Sri Jayendravani    Chapters    Last Page

ఆమోదము

''శ్రుతి స్మృతిపురాణానా మాలయం కరుణాలయం

నమామి భగవత్పాదశఙ్కరం లోకశఙ్కరమ్‌ ||''

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీస్వామివారు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీస్వామివారు, 1973వ సంవత్సరములో కంచి నుండి విజయయాత్రగా బయలుదేరి పుణ్యక్షేత్రమలు, దేవాలయములు దర్శించి, సేవించుచూ ఢిల్లీ చేరిరి.

ఢిల్లీలో చాతుర్మాస్య వ్రతము జరిపిరి. నిత్యం త్రికాలముల యందు శ్రీ చంద్రమౌళీశ్వరునికి అభిషేకము, అర్చన, శ్రీ శారదాదేవికి కుంకుమార్చనలు జరుపుచూ భక్తులకు తీర్థప్రసాదములను అనుగ్రహించిరి.

నిత్యము శ్రీశ్రీశ్రీ జయేంద్ర సరస్వతీ స్వామివారు భక్తుల గూర్చి అనుగ్రహించిన భాషణము (ఉపన్యాసములు) లను శ్రీ యస్‌.బాలసుబ్రహ్మణ్యంగారు ''భారతవర్షము - ఆర్షధర్మము'' అను పేర ఇంగ్లీషులో రెండు భాగాలుగా ముద్రించిరి. ఇది మొదటి భాగము. దీనిని తెలుగులో 'శ్రీ జయేంద్రవాణి' అను పేర, శ్రీ స్వామివారి ఆదేశ ఆశీర్వచనములతోను శ్రీ యస్‌. బాలసుబ్రహ్మణ్యంగారి సౌజన్యముతోను మా సాధన గ్రంథ మండలిలో ప్రచురించితిమి.

భారతవర్షము యొక్క గొప్పతనము వివిధ పుణ్యక్షేత్రములు-వారి మహిమ, నదీనదములు - వాని పవిత్రత, సప్తకుల పర్వతములు-వాని ఔన్నత్యము, సప్తసముద్రములు-వాని గాంభీర్యము, చతుర్దశ భువనములు - అందుగల ప్రకృతి ప్రాణి సంపద. వివిధ స్త్రీపురుషదేవతామూర్తులు - వారి అర్చనావిధానము. దానివలన కలుగు ఫలితము, సృష్టిలో మానవజన్మ. దాని గొప్పతనము, స్త్రీపురుషులు ఉదయము నిద్రనుండి లేచినది మొదలు- రాత్రి నిద్రించువరకు చేసుకొనవలసినవి, చేయవలసినవి క్రమంగా స్నానము, వస్త్రధారణము, తిలకము, దేవతారాధన, ఆహారము, సత్కాలక్షేపము మొదలగు విషయముల గురించి వివరంగా శ్రీ స్వామివారు అనుగ్రహించిరి.

వర్ణాశ్రమ విభాగము, వారి నిర్ణీత కార్యక్రమములు, కుల వృత్తులు, వివాహ వ్యవస్థ, ప్రాణులయందు దయ, పరోపకారము, సత్యము, అహింసలను పాటించుట. దేవతావృక్షములు వాని ఆరాధన, మొదలగు భారతదేశ సంపదను గురించి వేదశాస్త్ర ప్రమాణములతో లలిత సుందరమైన వ్యవహారభాషలో శ్రీ స్వామివారు అనుగ్రహించిరి. మన ''భారతవర్షము-ఆర్షధర్మము'' ల గురించి తెలుసుకొనదలచిన ప్రతివ్యక్తి ఈ గ్రంథమును తప్పక చదువవలయును.

కోరినతోడనే ఇంగ్లీషునుండి ఆంధ్రానువాదము చేసి యిచ్చిన శ్రీ కాశీనాథుని శివరావుగారికి, గ్రంథము ఆమూల చూడము సమీక్షించిన శ్రీ పురాణాం రాధాకృష్ణ ప్రసాద్‌గారికి మండలి తరపున ధన్యవాదములు. గ్రంథమును చక్కగా ముద్రించిన కమల ప్రెస్‌ అధినేతలు శ్రీ డి. సుధాకర్‌గారికి, వారి పరిచారకవర్గమునకు అభినందనలు.

ఇతిశమ్‌

వృష ఆషాఢ -

పూర్ణిమ 2001 ఇట్లు

తెనాలి. బులుసు సూర్యప్రకాశశాస్త్రి,

ª«sùª«sróyxmsNRPV²R…V,

సాధన గ్రంథ మండలి.

Sri Jayendravani    Chapters    Last Page