Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకోనచత్వారింశోధ్యాయః ముప్పదితొమ్మిదవ అధ్యాయము

గంగాస్నానమాహాత్మ్యమ్‌:

వసురువాచ:-

శృణ్యు మోహిని వక్ష్యామి గంగాయా దర్శనే ఫలమ్‌ l యదుక్తం హి పురాణషు మునిభిస్తత్త్వ దర్శిభిః 1

భవింతి నిర్విషాః సర్వా యథా తార్‌క్ష్యస్య దర్శనాత్‌ l గంగాసందర్శనాత్‌ తద్వత్‌ సర్వపాపైః ప్రముచ్యతే 2

సప్తావరాన్‌ సప్తపరాత్‌ పితౄంస్తేభ్యశ్చ యే పరే l పుమాం స్తారయతే గంగాం వీక్ష్య స్పృష్ట్వావగాహ్యచ 3

దర్శనాత్‌ స్పర్శనాత్పానాత్‌ తథా గంగేతి కీర్తనాత్‌ l పుమాన్‌ పునాతి పురుషాన్‌ శతశోథ సహస్రశః 4

జ్ఞానమైశ్వర్యమతులం ప్రతిష్ఠాయుర్యశస్తథా l శుభానామాశ్రమాణాం చ గంగా దర్శనజం ఫలమ్‌ 5

పరహింసాంచ కౌటిల్యం పరదోషాద్యవేక్షణమ్‌ దాంభికత్వం నృణాం గంగా దర్శనాదేవ నశ్యతి 6

పరహింసాంచ కౌటిల్యం పరదోషాద్యవేక్షణమ్‌ l దాంభికత్వం నృణాం గంగా దర్శనాదేవ నశ్యతి 7

ముహుర్మహుస్తథా పశ్యేత్‌ స్పృశేద్వాపి ముహుర్ముహుః l భక్త్యా యదిచ్ఛతి నరః శాశ్వతం పదమవ్యయమ్‌ 8

వాపీ కూపతడాగాది ప్రపాసత్రాదిభిస్తధా l అన్యత్ర యద్భవేత్పుణ్యం తద్గంగాదర్శనాద్భవేత్‌ 9

యత్ఫలం జాయతే పుంసాం దర్శనే పరమాత్మనః l తద్భవేదేవ గంగాయా దర్శనాద్భక్తిభావతః 10

నైమిషే చ కురుక్షేత్రే నర్మదారుయాం చ పుష్కరే l స్నానాత్‌ సంస్పర్శనాసేవ్య యత్ఫలం లభ##తే నరః 11

తద్గంగా దర్శనాదేవ కలౌ ప్రాహుర్మహర్షయః l అథ తే స్మరణస్యాపి గంగాయా భూపభామిని 12

ప్రవక్ష్యామి ఫలం యత్తు పురాణషు ప్రకీర్తితమ్‌ l అశుభైః కర్మభిర్యుక్తా న్మజ్జమానాన్భవార్ణవే 13

పతతో నరకే గంగా స్మృతా దూరాత్సముద్ధరేత్‌ l యోజనానాం సహస్రేషు గంగాం స్మరతి యోనరః 14

అపి దుష్కృత కర్మా హి లభ##తే పరమాం గతిమ్‌ l స్మరణాదేవ గంగాయాః పాపసంఘాతపంజరమ 15

భేదం సహస్రధా యాతి గిరిర్వజ్రహతో యథా | గచ్ఛంస్తిష్ఠన్స్వ పన్థ్యాయన్‌ జాగ్రద్భుంజన్‌ హసన్‌ రుదున్‌ 16

యః స్మరేత్సతం గంగా స చ ముచ్యేత బంధనాత్‌ l సహస్రయోజనస్థాశ్చ గంగాం భక్త్యా స్మరంతి యే 17

గంగా గంగేతి చాక్రుశ్య ముచ్యంతే తేపి పాతకాత్‌ l యే చ స్మరంతి గంగాం చ గంగాభక్తిపరాశ్చయే 18

తేప్యశేషైర్మహాపాపై ర్ముచ్యంతే నాత్ర సంశయః l భవనాని విచిత్రాణి విచిత్రా భరణాః స్త్రియః 19

ఆరోగ్యం విత్తసంపత్తి ర్గంగాస్మరణజం ఫలమ్‌ l మనసా సంస్మరేద్యస్తు గంగాం దూరస్థితో

నరః 20

చాంద్రాయణ సహస్రస్య స ఫలం లభ##తే ధ్రువమ్‌ l గంగా గంగా జపన్నామ యోజనానాం శ##తే స్థితః 21

ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం చ గచ్ఛతి l కీర్తనాన్ముచ్యతే పాపాద్ద ర్శనాన్మంగలం లభేత్‌ 22

