Varahamahapuranam-1    Chapters   

అష్టనవతితమోధ్యాయః - తొంబది యెనిమిదవ అధ్యాయము

ధరణ్యువాచ - భూమి యిట్లు పలికెను.

యా సా మాయా శరీరాత్‌ తు బ్రహ్మణోవ్యక్త జన్మనః

గాయత్ర్యష్టభుజా భూత్వా వైత్రాసుర మయోధయత్‌. 1

సైవ నన్దా భ##వేద్‌దేవీ దేవకార్యచికీర్షయా,

మహిషాఖ్యాసురవధం కుర్వతీ బ్రహ్మణరితా,

వైష్ణవ్యా చ హతో దేవ కథ మేతద్ధి శంస మే. 2

అవ్యక్తము వలన జన్మించిన బ్రహ్మ శరీరమునుండి వెలువడిన ఆ మాయ గాయత్రి ఎనిమిదిభుజములు గలదియై వైత్రాసురునితో పోరాడెను. ఆమెయే దేవకార్యమును చేయగోరి నందమైనది. బ్రహ్మ మాటమేరకు మహిషుడను రాక్షసుని వధ చేయనున్నది. విష్ణుమాయచే అతడు చచ్చెను. ఇది యెట్లు? ప్రభూ! నాకు చెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

ఇయం జగద్ధితా దేవీ గంగా శంకర సుప్రియా,

క్వచిత్‌ కిఞ్చిత్‌ భ##వేద్‌ వృత్తం స పదం వేద సర్వవిత్‌. 3

ఇట్లు జగములకు మేలు కోరిన ఈ దేవి శంకరుని ప్రియురాలు గంగయు నగును, ఏది ఎప్పుడు ఎట్లు జరుగవలయునో తెలిసినవాడు అన్నియు తెలిసిన పరమాత్మయే.

స్వాయంభువే హతో దైత్యో వైష్ణవ్యా మందరే గిరౌ,

మహిషాఖ్యోపరః పశ్చాత్‌ స చ వైత్రాసురః పునః.

నందయా నిహతో వింధ్యే మహాబల పరాక్రమః 4

స్వాయంభువమన్వంతరమున మందరగిరియందు వైష్ణవి మహిషుడను రక్కసుని చంపెను. తరువాత మరియొక మహిషుడు కలడు అతడు వైత్రాసురుడు. మహాబలపరాక్రమములు గల ఆతడు వింధ్యమున నందచేత చచ్చెను.

అథవా జ్ఞానశక్తిః సా మహిషోజ్ఞానమూర్తిమాన్‌,

అజ్ఞానం జ్ఞానసాధ్యంతు భవతీతి న సంశయః. 5

లేదా! ఆ తల్లి జ్ఞానశక్తి, మహిషుడు అజ్ఞానము రూపుకట్టిన వాడు. అజ్ఞానము జ్ఞానముచేతనే రూపుమాయుననుటచేతను సంశయము లేకుండును.

మూర్తిపక్షే చేతిహాస మమూర్తే చైకవ ద్ధృది,

ఖ్యాప్యతే వేదవాక్యైస్తు ఇహ సా వేదవాదిభిః. 6

మూర్తిపక్షమున ఇతిహాసము. మూర్తి సంభావన లేనిచో అమెను ఒక స్వరూపముతో హృదయమున సంభావింపవలయును. వేదపండితులు వేదవాక్యములతో దీనిని చక్కగా తెలియజెప్పుదురు.

ఇదానీం శృణు మే దేవి పఞ్చపాతకనాశనమ్‌,

యజనం దేవదేవస్య విష్ణోః పుత్రవసుప్రదమ్‌. 7

దేవీ! ఇప్పుడు వినుము. దేవదేవుడగు విష్ణువు పూజ అయిదు మహాపాతకములను నశింపజేయునదియు, పుత్రులను, ధనమును ప్రసాదించునదియు కలదు. దానిని చెప్పెదను.

ఇహ జన్మని దారిద్ర్య వ్యాధికుష్ఠాది పీడితః,

అలక్ష్మీవా నపుత్రస్తు యో భ##వేత్‌ పురుషో భువి. 8

తస్య సద్యో భ##వేల్లక్ష్మీ రాయు ర్విత్తం సుతః సుఖమ్‌,

దృష్ట్వా తు మండలగతం దేవందేవ్యా సమన్వితమ్‌. 9

ఈజన్మమున లేమి, రోగము, కుష్ఠు మొదలగువానిచేత పీడనొందినవాడు, సంపదలు, పుత్రులు లేనివాడునగు నరుడు మండలమునందు దేవితోపాటుగా ఉన్నదేవుని చూచి వెనువెంటనే సంపదను, ఆయువును, ధనమును, కుమారుని, సుఖమును పొందును.

నారాయణం పరం దేవం యః పశ్యతి విధానతః,

పూజితం నవనాభే తు షోడశాష్టదళే తు వా,

ఆచార్యదర్శితం దేవి మన్త్రమూర్తి మయోనిజమ్‌. 10

కార్తికే మాసి శుక్లాయాం ద్వాదశ్యాం తు విశేషతః,

సర్వాసు వా యజే ద్ధేవం ద్వాదశీషు విధానతః,

సంక్రాంత్యాం వా మహాభాగే చంద్రసూర్యగ్రహేపి వా. 11

యః పశ్యతి హరిం దేవం పూజితం గురుణా శుభే,

తస్య సద్యో భ##వే త్తుష్టిః పాపధ్వంసశ్చ జాయతే. 12

విధానముననుసరించి తొమ్మిదిబొడ్డులు గలదియో పదునారు గాని ఎనిమిది గాని దళములు కలదియో అగు మండలమున పూజనొందినవాడు, మంత్రములే ఆకారమైనవాడును, తల్లికడుపున పుట్టనివాడును అగు పరదైవము నారాయణుని ఆచార్యుడు చూపగా చూచినవాడు, విశేషించి కార్తికమాసమున శుక్లపక్షమున ద్వాదశినాడుగాని లేదా అన్నినెలలో ద్వాదశులయందు గాని, సంక్రాంతిదినమున గాని, సూర్యచంద్రుల గ్రహణ దినము లందు గాని గురువుద్వారమున అర్చలుగొన్న పరమదైవము నారాయణుని దర్శించినవాడు పరమానందమందును. వాని పాపము లన్నియు పటాపంచలగును.

