Mahayogama    Chapters   

ఓమ్‌

మ హా యో గ ము

೧೨.మహర్షి భాషణలు, వివరణలు - మరికొన్ని

- * -

*వివిదమతస్థుల భావవైరుద్యాలు - సమన్యయము.

" ఏ మతానికైనా స్వస్వరూపం సరిగా తెలుసుకోవడమే లక్ష్యం. దానికై యత్నిస్తే ఏ వైరుధ్యమూ ఉండదు. జనసామాన్యాని కది సులభం తన స్వరూప స్పృహ లేని వాడెవ్వడూ ఉండడు. దాన్ని గూర్చిన ప్రసంగాలేవీ వారికవసరం కావు. ఆ ప్రసంగాలకు వారు కట్టే విలువ అత్యల్పం. వారు వినగోరేవి సుదూరవిషయాలు - స్వర్గ నరకాలు, పునర్జన్మ యిత్యాది వారు వలచేవి దుర్జేయాలు; సర్వ సామాన్యంగా అందరెఱిగేచప్పిడి నాజాలు గావు. ఎన్నటికైనా ఆత్మార్థము మరలిరాగలన్న ఆశతో మతాలు వారి నుబ్బవేస్తాయి కాని వ్యర్థభ్రమణం కట్టిపెట్టి, యిప్పుడే ఆత్మను వెదకి కన్గొని అందేల సుప్రతిష్ఠుతుడు కారాదు? ఊర్థ్వలోకాలు, వానిని చూచిచింతించే వారికి దూరాలుకావు. ఆ లోకాలు అచట చేరనాసించే అహంతపాటి నిజాలే. సహజస్థితియే నిక్కమైన స్వర్గం ; ఆ ఆత్మ పదానికి వేరుగా ఏ లోకాలూ ఉండబోవు.

"ఎక్కడో అంతరాళాన స్వర్గంలో , అతిదూరాన, అతని సాయం లేక మనకందని తావుల్లో దైవమున్నాడనకుంటే క్త్రైస్తవునికి తృప్తి లేదు వానిప్రకారం జీసస్‌ యొక్కడే దైవాన్నెఱుగు. ఆతడొక్కడే మానవులను దైవంవద్దకు కొనిపోగలడు. అతనితో 'స్వారాజ్యం నీలోనున్న దంటే సరళ##మైన వాచ్యార్థాన్ని గ్రహించక దానికెన్నో చిలవలు పలవలు గల్పించి క్లిష్టార్థాలు దూరాన్వాయాలూ అంటగట్టుతాడు పరిణతబుద్ధి యొకడే సులువూ ఋజువూ అయిన కేవల సత్యాన్ని గ్రహించగలడు.

బోధల్లో వైరుధ్యం బాహ్యానికే. దైవానికి ఆత్మను నివేదిస్తే అదితొలగిపోతుంది. అది ఆత్మను దరియజేస్తుంది. ఎవ్వరైనా, యెప్పటికైనా, చివర కచ్చటికే చేరుకోవలె, అదే సత్యం గనుక. విశేషధర్మాల్లోని అసంగతాలను గుణావగుణ చర్చతో వదల్చుకోగాదు. ఆ చర్చ మనః ప్రవృతియే విశేష ధర్మాలుగూడా మానసికాలు - వాని ఉనికి మనస్సులోనే ; సత్యమో మనస్సు కావలిది. అందువల్ల సత్యంవిశేష ధర్మాల్లోనిది గాదు". కాబట్టి మనం విశేష ధర్మాలపై నాధారపడలేము.

మహర్షిదే మరియొక కధనం - "స్వారాజ్య" (kingdom of Heaven) మని జీసస్‌ నిర్దేశించినదేదో ఉపనిషదర్థ దైవవేదాంతి యెఱుగును. క్రైస్తవ ఋషి ప్రతిపాదించినదీ, ఆ సంప్రదాయి గ్రహింప జాలనిదీ అయిన 'స్వారాజ్యము' కేవల నాహంస్థితియే

కాబట్టి ఆత్మవిచారానికి పూని, విశేష ధర్మాలను దాటిపోవలె : లేదా, వానిలో నొకటిని, అంటీఅంటనట్లు అవలంబించి, దాని విధుల నాచరించుటలో యత్నమంతా కేంద్రీకరించవలె. విశ్వాసాలలో ఉత్కంఠ నియమాచరణలో శైధిల్యకారణ మవుతుంది. లోకాయతునికి, నాస్తికునిగూడ వానివాని విశేషధర్మ ముంటుంది. సజ్జీవనం వల్ల కలిగే శుద్ధమానసం వినా వారికీ ఆయామతస్థులకూ భేదమెంతో లేదు. అందుకే మహర్షి యంటారు : హృదయాంతరాత్మ నెఱిగి ఆస్థితియందు నిలుకడ జెందక, ఉన్నది, లేదు; రూపము, అరూపము ; ఏకము, ద్వయము ; రెండునూ గాదు అనివాదించుటయే జ్ఞానహీనత".

"వైదిక వాఙ్మయం చాల విస్తారమైనది. దానిలోని వేర్వేరు భాగాలను, వేర్వేరు తరముల సాధకులు యధాయోగ్యంగా అధ్యనం చేస్తారు. ప్రతివారూ ఒక్కొక్క భాగమే గడచి తరువాతి భాగాలకు సాగిపోతారు. ఉత్తరోత్తర భాగాల సాధకులకు పూర్వ పూర్వాలు వృధలేగాక మృషలూ కావచ్చును. చివరకు వారు వాని నన్నటినీ అధిగ మిస్తారు".

* ప్రమాదము (original Sin)

INRPª«sWlLiª«sL][ \ZNPQQûxqsòª«sLiÍÜ[¬s úxmsª«sWµR…zqsµôðyLi»y¬sõ gRiWLjiè @²T…gjiƒyLRiV úxms¼½ª«sWƒ«sª«so²R…V FyxmsLiÍÜ[®ƒs[ xmsoÉíÓÁƒy²R…V. µy¬sƒ«sVLiÀÁ ª«sVVNTPò ÒÁxqsxqsVƒ«sV „saRP*zqs}qsò®ƒs[ ryµ³R…ùLi. Bµk… NýRPVxmsòLigS A zqsµôðyLi»R½Li. ª«sVx¤¦¦¦L<ji ¸R…VƒyõLRiV : " పాపం మానవునిలో ఉందన్నారు కాని మానవత్వం నిద్రలో లేదు ; అది మెలకువలోనే గోచరిస్తుంది. దానితో సహా 'నేనీ దేహాన్ని' అనే భావమూ ఉదయిస్తుంది. ఆతలపే 'ప్రమాదము'. ప్రమాద నిర్వాపణకు అహంత చావవలె : ఆ తర్వాత ఆతలపేరాదు. అలాగే ఆ మతతత్త్వంలోని సిలువ=దేహం ; మనుజపుత్త్రుడైన జీసస్‌ =అహంత ; సిలువ వేసిన పిదప వాని ఉత్థానం 'దైవపుత్రుడు'గా అదే తేజస్వంతమైన ఆత్మసత్యం. బ్రదుకవలెనంటే అహంత చావవలె". ఋషులందరియభిప్రాయాల్లోనూ అహంతాజీవనం చావేగాని, నిక్కపు బ్రదుకుగాదు.

* నాహంస్థితిలో ఆత్మజ్ఞానముండునా ?

నాహంస్థితి స్వరూపాన్ని మహర్షి 'నేతి' మార్గాన తెలియపఱచి నారు. ఆత్మజ్ఞానమనేది ఒకస్థితి. 'జ్ఞానజ్ఞానములు లేనిదే జ్ఞానమగును. ఎఱుగునది యథార్థ జ్ఞానము కాదు. ఎఱుగుటకును, ఎఱిగించుటకును అన్యము లేక తాను వెలుగుట వలననే జ్ఞానమగును. శూన్యము కాదని యెఱుగుము". 1 నాహంస్థితినిట్లు అభావరూపం గానే వర్ణించారు గనుక చాలమంది దానిని కేవల శూన్యమని, సర్వోన్మూలన మని తలపోస్తారు. గౌతమబుద్ధుని పరిజనులుగా ప్రకటించుకొనే వారు బహుళంగాచేసిన తప్పిదమిదే. తనకు శిష్యులు కానున్న వారిట్టి అపార్థాలకు లోనుగాకుండా మహర్షి జాగ్రత్తపడి అది శూన్యస్థితిగాదని నొక్కి చెప్పినారు.

మహర్షి విద్యావిద్యల కవ్వలి తలంవారు. వారికి నేర్వవలసిన దేమియూ లేదు. వైదిక వాఙ్మయంసైతం వారి కింపుగొల్పదు. అడిగిన వారికి సరియైన అర్థం వివరించడానికై ఆగ్రంధాలను వారవలోకించవచ్చు. ఈ సందర్భంలో మనమీక్రిందివచనాన్ని అర్థం జేసుకోగలం :-"అన్నియు చదివిన పండితుడుగూడ చదువని ఋషికి మ్రొక్కనే వలయును. పండితుడు తెలిసియు తెలియని వాడు. ఋషి కూడ తెలియనివాడే ; అతనికి తెలియవలసిన దేమియూలేదు"

* విధిమతులలో జీవితాన్ని నిశ్చయించేదేది ?

ఇట్లు ప్రశ్నించేవాడు విస్పష్టార్థమైన ఉత్తరం గోరుతాడు. విధి పురుషకారాల్లో జీవితాన్ని నిశ్చింయిచేదేదియో తెలిసికోవలె. మహర్షి రచనాల్లో పై ప్రశ్నకుత్తరం అగపతుంది. "విధిమతుల మూలవివేకము లేనివారికే విధిమతులు గెలుచు వివాదము కలదు. విధిమతులకు ఏకమూలమైన తనను ఎఱింగినవారు, అవితొలగింనవారు. వారు మరలవానింజేరగలరా ? చెప్పుము".2

--------------------------------------------

1. ఉన్నది నలుపది, శ్లో. 12. 10, 11 కూడ.

2. ఉన్నది నలుపది , శ్లో.19

ఇట్లే ప్రశ్నించిన యొక ఆగంతుకునితో మహర్షి యన్నారు : " ఈ ప్రశ్నకు ఉత్తరం ఇచ్చినా అది అర్థంకావడం కష్టం. అయినా ప్రతివారూ తమజీవితాల్లో ఎప్పుడో ఒకప్పుడీ ప్రశ్ననడుగక మానరు. విధిచే బాధితుడుగనో, అబాధితుడుగనో కనుపించిన వానియాధార్ధ్యం కనుగోవలె" ఇట మహర్షి అహంతనుద్దేశించారన్నది స్పష్టం. విధిమతుల వివేచన అహంమతికేగనుక, దానియాధార్థ్యానికీ అహంత యాధార్థ్యానికీ అవినాభావం. అది తెలియడానికి విచారమే ఉపాయం ఆ పైన మహర్షి విధియంటే యేమో వివరింపసాగారు. "విధికొక ఆది (కారణం) ఉన్నది. అది యొక చేష్ట. సంకల్పం లేక చేష్ట లేదు. సంకల్పమే మతీపురుషకారమూనూ. అట్లు సంకల్పం మొదటి కారణం గనుక అదే బలవత్తరము; కాబట్టి మతిని పెంపొందించుటవలన విధిని జయించవచ్చును." మతిని పెంపొందించడానికి విచరసరణి, అంటే ఋషులు చెప్పిన అన్వేషణో కాక కేవల సద్వస్తువగుదైవానికి శరణా గతియో ఉపాదేయాలు. అందరూ సామాన్యంగా పలికే ఆత్మ విశ్వాసం నిజంగా అహంతావిశ్వాసం. అది బంధనాలను దృఢతరం జేస్తుంది. దైవాన్ని నమ్మడమే నిజమైన ఆత్మవిశ్వాసం. దైవమేకదా ఆత్మ? అందుచేత."

* గురువక్కఱలేదా ?

మతాసక్తి కలవారిలో సర్వసాధారణౖన యభిప్రాయం - ముముక్షువు క్రమేణ వెదకి గురువును గ్రహించవలెనని. ఈ నమ్మకం సరియైనదా ? అని యొకరడిగితే మహర్షి వచించారు : " తాను లఘువు ననుకొన్నంత కాలం, గురువును చేపట్టనేవలె. కాని ఆయనను ఒక వ్యక్తిగా భావించరాదు. గురువు శిష్యుని యంత రాత్మ కెప్పుడునూ భిన్నుడు కాడు. ఆత్మ సిద్ధించిన నాడు గురువూ లేడు, శిష్యుడూ లేడు" మహర్షికి బాహ్యంగా ఏ గురువూ లేనందున ఆ ప్రశ్న. ఇంకోమారు మహర్షియే అన్నారు. "క్రొత్తవేమైనా నేర్చేటైతే గురువు కావలె, కాని యిది మఱచుటే కదా?"

* జీవితములో సంకటహరణ మెట్లు ?

పృ || నేనుపడే బాధల కంతులేదు. సుఖంగా బ్రదకడానికి కావల సినవన్నీయున్నా, నాకు శాంతి లేదు.

మ|| ఆ బాధలు నిద్రలో గూడానా ?

పృ || నిద్రలో అవి లేవు.

మ || కలత లేవీ లేక నిద్రించిన అతడేనా యిప్పటి నీవు, కాక వేరా ?

పృ || వేరుకాను. అతడే నేను.

మ || అటైతే ఆ బాధలు నీకు చెందినవి కావు. అవి నీకారోపించుకొన్న తప్పు నీదే.

*ధ్యానము , మనోనిగ్రహమూ.

ధ్యానం ఒక యుద్ధం : ఇతర తలపులన్నిటి నీవెనుకకునెట్టి ఒక యొక తలపునంటిపెట్టుకొనే యత్నమది. వేరుతలపులు ముసరి ఆ ఒక్క తలపును ముంచివేయబూనుకొంటాయి. ఆ ఒక్కటే బలాన్ని పుంజుకుంటే ఇతరాలన్నీ పలాయనం. ఏకసంధాగా తలపుల నియమించలేనివానికి ప్రాణాయామం విధించారు. అది గుఱ్ఱానికి కళ్ళెంవంటిది. కాని అతడు ప్రాణవాయునియమనంతో ఆగరాదు. ప్రాణరోధ ప్రయోజనం మనశ్చాంచల్యమరచి దాన్ని స్తిమితంజేయడం. అది పూర్తి అయిన తర్వాత చిత్తైకాగ్రత నభ్యసించవలె. కాలం జరుగగా ప్రాణరోధంతో పని తీరిపోతుంది. ధ్యానప్రయత్నారంభంతో మనస్సు స్థిరమౌతుంది. ధ్యానం ఒకమారు సుప్రతిష్ఠితమైతే మరిదాన్ని కదలింప వీలుగాదు. లోకవ్యవహారాల్లో ఆటల్లో యితర చేతుల్లో ప్రవృత్తుడై యుండిగూడా అతని ధ్యానం అయత్నంగా సాగుతుంది : నిద్రలోనూ అట్లే ధ్యానంలో నిలుకడకు ధ్యానమే సాధనం; జపమౌనములక్కఱలేదు. స్వార్థకర్మప్రవృత్తుని మౌనవ్రతం శుభ ఫలాలీయదు. ధ్యానం అన్నితలపుల నార్పివేయగా, సత్యమొక్కటే మిగిలి వెలుగుతుంది.

కర్పూరం జ్వలించి నిశ్శేషమవుతుంది. మనస్సు కర్పూర సమం కావలె. ఆత్మ సత్యం కనుగొని అదిగాకావలెనన్న దృఢదీక్షతో తపించి తపించి పూర్తిగా కరగిపోవలె. అది మనస్సన్నజాడలవలేశమూ మిగులనప్పుడు అదే ఆ త్మైక్యం.

గురువును కనుగొనేదెట్లని ప్రశ్న. "తీవ్రధ్యానంవల్ల" అని బదులు.

* ఋషిత్వం సిద్ధించిన తర్వాత గూడధ్యానాభ్యాసం సాగనేవలె నని కొందరి యూహ. దానికి మహర్షి "నాహుంస్థితిలో మనస్సు మఱిగిపోగా, చిత్తైకాగ్రత యేమి ? అది లేకపోవుటేమి ? ఆత్మసిద్ధికి పిదప సమాధి యత్నమూలేదు, దానిని విడుచుటా లేదు".

అరుదుగా కొద్దిమందికి ధ్యానం సత్వరం సిద్ధిస్తుంది : ఇతరులకు చిరకాల అభ్యసించిన వెనుక. ఈ విషయంగా మహర్షి : "ధ్యానాన్ని వాసనలడ్డుతవి. కాబట్టి వాసనలను దుర్బలాలు జేసేకొద్దీ, ధ్యానం ఫలకారి యవుతుంది. కొందరి మనస్సులు తుపాకిమందువలె క్షణంలో ప్రేలి భస్మమవుతవి. కొన్ని బొగ్గు, మరికొన్ని వంటచెఱకులవలె".

మనోనిగ్రహరహస్యాన్ని మహర్షి వెలువరస్తూ అన్నారు : "మనస్సు నిజంగానే ఉన్నదని భావించేవారు దాన్ని నిగ్రహించలేరు. దొంగను వెన్నాడే పోలీసువలె నటించే దొంగపోలిక యిట వర్తిస్తుంది. ఈ విధమైన యత్నాలు అహమికామనస్సుల బ్రదుకును పొడిగిస్తాయి". సరియైనగతి ఆ రెంటి నిజం పరిశీలించడం: అది ఆత్మా న్వేషణకు దారి జూపుతుంది.

మహర్షి యొకమారన్నారు : "మనస్సును నిగ్రహించుటెట్లన్న వారిని నాకామనస్సును చూపమంటాను. అది తలపుల వరుసనుమించదు. నునస్సును నియమించవలెననే కోరిక ఎన్నో తలపులలో ఒకటి దానితో మనస్సును నిగ్రహించేదెట్లు ? మనస్సుతోనే మనస్సును అంతంజేయ నెంచటం వెఱ్ఱి. దానికి మార్గం ఒకటే. దాని మూలాన్ని కనుగొని దాని ప్టుట విడువకుండుటే అంతట మనస్సు తనకు తానై మఱిగిపోతుంది. యోగం చిత్తవృత్తి నిరోధాన్ని విధిస్తుంది. అంత కన్న మెఱుగు, ఆచరణీయమూనని నేను ఆత్మాన్వేషణను ప్రశంసిస్తాను. మూర్ఛ ఉపవాసాదులలో మనస్సు అడగి యుంటుంది. ఆ కారణం తొలగిపోగానే మనస్సుకోలుకొంటుది : అంటే పూర్వం లాగే తలపులు ప్రసరిస్తాయి. మనస్సును స్వాధీనం జేసుకోవడానికి రెండే మార్గాలు : దాని మూలాన్ని చేజిక్కించుకో; కాకుంటే దాన్ని సర్వశక్తిపరంజేయి. ఆ శక్తియే మనస్సును హతమారుస్తుంది. శరణాగతిఉన్నతమూ ఊర్జితమునైన శాసకసత్వము కలదని యంగీకరించుటగును. తనమూలాన్ని వెదకుటలో మనస్సు తోడుపడకుంటే దాని దారినది పోనీ. అది తిరిగివచ్చేవరకూ వేచియుండు : రాగానేపట్టి దాని నంతర్ముఖంచేయి. ఓ ర్పూ పట్టుదలా లేక ఎవ్వరూ జయించలేరు".

భూమధ్యంలో దృష్టినిలిపి ధ్యానించటం భయకారణం కావచ్చని మహర్షి హెచ్చరించారు. సరియైనవిధం మనస్సు నాత్మయందే నిల్పడం. అది అభయం.

ఆత్మయందు ధ్యానం నిల్పటం సామాన్యార్థంలో వీలేగాదు. ధ్యానం ఏదో యొక విషయంపై ఆలోచనయని అందరూ అనుకోవటం పరిపాటి.ఇక్కడ విషయి విషయభేదం సూచితమైంది. ఆ విధిగా ఆత్మను ధ్యానించడం సాధ్యమేగాదు ఆత్మను ఆవరించియున్న తలపులన్నిటినీ తరిమివేయడమే ధ్యానం. అది అయిన పిదప ఆత్మ సహజ స్థితిలో భాసిస్తుంది. ఆ స్థితిలో నిలకడజెందుటే సాధ్యమయ్యే సద్వస్తుధ్యానము.3 అందుకే యిత రేతర వ్యాపృతుడైనట్లున్నా మహర్షి సదాధ్యానగతుడే.

* దుఃఖసహనమెట్లు ?

మనస్సు నంతర్ముఖంచేయటంవల్ల తీవ్రదుఃఖాన్ని జయించవచ్చు. తాను దేహమనుకొన్న వారికే క్లేశాలు సంభవం. రూపాన్నధిగమిస్తే ఆత్మనిత్యమనీ దానికి చావుపుట్టువులు లేవనీ తెలియవస్తుంది. జనన మరణాలు శరీరానివేగాని ఆత్మవిగావు. అహంత దేహానికి దూరంగా కన్పింపకున్నా, అది కల్పించినదే దేహం. అసలు అవి రెండూ వేరని గుర్తింపనేలేము. నిద్రలో దేహమన్న స్మృతియేయుండదు. కనుక దేహం నిజంగాదని గ్రహించగలరు. నిద్రలేవగనే అహంతాలేస్తుంది, తరువాత తలపులూ. ఈ తలపులెవ్వరికో తెలుసుకో. అవి యెందుండియో అడిగిచూడు.అవి ఆత్మచైతన్యం నుంచే జనించి యుండవలె. ఇది ఏమాత్రం గ్రహించినా, అది అహంతా నాశానికి తోడవుతుంది. ఆ పిమ్మట కేవలమగు అనంతస్థితి ఎఱుక వడుతుంది. అచ్చట వ్యక్తులెవ్వరూ ఉండరు. ఉంటే ఏకైక మా సద్వస్తువే. "పుట్టితినన్న తలపున్న చత్తునన్న తలపు తప్పదు. కాబట్టి తా నసలు పుట్టితినా యని ప్రశ్నించుకొమ్మను. అంత వానికెఱుగనౌతుంది. ఆత్మ నిత్యము; దేహం కేవలం తలపే, అది తలపులన్నిటికినీ ఆది, అన్ని యనర్థాలకు పునాది," యని.

--------------------------------

3. చూ. అనుబంధం'' శ్లో. 4 :

ఉ. న. ఉపోద్ఘాతము. శ్లో . |

కథం స్మరామస్తమేయమేకం

తస్యస్మృతిస్తత్రదృఛైవనిష్ఠా ||

* త్రిగుణములు

మూడు గుణాల్లోనూ ఒకటిని మార్చి మరి యొకటికి మనస్సు వశమౌతుంది. జడతబుద్ధిమాంద్యాలను తమస్సన్నారు. మూడించను అది అధమం. అంతకుపైది అస్థిర ప్రకృతియైన రజస్సు, మధ్యమం : అన్నింటికిని మిన్న ప్రసన్నత విస్పష్టతల తోడి సత్త్వం . అందు మొదటి రెండూ ప్రకటాలుగ నున్నవేయని చింతిస్తూ ఉండక, సత్త్వము తల సూపగానే పొందగలంత లాభమూ రాబట్టుకొండని మహర్షి శిష్యుల కుపదేశించారు.

* మరణము

"పోయినవాడే సుఖపడ్డాడు ; పీడకలయైన యీ శరీరాన్ని వదల్చుకొన్నాడు. మృతుడు శోకించడు. నిద్రయంటే ఎవరికన్న భయమా? లేదు. మీదు మిక్కిలి దాని నామంత్రించి, దానికై సిద్ధమౌతారు. కాని నిద్ర తత్కాల మృతి; మృతి దీర్ఘనిద్ర. ఒకడు బ్రదుకునందే చావు భావిస్తే, అంటే చావుగాని చావు సాధిస్తే, అంటే అహంతను కడజూస్తే , ఎవ్వరిమృతికినీ వాడు శోకించడు. అదీగాక మూడవస్థల్లోనూ, తను భావం ఉన్నా లేకున్నా, మనం సుస్థితులమే యని యెఱుగుదుము గనుక, తనకు గాని యొరులకుగాని యీతను శృంఖలాలు విడివడరాదన్న కోర్కి యెందుకు ?

చనిపోతున్నప్పుడు కష్టంగా దీర్ఘంగా ఊపిరి తీసుకోడమారంభమౌతుంది ; అంటే అతడు చనిపోతూన్న దేహాన్ని విస్మరించాడని అర్థం. ఆ క్షణమే మనస్సు ఇంకొక యుపాధిని లంకించుకొని, పూర్వో పాథితోడి సంగం పూర్తిగ క్రొత్తదానికి మార్చుకొన్న దాకా, ఆ రెంటి మధ్యా, అటూ యిటూ ఊగిసలాడుతుంది. ఈ లోగా కొన్ని మార్లు తీవ్రశ్వాస ఉంటుంది; మనస్సు చనిపోతూన్న ఉపాథిలో తిరిగి చొరబారిందన్న మాట. మనస్సుయొక్క యీ మధ్యంతరస్థితి కొంత మేర స్వప్నసమమనవచ్చు".

* జంతువుల కాత్మకలదా ?

మహర్షి జంతువులను మనుజ సమంగా సంభావిస్తారు వానికి ఆయన "ఆమె" 'వాడు' అన్న సర్వనామముపయోగిస్తారు. a పశువులు మానవులంత ఉత్తమమూలాయని యడిగితే వారన్నారు :- "అహంతావశులైయున్న పర్యంతమూ అంటే శుద్ధాత్మ స్పృహ కలుగ నంత కాలము మానవులను పశుమాత్రులుగనే ఉపనిషత్తులు గణించినవి. పశువులకన్న హీనంగానూ వారుండవచ్చును." చాల పరిపాక బుద్ధులు వారి ఆశ్రమవాతావరణంలో వసించేందుకై జంతురూపాలు ధరించియుండవచ్చునని మహర్షి యొకమారన్నారు. రమణాశ్రమంలో నాల్గుకుక్కలుండేవి. వానిలో ఎన్నో భక్తి లక్షణాలు కనుపించేవి. వాని కాహారంపెడితే అవి మహర్షికి వడ్డన అయి వారు భుజించమొదలిడిన దాకా తమ ఆహారాన్ని ముట్టేవిగావు. ఆ యన ఆరంభించగానే తమ ఆహారాన్ని క్షణంలోతిని మాయంచేసేవి. ఆ విషయంలో వానికంత నియమం.

* భక్తిరీతులు.

జపాదులు చేయననువైనవని వానిని చాలమంది అభ్యాస విషయంగా ఆదరిస్తారు. కాని ఆత్మనుమించిన వాస్తవం కలదా ? ప్రతి యొక్కరికది ప్రత్యక్షానుభవం, ప్రతిక్షణమూ వారు పొందుతున్నదే. అంద రెఱిగినదని నిరాక్షేపంగా చెప్పతగింది ఆత్మవస్తువే. స్థితియంది. కాబట్టి తెలియని దేనికొఱకో -దైవానికై లేక విశ్వానికై - అఱ్ఱత్తి చూచేకన్న, ఆత్మకొఱకే వెదకి కన్గొనరాదా ?

-----------------------------------

a. జంతువును 'అది' యనడం మనవాడుక,

* సమాధి - దానినిరూపణము.

"సెయింట్‌ పాల్‌ కొక యనుభవం కలిగింది. అందువల్ల అతడు జీసస్‌ ను నమ్మినాడు. అనుభూతమైన దృశ్యం నిజంగా అరూపము. కాని అనుభూతి తర్వాత దానినతడు క్రీస్తు దర్శనంగా రూపించాడు". తత్పూర్వం పాల్‌ జీసస్‌ ద్వేషికదాయన్న ఆక్షేపానికి బదులుగా మహర్షి యన్నారు : "అక్కడ ప్రచలితమైనది ప్రేమాద్వేషమా యన్నది ప్రస్తుతం కాదు, ఎట్లెతేనేం, క్రీస్తుపై తలపు అచట ఉండింది. రావణాది అసురులు సాదృశ్యమనుకో".

* లోకంలో మెలగవలసిన తీరు.

"రంగుస్థలంపై నటునిలాగా యీలోకంలో ప్రవర్తించవలె. ప్రతిచేష్ట వెనుకా, దానికాధారమైన చైతన్యమున్నది : అది జ్ఞప్తి యుంచుకొని నడచుకో".

* హృదయము.

హృదయమంటే ఏమి ? అదెక్కడ ఉన్నది ? ఇది తెలియడం అవశ్యం కాదు. ఆత్మవిచారం సాగించు. హృదయం తనపని తాను చేసుకుంటుంది."

* బుద్ధి.

"రూపంలో, పరిమాణంలో ఆత్మదేహమంతది అనుకొనకుండటం బుద్ధికి వశంగాదు."

* మనస్సు.

"చంద్రుని కాంతి సూర్యునుండివలె, మనస్సునకు చిత్కాంతి ఆత్మనుండి ప్రసృతి మౌతుంది. కాబట్టి ఆత్మ సూర్యుడు ప్రకాశింప నారంభిస్తే మనశ్చంద్రుడు కొఱమాలి పోతాడు".

* పరోపకారము.

"ఋషి తాను స్వరూపస్థితినున్న మాత్రానే జగదుపకారకు డౌతాడు. విశ్వశ్రేయానికై ఉత్తమసాధనం నాహంస్థితి సంపాదనమే".

"ప్రపంచానికుపకారం చేయునాతురత యుండి, నిరహంస్థితి సాధన అందుకు తోడ్పడదనుకుంటే, అపుడు ప్రపంచ సమస్యలతో బాటు నీ సమస్యాదైవానికే సమర్పించును.

*అర్జునుని విశ్వరూప దర్శనము.

" విశ్వగోళాల నధిగమించే నే నరూపుణ్ణి". అని అర్జునునితో అంటూనే శ్రీకృష్ణుడతనికి తన విశ్వరూపం ప్రదర్శించాడు. అర్జునుడందు తన్నూ, దేవతలను, సర్వలోకాలను చూచినాడు. ఆయనే దేవతలుగాని, నరులుగాని ఎవ్వరూ తన్ను చూడ జాలరన్నాడు. అయినా అర్జునుడాయన రూపాన్ని కనగల్గినాడు. శ్రీకృష్ణులు తాను కాలము నన్నారు. కాలమునకు ఆకారణమున్నదా ? విశ్వ మతని రూపే అయితే అది ఏకమూ అవికారమూ కావలె మరి శ్రీకృష్ణులు అర్జునినితో 'నాలో' నీ కోరిన వన్నియును జూడు' మని ఎందుకన్నట్లు ? సమాధాన మొకటే. అది మానసిక దృశ్యము. కేవలము చూపరికోరికకు అనురూపమైనది. అందుచేత శ్రీకృష్ణ భాషణము యధా శబ్దం గ్రహించరాదు. అది సర్వేశ్వరుని స్వరూపసత్యం కాదు. అందుకే దాన్ని "దివ్యదృశ్య" మన్నారు. అయినప్పుటికీ ప్రతి యొక్కడూ ఆ దృశ్యాన్ని తనయిష్టానుసారం చిత్రిస్తాడు. చిత్రమేమంటే చూపరిగూడ ఆ దృశ్యంలోనే యున్నాడు. ఇంద్రజాలికుడట్టి వేవైనాచేస్తే అది 'కనుకట్టు' ఇది 'దివ్యము' , ఎందుకీ భేద దృష్టి ? కృష్ణులర్జునునికి 'దివ్యచక్షు" విచ్చారు. 'జ్ఞానచక్షువు"నుగాదు. దాని క్టిట ఆభాసాలేవీ ఉండవు. డృశ్య విషయమేదీ నిజంకాజాలదు".

* కర్మయోగము - కర్మ సన్న్యాసము

వీనిగూర్చి అడిగినప్రశ్నలకు మహర్షి అప్పుడేమీ బదులీయలేదు. కొంతసేపటికి ఆయన కొండపైకి వెళ్లినారు. పృచ్ఛకుడు వెంటనున్నాడు. అక్కడి చిట్టడవిలో మహర్షి రెండు సన్నని పొడవుపాటి రెమ్మలు విరచి, ఎండుటాకులతో నున్నగారుద్ది చక్కటిచేతి కర్రలుగా తీర్చారు. ఒకటి పృచ్ఛకుని కిచ్చారు. ఇంతలో తన కర్ర పోగొట్టుకొని చింతిస్తూ ఆ దారినే వచ్చిన గొల్లనికి ఆ రెండవ కర్రనిచ్చి మహర్షి యన్నారు : "చేకర్రల తయారీ కర్మయోగము : వానినిచ్చి వేయుట కర్సన్న్యాసము". వానిని తనకని చేసుకోలేదుగదా ?

* ఆధాత్మిక కేంద్రం

అది ప్రాదేశికంగాదు. అది సార్వజనీనం సృజన లయన శక్తులు రెండూ దానివే.

* శ్రీ శంకర రామానుజ సామరస్యము.

"ప్రపంచము సత్యము : మాయ యన్నది లేదని రామానుజులు. శంకరులు ఈ పరివర్తిని సంసారానికి ఆధార సత్యమేదో కనుగొమ్మన్నారు. రామానుజుల 'వికార్యము'ను శంకరులు 'విభ్రమ' మన్నారు "భేదము కేవలము శాబ్దికము. ఇరువురిదీ గమ్య మొక్కటే".

* ఋషికి దైవధ్యాన మందునా ?

"ధ్యానము చింతన, చింతనావిస్మరణలు ఒందొరుల నపేక్షించేవి దైవాన్ని మఱచినవాడు దైవచింతన చేయవలె. తన్ను దాను మఱవ నట్లే ఋషి దైవాన్నెపుడూ మఱవడు : అందువల్ల దైవాన్ని ధ్యానించడు కాని ఆయన దైవాన్నెపుడూ విస్మరించ నందున, ఆయన్ను సదా ధ్యానిస్తున్నాడనడమూ నిజమే."

* దైవమును చూచుట.

ఒకరు. వారికి మహర్షి బోధ తెలియదు, వైదిక గ్రంధ పరిచయమూ లేదు. వారడిగిన ఎన్నో ప్రశ్నల్లో నొకటి : "దైవాన్ని మీరు చూచినారా ?" చిఱునవ్వి మహర్షి యన్నారు". ఎవరన్నా నాకగపడి 'నేను శివుడను', 'నేను రాముడను', 'నేను కృష్ణుడను' అని ప్రకటించియుంటే అట్టివారిని నేను చూచినానుకోవచ్చు. కాని నాకు వారెవ్వరూ కనబడి 'నేను ఫలానా' యని చెప్పలేదు" ఆ సమాధానం పృచ్ఛకుని అజ్ఞాన్నాని ఎత్తి చూపుతుంది. దైవంసత్యాత్మ, ఆయనకు రూపంలేదు. అందువల్ల ఒక విషయంగా ఆయన్ను చూడ వీలుగాదు.

అన్నిటా దైవాన్నే చూడటాన్ని మన దర్శనాలు ప్రస్తుతించాయి. ఆ విషయంగా మహర్షి యొకమారన్నారు. "విషయాలను చూడటం, వానిలో దైవాన్ని భావించడం, ఇవి మానసిక క్రియలు. అది దైవదర్శనంగాదు. దైవమున్నది అంతస్సులో". సర్వత్రాదైవభావనంటే, దైవం సద్వస్తువు, జగద్దృశ్యం అతనిపై ఆరోపితమని గ్రహించటం . దీన్ని "ప్రవిలాప దృష్టి" యంటారు - అది బహు రూపాంతరమందున్న బ్రహ్మమును స్మరించుట. దీనిని మనోదార్ఢ్యానికీ శుద్ధికీ సాధనంగా ఋషులు శ్లాఘించారు. 4

ఆత్మస్వరూపమును శ్రుతులేల చెప్పవు ?

"ఆత్మను తెలిసి కొనుటకు చేయవలసినది సర్వమూ కోశాది అనాత్మ విషయాలను ఒలిచి వేయుటయే. తాను మనిషియాదాకాయని శంకించేవాడు ఇతరుని అడిగిచూస్తాడు. అతడు వీనిని నీవు చెట్టువుకావు. ఆవువు కావు, అది కావు ఇది కావు అంటూ మనిషివి దప్ప

-------------------

4. తరంగఫేనాదికమబ్దికూత్రాం. స్వాప్నం జగత్‌ స్వప్నదృగేవ యద్వత్‌

సర్వప్రపంచో7ప్ర్యహమేవ నాన్య ఇతి ప్రతీతిః ప్రవిలాపదృష్టా ||

-------------------

మరేమీ కాదని స్పష్టం జేయ జూస్తాడు. ఆ మనిషి తృప్తి జెందక ఇంతకూ నేనెవరో చెప్పావు కావంటే, 'నీవు మనిషివి కాదనలేదేయని సమాధానం. అప్పటికీ వాడు తాను మనిషినని తెలుసుకొనకపోతే, వానికిక చెప్పి ప్రయోజనం లేదు. అట్లే మనమేది కాదో తెల్పితే, దాన్ని నిరాకరించి మిగిలిన సద్వస్తువు మనమని తెలియగలమని శ్రుతులట్లు చేసినవి".

*'నేనెవరు' అన్న విచారణ ఎట్లు ?

"ఆ మార్గం విషయగతంకాదు. స్వ-గతం. కాబట్టి అది ఒరులు చెప్పి చూపేది, చూపగల్గినదీ కాదు. తనయింటిలోనే దారి నొరులు చూపవలెనా ? సాధకుడు మనస్సును సుస్థిరం జేస్తే అదే చాలు.

"నే నెవరన్న ప్రశ్నకు సమాధానం, మనస్సునుండి, మనస్సు వలన లభించేటైతే, అది సమాధానమే కాదు", సరియైన సమాధానం నాహంస్థితియే.

* అపరో క్ష జ్ఞానమేమి ?

జ్ఞానము మానసికములైన తలపులకు వేరుగాదని కొందరి యభిప్రాయం. వారికి ఇంద్రియజ్ఞానమే అపరోక్షజ్ఞానం. కాని ఇంద్రియ విషయమాలు స్వయంవ్యక్తాలు కావు. కాబట్టి యంద్రియజ్ఞానం అపరోక్షజ్ఞానం కాదు. ఆత్మ స్వయం వ్యక్తం . కావున ఆత్మజ్ఞానం అపరోక్షం. ఆత్మదేనిద్వారానో కాక ప్రత్యక్షంగా కనుపించిందా అని అడిగితే గ్రుడ్లు మిటకరిస్తారు. ఎందుకంటే 'శుద్ధాహం' సాకారంగా వారి మ్రోల నిలువదు".

------------

4. తరంగ ఫేనాదిక మబ్ధి మాత్రాం, స్వాప్నం జగత్‌ స్వప్న దృగేవ యద్వత్‌|

సర్వప్రపంచో7ప్యహమేవ నాన్యఇతి ప్రతీతిః ప్రవిలాపదృష్టా ||

-------------

* శాశ్వత జీవితము.

"ఆత్మవిస్మృతి మృతియే. దాని స్మృతియే జీవితం. నీవు జీవిత శాశ్వతత్వం గోరుతావు. దానితో పోల్చితే నీ యిప్పటి జీవితం దుర్భరం గనుక. అది నీ సహజస్థితి కానందున్నే దుస్సహమయింది. నిజానికి నీవు శుద్ధాత్మవు. కాని నీవు ఆత్మను దేహంగా భావిస్తావు. ఆ ఉపాధి మానసిక కల్పన. విషయాకృతి గొన్న భావన. ఆయనస్సు తన వరకు తాను శుద్ధాత్మనుండి జనించినదే. ఉపాధి మారిన మాత్రాన లాభ##మేమి ? అహంత మరియొక దేహంలోకి నివాసం మార్చింది. ఇంతకూ జీవితమంటే యేమి ? అది చిత్‌ స్థితి : అదే నీవు. అచ్చపు జీవిత మది. అది నిత్యం (కాలాతీతం) శరీరంలో జీవితం పరిమితం. నీవు అపరిచ్ఛిన్న జీవమవు. దేహాత్మ భావన నశించినవాడు నీకు సహజమైన నిరవధిక సత్‌ స్థితి పునః ప్రాప్తమౌతుంది".

* సద్‌ వస్తువులో తరతమాలున్నవా ?

"తరతమాలు సద్వస్తువులో లేవుగాని దాని యనుభూతిలో ఉండవచ్చు. అది తలపుల నుండి నీవు సాధించిన స్వేచ్ఛా ప్రమాణాన్ని బట్టి యుంటుంది.

*ఆత్మనష్టం సంభవమా ?

"బైబిల్‌ లో నష్టాత్మ ప్రసక్తి యుంది. అట్లొనగూడునా ? " అని యొకరు . మహర్షి యన్నారు" అహంత నష్టం కావచ్చు, కావలె. కాని ఆత్మ ఎన్నడూ అట్లు కాదు.

* ఆర్తి.

"మనస్సులో శ్రుతి గలియని తలపులు సందడిస్తే ఆర్తి కలుగుతుంది. అన్నితలపుల స్థానే ఒకే తలపును నిలిపితే ఆవేదనయుండదు. అప్పుడు కర్తృభావన, దానితోడి కర్మ ఫలాసక్తిగూడ వీడి పోతాయి."

* సాఖ్యోత్పత్తి.

"అది మనస్సు సర్వమూ ఒకే తలపుతో నిండి యితర తలపులన్నీ నిరాకృతాలైనపుడు ఆ తరువాత ఆ ఒక్కతలపూగూడ ఆత్మలో లీనమౌతుంది. ఆపుడు కలిగే ఆత్మానదం 'సౌఖ్యం'గా వ్యక్తమౌతుంది. కాని అది ఆనందమయ కోశంలోనే, పూర్ణానందము కోశాలన్నీ వీడిపోయిననే అనుభూతమౌతుంది."

* దైవ - ఆత్మల అభేదం.

"దైవం ఆత్మకు వేరైతే, ఆయన ఆత్మలేనివాడౌతాడు. అంత కన్న అపహాస్యముండునా ?"

* సత్‌ స్థితి

"నీధర్మం కేవలం ఉండుటే - ఇదిగా, అదిగా కాదు. "అహం స్ఫురణ తటాలున వెనుదిరిగి 'నేనిది'యని పరువు లెత్తితే, అది అహంత, అజ్ఞానము. అది 'శుద్ధాహం' లో భాసించినపుడే నిజమగు ఆత్మ"

* ద్వైతము.

ద్వైతము అనాత్మను ఆత్మగా భ్రమపడటంలో ఉంది. అదైత మట్లు చేయదు.

*ధైర్యము.

"అహం స్ఫూర్తి కలిగినపుడు విషయీ విషయములు రెండూ అదే. అహంత లేవనపుడు విషయము విషయీ, రెండూ లేవు. పక్వ బుద్ధి కింతకుమించి చెప్పనక్కఱలేదు. అది తెలిసి యతడు మనస్సును విషయ దూరంగా అంతర్ముఖం జేస్తాడు. అలాచేయగల్గటానికతడు ధీరుడు కావలె. కాని తన్ను తానెఱుగుటకు ధైర్యమే మవసరం ? 'ధీ' అంటే బుద్ధి, '' అంటే ఆలోచనాధారలో కొట్టుకొనిపోనీక తనశక్తులన్నిటినీ కూడగొట్టుకొనడం. తలపు వఱదనరికట్టి మనస్సు నంతర్ముఖం చేయగల్గినవాడు ధీరుడు"

* సాపేక్షజ్ఞానవృద్ధి.

పూర్వజన్మల నెఱుగగోరిన యొకరిని మహర్షి మందలించారు. "ఈజన్మలో తెలిసినంతకే సుఖపడలేకున్నావు. గతజన్మల దెలియటం అసౌఖ్యం పెంచుకోవడమే. ఆ విజ్ఞానమంతా మనస్సు కొక భారము".

* ఆత్మ సాక్షియా?

ఆత్మ సాక్షియన్న భావం మనస్సు లోనిది. మనస్సులోని యశాంతి శమించుట కది ఉపకరించవచ్చు, కాని ఆత్మను గూర్చిన పూర్ణజ్ఞానం కాదు. సాక్షిత్వం విషయ సంబంధి, సాక్షీ, అతడు చూచిన విషయమూ, రెండూ మనః కల్పితాలు".

అహంతలేమి, ప్రేమ, పూతప్రేతం (Holy Ghost), భూతం (spirit) ఇవన్నీ నానారూపాలు, పర్యాయపదాలు.

* సౌఖ్యము.

"దేహాన్ని ఆత్మగా భావిస్తూ సుఖమాసించడం, మొసలినెక్కి ఏరుదాటడం. అహంత లేవగానే అది తన మూలమైన ఆత్మకు వేరౌతుంది. గగనంలోకి విసిరిన రాయివలె, ఏటినీటివలె అది అస్థిర మౌతుంది. ఆ రాయిగాని ఏరుగాని తమతమ మూలములైన భూమి అంబుధుల చేరగానే స్వస్థలములౌతవి. అలాగే మనస్సుగూడామరలి తన మూలమునస్థిరపడితే, సుఖపడుతుంది. రాయీ ఏరూ తమతమ నెలవులకు చేరక తప్పనట్లే మనస్సుగూడ, ఎప్పటికైనా, విధిగా తనమూలానికి తిరిగి చేరుతుంది." ఇది అందరూ గమ్యం చేరెదరన్న ఆశంస.

"సౌఖ్యమే నీ స్వభావస్థితి. దాన్ని కోరటం తప్పుగాదు. తప్పెక్కడంటే ఆ సౌఖ్యనికై నీలోనగాక వెలిగా వెదకుటలో ఉన్నది.

* సమాధి - ప్రమదము (Eestcy)

"సమాధిలో కేవలం పూర్ణ శాంతియే యుండును సమాధి ముగిసి మనస్సు మరల ప్రవృతమై సమాధియందలి పూర్ణ శాంతి స్మృతికి వచ్చినపుడు కలిగేది ప్రమదం. భక్తిలో హర్షోన్మాదము ప్రాక్తనం. ఆనందాశ్రువులు, రోమాంచం, గగుర్పాటు, గాద్గద్యం, ఇట్లది వ్యక్తమౌతుంది. అహంత మరిలేవనట్లుగ నశించి సహజస్థితి యలవడినపుడు ఈ లక్షణాలు హర్కోత్కర్షలూ ఆగిపోతాయి. నిద్రలో యేహర్షోన్మత్తతా లేదు. నిద్ర జాగ్రత్‌ సుప్తిలోని సమాధి.

బుద్ధుడు తన శిష్యులకు శాశ్వతసౌఖ్య సంపాదనోపాయములను బోధించుటందే ఆసక్తి చూపినాడు. అడిగే వాని యజ్ఞానం ఆధారంగా, దైవాదులపై రేపిన ప్రశ్నలకు ఆయన సమాధానాలీయలేదు. అందు చేత ఆయన్ను శూన్యవాది యన్నారు.

*రాజర్షి.

పృ || ఋషియైయుండి జనకుడు రాజ్యపాలన మెట్లు చేసినాడు ?

మ || ఆ ప్రశ్నను జనకు డడిగెనా ? అది సుజ్ఞానికి కలిగే ప్రశ్న

కాదు. అట్టి ప్రశ్నలకాధారం అజ్ఞానం.

పృ || బహుశః ఆ ప్రవృత్తినాయన స్వాప్నికంగా భావించారేమో.

మ || ఈ వివరణ గూడ అజ్ఞాన జనితమే.

* మనశ్శుద్ధి.

"జ్ఞానానుభవం తానే మనసులోని సర్వకల్మషములనూ కడిగి వేస్తుంది.

* కర్మనాశము.

"చివళ్ళు కత్తిరించే కొద్దీ, మొక్కలు ఏపుగా పెరుగుతవి. అలాగే కర్మనాశానికై నీయత్నాలు ప్రబలేకొద్దీ, ఆకర్మా హెచ్చు తుంది. కర్మలకు మూలమైన అహంకారాన్ని ప్టటి నాశం చేయి."

* బ్రహ్మచర్యము

సంకల్ప బల మాత్రాన బ్రహ్మచర్యం సిద్ధించదు. నిజమైన బ్రహ్మచర్యం బాహ్యంగాదు. అది బ్రహ్మములో, సత్తులో, చరించటం అదిసిద్ధిస్తే బ్రహ్మచర్యం సిద్ధించినట్లే.

* స్వస్థదేహంలో స్వస్థమనం.

ముక్తి సాధనా విధులు నభ్యసించడానికి కనువుగా దేహం చిరస్థం జేయవలెనని హఠయోగి భావన. ఇది అపహసింపతగింది. తన్ను సమర్థిస్తూ అతడు దేహాన్ని చిత్రలేఖన యోగ్యమైన పట వస్త్రంతో పోల్చుతాడు. దానిపై మహర్షి :ఇందు పట మేది ? చిత్రమేది ? ఆత్మపటము ; శరీర జగత్తులు చిత్రము . ఆత్మవిశదం కావలెనంటే చేయవలసింది ఆ చిత్రాలను తుడిచి వేయడమే", కాబట్టి ప్రజ్ఞావంతుడగు శిష్యుడు హఠయోగం అభ్యసించ తగదు.

* మనోనిగ్రహము.

" ఏనుగు తొండాన్ని ఆపుకోలేక ఆడిస్తూంటుంది. ఆ ఊపు నాపటానికి మావటీడు దానినొకబరువైన గొలుసును పట్టనిస్తాడు. అట్లే మనోభ్రమణం అరికట్టడానికి దానికి ప్రకృష్టమైన పని చూపవలె లేకుంటే అది అసత్‌ వృత్తులకు పూనుకొంటుంది. మనస్సుకీయ తగిన ఉత్తమోత్తమ వ్యాపారం తన మూలాన్ని వెదుక మనడమే. ధ్యాన జపములు దాని తరువాతివే"

* తాత్త్విక పరిణతికి ఉపవాసము.

"ఉపవాసం ముఖ్యంగా మానసికం కావలె. భోజనం మానిన మాత్రాన లాభంలేదు. అది మనస్సును కలచివేయనూవచ్చు. కాని ఒక మాసం ఉపవసించి, ఆ కాలంలో ఆధ్యాత్మిక దృష్టినేమాత్రం చెదరనీ కుంటే, ఉపవాస విరమణ జాగ్రతగా జరిగి, మితహిత ఆహారం తీసుకొంటే, ఉపవాసం మానిన పదిదినాలలోగా మనస్సు శుద్ధమూ స్థిర మూనై అట్లే ప్రతిష్ఠితమౌతుంది."

*పరకార్య ప్రవృత్తునికి సమాధానము

పృ || అందరూ సన్న్యసిస్తే, భూములెవరు దున్నుతారు ? పంట

లెవరు పండిస్తారు ?

మ || ఆత్మను తెలుసుకో, ఆపైననీకే తెలిసివస్తుంది.

* దుష్కరభావన.

"ఏవిధానమైనా దుష్కరమో సుకరమో, దానిని పూర్వ మభ్యసించామా లేదాయన్న దానిపై ఆధారపడుతుంది.

* సమతావాదులకు.

"సంపూర్ణ సమత సాధించడానికి అమోఘమైనది నిద్రించటం.

* జన్మనియంత్రణము - సద్వృత్తము.

పృ || జన్మ నియంత్రణం నీతివిరుద్ధమా

మ || కామానికి వశుడయ్యే కొద్దీ, అది అతృప్తంగానే మిగులునని

మహాభారతంలో ఉంది.

* పురోగమనం - తిరోగమనం.

పురోగమనం సులువే ; కాని తిరోగమనం అసాధ్య మన్నారొకరు. దానికి మహర్షి " ఎంతదూరంచన్నా, ఉన్నచోటనే ఉన్నాడు. ముందు పోవడం, వెనుకకు తిరగటం ఎక్కడివి? ఈ శోపనిషత్‌ లో ఉన్నది . 'అది ఎంతో దూరమూ, సన్నిహితము కూడా ".

*దైవశక్తి - రోగనివారణ.

"ఏ ప్రయోజనానికైనా దైవశక్తిని లోనికి గోనుటేమి ? ఇప్పటికే అది నీలోన ఉన్నది ; అది నీవే."

*జాగ్రత్‌ స్యప్నములు - తులనము.

"కలగనువానికి ఆ స్వప్న జగత్తులో ఆసక్తి. వానికది తనకు వెలుపల తనకు వేరుగనున్న విషయక సత్యం. మెలకువలో నున్న వానికి జాగ్రజ్జగత్తు ఆకారణంగానే ఆసక్తికరం. ఆత్మానుభవం వల్ల వానికీ జగత్తు కేవలము మనః కల్పనే అని తెలిస్తే అందలి ఆసక్తి అంతరిస్తుంది"

* జగత్తున్నదా ?

ప్రపంచం ఉన్నదనటానికీ, అది సత్యమనడానికీ చాల భేద మున్నదన్నారు మహర్షి. ఆ రెండవది మొదటిదానిని జగత్తు మిధ్య యని నిరాకరించదు. మొదటిది అట్లుగాదు. బొత్తిగా అజ్ఞాని యైన వాడు దృశ్యాన్నీ జగద్దృశ్యంలోని సద్వస్తువునూ కలియగలిపి, ఆ మిశ్రణాన్ని సత్యమని భావిస్తాడు. మహర్షి శిష్యులు దృశ్యాన్నీ వస్తువునూ వేర్పఱచి వస్తువునే సత్యమని, యితరము భ్రాంతియని గ్రహించగలరు.

* దైవం పేర్లు.

"పుట్టినపుడు నీనొసట ఏప్రేరు వ్రాసి లేకున్నా నీపేరట పిలిస్తే నీవు పలికేలాగే, భక్తుడే పేరిట పిలిస్తే ఆ పేరిటనే భగవంతుడు బదులు పల్కుతాడు. ఇంతకూ ఆయన నామ రహితుడు."

* సంసార బంధ త్యాగము.

"నిద్రలో నీ కుటుంబము నెఱుగవు. కాని నీవిప్పుడావ్యక్తివే, నీకుటుంబాన్ని గుర్తిస్తావు. అది నిన్ను బంధిస్తున్నదని దాన్ని త్యజింప తలపు. నీకుటుంబంవారు నిన్ను తమకుకట్టి వైచినారా, కాక వారితో నిన్ను నీవే కట్టుకొన్నావా ? ఇది 'నాకుటుంబ'మన్న తలపు మానితే చాలు. మారునవి తలపులు , నీవు కావు. అవికార్యమైన 'నిన్ను'చేజిక్కించుకో, అందుకై మనస్సు తలపు లాపనక్కఱలేదు. కాని తలపుల మూలాన్ని జ్ఞప్తియుంచుకొని శ్రద్ధగా వెదకు".

* స్వార్పణము

"ఎంత లెంతలు దైవానికి నిన్నర్పించుకొంటావో అంతలంతలు నీ పరిసరాలు బాగుపడుతవి : అంతలంతలు నీ క్రియాశక్తీ అధికమౌతుంది.' ఇది భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నతనికి మహర్షి నిర్దేశం.

* శ్రుతివాఙ్మయ ప్రయోజనము

అది ఆత్మాన్వేషణానికై అంతర్ముఖుడవు కానంతవరకే. అది జరిగిన క్షణం, అంతవరకు నేర్చిన సర్వం విస్మృతమూ నష్టమూ అవుతుంది."5

* జగత్పరి గ్రహము.

" జగత్తు ఆత్మ ఆభాసమాత్రమే. కాబట్టి దాన్ని సరిగా గ్రహించటంగాని, పరిగ్రహించటం గాని అసాధ్యం. తన తల నీడను పట్టుకోయత్నించే శిశువుకది యెంతకూ చిక్కదు. బిడ్డ కదలినపుడెల్లా నీడగూడా కదలదా ? అంత తల్లి బిడ్డచేతిని వాని తలపై నుంచి నీడతల దొరికెననిపిస్తుంది. జగత్తును గ్రహించుటమూ, పరిగ్రహించటమూ ఆ విధంగా ఆత్మను చేజిక్కించుకొంటేనే ".

* ఆచలము, అబాధితము.

"చిత్సాగరంలో నేను నురువు" నన్నారొకరు. అదికాదంటూ మహర్షి వచించారు : "అట్లనుకోవడం సర్వవ్యధలకూ మూలం. అది మానవలె. ఆత్మాంబుధిలో జగజ్జీవములు నురువులు. అది తెలిసి సదా జ్ఞప్తినుంచుకొన్నతనికి అన్ని సంశయాలు వ్యధలూ వదలి మనస్సు స్థిరమౌతుంది" ఆత్మవిచారంచేస్తూ హృదయంలో మునిగి నప్పుడది ఋజువౌతుంది. అట్లు మునుగనివాడూ ఆ సద్వస్తువే, దానికి భిన్నంగాదు.

ఋజుదృష్టినిపెంచి అవలంబించని వారికే ఈ బాహ్యాంతర భావన. మోక్షకామి హృదయంలో మునుగవలెనన్నది అతడు అసత్‌ అగు జీవాత్మను ఆత్మగా భావిస్తున్నాడని. ఆత్మ నిరవధి, సర్వ దృశ్యము

------------

5. చూ. అనుబంధము, '' శ్లో . 82

----------

లనూ లోగొన్నది. దాని నట్లుగా తెలిసియెవ్వరూ దేనికోరక సదా తృప్తులుగనే యుంటారు. లో మునుగడానికి ముందుగూడ ఆత్మానుభవం కలుగుతుంది. తాను లేనని ఎవ్వరూ అనలేరు. ఆ ఉనికియే ఆత్మజ్ఞానం. నీవు లేకుంటే ప్రశ్నలడుగలేవు. కాబట్టి నీవున్నట్లు నీకెఱుకే, సద్వస్తు యాధార్థ్యం దెలిసికొను నీయత్నము ఫలం, ఇప్పిటి నీ దోషాల విసర్జించుటే. క్రొత్తగా 'ఆత్మ సిద్ధి' యొకటి ఉండబోదు.

* ఆత్మ ప్రకాశము.

ఏ విషయ వస్తువునైనా తెలియడానికి చీకటికి శత్రువైన సామాన్య దీపం కావలె. ఆత్మ నెఱుగుటకు వెలుగు చీకట్ల రెంటినీ వెలిగించే జ్యోతి కావలె. అది తమము కాదు ; ప్రకాశమూగాదు. కాని దానివల్ల నే అవి ఎఱుక పడుతవి గనుక దానిని ప్రకాశమన్నారు. ఆజ్యోతియే ఆత్మ, మేరలేని చిత్‌ ప్రకాశము. ఆ స్పర్శలేని వారుండరు. ఎవ్వడూ తన్ను దెలియని అజ్ఞాని కాడు. ఇది తెలియక జనులు జ్ఞానులు కాగోరుతున్నారు.

Mahayogama    Chapters