Sri Matrukachakra viveka    Chapters   

అథ స్వప్న వివేకః తృతీయః

విశ్వస్య కారణదశేతి విచారితైవం

కార్యక్రమో భవతి కార్యమిదం విమర్శాత్‌ |

విశ్రాంతమాత్మని పరాహ్వయవాచి సుప్తౌ

విశ్వం వమత్యధ విబోధపదే విమర్శః || 1

టీక :- ఇతి=ఈవిధమున, విశ్వస్య=ప్రపంచముయొక్క కారణదశా=కారణదశ, నిరూపితా=నిరూపించబడినది. ఏవం=ఈ ప్రకారముగా, కార్యక్రమః=కార్యక్రమము, భవతి=అగుచున్నది. ఇదం=ఈ, కార్యం=కార్యము, విమర్శాత్‌=విమర్శనుంచి, భవతి=అగుచున్నది, విమర్శః=విమర్శ, సుప్తౌ=సుషుప్తి కాలమందు, పరాహ్వయవాచి=పరావాక్‌ అనుపేరుగల, ఆత్మని=స్వాకారమందు, విశ్రాంతం=లీనమైన, విశ్వం=ప్రపంచమును. అథ=సుషుప్తి అనంతరము విబోధపదే=ఉత్థానదశయందు, వమతి=వెలుపలికి వదలి పెట్టును.

స్కంధాతరమును ప్రారంభించదలచితిమి. పూర్వోత్తర ముల సంబంధదర్శనము కొరకు పూర్వస్కంధతాత్పరయకధన పూర్వకముగా ఉత్తరస్కంధప్రమేయమును ప్రస్తావించినారు. ఉక్తప్రకారముగా విశ్రాంతి సంసారరూపమచేత కారణ కార్యరూపమైన విశ్వముయొక్క కారణదశ. ఈ విశ్రాంతి రూపావస్థనిరూపించబడినది. విశ్రాంతిరూపమైన సుషుప్తి, కారణరూపమగు విశ్వము. సంసారరూపములైన స్వప్నాదులు కార్యరూపమగు విశ్వమని భావము. ఏ ప్రకారముగా కారణ క్రమమో ఆ ప్రకారముగనే కార్యక్రమము కలదు. కారణ కార్యములు ఏకరూపమగుటవలన ప్రమేయాది కక్ష్యాత్రయ సంపన్నత్వ జడాజడ వ్యాప్త్యాదికముతో నున్నది కారణ క్రమము. ఈ ప్రకారముగనే కార్యక్రమము కూడ కలదు. ఈ కార్యరూపమైన విశ్వము విమర్శనుంచి అగుచున్నది. ఇది ఇటువంటిది అని అనుసంధానము మూలముగా కిగిన భావి వికల్పరూపకార్యము విశ్వము. అనుసంధానరూపము విమర్శ. అందువలన కార్యరూపమగు విశ్వమునకు విమర్శ మూలత్వమున్నది. ఈ విమర్శ సుషుప్తి యను విశ్రాంతి యందు ఏ రూపముగా నున్నదనగా - విమర్శ సుషుప్తి కాల మందు తన ఆకారమైన పరా అనుపేరుగల వాక్కు యందు (పరావాగ్రూపమందు) విశ్రాంతమైన విశ్వమును సుషుప్త్య నంతరము ఉత్ధానదశలో వెలుపలకు వదలిపెట్టును. ఇందుచేత విశ్వమునకు విమర్శగర్భమందే స్థితి ఉపదేశింపబడినది. ఆవిమర్శ విలాసరూపమైనది గనుక విమర్శవిలాసే విశ్వవిలాసః ఆ విశ్వవిలాసమును సుషుప్తి దశయందు పరావాగ్రూపముచేత విశ్రాంతితత్త్వమందు లీనమైన విమర్శలోగలదు. తాను కూడ లీనమైనదై ప్రబోధపదమందు అంతర్బాహ్యేంద్రియాత్మిక ముగా స్ఫుటస్స్వరూపమైన విమశన్‌ యొక్క గర్భమువల బైలుదేరునని భావము.

వాణీ వరా ఖలు ఋకార లుకార రూపా

సంకోచ గంధసహితా గగనే7పి సుప్తౌ |

సంకోచ ఏవ చిదచిద్ఘనఖస్య వాణీ

తద్వ్యోమ సంకుచతి చ ప్రకృతై విమర్శే || 2

టీక :- పరా=పరారూపమైన, వాణీ=వాక్కు, ఋకార లుకారరూపా ఖలు=ఋకార లుకారరూపమైనది గదా, గగ7నేపి=శూన్యరూపమైనప్పటికిని, సుప్తౌ=సుషుప్తియందు, సంకోచగంధసహితా=సంకోచగంధముతో కూడుకొన్నది, చిదచిద్ఘనఖస్య=చిదచిత్సామరస్యరూమగు ఆకాశమునకు, సంకోచ ఏవ=విశ్రాంతికి సంకోచమే, వాణి=వాక్కు,తద్వ్యోమ=ఆ విశ్రాంతిగగనము, విమర్శే=విమర్శ ప్రకృతౌ=స్వభావమమగుచుండగా, సంకుచతిచ=సంకోచమును పొందును.

విమర్శ పరావాగ్రూపముచేత సుషుప్తి విశ్రాంతి యందు ఉండునని చెప్పబడినది. ప్రమేయ, ప్రమాణ, ప్రమాతృరూపమై అకారాది ఊకారాంత విశ్రాంతి పదమందు పరావాక్కుకు స్థానమేది? స్వభావమేమి? అనగా చెప్పుచున్నారు. పరావాక్కుఋకార లుకార రూపము గదా. ఇందుచే పరావాగ్రూపమైన విమర్శకు ప్రమాణత్వముచెప్పబడినది. ఉత్థానపదముల యందు, విమర్శ ప్రమాణ రూపమని తెలుసుకొనవలెను. ప్రమాణరూపమైన ఇంద్రియ ములు అనుసంధానరూపమగును. అనుసంధానము విమర్శ రూపమువలన పర్యవసితమగును. ఇంద్రియములే విమర్శ యొక్క స్వరూపమని భావము. ఋకార లుకారాత్మకమై ప్రమాణమగు పరావాక్తత్వమే విమర్శరూపమనుటలో మరి యొక ఉపపత్తి గలదు. శూన్యరూపమైనప్పటికిని పూర్ణ స్వభావమైన సుషుప్తి యందు ఋకార లుకారములు సంకోచ గంధముతో కూడుకొన్నవి. అకార, ఇకార, ఉకారా పేక్షయా సంకోచభావము వ్యంజనవర్ణములయందు వలెనే స్థ్యౌల్యాను భవమువలన సంకుచితమగు చున్నవి. పరావాక్కు ఐన విమర్శకు సంకోచభావమైనచో సంకోచభావముతో కూడ కున్న ఋకార లుకారాత్మక ప్రమాణత్వము ఉపపత్తి గానే కలదు. పరావాక్కు ఐన విమర్శకు సంకోచభావమును ఉపపాదించుచున్నాము. చిదచిత్సామరస్వరూపగగనమునకు విశ్రాంతి సంకోచమే. నిర్విమర్శదశ ఐన విశ్రాంతియందు స్వభావము పూర్ణముగా అనుభవించబడును. ఆ స్వభావమే ఎపుడు అనుసంధానభూమికను పరిగ్రహించునో, అపుడు గ్రాహ్య గ్రాహకోభయావభాసాత్మక మగు విమర్శరూప ముగా సంకోచించును, గగనమునకు శబ్దాకారముగా సంకోచము గదా? విశ్రాంతి రూపమైన గగనమునకు శబ్దరూప విమర్శాత్మకముగా సంకోచ భావముడలదని స్పష్టమగు చున్నది. ఐతే పూర్ణముగా నున్న ఆ విశ్రాంతి గగనము ఏహేతవువువలన విమర్శాకారముగా సంకోచభావమును పొందుచున్నది? ఆ విశ్రాంతి గగనము విమర్శ, స్వభావమును పొందుచుండగా సంకోచించును. విమర్శాత్మనా సంకోచ భావ పరిగ్రహమే విశ్రాంతితత్వమునకు స్వభావము. మరి యొక హేతువు కాదని భావము.

ధర్మే స్వకే స్వరసవాహిని వాక్స్వరూపే

లగ్నం పరం గగనమప్యుపయాతి సత్తాం |

సత్వాయ నిత్య ముపగూఢ విమర్శతత్వం

తద్ధర్మతాం గగన మప్యుపయాతి చిత్రమ్‌ || 3

టీక :- స్వరసవాహిని=స్వతంత్రముగా ప్రవహించు స్వభావము కలిగినది, వాక్స్వరూపే=వాగ్రూపమైనది, స్వకే=తనదైన, ధర్మే=ధర్మమందు, లగ్నంసత్‌=లగ్న మగుచు. పరంగగనమపి=విశ్రాంతితత్త్వముకూడ, సత్తాం=సత్తను, ఉపయాతి=పొందుచున్నది, అతః=అందువలన సత్త్వాయ=సత్తాసిద్ధికొరకు, నిత్యం=నియతముగా, ఉపగూఢ విమర్శతత్త్వం=ఆలింగితమైన, విమర్శతత్వముగల, గగనమపి=విశ్రాంతి గగనము కూడ, తద్ధర్మతాం=ఆవిమర్శకు, ధర్మ త్వమును, ఉపయాతి=పొందుచున్నది, అద్భుతం=చిత్రము.

కార్యరూప జగత్తునకు బీజమైన విమర్శకు కారణ రూపజగత్తునకు బీజత్వమును ప్రతిపాదించుచు మహా తత్త్వమునూ, ఉపపాదించుచున్నాము. ఇతర ప్రేరణలేకనే స్వయముగా ప్రసరించు స్వభావము కలిగినది. ఇతర ప్రేరణ ఉన్నదనినచో ఆ ప్రేరకుని ప్రేరణ సంకల్ప రూపమగు విమర్శ లేకుండా ప్రేరణయొక్క ఉపపత్తి లేదు. అట్టి విమర్శకు విమర్శానంతరము లేక ప్రవహణము లేదను అనవస్థ రాగలదు. విమర్శకు కట్టకడకు స్వరసవాహినీత్వ మును అంగీకరించ తగినది. వాగ్రూపమై స్వీయమైనది. ప్రాక్ప్రతిపాదిత మర్యాదచే ధర్మమైన విమర్శయందు లగ్న మగుచు చిదచిత్సారస్వరూపమైన విశ్రాంతితత్త్వము కూడ సత్తాను పొందుచున్నది. ప్రాగుక్త ప్రక్రియచే విమర్శసీమాను ప్రవేశము లేకపోయినచో విశ్రాంతితత్త్వముయొక్క స్వరూప మునకు సిద్ధిలేదు. అందువలన సత్తాసిద్ధికొరకు నియతముగా ఆలింగనముచేసికొనబడిన విమర్శతత్త్వము కలిగినది. గగనము చిదచిత్సామరస్యరూప విశ్రాంతియను గగనము కూడ ఆ విమర్శకు ధర్మమగుచున్నది. అన్యోన్య ధర్మధర్మి భావము అద్భుతమని తాత్పర్యము. ఈ అర్థమును ఇది వరకు చెప్పినను విమర్శయొక్క సర్వప్రకార జగన్మూలత్వ ప్రవచన ప్రస్తావనలో తిరిగి విమర్శప్రభావమును జ్ఞాపకము చేయుచున్నామని తాత్పర్యము.

తస్మా త్పరైవ జననీ సముపాసనీయా

వ్యోమ్నః పరస్య గతజాడ్య మియం హి రూపం |

బధ్నాతి చేయ మిద మంశ సముచ్ఛ్రయేణ

జంతూ న్విమోచయతి చోన్నమితాహమంశా || 4

టీక :- తస్మాత్‌=అందువలన, జననీ=సర్వమాతృకా రూపమైన, పరైవ=విమర్శశక్తియే, ఉపాసనీయా=ఉపాసన చేయ తగినది, పరస్యవ్యోమ్నః=పరాగగనమునకు, గత జాడ్యం=శంకారహితమైన రూపమును, ఇయం హి=ఈ పరావాక్కే గదా, ఇయం=ఈ విమర్శరూపమగు పరావాక్కే, ఇదమంశసముచ్ఛ్రయేణ=ఇద మంశముయొక్క అతిశయముచేత, జంతూన్‌=జీవులను, బధ్నాతి=బంధించు చున్నది, ఉన్నమితాహమంశా=అహమంశయొక్క అతి శయముకలదై, మోచయతి=ముక్తులను చేయుచున్నది.

సర్వమునకు మూలము గనుక విమర్శతత్త్వమే ఉపాసించతగినది. విశ్రాంతికి మూలము గనుక సర్వమాతృకయగు విమర్శశక్తియే ఉపాసించ తగినది. ఉపాస్యత్వేన సంభావితమైన పరగగనమునకు జాడ్యశంకారహితమైనరూపము ఈపరావాక్కువలన చైతన్యరూప మగుటచే ఉపాస్యమగు పరగగన మునకు చైతన్యకళాస్థానమువచ్చును. అందువలననే అభ్యర్హితమైనది. ఇందుచేత విమర్శకు ప్రకాశై కాత్మ్యము ఉపపాదించబడినది. విమర్శ పరమోపాస్యమని చెప్పుటచే తదాత్మకమైన ప్రమాణతత్త్వమును విశేషముగా ఉపాసించ వలసి నదని తాత్పర్యము. ఈ అర్థమును మహాయంత్రమందు ముందుగా ఉపాసించుటకు యోగ్యమై ప్రముఖస్థానమందు చితురశ్రరూపమగు ప్రమాణచక్రముయొక్క సన్నివేశము నుంచి అభివ్యక్తమగుచున్నది. ఉపాస్యత్వేన అభిమతమైన విమర్శయొక్క ఉపాసనాప్రవృత్తి మూలమగు బంధమోక్షైక కర్తృత్వమును ప్రతిపాదించుచున్నాము. ఈ విమర్శ భేదా భేదరూపము కలది. స్వస్వరూపోభయ భాగములగు ఇదమహమంశలయొక్క మధ్యయందున్నది. ఇదమంశసముచ్ఛ్రయముచేత జీవులను బంధించుచున్నది. సర్వవస్తువులయందు ఇదమాకారా ప్రతీతిని, దేహమాత్రమందు అహమాకారా ప్రతీతిని కలుగజేయును. ఈ రెంటిలో ఇదంతా ప్రతీతి అతి శయించినపుడు బంధము. అహమంశకు ఉచ్ఛ్రయముచేత ముక్తులను చేయుచున్నది. ఇదంప్రతీతికి మారుగా సర్వత్ర అహమను ప్రతీతియొక్క ఔల్బణ్యమే మోక్షమని భావము. ఈబంధమోక్షములకు విమర్శరూపిణియగు శక్తి యేమూలము స్వరసవాహినీయైనది పరాశక్తి ఎవరి హృదయమందు ఇదంతా హెచ్చగాను, అహంతీతక్కువగాను ప్రవహించునో వాడుబద్ధుడు. ఎవని హృదయమందు ఇదంతాతగ్గి, అహంతా హెచ్చునో వాడు ముక్తుడగును అనిభావము.

