Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకచత్వారింశత్తమోధ్యాయ ః నలుబదియొకటవ అధ్యాయము

దానాది విధివర్ణవమ్‌.

వసురువాచ :-

అధావగాహనాదీనాం కర్మణాం ఫలముచ్యతే l సావధానా శృణుష్వ త్వం బ్రహ్మపుత్రి నృపప్రియే 1

యైః పుణ్యవాహినీ గంగా సకృద్భక్త్యావగాహితా l తేషాం కులానాం లక్షంతు భవాత్తారయతే శివా 2

సామాన్య స్నానతో దేవి తత్ర సంధ్యాహ్యుపాసితా l పుణ్యం లక్షగుణం కర్తుం సమర్ధా ద్విజపావనీ 3

దత్తాః పితృభ్యో యత్రాపః తనయైః శ్రద్దయాన్వితైః l అక్షయాం తు ప్రకుర్వంతి తృప్తిం మోహిని దుర్లభాం 4

యావన్తశ్చ తిలా మర్యైః గృహీతాః పితృకర్మణి l తవద్వర్ష సహస్రాణి పితరః స్వర్గవాసినః 5

పితృలోకేషు యేకేచిత్‌ సర్వేషొం పితరః స్థితాః l తర్ప్యమాణాః పరాం తృప్తిం యాంతి గంగాజలైః శుభైః 6

య ఇచ్ఛేత్సఫలం జన్మ సంతతిం వా శుభాననే l స పితౄం స్తర్పయేద్గంగా మభిగమ్య సురాంస్తధా 7

యే మతా దుర్గతా మర్త్యా స్తర్పితాస్తత్కు లోద్భవైః l కుశైస్తిలైర్గాంగ జలైః తే ప్రయాంతి హరేః పదమ్‌ 8

స్వర్గ సంస్థాశ్చ యే కేచిత్‌ పితరః పుణ్యశాలినః l తే తర్పితా గాంగజలైః మోక్షం యాంతి విధేర్వచః 9

మాసం తర్పణమాత్రేణ పిండ సంపాతనేన చ l గంగాయాం పితర! స్సర్వే సుప్రీతాః సూర్యవర్చస ః 10

అప్సరోగణ సంయుక్తాన్‌ హేమరత్న విభూషితాన్‌l ముక్తాజాల పరిచ్ఛన్నాన్‌ వేణువీణా నినాదితాన్‌ 11

భేరీ శంఖమృదంగాది నిరోషాన్స్రగ్విభూషితాన్‌ l గంధర్వదేహరుచిరాన్‌ దివ్య భోగసమన్వితాన్‌ 12

ఆరుహ్య తు విమానాగ్య్రాన్‌ బ్రహ్మలోకం ప్రయాంతి హి l గంగాయాం తు నరః స్నాత్వా యో నిత్యం లింగమర్చయేత్‌ 13

ఏకేన జన్మనా మోక్షం పరమాప్నోతి స ధ్రువమ్‌ l అగ్నిహోత్రాణి వేదాశ్చ యజ్ఞాశ్చ బహుదక్షిణా 14

గంగాయాం లింగపూజాయాః కోట్యంశేనాపి నో సమాః l పితౄనుద్దిశ్య వా దేవాన్‌ గంగాంభోభిః ప్రసించయేత్‌ 15

తప్తాస్యుస్తస్య పితరో నరకస్థాశ్చ తత్‌క్షణాత్‌ l మృత్కుంభాత్తామ్రకుంబైస్తు స్నానం దశగుణం స్మృతమ్‌ 16

రౌపై#్యః శతగుణం పుణ్యం హేమైః కోటిగుణం స్మృతమ్‌ l ఏవమర్ఘేచ నైవేద్యే బలిపూజాదిషు క్రమాత్‌ 17

పాత్రాంతర విశేషేణ ఫలం చైవోత్తరోత్తరమ్‌ l విభ##వే సతి యో మోహా న్న కుర్యాద్విధ విస్తరమ్‌ 18

