Varahamahapuranam-1    Chapters   

ఏకనవతితమోధ్యాయః - తొంబది యొకటవ అధ్యాయము

శ్రీవరాహ ఉవాచ - శ్రీవరాహదేవు డిట్లు చెప్పెను.

యా మందరగతా దేవీ తపస్తప్తుం తు వైష్ణవీ,

రాజసీ పరమా శక్తిః కౌమారవ్రతధారిణీ. 1

సైకాకినీ తపస్తేపే విశాలాయాం తు శోభ##నే,

తస్యా స్తపన్త్యాః కాలేన మహతా క్షుభితం మనః. 2

మందరమునకు తపస్సునకై అరిగిన ఆ రజోగుణము వలన ఏర్పడిన పరమశక్తి వైష్ణవి కౌమార వ్రతధారిణి యై ఒంటరిగా విశాల యను చోట తపస్సు చేయుచుండెను. తపము చేయుచుండగా పెద్ద కాలమునకు ఆమె మనస్సు కలతపడెను.

తస్మాత్‌క్షోభాత్‌ సముత్తస్థుః కుమార్యః సౌమ్యలోచనాః,

నీలకుంచితకేశాన్తా బింబోష్ఠా యతలోచనాః,

నితంబరశనోద్దోమా నూపురాఢ్యాః సువర్చసః. 3

ఆక్షోభవలన నిర్మలములగు కన్నులు, నల్లని నొక్కుల జుత్తు, దొండపండు వంటి పెదవులు, నిడుపాటి కన్నులు, మొలనూలు గల నడుములు, మ్రోయుచున్న అందెలు గల పాదములు, వెలిగి పోవుచున్న దేహ కాంతియు గల కుమారీజనుల పుట్టుకొని వచ్చిరి.

ఏవం విధాః స్త్రియో దేవ్యా క్షోభితే మనసి ద్రుతమ్‌,

ఉత్తస్థుః శతసాహస్రాః కోటిశో వివిధాననాః 4

ఆ దేవి మనసు క్షోభపడగా ఇట్లు కోట్లకొలదిగా పెక్కు తీరులైన మొగముల కన్యలు పైకి లేచిరి.

దృష్ట్వా కుమార్యః సా దేవీ తస్మి న్నేవ గిరౌ శుభా,

తపసా నిర్మమే దేవీ పురం హర్మ్యశతాకులమ్‌. 5

విశాలరథ్యం సౌవర్ణప్రాసాదై రుపశోభితమ్‌,

అంతర్జలాని వేశ్వాని మణి సోపానవన్తి చ,

రత్నజాలగవాక్షాణి ఆసన్నోపవనాని చ. 6

అట్టి ఆ కుమారీ జనమును గాంచి ఆ దేవి ఆ పర్వతమున వెడల్పయిన బాటలు, బంగారు ప్రాసాదములు, లోపలనీరుగల భవనములు, మణులతో చేసిన సోపానములు రత్నజాలముల గవాక్షములు, అందుబాటులో ఉన్న ఉద్యానములు గల వందలకొలది భవనములున్న పురమును తపశ్శక్తి చేత నిర్మించెను.

అసంఖ్యాతాని హర్మ్యాణి తథా కన్యా ధరాధరే,

ప్రాధాన్యేన ప్రవక్ష్యామి కన్యా నామాని శోభ##నే. 7

భూదేవీ! ఆ భవనములు, ఆ కన్యలు లెక్క పెట్టరాని సంఖ్యలో ఉన్నవి. ప్రాధాన్యమును బట్టి ఆ కన్యల నామములను చెప్పెదను.