త్రిధేద మితహమిత్యి స్ఫురణాత్మికాయా

స్తస్యా స్స్వరూప ముభయాంశ సమాసమత్యైః |

తద్ధర్మసంగతి వశేన తధాత్రిరూపో

ధర్మీచ చైత్యచితిమేళన సిద్ధరూపః || 5

టీక :- ఇదమితి=ఇది అని, అహమితి=నేను అని, స్ఫురణాత్మికాయాః=స్ఫురణస్వరూపమైన, తస్యాః=ఆ విమర్శయొక్క, స్వరూపం=స్వరూపము, ఉభయాంశ సమాసమత్యైః=ఇదమహామంశలయొక్క సమాసమత్వము చేత, ఇదమహమంశలచేత, త్రేధా=మూడువిధములు. ధర్మీచ=ప్రమాతయు, తద్ధర్మసంగతి వశేన=ఆవిమర్శయొక్క సంసర్గవశమున, చైత్యచితిమేళనసిద్ధిరూపః=చైత్యవ్యాప్తి, చిద్వ్యాప్తి అనువాటి సామ్యముచేత, సిద్ధరూపః =సిద్ధించిన రూపముగలవాడై, తధా=ఆప్రకారము, త్రిరూపః=మూడు రూపములు గలవాడు.

పూర్వసూత్రముచేత విమర్శాత్మిక పరాశక్తికి స్వరూపములైన ఇదమహమాత్మిక ప్రత్యయములు రెండు భాగములని సూచించబడినది. ఈ సూత్రమున ఆ అర్థమునే స్పష్టము చేయుచున్నారు. ఇదమని అహమని, స్ఫురణ ద్వయాత్మికమగు ఆ పరాశక్తి యొక్క స్వరూపము గలదు. ఇదమని, అహమని, స్ఫురణరూపమగు ఉభయాంశలయొక్క సమాసమత్వములు రాగలవు. ఇదమహం అంశల సామ్యము ఒకభాగము. వాటి అసమానత్వమందు ఇదమను స్ఫురణ యొక్క విస్థారము రెండవ భాగము అహమను స్ఫురణము యొక్క విస్తారము మూడవభాగము. అగుచున్నది. ఈ ధర్మ రూపమైన విమర్శపర్యాలోచనవలన ధర్మియు త్రిరూపుడగు చున్నాడు. వ్యాప్తి కలిగిన చైత్యముచేతను, వ్యాప్తి కలిగిన చితిచేతను తదుభయమును మేళవించుటచే సిద్ధస్వరూపుడగుచున్నాడు. ఇదం తోల్లేఖన సంసర్గవశమున వ్యాపక చైత్యరూపుడు ధర్మియు, అహంతోల్లేఖన సంసర్గవశమున వ్యాపక చిద్రూపుడు ధర్మియునగును. ఇదంతా7హంతా సామ్యభావముచేత ధర్మియే సామరస్యరూపు డగుచున్నాడు.

విశ్రాంతి ధామని నిజాశ్రయయో ర్విమర్శః

చిచ్చైత్యయో ర్భవపదే స్వయమాశ్రయో7పి |

ఏతద్ద్వయం నిజసమాశ్రయ మేవ కుర్వన్‌

సై#్వరక్రమేణ విలసత్యబహి ర్బహిశ్చ || 6

పిమ్మట సూత్రద్వయముచేత పరశివభట్టారికయొక్క స్వాతంత్ర్యశక్తి అగు విమర్శశక్తి యొక్క నిరాఘాటవిలసన చమత్కారములను చూపించుచున్నారు. విమర్శ విశ్రాంతిస్థానమైన సుషుప్తిలో తనకు ఆశ్రయులైన చిచ్చైత్యములయందు లీనమైయుండును. భవపదమందు తాను ఆశ్రయమైనప్పటికిని లీనమగును. భవపదము వికల్పమూలమైనది. వికల్పమనిన విమర్శయే. సంసారపదమందు ప్రమాత్రాది సర్వార్థము విమర్శమూలమే. చిచ్ఛైత్యరూపప్రమాతలకు ఆశ్రయమైన విమర్శ చిచ్ఛైత్యరూప ధర్మిద్వయమును తనకు ఆశ్రయమును గాచేయుచున్నది. అంతస్సీమయందు, బాహ్యసీమయందు, స్వతంత్రక్రమముచేత బాహ్యమునుండి ఆంతరమునకు, ఆంతర మునుండి బాహ్యమునకు ప్రకాశించుచుండును.

స్వప్నే స్ఫురత్యబహిరింద్రియ మూర్తి రంత

ర్బాహ్యే బహిః కరణమూర్తి రథ ప్రబోధే |

సంకోచ మాశ్రయతి పూర్వపదే7త్రకించి

దత్యర్థ ముత్తరపదేతు తమాధథాతి ||

స్వప్నమందు మనోబుద్ధి స్వరూపమైనదై, అభ్యంతర కక్ష్యయందు జగద్రూపమైన స్వవిలాసమును చూపించును. స్వప్నశబ్దము ప్రకృతిసంసారమునకు ఉపలక్షకము. ప్రకృతి సంసారమందు విమర్శ బుద్ధిరూపముచేత జగద్వమనము చేయుటవలన అని తెలియవలెను. అనంతరము సుషుప్తి వదలి శుద్ధమైన జాగ్రద్రూపమందు శ్రోత్రాదివాగాది జ్ఞానక్రియేంద్రియ స్వరూపమై బాహ్యకక్ష్యయందు ప్రకాశించును. అత్ర ఈ స్వప్నజాగ్రతల రెంటిలో పదే స్వప్నమందు కొద్దిగా సంకోచ భావమును ఆశ్రయించును సుషుప్తియందు విశ్రాంతితో ఐకరస్యమును పొందుటచే పూర్ణమైన విమర్శకు తదనంతర పదమైన స్వప్నమందు ఈషత్సంకోచము, జాగ్రత్‌లో మహా సంకోచము. ప్రమాతృ ప్రమేయములకుకూడ అట్టి సంకోచమే ఇక జాగ్రత్సంకోచము. స్వప్నాంతరమైన జాగ్రత్‌ లో ఆ సంకోచమును మిక్కిలిగా అంగీకరించును.

సంకోచవృత్తి పరసీమని బాహ్యరంగే

వ్యాప్తిం సమర్పయతి నాంతరధామ్ని పూర్ణే |

విశ్రాంతిమల్పయతి పూర్ణతరా మితోపి

మాయా చ మత్కృతి మవాప్య జడోవిమర్శః || 8

పశుసంసార పదమందు విమర్శకు మాయాచమత్కార పరిగ్రహముచేత విపరీత ప్రతీతరూపముగ విలాసమును చూపించుచున్నారు. సంకోచవృత్తి సంకోచభావ పరమా వధియైన జాగ్రత్పదమందు, వ్యాప్తిని సమర్పించును. పూర్ణతను ఆరోపించనని భావము. ఘటపటాదులు ప్రస్ఫుటముగ సాక్షాత్కారమగుటచే జాగ్రత్ప్రకాశ##యే పూర్ణమైనదని అనుసంధానము చేయును. జాగ్రదపేక్షయా పూర్ణమైన అనగా ఈషన్మాత్ర సంకోచము గలదియే గావున ఆంతర కక్ష్యయందు అనగా స్వప్నమందు పూర్ణతను ఆరోపించదు. స్వప్న ప్రకాశజాగ్రత్ప్రకాశకన్న అల్పమని తలంచును. ఘటపటాదులు సాక్షాత్కరించినను జాగ్రత్‌ వచ్చునంతనే అవి అంతర్థానమగుటచేత అని భావము. స్వప్నప్రకాశ నిష్ప్రకాశ సుషుప్తి తుల్యమనియే తలంచును. స్వప్నముకంటె అతి పూర్ణమైన సుషుప్తిని స్వప్నముకంటె అల్పముగా తలంచును అతిసంకోచపదమును పొందును. ఒక ఘటముగాని పటము గాని ప్రతీతము కానందున అని యర్థము. ఈ ప్రకారము విమర్శకు విపరీత ప్రతిపత్తియందు నిమిత్తమును చెప్పుచున్నారు. విమర్శ మాయాచమత్కారమును పొంది, జడమగుచు, విపరీతమగుననిభావము. విమర్శకంటె మాయగాని, విద్యగాని వేరుగానున్న తత్వముకాదు. ఇదంతా అతిశయముచే భాసించుచు మాయయనియు అహంతాతిశయముచే విద్య యనియు చెప్పబడునది విమర్శయే.