న స తత్కర్మ ఫలభాక్‌ దేవద్రోహీ ప్రకీర్త్యతే l దేవానా దర్శనం పుణ్యం దర్శనాత్స్పర్శనం వరమ్‌ 19

స్పర్శనాదర్చనం శ్రేష్ఠం ఘ్నతస్నాన మతః పరమ్‌ l ప్రాహుర్గంగాజలైః స్నానం ఘృతస్నాస మం బుధాః 20

అర్ఝ్యం ద్రవ్య విశేషేణ గంగాతోయేన యః సకృత్‌ l మాగధ ప్రస్థమాత్రేణ తామప్రత స్థితేన చ 21

దేవతాభ్యః ప్రదద్యాత్తు స్వకీయ పితృభిః సహ l పుత్ర పౌత్రైశ్చ సంయుక్తః స చ వై స్వర్గమాప్నుయాత్‌

ఆపః క్షీరం కుశాగ్రాని ఘృతం దధ తథా మధు 22

రక్తాని కరవీరాణి తధా వై రక్త చందనమ్‌ l అష్టాంగైరేష యుక్తోర్ఘో భానవే పరికీర్తతః 23

విష్ణోః శివస్య సూర్యస్య దుర్గయా బ్రహ్మణ స్తధా l గంగాతీరే ప్రతిష్ఠాం తు యః కరోతి నరోత్తమః 24

తదై వాయతనాన్యేషాం కారయత్యపి శక్తితః l అన్య తీర్ధేషు కరణాత్‌ కోటి కోటి గుణం భ##వేత్‌ 25

గంగాతీరసముద్భూత మృదా లింగాని శక్తితః l సలక్షణాని కృత్వా తు ప్రతిష్ఠాప్య దినే దినే 26

మంత్రైశ్చ పత్రపుష్పాద్యైః పూజయిత్వా చ శక్తితః | గంగాయాం నిక్షిపేన్నిత్యం తస్య పుణ్యమనంతకమ్‌ 27

సర్వానంద ప్రదాయిన్యాం గంగాయాం యో నరోత్తమః | అష్టాక్షరం జపేద్భక్త్యా ముక్తిస్త స్య కరే స్థితా 28

నమో నారాయణాయేతి ప్రణవాద్యం నియమ్య చ l షణ్మాసం జపతః సర్వా హ్యుపతిష్ఠంతి సిద్ధయః 29

సమః శివాయేతి మంత్రం సతార విధానా తు యః | చతుర్వింశతిలక్షంవై జపేత్సాక్షాత్స శంకరః 30

పంచాక్షరీ సిద్దవిద్యా శివ ఏవ న సంశయః l అపవిత్రః పవిత్రో వా జపన్నిష్పాతకో భ##వేత్‌ 31

పూజితాయాం తు గంగాయాం పూజితాః సర్వదేవతాః l తస్మాత్సర్వ ప్రయత్నేన పూజయేదమరాప గామ్‌ 33

చతుర్భుజాం త్రినేత్రాం చ సర్వావయవ శోభితాం l రత్న కుంభాసితాంభోజ వరాభయకరాం శుభామ్‌ 33

శ్వేత వస్త్ర పరీధానాం ముక్తామణి విభూషితాం l సుప్రసన్నాం సువదనాం కరుణార్ద్ర హృదంబుజామ్‌ 34

సుధాప్లావిత భూపృష్ఠాం త్రైలోక్యనమితాం సదా l ధ్యాత్వా జలమయీం గంగాం పూజయన్పుణ్యభాగ్భవేత్‌ 35

మాసార్ధమపి యసై#్వవం నైరంతర్యేణ పూజయేత్‌ l స ఏవ దేవ సదృశో బహుకాలే ఫలాదికః 36

వైశాఖ శుక్ల సప్తమ్యాం జహ్నునా జాహ్నవీపురా l క్రోధా త్పీతా పునస్త్యక్తా కర్ణరంధ్రాత్తు దక్షిణాత్‌ 37

తాం తత్ర పూజయేద్దేవీం గంగాం గగనమేఖలామ్‌ l అక్షయాయాం తు వైశాభే కార్తికేపి శుభావనే 38

రాత్రౌ జాగరణం కృత్వా యవాన్నైశ్చ తిలైస్తధా l విష్ణుం గంగాంచ శంభుంచ పూజయేద్భక్తి భావతః 39

తధా సుగంధైః కుసుమైః కుంకుమాగురు చందనైః l తులసి బిల్వ పత్రాద్యైః మాతులుంగ ఫలాదిభిః 40

ధూపైర్దీపైశ్చ నైవేద్యై ర్యధావిభవవిస్తరైః l కల్పకోటి సహస్రాతి కల్పకోటి శతానిచ 41

దివ్యం విమానమాస్థాయ విష్ణులోకే మహీయతే l తతో మహీతలం ప్రాప్య రాజా భవతి ధార్మికః 42

భుక్త్వా వివిధ సౌఖ్యాని రూపశీలగుణాన్వితః l దేహాంతే జ్ఞానవాన్భూత్వా శివ సాయజ్యమాప్నుయాత్‌ 43

యస్త్వక్షయతృతీయాయాం గంగాతీరే దదాతి వై l ఘృతధేనుం విధానేన తస్య పుణ్యఫలం శృణు 45

వసువు పలికెనుః ఓ బ్రహ్మపుత్రీ రుక్మాంగద ప్రియురాలా, ఇపుడు స్నానాది పుణ్యకర్మల ఫలమును చెప్పెదను. సావధానముగా వినుము. ఒకసారి భక్తిచే గంగాస్నానము నాచరించినచో లక్షతరములను తరింపచేయును. సామాన్య ప్రదేశమున చేయు సంధ్యోపాసన కంటే గంగానదిలో పుత్రులు పితరులకు తర్పణము గావించినచో అక్షయమగు తృప్తిని కలిగించును. తర్పణమునకు ఎన్ని నువ్వులు ఉపయోగింతురో అన్ని వేల సంవత్సరములు పితృదేవులు స్వర్గమున నుందురు. పితృలోకమున నున్న పితృదేవతలందరు గంగాజలముచే తర్పణము గావించిన అమితమగు తృప్తిని పొందెదరు. సఫలమగు జన్మను సత్సాంతానమను కోరువారు గంగానదికి వెళ్ళి దేవతలకు పితరులకు తర్పణము గావించవలయును. దుర్గతిని పొందిన పితరులు కూడా పుత్రులు దర్భలచే తిలలచే గంగాజలముచే తర్పణముగావించిన శ్రీహిరిపదమును పొందెదరు. స్వర్గమున నున్న పితరులు గంగా జలతర్పణముచే మోక్షమును పొందెదరు. అని బ్రహ్మవాక్యము, గుంగా జలముచే ఒక మాసము తర్పణముగావించిన పితృదేవతలందయ సుప్రీతులై సూర్య సన్నిభ##తేజస్కులై అప్సరోగణ సంయుక్తములు, హెమరత్న విభూషితములు, ముక్తా జాలపరిచ్ఛన్నములు, వేణు వీణానినాదితములు భేరీ శంఖమృదంగాది నిర్ఘోషములు గల, ప్రగ్విభూషితములు, గంధర్వ దేహరుచిరములు, దివ్య భోగ సమన్వితములుఅగు విమానములనధిరోహించి బ్రహ్మలోకమును చేరెదరు. ప్రతి దినము గంగానదిలో స్నానమాచరించి శివార్చన చేయువాడు ఒకే జన్మతో మోక్షమును పొందును. అగ్నిహోత్రములు, వేదములు, బహు దక్షిణలగు యజ్ఞములు గంగాలింగ పూజలో కోట్యంశముతో కూడా సమములు కావు. పితరుల నుద్దేశించి కాని దేవతల నుద్దేశించి కాని గంగా జలముచే తర్పణము గావించవలయును. వెంటనే నరకములో నున్న పితరులు కూడా తృప్తి చెందెదరు. మృత్కుంభము కంటే తామ్రకుంభములు శతగుణము, స్వర్ణకుంభములే కోటి గుణము పలము లభించును. ఇట్లు అర్ఘ్యమున నైవేద్యమున, బలిపూజాదులందు యధాక్రమముగా పాత్ర విశేషముచే ఫల విశేషము లభించును. విభవమున్ననూ విస్తరముగా విధినాచరించనివాడు ఆరు%ా ఫలములను పొందకపోగా దేవద్రోహియనబడును. దేవతలను దర్శించుట పుణ్యము. దర్శనము కంటే స్పర్శ విశేష పుణ్యప్రదము. స్పర్శనము కంటే అర్చనము