SARA SUDHA CHINDRIK    Chapters   

ఓం తత్‌సత్‌

శ్రీగణశాయనమః శ్రీరామచంద్రపరబ్రహ్మణనమః

శ్రీమద్భగవద్గీత - సారసంగ్రహము

1. అర్జున విషాద యోగము

ధర్మక్షేత్రమగు కురుక్షేత్రరణరంగమందు కౌరవ పాండవసేనలు యుద్ధ సన్నద్ధమైనిలచెను. దుర్యోధనుడు తనసైన్యబలమును, ఎదరి సైన్యబలమును వివరించుచు గురుద్రోణునికెరిగించుచు, తన పక్షమున 11 అక్షాహిణీల సైన్యము పాండవపక్షమున 7 అక్షౌహిణీలసైన్యము కలదని తెలుపుచు సర్వసేనాధ్యక్షుడగు భీష్ముని సర్వవిధములకాపాడగోరెను. తన సేనలకు ఉత్సాహము గొలపుటకై భీష్మపితా మహుడు. శంఖనాదము చేసెను. అదివిని కృష్ణార్జునులు పాంచజన్య దేవదత్తములు, మిగిలిన వీరవరులు తమ తమ శంఖముల పూరించిరి. ఇట్లు యుద్ధ సన్నద్ధమైన ఇరుసేనల పరికింపదలచి అర్జునుడు తన రధమును ఇరు సేనలమధ్యకు గొంపోవ శ్రీకృష్ణు నర్ధించెను. ఇరుసేనల గల తాతలు, తండ్రులు, పుత్రులు, పౌత్రులు, గురువులు, మిత్రులను చూచి అర్జునుడు మోహమమతాబద్ధుడై తన బంధువర్గమును సంహరించి ఆ రక్తపు కూడు తిన జాలననియు, దీని వలన కులక్షయము, ధర్మక్షయము, వర్ణ సంకరము కలుగుననియు, అట్టి మహాపాపమునకు తానొడిగట్ట ఆలననియు, కలత జెంది శోకాకులుడై ధనుర్బాణములు విడచి విషాదము పొందెను.

2. సాంఖ్యయోగము

ఇట్లు కనికరముచే కంటనీరు పెట్టు కొనుచువ్యాకులు డైన అర్జునుని జూచి శ్రీకృష్ణ పరమాత్మ పామరులపగిదిమోహ పరవశుడై అధైర్యము పొందవలదనియు, నీచమగుమనో దూర్బల్యమును వీడి యుద్ధము చేయుమని ప్రోత్సహించెను. అంతట అర్జునుడు. భీష్మ ద్రోణులిరువురు పూజనీయులు, అట్టి వారిపై బాణములెట్లు వేయగలను. గురువులను చంపక భిక్షాన్నమైనను రక్తపు కూడుకంటె మంచి దనియు, అదియును గాక యుద్ధములో గెలుపోటములు, నిర్ణయింపరాని వగుటచే ఏమిచేయుటకు పాలుపోక హేకృష్ణా! నేనునీకు శిష్యుడనై శరణ జొచ్చితిని. నాకు ఏది శ్రేయస్కరమో అది తెలుపవేడెను. అంతట శ్రీకృష్ణుడు రెండు సేనల నడుమ విలపించుచున్న అర్జునునిజూచి నవ్వుచు ఉపదేశాత్మకము ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, యోగశాస్త్ర సారభూతమగు గీతోపదేశము గావించెను.

హే అర్జునా! నీవు శోకింపదగని వారిని గూర్చి శోకించు చున్నావు. మరియు పండితులవలె మాట్లాడు చున్నావు. ఆత్మ జ్ఞానము గల పండితులు మరణించిన వారిని గురించి గాని, జీవించి యున్న వారిని గురించి గాని చింతింపరు. నేను, నీవు, ఈ యుద్ధ భూమి యందు గల రాజులు ఒకప్పుడు లేని వారముకాము, ముందులేక పోవువారముకాదు. ఈ శరీరమందలి జీవుడు (ఆత్మ), నిత్యము, జీవితమునందు బాల్య, ¸°వన, వార్ధక్యాది అవస్ధలవలె మరణము, మరణానంతరము మరియొక శరీరము పొందుట సహజము ఇట్టి నశ్వరశరీరమును గూర్చి జ్ఞానియగు వాడెంతమాత్రము శోకింపడు. ఇంద్రియముల యొక్క శబ్ద స్పర్శాది విషయ సంయోగముచేకలుగు. శీతోష్ణములు, సుఖదుఃఖములు అనిత్యములు. సుఖదుఃఖాదులు యందు సమ భావముకలవాడే మోక్షమున కర్హుడు. అసత్యము లైన నామరూపాత్మకశరీరము లకు ఉనికిలేదు. సత్యము, శాశ్వత మైన ఆత్మకు నాశములేదు. సమస్త ప్రపంచమును ఏపరమాత్మచే వ్యాపించ బడియున్నదో అది నాశరహితము. అవ్యయమగు అట్టి ఆత్మకు నాశములేదు. కాని ఈ దేహమే నాశవంతమైనది. వినాశ ధర్మముగల దేహమును గూర్చి శోకింపక యుద్ధము చేయుము.

ఈ ఆత్మ దేనిని చంపుటలేదు. దేని చేతను చంపబడుటలేదు ఆత్మకు పుట్టుట, చచ్చుట లేదు. ఆత్మ జరామరణములేని శాశ్వత పురాతనము. శరీరము చంపలేరు. చిరిగిన పాతవస్త్రమును వదలి క్రొత్తవస్త్రమును ధరించునట్లు ఈ ఆత్మ జీర్ణ శర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించును. ఆ ఆత్మను ఆయుధములు భేదింపలేవు. అగ్ని దహింప జాలదు, నీరు తడుప జాలదు, గాలి ఎండింపలేదు. ఈ ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, స్థిర స్వరూప, నిశ్చల పురాతనుడు. ఆత్మ ఇంద్రియములకగోదరము. మనస్సు చింతింపశక్యము కానివాడు, వికారములు పొందింపదగనివాడు

ఒకవేళ ఆత్మ శరీరము తో పుట్టుచు చచ్చుచుండునని తలచినను, చావు పుట్టుకలుకలవారిని గూర్చి శోకించుట యుక్తముకాదు కాని ఈ ఆత్మ స్వరూపము అత్యద్భుతము. కొందరు దీనిని ఆశ్చర్యమైన దానిగా చూచుచున్నారు. కొందరు ఆశ్చర్యకరమైన దానిగా చెప్పుచున్నారు. మరి కొందరు ఆశ్చర్యమైన దానిగా వినుచున్నారు. కాని వాస్తవమునకు దీనిని గూర్చి సాక్షాత్తు అనుభవించిన వారు అరుదు. ఆత్మ నిత్యముకాన ఏప్రాణిని గూర్చి శోకింపపనిలేదు.

ఇక నీ స్వధర్మమగు క్షత్రియ ధర్మముననుసరించి వాదారించినచో యుద్ధము చేయుటలో వెనుకాడుట సరియైనదికాదు. ఏలనన క్షత్రియునకు ధర్మయుద్ధము కంటెశ్రేయస్కరమైనది మరియొకటిలేదు. ఇది అప్రయత్నముగా లభించిన స్వర్గద్వారము వంటిది. నీవు యుద్ధము చేయకున్న స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపము పొందెదవు. మహారధులందు ఘనముగా భావింపడు నిన్ను చులకన చేసి మాట్లాడెదరున. శత్రువులు నీ సామర్ధ్యము (అసమర్ధత)నుచూచి దుర్భాషలాడెదరు. అంతకు మించిన దుఃఖము వేరు లేదు. ఒకవేళ నీవు ఈధర్మ యుద్ధమున శత్రవులచే చంపబడిన వీర స్వర్గమలంకరింతువు. జయించిన భూలోకరాజ్యము ననుభవింతువు.

రెండు విధముల మేలేయగుటచే యుద్ధమునకు సంసిద్ధుడవు కమ్ము. సుఖదుఃఖములు, లాబనష్టములు, జయాపజయములందు సముబుద్ధికలిగి యుద్ధము చేసినను నీవు పాపమును పొందవు. కావున యుద్ధమునకు సంసిద్ధుడవుకమ్ము.

హే అర్జునా! ఇంతవరకు సాంఖ్య శాస్త్రమున చెప్పబడిన ఆత్మ తత్వమును గూర్చి తెలిపితిని. ఇక యోగ శాస్త్రమందలి కర్మ యోగమును గూర్చి తెలుపుచున్నాను. అది తెలిసినచో కర్మ బంధము నుండి లెస్సగా విముక్తుడవగుదువు ఈ కర్మయోగము (నిష్కామకర్మ) ప్రారంభింపబడి ఏకారణముచే నైనను మధ్యలో నిలిచిపోయినను కొద్దిగా ఆచరించినను గొప్ప సంసార భయమునుండి రక్షించుచున్నది. ఈ కర్మ యోగానుష్టానము నిశ్చయాత్మక బుద్ధితో ఆచరించవలెను. అట్టి నిశ్చయాత్మక బుద్ధిలేనివారు వేదములందు ఫలము దెలుపు స్వర్గాదిఫలితములు విషయ వాంఛలతో డూఇన చిత్తముకలవారు అల్పజ్ఞులు, ఫలశూన్య భోగైశ్వర్యప్రియులు నగు జనులకు నిశ్చయ మైన ఏకాగ్రబుద్ధి కలుగదు. నీవు త్రిగుణా తీతుడవై ద్వంద్వములు విడచి, నిరంతర శుద్ధతత్వము నాశ్రయించి, యోగక్షేమముల దృష్టి లేని ఆత్మ జ్ఞాని వికమ్ము. వేదకర్మల యందెంత ప్రయోజనముకలదో అంత ప్రయోజనము పరమార్ధతత్వమును తెలిసిన బ్రహ్మవిష్ణునకు బ్రహ్మానందమున ఇమిడి యున్నది.

హే అర్జునా! నీకు కర్మను చేయుట యందే అధికారముకలదు. కాని కర్మ ఫలమునందుకాదు. కర్మ ఫల కారణ భూతుడవు నీవుకాదు. అట్లనికర్మలను వదలు అధికారము లేదు. నీవు యోగనిష్టుడవై సంగము విడచి, కర్మ ఫలించినను, ఫలించకపోయినను సమానబుద్ధి కలవాడవై కర్మలను చేయుము. సమత్వ బుద్ధితో గూడిన నిష్కామకర్మకంటె ఫలాపేక్ష తోకూడిన కామద్యకర్మ తక్కువైనది. ఫలమును గోరువారు అల్పులు. సమత్వబుద్ధి కలవాడు పుణ్య పాపముల రెండింటిని ఈ జన్మ యందే తొలగించుకొనుచున్నాడు. కావున అట్టి నిష్కామ కర్మయందలి నేర్పరి తనమే యోగమనబడును. సమత్వ బుద్ధిగల వివేక వంతుల కర్మల నొనరించినను ఫలమును త్యజించి జన్మమరణ బంధవిముక్తులై దుఃఖరహితమోక్ష పదముపొందెదరు. కావున అజ్ఞాన మాలిన్యము తొలగించుకొని పరిశుద్ధ బుద్ధి కలిగి, వినినదానిని గూర్చి వినవలసిన దానిని గూర్చి విరక్తి కలిగి యుండుము. నానావిధ శ్రవణాదులచే కలత చెందిననీబుద్ధి చలించనిదై పరమాత్మ యందు స్ధిరముగా నిలచిన నీవాత్మ సాక్షాత్కారము పొందగలవు.

హేకృష్ణా! సమాధి యందున్న స్థితి ప్రజ్ఞుడగు జీవన్ముక్తుని లక్షణమేమి? అతడెట్లు మాట్లాడును? ఏ రీతిగా నుండును? ఎట్లు సంచరించును? హే అర్జునా! ఏమనుజుఉడ తన మనస్సునందలి కోరికలన్నిటిని సంపూర్ణముగా వదలి ఆత్మయందే నిర్మలచిత్తముతో నిరంతరము సంతుష్టి పొందునో అతడు స్ధిత ప్రజ్ఞుడనబడును. అట్టి వాడు దుఃఖముల కలత నొందక సుఖము లందాసక్తిలేక, అనురాగము, భయము, క్రోధము తొలగిన మనన శీలుడు. స్ధితప్రజ్ఞుడు. అట్టివాడు సమస్త విషయములు (దేహద, బంధు, భోగాదుల)మంద భిమానము లేక ప్రియాప్రియములు సంభవించినను, సతోషము ద్వేషము లేకుండును.

తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకొనునట్లు, యోగి తన ఇంద్రియములను, ఇంద్రియసంబంధ స్పర్శాది విషయములనుండి సర్వత్ర వెనుకకు మరల్చి స్ధిరమగు జ్ఞానముపొంది స్ధితప్రజ్ఞుడగును. ఇంద్రియములను విషయ వాసనల నుండి మరల్చిన చాలదు. చిత్తమున గల విషయ వాసనలను ఆత్మ తత్వ చింతనాదులద్వారా ఆత్మ సత్య త్వమును ప్రత్యక్షముగా అనుభూతమొనర్చుకొనవలెను. కాని కొందరికి ఆత్మ దర్శనములభించుటలేదు. ఏలననగా మహాశక్తి వంతములైన ఇంద్రియములు. ఆత్మావలోకనమునకు యత్నించు విద్వాంసుని మనస్సును బలాత్కారముగా విషయములపైకి లాగును. అట్టి ఇంద్రియము లన్నిటిని చక్కగా వశపరచుకొని సాధకుడు, మన స్ధిరత్వముకలవాడై ఆత్మ యందే ఆసక్తమైన మనస్సు కలిగి యుండవలెను. ఎవని ఇంద్రియములు స్వాధీన మున నుండునో అతని జ్ఞానము సుస్ధిరమై వెలయగలదు.

విషయ చింతన వలన దాని యందాసక్తి జనించి వానియందు కోరికపుట్టును. కోరికలు తీరక పోవుటచే కోపము కోపమువలన అవివేకము, దాని వలన మరుపు, మరుపువలన బుద్ధి నాశముకలిగి తుదకుపూర్తిగా చెడిపోవును. కాని మనస్సును స్వాధీనపరచుకొన్న వాడు రాగద్వేష రహితుడై తన వశమందున్న ఇంద్రియములచే అన్నపానాది విషయముల ననుభవించుచున్నను మనశ్శాంతిని పొందును. మనో నిర్మలత్వమువలన వాని సమస్త దుఃఖములు ఉపశమించుటచే బుద్ధి శీఘ్రముగా పరమాత్మ యందు స్ధిరత్వము చెందును. ఇంద్రియ నిగ్రహము, మనస్సంయమనము లేని వానికి వివేక బుద్ధి కలుగదు. ఆత్మ చింతనకలగదు. అట్టి వారికి శాంతి, సుఖములు లభించవు.

విషయములందు ప్రవర్తించు ఇంద్రియ ములలో దేనిని అనుసరించి మనస్సుపోవునో అదిమనుఉని వివేకమును నీటి యందలి నావను ప్రతికూల వాయువులాగుకొని పోవునట్లు హరించి వేయును. కావున ఇంద్రియములను విషయములపైకి పోనీయక అరికట్టుదాని జ్ఞానము స్థిరమైయుండును.

సమస్త ప్రాణులకు ఏపరమాత్మ తత్వము రాత్రివలె అగోచరమో దాని యందు ఇంద్రియ నిగ్రహముకలయోగి మేలుకొన్నవానివలె తత్పరుడై యుండును. ప్రాణులు ఏ ఇంద్రియ విషయములందుమేల్కొని యుండునో వాటియందు యోగి రాత్రివలె అగోచరమగును.

సముద్రలములందు నదీజలములు ప్రవేశించురీతిని భోగ్యవిషయములన్నియు బ్రహ్మ విష్ణుని పొంది అణగి పోవును. సమస్తకోరికలు, శబ్దాదివిషయములు, అహంకార మమకారములు వదలి ప్రవర్తించువాడే శాంతిని పొందును. ఇట్టి బ్రహ్మీ స్థితిని పొందినవాడు మరల మోహము చెందడు. అంత్యకాలమందుకూడ ఇట్టి స్థితి కలవారు బ్రహ్మానందరూప మోక్షమును పొందుచున్నాడు.

3. కర్మ యోగము

జ్ఞానము కర్మము కంటె శ్రేష్ఠమైనదైనచో నన్నేల ఈ భయంకర యుద్ధకర్మకు పురి గొల్పుచున్నావు. ఈ మిశ్రమ వాక్యము నన్ను కలవరపెట్టు చున్నది. కావున నాకు దేని చే శ్రేయము కలుగునో దానిని చెప్పుమని అర్జునుడు శ్రీ కృష్ణ పరమాత్మను వేడెను.

శ్రీకృష్ణ పరమాత్మ, జ్ఞాన కర్మయోగములను వివరించుచు లోకమునందు జ్ఞాన మార్గమునవలంబించువారిని సాంఖ్యులని, కర్మ మార్గమునను సరించువారిని యోగులని అందురు. కర్మ మార్గ విశిష్టతను వివరించుచు కర్మ త్యాగముచే ఎవడు మోక్షముపొందడు ఎవరును కర్మలు చేయకుండా ఉండలేరు. ప్రకృతి వలన పుట్టిన గుణములచే ప్రతివారును కర్మలు చేయుచునేయున్నారు. కేవలము ఇంద్రిములను బిగ బట్టి మనస్సుతో ముల్లోకముల చరించువారు డంబాచారులు. ఇంద్రియములను మనస్సుచే నియమించి అనాస్తబుద్ధితో కర్మలు నాచరించువారు ఉత్తములు. శాస్త్ర విహితకర్మలు చేయ వలెను. కర్మ చేయకుండిన చిత్తశుద్ధి కలుగును. చిత్తశుద్ధి లేనిదే జ్ఞానము కలుగదు. జ్ఞానము లేని చో మోక్షము సిద్ధింపదు. మరియు కర్మ దేహయాత్రకుకూడా అవసరము. భగవత్ర్పీతి కరములగు కర్మలను ఫలాసక్తిలేక చేయవలెను. ఇట్లు చేయుట వలన కర్మ బంధము కలుగదు. జీవుని ఆధ్యాత్మికాభివృద్ధికి యజ్ఞములు చేయవలెను. ¸్ఞుములచే దేవతలు తృప్తి నొంది మానవులకు ఇష్ట భోగముల నిత్తురు. మరల వానిని దేవతలకు సమర్పించి అనుభవించవలెను. అట్లు చేయని వాడు దొంగయేయగును. దీనినే భగవదర్పణమందురు. భగవదదర్పణ చేసిన పిదప ఆ పదార్థములు భుజించిన సజ్జనులు సమస్త పాపముల నుండి విడివడుదురు.

మన జీవన నిర్వహణకు అన్నము అవసరము. అట్టి అన్నము మేఘముల వలన కలుగును. మేఘములు యజ్ఞమువలన దేవతల ప్రీతిచే కలుగును. ¸్ఞుము సత్కర్మల వలన, సత్కర్మలు వేదముల వలన, వదేములు పరబ్రహ్మ వలన కలుగుచున్నది. కావున యజ్ఞము ద్వారా బ్రహ్మ సాక్షాత్కారము కూడ సిద్ధించును. ఇట్టి ధర్మచక్రము ననుసరించనివాడు ఇంద్రియ లోలుడైపాప జీవితము గడపును.

ఆత్మయందే క్రీడించుచు, ఆత్మ తృప్తిని పొందిన ఆత్మ జ్ఞానులు చేయవలసిన కర్మ (విధి) ఏదియు ఉండదు. అట్టి వారికి కర్మ చేయుటచే ప్రయోజనముకాని, చేయకపోవుటచే నష్టముకాని ఉండదు. అయినను జనకాది చక్రవర్తులు. ఫలాపేక్ష రహితముగా కర్మల నాచరించి మోక్షము పొందిరి. గొప్పవాడే కర్మను చేయునో తక్కిన వారును దానినే ప్రమాణము (ఆదర్శము) గా తీసుకొని అనుసరించెదరు. నాకీమూడు లోకములందు చేయవసిన కర్మగాని, పొందబడిని వస్తువుగాని లేదు. అయినను నేను కర్మల యందు ప్రవర్తించుచున్నాను. నేను కర్మలు (దిహితకర్మలు) చేయకున్నచో ప్రజలు చెడిపోదురు. మరియు అట్లు చెడగొట్టిన వాడను నేనే అగుదును. అజ్ఞానులు ఫలాపేక్షతో కర్మలు చేయుదురు. కాని జ్ఞానులు ఫలాసక్తి రహితులై లోకకళ్యాణార్ధము కర్మలు చేయుదురు. జ్ఞాని యగువాడు నిరాసక్తముగా కర్మలు చేయుచు అజ్ఞానులనట్లు చేయుటకు బోధించవలెను.

ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తయోగుణములచే సమస్త కార్యములు జరుగుచున్నను అహంకారముచే వివేక శూన్యమైన మనస్సు కలవారు తానే చేయుచున్నారని తలంచును. ఆత్మ వివేకము గలతత్వవేత్తలు ఆ యా కార్యములు చేయుచున్నను తామేమియు చేయుటలేదని సంగవర్జితులై మెలగుదురు. అల్పజ్ఞులను, మందమతులను తమ ఆచరణ ద్వారా క్రమముగా దారికి తేవలెను.

హేఅర్జునా! సమస్త కర్మలను నాయందు ఆధ్యాత్మచిత్తముతో సమర్పించి ఆశ, మమకారాదులు లేకుండ యుద్ధము చేయుము. ఇట్లు చేసిన కర్మ బంధము నుండి విడివడుదురు. అట్లు చేయనివారు. జ్ఞానము లేక బుద్ధి చెడిపోయి సంసారకూపమున బడి నశింతురు. ఎంతటి పండితుడైనను జన్మ సంస్కార జనిత ప్రకృతి ననుసరించియే నడువవలెను. ఇంద్రియములకు వాని విషయములందురాగద్వేషములు ఏర్పడియున్నవి. ఆరాగద్వేషములకు లోబడక పురుషప్రయత్నముచే జయించ వలెను. గుణములేనిదైను స్వధర్మము ఉత్తమము. స్వధర్మాచరణలో మరణించినను, ఉత్తమ లోకములు కలుగును. పరధర్మము భయంకరము. కావున నీ క్షత్రియధర్మమునవలంబింపుము.

మనుజుడు ఇష్టము లేనప్పటికి పాపములు ఏల చేయుచున్నాడు? రజోగుణమువలన పుట్టిన కామము క్రోధముగా పరిణమించి మహాపాపము లకు కారణభూతమగును. పొగ చేత అగ్ని, మురికి చేత అద్ధము, మావిచే గర్భస్ధ శిశువు కప్పబడి యున్నట్లు కామముచే ఆత్మజ్ఞానము కప్పబడి యున్నది. ఈకామము అగ్నివలె తృప్తి చెందక ఆశలనువృద్ధి చేయుచు, జ్ఞానమును కప్పి వేయు నిరంతరశత్రువు. ఇది ఇంద్రియములు, మనస్సు, బుద్ధి నాశ్రయించి మనుజునిమోహ పెట్టి అజ్ఞానమునపడద్రోయును.

హే అర్జునా! నీవు మొట్టమొదట ఇంద్రియములనిగ్రహించి పపానక, జ్ఞాన విజ్ఞానములనాశనము చేయు కామమును నశింపజేయుము. దేహముకంటె ఇంద్రియములు. ఇంద్రియముల కంటె మనస్సు, మనస్సు కంటె బుద్ధి, బుద్ధికంటె ఆత్మ గొప్పది. కావున నీవు వివేక బుద్ధితో ఆత్మను తెలుసుకొని మనస్సును తద్వారా ఇంద్రియములను నరికట్టి కామమను శతృవును నశింపజేయుము.

4. జ్ఞానయోగము

శ్రీ కృష్ణ పరమాత్మ నాశరహితమగు. ఈ నిష్కామకర్మయోగ మును పూర్వము సూర్యునకు చెప్పితిననియు, సూర్యుని నుండి వైవస్వత మనువు, మనువు నుండి ఇక్ష్వాకుడు, ఇట్లు పరంపరగా రాజర్షులు తెలుసుకొని రనియు, చాలాకాలమైనందున అది ప్రచారములోలేకున్న దనియు, మరల దానిని భక్తుడగు. మిత్రుడగు అర్జునునకు చెప్పితి నని పలికెను. అంత అర్జునునకు సందేహము కలిగెను. నీ న్మము ఇటీవలది, సూర్యుని న్మము పురాతనమైనది, ఇది ఎట్లు సాధ్యమనగా హే అర్జునా! నీకును, నాకును అనేక జన్మలు గడచినవి. వానిని నేనెరుగుదును. నీవెరుగవు నేను పుట్టుక లేనివాడను, నాశరహితుడను సమస్త ప్రాణులకు ఈశ్వరుడనైన నామాయాశక్తిచే అవతరించుచున్నాను.

హే అర్జునా! ఎపుడెపుడు ధర్మము క్షీణించి, అధర్మముపెరుగునో అపుడు సాధుజన రక్షకు, దుర్మార్గుల వినాశమొనరించుటకు ధర్మము లెస్సగా స్థాపించుటకు నేను ప్రతి యుగమున అవతరింతును. ఎవడీ ప్రకారముగా నాదివ్యజన్మ కర్మను గూర్చియ ధార్ధముగా తెలుసుకొనునో అతడు మరణానంతరమున నన్నే (మోక్షము) పొందుచున్నాడు.

అనురాగము, భయము, క్రోధము విడచి, నాయందే చిత్తము లగ్నముచేసి ఆశ్రయించినవారు జ్ఞానతపస్సుచే నాస్వరూపము. (పరమాత్మ స్వరూప) మోక్షము పొందియుండిరి. ఎవరే ప్రకారము నన్ను సేవింతురో వారి నాప్రకారముగా ననుగ్రహింతును. మనుజులు సర్వవిధముల నామార్గమునే అనుసరించుచున్నారు. కర్మఫల ప్రాప్తి నాశించు మానవులు దేవతల నారాధింతురు.

బ్రాహ్మణ క్షత్రియాది నాలుగు వర్ణములు సత్వర జస్తమోగుణములయొక్కయు, వాని చే చేయబడుకర్మల ననుసరించినాచే సృజింపబడిరి. (బ్రాహ్మణులు కేవలము సత్వగుణముకలవారు, శమదమాదులు తపస్సు కర్మ గలవారు. క్షత్రియులు సత్వగుణము స్వల్పముగను రజోగుణము అధికముగా కలవారు. శౌర్య, ధైర్య, గాంభీర్యయుక్త యుద్ధ, రాజ్యపాలనాదులు చేయుదురు. వైశ్యులు స్వల్పముగా సత్వగుణము, రజో తమోగుణములు కలిగి కృషి, గోరక్ష, వ్యాపారాదులు కర్మలుగా చేయుదురు. శూద్రులు తమోగుణము అధికముగా రజోగుణము స్వల్పముగా గలిగి పరిచర్యాదులు చేయుదురు.)

భగవంతునికి కర్మలంటవు, కర్మ ఫలాపేక్ష యుండదు. ఇట్లు తెలిసిన ముముక్షువులు నిష్కామకర్మ నాచరించుటచే కర్మ ఫల బంధవిముక్తుడగును. కావున నీవును అట్లు చేయుము.

కర్మ, వికర్మ, అకర్మ అనిమూడు విధములు. కర్మ అనగా చేయదగిన కర్మ. వికర్మ చేయరానికర్మ. అకర్మ ఏకర్మ చేయక సోమరిగానుండుట. సమస్త కర్మలు కోరిక, సంకల్పములేక జ్ఞానమను అగ్నిచే దహింపబడిన కర్మలు గలవానిని పండితుడందురు. ఇట్లు కర్మ ఫలాసక్తి విడచి కర్మల యందు ప్రవృత్తుడైనను అతడు కర్మచేయని వాడేయగును. ఆశ##లేనివాడు, ఇంద్రియముల నిద్రించినవాడు ఏవస్తువును పరిడగ్రహింపనివాడు, శరీరమాత్రముచేకర్మచేసినను పాపమునొందడు. ఆ ప్రయత్నముగా లభించిన దానితో తృప్తి పడువాడు, సుఖదుఃఖాదిదవ్వంద్వముల దాటినవాడు, మాత్సర్యములేనివాడు, కర్మముసిద్ధించినను. సిద్ధింపకున్ను సమభావముతో నుండు వాడు కర్మచేసినను బంధింపబడడు. ఆసక్తిలేనివాడు, రాగద్వేష, కామక్రోధాదుల నుండి విముక్తుడు, ఆత్మజ్ఞానమందే మనస్సునిలకడగా నుంచి భగవత్ప్రత్యర్ధము కర్మలనాచరించినను, కర్మబంధము నశించును.

యజ్ఞాదుల యందు హోమసాధనములు, హోమద్రవ్యములు, హోమాగ్ని, హోమము చేయువాడు, హోమముచేయబడునది, సర్వము బ్రహ్మ స్వరూపములేయని ఏకాఆగ్రభావముతో కర్మలను చేసిన మనుజుడు బ్రహ్మమునేపొందును. యజ్ఞాములువివిధరకరములు 1. దేవతారాధనరూపయజ్ఞము. 2. బ్రహ్మయజ్ఞము - చిత్తము బ్రహ్మమునందు విలీనమోనర్చుట 3. ఇంద్రియనిగ్రహము, విషయ త్యాగము. 4. మనోనిగ్రహము- 1. ద్రవ్యయజ్ఞము, 2. తపోయజ్ఞము 3. మోగయజ్ఞము, 4.స్వాధ్యాయయజ్ఞము 5. జ్ఞానయజ్ఞము పూరక, కుంభక, రేచక సాదన ద్వారా ప్రాణాయామము, ఆహార విషయనియమములదే ఇంద్రియ నిగ్రహమొనర్చుటచే ప్రాణాది వాయువులను ప్రాణాదుల వశీకృతము చేయుట- ఇట్టి యజ్ఞముల నాచరించుటచే సత్సవితములుకలుగును, ఇట్టి యజ్ఞములు భగవత్ప్రత్యర్ధమొనరించి, భగవదర్పిత యజ్ఞశేషము (ప్రసాదము) భుజించుటను, అన్నియజ్ఞములు, సాధనాక్రమములు, అన్నిటికంటె జ్ఞానయజ్ఞముశ్రేష్ఠము.

అట్టి మోక్షసాదనమగు జ్ఞానము పొందుటకు తత్వవేత్తలగు జ్ఞానులు, భక్తితో సాష్టాంగనమస్కారముచేసి, సమయముచూసి వినయముతో ప్రశ్నించి, సేవచేసి వారివలన ఉపదేశపూర్వకముగా తెలిసికొనవలెను. అట్టి జ్ఞానము పొందుట వలన మోహము (అజ్ఞానము) నశించును. సమస్తప్రాణికోట్టను తనయందు భగవంతుని యందు చూడగలుగును. జ్ఞానసముపార్జచే మహాపాపాత్మడైనను. జ్ఞానమను నావచే (సంసారన) సముద్రము తాటగలదు. అట్టి ఆత్మ జ్‌బుూనము క్రమయోగ సిద్ధిచే తనయందేకాలక్రమమున లభించును. గురు శాస్త్రవాక్యములయందు శ్రద్ధ, ఆధ్యాత్మికసాధనలయందు నిష్ట, ఇంద్రియముల జయించినవారు పరమ శాంతికరమగు జ్ఞానముపొందును. జ్ఞానములేనివాడు శ్రద్ధలేనివాడు, సంశయచిత్తుడు వినాశము పొందును. ఇహపరలోకసౌఖ్యముండదు.

హే అర్జునా! నిష్టామకర్మయోగముచే కర్మఫలముత్యజించిన వాడు (ఈశ్వరార్పణ) జ్ఞానముచే సంశయనివృత్తుడైన ఆత్మనిష్టుని (బ్రహ్మజ్ఞానిని) కర్మముల బంధింపనేరవు, కావుననే హృదయమున బుట్టిన అజ్ఞానజనిత సంశయమును జ్ఞానమును ఖడ్గముచే ఛేదించి నిష్టామకర్మనాచరింపుము.

5. కర్మసన్యాసయోగము

హేకృష్ణా! నీవొకప్పుడు కర్మత్యాగము, మరియొకప్పుడు కర్మయోగమును ప్రశంశించుచున్నావు. ఈ రెండిటలో ఏది శ్రేష్ఠము?

హే అర్జునా! కర్మత్యాగము (కర్మత్యాగపూర్వకజ్ఞానయోగము) కర్మయోగము రెండును మోక్షము కలుగ జేయును. రెండింటిలో కర్మయోగమే శ్రేష్టమైనది. ఎవడు రాగద్వేషాదిద్వంద్వములు లేనివాడో అతడు సంసపార బంధమునుండి సులభముగావిముక్తుడగును. జ్ఞానయోగము, కర్మయోగము వేరువేరుకాదు. అందులో ఏఒక్కదానినిన బాగుగా అనుష్టించినను మోక్షము పొందును. జ్ఞానకర్మయోగములను ఒకటిగా చూచువాడే వివేవంతుడు. జ్ఞాన యోగము కర్మయోగములేకుండాసొందుకష్టము. నిష్టామకర్మ యోగమునాచరించువాడు పరివుద్ధహృదయుడై, ఇంద్రియముల జయించి, సమస్త ప్రాణులయందు తన యందుగల ఆత్మొకటే నని తెలిసికొని కర్మలు చేసినను వానిచేనంటబడడు. పరమార్ధ తత్వమును తెలిసినయోగి పచూచుట, వినుట, వాసన చూచుట, తినుట, నడచుట, నిదురించుట మొదలగు. ఇంద్రియకర్యములొనరించుచున్నను. ఆయాకార్యములందు కర్తృత్వబుద్ధిలేక నేనేమియు చేయుట లేదనితలచును. అట్లు చేయుకర్మలను పరమాత్మకర్పించి సంగరహితుడైయుండునో అతడు తామరాకుపై నీటిబొట్టును వాని పాపపుణ్యఫలములచే నంటబడకుండును. కావున నిష్టామకర్మయోగులు చిత్తశుద్ధికొరకు ఫలాశక్తివిడచి, శరీరము, మనస్సు, బురద్ధిచే అభిమానీరహితముగా కర్మలుచేయుదురు. ఫలాపేక్షరహితుడగునిష్టామకర్మయోగి పరమశాంతినిపొందును. ఫలాపేక్షచే కర్మలు చేయువాడు కర్మఫలమందాసక్తి కలిగి బద్ధుడగుచున్నాడు. ఇంద్రియనిగ్రహముగల జీవుడు సమస్తకర్మలను పరిత్యజించి నవద్వారపురమునందు సుఖముగానుండును.

భగవంతుడు జీవులకు, కర్తృత్వమును గాని, కర్మలనుగాని, కర్మఫలముతోగాని సంబంధముకలుగజేయుటలేదు. ప్రకృతి సంబంధ జన్మాతరసంస్కారము. ఆయాకర్తృత్వాదులను కలుగ జేయుచున్నది. పరమాత్మ ఎవరియొక్క పాపపుణ్యములను స్వీకరింపడు. అజ్ఞానముచే జీవులు భ్రమనొందుచున్నారు. ఆత్మజ్ఞానముచే అజ్ఞానము నశించుటచే అట్టివారి జ్ఞానము సూర్యునివలే ఆపరబ్రహ్మస్వరూపబును ప్రకాశింపజేయుచున్నది.

ఆత్మయందేబుద్ధింనుంచి ఆత్మగూర్చియే చింతన చేయుచు, ఆత్మయందే మనస్సులగ్నముచేసి పరమాత్మ శరణుపొందని ఆత్మ నిష్టునకు పాపము నశించి, పురరావృత్తిరహితమోక్షపదము లభించును. అట్టిజ్ఞానులు బ్రహ్మాణుడు, గోవు, ఏనుగు, కుక్క కుక్కమాంసముతిను చండాలునందు సమదృష్టికలిగియుందురు. అట్టిసమభావముకలవారు ఈ జన్మమందే జన్మమరణరూప సంసారము జయించును. ఏలననగా పరబ్రహ్మముదోషరహితమైనది.

సమత్వముగలది. సమత్వముద్ధికలవారు బ్రహ్మమందేఉన్న వారగుదురు. ఇట్టిస్ధిరబుద్ధిగలమో%్‌హరహితుడైన బ్రహ్మజ్ఞాని ఇష్టమైన దానిని పొందిన సంతోషము, అనిష్టప్రాప్తిచే దుఃఖము పొందకుండును. బాహ్యస్పర్శాది విషయములనయందాసక్తి లేనివాడు, నిరతిశయ ఆత్మసుకమునుపొంది బ్రహ్మను సంధానపరడుఐ అక్షయ సుకముపొందును.

ఇంద్రియ విషయభోగములు దుఃఖహేతువులు, అల్పకాల మందునవి. విజ్ఞుడు వానియందాసక్తి కలిగియుండడు. ఎవడేశరీరము విడచుటకు పూర్వమే ఇచటనే ఈ జన్మమందే కామక్రోధాదుల నిరకట్టువాడు యోగి, సుఖవంతుడు, ఆత్మయందేసుఖించుచు, క్రీడించుచు ఆత్మప్రకాశము కలయోగి బ్రహ్మస్వరూపుడై బ్రహ్మానందము పొందును. పాపరహితులు, సంగములేనివారు, ఇంద్రియములస్వాధీనపరచుకొన్న వారు. సమస్త ప్రాణులహితముకోరువారు నగు ఋషులు బ్రహ్మ సాక్షాత్కరముపొందెదరు. కామక్రోధములు తొలగి చిత్తమును స్వాధీనపరచుకొన్న ఆత్మతత్వమెరిగినవారికి బ్రహ్మసాయుజ్యము అంతటకలదు. శబ్ద స్పర్శాదివిషయముల బైటకినెట్టి, చూపును భ్రూమద్యమున నిలపి, ప్రాణవాయువుసమముగాచేసి, ఇంద్రియమనోబుద్ధులనిగ్రహించి, ఇచ్ఛా, భయ, క్రోధములులేనివాడు మోక్షాసక్తుడై మోక్షమునే పొందును.

యజ్ఞము యొక్కయు, తపస్సు యొక్క భక్తి సమస్త లోక ప్రభువు, నియామకుడునగు పరమాత్మే, ఈశ్వరుడు సర్వప్రాణి హితకారియని తెలిసినవారు శాంతిని పొందెదరు.

ఆత్మ సంయమయోగము

ఈ అధ్యాయమందు శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధితోకూడిన ఆత్మనిగ్రహమెట్లు సాధించమనో ఆపద్ధతున్నియు చక్కగాబోధింపబడెను. దీనినే ద్యానయోగమందురు.

ఎవడు చేయవలసినకర్మలనుఫలాపేక్షలేకుండాచేయునో ఆతడే సన్యాసి, యోగియునగును, కేవలము అగ్ని హోత్రాదికర్మల విడచినవాడు సన్యాసికాడు. సన్యాసమునే యోగమనితెలియవలెను. జ్ఞాన, ధ్యానయోగము పొందగోరిన మునికి కర్మసాధనము, అట్టి యోగారూధునకు (పొందినవారు) కర్మనివృత్తి (ఉపరతి) సాధనము. శబ్దాదివిషయములయందు, కర్మల యందు నాసక్తి నుంచక సమస్త సంకల్పములు, విడచినవాడు యోగారూఢుడు. గురువులు, శాస్త్రములు, దైవము దారి చూపుదురేకాని ఉద్ధరించరు. తన్నుతానే యుద్ధిరంచు కోవలెను. ఏలనన తనకు తానే మిత్రము, శతృవు, ఎవడు వివేక వైరాగ్యాదులచే మనస్సును జయించునో అట్టిమనస్సు అతని కి బంధువు, లేనిచో శతృవు. మనస్సును జయించినవాడు పరమశాంతితోగూడి శీతోష్ణ, సుఖదుఃఖ, మానవమానాదులందు చెక్కుచెదరక ఆత్మాను భవము నందే నిలకడగా నుండును. శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములచే తృప్తినొందిన మనస్సుకలవాడు, నిర్వికారుడు,ఇంద్రియములను లెస్సగా జయించినవాడు, మట్టిగడ్డ, రాయి, బంగారము మూడింటిని సమముగా చూచువాడు యోగారూఢుడని చెప్పబడును. ప్రత్యుపకారము కొరకే మేలొనర్చువారియందు ప్రతిఫలము గోరి మేలు చేయువారి యందు, శత్రువులు తటస్ధులు మద్యవర్తులు, విరోధులు, బంధువులు, సజ్జనులు, పాపులయందు సమభావముకలవాడేశ్రేష్టుడు.

అట్టియోగారూఢదశనొందుటకు, భతవత్సాక్షాత్కారమునకు ద్యానము నభ్యసించు యోగి ఏకాంతప్రదేశమున, ఒంటరిగా నున్నవాడై, దేహేంద్రియములను స్వాధీనపరచుకొని, ఆశ, కోరిక లేనివాడై మనస్సును ఆత్మయందే నిలపవలెను. ద్యానమునకు పరిశుద్ధమైన చోట, మిక్కిలి ఎత్‌ఉపల్లములులేని చోట క్రిందదర్భాసనము, దానిపై జింకచర్మము, ఆపైన శుభ్రవస్త్రము పరచి నిలకడయగు ఆసనము నేర్పరచుకొని దానిపై కూర్చుండి (ఏదైన ఆసనపద్ధతి) మనస్సును ఏకాగ్రపరచి, ఇంద్రియవ్యాపారములనరికట్టి పరమాత్మ ధ్యానము నభ్యసించవలెను. మరియు శరీరము, శిరస్సు, కంఠము, సమముగానిలపి, కదలక, దిక్కులుచూడక, నాసికాగ్రము (భ్రూమద్యము) చూచుచుర, ప్రశాంత హృతయుడై, నిర్భయ చేతస్కుడై, బ్రహ్మచర్యవ్రతనిష్ఠకలిగి, మనస్సును బాగుగానిగ్రహించి, పరమాత్మయే గతియని నమ్మి ధ్యానయుక్తుడు కావలెను అట్టిధ్యాన యోగి మితాహారము తీసుకొనుచు, నిద్రాదుల మితముగావర్తించుచు, మనోనిగ్రహముకలిగి ఎల్లప్పుడు మనస్సును ఆత్మధ్యానముందు నిలిపి పరమాత్మ స్వరూప మోక్షమురూప శాంతిని పొందును. ఆహార విహారాదులయందు మితమైన ప్రవర్తనకలవారికేయోగము సంసార దుఃఖము పోగొట్టును.

యోగసిద్ధిని పొందినవారు ఏ ఒక్కకోరికలేక, మనస్సును పూర్తిగా నిగ్రహించి, మనస్సును ఆత్మయందే స్థాపించును. అట్టివారి చిత్తము గాలివీచినచోట నిలకడగానుండు దీపమువలే నిశ్చలముగా నుండును. యోగాభ్యాసముచే నిగ్రహింపబడిన మనస్సు, పరమ శాంతినిపొంది, పరిశుద్ధ ఆత్మను సందర్శించును. ఇంద్రియములకగోచరము, కేవలము బుద్ధిచేగ్రహింపగలుగు, సుఖమనుభవించును. ఎట్టిదుఃఖము వలననుచలించక దేనిని ఇతరమగు ఏలాభమును గొప్పగా తలంపడో అట్టి ఆత్మసాక్షాత్కారమును, ధీరమనస్సుచే పట్టుదలతో సాధింపవలెను.

అట్టి ఆత్మస్థితి పొందుటకు సంకల్పమువలనకలిగెడు, కోరికలన్నిటిని పూర్తిగా విడచిపెట్టి, మనస్సుచే ఇంద్రియములను బాగుగా నిగ్రహించి, బుద్ధినిమెల్లగా బాహ్యప్రపంచమునుండి మరల్చి, ఆత్మయందుస్థాపించవలెను. మనస్సు ఛపల స్వభావము కలది. అది ఏయేవిషయములపైకి పోవునో, అటనుండి మరలించి, ఆత్మాధనముకావింపవలెను. అట్లు చేయుటచే ప్రశాంతచిత్తము కలిగి, రజోగుణ వికారములులేక, బ్రహ్మరూపమునుపొంది, దోష రహితుడై, సర్వోత్తమమైన ఆత్మానందము పొందును. ఇట్టి ధ్యాన యోగి ఆత్మైక్యము పొంది సమస్తచరాచర ప్రాణికోట్టయందు సమదృష్టికలవాడై, తన్నుసర్వబూతముల యందు, సర్వబూతములు తనయందున్నవిగా చూచును. అట్లు సమస్త భూతములందు పరమాత్మను, పరమాత్మయందు సర్వభూతముల చూచువారికి పరమాత్మ కనిపించును. పరమాత్మకు అతడు కనిపించును. అట్టి సర్వాత్మ దృష్టికలిగి పరమాత్మను సేవించుయోగి ఏవిధముగా ప్రవర్తించినను (సమాధినిష్టయందున్నను, లోకవ్యవహారములు సలుపుచున్నను) నాయందేయున్న వాడగును, సమస్త ప్రాణులసుఖదుఃఖములు తనవిగా భావించుయోగి శ్రేష్ఠుడు.

అంతట అర్జునుడు మనోనిశ్చలతచేసిద్ధించుయోగమును మనస్సుయొక్క ఛపలత్వముచే తెలిసికొనాలకున్నను, మనస్సుచంచలమైనది, విక్షోభము కలిగించునది, బలవంతమైనది. దృఢమైనది, దానిని నిగ్రహించుట గాని అణచిపెట్టుట గాని మిక్కిలి కష్టసాధ్యమైనదనెను. అతని శంకను సమాధానముగా శ్రీకృష్ణ పరమాత్మ హే అర్జునా!: మనస్సు నిగ్రహించుట కష్టమే, అది చంచలమైనదే, అయినను అభ్యాసవైరాగ్యములచే అదినిగ్రహింపబడగదు. మనస్సును ప్రయత్నముచే, ఉపాయముతో నిగ్రహించుటవలన యోగము సిద్ధించును. లేనిచో శక్యము కాదు.

మరియొక శంక, శ్రద్ధతో కూడియున్నను, నిగ్రహశక్తిలేనివారు, యోగమునుండి జారిన మనస్సుగల సాధకుని గతిఏమి? అట్టివాడు ఇహపరలోకములకు రెండిటికి చెడి నశింపడా? నాయీ సందేహముదీర్చుము. హే పార్ధా! అట్టి యోగభ్రష్టునకు ఇహపరలోకములందు వినాశము కలుగదు. అట్టి వారు మరణానంతరము పుణ్యలోకములుపొంది, మరల సదాచార సంపన్నులగు శ్రీమంతుల గృహమందు పెట్టెదరు. లేదా జ్ఞాన వంతులగు యోగులవంశమునందు జన్మింతురు. అట్లాతడు పూర్వజన్మయోగ సంస్కారముచే సంపూర్ణయోగసిద్ధికి మరల తీవ్ర ప్రయత్నము చేయును. పూర్వజన్మసంస్కారము చే యోగమువైపునకే ఈడ్వబడి పట్టుదలతో ప్రయత్నముచేసి, అనేక జన్మల అభ్యాసబలముచే పాపరహితుడై మోక్షము పొందును.

యోగి యగువాడు తపస్సులు చేయువారికంటెను. శాస్త్రజ్ఞానము కలవారికంటెను. అగ్నిహోత్రాది కర్మలుచేయువారికంటెను శ్రేష్ఠుడు. కావున నీవు యోగివికమ్ము. యోగులందరి లోను ఎవడు నాయందుమనస్సు నిలిపి శ్రద్ధలోనన్ను ధ్యానించుచున్నాడో అట్టివాడు (ధ్యానయోగి) సర్వశ్రేష్ఠుడడని నా అభిప్రాయము.

7. విజ్ఞాన యోగము

ఈ అధ్యాయమందు స్వానుభవయుక్తమగు పరమార్ధ జ్ఞానమును గూర్చి విశేషము గా తెలుపబడెను. అమానిత్వాది జ్ఞానగుణములనే గాక జ్ఞేయ తత్వరూపమగు విజ్ఞానము యొక్క పరిచయము ముముక్షువుకలిగి యుండవలెను. కావున భగవత్స్వరూపము, మహిమ ఇందుతెలుపబడెను.

హే అర్జునా! నా యందాసక్తిగల మనస్సుకలిగి, నన్నే ఆశ్రయించి యోగమునాచరించుము. నిస్సందేహముగా నన్నే తెలిసికొనగలవు. దేనిని తెలిసికొనిన మరల ఈ ప్రపంచమున తెలిసికొనవలసినది యుండదో అట్టిఅనుభవసహితజ్ఞానము సంపూర్నముగా నీకు చెప్పెదను.

అనేక వలేమంది మనుజులలో ఏ ఒక్కడో మోక్షసిద్ధికై యత్నించుచున్నాడు. అట్టివారిలో ఏ ఒక్కడు మాత్రమే నన్ను వాస్తవముగా తెలిసికొనగలడు.

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి ఆహంకారము. అని ఈ విధములుగా నీ ప్రకృతి (మాయ) విభజించబడినది. ఇది అపరాప్రకృతి, చాలస్వల్పమైనది. దీనికంటెవేరైన జగత్తును ధిరంచు జీవరూపప్రకృతి నాపరాప్రకృతి. దారమందు మణులు వలే నా యందీ సమస్త ప్రపంచము కూర్చబడియున్నది. నాకంటే వేరేదియులేదు. జలమందు రుచి, సూర్యచంద్రాదులయందు కాంతి, సమస్తవేదములయందు ఓంకారము. ఆకాశమునశబ్దము, మనుజులందు పరాక్రమము భూమియందు సుగంధము. అగ్నియందు ప్రకాశము, సమస్త ప్రాణులయందు ప్రాణము, తాపసుల యందు తపస్సు, సమస్తప్రాణుల శాశ్వత బీజము, బుద్ధిమంతులయొక్క బుద్ధి, ధీరుల యొక్క ధైర్యము, బలవంతులయందు ఆశ, అనురాగములేని బలము, ప్రాణులయందు ధర్మవిరుద్ధము కాని కోరిక నేనే అయియున్నాను.

సత్వరజస్తమోగుణములచే కలిగిన పదార్థములు, వాని స్వభావములు, నా వలనననే కలిగినవి. నేను వానికి వశుడను గాను. అది నాకు వశవర్తులైయున్నవి. ఈ త్రిగుణముల వికార స్వభావములచే ఈ ప్రపంచమంతయు మోహము (అవివేకము) పొందింపబడినది. అందుచే త్రిగుణాతీతుడును, నాశరహితుడనగు నన్ను తెలిసికొనజాలకున్నారు. త్రిగుణాత్మకమైన ఈ నా మాయ (దైవసంబంధమైనది) దాటుటకు కష్టసాధ్యమైనది. నన్ను శరణు పొందినవారు ఈ మాయను సులభుముగా దాటగలరు.

పాపములు చేయవారు, మాయచేకప్పబడినవారు, అసురీగుణములనాశ్రయించు మానవాధములు నన్నాశ్రయించుటలేదు. ఆపత్తు యందున్నవారు. సంపదకోరువారు. భగవంతుని తెలిసికొనగోరువారు. ఆతజ్ఞానము కలవారు అను నాలుగు విధముల పుణ్యాత్ములునన్ను సేవించుచున్నారు. వారితో పరమాత్మను గూడియుండి (నిత్యము) భక్తిగల జ్ఞాని శ్రేష్ఠుడు. అట్టిజ్ఞానికి నేను ఇష్టుడను. నాకు అతడు ఇష్టుడు వీరందరు మంచివారే కాని నాయందేచిత్తమును స్థిరముగానెలకొల్పి. సర్వోత్తమ ప్రాప్తి స్థానముగా నన్నాశ్రయించుకొన్న జ్ఞాని శ్రేష్ఠుడు.

అనేక జన్మల అంతమున మనుజుడు జ్ఞానవంతుడై సమస్తము భగవంతుడే యను సద్భుద్ధికలిగి నన్ను పొందుచున్నాడు. అట్టి మహాత్ములు ఈలోకములో అరుదు. కొందరు జన్మాంతరసంస్కారముల ప్రేరణచే విషయాదులందు కోరికలచే వివేకము కోల్పోయి. ఇతరదేవతల నారాధించుచున్నారు. ఏ భక్తుడు ఏదేవతారూపమును శ్రద్ధతోపూజింప దలచుచున్నాడో వానికి తగిన శ్రద్ధను, సుస్థిరముగా నేనేకలుగచేయుచున్నాను. మరియునాచే విధింపబడిన ఆయా యిష్టఫలములను, ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు. దేవతలనుపూజించువారు దేవతలనే పొందెదరు. అట్టి అల్పబుద్ధికలవారికి లభించు ఆ ఫలము నాశవంతమైనది. శాశ్వతమోక్షపదవి నాశించి నన్నాశ్రయించువారు నన్నే పొందెదరు. నాశ రహితము, సర్వతోత్తమము, ప్రకృతికి పరమైన నారూపమును తెలియని అవివేకము అద్యక్రరూపుడనగు నన్ను పొంద భౌతిక దేహము పొందినవారుగా తలంచుచున్నారు. యోగమాయచే కప్పబడిననేను అందరికి కనిపించను. అవివేకులు నన్నుపుట్టుకలేని నాశరహితుడు గానెరుగరు. భూత, భవితష్యలో మర్తమానములందరి ప్రాణులందరిని నేనురుగుదును. నన్ను మాత్రము ఎవరు ఎరుగరు. ఏలనన సమస్త ప్రాణులు పుట్టుకతేదనే రాగద్వేషజనితమగు. సుఖధుఃఖ ద్వంద్వరూప ద్యామోహము వలన మిక్కిలి జ్ఞానము పొందుచున్నది. పుణ్యకార్యతత్పరులు. పాపమునశించుట చేద్యంద్వరూప అజ్ఞానము నుండి విడువబడి దృడప్రతులైనన్ను సేవించుచున్నారు. ఎవరు జన్మమరణమదు సుఖము పోగోట్టుకోనుటకు. నన్నా శ్రయించిప్రయత్నించురాదట సమస్త ప్రత్యగాత్మస్వరూపము. సకల కర్మము ఆబ్రహ్మయేయని తెలిసికోందురు. అది భూత, అదిదైవ, ఆదియజ్ఞాములతోకూడియున్న నన్నెవరు తెలిసికోందురో వారు దేహవియోగకాలమందు. నిలకడగల మనస్సుకలవారై నన్నెరుగగలరు.

8. అక్షర పరబ్రహ్మయోగము

ఈ అద్యాయమందు నాశరహిత అక్షరపరబ్రహ్మమును గూర్చి బోధింపబడెను.

పురుషశ్రేష్ఠుడదగు. ఓకృష్ణా! ఆబ్రహ్మమేది? ఆద్యాత్మామేది? కర్మనగానేమి? ఈ అదిభూతమని ఏది చెప్పబడినది? అధిదైవదుని దేనిని చెప్పుదురు? ఈ దేహమందు అధియజ్ఞాడెవరు? అతనిని తెలుసుకోనుచు ఎట్లు? ప్రాణప్రాయణ సమయమునీ నియమిత చిత్తులచే నీ పెట్లు తెలిసి కోనబడగలవు? అని అర్జునుడు ప్రశ్నింప సమాధానముగా--

సర్వోత్తమమైన నాశరహితమైనదే భ్రహ్మ. ప్రత్యగాత్మ భావము (ఈ ఆత్మనేను). అత్యాత్మము. ప్రాణికోట్లకు. ఉత్పత్తి కలుగజేయు జ్ఞాదిరూపక త్యాగ పూర్వకమైన క్రయకర్మమనబడును. నశించు పదార్థము అధి భూతము. విరా పురుషుడులేక హిరణ్య గర్జుడే అధిదైవతము. ఈ దేహమందు నేనే (పరమాత్మయే). అధియజ్ఞుడగుబడును. ఎదడు మరణకాలమందు నన్నేస్మరించుచు శరీరమును విడేచి పోవున్‌ అతడు శాస్వరూపము నుపాందుచున్నాడు. ఇందు సందేహమేమియులేదు. ఎవడు మారణకాలములో ఏయే భావమును (లేకరూపమును)చింతించుచుదేహము విడిచున్‌వాడా యారూపమునేపోందును. కావునీ ఎల్లకాలమందు నీన్నేస్మరించుచు. యుద్ధమును గూడజేయుము. నా ంయదు సమర్పింపబడిన మనా బుద్ధులు కలవాడవైనచో నీవు నీన్నే పొందగలవు. అభ్యాసమనుయోగము లేకుండి ఇతర విషయములెపైకి పోని మనస్సుచే స్వయంప్రకాశ స్వరూపుడు. సర్మాత్తముడగు. పరీమపురుషుని మరలమరాల స్మరించుచు దునుజుడు అతనినే పొందుచున్నాడు.

ఎవడవ భక్తితో కూడకోననీవాడై అంత్యకాలమందు ద్యాయోగమ బలముచే ప్రాణవాయువును భ్రూమధ్యమందునిలబడి ఆ పిదాప సర్వజ్ఞాడు, పురాణపురుషుడు, జగన్నియామీకుడు, అణువుకేంటే సూక్ష్మమైన వాడు, సకలప్రపంచమునీకు ఆధారభూతుడు చింతింపవలని లేని స్వరూపముకేలవాడు, సూర్యకాంతివంటికాంతి గలవాడు. అజ్ఞానాంధకారమునీకు ఆదల నుండువాడునగు పరమాత్మను. నిశ్చలమనస్సుచే ఎజతెగక చింతించునో అతడు దివ్యపురుషుడైన సర్వోత్తముడగు ఆహారమాత్మనేపొందును. వేదవేత్తలు దేనిని నాశరహితముగా చెప్పుదురో. రాగరహితులు, త్యాగశీలురు, దేని యందు ప్రదేశించుచున్నారో, దేనిని అభిలషించి బ్రహ్మదర్యము నీనుష్టించుచున్నారో అట్టి పరమాత్మపదమును గూర్చి తెలిపెదేను. ఎవడు ఇంద్రయములనీ కప్పీ, మనస్సును ఆత్మయందులెస్సగా స్థాపించి శిరస్సు (బ్రహ్మరంద్రము). నందు ప్రాణవాయువు నుంచి ఆత్మను గూర్చి ఏకాగ్రచింతన చేయుచు శరీరమును వదులునో అతడు సర్వోత్తదుస్థానీము పొందును. ఎవడు అనన్యచిత్తుడై నన్ను గూర్చి ప్రతిదీనాము నిరంతరము స్మరించుచుండునో అట్టి నిరంతర ధ్యానపరునకు. నేను సులభముగా పొందబడినవాడ నైయుందును. సర్వోత్తమ మోక్షపదము నొందిన మహాత్ములు బ్రహ్మత్వమును పొంది మరల దుఃఖ నిలయమై అనిత్యమైనట్టి జన్మను ఎన్నడికి పోందరు.

ఓ అర్జునా! బ్రహ్మలోకమువరకు గల లోకములన్నియు తిరిగి వచ్చెడి స్వభావము కలవి. (పునర్జన్మము కలవి). నన్నుపొందిన వారికి మరలజన్మయేలేదు. బ్రహ్రదేవునాకు పగలు వేయి యుగము రాత్రి వే%ియ యుగముల పరిమితికలది (432*2=864 కోట్లసం||). ఏపరమాత్మ ఇంద్రియములకు అగోచరుడనియు, శారీరహితుడనియు, సర్వాత్తమప్రాప్యస్థానాముగా వేదవేత్తలు చెప్పుచున్నారో, దేనిని పొందిన మరల జన్మింపరో అదియేనాయొక్క శ్రేష్టమైన స్థానము, ఎవనియందు ఈ ప్రాణికోట్లు నివసించుచున్నవో. ఎవనిచే ఈ సమస్త జగత్తు వ్యాపింపబడి%ున్నదో, అట్టి పరమ పురుషుడగు పరమాత్మ అనన్య (అచంచల) మగు భక్తిచేతనే పొందబడగలడు.

అగ్ని, ప్రకాశము, పగలు, శుక్లేపక్షేము, ఉత్తరాయణము అనునది కలిగిన మార్గము గుండా పోవు బ్రహ్మవేత్తలు బ్రహ్మమునే పొందెదీరు. పోగ, రాత్రి, కృష్ణపక్షము, దీషిణాయనము గల మార్గమున పోవు. సకామకర్మయోగులు చంద్రసంబంధమైన ప్రకాశమున పోవు. సకామకర్మయోగలు చంద్రసంబందమైన ప్రకాశమును పొంది తిరిగి జన్మించుచున్నారు. ఈశుక్ల (జ్ఞాన) కృష్ణ (అజ్ఞాన) మార్గములు రెండును శాస్వతమైనవి. శుక్లమార్గమును జన్మరాహిత్యము. కృష్ణమార్గమున పునర్జన్మకలుగును. ఈ రెండు మార్గములను తెలిసిన యోగి ఎవడును. మోహము పోందడు కావున నీవు ఎల్లకాలమందు దైవయోగయుక్తుడవుకమ్ము.

ఈ అక్షర పరబ్రహ్మతత్వమును తెలిసినీయోగి వేదములందు యజ్ఞాములందు. దానము, తపస్సు నందు ఏపుణ్యపులముచెప్పు బడినీదో దానినీంతను మించిన పుణ్యపులమగు సర్వోత్తము పరబ్రహ్మపదమునాందును.

యోగమనగా జీవునీ భగవంతునితోచేర్చుమార్గము. అది నిష్కామకర్మైయనను, భక్తియైనను, ద్యానమైనను. జ్ఞానమైను సరి%య. దేనిననుసరించి నను, అతడు యోగియేయగును. వేదములు యజ్ఞతపోదానాదు లన్నిటికంటె బ్రహ్మజ్ఞానము, ఆత్మానుభవము శ్రేష్ఠము. సర్వోత్తమము. ప్రారంభస్థితిలో తపోదానాదుల నాశ్రియించినను వానితో తృప్తినోందక, ఇంకనుపైకి పోయి క్రమముగా చిత్తశుద్ధఇ ద్వారా ఆత్మజ్ఞానమును బ్రహ్మను భూతిని పొందవలెను.

9. రాజావిద్యారాజ గుహ్యయోగము

ఓఅర్జునా! అశుభరూపమగు సంసారఖంఢము నుండి విడినీడు రహస్యమైన అనుభవజ్ఞాన సహితమైన బ్రహ్మజ్ఞానమును అ ఆసూయ లేనివాడవగు. నీకుచేప్పు చున్నాను. ఈ బ్రహ్మజ్ఞానమువిద్యలలో కేల్ల శ్రేష్ఠమైనది - రహస్యములలోకెల్ల అతిరాహస్యమైనది. సర్వోత్తృష్టమైనాది. పవిత్రమైనది. ప్రత్యక్షముగా తెలియదగినది, ధర్మయుక్తయైనది. అనుష్టించుటకు మిక్కిలి సులభ##మైనది. నాశారహితమైనది. అయియున్నది. ధర్మమునందు శ్రద్దలేని మనుజులు నన్ను పోందలేక మృత్త్యురూప సంసారమునందే మరలు చున్నారు.

ఈ సమస్త ప్రపంచము అవ్యక్త రూపడనగు నాచేష్యాపింపబడియున్నది. సమస్ర ప్రాణికోట్లు నాయందున్నది. నేనువానియందుండుటలేదు. అనగా నాకవి ఆధారముకావు. ప్రాణికోట్లునాయందుండునవి కావు (ఇద అద్వైత భావము వ్యక్తమగును). నా ఆత్మస్వరూపము ప్రాణికోట్లెను ఉత్పన్నమొనర్చి. భరించునదియైనను, ఆప్రాణులయందుండుటలేదు, ఆకాశమునందు వాయువెట్లు సంచరించుచుగోప్పదిగా నుండునో అట్లే సమస్తప్రాణికోట్లు నా యందున్నవి. సమస్తప్రాణికోట్లు ప్రశయకాలమున నా ప్రకృతి (మాయ)ని చేరి అందు అణిగి%ుండును. తిరిగి సృష్టికాలమున వానిని నేను సృజించుచుందును. ప్రకృతికి ఆదీనీమైయిండుట వలన అస్వతంత్రమైన సమస్త ప్రాణిసముదాయమును. నేను స్వకకీయు ప్రకృతి నవలంభించి మరల సృష్టించుచున్నాను. ఆస్పష్టాది కర్మల యందు తగుల్కోనక సాక్షేభూతుడనైయుండుటచే ఆ కర్మలేని%ు నన్ను బంధింపవు. సాక్షేభూతుడనైనన నాచేత ఈ ప్రకృతి చరా చర ప్రపంచమునాంతను సృజించున్నది.

నాయొక్క పరమతత్వమును ఎరుగని అదివేకులు సర్వభూత మహేశ్వరుడను, లోకసంరక్షనార్ధము మనుషఅయదేహమును ఆశ్రయించిన నన్ను ఆలక్ష్యము చేయుచున్నారు. అట్టి వారు ద్యర్ధములైనా ఆశీలుగల వారై వ్యర్ధచేష్టలు. ద్యర్ధ జ్ఞానము కలిగి బుద్ధి హీనులగుచు రాక్షస సంబంధమైన అసుర స్వభావమునా శ్రీ%ించుచున్నారు. మహత్ములైన వారు దైవప్రకడతినాశ్రయించి నన్ను సమస్తప్రాణులకు ఆది కారణునిగా, నాశీరహితునిగానెరిగి వేరువాని యందు మనస్సు నుంచక నీన్నే సేవించుచున్నారు. వారు ఎల్లపుడు నన్నుకీర్తించుచు, దృడద్రీతనిష్టులై ప్రయత్నించుచు, భక్తితి నామస్కరించుచు, సదానాందు చిత్రమునుంచి నన్ను సేవించుచున్నారు. కోందరు జ్ఞానయజ్ఞముచే అద్వైత భఆవముతోను, మరికొందరు వివిధ దేవతారూపములందలి బ్రహ్మగా ద్వైత భావము తోను ఇట్లునేకవిధములను పాసించుచున్నారు.

క్రతువు. యజ్ఞము, పితృదేవతల కిచ్చు

అన్నము, జైషధము, మంత్రము, హవిస్సు, అగ్ని, హామకర్మము అన్నియునేనే, ఈజగత్తునకు నేను తండ్రిని, తల్లిని, సంరక్షకుడను, తాతను, తెలిసికోనదాగిన వస్తును, పావన పదార్థమును, ఓంకారమును, ఋశీయజు స్సామదేనములుని యున్నాను. పరమ లక్ష్మము, భరించువాడు, ప్రభువు, సాక్షప్రాణులు, నివాసము, శరణమొందదగినవాడు హితమొనర్చువాడు, సృష్టిస్థితిలయకర్త. నిషేపము, నాశరహితమైన బీజమునేనే అయియున్నాను, నేను సూర్యకిరణములచే తపింపజేయుచున్నాను, వర్షముకురిపించుచున్నాను, నిలుపుచున్నాను, మరణరాహిత్యము (మోక్షము). మరణమునేనే. సద సద్వస్తువునేనే.

మూడువేదములనద్యయనాముచేసి, కర్మకాండను సకామ భాదముతేనాచరించు. వారు, సోమపానము గావించినవారు, పాప కల్మషముతొలగిన మనజులు. యజ్ఞముల చేనన్నుపూజించి, స్వర్గాది సుఖములననుభవించి, పుణ్యము క్షయింపగనే తిరిగి మనుష్యలోకమున జన్మించుచున్నారు. వేదోక్తకర్మలనాచరించు భోగాభిలాషులు, జన్మమరణరూప రాకపోకలు పొందుచున్నారు.

ఎవరు ఇతర భావములులేని వార్లె నన్నుగూర్చి చింతించుచు, ఎడతెగకద్యానించుచున్నారో, ఎల్లపుడు నాయందేనిష్టగల వారి యొక్కయోగక్షేమములు నేనే దహించుచున్నాను. ఇతరదేవతల భక్తి శ్రద్ధలనారాధించువారు నన్ను క్రమముతప్పి ఆరాధించిన వారగుదురు. అట్టివారు సమస్తయజ్ఞములకు భోక్తను ప్రభనువును అయిన నన్ను యదార్థముగా తెలిసికొనవజాలక పునర్జన్మపొందుచున్నారు. దేవతలనారాధించువారు దేవతలను. పితరులు నారాధించువారు (పితరులను) పితృదేవతలను, భూతములనారాధించువారు భూతములను, నన్ను ఆరాధించువారు నన్ను పొందెదరు. ఎవడు నాకు భక్తితో పత్రము, పుష్పము, ఫలము, జలము పరిశుద్ధముమనస్సుతో భక్తి పూర్వకముగా నొసంగునోవానిని నేనుప్రీతితోస్వీకరించుచున్నాను.

హే అర్జునా! నేవు ఏదిచేసినను, తీసినను, హోమమొనర్చినను, తపస్సు, దానము, అన్నియు నాకర్పింపుము. ఇట్లు కర్మసమర్పణ యోగముతో కూడి పాపుణ్యఫలకర్మబంధమునుండి విముక్తుడై నన్నే పొందును, నేను సమస్తప్రాన/లయందు సమముగానుండు వాడను. నాకొకడు ద్వేషింప దగినవాడు గాని, మరియొకడు ఇష్టుడు గానిలేడు, ఎవరు నన్ను భక్తితో సేవింతురో వారు నాయందును, నేను వారియందును ఉందుము. ముక్తి విదురాచారుడైనను అనన్య భక్తితో నన్ను భజించునేని అతడు స్ధిరమైన మనోనిశ్చయము కలవాడగుటచే సత్పురుషుడనియే తలపదగినవాడు. అట్టివారు శీఘ్రముగా ధర్మబుద్ధికలిగి శాశ్వత శాంతిని పొందుచున్నారు. నా భక్తుడు ఎన్నటికి చెడిపోడు. నీచ జన్మలు గల స్త్రీలు, వైశ్యులు, శూద్రుడు, నన్నాశ్రయించి సర్వోత్తమపదవినిన నిశ్చయముగాపొందు చున్నారు. ఇక బ్రహ్మాణులు, భక్తులగు రాజర్షులవిషయము వేరే చెప్పవలెనా? భగవదాశ్రయముచేవారు తప్పకముక్తిపొందెదరు. కావున అశాశ్వతము. సుఖరహితమైన ఈ లోకమునుపొందిననీవు నన్ను భజింపుము. నాయందుమనస్సుకలిగి, బక్తుడవై, నన్నే పూజించినమస్కరింపుము. ఈ ప్రకారము చిత్రము నాయందు నిలపి నన్నే పరమగతిగా నెంచి తుదకు నన్నే పొందగలవు.

10. విభూతి యోగము

ఈ అధ్యాయమున భగవదైశ్వర్య, మహిమాతిశయ, చిద్విలాస పూర్ణముగా ప్రపంచమందు అభివ్యక్తమగు భగవానుని విభూతులు వర్ణింపబడెను.

హే అర్జునా! నామాటలు విని సంతసించుచున్ననీకు హితము కలుగజేయు నుద్దేశ్యముతో శ్రేష్ఠమగు వాక్యములు చెప్పబోవుచున్నాను. నాయొక్క ఉత్పత్తి, అవతార రహస్యము, ప్రభావము. దేవతలుగాని మహర్షులు గాని ఎరుగరు. ఏలనన నేను సర్వప్రపంచమునకు కారణభూతుడను. ఎవడు నన్ను పుట్టుకలేని వాడుగ, అనాదిరూపునిగా సమస్తలోకనియామకుడిగా తెలిసికొనుచుస్తాడో అతడుమనష్యులలో అజ్ఞఃఆనములేనివాడై సర్వపాపములనుండి లెస్సగా విడువబడుచున్నది.

బుద్ధి, జ్ఞానము, మోహరాహిత్యము, ఓర్పు, సత్యము, ఇంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము, నాశము, భయము, భయములేకుండుట అహింస సమత్వము, సంతుష్టి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు ప్రాణులయొక్క నానావిధగుణములు నావలననే కలుగుచునన్నవి. సప్తమహర్షులు(7)న, సనకాదిమునులు, మనువులు నా సంకల్పము చేతనే పుట్టిరి. నా యొక్క విభూతియోగమును ఎవరు యదార్థముగా తెలుసుకొనుచున్నారో అతడు యోగముతోకూడి యున్నాడు. నేను సమస్త జగత్తుకు ఉత్పత్తికారణమైన వాడను. నా వలననే ఈ సమస్తము నడచుచున్నది. ఇట్లు తెలుసుకొన్న వివేకవంతులు, పరిపూర్ణభక్తి భావముకలిగి నన్నే భజించుచున్నారు. నా యందుమనస్సుకలవారు, నాయందే ప్రానములునర్పించినవారు. నన్ను గూర్చి పరస్పరము బోధించు కొనుచు, ముచ్చటించుకొనుచు, ఎల్లపుడు సంతృప్తి ఆనందమును పొందుచున్నారు. ఎల్లపుడు నాయందుమనస్సుకలిగి, ప్రీతి తోనన్ను భజించు నట్టివారు దేనిచే నన్ను పొందగలరో అట్టి ఆత్మానాత్మవివేచనా శక్తి (జ్ఞానయోగమును) ప్రసాదించుచున్నాను. అట్టి భక్తులకు దయ జూపుటకు నేనే వారి అంతఃకరణ మందునిలచి, ప్రకాశవంతమగు జ్ఞానదీపముచే అజ్ఞానజన్య అంధకారమును నశింప జేయుచున్నాను.

హేకృష్ణా! నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పావనుడవు. నిత్యప్రకాశస్వరూప పరమపదిషుడవు. ఆదిదేవుడవు, జన్మరశితుడవు. సర్వవ్యాపకుడవని దేవర్షియగు నారదుడు, అసితుడు, దేవలుడు, వేదవ్యాసమహర్షిచెప్పుచున్నారు. నీవు నాకు చెప్పినదంతయు సత్యమనియే తలంతును.నీనిజ స్వరూపమును దేవాసురులు ఎరుగజాలరు. సర్వప్రాణులను సృష్టించువాడవు, సర్వసాయామకుడవు, దేవదేవుడవు. జగప్రాధుడవునగునిన్ను నీవే ఎరుగుదువు. నీవీలోకమున వ్యాపించిన నీదివ్యవిభూతులను నీవే చెప్పతగుదువు. నేను ఎల్లప్పుడు ఏప్రకారముగా ఏవస్తువుల యందు నిన్ను ధ్యానించవలెను.

హే అర్జునా! నామ భూతులు అనంతము, అయినను అందుకొన్ని ముఖ్యమైనవాటిన తెలిపెదను. సమస్త ఆత్మలయందు ప్రత్యగాత్మ ప్రాణుల ఆది మధ్యాంతమునేనే. అదిత్యులలో విష్ణువు, ప్రకాశింప జేయువారిలో సూర్యుడు, మరుత్తలలోమరీచిని, నక్షత్రములలో చంద్రుడను, వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియ ములలో మనస్సు, ప్రాణులలో దైతన్యము, రుద్రులలోశంకరుడు, యక్ష రాక్షసులలో కుబేరుడు, వసువులలో అగ్ని, పర్వతములలో మేరువనేనే, పురోహితులలో శ్రేష్ఠుడగు బృహస్పతి, సేనానాయకులలోకుమారస్వామి, సరస్సులలో సముద్రము, మహర్షులలో భృగుమహర్షి, వాక్కులలో ఓంకారము. యజ్ఞములలో జపయజ్ఞము, స్థిరపదార్థములలో హిమపర్వతము, చెట్లలలో రావిచెట్టు(అశ్వద్ధము) దేవర్షులలో నారదుడు, గంధర్వులలో చిత్రరధుడు, సిద్ధులలో కపిలముని, గుర్రములలో ఉబ్బైశ్రావము, ఏనుగులలో ఐరావతము, మనుష్యులలో రాజును, ఆయుధములలో వజ్రాయుధము, పాడియావులలోకామధేనువు, ప్రజోత్పత్తిక కారణబూతుడగు మన్మధుడు, సర్పములలో వాసుకి, నాగులలో అనంతుడు, జలదేవతలలో వరుణుడు, పితృ దేవతలలో అర్యముడు, నియమించి శిక్షించువారిలో యముడును, లసురులలో ప్రహ్లాదుడును, లెక్కపెట్టువారిలో కాలము, మృగములలో మృగరాజు సింహము, పక్షులలో గరుత్మంతుడు, వేగవంతులలో వాయువు, ఆయుధధారులలో శ్రీరాముడు, చేపలలో మొసలి, నదులలో గంగానది నేనే అయియున్నాను. సృష్టియొక్క ఆది మద్యాంతములు, విద్యలలో ఆద్యత్మవిద్య వాదించువారిలో రాగద్వేషరహిత తత్మనిశ్చయవాదము. అక్షరములలో ఆకారము, సమాసములలో ద్వద్వసమాసము, నాశములేనికాలమునకు పరమాత్మ, సర్వత్రముఖములు గల విరాటస్వరూప బ్రహ్మ దేవుడు, సమస్తము హరించుమృత్యువు, సమస్తములయొక్క పుట్టుక, స్త్రీలలో గలకీర్తి, సంపద, వాక్కు, స్మృతిజ్ఞానము, ధారణాశక్తి, బుద్ధిధైర్యము, ఓర్పు అను ఈ ఏడు గుణములు నేనే అయియున్నాను. సామవేదగానములో బృమత్‌సామము, ఛందస్సులలో గాయత్రి, మాసములలో మార్గశీర్షము, ఋతువులలో వసంత ఋతువు, వంచకవ్యాపారములో జూదము, తేజోవంతుల తేజస్సు, జయించువారి జయము, ప్రయత్నశీలుర యత్నము, సాత్వికుల సత్యగుణము, నేనే అయియున్నాను. దృష్టివంశయులలో వసుదేవపుత్రుడు వాసుదేవుడు(శ్రీకృష్ణుడు), పాండవులలో అర్జునుడు, మునులలో వేదవ్యాసమునీంద్రుడు, కవులలో శుక్రాచార్యుడు, దండించువారియొక్క దండనము, యింపనిచ్ఛగలవారి జయోపాయము, రహస్యములలో మౌనము, జ్ఞానవంతులలో జ్ఞానము, ఇట్లు సమస్తప్రాణికోట్లకు ఏది మూలకారణమైయున్నదో అది అంతయునేనే. స్థాపరజంగమాత్మక వస్తువేది నాకంటె వేరుగాలేదు.

హే అర్జునా! నాయొక్కదివ్యవిభూతములకు అంతములేదు. అందుకొన్నిటిని సంషేపముగాచెప్పితిని. ఈ ప్రపంచమున ఐశ్వర్యముయుక్తమైనది. కాంతివంతమైనది. ఆత్సాహముతోకూడినదినగు వస్తువు. ప్రాణికి ఏదికలదో అది నా తేజస్సుయొక్క అంశమువలన కలిగిన దానిగా నీవెరుగుము. ఈ విభూతి జ్ఞానము చే నీకేమి ప్రయోజనము? నేనే జగత్తంతను ఒక అంశ##చేతనే వ్యాపించియున్నాను. అనంతనేటి బ్రహ్మాండములన్నియు పరమాత్మేకాంశమాత్రము.

11. విశ్వరూప సందర్శనయోగము.

హే కృష్ణా! నన్ననుగ్రహించుటకై సర్వోత్తమము, రహస్యమైన ఆధ్యాత్మభోదచే నా అజ్ఞానము తొలిగినది. నీ వలన ప్రాణుల ఉత్పత్తి నాశనము, నీయొక్క మహత్యము, సవిస్తరముగా దింపిన. నీవుచెప్పిన గంతయు. యదార్థమనినేనువిశ్వసించుచున్నాను. ఓపురుషోత్తమా! నీయొక్క విశ్వరూపమును నేను చూడదలచుచున్నాను. నీస్వరూపమును జూచుటకు నాకు సాధ్యమగునేని నాశరహితనీవిశ్వరూపమును జూపుము.

హే అర్జునా! అనేక విధములుగా నున్నవియు, అలౌకికములైనవి, వివిధ వర్ణములు, ఆకారములుగల, అసంఖ్యాకముగావర్తిల్లు నారూపముతో గాంచుము. ఈ సమస్త చరాచర ప్రపంచము నా శరీరమందు ఒకచోట నున్నవానిగా నీవు చూడుము. చర్మ చక్షువులచే నావిశ్వరూపమును చూడజాలవు, కావున నీకు దివ్యదృష్టిని ప్రసాధించుచున్నాను. దానిచే నా ఈశ్వరసంబంధమైన యోగమహిమనుజూడుము.

వ్యాసమహర్షి కృపచేదివ్యదృష్టిని పొందిన సంజయుడు, విశ్వరూపమును గూర్చి ధృతరాష్ట్రునకు ఇట్లు చెప్పెను. పెక్కుముఖముల, నేత్రములు, అనేక (దివ్యాయుధములు, దివ్యపుష్పమాలికలు, వస్త్రములు ధరించి) అద్భుత విషయములజూపు దివ్వయములైన పెక్కు ఆభరణములతో గూడి, అనేక దివ్యాయుధములు, దివ్యపుష్పమాలికలు, మస్త్రములు ధరించి, దివ్యమణి గంధపుపూతతోకూడిన లనేక ఆశ్చర్యములతో కూడి ప్రకాశమానమైన అంతములేని, ఎల్లెడల తనముఖములుగల విశ్వరూపమును భగవానుడు అర్జునునకు చూపెను. అపుడర్జునుడు నానవిధములుగావిభజింప బడిన సమస్తజగత్తును దేవదేవుడగు శ్రీకృష్ణుని శరీరమున ఒక్కచోట నున్న దానిగా చూచెను. అటు పిమ్మట అర్జునుడు ఆశ్చర్యములోకూడిన వాడై గగుర్పాటుతో విశ్వరూపమును ధరించిన భగవానునకు శిరస్సున చేతులు జోడించి నమస్కరించుచు ఇట్లు పలికెను.

హేదేవా! నీశరీరమందు సమస్తదేవతలు చారచరప్రాణికోట్ల సముహులు, సృష్టికర్తయగు బ్రహ్మ, సమస్తఋషులు, దివ్యసర్మములు చూచుచున్నాను. నిన్ను సర్వత్ర అనుకహస్తములు, ఉదరములు, ముఖమలు, నేత్రములు గల అనంతరూపునిగాచూచుచున్నాను. నీయొక్కమొదలు, మధ్య, తుదను కాంచజాలకున్నాను. నీవు ఎల్లెడల, కిరీటములు, గద, చక్రము ధరించి, కాంతిపుంజముగ, అంతట ప్రకాశించు వానిగ, జ్వలించు అగ్ని సూర్యకాంతులతో పరిమితిలేనివానిగచూచుచున్నను. నీవు సర్వోత్తమ అక్షర పరబ్రహ్మవు, జగత్తంతటికి ఆధార భూతుడవు, నాశరహితుడవు, శాశ్వతధర్మములు కలవాడవు. పురాణ పురుషుడవు, ఆది మధ్యాంతరహిత అపరిమితసామర్ధ్యముగల అనేక హస్తములు కలిగి, సూర్యచంద్రులే నేత్రములుగ, ప్రజ్వలించు అగ్నిహోత్రుని వంటి ముఖము కలిగి, స్వీకయతేజస్సుచే ఈ ప్రపంచమునంతను తపింప జేయుచు న్నావు. భూమ్యాకాశములమధ్యప్రదేశము, దిక్కుల నీచే వ్యాపింపబడుటచే. నీయొక్క భయంకరము, ఆశ్చర్యకరమగునీయీరూపమును జూచిముల్లోకములు మిక్కిలి భీతినొందినవి. దేవతాసమూము నీ యందే ప్రవేశించుచున్నది. దేవతలు మహర్షులు, సిద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. రుద్రులు, సూర్యుల, వసువులు, సాధ్యులు, విశ్వేదేవతలు, అశ్వినీదేవతలు, యక్ష, గంధర్వ, అసుర, సిద్ధ, సంఘములు ఆశ్చర్యచకివతులైనిన్ను చూచుచున్నారు.

ఓకృష్ణా! అనేకముఖములు, నేత్రములు, హస్తములు, తొడలు, పాదములు కలిగి,కోరలచే భయంకరమైన నీ గొప్పరూపమును జూచి జనుందరు భయపడుచున్నారు. ఆకాశమును తాకుచు, ప్రకాశించుచు, తెరువబడిననోరు, జ్వలించువిశాలనేత్రములు, గలనిన్ను జూచి మిగుల భీతిల్లి శాంతిని పొందలేకున్నాను. కోరలచేభయంకరములైన, ప్రళయాగ్నిచోట, నీముఖములనుజూచి, దిగ్బ్రమచెంది సుకమునుపొందకున్నాను. కావున హేదేవదేవా! ప్రసన్నుడవగుము. ధృతరాష్ట్రుని పుత్రులు, భీష్మ, ద్రోఱ, కర్ణాదులు, సమస్తరాజసమూహములు, మనసేనయందలి ప్రముఖులు, నదీ ప్రవాహము, సముద్రమును చేరువిధముగా నీనోటబడు చున్నారు. జ్వలించుచున్న నీ నోళ్లచే వారినందరిని మ్రింగుచు. ఆస్వాదించుచున్నావు. దిండుతలు వేగముగాజ్వలించుచున్న అగ్నిలోప్రవేశించు రీతిని వీరందరు నీ నోటబడుచున్నారు. భయంకరములగు కాంతులు, తేజస్సుతో జగత్తంతయు వ్యాపించి తపింపజేయుచున్న నీవెవరవో నాకు చెప్పుము. నీప్రవృత్‌ఇని ఎరుగకున్నాను. ఆదిపురుషుడవగునిన్ను గూర్చితెలిసికొన గోరుచున్నాను. నీకు నమస్కారము. నన్ననుగ్రహింపుము.

హే అర్జునా! లోకసంహారకుడనై విజృంభించిన కాలుడనునేను ప్రాణుల సంహరించునిమిత్తము ఈ ప్రపంచమున ప్రవర్తించుచున్నాను. ప్రతిపక్షవీరులు, నీవుయత్నము చేయకున్నను జీవించియుండరు. వీరందరు నాచేఇదివరకే చంపబడిరి. నీవు కేవలము నిమ్తమాత్రుడవు, కావున శతృవులను జయించి నీకీర్తిని పొంది, నిష్కంటకరా%్‌యము ననుభవింపుము. నాచేచంపబడిన భీష్మ, ద్రోణ, కర్ణాదియుద్ధవీరులను నీవుచంపుము, భయపడకుము, యుద్ధము చేసి శతృవులను గెలువుము. ఇదివిని వణుకుచున్న చేతుల జోడించుకొనిన ఈర్జునుడు శ్రీకృష్ణునకు నమస్కరించి, మిక్కిలి భయముతో వినమ్రుడై గద్గదస్వరముతో ఇట్లు పలికెను.

హే కృష్ణా! నీయొక్క నామము నుచ్చిరంచి, మహత్యమును కొనియాడి, లోకముమిగుల సంతోషించుచున్నది. రాక్షసులు భయపడి దిశంతములకు పరుగిడుచున్నారు. సిద్ధులు నమస్కరించుచున్నారు. సతీఅసలీపరమైన అక్షర బ్రహ్మవునీవే అయియున్నావు. బ్రహ్మదేవునకు కూడ ఆదికారణుడవు. సర్వోత్తృష్టుడవగునీకేల నమస్కరించకుందురు. నీవు ఆదిదేవుడవు. సనాతనపురుషుడవు, ప్రపంచమునకు ఆధారభూతుడవు. సమస్తముతెలిసిన వాడవు. తెలియదగినవాడవు. సర్వోత్తమ స్థానము, ప్రపంచమంతట వ్యాపించి యున్న అనంతరూపుడవు. వాయువు, యముడు, అగ్ని, వరుణడు, చంద్రుడు, బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునకు తండ్రియు నీవేఅయియున్నావు. నీవు సమస్తమున వ్యాపించిన సర్వస్వరూపుడవు. నీకు అన్నివైపులనమస్కారమగుగాక!

హే కృష్ణా! నీ యొక్క మహిమతెలియని పొరపాటున, చనువువలన, సఖుడవని తలచి, ఓ కృష్ణా! యాదవా! సఖా! అని పలికితిని. విహారము సలుపునపుడు, భుజించునపుడు, పరుండునపుడు, ఒక్కడుగా ఉన్నపుడుగాని, ఇతరుల ఎదుట గాని పరిహాసము కొరకు ఏ అవమానము గావించితివో ఆ అపరాధములన్నిటినిన ఆప్రమేయుడివగు నీవు క్షమింపవేడుచున్నాను. నీవు చరాచర జగత్తుకు తండ్రివి, పూజ్యుడు, గురుడునైవెలయుచున్నావు.

ఈ ముల్లోకములందు, నీ తోసమానుడుగాని, నిన్నుమించిన వాడుగాని ఎట్లుండగలడు? కావుననేను సాష్టాంగపడి, ఈశ్వరుడవు. స్తుతింపతగినవాడవగు, నిన్ను అనుగ్రహింపవేడుచున్నాను. దేవా! కుమారుని తండ్రివలె, స్నేహితునివలె, ప్రియురాలిని ప్రియుడువలె నా అపరాధములక్షమింపుము. ఇదివరకెన్నడు చూడనట్టి ఈ విశ్వరూపమును జూచి ఆనందముసొందితిని, కానిభయముచే నామనస్సు మిక్కిలి వ్యధనొందుచున్నది కాన మునుపటివలె సౌమ్యరూపమున కిరీటము, గద, చక్రముధరించిన చతుర్భుజునిగా నాకు దర్శనమిమ్ము.

హే అర్జునా! ప్రకాశముచే పరిపూర్ణమైన జగద్రూపము, అంతములేని మొదటిదినగు నిది నీవు తప్ప ఇదివరకెన్నడు ఎవరు చూడని సర్వోత్తమ విశ్వరూపము ప్రసన్నుడనగు నాచే స్వీకయ యోగ శక్తివలన నీకు చూపబడినది. ఈ విశ్వరూపమును నీవు తప్ప ఈ మనుష్యలోకమున మరి ఎవరు చూచియుండలేదు. వేదాధ్యాయన, యజ్ఞ, దాన , తపాదిక్రియలచే నన్ను చూచుట శక్యముకాదు. నావిశ్వరూపమును చూచినీవు భయపడక, చిత్రవికలత్వము పొందక, నిర్భయుడవై, ప్రసన్నచిత్తుడవై బాగుగాచూడుము ఇట్లు శ్రీకృష్ణ పరమాత్మ తన పూర్వసౌమ్యరూపమును అర్జునకు చూపెను. అది చూచి అర్జునుడు స్వస్ధతను పొందెను.

అర్జునా! నాయొక్క ఏరూపమును నీ విపుడు చూచితివో అది మహాదుర్లభ##మైనది. భయమైనది. దేవతలుకూడ నిత్యము దానిని దర్శింపగోరుచుందురు. ఈ రూపము వేదాధ్యయన, తపోదానయజ్ఞాదుల చే చూడశక్యముకాదు.

నా ఈ రూపమును అనన్యభక్తిచే మాత్రమే యదార్ధముగా తెలసుకొనుట, చూచుట, ప్రవేశించుటకు, సాధ్యమైన వాడవగు చున్నాను. కావున ఎవడు నాకొరకై దైవకార్యములుచేయుచు నన్నే పరమప్రాప్యము గానమ్మి, నాయందే భక్తికలిగి, సంగవిముక్తుడై, సమస్తప్రాణులయందు ద్వేషములేక యుండునో అట్టివాడే నన్ను పొందుచున్నాడు.

12. భక్తియోగము.

ఎల్లపుడు. నీయందేమనస్సు నెలకొల్పి నిన్నుపాసించుభక్తులు ఇంద్రియ గోచరముకాని పరబ్రహ్మను ధ్యానించువారు, నీరిరువురలో యోగమును బాగుగానెరిగిన వారెవరను అర్జునిని సందేహనివృత్తి చేయుచు

హే అర్జునా! నాయందుమనస్సునిలపి, నిరంతరముదైవచింతనా పరులై మిక్కిలి శ్రద్ధతో ఎవరునన్నుపాసించుచున్నారో వారేఉత్తమయోగులు ఎవరు ఇంద్రియముల బాగుగానిగ్రహించి, సమభావముకలవారై సమస్తప్రాణుల హితము నందు ఆసక్తికలిగి, నిర్దేశింపశక్యము కాని, చింతిపనలవికాని, ఇంద్రియముకగోచరమైన, నిర్వికారమైన, చలింపని, నిత్య, సర్వవ్యాప్త అక్షరపరబ్రహ్మను ధ్యానించువారు నన్ను పొందెదరు. నిర్గుణ పరబ్రహ్మపాసన సగుణోపాసనకంటె కష్టమైనది. నిర్గుణోపాసన దేహాభిమానముకలవారిచే అతికష్టముగా పొందబడును. కావునసమస్తకర్మలను. నాయందు సమర్పించి. (నాయందు చిత్తము జేర్చినట్టివారిని) నన్నే పరమగతిగదలంచి అనన్య చిత్తములో నన్నే ధ్యానించుచు ఉపాసించుచున్నారో, నాయందు చిత్రముజేర్చినట్టివారిని సంసారసముద్రనుండి ఉద్దరించుచున్నాను. నాయందేమనస్సుఏస్థిరముగా నిలుపుము. బుద్ధినిప్రవేశ##పెట్టుము, పిమ్మట నాయందే నివసింతువు. ఒకవేళ నాయందు మనస్సు స్థిరముగా నిలుపుటకు శక్తిలేనిచో అభ్యాసముచేసాధింపుము. అభ్యాసముచేయుటకు అసమర్ధుడవేని నా సంబధమగు కర్మలు చేయుల యందాసక్తి కలవాడవుకమ్ము, అదియును సాధ్యముకానిచో సమస్తకర్మఫలమును ఈశ్వరార్పణచేయుము.

అభ్యాసముకంటె జ్ఞానము, జ్ఞానముకంటెధ్యానము, ధ్యానముకంటె కర్మఫలత్యాగము శ్రేష్ఠమైనవి. అట్టి కర్మఫల త్యాగముచే శీఘ్రముగా చిత్తశాంతిలభించును. సమస్త ప్రాణులయందు ద్వేషములేని వాడు, మైత్రి, కరుణకలవాడు, అహంకారమమకారములేనివాడు, సుఖదుఃఖముల సమభావముకలవాడు. ఓర్పుకలవాడు, సంతృప్తి తో యుండువాడు, యోగయుక్తుడు, మనస్సును స్వాధీనపరచుకొని దృఢనిశ్చయముకలిగి నాయందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలిగి,నాయందు భక్తికలవాడు నాకు ఇష్టుడు, ఎవనివలన జనులు భయముపొందరో, లోకమువలన ఎవడు భయముపొందడో, సంతోషము, క్రోధము, భయము, మనోవ్యాకులతలేనివాడు, నాకు ఇష్టుడు, కోరికలు లేనివాడు, బాహ్యభ్యంతరశుద్ధికలవాడు, కార్య సమర్ధుడు, తటస్ధుడు, దిగులులేనివాడు, సమస్తకార్యములకర్తృత్వము వదలి నాయందు భక్తికలవాడు నాకు ఇష్టుడు, సంతోషము, ద్వేషము శోకము, శుభాశుభముల వదలినవాడు నాకు ఇష్టుడు. శతృ-మిత్రులు మానావమానములు, సుఖదుఃఖములయందు సమముగానుండువాడు సంగములేనివాడు, నిందాస్తుతులసమముగానెంచువాడు, మౌనముతో నుండువాడు. దొరకినదానితో తృప్తినొందువాడు, గృహాదులయందాసకత్‌ఇ లేనివాడు. నిశ్చయబుద్ధికలిగి భక్తితోకూడి యుండువాడు నాకు ఇష్టుడు.

ఎవరైతే నన్నే పరమగతిగానమ్మి. అమృతరూపమగు ఈ ధర్మమును చెప్పబడిన విధముగా అనుష్టించు భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.

13 క్షేత్ర క్షేత్రజ్ఞవిభాగయోగము

హేకృష్ణా! ప్రకృతిని, పురుషుని, క్షేత్రమును, క్షేత్రజ్ఞుని, జ్ఞానమును, జ్ఞేయమును, గూర్చితెలిసికొనగోరు చున్నాను.

హే అర్జునా! ఈశరీరమేక్షేత్రము దానినితెలుసుకొనవాడు క్షేత్రజ్ఞుడు. సమస్యక్షేత్రములందు (శరీరములందు) నన్నేక్షత్రజ్ఞుని వాస్యవమగు జ్ఞానము క్షేత్రమేది, ఎటువంటిదో, ఎట్టివికారము కలదో, దేనినుండి ఈరీతిగా ఉత్పనినమైనదో, క్షేత్రజ్ఞుడు ఎవరో, ఎట్టి ప్రభావముకలవాడో సంక్షేపముగావినుము. ఈజ్ఞానము ఋషులచే అనేక ప్రకారములుగా. నానావిధములైన వేదములద్వారా వేరువేరు గా ప్రతిపాదింపబడినను, బేతుయుక్తము. బాగుగా నిశ్చయింపబడిన బ్రహ్మసూత్రవాక్యములచే ఇది చెప్పబడినది.

పంచమహాభూతమలు, అహంకారము, బుద్ధి, మూలప్రకృతి, దశజ్ఞానేంద్రియకర్మేంద్రియములు, మనస్సు, ఐదు ఇంద్రియపాషయములు, కోరిక, ద్వేషము, సుఖము, దేహేంద్రియాదుల సమూహము, తెలివి, ధైర్యము,అనువీని సముదాయమైవికాగ. సహితమైనది క్షేత్రముగాచెప్పబడెను.

ఇకజ్ఞానగుణములు 1. తన్నుతానుపొగడుకొనకుండుట, 2. డంబములేకుండుట, 3. పరప్రాణులహింసింపకుండుట 4, ఓర్పుకలిగి యుండుట, 5. ఋజుత్వముకలిగియుండుట, 6. గురుసేవచేయుట, 7. బాహ్యభ్యంతరశుచికలిగి యుండుట, 8. సన్మార్గమున స్థిరముగా నిలబపడుట, 9. మనస్సుబాగుగానిగ్రహించుకొనుట, 10. ఇంద్రియవిషయములవిరక్తి, 11. అహంకారములేకుండుట, 12. పుట్టుక, చావు, ముసలితనము, రోగము అనువానివలనకలుగు దుఖమును, దోషమును మాటిమాటికి స్మరించుట 13. సంతానము, భార్య, ఇల్లు, మొదలగు వానియందు ఆసక్తిలేకుండుట, 14. వానియందు తగులము (attachment) లేకుండుట, 15. ఇష్టానిష్టములసముబుద్ధి కలిగి యండుట, 16. భగవంతునియందు అనన్యభక్తి, 17. ఏకాంతప్రదేశము నాశ్రయించుట, 18. జనసముదాయముందుప్రీతిలేకుండుట, 19. నిరంతర అద్యాత్మజ్ఞానము, 20. తత్వజ్ఞానప్రయోజడనముతెలియుట, వీనికి వ్యతిరేకమైనదంతయు అజ్ఞానమే

ఏది తెలియదగిన బ్రహ్మస్వరూపమో, దేనిని తెలిసిన మనుజుడు మోక్షము పొందునో, దానిని గూర్చిచెప్పుచున్నాను. అది సత్‌అనిగాని, అసత్‌ అనిగాని చెప్పబడదు. ఆబ్రహ్మము (ఆత్మ) అంతటను చేతులు, కాళ్లు, కన్నులు, తలలు, ముఖములు, చెవులుకలిగి ప్రపంచమునందు. సమస్తమునుఆవరించుకొని యున్నది. అజ్ఞేయ పరబ్రహ్మము 1.అంతట చేతులు, కాళ్లు, మఖములు, చెవులుకలది, 2.అంతరును ఆవరించి యున్నది, 3. సమస్యఇంద్రియగణములను ప్రకాశింపజేయును, 4. సమస్తఇద్రియములేనిది,5త. అంరునిధి,6. సమస్తము భరించునది,7. సత్వరజస్తమోగణరహితము. 8. గుణములననుభవించునది. 9. ప్రాణులవెలపల, లోపల నుండునది. 10. కదలనిది. 11. కదులునది. 12. అతిసూక్ష్మము. అజ్ఞానులకుతెలియబడనది. 13. దూరముగానుండినది. 14. దగ్గరగా నుండునది. 15. విభజింపబడనిటైనను ప్రాణులయందు. విభజింపబడినట్లుండునది. 16. ప్రాణులను సృష్టించి పోషించి లయింపజేయునది. 17. సూర్యాది ప్రకాశ పదార్థముల ప్రకాశింపజేయునది 18. తమస్సు (అజ్ఞానమబు) కంటె ఆతీతమైనది. 19. చిన్మయరూపము. 20. తెలయదగినది. 21. అడూనిత్యాది జ్ఞానగుణములచే పొందదగినది. 22. సమస్త ప్రాణుల హృదయమందు విశేషించి యుండునది. ఇట్లు షేత్రము. జ్ఞానము. జ్ఞేయము గూర్చి చెపపబడినదానిని ఎరిగిన భక్తుడు మోక్షమును పొందుటకర్హుడు.

హే అర్జునా! ప్రకృతిని, పురుషుని. ఆదిలేనివారిగా సెరుగుము. మనోబుద్ధింద్రియాదుల వికారములు, సత్యరజస్తమోగుణములును. ప్రకృతివలన కలిగినది. కార్యము (శరీరము) కారణము (ఇంద్రియ మనోబుధ్యహంకారములు. పంచభూతములు. శబ్దాదివిషయములు) కలుగజేయుట యాది ప్రకృతి హేతువు. సుఖదుఃఖాది గుణములు ననుభవించుచున్నాడు. ఈ గుణములకూడికయే జీవుని ఉత్తమ నీ జన్మలకు హేతువగు చున్నది.

పురుషుడు (ఆత్మ ఈశీరరముందున్నప్పటికి శరీరముకంటె వేరైనవతాడు. సాక్షేభూతుడు, అనుభవించువాడు, అనుమతించువాడు, భరించువాడు, గొప్పనియామకుడు పరమేశ్వరుడైయున్నాడు. ఎదడేప్రకారముగా పురుషుని (ఆత్మ గుణములలే కూడిన ప్రకృతిని తెలిసికొనుచున్నాడో, అతడే విధముగా నున్నప్పటికి మరల జన్మింపబడు

ఆత్మను (ప్రత్యగాత్మలేక పరమాత్మ) ను కొందరు శద్ధమగు మనస్సుచే ధ్యానయోగముద్వారాను, కొందరు సాంఖ్యాయోగముద్వారాను, మరికొందరు కర్మయోగము చేతను సాక్షాత్కరించుకొనుచున్నారు. మరికొందరు ఇతరులవలన పరమాత్మతత్వమును బాగుగావిని, చక్కగా అనుష్టించి తరింతురు. ఈ ప్రపంచమున స్థావరజంగమాత్మక పదార్థమంతయు క్షేత్ర క్షేత్రజ్ఞులకూడికవలననే కలుగు చున్నది. సమస్తప్రాణులందును వెలయుచున్నట్టి పరమాత్మను సమముగా వ్యాపించి యున్నట్లు యూచువాడు తన్నుతానుహింసించుకొనడు,సమస్తకర్మలు ప్కకృతిచేతనే చేయబడునట్లును. ఆత్మను ఆకర్తగా చూచువాడే నిజముగాచూచువాడు.

ఎవడు వేరు వేరుగా నున్న ఈ భూతప్రపంచమునంతను పరమాత్మ యందున్నదానిగను, దాని నుండియే విస్తరించుచున్నదిగాన చూచువాడు బ్రహ్మమును పొదును. అనాది గ్రిగుణాతీడుడైన పరమాత్మీశరీర మందున్నను ఏమియుచేయక,దేనిచేతను అంటబడకయున్నాడు సర్వత్ర వ్యాపించిన ఆకాశము సూక్ష్మమగుటవలన ఏ ప్రకారముగా అంటబడచో అట్లే శరీరమందంతటను వెలయుచున్న పరమాత్మశరీరగుణ దోసములచే అంటబడడు, సూర్యుడొక్కడే సమస్తలోకముల ప్రకాశింప జేయునట్లు క్షేత్రజ్ఞుడగు పరమాత్మ సమస్తక్షేత్రమును ప్రకాశింపజేయును ఎవరు జ్ఞాన దృష్టితో క్షేత్రజ్ఞుల భేదము, భూతసంబంధప్రకృతినుండి విముక్తికలుగుఉపాయము తెలసుకొనువారుపరమ పదము పొందెదరు.

14. గుణత్రయవిభాగయోగము

హేఅర్జునా! దేనిని తెలుసుఒనిమునులందరు ఈ సంసారబంధమునుండి మోక్షము నొదిరో అట్టి పరమాత్మ విషయకజ్ఞానమునాశ్రయించిజనులు నాలోనైక్యముపొందిన వారై సృష్టికాలమున జన్మింపరు. ప్రళయకాలమున నశింపరు జన్మమరణ పునరావృత్తి రహితమపరమపదము పొందెదరు.

నామూలప్రకృతి (మాయ), సర్వభూతోత్పత్తిస్థానము దానియందుగర్భకారణమైనచైతన్యరూపమగు బీజమునుంచు చున్నాను. దేవమనుష్యాది సమస్తప్రాణులకు ప్రకృతి తల్లి నేను తండ్రిని, ప్రకృతి వలన పుట్టిన సత్వరజస్తమోగుణములుమూడును నాశరహితుడైన ఆత్మ (జీవుని) దేహమునందు బంధఙంచినైచుచున్నాను. సత్వగుణము నిర్మలమైనదగుట వలన ప్రకాశముకలుగజేయునదియు ఉపద్రవములేనిది యగు ఇంద్రియ సుఖమునందానశక్తిచే వృత్తి జ్ఞానమునందలి ఆసక్తిచే జీవునిబంధించుచున్నది. రజోగుణము దృశ్యవిషయములయందు ప్రీతినికలుగజేయుచే తృష్ణ (కోరిక) ఆసక్తి కలుగజేసి కర్మమునందలి ఆసక్తిచే జీవునిబంధించుచున్నవి. తమోగునము అజ్ఞానము వలనకలుగును. ఇది సమస్తప్రాణులను మోహము (అవివేకము) కలుగజేసి, మరుపు, సోమరి తనము, నిద్రమొదలగువానిచే జీవునిలెస్సగాబంధించివేయును.

సత్వగుణము సుఖమునందును.రజోగుణము కర్మము నందును, తమోగుణము జ్ఞానమును కప్పివైచి ప్రమాదమునునందును జీవుని చేర్చుచున్నవి. సత్వగుణము బలముకలిగినప్పుడు రజోగమోగునములను అణగద్రొక్కును. అట్లే రజోగుణము సత్వతమోగుణములను. తమోగునము సత్వరజోగునములను అణగ ద్రొక్కును. ఎపుడేశరీరమందు శ్రోత్రాది ఇంద్రియము లన్నిటియందును బుద్ధిరూప (ప్రకాశ) జ్ఞానము కలుగనో అపుడు సత్వగుణము బాగుగా వృద్ధి నొందినదని తెలియవలెను. రజోగుణము వృద్ధిపొందినపుడు మనుజునియందులోభత్వము, కార్యములందు ప్రవృత్తి, కార్యనిషిద్ధకర్మలు ప్రారంభించుట, మన శ్శాంతి లేకుండునట, కలుగును. తమోగునము అభివృద్ధి నొందిన మనుజునియందు అవివేకము. సోమరితనము, అజాగ్రత్త, అజ్ఞానము, మూఢత్వము కలుగును.జీవుడు సత్వగుణము అధికముగా నుండమరణించిన ఉత్తమజ్ఞానవంతుల పరిశుద్ధలోకము, రజోగుణముకలవాడు, కర్మాసక్తులగువారి యందు. తమోగుణ్ము అధికముగా కలవారు పామరులు లేక పశుపక్ష్యాది హీన జాతులందు పుట్టెదరు. సత్వగుణసంబంధమైన కర్మకు నిర్మల సుఖము, రజోగుణకర్మకు దుఃఖము, తమోగుణకర్మకు అజ్ఞానము ఫలము. సత్వగుణమువలన అజాగ్రత్త, భ్రమ, అజ్ఞానముకలుగుచున్నది. సత్వగుణ సంపన్నులు, ఊర్ద్వలోకములు, రజోగుణులు మనుష్యలోకములు, తామసగుణులు అధోలోకము అగు పశుపక్ష్యాది జన్మల నొందుదురు.

ఎప్పుడు వివేకవంతుడు సత్వాదిగుణములకంటె నితరమునుకర్తగానెంచడో, మరియు తనను త్రిగుణములకంటె వేరుగా తెలుసుకొనునో అతడు మోక్షమును పొందును. జీవుడు దేహోత్పత్తికి కారణ భూతములగు ఈ మూడు గుణములను దాటివ, జన్మమరణ జనాది దుఃఖములచే ఏడువ బడిన వాడై మోక్షముపొందు.

హే కృష్ణా! ఈ మూడు గుణములు దాటిన వానిలక్షనములు,వాని ప్రవర్తన, వీనినే ప్రకారముదాచివేయగలునో తెలుపవేడుదును.

హేఅర్జునా! ఎవడు సత్వర జస్తమోగుణ సంబంధ సుఖ కార్యప్రవృత్తి, మోహాదుల ద్వేషింపడో, అది తొటగిపోయినచో ఆపేక్షింపడో, తటస్థుడై యుండి గునములచేచలింపడో, గుణముల ప్రవర్తనను మాత్రముతెలుసుకొని చలింపకనిశ్చలముగానుండునో సుఖదుఃఖముల సమభావముకలిగి ఆత్మ యందే స్థిరముగానుండి మట్టి, రాయి, బంగారమందు సమబుద్ధికలిగి, ఇష్టానిష్టముల సమభావము కలిగి, ధైర్యవంతుడై సంమస్త కారయములందు కర్తృత్వబుద్ధిని వదలి నిరంతరము బ్రహ్మనిష్టయందుండు వాడు గుణాతీతుడు అతడు అచంచలమైన భక్తి యోగముచే నన్నే సేవించుచు, త్రిగుణ ములను దాటి జీవిన్ముక్తుడగును. ఏలనన నేను నాశరహిత నిర్వికార, శాశ్వత ధర్మ స్వరూప, నిరతిశయ ఆనంద స్వరూప బ్రహ్మను అయియున్నాను.

15. పురుషోత్తమ ప్రాప్తియోగము.

ఈ సంసారము ఒక అశ్వద్ధవృక్షము. దీనికి వేదములు ఆకులు, పైనవేళ్లు (ఉత్పత్తిస్థానము) క్రిందకొమ్ములు (జగత్తు) కలిగి నాశములేనిది. ఇదివేదార్ధము. ఈ సంసారవృక్షముయొక్క కొమ్ములు సత్వరజస్తమోగుణ ములచే వృద్ధిపొందింపబడి, శబ్దాది విషయ, బిచుళ్లతో క్రిందికి (ప్రపంచము) మీదికి (బ్రహ్మలోకము) అంతట వ్యాపించియున్నది. మనుష్యలోకమునకర్మసంబంధమగు వేళ్లు బాగుగా విస్తరించి నాటుకొని యున్నది. దీని అద్యంతములు కనబడవు. ఈ సంసారమును అశ్వద్ధవృక్షమును అసంగమమను ఆయుధముచే నరివైచిన వారు పిమ్మట మరల తిరిగిరాని, ఎవని నుండి ఈవృక్షము ఉద్భవించెనో అట్టి పరమాత్మపదముపొందును. అభిమానము. అవివేకము లేనివారు. దృశ్యపదార్థములయందాసక్తి యను దోషము జయించినవారు. నిరంతరము ఆత్మ (బ్రహ్మ) జ్ఞానము కలవారు, కోరికలు తొలగినవారు. సుఖదుఃఖాదిద్వంద్వములనుండి బాగుగా విడువబడిన జ్ఞానులు అవ్యయబ్రహ్మపదము (మోక్షము) పొందెను.

ఆ పరమాత్మ స్థానమును సూర్యచంద్రాగ్నులు ప్రకాశింపచేయజాలరు. దేనిని పొందిన మరల తిరిగి రారో అదినాయొక్క శ్రేష్టస్థానము నాయొక్క అనాది యగు అంశము జీవలోకమున జీవుడై ప్రకృతియందున్న మనస్సు, జ్ఞానేంద్రియమలు ఆకర్షించుచున్నది. ప్రబువగుజీవుడు ఈ శరీరము విడచి నూతన శరీరము పొందునపుడు పుష్పాదులనుండి గాలివానలను గ్రహించురీతిని, పంచేంద్రియములు, మనస్సుగ్రహించి వెడలుచున్నాడు. ఆ జీవుడు, చెవి, కన్ను, ముక్కు, చర్మము, నాలుక మనస్సుల నాశ్రయించి, శబ్దాదివిషయములననుభవించు చున్నాడు. ఈ శరీరము విడచివెళ్లినవాడు, ఈ శరీరమందుండు వాడు, విషయములననుభవించువాడు, గుణములతో కూడిన వాడగు జీవాత్మను అజ్ఞానులు చూడలేరు, జ్ఞానీదృష్టికలవారు మాత్రమే చూచుచున్నారు. ఆత్మసాక్షాత్కారము నకై ప్రయత్నించు యోగులు ఈ ఆత్మను చూచుచున్నారు. ప్రయత్నము చేయుచున్నను చిత్త శుద్ధిలేని అవివేకులు చూడలేకున్నారు.

సూర్యచంద్రాగ్నులయందులి తేజస్సు అంతయు నావిగా ఎరుగుము. నేను భూమి యందుప్యరవేశించి సమస్త ప్రాణికోట్లను నిలుపుచున్నాను. రసస్వరూపుడగు చంద్రుడనై సస్యములన్నిటిని పోషించుచున్నాను. వైశ్వానరుడను జఠరాగ్నిరూపమున ప్రాణం శరీరము నాశ్రయించి నాలుగు విధముల అన్నమును పచనముచేయు చున్నాను. నేను సమస్తప్రాణుల హృదయమందుడువాడను, నావలన నే జ్ఞాపకశక్తి జ్ఞానము మరుపుకలుగుచున్నది. వేదములచే తెలియదగిన వాడను, వదేతములను తెలిసినవాడను నేనే. సమస్త ప్రాణులదేహముల క్షరుడనియు, కూటస్థుడగుజీవుడు అక్షరుడు ముల్లోకముల ప్రవేశించి, భరించి నాశరహితజగన్నియామకుడగు ఉత్తమపురుషుని పరమాత్మయందురు. నేను క్షర స్వరూపుని కంటె మించిన వాడను అక్షర స్వరూపుడగు శ్రేష్టుడను. అజ్ఞానములేక నన్నుపురుషోత్తమునిగానెరిగి, సమస్తముతెలిసి సర్వవిధముల నన్ను భజించుచున్నాడు. ఈ అతిరహస్యమైన శాస్త్రమును తెలిసికొనిన వాడు జ్ఞానవంతుడు కృతకృతయుడు కాగలడు.

16. దైవాసురసంపద్విభాగయోగము.

ఈ అధ్యాయమున శ్రీకృష్ణపరమాత్మమోక్షగామికివలయు దైవీసంపదయను సద్గుణములు, విడువవలసిన ఆసుర గుణములు వివరించుచు, వాని ఫలితము కలుగు గతిని వివరించెను.

దైవీసంపదయనబడుసద్గుణములు:-

1. భయరాహిత్యము, 2. చిత్తశుద్ధి, 3. జ్ఞానయోగస్ధితి, 4. దానము, 5. బాహ్యేంద్రియ నిగ్రహము, 6. జ్ఞానయజ్ఞము, 7. శాస్త్రాద్యయనము, 8. తపస్సు, 9. ఋజుత్వము, 10. అహింస, 11. సత్యము 12. క్రోధ రాహిత్యము, 13. త్యాగము, 14. శాంతి, 15. కొండెములు చెప్పకుండుట 16. భూతదయ 17, విషయతోలత్వము లేకుండుట, 18. మృదుత్వము, 19. సిగ్గు, 20, చపలత్వము లేకుండును, 21. ప్రతిభ (బ్రహ్మతేజస్సు), 22. ఓర్పు, 23. ధైర్యము, 24. శుచిత్వము, 25. ద్రోహబుద్ధిలేకుండుట, 26. అభిమానరాహత్యము.

దంభము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము అవివేకము అనునవి అసురసంపదయనబడు దుర్గుణములు.

దైవీ సంపద పరిపూర్ణ సంపార బంధనివృత్తిని, అసురీసంపద సంసారబంధమును కలుగజేయును. అర్జునా! నీవుదైవీసంపదకల్గి జన్మించినాదబు. కావున శోకింపనవసరములేదు.

అసురస్వభావముగలజనులు. ధర్మప్రవృత్తినిగాని, అధర్మ నివృత్తినిగాని ఎరుగరు. వారి యందు శుచిత్వనము, సత్యర్మాచరణ, సత్యము యుండదు. వారు జగత్తు అసత్యమని, దర్మాదర్మపతిష్ఠలేదని, ఈశ్వరుడేలేడని, కామమేహేతువాగాగల స్త్రీ పురషుసంబంధమై. జగత్కారణమని పరికెదరు. వారు నాస్తిక దృష్టినవలంబించి, చెడిన మనస్సుకలిగి, అల్పబుద్ధితోకూడి, క్రూరకార్యములు చేయుచు, లోక కంటకులు శత్రువులుగా ప్రపంచ వినాశనమునకు పెట్టెదరు. వారు తనివి తీరనికామమునాశ్రయించి డంబము. అభిమానము, మదముకలవారై అవివేకమువలన చేడుపట్టుదలతో అపవిత్రములగు నీచవృత్తుంజీవింతురు. వీరు అంతులేనివిషయచింతలనాశ్రయించి. కామేభోగమే గొప్పగా తలచుచు. పెక్కు ఆశాపాశములచే బంధింపబడి, కామగ్రోధ తప్పరులై. విషయభోగమునకై అధిక ధనముకోరి, అన్యాయ, మోసపూరిత, పద్దతులద్వారా సంపాదించవలెను. శత్రువలనుచంపితిని, ఇంకనుపొందెదను. ఇంకనుధనము సంపాదించివలెను. సమస్తభోగములనుభవించువాడను. శత్రవంతుడను. బలవంతుడను. ధనవంతుదను. నాతేసమానమైన వారు వేరేవరు? ఇట్లు అజ్ఞానము చేవెరాహముపొంది. కామముల ననుభవించుట యటందు ఆసక్తికలిగి, గొప్పకారకు యజ్ఞములు, దానములుచేసి, అసురానందము పొంది చివరకునరకమునపడెదరు. తమ్ము తాముగొప్పగాతలచుచు, మర్యాదలేక ధనము కలదని గర్వము, మదముతోబలగర్వితువై, కామక్రోధములనాశ్రయించి. అంతర్యామియగుపరామాత్ను ద్వేషించుచు. అసూయాపురులై, శాస్త్రవిరుద్ధ నామమాత్రపు యజ్ఞాదులు చేయుదురు. అప్పివారు నీచజన్మలయందు మరల మర్గలపుట్టుచు. నరక యాతనలననుభవింతురు. కామ, క్రోధ, లోభము%ు నరకమునకు గల మూడుద్వారములు. ఇవి జీవిని నాశకారకములు. కావున వీనిని పూర్తిగావిడువలెనను. ఇట్లు విడచిన మునుజుడు తన హితముగావించుకానుచు. సర్వాత్కృష్టమోక్షమును పొందగలడు. శాస్త్రాక్తమగు విధిని విడచి తన ఇచ్చవచ్చినట్లు చేయావాడు. పురుషార్థసిద్ధికిగాని, మోక్షమును గానిపొందడు. నీవుచజేయదగిన చేయరానిది నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కావున శస్త్రానుసారము కర్మలను నీవు చేయదగును.

17 శ్రద్థాత్రయవిభాగయోగము

శాస్త్రోక్త విధానమును విడచిపెట్టి శ్రద్ధతోకూడుకొని పూడలొనర్చువారి స్థితి సాత్వికమా, రాజ సమా, తామసమా? ఏదియైయున్నదను అర్జునిని ప్రశ్నకు సమాధానముగా-

శ్రీకృష్ణపరమాత్మతెలుపుచున్నాడు-ప్రాణులయొక్క పూర్వజన్మ సంస్కారముచే కలిగిన శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసమని మూడు విధములు-సమస్త జీవులకు వారివారి పూర్వజన్మసంస్కారము ననుసరించి శ్రద్ధకేలుగుచున్నది. జీవుడు శ్రద్ధయే స్వరూపముగాగలవాడు. సత్యగుణముకలవారు దేవతలను రజోగుణముకలవారు యక్షులను, తామసగుణముకలవారు భూతప్రేత గణముల ను పూజించుచున్నారు. ఉపాసనాదులచే శరీరము శుష్టింపజేసి, శరీరాంతర్యామియగు పరమాత్మను కష్టపెట్టి. దంభాహంకారము. కామము. రోగము పశుబలముకలవారు అవివేకులపై శాస్త్రమునందు విధింపబడని. తమకును, ఇంతరులకును బాధాకారమగు తపస్సుచేయువారు అసురస్వభావముకలవారు.

ఆహారము, యజ్ఞము, తపస్సు, ధ్యానము, సత్వాది గుణానుసారము మూడువిధములుగా ప్రియమైనయున్నది. సత్వగుణము వృద్ధిపొందించురసముగల మనోహారములగు ఆహారము ఇష్టపడుదురు. చేదు, పులుపు, ఉప్పు, కారము, మిక్కిలి వేడిగను, చమురులేనిదిగను, మిగులదాహముకలుగజేయు, శరీరమునకు దుఃఖము, మనోవ్యాకులత కలుగజేయు ఆహారము రజోగుణముకలవారికి ఇష్టము బాగుగా ఉడకనిది, పాచి పోయినది, దుర్గంధముకలది. ఎంగివి ఆహారము తామసగుణము కలవారికి ఇష్టము.

శాస్త్రసమ్మతమైయుండి. ఫలాపేక్షలేకచేయుయజ్ఞముసాత్వికము, ఫలమునుకోరి డంబముకొరకు గవింపబడుయజ్ఞము రాజసమువిద్యుక్తముకానిది. అన్నదానములేనిది. మంత్రరహితమైనది.దక్షిణలేనిది. బొత్తిగా శ్రద్దలేనిది తామసయజ్ఞము.

దేవతలను, బ్రహ్మవిష్ణులగు గురువులను, జ్ఞానులను పూజించుట బాహ్యాభ్యంతరశుద్ది, ఋజుత్వము కలిగియుండి, బ్రహ్మచర్యవ్రతము పాలించుట, ఏప్రాణిని హింసింపకుండుట యనునదిశారీరకతపస్సు ఇతరుల మనస్సులకు బాధకలిగింపనిది. సత్యమైనది, ప్రియమైనది. మేలుకలిగించునది యగు వాక్యము వేదాదులఅధ్యయనము. ప్రణవాది మంత్రజపము వాచిక తపస్సు, మనస్సు నిర్మలముగానుంచుట. ప్రసన్నత్వము. దైవధ్యానము. ఆత్మయందే స్థితికలిగియుండుట. మనస్సులో బాగుగానిగ్రహించుట, పరిశుద్ధ బావములుకలిగి యుండుట మానసికతపస్సు

ఫలాపేక్ష లేక నిర్మల చిత్తులై. అధికశ్రద్ధతో ఆదరింపబడుపై మూడు విధముల తపస్సు సాత్వికమన బడును. ఇతరులచేసత్కరింపబపదవలెను. గౌరవింప బడవలెను. పూజింప బడవలెనని డంబము తేచేయబడుతపస్సు అస్థిర, అనిశ్చిత ఫలము కలదిరాజసతపస్సు మూర్ఖపుపట్టుదలతో శరీరమును శుష్కింప జేసుకొని ఇతరుల నాశనముకోరిచుయబడుతపస్సు తామసతపస్సు.

ఈయవలసినదేనని నిశ్చయముతో పుణ్యప్రదేశమందు, పుణ్యకాలమందు యోగ్యుడైనవానికి, ప్రత్యుపకారము చేయు శక్తిలేని వానికొరకు ఈయుబడునది సాత్వికదానము ప్రత్యుపకారముకొరకు ఫలమునుద్దేసించి ఇష్టములేని మనస్సుతో ఇచ్చుదానము రాజసము. అపవిత్రదేశకాలములందు అపాత్రులకు సత్కర శూన్యముగ, అమర్యాదతో రాయబడుదానము తామసదానము.

ఓంతతీసత్‌, అని పరబ్రహ్మకుమూడు పేర్లు. దీనినుచ్చిరించియే బ్రహ్మ జ్ఞానులు.వేదములు, యజ్ఞములు నిర్మింపబడినవి. ఆపరబ్రహ్మమే సత్యము అందువలన వేదములనెరిగిన వారు శాస్త్రోక్తయజ్ఞదానతప, క్రియలన్నియు ఓం అని చెప్పిన పిదపనే అనుష్టింపబడుచున్నవి. తత్‌అను పదము ఉచ్చరించియే ముముక్షవులు ఫలాపేక్ష లేక పలువిధములై న యజ్ఞదనతపః కర్మలు చేయుచున్నారు. కలదు. మంచిది అనుర్ధమతందు సత్‌ అను పరబ్రహ్మనామము ప్రయోగింపబడటుచున్నది. యజ్ఞతపోదానాదులయందు నిష్ట కూడా సత్‌ అనిచెప్పబడుచున్నది. భగవత్ప్రత్యర్దకర్మలుకూడ సత్‌ అనియేపిలువబడును. అశ్రద్ధతో చేయబడు హోమదానతపోకర్మలు అసత్యనిచెప్పబడును. అవి ఇహ పరలోక సుఖములు కలుగ జేయవు. కావున అధ్యాత్మికాది సత్కార్యములన్నియు శ్రద్ధ తోగూడి చేయవలెను.

18 మోక్ష సన్యాసయోగము.

సన్యాసము. త్యాగముయొక్క ధార్ధమును తెలుసుకొనగోరు అర్జునునకు. శ్రికృష్ణ పరమాత్మ ఇట్లు తెలిపెను-కామ్యకర్మలవదలుట సన్యాసమనికొందరు. సమస్తకర్మతఫలమును త్యజించుట త్యాగమని కొందురు దోషముల వలె క్రమలను విడువవలెనని సాంఖ్యలు. యజ్ఞము. దానము, తపస్సు వెలుదలగుకర్మలు విడువరాదని మరికొందరు చెప్పుదురు. కర్మతక్యాగవిషయమున నానిశ్చయము తెలిపెదను. త్యాగముమూడువిధములు.

యజ్ఞము, దానము, తపస్సు అనుకర్మలు త్యజింపదగినవికావు. చేయదగినవి. అవిచిత్య శుద్ధీకలుగజేయును. కాని ఈయజ్ఞదానతప, కర్మలను ఆసక్తి, ఫలము విడచి చేయవలెనని నానిశ్చతఉత్తమ అభిప్రాయము. విధింపబడిన కర్మల పరిత్యాగము యుక్తముకాదు. అట్లు విడచి పెట్‌%ిన అది తామసత్యాగమని చెప్పబడును. శరీరమునకు ప్రయాసకలుగునని భయముచే. దుఃఖముకలుగ జేయునది యని తలచి విద్యుక్తకర్మలను విడచిపెట్టుట రాజసత్యాగము. దీనిచేత్యాగఫలముపొందకుండును. ఇది చేయదగినదేయని తలంచి శస్త్రవిహితకర్మలు అభిమానము. ఫలమువిడచి పెట్టి చేయబడునది సాత్విక త్యాగము.

సత్యగుణముతోకూడిన వారు ప్రజ్ఞాశాలియై, సంశయములేని త్యాగమశీలుడు అశుభ, కామ్య, దుఃఖకరకర్మను ద్వేషింపడు. శుభము, నిష్కామము, సుఖకరమగుకర్మయందు ఆసక్తుడుకాడు. కర్మలను పూర్తిగావిడచుట దేవాధారియగు జీవునకు సాధ్యముకాదు. కర్మఫలము. నువిడచు వాడేత్యాగి దుఃఖకరము. సూఖకరము, సుకదుఃఖమిశ్రితకర్మ ఫలము కర్మలఫలత్యాగముచేయని వారికి మరణానంతరముకలుగు. కర్మఫల త్యాగము చేసినవారికి ఎన్నిటికికలుగునేరవు. సమ్మస్తకర్మలునెరవేర్చుటకు 1. శరీరము, 2.కర్త. 3. వివిధములగు ఇంద్రియములు, 4. వేరువేరక్రియలు 5. దైవముకరాణములుగానున్నవి. మనుజుడు శరీరము, వాక్కు, మనస్సు చేన్యాయమైనట్టి. అన్యాయమైనట్టి ఏకర్ము ప్రారంబించుచున్నాదో వానికీణదుకరాణములు, సంస్కరింపబడని బుద్ధికలవాడు, నిరుపాధికుడుఆత్మనుకర్తగా తలచు చున్నాడో అట్టి అవివేకి కర్మయొక్కగాని, ఆత్మయొక్క గాని వాస్తవరూపమును ఎరుగకున్నాడు.

నేనుకర్తను అనుభావము, బుద్ధియొక్క విషయకర్మాదుల సంగములేదో, అట్టివాడు ప్రాణులన్నిటిని చంపినను, చంపుటలేదు. అతడుకర్మలఫలముచే బంధింప బడుటలేదు. కర్మమునకు హేతువు తెలివి. తెలియదగువస్తువు. తెలియువాడు (జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత) అట్లే కర్మకు ఆధారము సధనము, క్రియ, చ్యువాడు (కరణము, కర్మ, కర్త) సాంఖ్యశాస్త్రముననుసరించి జ్ఞానము, కర్మము, కర్త, సతేవదిగుణభేదములననుసరించి మూడవిధములు.

విబజింపబడిపేరు వేరుగాను నున్న సమస్త చరాచరప్రాణులందు నాశరహితమగు ఆత్మ వస్తువు విభజింపబడక ఒక్కటిగానున్నట్లు తెలియును సాస్తివకజ్ఞానము. సమస్తప్రాణులయందు వేరువేరు విధణులగు జీవులను వేరువేరు గానెరుగుపరాజసజ్ఞానము. ఏజ్ఞానమువలన మను జుడు ఏదేని ఒక్కదానియందు అదియే సమస్తమని తగిలి యుండునో, అందుకతగిన హేతువు లేకుండునో, తత్వమునుతెలియకుండునో అట్టి అల్పజ్ఞానము తామస జ్ఞానము

శాస్త్రము చేనియమింపబడి ఫలాపేక్ష, ఆసక్తి అభిమానము రాగద్వేషములులేకుండ చేయ బడు కర్మసాత్విక కర్మ, ఫలాపేక్షతో కూడి, అహంకారము, అధిక ప్రయాసకరమగు కర్మఏదిచేయబడుచున్నదో అది రాజసకర్మ. తాను చేయబోవు కర్మకు కలుగ బోవు దుఃఖాదులను, నాశనమును, బాధను, సామర్ధ్యమును, ఆలోచింపక అవివేకముతో ప్రారంభింపబడు కర్మ తామసకర్మ.

సంగము, ఫలాపేక్ష విడచి, తాను కర్మనను అహంభావము, అభిమానములేనివాడు, ధైర్యము, ఉత్సాహము తోకూడి యుండువాడు కార్యము సిద్ధించినను, సిద్ధింపకున్నను వికారము చెందని వాడు సాత్విక కర్మ. అనురాగము కలిగి, కర్మ ఫలమునాశించి, లోభ హింసా స్వభావముతో శుచిత్వము లేని వాడు, కార్యము సిద్ధించిన సంతోషము, లోనిచో దుఃకాముపొందువాడు రాజసకర్త. మనోనిగ్రహములేక, పామర స్వభావముకలిగి,వినయములేక మోసము తో ఇతరులవచించి, వారి జీవనములు పాడుచేయువాడు, సోమరి తనముకలవాడు, ఎపుడు దిగులుతోనుండువాడు. స్వల్పకాలము లో చేయుపనిని దీర్ఘకాలమునకైనను పూర్చిచేయనివాడు తామసకర్త.

ధర్మమందు ప్రవృత్తి , అధర్మమందు నివృత్తి, చేయదగు దానిని, చేయరాని దానను, భయము, అభయము, బంధము మోశ్రము, తెలుసుకొను బుద్ధి సాత్విక బుద్ధి, ధర్మము, అధర్మము చేదగిన, చేరాని దానిని పొరపాటుగా వేరుగా తెలియుబుద్ధిరాజసబుద్ధి. అవివేకముతో కప్పబడి, అధర్మమును ధర్మమని యెంచి, సమస్త పదార్థములను విరుద్ధముగా తలంచునో అట్టి బుద్ధి తామస బుద్ధి.

చలింపని ధైర్యముతో కూడిన వాడై, మనస్సు , ప్రాణము,ఇంద్రియములయొక్క క్రియలను యోగసాధన చే విషయములనుండి త్రిప్పి ఆత్మధ్యానమును శాస్తోక్త మార్గమున నిలవ బెట్టువాని ధైర్యము సాత్విక ధైర్యము ఫలాపేక్షకలవాడై, అర్ధకామాదులయందాసక్తితో అనుష్టించువాని ధైర్యము రాజసము. దుర్బుద్ధి యగు మనుజుడు నిద్ర, భయము, దుఃఖము , సంతాపము, మదము విడువక యుండునో అట్టి వానిది తామసధైర్యము.

ప్రారంభమున విషము వలెన నుండి, పర్యవసానమందు అమృతమును బోలి%ుండు, తన బుద్ది యొక్క నిర్మల త్వేమునుచే కలుగు సుఖము సాత్విక సుఖము. విషయేంద్రియ సంయోగముచే మొదట అమృతము వలె నుండి పర్వసానీమున విషతుల్యమగునో అది రాజససుఖము. నిద్రస సోమరి తనము, ప్రమత్త తోకలిగి ఆరంభమందు అంతమందు, మోహము, అజ్ఞానము, భ్రమ, కలిగించునది తామస సుఖము. ప్రకృతి నుండి పుట్టిన ఈమూడు గుణములతో కూడియుండని వస్తువు. భూలోక స్వర్గలోక దేవతాదుల యందు గాని లేదు. మాయ త్రిగుణాత్మికము.

ఓ అర్జునా! బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులకు వారి వారి జన్మాంతర సంస్కారమునను సరించిన స్వభావమువలన పుట్టిన గుణములను బట్టి కర్మలు వేరువేరుగా విభజింపబడినది.

అంతరింద్రియ నిగ్రహము (మనోనిగ్రము) బ్రహ్మేంద్రియ నిగ్రహము, తపస్సు, బాహ్యభ్యంతరశుచిత్వము, ఓర్పు, ఋజువర్తనము, శాస్త్రజ్ఞానముఅనుభవ జ్ఞానము, దైవము, గురువు, శాస్త్రమందు నమ్మకము, కలిగియుండుట స్వభావము వలన పుట్టిన బ్రాహ్మణ కర్మయై యున్నవి. శూరత్వము , తెజస్‌%సు, కీర్తి, ప్రతాపము, ధైర్యము, సామర్ధ్యము, యుద్ధమునందు పారిపోకుండుట, దానము, ప్రజాపరిపాలనా శక్తి, ఇవి స్వాభావమువలన పుట్టిన క్షత్రి క్రమ యై యున్నది. వ్యవసాయము, గోసంరక్షణము, వర్తకము వైశ్యునకు స్వభావ జనితకర్మలై యున్నవి. అట్లే సేవారూపమైన కర్మము శూద్రునకు స్వభావ సిద్ధమైయున్నది.

తన తన స్వభావిక కర్మము నందాసక్తి గల మనుజుడు, జ్ఞాన యోగ్యతారూప సిద్దిని పొందుచున్నాడు. ఎవనివలన ప్రాణులు ఉత్పత్తి, ప్రవర్తనము కలుగుచున్నవో, ఎవని చే ఈ సమస్త ప్రపంచము వ్యాపింపబడి యున్నదో అట్టి పరమాత్మను మనుజుడు స్వకీయ కర్మము చేనారాభించి జ్ఞానయోగ్యతా రూప సిద్ధిని పొందుచున్నాడు. తనయొక్క ధర్మము గుణ ములేనిది గా కనబడినను చక్కగా అనుష్టింపబడిన ఇతరుల దర్మముకంటె శ్రేష్ఠమైనదియే యగును.స్వభావముచే ఏర్పడిన తన ధర్మమునకు తగిన కర్మను చేయు చున్నయెడల మనుజుడు పాపమును పొందనేరడు. స్వభావ సిద్ధమగు కర్మము దో,ముతో కూడియున్నను దానిని వదల రాదు. పోగచేత అగ్ని కప్పబడినట్లు సమస్త కర్మములు త్రిగుణముల యొక్క దోషముచే కప్పబడియున్నవి.

సమస్త విషయములందు ఆసక్తి లేని బుద్ధి కలవాడు, మనస్సును జయించినవాడు, కోరికలు లేని వాడు నగుమనుజుడు సంగత్యాగముచే (జ్ఞానయోగము) సర్వోత్కృష్టమైన, నిష్క్రయా స్తితిని పొందుచున్నాడు. నిష్కామ కర్మలచే చిత్తశుద్ధి రూపమగు కర్మ సిద్ధిని పొందినవాడు పరమాత్మను ఏవిధముగా పొందగలడో ఆ విధమును , మరియు జ్ఞానము యొక్క నిష్ఠను సంక్షేపముగా నావలన తెలిసికొనుము.

(1) అతి నిర్మలమైన బుద్ధికలవాడు 2) ధైర్ముతోమనస్సును నిగ్రహించువాడు 3) శబ్ద స్పర్శాది విషముల విడచినవాడు 4) రాగద్వేశములు పరిత్యజించినవాడు 5) ఏకాంత స్థలమున నివసించు వాడు 6) మితాహారము సేవించువాడు 7) వాక్కు, శరీరము, మనస్సులను స్వాధీనము చేసుకొనిన వాడు 8) ఎల్లప్పుడు ధ్యానోగత త్పరుడైయుండువాడు 9) వైరాగ్మును లెస్సగా నవలంబించిన వాడు 10) అహంకారము , బలము, డంబము, కామము, క్రోధము, వస్తు, సంగ్రహము బాగుగావదలి వైచిన వాడు 11) మమకారములేనివాడు 12) శాంతుడైయుండువాడు బ్రహ్మ స్వరూప మోక్షమును పొందుటకు అర్హుడు. బ్రహ్మ రూపమునుపొందిన వాడు (జీవన్ముక్తుడు) నిర్మల మైన మనస్సుకలవాడు నగుమనుజుడు దేనిని గూర్చి దుఃఖింపడు, దేనినికోరడు, సమస్త ప్రాణులయందు సమ బుద్ధి కలవాడై నాందలి ఉత్తమ భక్తిని పొందుచున్నాడు.

భక్తిచేతను మనుజుడు నేనెంతటి వాడనో, ఎట్టి వాడనో యధార్ధముగా తెలిసికొని అనంతరము నాయందు ప్రవేశించు చున్నాడు భగ జ్ఞానముచే మోక్షము లభించును.

సమస్త కర్మలను ఎల్లపుడు చేయుచున్న వాడైనను కేవలము నన్నే ఆశ్రయించి శరణు పొందువాడు నాయనుగ్రహముచే శాశ్వత మోక్ష పదము పొందుచున్నాడు. సమస్త కర్మలను (కర్మఫలమును) వివేక బుద్ధితో నాయందు సమర్పించి. నన్నేపరమ ప్రాప్యముగా నెంచి చిత్తైకాగ్రతతో తత్వవిచారణ (ధ్యానయోగము) అవలంబించి నాయందే చిత్తము నిలుపుము. అట్లుచిత్తము చేర్చినవాడనైతి వేని నాయనుగ్రహమువలన సమస్త సంసారమర దుఃఖములు దాటగలవు. అహంకారముచే నాయీవాక్యము విననిచో చెడిపోదువు.

అహంకారము నవలంబించి నేను యుద్ధము చేయనని తలచెదవేని నీప్రయత్నము వ్యర్ధమగును. ఏలనన నీ స్వభావమే నిన్ను యుద్ధమునకు నియోగింపగలదు. స్వభావ సిద్ధకర్మను అవివేకముచే ఇచ్చగింపకున్నను పరాధీనుడవై తప్పక చేసితీరెదవు.

ఓ అర్జునా! జగన్నియామకుడైన పరమాత్మ అంతర్యామి రూపమున సమస్త ప్రాణుల హృదయమునవెలసి, యంత్రగాడు కీలు బొమ్మలను త్రిప్పునట్లు త్రిప్పుచుండును. సర్వ విధముల ఈశ్వరునే శరణు బొందుము. అతని యను గ్రహముచే సర్తోత్తముమైన శాంతిని, శాశ్వతమోక్షపదము పొందగలవు. ఈ పరమ రహస్యమైన జ్ఞానమును (గీతాశాస్త్రమును) నీకు చెప్పితిని. దీనినంతను బాగుగా విచారణచేసి తదుపరి నీకిష్టమైనట్లు చేయుము. నీవు నాకు మిక్కిలి ఇష్టుడవగుటచే పరమరహస్యమైన శ్రేష్ఠమైన ఈ జ్ఞానమును నీ హితముగోరి మరల చెప్పుచున్నాను.

నాయందు మనస్సునుంచుము. నా యెడల భక్తి కలిగి యుండుము. నన్నారాధించుము. నాకు నమస్కరింపుము. అట్లు చేసిన చో నీవు నన్నే పొందగలవు. నీవు నాకిష్టుడవై యున్నావు. కావున యధార్ధముగా ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను. సర్వధర్మము లను విడచిపెట్టి నన్నోక్కని మాత్రము శరణుపొందుము. నేను సమస్త పాపముల నుండి నిన్ను విముక్తుని చేసెదను.

నీకు బోధించిన ఈ గీతాశాస్త్రమును తపస్సులేనివారికి, భక్తుడు కాని వానికి, వినుట కిష్టము లేని వానికి (గురు సేవచేయని వాడు) నన్ను దూషించు వానికి, గాని ఎన్నడు చెప్పుకుము. ఎవడు అతిరహస్యమైన గీతాశాస్త్రమును నాభక్తులకు చెప్పునో అట్టి వాడు నాయందు ఉత్తమ భక్తికలవాడై నిస్సందేహముగానన్నే పొందగలడు. మనుజులలో అట్టి వారికంటె ప్రియమొనర్చువాడు. అతనికంటె మిక్కిలి ఇష్టుడైన వాడు. ఈ భూలోకమున మరి యొకడు కలుగ బోడు. ఎవడు ధర్మ యుక్తమైన మన ఇరువురి సంభాషణము అధ్యయనము చేయునో అట్టి వానికిచే జ్ఞానయజ్ఞము చేనారాధింపబడిన వాడనగుదు నని నానిశ్చయము. ఏమనుజుడు శ్రద్ధతోకూడి, అసూయలేని వాడై ఈ గౌతాశాస్త్రము వినునో అట్టివాడు పాపవిముక్తుడై పుణ్యలోకములు పొందును.

హే అర్జునా! నాయీ బోధను నీవు ఏకాగ్రచిత్తముతో వింటివా? అజ్ఞాన నితమగు నీభ్రమ సంపూర్ణముగా నశించినదా?

హేకృష్ణ పరమాత్మా! నీయనుగ్రహమువలన నా అజ్ఞానము నశించినది. జ్ఞానముకలిగినది సంశయములు తొలగినవి. ఇక నీ యాజ్ఞను నెరవేర్చెదను.

సంజయుడు దృతరాష్ట్ర మహారాజునకిట్లు చెప్పెను. ఓ మహారాజా! ఈ ప్రకారముగా నేను శ్రీకృష్ణుని యొక్కయు, మహాత్ముడగు అర్జునిని యొక్కయు ఆశ్చర్యకరమైనట్టి పులకాంకురము కలుగ జేయు, ఈ సంభాషణము వింటిని. శ్రీ వేదవ్యాసమహర్షి అనుగ్రహము వలన నేను అతిరహస్యమైనది, మిగుల శ్రేష్టమైనది నగు ఈ యోగశాస్త్రమును స్వయముగా అర్జునునకు చెప్పుచున్న యోగేశ్వరుడగు శ్రీకృష్ణుని వలన ప్రత్యక్షముగా వింటిని. ఓ మహారాజా! ఆశ్చర్యకరమైనదియు, పావనమైనదియగు శ్రీకృష్ణార్జునుల సంభాషణమును తలచి తలచి, మాటి మాటికి ఆనందము పొందుచున్నాను. శ్రీకృష్ణ పరమాత్మయొక్క మిగుల ఆశ్చర్యకరమైన ఆవిశ్వరూపమును తలంచి తలంచి నాకు మహదాశ్చర్యముకలుగుచున్నది. దానిని తలచుకొని మాటి మాటికి సంతోషము పొందుచున్నాను.

యోగేశ్వరుడగు శ్రీకృష్ణుడు, ధనుర్ధారి యగు అర్జునుడు ఎచటెచట నుందురో అచట సంపద, విజయము, ఐశ్వర్యము, దృఢమగు నీతి యుండునని నా అభిప్రాయము.

ఓం శ్రీమద్భగవద్గీతా సార సంగ్రహము సమాప్తము

ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌, ఓం తత్‌సత్‌

ఓం. శాంతిః శాంతిః శాంతిః

***

SARA SUDHA CHINDRIK    Chapters