Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకవింశో7ధ్యాయః ఇరువది యొకటవ అధ్యాయము

శిక్షా నిరూపణమ్‌అ

మాంధాతోవాచ:-


పుత్రస్య వచనం శ్రుత్వా కిం చకార మహీపతిః సా చాపి మోహినీ బ్రహ్మ న్ప్రియా రాజ్ఞో విదేస్సుతా || 1 ||
ఆశ్చర్య రూపం కధిత మాఖ్యానం తు సుధోపమమ్‌ | విశేష తస్త్వయా పుణ్యం సర్వ సందేహ భంజనమ్‌ || 2 ||
మాంధాత పలికెను:-
పుత్రుని మాటలను విని రుక్మాంగద మహారాజు ఏమి చేసెను. రుక్మాంగదుని ప్రియురాలగు మోహిని కూడ ఏమి చేసినది? మీరు అమృతము వంటి రుచిగల ఆశ్చర్యమును కలిగించు, సర్వసందేహములను తొలగించు, పవిత్రమగు ఆఖ్యానమును చెప్పుచున్నారు.
వసిష్ఠి ఉవాచ: -
తత్పుత్ర వచనం శ్రుత్వా ప్రహృష్టో నృప పుంగవః | ఉదతిష్ఠ త్ప్రియాయుక్త స్తాశ్శ్రియశ్చావలోకయత్‌ || 3 ||
క్షణం హర్షన్వితో భూప రాజా విష్ణుపరాయణః | నాగకన్యాస్తు తాస్సర్వా వారుణీ సహితా ముదా || 4 ||

ప్ర
=దదౌ తనయే ప్రేవ్ణూ భార్యార్థం ధర్మభూషణ | శేషం దానవ నారీభి ర్బహు రత్న సమన్వితమ్‌ || 5 ||
మోహిన్యై ప్రదదౌ రాజా కామ ఆణ ప్రపీడితః | సంవిభజ్య పితా విత్తం ధర్మాంగద సమాహృతామ్‌ || 6 ||
పురోహితము వాచేదం కాలే చాహూయ భూపతిః | సర్వాసాం మత్సుతో బ్రహ్మన్పాణీ న్గృహ్ణాతు ధర్మతః || | 7 ||

కుమారీణాం కుమరో
యం మద్వాక్యే సంస్థితస్సదా | వైవాహ్య లగ్నే నక్షత్రే ముహూర్తే సర్వకామదే || 8 ||
వాచయిత్వా ద్విజాన్స్పస్తి గోస్వర్ణాంబర తోషితాన్‌ | వివాహం కురు పుత్రస్య మమ ధర్మాంగదస్య వై || 9 ||
యః పుత్రస్య పితో ద్వాహం కరో తీహ మందధీః | స మజ్జేన్నరకే ఘోరే హ్యప్రతిష్ఠే యుగాయుతమ్‌ || 10 ||
తస్మచ్చో ద్వాహయే త్పుత్రం పితా ధర్మ సమన్వితః | ఆత్మా సంస్థిపిత స్తేన యేన సంస్థాపిత స్సుతః || 11 ||
సర్వక్రతు ఫలం తస్య పుత్రో ద్వాహే కృతే భ##వేత్‌| పుత్రస్య గుణ యుక్తస్య నిర్గుణస్యాపి భూసుర || 12 ||

పిత్రాకార యిత వో
హి వివాహో ధర్మమిచ్ఛతా | యో నదారైశ్చ విత్తైశ్చ పుత్రాన్సం యోజయే త్పితా || 13 ||
నపుమాన్సతు విజ్ఞేయ ఇహాముత్ర విగర్హితః | తస్మాద్వృత్తి యుతాః కార్యః పుత్రా దారై స్సమన్వితాః || 14 ||
యధా రమన్తే తు తుష్టా స్సుఖం పుత్రా స్సుమానితాః | తచ్ఛ్రుత్వా వచనం రాజ్ఞో ద్విజ స్తస్య పురోహితః || 15 ||

ధర్మాంగద వివాహార్థ ముద్యతో హర్ష సంయుతః | సయువానిచ్ఛమానో
పి స్త్రీ సౌఖ్యం లజ్జయా సుతః || 16 ||
స్వీచికార పితర్వాక్యా ద్దార సంగ్రహణం తదా | వరుణాత్మ జయా సార్దం నాగకన్యా మనోహరాః || 17 ||
ఉపయేమే మహాబాహు రూపేణా ప్రతిమా భువి | ఉద్వాహ యిత్వా సర్వాస్తా విధి దృష్టేన కర్మణా || 18 ||

వసుగోరత్న దానాని విప్రేభ్యః ప్రదదౌ ముదా | కృతదారో వవందే
థ పాదాన్మాతుః పితుర్ముదా || 19 ||
తతస్సంధ్యావలీ దేవి మాహ ధర్మంగదస్సుతః | పితుర్వాక్యేన మే దేవి ! సంజాతో దార సంగ్రహః || 20 ||
ఏతన్యే నాస్తి మనసి యత్పిత్రో ద్వాహితో హ్యహమ్‌ | అవ్యయం పితరం విజ్ఞం దేవి శుశ్రూషయే హ్యహమ్‌ || 21 ||
ద్వివ్యై ర్భోగైర్నమే కించి త్స్వర్గేణాపి ప్రయోజనమ్‌ | కార్యమే పితృ శుశ్రూషా తవ చైవ దివా నిశమ్‌ || 22 ||
వసిష్ఠ మహర్షి పలికెను:-
కుమారుని మాటలను వినిన రుక్మాంగద మహారాజు సంతోషించి ప్రియురాలితో పాటు లేచి ఆ సంపదలను చూచెను. విష్ణు భక్తుడగు మహారాజు ఒక క్షణకాలము సంతోషము పరవశించెను. వరుణ పుత్రికతో పాటు నాగకన్యలందరిని ప్రేమతో పుత్రునికి భార్యలుగా ఇచ్చెను. మిగిలిన దానవ కన్యలను కూడా ఇచ్చెను. రత్నరాశులను సంపదలను మోహినికి కానుకగా ఇచ్చెను. ఇట్లు ధర్మాంగదుడు సంపాదించిన సంపదను రుక్మాంగద మహారాజు విభాగము చేసి, సకాలమున పురోహితుని పిలిచి ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమా? నా పుత్రుడు ఈ కన్యల. పాణి గ్రహణము చేయవలయును. సర్వకామ ప్రదము శుభకరమగు వివాహ లగ్నమున బ్రాహ్మణులకు గోకాంచన వస్త్రాభరణములనిచ్చి, స్వస్తి వాచనము గావించి, నా పుత్రుడగు ధర్మంగదునకు వివాహమును చేయుము. తండ్రి మంద బుద్దయై పుత్రుని వివాహమును చేయనిచో పదివేల యుగములు నరకమున నుండును. కావున ధర్మాత్ముడగు తండ్రి పుత్రునకు వివాహమును చేయవలయును. పుత్రుని స్థాపించినచో తనను స్థాపించుకొనువాడే యగును. పుత్రుని వివాహమును జరిపించినచో సర్వ యజ్ఞ ఫలము లభించును. ధర్మమును కోరు తండ్రి గుణవంతుడైనను, గుణ రహితుడైనను పుత్రుని వివాహమును చేయవలయును. పుత్రునకు భార్యలను ధనము నీయని తండ్రి పురుషుడుగా పరిగణించబడడు. ఇహ పరములలో నిందించబడును. కావున తండ్రి పుత్రునకు వివాహమును చేయవలయును పుత్రులు ఆనందయుక్తులగా నుండునట్లు చూడవలయును. ఇట్లు రుక్మాంగదుని మాటలను వినిన పురోహితుడు సంతోషముతో ధర్మాంగద వివాహమును జరుపుటకు ఉద్యుక్తుడాయెను. ధర్మాంగదుడు బిడియముచే స్త్రీ సౌఖ్యమును కోకుకున్ననూ తండ్రి ఆజ్ఞచే వారిని వరుణ కన్యకతో పాటు మనోహరలగు నాగకన్యలను వివాహము చేసుకొనెను. యధావిధిగా వారిని వివాహమాడి సంతోషముతో గోరత్న ధనములను బ్రాహ్మణలకు దానము గావించెను. ఇట్లు వివాహమాడి తల్లిదండ్రలకు పాదాభివందనమును గావించెను. అపుడు తల్లియగు సంధ్యావలితో ధర్మాంగదుడు ఇట్లు పలికెను. ఓ తల్లీ! తండ్రి ఆజ్ఞచే నాకు వివాహము జరిగెను. వివాహము చేసుకొన వలయునని నా మనసులో లేకుండెను. జ్ఞాని అవ్యయుడు అగు తండ్రిని సేవించవలయుననియే నా కోరిక. నాకు దివ్యభోగములపై కాని స్వర్గముపై కాని ఆశ##లేదు. నేను రాత్రింబవళ్ళు తండ్రికి మీకు సేవలు చేయుచుందును. ఇదియే నా కోరిక.
సంధ్యావతీ ఉవా: -

చిరంజీవ సుఖం పుత్ర! భుంక్ష్వ బోగాన్మనో
నుగాన్‌ | పితుః ప్రసాదా ద్దీర్ఘాయు ర్మనో నందయ మే సుత || 23 ||
త్వయా సుపుత్రిణీ పుత్ర! జాతా గుణవతా క్షితా | సపత్నీ నాం చ సర్వాసాం హృదయే సంస్థితా హ్యహమ్‌ || 24 ||
ఏవముక్త్వా పరిష్వజ్య మూర్ధన్యాఘ్రాయ చాసకృత్‌ | వ్యసర్జ యత్తతః పుత్రం రాజ్యతంత్రా వలోకనే || 25 ||
విసర్జి తస్త దా మాత్రా మాతౄరన్యాః ప్రణమ్య చ | రాజ్యతంత్రం తదఖిలం చక్రే పితృవచ స్థ్సితః || 26 ||
దుష్ట నిగ్రహణం చక్రే శిష్టానాం పరిపాలనమ్‌ | అటనం సర్వదేశేషు వీక్షణం సర్వకర్మణామ్‌ || 27 ||
చక్రే సర్వత్ర కార్యాణాం మాసి మాసి నిరీక్షణమ్‌| హస్త్య శ్వపోషణం చక్రే చార చక్రేక్షణం తధా || 28 ||
వాద సంవీక్షణం చక్రే తులామానం దినే దినే | గృహే గృహే నరాణాంచ చక్రే సంరక్షణం నృపః || 29 ||
స్తనంధయీ క్వచిద్బాలః స్తనహీనో న రోదితి | శ్వశ్రూర్వధా న కుత్రపి ప్రరోదిత్య వమానితా || 30 ||
క్వచిత్స మర్దస్తనయః పితరం నహి యాచతే | సవర్ణ సంకరో రాజ్యేద కేషాంచి ద భ వత్పనః || 31 ||
న గూఢ విభవో లేకే ధర్మే వదతి దూషణమ్‌ | నకంచుక విహీనాతు భ##వేన్నారీ స భర్తృకా || 32 ||
గృహాన్నిష్క్రమణం స్త్రీణాం మాస్తు రాజ్యే మదీయకే | మా సకేశా హి విథవా మాస్త్వకేశా స భర్తృకా || 33 ||

మా వ్రతీహ సదాక్రోశీ మారణ్యా నగరాశ్రయాః | సామాన్య వృత్త్య దాతా మే రాజ్యే
వసతు నిర్ఘృణః || 34 ||
గోపాలో నగరాకాంక్షీ నిర్గుణ స్తూపదేవకః | ఋత్విగ్వా శాస్త్ర హీనశ్చ మా మే రాజ్యే వసేదిహ || 35 ||
యో హి నిష్పాదయేన్నీలీం నీలీరంగాతిసేచకః | నిర్వస్సౌ తా వుభౌ పాపౌ యో వై మద్యం కరోతి చ || 36 ||

వృధా మాంసం హి యో
శ్నాతి పృష్ఠ మాంస ప్రయో హి యః | తస్య వాసో న మే రాజ్యే స్వకలత్రం త్యజేచ్చ యః || 37 ||
విష్ణుం పరిత్యజ్య వరణ సురాణాం సంపూజయే ద్యో
న్య తమం హి దేవమ్‌ |
గచ్చేత్సగర్భాం యువతీం ప్రసూతాం దండ్యశ్చ వధ్యశ్చ స చాస్మదీయైః || 38 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరభాగే శిక్షా నిరూపణం నామ ఏక వింశో
ధ్యాయః
సంధ్యావలి పలికెను : -
ఓ పుత్రా ! చాలా కాలము జీవించుము. నీకు నచ్చిన భోగములను భవించుము. తండ్రి అనుగ్రహముచే దీర్ఘాయుష్మంతుడవై నా మనసునకాంనదమును కలిగించుము. గుణవంతుడవగు నీచే నేను సుపుత్రిణినైతిని. నేను అందరు సవతుల హృదయములలో నిలిచితిని. ఇట్లు పలకి ఆ లింగనము చేసుకొని, శిరసు మూర్కొని, పుత్రుని రాజ్య కార్యములను చూచుటకు పంపెను. ఇట్లు తల్లి ఆజ్ఞను పొంది ఇతర మాతృ దేవతలకు కూడా నమస్కరించి పిత్రాజ్ఞా పాలకుడై సకల రాజ్య తంత్రములను చూచుచుండెను. దుష్ట నిగ్రహమును శిష్ట పరిపాలనమును చేయసాగెను. అన్ని దేశములలో తిరుగుచు, అన్ని పనులను చూచుకొనుచు. ప్రతినెలకొకసారి అన్ని కార్యములను సమీక్షించు చుండెను. హస్త్యశ్వములను పోషించుచుండెను. చార చక్రమును సమీక్షించు చుండెను. వాద సంవీక్షణమును, తులామాన పరీక్షణమును ప్రతిదినము చేయుచుండెను. ప్రతి ఇంటిలోను ప్రతి నరుని కాపాడుచుండెను. పాలు త్రాగు శిశువులు పాలులేనివాడై ఏడ్చుటలేదు. కోడలిచే అవమానించబడి ఏ ఒక్క అత్తకూడా రోదించుట లేదు. సమర్దుడగు పుత్రుడెవ్వరూ తండ్రిని యాచించుట లేదు. ధర్మాంగదుని రాజ్యమున ఏ ప్రాంతమున కూడా వర్ణసంకరము జరుగలేదు. ప్రజలెవరూ సంపదను దాచుకొనుట లేదు. ఎవ్వరూ ధర్మమును నిందించుట లేదు. ముత్తయిదువయగు స్త్రీ రవిక లేకుండగా యుండుట లేదు. నా రాజ్యమున స్త్రీలు ఇంటి నుండి వీధిలోనికి రారాదు. భర్తృహీనలు సకేశలుగా, భర్తృమతులు వికేశలుగా నుండరాదు. వ్రతము చేయువాడెవడు ఆక్రోశించ రాదు. నగరమున యుద్దములు జరుగరాదు. సామాన్య వృత్తులు కలవారెవ్వరు దానములు చేయక నా నగరమున నుండరాదు. గోపాలకుడు నగరము నుండరాదు. ఉపదేశము చేయువాడు గుణహీనునిగా నుండరాదు. శాస్త్ర జ్ఞానములేని ఋత్విజులు నా నగరమున నుండరాదు. నీలిని సిద్దము చేయువాడు నీలి రంగాతి సేచకుడు నా గరము నుండి బహిష్కృతులు కావలయును. అట్లే మద్యమును చేయువాడు కూడా నగరము నుండి వెడలగొట్ట బడవలయును. నిష్ర్పయోజనముగా మాంసమును భుజించు వానిని, పృష్ఠమాంస ప్రియుని, భార్యను విడిచిన వానిని నారాజ్యము నుండి వెడలగొట్ట వలయును. శ్రీ మహా విష్ణువును విడిచి ఇతర దేవతల నారాధించు వానిని, గర్భవతియగు యువతిని సంగమించువానిని, ప్రసవించిన యువతిని పొందు వానిని దండించవలయును. వధించవలయును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తర భాగమున శిక్షా నిరూపణము ఇరువది యొకటవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page