Sruthi Sourabham    Chapters    Last Page

13. ధారణాకళా

ధారణా కాచన కళా. పురా భారత దేశే రేజుర్జీవద్గ చ్ఛద్గ్రన్థాలయా ఇతి శ్రూయతే. అనేక శాస్త్ర విద్వాంసో బహవ ఆసన్నితి తద్వాక్య తాత్పర్యమ్‌. అనేక శాస్త్ర ధారణం న సామాన్య విషయః. 'కష్టం శాస్త్రమ్‌; దురవ గాహమిత్యర్థః ఇతి భట్టోజీ దీక్షిత వచనమ్‌. అనేక శాస్త్ర ధారణం కథం వా సంగచ్ఛతే? కేన మార్గేణ ప్రాచీన భారతీయాః తాదృశ ధారణాశక్తిం సమ్పాదితవన్త ఇతి విషయః పరిశీలనీయః. తత్పరిశీలనాయ వేదవేదాఙ్గ పఠన పద్ధతయః పరిశోధితవ్యా భ##వేయుః

అపిచ, విదిత మే వైత ద్విదుషాం కేచన వేద పండితాః కుర్వన్తి స్వరాక్షరావధాన మితి. వేద విభాగ విజ్ఞాన మత్యావశ్యకం భవతి స్వరాక్ష రావధాన రహస్య జ్ఞానాయ. జ్ఞాతే తస్మిన్‌ వేదధారణ కళా సువ్యక్తా జాయతే

శ్రీకృష్ణయజుర్వేదే విద్యన్తే విభాగాః సంహితా, బ్రాహ్మణమ్‌, ఆరణ్యకమ్‌, ఉపనిషద్‌, ఇతి, తత్ర సంహితాయాం సన్తి సప్త అష్టకాని; బ్రాహ్మణాదిషు తావత్‌ చత్వారి; ప్రత్యష్టకం విద్యన్తే ప్రశ్ననామక విభాగాః. ఆహత్యద్వ్యశీతి ప్రశ్నాః సంతి కృష్ణ యజుర్వేదే. ప్రశ్న ఏవ ఆంధ్ర భాషాయాం పన్న మిత్యుచ్యతే. ప్రతి ప్రశ్నం కేచన అధ్యాయాః, ప్రత్యధ్యాయం పఙ్చాశన్నామక భాగాశ్చ వర్తన్తే. పఙ్చాశత్పదాని ప్రతి పఙ్చాశతి సామాన్య తయా విద్యన్తే. ప్రాకృతే పణ్ణాసా ఇతి తెలుగు భాషాయాం పనస ఇతిచ పఞ్చాశతమేవ వ్యవహరన్తి.

బ్రాహ్మణారణ్యకోపనిషదః తావత్‌ వాక్య రూపేణ వర్తన్తే. తత్ర ఉత్సర్గతయాదశ వాక్యైర్జాయతే పఞ్చాశత్‌. ఉక్తా కృష్ణ యజుర్వేద విభాగాః, ఉచ్యతే అక్షర స్వరావధాన పద్ధతిః యస్మిన్‌ కస్మిన్నప్యష్టకే నిర్దిష్ట ప్రశ్నే, నిర్దిష్టాధ్యాయే, నిర్దిష్టే పఞ్చాశతి, నిర్దిష్ట మక్షరం కిమితి? తద్వర్ణ స్వరః ఉదాత్తానుదాత్త స్వరితేషు కఇతిచ ప్రశ్నస్వరూపః, కృతే ప్రశ్నే సమాధీయతే శీఘ్రమేవ వేదావధానిభిః.

కథమే తత్సంభవతీతి? ఉచ్యతే. వేదే తావత్‌ వర్తన్తే అధ్యాయ సూచికాః, పదసూచికాశ్చ, పఞ్చాశత్సూచికాశ్చ.

