Sri Padma Mahapuranam-I    Chapters   

సప్తమోధ్యాయః

భీష్మ ఉవాచ :

దితేః పుత్రా కధం జాతా మరుతో దేవవల్లభాః | దేవైర్జగ్ముశ్చ సాపత్నై కస్మాత్సఖ్య మసుత్తమమ్‌ || 1

పులస్త్య ఉవాచ :

పురా దైవాసురే యుద్ధే హతేషు హరిణా సురైః | పుత్రపౌత్రేషు శోకార్తా గతా భూలోకముత్తమమ్‌ || 2

పుష్కరేతు మహాతీర్థే నరస్వత్యాస్తటే శుభే | భర్తు రారాధనపరా తప ఉగ్రం చచార హ || 3

దితి ర్వైదైత్య మాతాతు ఋషికార్యేణ సువ్రతా | ఫలాహారా తపస్తేషే కృచ్ఛచాంద్రాయణాదిభిః || 4

యావద్వర్షశతం సాగ్రం జరాశోకసమాకులా | తత స్సా తపసా తప్తా వశిష్ఠాదీ నపృచ్ఛత 5

కధయంతు భవంతో మే పుత్రశోకవినాశనం | వ్రతం సౌభాగ్యఫలద మిహలోకే పరత్రచ 6

ఊచు ర్వశిష్ఠప్రముఖా జ్యేష్ఠేతాం పూర్ణిమా వ్రతం | యస్య ప్రసాదా దభవ త్సుతశోకవివర్జితా || 7

భీష్మ ఉవాచ :

శ్రోతు మిచ్ఛా మ్యహం బ్రహ్మన్‌ జ్యేష్ఠస్య పూర్ణిమావ్రతం | సుతా నేకోన పంచాశ ద్యేనలేభే పునర్దితిః || 8

పులస్త్య ఉవాచ :

-: జ్యేష్ఠ పూర్ణిమా వ్రతమ్‌ :-

యద్వ శిష్ఠా దిభిః పూర్వం దిత్యై సంకథితం వ్రతం | విస్తరేణ తదే వేదం మత్సకాశా న్నిశామయ 9

జ్యేష్ఠేమాసి సితేపక్షే పౌర్ణిమాయాం యతవ్రతా | స్థాపంయే ద్రవణం కుంభం సితతండులపూరితమ్‌ || 10

నానాఫలయుతం తద్వ దిక్షుదండ సమన్వితం | సితవస్త్రయుగచ్ఛన్నం సితచందన చర్చితమ్‌ || 11

నానాభక్ష్య సమాపూరం సహిరణ్యంతు శ క్తితః | తామ్రపాత్రం గుణోపేతం తస్యోపరి నివేశ##యేత్‌ || 12

తస్మాదుపరి బ్రహ్మాణం సౌవర్ణపద్మ కోదరే | కుర్యాచ్చర్కయోపేతాం సావిత్రీం తస్య వామతః || 13

గంధం ధూపం తయో ద్యా ద్గీతం వాద్యం చ కారయేత్‌ | తదభావే కధం కుర్యాద్యదా పితామహః || 14

భీష్ముడు దితి కొడుకులు మరత్తులు సవతితల్లి కొడుకులగు దేవతలకిష్టు లెట్లయిరి వారితో మంచి స్నేహమెట్లు సేసిరన పులస్త్యుడిట్లనియె. ''మున్ను దేవాసుర యుద్ధమందు హరిచే సమరులచే మనుమలు మునుమనుములుం గూలిపోవదితి శోకించి సరస్వతీ తీరమందు పుష్కరమహాతీర్దమందు ఋషులపట్ల వ్రతమూని ఫలహారయై కృచ్భ్రచాంద్రాయణాదులచే భర్త నారాధించుచు నూరేండ్లపైని ముదిమికింగూడ బెదరి వశిష్ఠాదులను బుత్రకోశహరము సౌభాగ్యప్రదము ఇహలోక శుభప్రదమగు వ్రతమానతిండన వారు జ్యేష్ఠపూర్ణిమా వ్రతము నుపదేశించిరి. తదనుగ్రహమున నామె పుత్రశోక ముందలగెను---'' వానిని భీష్ముడు దితి యీ వ్రతముచేసి నలుబది తొమ్మండ్రు కొడుకుల (మరుత్తులను) నెట్లు వడసెనక్కథ వినవలతునన పులస్త్యుడిట్లు సెప్పదొడంగెను.

జ్యేష్ఠపూర్ణిమనాడు కలశస్థాపన చేసి తెల్లని బియ్యము పెక్కుపండ్లునింపి చెఱకుగడ నుంచి తెలిగంధము పూసిన తెల్లని వస్త్రముం గప్పవలెను. దానిపై పెక్కు భక్ష్యములు యధాశక్తి బంగారమందుంచి బెల్లము కూడవేసిన రాగిబిందెను దానిపై నుంచవలెను. ఆ మీద బంగారు తామరపూవు దుద్దుపై బ్రహ్మను నాతని యెడమవైపు చెక్కెరతో జేసిన బొమ్మను సావిత్రిని బ్రతిష్ఠించి షోడశోపచార పూజలుచేసి గీత వాద్యాదులను మేళవింపవలెను. అంత సేయలేని యెడ బ్రహ్మ పేరిట నొక ప్రతిమను బెల్లముతో జేసి దానిని తెల్లని పూలతో నక్షంతలతో నువ్వులతో నర్చించవలెను. 14

బ్రహ్మాహ్వ యాంచ ప్రతిమాం కృత్వా గుడమయీం శుభాం | శుక్లపుష్పాక్షత తిలైరర్చయేత్పద్మసంభమ్‌ 15

పాదౌతు స బ్రహ్మణఇతి జంఘే సౌభాగ్యదాయచ విరించాయోరుయుగ్మంచ మన్మథా యేతి వై కటిమ్‌ || 16

స్వచ్ఛోదరా యేత్యుదరయతంద్రాయే త్యురో విధేః | ముఖం పద్మముఖాయేతి బాహూవై వేదపాణయే || 17

మౌశింస్సర్వాత్మనే మౌలియర్చయే చ్చాపిపంకజం | తతః ప్రభాతే తత్కుంభం బ్రాహ్మణాయ నివేదయేత్‌ || 18

బ్రాహ్మణం భోజయే ద్భక్త్యా స్వయంతు లవణం వినా | భక్త్యా ప్రదక్షిణం దద్యా దిమం మంత్ర ముదీరయేత్‌ || 19

ప్రీయతా మత్ర భగవాన్‌ సర్వలోక పితామహః | హృదయే సర్వలోకానాం యస్త్వానింద్రో7భి పయతే || 20

అనేన విధినా సర్వం మాసిమాసి సమాచరేత్‌ | ఉపవాసీ పౌర్ణమాస్యామర్చయే ద్చ్రాహ్మ మవ్యయమ్‌ || 21

ఫలమేకంచ సంప్రాశ్య శర్వర్యాం భూతలే స్వపేత్‌ | తతస్త్రయోదశే మాసి ఘృతధేను సమన్వితామ్‌ || 22

శయ్యాం దద్యా ద్విరించాయ సర్వోపస్కరసంయుతం | బ్రహ్మాణం కాంచనం కృత్వా సావిత్రీం రజతైస్తథా 23

పద్మోవతుం సృష్టిహేయం సావిత్రీ ముపలభ్యతు | వసై#్త్రర్ద్విజం సపత్నీకం సంపూజ్యాథ సుభూషణౖః || 24

శక్త్వా గవాది నందద్యాత్ర్పీయతా మిత్యుదీరయేత్‌ | హోమం శుక్లైస్తిలైః | కుర్యాద్బ్రహ్మనామాని కీర్తయేత్‌ || 25

గవ్యేన సర్పిషా తద్వత్పాయసేవచ ధర్మవిత్‌ | విప్రేభ్యో7థ ధనం దద్యా త్పుష్పమాలాంచ శక్తితః || 26

యః కుర్యాద్విధి నానేన పౌరమాస్యాం స్త్రి యోపివా | సర్వపాప వినిర్ముక్తా బ్రహ్మసాత్మ్యం భజంతితే || 27

ఇహలోకే పరాన్‌ పుత్రాన్సౌభాగ్యం ధ్రువ మశ్నుతే | యో బ్రహ్మా సిస్మృతో విష్ణురానందాత్మా మహేశ్వరః 28

సుఖార్థీ కామరూపేణ స్మరేద్దేవం పితామహం | ఏవం శ్రుత్వా చకారాసౌ దితిః సర్వమశేషతః || 29

కశ్యపోవ్రత మహాత్మ్యా దాగత్య పరయాముదా | చకార కర్కశాం మాయో రూపలావణ్య సంయుతామ్‌ || 30

వరై రాచ్ఛందయామాస సాచ తవ్రే చిరం వీరం | పుత్రం శక్రవధార్ధాయ సమర్దం చ మహౌజసమ్‌ 31

వరయామి మహాత్మానాం సర్వామర నిఘాదనం | ఉవాచ కాశ్యపో వాక్య మింద్రజేతార మూర్జితమ్‌ || 32

ప్రదాస్యామ్యహ మేతేన కిన్త్వే తత్ర్కియతాం శుభే | అపస్తంబంతు కృత్వేష్టిం పుత్రీయా మద్యసుస్తని || 33

విధాస్యామి తతో గర్భం న్పృష్ట్వాహం తే స్తనౌశుభే | భవిష్యతి శుభో గర్భోదేవి శక్ర నిఘాదనః || 34

:- ప్రత్యంగ పూజ :-

బ్రహ్మణ ఆని పాదాలు, సౌభాగ్యదాయ అని పిక్కలు, విరించయే అని ఊరువులు, మన్మధాయ అని నడుము, స్వచ్ఛోదరాయ అని యుదరము, అతంద్రాయ (ఎట్టి తొందరపాటు లేనివాడని యర్ధము) వక్షమును, పద్మ ముఖాయ యని ముఖమును, వేదపాణయే అని బాహువులు సర్వాత్మనే అని శిరస్సును బూజంచి పద్మమును గూడ పూజించవలెను. అటుపై సూర్యోదయమందా కుంభమును విప్రునకీయవలెను. భోనముం బెట్టవలెను. తా నుప్పు లేకుండ భోజనము సేయనగును. సర్వలోక పితామహుడు భగవంతుడు బ్రహ్మ. ఆయన సర్వలోకాంతరంగము లందనంత మూర్తియైయున్నాడు. ఆయన నా చేసిన వ్రతము వలన ప్రీతినందుగాక : అని వ్రతమును పరమేశ్వరార్పణము సేయవలయును. ఇట్లు ప్రతి మాసము పూర్ణిమ నాడుపవాసముచేసి యీ వ్రతమాచరింపవలెను. పండొకటి తని రాత్రి నేలపై పరుండవలెను. పదమూడవ నెల రాగానే ఘృతధేనువుతో పరుపు తలగడ మొదలయిన సామాగ్రితో శయ్యాసమర్పణము బ్రహ్మకు సేయవలెను. బ్రహ్మ విగ్రహమును బంగారముతో సావత్రీదేవిని వెండితో గావించి బ్రహ్మను సావిత్రి నుద్దేసించి వారుగా భావించి ఒక బ్రాహ్మణుని ఆయన భార్యను చక్కని భూషణములతో బూజించి యధాశక్తి గోదాన సువర్ణాది దానములు సేయవలెను. బ్రహ్మ నామములు సెప్పుచు తిలలతో హోమము సేయవలెను. ఆవు నేతితో పాయసముతో బ్రాహ్మణ సంతర్పణము సేసి పూలమాలలతో దక్షిణలనీయవలెను. పురుషుడుగాని స్త్రీ గాని యీ వ్రతము నేసిన వారు సర్వపాప విముక్తులై బ్రహ్మ సాయుజ్యమందుదురు. ఇహమందు పుత్ర సౌభాగ్యము నందుదురు. బ్రహ్మయనగా నానందస్వరూపుడగు పరమాత్మ విష్ణువు మహేశ్వరుడును. సుఖము కావలయుననువారు కామస్వరూపమున బ్రహ్మను స్మరింపవలెను. ఇదంతయు విని దితి యీ వ్రతము పూర్తిగావించెను. వ్రతమహిమచే కశ్యపుడు మిక్కిలి కృశించిన దితికి మంచిదార్ఢ్యమిచ్చి రూపలావణ్యవతిం గావించి వరము గోరుమన యింద్రుని జంపగల శక్తిమంతుని కొడుకునిమ్మని కోరెను. బ్రహ్మ ''సరే యిత్తునుగాని ఓ సుస్తని : పుత్రీయమగు అపస్తంబేష్టిని జేసి నీ పాలిండ్లం దాకి నీకు గర్భముంబొనరింతును. దాన నీ కింద్రునింజంపు శిశువు గలుగగలడనియె. 35

