Upanyasamulu    Chapters   

తొలిపలుకు.

శ్రీ జగద్గురు కామకోటి పీఠాధిపతులు నెల్లూరికివిచ్చేసిన అక్టోబరు తే 30 ది దొరఁకొని వారుకావించిన యుపన్యాసములు అనేకములు. వారు ఉపన్యసించిన తావులును, ఉపన్యసించిన విషయములును అనేకములే.
శంకరులు గా మాక్రమ్యపదే7ధికాంచి నిబిడైస్స్కంధై శ్చతుర్భిర్యుతః వ్యావృణ్వ& భువనాంతరం పరిహరం స్తాపం స మోహజ్వరం యశ్శాఖీ ద్విజసంస్తుతః ఫలతి తత్స్వాద్యం రసాఖ్యంఫలం తసై#్మ శంకరపాదపాయ మహతే తన్మః త్రిసంధ్యం నమః.
'నేను' అను భావమున కర్థమేమి? ఈవిస్తారమగు ప్రపంచమున జీవించియుండు ప్రాణులు కోటానకోటులు కలవు. ప్రతి ప్రాణియందును 'నేను నేను' అను భావము స్ఫుర్తించుచున్నది. ప్రతి జీవుడను ఏదోనొక శరీరములో'నేను' అను భావముతో కూడుకొనియే యున్నాడు.
శ్రవణ, మనన,నిదిధ్యాసములు శ్రవణ మనన నిదిధ్యానముల చేయవలసినదని మన ఉ నిషత్తులు ఆజ్ఞాపించుచున్నవి. కాని మనము వానిని ఎందుకు చేయవలసియునో విచారించెదము:-
హరిజన దేవాలయ ప్రవేశము. దేవాలయములో పవిత్రతకలదనియు, ఆలయాంతర్భాగమున భగవంతుడున్నాడనియు నమ్మువారికే దేవాలయములుద్దేశింపబడినవి.
స్వరాజ్యము -- స్వారాజ్యము శసంస్కృతములో స్వారాజ్య సిద్ధియను వేదాన్త శాస్త్రసమ్మతమగుగ్రన్థమొకటికలదు. దానిని సురేశ్వరాచార్యులవారు రచించిరి. ఇయ్యది, ఇష్టసిద్ధి, నైష్కర్మ్యసిద్ధి, అద్వైతసిద్ధి స్వారాజ్యసిద్ధి యనుదానిలో నాల్గవది.
పరోపకారము ప్రపంచములో పరోపకారమనునది లేనేలేదని నా యభిప్రాయము. చిన్నప్పుడు బడిలో చదువుకునేటప్పుడొక క్రైస్తవ ఉపాధ్యాయుఁడు చెప్పినాడు, 'వివేకానందస్వామి పాపము పుణ్యములేవని చెప్పఁగా దమ మిషనరీ
సాహిత్యము-స్త్రీలబాధ్యత ఇప్పుడు చదివిన పత్రములలో ఈ సాహిత్యసమితికి యాజ్ఞ్యవల్క్య, వ్యాస, వాల్మీకి, తిక్కన, శ్రీనాథ, వేంకటరాయశాస్త్రి, షేక్స్పియర్‌, షెల్లి, కీట్‌ స్‌ ప్రభృతులు తొమ్మండుగురు గురువులని కలదు.
సంస్కృతమనగా నేమి? భాషల కనేకముగా దేశాన్నిబట్టి పేరు వచ్చుచుండును. సాధారణంగా ఒకదేశానికి, ఆదేశంలో వాడబడు భాషకు ఒకే పేరుఉంటుంది. తెలుగుదేశం తెలుగుభాష, తమిళ##దేశం తమిళ భాష, కన్నడదేశం కన్నడభాష,
భగవన్నామమేతరించుటకు సులభోపాయము భగవన్నామ భజనమే మన జన్మతరించుటకు సులభోపాయము. పాపకార్యమంటే ఎటువంటిదో ఎఱుగక పరిశుద్ధముగా జీవితమును గడపడమంటే సాధ్యంకానిపని.
సనాతనుల కర్తవ్యమేమి? ఇప్పుడు కాగితములో వ్రాయబడిన తీర్మానములు గాక మన మనస్సులో కొన్ని తీర్మానముల జేసుకొనవలెను. ఇప్పుడుచేసినవన్నియు సంఘమునకు సం బం ధిం చి న వి.
సంధ్యావందనము మందేహులను కొందఱు రాక్షసులుకలరు. వారు సూర్యుడుదయించునప్పుడెల్ల నరుదెంచి అతనికి కష్టమును కలుగ జేయుచుందురు.
అద్వైతము మన మతమున కంతయు వేదము మూలాధారమైయున్నది. ఆవేదముల యంత్యభాగమున కుపనిషత్తులనిపేరు. వానిలో ప్రపంచస్వరూపము. అత్మతత్త్వము మొదలగు విషయములు విమర్శింపబడియున్నవి,
ఆత్మసంస్కారము ఈ యూర పండితపరిషత్తొకటి యేర్పడుట సంతోషావహము. దీనికి పండితాభిమానులును లౌకికులును అగువారధ్యక్షులగుటయు, విద్యభిమానముగలఇతరులును సహాయపడుటయు కొనియాడతగియున్నది.
ప్రశంసాశ్లోకములు ఈ యూర పండితపరిషత్తొకటి యేర్పడుట సంతోషావహము. దీనికి పండితాభిమానులును లౌకికులును అగువారధ్యక్షులగుటయు, విద్యభిమానముగలఇతరులును సహాయపడుటయు కొనియాడతగియున్నది.

Upanyasamulu    Chapters