ప్రతి ప్రశ్నం అధ్యాయాది గత పదైః కృతాః అధ్యాయా సూచికాః. ప్రతి ప్రశ్నే స్థితాన్‌ పఞ్చాశతః విభజ్య దశకరూపేణ, తద్దశకాదిమ పదైః దశక సూచికాః నిబద్ధాః. యత్ర మన్త్ర సాదృశ్యాత్‌ మన్త్రాన్తర ప్రవేశ రూపభ్రమో భ##వేత్‌ తత్ర తన్నివృత్యర్థం ముఖ్య పద సూచికాశ్చ నివేశితాః. ఏతా సూచికా ఆంధ్ర భాషాయాం 'చిట్టలు' ఇతివ్యవహ్రియన్తే.

ప్రత్యధ్యాయం తత్ర స్థిత పఞ్చాశదన్త పదైః యా స్సూచికాః గ్రథితా, స్తా స్త్రిలింగ భాషాయాం 'అక్కములు' ఇతి వ్యవహ్రియన్తే. ప్రతి పఞ్చాశతం ఉత్సర్గతయా పఞ్చాశత్పదాని వర్తన్తే. అధ్యాయాన్త పఞ్చాశతితు తాని న్యూనాధిక్యేన విద్యన్తే. పఞ్చాశదన్త పదైః కృతా సూచికా యథా వర్తతే :-

శ్రీకృష్ణ యజుస్సంహితాయాం నమక నామకే ప్రశ్నే ప్రథమాధ్యాయే ''హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్‌ం శతిశ్చ'' ఇతి సూచికా అస్తి. హస్తే, దిక్షు, ఇషవః ఇతి పదాని ప్రథమాధ్యాయ గత పఞ్చాశదన్త్య పదాని. అన్త్య పఞ్చాశతి సన్తి ద్విసప్తతి పదాని. పఞ్చాశత్తమ పదముభాభ్యామితి. శిష్టాని పదాని ద్వావిగ్‌ం శతిః. ఏతైః పదైః కృతా పూర్వోదాహృతా అక్కమితి పదసూచికా.

ఇత్థమధ్యాయ సూచికయా అధ్యాయాః దశక సూచికయా దశకాని, పఞ్చాశ త్సూచికయా పఞ్చాశతశ్చ శీఘ్రం జ్ఞాతుం వక్తు ఞ్చావకాశో వర్తతే.

అర్థరహితా అప్యే తత్సూచికాః వినా పుస్తకం, సమ్యగ్వేద పఠనం కర్తుం సహకారం కుర్వన్తి. కింతు కణ్ఠస్థిత వేద భాగ ధారణాయైవ ఏతే ఉపయుజ్యన్తే. ఏతాదృశ సూచికా సహాయేన వేదే అక్షరావధానం, స్వరావధానఞ్చ కర్తుం శక్యతే.

పదాది సూచికా పద్ధతిరేషా పాణినీయ వ్యాకరణపి దృశ్యతే. తత్ర ప్రతి వింశతి సూత్రాణి విభజ్య, సూత్ర సూచికాః కృతాః.

ఉక్తా ధారణోపయుక్తా ఏకా పద్ధతిః. అన్యా వక్ష్యతే.

వేదాధ్యయన పద్ధతి రిత్థం వర్తతే; గురుః శిష్యేభ్యో ఏకం పద సముదాయం వదతి. తతః. శిష్యాః ద్వివారం ఉచ్చరన్తి. ఏవం సర్వం ప్రశ్నమపి గురు ముఖతః శ్రుత్వా శిష్యాః విద్యాం గ్రహీష్యన్తి. ఏషా సంధా పద్ధతిః. ఇత్థం దశదినాని గచ్ఛన్తి. తతః శిష్యాః పఞ్చాశతం దశవారం పఠన్తి. ఇత్థం సర్వమపి ప్రశ్నం దశవారం దశదినేషు అధీయతే (ఏతాం పద్ధతిం ఆంధ్ర భాషాయాం 'పల్లె' ఇతి వదన్తి) తతః రాత్ర్యాం ఏకవారం వా ద్వివారం వా తత్ర్పశ్నం శిష్యాః దశదినేషు వదన్తి. ఏతాంరీతిం ఏకరువు ఇతి ఆంధ్ర భాషాయాం వదన్తి.

మనుష్యః నూతన విషయం మనసి ప్రవేశయితుం అతీవ శ్రమం ప్రాప్నోతి. అర్థ జ్ఞాన రహిత విషయ మధీతు మత్యధిక శ్రమో భ##వేత్‌.

పూర్వోక్త వేద పఠన మార్గే గురుణా ఉక్తత్వాత్‌ నూతనోపి విషయః, సులభ పఠన యోగ్యః పరిచితశ్చ భవిష్యతి. తేన విద్యార్థినః శ్రమః అపగచ్ఛతి.

ఏకమన్త్రస్య ఏకస్మిన్‌ కాలే కంఠస్థీకరణ శ్రమో భవిష్యతి. అపిచ అద్య తత్పాఠః ఆగతోపిశ్వః విస్మృతో భవిష్యతి. దశ దినాని పునః పునః పఠనే శ్రమ రాహిత్యం, సౌలభ్యేన పాఠాగమశ్చ భవిష్యతి.

ఏక వార పఠన పద్ధత్వా ప్రతిదినం పఠితం కానిచన సంవత్సరాణి నవిస్మృతం భవతి.

అద్యాపి విద్యా ప్రణాళికాయాం విద్యార్థిభ్యః ప్రథమతః విషయ పరిచయం కృత్వా, తతః కాలాన్తరే తద్విషయ దార్ధ్యం కారయిత్వా, తతః తదా తదా తద్విషయా వృత్తిం కారయన్తి యది విద్యార్థినః ధారణా పటవో భ##వేయుః.

అద్య విద్యార్థినస్తు పఠితాన్‌ పుస్తకాన్‌ సంవత్సరాన్తే విక్రీయ, లబ్ధాం విద్యాం విస్మరన్తి, విద్యాభ్యాసానన్తరం కించిత్‌ కాలం యది నిరుద్యోగినో భవిష్యన్తి తర్హి పఠితం సర్వ విషయ మపి విస్మరిష్యన్తి. తస్మాత్‌ విద్యార్థినః పూర్వోక్త పఠన మార్గాన్‌ మనసి నిధాయ ప్రయతిష్యన్తి యది అధిక విషయాన్‌ ధారయితుం సమర్థా భవిష్యన్తి.

వేదే తావత్‌ సంహితా, బ్రాహ్మణమ్‌, ఆరణ్యకమ్‌, ఉపనిషద్‌ ఇతి విభాగా వర్తన్త ఇత్యుక్తం. తత్ర సంహితాం పద విభాగం కృత్వా పదమితి నామ్నా తమపి స్వర సహిత మధీయతే. వేదసంహితాధ్యయనం సులభ##మేవ; సంహతత్వాత్‌. విభక్త పదాధ్యయనం క్లిష్టం భవతి. తత్ర కానిచన పదాని విస్మర్తుం అవకాశో వర్తతే. తస్మాత్‌ పఠనకాలే కరేణ పదగణన మపి క్రియతే. కృతే గణనే కానిచన పదాని యది భ్రమవశాత్‌ త్యజన్తే తర్హి గణనేన లక్ష్యన్తే. బ్రాహ్మణాధ్యయనేపి వాక్యగణనం కుర్వన్తి. తత్ర ''పనస'' నామకే విభాగే దశ వాక్యాన్తి విద్యన్తే ఖలు.

ఏతద్రీత్యా అద్య విద్యార్థినా ఇంద్రియ ద్వయేన విషయ గ్రహణం యది క్రియతే సుష్ఠు ధారణం భవిష్యతి. శ్రుణ్వన్‌ లేఖనం, పఠన్‌ లేఖనం ధారణాయసహ కురుతః

వేదాన్త శాస్త్రే శ్రవణ మనన నిదిధ్యాసనానాం అతీవ ప్రాధాన్యం వర్తతే. యది లౌకికా ధ్యయనేపి శ్రవణాదీని వినియుజ్యన్తే తర్హి విషయ ధారణం సుష్ఠు భ##వేత్‌.

పఠనతః శ్రవణం శ్రమ రాహిత్యేన విషయగ్రహణాయోపయజ్యతే. శ్రుతస్య విషయస్య యుక్తిభిరను చిన్తనం మననం భవతి. మననాత్‌ నిశ్చితస్య విషయసారస్య పునః పునః స్మరణం నిదిధ్యాసన స్థానీయం భవతి. ఏవం గృహీతః విషయః సుదీర్ఘ కాలం మనసి ధృతో భ##వేత్‌.

విషయ ధారణ ఛందః అపి సహకరోతి. ప్రాచీనాః శాస్త్ర విషయానపి అనుష్టుబాది సులభ చ్ఛందసి నిబద్ధ్య కంఠస్థం అకుర్వన్‌. ఋచః ఛందోయుతా ఏవ. గీతియుక్తా ఋక్‌ సామేత్యుచ్యతే. యజుః గద్యాత్మక మపి తస్మిన్‌ స్థితా స్వరాః విషయధారణాయ సహకుర్వన్తి. శిక్షా జ్యోతిషాది వేదాఙ్గాని ఛందసి నిబద్ధాన్యేవ.

పూర్వోక్తా వేదే స్థితాః పదాది సూచికాః అర్థ రహిత సూత్రాణీతి వక్తుం శక్యతే. అర్థ సహిత సూత్రాణి విషయధారణా యాతీవ ఉపయుజ్యన్తే. భగవతః శ్రీకృష్ణద్వైపాయనమునే ర్బ్రహ్మసూత్రాణి, పాణిని కణాద గౌతమ పతఞ్జల్యాపస్తంబాది ముని కృతాని వ్యాకరణ వైశేషిక నైయాయిక యోగధర్మ శాస్త్రాదీని సూత్రేష్వేవ నిబద్ధాని.

పురా గురుః శిష్యేభ్యః శాస్త్రవిషయాన్‌ శ్రావయిత్వా తద్విషయ ధారణ సౌలభ్యార్థం తద్విషయసారం సూత్రరూపేణ సంగ్రథ్య తత్సూత్రం శిషై#్యః కంఠస్థ మకారయత్‌. తత్సూత్ర స్మరణ మాత్రేణ గురుణా బోధితాన్‌ విషయాన్‌ స్మృత్వా శిష్యః స్వశిష్యేభ్యో అధ్యాపనం అకరోత్‌. గతే దీర్ఘకాలే పరం పరయా ప్రాప్త సూత్ర వివరణం శిష్యాః విసస్మరుః. తద్దృష్ట్వా మేధావినః, భాష్యాణి, వ్యాఖ్యానానిచాలిఖన్‌. అనంతరకాలే సూత్రకారాః స్వయమేవ వ్యాఖ్యామప్య లిఖన్‌. తత్ర భవతా భట్టవామనేన కావ్యాలఙ్కార సూత్రాణి వృత్తిసహితాని కృతాని ఖలు. ఆంధ్రభాషాయాం బాలవ్యాకరణ మేతాదృశ మేవ.

ఇతిహాస పురాణష్వపి ''సమాస వ్యాస భేదతః'' ఇతి అనుసృతాః సంగ్రహ విస్తర బోధన రీతయః. అత్ర సమాస పద్ధతిః సూత్ర స్థానీయా; వ్యాస పద్ధతిః వ్యాఖ్యా స్థానీయాచ. ఇతిహాస పురాణానువాద కర్తారః పునరుక్తి రితి మత్వా సమాస పద్ధతిం త్యక్త్వా వ్యాస పద్ధత్వా ఏవ భారతాదీన్‌ అనూదిత వన్తః.

సూత్ర లక్షణ మేవం వర్తతే;

'అల్పాక్షర మసందిగ్ధం సారవ ద్విశ్వతోముఖమ్‌, అస్తోభమనవద్యఞ్చ సూత్రం సూత్రవిదో విదుః' స్తోభోనామ అర్థరహితో వర్ణః.

అద్యాపి పాఠ్య విషయాన్‌ ప్రథమతః వ్యాసరూపేణ బోధయిత్వా తతః సూత్ర రూప బోధన మపి యదికరిష్యన్తి తర్హి విద్యార్థీ విషయ ధారణ నిపుణో భవిష్యతి.

కిఞ్చ పూర్వస్మిన్‌ కాలే అస్మిన్‌ దేశే బభూవు ర్బహవో యోగినః. ''చిత్తవృత్యాః నిరోధో యోగః'' ఇతి భగవతః పతఞ్జలేర్మతమ్‌, శరీరే మూలాధారాది చక్రేషు చిత్త వృత్త్యాః నిరోధోపి ధారణానామ్నా వ్యవహృతః. తత్ర విశుద్ధ నామ్ని కంఠస్థానే ధారణా కృతాయదిమేధా నామికా శ్రుత పఠిత విషయా విస్మరణాదాయినీ శక్తి రత్యధికా భవతీతి సౌందర్యలహరీ వ్యాఖ్యా కారా అవోచన్‌.

పదసూచికాః, ఛందః, కంఠస్థీకరణ విషయేషు, సూత్రాణి శ్రవణాదయశ్చ తదితర విషయేషుచ, ధారణ అతీవోపయుజ్యన్తే ఇతి, పూర్వోక్త వేద పఠన పద్ధతిః యోగ మార్గానిచ, విషయ ధారణాయ సహకుర్వన్తీతిచ సారాంశః.

వ్యాస సారాంశం

ఆ. బ్రహ్మ ధారణంబు పరతత్త్వదం బౌను

విషయ ధారణంబు విజ్ఞుc జేయు

అధిక విషయమణుల నంతరంగంబున

పదిలపఱచుకొనగc బథము లివ్వి.

వేద వేదాంగాలను పఠించే వివిధ పద్ధతులను, ధారణా రీతులను పరిశీలిస్తే అనేక విషయాలను చిరకాలం గుర్తుంచుకొనే మార్గాలు తెలుస్తాయి.

వేదంలో ప్రతి అధ్యాయానికి చివర అక్క ముంటుంది. అధ్యాయాల్లో పనసలుంటాయి. పనసల చివరి పదాలతో అక్కం ఏర్పడుతుంది. ఈ అక్కం చదివితే ఈ పనసకు తరువాతి పనస గుర్తుకు వస్తుంది.

చిట్టలు కూడా వేదంలో ఉన్నాయి. ఇవి మూడు రకాలు. ఒక పన్నంలో ఉండే అధ్యాయాల మొదటి పదాలతో ఏర్పడిన చిట్ట ఒకటి. దీనివల్ల ఒక పన్నంలో ఎన్నో అధ్యాయం ఏదో తెలుస్తుంది : ఆ అధ్యాయం మొదలు సులభంగా తొందరగా గుర్తుకు వస్తుంది. గ్రంథం కంఠస్థ మయిన వారికి మొదలందితే తరువాతి భాగం సులభంగా గుర్తుకు వస్తుంది. ఒక పన్నంలో పదేసి పనసలను ఒక్కొక్క గణంగా చేసి ఆ గణాల మొదటి పదాలతో ఏర్పడే చిట్ట లొక రకం. ఈ చిట్టల వల్ల ఇన్నవ సంఖ్య కలిగిన పనస ఏది అనే ప్రశ్నకు సులభంగా సమాధానం లభిస్తుంది. ఆ పనస ఉన్న గణం మొదలు చిట్ట ద్వారా అందుతుంది కనుక దాన్ని బట్టి మిగిలిన పనసల సంఖ్యను గుర్తించాలి.

కొన్ని పనసల్లో ఒకే రకమయిన వాక్యాలుంటాయి. అలాంటి సందర్భంలో ఒక పనస ప్రారంభిస్తే మరొక పనసలోకి వెళ్ళిపోతుంది. ఇలాంటి వాటిని 'కవలు' అంటారు. పోలిక ఉన్న వాక్యాల మొదటి పదాలను, మిగిలిన వాక్యాలతో కలిసిపోకుండా వాటి ప్రత్యేకతను గుర్తుకు వచ్చేలా వాటి ప్రక్క పదాలను చేర్చి ఏర్పరచిన చిట్టలున్నాయి. ఈ చిట్టల వల్ల కవులు తప్పకుండా పనస సరిగా చెప్పవచ్చు. 'కవలు'కు వాడుక రూపం కవులు. ఈ చిట్టలకు అర్థాలుండవు. ఇవి పదాల పట్టికలు. వేదం దృఢంగా అభ్యాసం చేసినవారు ఈ పట్టికల సహాయంతో అక్షరావధానం, స్వరావధానం గూడా చేయవచ్చు. ఫలాని పన్నంలో ఫలాని పనసలో ఫలాని వర్ణమేమిటి? దానికి స్వర మేమిటి అని అడిగితే చెప్పవచ్చు. కాని దానికి కొంత సాధన చేయాలి.

ఈ పదాల పట్టిక పద్ధతి పాణినీయాష్టాధ్యాయీ సూత్ర పాఠంలోను, సాయణ వేదభాష్యంలో ఉదాహరించిన వినియోగ సఙ్గ్రహంలోను కనబడుతుంది. అష్టాధ్యాయిలో ప్రతి 20 సూత్రాలను ఒక గణంగా విభజించి సూత్ర సూచికలను ఏర్పరచారు. వినియోగ సఙ్గ్రహంలో పదంలో కొంత భాగాన్ని గూడా పట్టికల్లో చేర్చారు. వీటివల్ల యజ్ఞంలో ఏ మంత్రాన్ని ఏ క్రియ దగ్గర వినియోగించాలో తెలుస్తుంది. ఇలాటి పట్టికల ద్వారా ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవచ్చు.

వేదాధ్యయనం చేసే వారు మొదటి 10 రోజులు సంత చెప్పుకుంటారు. అంటే ఒక పదాన్నో కొన్ని పదాల్నో గురువొకసారి స్వరసహితంగా చెప్పితే శిష్యులు దానిని రెండుసార్లు స్వరయుక్తంగా ఉచ్చరిస్తారు. ఇలా సుమారు పదిరోజులు సంతలవుతాయి. దీనిని సంస్కృతంలో 'సంధా' అంటారు. ఋగ్వేదం సంతలలో శిష్యుడు మూడుసార్లు ఉచ్చరించాలి.

తరువాత ప్రతి పనస పదేసి సార్లు చదువుతారు. దీనిని వల్లె అంటారు. అప్పటికి స్వరయుక్తంగా, అక్షర దోషాలు లేకుండా మంత్రాలు నోటికి వచ్చేస్తాయి. తరువాత 10 రోజులు ఒక్కొక్క పనస రెండేసిసార్లు చెబుతారు. దీనిని 'ఏక రువ్వు' చెప్పడ మంటారు. ఇలా సుమారు ముప్పయి రోజులలో శ్రమ లేకుండా విద్యార్థి కంఠస్థం చేయగలుగుతున్నాడు.

'ఏకరువ్వు' అనే పదంలో 'ఏక' అనే పదం ఒకసారి ఆవృత్తి చెప్పడాన్ని సూచిస్తోంది. కాని వాడుకలో 'ఏకరువ్వు' అనే పదం ఒక్కొక్కపనసను రెండు సార్లు ఆవృత్తి చేయడాన్ని సూచిస్తోంది.

సులభంగా కొత్త విషయాన్ని కంఠస్థం చేయడానికి, అర్థం తెలియకుండా మూలం కంఠస్థం చేయడానికి సంత, వల్లె, ఏకరువ్యు అనే పద్ధతులు బాగా ఉపయోగ పడుతున్నాయి. ఒక మంత్రం ఒకేసారి కంఠస్థం చేయడం శ్రమ. ఇపుడు వచ్చినా తరువాత మరల మరచిపోతారు. కాని సక్రమంగా సంతవల్లె ఏకరువ్వు చేసిన పన్నాలు కొన్ని సంవత్సరాల వరకు మరల ఉచ్చరించక పోయినా గుర్తుండి పోతాయి.

వేద సంహితను పద విభాగం చేసి స్వర సహితంగా అధ్యయనం చేస్తారు. ప్రతి పనసకు 50 పదాలుంటాయి. వీటిని వేళ్ళతో లెక్కపెడుతూ అధ్యయనం చేస్తారు. దీని వల్ల మనస్సు బాగా లగ్నమవుతుంది. ఒకవేళ పనసలో తప్పు వస్తే తెలిసిపోతుంది. దీనివల్ల రెండింద్రియాలను ఒక విషయంపై లగ్నం చేసి అధ్యయనం చేయడం ఎక్కువ ప్రయోజనకరమని గ్రహించవచ్చు.

వేదాన్త శాస్త్రంలో శ్రవణ, మనన నిదిధ్యాసనాలకు చాలా ప్రాధాన్యం ఉంది. లౌకిక విషయాలనధ్యయనం చేసే సమయంలో గూడా వీటిని పాటిస్తే చదివిన విషయం బాగా గుర్తుంటుంది. చదవడం కంటే వినడం సులభం. దీనినే శ్రవణ మంటారు. విన్న విషయాన్ని యుక్తులతో అనుచింతనం చేయడం మననం. మననం వల్ల దృఢపడిన విషయాన్ని మరల మరల స్మరించడం నిది ధ్యాసనం. ఇలా గ్రహించిన విషయం చిరకాలం గుర్తుంటుంది.

విషయాన్ని గుర్తుంచుకోవడానికి ఛందస్సుతోడ్పడుతుంది. ప్రాచీన సంస్కృత సారస్వతంలో ఎక్కువ భాగం ఛందస్సులోనే ఉంది. లోగడ పేర్కొన్న అక్కాలకు, చిట్టలకు అర్థాలుండవు. అర్థవంతమయిన సూత్రాలు గూడా ఎక్కువ విషయాన్ని గుర్తుంచుకోవడానికి సహకరిస్తాయి. వ్యాస భగవానుడి బ్రహ్మసూత్రాలు, పాణిని, కణాదుడు, గౌతముడు, పతంజలి, ఆపస్తంబ మున్యాదులు వ్రాసిన గ్రంథాలు సూత్ర రూపంతోనే ఉన్నాయి.

పూర్వం గురువులు శిష్యులకు శాస్త్ర విషయాలను వినిపించి ఆ విషయాలను సులభంగా గుర్తుంచుకోవడానికి సూత్ర రూపంలో వ్రాసి, ఆ సూత్రాలను కంఠస్థం చేయించేవారు. శిష్యులకు ఆ సూత్రం గుర్తుంటే చాలు గురువు చెప్పిన విషయమంతా గుర్తుకు వచ్చేది. వారు తమ శిష్యులకు సూత్రాలను చెప్పి వివరించేవారు. చాలా కాలం గడచిన తరువాత గురువులు చెప్పిన వివరణం శిష్యులు మరచిపోతూంటే మేధావులు భాష్యాలు, వ్యాఖ్యానాలు వ్రాసి ఆ విజ్ఞానాన్ని నిలబెట్టారు. తరువాతి కాలంలో సూత్రాలు వ్రాసినవారే వ్యాఖ్యానాలు గూడా వ్రాసి తమ భావం వెల్లడించారు.

ఇతిహాస పురాణాల్లో సమాస, వ్యాస భేదంతో బోధించే పద్ధతి ఉంది. తాను విస్తరించదలచిన విషయం మాత్రం వివరించి, మిగిలిన విషయాలను సంగ్రహంగా చెప్పడమీ విధానంలో ఉంది. దీనిలో సమాసంగా చెప్పడం సూత్రం వంటిది. వ్యాస పద్ధతి భాష్యం వంటిది.

శరీరంలో మూలాధారాది చక్రాల్లో యోగులు చిత్త వృత్తిని నిరోధిస్తూంటారు. కంఠం దగ్గర ధారణ చేస్తే 'మేధ'అనే శక్తి కలుగుతుంది. అది విన్న విషయాన్ని మరచిపోకుండా చేస్తుంది.

ఇలా ప్రాచీన గ్రంథాల పర్యాలోచన వల్ల మరెన్నో ధారణా మార్గాలు గోచరిస్తాయి.

Sruthi Sourabham    Chapters    Last Page