పాలయసి దేవి వినాపరాధా నస్మాం స్త్వదంఘ్రి శరణా న్కరుణా రసాబ్ధే. 37

నూనం మదంఘ్రి భజనాప్త పదాః కిలైతే భక్తిం విహాయ విభ##వే సుఖభోగలుబ్ధాః |

నేమే కటాక్షవిషయా ఇతిచే న్న చైషా రీతిః సుతే జనని కర్తరి చాపి దృష్టా. 38

దోషో న నో2త్ర జనని ప్రతిభాతి చిత్తే యత్తే విహాయ భజనం విభ##వే నిమగ్నాః |

మోహస్త్వయా విరచితః ప్రభవ త్యసౌ న స్తస్మా త్స్వభావకరుణ దయసే కథం న. 39

పూర్వం త్వయా జనని దైత్యపతి ర్బలిష్ఠో వ్యాపాదితో మహిషరూపధరః కిలా%%జౌ |

అస్మత్కృతే సకలలోక భయావహో%సౌ వృత్రం కథం న భయదం విధునోషి మాతః. 40

శుంభస్తథా%తి బలవా ననుజో నిశుంభస్తౌ భ్రాతరౌ తదనుగా నిహతా హతౌచ |

వృత్రం తథా జహి ఖలం ప్రబలం దయార్ద్రే మత్తం విమోహయ తథా న భ##వేద్యథా%సౌ. 41

త్వం పాలయాద్య విబుధా న సురేణ మాతః సంతాపితా నతితరాం భయ విహ్వలాంశ్చ |

నా%న్యో%స్తి కో%పి భువనేషు సురార్తిహంతా యః క్లేశజాల మఃలం నిదహే త్స్వశక్త్యా. 42

వృత్రే దయా తవ యది ప్రథితా తథా%పి జహ్యేన మాశు జన దుఃఖకరం ఖలం చ |

పాపా త్సముద్ధర భవాని శ##రైః పునానా నోచే త్ర్పయాస్యతి తమో నను దుష్టబుద్ధిః. 43

తే ప్రాపితాః సురవనం విబుధారయో యే హత్వా రణ%పి విశిఖైః కిల పావితాస్తే |

త్రాతా నకిం నిరయ పాతభయా ద్దయార్ద్రే యచ్ఛత్రవో పి నహి కిం వినహింసి వృత్రమ్‌. 44

జానీమహే రిపురసౌ తవ సేవకో న ప్రాయేణ పీడయతి నః కిల పాపబుద్ధిః |

య స్తావక స్త్విహ భ##వే దమరా నసౌ కిం త్వత్పాదపంకజర తాన్నను పీడయే ద్వా. 45

అపుడు దేవతలు మందారాదితరువులచే నందమైన మేరుగిరి జేరిరి. వారేకాంతమున దేవిని గూర్చి జపతపో ధ్యానములు చేసిరి. వారు భక్తుల కోరిక లీడేర్చునట్టి సంసార దుఃఖములు బోగొట్టునట్టి జగములేలేతల్లిని - సృష్టిస్థితి సంహార కారిణి నీ విధముగ గొప్పగ ప్రస్తుతించిరి: తల్లీ! దేవదేవీ! మేము సమరమున వృత్రునిచేత పీడితులమై సంతప్తులమైతిమి. నీ పదపద్మములపై మా తలలు వంచి శరణువేడుచున్నాము. సర్వవిశ్వజననీ! అమ్మా! ఈ ముల్లోకములందు నీకు తెలియనిది లేదుగదా! దానవపీడితులమగు మమ్మేల యుపేక్షింతువు? మేము నీ కన్నబిడ్డలము. భీకర శత్రువులబారి పడిన వారము. మమ్ము గాపాడగదవే. తల్లీ! ఈ జగములన్నియు నీ వలననే నిల్చియున్నవి. నీవు వేల్పులతల్లివి. హరి హర బ్రహ్మలు వలననే జన్మించి నీ కనుసన్న మాత్రన సర్వ కార్యముల నెరవేర్చి విహరింతురు. వారికి స్వేచ్ఛా స్వాతంత్ర్యము లెంత మాత్రమును లేవు. ఒకవేళ పుత్రులేవైన అపరాధములచేసి దీనులై తిరస్కృతులైనచో వారిని తల్లి దయతో గాపాడునుగదా! వారితప్పు మన్నించునుగదా! దయారసమయీ! మేము నీ దివ్య పదారవిందములను శరణుపొందిన వారము. నిరపరాధులము. మమ్మేలదయతో నేలవమ్మా! అమ్మా! భవానీ! వీరొకప్పుడు నా పదములు గొలిచి పదములు పడసి సుఖభోగములంది నేడు నా భక్తి మానిరి. వీరినిపుడు