Varahamahapuranam-1    Chapters   

చతురథికశతతమోధ్యాయః - నూటనాలుగవ అధ్యాయము

హోతా ఉవాచ - హోత చెప్పెను.

క్షీరధేనుం ప్రవక్ష్యామి తాం నిబోధ నరాధిప,

రాజా! క్షీరధేనువును తెలిపెదను. ఎరుగుము.

అనులిప్తే మహీవృష్ఠే గోమయేన నృపోత్తమ. 1

గోచర్మ మాత్రమానేన కుశానాస్తీర్య సర్వతః.

తస్యోపరి మహారాజ న్యసేత్‌ కృష్ణాజినం బుధః. 2

ఆవుపేడతో అలికిన నేలపై గోచర్మము కొలతతో దర్భలను అన్నివైపుల పరచి దానిపై నల్లజింకతోలు నుంచవలయును.

తస్యోపరి కుండలికాం గోమయేన కృతా మపి,

క్షీరకుంభం తతః స్థాప్య చతుర్థాంశేన వత్సకమ్‌. 3

దానిపై ఆవుపేడతో ఒక గుండ్రని అరుగును కావించి దానిపై పాలకుండను నిలపి నాలుగవవంతు గల మరియొక కుండతో దూడను చేయవలయును.

సువర్ణముఖ శృజ్గాణి చందనాగురుకాని చ,

ప్రశస్తపత్ర శ్రవణాం తిలమాత్రోపరి న్యసేత్‌. 4

బంగారముతో ముఖము, కొమ్ములు చేసి వాని పై చందనా గురువు లలది మంచి ఆకులతో చెవులు చేసి నువ్వులపై ఉంచవలయును.

ముఖం గుడమయం తస్యా జిహ్వా శర్కరయా తథా,

ఫలప్రశస్త దశనాం ముక్తాఫలమయేక్షణామ్‌. 5

ఇక్షుపాదాం దర్భరోమాం సితకంబల కంబలామ్‌,

తామ్రపృష్ఠాం కాంస్యదోహాం పట్టసూత్రమయం శుభమ్‌ 6

పుచ్ఛం చ నృపశార్దూల నవనీతమయస్తనీమ్‌,

స్వర్ణశృజ్గీం రౌప్యఖురాం పఞ్చరత్న సమన్వితామ్‌. 7

నోటిని బెల్లముతో, నాలుకను చక్కెరతో, దంతములను మేలైనపూలతో, కన్నులను ముత్యములతో, కాళ్లను చెరకుగడలతో, రోమములను దర్భలతో, గంగడోలును తెల్లని పట్టు వస్త్రముతో, పిరుదుభాగమును రాగితో, పాలపాత్రను కాంచుతో, తోకను పట్టువస్త్రముతో, పొదుగును వెన్నతో, కొమ్ములను సువర్ణముతో, గిట్టలను వెండితో చేసి అయిదురత్నములు కల క్షీరధేనువును కల్పింపవలయును.

చత్వారి తిలపాత్రాణి చతుర్దక్ష్వపి స్థాపయేత్‌,

సప్తవ్రీహి సమాయుక్తాం దిక్షు సర్వాసు స్థాపయేత్‌. 8

ఆ ఆవునకు నాలుగు దిక్కులందును నాలుగు నూగుల పాత్రల నుంచవలయును. అన్నిదిక్కుల యందును ఏడు విధముల ధాన్యములను ఉంచవలయును.

ఏవం లక్షణసంయుక్తాం క్షీరధేనుం ప్రకల్పయేత్‌,

ఆచ్ఛాద్య వస్త్రయుగ్మేన గన్ధపుషై#్పః సమర్చయేత్‌. 9

ఇట్లు అన్ని లక్షణములతో కూడిన క్షీరధేనువును చేసి రెండు వస్త్రములతో కప్పి గంధముతో పూలతో పూజింపవలయును.

ధూపదీపాదికం కృత్వా బ్రాహ్మణాయ నివేదయేత్‌,

ఆచ్ఛాద్యాలంకృతాం కృత్వా ముద్రికాకర్ణమాత్రకైః. 10

ధూపము, దీపము మొదలగునవి కావించి, ఉంగరముతో కర్ణాభరణములతో అలంకరించి బ్రామ్మణునకు నివేదింపవలయును.

పాదుకోపానహచ్ఛత్రం దత్వా దానం సమర్పయేత్‌,

అనేనైవ తు మన్త్రేణ క్షీరధేనుం ప్రదాపయేత్‌. 11

పాదుకలను గొడుగును ఇచ్చి ఈ మంత్రముతోడనే క్షీరధేనువును సమర్పింపవలయును.

ఆశ్రయః సర్వభూతానా మిత్యాది నరపుంగవ,

ఆప్యాయస్వేతి మన్త్రేణ క్షీరధేనుం ప్రసాదయేత్‌. 12

''ఆశ్రయః సర్వభూతానామ్‌'' ఇత్యాది మంత్రములు పలుకుచు దానమొసగవలయును. 'ఆప్యాయస్వ' మొదలగు మంత్రములతో క్షీరధేనువును ప్రసన్నపరుపవలయును.

గృహ్ణామి చ పఠేన్‌ మన్త్రం గ్రాహకో రాజసత్తమ,

దీయమానాం ప్రపశ్యన్తి తే యాన్తి పరమాం గతిమ్‌. 13

పుచ్చుకొనువాడు 'గృహ్ణామి' మొదలగు మంత్రములను చదువవలయును. ఇట్లా ధేనువును దానమిచ్చుచుండగా చూచు వారును పరమగతి కరుగుదురు.

ఏతాం హేమసహస్రేణ శ##తేనాథ స్వశక్తితః,

శతార్ధ మధవాప్యర్ధం తథా ర్దాపి యథేచ్ఛయా,

దత్వా ధేనుం మహార శృణు తస్యాపి యత్ఫలమ్‌. 14

ఇట్లా గోవును తన శక్తి మేరకు వేయిబంగారు నాణముల దక్షిణతో, లేదా వందతో, కాదా అందు సగముతో, లేదా దానిలో సగముతో ఒసగవలయును. ఈ దానమిచ్చినచో ఫలమును వినుము.

షష్ఠివర్ష సహస్రంతు ఇన్ద్రలోకే మహీయతే,

పితృభిః పితామహైః సార్ధం బ్రహ్మణో భవనం వ్రజేత్‌. 15

అరువది వేలయేండ్ల కాలము ఇంద్రలోకమున ప్రసిద్ధి కెక్కును. తండ్రులతో తాతలతో పాటుగ బ్రాహ్మలోకమున కరుగును.

దివ్యం విమాన మారూఢో దివ్యస్రగనులేపనః,

క్రీడిత్వా సుచిరం కాలం విష్ణులోకం స గచ్ఛతి. 16

దివ్యమైన విమానమునెక్కి దివ్యములగు మాలలు, మైపూతలుకలవాడై బహుకాలము విహరించి విష్ణులోకమున కేగును.

ద్వాదశాదిత్యసంకాశే విమానే వరమండితే,

గీతవాదిత్ర విర్ఘోషై రప్సరోగణసేవితే,

తత్రోష్య విష్ణోః సౌరాజం విష్ణుసాయుజ్యతాం ప్రజేత్‌. 17

పండ్రెండుగురుసూర్యుల కాంతి వంటికాంతి కలదియు, చక్కగా అలంకరింపబడినదియు నగు విమానమున గీతవాద్యముల ధ్వనులతో అప్సరసల సముదాయములు సేవించుచున్న ఆ విష్ణు లోకమున నివసించి తుదికి విష్ణుసాయుజ్యమును పొందును. (సాయుజ్యము=కలసిపోవుట).

య ఇదం శృణుయాద్‌ రాజన్‌ పఠేద్‌ వా భక్తి భావితః,

సర్వ పాపవినిర్ముక్తో విష్ణులోకం స గచ్ఛతి. 18

దీనిని భక్తితో వినువాడును, చదువువాడును సర్వపాపము లను రూపుమాపుకొని విష్ణులోకమున కరుగును.

ఇతి శ్రీవరాహపురాణ భగవచ్ఛాస్త్రే చతురధిక శతతమోధ్యాయః

ఇది శ్రీవరాహపురాణమను భగవచ్ఛాస్త్రమున నూటనాలుగవ అధ్యాయము.

Varahamahapuranam-1    Chapters