Sri Padma Mahapuranam-I    Chapters   

ద్వాత్రింశోధ్యాయః

తీర్థావతారమ్‌

భీష్మ ఉవాచ :- కేన కర్మవిపా కేన ప్రేతత్వం జాయతే పునః ||

కేనవాత్ర ప్రముచ్యేత తన్మే బ్రూహి మహామతే | 1

పులస్త్య ఉవాచ :- అహం తే కథయిష్యామి సర్వమేతదశేషతః ||

యచ్ఛ్రుత్వా న పునర్మోహం యాస్యతే నృపనత్తమ |2

యేన జాయేత ప్రేతత్వం యేన చాస్మాత్ర్పముచ్యతే | ప్రాప్నోతి నరకం ఘోరం దుస్తరం త్రిదశైరపి || 3

సతాం సంభాషణ చైవ పుణ్యతీర్థానుకీర్తనే | మానవాస్తు ప్రముచ్యంతా ఆపవ్నాః ప్రీతయోనిషు || 4

శ్రూయతే హి పురా భీష్మ బ్రాహ్మణః సంశ్రితవ్రతః | పృధ్వీస్పర్వత్ర విఖ్యాతః సంతోషే చ సదాస్థితః || 5

స్వాధ్యాయయుక్తో గేహేషు నిత్యయోగశ్చ యోగవిత్‌ | జపయజ్ఞ విధానేన యుక్తం కాలం క్షిపేచ్చ సః || 6

యుక్తః క్షమాదయాభ్యాం చ క్షాంత్యా యుక్తశ్చ తత్త్వవిత్‌ | అహింసాహితచిత్తశ్చ మార్దవే చ తథా స్థితః || 7

బ్రహ్మచర్యసమాయుక్తస్తపోయోగసమన్వితం | యుక్తః స పితృకార్యేషు యుక్తో వైదిక కర్మసు || 8

పరలోకభ##యేన యుక్తో యుక్తస్సత్యవచః వ్రతీ| యుక్తో మధురవా క్యేషు యుక్తశ్చాతిథిపూజనే ||9

ఇష్టాపూర్తసమాయుక్తో యుక్తో ద్వంద్వవివర్జనే | స్వకర్మవిధిసంయుక్తో యుక్తః స్వాధ్యాయకర్మసు || 10

ఏవం కర్మాణి కుర్వతస్సంసార విజిగీషయా | బహూన్యబ్దాన్యతీతాని బ్రాహ్మణస్య గృహే సతః || 11

తస్య బుద్దిరియం జాతా తీరాభిగమనం ప్రతి | పుణ్యౖ స్తీర్థజలై రేతత్ల్కిన్నం కుర్యాం కలేబరమ్‌ || 12

ప్రయతః పుష్కరౌ స్నాత్వా భాస్కరస్యోదయం ప్రతి | కృతజప్యనమస్కారోప్యద్ద్వానం ప్రత్యపద్యత ||13

ముప్పది రెండవ అధ్యాయము

-: తీర్థావతారము :-

భీష్ముడనియె : - 'బుద్దిశాలీ ! ఏ కర్మవిపాకమున ప్రేతత్వము వచ్చును? దేనిచే దానినుండి ముక్తుడగును. అది యెఱింగింపుమన పులస్తుడనియె. 'రాజోత్తమా ! నేనిదియెల్ల సెప్పెదను. ఇది విని మఱి మోహమందువు. సత్పురుషులతో సంభాషించినను, పుణ్యతీర్థములను గొనియాడినను మానవులు ప్రేతత్వమునుండి ముక్తిగందురు. భీష్మా! మున్ను వృథువను బ్రాహ్మణుడు వ్రతనిష్ఠుడు పేరందినవాడు, నిత్య సంతుష్టుడు, స్వాధ్యాయపరుడు యోగజ్ఞుడు, నిత్యయోగ సంపన్నుడు. జపయజ్ఞముచే కాలముంబుచ్చువాడు, క్షమ,దయ, సహనము, క్షాంతి గలవాడు. తత్వజ్ఞుడు , అహింసాపరుడు, మొత్తని మనస్సు గలవాడు, బ్రహ్మచర్యముతో తపోయోగముతో గూడినవాడు, పితృకార్యములందు వైదిక కర్మలందు శ్రద్ధగలవాడు, పరలోక భయము గలవాడు యుక్తాయుక్త విచక్షణ గలవాడు, సత్యవ్రతుడు, తియ్యని మాటలు గలవాడు,అతిథి పూజాపరుడు, ఇష్టాపూర్తములు గలవాడు రాగద్వేషాలు సుఖ దుఃఖాలు మొదలయిన ద్వంద్వములన్నియు వదలినవాడు, స్వకర్మవిధి నిష్ఠుడు, స్వాధ్యాయాది సత్కర్మ నిరతుడు, సంసారమును గెలుచుటకీలా సత్కర్మాచరణము సేయుటలో నీబ్రాహ్మణ గృహస్థునకు పెక్కు సంవత్సరములు గడచినవి. అతనికి తీర్థయాత్రల సేయవలెనను బుద్దిగల్గెను. ఈ కళేబరమును పుణ్యతీర్థములం దడిపెదనని మడిగా నియమముగొని పుష్కరమందు స్నానము సేసి సూర్యోదయమునకు ముందు జపము నమస్కారములు సేసి తనదారిం జనుచుండెను. 13

అగ్రతః పంచపురుషానపశ్యత్సో తిభీషణాన్‌ | వనే కంటకవృక్షాఢ్యే నిర్జనే పక్షివర్జితే | 14

తాన్దృష్ట్వా వికృతాకారాన్‌ సుఘోరాన్‌ పాపదర్శనాన్‌ | ఈషత్సంత్రస్తహృదయో వ్యతిష్ఠన్నిశ్చలాకృతిః || 15

అవలంబ్య తతో ధైర్యం భయముత్సృజ్యం దూరతః | పప్రచ్ఛ మధురాభాషీ కే యూయం వికృతాః || 16

కిం వా చైవ కృతం కర్మ యేన ప్రాప్తాశ్చ వై కృతం | కథమేవంవిధాః సర్వే ప్రస్థితాః కుత్ర చాధ్వని || 17

ప్రేతా ఊచు: - క్షుత్పిపాసాన్వితా నిత్యం మహాదుఃఖసమావృతాః ||

హృతప్రజ్ఞా వయం సర్వే నష్టసంజ్ఞా విచేతసః | 18

న జానీమో దిశం చాపి ప్రదిశం చాపి కాంచన | నాంతరిక్షం మహీం చాపి న జానీమో దివం తథా || 19

యదా తద్దుఃఖమాఖ్యాతమేతదేవ సుఖం భ##వేత్‌ | ప్రభాతమిదమాభాతి భాస్కరోదయదర్శనాత్‌ || 20

అహం పర్యుఫితో నామ సూచీముఖస్తథాపరః | శ్రీఘ్రగోరోహకశ్చైవ వంచమో లేఖకస్తథా || 21

అప్పుడతడు తనముందతిభయంకరుల నైదుగురు పురుషులం జూచెను. వికృతరూపులు భయంకరులు మహాఘోరులను పాపులను వాండ్రంగని యించుక గుండె బెదరి కదలక అట్టే నిలిచెను. ధైర్యము తెచ్చుకొని మధురముగా మీరెవరు? ఎందులకీ వికృత రూపులైనారు? ఈ వికృత రూపము వచ్చుటకే పాడుపని చేసినారు? ఈ విధంగా ఉన్న మీరందరు నెక్కడ కేదారిం బయలుదేరినారని యడుగగా ప్రేతలిట్లనిరి: 'ఎప్పుడు నాకలి దప్పికలందపించుచు తెలివిదప్పితిమి. దిక్కేదో విదిక్కుమూలేదో తెలియము. నింగి నేలయు క్రింద మీదేదో తెలియము. మా దుఃఖమిది తెల్పితిమి. ఇదే మాకు సుఖమగుచున్నది. తెల్లవారినది సూర్యోదయ దర్శనమైనది. నేనుప ర్యుషితుడను, రెండవవాడు సూచీముఖుడు. శీఘ్రగుడు, రోహకుడు ఐదవవాడు లేఖకుడను పేరివాడు, అన బ్రాహ్మణుడిట్లనియె. 21

