Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏ కోన వింశోధ్యాయః = పందోమ్మిదవ అధ్యాయము

మోహినీ ప్రణయ వర్ణనమ్‌

వసిష్ఠ ఉవాచ:-


సో
ను జ్ఞాతో మహీపాలః ప్రియాభిః ప్రియకాముకః | ప్రహర్ష మతులం లేభే ధర్మాంగద మువాచ హ || 1 ||
ఏతాం ద్వీపవతీం పృధ్వీం పరిపాలయ పుత్రక | కృత్వా దుష్ట వధం త్వాదౌ అప్రమత్త స్సదోద్యతః || 2 ||
సదావసర సంయుక్త స్సదాచార నిరీక్షకః | సదా చేతన సంయుక్త స్సదా వాణిజ్య వల్లభః || 3 ||
సదా భ్రమణ శీలశ్చ సదా దానరతిర్భవ | సదా కౌటిల్య హీనశ్చ సదాచార రతస్సదా || 4 ||
అపరం శృణుమే పుత్ర ! యత్కర్తవ్యం త్వయాధునా | అవిశ్వాసస్తువ సర్వత్ర భూమిపానాం ప్రశస్యతే || 5 ||
కోశస్య చ పరిజ్ఞానం జనానాం జనవల్లభ | రస వద్ద్రవ్య మా కర్షేః పుష్పేభ్య ఇవ షట్పదః || 6 ||
త్వయా పుత్రేణ సంప్రాప్తం పునరే వేహ ¸°వనమ్‌ || 7 ||
ఇమా మ పూర్వాం వరరూప మోహినీం సంప్రాప్య భార్యాం ద్విజ రాజ వక్త్రామ్‌ |

సుఖేన సంయోజ్య చ తే
ద్య భారం సప్తో దధి ద్వీప భవం ప్రరంస్యే || 8 ||
వ్రీడాకర స్తాత మనుష్యలోకే సమర్ద పుత్రే సురతాభికామీ |
భ##వేత్పితా చే ద్వలిభిశ్చయుక్తో జీర్ణద్విజ శ్శ్వేత శిరో రుహశ్చ || 9 ||

జీర్ణో
ప్య జీర్ణస్తవ సౌఖ్యవృద్దో వాంఛే ఇమాం లోకవరాం వరార్హామ్‌ |
సంత్యజ్య దేవాన్మ మ హేతు మాగతా మనంగ బాణాభి హతాం సునేత్రామ్‌ || 10 ||
కామం రమిష్యే ద్రుత కాంచనాభాం హ్యేకాంత శీలః పరిపూర్ణ చేతాః |
భూత్వా తు గుప్తో వన నిర్ఘరేషు రమ్యేషు దివ్యేషు నదీతేటేషు || 11 ||
ఇయం పురంధ్రీ మమ జీవితాధికా సుఖేన ధార్య త్రిదివైక నారీ |
అస్యాస్తు హేతో ర్విబుధా విముఢా యధా మాయై ధరణీ శ సంఘాః || 12 ||
తద్వాక్య మాకర్ణ్య పితుస్సుబుద్దిః ప్రణమ్య భక్త్యా జననీ సమేతమ్‌|

నృపోత్తమం తం నరృపనందనో
సౌ దిదేశ భోగర్థ మనేకవిత్తమ్‌ || 13 ||
ఆజ్ఞా విధే యాంస్తు పితుర్నియోజ్య దాసాశ్చ దాసీంశ్చ హిరణ్య కంఠీః |
మత్స్యధ్వ జార్తస్య సుఖాయ పుత్ర స్తతో మహీరక్షణ మాచచార || 14 ||