ఇచ్ఛాద్వయాంతరిత మానయుగే యవర్గే

స్వాప్నేజడా ఖలు దశా సమపేక్షణీయా |

మాతృత్వమత్ర మనసో హి లకారమూర్తేః

స్వప్నో హి మానసిక సంసరణం ప్రసిద్ధమ్‌ || 9

ఇచ్ఛామాత్ర సంసారమగు సుషుప్తికి అనంతరము జ్ఞానక్రియాసంసారములైన స్వప్నజాగ్రత్‌లలో విసర్గ ప్రకరణ మునుబట్టి క్రియా ప్రాధాన్యముచేత జాగ్రత్‌ వివేకమే ప్రథమ మైనను ఉత్పత్తి క్రియాదృష్టి ననుసరించి జ్ఞానమే ప్రథమమని భావించిరి. కనుక ముందుగా జ్ఞానసంసారమైన స్వప్నము యొక్క వివేకమును ఆరంభింతుము. ఈషత్సంకోచరూపమైన స్వప్నదశను ఈషత్సంకోచము గలిగిన యవర్గయందు నిరూపించవలెను. స్వరపదప్రక్రియానుసారము ఇకార, ఉకార. సంకోచరూపములైన యకార, వకారములకు జడాజడేచ్ఛా త్వమున్నది. ఇచ్ఛాద్వయము వలన అంతరితమైన అనగా మధ్యగా చేయబడిన ఋకార, లుకార, సంకోచరూపమగు రేఫ, లకారాత్మకమైన క్రియాజ్ఞాన రూపప్రమాణ యుగళము కలిగియున్న యవర్గయందు జడమగు జీవసంబంధమైన భేద స్వప్నదశ విచారింపదగినది. ఈషత్సంకోచరూపములైన యవర్గ స్వప్నదశలకు సాదృశ్యమువల్లన ఇది సంభవమని భావము. స్వప్నమందు లకారస్వరూపమగు మనస్సునకే ప్రమాతృత్వము. లకారము జ్ఞానప్రమాణస్థానీయమైనది. అంతఃకరణసంసారమైన స్వప్నమందు జ్ఞానరూపప్రమాణము మనస్సే శ్రోత్రాదులుకావు. ఐతే స్వప్నమందు శ్రోత్రాదీం ద్రియములే తమ తమ విషయముల యందు ప్రవర్తించు చున్నట్లు అనుభవము. అపుడు మనస్సునకు శ్రోత్రాదులకు బహిరూపమని, ఆంతరరూపమని రూపద్వయము గలదు. ఎపుడు శ్రోత్రాదులు బహిర్నిమీలితములై అంతర్ముఖ ముగా ప్రవర్తించునో అపుడుశ్రోత్రాదులకే ఆంతరరూపము మనస్సని చెప్పబడును. ఎపుడు బహిర్ముఖములగునో అపుడు శ్రోత్రాది వ్యవహారమని తెలియవలెను. అందువలన శ్రోత్రాదులకు అంతఃపదమందు మనస్సనే వ్యవహారమువలన జ్ఞానేంద్రియస్థానీయమైన లకారము మనస్సే ఈ ప్రకారముగ కర్మేంద్రియస్థానీయమైన రేఫబుద్ధి. కర్మేంద్రియములకు కూడ ఆంతరరూపము బుద్ధి అని తెలియదగినది. స్వప్నమందు మనస్సే త్రిపుటీభావ పరిగ్రహ చమత్కారముచేత సంసరణము చేయును. కాని తాత్త్విక దేహరూపమునకు ప్రమాతృత్వము లేదు. తాత్త్వికదేహమునకే ప్రమాతృత్వమనిన, స్వప్నాను భూతములైన అర్థములు జాగ్రతయందు కూడ ఉండవలసి వచ్చును. అందువలన విమర్శరూపమగు మహాశక్తి మనస్సే. స్వప్నమందు త్రిపుటీరూపముగా విలసిల్లును. ఆ మనస్సే వెలుపల శ్రోత్రాదిరూపముగాను, విషయాకారముగను గూడ విలసిల్లును. కాని ఆంతరమందుగాని, వెలుపలగాని, ఎచ్చటను జగత్తుకు విమర్శకంటె అన్యముగా పరమాణ్వాది సిద్ధి కాదని గురుకటాక్షముచే నిరస్తమైన మాయాంధకారము గల వారికే తెలియదగినది. స్వప్నసంసారము తాత్త్వికదేహ ప్రమాతృకర్తృత్వమే జాగ్రత్‌ యందు తత్సంవాదౌచిత్యము కారణము. అట్టి సంవాదమనుభవ విరుద్ధము. స్వప్నము మనో విలాసమని లౌకికునకు కూడ తెలిసినదే. స్వప్నమున నిర్వివాదముగా మనస్సునకే ప్రమాతృత్వమని చెప్పబడినది. ఎట్లనగా స్వప్నము మానసిక సంసరణమని ప్రసిద్ధమే.

స్వసై#్వవశక్తి రవమర్శమయీ స్వగర్భే

గ్రస్త స్తయైన మనసా వపురాది మూర్త్యా |

ఆత్మా స్వరశ్మిపటల స్థగితో7ర్యమేవ

నాభాతి కించిదపి కంచుక పంచకాంతః || 10

ఇపుడు చిత్తత్వమగు ఆత్మలో గల విమర్శపర్యాయ మైన మనశ్శక్తి చేత దేహాద్యంతః ప్రపంచముగా, పృథివ్యాది బాహ్యప్రపంచముగా, సంసరణచమత్కారమును ఉపపాదించుచున్నారు. విమర్శరూపమగు శక్తి తన సంబంధమైనదే. ఈ శక్తియొక్క ఉనికియు, తన గర్భమందే ధర్మమగుటచే గర్భ మందే యుండునని భావము. మనోరూపమైనట్టి దేహాది ప్రపంచభూమికా పరిగ్రహము కల్గిన ఆ విమర్శశక్తిచేతనే కబళింపబడితినని విమర్శయొక్క విపరీత ప్రతీతిగలదు. చమత్కారభావమువలన, గ్రాసనమని తెలియునది. ఇది చమత్కార విషయమేగాని, పరమార్ధముగా మ్రింగుట లేనేలేదు. విద్యో దయమైన పిమ్మట స్వస్వరూపపర్యాలోచనయందు తనను ప్రపంచము మ్రింగుట విమర్శ చమత్కారమాత్రముగనే తెలియుననియు భావము. తన ధర్మవిలాసము తననే ఆవరించినదని చెప్పుటకు సదృష్టాంతమును సాధించినారు. తన కిరణసముహముచే కప్పబడిన సూర్యునివలె అల్పముగా అయిదు కంచుకముల లోపలనున్నవాడై, అనగా మనశ్శక్తిచే కల్పితమైన పరిచ్ఛిన్న సంకల్పరూప కలా అవిద్యాది పంచాంగ పదమధ్యమందున్న వాడై ప్రకాశించుట లేదు. ఏ ప్రకారముగా సూర్యుడు స్వరశ్మిపటలముచే ఆచ్ఛాదితుడై బింబ మగు పడకుండ ఉండునో అటులనే ఈ ఆత్మస్వశక్తి విలాసముచే అనగా స్వరశ్మి చక్రరూపమైన ప్రపంచముచేత అంతర్హితుడై చిదాత్మకమూలరూపమును గానకున్నాడని యర్థము.

