Sri Jayendravani    Chapters    Last Page

27. నామజపం లేక భగవన్నామ స్మరణ

ª«sVƒ«s xqsXztísQúNRPª«sVLi Lki»yù ƒyÌæÁV ¸R…VVgSÌÁVƒyõLiVV. NRPX»R½¸R…VVgRiLiÍÜ[ úxmsÇÁÌÁV »R½F¡¬sxtîsv\ÛÍÁ ¸R…VVLi®²…[ªyLRiV. ú¾»½[»y¸R…VVgRiLiÍÜ[ ¸R…VÇìÁ¸R…WgSµR…VÌÁV ¿Á[zqs \®µ…ªy¬sõ xmspÑÁLi¿Á[ªyLRiV. µy*xmsLRi ¸R…VVgRiLiÍÜ[ªyLRiV ˳ÏÁgRiª«sLi»R½Vƒ«sNRPV xmspÇÁÌÁV xqsª«sVLjiöLi¿Á[ªyLRiV. NRPÖÁ¸R…VVgRiLiÍÜ[ ˳ÏÁgRiª«sµyLSµ³R…ƒ«sNRPV ˳ÏÁNTPò ª«sVWÍص³yLRi\®ªsVƒ«sµj….

''భక్తిరేవ కలౌ యుగే''

భగవన్నామ స్మరణ చాల ముఖ్యమైనది.

''యజ్ఞానాం జపయజ్ఞోస్మి''

''అన్ని యజ్ఞాలయందు, నేను జపయజ్ఞాన్ని''

తరచుగా మనం ఆలయాలకు వెళ్లి భగవానుని ప్రార్థిస్తాం. ప్రత్యేకమైన మంత్రజపంతో భగవంతుని ధ్యానిస్తాం. కొన్ని స్థలాల్లో కొన్ని ప్రత్యేకమైన సాధనలద్వారా ప్రాప్తించే భగవదానుగ్రహాలున్నాయి. నామజపం ద్వారా భగవత్స్వరూపం నేరుగా స్పష్టంగా గోచరిస్తుంది. భగవన్నామ జపాన్ని నిరంతరం చేస్తే దైవ సాక్షాత్కారం నేరుగా ప్రాప్తిస్తుంది.

ఉదాహరణకు రామనామ జపం శుభఫలితాలకు ఆలవాలమైంది. 'రామ' శబ్దానికి ఇతరులను రంజింప చేయువాడని అర్థం. రామనామ జపం కుటుంబంలో ఏ ఒక్కరు చేసినా కుటుంబాని కంతకు సుఖశాంతులు లభిస్తాయి. రాముని నిరంతరం ధ్యానించుట చేతను, రామనామ జపం ద్వారాను త్యాగరాజు మొదలగు మహాత్ములకు రామసాక్షాత్కారం నేరుగా లభించింది. అంధకవియైన సూరదాసు కూడ కృష్ణనామ జపం ద్వారాను ఆయన మహిమల్ని సంకీర్తనం చేయుటవల్లను శ్రీకృష్ణుని తన ఎదుట సందర్శించగల్గాడు.

ఆ రీతిగా పరమాత్ముని నామజపం మనకు అమితానందాన్ని, మనశ్శాంతిని సమకూర్చటమేగాక మన ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపజేసి, అన్ని రంగాల్లోను సత్ఫలితాల్ని లభింప జేస్తుంది.

Sri Jayendravani    Chapters    Last Page