Sri Jayendravani    Chapters    Last Page

17. వినాయకుని ఆరాధించుట

మనమేదైన కార్యక్రమాన్ని ప్రారంభించేముందు వినాయకుని ఆరాధించి ఆయన అనుగ్రహాన్ని పొందుతాం. శివరాత్రి గాని, నవరాత్రి గాని, మరి ఏ పర్వదినం గాని, మనం ప్రథమంగా వినాయకుని ఆరాధిస్తాం. వినాయకునే విఘ్నేశ్వరుడని కూడ అంటారు. విఘ్నేశ్వరుడనే పదానికి 'విఘ్నాలకు అధిపతి'అని అర్థం. అంటే విఘ్నాలన్నీ ఆయన నియంత్రణలో వుంటాయని, మనమార్గంలో తటస్థించే విఘ్నాలను సమగ్రంగా ఆయన తొలగించగలడని భావం. విష్ణు సహస్రనామాల్లో 'భయకృత, భయనాశనః' అనే ప్రయోగాలున్నాయి. భయానికి కారకుడాయనే, భయాన్ని నివృత్తి చేయగలవాడూ ఆయనే అని దాని అర్థం. అలాగే విఘ్నేశ్వరుడు కూడ :

శ్లో|| ''విఘ్నానాం ఈశ్వరః ఏవ విఘ్నానాం నివర్తకః |

అతః సః విఘ్నకృత్‌ విఘ్ననాశనః ||''

@¬sõ „sxmnsWõÌÁV A¸R…Vƒ«s Aµ³k…ƒ«sLiÍÜ[ ª«soLiÉØLiVV. NRPƒ«sVNRP A¸R…V¬sõ ALSµ³j…LiÀÁ ª«sVƒ«sNRPV FsµR…VLRi¹¸…[Vù „sxmnsWõÌÁƒ«sV ¬sª«sX¼½ò ¿Á[zqsN][gRiÌÁLi. xmnsÖÁ»R½LigS „sxmnsWõÖÁõ ª«sVƒ«sƒ«sVLi²T… µR…WLRiLi¿Á[zqs ª«sVƒ«s NSLSùÌÁV G LRiNRP\®ªsVƒ«s AÈÁLiNSÌÁNRPV gRiVLjiNSNRPVLi²y xmnsÌÁúxmsµR…ª«sV¹¸…[VùÈÁÈýÁV A¸R…Vƒ«s ¿RÁWryò²R…V.

ఒక పురాణంలో గణశుడు సర్వశ్రేష్ఠుడైన భగవానునిగ కీర్తింపబడ్డాడు. అష్టాదశ పురాణాల్లోని ఒక్కొక్క పురాణంలో ఒక దేవతను అధిష్ఠాన దేవతగా ప్రతిష్ఠించి మిగతా దేవతలను ఆయనకు లోకువైన వారినిగా చిత్రీకరిస్తారు. ఒక్కొక్కచోట ఒక తత్వానికి ప్రాధాన్యత నివ్వటమే అచ్చట ఉద్దేశింపబడిన లక్ష్యం. అంతేకాని దేవతల్లో వారు గొప్ప, వీరు తక్కువ అని వారిలో తారతమ్యాలు నిర్దేశించుటకు కాదు. ఒక తత్వాన్ని గురించి ప్రముఖంగా ప్రస్తావించిన సందర్భంలో ఒక ప్రత్యేకమైన మూర్తికి ప్రాధాన్యత ఈయబడుతుంది. ఉదాహరణకు శివపురాణంలో శివునకు, స్కందపురాణంలో సుబ్రహ్మణ్యశ్వరుడు లేక కార్తికేయునకు ఉన్నతస్థానం ఈయబడుతుంది.

పురాణాల్లో శివుడు తనకుమారుడైన గణశుని ఆరాధించినట్లు గమనిస్తాం. అది అలా ఎందుకు జరగాలని మనం ప్రశ్నించరాదు. అది నిజమైన అంతిమ తత్వం కానేరదు. అంతమతత్వమైన పరమాత్మయే ప్రజలకొరకు, వారిపై కరుణతో, గణశుడుగాను, శివుడుగాను, విష్ణువుగాను, సుబ్రహ్మణ్యశ్వరునిగాను, ఇంకా రామావతారం, క్రిష్ణావతారాలుగాను రూపాలు స్వీకరించాడు. కాబట్టి గణశుడుకూడ పరమాత్మ స్వరూపుడే. అట్లే మిగతా దేవతలుకూడ. కనుక మనం ఏ దేవతను ఆరాధించినా యధార్థంగా అంతిమ తత్వమైన పరమాత్మునే అనిశం ఆరాధించినట్లు, ఒక్కొక్క సందర్భంలో పరమాత్మయొక్క ఒక ప్రత్యేకం అంశం కీర్తింపబడుతుంది.

గణశుడు స్వీకరించిన రూపం చాలా ఆసక్తి దాయకంగా వుంటుంది. ఆయన గజాననుడు. తొండం కల్గివుంటాడు. ఏకదంతుడు. అంతేగాదు కుండ బొజ్జ కలవాడు. మూషికవాహనుడు.

బాహ్యలక్షణాల్ని బట్టి గణశుని రూపం మనోహరంగా లేదని నిరసించకూడదు. అందులోని ఆంతర్యాన్ని గ్రహించి, దాని ప్రాముఖ్యాన్ని అంచనావేసి ఆ రూపంలో కూడ పరమాత్మ స్వరూపాన్ని చూడాలి.

అసలు గణశుడు ఏనుగుయొక్క ముఖాన్ని ఎందుకు ధరించాల్సి వచ్చిందో తెలుసుకుంటే మనకు విషయం తేటతెల్లమౌతుంది. గజముఖాన్ని కల్గిన గజముఖాసురుడనే రాక్షసుని చంపటంకొరకు వినాయకుడు జన్మించాడు. తన రూపంవంటి రూపమే కల్గిన వానిచేతిలో తప్ప మిగతా వారెవ్వరి చేతను చంపబడనట్లుగా రాక్షసుడు ఈశ్వరుని యొక్క వరాన్ని పొంది యున్నాడు. కనుక వినాయకుడు గజాననరూపుడై వరప్రసాదియైన గజముఖాసురుణ్ణి సంహరించాడు. ఆ ఇతివృత్తాన్ని మనం సంస్మరణలో వుంచుటకై ఆయన ఇప్పటికి ఏనుగు ముఖంతో వుండి మన ప్రార్థనలను, ఆరాధనలను స్వీకరిస్తున్నాడు.

ఏనుగు ముఖానికి మరియొక విశేషం కూడ వుంది. మానవుని సంతృప్తి పరచలేనివి ప్రపంచంలో మూడు విషయాలున్నాయి. ఒకటి చంద్రుడు, రెండు సముద్రం. మూడు ఏనుగు. మనిషి చంద్రుని అనిశం చూస్తూనే వుండాలని వాంఛిస్తాడు. అలాగే పైకిలేస్తూ క్రిందకు పడుతూ నయనా నందకరంగా వుండే సముద్రంలోని అలల కదలికను చూస్తూనే వుండాలని కూడ తలుస్తాడు. సముద్రతీరం నుంచి కదలటానికి ఇష్టపడడు. అదే విధంగా పెద్ద చిన్న అందరూ ఏనుగును, ఎంతసేపైనా చూస్తూనే వుండాలనే ఉత్సుకతను చూపిస్తారు. ఆ ఆనందాన్ని తనివితీర అనుభవిస్తారు. వినాయకుడు మనకీ ఆనాందానుభూతిని ప్రసాదించుటకే గజాననుడుగా వుంటున్నాడు.

గణశునిపై వున్న ప్రార్థనాశ్లోకంలో ఇలావుంది.

శ్లో|| ''అగజానన పద్మార్కం గజాననం అహర్నిశం |

అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహె ||''

"@gRi' @ƒ«sgS xmsLRi*»R½Li; "@gRiÇØ' @LiÛÉÁ[ FyLRi*¼½ (z¤¦¦¦ª«sVª«sLi»R½V¬s NRPW»R½VLRiV). gRiâßá[aRPV²R…V FyLRi*¼½ ¹¸…VVNRPä ª«sVVÅÁxmsµyø¬sNTP xqsWLRiVù¬s ª«sLiÉÓÁªy²R…V. @LiÛÉÁ[ A®ªsV ª«sVVÆØLi‡ÁVÇجsõ @»R½²R…V „sNRPzqsLixmsÛÇÁ[zqs úxmsNSbPLixms ¿Á[ryò²R…V. A „sµ³R…LigS gRiâßá[aRPV²R…V FyLRi*¼½¬s xqsz¤¦¦¦»R½Li DÍýØxqsxmsLRi¿RÁgRiÌÁªy²R…V NSgS, ª«sWª«sVWÌÁV ª«sWƒ«sª«soÌÁ „sxtsQ¸R…VLi ¿Áxmsöª«sÛÍÁƒy ? gRiâßá[aRPV¬s LSú¼½Li‡Áª«sÎÏÁ§þ xqsøLji}qsò, ª«sVƒ«sNRPV xqsVÅÁxqsLi»][uyÌÁV „sLji„sgS ÌÁÕ³ÁryòLiVV. úxms¼½ „dsµ³j…xqsLiµR…VÍÜ[ƒ«sV INRP „sƒy¸R…VNRPV¬s AÌÁ¸R…Vª«sVVƒ«sõ ª«sVƒ«s®µ…[aRPLiÍÜ[ A¸R…V¬sõ LSú¼½Li‡Áª«sÎÏÁ§þ xqsøLjiLi¿RÁÈÁLi @ryµ³R…ùLiNSµR…V.

గణశుని భౌతిక ఆకృతిని పరిశీలిస్తే మనకొక విషయం స్ఫురిస్తుంది. ఆయన శిరస్సు, ముడిచిన తొండముతో, తొండముచివర 'ఓం'ను అనగా ప్రణవ చిహ్నాన్ని స్ఫురింపచేస్తుంది.

గణశుడు ప్రణవస్వరూపుడని, మరొక విధంగా చెప్పాలంటే ఆయనే పరమాత్మయని, మనకీ విషయం స్మరణకు తెస్తుంది.

ప్రణవ చిహ్నాన్ని కల్గిన ఈ రూపంలోని వినాయకుని ధ్యానించవలసిన వివరణ తమిళ కవయిత్రి అవ్వయ్యారు తన 'వినాయక అకవల్‌' అనే ప్రసిద్ధ తమిళ కావ్యంలో యిచ్చింది.

ఏనుగునకు మామూలుగ రెండు దంతాలుంటాయి. కాని వినాయకుని ముఖం ఒకే దంతాన్ని కల్గి వుంటుంది. ఏనుగు ఒక దంతంతో సుందరంగా కన్పించదు. కాని ఒక దంతం విషయంలో కూడ ఒక ఇతిహాసం వుంది. పంచమ వేదంగా భాసిస్తున్న మహాభారతంలో వేదవ్యాసుడు దీన్ని గురించి ప్రస్తావించాడు. వేదవ్యాసుడు మహాభారతకథను చెప్తుంటే వినాయకుడు లేఖకుడుగా వ్రాశాడు. ఆ వ్రాయటానికి ఉపయోగించింది తన దంతాన్నే. తనకున్న రెండు దంతాల్లో ఒక దంతాన్ని విరుగగొట్టి దానితో భారతాన్ని వ్రాశాడు. ఇక్కడ మనకు స్ఫురించే ధర్మమొకటి వుంది. విజ్ఞానం కొరకు మానవుడు తనశరీరానికి అందాన్నిచ్చే అవయవాన్ని కూడ త్యాగం చేయటానికి సిద్ధపడాలి. దంతం గజానికి అందాన్ని ఇచ్చే అవయవమేగదా. నిజానికి ఏనుగు తన దంతాల్ని చాల జాగ్రత్తగ సంరక్షించుకుంటుంది. అలాంటి అందచందాలకు చిహ్నమైన రెండు దంతాల్లో ఒకదాన్ని త్యాగంచేసి మహాభారతం లిఖించటమనే ఒక ఘనకార్యాన్ని నిర్వహించాడు. మహాభారతం ఒక విజ్ఞాననిధి. భౌతిక సౌందర్యం కంటే విజ్ఞానం అధిక ప్రాముఖ్యం కలది. భౌతిక సౌందర్యం కొంతకాలానికి నశిస్తుంది. కాని విజ్ఞానం శాశ్వతమైనది. కనుక ప్రతివాడు సర్వశ్రేష్ఠమైన విజ్ఞానం కొరకు భౌతిక సౌందర్యాన్నైనా త్యాగం చేయగల్గాలి. ఈ సంఘటన మరొక సత్యాన్ని కూడ ప్రకటిస్తుంది. భగవంతుడు తాను నిర్వర్తించదలచిన కార్యాన్ని సాధించటానికి ఏ వస్తువునైనా ఎన్నుకో గలడు.

వినాయకుని కుండబొజ్జ చూసినప్పుడు మనకొక సత్యం గుర్తుకొస్తుంది. వినాయకుణ్ణి అందరు తరచుగా 'లంబోదర' అని ప్రస్తావిస్తారు. లంబోదర అనగా పెద్ద కడుపు గలవాడు అని అర్థం. ఆయన శిరస్సు ఏనుగునకు చెందినది. ఆయనకు కుండబొజ్జ కూడ వున్నది. అలా ఆయన పెద్దశరీరం కలవాడు. ఐనా ఆయన్ని ఒక పిల్లవానిగా మనం భావిస్తాం. ఆయన పార్వతీపరమేశ్వరులకు ముద్దుబిడ్డ గనుక, పార్వతీ పరమేశ్వరులు విశ్వానికంతటికి తల్లిదండ్రులు కనుక, వినాయకుడు విశ్వానికే బిడ్డగా పరిగణింపబడతాడు. తమిళంలో ఆయన్ని 'పిల్లైయార్‌'అని అంటాం. 'పిల్లైయార్‌' అంటే కుమారుడు అని తమిళంలో అర్థం. పిల్లవానిగా వినాయకుని యొక్క భౌతికరూపం తల్లులందరూ తమ పిల్లల్ని పోషించే విషయంలో అనుసరించాల్సిన ఒక థర్మసూత్రాన్ని గుర్తుచేస్తుంది. పిల్లవానికి బలవర్థకమైన ఆహారాన్ని ఇచ్చి పెంచాలి. అలా పెంచితే అతడు వినాయకునివలె దృఢకాయుడై శౌర్యవంతుడౌతాడు.

కుండ బొజ్జగల్గి దృఢమైన బరువైన శరీరంతో వినాయకుడు యీ ఎలుక వాహనంపై ఎలా స్వారీచేయగల్గుతున్నాడా యని మనకు ఆశ్చర్యం కల్గకపోదు. దానికీ సమాధానం లేకపోలేదు. ఒక రాక్షసుడు ఎలుకరూపం దాల్చి వినాయకునితో యుద్ధానికి దిగి వానికి తెలిసిన మాయలన్నీ ప్రయోగించాడు. రాక్షసుని యుక్తుల్ని వినాయకుడు తెలిసికొని, వానిని అణచి పట్టుకొని తన క్రిందవుంచుకొని వాహనంగా వినియోగించుకుంటూ వానిని తన ఆధీనంలో వుంచాడు. ఎవరైనా భగవంతుని మాయతో వంచించాలని సాహసిస్తే వానికి ఎలుక రూపంలో వచ్చిన అసురునకు పట్టినగతే పడుతుందని ఈ సంఘటన వ్యక్తీకరిస్తుంది.

మనం గణశుని ఎలా ఆరాధించాలి, ఏ పూజా విధానాన్ని అనుసరించాలి. ఏవి ఆయనకు నివేదించాలి అనే విషయాలు మన సాంప్రదాయాలు మనకు విశదీకరిస్తాయి. మన వాంఛితార్థాల్ని మనం యీడేర్చుకోవాలంటే ముఖ్యంగా ఒక కొబ్బరికాయను ఆయన ముందుకొట్టి నా కోర్కెను సఫలీకృతం చేయమని గణశుని ప్రార్థనలు సల్పుతాం.

కొబ్బరికాయనే కొట్టడంలోని ముఖ్యోద్దేశ##మేమి ? దీనికొక పురాణగాథ వుంది. త్రినేత్రుడైన పరమేశ్వరుడు ముగ్గురు రాక్షసులను సంహరించవలసి వచ్చింది. వారు తామ్ర, లోహ, సువర్ణ నగరాల్లో నివసిస్తూ ప్రజలను పీడిస్తున్నారు. పరమేశ్వరుడు వారిని సంహరించటానికి వెళ్లినపుడు ఆయనకు బహువిఘ్నాలు ఎదురైనాయి. ఆయన విఘ్నాధిపతి యైన తన కుమారుని ఆటంక నివృత్తి కొరకు ఉపాయం అడిగాడు. శివుని శిరస్సు నివేదనగా తనకు సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయని వినాయకుడు సూచించాడు. అప్పుడు త్రినేత్రుడైన ఈశ్వరునికి బదులు మూడుకళ్ళు కల్గిన నారికేళాన్ని శివుని చిహ్నంగా వినాయకునకు సమర్పించాడు. పరమేశ్వరుడు తర్వాత అసురులపై యుద్ధంచేసి వారిని సంహరించాడు. ఆసమయం నుండి నారికేళ ఫలానికి పూజ్యత లభించింది. మనం ఏ శుభకార్యాన్నైనా ప్రారంభించే ముందు వినాయకునకు కొబ్బరికాయ కొట్టటం పరిపాటైంది. ప్రస్తుత కాలంలో కూడ పెండ్లికుమారుడు వివాహార్థం పెండ్లి కుమార్తె గృహానికి తరలి వెళ్లే సమయంలో దారిలో ప్రథమంగా తటస్థపడే గణశ దేవాలయంలో గణశుని దర్శించి ఒక నారికేళాన్ని ఆయన ముందు కొట్టే ఆచారం వుంది.

తమిళ దేశంలో వినాయకునికి కొబ్బరికాయను కొట్టే సదాచారం చాలా ఎక్కువగా వుంది. ఈ ఆచారాన్ని ప్రజలు అరవంలో 'చిదార్‌ తెంగై' (పగల కొట్టిన కొబ్బరికాయ ముక్కల విస్తరణ) అంటారు. కొబ్బరికాయ కొట్టినపుడు అది మూడు, అంతకంటే అధికమైన ముక్కలుగ పగలాలి. పగిలిన ముక్కలు అన్నివైపుల విస్తరిస్తాయి. ఈ విస్తరణ మనం నిర్వహించే కార్యాలకు ఎదురయ్యే విఘ్నాలు పటాపంచలై కొబ్బరిముక్కలు వలె నలుదిశల చెల్లాచెదురై పోవుటను సూచిస్తుంది. మనం ఏదైనా గొప్ప కార్యాన్ని సాధించటానికి పెద్ద త్యాగాలకు కూడ సిద్ధపడాలి. తుదకు మన తలను సైతం త్యాగం చేయటానికి వెనుదీయరాదు. నారికేళాన్ని పగులగొట్టి భగవంతునకు లోపలి స్వచ్ఛమైన తెల్లని గుజ్జును సమర్పించటంద్వారా మనకుఐచింత నిర్మలమైన మనస్సును ప్రసాదించమని భగవానుని ప్రార్థిస్తున్నట్లు భావించాలి.

ప్రసేనుడు వద్దనుండి దొంగిలింపబడిన శమంతకమణిని సింహం వద్దనుండి తిరిగి సంపాదించే ప్రయత్నంలో శ్రీకృష్ణుడు వినాయకుని ఆరాధించినట్లు 'వ్రత చూడామణి'లో ప్రస్తావించబడింది. వినాయకచతుర్థి రోజున పై కథను స్మరణకు తెచ్చే ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తాం :

శ్లో|| సింహః ప్రసేనం ప్రవథీః సింహో జాంబవతా హతారో |

సుకుమారక మా రోథీః తవ హి ఏవ స్యమంతకః ||

úxms}qsƒ«sV¬s ª«sVXgRiLSÇÁÙ xqsLix¤¦¦¦LjiLiÀÁ aRPª«sVLi»R½NRPª«sVßÓá¬s úgRiz¤¦¦¦xqsVòLiµj…. NS¬s ÇØLi‡Áª«sLi»R½V ²yzqsLi¥¦¦¦¬sõ xqsLix¤¦¦¦LjiLiÀÁ ª«sVßÓá¬s ¼d½xqsVNRPVLiÉزR…V. $NRPXxtñsv²R…V ÇØLi‡Áª«sLi»R½V¬s ª«sµôR…ƒ«sVLi²T… ª«sVßÓá¬s ¾»½¿RÁVèNRPVLiÉزR…V. A xqsLiµR…LRi÷éLiÍÜ[ $NRPXxtñsv²R…V »R½ƒ«s úxms¸R…V»yõ¬sNTP „sxmnsWõÌÁƒ«sV @µ³j…gRi„sVLi¿RÁVÈÁ\ZNP „sƒy¸R…VNRPV¬s ALSµ³j…Li¿y²R…V.

లలితా సహస్రనామాల్లో దేవిని గురించి ఈ క్రింది పేర్లు వున్నాయి.

శ్లో|| ''కామేశ్వరముఖాలోకకల్పితశ్రీగణశ్వరా |

మహాగణశనిర్భిన్న విఘ్నయంత్రప్రహర్హితా'' ||

LSORPQxqsVÌÁ¿Á[ NRPÖÁöLixms‡Á²T…ƒ«s „sÀÁú»R½ ¸R…VLiú»R½Li ª«sÌÁƒ«s xqsXztísQLixms‡Á²T…ƒ«s ÇÁ¸R…V„sxmnsWõ¬sõ @µ³j…gRi„sVLi¿RÁÉجsNTP ÌÁÖÁ»y®µ…[„s »R½ƒ«s ˳ÏÁLRiòª«sLiNRP ¿RÁW¿RÁVÈÁ µy*LS®ƒs[ gRiâßá[aRPV¬s xqsXztísQLiÀÁLiµj…, gRiâßá[aRPV¬s xqs¥¦¦¦¸R…VLi»][ @xqsVLRiVÌÁ ¸R…VLiú»yÌÁ¹¸…VVNRPä AÈÁLiNRP úxms˳تy¬sõ ®µ…[„s »R½Vƒy»R½Vƒ«sNRPÌÁV gS„sLiÀÁ ÇÁ¸R…W¬sõ ryµ³j…LiÀÁLiµj…. NRPƒ«sVNRP ª«sVƒ«sLi „sxmnsWõÖÁõ FyLRiúµ][ÖÁ ª«sVƒ«s úxms¸R…V»yõÖÁõ ÇÁ¸R…VúxmsµR…Li ¿Á[xqsVN][ª«sÉجsNTP „sƒy¸R…VNRPV¬s ALSµ³j…Li¿RÁÈÁLi FsLi»R½ ª«sVVÅÁù®ªsW @LiµR…LRiLi úgRiz¤¦¦¦Li¿yÖÁ.

ప్రణవస్వరూపునిగా వినాయకుని ఆరాధిస్తే అత్యధికంగా సత్ఫలితాల్ని సాధించుకోవచ్చు. నేను చెప్పబోయే కథ పైవిషయాల్ని ప్రస్ఫుటం చేస్తుంది. ఒకానొకప్పుడు తమిళ కవయిత్రి అవ్వయ్యార్‌ వినాయకపూజ చేస్తున్నది. ఆ సమయంలో సుందరమూర్తినయనార్‌, చేరమన్‌పెరుమాల్‌ అనే ఇద్దరు మహాత్ములు, మొదటి ఆయన గజంపైన, రెండవ ఆయన తురగం మీద స్వారీ చేస్తూ కైలాసయాత్రకు పోతూ అవ్వయ్యార్‌ను కూడ తమతో రమ్మన్నారు. కాని ఆమె తాను వినాయకుని పూజను వదలుట కిష్టపడక వారి ఆహ్వానాన్ని నిరాకరించింది. పూజను యధావిధిగా నిర్వర్తించి ముగించిన తర్వాత కైలాసం ఎలా చేరగలనా యని మధన పడసాగింది. వినాయకుడు తన భక్తురాలిని తన తొండంపై ఎత్తికొని ఇతర యాత్రికులు ఎవరూ చేరకమునుపే ఆమెను కైలాసం చేర్చాడు. కనుక వినాయకుని ఆరాధించి ఆయన కృపకు పాత్రులమైతే మనం సాధించలేనిది ఏదీ వుండదు.

మనం ఏదైనా కష్టాన్ని ఎదుర్కొన్నప్పుడు దుఃఖంతో బాధపడితే ప్రయోజనం వుండదు. మన బుద్ధిబలాన్ని వినియోగించి ఆటంకాల్ని తొలగించినప్పుడే మన శక్తిసామర్థ్యాలు రుజువౌతాయి. నిజంగా విఘ్నాలే జీవితాన్ని రసవత్తరం చేస్తాయి. మనలో నిబిడీకృతమైయున్న సామర్థ్యాన్ని వెలికి దీయుటకు అవి ఒక సవాలును మనముందుంచుతాయి. మనకు దేవుడు వివేకాన్ని లేక బుద్ధిని ప్రసాదించాడు. వాటిని ఉపయోగించి విఘ్నాల్ని అధిగమించాలి. ఏ పనిని ప్రారంభించినా వినాయకుని ఆరాధిస్తాం. ఆయన మనకు ప్రాప్తించే విఘ్నాల్ని తొలగించుకోటానికి కావలసిన బలాన్ని సమకూరుస్తాడు. ఆయన కృపతో మనం ఆటంకాల్ని త్రోసిరాజని మనకార్యాల్ని సఫలీకృతం చేసుకుంటాం.

వినాయకుని ఆలయంలో ప్రజలు 'దోర్భికర్ణం' అనే ప్రక్రియను చేయటం చూస్తాం. దోర్భి అనగా నాల్గు చేతులు, కర్ణం అంటే చెవులు. దోర్భికర్ణం అంటే చేతులతో చెవులను పట్టుకొనుట అని అర్థం. కుడిచేత్తో ఎడమ చెవిని, ఎడమచేత్తో కుడి చెవిని పట్టుకొని కూర్చొని, లేచి గుంజీలు మాదిరిగా వినాయకుని ఆలయంలో ప్రజలు చేస్తారు. ఇలా చేయటాన్ని గురించిన ఒక ఆసక్తికరమైన వృత్తాంతముంది.

విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని వినాయకుడొకసారి తీసికొని వెళ్లి మింగేసినట్లు చెప్తారు. ఆ చక్రాన్ని తిరిగి పొందటానికి విష్ణుమూర్తికి సులభసాధ్యం కాలేదు. వినాయకుడు ఒక చిన్న బిడ్డమాత్రమే కనుక చక్రాన్ని తిరిగి ఇమ్మని అతన్ని నిర్బంధించటం కష్టం. అప్పుడు విష్ణుమూర్తి ఒక ఉపాయాన్ని పన్నాడు. ఆయన తననాల్గు హస్తాలతో తనచెవులను పట్టుకొని పలుమార్లు కూర్చోటం, నుంచోటం, నృత్యం చేయటం ఆరంభించాడు. వినాయకున కాదృశ్యం వింతగా తోచి నవ్వుఆపుకోలేక విపరీతంగా నవ్వటం ప్రారంభించాడు. అప్పుడా చక్రం ఆయన నోటినుండి బయటపడగా విష్ణువు సంతోషంతో తీసుకున్నాడు.

కనుక వినాయకుణ్ణి సంతుష్ఠుణ్ణి చేస్తే మనం సాధించలేనిది ఏదీ వుండదు. పోయిన వస్తువుల్ని కూడ ఆయన కృపతో తిరిగిపొందుతాం.

ఆ విధంగా అనాదినుండి భగవానుడు వినాయకుని రూపంలో ఆయన కృపాకటాక్షాల్ని మనకు ప్రసాదిస్తున్నాడు. మనం ఏ పని ఆరంభించినా ముందు వినాయకుని పూజించిన తర్వాతే మిగతా దేవతల్ని ఆరాధిస్తాం. వైష్ణవాలయంలో కూడ గజముఖము, తొండము కల్గిన విష్వక్సేసుని-విగ్రహం వుంటుంది. దానికే ముందు మన పూజల్ని సమర్పిస్తాం. వినాయకుడే పరమాత్మస్వరూపుడు గనుక ఆయన్ని ఆరాధించి ఆయన్ని ప్రసన్నుని చేసికుంటే మిగతా దేవతల నారాధించే ఆవశ్యకత లేదు. ఆ విధంగా గాణపత్యారాధన విధానం గణశుని మాత్రమే ఆరాధించే మోక్షప్రాప్తి పొందవచ్చని ప్రతిపాదింస్తుంది. మహారాష్ట్రలో గణశ ఆరాధన చాల ప్రాముఖ్యమైంది. మహారాష్ట్రలో మోర్‌గాన్‌ అనే ప్రదేశంలో గణశుడు నెమలి వాహనుడై మనకు దర్శనమిస్తాడు. భగవంతునకు అసలు ఏ వాహనంతోనూ పనిలేదు. ఐనా ఒక ప్రాణికి గౌరవాన్ని ప్రసాదించుటం కోసం దాన్ని తన వాహనంగా స్వీకరిస్తాడు.

కనుక మనమందరం విఘ్నేశ్వరుని ప్రార్థించి ఆయన కరుణా వీక్షణాలతో మనకు తటస్థించే విఘ్నాల్ని బాపుకొని మన మొనరించే సత్కర్మల్లో విజయాన్ని సాధిద్దాం.

Sri Jayendravani    Chapters    Last Page