అవగాహ్య తథా పీత్వా పునాత్యాసపప్తమం కులమ్‌ l సప్తావరాన్పరాన్‌సప్త సప్తాథపరతః పరాన్‌ 23

గంగా తారయతే పుంసాం ప్రసింగేవాపి కీర్తితా l ఆశ్రద్ధయాపి గంగాయా యస్తు నామానుకీర్తనమ్‌ 24

కరోతి పుణ్యవాహిన్యః సోపి స్వర్గస్య భాజనమ్‌ l సర్వవస్థాం గతా వాపి సర్వధర్మ వివర్జితః 25

గంగాయాః కీర్తనేనైవ శుభాం గతిమవాప్నుయాత్‌ l బ్రహ్మహా గురుహా గోఘ్నః స్పృష్టోవా సర్వపాత కైః 26

గంగాతోయం నరః స్పృష్ట్వా ముచ్యతే సర్వపాతకైః l కదా ద్రక్ష్యామి తాం గంగాం కదా స్నానం లభేహ్యహమ్‌ 27

ఇతి పుంసాభిలషితా కులానాం తారయేచ్చ తమ్‌ l అధ స్నానఫలం దేవి గంగాయాః ప్రవదామి తే 28

యచ్ఛృత్వా సర్వపాపేభ్యో ముచ్యతే నాత్ర సంశయః l స్నాతస్య గంగాసలిలే సద్యః పాపం ప్రణశ్యతి 29

అపూర్వపుణ్యప్రాప్తిశ్చ సద్యో మోహిని జాయతే l స్నాతానాం శుచిభిస్తోయై ర్గాంగేయైః ప్రయతాత్మనామ్‌ 30

వసువు పలికెనుః-

ఓ మోహినీ ! పురాణములలో తత్త్వదర్శులకు మునులు చెప్పిన గంగాదర్శన ఫలమును చెప్పెదను వినుము. గరుడుని దర్శనము వలన సర్పములు విషహీనములగునట్లు గంగాదర్శనము వలన పాపరహితులగుదురు. గంగను దర్శించిన, స్పృశించిన, స్నానమాడినవారికి ముందు ఏడు తరములను, తరువాత ఏడు తరములను వారికంటే ఇతరులను తరింపచేయును. దర్శనస్పర్శన పానముల వలన గంగా నామసంకీర్తనము వలన నూర్లవేల పురుషులను తరింపచేయును. సాటిలేని జ్ఞానము, ఐశ్వర్యము, ప్రతిష్ఠ, ఆయుష్యము, యశస్సు, శుభా శ్రమవాసము గంగాదర్శనము వలన కలుగును. గంగాదర్శనము వల ఇంద్రియ చాంచల్యము, వ్యసనములు, పాపములు, దీనత్వము నశించును. శాశ్వత పదమును కోరు నరుడు గంగను మాటిమాటికి చూడవలయును. మాటిమాటికి తాకవలయును. వాపీకూపతటాకప్రపాదీతర తీర్థములలో కల పుణ్యమంతయూ గంగా దర్శనము వలన కలుగును. పరమాత్మదర్శనము వలన కలుగు పుణ్యము భక్తిచే గంగను దర్శించిన వారికి కలుగును. నైమిష కురుక్షేత్ర నర్మదాపుష్కర స్నాన స్పర్శనాదుల వలన కలుగు ఫలము కలియుగ మున గంగా దర్శనము వలన కలుగును. పురాణములలొ చెప్పబడిన గంగా స్పర్శన ఫలమును ఇపుడు చెప్పెదను. అశుభకర్మలను చేయుచు సంసారసాగరమున మునిగి యుండి నరకమున పడుచున్న వారిని గంగాస్మరణముద్ధరించును. సహస్రయోజనదూరమున నున్ననూ గంగను. స్మరించువాడు దుష్కృత్యములను చేయువాడైనను ఉత్తమ గతిని పొందును. గంగాస్మరణ మాత్రముననే పాపసంఘాత పంజరము వజ్రాయుధముచే కొట్టబడిన పర్వతము వలే వేయి వ్రక్కలుగా చీలిపోవును. నడుచుచు, నిలుచుచు, పడుకొనుచు, ధ్యానించుచు, మేలుకొనుచు, తినుచు, నవ్వుచు, ఏడ్చుచు, ఎప్పుడూ గంగను స్మరించువాడు సంసార బంధవినిర్ముక్తుడగును. సహస్రయోజన దూరమునునున్న వారు కూడా గంగా, గంగా అని ఆక్రోశించుచు గంగనుస్మరించువారు పాపములనుండి విముక్తులగుదురు. గంగను స్మరించుచువారు, గంగా భక్తిపరులు సమస్త మహాపాపముల నుండి విముక్తులగుదురు. గంగను స్మరించు స్త్రీలకు భవనములు, విచిత్రాభరణములు, ఆరోగ్యము, ధన సంపదలు కలుగను. దూరమున నున్న నరుడు మనసుతో గంగను స్మరించువాడు సహస్ర చాంద్రాయణ వ్రత ఫలమును పొందును. శతయోజనముల దూరమున నున్నవాడు కూడా గంగా గంగాయని జపించినచో సర్వపాప వినిర్ముక్తుడై విష్ణులోకమును చేరును. గంగా కీర్తనము వలన పాపములు తొలగును. దర్శనమువలన శుభములు కలుగును. స్నానమాడి, గంగా జలమును పానము చేసినచో ఏడు తరములకు ముక్తి కలుగును. ప్రసంగవశమున గంగను కీర్తించిననూ ముందు ఏడు తరములను, తరువాత ఏడు తరములను ఆ తరువాత ఏడు తరములను కూడా తరింపచేయును. అశ్రద్ధచేనైనను పుణ్యవాహినియగు గంగనామాను కీర్తనము చేసినవాడు కూడా స్వర్గమును పొందును. సర్వావస్థలను పొందినవాడు, సర్వధర్మవర్జితుడు, కూడా గంగానామసంకీర్తనము వలన శుభకరమగు గతిని పొందును. బ్రహ్మఘాతకుడు గురుఘాతకుడు, గోఘ్నుడు, సర్వపాతక సంస్పృష్టుడు కూడా గంగా జలమును స్పృశించి సర్వపాతక వినిర్ముక్తుడగును. నేనెపుడు గంగను దర్శించగలను, ఎపుడు గంగలో స్నానము చేయగలను అని అభిలషించువారి కులమును గంగ తరింపచేయును. ఇక ఇపుడు గంగాస్నాన ఫలమును చెప్పెదను. దీనిని వినినంతనే సర్వపాప వినిర్ముక్తుడగును. గంగా స్నానము చేసిన వానికి వెంటనే పాపములు నశించును. అపూర్వపుణ్యము కూడా లభించును. గంగా పవిత్ర జలములలో నిశ్చలమనస్సుచే స్నానము చేసినవారికి సర్వ శుభములు కలుగును.