నేనెట్లు కటాక్షింతునని మమ్ము గూర్చి దలంతువేని వినుము. అమ్మా! దయామతల్లియగు ఏ తల్లికైన నిట్టి భావము మదిగల్గదు సుమా! జననీ! శుభకామినీ! మేము నిన్ను భజింపక సంవదలం దనురక్తుల మగుటలో మా దోషమేమియును లేదు. ఏలన, నీవు మాయామోహమును రచించి మమ్ము మోహితులనుగ జేసితివి. స్వాభావిక కరుణారూపవగు నీవు దయతో మమ్మాదుకొనవేల? తల్లీ! తొల్లి నీవు బలశాలి - దైత్యపతియగు మహిషుని మాకు శ్రేయముగూర్ప నంతమొందించితివి. ఇపుడీ సకలలోక కంటకుడగు వృత్రునేల వధింపవు? దయామయీ! తొల్లి నీవు శుంభనిశుంభులను సోదరులను వారి యనుచరులను చంపివేసితివే. అట్లే మత్తుడు దుష్టుడు దుర్బలుడు నగు వృత్రుని మోహితునిజేసి చంపుము. శుభకారిణీ! జననీ! మేము దానవులచేత బాధింపబడితిమి. వికలాత్ములమైతిమి. మమ్ము బ్రోవగదవే! విబుధుల యార్తిపాపి వారి కడగండ్లనెల్ల బాపు శక్తిగలదానవు. దానవుల నెదిరించు ధీరశక్తివి నీవు; నిన్నెవడు నెదిరి నిల్వలేడు. ఓయమ్మా! ఒకవేళ వృత్రునిమీద నీకు కనికరమున్నచో జగములెల్ల పీడించునతడు నరకములో గూలకముందే నీ పవిత్రశరములతో వానిని చంపి యుద్ధరించుట మంచిది. నీ దివ్యబాణముల తాకిడికి పవిత్రులై చచ్చిన దనుజులు సురవనములందు విహరింతురుగదా! వృత్రుడు నీ శత్రువే. ఐన నతనిని నరకమున త్రోయక కాపాడవలసియుండ చంపవేల? జగన్మాతా! మాకు నీ శుభచరణములు శరణము. వృత్రుడు నిన్ను గొల్వక మమ్ము బీడించువాడు. అట్టి పాపమతి నీకు దాసుడుగాడు, వైరియేయగునని మేముదలంతుము. కుర్మః కథం జనని పూజన మద్య తే%ంబ పుష్పాదికం తవ వినిర్మితమేవ యస్మాత్‌ |

మంత్రా వయం చ సకలం పరశక్తి రూపం తస్మా ద్భవాని చరణ ప్రణతాః స్మనూనమ్‌. 46

ధన్యాస్త ఏవ మనుజా హి భజంతి భక్త్యా పాదాంబుజం తవభవాబ్ధి జలేషు పోతమ్‌ |

యం యోగినో%పి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగవికారమోహః. 47

యే యజ్ఞికాః సకలవేదవిదో%పి మనసా సతతం స్మరంతి మోక్షార్థినో విగతరాగ వికారమోహః.

స్వాహాంతు తృప్తి జననీ మమరేశ్వరాణాం భూయః స్వధాం పితృగణస్య చ తృప్తిహేతుమ్‌. 48

మేధా%సి కాంతిరసి శాంతిరపి ప్రసిద్ధా బుద్ధి స్త్వమేవ విశదార్థకరీ నరాణామ్‌ |

సర్వం త్వమేవ విభవం భువన త్రయే%స్మి న్కృత్వా దదాసి భజతాం కృపయా సదైవ. 49

ఏవం స్తుతా సురైర్దేవి ప్రత్యాక్షా సా%భవత్తదా | చారురూపధరా తన్వీ సర్వాభరణ భూషితా. 50

పాశాంకుశవరాభీతి లస ద్బాహు చతుష్టయా | రణత్కింకిణికాజాలరశనాబద్ధ సత్కటిః. 51

కలకంఠీరవా కాంతా క్వణత్కంకణనూపురా | చంద్రఖండ సమాబద్ధ రత్నమౌళి విరాజితా. 52

మందస్మితారవిందాస్యా నేత్రత్రయవిభూషితా | పారిజాతప్రసూనాచ్ఛనాళవర్ణ సమప్రభా. 53

రక్తాంబరపరీధానా రక్తచందనదర్చితా | ప్రసాదముఖీ దేవీ కరుణారససాగరా. 54

సర్వశృంగారవేషాఢ్యా సర్వద్వైతారణిః పరా | సర్వజ్ఞా సర్వకర్త్రీ చ సర్వాధిష్ఠానరూపిణీ. 55

