Sri Sivamahapuranamu-II    Chapters   

అథ ఏకోన వింశో%ధ్యాయః

గణశుడు బుద్ధిశాలి

నారద ఉవాచ |

గణశస్య శ్రుతా తాత సయ్యగ్జనిరనుత్తమా | చరిత్ర మపి దివ్యం వై సుపరాక్రమ భూషితమ్‌ || 1

తతః కిమభవత్తాత తత్త్వం వద సురేశ్వర | శివాశివయశస్స్ఫీతం మహానంద ప్రదాయకమ్‌ || 2

నారదుడిట్లు పలికెను -

తండ్రీ! సర్వోత్తమమగు గణశ జన్మ గాథను, గొప్ప ప్రరాక్రమముతో ప్రకాశించు ఆయన దివ్య చరితమును చక్కగా వింటిని (1). తండ్రీ! దేవ దేవా! తరువాత ఏమాయెను? మహానందమును కలిగించునది, గొప్ప ప్రకాశము గలది అగు పార్వతీ పరమేశ్వరుల కీర్తిని వర్ణించి శివతత్త్వమును వివరించుము (2).

బ్రహ్మోవాచ |

సాధు పృష్టం మునిశ్రేష్ఠ భవతా కరుణీత్మనా | శ్రూయతాం దత్త కర్ణం హి వక్ష్యే%హం బుషిసత్తమ ||3

శివా శివశ్చ విప్రేంద్ర ద్వయోశ్చ సుతయోః పరమ్‌ | దర్శందర్శం చ తల్లీలాం మమత్ర్పేమ సమావిశత్‌ || 4

పిత్రోర్లాలయతోస్తత్ర సుఖం చాతి వ్యవర్ధత | సదా ప్రీత్యా ముదా చాతిఖేలనం చక్రతుస్సుతౌ || 5

తీవేవ తన¸° తత్ర మాతపిత్రో ర్మునీశ్వర | మహాభక్తా యదా యుక్తౌ పరిచర్యాం ప్రచక్రతుః || 6

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మహర్షీ! దయా స్వభావము గల నీవు చక్కగా ప్రశ్నించితివి. చెవులను అప్పగించి వినుము. ఓ బుషిశ్రేష్ఠా!నేను చెప్పెదను (3). ఓ విప్రశ్రేష్ఠా! ఇద్దరు కుమారుల పరమ లీలలను చూడగా పార్వతీ పరమేశ్వరులకు వారిపై గొప్ప ప్రేమ ఏర్పడెను(4). తల్లి దండ్రులు సర్వదా ప్రేమతో లాలించు చుండగా ఆ ఇద్దరు బాలకులు మిక్కిలి సుఖముగా పెరుగుతూ, ఎక్కువగా ఆటల నాడుచుండిరి (5). ఓ మహర్షీ ! వారిద్దరు బాలకులు గొప్ప భక్తితో గూడిన సమయములో తల్లి దండ్రులకు పరిచర్యలను కూడ చేసిరి (6).

షణ్ముఖే చ గణశే చ పిత్రో స్తదధికం సదా | స్నేహో వ్యవర్ధత మహన్‌ శుక్లపక్షే యతా శశీ || 7

కదాచిత్తౌ స్థితౌ తత్ర రహసి ప్రేమసంయుతౌ | శివా శివశ్చ దేవర్షే సువిచార పరాయణౌ || 8

ఆ తల్లి దండ్రులకు కుమార స్వామి యందు మరియు గణశుని పైన మహాప్రేమ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ది గాంచెను (7). ఓ దేవర్షీ! ఒకప్పుడు ప్రేమ స్వరూపులైన పార్వతీ పరమేశ్వరులు ఏకాంతము నందుండి దీర్ఘముగా ఆలోచించుచుండిరి (8).

శివాశివావూచతు ః |

వివాహయోగ్యౌ సంజాతౌ సుతావితి చ తావుభౌ|వివాహశ్చ కథం కార్యః పుత్రయోరుభయోశ్శుభమ్‌ || 9

షణ్మఖశ్చ ప్రియతమో గణశశ్చ తథైవ చ | ఇతి చింతా సముద్విగ్నౌ లీలానందౌ బభూవతు ః || 10

స్వపిత్రోర్మత మాజ్ఞాయ తౌ సుతావసి సంప్పృహౌ | తదిచ్ఛయా వివాహార్ధం బభూవతురథో మునే || 11

అహం చ పరిణష్యామి హ్యహం చైవ పునః పునః | పరస్పరం చ నిత్యం వై వివాదే తత్పరావుభౌ || 12

పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -

బాలకు లిద్దరు వివాహమునకు యోగ్యమగు వయస్సును పొందిరి. ఈ ఇద్దరు కుమారులకు శుభకరమగు వివాహమును చేయట ఎట్లు? (9) కుమార స్వామి అత్యంత ప్రీతి పాత్రుడు. గణశుడు కూడా అంతే. లీలలతో ఆనందించే ఆ దంపతుల వారి గురించి ఈ తీరున ఆలోచించు చుండిరి (10). ఓ మునీ! ఆ ఇద్దరు కుమారులు తమ త్లి దండ్రుల మనోగతము నెరింగి వారి ఇచ్ఛచే వివాహము కొరకు తహతహలాడ జొచ్చిరి (11). 'నేను వివాహమాడెదను' అని ఒకరు అంటే, 'నేను వివాహమాడెదను' అని మరియొకరు అంటూ వారిద్దరు ఒకరితోనొకరు నిత్యము వివాదపుచుండిరి (12).

శ్రుత్వా తద్వచనం తౌ చ దంపతీ జగతాం ప్రభూ | లౌకికాచార మాశ్రిత్య విస్మయం పరమం గతౌ || 13

కిం కర్తవ్యం కథం కార్యో వివామ విధిరేతయోః | ఇతి నిశ్చిత్య తాభ్యాం వై రచితా యుక్తి రద్భుతా || 14

కదాచిత్సమయే స్థిత్వా సమాహూయ స్వపుత్రకౌ | కథయా మాసతుస్తత్రపుత్రయోః పితరౌ తదా || 15

జగత్తునకు తల్లి దండ్రులగు ఆ దంపతులు వారి మాటలను విని ఆచ్చెరువునందరి. వారు లోకాచారముననుసరించుచుండిరి (13). ' ఏమి చేయవలెను ? వీరిద్దరి వివాహకార్యమును ఎట్లు నెరవేర్చవలెను?' అని ఆలోచించి వారిద్దరు ఒక అద్భుతమగు యుక్తిని పన్నిరి (14). ఆ యుక్తి ప్రకారంగా ఒకనాడు ఆ తల్లిదండ్రులు పుత్రులనిద్దరినీ పిలిచి ఇట్లు పలికిరి (15).

శివాశివాపూచతు ః |

అస్మాకం నియమః పూర్వం కృతశ్చ సుఖదో హి వామ్‌ | శ్రూయతాం సుసుతౌ ప్రీత్యా కథయావో యథార్థకమ్‌ || 16

సమౌ ద్వావపి సత్పుత్రౌ విశేషో నాత్ర లభ్యతే | తస్మాత్పణః కృత శ్శందః పుత్రయోరుభయోరపి || 17

యశ్చైవ పృథివీం సర్వాం క్రాంత్వా పూర్వముపావ్రజేత్‌ | తసై#్యవ ప్రథమం కార్యో వివాహశ్శుభలక్షణః || 18

పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -

మీకిద్దరికీ సుఖమును కలిగించే నియమము నొకదానిని మేము పూర్వము ఏర్పాటు చేసితిమి. ఓ పుత్రులారా! వినుడు. మీకు ప్రీతితో సత్యమును చెప్పదము (16). మీరిద్దరు పుత్రులు సద్గుణములలో సమానులు. మీలో భేదము లేదు. కావుననే మీకిద్దరికీ సుఖమునిచ్చే పోటీని ఒక దానిని నిశ్చయించితిమి (17). మీ ఇద్దరిలో ఎవరైతే భూమినంతనీ చుట్టి ముందుగా ఇచటకు చేరునో, వానికి మాత్రమే ముందుగా శుభకరముగు వివాహము ఏర్పాటు చేయబడగలదు (18).

బ్రహ్మోవాచ |

తయోరేవం వచశ్శ్రుత్వా శరజన్మా మహాబలః | జగామ మందిరాత్తూర్ణం పృథివీక్రమణాయ వై || 19

గణనాథశ్చ తత్రైవ సంస్థితో బుద్ధిసత్తమః | సుబద్ధ్యా సంవిచార్యేతి చిత్త ఏవ పునః పునః || 20

కిం కర్తవ్యం క్వ గంతవ్యం లంఘితుం నైవ శక్యతే | క్రోశమాత్రం గతస్స్యాద్వై గమ్యతే న మయా పునః || 21

కిం పునః పృథివీయేతాం క్రాంత్వా చోపార్జితం సుఖమ్‌ | విచార్యేతి గణశస్తు యచ్చకార శృణుష్వ తత్‌ || 22

స్నానం కృత్వా యథాన్యాయం సమాగత్య స్వయం గృహమ్‌ | ఉవాచ పితరం తత్ర మాతరం పునరేవ సః || 23

బ్రహ్మ ఇట్లు పలికెను -

మహాబలుడగు కుమారస్వామి వారిద్దరి ఆ మాటను విని పృథివిని చుట్టి వచ్చుట కొరకై వెంటనే మందిరము నుండి బయలు దేరెను (19). బుద్ధిమంతుడు గణశుడు అచటనే ఉన్నవాడై తెలివి తేటలను ఉపయోగించి మనస్సులో తీవ్రముగా ఆలోచించెను (20). ఏమి చేయవలెను? ఎచటకు వెళ్లవలెను? పెద్దల ఆదేశమును ఉల్లంఘించ శక్యము కాదు. నేను రెండు మైళ్ల కంటె అధిక రూరమును పయనించ జాలను (21). పృథివినంతనూ ఎట్లు చుట్టి రాగలను? నేను ఈ పరీక్షలో ఎట్లు సుఖముగా గెలువవలెను? గణశుడు ఇట్లు ఆలోచించి ఏమి చేసెనో చెప్పెదను. వినుము (22). ఆతడు స్నానమును చేసి స్వయముగా తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి యథోచితముగా నిట్లు పలికెను (23).

గణశ ఉవాచ |

ఆసనే స్థాపితే హ్యత్ర పూజార్థం భవతోరిహ | బవంతౌ సంస్ధితౌ తతౌ పూర్యతాం మే మనోరథః || 24

గణశుడిట్లు పలికెను -

తల్లిదండ్రులారా! మీ పూజ కొరకు ఇచట ఆసనము నేర్పాటు చేసినాను. మీరు ఇచట కూర్చుండి నా కోరికను నెరవేర్చుడు (24).

బ్రహ్మోవాచ |

ఇతి శ్రుత్వా వచస్తస్య పార్వతీ పరమేశ్వరౌ | అస్థాతామాసనే తత్ర తత్పూజాగ్రహనాయ వై || 25

తేనాథ పూజితౌ తౌ చ ప్రక్రాంతౌ చ పునః పునః | ఏవం చ కృతవాన్‌ సప్త ప్రణామాస్తు తథైవ సః || 26

బద్ధాంజలిరథోవాచ గణశో బుద్ధిసాగరః | స్తుత్వా బహు తిథస్తాత పితరౌ ప్రేమ విహ్వలౌ || 27

బ్రహ్మ ఇట్లు పలికెను -

పార్వతీ పరమేశ్వరులు గణశుని ఆ మాటను విని ఆతని పూజను స్వీకరించుటకై ఆ ఆసనమునందు కూర్చుండిరి (25). గణశుడు అపుడు వారిని పూజించి ప్రణమిల్లి ఏడు ప్రదక్షిణములను చేసెను (26). వత్సా! అపుడు మహాబుద్ధి శాలియగు గణశుడు చేతులు జోడించి ప్రేమతో నిండియున్న తల్లిదండ్రులను బహుతెరంగుల స్తుతించి ఇట్లు పలికెను (27).

గణశ ఉవాచ |

భో మాతర్భో పితస్త్వం చ శృణు మే పరమం వచః | శీఘ్రం చైవాత్ర కర్తవ్యో వివాహశ్శోభనో మమ || 28

గణశుడిట్లు పలికెను -

ఓ తల్లీ! ఓ తండ్రీ! మీరు నా యథార్థ వచనము నాలకింపుడు. మీరు నాకిప్పుడు శీఘ్రమే శుభకరమగు వివాహమును చేయవలెను (28).

బ్రహ్మోవాచ |

ఇత్యేవం వచనం శ్రుత్వా గణశస్య మహాత్మనః | మహబుద్ధి నిధిం తం తౌ పితరావూచతుస్తదా || 29

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహాత్ముడు, గొప్ప బుద్ధి శాలి యగు గణశుని ఈ మాటలను విని ఆ

తల్లిదండ్రులు ఆతనితో నిట్లనరి(29).

శివాశివాపూచతుః |

ప్రక్రమేత భవాన్‌ సమ్యక్‌ పృథివీం చ సకాననామ్‌ | కుమారో గతవాంస్తత్ర త్వం గచ్ఛ పుర ఆవ్రజ || 30

పార్వతీ పరమేశ్వరులిట్లు పలికిరి -

నీవు వనములతో గూడియున్న భూమిని చుట్టి రావలెను. కుమార స్వామి అట్లు చేయుటకై వెళ్లినాడు. నీవు కూడ వెళ్లి భూమిని చుట్టి ఆతని కంటె మందు రమ్ము (30).

బ్రహ్మోవాచ |

ఇత్యేవం వచనం శ్రుత్వా పిత్రోర్గణపతిర్ద్రుతమ్‌ | ఉవాచ నియతస్తత్ర వచనం క్రోధసంయుతః|| 31

బ్రహ్మ ఇట్లు పలికెను -

తల్లి దండ్రుల ఈ మాటను విని గణపతి వెంటనే కోపమును పొందెను. కాని ఆతడా కోపమును నియంత్రించుకొని ఇట్లు పలికెను (31).

గణశ ఉవాచ |

భోమాతర్భో పితర్ధర్మరూపౌ ప్రాజ్ఞౌ యువాం మతౌ | ధర్మతశ్ర్శూయతాం సమ్యక్‌ వచనం మమ సత్తమౌ || 32

మయా తు పృథివీ క్రాంతా సప్తవారం పునః పునః | ఏవం కథం బ్రువాతే వై పునశ్చ పితరావిహ || 33

గణశుడిట్లు పలికెను -

ఓ తల్లీ! ఓ తండ్రీ! మీరిద్దరు ధర్మ స్వరూపులు, సత్స్వరూపులు మరియు జ్ఞానులు అని అందరు ఎరుంగుదురు. నేను ధర్మబద్ధ మగు మాటను పలికెదను. సావధానులై వినుడు (32). నేను ఏడు సార్లు పృథివిని చుట్టి వచ్చితిని. మీరు తల్లిదండ్రులై యుండి ఇట్లేల పలుకుచున్నారు ? (33)

బ్రహ్మోవాచ |

తద్వచస్తు తదా శ్రుత్వా లౌకికీం గతిమాశ్రితౌ | మహాలీలాకరౌ తత్ర పితరావూచతుశ్చ తమ్‌ || 34

బ్రహ్మ ఇట్లు పలికెను -

గొప్ప లీలను ప్రదర్శిస్తూ లోకపు పోకడను అనుకరించే ఆ తల్లి దండ్రులు అపుడాతని ఆ మాటను విని ఆతనితో నిట్లనిరి (35).

పితరా వూచతుః |

కదా క్రాంతా త్వయా పుత్ర పృథివీ సుమహత్తరా | సస్తద్వీపా సముద్రాంతా మహద్భిర్గహనైర్యుతా || 35

తల్లి దండ్రులిట్లు పలికిరి -

ఓ పుత్రా! చాల పెద్దది, ఏడు ద్వీపములు గలది, సముద్రముల వరకు వ్యాపించి యున్నది, దాటశక్యము కాని పెద్ద ఆటంకములతో గూడినది అగు పృథివిని నీవు ఎప్పుడు చుట్టివచ్చితివి? (35)

బ్రహ్మోవాచ |

తయోరేవం వచశ్శ్రుత్వా శివా శంకరయోర్మునే | మహాబుద్ధి నిధిః పుత్రో గణశో వాక్యమబ్రవీత్‌ || 36

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఓ మునీ! పార్వతీ పరమేశ్వరుల ఈ మాటను విని, వారిపుత్రుడు, మహాబుద్ధి శాలియగు గణశుడు ఇట్లు పలికెను (36).

గణశ ఉవాచ |

భవతోః పూజనం కృత్వా శివాశంకరయోరహమ్‌ | స్వ బుద్ధ్యా హి సముద్రాంత పృథ్వీకృత పరిక్రమః || 37

ఇత్యేవం వచనం వేదే శాస్త్రే వా ధర్మ సంచయే | వర్తతే కిం చ తత్తథ్యం నహి కిం తథ్య మేవ వా || 38

పిత్రోశ్చ పూజనం కృత్వా ప్రక్రాంతిం చ కరోతి యః | తస్య వై పృథివీజన్యపలం భవతి నిశ్చితమ్‌ || 39

అపహాయ గృహే యో వై పితరౌ తీర్థ మావ్రజేత్‌ | తస్య పాపం తథా హననే చ తయోర్యథా || 40

గణశుడిట్లు పలికెను -

పార్వతీ పరమేశ్వరులగు మిమ్ములను పూజించిన నేను సముద్రము వరకు వ్యాపించియున్న భూమిని చుట్టి వచ్చినట్లే యగునని నా బుద్ధికి తోచుచున్నది (37). ధర్మమునకు నిదానములగు వేదశాస్త్రములలో ఇటులనే చెప్పబడియున్నది. అది సత్యమా? కాదా? (38).ఎవడైతే తల్లిదండ్రులను పూజించి ప్రదక్షిణము చేయునో వాడు భూమిని ప్రదక్షిణము చేసిన ఫలమును పొందుట నిశ్చయము (39). ఎవడైతే తల్లిదండ్రులను ఇంటిలో విడిచి పెట్టి తీర్థయాత్రలకు వెళ్లునో, వాడు తల్లి దండ్రులను హింసించిన వానికి కలిగే పాపమును పొందునని చెప్పుబడెను (40).

పుత్రస్య చ మహత్తీర్థం పిత్రోశ్చరణ పంకజమ్‌ | అన్యతీర్థం తు దూరేవై గత్వా సంప్రాప్యతే పునః || 41

ఇదం సంనిహితం తీర్థం సులభం ధర్మసాధనమ్‌ | పుత్రస్య చ స్త్రి యాశ్చైవ తీర్థేం గేహే సుశోభనమ్‌ || 42

ఇతి శాస్త్రాణి వేదశ్చ భాషంతే యన్నిరంతరమ్‌ | భవద్భ్యాం తత్ప్రకర్తవ్య మసత్యం పునరేవ చ || 43

భవదీయం త్విదం రూపమసత్యం చ భ##వేదిహ | తదా వేదో%ప్యసత్యో వై భ##వేదితి న సంశయః |7 44

పుత్రునకు తల్లిదండ్రుల పాదపద్మములే గొప్ప తీర్థము. మరియొక తీర్థమును పొందవలెనన్నచో దూరప్రయాణము చేయవలసి యుండును (41). ఇది దగ్గరలో నున్న, తేలికగా లభించే, ధర్మమునకు సాధనమైన తీర్థము. పుత్రునకు తల్లిదండ్రులు, స్త్రీకి భర్త, ఇంటిలో లభ్యమయ్యే మంగళకరమగు తీర్థముల (42). వేదశాస్త్రములు నిరంతరముగా ఇట్లు చెప్పుచున్నవి. మీరిద్దరు ఆ వచనములను అసత్యము చేయవలయును గాబోలు! (43) అట్టి స్థితిలో మీ ఈ రూపము అసత్యమగును. అపుడు వేదము కూడా అసత్యమగును. ఈ విషయములో సందేహము లేదు (44).

శీఘ్రం చ భవితవ్యో మే వివాహః క్రియతాం శుభః | అథ వా వేదశాస్త్రం చ వ్యలీకం కథ్యతామితి || 45

ద్వయోశ్శ్రేష్ఠ తమం మధ్యే యత్‌ స్యాత్సమ్యగ్విచార్య తత్‌ | కర్తవ్యం చ ప్రయత్నేన పితరౌ ధర్మరూపిణౌ |7 46

నాకు వెంటనే శుభవివాహమును జరిపించవలెను. లేదా, వేదశాస్త్రములు అసత్యమని చెప్పుడు (45).మీరు ధర్మస్వరూపులగు తల్లి దండ్రులు. ఈ రెండు పక్షములలో ఏది ఎక్కువ శ్రేష్ఠమైనది అను విషయమును చక్కగా విచారించి ప్రయత్నపూర్వకముగా అనుష్ఠించుడు (46).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా పార్వీపుత్రస్స గణశః ప్రకృష్టధీః | విరరామ మహాజ్ఞానీ తదా బుద్దిమతాం వరః || 47

తౌ దంపతీ చ విశ్వేశౌ పార్వతీ శంకరౌ తదా | ఇతి శ్రుత్వా వచస్తస్య విస్మయం పరమం గతౌ || 48

తతశ్శివా శివశ్చైవ పుత్రం బుద్ధి విచక్షణమ్‌ | సుప్రశస్యోచతుః ప్రీత్యా తౌ యథార్థ ప్రభాషిణమ్‌ || 49

బ్రహ్మ ఇట్లు పలికెను -

బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, మహాజ్ఞాని, మంచి స్ఫూర్తి గలవాడు, పార్వతీతనయుడు అగు ఆ గణశుడు ఇట్లు పలికి విరమించెను (47). జగత్తునకు తల్లి దండ్రులు, ఆది దంపతులు అగు ఆ పార్వతీ పరమేశ్వరులు గణశుని ఈ వచనములను విని పరమాశ్చర్యమును పొందిరి (48). అపుడు పార్వతీ పరమేశ్వరులు బుద్దిమంతుడు, మరియు సత్యభాషియగు తమ పుత్రుని ప్రేమతో మిక్కిలి ప్రశంసించి ఇట్లు పలికిరి (49).

శివాశివావూచతుః |

పుత్ర తే విమలా బుద్ధి స్సముత్పన్నా మహాత్మనః | త్వయోక్తం మద్వచశ్చైవ తతశ్చైవ చ నాన్యథా || 50

సముత్పన్నే చ దుఃఖే చ యస్య బుద్ధిర్విశిష్యతే | తస్య దుఃఖం వినశ్యేత సూర్యే దృష్టే యథా తమః || 51

పార్వతీపరమేశ్వరులిట్లు పలికిరి -

పుత్రా! మహత్ముడవగు నీకు స్వచ్ఛమగు బుద్ధి కలిగినది. నీవు చెప్పిన మాట యథార్థము. సందేహము లేదు (50).కష్టము వచ్చినప్పుడు ఎవని బుద్ధి పని చేయునో వాని కష్టము సూర్యోదయము కాగానే చీకటి తొలగినట్లు తొలగిపోవును (51).

బుద్ధిరస్యస్య బలం తస్య నిర్బుద్ధేస్తు కుతో బలమ్‌ | కూపే సింహో మదోన్మత్త శ్శశ##కేన నిపాతితః || 52

వేద శాస్త్రపురాణషు బాలకస్య యథోదితమ్‌ | త్వయా కృతం తు తత్సర్వం దర్మస్య పరిపాలనమ్‌ || 53

సమ్యక్కృతం త్వయా యచ్చ తత్కేనాపి భ##వేదిహ | ఆవాభ్యాం మానితం తచ్చ నాన్యతా క్రియతేధునా || 54

బుద్ధి గల వానిదే బలము. బుద్ధి లేని వానికి బలమెక్కడిది? మదించిన సింహమును కుందేలు నూతిలో పడద్రోసినది (52). వేదశాస్త్ర పురాణములు పుత్రునకు ఏ ధర్మమును విధించినవో, నీవా ధర్మమును పూర్ణముగా పాలించితివి (53). నీవు చేసిన కర్మ ధర్మబద్ధమైనది. లోకములో ఎవరైననూ దానిని పాలించవలెను. నీవు చేసిన కర్మను మేమిద్దరము ఆదరించు చున్నాము. దీనిలో సందేహము లేదు (54).

బ్రహ్మోవాచ |

ఇత్యుక్త్వా తౌ సమాశ్వాస్య గణశం బుద్ధిసాగరమ్‌ | వివాహకరణ చాస్య మతిం చక్రతురుత్తమామ్‌ || 55

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్రసంహితాయాం కుమార ఖండే గణశ వివాహోపక్రమో నామ ఏకోన వింశో%ధ్యాయః (19).

బ్రహ్మ ఇట్లు పలికెను -

వారిద్దరు ఇట్లు పలికి బుద్ధిశాలియగు గణశుని కొనియాడి, ఆతనికి మాట ఇచ్చి, అతనికి వివాహమును చేయవలెననే ఉత్తమమగు నిర్ణయమును చేసిరి (55).

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో గణశ వివాహోపక్రమమనే పందొమ్మిదవ అధ్యాయము ముగిసెను (19).

Sri Sivamahapuranamu-II    Chapters