Varahamahapuranam-1    Chapters   

ఏకసప్తతితమో ధ్యాయః - డెబ్బదియొకటవ అధ్యాయము

అగస్త్య ఉవాచ - అగస్త్యుడిట్లు చెప్పెను.

ఏవముక్తా స్తతో దేవా ఋషయశ్చ పినాకినా,

అహం చ నృపతే తస్య దేవస్య ప్రణతోభవమ్‌. 1

ఆ పినాకి ఇట్లుచెప్పగా దేవతలు, ఋషులు, నేనును ఆ దేవునకు ప్రణమిల్లితిమి.

ప్రణమ్య శిరసా దేవం యావత్‌ పశ్యామహే నృప,

తావత్‌ తసై#్యవ రుద్రస్య దేహస్తం కమలాసనమ్‌. 2

నారాయణం చ హృదయే త్రసరేణు సుసూక్ష్మకమ్‌,

జ్వలద్భాస్కరవర్ణాభం పశ్యామ భవదేహతః. 3

శిరస్సుతో ప్రణమిల్లి ఆ దేవుని చూచునంతలో ఆతని దేహమున నున్న బ్రహ్మను హృదయమున సన్నని దుమ్ము కణమంత సూక్ష్మరూపుడగు నారాయణుని కనుగొంటిమి. ఆనారాయణుడు జ్వలించుచున్న సూర్యుని వన్నెతో ప్రకాశించు చుండెను.

తం దృష్ట్వా విస్మితాః సర్వే యాజకా ఋషయో మమ,

జయశబ్దరవాం శ్చక్రుః సామఋగ్యజుషాం స్వనమ్‌. 4

అతనిని దర్శించుకొని అందరు విస్మితులై యాజకులగు ఋషులందరు సామము, ఋక్కు, యజస్సులతో జయ జయధ్వనులను గావించిరి.

కృత్వోచుస్తే తదా దేవం కిమిదం పరమేశ్వర!

ఏకస్యా మేవ మూర్తౌ తే లక్ష్యన్తే చ త్రిమూర్తయః. 5

కావించి వారు ఆదేవునితో నిట్లనిరి. పరమేశ్వరా! ఇదియేమి? నీ ఒక్కమూర్తియందే త్రిమూర్తులును గాన వచ్చుచున్నారు.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

యజ్ఞేస్మిన్‌ యద్ధుతం హవ్యం మాముద్దిశ్య మహర్షయః,

తేత్రయోపి వయం భాగం గృహ్ణీమః కవిసత్తమాః. 6

ఓ మేధావులారా! ఈ యజ్ఞమునందు మహర్షులు నన్నుద్దేశించి దేనిని హుతము చేయుదురో దానిని మేము మువ్వురమును గ్రహింతుము.

నాస్మాకం వివిధో భావో వర్తతే ముని సత్తమాః,

సమ్యగ్దృశః ప్రపశ్యన్తి విపరీతే హ్యనేకశః. 7

మునివరులారా! మాకు వేర్వేరు భావములు లేవు. పెక్కువిధములైన వానియందును, చక్కని చూపుగలవారు దీనిని చక్కగా దర్శింతురు.

ఏవ ముక్తే తు రుద్రేణ సర్వే తే మునయో నృప,

పప్రచ్ఛుః శంకరం దేవం మోహశాస్త్ర ప్రయోజనమ్‌. 8

రుద్రు డిట్లు పలుకగా ఆ మునులందరు శంకరుని మోహశాస్త్ర ప్రయోజనమును గూర్చి యిట్లడిగిరి.

ఋషయ ఊచుః - ఋషు లిట్లు పలికిరి.

మోహనార్థం తు లోకానాం త్వయా శాస్త్రం పృథక్‌ కృతమ్‌,

తత్‌ త్వయా హేతునా కేన కృతం దేవ వదస్వ నః. 9

దేవా! లోకములను మోహపెట్టుటకై నీవు విడిగా ఒక శాస్త్రమును చేసితివి. అది చేయుటకు కారనమేమి? మాకు చెప్పుము.

రుద్ర ఉవాచ - రుద్రుడిట్లనెను.

అస్తి భారత వర్షేణ వనం దండకసంజ్ఞితమ్‌,

తత్ర తీవ్ర తపోఘోరం గౌతమో నామ వై ద్విజః. 10

భారతవర్షమున దండకమను పేరుగల వనము కలదు. అందు గౌతముడను బ్రాహ్మణుడు ఘోరమగు తపమొనరించెను.

చకార తస్య బ్రహ్మాతు పరితోషం గతః ప్రభుః,

ఉవాచ తం మునిం బ్రహ్మా వరం బ్రూహి తపోధన. 11

బ్రహ్మ దానికి నిండు సంతోషము పొంది ఆమునితో తపోధనా! వరము కోరుకొనుమని పలికెను.

ఏవముక్త స్తదాతేన బ్రహ్మణా లోకకర్తృణా,

ఉవాచ సద్యః పంక్తిం మే ధాన్యానాం దేహి పద్మజ. 12

లోకములకు కర్తయగు బ్రహ్మ అట్లు పలుకగా ఆతడు 'పద్మసంభవా! నాకు వెనువెంటనే కొన్ని ధాన్యపు గింజల నొసగుము' అని పలికెను.

ఏవ ముక్తో దదౌ తస్య తమేవార్థం పితామహః,

లబ్ధ్వాతు తం వరం విప్రః శతశృంగే మహాశ్రమమ్‌. 13

చకార తస్యోషసి చ పాకాంతే శాలయో ద్విజః,

లూయన్తే తేన మునినా మధ్యాహ్నే పచ్యతే తథా,

సర్వాతిథ్య మసౌ విప్రో బ్రాహ్మణభ్యో దదాత్యలమ్‌. 14

ఇట్లనగా బ్రహ్మ ఆతడు కోరిన వరము నిచ్చెను. అతడును ఆ వరమును కైకొని శతశృంగమున ఒక పెద్ద ఆశ్రమమును నిర్మించుకొనెను. అందు ఆధాన్యపు గింజలు ఉషఃకాలమున మొలకెత్తి మధ్యాహ్నమునకు పండుచుండగా వానితో ఆ విప్రుడు బ్రాహ్మణులకు తగినంత ఆతిథ్యము చేయుచుండెను.

కస్యచిత్‌ త్వథ కాలస్య మహతీ ద్వాదశాబ్దికా,

అనావృష్టి ర్ద్విజవరా అభవల్లోమహర్షణీ. 15

అంత కొంతకాలమునకు పండ్రెండేండ్ల పెనుకరవు (అనావృష్టి) ఒడలికి గగుర్పాటు కలిగించుచు ఏర్పడినది.

తాం దృష్ట్వా మునయః సర్వే అనావృష్టిం వనేచరాః,

క్షుధయా పీడ్యమానాస్తు ప్రయయు ర్గౌతమం తదా. 16

ఆ దండకమున నున్న మహర్షులందరు ఆ అనావృష్టిని చూచి దప్పికతో బాధపడుచున్నవారై గౌతముని కడ కరిగిరి.

అథ తానాగతాన్‌ దృష్ట్వా గౌతమః శిరసా నతః,

ఉవాచ స్థీయతాం మహ్యం గృహే మునివరాత్మజాః. 17

అట్లు వచ్చిన వారిని గాంచి గౌతముడు తలతో (మ్రొక్కి ఓ మునివరపుత్రులారా! మీరందరు మాయింట నిలువుడని పలికెను.

ఏవ ముక్తాస్తు తే తేన తస్థు ర్వివిధ భోజనమ్‌,

భుఞ్జమానా అనావృష్టి ర్యావత్‌ సా నివృతాభవత్‌. 18

అట్లు పలుకగా వారందరు ఆ కరవంతయు పూర్తిగా పోవువరకు అతని ఆశ్రమమునందే భుజించుచు నిలిచిరి.

నివృత్తాయాం తు వై తస్యా మనావృష్ట్యాంతు తే ద్విజాః,

తీర్థయాత్రా నిమిత్తం తు ప్రయాతుమనసోభవన్‌. 19

ఆకరవు మరలిపోగా ఆబ్రాహ్మణులందరు తీర్థయాత్రపై మనసు పెట్టిరి.

తత్ర శాండిల్య నామానం తాపసం మునిసత్తమమ్‌,

ప్రత్యువాచేతి సంచిన్త్య మారీచః పరమో మునిః. 20

అచట మారీచుడను వరమముని శాండిల్యుడను ముని సత్తముని చూచి చక్కగా ఆలోచించి యిట్లు పలికెను.

మారీచ ఉవాచ - మారీచు డిట్లు పలికెను.

శాండిల్య శోభనం వక్ష్యే పితా తే గౌతమో మునిః,

తమనుక్త్వా న గచ్ఛామ స్తప శ్చర్తుం తపోవనమ్‌. 21

శాండిల్య! నీకొక మంచిమాట చెప్పెదను. నీ తండ్రి గౌతమమహర్షి. అతనికి చెప్పక మనము తపోవనమునకు తపమాచరించుటకు పోజాలము.

ఏవ ముక్తేథ జహసుః సర్వే తే మునయ స్తదా,

కి మస్మాభిః స్వకో దేహో విక్రీతోస్యాన్న భక్షణాత్‌. 22

అట్లు పలుకగా ఆ మునులందరు నవ్విరి. ఏమయ్యా! ఈయన అన్నముతిన్నంతమాత్రమున మనము మనదేహములను అమ్మితిమా! ఏమి?

ఏవముక్త్వా పునశ్చోచుః సోపాధిగమనం ప్రతి,

కృత్వా మాయామయీం గాంతు తచ్ఛాలాయాం వ్యసర్జయన్‌ 23

ఇట్లు పలికి మరల అటనుండి వెడలిపోవుటకొక నిమిత్తము నాలోచించిరి. ఒక మాయ గోవును సృజించి ఆశాలయందు వదిలిరి.

తాం చరన్తీం తతో దృష్ట్వా శాలాయాం గౌతమో మునిః,

గృహీత్వా సలిలం పాణౌ యాహి రుద్రేత్యభాషత.

అంత నా శాలయందు తిరుగుచున్న ఆ గోవును చూచి గౌతమముని చేతియందు నీటిని గ్రహించి రుద్రా! పొమ్ము అని పలికెను.

తతో మాయామయీ సా గౌః పపాత జలబింధుభిః. 24

నిహతాం తాం తతో దృష్ట్వా మునీన్‌ జిగమిషూంస్తదా,

ఉవాచ గౌతమో ధీమాం స్తాన్‌ మునీన్‌ ప్రణతః స్థితః. 25

అపుడు మాయామయిఅగు ఆ ఆవు నీటిబిందువులతో అట క్రిందపడెను. చనిపోయిన ఆ ఆవును, వెడలగోరుచున్న ఆమునులను గాంచి నమస్కరించి ఆగౌతము డిట్లు పలికెను.

కిమర్థం గమ్యతే విప్రాః సాధు శంసత మాచిరమ్‌,

మాం విహాయ సదా భక్తం ప్రణతం చ విశేషతః. 26

విప్రులారా! మీయందు భక్తుడను. విశేషించి మీకు మ్రొక్కిన వాడనునగు నన్ను వదలి మీరేల పోవలయును. చెప్పుడు ఆలసింపకుడు.

ఋషయ ఊచుః - ఋషు లిట్లనిరి.

గోపధ్యేయ మిహ బ్రహ్మన్‌ యావత్‌ తవ శరీరగా,

తాపదన్నం స భూఞ్జామో భవతోన్నం మహామునే. 27

బ్రాహ్మణా! నీ దేహమందు ఈ గోహత్యాపాపమున్నంత వరకు నీ అన్నమును మేము తినము.

ఏవముక్తో గౌతమోథ తాన్‌ మునీన్‌ ప్రాహ ధర్మవిత్‌,

ప్రాయశ్చిత్తం గోవధ్యాయా దీయతాం మే తపోధనాః. 28

వారట్లనగా ధర్మమెరిగి గౌతముడు ఆ మునులతో ఓ తపోధనులారా! ఈ గోవధకు ప్రాయశ్చిత్తమును సెలవిండు -అని పలికెను.

ఋషయ ఊచుః - ఋషు లిట్లనిరి.

ఇయం గౌ రమృతా బ్రహ్మన్‌ మూర్ఛితేవ వ్యవస్థితా,

గంగాజలప్లుతా చేయ ముత్థాస్యతి న సంశయః. 29

ఆ గోవు అమృతస్వరూప. మూర్ఛిల్లినది వలె నున్నది. గంగాజలమున మునిగినచో ఇది లేచును. సంశయము లేదు.

ప్రాయశ్చిత్తం మృతాయాః స్యా దమృతాయాః కృతం త్విదమ్‌,

వ్రతం వా మాకృథాః కోప మిత్యుక్త్వా ప్రయయుస్తు తే. 30

మరణించినదానికి ప్రాయశ్చిత్తము. చావని దానికై ఈ మాత్రము వ్రతము చాలును. కోపము చేయకుము. అని పలికి వారు వెడలిపోయిరి.

గతై సై#్త ర్గౌతమో ధీమాన్‌ హిమవన్తం మహాగిరిమ్‌,

మామారాధయిషుః ప్రాయాత్‌ తప్తుంచాశు మహత్‌ తపః. 31

వారు వెడలిపోగా బుద్ధి శాలియగు గౌతముడు హిమవంతమను మహాగిరికి నన్నారాధించుటకును, గొప్పతపము చేయుటకును అరిగెను.

శతమేకం తు వర్షాణా మహమారాధితోభవమ్‌,

తుష్టేన చ మయా ప్రోక్తో వరం వరయ సువ్రత. 32

ఒక నూరేండ్లు నన్నారాధించెను. నేను తుష్టిచెంది సువ్రతుడా! వరమును కోరుకొమ్మనెను.

సోబ్రవీ న్మాం జటాసంస్థాం దేహి గంగాం తపస్వినీమ్‌,

మయా సార్థం ప్రయాత్వేషా పుణ్యా భగీరథి నదీ. 33

అతడు నాతో ఇట్లనెను. నీజటలలో ఉన్న తపస్విని ఈ గంగను నాకిమ్ము. ఈ పుణ్య భాగీరథి నాతో పాటు వచ్చుగాక!

ఏవ ముక్తే జటాఖండ మేకం స ప్రదదౌ శివః,

తాం గృహ్య గతవాన్‌ సోపి యత్రాస్తే సా తు గౌ ర్మృతా. 34

అతడిట్లు పలుకగా శివుడు ఒక జడముక్క నొసగెను. దానిని కైకొని ఆతడును చచ్చిపడి యున్న గోవున్న చోటి కరిగెను.

తజ్జలా ప్లావితా సా గౌ ర్గతా చోత్థాయ భామినీ,

నదీ చ మహతీ జాతా పుణ్యతోయా శుచిహ్రదా. 35

ఆ నీటితో తడిసిన ఆ గోవు లేచి స్త్రీయై అరిగెను. అచట పుణ్యజలములు, పవిత్రములగు పడియలు గల ఒక్క పెద్దనది యేర్పడెను.

తం దృష్ట్వా మహదాశ్చర్యం తత్ర సప్తర్షయోమలాః,

ఆజగ్ముః ఖే విమానస్థాః సాధు సాధ్వితి వాదినః. 36

ఆ గొప్ప అద్భుతమును గాంచి పవిత్రులైన సప్తమహర్షులు ఆకాశమున విమానమునందున్న వారై మేలు మేలని పలుకుచు వచ్చిరి.

సాధు గౌతమ సాధూనాం కోన్యోస్తి సదృశ స్తవ,

యదేవం జాహ్నవీం దేవీం దండకే చావతారయత్‌. 37

గౌతమ! మేలు. మంచివారిలో నీకు సాటియగు వాడెవ్వడు?

ఈ జాహ్నవీదేవిని దండకమున అవతరింపజేసితివి.

