Sri Sivamahapuranamu-II    Chapters   

అథ త్రిచత్వరింశోధ్యాయః

హిరణ్య కశిపుని నృసింహుడు వధించుట

వ్వాస ఉవాచ |

సనత్కుమార సర్వజ్ఞ హతే తస్మిన్‌ సురద్రుహి| కిమకార్షీత్తతస్తస్య జ్యేష్ఠ భ్రాతా మహాసురః || 1

కుతూహలమిత శ్రోతుం మమా %తీహ మునీశ్వర | తచ్ర్ఛావయ కృపాం కృత్యా బ్రహ్మపుత్ర

నమో %స్తుతే || 2

వ్వాసుడిట్లు పలికెను -

ఓ సనత్కుమారా! నీవు సర్వజ్ఞడవు. సురద్రోహియగు ఆ హిరణ్యక్షుడు సంహరింపబడిన తరువాత వాని పెద్ద సోదరుడగు మహా రాక్షసుడు ఏమి చేసెను? (1) ఓమహర్షి! ఈ విషయమును వినవలెను మాకు ఇప్పుడు చాల కుతూహలము గలదు. కావున దయచచేసి వినిపించుము. ఓ బ్రహ్మపుత్రా! నీకు నమస్కారమగు గాక!(2)

బ్రహ్మో వాచ |

ఇత్యాకర్ణ్య వచస్తస్య స మునీశ్వరః | సనత్కుమారః ప్రోవాచ స్మృత్వా శివపదాంబుజమ్‌ || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

ఆ వ్యాసుని ఈ మాటలను విని ఆ సనత్కుమార మహార్షి శివుని పాద పద్మములను స్మరించి ఇట్లు పలికెను (3)

సనత్కుమార ఉవాచ |

భ్రాతర్యేవం వినిహతే హరిణా క్రోడమూర్తినా | హిరణ్యకశిపుర్వ్యాస పర్యతప్యద్రుషా శుచా || 4

తతః ప్రజానాం కదనం విధాతుం కదన ప్రియాన్‌| నిర్దిదేశాసురాన్‌ విరాన్‌ హరివై ప్రియో హి సః || 5

అథ తే భర్తృ సందేశమాదాయ శిరసా%సురాః | దేవాప్రజానాం కదనం విదధుః కదనప్రియాః || 6

తతో విప్రకృతే లోకేసురైసై#్తర్దుష్టమానసైః | దివం దేవాః పరిత్యజ్యం వ్యధిత్సత || 7

హిరణ్యకశిపుర్భ్రతు స్సంపరేతస్య దుఃఖితః | కృత్వా కరోదకాదీని తత్క లత్రాద్యసాంత్వయత్‌ || 8

తతస్స దైత్యరాజేంద్రో హ్యజేయమజరామరమ్‌ | ఆత్మానమప్రతి ద్వంద్వ మేకరాజ్యం వ్యధిత్సత || 9

సనత్కుమారు డిట్లు పలికెను -

ఓ వ్యాసా ! వరాహామూర్తిని దాల్చి విష్ణువు తన సోదరుని ఈ తీరున సంహరించగా, హిరణ్యకశివుడు కోపముతో దుఃఖముతో పరితపించెను (4) విష్ణువుతో వైరమునందు మక్కువగల ఆతడు అపు%ు యుద్ధప్రియులు వీరులు అగు అసురులను ప్రజలలో కలహములను సృష్టించమని ఆదేశించను (5) అపుడు కలహప్రియులగు ఆ రాక్షాసులచే లోకము కల్లోలితము చేయబడగా దేవతలు స్వర్గమును వీడి అదృశ్య రూపముతో భూమిపై తిరుగాడిరి (6) దుష్ట బుద్ధులగు ఆ రాక్షసులచే లోకము కల్లోలితము చేయబడగా దేవతలు స్వర్గమును వీడి అదృశ్య రూపముతో భూమి తిరుగాడిరి (7). హిరణ్యకశిపుడు సోదరుని మరణమునకు దుఃఖించి వానీ భార్యను ఇతరులను ఓ దార్చి తర్పణాదులను చేసెను (8). అపుడా రాక్షస చక్రవర్తిని తనను జరామరణములు లేని వానినిగను, పరాజయములేని వానినిగను, తన ఏకచ్ఛత్రాపత్యమును నిష్కంటకముగను చేసుకొనెను (9).

సతేపే మందరద్రోణ్యాం తపః పరమదారుణమ్‌ | ఊర్ధ్య బాహుర్నభోదృష్టిః పాదాంగుష్ఠా శ్రితావనిః || 10

తస్మింస్తపస్తప్యమానే దేవాస్సర్వే బలాన్వితాః | దైత్యాన్‌ సర్వాన్‌ వినిర్జిత్య స్వాని స్థానాని భేజిరే || 11

తస్య మూర్ధ్న స్సముద్భూత స్సధూమో %గ్ని స్తపోమయః | తిర్యగూర్ధ్వమధోలోకానతపద్విష్య గీరితః || 12

తేన తప్తా దివం త్యక్త్వా బ్రహ్మలోకం యయుస్సురాః | దాత్రే విజ్ఞాపయామాసుస్తత్తపో వికృతాననాః || 13

అథ విజ్ఞాపితో దేవైర్వ్యాస తైరాత్మ భూర్విధిః | పరీతో భృగు దక్షాద్యైర్య¸° దైత్యేశ్వరాశ్రమమ్‌ || 14

ప్రతాప్య లోకానఖిలాంస్తతో%సౌ సమాగతం పద్మభువం దదర్శ |

వరం హి దాతుం తమువాచ దాతా వరం వృణీష్వేతి పితామహో%పి |

నిశమ్య వాచం మధురాం విధాతుర్వచో%బ్రవీదేవమమూఢ బుద్ధిః ||

అతడు మందర పర్వతము నందలి కందరములో నేలపై కాలి బొటనవేలిపై నిలబడి ఆకాశము వైపునకు చూస్తూ చేతులను పైకెత్తి మిక్కిలి ఉగ్రమగు తపస్సును చేసెను (10). అతడు తపస్సును చోయుచుంéడగా బలవంతులైన దేవతలందరు రాక్షసుల నందరినీ జయించి తమ తమ స్థానములను కైవసము చేసుకొనిరి (11). వాని శిరస్సునుండి బయలుదేరిన, తపోరూపమైన, పొగతో గూడిన అగ్ని భూతలమునకు సమాంతరముగా క్రిందికి పైకి సర్వత్రా వ్యాపించి ప్రాణులను తపింపజేసెను (12). దానిచే తాపమును పొంది, ఆ తపస్సుయొక్క ప్రభాలవముచే వికృతములైన ముఖములు గల దేవతలు స్వర్గమును విడిచి బ్రహ్మ భృగుదక్షాదులు వెంట రాగా ఆ రాక్షస రాజుయొక్క ఆశ్రమమునకు వెళ్లెను (14). ఆతడీ విధముగా ముల్లోకములను తపింపచైయుచూ, తనకు వరము నిచ్చుటకై విచ్చేసిన పద్మ సంభవుడగు బ్రహ్మను గాంచెను. పితామహుడు బ్రహ్మ ఆతనితో 'అతనితో వరమును కోరుకొనుము ' అని పలుకగా, బ్రహ్మ యొక్క ఆ మధురమగు వాక్యమును విని బుద్ధిమంతుడగు హిరణ్య కశివుడు ఇట్లు పలికెను (15).

హిరణ్య కశిపురువాచ |

మృత్యోర్భయం మే భగవన్‌ ప్రజేశ పితామహాభూన్న కదాపి దేవ |

శస్త్రస్త్ర పాశాశని శుష్కవృక్ష గరీంద్రతోయాగ్ని రిపుప్రహారైః || 16

దైవైశ్చ దైత్యైర్మునిభిశ్చ సిద్దై స్త్వత్సృష్టజీ వైర్బహు వాక్యతః కిమ్‌ |

స్వర్గే ధరణ్యాం దివసే నిశాయాం నైవోర్ధ్యతో నాప్యధతః ప్రజేశ || 17

హిరణ్యకుడిట్లు పలికెను -

హే భగవాన్‌ ! ప్రజాపతి ! పితామహా! నాకు శత్రువులచే ప్రయోగింపబడే శస్త్రములు, అస్త్రములు, వజ్రము, ఎండు చెట్లు, పర్వతరాజులు, నీరు, నిప్పు ఇత్యాదులచే మరణ భయము లేకుండుగాక! (16) ఇన్ని మాటలేల? ఓ ప్రజాపతి! నాకు దేవతలు, దైత్యులు, మునులు, సిద్ధులు మరియు నీచే సృష్టింపబడిన జీవుల చేతిలో, సర్గమునందు గాని, భూమియందుగాని, పగలు గాని రాత్రి గాని, పైనగాని, క్రిందగాని మృత్యువు లేకుండు గాక! (17)

సనత్కుమార ఉవాచ |

తసై#్యతదీదృగ్వచనం నిశమ్య దైత్యేంద్ర తుష్టో %స్మి లభస్య సర్వమ్‌ |

ప్రణమ్య విష్ణుం మనసా తమాహా దయాన్వితో%సావతి పద్మ యోనిః || 18

అలం తపస్తే పరిపూర్ణ కామస్సమాస్సహాస్రణి చ షణ్ణవత్య |

ఉత్తిష్ఠ రాజ్యం కురు దానవానాం శ్రుత్వా గిరం తత్సుముఖో బభూవ || 19

రాజ్యాభిషిక్తః ప్రపితామహేన త్రైలోక్యనాశాయ మతిం చకార |

ఉత్సాద్య ధర్మాన్‌ సకలాన్‌ ప్రమత్తో%% జిత్వా హవే సో%పి సురాన్‌ సమస్తాన్‌ || 20

తతో భయాదింద్రముఖాశ్చ దేవాః పితామహాజ్ఞాం సమవాప్య సర్వే |

ఉపద్రుతా దైత్యవరేణ జాతాః క్షిరోదధిం యత్ర హరిస్తు శేతే || 21

ఆరాదయా మాసురీవ విష్ణుం స్తత్వా వచోభిసుఖదం హి మత్వా |

నివేదయామాసురథో ప్రసన్నం దుఋఖం సకలం హితే తే || 22

శ్రుత్వా తదీయం సకలం హీ దుఃఖం తుష్టో రమేశః ప్రదదౌ వరాంస్తు|

ఉత్థాయ తస్మాచ్ఛయనాదుపేంద్రో నిజానురూపైర్వివిధైర్వచోభిః||

ఆశ్వాస్య దేవానఖిలాన్‌ మునీన్‌ వా ఉవాచ వైశ్వానర తుల్య తేజాః|

దైత్యం హవిష్యే ప్రసభం సురేశాః ప్రయాత ధామాని నిజాని తుష్టాః||

సనత్కుమారుడిట్లు పలికెను -

ఆతని ఈ మాటను విని పద్మ సంభవుడగు బ్రహ్మ దయ గలవాడై మనస్సులో విష్ణువునకు ప్రణమిల్లి 'ఓ రాక్షసవీరా! నేను ప్రసన్నుజనైతిని ; నీవు కోరిన సర్వమును పొందుము' అని పనికెను (18). 'నీవు తపస్సును చాలించుము. నీ కోరిక పరిపూర్తిని చెందినది. నీవు తొంభై ఆరువే సంవత్సరములు తపస్సుని చేసితివి. లెమ్ము. దానవ రాజ్యము నేలుము' అను మాటను విని ఆతడు తపస్సు విరమించుటకు సుముఖతను గలబరచెను (19). బ్రహ్మచే రాజ్యమునందు అభిషిక్తుడైన ఆతడు ముల్లోకములను నాశనము చేయ నిశ్చయించుకొని గర్వించిన వాడై, సమస్త ధర్మముల నుల్లంఘించెను. ఆతడు సమస్త దేవతలను యుద్ధములో జయించెను (20). అపుడు ఆ రాక్షస వీరునిచే పీడింపబడిన ఇంద్రాది దేవతలందరు భయభీతులై ప్రజాపతియొక్క అనుమతిని పొంది విష్ణువు నిద్రిస్తున్న క్షీరసముద్ర ప్రాంతమునకు వెళ్లిరి (21). విష్ణువు తమకు సుఖమును ఈయగలడని భావించిన ఆ దేవతలు ఆయనను మిక్కుటముగా ఆరాధించి వచనములతో స్తుతించిరి. అపుడు ప్రసన్నుడైన విష్ణువుకు వారు తమ దుఃఖము నంతనూ వివరించిరి (22). వారి దుఃఖము నంతనూ విని ఇంద్రుని పలికి వారికి వరముల నిచ్చెను (23). వైశ్వానరాగ్నితో సమానమగు తేజస్సు గల విష్ణు వు సర్వదేవతలను, మునులను కూడ ఓదార్చి,'ఓదేవతలారా! నేను బలమును ప్రయోగించి ఆ రాక్షసుని సంహరించెదను; మీరు సంతోషముతో మీ ధామములకు వెళ్లుడు' అని పలికెను (24).

శ్రుత్వా రమేశస్య వచస్సురేశాక్రాదికాస్తే నిఖిలాస్సుతుష్టాః| 25

యయుస్స్వధామాని హిరణ్య నేత్రానుజం చ మత్వా నిహతం మునీశ ||

ఆశ్రిత్య రూపం జటిలం కరాలం దంష్ట్రాయుధం తాక్ణ నఖం సునాసమ్‌ |

సైంహం చ నారం సువిదారితాస్యం మార్తండకోటి ప్రతిమం సుఘోరమ్‌ || 26

యుగాంత కాలాగ్ని సమప్రభావం జగన్మయం కిం బహుభిర్వచోభిః |

అస్తం రవౌ సో%పి హి గచ్ఛతీశో గతో%సురాణాం నగరీం మహత్మా || 27

కృత్వా చ యుద్ధం ప్రబలైస్స దైత్యైర్హత్వాథ తాన్‌ దైత్య గణాన్‌ గృహీత్వా |

బభ్రామ తత్రాద్భుత విక్రమశ్చ బభంజ తాంస్తానసురాన్నృసింహః || 28

దృష్టస్స దైత్యైరతుల ప్రభావస్తే రేభిరే తేహి తథైవ సర్వే |

సింహం చ తం సర్వమయం నిరీక్ష్య ప్రహ్లాదనామా దితిజేంద్రపుత్రః |

ఉవాచ రాజానమయం మృగేంద్రో జగన్మయంః కిం సముపాగతశ్చ ||

ఓ మహర్షీ! ఆ ఇంద్రాది దేవనాయకులందరు విష్ణువు యెక్క వచనములను విని, హిరణయక్షుని సోదరుడు మరణించినట్లే యని భావించి, చాలా సంతోషముతో తమ నెలవులకు వెళ్లిరి (25). జూలుతో ప్రకాశించునది, భయంకరమగు ఆకారము గలది, దంష్ట్రలే ఆయుధములుగా గలది, వాడి గోళ్లు గలది, సుందరమగు ముక్కు గలది, తెరచిన పెద్ద నోరు గలది, కోటి సూర్యుల కాంతి గలది, మిక్కిలి ఘోరమైనది, ప్రళయకాలాగ్నిని బోలిన ప్రభావము గలది, జగత్తును అధికముగా వ్యాపించిన రూపము గలది అగు నృసింహకారమును విష్ణువు దాల్చెను. ఇన్ని మాటలేల? మహాత్ముడు, ఈశ్వరుడునగు ఆ విష్ణువు సూర్యాస్తమయకాలములో హిరణ్యకశిపుని నగరములకు వెళ్లెను (26,27). అద్భుతమగు పరాక్రమముగల ఆ నృసింహుడు బలశాలురగు రాక్షసులతో యుద్ధమును చేసి ఆ రాక్షస గణములను ఒడిసి పట్టి సర్వత్రా తిరుగుతూ, ఆరాక్షసులను మట్టు పెట్టెను (28). సాటిలేని ప్రభావము గల ఆ నృసింహుని రాక్షసులందరు చూచిరి. సర్వమును ఆక్రమించియున్న ఆ సింహమును గాంచి హిరణ్యకశివుని పుత్రుడగు ప్రహ్లాదుడు రాజుతో నిట్లనెను : జగత్స్వరూపూడగు పరమాత్మ నృసింహరూపములో ఇట్లు వచ్చుటకు కారణమేమి? (29)

ప్రహ్లాద ఉవాచ|

ఏష ప్రవిష్టో భగవాననంతో నృసింహమాత్రో నగరం త్వదంతః |

నివృత్త్వ యుద్ధాచ్ఛరణం ప్రయాహి పశ్యామి సింహస్య కరాలమూర్తిమ్‌ || 30

యస్మాన యోద్ధా భువనత్రయే%పి కురుష్వ రాజ్యం వినమన్మృగేంద్రమ్‌ *

శ్రుత్వా స్వపుత్రస్య వచో దురాత్మా తమాహ భీతో%సి కిమత్ర పుత్ర ** 31

ఉక్త్వేతి పుత్రం దితి జాధినాథో దేత్యర్షభాన్‌ వీరవరాన్‌ స రాజా *

గృహ్ణంతు వై సింహమముం భవంతో వీరా విరూప భ్రుకుటీక్షణం తు ** 32

తస్యాజ్ఞయా దైత్య వరాస్తతస్తే గ్రహీతుకామా వివిశుర్మృగేంద్రమ్‌ *

క్షణన దగ్ధాశ్శలాభా ఇవాగ్నిం రూపాభిలాషాత్‌ ప్రవివిక్షవో వై ** 33

దైత్యేషు దగ్ధేష్వపి దైత్యరాజశ్చకార యుద్ధం స మృగాధిపేన *

శ##సై#్త్రస్సమగ్రైరఖిలైస్త థాసై#్త శ్శక్త్యర్షి పాశాంకుశపావ కాద్యైః** 34

సంయుధ్యతోరేవ తయోర్జగామ బ్రహ్మం దినం వ్యాస హి శస్త్రపాణ్యోః*

ప్రవీరయోర్వీర రవేణ గర్జతోః పరస్పరం క్రోధ సుయుక్తచేతసోః ** 35

తతస్స దైత్యస్సహసా బహూంశ్చ కృత్వా భుజాన్‌ శస్త్రయుతాన్నిరీక్ష్య*

నృసింహరూపం ప్రయ¸° మృగేంద్రం సంయుధ్యమానం సహసా సమంతాత్‌ ** 35

ప్రహ్లాదుడుట్లు పనికెను -

ఈ అనంత భాగవానుడు నృసింహరూపములో నీ నగరములోపల ప్రవేశించినాడు. కావున నీవు యుద్ధము నుండి విరమించి శరణు పొందుము. నాకు సింహము యొక్క భయంకరాకారము కానవచ్చుచున్నది (30). ఆయనతే పోరాడగల మొనగాడు ముల్లోకములలో లేడు. కావున నీవా నరసింహునకు ప్రణమిల్లి రాజ్యమును కాపాడుకొనుము. తన కొడుకు చెప్పిన ఈ మాటలను విని ఆ దుర్బద్ధి, 'ఓ పుత్రా! నీవిపుడు భయపడుచున్నావా ఏమి?' అని పనికెను (31). పుత్రునితో నిట్లు పలికి ఆ రాక్షస చక్రవర్తి కోపముతో ముడిపడిన కనుబొమలు కలవాడై గొప్ప వీరులగు రాక్షస శ్రేష్టులను, 'ఈ సింహమును వీరులగు మీరు చెరబట్టుడు' అని ఆదేశించెను (32). ఆతని ఆజ్ఞను పొంది ఆ రాక్షస వీరులు నృసింహుని పట్టుకొనబోయి అగ్నియెక్క రూప సౌందర్యమును ప్రేమించి దానిలో ప్రవేశించే మిడతల వలె క్షణకాలములో మాడి మసి అయిరి (33). ఆ వీరులు మరణించిననూ రాక్షస చక్రవర్తి నృసింహమూర్తితో యుద్ధమును చేసి,

సమస్త-ఆయుధములను, ఆగ్నేయాద్యస్త్రములను, శక్తి, చురిక, పాశము, అంకుశము ఇత్యాది ఆయుధములను ప్రయోగించెను (34). ఓ వ్యాసా! మహావీరులగు వారిద్దరు సింహనాదములను గర్జనలను చేయచూ పరస్పరము కోపముతో నిండిన హృదయములు గలవారై శస్త్రములను చేతులయందు ధరించి యుద్ధమును చేయుచుండగా బ్రహ్మయొక్క ఒక పగలు కాలము గడిచి పోయెను (35). అపుడా రాక్షసుడు శస్త్రములను దాల్చిన అనేక భుజములు గలవాడై, యుద్ధము చేయుచున్న ఆ నృసింహుని మీదకు వేగముగా అన్ని వైపుల నుండి దాడిచేసెను (36).

తతస్సుయుద్ధం త్వతిదుస్సహం తు శ##సై#్త్రస్సమసై#్తశ్చ తథాఖిలాసై#్త్రః *

కృత్వా మహాదైత్యవరో నృసింహం క్షయం గతై శ్శూలధరో%భ్యుపాయాత్‌ ** 37

తతో గృహీతస్స మృగాధిపేన భుజైరనేకైర్గిరిసారవద్భిః *

నిధాయ జానౌ స భుజాంతరేషు నఖాంకురైర్దానవమర్మభిద్భిః ** 38

నఖాస్త్రహృత్పద్మమసృగ్విమిశ్రుత్పాట్య జీవాద్విగతః క్షణన *

త్యక్తస్తదానీం స తు కాష్ఠభూతః పునః పునశ్చూర్ణితః సర్వగాత్రః ** 39

తస్మిన్‌ హతే దేవరిపౌ ప్రసన్నః ప్రహ్లాదమామంత్య్ర కృతప్రణామమ్‌ *

రాజ్యే%భిషిచ్యాద్భుతవీర్య విష్ణుస్తతః ప్రయాత్‌ గతిమప్రతర్క్యామ్‌ ** 40

తతో%తిహృష్టాస్సకలాస్సురేశాః ప్రణమ్య విష్ణుం దిశి విప్ర తస్యామ్‌ *

యయుస్స్వధామాని పితామహాద్యాః కృతస్వకార్యం భగవంతమీడ్యమ్‌ ** 41

ప్రవర్ణితం త్వంధకజన్మ రుద్రాద్ధిరణ్య నేత్రస్య మృతిర్వరాహాత్‌*

నృసింహతస్తత్సహజస్య నాశః ప్రహ్లాదరాజ్యాప్తిరితి ప్రసంగాత్‌ ** 42

శృణు త్విదానీం ద్విజవర్య మత్తోంధక ప్రభావం భవకృత్యలబ్ధమ్‌ *

హరేణ యుద్ధం ఖలు తస్య పశ్చాద్గణాధిపత్యం గిరిశస్య తస్య ** 43

ఇతి శ్రీ శివమహాపురాణ రుద్ర సంహితాయాం యుద్ధఖండే హిరణ్యకశివు వధవర్ణనం నామ త్రిచత్వారింశో%ధ్యాయః(43)

తరువాత ఆ రాక్షస శ్రేష్టుడు సమస్త శస్త్రాస్త్రములతో మిక్కిలి దుస్సహమగు యుద్ధమును చేసి అవి అన్నియు క్షీణించిన పిదప శూలమును ధరించి నృసింహుని పైకి ఉరికెను (37). అపుడా నృసింహుడు పర్వతములతో సమానమగు బలము గల అనేక భుజములతో ఆ రాక్షసుని పట్టుకొని మోకాలిపై పెట్టి గోళ్ల కొనలతో మర్మస్ధానములను చీల్చివేసెను (38). గోళ్లు అనే ఆయుధములతో రక్తముతో నిండియున్న వాని హృదయ పద్మమను పీకివేయగా ఆతడు క్షణకాలములో ప్రాణములను గోల్పోయెను. పలుమార్లు చూర్ణము చేయబడిన సర్వావయవములు గల ఆ రాభసుని దేహము దుంగవలె ప్రాణ విహీనము కాగా, దానిని నృసింహుడు పరిత్యజించెను (39). అద్భుతమగు పరాక్రమముగల విష్ణువు ప్రసన్నుడై ఆ దేవ శత్రువు సంహరింపబడగానే ప్రహ్లాదుని పిలిచి రాజ్యాభిషిక్తుని చేసి ఊహింప శక్యము కాని స్వలోకమునకు వెళ్లెను (40). అపుడు బ్రహ్మ మొదలగు దేవనాయకులందరు మిక్కిలి ఆనందించి తమ కార్యమును నెరవేర్చిన కొనియాడదగిన విష్ణుభగవానుని ఆ దిక్కు వైపునకు నమస్తరించుట, వాని సోదరుని నృసింహుడు సంహరించుట, ప్రహ్లాదుడు రాజ్యమును బడయుట అను వృత్తాంతములు చెప్పబడినవి (42). ఓ బ్రాహ్మణశ్రేష్టా! ఇపుడు అంధకుని మహిమ, ఆతడు జన్మించుటతోడనే వరములను పొందియుండుట, శివునితో యుద్ధమును చేసి తరువాత ఆ కైలాసనాధునకు గణాధ్యభుడు అగుట అను విషయములను నేను చెప్పెదను. వినుము (43).

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు యుద్ధ ఖండలో హిరణ్యకశిపు సంహారమనే నలుబది మూడవ అధ్యాయము ముగిసినది (43).

Sri Sivamahapuranamu-II    Chapters