ఆవంస్తబీం తతశ్చక్రే పుత్రేష్టిం ద్రవిణాధికాం | ఇంద్ర శత్రో ! భవస్వేతి జుహావచ హవిస్త్వరన్‌ || 36

దేవాశ్చ ముముదుర్ధైత్యా విముఖాశ్చైవ దానవాః | దిత్యాం గర్భమథాదత్త కశ్యపః ప్రాహతాం పునః || 37

ముఖంతే చంద్రప్రతిమం స్తనౌ బిల్వఫలోపమౌ | అధరౌ విద్రుమాకారౌ వర్ణ శ్ఛాతీవశోభసః || 38

త్వాం దృష్ట్వా హం విశాలక్షి విస్మరామి స్వకాంతనుం | తదేవం గర్భ స్సుశ్రోణి హస్తే నోప్త స్తనౌ తవ || 39

త్వ యా యత్నో విధాతవ్యో హ్యస్మిన్‌ గర్భే వరాననే సంవత్సరం శతం చైకమసి న్నేవ ఉపోవనే || 40

అవల కశ్యపప్రజాపతి బహుధన సాధ్యమైన అపస్తంభేష్టిని గావించి- ''ఇంద్రశవ్రోభవస్య ఓ ఇంద్రశత్రువ పుట్టుమని'' తొందరపడుచు హోమము సేసెను. అపుడు దేవతలు దైత్యులానందపడిరి. దానవులు పెడమొగమైరి. కశ్యపుడామెయందు గర్భాదానము నేసెను. సేయుచు నామెంగని నీ మొగము చంద్రబింబము స్తనములు మారేడుపండ్లు పెదవులు పవడపు సొంపుగలవి నీ మేనిరంగు పరమశోభనము నిన్ను జూచి ఓ విశాలాక్షి ! నా యొడలేను మరచితిని, ఓ శుశ్రోణి: (చక్కని పిరుదులు గలదానా : ఇక్కడ యిది సాభిప్రాయ విశేషణము) నీ శరీరమునందు గర్భము (శిశువు) నాచేత నుంపబడినది. ఇదే తపోవనమందీవు వందసంవత్సరములు నియమానుసారము గర్భము ధారణము సేయవలెను.

సంధ్యాయాం నైవభోక్తవ్యం గర్భిణ్యా వరవర్ణిని | న స్థాతవ్యం నగంతవ్యం వృక్షమూలేషు సర్వదా || 41

మోపస్కరేషు నివిశే న్మునలో లూఖలాదిషు | జలం చ నావగాహేత శూన్యాగారం చ వర్జయేత్‌ || 42

వల్మీకేషు నతిష్ఠేత న చోద్విగ్న మనా భ##వేత్‌ | న నఖేన లిఖే ద్భూమౌ నాంగారే నచ భస్మని || 43

న శయాలు స్సదా తిష్ఠే ద్వ్యాయామంచ వివర్జయేత్‌ | న తుషాంగార భస్మాస్థి కపాలేషు సమావిశేత్‌ || 44

వర్జయే త్కలహం లోకే గాత్రాభ్యంగం తథైవచ | సముక్తకేశ తిష్ఠేత నాశుచి స్స్యా త్కథంచన || 45

నశయీ తోత్తరశిరా నచైవాధశ్శిరాఃక్వచిత్‌ | న వస్త్ర హీనా నోద్విగ్నా నచార్ద్ర చరణా సతీ || 46

నామంగల్యాం పదే ద్వాచం నచ హాస్యాధికా భ##వేత్‌ | కుర్యా చ్చాగురుభి ర్నిత్యం పూజాం మాంగల్య తత్పరా ||

సర్వౌషధీభిః సృష్టేన వారిణా స్నాన మాచరేత్‌ | కృత రాక్షాతు శుశ్రూషా వాచా పూజన తత్పరా ||

తిష్ఠ్రేత్ప్రసన్న వదనా భర్తుఃప్రియహితే రతా | నగర్హయేచ్ఛ భర్తారం సర్వావస్థ మపి క్వచిత్‌ || 49

క్భశాహం దుర్బలా చైవ వార్థక్యం మమ చాగతం | స్తనౌ చ చలితౌ స్థానా న్ముఖం చ వలిభంగురమ్‌ || 50

ఏవం విధా త్వయా చాహం కృతేతి నపదేత్క్వచిత్‌ | స్వస్త్యస్తుతే గమిష్యామి తథేత్యుక్త స్తయాపునః || 51