బ్రాహ్మణ ఉవాచ:- ప్రీతానాం కర్మజాతానాం నామ్నాం వై సంభవః కుతః ||

కింతత్కారణముద్దిశ్య యతో యూయం సనామకాః || 22

ప్రేతా ఊచు:- అహం స్వాదు సదా భుంజే దద్యాం పర్యుషితం ద్విజే ||

ఏతత్కారణమాసాద్య నామ పర్యుషితో మమ | 23

సూచితా బహవోనేన విప్రాశ్చాన్నాద్యకాంక్షిణః | ఏతత్కారణముద్దిశ్య సూచీముఖాభిధో మతః || 24

శీఘ్రం గతోస్మి విప్రేణ యాచితః క్షుధితేన చ || ఏతత్కారణముద్దిశ్య శీఘ్రగో ద్విజసత్తమ || 25

గృహోపరి సదా స్వాదు భుంక్తే ద్విజభ##యేన హి | ఉద్విగ్న మానసస్తత్ర తేనాసౌ రోహకః స్మృతః || 26

మానే చాపి స్థితో నిత్యం యాచితో విలిఖన్మహీం | అస్మాకమపి పాపిష్ఠో లేఖకో నామ నామతః || 27

కర్మవలన బుట్టిన ప్రేతలకు పేరేమి? ఏట్లేర్పిడినవి ? దానికి కారణమేమి? అన ప్రేతలిట్లనిరి. నేనెప్పుడు రుచిగల పదార్థము తినెదను. తిరిగి బ్రాహ్మణునికి పర్యుషితమే పెట్టెదను. ఇందుచేత నాకు పర్యుషితడును పేరు వచ్చినది. అన్నాదులనడిగి వచ్చిన యెందరో విప్రులనితడు ముల్లుతో బొడిచి తిన్నాడు. అందుచే సూచీముఖుడను పేరొందెనువిప్రులేదైన యడుగవచ్చినపుడు నేను శ్రీఘముగా వెళ్ళిపోయితిని. అందుచే శ్రీఘగుడను పేరందితిని. విప్రుల జడిసి ఇంటిపైకెక్కి రుచిగల పదార్థమునే కంగారుపడుచును యెవరైనా అన్నము పెట్టుమని అడుగుదురో యని భయపడుచు నింటిపై నొక్కడు కూర్చుని తానే తినునుగాన వీడు రోహకుడను పేరొందెను. ఇక వీడు మౌనము పట్టి నేలమీద కాలితో రాయుచు నెవ్వడడిగిన బెట్టలేదు. వీడు మమ్ములనందని పాపిష్ఠుడు. లేఖకుడను పేరువాడు. 27

కృచ్ఛ్రేణ లేఖకో యాతి రోహకస్తు అవాక్‌శిరాః | శీఘ్రగః పంగుంతాం ప్రాప్తః సూచీ సూచీముఖోభవత్‌ || 28

పర్యుషితో లంబగ్రహో లంబోదర ఉదాహృతః | బృహదష్టో లంబోష్ఠః పాపాదస్మాదజాయత || 29

ఏతత్తే సర్వమాఖ్యాతమాత్మవృత్తం సహేతుకం | పృచ్ఛస్వ యది తే శ్రద్ధా పృష్టాశ్చ కథయామహే || 30

బ్రాహ్మణ ఉవాచ:- యే జీవా భువి తిష్ఠంతి సర్వేప్యాహారమూలకాః ||

యుష్మాకమపి చాహారం శ్రోతిమిచ్ఛామి తత్త్వతః | 31

లేఖకుడు కష్టముమీద నడచును.రోహకుడు తలవంచుకొనియే యుండును. శీఘ్రగుడు కుంటియైనాడు. సూచీముఖుని ముఖము నిండ ముళ్ళే. పర్యుషికుడి మెడ వ్రేలాండుచుండును. లంబోదరుడనబడును. బృహదష్టుడు వ్రేలాడు పెదవివాడు. మా కథ యిదంత సకారణముగ నీకిదియెల్ల చెప్పితిమి. నీకంకను శ్రద్ధగలదేని యడుగుమడిగిన చెప్పెదము అన బ్రాహ్మణుడు భూమినున్న జీవులందరాహారమూలమున నైనవారే. మీ యాహారమేమో విన్నగోరెదన్న ప్రేతలిట్లనిరి. 31

ప్రేతా ఊచు:- శ్రుణుష్వాహారమస్మాకం సర్వసత్వవిగర్హితం |

యచ్ర్ఛుత్వా నిందసే విప్ర భూయో భూయశ్చ నిత్యశః || 32

శ్లేష్మమూత్రపురీషేణ యోషిదజ్గమలేన చ | గృహాణి త్య క్త శౌచాని ప్రేతా భుంజంతి తత్ర వై || 33

స్త్రీబిర్దగ్థాని కీర్ణాని ప్రకీర్ణోచ్ఛిష్టకాని చ | మలేనాపి జగుప్స్యాని ప్రేతా భుంజంతి తత్ర వై || 34

చిత్తలజ్ఞావిహీనాని హోమహీనాని యాని చ | వ్రతైశ్చైవ విహీనాని ప్రేతా భుంజంతి తత్ర వై || 35

గురవో నైవ పూజ్యంతే స్త్రీజితాని గృహాణి చ | క్రోధలోభగృహీతాని ప్రేతా భుంజంతి తత్ర వై || 36

త్రపా మే జాయతే తాత కథ్యమానే స్వభోజనే | అస్మాత్పరతరం చాన్యన్న వక్తుమపి శక్యతే || 37

నివృత్తిం ప్రేతభావస్య పృచ్ఛామస్త్వాం ధృఢవ్రత | యథా న భవతి ప్రేతస్తన్మే వద తపోధన || 38

వినుమాహారము సర్వజీవులసహ్యించుకొనునునది. అది విని మమ్ము మఱిమఱి తెగ తిట్టిపోయుదువు. శ్లేష్మమంత్ర పురీషాలు స్త్రీ యంగములతో గూడినది. ప్రేతలు తిండితినే కొంపలు వట్టి పాడు కొంపలు. అశుచులు. స్త్రీలచే నంటింపపడినది.