ఆత్మాన్వితం వపు రహంకృతిధామనాంసి

త్రణ్యంతరాణి కరణాని పదం ప్రమాతుః |

ఏతన్మనో విలసితం యదిపంచరూపం

మాయాపదం పదమిదం ప్రకృతేస్తు సాక్షాత్‌ || 11

అనంతరము విసర్గవ్యాప్తియందు భావింపబడిన పంచాంగరూప స్వప్నపదముయొక్క సంస్థానమును చూపించుచు చెప్పబోవు ప్రకృతిసంసారపదముకంటె స్వప్న మునకు భేదము నుపాదించుచున్నారు. ఆత్మతో గూడ పరిగణతమైన శరీరమును అహంకారబుద్ధి మనోరూపములను మూడు ఆంతర కరణములతో కలసియున్న ప్రమాతయొక్క పదము అనిరి. పంచాంగకమైన స్వప్నరూపమునకు ఆత్మయే ప్రమాతయని చెప్పబడినది. ఈ పదము ఆత్మశక్తియైన మనస్సుయొక్క విలాసరూపమే. ఆత్మవిలాసరూపత్వము అర్ధాత్తు సిద్ధమైనది. జాగ్రత్‌ యందు మానసికసంసారరూపమైన ప్రకృతిపదము వక్ష్యమాణ ''ప'' వర్గరూపమైనది. అచటను కూడ ఆత్మా పర్యాయప్రకృతి, అహంకారాద్యంతఃకరణత్రయము కలిసి పంచాంగకమైన పదము. అందుచే ప్రకృతిపదముకంటె స్వప్న పదమునకు ఏమిభేదమనిన, ఈపంచాంగకమైనపదము తాత్త్విక దేహప్రమాతతో అపేక్షలేక మనస్సుయొక్క విలాసమే కావున స్వప్నపదమైనది. నేను ఈ ప్రకారము స్మరించు చున్నానని జాగ్రత్‌లో ప్రకృతిరూప ప్రమాతృమూలమైన ప్రకృతియొక్క పదము అగుచున్నది.

మాయాపదే స్వమన ఏవ శరీరతాభాక్‌

ఇత్యాదిశంత్యణువిదో త్రవకారగర్భే |

తద్బాహ్యతొపి చ లకార మస్మరంతః

పంచాంగకం పదమిదం చతురంగమేవ || 12

స్వప్నపదము విసర్గవ్యాప్తి విషయమగుటచే పంచాంగక మనిరి. ఇచట యకారాది వకారాంతవర్ణ చతుష్టయము జడేచ్ఛాప్రమాణద్వయ, అజడేచ్ఛాస్థానీయములు. విసర్గ ప్రమాతృస్థానకమైన వర్ణము వినబడదు. కనబడదు. ఈ పదమునకు పంచాంగత్వముకు చెప్పుచున్నారు. మంత్ర వేత్తలు స్వప్నపదమందు భేదవిమర్శకు స్వప్నపదమే ప్రధమాభివ్యక్తి స్థలమనిరి. స్వప్నపదమునకు మాయాపదమని వ్యవహారము. లకారరూపమగు మనస్సే దేహప్రమాతృ భావమును పొందినది. మనస్సుకంటె వ్యతిరేకముగా స్వప్న మందు వ్యవహరించు దేహములేదని ఇదివరలో చెప్పితిమి. అందువలన మనస్సే శరీరమైనదనిరి. ఈసందర్భమున వకారము యొక్క అంతరపదమందు, వకారమునకు పూర్వపదమందు లకారమును యోజనచేయుచున్నారు. మనస్థానీయమైన లకారమునకు దేహస్థానీయమందు యోజనచేయగా, మనస్సుకే దేహత్వముకూడ ప్రాప్తమైనదని తోచుచున్నది. అందుచే ఈ ప్రకారముగా యోజనచేయుటయే సంప్రదాయ మని ఉపదేశించిరి. వకారముకంటె పూర్వపదమందు బాహ్యముగా, మనస్థానీయ లకారమును అనుసంధానము చేయవలెను. వకారముకంటె పరపదయందు ఆంతరముగా దేహ స్థానీయమైన లకారముయొక్క సన్ని వేశమని అనుసంధించునది. ఐతే విసర్గవ్యాప్తి పదమందు, విసర్గ ప్రమాతృరూప మైన దేహమునకు ఆత్మస్థానీయమైన వకారముయొక్క గర్భ మందెట్లు సన్ని వేశమనగా చెప్పుచున్నారు. స్వప్నపదమందు విసర్గయొక్క స్థితిబిందుగర్భమందే అయినను, బిందువును విసర్గ వ్యాపించినట్లు ప్రతీతి. అందుచే స్వప్నమునకు చిదచిద్వ్యాప్తి సంకరస్థానమగుటచే మిశ్రాధ్యత్వము చెప్పబడినది. జాగ్రత్‌ యందైన విసర్గ ప్రమాతకు బిందుబహిర్భాగమందే సన్ని వేశము. అందువలననే జాగ్రత్‌కు అశుద్థతచెప్పబడెను. దేహము ఆత్మాంతర్గతమగుటచే అంతఃకరణత్రయము ఆత్మాంతర్గతమే అని ఊహించును తద్బహిర్గతత్వ సన్నివేశము. తద్వ్యాప్తి ప్రతీత్యపేక్షచే ఉపపన్నమైనది. ఈ పదము పంచాంగకమని చెప్పుట చేచతురంగకమైన శవర్గతోకూడ అష్టకోణమందు సమసంఖ్యగా యెట్లు సన్నివేశమగును. చతురంగపదమనిన విసవ్యాప్తికి భంగము వచ్చను. కాని వకారమునకు వెలుపల లకార సన్నివేశమందు చతురంగమగునని మంత్రవేత్తల యొక్క సంప్రదాయానుసారముగా, వకారగర్భమందు లకార సన్నివేశరహస్యమువలన పంచాంగకమని విశేషజ్ఞులచేత అంగీకరింపబడిన దని తెలియవలెను.

పృథ్వీ లకార ఇహ దేహమయీ ఖధామా

కర్తృజ్ఞతేన్య మరుదగ్నిమ¸° యరేఫౌ |

వ్యాప్యేతయోః క్షితిజలే వికృతే లకాచ

స్వాత్మస్థితస్య వపుషః కరణాని గర్భేః || 13

ఉక్తమర్యాదవలన విసర్గవ్యాప్తభిమానమందు పంచాంగకమైన స్వప్నపదముయొక్క అంగములు పశుపదమగుటచే పృథివ్యాదులకు వ్యుత్క్రమముచేత సన్నివేశమును చూపించుచున్నారు. ఈ స్వప్నపదమందు వకారాంతర్వర్తి లకారము వ్యాప్తిపదమగు ఆకాశస్థానమును పొందిన దేహరూపమగు పృథివి, ఈపృథివీరూప దేహప్రమాతకు వాయ్వగ్నిరూపములైన యకార రేఫలు క్రియాజ్ఞానకరణములు. చిద్వ్యాప్తిపదమందు జలాగ్నిరూపమైన పదద్వయమే గలదు. ఇపుడు వ్యుత్క్రమ పదమందు వాయువు అజడాగ్నిస్థానమును పొందెను. యకార రేఫరూపములలో ఉపలక్షితమైన పృథి వ్యాత్మకదేహప్రమాతకు చిత్తును వ్యాపించుటకు సాధన భూతమైన క్రియాజ్ఞానకరణద్వయము అగునని భావము. క్రియా స్వరూపమైన దేహమునకు ప్రమాతృత్వము గనుక తత్సాధ నము క్రియా ప్రధానమే యగుచున్నదని తెలిసికొనవలేను. వకారమునకు పూర్వలకారము, వకారము కూడ యకార రేఫరూప వాయ్వగ్నులయొక్క వ్యాప్యస్థలమందు వికార మును పొందినవై పృథివీజలములయ్యెను. అనగా స్వభావముచే వాయ్వాకాశరూపములైన ఆ రెంటికి వికారము రాగా, క్షితి జలభావమేర్పడెను. ఆత్మస్థానీయమై వకారగర్భమందున్న దేహప్రమాతయొక్క గర్భమందు అహంకార, బుద్ధిమనస్సులు కలవు. విసర్గకు తన వ్యాప్తి పదమందుస్థానము, చిత్పదముయొక్క ఉచ్ఛేదము లేకుండుట నియమమే. ఆకాశాదిరూపవిసర్గపదము యొక్క సంస్థాన విశేషముచేతనే, చిత్తుయొక్క అనుచ్ఛేదము తోచుచున్నది. విసర్గ ప్రమాతృసాధనములైన వాయ్వగ్నుల చేత పృథివీజలముల ఉచ్ఛేదము సిద్ధింపదు. వాయువుచే జలముయొక్క ఉచ్ఛేదము, అగ్నిచేత పృథివియొక్క ఉచ్ఛేదము సంభవించును గాని, వాయువుచేత పృథివియొక్క ఉచ్ఛేదము, అగ్నిచేత జలముయొక్క ఉచ్ఛేదము సంభవింప దని భావము.

మగ్నః పుమాన్వపుషి చిత్త మహంక్రియాయాం

బుద్ధౌజడాంశ జఠరే7ప్యజడన్తదంశః |

ఇత్థం ప్రమాతరి జడాంశగతా7జడంశే

జ్ఞానక్రియాంత రవభాతి మహానజాండః || 14

ఇపుడు ఆత్మకు తనగర్భస్థమైన దేహాదులచేవ్యాప్తిని నిరూపించుచున్నారు. మనోబుద్ధిరూపమగు విమర్శయొక్క దేహాహంకారరూపమగు అంతర్జగద్వమనాంతరము, బాహ్య జగద్వమన చమత్కారమును చూపవలెను. లకారరూప శరీరమందు మగ్నుడై వకారరూపుడై ఆత్మకలడు. పూర్వ లకారరూపమైన మనస్సు యకారరూపమైన అహంకార మందు మగ్నమైనది. బుద్ధిరూపమైన జడాగ్నియందు అజడాగ్ని మగ్నమైనది. బుద్ధికి అగ్నిత్వము జడాజడరూపత్వము ప్రతిపాదింపబడినవి. వాయురూపమైన అహంకారముచే పృథివీరూపమైన చిత్తముయొక్క కబళనము, అగ్ని రూపమైన బుద్ధిచేత జలరూపమగు ఆత్మకబళనము పూర్వ సూత్రముచే చెప్పబడినది. ఇపుడు ఆత్మకు దేహముచేత కబళనమెట్లు చెప్పబడెననగా! జ్ఞానక్రియారూపమైన కరణ ద్వయము ప్రమాతకు అంగమే. అంగములచేత కబళన మన్నను, పర్యవసానము ప్రమాతృకబళనమే విరోధములేదు. ఈచెప్పబడిన నిమజ్జనప్రక్రియచేత వకారరూపుడగు ప్రమాత విసర్గయందు, విసర్గాంగములయందు, తాను తన అంగములను కూడ నిమజ్జనము చేయును. అప్పుడు మనోబుద్ధిగర్భమునుండి మనోబుద్ధిరూప విమర్శగర్భమునుంచి, అతివిస్తారమైన బ్రహ్మాండము ప్రకాశించును. విమర్శ తనగర్భమునుంచి ప్రపంచోన్మీలనానంతరము బాహ్యప్రపంచమును వెలువర్ణించునని భావము. స్వప్నమందు బ్రహ్మాండమునకు పిండాండము కారణమని లౌకికునకు కూడ విదితమే. జాగ్రతయందైతే బ్రహ్మాండ పిండాండమునకు కారణమని దక్షిణమార్గమున గల లౌకిక ప్రతీతి. వామమార్గస్థ యోగికైతే జాగ్రతయందు కూడ పిండాండమే బ్రహ్మాండమునకు కారణమని నిశ్చయము. సిద్ధదర్శనమగు యామళమందైతే ఆరెంటికి అన్యోన్య కారణత్వము. ¸°గపద్యస్థితి, శివశక్త్యాత్మకములైన పిండాండ బ్రహ్మాండములకు అవినాభావమనిరి. అంతఃపదమందు పిండాండమునకు అంగమైనది బ్రహ్మాండము. బాహ్యపదమందు బ్రహ్మాండమునకు అంగమైనది పిండాండము.

పిండాండమూలమపి మూలమివాస్యభాతి

బ్రహ్మాండమంతరపి బాహ్యమివాస్యచిత్రం |

మాయావిమోహితదృశా తదణుర్నిరీక్ష్య

స్వాంగాని పంచకలయ త్యణుశక్తి కాని || 15

ఇపుడు స్వస్వరూపభూతమైన పిండాండ మునుండియే పుట్టిన బ్రహ్మాండముయొక్క దర్శనముచే పశువుయొక్క విపరీత ప్రతీకరూపమైన విమర్శ విలాసమును వివరించవలెను. బ్రహ్మాండము పిండాండమే మూలముగా కలిగినదైనను, స్వప్నమందు మనోమూలకత్వము నిర్వివాదమే. ఈపిండాండ మునకు కారణముగా భాసించుచున్నది. ఈ పిండాండము యొక్క అంతస్థమైన బ్రహ్మాండమంతయు మనోనిష్ఠమైనదే గనుక అంతస్థమైనదని భావము. బహిస్థ్సితమైనది వలె భాసించుచున్నది. తనలోనున్నది తనకంటె వ్యాపకముగా తోచుట అద్భుతము. సంకుచితప్రమాత ఆ బ్రహ్మాండమును మాయా చమత్కార పరిగ్రహముచేత వికారమును పొందిన దృక్కను విమర్శచేత, చూచి పంచపిండాండస్థానములైన దేహాది పంచక మగు తన అంగములను బ్రహ్మాండాపేక్షయా అల్పసారములు కలవానినిగా తలంచుచున్నాడు.

సంక్లప్త వాయు శిఖి భూ జలఖాపకర్షా

బంధామ్య రంతరణుకస్య కలాప్యవిద్యా |

ఠాగశ్చ కలావియతే ఇతి కంచుకాస్తే

మాయాత్మనః ప్రథమకంచుకతా సుషుప్తేః || 16

పశువునకు పంచమహాభూతాత్మక బ్రహ్మాండాంగదర్శన ముచేత సంకుచితభూతాత్మక స్వస్వరూప పిండాండాంగముల అపకర్షయొక్క సంకల్పములే అంతర్బంధములు. ఇవి కళాది శబ్దములచే వ్యవహరింపబడుచు షట్కంచుకములై అగుచున్నవి. సంక్లప్త వాయు శిఖి భూ జలాకాశముల అపకర్షలు యకార, రేఫ, లకార, వకార, వకారస్థ లకారస్థానక, వాయ్వగ్నిక్షితిజలాకాశ సంకోచములు. ఇవి పరిచ్ఛిన్న ప్రమాతకు అంతరబంధములు అగుచున్నవి. పశువునకు అంతస్సులోనే సంకల్పములుండును గనుక అంతర్బంధములు ప్రపంచవ్యాప్తి లక్షణ బంధమూలముచేత అంతర్బంధత్వము. స్వసంకల్పవశము వలననే బంధమని ప్రసిద్ధి. అట్టి సంకల్ప రూప బంధములకు యకారాది స్థానక వాయ్వాదిక్రమముచేత సిద్ధసంప్రదాయ ప్రసిద్ధమైన కళాదిషట్కంచుకరూపతను, క్రమముగా అనువాదము చేయుచున్నారు. యకారస్థానక వాయుసంకోచసంకల్పము కళా అను కంచుకము. రేఫస్థానక వాయుసంకోచసంకల్పము కళా అను కంచుకము. రేఫస్థానక అగ్నిసంకోచసంకల్పము అవిద్యానామకంచుకమగును. లకార స్థానకపృథివీసంకోచ సంకల్పము రాగమనుకంచుకము. వకార స్థానక జలసంకోచసంకల్పము కాలమనుకంచుకమగును. లకార స్థానక ఆకాశసంకోచ సంకల్పము నియతి అను కంచుకము అపరిచ్ఛిన్న ప్రమాతృపదమందు సర్వకర్తృత్వమైనవాయువు నకు పశుపదమందు సంకోచమువలన కళామాతృకర్తృత్వమని కళాసర్వజ్ఞత్వముగల అగ్నికి సంకోచమువలన వైపరీత్యముగా అవిద్యాత్వము. పూర్ణత్వశక్తియైన పృథివియొక్క సంకోచ మందు నా కిది ప్రాప్యమను స్పృహకు పర్యాయమగు రాగో దయమువలన రాగత్వము. నిత్యత్వశక్తి అయిన సలిలము యొక్క సంకోచమందు అనిత్యతాకలనము వలన కాలత్వము వ్యాపకత్వశక్తియైన ఆకాశముయొక్క సంకోచమందు అతైవాహమితి అను దేశనియమమువలన నియతిత్వము. ఈ విధమున కళాదుల నామోత్పత్తిలో ఆరని ప్రసిద్ధియుండగా అందు మాయ మొదటిదిగా తెలియబడుచున్నది. కంచుక రూపమగు స్వప్నముకంటె పూర్వముగానున్న తత్కారణ భూతమైన ఏసుషుప్తి గలదో అదియే మాయ. భేదసంసారము మాయారూపము గనుక అట్టి మాయాస్వరూపసుషుప్తికి ప్రథమకంచుకత్వము. క్షకారాది కకారాంతవర్ణములు శివాదిక్షిత్యంత షట్త్రింశత్తత్వరూపములని సంప్రదాయప్రసిద్ధి. ఆవర్ణములు ద్విరూప ఆకారములతో కూడ ముప్పదియైదు. ళకారక్షకారములు ఏకవర్ణమని సంప్రదాయము. అందువలన స్వరవర్గమైన మాయాతత్వరూపము అంతస్థలయొక్క మూల మున సన్నివేశమును పొందుటచే వర్ణములయందు షట్త్రింశ త్తత్వస్థితి నిర్వివాదము. స్వరఖండము వ్యాపకఖండమునకు మూలముగదా. యవర్గ రూపభేద స్వప్నమునకు బీజము. శవర్గ రూప అభేదస్వప్నమునకు విశ్రాంతిపదము. కావున ఉత్పత్య పేక్షయాజ్ఞానమునకు ప్రాధాన్యము. ప్రతీత్య పేక్షయా క్రియా ప్రాధాన్యము జ్ఞానక్రియా సంసారరూపములైన స్వప్నజాగ్రత్‌ల మధ్య సర్వకారణమైన స్వరవర్గరూసమగు సుషుప్తి యొక్క సన్నివేశము. స్వరవర్గయందు స్వప్నవాసనారూపమైన ఏ కారము మాయాతత్త్వస్థానమని వివేకము.

కర్తృత్వశక్తి రనిల స్సకలజ్ఞతాగ్ని

ర్భూఃపూర్ణతా విలతాంబు వియద్విభుత్వం |

పంచాపిశక్తయ ఇమా వితతాస్స్వరూపం

శంభోర్ఖవంత్యపి చ సంకుచితాఃపశోస్తు || 1

యకారాదిస్థానములైన వాయ్వాదిభూతముల పూర్ణా పూర్ణతయందు శివజీవుల స్వరూపమైన కర్తృత్వాది పంచశక్తి త్వమును ప్రతిపాదింతుము. వాయువు సర్వకర్తృత్వశక్తి. అగ్ని సర్వజ్ఞతాశక్తి. సర్వజ్ఞత్వశక్తి అగ్ని. భూమిపూర్ణతాశక్తి ఉదకము నిత్యత్వశక్తి. ఆకాశము వ్యాపకత్వశక్తి. ఈ పంచ శక్తులు కూడ పూర్ణములైచో శివునియొక్క స్వరూపము రాగలదు. సంకుచితములైనచో జీవునియొక్క స్వరూపము అగుచున్నది. సమస్త క్రియస్పందరూపము. స్పందమువాయు రూపము. వాయువునకు కర్తృత్వశక్తి జ్ఞానము భాసన రూపము. భాసనము తేజోరూపము. వహ్నికి సర్వజ్ఞత్వశక్తి సంపన్న తాపర్యాయమగు పూర్ణత్వము సకల భోగ్యవస్తు రూపము. సకలభోగ్యవస్తువులు పృథివీ మూలకములు. కావున పృథివికి పూర్ణత్వశక్తితః నిత్యత్త్వము ఆప్యాయన్యావిచ్ఛేద మూలకమగుటచే ఆప్యాయనము జలధర్మము. కావున జలము నకు నిత్యత్వశక్తితా విభుత్వము వ్యాప్తి మూలకమగుటచే వ్యాప్తి ఆకాశధర్మము. కావున ఆకాశమునకు విభుత్వశక్తి తా అని తెలియవలెను.

స్వాత్పంచశక్తి మయతా ప్రకృతి శ్శివస్య

స్వాంత ర్జగత్కలన మప్యథ దేహినస్తు |

బాహ్యే జగత్కలనమేవ భ##వేద్విభేదః

స్స్వాభ్యంతరస్థ జగతోపి విమోహశక్త్యా || 18

శివజీవులకు పంచశక్తి మయత్వము సామాన్యమగు చుండగా, భేదకమైన ధర్మమును ఉపపాదించుచున్నాము. శివునకు పంచశక్తిమయత్వము స్వభావమగును. ఆకాశము మొదలు అష్టమూర్తులు శివునకు ప్రసిద్ధి. ఆ సందర్భమందు చంద్రార్కకు తేజస్సుఅగు వహ్నియందు అంతర్భావము. చిదాత్మయైన యజమానుడు ఆకాశమందుగాని, తేజస్సు నందుగాని అంతర్భావము బ్రహ్మాండరూపముగా పరిణమించిన పంచభూతములే శివునిస్వరూపమని ఉపపన్నమగుచున్నది. శివునకు జీవునికంటె భేదమైన ధర్మమును చెప్పుచున్నాము. మహాభూతపరిణామములగు భూర్భువాది జగత్తులు మహా భూతములయందే ఉండుటవలన, తదాత్మకుడైన శివునకు స్యాంతర్జగత్కలనము. తన లోపలనే జగత్తు లన్నియు ఉండుటయే శివుని స్వభావము. అనంతరము జీవునకు తన లోనే జగత్తులున్నను, పంచశక్తు లనగా, పంచభూతములే తన్మయమైన పిండాండ స్వరూపము. జీవునియొక్క పిండాండము వలననే బ్రహ్మాండ ముదయింపగా, విమోహశక్త్యా విపరీత ప్రతీతరూపవిమర్శశక్తి వలన వ్యాప్తి పదమందు జగదవ స్థానసంకల్పమే శివునకంటె భేదకమైన ధర్మము, ఎపుడు నిజ స్వరూపమైన పిండాండమును బ్రహ్మాండమునకు మూలమని, బ్రహ్మాండముకంటె అధికమని తలంచునో అపుడు స్వస్వరూపమే బ్రహ్మాండమగుచుండగా, తదుత్తీర్ణమగుచుండగా విశ్వమయ విశ్వోత్తీర్ణ స్వభావము గల శివతత్త్వమును జీవుడే పొందుచున్నాడని తాత్పర్యము.

అంతస్థ్సితస్య జగతో నహి పూర్తియోగః

చైత్యస్య తత్కబళితత్వ వినిశ్చయాయాః |

తద్వచ్చి తేరపి న పూర్తి రతో దశేయం

పక్షద్వయే స్ఫురదపూర్త్యభి పూర్తి యోగాత్‌ || 19

స్వప్నమునకు మిశ్రాధ్వతా ప్రతిపాదన కొరకు అచట చిదచిద్వ్యాప్తి సాంకర్యమును చూపించెదము. దేహబ్రహాండరూపమైన వేద్యమునకు పూర్త్యుపపత్తి లేదు. ఉభయవిధచైత్యముచేత కబళింపబడినను నిశ్చయము గల వకారస్థాన ఆత్మకు చైత్యమునకువలె పూర్తి లేదు. పరమార్థ ముగా చైత్యము చిదంతర్గతమే కదా. కావున చిద్వ్యాప్తియే చెప్పవలెను. అన్యధా ప్రతిపత్తి దోషము చేత పరమార్థము నకు వ్యాహతి చెప్పవలెనా? అనిన కాదని చెప్పుచున్నాము. నిర్వికల్పమైన పరమార్థమూలక వస్తువునందు వికల్పవశము వలననే గదా సంసారాధ్యవసాయము. పరమార్థముగా లేదు. అందుచే కాంతిరూప విమర్శచే భాసితములైన భావములు అబద్ధమని త్రోసివేయరాదు. అట్లు చెప్పినచో సర్వసంసారము నకు అపహ్నకనీయత్వ ప్రసక్తి వచ్చును. కావున రహప్యోప దేశసమయమందు అంతరాయకథలు చాలును. చిదచిత్తులు వ్యాప్తి నిర్ణయమందు నిద్ధారణలేనందువలన ఈ స్వప్నదశ చిదచిద్వ్యాప్తి రూప పక్షద్వయమందు స్ఫురించుచున్న, అపూర్తిపూర్తులయొక్క సంసృష్టికలదు.

అధ్వాభ వేచ్చిదపర్ష వశాదశుద్ధః

శుద్ధ స్త్వసౌ భవతి చైత్యపదాపకర్షాత్‌ |

చిచ్చైత్యయో రుపచయాపచయా విశేషా

న్మిశ్రోహి మాయికపదం భవతీద మధ్వా || 20

స్వప్నమునకు అశుద్ధశుద్ధాధ్వతా ప్రహాణప్రస్తాన మందు సర్వాధ్యముయొక్క స్వరూపమును ఉత్పాదించ వలెను. చైత్యవ్యాప్తిచేత చిత్తత్వమునకు వ్యాప్యత్వము ప్రాప్త మైనందువలన శుద్ధముకాని మార్గముకలుగుచున్నది. ఎచట చిత్తుకు వ్యాప్యత్వమువలన అపకర్షయో ఆ పదము అశుద్ధాధ్వమని తాత్పర్యము. జడసుషుప్తులు అశుద్ధాధ్వము అచటను చైత్యవ్యాప్తి యొక్క ఏకాధిపత్యము చేత చిత్తుకు వ్యాప్యత్వము సంభవము. ఈ మార్గమే చైత్యపదముయొక్క అపకర్షమువలన శుద్ధమైనది అగుచున్నది. తుర్యపదము శుద్ధాధ్వ చిద్వాప్తి యొక్క ఏకాధిపత్యముచేత చైత్యమునకు వ్యాప్యత్వమువలన కలుగును. స్వప్నపదము చిచ్చైత్య ములకు వ్యాపకత్వవ్యాప్యత్వములలో విశేషములేకపోవుటచే చిచ్చైత్యములకు ప్రత్యేకము వ్యాప్త్యవ్యాప్తి సామాన్యము వలన మిశ్రమైన మార్గము అగుచున్నది. విశ్వము పరమార్థముగా చిన్మయమే గనుక తద్య్వాప్తి ప్రతీతియే శుద్ధము. అది కలవాడు శుద్ధుడు. చైత్యవ్యాప్తి చమత్కారమాత్రమగుటచే చిత్స్వరూపావరకమై, మలమగుచుండగా, చైత్యవ్యాప్తి ప్రతీతి అశుద్ధి. అదికలవాడు అశుద్ధుడు. జాగ్రదాదిదశలలో జీవశివులు సంచరింతురు గనుక అధ్వవ్యవహారము.

ఆత్మా వకారవపుషా ణురుకార ఏవ

దేహాత్మనైవ ఖలు సంసృతిరస్య జంతోః |

దేహం చ తాత్త్విక మముష్య సుషుప్త మేవ

స్వప్నే తదత్ర మనఏవ శరీరతాభాక్‌ || 21

ప్రకరణమును ఉపసంహరించుచు స్వప్నమందు మనస్సునకే శరీరత్వమని సవిశేషముగా ప్రతిపాదించు చున్నాము. అకారాదిరూప సుషుప్తి పదమందు ఆత్మస్థానీయ మైన ఉకారరూపుడ ఆత్మవకారరూపము చేతసంకుచితుడు. ఈ వకారరూపుడైన జీవునకు దేహరూపము చేతనే సంసరము గదా! శివునకువలెనే దేహబంధము లేకుండ చిదాకాశ రూపముచేత సంసరణలోవలె చమత్కారానుసంధానము సంభవింపదని భావము. అందువలన జీవునకు సంసరణమందు దేహమావశ్యకము. స్వప్నమందు అమనఃకల్పితమైన దేహము నిద్రపోవుచునేయున్నది. నిమీలితమైన బాహ్యేంద్రియ గ్రామము కలదై శయ్యాతలమును వదిలిపెట్టదని భావము. తాత్వికదేహమున కీస్వప్నసంసరణమందు అధిష్ఠాతృత్వమును చెప్పిన స్వప్నసంభావితములైన అంగుళి భేదాదులు జాగ్రత్‌ లో ఉండవలసివచ్చును. విచారింపగా తాత్వికదేహము మనో మూలకమే ఐనను, లౌకికప్రతీత్యపేక్షచేత తాత్విక దేహము అమనఃకృతమని యేప్రసిద్ధి. అందువలన స్వప్నమందు మనస్సే శరీరత్వమును పొందుచున్నది. తాత్వికదేహము పడియే యుండును. మిగిలినది మనస్సే గనుక లౌకికునకు స్వప్నమందు మనోశరీరమే అని సంప్రతిపన్నమైనది.

విమర్శానందనాధేన విరజానంద పుత్రేణ శ్రీమాతృకా

చక్ర వివేకే స్వప్నస్కంధస్య వాఖ్యేయం తృతీయః

ఇతి శ్రీమాతృకాచక్ర వివేకమున స్వప్నవివేకమను

తృతీయ స్కంధము.

***

Sri Matrukachakra viveka    Chapters