బ్రాహ్మణక్షత్రియవిశాం భక్తానాం తు పరీక్షణమ్‌,

సంవత్సరం గురుః కుర్యా జ్జాతిశౌచ క్రియాదిభిః. 13

గురువు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అను భక్తుల పరీక్షను జాతినిబట్టియు, శుద్ధినిబట్టియు, పనులను బట్టియు నొక్కసంవత్సరము చేయవలయును.

ఉపాసన్నాంస్తతో జ్ఞాత్వా హృదయేనాథ ధారయేత్‌,

తేపి భక్తిమతో జ్ఞాత్వా ఆత్మానం పరమేశ్వరమ్‌. 14

సంవత్సరం గురోర్భక్తిం కుర్వన్‌ విష్ణో రివాచలమ్‌,

సంవత్సరే తతః పూర్ణే గురుం చైవ ప్రసాదయేత్‌. 15

అట్లు తనకడకు వచ్చిన వారిని చక్కగా పరీక్షించి తెలిసికొని గురువు వారిని ఎదకు హత్తుకొనవలయును. వారును భక్తికలవారై సంవత్సరకాలము గురువును పరమేశ్వరునిగా భావించి విష్ణువునకు వలె చపలత లేని విధముగా భక్తి చేయవలయును. ఏడు ముగిసినపిదప గురువును చేసికొనవలయును.

భగవం స్త్వత్ర్పసాదేన సంసారార్ణవతారణమ్‌,

ఇచ్ఛామ సై#్త్వహికీం లక్ష్మీం విశేషేణ తపోధన. 16

పూజ్యుడా! తపోధనా! నీ దయచేత సంసార సముద్రమును దాటుటను, ఇహలోకపు భాగ్యమును కోరుచున్నాము.

ఏవమభ్యర్చ్య మేధావీ గురుం విష్ణు మివాగ్రతః,

అభ్యర్చిత సై#్తః సోప్యాశు దశమ్యాం కార్తికస్య తు. 17

క్షీరవృక్షసముద్భూతం మన్త్రితం పరమేష్ఠినః,

భక్షయిత్వా స్వపేచ్చైవ దేవదేవస్య సంనిధౌ. 18

తెలివిగలవాడు గురువును ఎదుటనున్న విష్ణువునుగా చక్కగా ఇట్లు పూజింపవలయును. గురువు కూడ వారట్లు కొలువగా కార్తిక మాసము దశమినాడు పరమేష్ఠి మంత్రమును జపించుచు మర్రిచెట్టు పాలను పుచ్చుకొని దేవదేవుని సన్నిధి యందు నిదురింపవలయును.

స్వప్నాన్‌ దృష్ట్వా గురోరగ్రే శ్రావయేత విచక్షణః,

తతః శుభా శుభం తత్ర లక్షయేత్‌ పరమో గురుః. 19

మరియు భక్తుడు వివేకముతో గురువుముందు తాను గాంచిన కలలను గూర్చి విన్నవింపవలయును. గురువు అందలి శుభమును, అశుభమును తెలియజెప్పవలయును.

ఏకాదశ్యా ముపోషై#్యవం స్నాత్వా దేవాలయం ప్రజేత్‌,

గురుశ్చ మండలం భూమౌ కల్పితాయాంతు వర్తయేత్‌. 20

ఏకాదశినాడు ఉపవాసముండి స్నానము చేసి దేవాలయమున కరుగవలయును. గురువు చక్కగా తీర్చిదిద్దినభూమి యందు మండలమును కూర్పవలయును.

లక్షణౖ ర్వివిధై ర్భూమిం లక్షయిత్వా విధానతః,

షోడశారం లిఖేచ్చక్రం నవనాభ మథాపి వా. 21

వేరువేరు శుభలక్షణములతో భూమిని చక్కగా అలంకరించి పదునారు అరలు గల చక్రమును గాని, తొమ్మిది బొడిపెలుగల మండలము గాని గీయవలయును.

అష్టపత్ర మథో వాపి లిఖిత్వా దర్శయేద్‌ బుధః,

నేత్రబంధం తు కుర్వీత సితవస్త్రేణ యత్నతః. 22

లేదా ఎనిమిదిరేకుల పద్మమువంటి మండలమునైన వ్రాసి చూపవలయును. ప్రయత్నముతో తెల్లనివస్త్రముతో భక్తులకు నేత్రబంధము చేయవలెను. తరువాత వారివారి వర్ణముల క్రమము ననుసరించి పూవులు చేత దాల్చిన శిష్యులను ప్రవేశ##పెట్టవలయును.

నవనాభం యదా కుర్యాన్మండలం వర్ణకై ర్బుధః,

తదానీం పూర్వతో దేవ మిన్ద్ర మైన్ద్య్రాంతుపూజయేత్‌. 23

రంగులతో తొమ్మిది బొడిపెల మండలము చేసినపుడు గురువు తూర్పుదిక్కున ఇంద్రుని నిలిపి పూజింపవలయును.

