Sri Jayendravani    Chapters    Last Page

10. మానవసృష్టి-విశ్వమానవ సౌభ్రాతృత్వం

మహర్షి తిరువల్లువార్‌ ఒక గొప్ప తమిళకవి, ఋషితుల్యుడు. తమిళ##వేదంగా పరిగణింప బడుతున్న 'తిరుక్కురల్‌' అనే మహాకావ్యంలో ఆయన తమ మొదటి పద్యంలో ఇలా అన్నారు.

(దాని భావం) : మొత్తం ప్రపంచ సృష్టికి భగవానుడే మూలకారణం. ఆంగ్ల వర్ణమాల 'A' అనే అక్షరంతో ఆరంభ##మైనట్లు విశ్వసృష్టి సమస్తమూ ఆద్యుడైన భగవానునితో మొదలైంది. సర్వసృష్టికి మూలకారణం ఆయనే. మనమందరం ఆయన వంశీయులమే. ఆయన సంతతికి చెందినవారమే.

వృత్తి కారణంగా కాని, లేక వ్యాపార నిమిత్తంగా గాని లేక పిల్లల విద్య కొరకుగాని మనలో చాలమంది వేరే ప్రదేశాల్లోను, ఇతర దేశాల్లోను నివసించాల్సిన స్థితికి చేరుతున్నాం. మనం ఎక్కడున్నా అందరం ఆయన సంతతి వారమేనని మరువకూడదు. అందరి ఎడల సోదర భావాన్ని ప్రదర్శిస్తూ పరమాత్ముని మరువకుండా జీవించాలి. భగవానుని ఆజ్ఞలను శిరసా వహిస్తూ మన జీవితం గడుపుకోవాలి. ఆయన ఉపదేశాల్ని నిత్యం మననం చేసుకోవాలి.

మనం ఎక్కడ జీవించినా, ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో వున్నా పరమాత్ముని సంతానమే. ఈ సృష్టికంతకు కారణభూతుడైన ఈశ్వరుడొక్కడే. మనతో సహజీవనం చేసే వారందరూ దేవుని బిడ్డలే. మన దేశవాసులందరమూ, భారతదేశ ప్రధాన నగరమైన ఢిల్లీవాసులతో సహా, భారతీయులమనే భావన కల్గి వుండాలి. అదే విధంగా మనం ప్రపంచంలో ఏ దేశంలో వున్నా, ఏ భాష మాట్లాడినా, ఏ మతాన్ని అనుసరించినా భగవానుని బిడ్డలమని మరొకసారి గుర్తుచేస్తున్నా, మన మతాన్ని ధర్మాన్ని అనుసరిస్తూ సర్వమానవ సౌభ్రాత్రుత్వంతో, అందరియెడ ప్రేమను వెదజల్లుతూ ప్రవర్తిస్తే ఈశ్వరుని కరుణా కటాక్షాలకు పాత్రులమై మనం ధన్యమైన సుఖమయ జీవితాన్ని గడప గలుగుతాం.

Sri Jayendravani    Chapters    Last Page