Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page

అర్థములు
శతావధానులు ః శ్రీ వేలూరి శివరామశాస్త్రి
విశ్వంపశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః
శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనాభేదతః|
స్వప్నే జాగ్రతివా య ఏష పురుషో మాయా పరిభ్రామితః
తసై#్మ శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే||
- శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్‌.

స్వప్నే వా = కాలయనేని, జాగ్రతి వా = మెలకువలోనేని, మాయాపరిభ్రామితః = మాయచే భ్రాంతి కలిగింపబడినవాడై, యః = ఏ, ఏషః = ఈపురుషుడు, విశ్వం = ప్రపంచమును, కార్యకారణతయా = కార్యకారణభావ సంబద్ధముగను - (కుండ కార్యము, మట్టికారణము), స్వస్వామిసంబంధతః = స్వస్వామిభావసంబద్ధముగను (తాను - ప్రభువు : అనగా ప్రజకు ప్రభువునకునుఉండు సంబంధము), శిష్యచార్యతయా = శిష్యుడు గురువు : వీరి యిరువురకునుగల సంబంధముతోడను, తథైవ=అటులే, పితృ పుత్రా ద్యాత్మనా = తండ్రి కొడుకు మామ అల్లుడు ఈ మొదలగు సంబంధముచేతను (కుండ వేరు మట్టి వేరనియు, రేడు వేరు లెంక వేరనియు, శిష్యుడువేరు గురువువేరయు, తండ్రివేరు కొడుకు వేరనియు) ఇటులు, విశ్వం = ప్రపంచమును. భేదతః=వేరువేరుగా, పశ్యతి=చూచుచున్నాడో, తస్మె = ఆ, గురుమూర్తయే = గురురూపుడగు, శ్రీదక్షిణామూర్తయే=శ్రీదక్షిణామూర్తికొఱకు, ఇదం నమః = ఈ నమస్కారము.

పుట 2 జగతీనాం పతిః.

జగతీనాం=జగత్తులకు, పతిః=ప్రభువు.

''త్రిదళంత్రిగుణాకారంత్రినేత్రంచ(త్రి)త్రయాయుషం

త్రిజన్మ పాపసంహార మేకబిల్వం శివార్పణమ్‌||

త్రిదళం = మూడు దళములు కలదియు, త్రిగుణాకారం=సత్త్వ రజస్తమ ఆకారమువంటి ఆకారముకలదియు, త్రినేత్రం = మూడుకన్నులు కలదియు, త్రయాయుషష్‌=బాల్యాద్యవస్థాత్రయాయుష్యము ఇచ్చునదియు, అనగా పురుషాయుష మిడునదియు, ఏకబిల్వమ్‌ = ఒక మారేడాకు, శివార్పణం (సత్‌) = శివునకు అప్పన చేయబడిన దనుచు, త్రిజన్మ పాపసంహారం = మూడు జన్మములలో చేసికొనిన పాపమును పోగొట్టునది (అగును).

అదిత్యవర్ణే తపసో7ధిజాతో

వనస్పతి స్తవ వృక్షో7థ బిల్వః,

తస్య ఫలాని తపసా నుదంతి మాయా

అంతరాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ||

- శ్రీసూక్తము. 6

ఆతిత్యవర్ణే = సూర్యుని కాంతివంటి కాంతి కల ఓ శ్రీమాతా,తన = నీయొక్క,తపసః = తపసు=చే, అథ = పిదప, (నీవు తపసు= చేసినపిదప),వనస్పతిః=పూలు లేక కాచు, బిల్వః వృక్షః = మారేడుచెట్టు, అధిజాతః = పుట్టెను తస్య=దాని,ఫలాని=పండ్లు,తపసా=తపసు=చే, మాయాంతరాః=మాయాజ్ఞానముతత్కార్యమునుఅయినట్టియు, యాఃబాహ్యాశ్చ = బహిరింద్రియ సంబంధము లయినట్టియు, అలక్ష్మీః=పాపదారిద్ర్యాదిదోషములను, నుదంతు=పోనడచుగాక, (సాయణ)

ఆదిత్యవర్ణే=సూర్య కాంతివంటి కాంతికల వైష్ణవ తేజోరూపిణి!, తవ=నీ,తపసా=అంశవలన, వనస్పతిః బిల్వః వృక్షః=(బిల్వః) పాపములను వ్యాధులను పోద్రోలు మారేడు చెట్టు, అధిజాతః = పుట్టెను, తస్య = దాని, ఫలాని = పండ్లు, మా = నన్నుగూర్చిన, యా = ఏ, ఆంతరాః=అంతరింద్రియమునకు చెందినవియు, యా = ఏ, బాహ్యాః = బాహ్యేంద్రియ సంబంధములయినవియునగు, అలక్ష్మిః=దోషములను,తపసా = తపసు=చే, నుదంతు = పోనడచుగాక, (భట్టభాస్కర).

పుట 4 వీతరాగ విషయం వాచిత్తమ్‌.

వీతరాగవిషయం=వీతరాగుల చిత్తముగూర్చి సంయమము పొందిన, చిత్తంవా = సాధకునిచిత్తము ఏకాగ్రమగును. హిరణ్యగర్భుడు, సనకుడు మొదలగువారు వీతరాగులు. వారిచిత్తములను భావించి సాధకు-డు తన చిత్తమును అటులు నిశ్చలముగా ఉండునటులు చేసికొనునది, అథవా తన కాలమునందు ఉన్న వీత రాగులు ఎటులు ప్రవర్తింతురోచూచినయెడల వారి చిత్త మెటులు ఉండునో గ్రహింపవచ్చును గ్రహించి వారి చిత్తమువలెనే తన చిత్తమును గూడ జేసికొనినచో ఏకాగ్రత కలుగును. ఈ సూత్రము వైరాగ్యాభ్యాసమును జెప్పి దానిగుండ చిత్తవిక్షేపమును తొలగించుటకు ఉపాయము చెప్పెను.

పుట 7 స్వస్తిప్రజాభ్యః పరిపాలయంతాం

న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః,

గోబ్రాహ్మణభ్యః శుభమస్తు నిత్యం

లోకాః సమస్తాః సుఖినో భవంతు||

ప్రజాభ్యః = ప్రజలకు, స్వస్తి = మేలు కలుగుగాక, మహీశాః=రాజులు, మహీం=భూమిని, న్యాయ్యేన = న్యాయమునుండి తొలగని, మార్గేణ=రీతిగా, పరిపాలయంతాం = ఏలుదురుగాక!' గోబ్రాహ్మణభ్యః = గోవులకును బ్రాహ్మణులకును, నిత్యం = నిచ్చలు, శుభం=మంగళము, అస్తు = అగుగాక, సమస్తాః = ఎల్ల, లోకాః = లోకములు, సుఖినః = సుఖముకలవి, భవంతు = అగుగాక!

పుట 11 నమోబ్రాహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయచ.

జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమోనమః||

- శాంతిపర్వము.

గోబ్రాహ్మణ హితాయ=గోవులకు బ్రాహ్మణులకును హితుడయినట్టి, బ్రహ్మణ్యదేవాయ=నారాయణునకు, నమః=నమస్కారము, జగద్ధితాయ = జగత్తులకును హితుడయిన, కృష్ణాయ గోవిందాయ = శ్రీకృష్ణునకు గోవిందునకు, నమోనమః = నమస్కారము. (ఆదరముచే ద్విరుక్తి.)

పుట 11 సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః,

పార్థోవత=ః సుధీరోభోక్తాదుగ్ధం గీతామృతంమహత్‌.

- గీతామాహాత్మ్యం.

సర్వోపనిషదః=ఎల్ల ఉపనిషత్తులును, గావః = ఆవులు, గోపాలనందనః = శ్రీకృష్ణుడు, దోగ్ధా = పితికెడివాడు, అర్జునః = అర్జునుడు, వత== లేగ, సుధీః = పండితుడు, భోక్తా = అనుభవించువాడు, దుగ్ధం = పితుక బడినది, మహత్‌ = గొప్ప, గీతామృతమ్‌ = గీత అను అమృతము.

పుట 12 సహయజ్ఞాఃప్రజాః సృష్ట్వాపురోవాచప్రజాపతిః,

అనేక ప్రసవిష్యధ్వం ఏషవో స్త్విష్ట కామధుక్‌||

- గీత 310.

ప్రజాపతిః=బ్రహ్మ, పురా = ముమ్మొదట, సహయజ్ఞాః=యజ్ఞములతోగూడ, ప్రజాః = ప్రజలను (ముత్తెగల వారలను), సృష్ట్వా = సృజించి, అనేన = ఈయజ్ఞముచే, ప్రసవిష్యధ్వమ్‌ = వృద్ధిచేయుదురుగాక! (పసవిష్యధ్వమ్‌ అనునది ఛాందసము), ఏషః = ఇది, వః = మీకు, ఇష్టకామధుక్‌=కోరిక గోరికలనుపితుకునది (గోష్ఠమున గట్టిన ఆవు పొదుగునుండి పితుకుకొనునటు లిచ్చునది), అస్తు = అగుగాక! (ఇతి ఉవాచ = అని పలికెను.)

పుట 13 దేవాన్‌ భావయతానేన తే దేవా భావయంతువః,

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాస=్యథ ||

- గీత. 311.

అనేక=ఈయజ్ఞముచే, దేవాన్‌=ఇంద్రుడు మొదలగు వారిని,భావయత=వర్థిల్లజేయుడు, దేవాః = ఆయింద్రాదులును, వః=మిమ్ములను, భావయంతు=వానలు మొదలగు వానిచే వర్థిల్లజేయుందురుగాక!, పరస్పరం=ఒకరినొకరు, భావయంతః = వర్థిల్లజేసికొనుచు, పరం=గొప్ప, శ్రేయః=మేలు, అవాప=్యథ=పొందుదురుగాక, ఇచట ప్రజలకు గొప్పమేలు కలుగుట ఇష్టమే. మఱి ప్రజల యజ్ఞములవలన దేవతలకుకూడ గొప్ప మేలు కలుగుననుట చెల్లునా? దేవతలు తమ్మారాధించిన వారికి మేలుకలిగింపనగునుగాని ఆరాధించువాడు ఆరాధింపబడినవానికి మేలుకూర్చుననుట చెల్లదు. కావున దేవతల కిది విధి కాదు. వార లీ ధర్మోపదేశమునకు విషయము కారు. వారు ఉద్భూతజ్ఞానులు, జీవస్ముక్తులును. కాగా వర్థిల్లజేసికొనుటయందే గొప్పమేలుపడయుటలో దేవతలకు సంబంధములేదని శంకరానందీయము.

పుట 17 నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే,

తత్‌ స్వయం యోగసంసిద్ధః కాలే నాత్మని విందతి||

- గీత 438

(యస్మాత్‌ = ఎందువలన) జ్ఞానేన సదృశం=జ్ఞానమును పోలిన, పవిత్రం=పవిత్రమగు వస్తువు, ఇహ = ఇచట, న విద్యతే = ఉండదో అందువల్ల, యోగసంసిద్ధః = జ్ఞానముచే సంస్కరింపంబడినకర్మసమాధిచే పరమాత్మ, సమాపత్తి లక్షణమైన ప్రకృష్ట ఫలము కలవాడై, కాలేన = సకాలమున, స్వయమేవ = స్వయముగనే, తత్‌ = ఆ జ్ఞానమును, లభ##తే=పొందును.

పుట 20 'తైలే లక్ష్మీర్జలే గంగా' - తులాపురాణం.

తైలే=నూనెలో,లక్ష్మీః=లక్ష్మీదేవి (ఉన్నది), జలే = నీటిలో, గంగా = గంగాదేవి (ఉన్నది).

పుట 23 రే హస్త దక్షిణమృతస్య శిశోర్ద్విజస్య

జీవాతవే విసృజ శూద్రమునౌ కృపాణమ్‌,

రామస్య చాహురసి దుర్భరగర్భఖిన్న

నీతావివాసనపటోః కరుణా కుతస్తే.

- ఉత్తర రామచరిత.

రే దక్షిణహస్త=ఓసి కుడిచేయీ!, మృతస్య = చనిపోయిన, ద్విజస్యశిశోః=బ్రాహ్మశిశువును, జీవాతవే = బ్రతికించుకొఱకు, శూద్రమునౌ=శూద్రముని మీద, కృపాణం=కత్తి, విసృజ = విసురు, రామస్య బాహు రసి=రాముని చేతివిగదా!, దుర్భర........పటోః = నిండు చూలుచే నవసిన సీతను వెడలనడచుపాటనముకల, తే నీకు,కుతః కరుణా = దయ యెటులు కలుగును?

పుట 28 యాతే రుద్ర శివా తనూ రఘోరా7పాపకాశినీ,

అఘోరేభ్యో థ ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః

- రుద్రము.

రుద్ర! = రుద్రుడా!, తే = నీ, యా=ఏ, తనూః=శరీరము, శివా=మంగళకరమయినదికనుకనే, అఘోరా=హింసచేయదు, అపాపకాశినీ=పాపమునొనరింపనీయదు, (తసై#్మతేతనుమౌ ఘోరా7న్యా శివా7న్యా=రుద్రునకుగల ఆయీశరీరములలో ఒకటిక్రూరము మఱొండు మంగళకరము. ఈశ్వరునకు సంహారముచేయు శక్తియే కాక అట్టి శక్తులెన్నోకలవు. వానిలో సంహారశక్తి అతిభయంకరము. భట్టభాస్కర భాష్యపీఠికచూచునది.) అఘోరేభ్యః = క్రూరము కానివియు, అథ = మఱి, ఘోరేభ్యః=ఘోరములైనవియు, ఘోర ఘోరతరేభ్యః = ఘోరాతిఘోరములగు ఆ యీ శరీరములకు నమస్కారము.

పుట 28 ఓంకారపంజరశుకీ ముపనిషదుద్యాన కేళికలకంఠీం,

ఆగమవిపినమయూరీ మార్యామంత ర్విభావయేగౌరీం||

దయమానదీర్ఘనయనాం దేశికరూపేణదర్శితాభ్యుదయాం.

- నవరత్న మాలికా.

ఓంకార.......శుకీం = ఓంకారము అనుకొప్పరముననున్న చిలుకయు, ఉప....కలకంఠీం = ఉపనిషత్తులు అను తోటలో ఆడవోయిలయు. ఆగమ మయూరీం = ఆగమములు అను అడవిలో నెమలియు, ఆర్యామ్‌=పూజనీయము, దయ...నయనాం = దయయొలుకు క్రాల్గన్నులు కలదియు, దేశికరూపేణ = గురుస్వరూపముతో, దర్శితాభ్యుదయాం = చూపబడిన అభ్యుదయము కలదియునగు, గౌరీం = గౌరిని, అంతః = హృదయమున, విభావయే = భావన చేయుదును.

పుట 28 అవటుతటఘటితచూలీం తాడితపలాశతాటంకాం,

వీణావాదన వేలాకంపితశిరసం నమామిమాతంగీమ్‌.

- నవరత్న మాలికా.

అవటు.........చూలీం = ముచ్చిలిగుంటమీదకైసేసిన వేనలి కలదియు, తాడిత.....తాటంకాం = తాటాకులు కమ్మలుగాగలదియు, వీణా......శిరసం = వీణ వాచునపుడూగుక్రొందలగల, మాతంగీం=మాతంగిని, నమామి=నమ్కరించుచున్నాడు.

పుట 29 పురారాతే రంతః పురమసి తతస్త్వచ్చరణయో

=పర్యా మర్యాదా తరళ కరణానా మనులభా,

తథాహ్యేతే నీతా శ్శత మఖముఖా సి=ద్ధి మతులాం

తవ ద్వారోపాన్త స్థితిభి రణిమాద్యాభి రమరాః||

- సౌందర్యలహరి.

పురారాతేః = పురాంతకునికి, అంతఃపురం అసి = రాణివాసమవు, తతః=దాన, త్వచ్చరణయోః = నీపాదములయొక్క, సపర్యా మర్యాదా = పూజ ఎటులు చేయవలెనో దానిమర్యాదా, తరళకరణానాం = చంచలమగు ఇంద్రియములు కలవారికి, అసులభా=సులభముకాదు 'చంచలచిత్తుల కంతఃపురప్రవేశము కూడదని తెల్లము కావున నిశ్చలచిత్తులేయగు కావలివారు రాణివాసములోనికి పోవలయు'నని నీతివాక్యామృతము. సుధా సముద్రమధ్యమున నున్న భగవనీ పాదసేవ నిర్మలచిత్తులగు సమయులకే తెలియునుగాని ఒరుల కెఱుక కాదని అర్థము. తథాహి = అది అట్టిద, ఏతే = ఈ, శతమఖ ముఖాః=ఇంద్రాదులగు, అమరాః=దేవతలు, తవ=నీ, ద్వారోపాంత స్థితిభిః = గుమ్మముదరి నునికిగల, అణిమాద్యాభిః (సహ) = అణిమాదులతోడి, అతులాం = ఎనలేని, సిద్ధిం = సిద్ధిని, నీతాః = పొందింపబడిరి. అణిమాదిసిద్ధులు నీ గుమ్మముదరినే సేవించినటులింద్రాదులును సేవింతురు. ఇచట ఇది విశేషము-అణిమాదిసిద్ధులును నీవాకిట కావలి కాయుచుండగా నీవుండుట స్వభావసిద్ధము. ఇంద్రాదులు చంచలచిత్తులు కావున రాణివాసములోనికి జనుటకు తగమిచే కావలివారల అనుమతి గొని గవకు కడనేని ఉండగలుగుటయే సిద్ధియని తాత్పర్యము. (లక్ష్మిధర)

అరుణామోదిని భక్తులకు భగవతి కోరిన వరములిచ్చుట గూర్చి యీశ్లోకము చెప్పుచున్నది- (త్వం = నీవు) పురారాతేః=త్రిపురాంతకునకు, అంతఃపురం = అవరోధము-పట్టమహిషివి, అసి = అయితివి, ఆయన సామాన్యసాధువు కాడు; మఱిత్రిపురాంతకుడు. రాచకన్నెలో ఎండ కన్నెఱుగరు; నీవో అంతిపురిలో నుందువు, పైగా రుద్రుని పట్టపుదేవివి. భక్తుల విన్నపములకు వీలుకలుగదని అభిప్రాయము, తతః = అందువలన, త్వచ్చరణయోః=నీపారములకు, అమర్యాదా=ఎల్లలేని, సపర్యా=పూజ, తరల కరణానాం = చంచలమగు ఇంద్రియములు కలవారికి-ఇంద్రియనిగ్రహము లేనివారికి, అసులభా=దుర్లభము, చపలచిత్తులు పరమ శివమహిషి వగు నిన్ను పూజింప నోప రని అర్ధము. లేక యిటులుచెప్పుదము: పురారాతేః = నీశక్తివలన, త్రిపురసంహారకీర్తి వడసిన, అంతః=రుద్రునిలోనున్న - దేహములోపలనున్న, పురం = శరీరమవు, అసి=ఐతివి, శక్తి దేవీసామర్ధ్యరూపము కదా. (కావున) త్వచ్చరణయోః అమర్యాదా సపర్యా = నీ పాద సంపూర్ణ పూజ, తరల కరణానాం = మనోనిగ్రహము లేమిధ్యానము చేయజాలనివారికి. అసులభా = సులభముకాదు, కాని అ్శసులభా==బ్రహ్మాదులచేతనే సులభముగా చేయదగినది అని అర్థము. తథాహి = అది అట్టిదే, శతమఖముఖాః ఏతే అమరాః = ఇంద్రాదులగు ఈ వేల్పులు, తవద్వారోపాంతస్థితిభిః=నీగుమ్మముకడ పడిగాపులుకాయు, అణిమాద్యాభిః=అణిమ మహిమ మొదలగువానితోగూడ, అతులాం సిద్ధిం నీతాః=ఎనలేని యోగసిద్ధిని పొందింపబడిరి. ఇంద్రాదులు నీయనుగ్రహమున వైభవము వడసినను ఉర్వశ్యాది రసికులు గాన చంచలచిత్తులగుటచే అంతఃపురప్రవేశమున కనర్హులుగాన వీరి నివాసము చక్రము లన్నింటికిని వెలుపలిదయిన చతురశ్రవున నుండు అణిమాది సిద్ధులకువలె ముంగిలికడనే నిర్దేశింపబడినదని భావము. లేక యింద్రాదు లణిమాదిసిద్ధిని పొందింపబడినారనిఅర్థము, అణిమాదులు లోభులనుమోసగించును. నానామాయా విలాసములకు మూలములు, వేశ్యాప్రాయములు. బాహ్యచతురశ్రముకడ నుండు యిట్టి అణిమాదులచే ఇంద్రాదు లెలయింపబడిరని అర్థము.

పుట 30 సుధామప్యాస్వాద్యప్రతిభయజరామృత్యుహరిణీం

విపద్యంతే విశ్వే విధిశత మఖాద్యా దివిషదః,

కరాళం యత్వేక్షళం కబళితవతః కాలకలనా

న శంభో స్తన్మూలం తవ జనని తాటంకమహిమా||

జనని=ఓయమ్మా!, విశ్వే=ఎల్ల, విధిశతమఖాద్యాః = బ్రహ్మేంద్రాదులైన,దివిషదః=దేవతలు, ప్రతిభయ....హరిణీం=అతిభయంకరమగు ముదిమిని మృత్యువును హరించు, సుధాం=అమృతమును, ఆస్వాద్య అపి = క్రోలియు, విపద్యన్తే = విలయము పొందుచున్నారు. కరాళం=గాటగు, క్ష్వేళం=విషమును, కబళితవతః = మ్రింగివైచిన, శంభోః=శంభువునకు, కాలకలనా=యమస్పర్శ అనగా చావు, నాస్తీతియత్‌ = లేదనుట ఏది కలదో, తన్మూలం=దానికి కారణము, తవ=నీయొక్క, తాటంక మహిమా = కమ్మల గొప్పదనము. అమ్మకాలసంకరిణి యనియును, కమ్మలు మొదలగునవి మాంగలికములనియు, వాని దాల్చిన పతివ్రతలు పతుల గండములను పొంగొట్టగల రనియును తాత్పర్యము. ఇటులగుటబట్టి శంభువునకును విపత్తు కలుగునెడల నీ కమ్మలు రాలును. కాలునకు నీ కమ్మలందవు. కాలము యొక్కయు ఉత్పత్తిస్థితిలయములు నీకమ్మలున్న యెడలనే జరగును. కావున అమ్మవారి పాతివ్రత్యమహిమ కడు దొడ్డదని యభిప్రాయము.

బ్రహ్మాదులను మృత్యువు తన్నుకొని పోవకుండుటకు సుధాస్వాదరూప కారణ మున్నది. కాని వారికి జరా మృత్యురాహిత్యరూపమగు కార్యములేదు; శివునకు మృత్యుభయము లేదు కాని మృత్యువునకు కారణమగు విషభక్షణ మున్నది' కాని విశేషోక్తివిభావనాలంకారములు వ్యక్తములు. 'అమృతము క్రోలియు బ్రహ్మాదులు విపన్నులగుచున్నారు. శంభువు గరళముమ్రింగియు విపన్నుడుకాడు' అని విరాధాభాసము. సాక్షాత్తు నీ కమ్మల మహిమచేతనే మ్రింగిన విషమమృతమాయెను; తానును మృత్యుంజయుడాయెను. నీ కమ్మలు గరుడమణులచే పొదుగబడెనా లేక విషహరములా లేక యీ రెండునా? అను వితర్కము వ్యంగ్యము. వేఱు దేవతా స్త్రీల సౌభాగ్యము నశ్వరము. నీ సౌభాగ్యమునశ్వరము. మఱిప్రలయమునందునుపోదు. ఇట్టినీతో గూడ శివున కనాద్యావినాభావమున్నదని పర్యవసితార్థమని సౌభాగ్యవర్ధని.

పుట 31 యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహభేషజీ

శివా రుద్రస్యభేషజీ తయానోమృడజీవసే. - రుద్రము.

హేరుద్ర=ఓ రుద్రుడా!, తే=నీ, శివా = శాంతమయిన, యా=ఏ, తనూః = శరీరము (కలదో), ఆయా=ఆ శరీరముతో, నః=మమ్ము, జీవసే = బ్రతికించుటకు, మృడ = సుఖపెట్టుమా! (ఏ శరీరము ఎందువలన), విశ్వాహ భేషజీ = ఎల్లప్రొద్దులందును మందువంటిదో (దానివలన), శివా=మంగళకర మయినది (రోగమునకు సరేసరి, దారిద్ర్యమునకును మందువంటిది. మరియు దేనివలన), రుద్రస్య=రుద్రునియొక్క (తాదాత్మ్యము పొందుటకు అనగా రుద్రత్వము చెందుటకు), భేషజీ = మందువంటిదో (దానివలన), శావా=మంగళకరమయినది. మంగళమయమయిన ఆ రూపమంబికది. జ్ఞాన మొసగున దగుటచేతను జన్మమరణాది దుఃఖమును పోగొట్టునదగుటచేతను ఈ శరీరము మంగళమయినదని తాత్పర్యము.

పుట 31 శివః శక్త్యాయుక్తో యదిభవతి శక్తః ప్రభవితుం

నచే దేవం దేవో న ఖలు కుశలః స్పందితు మపి,

అతస్త్వా మారాధ్యాం హరిహర విరించాదిభిరపి

ప్రణంతుం స్తోతుం వా కథ మకృతపుణ్యః ప్రభవతి?

- సౌందర్యలహరి.

భవతి!=ఓయమ్మా!, శివః=సర్వమంగళమయుడయిన సదాశివుడు, శక్త్యా = శక్తితో (చేయుటకును చేయకుండుటకును, వేఱొకరీతిగా చేయుటకును సామర్థ్యము కలది శక్తి.) యది యుక్తోభవతి తదా = కూడినవాడగునేని, శక్తోభవతి ప్రభవితుం=ప్రభువుకానేర్చును (ప్రభువగుటకు సమర్థుడగును. ప్రపంచము సృజింప సమర్థుడగును.) న చే దేవం=ఈ దెస శక్తియుక్తుడు కాదేని. దేవః=అప్రతిహతమగు లీల కలదేవుడు. స్పందితుమపి=కతలుటకును, న కుశలః = సమర్థుడు కాడు. అతః=ఇక్కతన, హరి....అపి = మూర్తిత్రయాదులచేతను, ఆరాధ్యాం = ఉపాసింపదగిన=కొలువదగిన, త్వాం=నిన్ను, ప్రణంతుం=మ్రొక్కుటకుగాని, స్తోతుంవా=స్తోత్రము చేయుటకుగాని, అకృత పుణ్యః = పుణ్యము చేయనివాడు - నోచుకొననివాడు, కథం ప్రభవతి = ఎటులు సమర్థుడు?

పుట 34 వేదోనిత్యమధీయతాంతదుదితంకర్మస్వసుష్టీయతాం

తేనేశ=స్యవిధీయతా మపచితిః కామ్యే మతి స్త్యజ్యతామ్‌,

పాపౌఘః పరిధూయతాం భవసుఖేదోషోనుసంధీయతా

మాత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం.

నిత్యం=ఎల్లప్పుడును, వేదః = వేదము, అధీయతాం = అధ్యయనము చేయబడుగాక!, తదుదితం=వేదముచే చెప్పబడిన, కర్మ = కర్మ, స్వనుష్ఠీయతాం = సు = చక్కగా, అనుష్ఠీయతాం = చేయబడుగాక!

తేన = దానిచే - ఆ వేదవిహిత కర్మచే, ఈశన్య = ఈశ్వరునికి, అపచితిః=పూజ, విధీయతాం=చేయబడుగాక!, కామ్యే = కోరికయందు-కామ్యకర్మలో, మతిః = బుద్ధి, త్యజ్యతామ్‌ = విడనాడబడుగాక!, పాపౌఘః = పాపసముదాయము, పరిధూయతామ్‌=దులుపబడుగాక!, భవసుఖే = సంసార సుఖమునెడ, దోషః = దోషము (కలదని) మరల మరల ఆ సుఖమునందే ఆసక్తికలుగుట, ఆ సుఖము దుఃఖముగా పరిణమించుట యీ మొదలగు దోషములు కలవని; అనుసంధీయతామ్‌ = మరల మరల ఆలోచింపబడుగాక!, ఆత్మేచ్ఛా=ఆత్మ నెరుగునిచ్చ, వ్యవసీయతాం=నిర్ణయింపబడుగాక, నిజగృహాత్‌ = స్వగృహము నుండి, తూర్ణం=వడిగా, వినిర్గమ్యతాం=బయటబడ బడుగాక!

పుట 35 సంగంసతు=విధీయతాం భగవతో భక్తిర్దృఢాధీయతాం

శాంత్యాదిః పరిచీయతాం దృఢతరం కర్మాశుసంత్యజ్యతామ్‌

సద్విద్వా నుపసర్వ్యతాం ప్రతిదినం తత్పాదుకాసేవ్యతాం

బ్రహ్మైకాక్షర మర్థ్యతాం శ్రుతిశిరో వాక్యం సమాకర్ణ్యతామ్‌.

సతు==సత్‌ పురుషులలో, సంగం=సంబంధము, విధియతాం = చేయబడుగాక! దృఢా = గట్టి, భగవతః భక్తిః=భక్తి, అధీయతామ్‌=నెలకొలుప బడుగాక! శాంత్యాదిః=శాంతి మొదలయినది, దృఢతరం=మిగులగట్టిగా, పరచీయతాం పెంపొందించు కొనబడుగాక, కర్మ=కర్మ, ఆశు=వడిగా, సంత్యజ్యతాం=విడనాడుకొనబడుగాక, సద్విద్వాన్‌ = యోగ్యుడగు జ్ఞానవంతుడు, ఉపసర్ప్యతాం = ఆశ్రయింపబడుగాక! ప్రతిదినం=ఏనాడును, తత్పాదుకే=అతని పాదుకలు, సేవ్యతాం=సేవింపబడుగాక, ఏకాక్షరం=ఒకఅక్షరము స్వరూపముగాగల, బ్రహ్మ=బ్రహ్మము, అర్థ్యతాం=ఉపదేశింపగోరబడుగాక, శ్రుతి-వాక్యం=ఉపనిషద్వాక్యము, ఆకర్ణ్యతాం=వినబడుగాక.

పుట 35 వాక్యార్థశ్చవిచార్యతాంశ్రుతిశిరఃపక్షఃసమాశ్రీయతాం

దుస్తర్కస్తు విరమ్యతాం శ్రుతిమన స్తర్కోను సంధీయతాం,

బ్రహ్మైవాస్మి విభావ్యతా మహరహర్గర్వః పరిత్యజ్యతాం

దేహే7హంమతిరుఝ్యతాంబుధజనైర్వాదఃపరిత్యజ్యతాం.

వాక్యార్థశ్చ=ఆయాయీశాస్త్రములప్రామాణ్యముచే జేయబడిన పూర్వపక్ష సిద్ధాంతరూపమగు వాక్యార్థము గూడ, విచార్యతామ్‌=విచారింపబడుగాక!, శ్రుతిశిరః పక్షః=ఉపనిషత్తులు, పక్షము; సమాశ్రీయతాం=ఆశ్రయింపబడుగాక!, దుస్తర్కాత్‌=కూడనితర్కమునుండి, సు విరమ్యతాం = మెత్తనతొలగిపోబడుగాక!, శ్రుతి మతః=శ్రుత్యనుకూలమగు, తర్కః=తర్కము, అనుసంధీయతాం=అనుసంధింపబడుగాక!, అహరహః=ప్రత్యహము-ఎల్లపుడును, 'బ్రహ్మైవాస్మి' (ఇతి) విభావ్యతాం=బ్రహ్మము నేనని భావన చేయబడుగాక!, గర్వః=గర్వము, పరిత్యజ్యతాం=విడనాడబడుగాక!, దేహే=మేనియందు, అహం మతిః=నే నను బుద్ధి, ఉఝ్యతాం=విడనాడబడుగాక!, బుధజనైః=బుధులతో, వాదః పరిత్యజ్యతామ్‌=వాదులాడకుండబడుగాక!

పుట 36 'ఆత్మావా అరేద్రష్టవ్యః శ్రోతవ్యో మంతవ్యో

నిదిధ్యాసితవ్యః' - బృహ.

అరే=ఓసిమైత్రేయీ! ఆత్మా వై=ఆత్మయే, ద్రష్ట వ్యః=ఎఱుకకు విషలముగా జేయదగినది, శ్రోతవ్యః=వినదగినది, మన్తవ్యః=మననము చేయదగినది, నిదిధ్యా సితవ్యః=నిశ్చయముతో ధ్యానింపదగినది.

పుట 37 'పదార్థత్వమ్‌ అభిధేయత్వమ్‌'

- సంగ్రహ దీపిక. ద్రవ్యగుణ ..... పదార్థాః.

(పదస్య అర్థః పదార్థః) 'పదముయొక్క అర్థము పదార్థము' అను వ్యుత్పత్తిచే అభిధేయత్వము పదార్థ సామాన్య లక్షణము. అనగా ఏదే నొకపేరు కలది పదార్థమని పదార్థ సామాన్యలక్షణము. 'బుచ్ఛంతీంద్రియాణి యమ్‌ సః=అర్థః=దేనినిగూర్చి ఇంద్రియములు చనునో అది అర్థము. అనగా ఇంద్రియములచే కనుగొనబడు బాహ్యవస్తువు. కాగా పేరు పెట్టదగిన బయటి వస్తువేదేని పదార్థము అని తాత్పర్యము.

పుట 42 'సత్యం వద'

సత్యం=సత్యము, వద=పలుకుము.

పుట 42 'పితృదేవో భవ'

పితృదేవః=తండ్రిదైవముగాకలవాడవు, భవ=అగుమా.

పుట 43 యద్వేదాత్‌ ప్రభుసమ్మితాదధిగతంశబ్దప్రమాణాచ్చిరం

య చ్చార్థప్రవణాత్పురాణవచనాదిష్టం సుహృత=మ్మితాత్‌!

కాంతాసమ్మితయా యయా సరసతా మాపాద్యకావ్యశ్రియా

కర్తవ్యే కుతుకీ బుధో విరచిత స్తసై#్య నమస్కుర్మ హే||

- ప్రతాపరుద్రీయము.

ప్రభుసమ్మితాత్‌ = రాజువంటిదియు, శబ్దప్రమాణాత్‌ వేదాత్‌ = శబ్దప్రధానము నగు వేదమువలన, చిరం = చాలాకాలమునకు, యత్‌ = ఏది, అధిగతం=పొందబడునో, ప్రత్యక్షాది ప్రమాణాంతరముచే తెలియని యజ్ఞము మొదలగువానివలన గలుగు ఇష్టము, పరస్త్రీ ప్రవర్తనము వలన గలుగు అనిష్టమువంటివి వేదము వలననే తెలియదగినవి. యాగము కర్తవ్వమనియు పరస్త్రీ ప్రవర్తనము అకర్తవ్యమనియు శబ్దప్రమాణము వలననే తెలియదగినవనియు వేదార్థ గ్రహణములో మీమాంసాద్యపేక్ష యున్నదనియు అదియు చాల కాలమునకుగాని వశపడదనియుగ్రహింపవలెను. సుహృత=మ్మితాత్‌ = మిత్రునివంటిదియు, అర్థప్రవణాత్‌ = అర్థప్రధానమగు, పురాణవచనాత్‌=పురాణవాక్యములవలన, యత్‌=ఏది, చిరం=చాలాకాలమునకు, ఇష్టం=ఇష్టమగునో-చాలాకాలానికిగాని ఇష్టము కాదో, పురాణములు మేలుచేసినవాడు 'మే లొందెను. కీడు చేసినవాడు కీడొందెను' అని మిత్రుడు దృష్టాంత ముఖముగా మంచి చెడుగులు చెప్పినటులు చెప్పును. పురాణ కథలకు స్వార్థమందు చూపులేదు. పురాణ పాత్రలకు ప్రసిద్ధి ఉన్నను పురాణములకు చెప్పదలచుకొనిన విషయమే ప్రధానముకాన అవి అర్థప్రధానములు. అవి 'ఇటులు చేయుము; ఇటులు చేయకుము' అని వేదమువలె ఆజ్ఞాపింపవు, కాంతా సమ్మితయా=భార్యవంటి, యయా=ఏ, కావ్యశ్రియా=కావ్యశ్రీచేత, సరసతాం=సరసత్వమును, ఆపాద్య=పొందించి, కర్తవ్యే=కర్తవ్యమునందు-ఏది చేయదగినదో అట్టిదానియందు, బుధః=బుధుడు, కుతుకీ విరచితః=కౌతుకము కలవాడుగా చేయబడెనో, తసై#్య=అట్టి కావ్యశ్రీకొరకు, స్పృహాం=కుర్మహే = వేడుకపడుచున్నాము. కాంతునకు కాంత యెల్లయు అందమే - నడవనీ, చూడనీ నవ్వనీ, మరలనీ, మెసలనీ, ఉలుకనీ=పలుకనీ-ఇదిదేనికదియే ఒకానొక అందము. ఆమె-దీనిని తెమ్ము అని కాని, అటులు చేయుము అనికాని, ఆటులుచేయవలదని కాని చెప్పకయే వలయునదెల్ల చెయించుకొనగలదు. ఆమె కనువంపు కనుబొమ్మ సొంపులబట్టియే ఆమె కాంతుడు వలయున దెల్లయు చేయగలడు. ఇటులే కావ్యము కద్దనియు వద్దనియు చెప్పదు. అది చేయు వ్యంజనాసౌందర్యము సూటిగా హృదయములో దూరి సరసత నాపాదించి ప్రవర్తకముగాని నివర్తకముగాని అగునని తాత్పర్యము.

పుట 44 శ్రుతిం పశ్యంతి మునయః.

మునయః మునులు, శ్రుతిం, = వేదమును, పశ్యంతి=చూచుచున్నారు.

పుట 44 సంస్కారజన్యం జ్ఞానం స్మృతిః.

- తర్కసంగ్రహము.

సంస్కార=సంస్కారమువలన(అనుభవమువలనసంస్కారమేర్పడును), జన్యం = కలిగిన, జ్ఞానం = జ్ఞానము, స్మృతిః = స్మృతిః. మనము ఒకపుడు ఏనుగునుగాని మరొక దానినిగాని చూచియుందుము. అయేనుగు పోలిక యేదియేని కానిపించినపు డాయేనుగు గుఱుతువచ్చును. అటులు గుఱుతు (స్మృతి) కలుగుటకు కారణము లోగడ మనము ఏనుగునుచూచిన అనుభవము సంస్కార రూపముగా మనను నంటికొని యుండును. స్మృతి కలుగుటకు ఆ సంస్కారము కారణము.

పుట 45 తస్యాః ఖురన్యాస పవిత్రపాంసు

మపాంసులానాం ధురికీర్తనీయా,

మార్గం మనుష్యేశ్వర ధర్మపత్నీ

శ్రుతే రివార్థం స్మృతి రన్వగచ్ఛత్‌|| - రఘువంశము.

అపాంసులానాం = కళంకము లేనివారిలో, ధురి = మొదట, కీర్తనీయా=కొనియాడదగిన, మనుష్యేశ్వర ధర్మపత్నీ = సుదక్షిణ, తస్యాః = ఆనందినియొక్క, ఖురన్యాస పవిత్రపాంసుం= గిట్టల నుంచుటచే పవిత్రమైన పరాగము.

కల మార్గం=దారిని, శ్రుతేః=శ్రుతియొక్క, అర్థం=అర్థమును, స్మృతిరివ=స్మృతివలె, అన్వగచ్ఛత్‌=అనుగమించెను.

పుట 45 ఉపమా కాళిదాసస్య భారవే రర్థగౌరవమ్‌,

దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః ||

- చాటువు.

కాళిదాసస్య=కాళిదాసుయొక్క, ఉపమా = ఉపమలు చెప్పు సొగసును, భారవేః=భారవియొక్క, అర్థగౌరవమ్‌=లోతైన అర్థము తెలుపుగౌరవమును, దండినః = దండియొక్క, పదలాలిత్యం=పదమార్దవమును, త్రయః=ఈ మూడైన, గుణాః=గుణములు, మాఘే = మాఘునందు, సంతి=కలవు.

పుట 46 భ్రువౌకించిద్భుగ్నే భువనభయభంగవ్యసనిని

ద్వదీయే నేత్రాభ్యాం మధుకర రుచిభ్యాం ధృతగుణమ్‌

ధనుర్మన్యే సవ్యేతర కరగృహీతం రతిపతేః

ప్రకొష్ఠే ముష్టౌ చ స్థగయతి నిగూఢాంతర ముమే.

భువన........వ్యసనిని=భువనముల నెరపును చెరపుట యెడ పేరాసగల, ఉమే=అమ్మా!, కించిత్‌=కొంచెము, భుగ్నే=వంగిన, త్వదీయే=నీవగు, భ్రువౌ=కనుబొమలు, మధుకర రుచిభ్యాం=తుమ్మెదల రంగువంటి రంగుకల, నేత్రాభ్యాం=కనులచే, ధృతగుణం=కట్టబడిన అల్లెత్రాడుగల, రతిపతేః=మన్మథునియొక్క, సవ్వేతర కరగృహీతం=ఎడమచేత పట్టుకోబడినదై, ప్రకోష్ఠే=మంజేయియు, ముష్టౌచ=పిడికిలియు, స్థగయతి (సతి)=కప్పుచుండగా, నిగూఢాంతరం=మరుగుపడిన నడిమిచోటు కల, ధనుః = విల్లు! (ఇతి=అని) మన్యే = తలచుచున్నాను.

పుట 53 'ఏకమేవా7ద్వితీయంబ్రహ్మా' - ఛాందోగ్య.

బ్రహ్మా = బ్రహ్మము, అద్విదీయం=రెండవది లేని, ఏకమేవ=ఒక్కటే, 'ఆత్మ ఒకటియే కలదుగాని ప్రపంచమను రెండవ వస్తువులేదు' అని తాత్పర్యము.

పుట 53 పురుష ఏవేదం సర్వమ్‌ - పురుషసూక్తము.

ఇదం=ఈ, సర్వమ్‌=ఎల్లయు, పురుషఏవ=ఆత్మయే, (మూలములో 'ఇదంసర్వం పురుష ఏవ' అని అర్థక్రమమనుసరించి చెప్పబడినది).

పుట 53 ఈశ్వరాసుగ్రహా దేవ పుంసా మద్వైతవాసనా,

పుంసాం=పురుషులకు (జనమునకు), అద్వైతవాసనా = అద్వైతసంస్కారము, ఈశ్వరానుగ్రహాదేవ=ఈశ్వరుని అనుగ్రహమువలననే (కలుగును).

పుట 53 భక్త్యా మా మభిజానాతి యావా& యశ్చాస్మి త త్త్వతః||

- గీత. 18-55.

యావా& = ఎంతవాడనో (సృష్టిలోని ఉపాధులు ఎన్నియో అవన్నియు ఆత్మవే, కావున ఇట్లనుట) తత్త్వతః=నైజముగా, యశ్చ అస్మి=ఎవడనో (ఉపాధి భేదములు లేక ఆకాశమువంటివాడు కావున) భక్త్యా=భక్తిచేత-ఆర్తుడు, జిజ్ఞాసువు, ఆర్థార్థి - వీరలభక్తి కంటె నాలుగవదగు పరభక్తిచేత - ఏభక్తిచే ఈశ్వరక్షేత్రబుద్ధి పోవునో అట్టిపరభక్తిచే, మాం=నన్ను అభిజానాతి=తెలిసికొనును.

పుట 54 వేదో నిత్య మధీయతామ్‌

దీని అర్థము ఈసంపుటమున 177వ పుటలోచూచునది)

పుట 55 ''మోక్షకారణ సామాగ్ర్యాం భక్తి రేవ గరీయసీ''

మోక్ష....గ్రాం=మోక్షమునకు గల, కారణ=కారణములయొక్క, సామగ్ర్యాం=సామగ్రిలో (సమగ్రమగు మోక్షకారణములలో, మోక్షకారణము లన్నింటిలో), భక్తిరేవ=భక్తియే, గరీయసీ=కడుదొడ్డది.

పుట 59 బ్రహ్మచార్యసిఆచార్యాధీనోభవ! భిక్షాచర్యంచర!

బ్రహ్మచారీ=బ్రహచారివి, అసి = అగుచున్నావు, ఆచార్యాధీనః = గురువునకగ్గము కమ్ము, భిక్షాచర్యం చర=బిచ్చ మెత్తికొనుము, బాఢమ్‌=అటులే ప్రతిజ్ఞ చేయుచున్నాను అని తాత్పర్యము.

పుట 61 ఆచార్యాయ ప్రియం ధన మాహృత్య ప్రజా

తంతుం మా వ్యవచ్చేథీ=ః||

ఆచార్యాయ=గురువు (కొఱకు)నకు, ప్రియం=ఇష్టమైన, ధనం=ధనము, ఆహృత్య=తెచ్చి (యిచ్చి, అనుజ్ఞగొంది), ప్రజాతంతుం = సంతతి యను దారమును, మా వ్యవచ్చేథీ==తెంపివేయకుము.

పుట 64 ''మనఏవమనుష్యాణాంకారణం బంధమోక్షయోః||

మనష్యాణాం=మనుష్యుల, బంధమోక్షయోః=బంధమునకు మోక్షమునకు, మన ఏవ=మనసే=, కారణం=హేతువు.

''న కించ దపి చింతయేత్‌'' - గీతా 6-25.

ఆత్మసంస్థం మనః కృత్వా' అనునది దీనివెనుక గలదు. ప్రత్యగాత్మలో మనసు=ను ముగియునటులు చేసి అని దీని కర్థము. కించిదపి=దేనినేనియు, న చిందయేత్‌=వృత్తికి విషయము చేయరాదు. అనాత్మాకారవృత్తినిగాని, ఆత్మాకారవృత్తినిగాని చేయరాదు. ఆనాత్మాకార వృత్తికూడనే కూడదు. మరి ఆత్మాకారవృత్తి సంప్రజ్ఞాతసమాధి యగును. కాన అసంప్రజ్ఞాతసమాధి సిద్ధికి ఆత్మాకారవృత్తియు ఉండరాదు. మనసు=నిశ్చలమగునేని తనంత దా బ్రకాశించు ఆనందమే. తానై ఆత్మధ్యానమునుండిగూడ నివృత్తుడు కావలయును.

పుట 66 ''అహింసా ప్రతిష్ఠాయాం తత=న్నిధౌవైరత్యాగః''

- యోగసూత్ర సాధనపాద 35.

అహింసా...యాం=(వాజ్మనఃకాయములచేచేయబడిన) అహింస=అహింసయొక్క, ప్రతిష్టాయాం=గట్టితనము కలువగా - అహింస దృఢపడగా, తత=న్నిధౌ = అట్టియోగిసమీపమున,వైరత్యాగః=వైర = (పుట్టుకతో శత్రువులగు జంతువులయు) వైరముయొక్క, త్యాగః=విడుపు (కలుగును). ఎట్టిచోనేని ప్రబలమగు ఎట్టి కారణముచేనేని ఇతరులకు కీడు కలిగించు భావమే యోగి కుదయింపదో అట్టియోగిలో అహింస ప్రతిష్ఠితమయినదని తెలియనగును. అట్టియోగియందు ప్రతిష్టితమయిన అహింసాప్రభావమును సాక్షాత్తుగా చూచిన జంతువులు ఆ యోగి సాన్నిధ్యమునందు పరస్పరవైరముడుగును. అట్టి ప్రభావమును దవ్వులనుండి విన్నవారు తమతమ స్వభావమునకు అనుగుణముగ వర్తింతు రని సన్నిధి శబ్దము చెప్పునుొ.

పుట 67 ''అహింసన్‌ సర్వభూతా న్యన్యత్ర తీర్థేభ్యః''

తీర్థేభ్యఃఅన్యత్ర=తీర్థములకంటె వేఱుచోటుల, సర్వభూతాని=ఎల్ల భూతములను - ఏ ప్రాణి నయినను, అహింసన్‌=హింస చేయక ఉండుచు.

పుట 67 వాఙ్మనసయో రైకరూప్యం సత్యమ్‌''.

వాఙ్మనసయోః=మాటకును మనసునకును, ఐకరూప్యం=ఏకత్వము, సత్యమ్‌ సత్యము, మాట యెట్టిదో మనసట్టిదగును, మనసెట్టిదోమాట అట్టిదిగను ఉండుటెందో అది సత్యము.

పుట 68 ''సత్యం భూతహితం ప్రియమ్‌''

భూత = ప్రాణులకు, హితం = హిత వయినదియు ప్రియం = ప్రియమయునదియుగా, సత్యం = సత్యము (ఉండవలయును).

పుట 69 ''సత్యప్రతిష్ఠాయాం క్రియాఫలాశ్రయత్వమ్‌''

- యోగసూత్ర - సాధనపాద - ్‌్త6

సత్యప్రతిష్ఠాయాం=సత్యము నెలకొనగా, క్రియా....త్వమ్‌=క్రియా=కర్మాచరణముచే గలుగుఫలము యోగిమాటచేతనే, ఫల=ఫలమునకు, ఆశ్రయత్వమ్‌=ఆశ్రయమగుట (జరుగును). ధర్మాధర్మ రూపమగు కర్మవలన స్వర్గనరకములు కలుగును. అట్టి కర్మ చేయకుండగనే సత్యప్రతిష్ఠ కలిగిన యోగి గనుక ఆశీర్వదించుచో ఆశీర్వదింపబడువానికి మనసు=నందు మాటుపడిన సంస్కారముసముదితమైదానివలనఅట్టిఫలముకలుగును. యోగి 'ధార్మికుండ వగుము' అనిగాని, 'సుఖవంతుడవగుము' అనికాని ఆశీర్వదించెనని అనుకొందము. అపుడు అధర్మాభిభూతుడు ధార్మికుడగును. దుఃఖవంతుడు సుఖవంతుడగును. యోగివాక్కుఇటులు అమోఘమని తాత్పర్యము. ఇచట కొందరిటులు శంక చేయుదురు. అట్టి యోగి చచ్చినవాని జూచి 'బ్రతుకుమా' అని దీవించుచో, ఆచచ్చినవాడు బ్రతుకునా? జలభూతమును మరొకభూతమును చేయునా? ఈ శంకలకు వ్యాఖ్యాతలు కొంద రిటులు ప్రత్యుత్తరించిరి. సత్యప్రతిష్ఠచే కలుగు ఫలము ఇచ్ఛాశక్తి ద్వారముననే కలుగును. యోగి వాక్కున ప్రవహించిన ఇచ్ఛాశక్తి విఫలము కాదనుట నిక్కమే. అది ఆశీర్వదింపబడినవాని హృదయమున నీరువలె పారి అందు చేరిన మాలిన్యమును కడిగివయిచి మాసిన మంచిసంస్కారములను దీప్తమొనరించునేకాని శవమునుసజీవునిగను, జలభూతమును పృథివీభూతమునుగను చేయజాలడు. కావున యోగి హృదయమునందు శక్తికి మిగిలిన సంకల్పము ఉదయింపదు. తన్ను ఎఱుగని శివ ముండునా? మరియు సత్య ప్రతిష్ఠవలన కలిగిన శక్తి యోగివాక్కునకు అర్ధమెఱిగిన ప్రాణులయెడలనే కార్యకారి యగును.

పుట 71 దుఃఖేష్వనుద్విగ్న మనా సు=ఖేషు విగతస్పృహః'

వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే||

- గీత- 2-56

(ఎవడు) దుఃఖేషు (సత్‌ సు) దుఃఖములు కలుగుచుండగా, అనుద్విగ్నమనాః=క్షోభపడని మనసుకలవాడో, సుఖేషు(సత్‌ సు)=సుఖములు కలుగుచుండగా, విగతస్పృహః = విగత=పోయిన, స్పృహః=కోరికకలవాడో, వీత రాగభయక్రోధః=వీత=పోయిన, రాగ=విషయములందు ప్రీతియు, భయ=మరణాదులయెడ భీతియు, క్రోధః=క్రోధముకలవాడో, (అట్టి) మునిః=మననశీలుడగు సన్న్యాసి, స్థిత ధీః=స్థితప్రజ్ఞుడు (అని), ఉచ్యతే, చెప్పబడుచున్నాడు.

పుట 71 తాని సర్వాణి సంయమ్య యుక్తఆసీత మత్పరః

వశే హి య స్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా||

- గీతా- 2-61.

సర్వాణి=అన్నియునగు, తాని=(ఆ) ఇంద్రియములను, సంయమ్య=వశపరిచికొని, యుక్తః=సమాహితుడై, మత్‌ పరః=నేను పరుడుగా గలవాడై, అసీత=ఉండునది, వాసుదేవపరుడై (వాసుదేవుడు సర్వప్రత్యగాత్మ కావున వాసుదేవునికంటె నేనువేరుకాదు అని ఉండునది అని తాత్పర్యము), యస్య=ఎవనియొక్క, వశే=వశమునందేని, ఇంద్రియాణి=ఇంద్రియములు (వర్తన్తే=ఉండునో), తస్య=అట్టివానికి, ప్రజ్ఞా=ఎఱుక, ప్రతిష్ఠితా=నెలకొనినది.

పుట 71 మా మేకం శరణం వ్రజి.

'సర్వధర్మాన్‌' అను పూర్ణశ్లోకమును, దాని అర్థమును ఈ సంపుటమున 193వ పేజీలో చూడుడు.

'' బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్‌ మాంప్రపద్యతే,

వాసుదేవ స=ర్వ మితి సమహాత్మా సుదుర్లభః||

- గీతా. 7-19.

బహూనాం = పెక్కు, జన్మనాం = పుట్టువులయొక్క, అంతే=చివర, జ్ఞానవాన్‌=పండిన యెఱుక గలవాడు, సర్వం=ఇది యెల్లయు, వాసుదేవ ఇతి=వాసుదేవుడని, మాం=నన్ను-వాసుదేవుని-ప్రత్యగాత్మను, ప్రపద్య తే=ప్రత్యక్షముగా నెఱుగుచున్నాడు, నః=అట్టి మహాత్ముడు, సుదుర్లభః=అతిదుర్లభుడు.

పుట 71 నాస్తి బుద్ధి రయుక్తస్య నచాయుక్తస్య భావనా,

న చాభావయతఃశాంతిః రశాంతస్యకుతసు=ఖమ్‌||

- గీత. 2-66.

అయుక్తస్య=సమాధి చేతకానివానికి-(అప్రసన్నచిత్తునకు), బుద్ధిః ఆత్మ, నిశ్చయజ్ఞానము; నాస్తి=లేదు, అయుక్తస్య అసమాహితునకు. న చ భావనా = ఆత్మజ్ఞానాభినివేశము లేదు, అభావయతః=ఆత్మజ్ఞానాభినివేశము లేనివానికి, శాతిః = ఉపశమము, న = లేదు, అశాంతస్య = ఉపశమము లేనివానికి, సుఖం=సుఖము, కుతః = ఎటులు పనుపడును? విషయ నివృత్తియే సుఖము.

పుట 72 ఇంద్రియాణాం హి చరతాం యన్మనోనువిధీయతే

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావ మివాంభసి||

- గీత. 2-67.

హి = అయుక్తునకు బుద్ధి ఎందువలన కలుగదనగా, ఇంద్రియాణాం=ఇంద్రియములు, చరతాం (సతాం)=విషయములందు విచ్చలవిడిగా తిరుగుచుండగా, యత్‌ మనః = ఏ మనసు= (ఎవనిచే అని అథ్యాహార్యము), అనువిధీయతే = అనుసరించి పోవునటులు చేయబడుచున్నదో, తత్‌ = ఆ మనసు=, అస్య = ఇతనియొక్క, ప్రజ్ఞాం=తెలివిని, అంభసి=నీటియందలి, నావః ఇవ=ఓడనువలె, హరతి=లాగుకొని పోవును.

పుట 73 ఆపూర్యమాణ మచలప్రతిష్ఠం

సముద్ర మాపః ప్రవిశన్తి యద్వత్‌,

తద్వత్కామా యం ప్రవిశన్తి సర్వే

స శాంతి మాప్నోతి న కామకామీ|| - గీత. 2-70

యద్వత్‌=ఎటులు, ఆపూర్వమాణం (అపి)=లెస=గా నిండింపబుడుచున్నను, అచలప్రతిష్టం=అచల=చలింపని, ప్రతిష్ఠం=స్థితి కల (ఉబ్బి తబ్బిబ్బుగాని), సముద్రం=సముద్రుని, ఆపః=నీళ్లు, ప్రవిశంతి=ప్రవేశించుచున్నవో, తద్వత్‌=అటులు, సర్వే=ఎల్లయు, కామాః=కోరికలు, యం=ఎవనిని, ప్రవిశంతి=ప్రవేశించుచున్నవో, సః=అతడు, శాంతిం=శాంతిని, ఆప్నొతి=పొందుచున్నాడు, కామకామీ=కామ=కామములను, కామీ=కోరువాడు, శాంతిం=శాంతిని, నాప్నోతి=పొందడు.

పుట 75 సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ,

అహం త్వాసర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాశుచః||

- గీత. 1866

సర్వధర్మాన్‌=ధర్మముల నన్నిటిని, పరిత్యజ్య=విడిచి. ఎవని ఆశ్రమమునకు తగిన ధర్మములు అనగా కర్మలు వానికున్నవి, వానినన్నిటిని విడిచిఅనిఅర్థము. ఇంతియకాక - 'నావిరతో దుశ్చరితాత్‌' 'త్యజ ధర్మమధర్మం చ' అని శ్రుతిస్మృతులు చెప్పుచున్నవి. కాన ధర్మాధర్మరూపములగు కర్మల నన్నిటిని విడిచి అని తాత్పర్యము. ఏకం=సర్వాత్మను, సర్వభూతస్థితుడను అగు; మాం=నన్ను, శరణం వ్రజ=శరణు పొందుము. నేనే సర్వాత్ముడను, సర్వభూతస్థితుడను, నాకంటె ఇతరమేమియు లేదని శరణాగతి చేయుము. ఆహం=నేను, త్వాం=(ఇటులు నిశ్చితమైన బుద్ధిగల) నిన్ను, సర్వపాపేభ్యః = ధర్మాధర్మ రూపములగు బంధనము లన్నిటినుండియు, మోక్షయిష్యామి=(నేనుఆత్మనుఅని తెలివిని కలిగించి) ముక్తుని జేయుదును. మాశుచః=కావున దుఃఖింపకుము.

పుట 76 మన్మనా భవమద్భక్తో మద్యాజీ మాం నమస్కురు,

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో7సిమే||

- గీత. 1865

మన్మనాః భవ = నామయమయిపోయిన చిత్తము కలవాడ వగుము. మద్‌ భక్తః=నాభజనపరుడ వగుము, మద్యాజీ=నన్ను పూజించు స్వభావముకలవాడ వగుము, మాం = నన్ను, నమస్కురు=నమస్కరింపుము, మామేవ=నన్నే, ఏష్యసి=పొందగలవు, తే=నీకు, సత్యం ప్రతిజానే=సత్యప్రతిజ్ఞ చేయుచున్నాను, మే=నాకు, ప్రియః అసి = ప్రియుడవు. ఇటులు భగవంతుని సత్యప్రతిజ్ఞ తెలిసి భగవద్‌ భక్తివలన మోక్షఫలము కలుగక తప్పదని నిర్ధారించి భగవచ్ఛరణౖకపరాయణుడు కావలయునని వాక్యార్థము.

పుట 79 ''సూచనాత్‌ సూత్రమ్‌''

సూచనాత్‌ = జాడగా తెలుపుటవల్ల, సూత్రమ్‌=సూత్రమని చెప్పబడును. (సూత్రమను పదమునకు ఇది వ్యుత్పత్తి)

పుట 80 ''నృత్తావసానే నటరాజరాజో

ననాద ఢక్కాం నవపంచవారమ్‌,

ఉద్ధర్తుకామ స=నకాది బృంద

మేత ద్విమర్శే శివసూత్రజాలమ్‌||''

సనకాది బృందమ్‌=సనకుడు మొదలగువారి సముదాయమును, ఉద్ధర్తుకామః=ఉద్ధరింపగోరినవాడై, నటరాజరాజః=నటరాజు, నృత్తావసానే=ఆట చివర, ఢక్కాం=ఢక్కను, నవపంచ వారమ్‌=పదునాలుగు మారులు, ననాద=వాంచెను, విమర్శే (సతి)=తరచి చూడగా, ఏతత్‌ = ఇది, శివసూత్రజాలమ్‌ = శివసూత్రసముదాయము (అని తెలియనాయెను) - లేక - ఏతద్విమర్శే (సతి) ఏతత్‌ = ఢక్కా ధ్వనిని విచారించిచూడగా, శివసూత్రజాలమ్‌=శివసూత్రసముదాయము (అని తెలియనాయెను).

పుట 81 ''రూపావతారవక్తుః ఏకో భాగః''

రూపా....వక్తుః=రూపావతారము అను వ్యాకరణము చెప్పువానికి, ఏకః = ఒక, భాగః = పాలు.

పుట 82 ''దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగ మైశ్వరమ్‌''.

- గీత. 11-3.

తే=నీకు, దివ్యమ్‌ చక్షుః=జ్ఞాననేత్రమును, దదామి=ఇచ్చుచున్నాను, మే=నాయొక్క, ఐశ్వరం=ఈశ్వది సంబంధమైన (నేను ఈశ్వరుడను, నాకు సంబంధించినది ఐశ్వర్యము), యోగం=మోగమాయచే, ఎడతెరపి లేక కానిపించు స్వరూపమును, పశ్య=చూతుగాక.

పుట 83 ''చిత్రార్థాం=చిత్ర న బృహత్కథా మచకథమ్‌''

చిత్రార్థాం = చిత్ర = మనసు=నకు వేడుక కలిగించు, అర్థాం=అర్థముకల, బృహత్కథాం=బృహత్కథను (గుణాఢ్యుడు 'బృహత్కథ' అను గ్రంథము రచించెను. క్షేమేంద్రుడు దీనిని సంగ్రహముగా వ్రాసెను.)న అచకథమ్‌ = చెప్పనయితిని.

పుట 84 అజ్ఞాతప్రభ##వై ర్వచోభి రఖిలై రాలంబి ధర్మప్రభా (థా)

హేతుత్వం వివిధాధ్వరక్రమకృతిష్వేకాయనశ్చోదనైః|

తేషా మధ్వరకర్మణా మధిపతిం ద్వామీశనారాధయన్‌

ధర్మా నర్జయితుం నశక్ష్యతి జనో దక్షోప్యదక్షో7థవా||

- సాహిత్యరత్నాకరము.

అజ్ఞాతప్రభ##వైః = అజ్ఞాత=తెలియబడని, ప్రభ##వైః=పుట్టువుకల, అఖిలైః వచోభిః=ఎల్ల పలుకులచే అనగా వేదములచే (వేదములకు పుట్టుకలేదు, వాని వెవరును రచింపలేదు. కావున వానికి ప్రాబలుకులని పేరు. ప్రాబలుకు లనగా ప్రాతపలుకులు). ధర్మ.....త్వం=ధర్మ = ధర్మముయొక్క, ప్రభా=తేజమునకు, (ప్రథా అను పాఠమున ప్రఖ్యాతికి అని అర్థము.) హేతుత్వం=హేతువగుట, ఆలంబి=అవలంబింపబడెను. వేదములు ధర్మప్రచారమునకు హేతువని తాత్పర్యము. చోదనైః=ప్రేరణములచే, వివిధ....కృతిషు=పలు తుగలగుజన్నములను వరుసగా చేయుడని తెలుపుటలో, ఏకాయనః=ఏకాగ్రము. అధికారినిబట్టి 'ఇపు డీయజ్ఞము చేయుము, అపుడా యజ్ఞము చేయుము' అను నీ మొదలయిన ధర్మములను విధించుటయే వేదముల ఉద్దేశము అని తాత్పర్యము. (హే)ఈశ!=ఓఈశ్వరుడా!, తేషాం=అట్టి, అధ్వరకర్మణాం = క్రతు కర్మలకు, అధిపతిం = అధిపతివయిన, త్వాం = నిన్ను, నారాధయన్‌ = కొలువనివాడైన, జనః=మనుష్యుడు, ధర్మాన్‌=ధర్మములను (ధర్మఫలములను), అర్జయితుం=సంపాదించుటకు, న శక్ష్యతి = సమర్థుడు కాజాలడు, అథవా = లేక, దక్షో7పి=దక్షప్రజాపతి యయినను (ఎంతసమర్థుడయినను) అదక్షః=అసమర్థుడు. దక్షప్రజాపతియే యజ్ఞాధిపతియయిన అనగా యజ్ఞమునకు ఫల మిచ్చు ఈశ్వరుని కొలువక చెడిపోయెనని తాత్పర్యము.

పుట 85 ఆవో రాజాన మధ్వరస్య రుద్రం

హూతారపు సత్యయజం రోదస్యోః,

అగ్నిం పురా తనయిత్నో రచిత్తా

ద్ధిరణ్యరూప మవసే కృణుధ్వమ్‌||

- తై. సం 1326. ఋక్‌-4 మం - 3 సూ-1

ఓ ఋత్విగ్యజమానులారా, అధ్వరస్య=యజ్ఞమునకు, రాజానం=అధిపతియు, హోతారం=దేవతలనుఆహ్వానించునట్టియు, రుద్రం=రుద్రాత్మకుడును, రోదస్యోః=దివస్‌ పృథువులకు, సత్య యజం=అన్నదాతయు, హిరణ్య రూపం=సువర్ణ కాంతి గల, అగ్నిం=అగ్నిని, వః అవసే=మీరక్షణకు, తనయిత్నోః=పిడుగువంటి, అచిత్తాత్‌ పురా=మతియు ఇంద్రియవ్యాపృతియుకోలుపోక ముందే అనగా మరణమునకు ముందే, అకృణుధ్వం=భజింపుడు.

పుట 85 ఆదౌ పాణి నినా (వా) దతో7క్షర సమాన్నూయోపదేశేన యః

శబ్దానా మనుశాసనం వ్యకలయ చ్ఛాస్త్రేణ సూత్రాత్మనా,

భాష్యం తస్య చ పాద హంసక రవైః ప్రౌఢాశ యం తం గురుం

శబ్దార్థ ప్రతిపత్తి హేతు మనిశం చంద్రార్థచూడం భ##జే||

యః = ఎవడు, అదౌ=తొలుత, పాణి నినా (వా) దతః = చే (బట్టుకొనిన డుబుడక్క) మ్రోత వలన, అక్షర....ఉపదేశేన=అ ఇ ఉ ణి త్యాది సూత్రములచే అక్షరముల నుపదేశించి, సూత్రాత్మనా=అష్టాధ్యాయీ రూపమయిన, శాస్త్రేణ=శాస్త్రముచే, శబ్దానాం=శబ్దములయొక్క, అనుశాసనం=ఈశబ్ద మిటులు ఈ శబ్ద మిటులు అను ఆజ్ఞను, వ్యకలయత్‌ = చేసెనో, యః=ఎవడు, పాద హంసక రవైః = కాలియందెల రవళిచే, ప్రౌఢాశయం = గంభీరమయిన అర్థము కల, తస్యచ = ఆ శబ్దానుశాసనముయొక్కయు, భాష్యం=భాష్యమును (ఇదియే మహాభాష్యము). వ్యకలయత్‌=రచించెనో, శబ్దార్థ ప్రతిపత్తి హేతుం=శబ్దము అర్థము: వీని యెరుకకు కారణమగు, చంద్రావతంసం=చంద్రశేఖరుని, అనిశం=ఎల్లపుడును, భ##జే=సేవింతును.

పుట 89 ఋషయోదీర్ఘ సంధ్యత్వాద్దీర్ఘమాయురవాప్నుయుః,

ప్రజ్ఞాం యశ శ్చ కీర్తిం చ బ్రహ్మవర్చస మేవ చ||

- మను. 4-94.

యస్మాత్‌=ఎందువలన, ఋషయః=ఋషులు, దీర్ఘసంధ్యత్వాత్‌=దీర్ఘకాలము సంధ్యానుష్ఠేయమైనజపాదులు కలవారగుటవలన, దీర్ఘం=దీర్ఘమగు, ఆయుః=ఆయువును, (అవగా చాల కాలము బ్రతుకువారై) ప్రజ్ఞాం=జ్ఞానమును, యశః=అధ్యయనాది సంపన్నమగు యశసు=ను, కీర్తించ=మాయనికీర్తిని, బ్రహ్మవర్చసం ఏవ చ = బ్రహ్మ తేజసు=ను, అవాప్ను యుః=పొందుదురు. అందువలన ఆయుష్యాదికమును గోరువాడుచిరకాలము సంధ్యను ఉపాసించునది.

పుట 92 ''బ్రహ్మ సత్యం జగన్మిథ్యా''

బ్రహ్మ=బ్రహ్మము, సత్యం=నిక్కము. మూడు కాలములందును ఉండునది. జగత్‌=ప్రపంచము, మిథ్య=లేనిది. ఇపు డున్నటు లుండి రేపు నశించునది.

పుట 94 ''విద్యా వినయనంపన్నా''

విద్యా=విద్య, చదువు. వినయముతో కూడుకొన్నది (కావలెను). వినయముతో కూడినదే విద్య యని తాత్పర్యము.

'' శైశ##వేభ్యస్త విద్యానామ్‌'' - రఘు. 1

శైశ##వే=పసితనమునందే, అభ్యస్తవిద్యానాం=నేర్పిన చదువులు కల. (రఘువుల వంశమును చెప్పుదును.)

1వ సంపుటము 209 వ పుట చూడుము.ొ

పుట 95 వీణా వాదన తత్త్వజ్ఞః శ్రుతిజాతి విశారదః,

తాలజ్ఞ శ్చాప్రయత్నేన మోక్షమార్గం స గచ్ఛతి||

వీణా.....జ్ఞః=వీణ పలికించుటలో మెలకువ నెఱిగినట్టియు-వీణనెటులు పలికింపవలెనో అటులు పలికింపగలిగినట్టియు, శ్రుతి...విశారదః=శ్రుతిజాతులజక్కగా దెలిసినట్టియు, తాలజ్ఞః చ=లయనుగూడ తెలియు, సః=అతడు (అట్టిగాయకుడు), అప్రయత్నేన=ప్రయత్నము లేకయే, చులకనగనే; మోక్షమార్గం=ముక్తిత్రోవ, గచ్ఛతి=పట్టును. ముక్తినొందునని తాత్పర్యము.

పుట 97 యద్వక్త్ర మానస సరః ప్రతిలబ్ద జన్మ

భాష్యారవింద మకరందరసం పిబంతి,

ప్రత్యాశ మున్ముఖ వినీత వినేయ భృంగాః

తాన్భాష్యవిత్తక గురూన్‌ ప్రణమామి మూర్ధ్న||

- పంచపాదికా-ముంగళశ్లోక 4.

యత్‌=ఎవరి, వక్త్ర=మోము అను, మానస సరః=మానస సరోవరము నుండి, ప్రతిలబ్ధ=పోందబడిన, జన్మ=పుట్టువు కల, భాష్య=భాష్యము అను, అరవిందమకరందరసం=తమ్మిపూదేనియను, ప్రత్యాశం=ప్రతిదిక్కునందును, యే=ఏ, ఉన్ముశ...భృంగాః=ఉన్ముఖులైనట్టియు (ఆస్తికతచే ఉన్ముఖత్వము), వినీత=వినయము పొందినట్టి (ఔద్ధత్యాది రాహిత్యమాత్రము చేతనేకాక, వాజ్మనఃకాయ ప్రణిధానములచే గూడ), వినేయ=వినీతులగు శిష్యులు అను, భృంగాః=తుమ్మెదలు, పిబంతి = క్రోలుచున్నవో, తాన్‌ = అట్టి, భాష్యవిత్తక గురూన్‌=భాష్య=భాష్యమే, విత్తక=ధనముగాగల, గురూన్‌=గురువులను, మూర్థ్నా ప్రణమామి=తలవంచి నమస్కరించు చున్నాను.

పుట 102 ఆంధ్రత్వమాంధ్రభాషాచాప్యాంధ్రదేశఃస్వజన్మభూః

తత్రాపి యాజుషీ శాఖా నాల్పస్య తపసః ఫలమ్‌||

ఆంధ్రత్వం=ఆంధ్రత్వము, ఆంధ్రభాషా చ=తెలుగు భాషయు, ఆంధ్రదేశః=తెలుగునాడు, స్వజన్మభూః=తాను పుట్టిన నేలయగుటయు, తత్రా7పి=అందును విశేషించి, యాజుషి శాఖా = యజుశ్శాఖాధ్యయనమును, అల్పస్య=కొలది, తపసః=తపసు=కు, ఫలమ్‌=ఫలము, న=కాదు. తెలుగునాడున పుట్టి తెలుగుమాటాడి, జయుశ్శాఖాధ్యయనము చేసి ఆంధ్రత్వము పొందుట గొప్ప తపసు= చేయనిదే లభింపదని తాత్పర్యము. ఈశ్లోకమున - 'ఆంధ్రత్వ మాంధ్రభాషాచ ప్రాభాకర పరిశ్రమః' అని పాఠాంతరము, పూర్వమీమాంసాశాస్త్రమున భాట్టనుతమని, ప్రాభాకరమతమని రెండు మతములు కలవు.

పుట 107 అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి,

పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి||

అన్యక్షేత్రే=పుణ్యక్షేత్రము కానిచోటున, కృతం = చేయబడిన, పాపం=పాపము, పుణ్యక్షేత్రే = పుణ్యక్షేత్రమునందు, వినశ్యతి=పోవును, పుణ్యక్షేత్రే=పుణ్యక్షేత్రమునందు, కృతం=చేయబడిన, పాపం=పాపము, వారాణస్యాం=కాశిలో, వినశ్యతి=పోవుచున్నది.

పుట 108 వారణస్యాంకృతం పాపంకుంభకోణ వినశ్యతి,

కుంభకోణ కృతం పాపం కుంభకోణ వినశ్యతి||

వారాణస్యాం=కాశిలో, కృతం=చేయబడిన, పాపం=పాపము, కుంభకోణ=కుంభకోణమున, వినశ్యతి=పోవును. కుంభకోణ=కుంభకోణమున, కృతం=చేయబడిన, పాపం=పాపము, కుంభకోణ=కుంభకోణమున, వినశ్యతి=నశించును.

పుట 108 క్షేత్రాణా ముత్తమానా మపి యదుపమయా కాపి లోకే ప్రశ స్తిః

చిత్తద్రవ్యేణ ముక్తి త్రయ మభిలషతాం యాద్భుతా పణ్యవీథీ,

సాక్షా ద్విశ్వేశ్వరస్య త్రిభువనమహితా యా పురా రాజధానీ

రమ్యా కాశీ సకాశీ భవతు హితకరీ భుక్తయే ముక్తయే నః||

లోకే=లోకమునందు, యదుపమయా=దేనిపోలికచే, ఉత్తమానాం=శ్రేష్ఠములయిన, క్షేత్రాణామపి=క్షేత్రములకును, కాపి=ఒకానొక, ప్రశస్తిః=ప్రశంస (అస్తి=కలదొ) యా = ఏది, చిత్తద్రవ్యేణ = చిత్తము అను ధనముచేత, ముక్తిత్రయం = మూడు ముక్తులను, అభిలషతాం=కోరువారికి, అద్భుతా=పెద్ద, పణ్యవీథీ=అంగడివీథియో, యా=ఎవరు, విశ్వేశ్వరస్య=జగదీశ్వరునకు, త్రిభువన మహితా=ముల్లోకములచేతను పూజింపబడిన, పురా రాజధానీ=మేలుచేయునదియునగు, సా = అట్టి, కాశీ = కాశి, భుక్తయే = భుక్తికొరకును, ముక్తయే=ముక్తికొరకును, నః=మాకు, సకాశీ భవతు=చేరువ అయిన దగుగాక!

పుట 111 జన్మాద్యస్య యతోస్వయాది తరతశ్చార్థే ష్వభిజ్ఞః స్వరాట్‌

తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యతూ=రయః,

తేజోవారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా

ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి||

- భాగవతము.

అస్య = ఈ ప్రపంచముయొక్క, జన్మాది=జన్మ స్థితిలయములు, యతః=ఎవనిచే (నగునో), ఈసంగతియెటులు తెలియునో చెప్పుచున్నాడు-అర్థేషు, అన్వయాత్‌, ఇతరతశ్చ అని. అర్థేషు=కార్యములగు అన్ని వస్తువులనను, అన్వయాత్‌=సద్రూపముగాఅనుగతమగుటవలనను, ఇతరతశ్చ = ఆకార్యములగు ఆకాశకుసుమము మొదలగు వానికంటె వ్యతిరిక్త మగుటవలనను, బ్రహ్మము అనగా పరమేశ్వరుడుజగత్కారణమని తెలిసికొనవచ్చునని తాత్పర్యము. ఇచట ఇంకొక రీతిగను అర్థము చెప్పవచ్చును-అర్థేషు=కార్యము కారణము. మన్ను కుండలయందును, బంగారము నగలయందును అనువృత్తమయియుండుటవలన కుండలన్నింటికి మట్టియు, నగల కన్నింటికి బంగారమును కారణమని తెలిసికొనుచున్నాము కదా. ఇతరతః చ = వ్యావృత్తమగుటవలనను ఆకాశాదులు ప్రధానము. ఇవి కారణముకాదు. ప్రపంచమునం దేవస్తువయినను నేడుండును రేపు నశించును. బ్రహ్మము మాత్రము సద్రూపముగా ఉండుగావునబ్రహ్మము కారణముగాని ఇతరము కాదు అని తాత్పర్యము. మఱియొక రీతిగను చెప్పవచ్చును-ఈప్రపంచము సావయవము. అవయవములతో గూడినది కార్యము. బ్రహ్మము నిరవయవము. కాన అదికారణము. యః=ఏపరమేశ్వరుడు, అభిజ్ఞః=సర్వజ్ఞుడో, యః = ఎవడు, స్వరాట్‌ = స్వప్రకాశుడో, యత్‌=ఏశబ్దబ్రహ్మమునెడ అనగా వేదవిషయమున, సూరయో7పి=యోగులును, ముహ్యంతి=మోహము చెందుదురో, (తత్‌) బ్రహ్మ=అట్టి వేదమును, యః=ఎవడు, ఆదికవయే=బ్రహ్మకు (నలువకు), హృదా=మనసునందు(సప్త్యర్థేతృతీయా), తేనే=విశదమగునటులుచేసెనో, తేజోవారి మృదాం=తేజము నీరు మట్టి అను వీనికి, యథా వినిమయః=వ్యత్యయమువలె- (తేజసు=ను జూచి నీరని అనుకొందుము. ఎండమావులు ఉదాహరణము. మట్టిచే చేయబడిన గాజు మొదలగువానినిజూచి నీరనిఅనుకొందుము. నీరుగూడనొకానొకపుడు గాజుగాకానిపించును. ఇటులే ఒకవస్తువును మరొకవస్తువు అని అనుకొనుట వినిమయము). యత్ర=ఏ బ్రహ్మమునందు. త్రిసర్గః=భూతేంద్రియ దేవతారూపమయిన తమో రజస=త్త్వ దృష్టి, అమృషా=సత్యమో, దేని సత్యముచే మిథ్యా సృష్టియు సత్యమువలె తోచునో (లేక మృషా అనియే పదవిభాగము. అపుడు త్రిసర్గము స్వభావముచేసత్యము కాదని అర్థము), స్వేన=తన, ధామ్నా = తేజసు=చే, నిరస్త కుహకం=నిరస్త=నిరసింపబడిన, కుహకం = మాయికమగు విశ్వము కల, (తత్‌) పరం సత్యం = పరమసత్యమగు ఆబ్రహ్మమును, ధీమహి = ధ్యానింతము గాక.

పుట 129 న హి కశ్చిత్‌ క్షణ మపి జాతు తిష్ఠ త్యకర్మకృత్‌,

కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజై ర్గుణౖః||

- గీత. 3-5

కశ్చిత్‌ = ఎవడేని, జాతు=ఒకప్పుడేని, క్షణమపి=రెప్పపాటు కాలమేని, అకర్మకృత్‌=కర్మ చేయనివాడుగా, న తిష్ఠతి హి=ఉండనే ఉండడు, ప్రకృతిజైః=(సత్త్వరజ స్తమసు=లు అను) ప్రకృతివలన బుట్టిన, గుణౖః=గుణములచేత, సర్వః=ఎల్లవాడును, అవశః=అస్వాధీనుడై, కర్మ=పనిని, కార్యతే=చేయింపబడును.

పుట 133 యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ|

న వై రాఘవశార్దూల ధర్మస్త్వా మభిరక్షతు||

- రామాయణ - అయోధ్యా.

రాఘవశార్దూల=రామా!, త్వం=నీవు, ధృత్యా=ధైర్యముచేతను, నియమేన చ=నియమముతోగూడ, యం=ఏ. ధర్మం=ధర్మమును, పాలయసి=జవదాటక నడపుచుంటివో, స ధర్మః వై=ఆధర్మమే, త్వాం=నిన్ను, అభిరక్షతు=రక్షించుగాక!

పుట 134 యాంతి న్యాయప్రవృత్తస్య తిర్యఞ్చో సహాయతామ్‌

అపంథానం తు గచ్ఛంతం సోదరోపి విముఞ్చతి||

- అనర్ఘ రాఘవ - ప్రథమాంక.

న్యాయప్రవృత్తస్య = సరియగు దారిని నడచువానికి, తిర్యఞ్చోపి=జంతువులును, సహాయతాం యాంతి=సాయపడును, అపంథానం=చెడుదారిలో, గచ్ఛంతంతు=నడచువానినో, సోదరోపి=సోదరుడును, విముఞ్చతి=విడిచిపెట్టును. న్యాయమార్గమున నడచిన శ్రీరామునకు కోతులు తోడుపడెను. అన్యాయమార్గమున పోయిన రావణుని విభీషణుడు విడిచివైచెను.

పుట 137 అపి చేదసి పాపేభ్య స=ర్వేభ్యః పాపకృత్తమః,

సర్వం జ్ఞానప్ల వేనైవ వృజినం సంతరిష్యసి||

- గీత.

సర్వేభ్యః పాపేభ్యః=పాపులందరకంటె, పాపకృత్తమః అపి చేత్‌ అసి = ఎక్కువ పాపము చేసినవాడవుఅయినప్పటికిని, సర్వం=ఎల్ల,వృజినం=పాపమును, జ్ఞానప్లవే నైవ=ఎరుక యను తెప్పచేతనే, సంతరిష్యసి=దాటగలవు.

పుట 137 సర్వధర్మాన్‌ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ,

అహం త్వా సర్వపాపేభ్యోమోక్షయిష్యామి మాశుచః||

- గీత. 8-66.

సర్వధర్మాన్‌ = ఎల్లధర్మములను - ధర్మమును అధర్మమును లేక అన్ని కర్మములను, పరిత్యజి = విడనాడి, మామ్‌ ఏకం=నన్నొకనిని - సర్వాత్మయు సర్వభూతస్థితుడను అగువాడను నేనే యనినన్ను, శరణంవ్రజ=శరణుపొందుమా. అహం = నేను, సర్వపాపేభ్యః= ఎల్లపాపముల నుండియు, మోక్షయిష్యామి=విడుదల చేయింపగలను, మాశుచః = దుఃఖింపకుమా.

'ధర్మేణ పాప మపనుదతి' - నారాయణ.

ధర్మేణ=ధర్మముచే, పాపం=పాపమును, అపనుదతి=పోగొట్టుకొనుచున్నాడు.

పుట 138 పుణ్యస్య ఫల మిచ్ఛంతి పుణ్యం నేచ్ఛన్తిమానవాః,

న పాపఫల మిచ్ఛంతి పాపం కుర్వంతి యత్నతః||

మానవాః = జనులు, పుణ్యస్య = పుణ్యముయొక్క, ఫలం=ఫలమును, ఇచ్ఛంతి=కోరుచున్నారు, పుణ్యం=పుణ్యమొనగూర్చు పనిచేయుటకు, నేచ్ఛన్తి = ఇచ్చగింపరు. పాపఫలం = పాపఫలమును, న ఇచ్ఛంతి = కోరరు, యత్నతః=ప్రయత్నపూర్వకముగా, పాపం = పాపమును, కుర్వంతి = చేయుదురు.

పుట 138 అథ కేన ప్రయుక్తో7యం పాపం చరతి పూరుషః||

అనిచ్ఛన్నపి వార్‌ష్ణేయ! బలాదివ నియోజితః||

- గీతా. 3-36

అథ=ఇక, కేన=దేవ, ప్రయుక్తః=ప్రేరితుడై, అయం=ఈ, పూరుషః=పురుషుడు, అనిచ్ఛన్నపి = ఇచ్ఛిం = కున్నను బలాత్‌=బలాత్కరముగా, నియోజితఇవ (దేనిచే) ఆజ్ఞాపింపబడిన (భృత్యవు) నటులు, పాపం=పాపమును, చరతి = చేయుచున్నాడు?

పుట 139 కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః,

మహాశనో మహాపాప్మా విద్ధ్యేన మిహవైరిణమ్‌||

- గీతా. 3-37

కామః=కామము, ఏషః=ఇది (పాపమును చేయించునది కామమని ప్రత్యుత్తరము.) క్రోధః=క్రోధము, ఏషః=ఇది (పాపముచుయించునది క్రోధమనియుప్రత్యుత్తరము). అగుచో ఈ రెండునా? అని శంకించుచో, కాదు. ఈ రెండును ఒకటియే. ఈ కామము, ఈ క్రోధము అని ఒకేవస్తువును రెండుగాజెప్పుట, అగుచో లోకమునందు కామక్రోధములు విడివిడిగా ఎన్నబడునుగదా అనినయెడల, ఈ కామమే ప్రతిహతమయిన యెడల క్రోధమగును గావున ఒకేవస్తువు.) రజోగుణ సముద్భవః=రజోగుణము కారణముగాగలది, మహాశనః=వెర్రితిండి తినునది (కోరికలు అనంతములు. అవి ఎంత అనుభవించినను తీరవని తాత్పర్యము.) మహాపాప్మా=మహాపాపము (అకామ్యమునుకామింపజేయును, గోవునేని చంపించునని తాత్పర్యము) ఏవం=దీనిని, వైరిణం=శత్రువునుగా, విద్ధి=తెలియుము.

పుట 139 'కామః స ఏష ప్రతిహతః కేనచిత్‌ క్రోధత్వేన పరిణమతే' - శాంకరగీతాభాష్య. 3-37

స ఏష కామః = ఆ యీ కామము, కేనచిత్‌=ఏదేనొకదానిచే, ప్రతిహతః=అడ్డగింపబడినదై - విఫలమైనదై, క్రోధత్వేన=క్రోధముగా, పరిణమతే=పరిణమించుచున్నది.

పుట 140 దుర్గంకామాశుగేనాపిదుర్లంఘ్యమవలంబ్యయః,

దుర్వాసోహృదయం లోకాన్‌ సేంద్రానపి దిధక్షతి.

- నైషధీయచరిత 17-21

యః=(ఏ) క్రోధు-డు, కామాశుగేనాపి=మన్మథుని బాణముచే నయినను, అలంఘ్యం దొరరానిది కావుననే, దుర్గం=చేరరానిదియునగు, 'గిర్యాది విషమదుర్గ రూపమయినదియు నగు' అని మరొక అర్థము. దుర్వాసోహృదయం=రుద్రరూపు-డగు దుర్వాసోముని యొక్కమనసు=ను, అవలంబ్య=ఆశ్రయించి, సేంద్రాన్‌=ఇంద్రాది సహితములగు, లోకాన్‌=ఏడులోకములను, దిధక్షతి=తగులబెట్ట గోరుచున్నాడు. క్షుద్రుడెవడేని బాణాదులు చేరరాని గిరిదుర్గమును స్థలదుర్గమును జలదుర్గమునుగాని ఆశ్రయించి అందరను పీడించును. రూపకము, సమాసోక్తి అను అలంకారములు.

పుట 143 ప్రయాణకాలే మనసాచలేన

భక్త్యా యుక్తోయోగబలేన చైవ,

భ్రువోర్మధ్యే ప్రాణమావేశ్య సమ్యక్‌

స తం పరం పురుష ముపైతి దివ్యమ్‌|| - గీత.

ప్రయాణకాలే=చనిపోవునపుడు, అచలేన=చలనములేని, మనసా=మనసుచే, భక్త్యా=స్వవిషయాకారము పొందుట, భక్తి = అట్టిభక్తిచే, యోగబలేన చ ఏవ=సమాధిచే గలుగు సంస్కార బాహుళ్యముచేగూడ, యుక్తః=కూడినవాడై. భ్రువోః=కనుబొమల, మధ్యే=నడుమ (మొదట హృదయమున చిత్తమును నిలిపి పైకిపోవు నాడిగుండ పోనిచ్చి,) ప్రాణం=ప్రాణమును, ఆవేశ్య=నిలిపి, సమ్యక్‌ = ప్రమాదపడనివాడై, సః=అట్టి, యోగీ=యోగి, తం=ఆ (కవింపురాణం ఇత్యాదిగా వెనుక చెప్పబడిన లక్షణములుగల), పరం దివ్యం పురుషం=పరమపురుషుని, ఉపైతి=పొందుచున్నాడు.

పుట 144 రౌరవే7పుణ్యనిలయే పద్మార్బుదనివాసినాం,

అర్థినా ముదకం దత్త మక్షయ్య ముపతిష్ఠతు.

అపుణ్యనిలయే=పాపనిలయమగు, రౌరవే=రౌరవమునందు, పద్మార్బుదనివాసినాం = పద్మము=1000 1000000 ఏండ్లు, అర్బుదము = 100 1000000 యేండ్ల నుండియు నివసించుచున్న, అర్థినాం=అర్థులకు, దత్తం = ఈయబడిన, ఉదకం = నీరు, అక్షయ్యం ఉపతిష్ఠతు=తరగనిదై యుండుగాక.

పుట 148 యస్త్యెతే చత్వారింశత్‌ సంస్కారా అష్టావాత్మ

గుణాః బ్రహ్మణః సాయుజ్యం సలోకతాం జయతి.

యస్య=ఎవనికి, ఏతే=ఈ చత్వారింశత్‌ = నలుబది, సంస్కారములును, అష్టౌ=ఎనిమిది, ఆత్మగుణాః=ఆత్మగుణములును (అబ్బెనో ఆతడు) బ్రహ్మణః=బ్రహ్మయొక్కసాయుజ్యమును, సలోకతాం=సాలోక్యమును, జయతి=చూరగొనును.

పుట 154 రాజవిద్యా రాజగుహ్యం పవిత్ర మిద ముత్తమమ్‌,

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తు మవ్యయమ్‌,

- గీతా. 9-2.

ఇదం=ఈ బ్రహ్మజ్ఞానము, రాజవిద్యా=విద్య లన్నిటిలో గొప్పది. (రాజదంతాదిషు పరమ్‌' అనుసూత్రముచే నయిన నిపాతము) ఏవిద్యయేని ఆవిద్యలోకొంతపాలే పోగొట్టును. బ్రహ్మవిద్యయో పెరవిద్యలను అవిద్యలను గూడ తుడిచిపెట్టును గాన నిది రాజవిద్యయని తాత్పర్యము. రాజగుహ్యం=గొప్ప రహస్యము. రత్నాదులను మంత్రములను యంత్రములను దివ్యములగు ఓషధులను గుప్తముగా ఉంచుకొందురు. అట్లే యీ బ్రహ్మవిద్య రహస్యాతిరహస్యము. లేక రాజును ప్రజ లెటులు కాపాడుకొందురో బ్రహ్మవిద్య అటులు కాపాడుకొనదగినదని తాత్పర్యము. ఉత్తమంపవిత్రం=పఠిశుద్ధి గలిగించునవి గంగాదులు పెక్కులున్నను ఈ బ్రహ్మవిద్య అన్నిటికంటెను పఠిశుద్ధి కలిగించునది.

మిగిలిన పవిత్రవస్తువులన్నియును పాపమును మాత్రమే నశింప-జేయును. బ్రహ్మవిద్యయో పుణ్యమును గూడ పోకార్చును అని తాత్పర్యము. ప్రత్యక్షావగమం = ప్రత్యక్షప్రమాణము కలది లేక ప్రత్యక్షఫలము కలది. అనగా జ్ఞానము స్వరూపమున సాక్షిప్రత్యక్షము మరియు ఫలమున సాక్షిప్రత్యక్షము. 'నే నెరిగితిని దీనియెడ నాయజ్ఞానము నశించినది' అనుసాక్ష్యనుభవము అందఱకును కలుగనదే. మరియు సుఖ మెటులు ప్రత్యక్షాను భవమో బ్రహ్మజ్ఞానమును అటులే. ధర్మమ్‌=ధర్మమునుండి తొలగనిది, నిష్కామధర్మ ఫలమని తాత్పర్యము. కర్తుం=చేయుటకు, సుసుఖమ్‌=గురూపదేశముచే కస్తి లేకుండ-చేయదగినది, అవ్యయమ్‌=అక్షయ ఫలము కలది.

పుట 156 సంధ్యారంభ విజృంభితం శ్రుతి శిరస్థా=నాంత రాధిష్ఠితం

సప్రేమ భ్రమరాభిరామ మన కృత=ద్వాసనా శోభితమ్‌,

భోగీంద్రాభరణం సమస్త సుమనః పూజ్యం గుణా విష్కృతం

సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితమ్‌||

సంధ్యారంభ విజృంభితం=సంధ్యా-ఆరంభ=సాయంసమయారంభమున, విజృంభితం=తాండవవిజృంభణముకలదియు - సాయంకాలారంభమున పుష్పవికాసము కలదియు, శ్రుతి శిర స్థా=నాంతరాధిష్ఠితం=శ్రీశైలము కంటె వేరయిన ఉపనిషత్తులను అధిష్ఠించినదియు, చెవులు, తల అను వేరువేరు చోటుల అలంకారముగా ఎక్కియున్నదియు. సప్రేమ భ్రమరా అభిరామం = ప్రేమతో గూడిన భ్రమరాంబికచే మనోహరమయివదియు- ప్రేమతో గూడిన తుమ్మెదలచే చక్కనయినదియు. అసకృత్‌ సద్‌ వాసనా శోభితమ్‌=ఎల్లపుడును సత్పురుషుల భావనచే ప్రకాశించునదియు, భోగీంద్రభరణం = భోగీంద్ర=వాసుకి, ఆభరణం=భూషణముగా గలదియు- భోగీంద్ర=పెద్దభోగులకు అలంకారమయినదియు, సమస్త సుమనః పూజ్యం=ఎల్ల దేవతలచే పూజింపదగినదియు పూవు లన్నిటిలో మేలయినదియు, గుణావిష్కృతం = కల్యాణగుణములచే ప్రకటమయినదియు- సుగంధముచే ప్రకటమయినదియు లేక దారముచే దండగా గ్రువ్వబడినదియు, శివాలింగితం=భ్రమరాంబచే కౌగిలింపబడిన, శ్రీగిరి=శ్రీపర్వతమునందున్న, మల్లికార్జున మహాలింగం = మల్లె తీవచే అల్లుకొనబడిన మద్దిచెట్టువంటి మహాలింగమును, సేవే=కొలుతును.

పుట 157 ''అతులిత సుధారస మాధుర్య కమలాసన కామినీ

ధమ్మిల్ల సంపుల్ల మల్లికామాలికా నిష్యంద మకరంద

ఝరీ సౌవస్తిక వా ఙ్నిగుంభ విజృంభణానంద

తుందిలిత మనీషి మండలానాం''

- శ్రీ కామకోటిపీఠ శ్రీముఖం.

అతులిత=సాటిలేని, సుధారస=అమృతరసముయొక్క, మాధుర్య=తీయదనము గల, కమలాసనకామినీ=సరస్వతీదేవియొక్క, ధమ్మిల్ల=కొప్పునందు, సంపుల్ల=విచ్చిన, మల్లికామాలికా=మల్లెదండనుండి, నిష్యంద=జాలువారు, మకరంద ఝరీ=తేనె సెలయేటికి. సౌవస్తిక=మంగళాశంసనము చేయు. వాక్‌=పలుకులయొక్క, నిగుంభ విజృంభణ=రచన విజృంభించుటచే గలుగు, ఆనందమున, తుందిలిత=ఉబ్బిన, మనీషి మండలానాం=విద్వత=ముదాయములకు.

పుట 159 ''సర్వం ఖల్విదం బ్రహ్మ'' - మాండూక్య.

ఇదం సర్వం=ఇదిఅంతయు, బ్రహ్మఖలు = బ్రహ్మము కదా!

పుట 160 దుర్లభంత్రయమేవైతత్‌ దై వానుగ్రహ హేతుకం,

మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుషసంశ్రయః||

దైవానుగ్రహహేతుకం=దైవము యొక్క అనుగ్రహమే హేతువుగాగల, ఏతత్‌ = ఈ, త్రయమేవ=మూడూ, దుర్లభం = పొందరానివి, (ఒకటి) మనుష్యత్వం = మునుష్యుడై పుట్టుట, (రెండు) ముముక్షుత్వం=మోక్షేచ్ఛకలుగుల, (మూడు) మహాపురుష సంశ్రయః = జ్ఞాని ఆశ్రయము దొరుకుట.

పుట 160 స్వ వర్ణాశ్రమ ధర్మేణ తపసా హరితోషణాత్‌,

జ్ఞాన ముత్పద్యతే పుంసాం వైరాగ్యాది చతుష్టయమ్‌||

స్వ వర్ణాశ్రమ ధర్మేణ=తమ తమ వర్ణములయు ఆశ్రమములయు ధర్మముచేతను, తపసా=తపసుచే, హరితోషణాత్‌=భగవంతుని సంతస పరచుటచేతను, వైరాగ్యాది చతుష్టయం=వైరాగ్యాదులు నాలుగును, జ్ఞానమును, పుంసాం=పురుషులకు ఉత్పద్యతే=కలుగును.

''తస్మాచ్ఛాస్త్ర ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ,

జ్ఞాత్వా శాస్త్రవిధానోక్తం కర్మ కర్తు మిహార్హసి||

- గీతా. 1624.

తస్మాత్‌ = కావున, కార్యాకార్యవ్యవస్థితౌ = ఇటులు చేయవచ్చుననిగాని, ఇటులు చేయరాదని గాని నిర్ణయింపవలసినపుడు; శాస్త్రం=శాస్త్రము, తే=నీకు-ప్రమాణం=జ్ఞానోపకరణము, ఇహ=ఈయెడల, శాస్త్రవిథానోక్తం=ఇటులు చేయవచ్చును ఇటులు చేయరాదు అని చెప్పు శాస్త్రవిధిని, బట్టి, కర్మ=స్వకర్మను, కర్తుం = చేయుటకు, అర్హసి = తగుదువు.


Jagathguru Bhodalu Vol-4        Chapters        Last Page