ఏవ ముక్త స్తదా తైస్తు గౌతమః కిమిదిం త్వితి,

గోవధ్యాకారణం మహ్యం తావత్‌ పశ్యతి గౌతమః. 38

వారట్లు పలుకగా గౌతముడు ఇదియేమి? నాకీగోహత్యా పాపమెట్లు కలిగించెనని పరికించెను.

ఋషీణాం మాయయా సర్వ మిదం ఆతం విచిన్త్యవై,

శశాప తాన్‌ జటాభస్మ మిథ్యా వ్రతధరా స్తథా,

భవిష్యథ త్రయీబాహ్యా వేదకర్మబహిష్కృతాః. 39

ఇది యంతయు ఋషుల మాయ చేత కలిగెనని తెలిసికొని మీరందరు జడలు, బూడిద, తప్పుడు వ్రతములు తాల్చినవారు, వేదములకు వెలియైనవారు, వేదకర్మములనుండి భ్రష్టులైనవారు అగుడని శపించెను.

తచ్ఛ్రుత్వా క్రూరవచనం గౌతమస్య మహామునేః,

ఊచుః సప్తర్షయో మైవం సర్వకాలంద్విజోత్తమాః,

భవన్తు కింతు తే వాక్యం మోఘం నాస్త్యత్ర సంశయః. 40

మహాముని యగు ఆ గౌతముని క్రూరవచనము విని సప్తర్షులు ఇట్లనిరి : ఉత్తమబ్రాహ్మణులు సర్వకాలము ఇట్లు కాకుందురుగాక! నీ పలుకు పొల్లును కారాదు. సంశయము లేదు.

యది నామ కలౌ సర్వే భవిష్యన్తి ద్విజోత్తమాః,

ఉపకారిణి యేతే హి అపకర్తార ఏవ హి,

ఇత్థం భూతా అపి కలౌ భక్తి భాజో భవన్తు తే. 41

త్వద్వాక్య వహ్ని నిర్దగ్ధా దా కలియుగే ద్విజాః,

భవిష్యన్తి క్రియాహీనా వేదకర్మబహిష్కృతాః. 42

ఈ బ్రాహ్మణ శ్రేష్ఠులందరు ఉపకారము చేసిననీయందు అపకారము చేయువారైనను, నీయందు భక్తి కలవారు. నీమాటల నిప్పులో బూదియై కలియుగమున బ్రాహ్మణులు క్రియాహీనులు, వేదకర్మములనుండి వెలిపడిన వారు అగుదురు.

అస్యాశ్చ గౌణం నామేహ నదీ గోదావరీతి చ,

గౌర్దత్తా వరదానాచ్చ భ##వేద్‌ గోదావరీ నదీ. 43

ఈ నదికిని గోదావరియను పేరు గౌణముగా కలుగును. 'గోవుదత్త' 'వరదానమువలన' అను అర్థముతో ఇది గోదావరియగును.

ఏతాం ప్రాప్య కలౌబ్రహ్మన్‌ గాం దదంతి జనాశ్చయే,

యథాశక్త్యాతు దానాని మోదన్తే త్రిదశైః సహ. 44

ఈనది కడకు వచ్చి గోవును దానమిచ్చినవారు, ఇతరదానముల నొసగినవారు దేవతలతోపాటు మోదమును పొందుదురు.

సింహస్థేచ గురౌ తత్ర యో గచ్ఛతి సమాహితః,

స్నాత్వా చ విధినా తత్ర పితౄం స్తర్పయతే తథా. 45

స్వర్గం గచ్ఛన్తి పితరో నిరయే పతితా అపి,

స్వర్గస్థాః పితర స్తస్య ముక్తిభాజో న సంశయః. 46

గురువు సింహరాశియందున్నపుడు శ్రద్ధగల వాడై ఈనది కరిగి విధిపూర్వకమగా స్నానముచేసి పితృదేవతలకు తర్పణము చేయువాని పితరులు నరకమున పడినవారైనను స్వర్గమున కరుగుదురు. స్వర్గమునందున్న పితృదేవతలు ముక్తిపొందుదురు. సందియము లేదు.

త్వం ఖ్యాతిం మహతీం ప్రాప్య ముక్తిం యాస్యసి శాశ్వతమ్‌,

ఏవ ముక్త్వా థ మునయో యయుః కైలాస పర్వతమ్‌,

యత్రాహ ముమయా సార్ధం సదా తిష్ఠామి సత్తమాః. 47

నీవును గొప్పకీర్తిని పొంది శాశ్వత ముక్తిని పొందెదవు. అని ఆ మునులు, నేను ఉమాదేవితో పాటు శాశ్వతముగా నుండు కైలాసపర్వతమున కేగిరి.

ఊచు ర్వాం తే చ మునయో భవితా కో ద్విజోత్తమాః,

కలే త్వద్రూపిణః సర్వే జటాముకుట ధారిణః,

స్వేచ్ఛయా ప్రేతవేషాశ్చ మిథ్యాలింగధరాః ప్రభో. 48

తేషా మనుగ్రహార్థాయ కించిచ్ఛాస్త్రం ప్రదీయతామ్‌,

యేనాస్మ ద్వంశజాః సర్వే వర్తేయుః కలిపీడితాః. 49

ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులైన మునులు నాతో నిట్లనిరి. కలియందు వీరందరు నీవంటి రూపముకలవారు. జడలే కిరీటముగా ధరించువారు, ఇచ్చ ననుసరించి ప్రేతవేషమును తాల్చువారు. మాయలింగములు ధరించువారు నగుదురు. ఆ విధముగా కలిచేత పీడింపబడు మావంశమువారందరి ననుగ్రహించుటకొరకు ఏదేని శాస్త్రమును దయతో తామొసగవలయును.

ఏవ మభ్యర్థిత సై#్తస్తు పురాహం ద్విజసత్తమాః,

వేదక్రియా సమాయుక్తాం కృతవా నస్మి సంహితామ్‌. 50

నిఃశ్వాసాఖ్యాం తత స్తస్యాం లీనా బాభ్రవ్యశాండిలాః,

అల్పాపరాధా చ్ఛ్రుత్రైవ గతా బైడాలికా భవన్‌. 51

ఇట్లు వారు ప్రశ్నింపగా ఓ బ్రాహ్మణోత్తములారా! వేదక్రియలతో కూడిన 'నిఃశ్వాస' అను ఒక సంహితను చేసితిని. దానియందు బాభ్రవ్యులు శాండిలులు ఆరితేరిన వారైరి. చిన్నతప్పు వలన నిది జరిగినదని విన్నవెంటనే వారు పిల్లిశీలములు కలవారైరి.

మయైవ మోహితాస్తే హి భవిష్యం జానతా ద్విజాః,

లౌల్యార్థినస్తు శాస్త్రాణి కరిష్యన్తి కరిష్యన్తి కలౌ నరాః. 52

భవిష్యత్తు ఎరిగిన నేను బ్రాహ్మణులను మోహపెట్టితిని. కలియందు లోభము కలవారు శాస్త్రములను నిర్మింతురు.

నిఃశ్వాస సంహితాయాం హి లక్షమాత్ర ప్రమాణతః,

సైవ పాశుపతీ దీక్షా యోగః పాశుపత స్త్విహ. 53

నిశ్వాస సంహిత లక్షశ్లోకములప్రమాణము కలది. అదియే పాశుపత దీక్ష. దానినే పాశుపత యోగమందురు.

ఏతస్మాద్‌ వేదమార్గాద్ధి యదస్య దిహ జాయతే,

తత్‌ క్షుద్ర కర్మ విజ్ఞేయం రౌద్రం శౌచ వివర్జితమ్‌. 54

ఈ వేదమార్గముకంటె వేరైనది క్షుద్రకర్మముగా తెలియదగినది. అది రౌద్రము. శుద్ధి లేనిది.

యే రుద్ర ముపజీవన్తి కలౌ బైడాలికా నరాః,

లౌల్యార్థినః స్వశాస్త్రాణి కరిష్యన్తి కలౌ నరాః,

ఉచ్ఛుష్మరుద్రా స్తే జ్ఞేయా నాహం తేషు వ్యవస్థితః. 55

ఇట్టి పిల్లిశీలముగల గలనరులు రుద్రునాశ్రయించి బ్రతుకువారు చంచలస్వభావులు తమ శాస్త్రములను వేరుగా వ్రాసికొనుచుందురు. అట్టివారిని ఉచ్ఛుష్మరుద్రులందురు. నేను వారియందు నిలువను.

భైరవేణ స్వరూపేణ దేవకార్యే యదా పురా,

నర్తితం తు మయా సోయం సంబంధః క్రూరకర్మణామ్‌. 56

పూర్వము దేవతలపని కలిగినపుడు భైరవస్వరూపముతో నేను నర్తనము చేసితిని. ఇది క్రూరకర్ములకు నాతో సంబంధము.

క్షయం నినీషతా దైత్యా నట్టహాసో మయా కృతః,

యః పురా తత్ర యే మహ్యం పతితా అశ్రుబిన్దవః,

అసంఖ్యాతాస్తు తే రౌద్రా భవితారో మహీతలే. 57

మునుపు దైత్యులను నాశమొందించుకోరికతో నేను అట్టహాసము చేసితిని. అప్పుడు లెక్క పెట్టరాని కన్నీటిబిందువులు పడినవి. అవియే భూతలమున రౌద్రస్వరూపము లగును.

ఉచ్ఛుష్మనిరతా రౌద్రాః సురామాంసప్రియాః సదా,

స్త్రీలోలాః పాపకర్మాణః సంభూతా భూతలేషు తే. 58

ఉచ్ఛుష్మ పద్ధతియందు ఆసక్తి కలరుద్ర సంబంధులు మద్య మాంసములయందు ప్రీతికలవారు, స్త్రీలోలురు, పాపకర్ములు అయి భూలోకమున జన్మించిరి.

తేషాం గౌతమశాపాద్ది భవిష్యన్త్యన్వయే ద్విజాః,

తేషా మధ్యే సదాచారా యే మచ్ఛాసనే రతాః. 59

గౌతముని శాపము వలన వారి కులమున బ్రామ్మణులు జన్మింతురు. వారిలో సదాచారులు నాశసనమున ప్రీతికల వారగుదురు.

స్వర్గం చైవా పవర్గం చ ఇతి వై సంశయాత్‌ పురా,

బైడాలికాధో యాస్యన్తి మమ సంతతి దూషకాః. 60

బైడాలికులు స్వర్గమా, మోక్షమా అను సంశయమువలన నా సంతానమును చెరుచువారగుదురు.

ప్రాగ్‌ గౌతమాగ్నినా దగ్ధాః పునర్మద్వచనాద్‌ ద్విజాః,

నరకం తు గమిష్యన్తి నాత్ర కార్యా విచారణా. 61

ముందు నామాట మీద గౌతముని శాపాగ్నిచే దగ్ధులైన బ్రాహ్మణులు నరకమున కరుగుదురు. ఇందు విచారణ చేయనక్కర లేదు.

రుద్ర ఉవాచ - రుద్రు డిట్లనెను.

ఏవం మయా బ్రహ్మసుతాః ప్రోక్తా జగ్ముర్యథాగతమ్‌,

గౌతమోపి స్వకం గేహం జగామాశు పరంతపః. 62

నేనిట్లు చెప్పగా ఆబ్రాహ్మపుత్రులు తమతావున కరిగిరి. పరంతపుడగు గౌతముడును తన గృహమున కరిగెను.

ఏతద్‌ వః కథితం విప్రా మయా ధర్మస్య లక్షణమ్‌,

ఏతస్మాద్‌ విపరీతో యః సపాషణ్డరతో భ##వేత్‌. 63

విప్రులారా! మీకు ధర్మము లక్షణమును చెప్పితిని. దీనికంటె విపరీతముగా ప్రవర్తించువాడు పాషండులయందు ఆసక్తి కలవాడగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే ఏకసప్తతితమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున డెబ్బదియొకటవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters