Sri Jayendravani    Chapters    Last Page

39. ప్రళయత్రయం

úxms¼½ª«sùQQNTPò »R½ƒ«sÒÁ„s»R½LiÍÜ[ xqsVÆجsõ ÌÁORPQQùLigS |msÈíÁVN]LiÉزR…V. N]¬sõ xqsLiµR…LS÷éÍýÜ[ A¸R…WÀÁ»R½LigS®ƒs[ xqsVÅÁúFyzmsò¬s @»R½²R…V F~LiµR…gRiÌæÁV»y²R…V. @ÍØ ÌÁÕ³ÁLiÀÁƒ«s r¢ÆØù¬sõ

చవిజూసి వ్యక్తి తన బాధల్ని, కష్టాల్ని అధిగమించి ప్రపంచంలో జీవించ గల్గుతాడు. మనం నిద్రావస్థలో వున్నప్పుడు మన ఇంద్రియాలన్నీ పరబ్రహ్మయొక్క ఆనంద స్వరూపంలో అణగి, ఒక పరిమితమైన మేరకు సుఖానుభవాన్ని చవిజూస్తాం. కనుక తాత్కాలికంగానైనా సుఖశాంతుల్ని లభింపజేసే నిద్ర భగవత్ప్రసాదితమైన వరంగా పరిగణింప బడుతుంది.

ప్రతిదినం మనం అనుభవించే నిద్రనే నిత్యప్రళయం లేక దైనందిన ప్రళయ మంటాం.

ప్రళయ శబ్దానికి ఉద్ధృతమైన నీటిప్రవాహంలో మునిగి పోవుట యనే అర్థంకాదు. 'లయ' అనగా అణగియుండుట, కుంచించుకొనుట. 'ప్రళయం' అంటే పూర్తిగా అణగియుండుట, లేక కుంచించుకొనుట. నిద్రావస్థలో సూక్ష్మశరీరం కారణశరీరంలో తన నిజస్థితిని వదలి అణగి వుంటుంది. ఆ స్థితిలో అది ఎనలేని సుఖానుభూతిని పొందుతుంది. అంటే నిద్రావస్థలో తన సర్వేంద్రియాలు పరమాత్మలో అణగిపోగా వ్యక్తి ఆ సమయంలో సుఖానుభూతిని పొందుతాడు. దైనందిన జీవితంలో వ్యక్తికి అనేక రకాలైన చికాకులు, మనోవ్యధలు వుండవచ్చు. కాని నిద్రావస్థలో జీవాత్మ పరమాత్మ తత్వంలో అణిగి పోతుంది గనుక వ్యక్తి సుఖశాంతుల్ని అనుభవించి నిద్రనుండి లేవగానే ఉపశమనస్థితిని పొంది హాయిని అనుభవిస్తాడు.

వ్యక్తి తాను ఎంతకాలం నిద్రావస్థలో వుంటాడో అది అతని నియంత్రణలో వుండదు. కొంతసమయం గడచింతర్వాత అతడు నిద్రలేచి బాధాసమన్వితమైన మామూలు ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. ఉదాహరణకు పాలల్లో పెరుగు తోడు పెడితే ఆ పాలు పెరుగు అవటానికి నియమిత సమయం తీసుకుంటుంది. ఆ క్రియను వేగిరపరచలేం. ఆలస్యం చేయలేం. కనుక వ్యక్తికూడ నియమిత సమయం పూర్తియైన తర్వాతే నిద్రావస్థనుండి జాగ్రదవస్థకు వస్తాడు. ఈ విధంగా నిద్రావస్థలో జీవాత్మ పరమాత్మలో కలసి సుఖానుభూతిని పొంది తిరిగి జాగ్రదవస్థలో మామూలు ప్రపంచంలోకి ప్రవేశించటం అందరకు నిత్యం జరుగుతూనే వుంటుంది. దీనినే నిత్యప్రళయం అంటాం.

తర్వాత నైమిత్తిక ప్రళయం కూడ మనకుంది. బ్రహ్మయొక్క పగలు ముగిసి రాత్రి ప్రవేశించే సమయంలో ఇది సంభవిస్తుంది. ఈ సమయంలో భూలోకం, భువర్లోకం, దేవలోకాలు బ్రహ్మలో అణగివుంటాయి. తిరిగి బ్రహ్మ నిద్రనుండి లేవగానే ఈ లోకాలన్నీ మరల సృష్టింపబడతాయి. బ్రహ్మ నిద్రలేవగానే సృష్టి పునః ప్రారంభింప బడుతుంది. అదే తరుణంలో జీవాత్మ పరమాత్మనుండి విడిపోతుంది.

ప్రపంచసృష్టి ఎలా జరుగుతుందనే ప్రశ్న తల ఎత్తుతూనే వుంటుంది. సృష్టి జరగటం, నశింపబడటం అనే కార్యక్రమం అసలు ఎందుకు జరగాలి ? భగవంతుడు అందర్ని సృష్టిచేసి వారిని నిత్యసుఖజీవనులుగా వుంచవచ్చుగదా ? ఈ ప్రశ్న చెట్టుముందా, విత్తుముందా అనే ప్రశ్నలాంటిదే. చెట్టు లేకుండా విత్తు లభించదుగదా ? అలాగే విత్తు లేకుండా చెట్టు ఉద్భవించదు కదా ? కనుకనే మన ప్రాచీనులు ఇది ఆదిలేనిది అనాది యైనిదని తీర్మానించారు. సృష్టికి ఆదిలో పరమాత్మయుండి మయాశక్తి సహాయంతో పంచభూతాల్ని సమన్వయించి ప్రపంచ సృష్టిని నిర్వహించాడు.

జీవాత్మ పరమాత్మలో అణగి యున్నప్పుడు ఒక్కటే తత్వం మిగిలి యుంటుంది. ఆ సమయంలో జీవాత్మ పరమానందస్థితిలో వుంటుంది. ఆ బ్రహ్మానందస్థితిని చేరటానికి చాలాచాలా జన్మలెత్తాలి. ప్రతి మహాప్రళయం తర్వాత ప్రతివానికి ఆ స్థితి లభిస్తుంది. మహాప్రళయ కాలంలో రుద్రుడు మొత్తం ప్రపంచాన్ని తనలోకి తీసుకుంటాడు. ఆ స్థితిలో మనందరకు నిద్రావస్థ వస్తుంది. దయార్ద్ర హృదయుడైన తండ్రివలె రుద్రుడు మనపై జాలిపడి కరుణతో ''మీరు యీ పుట్టుక, చావు పరిభ్రమణ క్రమంలో సుఖదుఃఖాల్ని బాగా అనుభవించారు. తిరిగి మీ కర్మఫలాన్ని బట్టి జన్మించేవరకు విశ్రాంతి తీసికోండి.'' అంటూ మనల్ని అనునయిస్తాడు.

సృష్టి విషయంలో పరిణామవాదం, వివర్తవాద మని రెండు సిద్ధాంతాలు ప్రచారంలో వున్నాయి. పరిణామవాదం ప్రకారం మూలవస్తువు నుండి కడపటి వస్తువు లభించిన తర్వాత మూలవస్తువు తన అస్తిత్వాన్ని పోగొట్టుకుంటుంది. పాలు పెరుగుగా పరివర్తన చెందిన తర్వాత పాలు వుండవు కదా ? అలాగే పెరుగునుండి వెన్నను తీసిం తర్వాత పెరుగు తన మొదటిస్థితిని కోల్పోయి మజ్జిగగా పరిణమిస్తుంది. అనగా మూలవస్తువు పోయి దానినుండి మరియొకటి మనకు లభిస్తుంది.

వివర్తవాదంలో ఒక వస్తువు మరియొక వస్తువునుండి బయటకు పొడుచుకొని వచ్చి తిరిగి లోపలకు పోయి మరల బయటకు వస్తూ ఆ కార్యక్రమం అలా జరుగుతూ వుంటుంది. మహాప్రళయం తర్వాత జీవాత్మలు వాటి కర్మఫలితాలను బట్టి పునః సృష్టింప బడతాయి. ఇలా పుట్టుట, చచ్చుట అనే కార్యక్రమం వ్యక్తి విషయంలో అతడు తన నిజస్థితి నెరుంగువరకు నిత్యం జరుగుతూనే వుంటుంది. ఆ స్థితి నతడు పొందగానే జనన మరణ కార్యక్రమం అతని విషయంలో నిలిచిపోతుంది. మహాప్రళయస్థితిని ప్రతివ్యక్తి పొందాలని ఆకాంక్షిస్తాడు. కాని యీ స్థితి కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాతగాని సంభవించదు. బ్రహ్మ నూరుసంవత్సరాలు జీవిస్తాడు. ఆయన జీవితం ముగిసిన తర్వాత మహాప్రళయం సంభవిస్తుంది. ప్రస్తుతం మహాప్రళయం జరగటానికి అవకాశంలేదు గనుక మనం పరమాత్ముని స్మరిస్తూ సత్కర్మలు చేస్తూ కాలం గడపాలి. మహాప్రళయం వచ్చే అవకాశ##మే వుంటే వ్యక్తులు పూజలుచేస్తూ భగవదారాధనలు, తత్సంబంధిత క్రియలు ఆచరిస్తూ మనకు కనబడరు.

నిత్యం మనకున్న నిద్రావస్థలో కొలది సుఖాన్ని కొన్ని గంటలకాలం మనం అనుభవిస్తాం. కాని మహాప్రళయ సమయంలో పరమానందానుభూతిని చాల సంవత్సరాలు పొందుతాం. కాని మన కర్మఫలాల్ని అనుసరించి తిరిగి జన్మించాల్సిందేగదా ! ఈ మధ్య కాలంలో పరబ్రహ్మ ఒడిలో సేదదీర్చుకొని మరల సృష్టితో బాటు ప్రపంచంలోకి ప్రవేశించాల్సిందే. కనుక మహాప్రళయ సమయంలో పరబ్రహ్మ సాన్నిధ్యంలో వేలకొలది సంవత్సరాలు గడిపి మనం పొందే ఆనందానుభూతి అనిర్వచనీయమైనది.

ఆత్మజ్ఞానం కలిగిన మానసిక స్థితిలో భవబంధాల్నుండి విముక్తిచెంది మోక్షానికి అర్హులమైనపుడే మనకు పరబ్రహ్మలో పరిపూర్ణంగా లయమయ్యే స్థితి ఏర్పడుతుంది.

Sri Jayendravani    Chapters    Last Page