Sri Jayendravani    Chapters    Last Page

ఎనిమిదవ భాగము

38. అవస్థా త్రయం

(జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుప్త్యవస్థ)

సాధారణంగా మన మనస్సును ఏ వస్తువుపైననైనా కేంద్రీకరించటం అంతసులభ##మైన విషయం కాదని మన అనుభవంవల్ల తెలుసుకుంటాం. ఎల్లప్పుడు మనస్సు అనేక విషయాలపై సంచరిస్తూ వుంటుంది. మనస్సును ఒక వస్తువుపై లగ్నంచేయటం మన చేతుల్లో లేదు. కాని కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అది జరుగుతుంది. మనం దాన్ని స్థిరీకరిద్దామని యత్నిస్తే స్థిరీకరింపబడదు. ఉదాహరణకు పూజలు, ప్రార్థనలు చేస్తున్నప్పుడు మనమనస్సు ఒకే విషయంపై పరిభ్రమిస్తూ వుంటుంది. కాని మనకు తెలియని స్థితిలో అది అప్రయత్నంగా ఒక విషయంపై లగ్నమై వుంటుంది. మనస్సు అలా లగ్నం కాబడిన సమయం నిద్రాసమయం. వ్యక్తి మనస్సును లగ్నం చేసినా, చేయకపోయినా, ఈశ్వరభక్తి సల్పినా, సల్పకపోయినా, నిద్రాసమయంలో మనస్సు సుఖాన్ని పొందుతుంది. మనిషి ఉదయం నిద్రనుండి లేవగానే, లేచిన తర్వాత కొద్ది నిముషాలవరకు అతని మనస్సు ప్రశాంతతను, నిశ్చలతను పొంది వుంటుంది. గడచిన రాత్రి సంభవించిన సంఘటనలను మరచి వ్యక్తి ఉన్నతస్థాయిలో మానసిక శాంతిని అనుభవిస్తాడు. కాని కొంతసమయం గడచిన తర్వాత ముందు రాత్రి సంభవించిన వివాదాలు, ఇతర అనుభవాలు పునరావృతమౌతాయి.

మనం నిద్రించినపుడు మనమనస్సు విహరించుచున్నది, లేనిది మనకు తేలీదు కాని ఉదయం నిద్రలేచిన తర్వాత మనం ఏ రకమైన వ్యాకులతలు లేకుండా సుఖంగా నిద్రపోయినట్లు తెలిసికొంటాం. దీన్నిబట్టి నిద్రలో మనమనస్సు ఎక్కడా సంచరించక నిలకడగా వుందని వూహిస్తాం. మరొక రకంగా చెప్పాలంటే నిద్రలో మనస్సు దాని సహజస్థితికి చేరుకుంటుంది.

ప్రతిజీవికి తన శరీర అంతర్భాగంలో ఒకవిధమైన శక్తి వుంటుంది. మనం జాగ్రదవస్థలో వున్నపుడు మనం ఆహారం తీసుకుంటాం. ఇంకా అనేక రకాలైన పనులను చేస్తాం. మన ప్రతి పనిని నియంత్రించే శక్తి మనలో వుంది. కొన్ని సమయాల్లో మనం ఏదో చేస్తున్నట్లు కలకంటాం. ఆ సమయంలో కూడ ఏదోశక్తి పనిచేస్తూ వుంటుంది. కాని మనం గాఢనిద్ర పోయినప్పుడు ఒక కొయ్యలాగ నిద్రపోతాం. మనం నిద్రలేచి నప్పుడు మాత్రమే మనం గాఢనిద్రపోయామని చెప్పుకుంటాం. అంటే ఒకరు మన నిద్రను పరిశీలిస్తున్నారని అర్థం. ఆ ఒకరు అనేదే 'జీవాత్మ'. నిద్రలో జీవాత్మ పరమాత్మలో ఐక్యమవుతుంది.

జాగ్రదవస్థలో త్రాగుట, తినుట మొదలైన అనేకమైన పనులను నిర్వర్తిస్తాం. అప్పుడే ప్రేమ, ద్వేషం, ఆగ్రహం మొదలైన మనోవికారాల్ని కూడ ప్రదర్శిస్తాం. కాని స్వప్నావస్థలో ఇవన్నీ అదృశ్యమౌతాయి.

అందువలననే ఆ సమయంలో మనకు సుఖానుభూతి వుంటుంది. పగలంతా అనేకమైన ఈతిబాధలను అనుభవించినా, కనీసం నిద్రలోనైనా సుఖాన్ని అనుభవిస్తాం. ఒక వ్యక్తి బాధలతో కృంగిపోయి, దైన్యాన్ని భరించలేక ఒంటరిగా కూర్చొని దుఃఖిస్తాడు. తర్వాత కొంతసమయానికి అలసి స్వప్నంలోకి జారు కుంటాడు. తిరిగి మేల్కొనిన తర్వాత అతడు కూడ కొంత సుఖాన్ని చవిచూస్తాడు.

అసలు వ్యక్తి నిద్రలేకుండా వుంటే అతనికి ఆ రకమైన అనుభవం వుండదు. కాని స్వప్నావస్థకు ఇది వర్తించదు. స్వప్నంలో మనకు వింతయైన, భయంకరమైన అనుభవాలు కల్గుతాయి. స్వప్నాల్లో కూడ మనం నిద్రలో వున్నట్లు కలకనవచ్చు. కాని గాఢనిద్రలో కలిగే సుఖానుభూతి అక్కడ లోపిస్తుంది.

నిజంగా గాఢనిద్రపోగల్గటం ఒక వరం లాంటిది. మనల్ని నిద్ర వశంచేసుకున్నప్పుడే నిద్రపోతాం. ఒకప్పుడు నిద్ర లేచిన తర్వాత మళ్లీ నిద్రలోకి జారుకోవాలని ప్రయత్నిస్తాం. కాని అప్పుడు మనకు నిద్రరాదు. నిజానికి మన ఇష్టప్రకారం మనం నిద్రపోలేము. నిద్రపోవాలని పడుకుంటాం. కాని నిద్రరాదు. బలవంతాన కళ్లుమూసుకొని నిద్రపోవటం ఆరంభిస్తాం. అప్పుడు మనకు గాఢనిద్రపట్టదు. కలలను మాత్రం కంటాం. గాఢనిద్ర అనుభవించాలంటే వ్యక్తి పుణ్యం చేసి వుండాలి. అప్పుడు మాత్రమే అతడు మైమరచి నిద్రించి తద్వారా మానసిక ప్రశాంతతను పొందుతాడు. మన సౌఖ్యానికి అవసరమై నంతమేరకే భగవంతుడు మనకు నిద్రను ప్రసాదిస్తాడు.

నిద్రలో మనస్సు ప్రశాంతస్థాయిలో ఎందుకు వుంటుంది? నిద్రనుండి మేల్కొనిన వెంటనే మానసిక శాంతి మనకు ఎలా లభిస్తుంది? నిద్రలో సర్వేంద్రియాలు నిశ్చలస్థితిలో వుంటాయి. కొందరి విషయంలో నిద్రలో వున్నప్పుడు కూడ కళ్లు, నోరు తెరచుకొని వుండవచ్చు. కాని వీటికి క్రియాపరత్వముండదు. చెవులు, కళ్లు, ముక్కులాంటి బాహ్యేంద్రియాలే నిజమైన జ్ఞానేంద్రియాలని భావిస్తాం. కాని యధార్థానికి ఈ బాహ్యేంద్రియాలు వాటివాటి క్రియలను నిర్వర్తించటానికి సాధనాలు మాత్రమే.

శ్రవణక్రియను జరిపే అంగాన్ని శ్రోత్రమంటాం. దృష్టినిచ్చే అంగాల్ని చక్షువులంటాం. అలాగే మాట్లాడటానికి, రుచులను గ్రహించటానికి ఉపయుక్తమయ్యే అంగాన్ని జిహ్వయని పిలుస్తాం. వాటిని మనం అవయవాలని మాత్రమే ఎందుకు అంటాం ? ఉదాహరణకు ఒక బధిరునకు కూడ చెవి పేరుతో బాహ్యేంద్రియం వుంటుంది. కాని అతడు వినలేడు. అలాగే గ్రుడ్డివానికి నయనాలు వుండవచ్చు. కాని దృష్టి వుండదు. అట్లే మూగవానికి నోరు నాలుక వుంటాయి. కాని అతడు మాట్లాడలేడు. అంటే ఈ జ్ఞానేంద్రియాలు అన్నింటిలోను వాటి వాటి క్రియలు నిర్వర్తింపచేయటానికి ఒక శక్తి వున్నదని అర్థం. ఆ శక్తి లోపిస్తే మనం చూడలేం, వినలేం, మాట్లాడలేం. అంతర్గతంగా వున్న ఆ శక్తి వల్లనే ఈ జ్ఞానగ్రాహ్యతలు సంభవిస్తున్నాయి. మైకులోని ఆ శ##క్తే శబ్దవిస్తరణకు, శబ్ద ప్రసరణకు బాధ్యత వహిస్తుంది. అదే విధంగా ఈ శక్తి అనేక సాధనాల్లో అంతర్గతంగా వుండి వాటిని క్రియలు నిర్వర్తించటానికి ఆధారభూతమౌతుంది.

మనకు చక్షువు, శ్రోత్రము, ఘ్రాణము, జిహ్వ, త్వక్కు అనే జ్ఞానేంద్రియాలు ఐదు వున్నాయి. అలాగే పాణి, పాదము, వాక్కు, పాయువు, ఉపస్థము అనే ఐదు కర్మేంద్రియాలు వున్నాయి. ఇవిగాక ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అని పేర్లు గల పంచప్రాణాలు, వీటికితోడు మనస్సు మనకున్నాయి. ఈ పదహారు సూక్ష్మశరీరంలో స్వతస్సిద్ధంగా ఏర్పడివుంటాయి.

మొత్తం శరీరానికి ప్రాణాలు ఆధారస్థానంలో వుంటాయి. ప్రాణం నిష్క్రమించిన తర్వాత మిగిలేది ఏదీవుండదు. నిద్రాసమయంలో శరీరం వుంటుంది. కాని కర్మేద్రియాలు చైతన్య వంతంగా వుండవు. అయితే కొంతమంది నిద్రలో కూడ తమ కళ్లను, నోటిని తెరచివుంచుకోవచ్చు, లేక మరేదైనా చేష్టలను, కదలికలను చేయవచ్చు. కాని అంతకు మినహా కర్మేంద్రియాలన్నీ నిద్రలో అయిదు జ్ఞానేంద్రియాల్లోనూ మిళిత మౌతాయి.

మన స్థితిని మనకు గుర్తుచేసి మనకు ఆ జ్ఞానాన్ని సమకూర్చే అవయవాల్ని జ్ఞానేంద్రియాలంటాం. మన క్రియలకు, చేష్టలకు కారణభూతమైన అంగాల్ని కర్మేంద్రియాలని పిలుస్తాం. దేనినైనా చూచిన, విన్న, ఆ చూచిన, విన్న విషయాన్ని గుర్తించిన జ్ఞానం మనకు కల్గుతుంది.

మనకున్న పంచప్రాణాలు, వివిధములైన అవయవాలు తమ పనులను సవ్యంగా నిర్వర్తించటానికి బాధ్యత వహిస్తాయి. మన శరీరం ఈనాడు ఈ స్థితిలో నుండటానికి ఈ పంచప్రాణాలే కారణం. ప్రధమంగా ప్రాణవాయువు గుండె యందుంటుంది. గుండె ఆగిపోయి ప్రాణవాయువు దాన్ని విడచివెళ్తే ఏం జరుగుతుందో అందరికి తెలుసు. మల పురీషాదులను విసర్జించుటకు అపానవాయువు దోహదం చేస్తుంది. తిన్న ఆహారం కడుపులో జీర్ణంకావటానికి సమానవాయువు బాధ్యత వహిస్తుంది. ఉదానవాయువు గొంతు ప్రాంతంలో వుంటుంది. మనం చాలినంత ఆహారం తీసుకొన్నప్పుడు గొంతు ద్వారా వెలువడే త్రేనుపు ధ్వనికి ఉదాన వాయువే కారణం. అదే విధంగా వ్యానవాయువు మొత్తం శరీరం అంతా వ్యాపించి యుంటుంది. మనం చాలా దూరం నడచినప్పుడు శ్రమవల్ల శరీరంలో వాయువు చేరుతుందని అనుకుందాం. ఆ వాయువు చేరిక వ్యానవాయువు సవ్యంగా దాని పని అది చేయనందువల్ల జరుగుతుంది.

ఈ వాయువులన్నీ స్వతసిద్ధముగా ఏ భౌతిక శరీరంలో ఉంటాయో దానినే స్థూలశరీరం అంటాం. ఆ విధంగా మన స్థూలశరీరంలో ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేద్రియాలు, ఐదు ప్రాణాలు వున్నాయి. స్థూలవస్తువే పుట్టుకకు, మరణానికి గురిఔతుంది. అదే జననమరణాల నడుమ కాలంలో బాల్యదశను, ¸°వనదశను, వృద్ధాప్యాన్ని, తలనొప్పిని, కడుపునొప్పిని, ఆకలిదప్పులను అనుభవిస్తుంది.

మనకు బాహ్యంగా కనిపించేదే స్థూలశరీరం. స్థూలశరీరం లోపల సూక్ష్మశరీరం వుంటుంది. జాగ్రదవస్థలో శరీరం దానితో బాటు అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయి. కాని నిద్రావస్థలో బాహ్యచర్యలన్నీ నిలిచిపోయి శరీరం విశ్రాంతి స్థితికి చేరుకుంటుంది. ఇంద్రియాలన్నీ వాటి వాటి ప్రవృత్తులనుండి విముక్తి పొంది కారణశరీరంలో ఐక్యమౌతాయి. జాగ్రదవస్థలోకి తిరిగి వచ్చిన తర్వాతే అవి చైతన్యవంతమౌతాయి. మనం నిద్రించు చున్నపుడు అన్నీ సవ్యంగానే వున్నట్లు భావిస్తాం. నిద్రలో మనం తెలిసిచేసే ప్రయత్నాలేమి వుండవు. నిద్రావస్థలోనైనా సుఖదాయకమైన స్థితిని చేరటానికి సూక్ష్మశరీరాన్ని భద్రంగా చూచుకోవాలి.

నిద్రావస్థలో మనకర్మేద్రియాలు, జ్ఞానేంద్రియాలు కూడ చైతన్యరహితంగా వుండటాన్ని మనం పరిశీలిస్తాం. అంటే అవి సూక్ష్మ శరీరం నుండి అదృశ్యమైనట్లా? కాదు. నిద్రావస్థలో సూక్ష్మశరీరం యావత్ప్రపంచ వ్యాపారానికి కారణభూతమైన కారణశరీరంలో ఐక్యమౌతుంది.

సాధారణంగా ఒక వ్యక్తి నిద్రావస్థలో నుండి జాగ్రదావస్థలోనికి రావటానికి ఇష్టపడడు. ఒక వ్యక్తి అసలు నిద్రలేవకుండా నిద్రలోనే వుండటం అంటే అర్ధమేమిటో మనకు తెలుసు. వ్యక్తి నిద్రిస్తూ, నిద్రలో లభించే సుఖాన్ని అనుభవించి తిరిగి మేల్కొంటే అది మంచి విషయమే. కాని జాగ్రదవస్థలో నుండి కూడ మొత్తం సమయాన్ని నిద్రలో గడపగల్గితే, ఆ వ్యక్తి జ్ఞానిగా పరిగణింపబడతాడు.

మనం కలలను సూక్ష్మశరీరంలోనే కంటాం. ఒక వ్యక్తి కలలో కంచిలోని మహాత్ముని చూడటం సంభవించవచ్చు. అలాంటి కలలు శుభప్రదమే. అతడు కంచిలో పూజచేస్తున్న పరమాచార్యుని కొద్ది దినాలు చూచివుండొచ్చు. అందువల్ల అదే దృశ్యం అతనికి తర్వాత కలలో కనిపించవచ్చు. అలాగాక కొంతమంది కలలో పెద్దపులిగాని, సింహంగాని, మరియేదైన క్రూరజంతువుకాని మీదకు ఉరుకుతున్నట్లుగా భయానకమైన దృశ్యాన్ని చూడవచ్చు. దాని వలన వారి నిద్రకు భంగం కల్గి ఆ కల వున్నంతవరకు సరియైన నిద్రరాకపోవటం జరుగవచ్చు.

స్వప్న స్థితికి హేతువేమిటి? స్వప్నాల అవసరం మానవునకుందా? కలలు లేకుండా మనం జీవించలేమనేదే దీనికి సమాధానం. కర్మేంద్రియాలు ఐదు, జ్ఞానేంద్రియాలు ఐదు, ఐదు ప్రాణాలు, మనస్సు ఇవన్నియూ సూక్ష్మశరీరంలో స్వతసిద్ధంగా ఏర్పడతాయి. సూక్ష్మశరీరంలో ఏది వుంటే అది స్థూల శరీరంలోకి వెళ్తుంది. ఈ సూక్ష్మశరీరమే బాహ్య శరీరాన్ని నిత్యజీవితంలో నడిపిస్తుంది. కారణ శరీరంలో ఏది చలించినా అది సూక్ష్మశరీరమే. సహజంగా ఆ సూక్ష్మశరీరమే స్థూల శరీరం యొక్క క్రియల్లో ప్రతిబింబిస్తుంది. కనుక ప్రతివ్యక్తి సూక్ష్మ శరీరాన్ని భద్రంగా వుంచుకొని మంచిస్థితిని కల్గజేయకపోతే అది మరియొక స్థూలశరీరాన్ని ఆశ్రయించి జీవించ వలసి వచ్చినపుడు వ్యథలకు గురియై సుఖానికి దూరమౌతుంది. కాని కొంతమంది స్థూల శరీరాన్ని మాత్రం జాగ్రత్తగా చూచుకుంటే చాలు, అన్నీ సక్రమంగా జరిగిపోతాయనే అభిప్రాయంతో వుంటారు. అది పొరపాటు. మనం జాగ్రత్తగా చూడవలసింది సూక్ష్మశరీరాన్నే. ఈ జన్మలో మనం సూక్ష్మ శరీరాన్ని గురించి శ్రద్ధ వహిస్తే మరుజన్మలో కూడ దానియొక్క స్థితిని చక్కబరచిన వారమౌతాం. మనం వార్షికంగా నిర్వహించే శ్రాద్ధకర్మలు, తర్పణాలు సూక్ష్మశరీరం యొక్క శ్రేయస్సు కొరకు మాత్రమే. వీటి లక్ష్యం స్థూలశరీరం కానేకాదు. మన నిత్యజీవితంలో మనం ఏ కార్యం నిర్వర్తించినా అది సూక్ష్మశరీరం కొరకే.

సూక్ష్మశరీర సిద్ధాంతం దానిని గురించిన జాగ్రత్త మన హిందూ మతం తప్ప మరియే ఇతర మతం ఆమోదించలేదు. బౌద్ధమతస్థులు జనన మరణాలు, పునర్జన్మ ఉన్నవనే సిద్ధాంతాన్ని స్వీకరించారు. ప్రజలు పాపభీతులై సన్మార్గప్రవర్తకులు కాగలందుకు నరకం వున్నదనే సిద్ధాంతాన్ని కూడ అంగీకరించారు. భగవంతుని ఆరాధించక, సత్కర్మలు చేయక జీవిస్తే నరకం తప్పదని వారంటారు. మనం కలలు కనటానికి దోహదం చేయటంతో బాటు సూక్ష్మశరీరానికి మరొక ముఖ్యమైన కర్తవ్యముంది. పరమాత్మ తత్వాన్ని గురించిన ఒక గొప్ప వేదాంత సూత్రాన్ని ఇది మనకు గుర్తు చేస్తుంది.

ఈ ప్రపంచం మిథ్యా, సత్యమా అనే సందేహాన్ని కూడ తరచుగా అందరూ అడుగుతారు. శంకరుని అద్వైత వేదాంతం జగం మిథ్యయని పరమాత్మ సత్యం అని సిద్ధాంతీ కరిస్తుంది. ఈ జగత్తు మిథ్య అయితే ఈ పూజలు ఆరాధనలు ఈ తతంగం అంతా ఎందుకనే ప్రశ్న రాకపోదు. స్వప్నావస్థ ఒక గొప్ప అద్వైత సిద్ధాంతాన్ని మనకు గుర్తుచేస్తుందని లోగడ చెప్పుకున్నాం. పరబ్రహ్మ స్వరూపమే నిత్యమైందని, సాపేక్షికంగా చూస్తే మిగతావన్ని తాత్కాలికమైనవని దాని సారం.

మామూలుగా కల నిజం కాదని అందరెరింగినదే. కాని, కల కనే వ్యక్తి దృష్టిలో కలకనే సమయంలో అది చాల నిజమే అవుతుంది. అలాగే మన స్థాయిలో మనకు విధింపబడిన కార్యాన్ని మనం తప్పక చేయాలి. కాని జ్ఞానికి కర్మతో పనిలేదు. కాని ఆ స్థితికి చేరుకునేంతవరకు నియమితకర్మల్ని మనం చేస్తూనే వుండాలి. వ్యక్తి జ్ఞాని కాగానే వేదాంత పరిజ్ఞానం అతనికి సమకూరుతుంది. వేదాంత సత్యాలు అవగతమౌతాయి. శ్రీకృష్ణభగవానుడు చెప్పినట్లు-''తస్య కార్యంన విద్యతే'' - ఆ స్థాయిలో జ్ఞానియైనవాడు కర్మలనేమి చేయవనసరం లేదు.

బ్రహ్మ పదార్థమొక్కటే నిత్యమైనప్పుడు, మనం కర్మలు చేసి ప్రయోజనమేమి అనే ప్రశ్నకు సమాధానం వుంది. మామూలు నిత్యజీవితంలో మనం సూక్ష్మ శరీరానికి సరియైన ఆహారం ఈయక పోతే మరు జన్మలో దానికి సుఖం సమకూరదు. జ్ఞానియైనవాడు కర్మను విసర్జించటానికి అర్హుడైనా, ఇతరుల కొరకు కర్మలను ఆచరిస్తూనే వుంటాడు.

గీతలో శ్రీకృష్ణుడిలా చెప్తాడు.

శ్లో|| యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రిత ః

మమ వర్త్మాను వర్తన్తే మనుష్యాః పార్థ సర్వశః ||

""®ƒs[ƒ«sV ƒy „sµ³j…¬s ¬sLRi*QQLjiòLi¿RÁNRPF¡¾»½[ „sVgRi»y ªyLRiLiµR…LRiW ƒ«s®ƒs[õ @ƒ«sVxqsLjixqsWò

వారివిధులను వారు నిర్వర్తించరు. నేను అన్నిటికి ప్రభువుని. కనుక నేనేమీ కర్మను చేయనవసరం లేదు. కాని గొప్పవాడేమి ఆచరిస్తే ఇతరులు వానిననుసరిస్తారు.''

శ్లో|| ''యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జన ః |

స యత్ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే ||''

""NRPƒ«sVNRP ®ƒs[ƒ«sV NRPLRiøÍÜ[ ¬s¸R…V„sV»R½V²R…\®ƒs NRPLRiøƒ«sV N]ƒ«srygji}qsò®ƒs[ B»R½LRiVÌÁV ƒy¿Á[ ú}msLji»R½V\ÛÍÁ

వారి విధులను వారు నిర్వహిస్తారు. కనుక జ్ఞాని కర్మను చేస్తూ ప్రపంచానికి మార్గదర్శకు డౌతాడు. ఇక్కడ కూడా అదే నియమం వర్తిస్తుంది. కనుక మనం కర్మను త్యజించి నేనేమీ చేయనక్కర లేదని వూరికే వుండటానికి అవకాశం లేదు.''

స్వప్నావస్థ మరొక ప్రయోజనకరమైన అంశాన్ని కూడ మనకు సమకూరుస్తుంది. వ్యక్తి ఆత్మజ్ఞాన విషయంలో సాధించిన పెరుగుదలను శోధించుటలో సాధనంగా పనిచేస్తుంది.

స్వప్నావస్థలో మనం పరాశక్తి పాదపద్మాలపై ధ్యానం నిలుపుతున్నామా, లేక దొంగకాని, క్రూరమృగంకాని కనిపిస్తే భయపడి దుఃఖిస్తున్నామా, లేక మన కోర్కె లన్నీ తీరినట్లు, దాని ఫలితంగా ఆనందిస్తున్నామా అనే అంశాల్ని పరిశీలించాలి. పరాశక్తి పాదకమాలాలపై ధ్యానం నిలపగల్గితే మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తున్నట్లు అర్థం. అలాకాని స్థితిలో జాగ్రదావస్థలో మనం అనుకున్న కోరికలు ఫలించని పరిస్థితిని స్వప్నావస్థ సూచిస్తుంది. మన మేదో చెడు పనిని చేస్తున్నట్లు కలకంటే, మన కుదయించిన చెడుతలంపులు ఇంకా మనల్ని వెంటాడుతున్నాయని బాధ పడాలి. భగవంతుడు మనలను మనం పరిశోధించుకోటానికే కలలను సృష్టించాడు. భగవ దనుగ్రహాన్ని పొందగల్గామా లేదా అనే విషయాన్ని కూడ ఋజువు చేసికోటానికి ఇది ఉత్తమ మార్గం. నిజమైన భక్తుని విషయంలో అతడు తన కలలలో కూడ భగవన్నామం జపిస్తున్నట్లు, భగవద్దర్శనం పొందినట్లు తద్ద్వారా మనశ్శాంతి లభించినట్లు అనుభవం పొందుతాడు.

ఆ విధంగా స్వప్నావస్థ మన భక్తిస్థాయిని, ఆధ్యాత్మికతను కొలుచుటకు భారమితివలె పనిచేస్తుంది.

మానవుని యొక్క మూడు అవస్థలు - అనగా జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషిప్త్యవస్థల ప్రాముఖ్యత ఇదే.

Sri Jayendravani    Chapters    Last Page