విద్యుత్ప్పభా చంద్రకాన్తిః సూర్యకాన్తి స్తథాపరా,

గంభీరా చారుకేశీ చ సుజాతా ముఞ్జకేశినీ. 8

ఘృతాచీ చోర్వశీ చాన్యా శశినీ శీలమండితా,

చారుకన్యా విశాలాక్షీ ధన్యా పీనపయోధరా. 9

చంద్రప్రభా గిరిసుతా తథా సూర్యప్రభామృతా,

స్వయంప్రభా చురుముఖీ శివదూతీ విభావరీ. 10

జయా చ విజయా చైవ జయన్తీ చాపరాజితా,

ఏతా శ్చాన్యాశ్చ శతశః కన్యా స్తస్మిన్‌ పురోత్తమే. 11

విద్యుత్ర్పభ, చంద్రకాంతి, సూర్యకాంతి, సూర్యకాంతి, గంభీర, చారుకేశి, సుజాత, ముంజకేశిని, ఘృతాచి, ఉర్వశి, శశిని, శీలమండిత, చారుకన్య, విశాలాక్షి, పుష్టిగల స్తనములుగల ధన్య, చంద్రప్రభ,

గిరిసుత, సూర్యప్రభ, అమృత, స్వయంప్రభ, చారుముఖి, శివదూతి, విభావరి, జయ, విజయ, జయంతి, అపరాజిత - వీరును ఇంకను వందలకొలది కన్యలును ఆ ఉత్తమపురమున నివసించిరి.

దేవ్యా అనుచరాః సర్వాః పాశాంకుశధరాః శుభాః,

తాభిః పరివృతా దేవీ సింభాసనగతా శుభా. 12

సుసితై శ్చామరైః స్త్రీభి ర్వీజ్యమానా విలాసినీ,

కౌమారం వ్రతమాస్థాయ తపః కర్తుం సముద్యతా. 13

వీరందరు ఆదేవిని వెంటనంటి యుందురు. పాశమును, అంకుశమును ధరించువారు, మంచివారు. వారు కొలిచియుండగా ఆ దేవి సింహాసమున కూర్చుండి, తెల్లని వింజామరతో స్త్రీలు విసరుచుండగా కౌమారవ్రతమును తాల్చి తపస్సు చేయుటకు ఉద్యుక్త ఆయెను.

¸°వనస్థా మహాభాగా పీనవృత్త పయోధరా,

చంపకాశోకపున్నాగ నాగకేసరదామభిః.

సర్వాంగే ష్వర్చితా దేవీ ఋషి దేవనమస్కృతా,

పూజ్యమానా వరస్త్రీభిః కుమారీభిః సమంతతః. 15

¸°వనమున నున్నది, పూజ్యురాలు, చక్కని దేహపుష్టికలది, సంపెంగలు, అశోకములు, పున్నాగములు, నాగకేసరములు మొదలగు పూమాలలతో అన్ని యంగములందును అర్చింపబడినది, ఋషులు, దేవతలు మొదలగువారి నమస్కారములు కొనుచున్నట్టిది, శ్రేష్ఠలగు కన్యలు పూజలు చేయుచున్నట్టిది అయి ఆ దేవి విరాజిల్లుచుండెను.

సర్వాజ్గభోగినీ దేవీ యావదాస్తే తపోన్వితా,

తావదాగతవాం స్తత్ర నారదో బ్రహ్మణః సుతః. 16

ఇట్లా దేవి సర్వాంగభోగములు కలదియై తపస్సు చేయుచుండగా బ్రహ్మకుమారుడు నారదు డచటికి వచ్చెను.

తం దృష్ట్వా సహసా దేవీ బ్రహ్మపుత్రం తపోధనమ్‌,

విద్యుత్ర్పభా మువాచేద మాసనం దీయతా మితి,

పాద్య మాచమనీయం చ క్షిప్రమసై#్మ ప్రదీయతామ్‌. 17

తపస్సేధనముగా గలవాడు, బ్రహ్మతనయుడు అగు అతనిని చూచి త్వరత్వరగా ఆ దేవి విద్యుత్ర్పభయను సఖితో ఆతని కాసనమిమ్ము. కాలుగడుగుకొని నీరు, త్రావుటకు జలము త్వరగా ఇమ్ము అని పలికెను.

ఏవముక్తా తదా దేవ్యా కన్యా విద్యుత్ర్పభా శుభా,

ఆసనం పాద్య మర్ఘ్యం చ నారదాయ న్యవేదయత్‌. 18

అట్లు ఆ దేవి పలుకగా విద్యుత్రభ నారదునకు ఆ సనమును, పాద్యమును, అర్ఘ్యమును నివేదించెను.