అర్చనము కంటే ఘృత స్నానము విశేష పుణ్యప్రదము. గంగా జలస్నానము ఘృత స్నానసమమని పండితులు చెప్పియున్నారు. తామ్రపాత్రతో మాగధప్రస్థ మాత్ర గంగా జలము పితరులకు దేవతలకు తర్పణ గావించిన పుత్రపోత్రాదులతో స్వర్గమును పొందును. జలము, పాలు, కుశాగ్రములు, ఘృతము, దధి, తేనె, రక్తకరవీరములు, రక్త చందనము అను ఈ అష్టాంగములచే సూర్యునికి అర్ఘ్యము నీయవలయును, గంగాతీరమున శ్రీ మహావిష్ణువును, శివుని, సూర్యుని, దుర్గను, బ్రహ్మను ప్రతిష్ఠించినవాడు, వీరి దేవాలయములను నిర్మించినవాడు. ఇతర తీర్థములలో చేసిన దాని కంటే కోటి కోట్ల రెట్లు ఫలము లభించును. గంగాతీర సంభవమగు మృత్తికచే సలక్షణముగా శివలింగములను ప్రతినిత్యము చేసి ప్రతిష్ఠించి, శక్తి కొలది పూజించి గంగయందు పడవేసినచో అనంత పుణ్యము లభించును. సర్వానంద ప్రదాయిని యగు గంగానది యందు అష్టాక్షరీమంత్రమును జపించిన వానికి మోక్షము చేతిలో నుండును.''ఓం నమోనారాయణాయ' అను మంత్రమును నియమప్వూకముగా గంగానది యందు ఆరుమాసములు జపించువానికి సర్వసిద్ధులు లభించును. గంగానది యందు ''ఓం నమశ్శివాయ'' అను మంత్రమును ఇరువది నాలుగులక్షలు జపించినవాడు సాక్షాత్తు శంకరుడగును. పంక్షాక్షరీ విద్యాసిద్ధుడు సాక్షాత్తు శంకరుడే. అపవిత్రుడైనను పవిత్రుడైనను జపముచే నిష్పాతకుడగును. గంగను పూజించినచో దేవతలందరూ పూజించిన వారగుదురు. కావున సర్వప్రయాత్నముచే గంగానదిని పూజించవలయును. చతుర్భుజ, త్రినేత్ర, సర్వావయవశోభిత, రత్నకుంభసితాంభోజ వరాభయకర, శుభకరి, శ్వేత వస్త్రపరీత, ముక్తామణ విభూషిత, సుప్రసన్న, సువదన, కరుణార్ద్ర హృదయ, సుధాప్లావిత భూపృష్ఠ, సదాత్రైలోక్యనమిత, జలమయియగు గంగను ధ్యానించి పూజించి పుణ్యములను పొందును. ఇట్లు మాసార్ధమైనను నిరంతరముగా పూజించినవాడు దేవ సదృశుడు, కాలాంతరమున అధిక ఫలమును పొందును. వైశాఖ శుద్ధసప్తమినాడు జహ్నుమహర్షి కోపముచే గంగను పానము చేసి మరల కర్ణరంధ్రము నుండి విడిచెను. కావున ఆ ప్రదేశమున గగన మేఖల యగు గంగను పూజించవలయును. వైశాఖమున అక్షయ తిథి యందు , కార్తికమునందు కాని రాత్రి యందు జాగరమున గావించి యవాన్నములచే తిలలచే, విష్ణువును, గంగను శంభుని భక్తి భావముచే పూజించవలయును. ఆట్లే సుగంధములచే, పుష్పములచే, కుంకుమాగురు చందనములచే తులసీ బిల్వపత్రాదులచే మాతులుంగ ఫలాదులచే, విభవానుసారముగా ధూపదీప నైవేద్యములచే పూజించినచో దివ్యవిమానము నధిరోహించి కల్పకోటి శతములు, కల్పకోటి సహస్రములు విష్ణులోకమున విరాజిల్లును, తయవాత భూమండలమును చేరి ధార్మికడగు రాజగును. పుణ్యశీల గుణాన్వితుడై వివిధ భోగములనునుభవించి జ్ఞానవంతుడై దేహాంతమున శివ సాయుజ్యమును పొందును. గంగానదిలో చేసిన యజ్ఞము, దానము, తపము, జపము, శ్రాద్ధము, దేవతార్చనము, కోటి కోటి గుణఫలప్రదమగును. ఇక ఇప్పుడు అక్షయ తృతీయ నాడు గంగాతీరమున యధావిధిగా ఘృతధేనుదానమును గావించిన వానికి కలుగు ఫలమును వినుము.

కల్పకోటి సహస్రాణి కల్పకోటి శతానిచ l సహస్రాదిత్య సంకాశః సర్వకామ సమన్వితః 46

హేమరత్నమయే చిత్రే విమానే హంసభూషితే l స్వకీయ పితృభిః సార్థం బ్రహ్మలోకే మహీయత్‌ 47

తతస్తు జాయతే విప్రో గంగాతీరే ధనాన్వితః l అంతే తు బ్రహ్మవిద్భూత్వా మోక్షమాప్నోత్యసంశయః 48

తదైవ గోప్రదానంచ విధినా కురుతే తు యః గోలోమ సంఖ్యవర్షాణి స్వర్గలొకే మహీయత్‌ 49

జాయతే చ కులే పశ్చా ద్ధనధాన్య సమాకులే l రత్నకాంచన భూపూర్ణే శీలవిద్యాయశోన్వితే 50

స భుక్త్వా విపులాన్భోగా న్పుత్ర పౌత్ర సమన్వితః l మోక్షభాగీ భ##వేన్నూనం నాత్ర కార్యా విచారణా 51

కపిలా యది దత్తా స్యాత్‌ విధినా వేదపారగే l నరకస్థాన్పితౄన్సర్వాన్‌ స్వర్గం నయతి వై తదా 52

భూమిం నివర్తనమితాం గంగాతీరే దదాతి యః l భూవిరేణు ప్రమాణాబ్దం బ్రహ్మ విష్ణుశివాతి గః 53

జాయతేవా పునర్భూమౌ సప్తద్వీప పతిర్బవేత్‌ l భేరీ శంఖాది నిర్ఘోషై ర్గీతవాదిత్రనిః స్వనైః 54

స్తుతిభిర్మాగధానాం సుప్తోసౌ ప్రతిబుధ్యతే l సర్వసౌఖ్యాన్య వాప్యేహ సర్వధర్మపరాయణః 55

నరక స్థాన్పితృన్సర్వా న్ప్రాపయిత్వా దివం తధా l స్వర్గ స్థితాన్మోక్షయిత్వా స్వయం జ్ఞానీ చమోహిని 56

అంతే జ్ఞానాసినా ఛిత్వా అవిద్యాం పంచపర్వికాం | పరం వైరాగ్యమాపన్నః పరం బ్రహ్మాది గచ్ఛతి 57

సప్తహస్తేన దండేన త్రింశద్దండా నివర్తనమ్‌ l త్రిభాగ హీనం గోచర్మ మానమాహ విధిః స్వయమ్‌ 58

గ్రామం గంగా తటే యో వై బ్రహ్మణభ్యః ప్రయచ్ఛతి l బ్రహ్మ విష్ణు శివప్రీత్యై దుర్గాయా భాస్కరస్య చ 59

సర్వదానేషు యత్పుణ్యం సర్వయజ్ఞేషు యత్ఫలం l తపోవ్రతేషు పుణ్యషు యత్ఫలం పరికీర్తితమ్‌ 60

సహస్ర గుణితం తత్తు విజ్ఞేయం గ్రామదాయినః l సూర్యకోటి ప్రతీకాశే విమానే వైష్ణవే పురే 61

క్రీడతే శాంకరే వాపి స్తుతో దేవాదిభిర్ముదా l భూమిరేణ్వబ్ద సంఖ్యాకం కాలం స్థిత్వాచ తత్ర సః 62

అణిమాది గుణౖర్యుక్తే యోగినాం జాయతే కులే l అక్షయాయాం తు యో దేవి స్వర్ణం షోడశమాసికం 63

దదాత ద్విజముఖ్యాయ సోపి లోకేషు పూజ్యతే l అన్నదానా ద్విష్ణులోకం శైవం వై తిలదానతః 64

బ్రాహ్మం రత్న ప్రదానేన గోహిరణ్యన వాసవం l గాంధర్వం స్వర్ణ వాసోభిః కీర్తిం కన్యా ప్రదానతః 65

విద్యయా ముక్తిదం జ్ఞానం ప్రాప్య యాయాన్నిరంజనమ్‌ l గంగాతీరే నరో యస్తు నానావృక్షైః సమన్వితమ్‌ 66

ఆరామం కారయేద్భక్త్యా గృహం చోపవనాన్వితం l కదళీ నారికేరైశ్చ కపిత్థాశోక చంపకైః 67

పనపైర్బిల్వ వృక్షైశ్చ కదంబాశ్వత్థ పాటలైః l ఆమ్రైస్తాలైర్నాగరంగై ర్వృక్షైరన్యైశ్చ సంయుతమ్‌ 68

జాతీవిజయసంయుక్తం తధా పాటల రాజితం l విచితం కారయిత్వైవ మావాసం పుష్పశోభితమ్‌ 69

శివాయ విష్ణవే వాపి దుర్గాయై భాస్కరాయ చ l ప్రయచ్ఛతి తధా భక్త్యా సర్వార్ధం పరికల్ప్య చ 70

తస్య పుణ్య ఫలం వక్ష్యే సంక్షేపాన్నతు విస్తరాత్‌ l యా వంతి తేషాం వృక్షాణాం పుష్పమూలఫలాని చ 71

బీజానిచ విచిత్రాని తేషాం మూలానివైతథా l తావత్కల్ప సహస్రాణి తేషాం లోకేషు సంస్థితిః 72

ఇతి శ్రీ బృహన్నారదీయ పురాణోత్తర భాగే

మోహినీ వసు సంవాదే గంగా మాహాత్య్మే

దానాదివిధివర్ణనం నామైక చత్వారింశత్తమెధ్యాయః

సహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై హెమరత్నమయము చిత్రము హంస భూషితమగు విమానమున పితరులతో కలిసి కల్పకోటి శతములు, కల్పకోటి సహస్రములు బ్రహ్మలోకమున విరాజిల్లును. తరువాత గంగాతీరమున ధనవంతుడగు విప్రునిగా పుట్టును. అంతమున బ్రహ్మజ్ఞానియై మోక్షమును పొందును. అట్లే యథావిధిగా గోదానమును చేసినవాడు గోలోమసంఖ్యా వత్సరములు స్వర్గలోకమున విరాజిల్లును. తరువాత ధన ధాన్య సమాకులము, శీల విద్యాయశోయుతము రత్నకాంచన భూపుర్ణమగు కులమున పుట్టి పుత్రపౌత్ర సమన్వితుడై వివిధ భోగములననుభవించి మోక్షమునునుభవించును. గంగా తీరమున యధావిధిగా వేదపారగుడగు విప్రునికి కపిలగోదానమును గావించినచో నరకములలో నున్న పితరులనందరి స్వర్గమును చేరెదరు. గంగాతీరము నివర్తనమితమగు భూమిని దానముచేసినవాడు భూమిరేణు ప్రమాణాబ్దములు బ్రహ్మ విష్ణు శివలోకములలో నివసించి మరల భూమియందు పుట్టి సప్త ద్వీపాధిపతి యగును. ఇతను నిదురించినచో భేరీ శంఖ్యాది ధ్వనులచే మేల్కాంచును. సర్వధర్మపరారుణుడై సర్వసౌఖ్యముల నునుభవించి, నరకములో నున్న పితరులనందరి స్వర్గమున చేర్చి, స్వర్గమున నున్న వారిని మోక్షమున చేర్చి స్వయముగా జ్ఞానియై పంచపర్వికయగు అవిద్యను జ్ఞాన ఖడ్గముచే ఛేదించి పరమవైరాగ్యమున పొంది పరబ్రహ్మను చేరును. నివర్తనమనగా సప్తహన్తమితమగు దండములు ముప్పది పొడుగు. దీనిలో త్రిభాగహీనమగుచో గోచర్మ ప్రమణాముగా చెప్పబడినది. బ్రహ విష్ణు శివ దుర్గాప్రీతి కొరకు గంగాతీరమున గ్రామదానమును చేసినవాడు సర్వదానములందు, సర్వయజ్ఞములందు తపోవ్రతాది పుణ్యకార్యము లందు కలుగు సమస్త ఫలమునకు వేయిరెట్లధికమగు ఫలమును పొందును. కోటి సూర్యసంకాశమగు విమానమున విష్ణుపురమున, శివపురమున కాని దేవాదుల చే స్తుతించబడుచు క్రీడించును. ఆలోకములలో భూరేణుమిత వత్సరములు నివసించి అణిమాది గుణయుక్తమగు యోగి కులమున పుట్టును. అక్షయ తిధియందు పదునారు మాసమితమగు స్వర్ణమును విప్రునకు దానము చేసినవాడు లోకములందు విరాజిల్లును. అన్నదానము విష్ణులోకము, తిలదానముచే శివలోకము, రత్నదానముచే బ్రహ్మలోకము, గోహిరణ్య దానముచే ఇంద్రలోకము, స్వర్ణ వస్త్రాది దానముచే గంధర్వలోకము, కన్యాదానముచే కీర్తి, విద్యాదానముచే ముక్తి ప్రదమగు జ్ఞానము లభించును. గంగాతీరమున భక్తిచే నానావృక్ష సమన్వితమగు ఆరామమును, ఉపవనముచే కూడి యున్న గృహము నిర్మించి, కదళీనారికేల, కపిత్థ, అశోక చంపక పనస బిల్వకదంబాశ్వత్థ పాటల, ఆమ్ర తాల నాగరుగ వృక్షములచే, ఇతర వృక్షములచే కూడిన, జాతీ విజయ పాటలయుక్తముగా పుష్ప శోభితముగా అవాసమును ఏర్పరిచి శివునకు విష్ణువునకు, దుర్గకు, భాస్కరునికి కాని సర్వార్ధ పరికల్పనమునగా భక్తితో సమర్పించిన వానికి అచట నున్న వృక్షములనున్న పుష్పమూల ఫల భీజములు, వాటి మూలముల సంఖ్యా ప్రమాణ కల్ప సహస్రములు వారి వారి లోకములో నుండును ఇది సంగ్రహముగా చెప్పిన ఫలితాంశము విస్తరముగా కాదు.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహినీ వసుసంవాదమున

గంగా మాహాత్మ్యమున దానాది విధి వర్ణన

మను నలుబది యొకటవ అధ్యాయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page