నృపై స్త్సుతో ధర్మ విభూషణో
సౌ సమావృతో ద్వీపవతీం సమగ్రామ్‌ |
తస్యేత్థ ముర్వీం చరతశ్చ భూప నపాప బుద్దిం కురతే జ నౌఘః || 15 ||
న చాపి వృక్షః ఫలం పుష్పహీనో నక్షేత్ర మాసీ ద్యవ శాలిహీనమ్‌ |
స్రవన్తి గావో ఘట పూరదుగ్దం ఘృతాధికం శర్కర వత్సుమిష్టమ్‌ || 16 ||
క్షీరం సుపేయం సకలార్తినాశనం పాపాపహాం పుష్టి వివర్థనం చ|
జనో న కశ్చి ద్విభవస్య గోప్తా భర్తుర్హి భార్యా న కటూక్త వాదినీ || 17 ||
పుత్రో వినీతః పితృ శాసనే రతో వధూ స్థ్సితా హస్తపుటే చ శ్వశ్రోః |
ద్వజోపదేశే హి జనో వ్యవస్థితో వేదోక్త ధర్మాచరణా ద్విజోత్తమాః || 18 ||
న భుంజతే మాధవ వాసరేజనా న యాంతి శోషం భువి నిమ్మగాస్తు |
సంభుజ్య మాన న హి యాంతి సంపదః సంభోగ యుక్తైరపి మానవైః క్షయం || 19 ||
వివృద్ది మాయంతి జలైరివోనర్థ్యం దూర్వాతృణం శాద్వలతా ముపైతి |
కృతీ చ లోకోహ్య భవత్సమస్తో ధర్మాంగదే పాలన సంప్రవృత్తే || 20 ||
భుక్త్వాతు సౌఖ్యాని చ యాన్తి మానవాః హరేర్దినం తద్దిన సేవనేన |
ద్వారాణి సాధ్వన్త నిశాసు భూప గుప్తాని కుర్వన్తి నద స్సుభీతాః || 21 ||
న చీపి గోపేషు దదన్తి వృత్తిం స్వేచ్ఛా చరా మందిర మా వ్రజన్తి |
క్షీరం క్షరన్త్యో ఘటవత్సు భూరిశో వత్సప్రియా శ్శాంతికరాశ్చ గావః || 22 ||
అకృష్ట పచ్యా ధరణీ సమస్తా ప్రరూఢ సస్యా కిల లాంగలం వినా |
మాతుః పయోభిశ్శశవ స్సుపుష్టా భర్తుః ప్రయోగైః ప్రమాదాస్సుపుష్టాః || 23 ||
నృపైస్సు పుష్టాస్తు జనాస్సు పుష్టా స్సత్యాభి యుక్తోహి వృషస్సు పుష్టః|
ఏవం విధే ధర్మరతి ప్రధానే జనే ప్రవృత్తే హరి భక్తియుక్తే || 24 ||
సంరక్ష్య మాణ మి నృపాత్మజేన జగామ కాల స్సుఖహేతు భూతః |
నిరామచయో భూతి సమన్వితశ్చ స భూరి వర్షోత్సవ కారకశ్చ || 25 ||
పృధ్వీపతి శ్చాతి విమోహితశ్చ విమోహినీ చేష్టిత సౌఖ్య యుక్తః
దినం న జానాతి న చాపి రాత్రి మాసం చ పక్షం చ స వత్సరంచ || 26 ||
అతీవ ముగ్ద స్సురతేన తస్యా విరించి పుత్ర్యా శ్శుభ చేష్టితాయాః |
విమోహినీ సంగమనే నృపస్య బభూవ శక్తి స్త్వధికా మనోజ్ఞే || 27 ||
యధా యధా సేవత ఏవ భూప స్తధా తధా వృద్ది మియర్తి వీర్యమ్‌ |
పక్షేషు శుక్లేష్వివ శీతభాను ర్నక్షీయతే సంతతసేవ నేన || 28 ||

వృన్దారకః పీత సుధారసో యధా సంస్పృశ్య పంస్పృశ్య పునర్నవో
సౌ |
పి బంస్తు పానం సుమనోహరం హి శృణ్వం స్తు గీతం సుపద ప్రయుక్తమ్‌ || 29 ||
పశ్యం శ్చ రూపం స నితంబినీనాం స్పృశన్స్పృశన్మోహిని వక్త్ర చంద్రమ్‌|
విమర్ద మానస్తు కరేణ తుంగౌ సుఖేన పీనౌ పిశితో పరుఢౌ || 30 ||
ఘనస్తనౌ కాంచన కుంభతుల్యౌ ప్రచ్ఛాదితౌ హారవిభూషణన |
వలిత్రయం నాతి వివర్థమానం మనోహరం లోను శరాజి శోభమ్‌ || 31 ||
స్తనస్య రూపం పరితో విలోక్య దధ్రే వరాంగ్యా శ్శుభోలోచనాయః |

నహీ దృశం చారుతరం నితాంతం నితంభినీనాం మనసో
భిరామమ్‌ || 32 ||
యా దృగ్విధం మోహిని మోహనార్థం వినిర్మితం యద్విధినా స్వరూపమ్‌ |
మృగేన్ద్ర శత్రోః కరసన్ని కావే జంఘే విలోమే ద్రుత కాంచనాభే || 33 ||
శశాంక కాంతి ర్దశనస్య పంక్తిః నిగూఢ గూల్భే జనమోహ నార్థమ్‌ |
ఆపాద శీర్షం కిల తత్స్వ రూపం సంపశ్యతశ్చారు విశాల నేత్రాః || 34 ||
మేనే సురాణా మధికం హి రాజా కృతార్థ మాత్మాన మతీవ హర్షత్‌ |
ఆహో సు తన్వీ విపులేక్షణీయం యాచిష్యతే యచ్చ తదేవ దేయమ్‌ || 35 ||
అస్యాస్తు రమ్యే సురతే శుభాయా దాస్మామి చాంతే నిజవిత్త జాతమ్‌ |
సుదర్లభం దేయ మదేయ మన్యై ర్దాస్యామి చాస్యా యది వాప్యదేయమ్‌ || 36 ||
యద్యప్య దేయం మమ జీవితంహి యాచిష్యతే చేద్యది హేమ వర్ణా|
దాస్యామి చేదం నవిచారయిష్యే పుత్రం వినా నాస్తి న దేయ మస్యాః || 37 ||
ఇతి శ్రీ బృహన్నారదీయ మహాపురాణ ఉత్తరబాగే మోహినీ ప్రణయ వర్ణనాం నామ ఏకోన వింశో
ధ్యాయః
వసిష్ఠ మహర్షి పలికెను:-
ఇట్లు ప్రియురాళ్ళచే అనుమతిని పొందిన రుక్మాంగద మహారాజు సంతోషించిన వాడై ధర్మాంగదునితో ఇట్లు పలికెను. ఓ పుత్రా! ఎప్పుడూ ప్రమాద రహితుడవై మొదట దుష్టులను వధించి సప్తద్వీపములు గల ఈ భూమండలమును పరిపాలించుము. సత్కాలమున సదాచారమును పరిశీలించుచు. జ్ఞానినై వాణిజ్యము నందు ప్రీతి కలవాడవై, ఎప్పుడూ పర్యటించుచు, సర్వకాలములందు దానములను చేయుచు కుటిలత్వమును విడిచి సదాచారమునందు ప్రీతికలవాడవై యుండుము. ఓ పుత్రా ! ఇప్పుడు నీవు చేయవలసిన మరియొక పనిని వినుము. రాజులు ఎప్పడూ అందరి యందు అవిశ్వాసమునే కలిగి యుండవలయును. జనుల కోశమును తెలియుచుండ వలయును. పూవుల నుండి తుమ్మెద మరందమును పరిగ్రహించునట్లు పాదరసమువలె అంతటా పరిభ్రమించుచు ప్రజల నుండి ధనమును గ్రహించవలయును. ఇక నేను నీచే లభించిన ¸°వనమును పొంది చంద్రముఖి, అపూర్వ సౌందర్య రాశి అగు మోహినిని భార్యగా పొంది సప్తద్వీప భూ భారమును నీ కప్పగించి సుఖముగా ఆనందించెదను. పుత్రా! మనుష్యలోకమున ¸°వనవంతుడు సమర్థుడగు పుత్రుడుండగా దంత భ్రంశమును చెంది, తలపండి, ముడుతలు పడిన శరీరము కల తండ్రి స్త్రీ సౌఖ్యమును కోరుట సిగ్గును కలిగించు విషయమే. అయిననూ నేను వృద్దుడనై కూడా యువకుడనే. కావున అన్ని లోకములలో శ్రేష్ఠురాలగు, నా కొరకు దేవతలను కూడ వదలివచ్చిన, మన్మధ బాణ విద్దయగు ఈ మోహినిని, చారునేత్రను స్వర్ణ వర్ణ దేహను, ఏకాంత శీలుడనై నిండు మనసుతో, రహస్యముగా సుందరములగు సెలయేరులలో నదీ తీరములందు రమించెదను. దేవతలందిరితో శ్రేష్ఠురాలగు ఈ మోహిని నాజీవితము కంటే అధికురాలు. సుఖముగా నుంచదగినది. లక్ష్మీదేవి కొరకు దేవతలు లోకపాలులు మూఢులైనట్లు ఈ మోహిని కొరకు దేవతలందరూ మోహితులైరి ఇట్లు పలికిన తండ్రి మాటను విని సుబుద్దియగు ధర్మాంగదుడు జననీ సమేతమూగా జనకునికి ప్రణమిల్లి, తండ్రి భోగము కొరకు బహువిత్త సంచయమున సమకూర్చెను. తండ్రి కొరకు ఆజ్ఞావిధేయులగు దాసులను దాసీ జనమున నియమించి కామబాణార్తుడగు తండ్రికి అన్ని సౌకర్యములను సమకూర్చి భూరక్షణమును ఆచరించెను. ధర్మాంగదుడు రాజులచే స్తుతించబడుచు సప్తద్వీప సమన్వితమగు భూమండలమును పర్యటించుచు పరిపాలించు చుండగా ప్రజలు పాపమునందు బుద్దిని విడిచిరి. ఫలములు పుష్పములు లేని చెట్లు లేకపొయెను. యవశాలి రహితమగు క్షేత్రము లేదు. గోవులు ఘట పూర్ణముగా పాల నిచ్చుచున్నవి. ఆ పాలు శర్కరవలె తీయనివి. ఎక్కువ నేయి కలవి. సుఖముగా త్రాగదగిన పాలు. అందరి ఆర్తిని నశింప చేయునవి. పాపములను తొలగించగలవి. పుష్టిని పెంచునవి. ప్రజలలో ఏ ఒక్కరూ సంపదను దాచరు. భర్తతో భర్య పరుషముగా మాటలాడదు. వినయశీలులగు పుత్రులు తండ్రి ఆజ్ఞను పాలించువారు. కోడలు అత్త చేతుల్లో నిలుచు. ప్రజలందరూ బ్రాహ్మణుల ఉపదేశములో నిలుచువారు. బ్రాహ్మణులు వేదోక్త ధర్మములను ఆచరించువారు. ఏకాదశినాడు ఏ ఒక్కరూ భుజించరు. నదులు ఎండిపోవుటలేదు. భోగములందు కోరికగల మానవులు భోగములననుభవించుచున్ననూ వారి సంపదలు తరుగుట లేదు. నదులలోని నీరువలె సంపదలు పెరుగుచున్నవి. దూర్వాతృణము జలముచే పెరుగుచున్నది. ధర్మాంగద మహారాజు రాజ్యపాలన చేయుచుండగా సమస్త లోకము ధన్యత నందెను. భోగానుభవముచే సౌఖ్యములను పొందుచున్నారు. హరి దినమును సేవించుటచే గడుపుచున్నారు. రాజ్యములలో ఎవ్వరూ దొంగల భయముచే తలుపులు మూయుట లేదు. స్వేచ్ఛాచారులు లేరు. గోపాలకులకు ఇతర వృత్తులను ఇచ్చటలేదు. గోవులు పుష్కలముగా బహుఘట పూర్ణములుగా పాలనిచ్చును. దూడలయందు ప్రీతి కలవి. శాంతిని కలిగించునవిగా యున్నవి. నాగలిచే దున్నకనే క్షేత్రములన్నియూ సస్యములు పెరిగి పండుచున్నవి. తల్లులచోను బాలతో శిశువులు పుష్టిని పొందుచున్నారు. భర్తల అనురాగముచే భార్యలు సంతుష్టలు. రాజులచే ప్రజలు, ప్రజలచే రాజులు పుష్టి తుష్టి కలవారుగా నుండిరి. సత్యముచే కూడిన ధర్మము పుష్టి నొందెను. శ్రీహరి యందు భక్తి కల ధర్మాంగద మహారాజు ధర్మప్రీతి కలవాడై పరిపాలన చేయుచుండగా ప్రజలు సంతోషముతో నుండిరి. కాలము సుఖదాయకముగా గడుచు చుండెను. లోకమంతయూ రోగ రహితము. సంపద్యుతము. వర్ష సమృద్ధి ఉత్సవ సమృద్ధి కలిగియున్నది. రుక్మాంగద మహారాజు కూడా మోహినీ దేవి చేష్టలచే సౌఖ్యము కలవాడై మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజు మోహినీ మోహములో పరవశుడై పగలును. రాత్రిన, పక్షమును, మాసమును, సంవత్సరమును తెలియజాలక పొయెను. శుభకరముల చేష్టలు కల బ్రహ్మపుత్రికయగు మోహినీ సంగమమున మిక్కిలి మోహముతో నుండెను. రుక్మాంగద మహారాజునకు మోహినీ సంభోగమున శక్తి అధికమాయెను. మోహినిని అనువించుచున్నపుడల్లా అతని బలము అధికముగా జొచ్చెను. శుక్ల పక్షమున చంద్రునివలె రుక్మాంగదునికి మోహినీ సంగమమున శక్తి ప్రతిదినము తరుగుట లేదు. అమృతపానమును చేసిన దేవతలవలె మోహినిని స్పృశించుచు స్పృశించుచు పునర్నవత్వమును పొందెచుండెను. మనోహరముగా పానము సేవించుచు మధుర పదయుక్తముగా గానమును వినుచు రూపవతుల రూపమును చూచుచు, మోహినీ దేవి వక్త్రమును తాకుచు, ఉన్నతములు, సుఖముతో బాగుగా బలసియున్న, మాంసముతో వృద్ధి చెందిన, బంగారు కలశముల వలెనున్న, హార భూషములచే కప్పబడియున్న మోహనీదేవి యొక్క ఘనములగు స్తనములను చేతితో మర్దించుచు ఎక్కువగా పెరుగని త్రివళులను మనోహరముగా లోమశరాజి శోభితముగా నుండుటచే స్తనరూపమును పొందుటచే మోహినీ గాత్రములందు దృష్టిని నిలిపెను. బ్రహ్మ స్వయముగా మోహింప చేయుటకు స్త్రీలు మనసారా ఆశించు సుందర రూపమును మోహినికి సమకూర్చెను. యేనుగు తొండము వంటి పిక్కలు రోమ రహితముల కాంచన సన్నిభములు, పలువరుస చంద్రకాంతి సన్నిభములు, జనమోహకములగు నిగూఢగుల్ఫములు. సుందర విశాల నేత్రములు మోహినీదేవి యొక్క రూపమును ఆపాదమస్తకమును చూచుచు దేవతలందరిలో తానే అధికునిగా భావించెను. తనను కృతార్థునిగా తలించెను. ఆహా! ఈ సుందరి విశాలనేత్ర అడిగినదేదైనను తప్పక ఈయదగినది. సుందరమగు ఈమె సమాగమము కొరకూ నా సంపందనంతటిని ఈయగలను. దుర్లభ##మైన దానినైనను, ఇతరులకు ఈయరానిదైను ఈమె కోరినచో ఈయదగినదే. ఈయరాని నా ప్రాణమును కూడా ఈయగలను. ఒక్క నాకుమారుని తప్ప ఇక దేనినైననూ ఈమె కోరినచో ఈయగలవాడను.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున ఉత్తరభాగమున మోహినీ ప్రణయ వర్ణన మను పందొమ్మిదవ అధ్యయము

Sri Naradapuranam-3    Chapters    Last Page