శ్యతాం సర్వభూతానాం తత్రైవాంతరధీయత | తతస్సా భర్త వాచోక్త విధినా సమతిష్ఠత || 52

-: గర్భిణీనియమములు :-

xqsLiÇÁ®ªs[ÎÏÁ ˳Ü[ÇÁƒ«sLi }qs¸R…VLSµR…V. ¿ÁÈýÁ®ªsVVµR…ÌÁ ¬sÌÁVª«sLSµR…V. @¼½¬súµR…F¡LSµR…V. L][ÌÁV L][NRPÖÁ ®ªsVVµR…ÌÁLiVVƒ«s ªy¬s ÇÜ[ÖÁNTPF¡LSµR…V. ¬dsÉÓÁÍÜ[ µj…gRiLSµR…V, aRPWƒ«sùgRiXx¤¦¦¦ª«sVV ¿]LRiLSµR…V, xmsoÈíÁÌÁVƒ«sõ¿][ÈÁ ¬sÌÁVª«sLSµR…V. ª«sVƒ«sryLiµ][ÎÏÁƒ«s xms²R…LSµR…V. ®ƒs[ÌÁ„dsVµR… ËÜgæRiVÌÁÍÜ[ ‡ÁW²T…µR…ÍÜ[ g][ÉÓÁ»][ LS¸R…VLSµR…V. FsxmsöV²R…V xmsLi²R…VN]¬s ¸R…VVLi²R…LSµR…V. ªyù¸R…Wª«sVª«sVV (aRPLkiLRiúaRPª«sV) ª«sWƒ«sª«sÛÍÁƒ«sV. ENRPF~ÌýÁV, ËÜgæRiVÌÁV, ‡ÁW²T…µR…, ¹¸…Vª«sVVNRPÌÁV, xmsoúlLiÌÁVƒ«sõ¿][ÈÁ gRiWLRiVèLi²R…LSµR…V. ÍÜ[NRPª«sVV»][ NRPÌÁx¤¦¦¦ª«sW²R…VÈÁ, »R½ÌÁLiÈÁVN]ƒ«sVÈÁ xms¬sNTPLSµR…V. »R½ÌÁ„sLRiËÜ[xqsVN]¬s ¸R…VVLi²R…LSµR…V. @aRPVÀÁgS ƒ«sVLi²R…LSµR…V. D»R½òLRibPLRixqsV=gS Aµ³R…bP+LRixqsV=gS (»R½ÌÁ úNTPLiµj…NTPªyÖÁè ¸R…Vƒ«sõª«sWÈÁ) xmsLi²R…VN]ƒ«sLSµR…V. ‡ÁÈíÁ„sxmsöVN]¬s, Dµj…*gRiõQQ\¹¸…V (ALiµ][×ÁLi¿RÁV¿RÁV) »R½²T… NSÎÏÁþ»][ ƒ«sVLi²R…LSµR…V. @ª«sVLigRiÎÏÁ ˳ØxtsQß᪫sVV }qs¸R…VLSµR…V. FsNRPV䪫s xmsLji¥¦¦¦xqsª«sVV gRiW²R…µR…V. (ƒ«sª«s*gRiW²R…µR…ƒ«sõª«sWÈÁ) ª«sWLigRiÎÏÁù »R½»R½öLRi\¹¸…V ¹¸…VxmsöV²R…V ƒ«sgRiLRiVxmnsVVª«sVxmnsVVª«sVÌÁ»][ ®µ…[ª«s‡ÁWÇÁ }qs¸R…Vª«sÛÍÁƒ«sV. @¬sõ ª«sVWÖÁNRPÌÁV ®ªs[zqsƒ«s ¬dsÈÁ ryõƒ«sª«sVV ¿Á[¸R…Vª«sÛÍÁƒ«sV. @LigRiLRiORPQ }qszqsN]¬s ª«sVLiÀÁª«sWÈÁÌÁV „sƒ«sg][LRiV¿RÁV ª«sVLiÀÁ ª«sWÈÁÌÁ»][ ‡ÁWÑÁLi¿RÁV¿RÁV ˳ÏÁLRiòz¤¦¦¦»R½®ªs[ ¬s»R½ùª«sVV g][LRiV¿RÁV ƒ«sª«so*®ªsVVgRi\®ªsV ¸R…VVLi²R…ª«sÛÍÁƒ«sV. G ¸R…Vª«sxqósÍÜ[\®ƒsƒ«s ˳ÏÁLRiò ƒ«sxqsz¤¦¦¦ùLi¿RÁVN]ƒ«sLSµR…V. ÀÁNTPäF¡¸R…Wƒ«sV ‡ÁÌÁ{¤¦¦¦ƒ«s\®ƒs¼½¬s ƒyNRPV ª«sVVxqsÖÁ»R½ƒ«sª«sVV ª«sÀÁ胫sµj…. NRPV¿RÁª«sVVÌÁV xmsÈíÁV»R½zmsö ÇØLjiF¡LiVVƒ«s„s ®ªsVVgRiª«sVV ª«sVV²R…V»R½ÌÁV xms²T…ƒ«sµj… @¬s ¬ds¿Á[ ¬sÈýÁV gS„sLixms‡Á²T…¼½ƒ«s„s ¹¸…Vƒ«sõ²R…V ª«sVgRi¬sƒ«sƒ«sLSµR…V. aRPV˳ÏÁª«sVgRiVgSNRP ¬dsNRPV ®ªsÎÏÁ§þ¿RÁVƒyõƒ«s¬s, ª«sVLiÀÁµR…¬s ¸R…W®ªsV¿Á[ ƒ«s¬szmsLi¿RÁVN]¬s xqsLRi*˳ÏÁW»R½ª«sVVÌÁV xqsW¿RÁV¿RÁVLi²R… úxmsÇØxms¼½ ¸R…VNRPä²R…®ƒs[ ª«sVàáVgRi¹¸…Vùƒ«sV A®ªsV¸R…VV ˳ÏÁLRiò|qszmsöƒ«sÈýÁV ¸R…VÈÁƒ«sVLi®²…ƒ«sV. 52

-: ఇంద్రకృతగర్వభంగః :-

అథ జ్ఞాత్వా తథేంద్రో7పి దితేః పార్శ్వ ముపాగతః | మిహాయదేవసదనం తాం సూశ్రూషు రవస్థితః || 53

దితే శ్చిద్రాంతర ప్రేప్సు రభవ త్పాకశాసనః|విపరీతోంతరవ్యగ్రః ప్రసన్నపదనోబహిః || 54

అజానన్నివ తత్కార్య యాత్మన శ్శుభమాచరన్‌ | తతో వర్షశతాంతే సా న్యూనేతు దివనైస్త్రిభిః || 55