సర్వవేదాంతసంసిద్ధా సంచిదానందరూపిణీ | ప్రణము స్తాం సమాలోక్య సురాదేవీం పురః స్థితామ్‌. 56

తానాహ ప్రణతా నంబాకింపః కార్యంబ్రువంతుమామ్‌ | దేవాః : మోహయైనంరిపుం వృత్రం దేవానామతిదుఃఖదమ్‌. 57

యథా విశ్వసతే దేవాం స్తథా కురు విమోహతమ్‌ | ఆయుధే చ బలం దేహి హతః స్యాద్యేనవా రిపుః. 58

తథే త్యుక్త్వా భగవతీ తత్రైవాంతర ధీయత | స్వాని స్వానినికేతాని జగ్ముద్దేనా ముదా%న్వితాః. 59

ఇతి శ్రీదేవీభాగవతే మహాపురాణ షష్ఠస్కంధే పంచమో%ధ్యాయః.

తల్లీ! విశ్వజననీ! ఇకమేము నీ పాదపూజమాత్రమెట్లు చేయగలము? ఏలన నీ పూలు ఈ మంత్రములు ఈ మేమందఱము నీ పరిణామమే కదా! నీ పరాశక్తి చైతన్యములోని భిన్నరూపములమే కదా! కావున మేము నీ దివ్య పదరాజీవములకు తలలొగ్గి నమస్కారములు మాత్రము చేతుము. ముముక్షువులు మోహరాగవికారములు లేనివారు. పరమయోగులు. వారు తమ చిత్తములందు నిరంతరముగ భవసాగర నౌకవంటి నీ పదనళిన యుగమును పరమభక్తితో సేవింతురు. వారు నీ సుప్రసన్నతతో ధన్యజీవులు వేదవిదులగు యాజ్ఞికులు యాగములందు దేవతలను పితృదేవతలను తృప్తిపఱచు స్వాహా స్వధారూపిణివగు నిన్నే స్మరింతురుగదా తల్లీ! నీవు కాంతివి. శాంతివి. మేధవు. ప్రజ్ఞవు. నరులలోని సుబుద్ధివి. శ్రద్ధవు. సర్వము నీవే. ఈ భువనములందు నిన్ను గొల్చువారికి దయతో వైభవము లొసగుతల్లివి నీవే. అని యీ విధముగ విబుధులు ప్రస్తుతింపగా శ్రీదేవి యిట్లు ప్రత్యక్షమయ్యెను: శ్రీదేవి పంచదశాత్మైక స్వరూపిణి. దివ్యభూషితరంజిత. పాశ-అంకుశ-వర-అభయములతో నొప్పుకరాంబుజయుత. కింకిణీరశనల నలరు శృంగానర మధ్యమ. కలకంఠకంఠరవ- కనకాంగదకేయూరభకూషిత. చంద్రరేఖ వెలుగొందు రత్నమకుటముచే విరాజిత. చిర్నగవు వెన్నెలలు కురియు తల్లి. విరిసిన తమ్ములవంటి మూడు కన్నులు కలది. పారిజాత కుసుమ స్వచ్ఛనాళ సమానకాంతి. రక్తవసన-రక్త చందన చర్చిత. అవ్యాజకరుణాపూర్ణ - ప్రసాదసుముః సకల శృంగార రసాధిదేవత - అనంతకోటి బ్రహ్మాండ జనని. సర్వజ్ఞ. సర్వకర్త్రి - సర్వాధిష్ఠానదేవత - సర్వవేదాంత ప్రతిసాద్య - సచ్చిదానంద స్వరూపిణి యగు త్రిభువనేశ్వరీదేవి దేవతల ముందు ప్రత్యక్షమయ్యెను. దేవతలు శ్రీదేవిని సందర్శించి యామెకు దోసిలొగ్గిరి. అంత దేవి 'మీరు నన్నేల ప్రస్తుతించుచున్నారు? తెలుపడ'నెను. దేవతలిట్లనిరి : వృత్రుడు సురలను బాధించుచున్నాడు. అతనిని మోహపఱచుము. అతడు చచ్చునట్లుగ నీవు మా యాయుధములందు నీ దివ్యశక్తినుంచుము.' అంత శ్రీభగవతి యట్లే యని యచ్చోట నదృశ్యురాలయ్యెను. దేవతలు హర్షముతో తమతమ నెలవుల కరిగిరి.

ఇది శ్రీ మద్దేవీభాగవతమందలి షష్ఠస్కంధమందు దేవలతకు శ్రీదేవి ప్రత్యక్షమగుట అను పంచమాధ్యాయము.

Sri Devi Bhagavatam-1    Chapters