చెల్లచెదురైనని ఎంగిళ్ళతో నలముకొన్నవి. మలముచే రోటిగొన్నవి. అటగదా ప్రేతలు తిందురు. సిగ్గనునది లేదు. హోమములు లేవు. విస్తళ్ళుండవు. ప్రేతలు తినుట యక్కడనే. గురువుల పూజింపరు. స్త్రీలే గెలుతురు. (పెత్తనము స్త్రీలదే) క్రోధ లోభములలో బడినవి ప్రేతలట తిందురు నా తిండి సంగతి నే జెప్పుకొనుటకు సిగ్గగుచున్నది. తండ్రీ ! ఇంతకుపై నింక చెప్పుట నావలన గాదు. గట్టి వ్రతనిష్ట గలవాడవు నీవు. ఈ ప్రేతత్వమెట్లు పోవునో అడుగుచున్నాము నిన్ను. ప్రేతలెట్లు కారోయది తపోధనుడవు నాకు దెల్పుమన బ్రాహ్మణుడిట్లనియె. 38

బ్రాహ్మణ ఉవాచ :- ఏకరాత్రాద్విరాత్రాదికృచ్ఛచాంద్రాయణాదిభిః ||

వ్రతైరన్యైః కృతైర్నిత్యం న ప్రేతో జాయతే నరః || 39

త్రీనగ్రానృఞ్ఛ చైకం వా యోహన్యహని సేవతే | స వై భూతదయాపన్నో న ప్రేతో జాయతే నరః || 40

ఏకరాత్ర ద్విరాత్రాదిగ చాంద్రాయణాది వ్రతాదులుగాని మరి మేలైన వ్రతములు చేసిన ప్రేత కాబోడు. మూడు ముద్దలు లేదా యైదు ఒకటిగాని దినదినము తిన్నవాడు భూతదయగలవాడు ప్రేతమై పుట్టడు. 40

తుల్యో మానాపమానే య తుల్యం కాంచనలోష్టయోః |

తుల్యః శత్రౌ చ మిత్రౌ చ న ప్రేతో జాయతే నరః || 41

దేవతాతిథిపూజాసు గురుపూజాసు నిత్యశః | రతో వై పితృపూజాసు న ప్రేతో జాయతే నరః || 42

శుక్లాంగారకసంయుక్తా చతుర్థీ జాయతే యదా | శ్రద్ధాయా శ్రాద్ధకృత్తస్యాం న ప్రేతో జాయతే నరః || 43

జితక్రోధవిమర్శో యస్త్రుష్ణాసంగవివర్జితః | క్షమావాన్‌ దానశీలశ్చన ప్రేతో జాయతే నరః || 44

గోబ్రాహ్మణాంశ్చ తీర్థాని పర్వతాంశ్చ నదీ స్తథా | దేవాంశ్చైన తు యో వన్ద్యాన్నప్రేతో జాయతే నరః || 45

శత్రుమిత్రులందు, మానవమానములందు బంగారము, మట్టిపెడ్డయందు సమబుద్దిగలవాడు ప్రేత గాడు. గురు దేవతలతిధి పూజలందాదరము గలవాడు ప్రేతగాడు. శుక్లపక్షములో చతుర్థి తిధి మంగళవారము కలిసివచ్చినపుడు పితరులనుద్దేశించి శ్రద్ధతో శ్రాద్ధము పెట్టినవాడు ప్రేత గాడు. క్రోధము జయించి, పాడు విమర్శలు మాని, ఆశ అంటూ వీడి, క్షమ గల్గి, దానశీలుడైన నతడు ప్రేతగాడు. గో బ్రాహ్మణులను, తీర్థముల, నదుల, పర్వతముల, దేవతలను మ్రొక్కువాడు ప్రేత గాడు. 45

ప్రేతా ఊచు:- శ్రుతాభ్చ వివిధా ధర్మాః పృచ్ఛామో దుఃఖితా మునే ||

యేన వై జాయతే ప్రేతస్తన్నో వద మహామతే | 46

బ్రాహ్మణ ఉవాచ :- శూద్రాన్నేన తు భుక్తేన బ్రాహ్మణన విశేషతః ||

మ్రియతే హ్యదురస్థేన స వై ప్రేతో భ##వేన్నరః | 47

మాతరం పితరం భ్రాతౄన్‌ భగినీం సుతమేవ చ | అదృష్ఠదోషాం స్త్యజాతి స ప్రేతో జాయతే నరః 48

అయాజ్యయాజనాచ్చైవ యాజ్యస్య చ వివర్జతాత్‌ | రతో వై శూద్రసేవాసు స ప్రేతో జాయతే నరః || 49

న్యాసాపమర్తా మిత్రధృక్‌ శూద్రాపాకరతః సదా | విస్రంభఘాతీ కూటస్థః స ప్రేతో జాయతే నరః || 50

బ్రహ్మహా గోఘ్నకః స్తేనః సురాపో గురుతల్పగః | భూమికన్యాపహర్తా చ స ప్రేతో జాయతే నరః || 51

సామాన్యాం దక్షిణాం లబ్ధ్వా ఏక ఏవ నిగూహతి | నాస్తికే భావనిరతః స వై ప్రేతోభిజాయతే || 52

ప్రేతలిట్లనిరి : పలురకముల ధర్మముల విన్నాము. మరీ దుఃఖితులమైయున్నాము. ప్రేతయగుటకు కారణము తెల్పుమన బ్రాహ్మణుడనియె.

శూద్రాన్నము తిని యది కడుపులో నుండగానే చచ్చినవాడు, తల్లిదండ్రుల, నన్నదమ్ముల, నక్కచెల్లెళ్ళ, కొడుకును ఏ కారణము లేకుండానే విడిచిపెట్టినవాడు చేయించరాని వానిచేత యజ్ఞము సేయించుటవలన, యోగ్యునిచేత చేయించక విడిచినవాడు శూద్ర సేవయందాసక్తి గలవాడు, తనదగ్గర దాచిన తనసొత్తు కాజేసినవాడు, మిత్రద్రోహి, శూద్రుని వంటపై మక్కువ గలవాడు, నమ్మిన వానికి ద్రోహము సేసినవాడు, మాయావి, గో బ్రాహ్మణ హంతకుడు, దొంగ త్రాగుబోతు, గురుతల్పగాడు, భూమిని కన్యను నపహరించినవాడు, అందరికిచ్చిన దక్షిణగొని తానొక్కడే దాచుకొన్నవాడు, నాస్తిక భావము గలవాడు ప్రేతయగును. 52

ఏవం బ్రువాణో విప్రేంద్ర ఆకాశే దుందుభిస్వనః | పుషృవృష్ఠిః పపాతోర్వ్యాం దేవైర్ముక్తా సహస్రశః || 53

ప్రేతానాం తు విమానాని ఆగతాని సమంతతః | అస్య విప్రస్య సంభాషాత్పుణ్యసంకీర్తనేన చ || 54

తస్మత్సర్వప్రయత్నేన సతాం సంభాషణం కురు | యది తే శ్రేయసా కార్యం గంగాసుత అతంద్రితః || 55

తిలకం సర్వధర్మస్య పఞ్చప్రేతకథామిమాం | పఠేల్లక్షం యేస్య కులే న ప్రేతో జాయతే నరః || 56

శృణోతి వాప్యభీక్ష్నం వా శ్రద్ధయా పరాయాన్వితః | భక్త్యా సమన్వితో వాపి న ప్రేతో జాయతే నరః || 57

ఈలా విప్రోత్తముడు మాటలాడుచున్నాడు. ఆకాశమందు దుందుభి ధ్వని యైనది. దేవతలు వేలకొలది పూలవాన గురిపించిరి. ప్రేతల కంతలు విమానములు వచ్చెను. ఈ విప్రుని సంభాషణవలన పుణ్యసంకీర్తనము వలన నీ శుభము జరిగినది. అందువలన సర్వప్రయత్నమున సత్పురుష సంభాషణమొనరింపుము. ఓ గంగా కుమారా ! నీకు శ్రేయస్సు కావలెనన్న తొట్రుపడక సద్గోష్ఠి సేయుము. సర్వధర్మతిలకమీ పంచప్రేతకథను పఠించినవాని కులమున ప్రేత కలుగడు. మిగుల భక్తిశ్రద్ధలతో విన్న వాడు ప్రేతగాడు. 57

భీష్మ ఉవాచ :- అంతరిక్షే కిమర్థం తు పుష్కరం పరికీర్త్యతే ||

మునిభిర్ధర్మశీలైశ్చ లభ్యతే తత్కథం త్విహ || 58

యేన తల్లభ్యతే లబ్ధం లబ్ధం చైవ ఫలప్రదం | తన్మే సర్వం సమాచక్ష్వ కౌతుకాదేవ పృచ్ఛతః || 59

భీష్ముడనియె : అంతరిక్షమందు పుష్కరమును ధర్మశీలు రెందులకు కీర్తించిరి? అది యిక్కడ యెట్లు లభించును? లభించిన దది యెట్లు ఫలమిచ్చును? అదంత నాకానతిమ్ము కుతూహలముతో నడుగుచున్నానన పులస్త్యుడనియె.