మేనే కృతార్థ మాత్మానం ప్రీత్యా విస్మితమానసా | అకృత్వా పాదయో శ్చౌచం శయానాముక్త మూర్ధాజా || 56

నిద్రాభర సమాక్రాంతా దివా పరశిరాఃక్వచిత్‌ | తత స్తదం తరం లబ్ధ్వా ప్రవిశ్యాంత శ్శచీపతిః || 57

వజ్రేణ సప్తధా చక్రే తం గర్భం త్రిదశాధిపః | తతస్సప్త చ తే జాతాః కుమారా సూర్యవర్చసః || 58

రుదంత స్సప్త తే బాలా నిషిద్థా దానవారిణా | భూయో7పి రుదమానాం స్తానేకై కాన్‌ సప్తధా హరిః || 59

చిచ్ఛేద వజ్రహస్తోవై పునస్తూదర సంస్థితాన్‌ | ఏవ మేకోన పంచాశత్‌ భూత్వా తే రురుదుర్భృశన్‌ || 60

ఇంద్రో నివారయా మాన మారుదధ్వం పునః పునః | తతస్స చింతయావాస వితర్క మితి వృత్రహా || 61

-: దితికింద్రుడు సేసిన ద్రోహము :-

ఇంద్రుడిది యెఱింగి దేవసదనమెడలి యామె (శుశ్రూష) చెప్పినట్లు వినగోరి (సేవింపగోరి) యామెవద్ద కేతెంచెను. ఆమె యేదైన పొరబడునా చూతమని లోన దురభిప్రాయమూని పైకేతొందరపాటు లేనివాడట్లు ప్రసన్న ముఖుడై తన మంచికోరి ఆమెసంగతి యేమియు నెఱుగనట్లు నటించుచుండెను. మూడురోజులు తక్కువ యేడాది యైనంతట నామె తాను ధన్యురాలనైతిననుకొనుచు వింతవడుమనసుతో నొకతఱి పొరపాటున కాళ్ళుకడుగుకొనగ తల విరియబోసికొని పెన్నిద్దురగ్రమ్మ పగలుత్తరతలాడగా పండుకొనెను. శచీపతి యా యంతరమెఱింగి ముప్పదికోట్ల కధిపతియగు నాతడు వజ్రముచే నామెగర్భము వేడువ్రక్కలు గావించెను. ఏడుగురుగపుట్టి యామె కుమారులు సూర్య తేజస్వులేడ్ఛుచుండ నేడువకుడని సురారిచె నాపబడియు మఱియు నేడ్చుచున్నవారి నొక్కొక్కరి నేడు తునుకలు గావించి నాడాహరి (ఇంద్రుడు) కడుపులోని శిశువులనట్లు నలుబదితొమ్మిది తునుకలు సేసినంత వారెంతేని యేడ్చిరి. ఇంద్రు డేడ్వవలదని మఱి మఱి వారించుచు తనలోనిట్లు తర్కించుకొనెను.

కర్మణః కస్య మహాత్మా త్పు న స్సం జీవితా అమీ | విదిత్వా పుణ్య యోగేన పౌర్ణమాసీఫలం త్విదం || 62

నూన మేతత్పరిణత మథవా బ్రహ్మపూజనాత్‌ | వజ్రేణాభి హతాస్సంతో న వినాశ ముపాయయుః || 63

ఏకో7ప్యనేకతామాప యస్మాదుదర గోపనం | అపధ్యానూన మేవైతే తస్మాద్ధేవా భవంత్వితి || 64

యస్మా న్మారుచ ఇత్యుక్తా రుదంతో గర్భ సంభవాః | మరుతో నామ తే నామ్నా భవంతు సుఖభాగినః || 65

తతః ప్రసాద్య దేవేశః క్షమస్వేతి దితిం పునః | అర్ధశాస్త్రం సమాస్థాయ మయైత ద్దుష్కృతం కృతం || 66

కృత్వా మరుద్గణం దేవై స్సమాన మమరాధిపః | దితిం విమాన మారోప్య ససుతా మగమద్దివమ్‌ || 67

యజ్ఞభాగ భుజస్సర్వే మరుతస్తే తతో7భవన్‌ | న జగ్మురైక్య మసురై రతస్తే సురవల్లభాః || 68

కర్మ ప్రభావమెద్ధాన వీరు పునరుజ్జీవితులైనారు? అని పూర్ణిమావ్రత ఫలము కాబోలును. ఆ పుణ్యము పండినది. లేదా బ్రహ్మపూజా ప్రభావము కావచ్చును. వజ్రహతులయ్యు నిహతులైపోరు. ఒక్కడు పెక్కురైనారు. దితి గర్భరక్షణమంత జాగ్రత్తగా సేసికొన్నది వీరవధ్యులగుట నిశ్చయము. కావున వీరు దేవతలేయై సుఖభాగు లగుదురు గాక (అనుకొనెను) ఆ పై నమరవతి క్షమింపమని దితిని వేడుకొని ప్రసన్నురాలిం గావించుకొని మఱియు నేనర్ధశాస్త్రముననుసరించి యీ పాపమొనరించితినని యామరుత్తులను దేవతుల్యులనిగా గావించి వారితో దితిని విమాన మెక్కించుకొని స్వర్గమేగెను.

భీష్మ ఉవాచ :

అదిసర్గ స్త్వయా బ్రహ్మన్‌ కధితో విస్తరేణమే | ప్రతిసర్గశ్చ యో యేషామధి పాం స్తా న్వదస్వమే 69

-: ప్రతి సర్గకథనమ్‌ :-

పులస్త్య ఉవాచ :

యదాభిషిక్త న్సకలే7పి రాజ్యే పృథుర్ధరిత్ర్యా మధిపో భభూవ

తదౌషధీనా మధిపం చకారయజ్ఞవ్రతానాం తపసాం చ సోమమ్‌

నక్షత్ర తారా ద్విజవృక్ష గుల్మ లతా వితానస్య చ రుక్మగర్భః

అపా మధీశం వరుణం ధనానాం రాజ్ఞాం ప్రభుం వైశ్రవణం చతద్వత్‌ 70

విష్ణుం రవీణా మధిపం వసూనామగ్నిం చ లోకాధిపతిం చకార

ప్రజాపతీనా మధిపం చ దక్షం చకార శక్రం మరుతా మధీశమ్‌ 71

దైత్యాధిపానా మధదానవానాం ప్రహ్లాద మీశం చ యమం పితౄణామ్‌

పిశాచ రక్షః పశుభూత యక్షవేతాలరాజం హ్యథ శూలపాణిమ్‌ 72

ప్రాలేయశైలం చ ప పతిం గిరీణా మీశం సముద్రం సరితా మధీశం

గంధర్వ విధ్యాధర కిన్నరాణా మీశం పుస శ్చిత్ర రథం చకార 73

నాగాధిపం వాసుకి ముగ్రవీర్యం సర్పోధిపం తక్షక మాది దేశ

దిగ్వారణానా మధిపం చకార గజేంద్ర మైరావత (ణ) నామధేయమ్‌ 74

సువర్ణ మీశం పతతా మథార్వతాం రాజాన ముచ్చైశ్రవ సం చకార

సింహం మృగాణాం వృషభం గవాం చ ప్లక్షం పున స్సర్వ వనస్పతీనాం 75

ఆదిసర్గ మెరిగించితి విక ప్రతిసర్గమున అధిపతులెవ్వరో వారి దెలుపుమని భీష్ముడన పులస్త్యుండిట్లనియె.

-: ప్రతిసర్గము :-

పృథువు సర్వసామ్రాజ్య చక్రవర్తిగ నభిషిక్తుడైనంత బ్రహ్మ నా రుక్మగభం (హిరణ్యగర్భుడు) సోముని (చంద్రుని) ఓషధీశునింగావించెను. యజ్ఞములకు వ్రతములకు తపస్సులకు నక్షత్రములకు ద్విజులకు చెట్లు గుల్మములు లతలకుం గూడ ప్రభువుం గావించెను. అప్పలకు (జలిములకని సామాన్యార్థము) వరుణుని ధనపతింగా కుబేరుని ఆదిత్యులకు విష్ణువును వసువుల కగ్నిని ప్రజాపతులకు దక్షుని మరుత్తులకు శుక్రుని దైత్యరాజులకు దానవులకు ప్రహ్లాదుని పితరులకు యముని పిశాచ రక్షః పశు భూత యక్ష వేతాళములకు శూలపాణిని గిరులకు హిమవంతుని నదులకు సముద్రుని గంధర్వ విద్యాధర కిన్నరులకు చిత్రరధుని రాజుంగావించెను. నాగులకు వాసుకిని సర్పములకు తక్షకుని దిగ్గజముల కైరావతమును పక్షులకు సువర్ణుని (గరుడుని) గుఱ్ఱములకుచ్చైశ్ర్శవమును మృగములకు సింహమును గోవులకు వృషభమును సర్వవనస్పతులకు ప్లక్షము (జువ్విని) ప్రభువుం జేసెను.

పితామహః పూర్వమథాభిషించ దేతాస్పున స్సర్వ దిశాధినాథాన్‌

పూర్వేతుదిక్పాల మథాభ్యషించ న్నామ్నా సువర్మాణ మరాతి కేతుమ్‌|| 76

తతో7ధిపం దక్షిణత శ్చ కార సర్వేశ్వరం శంఖపదాభిధానం

సుకేతుమంతం దిగధీశ మీశం చకార పశ్చాద్భువనాండ గర్భః || 77

హిరణ్యరోమాణ ముదగ్దిగీశం ప్రజాపతిం మేఘసుతం చకార

అద్యాపి కుర్వంతి దిశా మధీశాః సదావహంతస్తు భువో7భిరక్షాం 78

చతుర్భిరేతైః పృథునామధేయో నృపో7భిషిక్తః ప్రథమః పృథివ్యాం

గతే7ంతరే చాక్షుషనామధేయే వైవస్వతం చక్రు రిమం పృథివ్యామ్‌ || 79

గతే7ంతరే చాక్షుపనామధేయే వైవస్వతాఖ్యే చ పునః ప్రవృత్తే

ప్రజాపతి స్పో7స్య చరాచరస్య బభూవ సూర్యాన్వ యజస్సచిహ్నః 80

ఆమీద దిక్పతులకు పట్టాభిషేకము సేసెను. తూర్పున సువర్మసు దక్షిణమున శంఖుని పడమట సంకేతు మంతుని ఉత్తరమున హిరణ్యరోముని మేఘసుతుని బ్రజాపతినిగా నొనరించెను. వీరిప్పుడును భూ రక్షణ భారమూనియున్నారు. పృథవను పేరుగల రాజు మొట్టమొదటివాడీ దిక్పతులు నల్వురచేత పట్టాభిషిక్తుడైనాడు. చాక్షుషమన్వంతరము తర్వాత వైవస్వతమన్వంతరమందు సూర్యవంశీయుడు సార్వభౌమ చిహ్నములు గలవాడై యీ పృధువు చరాచరమునకెల్ల ప్రజాపతి మయ్యెను.

పుతస్త్య ఉవాచ :

మన్వంతరాణి సర్వాణి మనూనాం చరితాని యత్‌ | ప్రమాణం చైవ కల్పస్య తత్‌ సృష్టించ సమావతః 81

ఏవచిత్తః ప్రసన్నాత్మా శ్రుణు కౌరవనందన | యామా నామ పురా దేవా ఆసన్‌ స్వాయంభు వాంతరే || 82

నపై#్తవ ఋషయః పూర్వం యే మరీచ్యాదయః స్మృతాః | అగ్నీధ్ర శ్చాగ్ని బాహుశ్చ విభుస్సవన ఏవచ || 83

జ్యోతిష్మాన్‌ ద్యుతిమాన్‌ భవ్యో మేధాః మేథాతిధిర్వసుః | స్వాయంభువ స్యాస్యమనోర్దశైతే వంశవర్ధనాః || 84

ప్రతిసర్గ మమీకృత్వా జగ్ముస్తే పరమం పదమ్‌ | ఏవం స్వాయంభువః ప్రోక్తం స్వారోచిషమతః పరమ్‌ 85

స్వారో చిషస్థు తనయా శ్చత్వారో దేవవర్చసః | నభో నభస్యం ప్రభృతి ర్భావనః కీర్తి వర్ధనః || 87

దత్తో7గ్ని శ్చ్య వనః స్తంభః ప్రాణః కశ్యప ఏవచ | అర్వా బృహస్పతి శ్చైవ సప్త సప్తర్షయో7భవన్‌ || 88

తదా దేవాశ్చ తుషితాః స్మృతాః స్వారోచిషే7ంతరే | హవీంద్రః సుకృతో మూర్తి రాపో జ్యోతీరథ స్మృతః 89

వశిష్ఠస్య సుతాస్సప్త యే ప్రజాపతయ స్తదా | ద్వితీయ మే తత్కధితం మన్వంతర మతః పరమ్‌ || 90

అన్యచ్చైవ ప్రవక్ష్యామి తథా మన్వంతరం శుభం | మనూనా మౌత్త మిస్తత్ర దశపుత్రా నజీజనత్‌ || 91

ఇష ఊర్జ స్తనూజశ్చ శుచిశ్శుక్ర స్తథైవచ | మధుశ్చ మాధవశ్చైవ నభస్యో7థనభ స్తథా || 92

సహస్సహ స్య ఏతేషా ముత్తమః కీర్తివర్ధనః | మానవ స్తత్ర దేవాస్స్యు రూర్జా స్సప్తర్షయః స్మృతాః || 93

కౌకభిండిః కుతండశ్చ దాల్భ్యః శంఖః ప్రజాపతిః | మితిశ్చ సం మితిశ్చైవ నపై#్తతే యోగవర్థనాః || 94

మన్వంతర చతుర్ధంతు తామసం నామ విశ్రుతం | కపి పృస్థు స్తథైవాగ్ని రకపిః కవిరేవచ || 95

తదైష జన్య ధామానే మునయ స్సప్తనామతః | సాధ్యా దేవగణాయే చ కధితా స్తామసేంతరే || 96

అకల్మష తపోధన్వీ తపోమూల స్తపోధనః | తపోరాశి స్తపస్యశ్చ సుతపస్యః పరంతపః || 97

తామసస్య సురాస్సర్వే దశవంశ వివర్దనాః | పంచమస్య మనోస్తద్వ ద్దైవ తస్యాంతరం శ్రుణు || 98

దేవబాహు స్సుబాహుశ్చ పర్జన్య స్సమయో మునిః | హిరణ్య రోమా స్తప్తాశ్వః సపై#్తతే ఋషం స్మృతాః || 99

దేవాశ్చ భూతరజసః తథాప్రకృతయః స్మ్పతాః | అవశస్తత్వదర్శీచ వీతిమాన్‌ హవ్యపః కపిః || 100

ముక్తో నిరుత్సుక స్సత్వో నిర్మోహో7ధ ప్రకాశకః | ధర్మవీర్య బలోపేతా దశైతే రైవతాత్మజాః || 101

భృగు స్సుథామా విరజ స్స హిష్ణు ర్నారద స్థథా | వివస్వాన్‌ కృతి నామాచ సప్తసప్తర్షయో7పరే || 102

పులస్తుడనియె. సర్వమన్వంతరములు వసువుల చరిత్రలు కల్పప్రమాణము సృష్టినిగూర్చి ప్రసన్న మనస్కుడవై ఆలింపుము. స్వాయంభువాంతరములో యాములను దేవతలుండిరి. మరీచ్యాదులు ఋషులు మున్నేడ్వురే. అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, విభువు, సవనుడు, జ్యోతిష్మంతుడు, ద్యుతిమంతుడు, భవ్యుడు, మేథ, వసువు మేథాతిథి, నను వీరు పదిమంది స్వాయంభువ వంశవర్ధనులు. వీరు ప్రతిసర్గమునేసి పరమపదమందిరి. ఇది స్వాయంభువ మన్వంతర విషయము.

-: స్వారోచిషమన్వంతరము :-

స్వారోచిషమనువు కొడుకులు నల్గురు. దేవతావర్చస్కులు. సభుడు నభస్యుడు ప్రభృతి భావనుడు; కీర్తివర్ధనుడు దత్తుడు అగ్నిచ్యవనుడు స్తంభుడు ప్రాణుడు కశ్యపుడు బృహస్పతి యను నేడుగురప్పుడు సప్తర్షులు, అపుడు దేవతలు తుషితులనబడిరి. వారు హవీంద్రుడు సుకృతుడు మూర్తి, ఆపుడు జ్యోతిరథుడు నను నేడ్వురు. వీరు వశిష్ఠసుతులు. ప్రజాపతులు. ఔత్తమిమన్వంతరము : ఔత్తమికి పదిమంది కొడుకులు. ఇషుడు ఊర్జస్సు శుచి శుక్రుడు మధుడు మాధవుడు నభస్యుడు నభస్సు సహుడు సహస్యుడు అందు దేవత లూర్జులు. సప్తర్షులనబడిరి. వారుకాక భిండి కుతండుడు దాల్భ్యుడు శంఖుడు ప్రజాపతి మితి సంమితి అనువారేడ్వురు. నాల్గవ మన్వంతరము తామసము. కపి పృస్థువు అగ్ని రకపి కవి ఈషుడు జన్యధాముడు ననువారిందు సప్తర్షులు. సాధ్యులు దేవగణములు అకల్మషతపుడు ధన్వి తపోమూలుడు తపోరాశి తపస్యుడు సుతపస్యుడు పరంతపుడు ననువారు పదిమంది. (సంఖ్యసరిపోలేదు) పంచమమన్వంతరము నందు దేవబాహువు సుబాహుపు పర్జన్యుడు సమయుడు ముని హిరణ్య రోముడు సప్తాశ్యుడు ననువారేడ్వురు ఋషులు. ఇందు దేవతలు పదిమంది. భూతరజస్సు (ప్రకృతులనియు వీరిపేరు) అవశుడు తత్వదర్శి వీతిమంతుడు హవ్యపుడు కపిముక్తుడు, నిరుత్సకుడు, సత్వుడు, నిర్మోహుడు, ప్రకాశకుడు, ధర్మవీర్యుడు బలోపేతుడు 102

చాక్షుషస్యాంతరే ప్రాప్తే దేవానాం పంచ మోజనః | రురుప్రభృతయస్త ద్వ చాక్షుషస్య సుతా దశ || 103

భృగువు సుదాముడు సహిష్ణువు నారదుడు వివన్వంతుడు కృతి ననువారు సప్తర్షులు. చాక్షుషమన్వంతర మందు దేవతలలో నైదవవాడు జనుడు చాక్షుషకుమారులు రురువు మొదలగువారు. 103

ప్రోక్తాః స్వయంభువే వంశే యే మయా పూర్వమేవతే | అంతరం చాక్షుషం చైవ మ యాతే పరికీర్తితమ్‌ || 104

సప్తమం చ ప్రవక్ష్యామి యద్వైవస్వత ముచ్యతే | అత్రిశ్చైవ వశిష్ఠశ్చ కశ్యపో గౌతమ స్తథా || 105

భారద్వాజస్తథా యోగీ విశ్వామిత్రః ప్రతాపవాన్‌ | జమదగ్ని శ్చ నపై#్తతే సాంప్రతం తే మహర్షయః || 106

కృత్వా ధర్మవ్యవస్థానం ప్రయాంతి పరమం పదం | సావర్ణ్యస్య ప్రవక్ష్యామి మనోర్భావి తధాంతరమ్‌ || 107

అశ్వత్థామా శరద్వాంశ్చ కౌశికో గాలవస్తథా | శతానందః కాశ్యపశ్చ రామశ్చ ఋషయః స్మృతాః || 108

ధృతి ర్వరీయాన్యవసు స్సువర్ణో ధృతి రేవచ | వరిష్ణువీర్య స్సుమతిర్వసు శ్శుక్రశ్చ వీర్యవాన్‌ || 109

భవిష్య స్కార్క సావర్ణే ర్మనోః పుత్రాః ప్రకీర్తితాః | రౌచ్యాదయ స్తథాన్యేపి మనవ స్సంప్రకీర్తితాః || 110

రుచేః ప్రజాపతేః పుత్రో రౌచ్యోనామ భవిష్యతి | మను ర్భూతిసుతస్తద్వ ద్భౌత్యోనామ భవిష్యతి || 111

తతస్తు మేరుసావర్ణి ర్ర్బహ్మసూను ర్మనుః స్మృతః | ఋభు శ్చ ఋతుదామో విష్వక్సేనో మనుస్తథా || 112

అతీతా నాగతాశ్చైవ మనవః పరికీర్తితాః | వర్షాణాం యుగ సాహస్ర మేభిర్వ్యాప్తం నరాథీప || 113

స్వేస్వే7ంతరే సర్వమిదం సముత్పాద్య చరాచరం || కల్పక్షయే నివృత్తేతు ముచ్యంతే బ్రహ్మణాసహ || 114

అమీయుగ సహస్రాంతే వినశ్యంతి పునః పునః | బ్రహ్మాద్యా విష్ణుసాయుజ్యం తతో యాస్యంతివైనృప || 115

ఇతి శ్రీ పద్మపురాణ ప్రథమే సృష్ఠిఖండే మన్వంతరవర్ణనం నామ సప్తమో7ధ్యాయః

స్వాయంభువమన్వంతరము నందలి ఋషులను దేవతలనింత మున్నదెల్పితిని. చాక్షుషాంతరము నిదివరకే తెల్పితిని. ఇక వై వస్వతము సప్తమము. అత్రి వశిష్ఠుడు కశ్యపుడు గౌతముడు భారధ్వాజుడు (యోగి) విశ్వామిత్రుడు(ప్రతాపశాలి) జమదగ్ని వీరేడ్వురు నిపుడు సప్తర్షులు. వీరు ధర్మవ్యవస్థసేసి పరమపదమందుదురు. రాబోవు సావర్ణిమన్వంతరమున అశ్వత్థామ శరద్వంతుడు కౌశికుడు గాలివుడు శతానందుడు కాశ్యవుడు (పరశు) రాముడు సప్తర్షులగుదురు. ధృతి వరీయుడు, యవనువు, సువర్ణుడు, ధృతి, వరిష్ణు, వీర్యుడు, సుమతి వసువు, శుక్రుడు రాబోవు అర్కసావర్నిమన్వంతరమందు మనుపుత్రులు వీరు. రౌచ్యాదులు మరికొందరు నిందు మానవులనబడుదురు. రుచి ప్రజాపతి కొడుకు రౌచ్యుడు భూతి కొడుకు భౌతి మేరుసావర్ణి బ్రహ్మకొడుకు బుభుడు ఋతుదాముడు విష్వక్సేనుడు మానవులగురు.

గడచినవారు రాగలవారునగు మనువులం గీర్తించితిని. వేయియుగాల కాలము వీరిచే వ్యాప్తమైనది. తమ తమ యంతరమందే మానవులు చరాచర ప్రపంచ సృష్టిసేసి కల్పక్షయమందు బ్రహ్మతోగూడ వీరు ముక్తులగుదురు. వీరు వేయియుగముల చివర తిరిగి తిరిగి నశింతురు. అప్పుడు బ్రహ్మాదులు విష్ణుసాయుజ్యమందుదురు.

ఇది మన్వంతరవర్ణనమను సప్తమాధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters