Sri Naradapuranam-3    Chapters    Last Page

పంచవింశోధ్యాయః = ఇరువదియైదవ అధ్యాయము

మోహినీ చరితమ్‌

వసిష్ఠ ఉవాచ :-


తద్వాక్యం బ్రాహ్మణా శ్శ్రుత్వా మోహిన్యా సముదీరితమ్‌ | తధ్యమిత్యేవ ముక్త్వాతు రాజానం వాక్యమ బ్రువన్‌ || 1 ||
వసిష్ఠ మహర్షి పలికెను :-
మోహని పలికిన మాటలను వినిన బ్రాహ్మణులు నీవు చెప్పినది నిజమే. యనిరి. తరువాత రాజుతో ఇట్లు పలికిరి.
బ్రాహ్మణా ఊచు:-

యస్త్వయా నృపతే పుణ్యః కృతో
యం శపథః కిల | ఏకాదశ్యాం నభ్యోక్తవ్యం పక్షయోరు భయోరపి || 2||
నకృత శ్శాస్త్ర దృష్ట్యాతు స్వబుద్ధ్యైవ ప్రకల్పితః | సాగ్నీనాం ప్రాశనం ప్రోక్త ముభయో స్సంధ్యయోః కిల || 3 ||
హోమోచ్ఛిష్ట ప్రభోక్తరా స్త్రయో వర్ణాః ప్రకీర్తితాః | విశేషాద్భూమి పాలానాం కథం యుక్తముపోషణమ్‌ || 4 ||

సర్వదోద్యత శస్త్రాణాం దుష్ట సంయమినాం ప్రభో! శాస్త్రతో
శాస్త్రతో వాపి యస్త్వయా శపధః కృతః || 5 ||
పరిపూర్ణో భవత్వద్య వాక్యేన హి ద్విజన్మనామ్‌ | వ్రత భంగో నతే
స్తీహ భుంక్ష్వ విప్ర సమన్వితః || 6 ||
పరితాపో నతే కార్యో విప్రవాక్య మహత్తరమ్‌ | యో
న్యధా మన్యతే వాక్యం విప్రాణాం నృపసత్తమ || 7 ||
స యాతి రాక్షసీం యోనిం జన్మాని దశ పంచ చ | తుచ్ఛ్రుత్వా వచనం రౌద్రం రాజా కోప సమన్వితః || 8 ||
ఉవాచ స్ఫురమాణోష్ఠ స్తాన్విప్రాన్ల్నక్ణయాగిరా | సర్వేషామేవ భూతానాం భవంతో మార్గదర్శినః || 9 ||

యతీనాం విధవానాంచ శ్లోకో
యం పఠ్యతే ద్విజాః | విమార్గ గామినాం చైత న్మతం న సాత్వతాం క్వచిత్‌ || 10 ||
యద్భవద్భి స్సముద్దిష్టం రాజ్ఞాం నోపోషణం స్మృతమ్‌ | తత్ర వాక్యాని శృణుత వైష్ణవాచార లక్షణ || 11 ||
న శంఖేన పి బేత్తోయం నహన్యాత్కూర్మ సూకరౌ | ఏకాదశ్యాం న భోక్తవ్యం పక్షయో రుభయోరపి || 12 ||
న పాతవ్యం హి మద్యంతు నహన్తవ్యో ద్విజాః క్వచిత్‌ | క్రీడేన్నాక్షైస్తు ధర్మజ్ఞో నాశ్నీయాద్ధరి వాసరే || 13 ||
అభక్ష్య భక్షణం పాపం పరదారాభి మర్శనమ్‌ | ఏకాదశ్యాం భోజనం చ పతనసై#్యవ కారణమ్‌ || 14 ||
అకార్య కరణం కృత్వా కింజీవేచ్ఛరదాం శతమ్‌ | కోహి సంచేష్ట మానస్తు భునక్తి హరివాసరే || 15 ||

చతుష్పదేభ్యో
పి జనై ర్నాన్నం దేయం హరేర్దినే | ఉత్తరా శాస్ధితై ర్విపై#్ర ర్విష్ణు ధర్మ పరాయణౖః || 16 ||
సో
హం కథం కరోమ్యద్య అభక్ష్యస్య తు భక్షణమ్‌ | నోపక్షీణ శరీరోహం నామయావీ ద్విజోత్తమాః || 17 ||
స కథం హి వ్రతం త్యక్ష్యే విమార్గస్థ ద్విజోక్తితః | ధర్మభూషణ సంజ్ఞేన రక్ష్యమాణ ధరాతలే || 18 ||

నచ రక్షా విహీనో
హం శత్రుః కోపి నమే స్తిచ | ఏవం జ్ఞాత్వా ద్విజశ్రేష్ఠా వైష్ణవ వ్రత శాలినః || 19 ||
భవద్భి ర్నో చితం వక్తుం ప్రతికూలం వ్రతాపహమ్‌ | అసంపరీక్ష్య యే దద్యుః ప్రాయశ్చిత్తం ద్విజాతయః || 20 ||

తేషామేవ హి తత్పాపం స్మృతి వైకల్య సంభవమ్‌ | దేవో వా దానవో వాపి గంధర్వో రాక్షసో
పివా || 21 ||
సిద్దో వా బ్రాహ్మణో వాపి పితాస్మాకం స్వయం వదేత్‌ | హరిర్వాపి హరోవాపి మోహినీ జనకో
పి వా || 22 ||
దినకృల్లోకపాలోవా నోభ్యోక్ష్యే హరివాసరే | యో హి రుక్మాంగదో రాజా విఖ్యాతో భూతలే ద్విజాః || 23 ||
సత్యప్రతిజ్ఞాం విఫలాం న కరోతి కదాచన | ద్యుపతేః క్షీయతే తేజో హిమవాన్పరి వరత్తే || 24 ||
జలధిశ్శోషమాయాతి పావక శ్చోష్ణతాం త్యజేత్‌ | తధాపి నత్యజే విప్రా వ్రతమే కాదశీ దినే || 25 ||

ప్రసిద్ధిరేషా భువనత్రయే
పి ఆరట్యతే మే పటహేన విప్రాః |
గ్రామేషు దేశేసు పరేషు వాపి యే భుంజతే రుక్మ విభూషణస్య || 26 ||
దండ్యాశ్చ వధ్యాశ్చ సపుత్రకాస్తే న చాపి వాసో విషయే హి తేషామ్‌ |
హరేర్దినే సర్వమఖ ప్రధానే పాపాపహే ధర్మ వివర్ధనే చ || 2 7 ||

మోక్ష ప్రదే
ధర్మ నికృంతనాఖ్యే తేజో నిధే సర్వజన ప్రరూఢే |
ఏవం విధే ప్రోద్గత ఏవ శ##బ్దే యద్యస్మి భోక్తా వృజి నస్యకర్తా || 28 ||
అమేధ్య లిప్తః పటహో భ##వేత్తదా సంఛాదితో నీలమయేన వాససా |
ఉత్పాద్య కీర్తిం స్వయమేవ జన్తు ర్ని కృంతతి ప్రాణ భయాచ్చ పాపాత్‌ || 29 ||
యస్తస్య వాసో నిరయే యుగానాం షష్ఠిర్భవేద్వా క్రిమిందశ సంజ్ఞే |
వృధాహి సుతా మమ సాజనిత్రీ భ##వేన్ని రాశా ద్విజ పితృదేవాః || 30 ||
వైవస్వతో హర్ష ముపాశ్రయేచ్చ సలేఖకో మే వ్రత భంగ ఏవ |
కిం తేన జాతేన దురాత్మనా హి దదాతి హర్షం రిపుసుందరీణామ్‌ || 31 ||
కుకర్మణా పాపరతిః కుజాతిః సర్వస్య నాశీత్వ శుచిస్స మూఢః |
న మన్యతే వేద పురాణ శాస్త్రా నంతే పురీం యాతి దినేశ సూనోః || 32 ||
కృత్వైవ వాంతిం పునరత్తి తాం య స్దద్వత్ర్పతి జ్ఞావ్రత భంగకారీ |
వేదా న శాస్త్రం న చతత్పురాణాం నచ చాపి సన్త స్స్మృతయో న చ స్సుః || 33 ||

యే మాధవస్య ప్రియతకృత్యయోగే వదన్తి శుద్దే
హ్ని భుజి క్రియాంతు |
శ్రాద్ధేన తేనాపి న చాస్తి తృప్తిః పితుశ్చ చీర్ణేన హరేర్దినేతు || 34 ||
వ్రతేన యద్విష్ణు పద ప్రదేన సాకం క్షయాహేన వదన్తుమూఢాః || 35 ||
ఏతచ్ఛ్రుత్వాతు తద్వాక్యం మోహినీ జ్వలితాం తరా | కోప సంరక్త నయాన భర్తారం పర్యభాషత || 36 ||
కరోషి చేన్నమే వాక్యం ధర్మబాహ్యో భవిష్యసి | ధర్మ బాహ్యోహి పురుషః పాంశు నాత తుల్యతాం వ్రజేత్‌ || 37 ||
పాంసునా పూర్యతే గర్తః స గర్త ఖనకోభ##వేత్‌ | త్వయా మమార్పితః పాణి ర్వరాయ పృధివీపతే || 38 ||
తా ముల్లంఘ్య ప్రతిజ్ఞాం స్వాం పాలయిష్యసి నోయది | కృత కృత్యా తదా యాస్యే ప్రాప్తో ధర్మో మయా తవ || 39 ||
న చాహం తే ప్రియా భార్యా న చ త్వం మే పతిర్నృప ! | ఉపధానం కరిష్యామి స్వకం బాహుం న తే యుధి || 40 ||
ధిక్‌ త్వాం ధర్మ క్షయకరం స్వవచో లోపకారకమ్‌ | వ్లుెచ్ఛేష్వపి న దృశ్యేత త్వాదృశో ధర్మలోపకః || 41 ||
సత్యాచ్చలిత మద్య త్వా పరిత్యక్ష్యే సుపాసినమ్‌ | ఏవ ముక్త్వా వరారోహా హ్యుదతిష్ఠత్త్వరాన్వితా || 42 ||
యధా సతీహరం త్యక్త్వా దివ్యాభరణ భూషితా | ప్రస్థితా సా తదా తన్వీ భూసురైశ్చ సమన్వితా || 43 ||
వరం మద్యస్య సంస్పర్శో నాస్య సంగో నృపస్యవై | వరం నీలాంబర స్పర్శో నాస్య ధర్మచ్చుతస్యహి || 44 ||
ఏవం హి మోహినీ రుష్టా ప్రలపంతీ తదా భృశమ్‌ | గౌతమాది సమాయుక్తా నిర్జగామ గృహాద్బహి || 45 ||
హా తాత ! హా జగన్నాధ ! సృష్టి స్థిత్యంత కారక ! | ఇత్యేవ శబ్దం క్రోశంతీ బ్రహ్మణో మానసోద్భవా || 46 ||
ఏతస్మిన్నేవ కాలేతు వాజరాజం సమాస్థితః | అటిత్వా సకలా ముర్వీం సంప్రాప్తో ధర్మ భూషణః || 47 ||

సంముఖో
భూజ్జనన్యాస్తు త్వరాయుక్తో విమత్సరః | కర్ణాభ్యాం తస్య శబ్దోసౌ విశ్రుతః పితృవత్సలః || 48 ||
మోహినీ వక్త్ర సంభూతో విప్ర వాక్యోప బృంహితః | ధర్మాంగదో ధర్మమూర్తిః రుక్మాంగద సుత స్తదా || 49 ||
అవరుహ్య హ యాత్తూర్ణం య¸° తాత పదాంతికే | పునరుత్ధాయ విప్రేన్ద్రా న్ననామ విహితాంజలిః || 50 ||
తతశ్శీఘ్ర గతిం దృష్ట్వా మోహినీం రుష్ట మానసామ్‌ | ఆలక్ష్య తరసా మాతః ప్రాహ రాజ న్కృతాంజలిః || 51 ||
కేనావమానితా దేవి ! కథం రుష్టా పితుః ప్రియే | ఏతైర్ద్వి జేన్ద్రై స్సహితా క్వత్వం సంప్రస్ధి తాధునా || 52 ||
ధర్మాంగద వచ శ్ర్శుత్వా మోహినీ వాక్యమ బ్రవీత్‌ | పితా తవానృతీ పుత్ర కరో యేన వృధా కృతః || 53 ||
యః కర్తా సుకృతం భూరి రక్తా శోకాం కృతి స్థ్సితః | ధ్వజాంకుశాంకిత శ్రీమా న్దక్షిణః కనకాం గదః || 54 ||
రుక్మాంగదేన తే పిత్రా న చాహం వస్తు ముత్సహే || 55 ||
బ్రాహ్మణులు పలికిరి :-
ఓ రాజా? రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించరాదని నీవు చేసిన శపథము శాస్త్ర దృష్టిచే చేసినది కాదు. నీ బుద్ధిచే కల్పించుకొనినదే. అగ్నిహోత్రులకు రెండు పూటలా భోజనము విధించబడినది. హోమ శేషమును భుజించువారు మూడు వర్ణముల వారని చెప్పబడినది. విశేషించి రాజులకు ఉపవాసము ఉచితమైనది కాదు. క్షత్రియులు ఎపుడూ దుష్టులను శాసించుటకు శస్త్రమును ధరించి యుండవలయును. శాస్త్ర విధిగాకాని అశాస్త్ర విధిగాకాని నీవుచేసిన శపథము ఈనాడు బ్రాహ్మణ వాక్యము వలన పరిపూర్ణమగును. నీకిచట వ్రత భంగము జరుగదు. బ్రాహ్మణులతో కలిసి భుజించుము. నీవు విచారించవలదు. బ్రాహ్మణ వాక్యము అన్నిటిలో ఉత్తమము. బ్రహ్మణ వాక్యమును వేరుగా భావించు వాడు పదిహేను జన్మలు రాక్షసునిగా పుట్టును. ఇట్లు బ్రాహ్మణుల పలికిన రౌద్ర వాక్యములను వినిన రాజు కోపము కలవాడై పెదవు లదరుచుండగా వినయముగా బ్రాహ్మణులతో ఇట్లు పలికెను. ప్రాణులందరికి మీరు మార్గదర్శకులు. యతులకు విధవలకు ఈ శ్లోకము చెప్పబడినది. మీరుచెప్పినది చెడు దారిన నడుచు వారిది కాని సాత్త్వికులది కాదు. రాజులకు ఉపోషణము ఉచితము కాదని మీరు చెప్పిన దానికి వైష్ణవాచార లక్షణమున ఇట్లు చెప్పబడినది. వినుడు. శంఖముతో నీరు త్రాగరాదు. కూర్మమును, సూకరమును చంపరాదు. రెండు పక్షములలోని ఏకాదశులలో భుజించురాదు. మద్యపానము చేయరాదు. బ్రాహ్మణుని చంపరాదు. ధర్మజ్ఞులు పాచికలాడరాదు. ఏకాదశినాడు భుజించరాదు. తినరాని దానిని తినుట పాపము. పరదారాభి మర్శనము పాపము. ఏకాదశీ భోజనము పతనమునకే కారణము. చేయరాని పనులను చేయుచు నూరు సంవత్సరములు బ్రతుకనేల? చేతనుడగు మానవుడు ఎవడు ఏకాదశినాడు భుజించును? ఏకాదశినాడు చతుష్వాద జంతువులకు కూడా జనులు ఆహారము నీయరాదు. ఉత్తర దిక్కున నుండు బ్రాహ్మణులు విష్ణు ధర్మపరాయణులు జంతువులకు కూడా ఏకాదశినాడు ఆహారము నీయరు. కావున నేను నాడు తినరాని దానినెట్లు తిందును? నా శరీరము క్షీణించలేదు. నాకే రోగము లేదు. అట్టినేను బ్రాహ్మణుల మాటలలతో విమార్గమున సంచరించి వ్రతమునెట్లు విడుతును? ఈ రాజ్యమును ధర్మాంగదుడు రక్షించుచున్నాడు. నేను రక్షణలేని వాడను కాను. నాకు శత్రువెవ్వరూ లేరు. కావున ఇట్లు తెలసి విష్ణువ్రతము నాచరించు నాతో వ్రతభంగమును చేయు మాటలు మాట్లాడరాదు. చక్కగా పరిశీలించక బ్రాహ్మణులు ప్రాయశ్చిత్తమును బోధించినచో స్మృ
తిని అతిక్రమించిన పాపము బోధించిన బ్రాహ్మణులదే యగును. దేవతలు కాని దానవులు కాని, గంధర్వులు, రాక్షసులు, సిద్ధులు, బ్రాహ్మణులు స్వయముగా నా తండ్రి చెప్పిననూ, హరిహర బ్రహ్మలు, సూర్యడు, లోకపాలకులు చెప్పిననూ ఏకాదశినాడు భుజించను. ఓ బ్రాహ్మణోత్తములారా? ప్రాఖ్యాతి గాంచిన రుక్మాంగద మహారాజు ఎన్నడూ సత్యప్రతిజ్ఞను విఫలము గావించజాలడు. సూర్యుని తేజస్సు తరుగవచ్చును. హిమవంతుడు మారవచ్చును. సముద్రము ఇంకి పోవచ్చును. అగ్ని వేడిన విడుచును గాక. నేను మాత్రము ఏకాదశీ వ్రతమును వీడజాలను. ఈ మూడు లోకములలో ఇది ప్రసిద్ధము. నా రాజ్యమును పటహముతో గ్రామములలో, పట్టణములలో, ఇతరుల దేశములందు కూడా రుక్మాంగదుని రాజ్యమున ఏకాదశినాడు భుజించువారు సపుత్రులుగా దండించబడుదురు. వధించబడుదురు. దేశ బహిష్కృతులగుదురు. సర్వయజ్ఞ ప్రధానము, పాపనాశకము, ధర్మ, వర్ధకము, మోక్షప్రదము, అధర్మచ్ఛేదకము, తేజోనిధి, సర్వజన ప్రసిద్ధమగు శ్రీ హరి వాసరమున భుజించరాదని ప్రకటించుచుండగా నేను భుజించినచో పాపకారినగుదును. నా పటహమునకు కూడా పాపమంటును. నల్లని వస్త్రముతో కప్పబడును. ప్రాణి తాను సంపాదించుకొనిన కీర్తిని ప్రాణభయముతో కాని పాపబుద్ధితో కాని స్వయముగా నశింపచేయువాడు క్రిమిదంశమను నరకమున అరువది యుగములు నివసించును. నా తల్లి నన్ను వ్యర్ధముగా ప్రసవించినదగును. బ్రాహ్మణులు పితృదేవతలు నిరాశ##చెందెదరు. యమధర్మరాజు కూడా సంతోషించును. నా వ్రత భంగమును చిత్రగుప్తుడు వ్రాయును. శత్రు స్త్రీలకు ఆనందమును కలిగించువాడు పుట్టక వ్యర్ధమే. చెడు కర్మచేయువాడు, పాపము నందాసక్తి కలవాడు, కుజాతి అందరిని నశింప చేయువాడు, అపవిత్రుడుగా నుండువాడు పరమ మూర్ఖుడు. వేద పురాణ శాస్త్రములను గౌరవించని వాడు అంతకాలమున యమపురికి వెళ్ళును. వ్రతమును భంగపరుచుకొనువాడు వాంతి చేసుకొనిన దానినే మరల భుజించు వానితో సమానము. పరమ పవిత్రమగు ఏకాదశినాడు భోజనము చేయమని చెప్పువారు వేదములను, శాస్త్రములను పురాణమును సత్పురుషులను స్మృతులను గౌరవించనివారు. అట్టివారు చేయు శ్రాద్ధముతో తృప్తిచెందరు. విష్ణుపదమును ప్రసాదించు ఏకాదశీ వ్రతమును ఆచరించవలదని మూర్ఖులు మాత్రమే చెప్పెదరు. ఇట్లు పలకిన రాజు మాటలను వినిన మోహిని మనసు మండగా, కోపముతో ఎఱ్ఱబారిన కనులు గలదై భర్తతో ఇట్లు పలికెను. నా మాటను పాటించినచో ధర్మ బాహ్యుడవగుదువు. ధర్మబాహ్యుడగు పురుషుడు ధూళికణముతో సముడగును. ఇంకా చెప్పవలయునన్నచో ధూళికణము కన్న హీనమగును. ధూళికణములతో గర్తము పూరించబడును. కాని ధర్మ బాహ్యుడు గర్తమును త్రవ్వు వాడగును. నాకు వరమునిచ్చుటకు నాకిచ్చిన చేతిని కాదని నీ ప్రతిజ్ఞను నీవే పాలించ
నిచో నీ ధర్మమును పొందిన నేను కృతకృత్యురాలనై వెళ్ళిపోదును. ఇక నేను + నీకు ప్రియమగు భార్యను కాను. నీవు నాకు భర్తవు కావు. ఇక నేను నా బాహువును నీకు ఉపధానముగా చేయజాలను. స్వ వాక్యమును లోపింపచేసి ధర్మక్షయము చేయు నీకు నింద నీ వంటి ధర్మలోపకారకుడు వ్లుెచ్ఛులలో కూడా ఉండడు. సత్యమును తప్పి పాతకుడవగు నిన్ను ఈనాడు వదులుచున్నాను. మోహిని ఇట్లు పలికి త్వరలో లేచెను. హరుని విడిచి వెళ్ళుసతీ దేవివలె మోహినీదేవి బ్రాహ్మణులతో కలిసి బయలుదేరెను. మద్యమును స్పృశించుట మేలుకాని ఇతని సంగము యుక్తము కాదు. నీలాంబరమును స్పృశించవచ్చును కాని ధర్మచ్చుతుడగు ఈ రాజుతో ఉండరాదు. ఇట్లు కోపించిన మోహిని పలుకుచు గౌతమాదులతో కలసి ఇంటి నుండి బయటికి వెడలెను. ఓ తండ్రీ ! ఓ జగన్నాథా ! ఓ సృష్టి స్థితి లయములను చేయువాడా? అని బ్రహ్మపుత్రిక ఆక్రోశించుచుండెను. ఇదే సమయమున ఉత్తమాశ్వము నధిరోహించి భూమండలమంతయూ పర్యటించి ధర్మాంగద మహారాజు అశ్వమును దిగి తండ్రి పాదముల చెంతకు వెళ్ళి లేచి చేతులు జోడించి నమస్కరించెను. అంతలోనే కోపముతోనున్న మోహినిని చూచి త్వరగా చేతులు జోడించి ఇట్లు పలికెను. ఓ తండ్రి ప్రియురాలా? నిన్నెవరు అవమానించిరి? ఏల కోపించితివి? ఈ బ్రాహ్మణులతో కలిసి ఎటకు బయలుదేరుచున్నావు? ధర్మాంగదుని మాటలనువ విని మోహిని ఇట్లు పలికెను. నీ తండ్రి అసత్యవాక్యుడు. వ్యర్థముగా నాకు చేయిచ్చెను. ఎంతో సుకృతమును చేసిన నీ తండ్రి రక్తా శోకాకారముతో కదలక నిలిచెను. మీ తండ్రియగు రుక్మాంగదునితో నేను కలిసి ఉండదలచుకోలేదు.
ధర్మాంగద ఉవాచ: -
యద్ర్భవీషి వచోదేవి ! తత్కర్తాహం న సంశయః | మా కోపం కురు మాతస్త్వం నివర్తస్వ పితుః ప్రియే || 56 ||
ధర్మాంగద మహారాజు పలికెను :-
నీవు చెప్పిన దానిని నేను చేతును. ఓ తల్లీ ! నీవు కోపించకుము. మరలిరమ్ము.
మోహిన్యువాచ: -
అనేన సమయే నాహం త్వత్పిత్రా మందరా చలే | కృతా భార్యా శివస్సాక్ష్యే స్థితో యత్ర సురాధిపః || 57 ||
సమయా త్సచ్యుత స్సమ్యక్‌ పితా తే రుక్మ భూషణః | న ప్రయచ్ఛతిమే దేయం తస్య వృద్ధిం విచింతయే || 58 ||
న యాచే కాంచనం ధ్యానం హస్త్యశ్వం గ్రామవానసీ | యేన తస్య భ##వేద్ధాని ర్నయా చే తన్నృపాత్మజ || 59 ||
యేనాసౌ ప్రీణ యేద్దేహం స్వకీయం దేహినాం వర | తన్మయా ప్రార్ధితం పుత్ర స మోహా న్న ప్రయచ్ఛతి || 60 ||
తసై#్యవ చోప కార రాయ శరీరస్య నృపాత్మజ! | యాచితస్సుఖహేతోస్తు మయా నృపతి సత్తమః || 61 ||
సత్యచ్యుతం నిష్ఠుర వాక్య భాషిణం విముక్త ధర్మం త్వనృతం శఠంచ
పరిత్యజేయం జనకం తవాధమం నైవ స్థితిర్యే భవితా హి తేన || 63 ||

తచ్ఛ్రుత్వా మోహినీ వాక్యం పుత్రో ధర్మాంగదో
బ్రవీత్‌ | మయి జీవతి తా తోమే న భ##వేదనృతీ క్వచిత్‌ || 64 ||
నివర్తస్వ వరారోహే కరిష్యే
హం తవేప్సితమ్‌ | పిత్రా మే నా నృతం దేవి! పూర్వముక్తం కదాచన || 65 ||
స కథః మయి జాతే తు వదిష్యతి మహీపతిః | యస్య సత్యే స్థిత్యే లోకా స్సదేవాసుర మానుషాః || 66 ||
వైవస్వత గృహం యేన కృతం శూన్యం హి పాపిభిః | విజృంభ##తే యస్య కీర్తి ర్వ్యాప్తం బ్రహ్మండ మండలమ్‌ || 67 ||
స కథం జాయతే భూపో మిధ్యా వచన సంస్థితః | అశ్రుతం భూపతేర్వాక్యం పరోక్షే శ్రద్దధే కథమ్‌ || 68 ||
మమోపరి దయాం కృత్వా నివర్తస్వ శుభాననే | ఏతద్ధర్మాంగదేనోక్తం వాక్యమాకర్ణ్య మోహినీ || 69 ||
న్యవతర్త మహీపాల పుత్ర స్కంధావలంబినీ | యత్ర రుక్మాంగదశ్శేతే మృత కల్పో రవిప్రభః || 70 ||
తస్మిన్నివేశయా మాస శయనే కాంచనాన్వితే | దీపరత్నై స్సుప్రకాశే విద్రమై శ్చిత్రితే వరే || 71 ||
అఖండలాస్త్ర మణిభిః కృతపాదే సుకోమలే | దీర్ఘవిస్తార సంయుక్తే హ్యనౌపమ్యే మనోహరే || 72 ||

తతః కృతాంజలిః ప్రాహ పితరం శ్లక్షయా గిరా| తాతైషా జననీమే
ద్య త్వాం వదత్య నృతీత్వితి || 73 ||
కస్మాత్త్వ మనృతీ భూప భవిష్యసి మహీతలే | స కోశరత్న నిచయే గజాశ్వరథ సంయుతే || 74 ||
రాజ్యే ప్రశాస్య మానే తు సప్తోదది సమన్వితే | ప్రదేహి సకలం హ్యసై#్య యత్త్వయా శ్రావితం విభో ! || 75 ||
మయి చాప ధరే తాత! కో వ్యలీకం చరేత్తవ ! దేహి శక్ర పదం దేవ్యై జితం విద్ధి పురందరమ్‌ || 76 ||
వైరించ్యం దుర్లభం యచ్చ యోగి గమ్యం నిరంజనమ్‌ | తచ్చాప్యహం ప్రదాస్యామి తపసా తోష్య పద్మజమ్‌ || 77 ||
సమీహతే యజ్జననీ మదీయా రసాతలే వాపి ధరాతలే వా |
త్రివిష్టపే వాపి పరే పదేవా దస్యామి జిత్వా నరదేవ దానవాన్‌ || 78 ||
అహం హి దాస స్తవ భూప యస్మా విక్రీయతాం మా మధవా తృణాయ |
హస్తే హి పాపస్య దివాప్రకీర్తే ర్దత్స్యామి తత్కర్మ కర స్సుభక్తః || 79 ||
యద్దుష్కరం భూమిపతే త్రితోక్యాం నాదేయ మస్తీహ తదిష్టి భావాత్‌ |
తచ్చాపి రాజేన్ద్ర దదస్వ దేవ్యై మజ్జీవితం మజ్జననీ భవం వా || 80 ||
తేనైవ సద్యో నృపనాథ లోకే సత్కీర్తి యుక్తో భవ సర్వదైవ |
విరాజయిత్వా స్వగుణౖర్నృపౌఘాన్‌ కరైరివాత్మ ప్రభ##వై స్వశోభైః || 81 ||
కీర్తి ప్రభంగే వృజినం భవిష్యతి ప్రజావధం యన్మను రాహ సత్యమ్‌ |
సం మార్జయిత్వా విమలం యశస్స్వం కథం సుఖీ స్యాం నృపతే తతః క్షమః || 82 ||

ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే మోహినీ చరితే పంచవిశో
ధ్యాయః
మోహిని పలికెను :-
ఓ పుత్రా ! ఇట్టి శపథముతోనే సురాధిపుడగు శివుని సాక్ష్యముగా మందరాచలమున మీ తండ్రికి భార్యనైతిని. ఇపుడు నీ తండ్రియగు రుక్మాంగదడు సత్యము నుండి భ్రష్టుడాయెను. నా కీయవలసిన దానిని ఇచ్చుటలేదు. నేను కూడా అతని అభివృద్ధినే కాంక్షించుచున్నాను. నేను బంగారమును, ధాన్యమును యేనుగులను, అశ్వములను, గ్రామములను, వస్త్రములను కోరుట లేదు. అతనికి హాని కలిగించు దానిని కోరుటలేదు. నా కోరిక అతని దేహమునే ప్రీతి యుక్తముగావించును. నేనడిగినది అతని దేహరోగ్యమునే కాని మీ తండ్రి మోహముచే ఇచ్చుట లేదు. అతని ఉపకారముకు, అతని శరీరము కొరకు, అతని సుఖము కొరకు మాత్రమే కోరితిని. కాని మీ తండ్రి ఈనాడు సురాపాన తుల్యము, పరమ ఘోరమగు అసత్యమున నిలిచియున్నాడు. సత్యభ్రష్టుని, నిష్ఠుర వాక్యములను మాటలాడు వానిని, ధర్మమును వదలిన వానిని, అసత్యశీలిని, శఠుని నీ తండ్రిని నేనొదులుచున్నాను. నేనతనితో ఉండజాలు. ఇట్లు మోహిని వాక్యములను వినిన ధర్మాంగదుడు ఓ తల్లీ ! నేను బ్రతికి యుండగా నా తండ్రి అసత్యవాది కాజాలడు. మరలిరమ్ము. నేను నీ కోరికను ఇప్పించెదను. నా తండ్రి ఇదివరకెన్నడూ అసత్యమును మాటాడలేదు. ఇక ఇపుడు నేను పుట్టినతరువాత ఎట్లు అబద్ధ మాడును. అతని సత్యముననే దేవాసురమానవ లోకములు నిలిచి యున్నవి. నా తండ్రే యమలోకమును శూన్యమును చేసెను. నా తండ్రి కీర్తి బ్రహ్మండ మంలము వరకు వ్యాపించియున్నది. అట్టి రాజు ఎట్లు అబద్ధమునాడగలడు? నా తండ్రి మాటను వినకనే పరోక్షముగా నేనెట్లు విశ్వసింతును; నా మీద దయనుంచి తిరిగి రమ్ము. ఇట్లు ధర్మాంగదుని మాటలను వినిన మోహిని ధర్మాంగదుని భుజము పట్టుకొని మరలెను. సూర్యతేజస్కుడగు రుక్మాంగద మహారాజు మృతకల్పునిగా పరుండియున్న ప్రదేశమునకు వచ్చెను. ఆ బంగారు శయ్యమీద దీపరత్నములతో ప్రకాశించుచుండగా పగడములు పొదిగియున్న ఉత్తమమగు, వజ్రఖచిత పాదములచే శోభించు చున్న, కోమలమగు, దీర్ఘవిస్తారయుక్తమగు, సాటిలేని మనోహరమగు పర్యంకమున మోహినిని కూర్చుండబెట్టి చేతులు జోడించి తండ్రితో ఇట్లు పలికెను. ఓ తండ్రీ ! ఈ నా తల్లి నిన్ను అసత్యవాక్యుడవనుచున్నది. నీవెందుకు అసత్యవాది వగుచున్నావు. కోశరత్న సమన్వితము, గజాశ్వరథ సంయుతము అగు రాజ్యమును పాలించు నీవు ఏడు సముద్రములచే చుట్టబడిన భూమంలమునకు అధిపతివి నీవు. నీవు ప్రతిజ్ఞచేసినందతయూ ఈమెకిమ్ము. నేను ధనుర్దారినై యుండగా నీకు అపకారమును ఎవడు చేయగలడు? ఈమెకు ఇంద్రపదవినిమ్ము. ఇంద్రుని నేను జయించెదను. యోగి గమ్యము నిరంజనము అగు బ్రహ్మసాయుజ్యమును కూడా నేను తపస్సుచే బ్రహ్మకు ప్రీతిని గావించి ఇచ్చెదను. నాతల్లి భూమిలో కాని రసాతలమునకాని, స్వర్గమునకాని, పరలోకమునకాని దేనిని కోరిననూ నరదానవులను యుద్ధమున గెలిచి ఈయగలవాడను. ఓరాజా? నేను నీకు దాసుడను. నీవు కోరినచో నన్ను గడ్డిపోచకమ్ముము. నన్ను చండాలునమ్ముము. అతని పనిచేయుచు అతని వద్ద ఉండగలను. మూడులోకములలో దుష్కరమైనదేదియూ లేదు. ఈయరానిదైనను ఈమెకిమ్ము. నా జీవితమును నా తల్లి జీవితమును కాని ఇమ్ము. నీవు ఇదివరకున్న సత్కీర్తిచేతనే విరాజిల్లుము. సూర్యుడు తన కిరణములచే లోకములను ప్రకాశింప చేయును. కీర్తి భంగమైనచో పాపము వచ్చును. ప్రజానాశము జరుగునని మనువు నిజమునే చెప్పెను. నీస్వచ్ఛమగు కీర్తిని తుడిచి వేసి నేనెట్లు సంతోషముతో నుండగలుగుదును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహారాణమున ఉత్తరభాగమున మోహినీ చరితమున ఇరువది యైదవ అధ్యయము.

Sri Naradapuranam-3    Chapters    Last Page