Varahamahapuranam-1    Chapters   

అష్టాశీతితమోధ్యాయః - ఎనుబది యెనిమిదవ అధ్యాయము

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లు చెప్పెను.

త్రిషు శిష్టేషు వక్ష్యామి ద్వీపేషు మనుజాన్యుత,

శాల్మలం పంచమం వర్షం ప్రవక్ష్యే తన్నిబోధత,

క్రౌంచద్వీపస్య విస్తారా చ్ఛాల్మలో ద్విగుణో మతః. 1

మిగిలినమూడు ద్వీపములలో అయిదవదియగు శాల్మల ద్వీపమును గూర్చి చెప్పెదను. వినుడు. శాల్మలము క్రౌంచద్వీపమునకు రెట్టింపు అయినది.

ఘృతసముద్ర మావృత్య వ్యవస్థిత స్తద్విస్తారో ద్విగుణ

స్తత్ర చ సప్త పర్వతాః ప్రధానా స్తావన్తి చ వర్షాణి తావత్యో

నద్యః. 2

ఇది నేతి సముద్రముతో చుట్టబడియున్నది. దాని వైశాల్యము ద్వీపమునకు రెట్టింపు. అందును ఏడు పర్వతములు ప్రధానములు. అంతే సంఖ్యలో దేశములు, నదులు కలవు.

తత్ర చ పర్వతాః సుమహాన్‌ పీతఃశాత కౌమ్భాత్‌ సార్వ

గుణ సౌవర్ణరోహిత సుమనసకుశల జాంబూనదవైద్యుతా

ఇత్యేతే కులపర్వతా వర్షాణి చేతి. 3

మిక్కిలి పెద్దది, బంగారుతో ఏర్పడినది కనుక పచ్చని వన్నె కలది యగు సార్వగుణము, సౌవర్ణము, రోహితము, సుమనసము, కుశలము, జాంబూనదము, వైద్యుతము అనునవి కుల పర్వతములు. దేశములును ఈ పేర్లతోనే యున్నవి.

అథ షష్ఠం గోమేదం కథ్యతే. శాల్మలం యథా

సురోదేన ఆవృతం తద్వత్‌ సురోదో7పి తద్ద్విగుణన

గోమేదేనావృతః తత్ర చ ప్రధాన పర్వతౌ ద్వావేవ.

ఏకస్యతావత్తావసరః. అపరశ్చ కుముద ఇతి. సముద్ర

శ్చేక్షురస స్తద్ద్విగుణన పుష్కరేణావృతః. 4

ఆరవది గోమేద ద్వీపము. శాల్మలము వలె సురోదముతో ఆవృతమైనది. (సురోదము - మద్యపు సముద్రము). అది దానికి రెట్టింపుగా ఉన్న గోమేదముతో చుట్టబడి యున్నది. అందు ప్రధాన పర్వతములు రెండే. మొదటిది తావసరము. రెండవది కుముదము. సముద్రము చెరకురసము కలది. దానికి రెట్టింపు అయినది పుష్కరము.

తత్ర చ పుష్కరాఖ్యే మానసో నామ పర్వతః. తదపి

ద్విధాభిన్నం వర్షం తత్ప్రమాణనచ. స్వాదోదకేనావృతమ్‌.

తతశ్చ కటాహమ్‌. ఏతత్‌ పృథివ్యాః ప్రమాణమ్‌. 5

ఆ పుష్కర ద్వీపమున మానసమను పర్వతమొక్కటి కలదు. దానితో ఆ దేశము రెండుగా చీలినది. తీయని నీరు చుట్టును కలదు. దానికి పైని కటాహము కలదు. ఇది భూమి ప్రమాణము. (కటాహము - కుండ మొదలగు వాని లోపలి అంచు).

బ్రహ్మాండస్య చ సకటాహవిస్తార ప్రమాణమ్‌. ఏవం

విధానా మండానాం పరిసంఖ్యా న విద్యతే. ఏతాని కల్పే

కల్పే భగవాన్‌ నారాయణః క్రోడరూపీ రసాతలాంతః

ప్రవిష్టాని దంష్ట్రె కేనోద్ధృత్య స్థితౌ స్థాపయతి. 6

బ్రహ్మాండము కటాహముల మొత్తము విస్తారపు కొలత కలిగి యున్నది. ఇట్టి అండములు లెక్కలేనన్ని కలవు. ప్రతికల్పము నందును భగవంతుడగు నారాయణుడు వరాహరూపమును తాల్చి రసాతలమున చొచ్చుకొని పోయిన వీని నన్నింటిని ఒక కోరతో పైకెత్తి మరల చక్కగా నిలుపును.

ఏష వః కథితో మార్గో భూమే రాయామ విస్తరః,

స్వస్తి వో7స్తు గమిష్యామి కైలాసం నిలయం ద్విజాః. 7

విప్రులారా! భూమి పొడవు వెడల్పుల మార్గమును మీకు తెలియజెప్పితిని. మీకు స్వస్తియగుగాక! నేను నా నివాసమగు కైలాసమునకు పోయెదను.

శ్రీవరాహ ఉవాచ శ్రీ వరాహదేవు డిట్లు పలికెను.

ఏవముక్త్యా గతో రుద్రః క్షణా దదృశ్యమూర్తిమాన్‌,

తే చ సర్వే గతా దేవా ఋషయశ్చ యథాగతమ్‌. 8

ఇట్లు పలికి రుద్రుడు క్షణములో అదృశ్యమైనమూర్తి కలవాడై వెడలెను. ఆ దేవతలు ఋషులును అందరును తమతమ తావుల కరిగిరి.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే అష్టాశీతితమో7ధ్యాయః

ఇతి శ్రీవరాహపురాణము అను భగవచ్ఛాస్త్రమున ఎనుబది యెనిమిదవ అధ్యాయము

Varahamahapuranam-1    Chapters