పుల్యస్త ఉవాచ: ఋషికోటిస్సమాయాతా దక్షిణాపథవాసినీ | స్నానార్థం పుష్కరే రాజన్‌ పుష్కరం చ వియద్గతమ్‌ || 60

దక్షిణపథమందున్న మునికోటి పుష్కరమందు స్నానము సేయవచ్చెను. పుష్కరమాకసమందున్నది. 60

మత్వా తే మునయః సర్వే ప్రాణాయామపరాయణాః | ధ్యాయమానాః పరం బ్రహ్మా స్థితా ద్వాదశవత్సరాన్‌ || 61

బ్రహ్మామహర్షయస్తత్ర దేవాస్సేన్ద్రాస్సమాగతాః | ఋషయోంతర్హితాః ప్రోచుర్నయమాంస్తే సుదుష్కరాన్‌ || 62

ఆకారణం పుష్కరస్య మంత్రేణ క్రియతాం ద్విజాః | అపోహిష్ఠేతి త్రసృభీ ఋగ్భీః సాంనిధ్యమేష్యతి || 63

అఘమర్ఫణజాప్యేన భ##వేద్యై ఫలదాయకం | విపై#్రర్వాక్యావసానే తు సర్వైసై#్తస్తు తథాకృతమ్‌ || 64

కృతేన పుణ్యతాం ప్రాప్తా యేనిదేశాచ్య తే ద్విజాః | గర్హితా ధర్మశాస్త్రేషు తే విప్రా దక్షిణోత్తరాః || 65

యే చాన్యే పార్వతీయాశ్చ శ్రాద్ధే నార్హంతి కేతనం | ఏతస్మాత్కారణాద్రాజన్‌ వియత్యేవం సమాస్థితమ్‌ || 66

కార్తిక్యాం పుష్కరం స్నానాత్పూతతామభిగచ్ఛతి | బ్రహ్మణా సహితం రాజన్సర్వేషాం పుణ్యదాయకమ్‌ || 67

పరబ్రహ్మమును ధ్యానించుచు పండ్రెండేండ్లు వారు గడిపిరి. బ్రహ్మ, ఇంద్రాదులు, దేవతలు, మహర్షులు నిటకు వచ్చిరి. ఋషు లంతర్ధానముగనుండి మిక్కిలి యసాధ్యములైన ధర్మములు సెప్పిరి. విప్రులార! పుష్కరమును మంత్రములతో బిలువుడు. ''అపోహిష్ఠామయోభువః'' అను ఋక్కులతో బిలిచిన దేవత దగ్గరకు వచ్చును. అఘమర్షణ మంత్ర జపముచే ఫలమిచ్చును. ఆ వాక్యము చివర విప్రులట్లే సేసిరి. దానిచే వారు దేశ నిమిత్తముగా పుణ్యులైరి. దక్షిణోత్తర దేశములవారు ధర్మశాస్త్రములందింతమున్ను నింద్యులైన కొండజాతి బ్రాహ్మణులు శ్రాద్ధములందు కేతనమున కర్హులు గాని వారును పుణ్యలైరి. ఈ కారణముచేతనే రాజా! పుష్కరమింతదాక ఆకాశమందే యుండెను. కార్తికమందు స్నానము చేసినచో పుష్కరము పవిత్రతనిచ్చును. బ్రహ్మతో గూడ నందరకది పుణ్యమిచ్చును. అచటికి యాత్రవచ్చిన అన్ని వర్ణములవారు మంత్రము లేకున్న పుణ్యవంతులగుదురు. 67

తత్రాగతాస్తు యే వర్జాః సర్వే తే పుణ్యభాజనాః | ద్విజైస్తుల్యా న సందేహో వినా మంత్రేణ తే నృప || 68

ఆగ్నేయం తు యథా ఋక్షం కార్తిక్యాం భవతి క్వచిత్‌ | మహతీ సా తిథిర్జేయా స్నానే దానే తథోత్తమా || 69

యదా యామ్యం తు భవతి ఋక్షం తస్యాం తిథౌ క్వచిత్‌ | తిథిః సాపి మహాపుణ్యా యతిభిః పరికీర్తితా || 70

ప్రాజపత్యం యదా ఋక్షం తిథౌ తస్యాం నరాధిప | సా మహాకార్తికీ ప్రోక్తా దేవానామపి దుర్లభా || 71

వారు ద్విజులతో సమానులే సందియములేదు. కార్తిక మాసమందు అగ్నిదేవతాకము కృత్తికా నక్షత్రమెప్పుడేని వచ్చునేని స్నానము దానమున నది యెంతో ఉత్తమము. యమదేవతాక నక్షత్రము యమదేవతా తిధియందు వచ్చెనా అది పుణ్యతిథియని యతులు కొనియాడిరి. ప్రజాపతి దేవతాకమగు తిధియందు ప్రజాపతి దేవతాకమగు నక్షత్రము వచ్చెనేని యది మహాకార్తిక యనబడును. దేవతలకుగూడ యది లభింపదు. 70

యదా చార్కే గురే సోమే వారేష్వేతేషు వై త్రిషు | త్రీణ్యతాని చ బుూక్షాణి స్వయం ప్రోక్తాని బ్రహ్మణా || 72

అత్రాశ్వమేధికం పుణ్యం స్నాతస్య భవతి ధృవం | దానమక్షయతాం యాతి పితౄణాం తర్పణం తథా || 73

విశాఖాసు యదా భానుః కృత్తికాసు చ చంద్రమాః | స యోగః పుష్కరే నామ పుష్కరేష్వతిదుర్లభః || 74

అంతరిశావతీర్ణే తు తీర్థే పైతామహే శుభే | స్నానం యేత్ర కరిష్యంతి తేషాం లోకా మహోదయాః || 75

న స్పృహాం తేన్యపుణ్యస్య కృతస్యాప్యకృతస్య చ | కరిష్యంతి మహారాజ సత్యమేతదుదాహృతమ్‌ || 76

తీర్థానాం ప్రవరం తీర్ధం పృథివ్యామిహ పఠ్యతే | సాస్మాత్పరం పుణ్యతీర్థం లోకేషు నృప పఠ్యతే || 77

ఎపుడు మంగళ భాను గురువారములు మూడిటియందు సూర్య కుజ గురు దేవతాకములైన తిథులు కలిసివచ్చినచో స్నానము సేసినవాడు పుష్కరమందు స్నానాది విధులు సేసినచో పుష్కర అశ్వమేధ పుణ్యము లభించును. నిశ్చయమిది, ఇప్పుడిట దానము పితృతర్పణమున క్షయ పుణ్యమిచ్చును. విశాఖా నక్షత్రమందాదివారము కృత్తికా నక్షత్రమందు చంద్రుడు కలిసివచ్చునేని యది పుష్కర యోగమను పేరందినది. పుష్కర తీర్థమందది యతి దుర్లభము. అతరిక్షమునుండి యవతరించిన బ్రహ్మ దేవతాకమగు నీ శుభ తీర్థమందు స్నానము సేసిన వారికి పుణ్యలోకములు మహోదయములు. వారింకొక పుణ్యము యంతమున్ను జేసిన చేయని దానియందు మఱి యుపేక్షము సేయుదురు. ఈయామిని మహారాజా ! సత్యమిది యుదాహరింపబడినది. తీర్థములకెల్ల ప్రవరమిదియని పఠింపబడినది. దీని యమించినదిక పఠింపబడలేదు. విశేషించి కార్తికమాసమందిది పుణ్యకరము పాపహరము. 77

కార్తిక్యాం తు విశేషేణ పుణ్యా పాపహరా శుభా | ఉదుంబరవనాత్తస్మాదాగాతా చ సరస్వతీ || 78

తయా తత్పూరితం తీర్థం పుష్కరం మునిసేవితం | దక్షిణ శిఖరం భాతి పర్వతస్యావిదూరతః || 79

నీలాంజనచయప్రఖ్యం వర్ణతో నీలాశాద్వలం | తయా తచ్ఛిఖరం తస్వ ఖస్థితం పుష్కరం యథా || 80

ప్రావృట్‌కాలే వియత్పూర్ణం ఘనవృందమివోచ్ఛ్రితం | కదంబపుష్పగంధాఢ్యం కుటజార్జునభూషితమ్‌ || 81

రథమార్గమివారోఢుం రవే స్తచ్ఛిఖరం స్థితం | వృతైస్సపులకైస్స్నిగ్ధైః స్త్రీణామివ పయోధరైః || 82

శ్రీఫలైః శిఖరం భాతి సమాన్తాత్సుమనోహరైః | గుంజద్భిః షట్పదకులైః సమంతాదుపశోభితమ్‌ || 83

కోకిలరావరుచిరం శిఖికేకారవాకులం | శృంగే మనోహరే తస్మిన్నుద్గతా సుమనోరమా || 84

పుణ్యా పుణ్యజలోపేతా నదీయం బ్రహ్మణస్సుతా | వంశ స్తంభాత్సువిపులా ప్రవృత్తా చోత్తరాముఖీ || 85

గత్త్వా తతో నాతిదూరాత్పునర్యాతి పరాజ్ముఖీ | తతః ప్రభృతి సా దేవీ ప్రసన్నా ప్రకటాస్థితా || 87

అన్తర్ధానం పరిత్యజ్య ప్రాణినామనుకమ్పయా | కనకా సుప్రభా చైవ నన్దా ప్రాచీ సరస్వతీ || 88

పంచ స్రోతాః పుష్కరేషు బ్రహ్మణా పరిభాషితాః | తస్యాస్తీరే సురమ్యాణి తీర్థాన్యాయతనాని చ || 88

సంసేవితాని మునిభిః సిద్ధైశ్చాపి సమంతతః | తేషు సర్వేషు భవితా ధర్మహేతుః సరస్వతీ || 89

సరస్వతి ఉదుంబర వనమునుండి (మేడిచెట్ల తోపుతో) వచ్చినది. దానిచే పుష్కర తీర్థమందు నిండింపబడినది. మణులనే సేవింపబడినది. దగ్గరలో దక్షిణదిశ పర్వత శిఖరమున్నది. అది నల్లని కాటుకవంటిది. నీలపు రంగు గరిక తోడిది. దానితో నా శిఖరము పుష్కరముతో నిండును. వర్షకాలములో మబ్బుగ యట్లెత్తుగ నుండును. కదంబ పుష్ప సమృద్ధము (కడిమిపూట) కుటజములు - అర్జునపుష్పాలతో సొంపుగానున్నది. సూర్యరథ మార్గమిట్లెత్తున శిఖరమెక్కనే పులకరించిన స్నిగ్ధములై స్త్రీల కురుల మనోహరముల వయోధరములతో నట్లు మారేడు పండ్లతో నా శిఖరము భాసించును. ఝంకరించు తుమ్మెద లంతట శోభించును. కోకిలల కుహూకారములతో, నెమళ్ళ కేంకారవములతో నింపుగొన్నది. ఆ చక్కని శృంగముపై నుండి మనోహరమీ పుణ్యనది పుణ్యజలాలతో బ్రహ్మకుమారి వెదరు స్తంభమునుండి ఉత్తరాభిముఖియై ఈ విపులమైన నది బయలుదేరినది. కొంత దూరమేగి యతికొలది దూరమునుండియే నది వెనుదిరిగివచ్చును. అది మొదలాదేవి ప్రసన్నమై ప్రాణులపై దయచే నంతర్ధానము విడిచి వెల్లడియైవది. కనుక సుప్రభ-నంద ప్రాచి సరస్వతి అని పుష్కర తీర్థమందు బ్రహ్మపేరు పెట్టినది. పంచస్రోతస్సులు ఆ సరస్వతి తీరమందెంతో చక్కని తీర్థములు ఆలయములున్నవి. సిద్ధులు మునులు వానిని నలువైపుల సేవింతురు. వానియందెల్ల సరస్వతి ధర్మహేతువగును.

హాటకక్షితి గౌరీణాం తత్తీర్ధేషు మహోదయం | దానం దత్తం నరైః స్నాతైర్జనయత్యక్షయం ఫలం || 90

ధాన్యప్రదానం ప్రవరం వదంతి తిలప్రదానం చ తథా మునీంద్రా | యైస్తేషు తీర్థేషు నరైః ప్రదత్తం తద్ధర్మ హేతుప్రవరం ప్రదిష్టమ్‌ || 91

ప్రాయోపవేశం ప్రయతః ప్రయత్నాద్యస్తేషు కుర్యాత్ప్రమదా పుమాన్వా |

తీర్థేపి సంయోజ్య మనోపి చేత్థం భుంక్తే ఫలం బ్రహ్మగృహే యథేష్టమ్‌ || 92

తస్యోపకంఠే మ్రియతే మి యైస్తు కర్మక్షయాత్‌ స్థావరజంగమైశ్చ | తే చాపి సర్వే సకలం ప్రసహ్య లభంతి యజ్ఞస్య ఫలం దురాపమ్‌ || 93

ఇచ్చిన దానము, చేసిన స్నానమిట యక్షయ ఫలదము. ఇట ధాన్యదానము తిలదానమును పరమ శ్రేష్ఠమని మునీశ్వరులందురు. ఇట స్త్రీగానీ పురుషుడగాని మనస్సు మార్చి ప్రాయోపవేశము చేసినా బోయిబ్రహ్మలోకమందు ఈలాంటి ఫలమనుభవించును. ఆ పుష్కరమునందు చనిపోయిన స్థావరజంగములు కర్మక్షయమై మనుకోకుండ నందరాని యజ్ఞఫలమందుదురు. 93

తతస్తు సా ధర్మఫలారణీ చ జన్మాది దుఃఖార్దితచేత సా తం |

సర్వాత్మనా చారుఫలా సరస్వతీ సేవ్యా ప్రయత్నాత్పురుషైర్మహానదీ || 94

తత్రి యే సలిలం పూతం పిబంతి సతతం నరాః | న తే మనుష్యా దేవాస్తే జగత్యామిహ సంస్థితాః || 95

యజ్ఞైర్దానైస్తపోభిశ్చ యత్ఫలం ప్రాప్యతే ద్విజై | తదత్ర స్నానమాత్రేణ శూద్రైరపి స్వభావజైః || 96

దర్శనాత్పుష్కరస్యాపి మహాపాతకినోపి యే | తేపి తత్పాపనిర్ముక్తాః స్వర్గం యాంతి తనుక్షయే || 97

సరస్వతి ధర్మఫలమున కరణి. జన్మాది దుఃఖముల మనసు దిగులొందినవారికి సర్వవిధముల చక్కని ఫలమిచ్చునది. సరస్వతి మహానది సర్వప్రయత్నములచే సేవింపదగినది. ఆ జలము పవిత్రము. నెప్పుడు త్రావువారు వారు మనుష్యులుగారీ జగత్తునందున్న దేవతలు. యజ్ఞదానతపస్సులచే ద్విజులందు ఫలమట స్నానముచే నైజముగ బుట్టినశూద్రులు గూడ పొందుదురు. పుష్కరదర్శనమాత్రమున మహాపాపులు పాపములువాసి స్వర్గమందుదురు. ఇట ఉపవాసమున్నతడు కొలది శ్రమతో పౌండరీక యజ్ఞముసేసిన ఫలమందును. 97

తత్రోపవాసి యజ్ఞస్య పుండరీకస్య యత్ఫలం | తత్రాప్నోతి నరః క్షిప్రమల్పాయాసేన పుష్కరే || 98

మాఘమాసే తిలాన్యస్తు ప్రయచ్ఛతి చ సద్ద్విజే | యథాశక్తి చ భక్త్యా చ స విష్ణుభవనే వసేత్‌ || 99

తత్రోపవాసం స్నానం చ పంచగవ్యాశనం తథా | యః కరోతి నరః సోపి దేహాంతే స్వర్గమాప్నుయాత్‌ || 100

వసంతి తత్సమీపస్థా యేపి తస్కరజాతయః | తేపి తస్యానుభావేన స్వర్యాంతి చ న సంశయః || 101

యే పునః శూద్రవృత్తిస్థాస్త్రిరాత్రోపోషితా నరాః ప్రయచ్ఛంతి ద్విజేష్వర్థం బ్రహ్మశక్తి సమన్వితాః 102

తే మృతా యానమారూఢాః పద్మాసనచతుర్భుజాః | బ్రహ్మణా సహ సాయుజ్యం ప్రాప్నువంత్యపునర్భవమ్‌ || 103

పుష్కరమందుపవాసమున్నయతడు పౌండరీక యాగఫలమందును. మాఘమాసమందు బ్రాహ్మణునకిట తిలదానము యధాశక్తి భక్తితో జేసినతడు విష్ణలోకమందును. అట స్నానము, ఉపవాసము పంచగవ్యప్రాశనము సేసినతడు స్వర్గమందును. ఆ పుష్కరము దగ్గర వసించు దొంగలు మొదలగు జాతులు కూడ స్వర్గమందుదురు. సందియములేదు. శూద్రవృత్తిగలవాండ్రుకూడ మూడురాత్రులుపవాసముండి బ్రాహ్మణులకిట ద్రవ్యమిచ్చినచో బ్రహ్మశక్తితోగూడి మరణించినపుడు పద్మమందు గూర్చుండి నాల్గు భుజములుకలవారై బ్రహ్మతో సారూప్యము, సాయుజ్యమునందుదురు. పునర్జన్మమందరు. 103

గంగోద్భేదం యత్ర గంగా సంప్రాప్తా సరితాం వరా | సరస్వతీం ద్రష్టుకామా సాంత్వార్థే ప్రోద్గతాంబరాత్‌ || 104

తత్ర గత్వా పయఃపూతం సురసిద్ధనిషేవితం | సారస్వతం చ విమలం విద్యాధరగణార్చితమ్‌ || 105

పీతమేకాంజలిమితం యేనాప్తం తేన తత్పరం | అవలోక్యం దిశం పూర్వామాహ గంగే సఖి త్వయా || 106

ఏకాకినీ వియుక్తాస్మి క్వ యాస్యేహమబాంధవా | తాం విజ్ఞాయ తతో గంగా రుదంతీ శోకకర్శితామ్‌ || 107

పూర్వదేశాత్సమాయాతా ద్రష్టుం తాం దీనమానసాం | దృష్ట్వా చ తాం మహాభాగాం పరిష్వజ్య తు పీడితామ్‌ || 108

నదీశ్రేష్ఠురాలు గంగానది సరస్వతీ నదితో విడవడి, ఆ పుణ్యనదిని జూచి యామె నోదార్చవలెననికోరి యాకాశమందుండి బయలుదేరినది. సిద్ధులెల్లరు సేవించు సరస్వతీనది దగ్గరకేగినది. అలా గంగాసంగమమందిన సరస్వతీ జలమును విద్యాధరులు సేవించిరి. దానినొక దోసెడు సేవించినవాడు పరమపదమందును. తూర్పుదెసకు చూసి గంగానదితో సరస్వతీ సఖీ! గంగా ! నేనొంటరిదాననై నన్ను విడిచితిని. బంధువు నెడలి నేనెటకు పోవుదును! అనెను. ఆమెను జూచి గంగ యేడ్చుచు, దిగులుపడి తూర్పునుంచి చూడవచ్చిన యా మహానుభావురాలింజూచి కౌగిలించుకొని బాధతో ఆమె కన్నీరు. తుడిచి యిట్లనెను. 108

నేత్రే ప్రమృజ్య చైతస్యాః ప్రాహ గంగా వచస్తదా | మారోదస్త్యం మహాభాగే దుష్కరం తే కృతం సఖి || 109

దేవకార్యం యదాన్యన్న కర్తుం శ##క్యేత నైవ హి | ఏతస్మాత్తే మహాభాగే ద్రష్టుం దేవాః సమాగతాః || 110

ఏషాం చ క్రియతాం పూజా వాఙ్మనః కాయకర్మణా సరస్వతీ సురేంద్రాణాం కృత్త్వా పూజావిథిక్రమమ్‌ || 111

క్రమేణ బ్రహ్మజా పశ్చాత్సంగతా తు సఖీజనం | జ్యేష్ఠమధ్యమయోర్మధ్యా సంగమో లోకవిశ్రుతః || 112

పశ్చాన్ముఖీ బ్రహ్మనుతా జాహ్నవీ తు ఉదఙ్ముఖీ | తతస్తే విబుధాః సర్వే పుష్కరం యే సమాగతాః || 113

మహానుభావురాల నెచ్చెలీ! నీకు జేయరాని పని చేసితిని. దేవతలకార్యామింకొంటిచేయ శక్యమగుటలేదు. ఇందువలన దేవతలు నిన్నుదర్శింపవచ్చినారు. త్రికరణశుద్ధిగ వీరికి బూజసేయుము. అనగా సరస్వతీ పూజగావించెను. క్రమముగా బ్రహ్మపుత్రనదిగ కూడా సఖురాండ్రను గలిసికొనెను. జేష్ఠురాలు గంగతో మధ్యమురాలు బ్రహ్మ క్షత్రియులుకలియుట యిదిలోక ప్రసిద్ధము. బ్రహ్మపుత్ర పడమటి ముఖముగా గంగ ఉత్తర ముఖముగాను సాగిరి. ఆ మీద దేవతలందరు పుష్కరమునకు వచ్చిరి. ఆసాధ్యమైన పనిసేసినదని యామెను నిట్లు స్తుతించిరి. 113

-: దేవతలు సరస్వతిని స్తుతించుట :-

విదిత్వా దుష్కరం కర్మ తస్యాస్తుతిమకారయన్‌ | త్వం బుద్ధిస్త్యం మతిర్లక్ష్మీస్త్వం విద్యా త్వం గతిః పరా || 114

త్వం శ్రద్ధా త్త్వం పరా నిష్ఠా బుద్ధిర్మేధా రతిః క్షమా | త్వం సిద్ధిస్త్వం స్వాహా త్వం పవిత్రం మతం మహత్‌ || 115

సంధ్యా రాత్రిః ప్రభా భూతిర్మేధా శ్రద్ధా సరస్వతీ | యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనా || 116

ఆన్వీక్షకీ తు యా వార్తా దండనీతిశ్చ కథ్యతే | నమోస్తు తే పుణ్యజలే నమః సాగరగామిని || 117

నమస్తే పాపనిర్మోకే నమో దేవి జగత్ర్పయే | ఏవం స్తుతా హి సా దేవీ దివ్యా స్వార్ధపరాయణౖః || 118

ఏవం సా ప్రాఙ్ముఖీ తత్రాస్థితా దేవీ సరస్వతీ | సర్వతీర్థమయీ దేవీ సర్వామరసమన్వితా || 119

ప్రాచీ సేతి బుధైర్జేయా బ్రహ్మణో వచనం తధా | తత్ర శుద్ధావటం నామతీర్థం పైతామహం స్మృతమ్‌ || 120

దర్శనేనాపి వై తస్య మహాపాతకినోపి యే | బోగిబోగాన్సమశ్నంతి విశుద్ధా బ్రహ్మణోంతికే || 121

తల్లీ! నీవు సిద్ధివి. స్వధ - స్వాహవు. పరమపవిత్రురాలవు. సంధ్యా, రాత్రి, ప్రభ, భూతి, మేధ, శ్రద్ధ, సర్వతీర్థమయివి. అందిదేవతలతో గూడిన దానవు ప్రాచీనదియని తెలియవలసినవి. బ్రహ్మయన్నమాటకూడ యదే. అక్కడ బ్రహ్మతీర్థమున్నది. శుద్దావటమను పేరుగలది. అది దర్శనమాత్రమున నీమహాపాపులు బ్రహ్మసామీప్య మందుదురు. 121

ప్రాయోపవేశం యే తత్ర ప్రకుర్వంతి నరోత్తమాః | తే మృతా బ్రహ్మయానేన దివం యాంత్యకుతోభయాః || 122

తత్రాల్పమపి యైర్ధానం దత్తం బ్రమ్మవిదాత్మనాం | జన్మాంతరశతం తేషాం తైర్దత్తం బావితాత్మనామ్‌ || 123

అచట ప్రాయోపవేశము సేసిన పుణ్యులు చనిపోయి బ్రహ్మయానమున నేభయములేక స్వర్గమేగుదురు. బ్రహ్మవేత్తలట నేకొంచెము దానము సేసిననునది నూరుజన్మలాపుణ్యముసేసినవారగుదురు. 123

ఖణ్ణస్ఫుటితసంస్కారం తత్ర కుర్వన్తి యే నరాః | తే బ్రహ్మలోకమాసాద్య మాదన్తే సుఖినస్సదా || 124

యోత్ర పూజా జపో హోమః కృతో భవతి దేహినా | అనన్తం తత్ఫలం సర్వం బ్రహ్మభక్తిరాతాత్మనామ్‌ || 125

తత్ర దీప్రపదానేన జ్ఞానచక్షురతీంద్రియః | ప్రాప్నోతి ధూపదానేన స్థానం బ్రమ్మనిషేవితమ్‌ || 126

అథ కిం బహునోక్తేన సంగమే యత్ర్పదీయతే | తదనంతఫలం ప్రోక్తం జీవతో వా మృతస్య చ || 127

స్నానాజ్జపాత్తథా హోమాదనంతఫలసాధకం | రామేణాగత్య వై తత్ర పిండం దశరథస్య చ || 128

హంసయుక్తేన యానేన సర్వే యాంతి త్రివిష్టపం | తస్యాం వాప్యాం తు వై బ్రహ్మా పితృమేధం చకార హ || 130

అచ్చట ఖండస్ఫుటిత సంస్కారము సేసికొన్నవారు బ్రహ్మలోకమునందు సుఖింతురు. ఇట పూజ జపముతో హోమముచేసెనేని బ్రహ్మభక్తిపరులకాఫలమనంతమగును. అచట దీపమువెట్టినవా డతీంద్రియ జ్ఞాననేత్రసంన్నుడగును. ధూపదానముచే బ్రహ్మస్థానమందును. పలుమాటలేల ! గంగాది సంగమమందేది దానముసేసిననది బ్రతికియుండగాను, చనిపోయిన నది యనంతఫల సాధకము. మార్కండేయ మహర్షి చూపింపగా నిట రాముడువచ్చి దశరథునికి పిండప్రదానము చేసెను. అట నలుచదరముగా పిండవాపియున్నది. పిండములువేయు నూయి. అందు పితరులకు పిండమువేసినవారు హంసవాహనముపై స్వర్గమేగుదురు. ఆ వాపియందు బ్రహ్మ పితృమేధ మాచరించెను. 130

యజ్ఞం యజ్ఞవిదాం శ్రేష్ఠః సమాప్తవరదక్షిణం | వసవః పితరో జ్ఞేయా రుద్రాశ్చైవ పితామహాః || 131

ఆదిత్యాశ్చ తతస్తేషాం విహితాః ప్రపితామహః | త్రివిధా అపి ఆహూయ పునరుక్తా విరించినా || 132

భవద్భిః పిండదానాద్యం గ్రాహ్యమత్ర స్థితైస్సదా | యత్కృతాం పితృకార్యం చ దతనంతఫలం లభేత్‌ || 133

వృత్యర్ధం పితరస్తేషాం తుష్టాశ్చైవ పితామహాః | లభంతే తర్పణాత్తృప్తిం పిండదానాత్రివిష్టపమ్‌ || 134

తస్మాత్సర్వం పరిత్యజ్య ప్రాచీనే పిండదో భ##వేత్‌ | దత్వా పుత్రః ప్రయత్నేన పితౄన్సర్వాంశ్చ తర్పయేత్‌ || 135

ప్రాచీనేశ్వరదేవస్య పురోభూతం ప్రతిష్టితం | ఆదితీర్థం తదిత్యుక్తం దర్శనాదపి ముక్తిదమ్‌ || 136

యజ్ఞవేత్తలలో నుత్తముడు బ్రహ్మ యట యజ్ఞమును జేసెను. చాల యుత్తమ దక్షిణలిచ్చెను. పితరులు, వసువులు; పితామహులు, రుద్రులు ; ఆదిత్యులు ప్రపితామహులు, ఆ మూడు విధాలవారిని బిలిచి బ్రహ్మయిట్లనియె. మీరు ముగ్గురు నిటనుండి పిండదానాదికము తీసికొనవలెను. ఇట సేసిన పితృకార్య మనంతమగును. బ్రతుకుకొఱకు పితరులట సంతుష్టులగుదురు. వారు తర్పణమును తృప్తినిచట పొందుదురు. ఇట పిండప్రదానమువలన స్వర్గమందుదురు. అందుచే సర్వము విడిచి తూర్పన నిట పిండదానము సేయవలెను. పుత్రుడదిసేసి పితృలందరికి తర్పణము సేయవలెను. ప్రాచీనేశ్వరీదేవునిముందు ఆదితీర్థము ప్రతిష్ఠింపబడినది. అట జలము స్పృశించినంజాలు జన్మబంధమిముక్తిగనును. 136

స్పృష్ట్వా తు సలిలం తత్ర ముచ్యతే జన్మబంధనాత్‌ | అవగాహనాద్ర్బహ్మణోసౌ భవత్యనుచరః సదా || 137

ఆదితీర్థే నరః స్నాత్నాయః ప్రదద్యాత్సమాధినా | అన్నమల్పమపి ప్రాయః ప్రాయశస్స్వర్గమాప్నుయాత్‌ || 138

యస్తత్ర బ్రహ్మభక్తానాం నరః స్నాత్వా దదేద్ధనం | కృసరేణాపి హేమ్నా చ స స్వర్గే మోదతే సుఖీ || 139

ఇట స్నానము సేసినచో బ్రహ్మకనుచరుడగును.ఆదితీర్థమున స్నానముచేసి సమాధినిష్ఠుడై (చిత్తమునిరోధించినవాడై) కొంచెమేని అన్నము పెట్టినను స్వర్గమందును బ్రహ్మభక్తులకట స్నానముచేసి యన్నము కొంచెము పెట్టి గంజిలేక జావతో గూడ బంగారము దక్షిణతోబెట్టినను హాయిగ స్వర్గమందానందింతురు. 139

ప్రాచీ సరస్వతీ తత్ర నరైః కిం మృగ్యతే పరం | తస్యాం స్నానాత్ఫలం త్పపై#్త్య తపోయజ్ఞాదిలక్షణమ్‌ || 140

యే పిబంతి నరాః పుణ్యాం ప్రాచీం దేవీం సరస్వతీం | న తే నరాః సురా జ్ఞేయా మార్కండేయర్షిరబ్రవీత్‌ || 141

సరస్వతీ నదీం ప్రాప్య న స్నానే నియమః క్వచిత్‌ | భుక్తే వా న చ వాభుక్తే దివా వా యది వా నిశి || 142

తత్తీర్థం సర్వతీర్థానాం ప్రాచీనం ప్రవరం స్మృతమ్‌ | పాపఘ్నం పుణ్యజననం ప్రాణీనాం పరికీర్తితమ్‌ || 143

యే పునర్భవితాత్మానస్తత్ర స్నాత్వా జనార్దనం | పూజయన్తి యథాశక్తి తే ప్రయాంతి త్రివిష్టపమ్‌ || 144

దేవానాం ప్రవరో విష్ణుస్తేన యత్ర సరస్వతీ | సేవితా తత్పరం తీర్థం క్షితౌ బ్రహ్మసుతో బ్రవీత్‌ || 145

తతస్తస్మాన్మహాతీర్థం మన్యమానా మహోదయమ్‌ | మందాకినీముదీక్షంతి స్థితా తత్ర సరస్వతీ || 146

అట తూర్పుదెస నున్నది సరస్వతి. వెదుకనక్కరలేదు. అందుస్నానము తపోయ జ్ఞాదిరూపమగు ఫలము. ఆమెనుద్రావునరులు సురులేయని మార్కండేయులుయన్నారు. సరస్వతీ నదిలో స్నానమునకు నియమమేమియులేదు. తినిగాని తినకేకాని పగలుగాని రాత్రిగాని ఆ తీర్థము సర్వతీర్థోత్తమము తూర్పువైపుదని ఋషులన్నారు. పుణ్యము పాపహరమూ. మనస్సున భావించి యట స్నానముచేసి విష్ణువును సేవింతురు. వారు స్వర్గమందుదురు. దేవతలకెల్ల మేటి విష్ణువు. ఆయనచే సరస్వతి సేవింపబడినది. ఈమాట బ్రహ్మకుమారుడు (నారదుడు) సెప్పెను, అందువలన సరస్వతిదరినిల్చి మందాకినిం దర్శింతురు. 146

తత్తీర్థం సర్వతీర్ధానాం పరం స్వయంభువోబ్రవీత్‌ | మందాకిన్యా సమం యాత్ర ప్రాప్య పుణ్యసమాగమమ్‌ ||147

తత్ర స్థానే స్థితా దేవైః స్తుతా దేవీ సరస్వతీ | మత్వా చైకాకినీం తాం తు దీనాస్యాం దీనమానసామ్‌ || 148

సఖీం తదాసృజద్ర్బమ్మరూపిణీం విమలేక్షణామ్‌ | హరిణీం హరిరప్యాశు జజ్ఞే కమలలోచనామ్‌ || 149

ఆతీర్థముత్తమోత్తమమని బ్రహ్మయనెను. మందాకినీసమమని దేవతలటనున్నారు. ఆ సరస్వతిని కొనియాడినారు. ఆమె యెంటరిదైన దీనురాలయినదని బ్రహ్మరూపిణిని యామెనెచ్చలిని బ్రహ్మ సృజించెను. హరియు హరిణి కమలనయన పుట్టించెను. 149

వజ్రిణీమపి దేవేశో వజ్రపాణిర్విసృష్టవాన్‌ | సుకురంగరుచిం దేవో నీలకంఠో వృషధ్వజః || 150

సఖీం సంజనయామాస సరస్వత్యాస్త్రిలోచనః | విలోక్యమానా సా రాజన్సఖీభిః సురసుందరీ || 151

వజ్రపాణి యామెను వజ్రిణిగానొనరించెను. వజ్రాయుధ సమముగ పాపములమీదంబోరు నీలకంఠుడు శివుడు చక్కని వేడిసొంపుగలదానిని సరస్వతితో పుట్టించెను. చెలికత్తెలతో చూడబడుచు శ్రీ సుందరి, సంతోషించుచు వారున్నచోటు నామెను గాంచి పెక్కు దేవతలతో తూర్పు ప్రయాణమైనది. 151

ప్రహృష్టా యాతుమారబ్ధా దేవాదేశాన్మహానదీ | తతః సఖీభిః సార్థం ప్రాచీనా గంతు ముద్యతా || 152

సరస్వతీ సమస్తానాం తాసాం శ్రేష్ఠతమా స్మృతా | ప్రాచీ సరస్వతీతోయం యే పిబంతి మృగా భువి || 153

తేపి స్వర్గం గమిష్యంతి యజ్ఞైర్ద్విజవరా యథా | చింతామణిరివాత్రైషా ప్రాచీ జ్ఞేయా సరస్వతీ || 154

తథా కామఫలస్యేయం హేతుభూతా నుహానదీ | దక్షిణాం దిశమాలోక్య పునః పశ్చాన్ముఖీ గతా || 155

ఉక్తా తయా తథా గంగా దిశం ప్రాచీం వ్రజస్వహ | విస్మర్తవ్యా న చాహం తే వ్రజ దేవి యథా గతమ్‌ || 156

ఇతి శ్రీపాద్మపురాణ ప్రథమే సృష్టిఖండే తీర్థావతారో నామ

ద్వాత్రింశోధ్యాయః ||

ఆ నది దేవతలందరికన్న చాలామిన్న సరస్వతియని ఋషులందురు. తూర్పుననున్న సరస్వతి జలమును త్రావిన జంతువులుగూడ యజ్ఞములు సేసిన ద్విజోత్తములతో బాటు స్వర్గమందును. ఇచట నీమె చింతామణియని యనుకొనవలసినది. ఆరత్నమట్లు యామె కోరినకోర్కెలనిచ్చును. దక్షిణ దిక్కునుజూచి మఱి పడమటిగానేగినది. గంగయూ తూర్పు దెసగానేగుము నన్ను మఱువవద్దు. తీరాదేవీ! వచ్చినదారినేగుమని యామెతోనన్నది.

ఇది శ్రీ పాద్మపురాణమున మొదటి సృష్టిఖండమునందలి తీర్థావతారమను ముప్పదిరెండవ అధ్యాయము.

Sri Padma Mahapuranam-I    Chapters