లోకపాలైః సమం తద్వదగ్నిం సంపూజయేచ్ఛుభే,

స్వదిక్షు తద్వద్‌ యామ్యాయాం నైరృత్యాం నైరృతిం న్యసేత్‌. 24

వరుణం వారుణాయాం చ వాయుం వాయవ్యతో న్యసేత్‌.

ధనదం చోత్తరే న్యస్య రుద్ర మీశానగోచరే. 25

లోకపాలుర నందరిని ఇట్లు వారి దిక్కులయందు నిలుప వలయును. అగ్నిని ఆగ్నేయమునందు, యముని దక్షిణము నందు, నిరృతిని నైరృతియందు, వరుణుని దక్షిణమునందు, వాయువును వాయవ్యమునందు, కుబేరుని ఉత్తరమునందు, రుద్రుని ఈశాన్యమునందు నిలిపి పూజింపవలయును.

పూజ్యైవంతు విధానేన దిక్‌క్షేత్రేషు విశేషతః,

పద్మమధ్యే తథా విష్ణు మర్చయేత్‌ పరమేశ్వరమ్‌. 26

ఈ విధముగా శాస్త్రముననుసరించి ఆయా దిక్కలక్షేత్రములలో దిక్పాలురను పూజించి పద్మమునడుమ పరమేశ్వరుడగు విష్ణువును పూజింపవలయును.

పూర్వపత్రే బలం పూజ్య ప్రద్యుమ్నం దక్షిణ తథా,

అనిరుద్ధం తథా పూజ్య పశ్చిమే చోత్తరే తథా,

పూజయేద్‌ వాసుదేవం తు సర్వపాతక శాంతిదమ్‌. 27

తూర్పురేకున బలరాముని, దక్షిణపు ఆకున ప్రద్యుమ్నుని, పడమటి రేకున అనిరుద్ధుని, ఉత్తరమున సర్వపాతకములను అణచి వేయు వాసుదేవుని నిలిపి పూజింపవలయును.

ఐశాన్యాం విన్యసేచ్ఛఙ్ఖ మాగ్నేయ్యాం చక్రమేవ చ,

యామ్యాయాం తు గదాం పూజ్య వాయవ్యాం పద్మమేవచ. 28

ఐశాన్యాం ముసలిం పూజ్య దక్షిణ గరుడం న్యసేత్‌,

వామతో విన్యసేల్లక్ష్మీం దేవదేవస్య బుద్ధిమాన్‌. 29

ఈశాన్యమున శంఖమును, ఆగ్నేయమున చక్రమును, దక్షిణమున గదను, వాయవ్యమున పద్మమును, ఈశానదిక్కున రోకలిని, దక్షిణమున గరుడుని పూజింపవలయును. దేవదేవునికి వెనుకవైపుగా లక్ష్మిని నిలుపవలయును.

ధనుశ్చైవ తు ఖడ్గం చ దేవస్య పురతో న్యసేత్‌,

శ్రీవత్సం కౌస్తుభం చైవ దేవస్య పురతోర్చయేత్‌. 30

ధనుస్సును ఖడ్గమును దేవుని ముందు భాగమున నిలుపవలయును. శ్రీవత్సమును, కౌస్తుభమును కూడ దేవునిముందుంచి పూజింపవలయును.

ఏవం పూజ్య యథాన్యాయం దేవదేవం జనార్దనమ్‌,

దిఙ్మండలేషు విన్యస్య అష్టౌ కుంభాన్‌ విధానతః. 31

వైష్ణవం కలశం చైకం నవమం తత్ర కల్పయేత్‌,

స్నాపయేన్‌ ముక్తికామం తు వైష్ణవేన ఘటేన హ. 32

ఇట్లు పద్ధతి ప్రకారము దేవదేవుడగు జనార్దనుని పూజించి దిక్కులందలి మండలములలో ఎనిమిది కుంభములను పద్ధతి ననుసరించి ఉంచవలయును. మరియు విష్ణు సంబంధమైన తొమ్మిదవ కలశము నొకదానిని కూడ ఉంచవలయును. ముక్తిని కోరుచు వైష్ణవఘటముతో దేవుని అభిషేకింపవలయును.

శ్రీ కామం స్నాపయేత్‌ తద్వదైన్ద్రేణ తు ఘటేన హ,

ద్రవ్య ప్రతాపకామస్య ఆగ్నేయేన తు స్నాపయేత్‌. 33

సంపదయందు కోరికతో ఇంద్రఘటముతోడను, వస్తువులు ప్రతాపము కోరువాడు ఆగ్రేయఘటముతోడను అభిషేకము చేయవలయును.

మృత్యుంజయవిధానాయ యామ్యేవ స్నాపనం తథా,

దుష్టప్రధ్వంసనాయాలం నైరృతేన విధీయతే. 34

మృత్యువును గెలుచుపద్ధతికొరకు దక్షిణదిక్కుకలశము తోడను, దుష్టులను రూపుమాపు కోరికతో నైరృతమగు కలశము తోడను స్నానము చేయింపవలయును.

శాన్తయే వారుణ నాశు పాపనాశాయ వాయవే,

ద్రవ్యసంపత్తి కామస్య కౌబేరేణ విధీయతే. 35

శాంతికై దక్షిణకలశముతోడను, పాపములునశించుటకై వాయవ్యకలశము తోడను, ద్రవ్యసంపత్తివాంఛకలవాడు ఉత్తర కలశముతోడను అభిషేకముచేయవలయును.

రౌద్రేణ జ్ఞానహేతోస్తు లోకపాలఘటాస్త్విమే,

ఏకైకేన నరఃస్నాతః సర్వపాపవివర్జితః.

భ##వే దవ్యాహతం జ్ఞానం శ్రీమాన్‌ విప్రో విచక్షణః,

కిం పున ర్నవభిః స్నాతో నరః పాతక వర్జితః. 37

ఈశాన దిక్కుకలశముతో జ్ఞాన సంపదకై స్నానము చేయింపవలయును. ఇవి లోకపాలుర ఘటములు. ఒక్కొక్క కలశముతో నరుడు స్నానము చేసినను సర్వపాపములను పోగొట్టు కొనును. అడ్డులేని జ్ఞానమును సంపదను విప్రుడు వివేకము కలవాడు పొందును. ఇంక తొమ్మిదికలశములతో స్నానము చేసినచో చెప్పనేల? పాతకములన్నియు వానికి నశించును.

జాయతే విష్ణు సదృశః సద్యో రాజాథ వా పునః,

అథవా దిక్షు సర్వాసు యథాసంఖ్యేన లోకపాన్‌,

పూజయీత స్వశాసస్త్రోక్త విధానేన విధానవిత్‌. 38

మరియు విష్ణువంతటి వాడగును. లేదా వెనువెంటనే రాజగును.

అట్లుకాక సంఖ్యననుసరించి అన్ని దిక్కులయందును తనశాస్త్ర విధానమును బట్టి లోకపాలురను పూజింపవలయును.

ఏవం సంపూజ్య దేవాంస్తు లోకపాలాన్‌ ప్రసన్నధీః,

పశ్చాత్‌ ప్రదక్షిణం శిష్యాన్‌ బద్ధనేత్రాన్‌ ప్రవేశ##యేత్‌. 39

ఇట్లు ప్రసన్నమగుబుద్ధికలవాడై లోకపాలురగు దేవులను చక్కగా పూజించి తరువాత కన్నులకు గుడ్డ కట్టుకొన్న శిష్యులను ప్రదక్షిణముగా ప్రవేశ##పెట్టవలయును.

ఆగ్నేయ ధారణాన్‌ దగ్ధాన్‌ వాయునా విధుతాంస్తు సః,

సౌమే నా ప్యాయితాన్‌ పశ్చాచ్ఛ్రావయేత్‌ సమయాన్‌ బుధః. 40

అగ్నితేజస్సు తాల్చినవి, కాలినవి. వాయువుచేత విసరబడినవి, సోమరసముచేత తృప్తినందినవి అగు సమయములను (ప్రతిజ్ఞలను) పండితుడగు ఆచార్యుడు శిష్యులకు వినిపింపవలయును.

అనిన్ద్యా బ్రాహ్మణా వేదా విష్ణు ర్బ్రాహ్మణ ఏవ చ,

రుద్ర మాదిత్య మగ్నిం చ లోకపాలాన్‌ గ్రహాంస్తథా. 41

గురూన్‌ వా వైష్ణవాన్‌ వాపి పురుషం పూర్వదీక్షితమ్‌,

ఏవం తు సమయే స్థాప్య పశ్చా ద్ధోమంతు కారయేత్‌. 42

బ్రాహ్మణులు వేదములు నిందింపరానివి. బ్రాహ్మణుడు విష్ణువే, రుద్రుని, ఆదిత్యుని, అగ్నిని, లోకపాలురను, గ్రహములను గురువులను, విష్ణుభక్తులను, మునుపు దీక్షగొన్న పురుషుని నిందిపను అని ప్రతిజ్ఞచేయించి తరువాత హోమకార్యమును చేయింప వలయును.

తత్త్వాని శిష్యదేహే తు సంస్థితాని తు శోధయేత్‌,

ఓంనమో భగవతే సర్వరూపిణ హుంఫట్‌ స్వాహా,

షోడశాక్షరమన్త్రేణ హోమయే జ్జ్వలితాగ్నయే. 43

శిష్యుని దేహమునందున్న తత్త్వములను (పంచభూతములు మొదలగువానిని) శుద్ధిచేయవలయును. ''ఓంనమోభగవతే సర్వ రూపిణ హుంఫట్‌ స్వాహా'' అను పదునారక్షరముల మంత్రముతో జ్వలించుచున్న అగ్నియందు హోమము చేయింపవలయును.

గర్భాధానాదికా శ్చైవ క్రియాః సమవధారయేత్‌,

త్రిభి స్త్రిభి రాహుతిభి ర్దేవదేవస్య సంనిధౌ. 44

గర్భాధానము మొదలగు సంస్కారములను మూడుమూడు ఆహుతులతో దేవదేవుని సన్నిధియందు కావింపవలయును.

హోమాన్తే దీక్షితః పశ్చాద్‌ దాపయేద్‌ గురుదక్షిణామ్‌,

హస్త్వశ్వవాజికటకం హేమగ్రామాదికం నృపః. 45

హోమము మగిసినపిదప దీక్షగొన్నరాజు గురుదక్షిణగా ఏనుగులు, గుఱ్ఱములు, వలయములు, సువర్ణములు, అగ్రహారములు మొదలగువాని నొసగవలయును.

దాపయేద్‌ గురవే ప్రాజ్ఞో మధ్యమో మధ్యమం తథా,

దాపయే దితరో యుగ్మం సహిరణ్యంతు దాపయేత్‌. 46

బుద్ధిశాలియగు మధ్యముడు (ఎక్కువధనసంపదలేని వాడు) మధ్యవిధమగు గురుదక్షిణను ఒసగవలయును. ఇతరుడు (సామాన్యుడు) కొంచెము పాటి సువర్ణముతో ఏదైన తనకు కలదానిని జంటగా నొసగవలయును.

ఏవం కృతే తు యత్పుణ్యం మాహాత్మ్యం జాయతే ధరే,

తన్న శక్యం తు గదితు మపివర్షశ##తై రపి. 47

ధరాదేవీ! ఇట్లు చేయగా కలుగు పుణ్యము మహిమను నూరుల ఏండ్లు వర్ణించినను తీరదు.

దీక్షితాత్మా పురాభూత్వా వారాహం శృణుయాద్‌ యది,

తేన వేదపురాణాని సర్వే మన్త్రాః సుసంగ్రహాః. 48

ముందు దీక్షితాత్ముడై వరాహపురాణమును వినునేని వానికి వేదములు పురాణములు, అన్ని మంత్రములును చేతికి చిక్కినట్లే.

జప్తాః స్యుః పుష్కరే తీర్థే ప్రయాగే సింధుసాగరే,

దేవాగారే కురుక్షేత్రే వారాణస్యాం విశేషతః. 49

గ్రహణ విషువే చైవ యత్ఫలం జపతాం భ##వేత్‌,

తత్ఫలం ద్విగుణం తస్య దీక్షితో యః శృణోతి చ. 50

పుష్కరతీర్థమునందును, ప్రయాగయందును, సింధు సాగరమునందును, దేవనిలయమగు కురుక్షేత్రమునందును, విశేషించి వారాణసియందును, గ్రహణకాలమునను, విషువము నందును జపించువారికి ఏపుణ్యము కలుగునో దానికి రెట్టింపు ఫలము దీక్షితుడై ఈ వరాహపురాణము విన్నవానికి కలుగును. (విఘవము =రాత్రింబవళ్లు సమానముగా ఉన్నదినము).

దేవా అపి తపః కృత్వా ధ్యాయన్తే చ వదన్తి చ,

కదా నో భారతే వర్షే జన్మ స్యాద్‌ భూతధారిణి,

దీక్షితాశ్చ భవిష్యామో వారాహం శృణుమః కథమ్‌. 51

దేవతలు కూడ తపముచేసి ధ్యానింతురు. మేము భారత వర్షమున ఎప్పుడు పుట్టుదుమో, దీక్షితులమై ఎప్పుడు వరాహ పురాణమును విందుమో, అని పలుకుచుందురు.

వారాహం షోడశాత్మానం త్యక్త్వా దేహం కదా వయమ్‌,

యాస్యామః పరమం స్థానం యం గత్వా న పునర్భవేత్‌. 52

పదునారు విభాగములు గల వరాహపురాణమును వినుచు ఎప్పుడు దేహమును వదలి మరలపుట్టుకలేని పరమస్థానమును పొందుదుమోకదా! అని ధ్యానించుచుందురు.

ఏవం జల్పన్తి విబుధా మనసా చిన్తయన్తి చ,

వరాహయాగం కార్తిక్యాం కదా ద్రక్ష్యామహే ధరే. 53

ఓ భూదేవీ! మేము కార్తికమాసమున ఎప్పుడు వరాహ యాగము చూతుమో! అని విబుధులు పలుకుచుందురు. మనసున చింతించుచుందురు.

ఏష తే విధి రుద్దిష్టో మయాయం భూతధారిణి,

దేవగంధర్వ యక్షాణాం సర్వదా దుర్లభా హ్యసౌ. 54

ఓ భూతధారిణీ! నేను నీకు ఈ యాగవిధానమును చెప్పితిని. ఇది దేవతలకు, గంధర్వులకు, యక్షులకు అన్ని వేళలందును దుర్లభ##మైనది.

ఏవం యో వేత్తి తత్త్వేన యశ్చ పశ్యతి మండలమ్‌,

యశ్చేమం శృణుయాద్‌ దేవి సర్వే ముక్తా ఇతి శ్రుతిః. 55

దేవీ! దీనిని తత్త్వముతో ఎరిగినవాడు, మండలమును తత్త్వపూర్వకముగా దర్శించుకొనువాడు, ఈ విధానమును తత్వముతో వినువాడు - ఈ అందరును ముక్తులని వేదము చెప్పుచున్నది.

ధరణ్యువాచ - భూదేవి పలికెను

యత్త్వయా కథితం దేవ ద్వాదశీనాం ఫలం మమ,

తదాయుషః స్వల్పతయా మర్త్యైః ప్రాప్తుం నశక్యతే. 56

దేవా! ఈ ద్వాదశుల ఫలమును నీవు చెప్పితివే దానిని అల్పమగు ఆయువు గల మనుష్యులు, పొందజాలరు.

అల్పాయాసేన యేన స్యాత్‌ సంవత్సర ముపోషితమ్‌,

తన్మేభ##వేత్‌ సురశ్రేష్ఠ కథయస్వ మహాఫలమ్‌. 57

తక్కువశ్రమతో ఒక సంవత్సరము కాలము ఉపవాసముండి మహాఫలమును పొందుమార్గమును నాకు తెలియజెప్పుము.

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు పలికెను.

ఇమ మర్థం పురా దేవి శ్వేతో రాజా మహాయశాః,

వసిష్ఠం పృష్టవాన్‌ స్వర్గే క్షుధాసంపీడితో భృశమ్‌. 58

దేవీ! ఈ యర్థమునే ముందు గొప్పకీర్తి గల శ్వేతుడను రాజు స్వర్గమున గొప్ప ఆకలికి పీడనొంది వసిష్ఠుని అడిగెను.

ఆసీ దిలావృతే వర్షే శ్వేతో నామ మహామనాః,

స మహీం సకలాం దేవీం సపత్తనవన ద్రుమామ్‌. 59

భగవన్‌ దాతు మిచ్ఛామి బ్రాహ్మణభ్యో వసుంధరామ్‌,

దేహ్యనుజ్ఞాం సచోవాచ వసిష్ఠో రాజసత్తమమ్‌. 60

ఇలా వృతవర్షమున దొడ్డబుద్ధి కల శ్వేతుడను రాజుండెను. ఆతడు పత్తనములతో, తోటలతో, చెట్లతో కూడిన సమస్త భూమిని. భగవంతుడా! బ్రాహ్మణులకు ఒసగగోరుచున్నాను. నాకనుమతి నిమ్ము - అని వసిష్ఠునితో పలికెను. అపుడు వసిష్ఠుడు ఆరాజు సత్తమునితో ఇట్లనెను.

అన్నదానం దదద్‌ రాజన్‌ సర్వకాలసుఖావహమ్‌,

అన్నేన చైవ దత్తేన కిం న దత్తం మహీతలే. 61

రాజా! అన్నదానము సర్వకాలములందును సుఖమును కలిగించునది. అన్నమొసగినచో భూతలమున ఈబడనిది ఏముండును?

సర్వేషా మేవ దానానా మన్నదానం విశిష్యతే,

అన్నాద్‌ భవన్తి భూతాని అన్నేనైవ చ వర్ధతే. 62

అన్నిదానములలో అన్నదానము మిన్న. అన్నమువలననే సర్వ ప్రాణులును పుట్టుచున్నవి. అన్నముచేతనే వృద్ధిపొందుచున్నవి.

తస్మాత్‌ సర్వప్రయత్నేన అన్నం దదస్వ భూపతే,

అందువలన సర్వప్రయత్నముతో రాజా! అన్నము ఇమ్ము.

తదవజ్ఞాయ రాజాసౌ వసిష్ఠం వాక్య మబ్రవీత్‌,

కిం వస్తు సతి తే చాన్నం యద్‌ వాదేయం వదేత్‌ కిల. 63

రాజామాటను లెక్కచేయక వసిష్ఠునితో ఇట్లనెను. నీ అన్నమిది - ఏమి ఒక గొప్ప దానమిచ్చువస్తువా? చెప్పు.

రత్న వస్త్రానలంకారాన్‌ శ్రీమాంశ్చ నగరాణి చ,

దత్తవాన్‌ బ్రాహ్మణభ్యోథ కుంజరా నజినాని చ. 64

అని రత్నములను, వస్త్రములను, అలంకారములను నగరములను, ఏనుగులను, మృగచర్మములను ఆ శ్రీమంతుడు బ్రాహ్మణుల కిచ్చుచుండెను.

స కదాచిన్నృపః పృథ్వీం జిత్వా పరమధర్మవిత్‌,

పురోహిత మువా చేదం వసిష్ఠం జపతాం వరమ్‌,

భగవన్నశ్వ మేధానాం సహస్రం కర్తు ముత్సహే. 65

అంత గొప్ప ధర్మవేత్తయగు ఆరాజు భూమినంతటిని జయించి పురోహితుడు తాపస శ్రేష్ఠుడగు వసిష్ఠునితో భగవానుడా! వేయి అశ్వమేధములను చేయగోరుచున్నాను. అని పలికెను.

సువర్ణరత్న రౌప్యాణి యాగం కృత్వా ద్విజాతిషు,

దత్తాని తేన రాజ్ఞవై నాన్నం దత్తం తథా జలమ్‌,

స్వల్పం వస్తు ఇతి జ్ఞాత్వా సోన్నం తు నదదత్‌ ప్రభుః 66

బంగారుకాసులు, రత్నములు, వెండివస్తువులు మొదలగు వానిని యజ్ఞము చేసి ఆ రాజు బ్రహ్మణులకు దానమొసగెను. కాని తక్కువ వస్తువని తలచి అన్నమునుగాని నీటిని గాని ఒసగలేదు.

ఏవం విభవయుక్తస్య తస్య రాజ్ఞో మహాత్మనః,

కాలధర్మవశాద్‌ దేవి మృత్యుః సమభవత్‌ తదా. 67

ఇట్లు గొప్పవిభవము గల మహాత్ముడగు ఆ రాజునకు కాలధర్మవశమున మృత్యువు సంప్రాప్తించెను.

పరలోకే వర్తమానః సచరాజా మహామనాః,

క్షుధయా పీడితో హ్యాసీత్‌ తృషయా చ విశేషతః. 68

తృషయా పీడ్యమానస్తు క్షుధయా రాజసత్తమః,

ఆవినాయాప్సరో భోగం గత్వా శ్వేతాఖ్య పర్వతమ్‌. 69

దప్పి ఆకలి అనునవి బాధింపగా ఆరాజవరుడు అప్సరసల నివాసమగు శ్వేతమను పర్వతమున కరిగెను. పరలోకమున తిరుగుచు దొడ్డ బుద్ధిగల ఆ రాజు ఆకలిదప్పులచే పీడనొందెను.

తత్ర ప్రాగ్జన్మమూర్తిం చ పురా దగ్ధాం మహాత్మనః,

తత్రా స్థీని స సంగృహ్య లిహన్నాస్తే సపార్థివః,

పున ర్విమాన మారుహ్య దివ మాచక్రమే నృపః. 70

అందాతని వెనుకటి జన్మపుమూర్తి కాలినదై యుండెను. ఆ రాజు దాని ఎముకలను ప్రోగు చేసికొని నాకుచునుండెను. మరల విమాన మెక్కిస్వర్గమున కరిగెను.

అథ కాలేన మమతా స రాజా శంసితవ్రతః,

తాన్యస్థీని లిహన్‌ దృష్టో వసిష్ఠేన మహాత్మనా,

ఉక్తశ్చ తేన కించ త్వం స్వాస్థి భుంక్షే నరాధిప. 71

అంత పెద్దకాలమునకు చక్కగా చేసిన వ్రతములు గల ఆ రాజు ఎముకలను నాకుచు మహాత్ముడగు వసిష్ఠునకు కానవచ్చెను. వసిష్ఠుడు - ఇదియేమి? రాజా! నీఎముకనే తినుచున్నావు? అని అడిగెను.

ఏవముక్త స్తదా రాజా వసిష్ఠేన మహర్షిణా,

ఉవాచ వచనం చేదం శ్వేతో రాజా మునిం తదా. 72

ఇట్లు మహర్షి యగు వసిష్ఠుడు పలుకగా శ్వేతమహారాజు ఆమునితో ఇట్లు పలికెను.

భగవన్‌ క్షుధితోస్మ్యన్త రన్నపానం పురా మయా,

న దత్తం మునిశార్దూల తేన మే దారుణా క్షుధా. 73

స్వామీ! ఆకలితో నున్నాడను. మునుపు నేను అన్నపానముల నొసగలేదు. అందుకై నా ఆకలి దారుణమైనది.

ఏవముక్త స్తతో రాజ్ఞా వసిష్ఠో మునిపుంగవః,

ఉవాచ చ మునిర్భూయో వాక్యం శ్వేతం మహానృపమ్‌. 74

రాజిట్లనగా మునిపుంగవుడగు వసిష్టుడు ఆ మహారాజు శ్వేతునితో మరల ఇట్లు పలికెను.

కిం తే కరోమి రాజేన్ధ్ర క్షుధితస్య విశేషతః,

అదత్తం నోపతిష్ఠేత కస్యచిత్‌ కించిదుత్తమమ్‌. 75

రాజా! విశేషముగా ఆకలిగొన్న నీకేమి చేయుదును? దానమోసగనిది ఎవ్వనికి ఏదియు మేలైనది లభింపదు.

రత్నహేమ ప్రదానేన భోగవాన్‌ జాయతే నరః,

అన్నదాన ప్రదానేన సర్వకామైస్తు తర్పితః,

తన్న దత్తం త్వయా రాజన్‌ స్తోకం మత్వా నరాధిప. 76

రత్నములు, బంగారము దానమొసగుటచేత నరుడు భోగముల కలవాడగును. అన్నమునొసగుటచేత అన్నికామములతో తృప్తికలవాడగును. రాజా! అదియెంత దానమునుకొని నీవు అన్నదానము చేయవైతివి.

శ్వేత ఉవాచ - శ్వేతుడిట్లు పలికెను.

అదత్తస్య చ సంప్రాప్తి స్త న్మమాచక్ష్వ పృచ్ఛతః,

శిరసా భక్తి యుక్తేన యాచితోసి మహామునే. 77

మహామునీ! భక్తినిండిన తలతో నిన్నడుగుచున్నాను. దానమొసగనిది పొందుట యెట్లో నాకు తెలియెజెప్పుము.

వసిష్ఠ ఉవాచ - వసిష్ఠు డిట్లు చెప్పెను.

అస్త్యేకం కారణం యేన జాయతే తన్నసంశయః,

తచ్ఛ్రుణుష్వ నరవ్యాఘ్ర కథ్యమానం మయానఘ. 78

రాజా! దానికొక దారియున్నది. సంశయములేదు. చెప్పు చున్నాను. వినుము.

ఆసీద్‌ రాజా పురాకల్పే వినీతాశ్వేతి విశ్రుతః,

స సర్వమేధ మారేభే స్వయం క్రతువరం నృప. 79

పూర్వకల్పమున వినీతాశ్వుడను రాజొకడుండెను. ఆతడు సర్వమేధమను ఉత్తమయజ్ఞ మును ఆరంభించెను.

యజతానేన విప్రేభ్యో దత్తా గావో ద్విపా వసు,

నాన్నం తేన తదా దత్తం స్వల్పం మత్వా యథా త్వయా 80

యజ్ఞము చేయుచు ఆతడును విప్రులకు గోవులను, ఏనుగులను, ధనములను ఒసగెను కాని అన్నము తక్కువది అని నీవలెనే భావించి ఒసగకుండెను.

కృత్వా పుణ్యం వినీతాశ్వః సార్వభౌమో నృపోమహాన్‌,

స్వర్గం చ గతవాన్‌ సోపి యథా రాజన్‌ భవాన్‌ ప్రభో. 81

సార్వభౌముడు, మహారాజునగు ఆ వినీతాశ్వుడు పుణ్యము చేసి నీవలెనే స్వర్గమున కరిగెను.

అసా వపి క్షుధావిష్ట ఏవమేవ గతో నృపః,

మర్త్యలోకే నదీతీరం గంగాయాం నీలపర్వతమ్‌. 82

అతడును ఆకలిపైకొనగా నీవలెనే మానవలోకమున గంగా నది ఒడ్డున నీలపర్వతమున కరిగెను.

విమానే నార్కవర్ణేన భాస్వతా దేవవన్నృపః,

దదర్శ చ తదా రాజా క్షుధితః స్వం కళేబరమ్‌. 83

సూర్యునివలె ప్రకాశించుచున్న విమానముతో దేవుని వలెనున్న ఆ రాజు ఆకలికొన్నవాడై తన శవమును చూచెను.

పురోహితం దదర్శాథ హోతారం జాహ్నవీతటే,

తం దృష్ట్వాసావపి నృపః పప్రచ్ఛ మునిసత్తమమ్‌,

క్షుధాయాః కారణం కింమే సహోతా తమువాచ హ. 84

తనపురోహితుడు హోతయనువానిని ఆ గంగ ఒడ్డున ఆరాజు చూచెను. ఆతడును ఆమునిసత్తముని నా ఆకలికి కారణమేమి? అని యడిగెను. ఆ హోత అతనితో నిట్లనెను.

తిలధేనుం భవాన్‌ రాజన్‌ జలధేనుం చ సత్తమ,

ఘృతధేనుం దధిధేనుం రసధేనుం చ పార్థివ. 85

దేహి శీఘ్రం యేన భవాన్‌ క్షుధయా వర్జితోభ##వేత్‌,

తపతే యావ దాదిత్య స్తపతే వాపి చన్ధ్రమాః. 86

రాజా! నీవు వెంటనే తిలధేనువు, జలధేనువు, ఘృతధేనువు, దధి ధేనువు, రసధేనువు అనువానిని దానమొసగుము. దానితో నీ ఆకలి నిన్ను వదలును. సూర్యచంద్రులు ప్రకాశించుచున్నంతవరకు ఆకలి నిన్ను దరిజేరదు.

ఏవ ముక్త స్తతో రాజా తం పునః పృష్టవా నిదమ్‌,

తిలధేనో ర్విధానంతు వినీతాశ్వో నరాధిపః. 87

ఇట్లతడు పలుకగా రాజాతనిని తిలధేనువు విధానమును గూర్చి అడిగెను.

వీనీతాశ్వ ఉవాచ - వినీతాశ్వు డిట్లనెను.

కథం సా దీయతే బ్రహ్మం స్తిలధేను ర్జిగీషుభిః,

భుఙ్త్కే స్వర్గం చ విప్రేన్ధ్ర తన్మమాచక్ష్వ పృచ్ఛతః 88

బ్రాహ్మణోత్తమా! గెలుపుగోరువారు ఏవిధముగా తిలధేనువు నిత్తురు? స్వర్గము నెట్లు అనుభవింతురు. అది నాకు చెప్పుము.

హోతా ఉవాచ - హోత ఇట్లనెను.

విధానం తిలధేనోస్తు త్వం శృణుష్వ నరాధిప, 89

రాజా! తిలధేనువునిచ్చు పద్ధతిని నీవు వినుము.

చతుర్భిః కుడవై శ్చైవ ప్రస్థ ఏకః ప్రకీర్తితః,

తైః షోడశైః భ##వేత్‌ సాతు చతుర్భి ర్వత్సకో భ##వేత్‌. 90

నాలుగు కుడవములతో ఒక ప్రస్థమగును. పదునారు ప్రస్థములతో ఆ ధేనువు ఏర్పడును. నాలుగింటితో దూడ ఏర్పడును.

ఇక్షుదండమయాః పాదా దన్తాః పుష్పమయాః శుభాః,

నాసా గన్ధమయీ తస్యా జిహ్వా గుడమయీ శుభా. 91

చెరకుగడలతో పాదములు, పుష్పములతో దంతములు, గంధముతో ముక్కు, బెల్లముతో నాలుకయు చేయవలయును.

పుచ్ఛే స్రక్‌ కల్పనీయా స్యాద్‌ ఘణ్టాభరణభూషితా,

ఈదృశీం కల్పయిత్వా తు స్వర్ణశృజ్గీం తు కారయేత్‌. 92

తోకయందు పూలమాలను కూర్పవలయును. గంటల అభరణములతో అలంకరించిన ఆ తిలధేనువును బంగారు కొమ్ములు కలదానినిగా చేయవలయును.

కాంస్యదోహం రౌప్యఖురాం పూర్వధేను విధానతః,

కృత్వా తాం బ్రాహ్మణాయాశు దాపయేత నరాధిప. 93

కంచుపాత్రను, వెండిగిట్టలను ఆ ఆవునకు విధిననుసరించి చేసి దానిని శీఘ్రముగా బ్రాహ్మణునకు దానముచేయవలయును.

కృష్ణాజినం ధేనువాసో నన్దితాం కల్పితాం శుభామ్‌,

సూత్రేణ సూత్రితాం కృత్వా సర్వరత్న సమన్వితామ్‌,

సర్వౌషధిసమాయుక్తాం మన్త్రపూతాం తు దాపయేత్‌. 94

నల్లని లేడిచర్మము ఆ ఆవునకు వస్త్రము. ఇట్లు ఆ శుభమగు నందితను కల్పించి సర్వరత్నములతో కూడిన హారమును కూర్చి సకల విధములగు ఓషధులను ఏర్పరచి ఈ క్రింది మంత్రముతో పవిత్రను చేసి దానము చేయవలయును.

అన్నం మే జాయతా మన్యత్‌ పానం సర్వరసా స్తథా,

సర్వం సంపాదయాస్మాకం తిలధేనో ద్విజార్పితే. 95

ఓ తిలధేనూ! నిన్ను ద్విజున కర్పించుచున్నాను. నాకు దీని వలన అన్నము, పానము, అన్నిరసములు కలుగుగాక మాకు సర్వమును సంపాదించి పెట్టుము.

గృహ్ణామి దేవి త్వాంభక్త్యా కుటుంబార్థం విశేషతః,

భజస్వ కామాన్‌ మాందేవి తిలధేనో నమోస్తుతే. 96

దానముగ్రహించువాడు - ఓ తిలధేనూ! నీకు నమస్కారము. విశేషమగు భక్తితో నాకుటుంబము కొరకు నిన్ను గ్రహించుచున్నాను. నా కోరికలను, నన్ను ఆదరింపుము, అనవలయును.

ఏవం విధాం తతో దద్యాత్‌ తిలధేనుం నృపోత్తమ,

సర్వకామసమావాప్తిం కురుతే నాత్ర సంశయః 97

ఇట్టిదగు తిలధేనువును దానముచేయవలయును. అది అన్ని కోరికలను తీర్చును. సంశయము లేదు.

యశ్చేంద్రం శృణుయాద్‌ భక్త్యా కుర్యాత్‌ కారయతేపి వా,

సర్వపాపవినిర్ముక్తో విష్ణులోకం చ గచ్ఛతి. 98

దీనిని భక్తితో వినువాడు, చేయువాడు, చేయించువాడును సర్వపాపములను వదలించుకొని విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టనవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహ పురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదియెనిమిదవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters