Sri Bhagavadgeetha Madanam-1    Chapters   

7. ధ్యానయోగము

ధ్యానయోగ మనగా నేమి?

పతంజలి మహర్షి ''యోగః చిత్తవృత్తి నిరోధః'' అని ధ్యాన యోగమును నిర్వచించెను. అనగా విక్షేప లక్షణముగల మనస్సు యొక్క వృత్తులను నిరోధించుటయే ధ్యానయోగము.

మనోనిగ్రహ మెట్లు సాధ్యమగును?

ఇట్టి చిత్తవృత్తి నిరోధము అసాధ్యమని భావించి అర్జునుడు శ్రీకృష్ణు నిట్లు ప్రశ్నించెను.

శ్లో|| చంచలంహి మనః కృష్ణ! ప్రమాధి బలవ ద్దృఢమ్‌

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్‌ గీత 6-34

మనస్సు చంచలము, కలత పెట్టునది, బలవంతము, స్వాధీన మునకు రానిది, దానిని వశము చేసికొనుట గాలిని మూటగట్టుటవలె కష్టసాధ్యము.

ఈ ప్రశ్నకు అభ్యాస వైరాగ్యములచేత మనస్సును నిగ్రహింప వచ్చు'' నని శ్రీకృష్ణుడు సమాధానము తెలిపెను.

శ్లో|| అసంశయం మహాబాహో! మనో దుర్నిగ్రహం చలం

అభ్యాసేనతు కౌంతేయ! వైరాగ్యేణచ గృహ్యతే

గీత 6-35

మనస్సును నిగ్రహించుట కష్టము. అది చంచలము. అయినను దానిని వైరాగ్యముచేతను అభ్యాసముచేతను నిగ్రహింపవచ్చును.

పతంజలి యోగసూత్రములయందు కూడ అభ్యాస వైరాగ్యముల చేత మనోనిగ్రహము సాధ్యమని తెలుపబడియున్నది.

1. అభ్యాస వైరాగ్యాభ్యాం త న్నిరోధః

అబ్యాస వైరాగ్యములద్వారా చిత్తవృత్తి నిరోధము సాధ్యమగును.

2. ఈశ్వర ప్రణిధానాద్వా

భక్తి పూర్వకముగా ఆరాధించి ఈశ్వరుని మెప్పించుటచేతకూడ ఇది సాధ్యమగును.

ఈశ్వర ప్రణిధానమును గూర్చి శ్రీ సీతీరామాంజనేయ సంవాద మిట్లు తెలుపుచున్నది.

సీ|| కరణంబు లఖిలోప కరణంబులును గాగ

ప్రాణంబు లుపచార భటులు గాగ

గంగాప్రముఖ నాడికలు జలంబులు గాగ

షట్కమలములు పుష్పములు గాగ

జఠరాగ్నిహోత్ర ముజ్వలధూపముం గాగ

బటు జీవకళలు దీపంబు గాగ

నందితానందంబు నైవేద్యముం గాగ

రవి శశిజ్యోతు లారతులు గాగ

నంగ దేవాలయమున సహస్ర కమల

పీఠమున శాంతి జనక జోపేతుడగుచు

జెలగు పరమాత్ము రాము నర్చించుచుండ

దత్వవిదు లీశ్వర ప్రణిధాన మండ్రు

- సీతారామాంజనేయ సంవాదము

అభ్యాస మనగా నేమి :-

యోగ వాశిష్ఠమునందు అభ్యాసమునుగూర్చి ఇట్లు చెప్పబడినది.

శ్లో|| తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ర్పబోధనమ్‌

ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదు ర్బుధాః

అద్వితీయ బ్రహ్మ చింతనము, కథనము, బోధనము, ధ్యానము బ్రహ్మాభ్యాస మందురు.

శ్లో|| సర్గాదావేవ నో త్పన్నం దృశ్యం నాస్త్యేవ తద్వదా

ఇదం జగ దహం చేతి బోధాభ్యాసం విదుః వరమ్‌

- యోగవాశిష్ఠము

ఈ దృశ్యము సృష్టికి పూర్వములేదు. సత్యమైనది కాదు. నేనను ఆత్మయే జగద్రూపమున నున్నది. ఇట్టి నిరంతర చింతనము బోధాభ్యాస మందురు.

పతంజలి యోగసూత్రముల యందు ''తత్ర స్ధితౌ యత్నో అభ్యాసః'' అనగా పరమాత్మయందు ప్రయత్న పూర్వకముగా మాటి మాటికి చిత్తవృత్తిని లగ్న మోనర్చుట అభ్యాసము అని చెప్పబడినది.

శంకరాచార్యులు అభ్యాసము నిట్లు నిర్వచించిరి. ''అభ్యాసోనామ చిత్తభూమే కస్యాంచిత్‌ సమాన ప్రత్యయావృత్తిః చిత్తస్య''

ఏదో ఒక విషయమునందు మనస్సు వృత్తులు గలది అగుటయే అభ్యాసము.

శ్రీ రమణమహర్షి అభ్యాసమును ''ఏకవస్తు చింతన'' మని వచించిరి. కాబట్టి మనస్సును విషయములనుండి మరలించి ఆత్మ స్వరూప మునందు చిత్త ప్రవాహమును లగ్న మొనర్చుట అభ్యాస మనవచ్చును.

సోపాన పంక్తిపై పడిన కందుకము వరుసగా క్రిందికి పడునట్లు లగ్నముగాక బహిర్ముఖమైన మనస్సు పతనము చెందును.

శ్లో|| లక్ష్యచ్యుతం చే ద్యది చిత్త మీషత్‌

బహిర్ముఖం నన్నిపతే త్తత స్తతః

ప్రమాదతః ప్రచ్యుత కేళి కందుకః

సోపాన పంక్తే పతితో యథా తధా

- వివేక చూడామణి

తాను తానుగా నిలచుటకు అడ్డువచ్చే శరీరాది భ్రాంతులను పోగొట్టుటకే సాధన అని రమణమహర్షి తెలిపెను.

అభ్యాస మెట్లు చేయవలయును :-

మనస్సును నిరోధించుటకు చేయు అభ్యాసములు 32 వేదమున చెప్పబడినవి.

1. అమృతయోగము :- మహా మౌనముచేత సాధింపబడునది.

2. భూమవిద్య :- సంప్రసాదముతో నుండుట.

3. ఉద్గీథవిద్య :- స్థిరమనస్సుతో కంఠ కుహరమునందు ప్రణవ ధ్యానము.

4. జ్యోతిర్విద్య :- తీవ్ర నిర్విషయాలోకముచే ధ్యానించుట.

5. సంవర్గవిద్య :- ప్రాణవాయు గత్యాగతి ప్రత్య వేక్షణము.

6. వారుణీవిద్య :- స్థిరమతితో జిహ్వాగ్ర రసమును ధ్యానించుట.

7. ఇంద్రయోనివిద్య :- ఉపజిహ్వపై రసమును ధ్యానించుట.

8. ఉపకోసలవిద్య :- ''దృష్టిం దష్టారం వా ధ్యాయేత్‌'' మొదలగు 32 విద్యలలో ఓక విద్యనుగాని సక్రమముగా ఉపదేశించువారు నేడు లభించుట లేదు.

అభ్యాసములు ఆంతతంగికములని బాహ్యములని రెండు విధములు

బాహ్య సాధనములు :-

చిత్తవృత్తి నిరోధకమునకు బాహ్యసాధనములలో భగవద్గీత, సంవర్గ విద్యను సూచించినది.

''గత్యగతి ప్రత్యవేక్షణ ద్వారా ప్రాణవాయుం ధ్యాయేత్‌ సా సంవర్గ విద్యా'' తత్వాను శాసనమ్‌'' - గణపతిముని

"Contemplate on life breath through watching he inhalation and exhalation. It is Samvarga vidya. దీనినే తారకవిద్య అని క్రియాయోగమని అజపావిద్య అని చెప్పుదురు. గీతయందు ఈ యోగముయొక్క పూర్వ నియమములు ఇట్లు చెప్పబడినవి. జపమునకు ముందు ''ప్రాణాయామే వినియోగః'' అని చెప్పబడుచున్నది కదా.

శ్లో|| యోగీ యుంజీత సతత మాత్మానం రహసి స్థితః

ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీ ర పరిగ్రహః

- గీత 6-10

యోగి రహస్యప్రదేశమున ఒంటరిగా నుండి మనోదేహముల జయించి ఆశలను విడచి దేనిని గైకొనక నిరంతరము ఆత్మయోగము నందు నిలువవలెను.

శ్లో|| శుచౌ దేశే ప్రతిష్ఠాప్య స్థిరమాసన మాత్మనః

నాత్యు చ్ఛ్రితం నాతి నీచం చైలాజిన కుశోత్తరమ్‌

శ్లో|| తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియ క్రియః

ఉపవి శ్యా7సనే యుఞ్జ్యా యోగ మాత్మ విశుద్ధయే

గీత 6-11, 12

పవిత్రస్థానమున దర్భాసనము, మృగచర్మము వస్త్రము ఒక దానిపైనొకటి పరచి, మిక్కిలి ఎత్తు మిక్కిలి పల్లముగానట్టి ఆసనము వేసికొని; దానిపై ఏకాగ్ర మనస్సుతో గూర్చుండి, చిత్తమును ఇంద్రిములను వశపరచుకొని ఆత్మశుద్ధి నిమిత్తము యోగసాధన చేయవలయును. (పవిత్రస్థానమనీ, వివిక్తదేశమనీ రహస్యప్రదేశమనీ చెప్పబడియున్నది. వివిక్తదేశ మనగా పరమాత్మ తప్ప వేరులేనిదే నని రమణమహర్షి తెలపిరి.)

శ్లో|| సమం కాయ శిరోగ్రీవం ధారయ న్నచలం స్థిరః

సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశశ్చా నవలోకయన్‌

గీత 6-13

శ్లో|| ప్రశాన్తాత్మా విగత భీః బ్రహ్మచారి వ్రతే స్థితః

మన స్సంయమ్య మచ్చిత్తో యుక్త ఆశీత మత్పరః

గీత 6-14

తలను మెడను శరీరమును కదల్చక చూపును తన ముక్కు కొనయందు లయింపజేసి, (గీతలోని 5-27 శ్లోకములో) ''చక్షుశ్చైవాంతరే భృవోః'' అనియు 6-13 శ్లోకములో సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం'' అనియు ఉన్నది. శంకరాచార్యులు నాసికాగ్ర దృష్టిని గూర్చి ఇట్లు వ్యాఖ్యానించిరి.

''స్వ నాసికాగ్రం సంప్రేక్ష్య సమ్యక్‌ ప్రేక్షణం దర్శనం కృత్వా ఇవ ఇతి, ఇవ శబ్దో లుప్తః ద్రష్టవ్యః | న స్వనాసికాగ్ర సంప్రేక్షణం ఇహ విధి త్సితమ్‌ | కింతర్హి | చక్షుషో దృష్టి సన్నిపాతః | సచ అంతఃకరణ సమాధానాపేక్షః వివక్షితః | స్వ నాసికాగ్ర సంప్రేక్షణ మేవచేత్‌ వివక్షితం మనః తత్రైవ సమాధీయేత్‌ న ఆత్మని | ఆత్మని హి మనసః సమాధానం వక్ష్యతి ''ఆత్మ సంస్థం మనః కృత్వా'' (6-27) ఇతి | తస్మాత్‌ ఇవ శబ్దలోపేన అక్‌ష్ణోః దృష్టి సన్నిపాతః ఏవ సంప్రేక్ష్య ఇత్యుచ్యతే''

It is not gazing at the tip of the nose, rather it is the convergence of sight. The concentration on the self is aimed at.

ఖేచరీ ముద్రలో కన్నులు మూసికొనియే భ్రూమధ్యమున దృష్టి నిలుపవచ్చును.

ఆ|| కనులు మూసియైన కనువిచ్చియైన భ్రూ

మధ్యమమున చూపు మలచి నిలిపి

యూర్ధ్వముఖముగాగ నొనరజూచిన నది

ఖేచరి యను ముద్ర

- సీతారామాంజనేయ సంవాదము

సిక్కుల గురుద్వార్‌ అనగా ''ఉపజిహ్వకు ప్రాక్‌ దిక్కున'' ఉన్న గురుస్థానము. బైబిలులో జెహోవా ఇట్లు తెలిపెను.

Let thine eyes be single. The body will be full of light.

దిక్కులు చూడక, పరమశాంతిచేత, నిర్భయముగలిగి బ్రహ్మ నిష్ఠయందు నిల్చి మనస్సును స్వాధీన పఱచుకొని, నాయందు చిత్తము నిలిపి నాయం దత్యంతాసక్తి గలవాడగుచు యోగసమాధి యందుండవలెను.

శ్లో|| యుఞ్ప న్నేవం సదాత్మానం యోగీ నియత మానసః

ళాన్తిం నిర్వాణ పరమాం మత్సం స్థా మధి గచ్ఛతి గీత 6-15

ఇట్లు నిశ్చయించిన మనస్సుగల యోగి తన మనస్సు సర్వదా స్వాధీనము చేసికొని ఉత్తమమగు నా యొక్క స్థానమును పొందుచున్నాడు.

శ్లో|| నా త్యశ్నతస్తు యోగో7స్తి న చై కాన్త మనశ్నతః

న చాతి స్వప్న శీలస్య జాగ్రతోనైవ చార్జున

గీత 6-16

ఆహారాది నియమము లేనివానికి సమాధి సిద్ధింపదు. ఎక్కువ భుజించువానికి, బొత్తిగా భోజనము చేయనివానికి, అధికముగా నిద్ర బోవువానికి, బొత్తిగా నిద్రింపనివానికి యోగము సంభవింపదు.

శ్లో|| యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు

యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా

గీత 6-17

ఆహారాది నియమములు గలవానికి యోగము సిద్ధించును. మితాహారము, మిత సంచారము, మితకర్మ, మితనిద్ర, మితముగా మేలు కొనుటగలవానికి మాత్రము సర్వదుఃఖహరమగు యోగము సిద్ధించును.

అభ్యాస విధానము:-

శ్లో|| స్పర్శాన్‌ కృత్వా బహి ర్బాహ్యాన్‌

చక్షు శ్చై వాంతరే భృవోః

ప్రాణుపానౌ సమే కృత్వా

నాసాభ్యంతర చారిణౌ - గీత 5-27

''చక్షుశ్చై వాంతరే భృవోః'' అన్నప్పుడు భ్రూమధ్యమున దృష్టి చెప్పబడినది.కాని దృష్టిం జ్ఞానమయీం కృత్వా'' అని తేజోబిందూపనిషత్తున నున్నది. శంకరులు అపరోక్షానుభూతిలో ఈ విధముగా వ్రాసినారు.

''దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యే ద్ర్బహ్మమయం జగత్‌ సా దృష్టిః పరమోదారా న నాసాగ్రావలోకినీ''

ద్రష్టృ దర్శన దృశ్యానాం విరామా యద్రవో భ##వేత్‌ దృష్టి స్తత్రైవ కర్తవ్యా న నాసాగ్రావలోకినీ.

అనగా దృష్టి భ్రూమధ్యమందు నిలుపుటగాదు. చూపు, చూచే వాడు, చూడబడేది అను త్రిపుటి ఎక్కడలయిస్తుందో అక్కడదృష్టిని నిలుపవలెను. అదియే జ్ఞానదృష్టి. దృష్టిని జ్ఞానమయముగా చేసిన జగత్తు బ్రహ్మమయముగా తెలియును.

అన్నిటికీ ఉత్పత్తిస్థానము అనాహతము. కొందరు మూలా ధారముపై దృష్టి ఉంచవలెనని సహస్రారమున ఉంచవలెననీ భ్రూమధ్యమున ఉంచవలెనని చెప్పినప్పటికిని ఆత్మఅంతట ఉన్నదని గ్రహింప వలయును. హృదయమే సహస్రారమునకు వెలుగు నిచ్చునది. ఇది అన్నిటికి మూలము.

శ్లో|| ముహూర్తమపి యోగశ్చే న్నాసాగ్రే మనసా సహ

సర్వం తరతి పాప్మానం తస్య జన్మ శతార్జి తమ్‌.

ఉత్తరగీత 2-11

తత్త్వజ్ఞానముకొరకు నాసాగ్రమందు మనస్సుతోకూడ ముహూర్త కాలము దృష్టి నిలిపినయెడల అట్టి ఖేచరీముద్ర అనేక జన్మలయందు సంచితములైన సకల విధములైన పాపములను నాశనము పొందును.

శ్లో|| గచ్ఛం స్తిష్ఠన్యథాకాలం వాయు స్వీకరణం పరం

సర్వకాలం ప్రయోగేన సహస్రాయు ర్భవే న్నరః

ఉత్తరగీత 1వ అధ్యాయము

శ్లో|| యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్ష పరాయణః

విగతేచ్ఛా భయ క్రోధో యస్సదా ముక్త ఏవ సః

గీత 5-28

బయటనుండి లోపలకు ప్రవేశించి శబ్దాది విషయములను బయటనే నిలిపి, ప్రాణవాయువును నాసికయందు వర్తింపజేసి, ఇంద్రియముల నిగ్రహించి, దేనియందు ఇష్టములేనివాడగుచు మోక్షమే పరమగతిగా నెంచువాడు సదా ముక్తుడే యగును. ఈ సంవర్గవిద్యనే శ్రీ సీతారామాంజనేయ సంవాదమున తారకవిద్యగా తెలిపిరి.

సీ|| అనిశంబు పద్మాస నాసీనుడై, చూపు }పద్మాసనము

లమరంగ నాసికాగ్రమున నిలిపి }ఖేచరీ ముద్ర

ఇంద్రియంబుల నెల్ల నిట్టట్టు బోనీక} జానేంద్రియ కర్మేం

మనసుచే తిరముగా గుదియబట్టి} ద్రియ నిగ్రహము.

ప్రాణాది దశవిధ పవనంబులను వికా} వాయు

రము లంటకుండ జొక్కముగ నునిచి} నిగ్రహము

కామ రాగాది సంకల్ప వర్జనముగా

స్వాంతంబు నరసి నిశ్చలముజేసి} మనోనిగ్రహము

గీ|| అనిల మానసములతోడ హంసమంత్ర

మమర గూరచి జపించుచు నంతమీద }అజపావిద్య

హృదయ నభమున బిందువు గదలకుండ

బెంపుగా నాదకళల వీక్షింప వలయు.

ఊపిరి మనస్సులతో హంస మంత్రము జపించవలెను. ఇట్టి విద్యను గురువువద్ద ఉపదేశముపొంది అభ్యసించిన వానికి మనోనిగ్రహము కలిగి మోక్షము చేకూరును. ఇట్టి అభ్యాసికి గ్రంథ పఠనము అక్కరలేదని (త్యజేత్‌ గ్రంధ మశేషతః) స్కందగీతలో విద్యారణ్య వ్యాఖ్యానమున చెప్పబడినది. పాండితయములేకయే జ్ఞాని అయిన తరువాత రమణమహర్షికి పుస్తకములయందు తాననుభవించిన విషయములు గోచరించినవి.

గీ|| ఇంద్రియముల నిగ్రహించి ప్రాణములతో

మానసము గూర్చి వానితోడ

హంసయనగ నొప్పు నక్షరద్వయము యో

చించి సంతతము భజింప వలయు

- సీతరామాంజనేయ సంవాదము

శ్లో|| హకారేణ బహిర్యాతి సకారేణ విశే త్పునః

ఇట్టి హంసమంత్రమును జీవుడు సర్వదా జపించును. మనో నిశ్చలత ఏర్పడిన తరువాత బ్రహ్మనిష్ఠ ఆరంభమగును. స్వస్వరూప అనుసంధానము ఏర్పడును.

హకారేణ బహిర్యాతి సకారేణ విశేత్పునః

హంస హంసేతి మంత్రోయం జీవో జపతి సర్వదా

అనయా సదృశీ విద్యా అనయా సదృశో జపః

అనయా సదృశం పుణ్యం నభూతో నభవిష్యతి

బిభర్తి కుండలీశక్తి రాత్మానం హంస మాశ్రితా

హంసః ప్రాణాశ్రయో నిత్యం ప్రాణాః నాడీపథాశ్రయాః

హంస విద్యా మవిజ్ఞాయ ముక్తౌయత్నం కరోతి యః

సః నభోభక్షణ నైవ క్షున్నివృత్తిం కరిష్యసి

ముక్తానందులవారి ''సోహం జపము'' నుండి గ్రహించిన విషయములు క్రింద పేర్కొనబడినవి.

Prana flows in-apana flows out. for subjugating mind and prana establishment of even movement of prana - apana is necessary. Hansa is the uneven movement of prana in man and animaals. "So-ham" is its even movement join 'soham' to inhalation and exhalation. It is yajna in which prana is offered to fire of prana. 'Soham' brings natural samadhi.

యజ్ఞానాం జపయజ్ఞోస్మి - గీత

In normal person prana in the form of hamsa moves through ida and pingala. Under guru's inspiration, prana becomes 'soham' flowing through 'sushumna,

గురు వాక్యాత్‌ సుషుమ్నా యాం

విపరీతో అభవత్‌ జపః

సోహం సోహం ఇతి ప్రాప్తో

మంత్రయోగః స ఉచ్యతే

Spontaneous Kumbhaka is achieved when 'soham becomes active in prana-apana.

అజపావిద్యను గూర్చి ప్రభుజీవారి Lectures Divine లో క్రింది విధముగా నున్నది.

1) Body neck and head erect, with unseeing gaze fixed at the root of the nose, the incomming and out going breath equalised, thought, senses mind and intellect controlled.

2) Take in 'soo' and give out 'hung' concentrating on the light divine before centre of eye brows.

Root of the nose=Origin of the ose between the eye brows.- భ్రూమధ్యము

పై విధానము సీతారామాంజనేయ సంవాదములోని విధానమును పోలియున్నది.

ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణములో రేచకపూరకములు మాత్రమే యుండును. కుంభకము లేదు. గాలి నిబ్బరముగా నిదానముగా పీల్చి విడువవలయును. గాలి వరుసగా భ్రూమధ్యములో నాలుక, కంఠ స్థానము, హృదయము, నాభి, వీని మార్గమున ప్రవేశించి నిర్గమించునట్లు భావించవలయును. నాభ్యాది నాసాంతము. ఈ ప్రక్రియ ఎడతెగక జరుగవలయును. రేచకపూరకములు చేసినంత మాత్రమున కుంభకము జరుగలేదని భావించరాదు. పీల్చినంతకాలము గాలిలోన కుంభింపబడును కదా? అట్లే ఊపిరి విడిచినప్పుడు బాహ్యకుంభకము జరుగును. దీనినే సీతారామాంజనేయ సంవాద మిట్లు సమర్థించినది.

సీ|| హృదయగత ప్రాణు డేతెంచు నాసికా

వివరంబువలనను వెలికి ద్వాద

శాంగుళ పర్యంత మది రేచకంబగు

నరుదెంచు నంతలో నర్థ సమయ

మచ్చోట లయమగు నది బహిః కుంభకం

బారీతి లోపలి కరుగునదియె

పూరకంబన నొప్పు పూరించు నంతలో

నర్ధకాలంబు దా నడగు నచట

అదియె యాంతర కుంభకం బనగదనరు.

శ్లో|| దృగ్యుగం లీయతే యత్ర మనః తత్రైవ లీయతే

దృఙ్మనో లీయతే యత్ర మారుతం తత్ర లీయతే

భ్రూమధ్యమున దృష్టిని నిలుపుటను ఖేచరీ ముద్ర యందురు. చూపును నిలుపగనే మనస్సు నిలుచును. మనస్సు చూపు నిలచినంతనే ఊపిరి నిలుచును.

నాదరూపం భృవోర్మధ్యే

మనసో మండలం విదుః - యోగశిభోపనిషత్తు

The region of the mind between the eye brows of the form of nada.

ఇస్లాం అనగా శరణాగతి. అందులో ''రూహ్‌కా రాస్తాహై అల్లాకా'' అని చెప్పబడినది. రూహ్‌ అనగా ప్రాణము. భగవంతుని పొందు మార్గము ప్రాణ గత్యగతా ప్రత్యవేక్షణము.

బ్రహ్మమును నాసాగ్రదృష్టితో ధ్యానించవలయునని ఉత్తర గీతయు తెల్పుచున్నది.

శ్లో|| స్థిరబుద్ధి రస మ్మూఢో బ్రహ్మవిద్ర్బహ్మణి స్థితః

బహిర్వ్యోమ స్థితం నిత్యం నా సాగ్రేచ వ్యవస్థితం

నిష్కలం తద్విజానీయా చ్ఛ్వాసో యత్ర లయంగతః

- ఉత్తరగీత 1 అధ్యాయము

సిరబుద్ధి గలవాడును అజ్ఞాన రహితుడును, బ్రహ్మజ్ఞానము గలవాడును ఎప్పుడు బ్రహ్మమునందేయున్న వాడగును. సంతతమును యే స్థలమునందు నాసాగ్రము నందున్నదై బాహ్యాకాశస్థితములై అవయవ రహితమైయున్న ఆ బ్రహ్మమును ధ్యానము చేయవలయును.

భాగవతమున ఇట్టి అభ్యాసమునే శుకుడు మనోనిగ్రహమునకై తొలుత పరీక్షితునకు బోధించెను. మనోమల మేరీతిని హరించవచ్చు నను ప్రశ్నకు శుకుడిట్లు సమాధానము తెలిపెను.

ఆ|| పవనము నియమించి పరిహృతరంగు

ఇంద్రియముల వర్గమెల్ల మాపి

హరి విశాల రూపమందు చిత్తముజేర్చి

నిలుప వలయు బుద్ధి నెఱపి బుధుడు.

మనస్సు ఊపిరి రెండూ ఒకచోటనుండే ఉత్పన్న మగును. ఒకటి అదుపులోనికి వచ్చిన రెండవది వశమగును. రమణమహర్షి ''నే నెవరిని'' చింతించినను మనసు ఊపిరి రెండును నిలచునని తెలిపెను. ''నే నెవరిని'' అనుకొనుటకాదు. నిజముగా ''నేను'' ఎక్కడ నుండి పుట్టుచున్నది అనీ వెదువలయును. నేననునది ఎక్కడనుండి పుట్టుచున్నదో ఎరుగుటకు ప్రయత్నించినపుడు ప్రాణగత్యాగతి పత్య వేక్షణము జరుగును. ఊపిరి ఎక్కడనుండి పుట్టుచున్నదో పరిశీలించినను అట్లే యగును. నే ననునది ఊపిరి ఒకచోటునుండే పుట్టుచున్నవని గ్రహించును. అప్పుడు మనస్పు నిలచును. ప్రాణ గత్యాగతి ప్రత్యవేక్షణముకూడ ఒక విధమైన ప్రాణాయామమే. ప్రాణాయావుము మనసేకాగ్రము చేయుటకు సహకరించును. మననేకాగ్రము చేయుశక్తి కలిగినప్పుడు ప్రాణాయామ మవసరము లేదు.

మనస్సు నశించినపుడు శూన్య మేర్పడునని భయపడరాదు. ఆలోచించువాడు, ఆలోచనాకార్యము, ఆలోచనలు ఈ త్రిపుటి నశించును. ఆత్మలో కలసిపోవును. ఈ స్థితి బ్రహ్మానందముకానిశూన్యము కాదు, నిద్రలో మన మిట్టి స్థితిని దినము పొందుచున్నాము. దానిని గూర్చి భయ మక్కరలేదు.

ఊపిరి నిలిచి మనోలయస్థితి చెందినప్పుడు బాహ్యజ్ఞానము (నిద్రలోవలె) ఉండదు. ''నే నున్నా''నను ఎఱుకమాత్ర ముండును. (నిద్రలో ఉండదు). ఈ స్థితిలో జాగ్రదవస్థ కలగా దోచును. కల నుండి మేల్కొనిన తరువాత స్వప్నము అసత్యమని తెలిసినట్లే ఈ స్థితిలో జాగ్రత్తు అసత్యమగును. సుఖదుఃఖములు, పుణ్పాపములు. ధర్మాధర్మముల విచారములేదు. కేవలము ఆనంద స్వరూపము, అను భ##వైక వేద్యము.

స్వప్నావస్థలో నున్నప్పుడు స్వప్నము అసత్యముగా తోచదు. మేల్కొన్న తరువాతనే అది తెలియును. అట్లే జాగ్రవస్థలోనున్నప్పుడు అది అసత్యమని తోచదు. మనోలయము సిద్ధించి సమాధిసితి ఏర్పడగనే జాగ్రదవస్థ స్వప్నప్రాయమై పోవును.

హఠయోగ విధానము:-

కుంభక ప్రాణాయామ మొనర్పికూడ మనస్సును నిగ్రహించవచ్చును.

కం|| చంచల మగునట్టి మన

మ్మంచితముగ నిగ్రహించనగు బ్రాణము రో

ధించినచో, ద్రాడున బం

ధించిన పశువువలె మనము నిశ్చేష్టమగున్‌

-- రమణగీత

వాయు బంధనముచేత త్రాడున బంధించిన పశువువలె, లేదా పంజరమున బంధించిన చిలుకవలె (జాలపక్షివత్‌) మనస్సు నిలచును. యోగాష్టాంగములు:-

హఠయోగములో ప్రాణము బంధింపబడుటచే మనస్సు బంధిపబడుచున్నది. జ్ఞానయోగములో మనస్సు నిగ్రహింపబడి ప్రాణము బంధింపబడుచున్నది. మనోనిగ్రహమే రెండింటి ధ్యేయము.

హఠయోగాంగము లెనిమిది. 1) యమ 2) నియమ 3) ఆసన 4) ప్రాణాయామ 5) ప్రత్యాహార 6) ధారణ 7) ధ్యాన 8) సమాధులు, అష్టాంగములు.

1) యమము

2) నియమము

3) అసనము :- పద్మాసనాదులు.

4) ప్రాణాయామమ :- రేచక, పూరక, కుంభకములు శాస్త్రములో చెప్పిన రీతిని అభ్యసించుట.

5) ప్రత్యాహారము :- భ్రూమధ్యమున చూపు నిలుచు మంత్రోచ్చారణముచే మనస్సు నొక స్థానమునందు నిలుపుట.

6) ధారణ :- హృదయము, బ్రహ్మరంధ్రము మొదలగు స్ధానముల యందు, మనస్సును నిలుపుట, అందు ఇష్ట దేవతారూపమును గాని (అవయవయోగము) దీపజ్వాలారూపమును గాని నిలుపవలెను.

7) ధ్యానించుట :- సో7హంభావముతో ధ్యానించుట. అనగా ఆ ఉపాసనా దేవతయే ఆత్మయని భావించుట.

8) సమాధి :- అహం అనుస్ఫురణ అణగినస్ధితి, ఇష్టదేవతా ధ్యానమునగాని, స్వస్వరూప ధ్యానమునగాని, ప్రాణము నిరోధింపబడునని రమణమహర్షి తెలిపిరి.

యోగ ప్రాశస్త్యము :

వైద్యళాస్త్రములు చెప్పు కాయకల్ప చికిత్సలు దేహమును కొంత కాలము పొడిగించును. అనుకున్నప్పుడు మరణము (స్వచ్ఛంద మరణము) కలుగదు. కళారాధకునకు అంతులేని శాంతి సుఖములు కలుగవు. యోగమార్గముననే పై వానిని పొందవచ్చును.

యోగశిఖి, యోగకుండలి, యోగచూడామణి, యోగతత్త్వము ఇత్యాది ఉపనిషత్తులు హఠయోగవిద్యను తెలుపుచున్నవానిలో యోగ శిఖోపనిషత్తు ముఖ్యమైనది. దీనిలో బ్రహ్మము కేవల శాస్త్రగమ్యము కాదని చెప్పబడినది. కేవల శాస్త్రపఠన జన్య జ్ఞానముచేత బ్రహ్మము లభింపదు. అది యోగముతో కూడి యుండవలయును. అట్లని కేవల యోగము మాత్రమే మోక్షప్రద మని చెప్ప వీలు పడదు.

శ్లో|| యోగేన రహితం జ్ఞానం న మోక్షయ భ##వే ద్విధే

జ్ఞానేనైన వినాయోగో న సిధ్యతి కదాచన.

- యోగశిభోపనిషత్తు

శాస్త్ర జనిత జ్ఞానము అభాసజ్ఞాన మనబడును. అభసజ్ఞాని యోగాభ్యాసము లేక ఇంద్రియములను స్వాధీనపరచుకొన జాలడు. అట్టి వానికి దుఃఖనివృత్తి లేదు. ఆభాసజ్ఞానము జీవునకు కేవలము శ్రమను మాత్రమే కలిగించును. కాని ప్రయోజనకారికాదు. యోగ సిద్ధుడై మనోలయము చెందిన తరువాతనే నిర్విశేషజ్ఞానము లభించును. శాస్త్ర జన్యజ్ఞానముచే లభించిన ''అహం బ్రహ్మాస్మి'' అను చిత్త వృత్తి యోగాభ్యాస పాటవములేక దృఢముగా నిలువదు. అది నశించిన వెంటనే కామక్రోధములు ప్రకోపించును. ''నేను ముక్తుడ''నని తలంచిన మాత్రముననే ముక్తి లభింపదు. శాస్త్ర జ్ఞానమునకు యోగ మార్గము లభించిననేగాని విముక్తుడు కాడు. యోగ సంస్కృతమైన మనస్సునందే ఆత్మజ్ఞానము కలుగును. పై విధముగా యోగశిభోపనిషత్తు యోగమార్గ ఆవశ్యకతను ప్రాణుఖ్యతను తెలుపుచున్నది.

యోగాభ్యాసమువలన రజోగుణము నశించునని భగవద్గీత తెలుపుచున్నది.

శ్లో|| ప్రశాంత మనసం హ్యేదం యోగినం సుఖ ముత్తమం

ఉపైతి శాంతి రజసం బ్రహ్మభూత మకల్మషమ్‌.

గీత 6-27

యోగాభ్యాస మొనర్చుకొలదిని మనస్సుయొక్క చంచలత్వము పోవుచుండు. రజోగుణము నశించును.బ్రహ్మాభావన కలుగును.

శ్లో|| వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్పుణ్య ఫలం ప్రదిష్టమ్‌.

అత్యేతి తత్పర్వమిదం విదిత్వా యోగీపరం స్థానముపైతి చాద్యమ్‌.

- గీత 8-28

యోగమార్గము తెలిసినవానికి వేదములు యజ్ఞములు తపస్సులు దానములు మొదలగు వానియందు ఏ ఫలము చెప్పబడియున్నదో ఆ ఫలము నతిక్రమించి శ్రేష్ఠమగు యత్కృష్ట స్థానమును పొందుచున్నాడు.

మంత్ర హఠయోగములకు గల సంబంధము :-

దేవీగీతలో మంత్రసిద్ధిని గూర్చి చెప్పునపుడు ప్రాణాయామ మంత్రజపము చేయవలయునని సూచించపబడినది. మనస్సు మంత్రమును ధ్యానించుట మంత్రయోగము వాయునిగ్రము హఠయోగము.

శ్లో|| జప ధ్యానాదిభి స్సార్థం సగర్భం తం విదు ర్బుధాః

తద పేతం విగర్భంచ ప్రాణాయామం వదే విదుః

హఠయోగ విధానము ప్రాణాయామము చేయునపుడు దానిని ఇష్టదేవతా మంత్రజపముతో కూడికొనిన సగర్భమనియు, లేనిఎడల విగర్భమనియు అందురు.

శ్లో|| మంత్రాభ్యానేన యోగేన జ్ఞేయ జ్ఞానాయ కల్పతే

న యోగేన వినా మంత్రో న మంత్రేణ విన హి నః

మంత్రయోగ హఠయోగముల రెండిటిని అభ్యసించిననే సిద్ధి కలుగును. మంత్రాభ్యాసములచేత తెలియదగిన పదార్థమును తెలిసికొనుటకు తగినవాడగును. యోగమును విడిచి మంత్రము మంత్రమును విడిచి యోగము ఉండదు.

శ్లో|| ద్వయో రభ్యాస యోగోహి బ్రహ్మ సంసిద్ధి కారణమ్‌.

మంత్రము యోగము రెండింటి నభ్యసించుయోగము బ్రహ్మ ప్రాప్తికి కారణ మగుచున్నది. ఎట్లనగా.

శ్లో|| తమః పరివృతే గేహే ఘటో దీపేన దృశ్యతే

ఏవం మాయావృతో హ్యాత్మా మనునా గోచరీకృతః

చీకటిలో దీపమున్న నే కుండ అగుపించును. అట్లే మాయతో ఆవరింపబడిన హృదయమునగల పరమాత్మ మంత్రముచే గోచరింపబడును.

మంత్రమును ప్రాణగత్యాగతి ప్రత్యవేక్షణమున గూడ జపించవచ్చును.

క|| ఆనామ మంత్ర జపమున

మానస నిగ్రహము లభ్యమానంబగు స

మ్మానసముచేత నప్పుడు

ప్రాణముతో మంత్రమునకు నైక్యము పొసగున్‌

క|| ప్రాణము మంత్రాక్షరముల

కౌ నైక్యము ధ్యానమునుచు నవనిం బరగున్‌

ధ్యానము గొనునేని దృఢ

స్థానము నద్ది యొదవించు సహజ స్థితి నిన్‌

- రమణగీత

రమణమహర్షి మంత్రవాదమూలము, అహంమూలము, ప్రాణమూలము - అన్నియు ఒకటేనని తెలిపెను. నేనను అహంకారము పుట్టు స్థానమునుండియే ప్రాణము బయలుదేరును. నాదమూలస్థానము అదియే. అదియే హృదయము.

జపము చేయుచున్నప్పుడు మంత్రనాద మెచటనుండి ఉదయించుచున్నది అని పరికించినచో అది ఉద్భవించు స్థలమునందు పరికించు మనస్సు లీనమగును. అదియే తపము.

''నేను నేను'' అనునది ఎచ్చటనుండి వచ్చుచున్నదో వివరించిన ఎడల అది ఉదయించు స్థలమునందే లీనమగును అదియేతపస్సు.

ఊపిరి మనస్సు లీనమగుచోటు సుషుమ్న.

కొందరు కేవలము మంత్రముల పొందుటకై అనేక గురువుల నాశ్రయించి అనేక మంత్రములను జపించుచుందురు. ''సప్తకోటి మహా మంత్రాః చిత్త విభ్రమ కారకాః'' అన్నట్లు మంత్రానుష్ఠానమే పరమావధికాదు. జ్ఞానము పొందుటయే పరమావధి. చాందోగ్యమున నారదుడు సనత్కుమారుని జేరి ''నేను మంత్ర విదుని మాత్రమే ఆత్మ విదునికాదు ఆత్మజ్ఞాన ముపదేశింపు''మని కోరెను.

ఇచ్చట మనోలయ స్థితికిని, నిద్రకునుగల భేదము గమనించవలయును, మనస్సు నిర్విషయమైన శూన్య మేర్పడును. మనోలయ స్థితిలో ఇంద్రియ వ్యాపారము లుడుగును. బాహ్య ప్రపంచముపై జ్ఞాన ముండదు. కాని తనపై నేనున్నానను ఎఱుక కలిగి యుండును. నుషుప్తిలో బాహ్యప్రపంచ జ్ఞానము లేకపోగా తన్నుతాను మఱచును మనోలయస్థితిలో శ్వాసక్రియ నిలచును. నిద్రలో శ్వాస సక్రమముగ ఆడును.

నిద్రలో కండరముల కదలకున్నను హృదయము, శ్వాసక్రియ రక్త ప్రసరణము జరుగుచునే యుండును. వానికి విశ్రాంతిలేదు. మనోలయస్థితిలో ''ఆంతరింద్రియములగు హృదయము ఊపిరితిత్తులు కూడ విశ్రాంతి చెందును. ఇదియే నిద్రలోని నిద్ర. ఆత్మసాక్షాత్కార మిప్పుడే సాధ్యమగును. ఊపిరి మనస్సు నిలిచినగాని ఆత్మసాక్షాత్కారముకాదు. ఎట్లనగా

శ్లో|| యథాదీపో నివాతస్థో నేజ్గతే సోపమాస్మృతా

యోగినో యత చిత్తస్య యుఞ్జతో యోగ మాత్మనః

గీత 6-19

గాలి లేనిచోట యుంచిన దీపము చలింపక యుండును. అట్లే మనోనిగ్రహము గావించి ఆత్మయోగము నభ్యసింపవలెను.

నిద్రలోని నిద్ర నిజముగా నెఱిగిన

భద్రమగును మీది బ్రహ్మవిద్య

నిద్ర నెఱిగినవాడు నిర్మలయోగిరా

విశ్వరాభిరామ వినురవేమః

.... .... .... నిద్ర నెరిగినేని

సర్వముక్తు డౌను సర్వము తానౌను''

ఇదియే నిద్రకు మనోలయ స్థితికీగల భేదము. అందులకే యోగి నిద్రించడు. వేమనయోగి ఈ మనోలయస్థితిని జాగ్రత్‌ సుషుప్తి (మేలుకొన్న నిద్ర) (sleepses sleep) నే, నిద్రలోని నిద్ర అనెను. జాగృతి, నిద్ర, వీనిని సరిగా తెలిసికొనిన చావుబ్రతుకుల రహస్యము తెలియును.

అనగా మనోలయానంతరమే స్వ స్వరూపాను సంధానము సాధ్యమగును. మనోలయమును పొందుటకు కర్మభక్తులు ఆవశ్యకములై యున్నవి. ఎవడైనను క్షణముగాని కర్మ చేయక ఉండనోపడు. సమాధి యందును సుషుప్తి యందును మాత్రమే కర్మ యుండదు.

క్రియా యోగి నిద్రించిన వానిని అనుకరించును. అతడు ప్రజ్ఞను కలిగియే అనుకరించును. దేహములో ప్రతి అణువును శక్తితో నింపి శ్వాసక్రియను అవసరములేకుండ చేసికొనును. ఇప్పుడు కేవల మానసికమైన తానెవరను ఆలోచనచే సిద్ధి కలుగును. క్రియా యోగములోనే ఇది సాధ్యమగును. యోగులకు సమాధినిచ్చు శక్తియే అజ్ఞానులకు నిద్రనిచ్చును.

స్వప్నావస్థ కొంత కాలవ్యవధి కలది. జాగ్రదవస్థ చాల కాలముండును. వాని మధ్య ఇంతకన్న భేదములేదు. జాగ్రదవస్థ మన సహజావస్థ కాదు. జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు లేని తురీయావస్థయే మన సహజావస్థ.

భక్తియోగ హఠ యోగములు:-

హఠయోగము కష్టము. భక్తియోగము వలె సులభ సాధ్యము కాదు.

శ్లో|| సర్వ ద్వారాణి సంయమ్య మనోహృది నిరుధ్యచ

మూర్ధ్నాదా యాత్మనః ప్రాణ మాస్థితో యోగధారణమ్‌

గీత 8-12

శ్లో|| ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్‌ మా మనుస్మరన్‌

యః ప్రయాతి త్వజన్‌ దేహం సయాతి పరమాం గతిమ్‌

గీత 8-13

నాసికా రంధ్ర, నేత్ర రంధ్ర, శ్రోత్ర రంధ్ర, ముఖ, అధోబిల, లింగ రంధ్రములు వాయు నిర్గమన ద్వారము. ఇట్టి సర్వ ద్వారములు యోగబలముచే అరికట్టి. వెలుపల లోపల వ్యాపించెడి మనస్సును హృదయమునందు నిరోధించి, ప్రాణవాయువును హృదయ స్థానమున నిలిపి, సుషుమ్నా నాడియందు ప్రవేశ##పెట్టి, విశుద్ధ అనాహత ఆజ్ఞా చక్రముల నతిక్రమించి, ప్రాణమును బ్రహ్మరంధ్రము నందు, ద్వాద శాంతము నందు, షోడశాంతము నందు నిలిపి, యోగ ప్రక్రియతో నుత్తమ గతిని పొందినవాడై ఓంకార వాచ్యుడైన పరమేశ్వరుని ధ్యానించి, శీర్ష కపాలమును భేదించుకొని సూక్ష్మ దేహముతో బయలు వెడలి యోగి విదేహముక్తిని పొందుచున్నాడు. ఇదియోగమార్గము, ఇట్టి యోగాభ్యాస రతునకు ప్రాణాయామాభ్యాస క్లేశము, ఇంద్రియ నిగ్రహశ్రమ, మనోనిరోధ ఆయాసము, సుషుమ్నా నాడిచే ఊర్ధ్వగమన దుఃఖము, శీర్షకపాల భూమ్యాద్యావరణ భేద వ్యధ కలిగియున్నవి. ఇట్టి మార్గము క్లేశముతో కూడుకొన్మది.

ఇట్టి ప్రయాసముతో కూడిన మార్గమును తెలిసిన తరువాత శ్రీ కృష్ణ పరమాత్మ సులభ##మైన మార్గమును సూచించి రాజ విద్యారాజు గుహ్యయోగమున విపులీకరించెను.

శ్లో|| అనన్య చేతా స్సతతం యోమాం స్మరతి నిత్యశః

తస్యాహం సులభః పార్థ! నిత్యయుక్త స్సయోగినః

గీత 8-14

ప్రాణాయామమున కసమర్థులగు వారికి మోక్షము దుర్లభమా? అని అడుగవచ్చును. ఎవడు విషయముల యందు చిత్తమును పోనీయక, నిరంతరము, నిత్యము యావజ్జీవకాలము పరమేశ్వరుని స్మరించునో అట్టి సదా సమాహిత చిత్తులకు నేను సులభముగా లభించును.

భాగవతమున యోగజనిత జానమున్నను భక్తి లేక శ్రీహరిని దర్శింపజాలవని చెప్పబడి యున్నది. బ్రహ్మదేవుడు తపస్సు చేసి యోగ జనితమైన జ్ఞానమును పొంది యున్నను కమలనయనుడైన శ్రీహరిని కనుగానజాల డయ్యెను. కాని ''కనియెన్‌ నిశ్చల భక్తియో గమున'' అని భాగవతమున తెలుపబడినది.

''భక్తిచేత ఆత్మయందు గట్టబడిన మనస్సు ఆత్మ ఎఱుకను కలిగి యుండును. ఇతర సాధనములచే (యను నియమాదులచే) కట్టబడిన మనస్సు యెఱుక దప్పియుండును. భక్తికిని భ##క్తేతర సాధనములకును గల భేదమిదియే'' -ప్రణవానంద

శ్రీహరి నెవడు దర్శింపగలడను ప్రశ్నకు భాగవత సమాధాన మిట్లు చెప్పబడినది.

''కామముఖ షట్కము నిర్దశితంబు జేసి నిర్మూలిత కర్ముడైన ముని ముఖ్యుడు గాని కుయోగి కానగా జాలడు''

గురుకటాక్షము:

ఒక్కొక్కప్పుడు సద్గురువు యొక్క అనుగ్రహము చేత కూడ ఇంద్రియ మనో నిగ్రహములు లభించగల వనుటకు దృష్టాంతములు లేకపోలేదు. Paul Brunton శ్రీ రమణమహర్షి వద్ద ఉన్నప్పుడు ఒక వృద్ధుడు స్వామిని దర్శింప వచ్చెను. అతడు స్వామితో ఇట్లు విన్నవించుకొనెను. ''స్వామీ! నాకు సంసారముపై విరక్తి కలిగి ఇల్లు విడచి వచ్చితిని, కాని నా మనస్సును నిశ్చలము చేయలేకున్నాను. నా మనోవిక్షేపమును మాన్పి అనుగ్రహింపు'' మని కోరెను. రమణ మహర్షి దయగలవాడై అతని వైపునకు కొంత కాలము తీక్షణముగా తన దృష్టిని ప్రసరింప జేసెను. దానిచే ఆ వృద్ధుని మనో విక్షేపమునశించి ఏకాగ్రత సిద్ధించెను. మారు మాటాడక ఆ వృద్ధుడు నమస్కరించి వెడలిపోయెను. వైరాగ్యము కలిగియు మనో నిగ్రహము పొందలేని వృద్ధుని పై విధముగా మహర్షి అనుగ్రహించి జ్ఞానమార్గము నవలంబించుటకు అధికారిని జేసెను. అహంవృత్తి ఎక్కడ లయించునో అదియే గురుపాదము.

నిర్గుణ ధ్యాన పద్ధతులు:

ఉపనిషత్ర్పతిపాదితములైన నిర్గుణ ధ్యాన పద్ధతులు చాల కలవు. శ్రీ ప్రణవానంద స్వాములవారు క్రింది పద్ధతులను సూచించిరి.

1. ఓంకార లయ చింతనము

2. భూతలయ చింతనము

3. అన్వయ వ్యతిరేక మార్గము

4. నేతి నేతి మార్గము

5. అధ్యారోప అపవాదము

6. భాగత్యాగ లక్షణము

7. అర్ధాదులతో కూడిన ఓంకారోచ్చారణము

8. తమ త్రయమును దాటు విచారము

9. పంచకోశ లక్షణ విచారము

10. అవస్థాత్రయ సాక్షిత్వము

11. త్రిగుణాతీత బ్రహ్మధ్యానము

12. ప్రాణ ప్రత్యవేక్షణ మార్గము

13. శ్వాస నిరోధము

14. సత్పురుష సహవాసము

ఆంతరంగిక అభ్యాసములు:

మనో నిగ్రహమునకు కొన్ని ఆంతరంగిక అభ్యాసముల గూర్చివిచారింతము. ''యోగః చిత్తవృత్తి నిరోధః'' ఆని వతంజలి చెప్పుట చేత చిత్తవృత్తి నిరోధము ఆంతరంగిక అభ్యాసముచే కలిగినను అది యోగమే యగును. భగవద్గీతలో ఆంతరంగిక సాధన ఇట్లుచెప్పబడినది.

శ్లో|| సంకల్పప్రభవాన్‌ కామాం స్త్వక్త్వా సర్వా నశేషతః

మనసై వేంద్రియ గ్రామం వినియమ్య సమస్తతః

శ్లో|| శ##నై శ్శనై రుపరమే ద్బుద్ధ్యా ధృతి గృహీతయా

ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్‌

గీత 6-24,25

సంకల్పములవలన బుట్టిన సమస్త కోరికలను పూర్తిగా విడచిన మనస్సుచేత ఇంద్రియ సమూహమును సర్వ విషయముల నుండి గ్రహించి, ధైర్యముతోగూడిన బుద్ధితో మెల్లమెల్లగా విషయ విరాగమును బొందవలెను. మనస్సు నాత్మయందు లెస్సగా నిలిపి ఏమియు చింతింపక నుండవలయును.

''ఆత్మ సంస్థం మనః కృత్వా నకించిదపి చింతయేత్‌''

అనవాక్యము సర్వజ్ఞానోత్తరములోని 37వ శ్లోకమున కలదు. శంకరు లీస్థితియోగమునకు పరమవిధి (ఏషం యోగస్యపమో విధిః) అని చెప్పిరి.

ఇక్కడ ఒక సందేహనివృత్తి చేయవలయును. ఆత్మ ఎట్టిదో ఎఱుగనప్పుడు. ఆత్మయందు మనస్సు నిల్పుట (ఆత్మ సంస్థం మనః కృత్వా) ఎట్లని శ్రీరమణమహర్షిని ప్రశ్నించిరి. మహర్షి తన అనుభవ జ్ఞానమును పురస్కరించుకొని ఇట్లు సమాధానము తెలిపెను. మనస్సనగా ఆలోచనల సమూహము. ఈ ఆలోచనలు ఆత్మనుండియే వెలువడును. ఆలోచనలను నిలుపు కొన్నచో మనస్సు తన స్థానమైన ఆత్మయందు చేరును. ఇదియే నిజమైన మౌనస్ధితి లేదా సహజ స్థితి. నోరు మూసుకొన్నంత మాత్రమున మౌనము సిద్ధించదు. అందులకే ''న కించిదపి చింతయేత్‌'' అని తరువాత చెప్పబడినది. మనస్సు వికల్పములను వదలిన అది నిర్వికల్ప సమాధియగును. నిద్రలో ఆనందము తెలియదు. తురీయస్థితిలో అది అనుభవమునకు గోచరించును.

శాక్తేయులు మనస్సును మహాస్మశానముగా మార్చవలయు నందురు. అందులో శివుడు తాండవించును. స్మశానమున మొక్కలు మొలకెత్తవు. అట్లే మనస్సులో ఆరోచనలు మొలకెత్తరాదు. అట్టి నిర్విషయమైన మనస్సున ఆత్మ సాక్షాత్కరించునని భావము.

శ్లో|| యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్‌

తతస్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్‌

గీత 6-26

చంచలమైన మానసము నలుదిక్కుల పరుగిడుచుండును. అట్టి దానిని ఆ విషయములనుండి మరల్చి వశపరకొనవలయును.

శ్లో|| ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం

ఉపైతి శాంత రజసం బ్రహ్మభూత మ కల్మషం

గీత 6-27

యోగాభ్యాస మొనర్చినకొలది మనస్సుయొక్క చంచలత్వము పోవుచుండును. రజోగుణము (మనోవిక్షేపము) నశించును. బ్రహ్మ భావన బొందును. అంతటను దోషములేని నిర్మబలభావము గలుగును. ప్రయత్న మత్యావశ్యకము.

శ్లో|| ఫ్రయత్నాద్యత మానస్తు యోగీ సం శుద్ధ కల్పిషః

అనేక జన్మ సంసిద్ధ స్తతోయాతి పరాం గతిమ్‌

గీత 6-45

శ్లో|| అనభ్యాస వతశ్చైవ వృధా గోష్ఠ్యాన సిద్ధతి

తస్మాత్‌ సర్వ ప్రయత్నేన యోగమేవ సదాభ్య సేత్‌

క|| ఏ సిద్ధియులేదు విజి

జ్ఞాసువులకు శాస్త్ర చర్చ సలుపుట మాత్రన్‌

వీసం బే.... .... ....

ఉపాసన లేకున్న సిద్ధి ప్రాప్తింపదు

- రమణమహర్షి

జ్ఞానస్థితి మనస్సును దాటినది కాబట్టి దానిని మనస్సుతో వర్ణింప వీలుకాదు, దానిని వర్ణించుట మౌనముతోనే సాధ్యమగును. మౌనము నుండి ఆలోచన, దానినుండి అహంకారము, దానినుండి మాటలు వచ్చినవి. కావున మాటలకంటె మౌనమే శ్రేష్ఠము. నే నెరవను విచారము చేయునది అహంకారమే. దీనిలో అహంకారము నశించును. ఆత్మకు విచారములేదు.

ఈ ఆంతరంగిక సాధనమే భాగవతమున శమీక మహర్షియం దగుపించుచున్నది.

సీ|| మెలగుట చాలించి మీలిత నేత్రుడై

శాంతుడై కూర్చుండి జడత లేక

ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబుల

బహిరంగ వీధుల బారనీక

జాగరణాదిక స్థానత్రయము దాటి

పరమమై యుండెడి పదము దెలిసి

భాగవతము 1-458

యున్న శమీకునిస్థితి ఆంతరంగిక సాధనవలన ఏర్పడిన సమాధిస్థితియే కదా.

మనస్సును విషయాసక్తము చేయక ఆత్మయందు లగ్నము చేసిన జీవన్ముక్తు డగును. అమృతబిందు ఉపనిషత్తున

శ్లో|| మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః

బంధాయ విషయా సక్తం ముక్త్వై నిర్విషయం స్మృతమ్‌

అని చెప్పబడినది. బంధమోక్షముల రెండింటికిని మనసే కారణము, మనస్సు విషయాసక్తమైన బంధము నిర్విషయమైన మోక్షము.

ధ్యానమునందు మనస్సు పాల్గొనును. ఇంద్రియములు పాల్గొనవు, అందువలన మానసిక ఏకాగ్రతయే ధ్యానమని నిర్వచింప వలయును. మనస్సును దేనియందు నిలుపుదుమో దానియందు లగ్నమగును. విషయములయందు నిలిపిన విషయములను మననము చేయును. బ్రహ్మమునందు నిలిపిన బ్రహ్మభావన కలుగును. మనసు ఉన్నదని దానిని చంపవలెనని ప్రయత్నింపరాదు. మనస్సు ఉత్పన్నమగు స్థానమును తెలిసికొనిన అది ఉండదు. ఆలోచన లెక్కడనుండి బయలుదేరుచున్నావో విచారించిన అవి ఉత్పన్నములు కావని రమణ మహర్షి మనో నిగ్రహమున కుపాయము తెలిపెను. మనస్సుతో ప్రపంచ మేర్పడును. నిద్రలో ప్రపంచము లేదు.

అహంవృత్తియే మనస్సు తొలివృత్తి. అహంకారము లేనప్పుడు మమకారము లేదు. నేను లేనప్పుడు నాదిలేదు. అందువలన భక్తుడు తానై (బ్రహ్మమై) వెలయునని, స్వస్వరూవ జ్ఞానము కలవాడగునని రమణమహర్షి ఉపదేశించెను,

మనస్సు నిల్పుటకు కుండలినీ యోగము:-

శాక్తేయులు మనస్సును నిగ్రహించుటకు కుండలినీ యోగమును ఆవలంబింతురు. మూలాధారమునుండి సహస్రారమువరకు అధఃకుండలిని. దీనిని సాధించినవారికి ఇంద్రియ మనోనిగ్రహములు కలుగును. భ్రూమధ్యము నుండి సహస్రారమువరకు గల నవచక్రములు ఊర్ధ్వకుండలిని, దీనిని సాధించిన మోక్షము లభించును. శ్రీ రమణమహర్షి కుంటలినీ శక్తి ఆత్మశక్తి ఒకటేనని, మనస్సును ఆత్మసంస్థము చేసిన కుండలినీ ఉత్థాపనము కలుగునని తెలిపెను. కుండలినీ శక్తి యదార్థ స్వరూపము తెలిసికొన్నప్పుడు అఖండాకారవృత్తి అని అహంస్ఫురణమనీ చెప్పుదురని రమణమహర్షి తెలిపిరి.

శాంతి ఎట్లు లభించును:-

ఇంద్రియ మనోనిగ్రహములు లేనిది శాంతి లభింపదు. శాంతియనగా కామాద్యరిషడ్వర్గముల లయము.

శ్లో|| ధ్యాయతో విషయాన్‌ పుసః సంగ స్తే షూపజాయతే

సంగాత్‌ సంజాయతే కామః కామాత్‌ క్రోధో7భిజాయతే

గీత 2-62

పురుషుడు విషయములను ధ్యానించుటచేత వానియం దతనికి ఆసక్తి కలుగును. ఆ యాసక్తి వలన కామము కలుగును. కామము చేత క్రోధము కలుగును.

శ్లో|| క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహాత్‌ స్మృతి విభ్రమః

స్మృతి భ్రంశా ద్బుద్ధినాసో బుద్ధినాశా త్ర్పణ స్యతి.

గీత 2-63

క్రోధమువలన మోహము, మోహమువలన స్మృతి భ్రంశము దానివలన బుద్ధినాశము, బుద్ధినాశమువలన స్వరూపనాశము కలుగును.

శ్లో|| రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్‌

ఆత్మవసై#్య ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి.

గీత 2-64

అందువలన రాగద్వేషములను వదలి స్వాధీనములై న ఇంద్రియములచేత శరీరము నిలుచుటకై విడువ శక్యముకాని విషయముల ననుభవించుచు స్వాధీనమైన మనస్సుగల యోగి నిర్మలు డగును.

రాగద్వేషముల వదలుటచే ఇంద్రియజయము, ఇంద్రియజయముచే మనోజయము, మనోజయముచే నాత్మ దర్శనమునకు వలయుమనో నై ర్మల్యము గలుగును.

శ్లో|| ప్రసాదే సర్వ దుఃఖానాం హాని రస్యోప జాయతే

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవ తిష్ఠతి

గీత 2-65

నిర్మలత్వము కలుగుటవలన వీనికి సర్వదుఃఖములు నశించును. ఎందుకనగా ప్రసన్నమగు మనస్సు గలవానికి శీఘ్రముగా బుద్ధి ఆకాశమువలె నంతట నుండునదియై స్థిరపడును.

శ్లో|| నాస్తి బుద్ధి రయుక్తస్య నచా యుక్తస్య భావనా

నాచ భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్‌.

గీత 2-66

ఇంద్రియ నిగ్రహము లేనివానికి అత్మబుద్ధి కలుగదు. ఆత్మ స్వరూప భావన కలుగదు. ఆత్మభావన లేనివానికి చిత్త సిరము కలుగదు. చిత్తస్థిరము లేనివానికి సుఖము కలుగదు.

శ్లో|| ఇంద్రియాణాంహి చరతాం యన్మనో7ను విధీయతే

తదస్య హరతి ప్రజ్ఞాం వాయు ర్నావ మివాంభసి

గీత 2-67

స్వేచ్ఛగా విషయములలో దిరుగుచున్న ఇంద్రియములకు మనస్సు లోబడిన ఎడల సముద్రమునందు గాలిలో చిక్కిన నావవలె పురుషునియొక్క బుద్ధిని హరించును.

శ్లో|| తస్మాదస్య మహాబాహో నిగృహీతాని సర్వశః

ఇంద్రియా ణీంద్రియార్ధేభ్య స్తన్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

గీత 2-68

ఎవడు తన ఇంద్రియములను విషయములనుండి మరలించునో అతని బుద్ధి నిశ్చల మగును.

నే నెవరను విచారము సాధ్యముగానప్పుడు ధ్యానము జపము చేయవలెను. మనస్సు ఏకముపై నిలిచి ఉద్భవించిన స్థానముచేరి నశించునని రణమహర్షి తెలిపెను.

యోగయుక్త పురుషుని లక్షణములు:-

శ్లో|| సర్వ భూతస్థ మాత్మానం సర్వభూతాని చాత్మని

ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శినః -గీత 6-29

యోగయుక్తుడు అంతటను సమానమగు ఆత్మధర్మము

గలవాడగును. తాను సర్వభూతముల యందును, సర్వభూతములు తన యందును ఉన్నట్లు అనుభవముచే తెలిసికొనుచున్నాడు.

శ్లో|| యో మాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి

తస్యాహం న ప్రణశ్యామి. సచ మే న ప్రణశ్యతి.

గీత 6-30

ఎవడు సమస్త భూతములయందు నన్నును నాయందు సమస్త భూతములను జూచుచున్నాడో అతనికి నేను నా కతడు ప్రత్యక్షులుగా నుందుము.

శ్లో|| సర్వభూత స్థితం యో మాం భజ త్యేకత్వమా స్థితః

సర్వధా వర్తమానో7పి స యోగీ మయివర్తతే.

- 6-31

అన్ని భూతములయందు నే నున్నానను జ్ఞానము గలిగి నన్ను భజించువాడు సర్వ ప్రకారములుగాను నాయందే యుండును.

ఎవరు యోగిశ్రేష్ఠుడు:-

శ్లో|| ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో7ర్జున

సుఖంవా యదివా దుఃఖం స యోగీ పరమో మతః

-6-32

ఎవడు సర్వభూత సుఖ దుఃఖములను తన సుఖదుఃఖములుగా దలచునో ఎవ్వనికిని ప్రతికూలము చేయక అహింసకుడై యుండునో అట్టి జ్ఞాని నాకు సమ్మతుడైనవాడు జ్ఞానులలో నుత్తముడు.

శ్లో|| యోగినా మపి సర్వేషాం మద్గతే నాంతరాత్మనా

శ్రద్ధావాన్‌ భజతే యోమాం సమే యుక్త తమో మతః

- 6-47

యోగులందరిలో నా యందంతఃకరణము గలవాడగుచు శ్రద్ధతో నన్నెవడు సేవించుచున్నడో అతడు యోగి శ్రేష్ఠుడని నా మతము.

యోగభ్రష్టుడు నశింపడు:-

అర్జునున కొక సందేహము కలిగెను. యోగమునందు శ్రద్దు మాత్రము కలిగి మనోనిగ్రహశక్తి చాలక మృతినొందిన వానికేమిగతి కల్గునని శ్రీకృష్ణుని ప్రశ్నించెను.

శ్లో|| పార్థః నై వేహ నాముత్ర వినాశ స్తస్య విద్యతే

న హి కల్యాణకృ త్కశ్చి ద్దుర్గతిం తాత! గచ్ఛతి

గీత 6-40

ఇట్టి యోగభ్రష్టునకు ఇహపరలోకములందు నాశనము లేదు. మంచిచేసినవాని కెన్నటికి దుర్గతి లేదుకదా!

శ్లో|| ప్రాప్య పుణ్య కృతాం లోకా నుషిత్వా శశ్వతీ స్సమాః

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే

- 6-41

యోగసిద్ధిని బొందలేక ఎవడు మరణించుచున్నాడో అతడు పుణ్యకర్మలు చేసినవాడు పొందు స్వర్గాది లోకములనుపొంది అందు బహుకాలము సుఖముగానుండి మఱల భూలోకమున పరిశుద్ధులగు శ్రీమంతుల ఇండ్లలో జన్మించుచున్నాడు.

శ్లో|| అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం

ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీ దృశమ్‌ - 6-42

లేదా, బుద్ధిమంతులగు యోగుల వంశములో బుట్టును, యోగుల వంశమున బుట్టుట దుర్లభవము.

శ్లో|| తత్ర తం బుద్ధి సంయోగం లభ##తే పౌర్వ దైహికమ్‌

యత తేచ తతో భూయ స్పంసిద్ధౌ కురునందన - 6-43

అట్లు యోగులవంశమున బుట్టి పూర్వదేహమున సంపాదించిన యోగబుద్ధి విశేషమును పొందుచున్నాడు. అనేకరెట్లు యోగసిద్ధికొరకు ప్రయత్నము చేయుచున్నాడు.

శ్లో|| పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హవ్యశోపి సః

జిజ్ఞాసురపి యోగస్య శబ్దబ్రహ్మాతి వర్తతే

పూర్వ జన్మమునందు జేసిన యోగాభ్యాసమువలననే అతడు బలవంతముగా మఱల యోగాభ్యాసమును జేయవలసిన వాడగును. యోగాభ్యాసమును చేయు సాధకుడుకూడ శబ్దబ్రహ్మము నతివర్తించుచున్నాడు.

శ్లో|| ప్రయత్నా ద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః

అనేక జన్మసంసిద్ధ స్తతోయాతి పరాంగతిమ్‌ 6-45

కృషియొనర్చు యోగి ఒక జన్మమున తరింపక పోయినను ఒక జన్మముకంటె మరియొక దానిలో విశేషముగా తనదోషముల హరింపజేసికొని తుదకు యోగసిద్ధుడై ముక్తిని బొందును.

వేదములయందు ఇంద్రియ మనోజయములు సూచింపబడెనా

ఇంద్రియనిగ్రహము వృత్రాసురవధ కథ చేతను మనోజయము అంగిరసుల కథచేతను వేదమున సూచింపబడినది. ఈ విషయము చిత్రకేతూ పాఖ్యానమున ముందు వివరించితిని.

పై విధముగా గీతలో ఆంతరంగిక, బాహ్యపద్ధతులతో ధ్యానము వివరింవబడినది. ధ్యానయోగమును చక్కగా సూచించిన వేమన పద్యముతో ఈ చర్చ ముగింతును.

పెక్కుచదువులేల? చిక్కువాదములేల? ఒక్క మనసుతోడ నూరకున్న సర్వసిద్ధుడౌను, సర్వంబు తానౌను విశ్వదాభిరామ! వినుర వేమ!

Sri Bhagavadgeetha Madanam-1    Chapters