వ్యుష్టిర్భవతి యా పుంసాం న సా క్రతుశ##తైరపి l అపహత్య తమస్తీవ్రం యథా భాత్యుదయే రవిః 31

తథాపహత్య పాప్మానం భాతి గంగాజలోక్షితః | ఏకేనైవాపి విధినా స్నానేన నృ పసుందరి 32

ఆశ్వమేధఫలం వర్త్యో గంగాయాం లతే ధ్రువమ్‌ l అనేక జన్మసంభూతం పుంసః పాపం ప్రణశ్యతి 33

స్నానమాత్రేణ గంగాయాః సద్యః స్యాత్పుణ్యభాజనమ l అన్యస్థానకృతం పాపం గంగాతీరే వినశ్యతి 34

గంగాతీరే కృతం పాపం గంగా స్నానేన నశ్యతి l రాత్రౌ దివా చ సంధ్యాయాం గంగాయాంతు ప్రయత్నతః 35

స్నాత్వాశ్వమేధజం పుణ్యం గృహేప్యుద్ధృ త్య తజ్జలైః l సర్వతీర్థేషు యత్పుణ్యం సర్వేష్వాయతనేషుచ 36

తత్ఫలం లభ##తే మర్త్యో గంగాస్నానాన్న సంశయః l మహాపాతక సంయుక్తో యుక్తో వా సర్వపాతకైః 37

గంగాస్నానేన విధివన్ము చ్యతే సర్వపాతకైః గంగాస్నానాత్పరం స్నానం న భూతం న భవిష్యతి 38

విశేషతః కలియుగే పాప హరతి జాహ్నవీ l నిహత్య కామజాన్‌ దోషానే కాయవాక్చిత్త సంభవాన్‌ 39

గంగాస్నానేన భక్త్యాతు మోదతే దివి దేవవత్‌ l వర్షం స్నాతి చ గంగాయాం యో నరో భక్తి సంయుతః 40

తస్యస్యాద్వైష్ణవే లోకే స్థితిః కల్పం న సంశయః l ఆమృత్యుం స్నాతి గంగాయాం యో నరో నిత్యమేవ చ 41

సమస్త పాప నిర్ముక్తః సమస్త కుల సంయుతః l సమస్త భోగ సంయుక్తో విష్ణులోకే మహీయతే 42

పరార్థద్వితయం యావ న్నాత్ర కార్యా విచారణా l గంగాయాం స్నాతి యో మర్త్యో నైరంతర్యేణ నిత్యదా 43

జీవన్ముక్తిః స చాత్రైవ మృతో విష్ణుపదం వ్రజేత్‌ l ప్రాతః స్నానాద్దశగుణం పుణ్యం మధ్యందినే స్మృతమ్‌ 44

సాయంకాలే శతగుణం అనంతం శివసన్నిధౌ l కపిలాకోటిదానాద్ది గంగాస్నానం విశిష్యతే 45

కురుక్షేత్ర సమా గంగా యత్ర తత్రావగాహితా l హరిద్వారే ప్రయాగే చ సింధుసంగే ఫలాధికా 46

యే మదీయాంశు సంతప్తే జలే తే స్నాంతి జాహ్నవి l తే భిత్వా మండలం యాంతి మోక్షం చేతి రవేర్వచః 47

యో గృహే స్వేస్థితోపి త్వాం స్నానే సంకీర్తయిష్యతి l సోపి యాస్యతి నాకం వై ఇత్యాహ వరుణశ్చ తామ్‌ 48

ఇతి శ్రీ బృహన్నారదీయపురాణ

ఉత్తరభాగే

మోహినీచరితే

గంగాస్నానమాహాత్మ్యం

నామ ఏకోనచత్వారింశోధ్యాయః !!

పవిత్ర గంగా జలములలో స్నానమాడువారికి కలుగు ఫలము నూరు యాగములను చేసిన వారికి కూడా కలుగదు. గంగా జలముచే ప్రోక్షితుడగువాడు ఉదయకాల సూర్యుడు తీవ్రాంధకారమును నశింప చేయునట్లు పాపములను నశింపచేయును. గంగా జలమున ఒక మారు స్నానమాచరిచినవాడు కూడా అశ్వమేధయాగ ఫలమును పొందును. గంగా స్నానమాత్రమున అనేక జన్మ సంచితములకు పాపములు నశించి పుణ్యభాజనులగుదురు. ఇతర ప్రదేశములలో చేసిన పాపము గంగా తీరమున నశించును. పగలు సంధ్యవేళ, రాత్రి పూట ప్రయత్నముచే గంగా స్నానమును చేసినవాడు, గంగా జలమును తీసుకొని వచ్చి ఇంట్లో స్నానమాడిన వాడు కూడా అశ్వమేధ యాగ ఫలమును పొందును గంగాస్నానము వలన సర్వతీర్థగత పుణ్యమును, సర్వదేవాలయ పుత్యమును పొందకలుగును. మహాపాతక యుతుడైనను, సర్వపాతక యుక్తుడైననూ యాధావిధిగా గంగా స్నానము నాచరించినవాడు సర్వపాతక వినిర్ముక్తుడగును. గంగా స్నానమునకు మించిన ఫలము లేదు. ఉండబోదు. కలియుగమున గంగా స్నానము విశేషముగా పాపములను హరించును. భక్తిచే గంగా స్నానమును చేసినవారు కామజ దోషములను మనో వాక్కాయ దోషములను హరించి స్వర్గమున దేవతల వలే ఆనందింతురు. గంగా జలమున ఒక సంవత్సరము స్నానము చేయువాడు విష్ణులోకమున ఒక కల్పకాలము నివసించును. మరణ పర్యంతము ప్రతిదినము గంగాస్నానము చేయువాడు విష్ణులోకమున ఒక కల్పకాలము నివసించును. మరణ పర్యంతము ప్రతిదినము గంగా స్నానము చేయువాడు సమస్త పాప వినిర్ముక్తుడై సమస్త కుల హితముగా సమస్త భోగముల ననుభవించి విష్ణులోకమున రెండు పరార్థములు విరాజిల్లును. ఇచట విచారించవలసిన పనిలేదు. నిత్యము నిరంతరము గంగా స్నానమును చేసినవాడు ఇచటనే జీవన్ముక్తుడగును. మరణించిన పిదప పరమ పదమును చేరును. ప్రాత్తకాల స్నానము కంటే మధ్యాహ్న స్నానము దశగుణ ఫలమను కల్పించును. మధ్యాహ్న స్నానమున కంటే సాయంకాల స్నానము శతగుణ ఫలము నిచ్చును. శివసన్నిధిలో గంగా స్నానమాచరించిన అనంత ఫలప్రదము. కోటి కపిలాదాముల కంటే గంగాస్నానము అనంత ఫలప్రదము. కురుక్షేత్ర సమము గంగా జలము, హరి ద్వారమున ప్రయాగలో సాగరసంగమున విశేషించి ఫలప్రదము, నాకిరణములచే తపించబడిన గంగా జలమున స్నానమాడినవారు నా మండలమును ఛేదించుకొని మోక్షమును చేరెదరని సూర్యుని వాక్యము . ఇంట్లో ఉన్నవామ కూడా స్నాన సమయము గంగను స్మరించినచో స్వర్గమును పొందునని వరుణుడు చెప్పెను.

ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున

ఉత్తర భాగమున మోహిని చరితమున

గంగా స్నానమాహాత్మ్యమను

ముప్పది తొమ్మిదవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page