తతః కృతాసనం దృష్ట్వా ప్రణతం నారదం మునిమ్‌,

ఉవాచ వచనం దేవీ హర్షేణ మహతాన్వితా. 19

ఆ సనమును స్వీకరించి వినయముతో ఉన్న నారదమునిని గాంచి ఆదేవి గొప్ప సంతోషముతో ఇట్లు పలికెను.

స్వాగతం భో మునిశ్రేష్ఠ కస్మాల్లోకా దిహాగతః,

కిం కార్యం వద తే కృత్యం మా తే కాలాత్యయో భ##వేత్‌. 20

ఓ మునిశ్రేష్ఠా! నీకు స్వాగతము. ఏ లోకమునుండి యిచటికి విచ్చేసితివి? నీ పనియేమి? నీకు నేను చేయవలసినదేమి? నీకు ఆలస్యము జరుగరాదు. చెప్పుము.

ఏవ ముక్త స్తదా దేవ్యా నారదః ప్రాహ లోకవిత్‌,

బ్రహ్మలోకా దిన్ధ్రలోకం తస్మాద్రౌద్ర మథాచలమ్‌. 21

తత స్త్వామిహ దేవేశి ద్రష్టు మభ్యాగతః శుభే,

ఏవముక్త్వా మునిః శ్రీమాం స్తాం దేవీ మన్వవేక్షత. 22

ఆ దేవి యట్లు పలుకగా లోకజ్ఞుడగు నారదు డిట్లాడెను. తల్లీ! బ్రహ్మలోకమునుండి యింద్రలోకమునకు వెళ్లి అటునుండి రౌద్రచలమున కరిగి అటనుండి నిన్ను దర్శించుకొనుటకై ఓదేవేశీ! నీకడకు వచ్చితిని - అని పలికి కాంతి శాలియగు ఆ నారదుడా దేవిని పరికించి చూచెను.

దృష్ట్వా ముహూర్తం దేవేశీం విస్మితో నారదోభవత్‌,

అహోరూప మహో కాంతి రహో ధైర్య మహో వయః. 23

అహో నిష్కామతా దేవ్యా ఇతి ఖేద ముపాయ¸°.

ఒక్కముహూర్తము ఆ దేవేశిని పరికించి నారదు డచ్చెరువందెను. ఆహా! ఏమిరూపము! ఏమి కాంతి! ఏమి ధైర్యము! ఏమి వయస్సు! ఏమి నిష్కామత! అని మనసున చింతించెను.

దేవగంధర్వసిద్ధానాం యక్షకిన్నరరాక్షసామ్‌. 24

న రూప మీదృశం క్వాపి స్త్రీష్వన్యాసు ప్రదృశ్యతే,

ఏవం సంచిన్త్య మనసా నారదో విస్మయాన్వితః. 25

దేవతలు, గంధర్వులు, సిద్ధులు, యక్షులు, కిన్నరులు, రాక్షసులు అను జాతులలో కాని ఇంక ఏ యతరస్త్రీలలో కాని ఇట్టి రూపము ఎందును లేదు. అని మనసున భావించి నారదుడు విస్మయము పొందెను.

ప్రణమ్య దేవీం వరదా ముత్పపాత్‌ నభస్తలమ్‌,

గతశ్చ త్వరయా యుక్తః పురీం దైత్యేన్ధ్ర పాలితామ్‌. 26

వరదురాలగు ఆ దేవికి దండప్రణామము గావించి ఆకాశమున కెరిగెను. తొందరతో దైత్యరాజు పాలించు పురి కరిగెను.

మహిషాఖ్యేన భూతేశి సముద్రాన్తః స్థితాం పురీమ్‌,

తత్రాససాద భగవా ససురం మహిషాకృతిమ్‌. 27

ఆపురి మహిషము. సముద్రములోపల కలదు. అచటికా పూజ్యుడరిగి దున్నపోతు ఆకారముగల ఆ రాక్షసరాజును చేరుకొనెను.

దృష్ట్వా లబ్ధవరం వీరం దేవసైన్యాంతకం మహత్‌,

స తేన పూజితో భక్త్యా తదా లోకచరో మునిః. 28

ప్రీతాత్మా నారద స్తసై#్మ దేవ్యా రూప మనుత్తమమ్‌,

ఆచచక్షే యథాన్యాయం యద్దృష్టం దేవతాపురే. 29

వరములు పొందిన వీరుడు, దేవసైన్యమును పెద్దమొత్తములో రూపుమాపినవాడు అగు ఆ రాక్షసుని గాంచి భక్తితో ఆతడుచేసిన పూజలందుకొని లోకములందు తిరుగుచుండు ఆ ముని ప్రీతినొంది తాను దేవతాపురమున చూచిన ఆ దేవి సర్వోత్తమ రూపమును గూర్చి ఉన్నదున్నట్లు వక్కాణించెను.

నారద ఉవాచ - నారదు డిట్లు పలికెను.

అసురేన్ధ్ర శృణుషై#్వకం కన్యారత్నం సమాహితః,

యేన లబ్ధం తు త్రైలోక్యం వరదానా చ్చరాచరమ్‌. 30

రాక్షసరాజా! ఒక కన్యారత్నమును గూర్చి సావధానుడవై వినుము. వరదానమువలన ఆమో చరాచరమగు మూడులోకముల సముదాయమును సాధించినది.

బ్రహ్మలోకా దహం దైత్య మందరాద్రి ముపాగతః,

తత్ర దేవీపురం దృష్టం కుమారీ శతసంకులమ్‌. 31

దైత్యా! నేను బ్రహ్మలోకమునుండి మందరగిరి కరిగితిని. అందు వందలకొలది కన్యలతో బిలబిలలాడు దేవీపురమును గాంచితిని.

తత్ర ప్రధానా యా కన్యా తపసీ వ్రతధారిణీ,

సా దేవదైత్యయక్షాణాం మధ్యే కాచి న్న దృశ్యతే. 32

అందు ముఖ్యురాలగు కన్య తపస్సు చేయుచున్నది. వ్రతమును పూనియున్నది. దేవతలతో, దైత్యులలో, యక్షులలో అట్టి ఆమెను నేనెచటను చూడలేదు.

యాదృశీ సా శుభా దైత్యా తాదృశ్యేకాండమధ్యతః,

భ్రమతా తాదృశీ దృష్ట్వా న కదాచిన్మయా సతీ. 33

ఈ బ్రహ్మాండమునడును నేను తిరుగులాడుచు అట్టి కన్య నొక్కదానిని కూడ నేను ఎన్నడును కాంచనైతిని.

తస్యాశ్చ దేవగన్ధర్వా ఋషయః సిద్ధచారణాః,

ఉపాసాంచక్రిరే సర్వే యోప్యన్యే దైత్యనాయకాః 34

దేవజాతివారు, గంధర్వులు, ఋషులు, సిద్ధులు, చారణులు, ఇతరులగు రాక్షసనాయకులు అందరు ఆమె కడ పడిగాపులు పడియున్నారు.

తాం దృష్ట్వా వరదాం దేవీ మహం తూర్ణ మిహాగతః,

అజిత్వా దేవగంధర్వాన్‌ న తాం జయతి కశ్చన. 35

వరములనొసగు ఆ దేవిని గాంచి వెంటనే నేనిటకు పరువెత్తి వచ్చితిని. దేవతలను, గంధర్వులను గెలువక ఆమె నొక్కడును గెలువజాలడు.

ఏవ ముక్త్వా క్షణం స్థిత్వా తమనుజ్ఞాప్య నారదః,

యథాగతం య¸° ధీమా నన్తర్ధానేన తత్షణాత్‌. 36

ఇట్లు పలికి ఒక్కక్షణ మచట నిలిచి ఆతనిని వీడ్కొని ధీశాలియగు నారదుడు ఆ క్షణమున అంతర్ధానము చెందెను.

ఇతి శ్రీవారహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకనవతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున తొంబదియొకటవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters