Sri Laxmihrudayamu    Chapters   

శ్రీమాత్రేనమః

ఓం ఈం నమః

శ్రీ లక్ష్మీ హృదయము

లక్ష్మీహృదయస్తోత్రమనెడి యీ మహామంత్రమునకు భార్గవుడు ఋషి. త్రిష్టుబాదులు ఛందస్సులు-మహాలక్ష్మి దేవత. శ్రీం బీజము - హ్రీంశక్తి-నమః కీలకము-అలక్ష్మీపరిహారపూర్వకదీర్ఘాయురారోగ్యవిజయాభ##యైశ్వర్యఫలావాప్తి కొఱకు లక్ష్మీహృదయపాఠమందు వివియోగము.

శ్రాం, శ్రీం, శ్రూం, శ్రైం, శ్రౌం, శ్రః అనెడిజీజములతోఁ గరాంగన్యాసములు చేసికొనవలయును. వ్యాహృతి త్రయముతో (ఓంబూర్భువస్సువః) దశదిగ్బంధనము నారాచముద్రతో ఁ జేయవలయను.

ధ్యానము

శ్లో|| హస్తద్వయేన కమలే ధారయంతీంతులీలయా|

హారనూపురసంయుక్తాం లక్ష్మీం దేవీం విచింత యే||

తా|| రెండుచేతులతో రెండుతామర ను విలాసముగాఁబట్టుకొన్నట్టియు, మంచి ముత్యాలహారములను, అందెలనుధరించినట్టియు, దేవశక్తియైన లక్ష్మిని విశేషించి ధ్యానింతును.

వి|| రెండుతామరలను బట్టుకొనుభావమేమనఁగాఁదన్నాశ్రయించు భక్తులకు ధనదారసువర్ణాదిజాగతికసంపద నిచ్చుటను దెల్పుట కొకటియు; తన భక్తులకు బ్రహ్మవిద్య నొసంగి దానివల్లనైన యశస్సును బద్మగంధమును వాయువువలె దెసలకు వ్యాపింపఁజేయుటను దెల్పుట కొకటియు ధరించెనని భావము. మత్యాలసరులు ధరించుట శ్రీదేవిసత్త్వగుణ ప్రాధాన్యమును, అందెలు దాల్చుట శబ్దమయత్వమును అనఁగా నాదమయస్వరూపత్వమును దెలుపును. ఆయమలక్ష్మీ,అనగా సర్వసులక్షణసంపన్న. సర్వైశ్వర్యవతి. భక్తులను సర్వదాయొకకంట లక్షించునది. ఎల్లర చేతను జూడఁబడునది. దేవియనఁగా స్వయంప్రకశశీల. క్రీడనశీల, అనఁగాఁదన్ను దాను జగదాకారముతో బయల్పెట్టుకొనుటయే కాక దానితో సృష్టి స్థితిలయతిరోధానానుగ్రహములనెడి యైదాటలాడుకొనుదనియు నర్థము. అట్టి జగన్మాతను నిన్ను విశేషించి సేవింతును.

లమిత్యాదిపాంచభౌతికబీజములతో గంధాదిపంచోపచారములను బరికల్పింపవలయును.

శ్లో|| వందే లక్ష్మీంపరశివమయీం, శుద్ధజాంబూనాదాభాం,

తేజోరూపాం| కనకవసనాం| సర్వభూషోజ్వలాంగీం|

బీజాపూరం కనకకలశం హేమపద్మే దధానాం|

ఆద్యాం శక్తిం, సకలజననీం| విష్ణువామాంకసంస్థామ్‌||

తా|| పరశివమయియు ననఁగాఁ బరమాత్మస్వరూపిణియు; పుటము పెట్టిన బంగారు వన్నె కలదియు, జ్ఞానము శక్తిరూపముగాఁ గలదియు, బంగారు పుట్టము గలదియు; ఎల్లనగలతో వెలయు విగ్రహము గలదియు, మాతు లుంగమును (మాదీఫలము, తురంజిదబ్బపండు) బంగారుగిండిని, రెండు బంగారుతామరపూవులను ధరించినట్టియు, సృష్టికంటెఁబూర్వమందన్నట్టియు శక్విస్వరూపిణియు సర్వ జగత్తులను గన్నట్టియు విష్ణుని యెడమతొడపై సుస్థిరముగా నుండునట్టియు. లక్ష్మీ దేవిని నోరఁగొనియాడుచు నమస్కరించుచున్నాను.

వి||"ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం" అనెడి సంధ్యావందన గ్రంథమందలి వాక్యమే "శక్తిశక్తిమతోరభేదః" అనెడి శ్రుత్యర్థమును బ్రతిపాదించుచున్నది కనుక బ్రహ్మమునకు బ్రహ్మశక్తికిని భేదము లేదు. కనుక మహాలక్ష్మి పరమాత్మస్వరూపిణియే, పుటము పెట్టిన బంగారువన్నెకలదిగావర్ణించుట యేల యనఁగా పరమాత్మయొక్క ప్రకశశక్తివిమర్శశక్తియనెడి వానిలోవిమర్శశక్తి యేమనఁగా "అహమస్మి-అహంజానామి ఆహంపశ్యామి" మున్నగు భావములతో వ్యాపించి యుండుశక్తి: అట్టి విమర్శశక్తిని వేదాదులు రక్తవర్ణగానే వర్ణించినవి. పుటము పెట్టిన బంగారము ఎర్ఱగా నుండును. కనుక యీపోలిక తగియే యున్నది. తేజస్సు అనఁగా జ్ఞానము వీర్యము శక్తియు స్వరూపముగాఁగలది. కాఁగా జ్ఞానమే స్వరూపముగాఁగలదియు, సృష్ట్యాదిశక్తియే స్వరూపముగాఁ గలదియు నని భావము. బంగారుచీర కట్టినది యనఁగా శరీరమును గప్పియుంచు వస్త్రము కనకమయ మనుటచేత విమర్శశక్తిస్వరూపిణియే శ్రీమాతయని భావము. దేవదేవీమూర్తులు సర్వభారణశోభులను వర్ణనము సాధారణముగాఁ గానవచ్చును. ఈవర్ణనము సర్వవిభూతులను భగవంతునివే యని చెప్పుటకే.శ్రీదేవిచేతఁ గలబీజపూరము జీవుల కర్మఫలబీజములను దనయధీనమందుంచుకొనిసకలమును సృష్టించునదియని తెలుపును. ఆమె చేతఁగల బంగారుగిండి వట్టిది గాదు. అడియమృత పూర్ణము. విద్యయు నానందమును అమృతముతోనే యుపమింపఁబడును. కనుక శ్రీదేవి తన యాశ్రితులకు జ్ఞానానందముల నొసగునదని భావము. రెండు చేతులందు రెండు పద్మములను ధరించు భావము. ధ్యానశ్లోకమందు వివరింపఁబడినది. ఇచట లహేమపద్మములని చెప్పఁబడుటచే ¸°గికార్థము చెప్పికొ నుట యుక్తము. అవిఅథఃసహస్రారము, ఊర్ధ్వసహస్రరాము; ఈ రెండు సహస్రదళపద్మములును శక్త్యుపాసనస్థానములే. మూలాధారనిలయమైన అథఃసహస్రదళ##మే కులపద్మము. ఊర్థ్వసహస్రదళ పద్మమే అకులపద్మము. క్రింది కులపద్మమునుండి సుషుమ్నామార్గమున మీది అకులపద్మమునకు ఎక్కించి, మఱలఁగులపద్మమునకు దించుచుండుటే కులాచారమనెడి కుండలినీయోగసాధనము. కులమనఁగా సుషుమ్నామార్గము. కుండలినీశక్తిరూపశ్రీదేవిచేత నీమార్గమందు ఆరోహణావరోహణములను జేయించుటే కులాచారమనెడి యోగసాధనము. ఊర్ధ్వాథఃసహస్రదళపద్మముల సంధానించు నాళమును బోలి నడుమ బిసతంతుసన్నిభ##మైన సూక్ష్మతమమార్గమునే కులమని, సషుమ్నయని యోగశాస్త్రము వివరించినది. మఱియు శ్రీదేవి ఆద్యశక్తిగా వర్ణింపఁబడినది. ఈశక్తిసర్వవ్యాపకుడైన విష్ణుని (పరమేశ్వరుని) ఎడమ తొడయందు సుస్థిరముగా నుండుననుట బ్రహ్మమును బ్రహ్మశక్తి, వీడియుండనిదనియుఁ, బరమాత్మకంటె వేఱుకాదనియు దెల్పుటకే ఈశక్తి ఆద్య-యనఁగా జగత్సృష్టికంటె ముందుండినదే. సృష్టికంటెను మున్నుండి ఆనందస్పందనరూపమునఁ దనయందు సంకల్పరూపమున వికసించిన శక్తియే ఆద్య. ఇది పరమాత్మకంటె భిన్న కాదు. వ్యాసదేవుఁడును బ్రహ్మసూత్రములందు బ్రహ్మమనఁగా నేమో చెప్పవలసివచ్చినపుడు "జన్మాద్యస్యయతః" దేని వలన జగత్సృష్టిస్థితిలయాదులగుచున్నవో యదియే బ్రహ్మమని శక్తినే సూచించెను. దేవుఁడనఁగా నెవ్వఁడను నపుడు సృష్టిస్థితిలయములను జేయునదియే దేవుఁడని తేఁటపడునట్లు పాశ్చాత్యులును G-Generation=సృష్టిo-Organigation= పరిపాలనము, D-Destruction= లయము అను ఆద్యక్షరములతో నైనGodఅనియే వ్యవహరించుచన్నారు. సకలమును దనలోనుండియే సృష్టించినది. అనఁగా వెలికి విడిచినది. కావుననే శ్రీమాత సకలజనని.

శ్లో|| శ్రీమత్‌ సౌభాగ్యజననీం స్తౌమి లక్ష్మీం సనాతనీం|

సర్వకామఫలావాప్తి సాధనైక సుభావహామ్‌|| 3

తా|| శోభాయుక్తమైన సౌభాగ్యము గల్గించు నట్టియు, భక్తుల నెల్లప్పుడు లక్షించునట్టియు, శాశ్వతయైనట్టియు, ఎల్లకోర్కుల పంట నొందుటకైన సాధనమై మహానందమును గల్గించునదియైన శ్రీదవిని గొనియాడు చున్నాను.

వి|| భగమే భాగ్యము. సుభగమేసౌభాగ్యము. భగమనఁగా షడైశ్వర్యసంపత్తి సామర్థ్యములాఱు. సర్వజ్ఞతనిత్యతృప్తి, అనాదిబోధము, స్వతంత్రత, నిత్యాలుస్తిఅనంతత్వము అనునవియే షడైశ్వర్యములు. మతాంతరమున ఉత్పత్తి, వినాశము, భూతములరాకస భూతముల పోక, విద్య, అవిద్య అనువానికే భగమందురు. సు=శ్రేష్ఠమైన, భగమ=షడైశ్వర్యసంపత్తి. 'సు' అనుమాట పరమాత్మకే చెల్లును. అట్టి యాఱు విధములైన యైశ్వర్యసంపత్తిని గలిగించునది కావున సౌభాగ్యజనని, లక్ష్మినిసనాతని, బ్రహ్మమెట్లు సనాతనమో యటులే బ్రహ్మముకంటె వేఱుకాని తచ్ఛక్తియైన లక్ష్మియు సనాతనియేసనాతనియనఁగాఁద్రికాలాబాధ్య. అనఁగా మున్నుండినది యిపుడున్నది. ముందుండునది. ఈ లక్షణమునే 'సత్‌సత్య శాశ్వత, సనాతన, సదాతన, అను పదములతో వ్యవహరించిరి. కావున బ్రహ్మశక్తియైన లక్ష్మి బ్రహ్మమువలెనే సనాతని. ఆశ్రితుల కోర్కులెల్లఁబండించి, యానందము నొందుచుశక్తి లక్ష్మీదేవిదే. అనఁగా లక్ష్మి యుపాసనము భోగమోక్షకరసాధనము.

శ్లో|| నమామి నిత్యం దేవేశి, త్వయా ప్రేరితమానసః

త్వదాజాం శిరసాధృత్వాభజామి పరమేశ్వరి||

తా|| దేవనాయికా! నీచేఁ బ్రేరణచేయఁబడిన మనస్సు గలవాఁడనై యెడ తెగక నీకు మ్రొక్కుచున్నాను. ఓపరమేశ్వరి! నీయానను దలఁదాల్చి నిన్ను భజించుచున్నాను.

వి|| అమ్మా! నీవు దేవేశివి. దేవులను వాని వాని పనులయందు నియమించుదానవు. దేవులనఁగా నింద్రియశక్తుల విశుద్ధాఖండచైతన్యస్వరూపిణివైన, నీవే ఖండఖండచైతన్యవర్గముగానై మనస్సుమున్నగు పదునొకండింద్రియములకడనుండి జ్ఞానకర్మేంద్రియాధిష్ఠానచైతన్యమనుపేరవెలయుచునాయాశక్తులను నీవే నియమించిచుచున్నావు. ఇపుడు" నమామి" అనుచోట నుభయాత్మకమైన (జ్ఞానకర్మేంద్రియాత్మకమైన) మనస్సును పాణిపాదాదులైన కర్మేంద్రియములనున నీవే. ఇంద్రియాధిష్ఠాన దేవతారూపముతో నీవేనియమింపకున్న నమస్కారమనెడి పని జరుగదు. అందు అంతఃకరణమైన మనస్సే ప్రధానము. "నేను", అనునది నీవే కాని వేఱొండు కాదనుటయు, అంతయు నీవే యనుటయు మనఃకార్యమే కాని, మఱియొకటికాదు.

"యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా" (సప్తశతి) ఇమ్మహాలక్ష్మియే సర్వభూతములందును మానస వ్యాపారరూపముతో వెలయును. ఎట్టి మనోమృత్తియైనను ఆపరాశక్తిప్రేరణమే. తనకు మ్రొక్కుటయనెడి మనో (నావ్రాసిన "దేవపూజా రహస్యమనెడి" గ్రంథమందో, సాధనసామగ్రియందో ప్రణామతత్త్వమను భాగమును జదువుచో విశిష్టాంశము లెన్నియో తెలియఁగలవు.) వృత్తియుఁదనరూపమే. కనుక నే సాధకుడు "నీప్రోత్సాహము చేతనే నీకు మ్రొక్కుచున్నాను"- అనుచున్నాఁడు "ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే7ర్జున తిష్ఠతి భ్రామయన్‌ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా" అనెడి భగవద్వాక్యాభిప్రాయమును నిదియే. మాయానామకపరాశక్తియైన మహాలక్ష్మియే ఈశ్వరీనామముతో సర్వభూతములలోను నిల్చి సర్వకార్యములయందును జీవులను బ్రేరణచేయు చుండును. కనుకనే సాధకుఁడు "నీయానను దలఁదాల్చినిన్ను భజించుచున్నాను" అనెను. కృతపుణ్యులైన జీవులనే పరమేశ్వరి తన్ను భజింప నాజ్ఞపెట్టను. ఈశ్వరియనఁగా సర్వభూతనియంత్రియని యర్థము. అనఁగా భూతములను గట్టుబాటునఁ బెట్టునది. లక్ష్మీదేవి; పరమేశ్వరి, పరములనఁగా శ్రేష్ఠులు. అట్టివారిని సైతము నియమించునది. బ్రహ్మాదులు పరములు-బ్రహ్మావిష్ణురుద్రేశ్వరసదాశివులు సృష్టిస్థితిలయతిరోధాననుగ్రహములనెడి కార్యములను జేయువారు. పరమార్థమేమనఁగా సృష్ట్యాదిపంచ కృత్యములను జేయునది పరమేశ్వరియే ఆశ్రీదేవిశక్తులనే పురుషులాగ భావించి బ్రహ్మాదినామములతోవ్యవహారించిరి. ఫలితార్థమేమనఁగా సృష్ట్యాదింపచకృత్యపరాయణ శ్రీమాతయేమని యర్థము. పక్షాంతరమున "పరమా+ఈశ్వరి=పరమయైన యీశ్వరి-పరం మాతీతి పరమా- మోక్షమును గల్గించునది కాఁగా ''పరమా'' ఎవ్వని సంకల్ప మమోఘమో యాతఁడిశ్వరుఁడు. తచ్ఛక్తి ఈశ్వరి. కావున లక్ష్మియే పరమేశ్వరి. ముక్తిదాత్రి. అట్టి పరమేశ్వరిని నేను భజింతును; అని యనుచున్నాఁడు. "భజ్‌" ధాతువునకు "సేవించు" యనునర్థమొక్కటే కాదు. పూజనీయ (గుణగౌరవముగల) వస్తువు నంటిపెట్టికొని యుండుటే భజనము, అనఁగా సాధకుఁడు దానిని గూర్చి వినుట., వీనినదానిని విడువక తలంచుచుండుట,దానిని గొనియాడుట, దానినే స్మరించుట, మున్నగు పనులను జేయుటే భజనము. ఇందలి విశేషమేమనఁగా స్మరణము ఏనాఁడో మఱచిన యొకవిషయము తలంపునకు వచ్చుటే. బహుత్వవాంఛ చేసిన బ్రహ్మశక్తియైన మహాలక్ష్మియే సర్వోపాథులయందును "నేను"అను పేర వెలయుచున్నదను మాటయే. యెన్నిజన్మములనుండియో మఱపైనది; ఇప్పుడు స్మృతినిబడుటే యనఁగాఁ దలంపునఁబడుటే స్మరణము. దీనినే శ్రీ శంకరాచార్యులు "మేధ" యనుచు ''బ్రహ్మాహమస్మీతిస్మృరేవమేధా'' యని నిర్వచించిరి. కనుక నిచట 'భజామి' యనఁగా "నీవేనేను" అని విడువక స్మరించుచున్నానని చెప్పికొనుటయే శ్రేష్ఠము.

శ్లో|| సమస్తసంపత్సుఖదాం మహాశ్రియం

సమస్తసౌభాగ్యకరీం మహాశ్రియం|

సమస్తకళ్యటాణకరీం మహాశ్రియం

భజామ్యహం జ్ఞానకరీం మహాశ్రియమ్‌||

తా|| ఎల్లకములను, సుగములను నిచ్చునట్టియు, సర్వసౌభాగ్యములను గూర్చునట్టియు; సకలశుభములను జేకూర్చునట్టియు, జ్ఞానము నొసంగునట్టియు; మహాశ్రీని, నిన్ను భజింతును.

వి|| ఈశ్లోకపాదముల నాల్గింటను "మహాశ్రీశబ్దము ప్రయోగింపఁబడునది, ''శ్రయతేసర్వైరితిశ్రీః'' అందఱిచే నాశ్రయింపఁబడినది. కాఁగా శ్రి. "మహద్భిశ్రయతే ఇతి మహాశ్రీః" గొప్పవారనఁబడు బ్రహ్మాదులచేసైతమాశ్రయింపఁబడునది యని యర్థము. ఆశ్రితుల యా యా కోర్కులను దీర్చునది మహాలక్ష్మి. సంపత్సుఖములన గోరి శ్రీదేవినాశ్రయించువారును గొప్పవారే. వీరు గంధపుష్పధూపదీపనైవేద్యాదులతో బాహ్యపూజ చేయుచు నాశ్రయించుటచే గొప్పవారు. సర్వజ్ఞత్వాదులను అణి మాదిసిద్ధులను గోరి యుపనిషత్‌ తంత్రాదులయందుపదిష్టమైన రీతిని న్యాసాదికములను జేసికొనుచు మంత్రజపాద్యుపాయపూర్వకముగాఁ గలమార్గమందు వ్యష్టికుండలి రూపమహాలక్ష్మి నర్చించుచు నాంతరోపాసనముఁజేయ వారును గొప్పవారే. ఇఁక సాధకజీవుల కత్యావశ్యకమైన బక్తిజ్ఞానవైరాగ్యదైవీసంపదాది కల్యాణములనుత, పక్షాంతరమున మోక్షమే కల్యాణము కావున దానినిఁ గోరి యాశ్రయించువారును గొప్పవారే. ''జ్ఞానాదేవ ముక్తిః'' యనుటచే నాత్మజ్ఞానమే మోక్షదాయకము. కావున దానినే గోరుచు ననన్యభావముతో 'త్వమేవాహం' అనెడి మహావాక్యార్థజ్ఞానమునందు నిల్చి పరోపాసనము చేయవారును మహాత్ములే. ఏవిధముగా నైన శ్రీదేవి నాశ్రయించు మహాత్ములే, కాని యిందుఁదుదిపరోపాసనమునకు మొదటి మూడును సోపనములుగాను, బుద్ధియోగమును బ్రసాదించి యాశ్కితులను సత్యప్రాణానందములందుఁ బ్రతిష్ఠితులను జేయునది శ్రీదేవియే. "సంపత్కరీ, సుఖప్రదా" సర్వసౌభాగ్యగదాయినీ. ముక్తిదా, జ్ఞానదా, రాజిపీఠనివే శితనిజాశ్రితా," అను నీశ్రీమాతృనామములన్నియు స్మర్తవ్యములు. అట్టి శ్రీదేవిని విడువక సేవింతును. శవర్ణము సుఖమును, రేఫము సంవిత్తును, ఈకారము కామకలను (శక్తిని) దెల్పును. ఇవి యన్నియును బిందువుఁజేర్పఁగా బీజత్వమునొంది రమాబీజమగును. శ్రీం బీజము బ్రహ్మవిద్యారూపసరస్వతిని దెల్పును. కావుననే చైత్రశుద్ధపంచమి శ్రీపంచమి. ఆనాఁడు మొదలుపదిదినములుఅనఁగాఁ బూర్ణిమాంతముగా బ్రహ్మవిద్యారూపసరస్వతీపూజలు చేయుదురు. శరన్నవరాత్రములందుఁ జేయఁబడు రమోత్సవములలో మూలనానక్షత్రిదిగా మూడుదినములు ఘనీభూతబ్రహ్మవిద్యను - అనఁగా బుస్తకరూప బ్రహ్మవిద్యారూప సరస్వతిని మాత్రమే పూజింతురు. శ్రీపదమును విసర్గముతో (శ్రీః) గ్రహించునపుడు ఆవిసర్గము శ్రీదేవి యొక్క ముక్తిప్రద లక్షణమును దెల్పును.

శ్లో|| విజ్ఞానసంపత్సుఖదాం సనాతనీం

విచిత్రవాగ్భూతికరీం మహేశ్వరీమ్‌|

మనోహరాసంతసుభోగదాయినీం

సమామ్యహం భూతికరీం హరిప్రియాం|| 9

తా|| విజ్ఞానమును (శిల్పాశాస్త్రాదిజ్ఞానమును) విజ్ఞాన మనెడి కలిమినిబెట్టి, యానందమును, గల్గించునదగియు, త్రికాలాబాధ్యయు వివిధములైనవాక్కులవైభవమును గలిగించునదియు, మహేశ్వరశక్తియు, పక్షాంతరమున మహచ్ఛబ్దవాచ్యులైన బ్రహ్మాదులను సైతము సృష్ట్యాది కార్యములందు నియమించునదియు, మనస్సు నాకర్షించునట్టి యంతములేని జాగతిక ములైన శ్రేష్ఠభోగముల నిచ్చునదిటయు అణిమాద్యష్టైశ్వర్యముల నిచ్చునదియునైన విష్ణువల్లభను మ్రొక్కుచున్నాను.

వి|| అఖండజ్ఞానస్వరూపముతో నుండునదియు, వివిధ జ్ఞానరూపముతో నుండినదియు అమ్మయే. వివిధజ్ఞనమనఁగా శబ్దస్పర్శరూపరసగఁధాకారమైన ఖండఖండ విషయజ్ఞాన రూపముగా నుండునదియు అమ్మయే. కనుకనే ఆమె సనాతని, అట్టి విశిష్టజ్ఞానసంపదను గల్గించి తన్మూలముగా సుగపెట్టునది శ్రీదేవి. అనఁగా ఖండఖండవిషయజ్ఞానరూపముతో వెలసి, వానిచే నల్పాల్పమైన యానందమును గలిగించు చున్నది అమ్మయే. ఈ ఖండఖండజ్ఞానములన్నియు అఖండ జ్ఞానస్వరూపములే యనియు ఈయల్పాల్పమైన ఆనందములు అఖండజ్ఞానానంమయబ్రహ్మస్వరూపములే యనియు, అమ్మ రూపములే యనియు తెలిసికొన్నప్పుడు బ్రహ్మానందము కలిగించునది. అమ్మయే యనుభావము. విచిత్రవాగ్భూతి యనఁగా అర్థయుక్తములైన అలంకారయుక్తములైన మృదువైన మాట నేర్పు (లాడుట) అట్టి మాటలతో గద్యపద్యరూపమైన గ్రంథములు రచించుట మున్నగు శక్తులే వాగ్విభూతులు. అట్టి శక్తిని గల్గించునది మహేశ్వరశక్తియైన శ్రీమాతయే. అణిమ మున్నగు నైశ్వర్యముల నిచ్చునట్టిదియగు హరిప్రియకు నమస్కారము. ఇచట హరిప్రియ హరి=సర్వము నాకర్షించువాఁడు, లయకాలమందు సమస్తమును లోఁగొను వాఁడు. అట్టి పరమాత్ముని ప్రియురాలుగా భావింపఁబడునది యాతని శక్తియే. హకార, అకార, రేఫ, ఇకారములు కలిసి హరి అయినది. హాకారము బ్రహ్మను; రుద్రుని; ఆకాశమును దెల్పును. ఆకారము వ్యాపకశక్తిస్వరూపవిష్ణుని దెల్పును. రేఫము తేజస్సును అనఁగా జ్ఞానమును దెల్పును. ఇకారము శక్తిని దెల్పును. కాఁగా సృష్టిస్థితి లయములను చేయువాఁడును, ఆకాశమువలెనిర్మలుఁడును, అంతట వ్యాపించియున్న వాఁడును, జ్ఞానస్వరూపుఁడును, శక్తియుతఁడును, పక్షాంతరమునశక్తికంటె వేఱుకాని వాఁడను అయిన పరమాత్మఅని యర్థము. అట్టి హరిని బ్రీతుని జేయునది కనుక హరిప్రియ . పశ్రాంతరమున హరి శబ్దమే హ్రీఅనుదాని రూపాంతరము.

ఇప్పుడు హరిప్రియయన్నను హ్రీప్రియయన్నను ఒకటే. కనుక"హ్రీంకారజపసుప్రీత" యని యర్థము, సుభోగమను నపుడు శ్రేష్ఠమైన జాగతికసుఖానుభవము అనిమాత్రమే చెప్పి యూరకుండుటయకంటె సు+భోగదాయిని=బ్రహ్మాను భవము గల్గించునది యని చెప్పుటచ సరసము. సు శబ్దము ఒక్క పరమాత్మకేచెల్లును. కనుక బ్రహ్మానుభవము అని చెప్పుట మనోహరతరము.

________________________________________

హ్రీ శబ్దమునూగూర్చిన వివరణమునకై నా 'సప్తశత్యుపాసనాక్రమము' అను గ్రంథమందలి తొలి నాలుగైదు పుటలు చూచునది.

________________________________________

శ్లో|| సమస్తభూతాంతరసంస్థితా త్వం

సమస్తభూతేశ్వరి! విశ్వరూపే|

తన్నాస్తి యత్‌ త్వద్వ్యతిరిక్తవస్తు

త్వత్పాదయుగ్మం (పద్మం) ప్రణమామ్యహం శ్రీః||

తా|| సత్యదజ్ఞానానందస్వరూపిణి! పరాశక్తి! నీవే సర్వభూతములలోపల నున్నదానవు. సర్వభూతములను నియమించుదానా! విశ్వమే ఆకారముగాఁగలదానా! నీకంటె వేఱౖనది మఱియొకవస్తువులేదు. కనుక నీయడుగుఁదమ్మికే (నీయడుగు దోయికే) ప్రణమిల్లుచున్నాను.

వి|| అమ్మా! విశ్వమనఁగా శివాదిక్షితిపర్యంతమైన ముప్పదియారు తత్త్వములతో సిద్ధమైన జగజ్జాలము. అదియే నీరూపము. నీతనువు. అందలి సర్వభూతములందను శ్రరీరముతో ఁ బుట్టిన యన్నింటను) నీవే యున్నావు. అనఁగా సర్వోపాధులందను నేనున్నాను; "నేనేఱుగుదును; నేను జూచుచున్నాను; నేను వినుచున్నాను;" అనుచు విమర్శ శక్తిస్వరూపగా నీవే యున్నావు. ఇదే నీపరాప్రకృతిస్వరూపము. ఇది యొకవిధమైన నీవ్యాపకశక్తి. కనుక యీవిశ్వమందలి భూతములను గట్టుబాటు చెడకుండ నియమించుభారమును వహించుచున్నావు.కనుకనే సర్వభూతేశ్వరివి, "ఈశ్వరస్సర్వభూతానాం హృద్దేశే7ర్జున తిష్ఠతి| భ్రామయన్‌ సర్వభూతాని యాంత్రారూఢానిమాయయా" (భ|| గీత) కనుక భూతనియామకత్వభారము నీది. ఇదియు నొకవిధమైన వ్యాపకశక్తియే. పరాప్రకృతికిఁజెందినదియే. అమ్మా! నీవే విశ్వాకారముతోఁ జరాచరాత్మకతనువుతో వెలయుట చేతను నీవే విశ్వమందలి సర్వభూతములలోను విమర్శశక్తి స్వరూపగా నుండుటచేతను నీవు కానిది వేఱొక్కటిలేదు. విశ్వవిరాడ్రూపముతో నైన నీవ్యాపకశక్తియే ప్రకాశపాదముగా నన్నింటిలోను జైతన్యస్వరూముతో వ్యాపించి యుండు నీశక్తినే విమర్శపాదముగాను శాస్త్రములు వ్యవహారించినవి. పాదము వ్యాపకత్వశీలము. కనుక వ్యాపకశక్తిని పాదమనిరి. ఓయీ! లోకమందు పాదములు రెండుండుట సహజము కదా! "త్వత్పాదపద్మం" అని యేకవచనము ప్రయేగించుట యుక్తమా! యని సందేహింపవలదు. భగంవతుని ప్రకాశవిమర్శపాదుకలు రెండుగా మన చేతననుభవింపఁబడుచున్నను భగవంతుని వ్యాపకశక్తియొక్కటే కనుక నే మహాపాదుకాధ్యానమందు "స్వప్రకాశశివమూర్తిరేకికా తద్విమర్శతను రేకికా తయోః నామరస్య వపురిష్యతే పరా పాదుకా పరశిలవాత్మనో గురోః" అని యాగమతంత్రప్రమాణము కానవ్చచుచున్నది. కనుక రెండు విధములుగా వ్యాపించు శక్తిని 'పాదపద్మం' అని యొక్కటిగా వర్ణించుట తప్పు కాదు. అట్టి పాదమునకు నేను బ్రణమిల్లుచున్నాను. ప్రణమిల్లుట సాధారమణ నమస్కారము కాదు. ఆత్మార్పణము చేయుట శరణాగతి నొందుట యని యర్థము అనఁగా "నేన" నెడి యల్పాహాంతను శ్రీ త్యాదశబ్దములచే సుప్రసిద్ధమగు పరాహంతయందు సమర్పించుటే. అనఁగా జీవబ్రహ్మైక్యనిష్ఫాలము నొందుటే. (ప్రణామతి త్త్విమును గూర్చిన విశేషవివరణమును నాదేవపూజారహస్యమందోసాధనసామగ్రియందోచూచుకొనునది) శ్రీః అనుదాని వివరణము వెనుకటి 5వశ్లోక వివరణము క్రిందఁజేయఁబడినది. కొన్ని ప్రతులలో "పాదపద్మం" అను చోట "పాదయుగ్మం" అను దిద్ది వ్రాయఁబడినది కాని మహాపాదుకాధ్యానశ్లోకప్రమాణముచేరెడు విధములైన వ్యాపకశక్తుపల సామరస్యముఁజేకొని "పాదపద్మం" అనెడి యేకవచన ప్రయోగమే గ్రాహ్యము.

శ్లో|| దారిద్య్రదుఃఖౌఘత మోపహన్త్రిః

é త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ|

దీనా ర్తివచ్ఛేదన హేతుభూతైః

కృపాకటాక్షైరభిషంచమాం త్వమ్‌||

తా|| లేమివనటల చాలుచేనైన చీకునడంచు తల్లీ! నీయడుగుఁదమ్మిని నాయందుఁబెట్టుము. దీనుల సంకటమును దొలఁగింపఁగారణములైన నెనరుక్రేఁగంటిచూపులతో నాకు స్నానము చేయింపుము.

వి|| దారిద్ర్యమనఁగా లేమి. విద్య. ధనము, జ్ఞానము ఆరోగ్యము మున్నగు వానిలో నేదేవి యొకదాని దాని దారిద్ర్యము ప్రత్యేకజీవుని దుఃఖమునకు హేతువగుచునే యుండును. జాగతిక వస్తుదారిద్ర్యము మాట నటుంచి 'తమోపహన్త్రి'- చీకటిని దొలఁచుదానా! యని సంబోధించుటచే నజ్ఞానము చీకటితోనే పోల్చఁబడుచుండును. గాననిపుడు జ్ఞానదారిద్ర్యమునే సమన్వయించుకొనవలయును. తరువాతి వాక్యము దీనినే పోషించుచున్నది. నీపాదపద్మము నాయందుంచుము.' అనుమాట దానినే పోషించుచున్నది. శ్రీమాతృపాదపద్మమనఁగాఁ బ్రకాశవిమర్శవ్యాపకశక్తులు. వాని సంబంధమైన తెల్విని నాయందుఁబెట్టితి వేని నాజ్ఞాన దారిద్ర్యము ఇట్టె తొలఁగను. ప్రకాశపాదము, విమర్శపాదము, నపరాప్రకృతి పరాప్రకృతిరూపముతో వ్యాపించి యున్నది. అమ్మ తక్క మఱియొకటి లేదను జ్ఞానమే జ్ఞానము. అదే యద్వయబ్రహ్మజ్ఞానము. అమ్మ కరుణచే నది లభించినపుడు మానవుని యహంతామమత లణఁగిపోయి 'సాహంభావ' సమాధిస్థితినొంది తరింపఁగలఁడు.

అమ్మ నెనరుగ్రేగంటిచూపులే దీనుల యార్తిని దొలఁగింప సమర్థములు. అమ్మా! వానితో నన్ను స్నాతునిఁజేయుమని కోరుచున్నాఁడు దీనుఁడనఁగా నేయుపాయము చేతను దన వనఁచ తొలఁగక దుఃఖించువాఁడు. ఆవనఁటను దొలఁగించుటకు శ్రీమాత చేయు కృపాకటాక్షాబిషేకమొక్కటే యుపాయము. స్నానమొక్కటే యాప్యాయన ఫలదము. అమ్మ దయతోడి క్రేగంటిచూపు పడకున్నఁదాపత్రయము శమించి మనుష్యునకు సుగము కలుగదు. జననమరణబంధమున్నంతసేఁపు తాపత్రియము తప్పదు. కావున "అమ్మా! నాసంసారతాపత్రశాంతి యగునట్లు నన్నుదయఁజూడు" మని సాధకుఁడు ప్రార్థించుచున్నాఁడు. అట్టి శాంతి యాత్మజ్ఞానమువల్లనే కలుగవలయును. కనుకనే శ్లోకపూర్వార్థమందు స్వరూపజ్ఞానమును బెట్టుమనియు

నుత్తరార్థము చేఁదత్ఫలముగా సంసారతాపత్రయ శాంతి చేయుమనియుఁ బూర్ణవిశ్వాసముతో సాధకుఁడు ప్రార్థించుచున్నాఁడు.

శ్లో|| అంబ ప్రసీద కరుణాసుధయార్ద్రదృష్ట్యా

మాం త్వత్కృపాద్రవిణ గేశూమిమం కురుష్వ|

ఆలోకనప్రణయిహృద్గతశోకహన్త్రి!

త్వత్పాదపద్మయుగళం ప్రణమామ్యహం శ్రీః||

తా|| అమ్మా! నీ కరుణామృతముచేఁదడుపఁబడిన చూపుతో నాకుంబ్రసన్నరాలవగుము. కన్నతల్లీ! యీదీనుని నీదయాధనము దాచుకొనుకొట్టుగాఁజేయము. నినుఁజూచువేడ్కగలవారి హృదయములనంటిన శోకమును బోఁగొట్టుదానా! శ్రీ దేవీ! నీయడుగుఁదమ్మిదోయికి నెరఁగుచున్నాను.

వి|| "అంబ" యనుచున్నాఁడు సాధకుఁడు. తద్భవమైన అమ్మా! యనుమాటతోఁ బిల్చుటే కాదు. "అం+బమతి (వమతి) ఇతిఅంబా" పరమాత్మను వెడలుగ్రక్కుదానా! అనఁగా శివజ్ఞానమును బెట్టుదానా! తండ్రి తత్త్వమును దల్లియే తెల్పవలయును. కావున నంబ యననాత్మజ్ఞానదాయిని యని యర్థము. నీకృపామృతముతోఁదడుపఁబడిన చూపు నాపైనింబ్రసరింపఁజేయుము-ల నీవు కరుణతోఁ జూడకున్న స్వరూపజ్ఞానము నాకుఁగల్గదు. అని సాధకుని భావము. శక్తిమంతునికంటె భిన్న కాక గాయత్రీ, సరస్వతీ, శ్రీత్యాదినామములచేఁబ్రసిద్ధయగు మహాలక్ష్మియే వరద. అనఁగా గోర్కులనిచ్చునది. తన వరునే (శివునే) యిచ్చునది. యనిరెండవ యర్థము. "అక్షరం బ్రహ్మసమ్మితం" మహాలక్ష్మి గాయంత్రి. తన్నుగూర్చిగానము చేయువారిని రక్షించునది. ఆమె అధిష్టాన, అవస్థాన, అనుష్ఠాన, నామ, రూపములయందు బ్రహ్మముకంటె వేఱు కానిది. అమెయే సరస్వతి. అనఁగా బ్రహ్మవిద్యాస్వరూపసరస్వతి. ఆమెయే శ్రీ. అందఱిచేత నాశ్రయింపఁబడునది కనుక శ్రీ అందఱిచేత నాశ్రయింపఁబడునది కనుక శ్రీ. ఈమెయే సావిత్రి. అనఁగా సకలజనని, కావున సాధకుఁడు చనవుతో అమ్మా! నీదయాద్రవిణమునుదాచుకొను గదిగా నున్నఁజేయుమనుచున్నాఁడు. అనఁగా ధనాగారమందుధనార్జనపరుఁడ నానాఁటికి ధనమును జేర్చుచుండును. అటులే నాయందు నీకృపాధనమును బెంపొందించి సురక్షితముగా నుంచుము" అని ప్రార్థించుచున్నాడు. అమ్మా! నిన్నుఁజూచు వేడుక గలవారి మనసున నంటిన వనఁటను బోఁగొట్టుదానవు నీవు అనఁగా నాత్మదర్శనలాసుల దుఃఖమును దొలగించుట నీపని. అనఁగా నమ్మ పెట్టుతుచ్ఛజాగతిక సుఖములను గోరక అమ్మయే కావలయును. అమ్మనే చూడవలయును. అనఁగా "ఆత్మదర్శనమే నాకు గావలతును." అని మొఱపెట్టు బిడ్డలదుఃఖము నెడలించుట అమ్మమైన నీపని. అట్టి లాభము నీవలఁబొందుటకు నీ యడుగుఁదుమ్మిదోయికిఁ బ్రణమిల్లుటే మఖ్యోపాయము. కనుక దానిచే చేయుచున్నానని పల్కుచున్నాఁడు. అనఁగా శ్రీః (బ్రహ్మవిద్యచాస్వరూపిణీ!) ఎల్లరచే నాశ్రయింపబఁడు దానా! నీపాదయుగళము ననఁగా రెండు విధములైన నీ వ్యాపకశ్కతిని(ప్రకావిమర్శశక్తులను) నీకృపవల్లను గురురూపమున వచ్చినీవే పెట్టన తెల్వివల్లను గుర్తంచివానికే ప్రణమిల్లుచున్నాను. ఆత్మార్పణమన్నను శరణాహగతియన్నను ప్రణామన్నను నొక్కటియే.

శ్లో|| శాంత్యైనమో7స్తుశరణాగతరక్షణాయై

కాంత్యైనమో7స్తుకమనీయగుణాశ్రయాయై

క్షాంత్యైనమో7స్తుదురితక్షయకారణాయై

ధాత్ర్యైనమో7స్తుధనధాన్యవివృద్ధిదాయై|| 1

తా|| అమ్మా| శాంతిస్వరూపిణీ! నీకు నమస్కారము. శరణాగతులను రక్షించుదానా! నీకు నమస్కారము. కాంతి స్వరూపిణీ! నీకు నమస్కారము. ఎల్లరుకోరఁదగిన మనోహరమైనగుణములకు నెలవైనదానా! నీకు నమస్కారము. క్షమాస్వరూపిణీ! నీకు నమస్కారము. పాపములను దొలంపఁగారణమైనదానా! నీకు నమస్కారము. భూస్వరూపిణివియు; పెంచుతల్లివియునైన నీకు నమస్కారము. ధనధాన్యము లను విశేషించి పెంపొందిచు నీకు నమస్కారము.

వి|| అమ్మా! శాంతిస్వరూపిణివై న నీకుమామ్రొక్కు. విషయములను భోగించుటయందు యథార్థశాన్తి లేదు. శాన్తియొక్క యాభాసమేయైనను జిత్తమందుఁ బూర్ణప్రశాన్తభావ మేర్పడక శాన్తి జాడ యైనను దొరకకున్నను; విషయలను గ్రహించుటవలన వాని ననుభవించుటవలన

________________________________________

ప్రణామరహస్యమునుగూర్చి నాసాధనసామగ్రినో దేవపూజారహస్యమునో చూచునది.

________________________________________

గల్గిన యస్వాభావికచిత్తవిక్షేపమందు రవ్వంత శాన్తిక్షణకాలము మహృదయములను బవిత్రము చేసినచో నాశాన్తి మూర్తివి నీవే. సర్వభూతములయందును నేమూర్తియింతమో, యంతమో కానవచ్చును. అది నీవ్యష్టిశాంతి మూర్తి. నీవు నీశాంతిమయమూర్తితో మమ్ము నీయొడియందు జేర్చుకొన్నప్పుడే శాంతిస్వరూపము ననుభవింపఁగల్గుదుము. అది క్షణమాత్రమే యైనను అపూరూపమే. అమ్మా! శాంతికై వెలుపల నెక్కడనో వెదుకు నీబిడ్డలకు "నాయనలారా! శాంతి వెలినిలేదు. మీలోనే కల" దని తెలియఁజెప్పుము. నీవు మాయమ్మవు. శాంతిరూపిణివి. నీకుఁబ్రణామము. ఒక్క యపారశాంతి తక్క మఱమియు లేనట్టియు; మూడ విధముల నుడికి పోవుచున్న మాగుండెను జల్లఁబఱచునట్టియు; నీమహాశాన్తియమూర్తి కడకు మమ్ములను గొనిపొమ్ము. అది మధుమయము. అనిర్వచనీయము. ఆ నీ మహతీసమష్టిశాన్తిమూర్తికిమాప్రణామములు.

అమ్మా! శరణాగతులగు వారిన %ిరక్షించుటయే నీశీలము.కాన నీశాంతి స్వరూపము నర్థించియే నీకు మ్రొక్కుచున్నాను. నేను శరణాగతుఁడును. ఆత్మార్పణశీలుఁడను. నీవు రక్షణశీలవు.

అమ్మా! కాంతి (సౌందర్య) రూపముతో నీవే వెల యుదువు. జీవుఁడెంతకుత్సితుఁడై కానిమ్ము; ప్రత్యేకమందును గాంతి యనెడి దొకటిగలదు. మనుజుఁడాకాంతినింతయోయంతయో యమభవింపఁగలఁడు. అంతే గాదు. పూలయందు; స్త్రీలయందు, శశియందు, శిశువలయందుఁగాన్తియేదేనొకవిధముగా నుండుటచేతనే వానిని జూచునపుడు మాచిత్తములు వికసించును. అది నీకాంతియే, జీవదేహమందుఁగాంతిమూర్తితో నమ్మయున్నంతకాలము నీకాన్తి మూర్తిప్రత్యక్షమగుచుండును. ప్రాణిదేహమునందే కాదు. వృక్షలతాగుల్మపర్వతనదీగ్రహనక్షత్రాదులందంతటను నీ కాన్తిమూర్తి ప్రత్యక్ష మగుచుండును ఇదే మాయమ్మవైన నీవ్యష్టికాన్తిమూర్తి. ఇంతే కాదు; అమ్మా! వ్యష్టిగా వినయము, పరోపకారపర్వతము. నిస్స్వార్థత, సత్యమృదుహితవాక్కు, శ్రుతివ్యసనము, కృపాళుత, మున్నగు మనో హరగుణములు లక్షింపఁబడినపుడు ఆవ్యక్తి కురూపియే కానీ, అంగవికలుఁడే కాని వానియందొకవిధమైన మనోహరకాన్తిమాకు గోచరించును; ఆకాంతియు నీస్వరూపమే. కమనీయగుణముల కన్నిఁటికి నీనాటపట్టవు. కావుననే నీవెవ్వరియందట్టి గుణముల రూపముతో వెలయుదువో వారియెడ మాకు నమ్రభావమే కలుగుచుండును. అందుననే "కమనీయగుణాశ్రయా" యనుచు నీకు మ్రొక్కుచున్నాను.

క్రమముగా వ్యష్టివస్తువులను విడచి సర్వభూతమహేశ్వరివైన నీ మహాకాంతివంకఁజూపు పాఱునపుడీసర్వజగత్తు కాంతిమయము, సౌందర్యమయము, మధుమయము నగును. ఈమాక్షుద్రబుద్ధి సాగింనంతవఱకు అమ్మవైన నీకమనీయ కాంతిఁజూచియే మతిపోవు మేము సర్వత్ర ప్రసిరించియున్న రూపహీనకమనీయరూపమును జూచి యనుభవించి యేమైపోవుదుమో? మయహంతాకాంతి నట్టేటఁ గలిసిపోవును. ఆయరూపరూపసాగరమందు మునిఁగిపోయి మేమెట్టి యని ర్వచనీయభవామయత నొందుదుమో! అదియిట్టిదనఁ జాలము, ఏరూపమును జూచిప్రజాంగనలు మయిమఱచిరో, యేరూపమును జడూచి యాఁబసులు సైతము మేఁత మాని నీయందే చూపు నిల్పినవో, యేరూపమును జూచి జడయమునయుఁబ్రాణమయియైముబికిపాఱినదో యది యమ్మా! నీరూపము కాదా? ఆమనోహరకాంతి నొకసారి కన్నారంగన్నవారికి నీజగమున నీడు లేదు. ఆలోభనీయకాంతి మాజీవత్వమునే మఱపింపఁగలదు. విశ్వవ్యాపినియైననీయనంతకాంతి మూర్తికి మాప్రణామము. పిదప నీవ్యష్టిసమష్టికాంతి పుట్టిన యవ్యక్తబీజమైన కారణరూపకాంతిమూర్తికి మాప్రణామములు. ఇఁక నీనిరంజనస్వరూపమును గూఱించిమాటిమాటికి బ్రణమిల్లుదుము. అచటఁగాంతి యన నేదియు లేకున్నను గాంతి యన్నది నీ కాంతియే. అతి కాంతిరూపమునఁ బ్రకాశించినను దాని యవ్యయస్వరుపమునకు రవ్వంతయు వ్యయము లేదు. ఆపరమకమనీయపరమప్రేమాన్పదపరమాత్మస్వరూపమునకుఁబునఃపునఃప్రణామముల.

పరులచేఁ బీడింపఁబడియు దాని బదులుసేఁతకగు సామర్థ్యముండియు నప్యపకారము సూరక యోర్చు సామర్థ్యమనెడి క్షాంతి (క్షమా) రూపముతో నీవే యున్నావు. నీకు నామ్రొక్కు. మాహితచింతకులు పీడించిననునోర్చుకొను నటులే మాటయహితపీడను సైతము సహించు శక్తి కల్గినపు డాక్షమామూర్తితో నీవే మమ్మొడిని బెట్టికొందువు. అట్టి పరాపకారసహిష్ణుతయే నీక్షమామూర్తి. నీ యీవ్యష్టిక్షమామూర్తికి మాప్రణామము. ఆనీమూర్తియే మాకు శాంతిని గూర్చును.

ఆక్షమామూర్తిసర్వభూతములందు సమష్ఠిస్వరూపబోధముగా వ్యాపించినపుడాహ్లాదోత్సాహరూపముతో నూరింతలుగా హృదయమందు విచరించును. అమ్మా! ఆవిశ్వవ్యాపి క్షమామూర్తినీవే. అమ్మవు నీవు. క్షమయే నీమూర్తి. అపరాధమింతయు లేని; యపకారమిసుమంతయు లేని; యన్యాయము రవ్వంతయు లేని, స్వేచ్ఛాసంచారస్నేహ బహిర్వికాసముగల క్షమామూర్తివి నీవే. నీవు రెప్పవేయక మావంకనే చూచుచున్నావు. కనుకనే మేమున్నాము. కాకున్న నీయకృతజ్ఞజీపజగ్తత్తునక స్తిత్వమేయుండదు. నీసత్తనంగీకరింపని యకృతజ్ఞజీవగత్తునుసైతము సాకుటే నీక్షమామూర్తి కపూర్వోదాహరణము. నీసమష్ఠిమహాక్షమామూర్తికి నాప్రణామములు. బీజరూపిణివియు, నవ్యక్తకరు ణామూర్తివియునగు నీకుం బ్రణామము చేయఁగల్గినపుడే నీనిరంజనక్షేత్రమందు మేము చేరఁగల్గుట. అచట క్షమయు నక్షమయు లేవు. దానిసత్తపైనే క్షమ నిల్చియున్నది క్షమారూపముగా వెలసినను దాని నిర్గుణసత్తకు వెల్తిలేశమును లేదు.

అమ్మా! నీవు శాంతిరూపముగా వెలయని జీవుని హృదయమే సర్వపాపములకునునిలయమైయుండును. కనుక నీరూపమైన క్షమయే సర్వదురితములను దొలగింపఁగలది. కనుక మాయందు క్షమారూపమున వెలసి మమ్ము దురిత దూరులను జేయుము.

అమ్మా! ధాత్రిరూపమునవలయు నీకు నమస్కారము. భూస్వరూపమున వెలయు నీకు నస్కారము. సర్వమున కాధారభూతవై నీవు ధరింపకున్న నెట్టి పదార్థమునకును నిల్చుశక్తిలేదు. సర్వమును నీగుండెయందుంచుకొని ధరించిచుచున్నావు. నీమధ్యాకర్షణశక్తిచేత నీవేసర్వపదార్థములను ధరించి యుంటుచే కాక దురూహమైన వేగమున నాత్మప్రదక్షిణములు చేయుచు, అటులే దురూహమైన వేగమున సవితృమండల ప్రదక్షిణములు చేయుచున్నావు. సవితృమండలమధ్యవర్తియగు విష్ణువు నిన్ను ధరించుచున్నాఁడు. నీవు మమ్ము ధరించుచున్నావు. కనుక విష్ణువునకు ధరణిధరుఁడను నామము ప్రసిద్ధము. నీ వావిష్ణువునకుఁబ్రియవుకనుకనే ధరిణీధరవల్లభవు. తన మధ్యాకర్షణ శక్తిచేత విష్ణువు (సూర్యఁడు) నిన్ను ధరించుచుండగా నీమధ్యకార్షణశక్తి చేత మమ్ము ధరించుచున్నావు. కనుక నీవు ధాత్రివి. మఱియు ధాత్రివి అనఁగా మాపెంపుడుతల్లివి. మముఁగన్నతల్లులు శైశవమందు స్తన్యదానమాత్రము చేతనే పెంతురు. అన్న ప్రాశనసంస్కారమైన నాఁటినుండి నీవవ్యాజకృపతో మాకిచ్చు సకలవిధధాన్యాదిసస్యముల వల్లనే మాయన్నమయకోశపోషణమగుచున్నది. నీవు రత్నసువర్ణాదిధాతువులను ధరించినదానవు. వసుంధరవు. ఆరత్నసువర్ణాదురు మాజాగతికధనము. అంతే కాక పృథుశరీర ధారిణి వుగుటే పృథ్వీనామవైన నితత్త్వము నెఱింగి కొన్నపుడు జ్ఞానమనెడి యమూల్యధనము మాకబ్బి ప్రాణమయమనోమయాదికోశములకు సైతము పోషణద్రవ్యము నిచ్చు ధాత్రివి నీవే యని తేలిసికొనఁగలము. నీతెలివి గల్గినపుడే నీవల్లభుఁడైన విష్ణుని తెలివియు మాకుఁగల్గును.

శ్లో|| శ##క్తై నమో7స్తుశశిశేఖరసంస్తుతాయై

రత్యై నమో7స్తురజనీకరసోదరాయై|

భ##క్త్యై నమో7స్తుభవసాగరతారకాయై

మత్యై నమో7స్తుమధుసూదనవల్లభాయై|| 11

తా|| శ్రీదేవీ! నీవు శక్తివి. చంద్రశేఖరునిచేఁగొనియాడఁబడినదానవు. అమ్మా! నీవే రతిదేవివి. నీవేచంద్రుని తోఁబుట్టువవైనలక్ష్మీదేవివి. నీవేభక్తిస్వరూపిణివైసంసారసముద్రమును దాటించుదానవు. నీవే మతిస్వరూపిణివి. మధువను నసురుని మట్టిపెట్టిన విష్ణువునకఁబ్రియవు. నీకు మానమస్కారము.

వి|| అమ్మా! నీవు శక్తివి అసాధారణసమార్థ్యరూపమున వెలయుచున్నావు."శక్తిః కుండలినీతి, యా నిగదితా ఆ, ఈ, మ, సంజ్ఞాజగ న్నిర్వేహేసతతోద్యతా" (త్రిపురాసారము) జగన్నిర్వాహకత్వమునఁగా సృష్టిస్థితిలయాదులైన యనన్యసాధారణమైన కార్యములయందు సామర్థ్యమే. అపుడు నీవు సమిష్టికుండలినీశక్తివి. నీవే పిండాండముందుండి సర్వకార్యములను నిర్వహించుదానవు. అపుడు నీవు వ్యషికుండలినీశక్తివి. నీవు శశిరేఖరసంస్తుతవు. శక్తివైన నీతోఁగూడుటచేతనే సృష్టిని గావించి కాముఁడనఁబడు శివుఁడు సృష్టిస్థితిలయాది ప్రభువుగా నెన్నఁబడుచుండుటచే నాతఁడును నిన్ను గొనియాడుట సహజము. కనుకే నిన్నుఁగామేశ్వరి, కామాక్షి, కామపూజిత, కామమోమిని మున్నగు వేళ్లతో శాస్త్రము కొనియాడినది.

రత్యైనమో7స్తు- రతిరూపమైన నీకు నమస్కారము. జగత్తునందసమానసౌందర్యవతి యని వాసి కెక్కిన మన్మథుని భార్యయైన రతిదేవిరూమున నీవెయై యున్నావు. సృష్టిని గామించినపుడే శివుఁడు కాముఁ డనిపించుకున్నాఁడు. కావున గామపత్నివైన రతివి నీవే, రతికి జగద్విఖ్యాతిఁదెచ్చిన సౌందర్యరూపమున నీవే వెలయుటచే రతిరూపపు నీవే, మఱియు రతి యనఁగా నాసక్తి. అది సృష్టి కామరూపమైనది. రతిభర్తయైన మన్మథుని వేళ్ళన్నియు శివునకునుంజెల్లును. సౌభాగ్యవిద్యాన్యాసములందు '' ఈశానమనోభవమూర్ధ్నే నమః --- తత్పురుషమకరధ్వజవక్త్రాయ నమః --- అఘోరమన్మథహృదయాయ నమః-- వామదేవ కందర్ప గుహ్యాయ నమః -- సద్యోజాతకామరాజపద్భ్యాం నమః'' -- అని తంత్రములందు మన్మథుని వేళ్లే కామేశ్వరుఁ డైన నీ భర్తకును బ్రసిద్ధముగఁ జెల్లుచున్నవి. కావున శివురాణివైన నీకు రతినామము సార్ధకము-- కావమకళవు నీవే. అనఁగాఁ గాముని శ్రేష్ఠశక్తిని నీవే. నీ కామకళారూపము నుగ్గడించు బీజాక్షరము-- 'ఈం' కారము శ్రీ సూక్తముందు మహాలక్ష్మీబీజముఁగాఁ బేర్కొనఁబడినది. ఇదే ''పద్మినీ మీం శరణమహం ప్రపద్యే'' (శ్రీ సూక్తము). మఱియు మాతృకాసరస్వతీస్తుతియందు ''తామీకారాక్షరోద్ధారా సారాత్సారాం పరాత్పరాం ప్రణమామి మహాదేవీం పరమానందరూపిణీం'' అని కొనియాడఁబడినది. కనుక నీవే మహాలక్ష్మీని నీపుట్టిన తావుసముద్రమని పురాణప్రసిద్ధము. నీతోఁబుట్టువేచంద్రుఁడనియుఁబ్రసిద్ధము. సముద్రుఁడనఁగా మనోరూపము నొందని యనఁగా నెట్టి సంకల్పము లేని నిర్గుణపరమాత్మ. పరమాత్మకే సముద్రశబ్దము శ్రుతి ప్రసిద్దము. సముద్రమథనమనఁగా నిశ్చలానంద స్వరూప పరమాత్మయందు సంకల్పము కలుగుటే. ఆ కలుగునపుడు లక్ష్మీపేర నీవే వెలసితివి. తచ్ఛక్తివేయైన నీవు వెలిసితివి. నీతోడనే చంద్రుఁడుచయించెను. ''చదిఆహ్లాదనే, రకిదీప్తౌ'' అను రెండు ధాతువులవలన నుత్పన్నమైనది చంద్రశబ్దము అనఁగా నానందము దీప్తియు ననెడి రెండు లక్షణములు కలవాఁడు చంద్రుఁడు, నిశ్చలానందసముద్రుఁడైన పరమాత్మ సంకల్పముచేతనే చంద్రుఁడుచయించెను. దీప్తియనఁగా జ్ఞానము. జ్ఞానానందస్వరూపుఁడని యర్థము ''సూర్యాచంద్రమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌'' శ్రుతి. కనుకనే నీవు చంద్రసోదరి వైతివి. నీకుఁ బ్రసిద్ధమైన ''ఈం'' కారమే సౌభాగ్యవిద్య వేరిటి పంచదశాక్షరవిద్యయందు (కాదివ్యయందు ) ఇమిడియున్నది. కనుకనే ఉపనిషత్తు ''ఏషా పంచదశాక్షర్యేవ షోడశాక్షరీ'' అని షోడశాక్షరీమహావిద్యయందు షోడశాక్షరముగా 'ఈం' కారమునే ప్రతిపాదించినది. ఆయుపనిషత్తునందే యీవిషయము ''చత్వారిఈంబిభ్రతి క్షేమమంతః'' క్షేమమనఁగా లక్ష్మీబీజము. అదే ''ఈం''. నీశక్తితత్త్వము నెఱింగిన వరిలో నీవే భక్తిరూపమున నుదయింతువు. భక్తి పేరిటి ప్రీతి నీయెడల నాటుకొనుటకు నిన్ను గూర్చిన తెల్వియే మూలము. ఆత్మజ్ఞానమే భక్తినుత్పాదించును. జ్ఞానమే భక్తియని శ్రీశంకరభగవత్పాదులను దమ యుపదేశ సాహస్రియందు నుగ్గడించిరి. నీమహిమపారమ్యాదులను స్మరించుచు నీకంటె వేఱు కానిదే 'నేను' అనెడి జ్ఞానము స్థిరంపడి నపుడు సాధకజీవుఁడు నిను విడిచి యుండలేఁడు. ఆ యవస్థయే భక్తి, అనఁగా ''త్వమేవాహం'' అనెడి జ్ఞానమందు నిల్వఁగల్గినపుడు పరమానందస్వరూపిణివైన నీవు భక్తుల కచ్చుతవై సంసారసాగరమును దాటించు తెప్పవై ధన్యులఁ జేయుదువు.

ఓతారాదేవీ! నీకు నమస్కారము. తాత్కాలిక ప్రయోజనమందుఁ బ్రవర్తించు మనస్సునకే మతి యని వేరు. అట్టి నీకు నమస్కారము. నీవు మధుసూదనవల్లభవు. మధువను రాక్షసుని మట్టుపెట్టిన విష్ణువునకుఁ బ్రియవు. నీకు నమస్కారము. పరమార్థ మేమనఁగా మధుకైటభులు విష్ణునాభికమలమందుండిన నలువను జంప నెంచి వచ్చినపుడు విష్ణుని కన్నులను యోగనిద్రారూపమున నీవు క్రమ్మియుంటివి. అపుడు విష్ణువుచేతనే యారాక్షసులను జంపించుటకై బ్రహ్మ నిన్ను స్తుతింపఁగా నిదే తాత్కాలిక ప్రయోజనమని నీవు యోగనిద్రారూపమును విడిచి విష్ణుని మేల్కొల్పితివి. అదే నీమతిస్వరూపము. కేశవాదులు దానినే పూజింతురు. కనుక నే మధుసూదనవల్లభవు. కావుననే యిచట మధుసూదనవల్లభాయై అనఁబడినది. ''యానుభూతిరుదితా మతిః పరా వేదమాననిదరతా శుభా వహా తామతీవ సుఖదాం వయం శివాం కేశవాదిజనసేవితాంనుమః'' -- (సూతసంహితా) మధుకైటభులు. విష్ణునాభికమలమందు బ్రహ్మనసించుట మహాలక్ష్మీయొక్క యోగనిద్రాస్వరూపము మధుకైటభనాశనము-- అను వాని యాధ్యత్మికరహస్యార్థము నావ్రాసిన సాధనసామగ్రి మొదటి మూటయందు విపులముగాఁగలది చూడుఁడు. అంతే గాక మనస్సునం దనుభూతి కల్గినపుడు దానికే మతి యనిపేరు అనుభవజ్ఞానమును గల్గించు సాధనము కలది. అట్టి యనుభవజ్ఞానముతోఁగూడిన మానసికావస్థకే మతి యని పేరు. అదియే మంగళప్రద; శుభావహ; అదియే శివభక్తి.

శ్లో|| లక్ష్మ్యై నమో7స్తు శుభ లక్షణ లక్షితాయై

సిద్ధ్యై నమో7స్తు శివసంగసుపూజితాయై|

దృత్యై నమో7స్త్వమితదుర్గతిభంజనాయై

గత్యై నమో7స్తు వరసద్గతిదాయి కాయై||

తా|| అమ్మా! నీవు లక్ష్మివి. శ్రీంబీజరూపిణివి. శ్రీంబీజము లక్ష్మిని ననఁగా ధనధాన్యసువర్ణరజతగృహ పుత్ర దారాది పార్థిలక్ష్మీస్వరూపిణికిని. బ్రహ్మవిద్యారూప సరస్వతికిని జెల్లును. తద్రూపిణివైన నీకు నమస్కారము. శుభలక్షణలక్షితవైన నీకు నమ్రొక్కు. సిద్ధిస్వరూపిణివియు, దేవసుఖుఁడైన కుబేరుని చేఁబూజింపఁబడుదానవునైన నీకు నమస్కారము. ధారణశక్తి స్వరూపిణివైన నీకు నానమస్కారము. జననమరణచపేటలనెడి దుర్గతిని బోగొట్టు నీకు నమస్కారము. గతిరూపిణివైన నీకు నామ్రొక్కు. మోక్షమనెడి సద్గతి నొసంగు నీకు నాయేటికోళ్ళు.

వి|| అమ్మా! నీవు లక్ష్మివి. శ్రీంబీజరూపిణివి. శ్రీంబీజము లక్ష్మికిని, అనఁగా ధనధాన్యసువర్ణ రజతగృహపుత్త్ర దారాదిపార్థివలక్ష్మీస్వరూపిణికిని, బ్రహ్మవిద్యారూపసరస్వతికిని; జెల్లును. తద్రూపముతోడి నిన్నుఁ బూజించు శుభ తిథియే శ్రీ పంచమిపేరఁబ్రసిద్ధము. చైత్రశుద్ధపంచమినాఁడు మొదలు పూర్ణిమాంతముగా బ్రహ్మవిద్యాస్వరూపిణిగా నిన్నుఁబూజింతురు. నీవు సర్వలక్షణసంప్నవు. సర్వదా భక్తుల నొకకంటఁ జూచుదానవు. కనుక లక్ష్మివి. సౌందర్య రూపిణివి. సంపద్రూపవు;

అమ్మా! నీవు శుభలక్షణక్షితవు. ఒక వ్యక్తి యందేని, ఒక పదార్థమందేని, శుభలక్షణములు కాన వచ్చినపుడు నీవే యట్టిరూపముతోనిలిచి యున్నావని గుర్తింపవలయును. ఒకవ్యక్తియందు సత్యము. శౌచము, శ్రుతివ్యసనము, ఆత్మాభిముఖ్యము, దయాళుత్వము, సత్సాంగత్యము మున్నగు లక్షణములు కానవచ్చినపుడు నీవే యట్టిలక్షణములతో నచట నిలిచియున్నావని గ్రహించుకొందుము. అట్టి నీపుత్త్రుఁడు కాయికముగా దుర్బలుఁడేకాని, కురూపియేకాని, ఏయాశ్రమమందుండనీ వానియందు నీవే లక్షింపఁ బడుదువు. అట్టి నీకు నమస్కారము.

అమ్మా! నీవు సిద్ధి స్వరూపిణివి. అణిమాద్యష్టసిద్ధులును నీస్వరూపము లే. అంతే గాక భగవంతుడు తనగీతావాక్యములలో జాగతివాంఛాసిద్ధియే సిద్ధి యనక యాత్మజ్ఞాన సిద్ధినే సిద్ధియని రూఢి చేసినాఁడు. అట్టి జ్ఞానసిద్ధి శివసంగులకే కలుగును. కనుకనే వారు నిన్నుఁ బూజింతురు. అనఁగా శివ సంగమును, బరమాత్మతో నెడయకుండుటను, అనఁగా 'శివో7హం' అనెడి మహావాక్యార్థసిద్ధికై శివస్వరూపవు. సిద్ధిస్వరూపవునైన నీవే పూజింపఁబడుదువు. శివసంగుఁడనఁగాఁగుబేరుఁడు. సుప్రసిద్ధశ్రీవిద్యోపాసకులగు పదునైదుగురిలో (శివసంగులలో) కుబేరుఁడొకఁడు. అతనిచేఁబూజింపఁబడుదానవు. శక్తివైన నిన్ను ఁ బూజింపక శక్తిమంతుని జాడ దొరకదు. సర్వదేవతా గాయత్రీమంత్రములయందును శక్తిధ్యానమే సాధకుల ధీప్రచోదనమునకు హేతువను నుపదేశము, ఆదేశము కానవచ్చుచు సాధకవ్యవహారముందుఁదప్పనిదైనది.

అమ్మా! ధృతిస్వరూపిణివి నీవే. ధృతి యనఁగా నింద్రియములచేత గ్రహింపఁబడిన యెట్టి విషయమైనను జిత్తమునుండి జారిపోవకుండుటే. దీనికే ధృతి యని పేరు. అది లేనిచో జనున కెన్ని దుర్గతులో కల్గును. ధృతి యనెడి యీమానసికావస్థయే స్మృతి యనఁబడును. శ్రీశంకరాచార్యులు ధృతిరూపస్మృతినే ''బ్రహ్మాహమస్మీతి స్మృతదేవమేధా'' అని మేధగా వర్ణించిరి. అమ్మా! ధృతిరూపమున నీవు నీ బిడ్డల ననుగ్రహించినపుడే వారికి దుర్గతులుండవు మఱియు ధృతి యనఁగా ధారణార్థకమే. కాక ధైర్యము ధీరుఁడై యుండుటే ధైర్యము. ధేరుఁడనఁగా నెవ్వనిచిత్తము మారిపోదగినకారణము పట్టినను మారదో వాఁడే ధీరుఁడు. ''వికారహేతౌ సతి విక్రియంతే యేషాం న చేతాంసిత ఏవధీరాః'' (అని కాళిదాసుఁడు) ధృతి యనెడి యిట్టి భావము లేనివారే మాటిమాటికిని విషయములచేత నాకర్షింపఁబడుచు మన్సును మార్పులకై యొప్పగించి దుర్గతి పాలగుదురు. అనఁగా సుఖదూరు లగుదురు. సంసార బంధమును వీడ్చుకొనలేరు. కావున ధృతిరూపమున నీబిడ్డని హృదయమున నీవే వెలిసి, దుర్గతి భంజనము చేయుదువు. మఱియు ధృతిపదము యోగవిశేషమునకును, అధ్వరమునకును జెల్లునుగాన, నీవే ధృతియోగరూపవు; యజ్ఞ రూపపునై తత్సాధనవిశేషమున వెలసి సాధకుల దుర్గతిని దొలగింతువు. కనుకే ధృతిరూవై దుర్గతిని భంజించు నీకు మ్రొక్కుచున్నాము.

అమ్మా! మాగతిరూపమున నీవే వెలయుచున్నావు. ప్రతి జీవుఁడును. బ్రతిక్షనమందును నీవైపున కే పరుగిడి వచ్చుచున్నాఁడు. ఉపలభ్యమానగతిరూపమున నీవే వెలయుచున్నావు. నీవు స్వరూముచే నిర్వి కారవు. నీవు నిత్యస్థిరవైనను జీవుల గతిరూపమున భాసిల్లుచున్నావు. జీవులెల్లరు నీయీగతిమూర్తిని గానలేకుందుటచేతనే హతాశులై భగ్నోద్యములై విషష్ణులై చెడుచున్నారు. తెలిసియో తెలియకో జీవుఁడు నీవైపునకే వచ్చుచున్నాఁడనుట తెలియ లేకుంటచేతనే స్వజనముతోనో, విత్తముతోనే యెడబాటు కల్గినపుడు దుఃఖపడి చెడుచున్నాఁడు . జీవుఁడు నిన్ను మఱుచుచున్నాఁడు. కాని నీవు మాత్రము జీవులను మఱువవు. అమ్మా!జీవుఁడు నీగతిమూర్తిని జూచి యుద్యమశీలుఁడు కాఁగోరెనేని వాని లోలోనే యొకయసంతృప్తి, యొకయపూర్ణత, సరవదా తలయెత్తుచేనే యున్నవి. అదె నీగతిమూర్తి. నిన్నుఁజూచ యాదరించి ప్రణమిల్లవలయును. నిన్ను దుర్జేయనుగా నెంచి మోసపోరాదు. నీ వెంత సులభముగా దొరకుదానవో తెలిసికొనవలయును. కోరిన వస్తువొకటిలభించినంతనే జీవునిలో నుత్తరక్షనముందే మరల నసంతృప్తి తలయెత్తుచుండును. ఈయసంతృప్తి నీయెడనే పరిసమాప్తి నొందును. నీయందుఁబూర్ణముగా నాత్మవిస్మృతి కలుగనంత దాఁక వాని యసంతృప్తి యణఁగదు. శుద్ధబోధస్వరూప వైన నీయందుఁజేరిపోఁగల్గుటచేతనే యీయతృప్తి తొలఁగి పరితృప్తి లభించును. నీవే గతిరూపమైన జననమరణపరం పరను దాటించుకొనిపోవుచుందువు. జీవుఁడొక్కక్షణమైనను స్థిరముగానుండు నుపాయము లేదు. తాను దనమనస్సు చంచలమని యెంతగా ధిక్కరించుచున్నాఁడో తనకు తెలియకయే యెంతగా నకర్మణ్యుఁడగుచున్నాంఁడో యూహించుకొనవలయును. కాని నీవే గతిరూపముఁ బ్రతిక్షణము తన్నుఁజంచలునిఁగాఁ జేయుచున్నావని కానలేకున్నాఁడు. అసంతృప్తియే గతిలక్షణము. గతి యున్నంతదాఁకఁ జిత్తము చంచముగానేయుండును. జీవుఁడు అయ్యో! తన చిత్తవిక్షేపమును గనాక నీగతిమూర్తిని గాంచి ముగ్ధుఁడగు చున్నాఁడు. నిన్నుఁబొందెననుచు విశ్వసింపవలయును. తన యసంతృప్తి తొలఁగిపోవుట తానే కనుఁగొనును. అపుడు మాయమ్మ మహాలక్ష్మియే సద్గతిదాయికయని గ్రహింపఁగలఁడు. అనఁగాఁ ద్రికాలాబాధ్యపరశివస్వరూపమును జేర్చుదానవు నీవే యని జీవుఁడెఱుంగఁగలఁడు.

శ్లో|| దేవ్యై నమో7స్తు దివి దేవగణార్చి తాయై

భూత్యై నమో7స్తు భువనా ర్తివినాశికాయై,

దాంత్యై నమో7స్తు ధరణీధరవల్ల భాయై

పుష్ట్యై నమో7స్తు పురుషోత్తమ వల్లభాయై. 13

వివ|| అమ్మా! నీవు దేవివి. ద్యోతనక్రీడనశీలవు. సర్వబ్రహ్మాండజాలరూపమున నిన్ను నీవు వెలయించుకొనుటే కాక వానితో సృష్టిస్థితిసంహారతిరోధానానుగ్రహములనెడి యైదాటల నాడుకొందువు. ఇమ్మాట తెలిసి జ్ఞనావంతులై దేవగణములలోఁ జేరినవారెల్లరు సృష్టిస్థితియాదికారణ భూతమహాదేవిని నీవే యని నిన్నే పూజింతురు. కావున నీవు దేవగనార్చితవు. నీకు నమస్కారము.

అమ్మా! నీవు భూతివి. శుద్ధసత్త్వగుణస్వరూపపు. 6 వ. మంత్రమందుజెప్పఁబడినట్లు నీవు భూతికరివి మాత్రమే కావు. భూతిస్వరూపవును నీవె. అణిమాద్యష్టభూతుల స్వరూపమును నీదే. భూతి యనఁగా నైశ్వర్యము. ఎవ్వరి సంకల్ప మమోఘమో యతఁడీశ్వరుఁడు. ఈశ్వరభావమే యైశ్వర్యము. అనఁగా సర్వసమర్థత. దేనియందేని, యే వ్యక్తియందేని, సామర్థ్యమేదేనిఁదోఁచిన, నయ్యది నీవిభూతియే. నీసామర్థ్యమే. అట్టి నీభూతిమూర్తి నెఱింగికొని సేవించిన వారియెడ నట్టి భూతి (ఐశ్వర్య) రూపముననే సాక్షాత్కరించి వారి వారి యార్తులను దొలఁగింతువు. కనుకనే నీవు భువనార్తివినాశికవు. సౌఖ్యప్రదాయికవు. అట్టి నీకు మానమస్కారము.

అమ్మా! నీవు దాంతిస్వరూపిణివి. ఇంద్రియక్షోభమును సహించుట, బ్రహ్మచర్యాదిక్లేశముల నోర్చుకొనుట యనునదే దాంతి. ఆరూపముతో నీవే వెలయుచున్నావు. నీకు నమస్కారము.

ఓర్పునకుం బ్రసిద్ధి కెక్కినది నీస్వరూపమైయేన ధరణి. భూస్వరూపవై విశ్వమునంతటిని ధరించుటచేత నీవే ధరణివి. అట్టి యసామాన్యశక్తిస్వరూపిణివైన నిన్ను ధరించువాఁడు ధరణీధరుఁడు. విష్ణువు. సర్వంసహ (అన్నింటిని సహించునది) యనుపేర వెలయు భూరూపిణివైన నిన్ను ధరించుట చేతనే విష్ణువునకు ననఁగా సర్వత్రవ్యాకనశీలుఁడైన భగవంతునకుధరణీధరనామము. ప్రసిద్ధము. సర్వకారణభూతశక్తివైన నిన్ను ధరించుటచేతనే తాను నీకంటె వేఱుకాని భగవమనెడి షడైశ్వరస్యసంపత్తికలవాఁడై భగవంతుఁడని వాసికెక్కిన వానికి నీవే ప్రీతినిగూర్చుదానవు. ప్రీతిపాత్రమవునీవే. కనుక నీవు ధరణీధరవల్లభవు.

పక్షాంతరమున ధరనీధరమనఁగా భూమిని ధరించునది. పర్వతము. హిమవంతముఁడనుపేర వెలయు పర్వతమునకు బొట్టెవై వెలిసి, ప్రేమపాత్రమవగుటచేతను నీవు ధరణీ ధరవల్లభవు. ''అస్త్యుత్తరస్యాం దిశి దేవ తాత్మా హిమాలయో నామ నగాధిరాజః'' (కాళిదాసుఁడు) పరదేవత వైన నీవు దేవతాత్ముఁడైన నగాధిరాజహిమవంతునకు బొట్టెవై పుట్టి ప్రీతిఁగొల్పుట వింత గాదు; ధర్మము. కావుననే హిమవంతుని బిడ్డవై వాని విజయపతాకవై ప్రీతి గల్గించితివి. చైతన్యమయివైన నీవు తన బొట్టెవగుటచేతనే పార్వతీనామమునఁబరఁగి శివునకును వల్లబవైతివి. కావున నీ స్తుతియందే ''శివసంగసుపూజితా, శివా,'' మున్నగు నామములతో నిన్నుఁ బేర్కొనుట అయినది.

అమ్మా! నీవు పోషణశక్తిస్వరూపిణివి. సర్వభూత ములకును బుష్టి నొసంగుచున్నావు. సకలజననివి, భూత ధాత్రివి. నీవే కనుక దేవని కేవిధమైన పుష్టి కావలెనో దానిని నీవే పెట్టుచున్నావు. సస్యాదులచేఁబోషింపఁబడు శరీరములకు భూస్వరూపవై నీవే సర్వసన్యముల నీనుచున్నావు. నీవే చంద్రస్వరూపవై యోషధీతతులఁబెంచు చున్నావు. నీవే సూర్యస్వరూపవై భూతములకు దృష్టిపుష్టినొసంగుచున్నావు. అంతే కాదు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయకోశములకుఁ బుష్టి నొసంగుచున్నావు. అన్నాపూర్ణేశ్వరివి. దేవీ! నీకు నమస్కారము.

అమ్మా! నీవు సర్వభూతముకు సర్వవిధుల పుష్ట నొసంగుటచేతనే నీవల్లభుఁడైన విష్ణువునకు జగత్‌ పుష్టికర్తయనుమాట దక్కినది. కనుకనే నీవాతనికి వల్లభవు. మఱియు సర్వమందును నీపుష్టమూర్తిని దర్శించి నమస్కరించు పురుషశ్రేష్ఠులను నీవు ప్రేమఁజూతువు. వారును నీకమనీయమైన నీపుష్టిమూర్తిని దర్శించి మేలొందుటచే నీయెడలఁబ్రీతివేరి భక్తిని జూపుదురు. అమ్మా! నీకు నమస్కారము.

శ్లో|| సుతీవ్ర దారిద్ర్యవిదుఃఖహంత్ర్యై

నమో7స్తు తే సర్వభయాపహంత్ర్యై,

శ్రీవిష్ణువక్షః స్థలసంస్థితాయై

నమోనమః సర్వవిభూతిదాయై,

తా|| జనులను మిగుల బాధించు లేములను వాని వల్లనైన దుఃఖములను బోఁగొట్టునట్టినీకు నమస్కారము. సమస్తమైన భయములను దొలఁగించు దానవును, శ్రీమహావిష్ణుని వక్షఃస్థలమందు నిలిచి యున్న దానవును, బాహువిధములైన సంపదల నొసంగుదానవును, నగు నీకు మా నమస్కారము.

వి|| అమ్మా! జనులను మిగుల బాధించు లేములును వానివల్లనైన దుఃఖములను బోగొట్టుదానవు. నీవు మహాలక్ష్మివి. సకలజననివి. బిడ్డల లేములను జూచి యోర్వఁ జాలవు. ఆలేములవల్లనైన దుఃఖములను, భయములను బోఁగొట్టుదానవు నీవే. దీనిని మఱింత పరిష్కారభావముతో దెలియ యత్నింతము. దారిద్ర్యములు వివిధములు. ధనదారిద్ర్యము. విద్యాదారిద్ర్యము, సంతానదారిద్ర్యము, మున్నగునవన్నో కలవు. వానివల్ల నే యనేక భయములు. దారిద్ర్యమనగా నభావబోధమే. అభావబోధమనఁగా లేమి తోఁచుటయే. అభావబోధ ముండుటవల్లనే దుఃఖము కల్గును దుఃఖముచేతనే భయము కల్గును. కనుక దారిద్ర్యదుఃఖభయములనెడి మూడును నొండొంటితోఁ గలిసియుండును. ఈ దారిద్ర్యమనునది చిత్తధర్మము. చిత్తమందెల్లప్పుడు నేదేనొక భావముండనే యుండును. ఈ యభావబోధమును (దారిద్ర్యమును) దొలఁగించుకొనుటకే యీ జగత్తునందీ కోలాహలము పరుగులెత్తుట, ఎంత కూడఁబెట్టనీ యెంత భోగింపనీ, చిత్తక్షేత్రమందింకను గ్రొత్తలేములు తలసూపుచునే యుండును. ఈ దారిద్ర్యము తొలఁగక దుఃఖభయము లెన్నఁడును దొలఁగిపోవు. ఇక్కాలమందు దేశమందంతటను వ్యాపించి భయానకదరిద్రతామూర్తిరూపము కానవచ్చుటకు ఈయభావబోధమేకారణము. అభావబోధమెంత యధికముగా నున్నదో యంతగా సామగ్రిసంచయము, భోగము ననువాని యభావములేదు. ఏవస్తువు లభించినంత నీయభావము తొలఁగునో చెప్పనా? అదే బుద్ధి. అట్టి బుద్ది యోగము నిన్నుఁ గొల్చుటచేతనే మాకు లభించును. అమ్మా! నీవే కృష్ణరూపమున ''బుద్ధియోగం దదామ్యహం'' అని గొంతెత్తి చేయెత్తి యభ యవాగ్దానము చేసితివి. బుద్ధి యననేమి? ''తత్త్వజ్ఞానలక్షణా బుద్ధిః'' . ఆ బుద్ధి యశుభముగా (మలినముగా) నుండునంతదాఁక సర్వవిధముల యభావముల నశింపజేయఁగల వస్తువుయొక్క స్వరూపమే గానఁబడదు. కనుకనే యభావబోధ మేవిధముగాను తొలఁగదు. గాన శుభమతి (నిరమలినమైన మతి) యావశ్యకము. అది సర్వమంగళ##వైన నిన్ను స్మరించుటచేతను, మ్రొక్కుటచేతను, లభించును. ఏది లభించినంత మఱద్దాని లాభమును గొప్ప దనిపించదో. దేనియందు నిల్వఁగల్గుటచేదుః సహ దుఃఖ భయములు వచ్చి పడినను చెదరుపాటుండదో, యాపరమానందమయసత్యవస్తు వేదో, యేది లభించుటచే దారిద్ర్య దుఃఖభయములు కడుందొలఁగిపోవునో దాని జాడ నెవ్వరు చూపుదురు? దాని యాచూకి నెవ్వరిత్తురు? మాచేయు నమస్కారమువలన నీ సహజప్రసాదగుణములవలన లభించు శుభమతియే (నిర్మలబుద్ధిసత్యమే) ఉపనిషద్భాషయందు దీనినే ప్రజ్ఞయందురు.

''అపరోక్షానుభపర్యంతవిచారిణీ బుద్ధిః ప్రజ్ఞా'' ప్రజ్ఞ ప్రకాశించునపుడే జీవుఁడు పరమాత్మవైన నీస్వరూపానుభవము చేయఁగలఁడు. అపుడీలేములు, గొడవలు భీతులు నన్నియుఁదొలఁగిపోవును. అపుడే నీకు భక్తివినమ్రులమై నమస్కరింతుము. అమ్మా! జీవత్వాహంకారము విడిచి నమస్కరించుటే పుత్త్రత్వము; తీవ్రదారిద్ర్యదుఃఖ భయములను దొలఁగించుటే నీమాతృత్వము.

సప్తసతియందు మహిషాసురవధానంతరము శక్రాదులు చేసిన స్తుతియందలి ''దుర్గేస్మృతా హరసి భీతిమ శేషజంతోః, స్వస్థైః స్మృతా మతిమతీవ శుభాం దదాసి | దారిద్ర్య దుఃఖభయహారిణి కాత్వదన్యా, సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా||'' అనునీమంత్రవ్యాఖ్యయే యీలక్ష్మీహృదయమందలి ''సుతీవ్రదారిద్ర్యవిదుఃఖహంత్ర్యై నమో7స్తు తే సర్వభయాపహంత్ర్యై||-- అనుమంత్రమునకు జెల్లును.

అమ్మా! జగత్పాలనశీలుఁడగు విష్ణుఁడు సకలజననివైన నీసంతానమునకగు తీవ్రదారిద్ర్యదుఃఖభయములను నమస్కారమాత్రమేచేతనే తొలగింపఁగల శక్తిమతివైన నిన్ను వక్షమందు సుస్థిరముగా ధరించినాఁడు, అనుటను దెల్పుటకే మంత్రమందు 'శ్రీవిష్ణువక్షఃస్థలసంస్థితా' అని చెప్పఁబడినది. శ్రీ+విష్ణు= లక్ష్మితోఁ గూడినవిష్ణువు. శవర్ణ, రేఫ, ఈ కారములు చేరి శ్రీశబ్దమైనది. శవర్ణమానందార్థకము; రేఫము తేజో7ర్థకము; తేజస్సు అనగా జ్ఞానము; ఈ కారము శక్తివాచకము; ''తామీకారాక్షరోద్ధారాం సారాత్సారాం పరాత్పరాం ప్రణమామి మహాదేవీం పమానందరూపిణీమ్‌|| (మాతృకాసరస్వతీస్తుతి) జ్ఞానానందస్వరూపపరాశక్తి శ్రీ యని యర్థము. ఆమెయే లక్ష్మీ. అట్టి తన శక్తితో ఁగూడిన విష్ణువు శ్రీవిష్ణువు. మఱియు 'శ్రయతే సర్వైరితి శ్రీః' - ఎల్లరచే నాశ్రయింపఁబడునది కనుక శ్రీః; లేదా, యిచట శోభాయుక్తుఁడైన విష్ణువనియును జెప్పవచ్చును. అట్టి విష్ణుని గుండెయందు స్థిరముగా నుండునది యని యర్థము. భావమేమనగా జననీజనకులు లక్ష్మీ నారాయణులు. శక్తిలక్ష్మీ; శక్తిమంతుఁడు నారాయణుఁడు; శక్తిమంతుఁడెప్పుడును శక్తిని భరించియే యుండును. ప్రజాపాలనశక్తి జననిదే. అనఁగా శ్రీదేవీ! నీదే. నీభర్తయైన విష్ణువునకుస్థితి కర్తృగౌరవమును గూర్చుచు నాతని విభూతులకు (గొప్పదనములకుఁ)గారణమీవే యగుచున్నావు. నీవివిధశక్తిస్వరూములే విష్ణుని విభూతులు నీబిడ్డలయందు సైత యేదేని విశేషభూతి కానవచ్చిన నయ్యది నీస్నేహముచే నైనదే. ఈమంత్రమందలి యుత్తరార్థమున 'నమోనమః' యనుట పునరుక్తి కాదు. లక్ష్మివైన నీకును, లక్ష్మీధరుఁడైన నారాయణునకును సమానభక్తితో మ్రొక్కుచున్నాననుటకే. అమ్మా! ఆదిదంపతులగు మీకు నానమస్కారములు.

శ్లో|| జయతు జయతు లక్ష్మీర్ల క్షణాలక్ష్మి తాంగీ

జయతు జయతు పద్మా పద్మసద్మాభివంద్యా,

జయతు జయతు విద్యా విష్ణువామాంక సంస్థా

జయతు జయతు సమ్యక్‌ సర్వసంత్కరీ శ్రీః||

తా|| శుభలక్షణములతో గూడిన యంగములు గల లక్ష్మీదేవి సర్వోత్కష్టవై వెలయుఁగాక. చేతులతో బద్మముల ధరించిన నీవు సర్వోత్కృష్టవై ప్రకాశింతువు గాక. తమ్మిపూగీము గల బమ్మచే స్తుతిపూర్వకముగా నమస్కరింపఁబడు నీకు జయమగు గాక. వెన్నుని యెడమప్రక్కనిల్చియుండు జ్ఞానస్వరూపిణివగు నీవుసర్వోత్కృష్టవై వెలయుదువు గాక. సమస్తసంపదల నొసంగు శ్రీ దేవి వైన నీవు సర్వోత్కృష్టవై వెలయుదువు గాక!

వి|| లక్షణాలక్షతాంగీ - సర్వశుభలక్షణములచే గుర్తింపఁబడు నంగముగల లక్ష్మీదేవి సర్వోత్కృష్టయై వలెయుఁగాఁక! లక్ష్మీ యనుటచేతనే శుభలక్షణలక్షిత యనునర్థము కాఁగా ; లక్షణాలక్షితాంగీ యనుటలో సారస్య మేమి కలదన రాదు. సత్యజ్ఞనానందము లే స్వరూపముగాఁ గల అమ్మకు నంగకల్పనము చేసి శుభలక్షణములు గల శరీరముగలది యనునపుడు, అమ్మ శరీరముజగమే. ''దేశకాలపదార్థత్మా యద్యద్వస్తు యథా యథా తత్త ద్రూపేణ యా భాతి తాం శ్రయో7హం విభోః కలామ్‌'' (సౌభాగ్యలక్ష్మిహృదయము) దేశకాలపదార్థస్వరూపమైన వస్తువసముదాయమే యనఁగా జగత్తే తన రూపముగాఁ గలది. అట్టి పరమాత్మయైన శ్రేష్టశక్తి నాశ్రయించున్నాను. మఱియు ''యదిదం భాసతే దేవి నామరూప క్రియాత్మకం| ప్రకాశవపుషస్తత్తత్సర్వం నాతికరిష్యతి||||- నామరూపక్రియాత్మకమైన సర్వమును మమాలక్ష్మియొక్క ప్రకాశరీరము, ఇంక జ్ఞానస్వరూపమున సర్వోపాధులలోను ''అహమస్మి అహం జనామి, అహం శృణోమి, అహం జిఘ్రామి,'' అను నీవిధముగా వెలయునదే యమ్మగారి విమర్శశరీరము, ఈరెండు శరీరముల రూపముననే సత్యజ్ఞానానంద స్వరూపిణి మహాలక్ష్మి యంతట వ్యాపించియున్నది. వ్యాపకత్వలక్షణమొక్యటే యైనను అది రెండువిధములగా మనచే ననుభవింపఁ బడుచున్నది. కనుక రెండుశరీరము లనిరి. కాని

''స్వప్రకాశశివమూర్తి రేవకా తద్విమర్శతను రేకికా| తయోః సామరస్యవపురిష్యతే పరా పాదుకా పరశివాత్మనో గురోః'' -- ఈప్రకాశవిమర్శశరీరముల సామరస్యశరీరమే అమ్మ యుంగము. ఇదే పరాపాదుకా, ఈద్వివిధవ్యాపకత్వ లక్షణమువల్లనే యమ్మ యంగలక్షణము గుర్తింపఁబడును. లక్ష్మి యనఁగా శోభ. అమ్మవైన నీవే సర్వభూతములందు లక్ష్మీరూపముతో వెలయుచున్నావు. ఇంద్రియగ్రాహ్యము కాకున్నను ఈనీమూర్తి మాయనుభవమునకు వచ్చుచుండును. జీవించి యున్న వాఁడైవ్వఁడును ప్రాణాభావము ననుభవింపఁడు. జీవనమందు సదానుభయోగ్యము ప్రాణస్వరూపమే. ఇదే నీవ్యష్టిలక్ష్మీమూర్తి. అట్టి ప్రేమరూపిణి వైన తల్లీ! నీకివే మానమస్సులు. మాలోలోపల సదాప్రాణరూపముతో ననుభూత వగుచున్న నీవే మా వ్యష్టి లక్ష్మీమూర్తివి. మఱియు విశ్వవ్యాపిమహాప్రాణరూపమున నున్న సమష్టి ప్రాణమూర్తివియు నీవే. ఒక ప్రాణసముద్రరూపిణివైన నీయందగు విభిన్నతరంగములే జీవరూపముగా నుబుకుచున్నవి. బహుకాలమునుండి జీవులు నీయంగము లేయనుసత్యము నెఱుంగక యవమానించుచున్నాము. అట్టి నీ వ్యష్టిప్రాణలక్ష్మీమూర్తులు రెండును సర్వోత్కృష్టములై ప్రకాశించుఁగాక.

పద్మవైన నీవు అనఁగాఁ జేతేలయందుఁ బద్మములను ధరించిన నీవు సర్వోత్కృష్టవై ప్రకాశింతువు గాక సత్యజ్ఞానానందస్వరూపిణివైన నీకు మూర్తికల్పనము చేసి చేతఁ బద్మములు కలట్లు వర్ణించిరి. పద్మధారణమువలన మాకు రెండర్థములు తోఁచుచున్నవి. ఆశ్రితులకు సర్వసంపదల నిచ్చుదానవనియు, పద్మగంధము వాయువుచే దిక్కులకుఁ బ్రసరించునట్లు నిన్నాశ్రియంచిన భక్తులకు బ్రహ్మవిద్యను బెట్టి దానివల్లనైన యశస్సును దిక్కులకువ్యాపింపఁజేయుదు వనియుఁ దెలుపు నీపుత్రస్నేహము భోగ మోక్షకరసాధన దానము చేయ నెల్లప్పుడును సంసిద్ధమనియును దోచుచున్నది. అట్టి నీమూర్తి సర్వోత్కృష్టమై యొప్పుఁగాక.

మఱియు నీవు పద్మసద్మాభివంద్యపు. పద్మసద్ముఁడైన బ్రహ్మచే స్తుతిపూర్వకముగా నమస్కరింపఁబడుదానవు. అనఁగా నీవల్లనే తనకు సృష్టికర్తృపదము లభించినదను కృతజ్ఞతాసూచనము సేయుటే. ''యయా త్వయా జగత్ర్సష్టా జగత్పాతాత్తి యో జగత్‌ | సో7పి నిద్రా వశం నీతః కస్త్వాం స్తోతుమిహేశ్వరః|| విష్ణుః శరీర గ్రహణ మహమీశాన ఏవ చ కారితాస్తే యతో7తస్త్వాం కఃస్తోతుం శక్తిమాన్‌ భ##వేత్‌ ||(బ్రహ్మకృతస్తుతి, సప్తశతి మార్కండేయ పురాణము)

మఱియు మూలాధారాది సహస్రారాంత సౌఘమ్న పద్మములన్నియు నీసద్మములు. అట్టి పద్మసద్మములయందు నంత ర్యాగసమారాధ్యవైన నిన్ను నిల్పి సమయాచారతత్పరులైన సాధకు లభివందనము చేయుదురు. కావున బద్మవును, పద్మసద్మాభినంద్యవు, నయిన నీవు సర్వోత్కృష్టవై వెలయుదువు గాక.

అమ్మా! నీవు విద్యపు. అఖండజ్ఞానస్వరూపిణివి. ఏది తెలియఁబడినప్పుడు సర్వము తెలియఁబడునో యది విద్య. ''యయా తదక్షరమథిగమ్యతే సా విద్యా'' దేనిచేత అక్షర వస్తువు పొందఁబడునోయది విద్య. బహుత్వవాంఛఁజేసి ప్రకాశవిమర్శశక్తిరూపమున దాను సర్వత్ర వ్యాపింపక మున్ను విష్ణుఁడు విద్యాస్వరూపిణియు, ననపాయినివియు, నైన నిన్ను మన్నింపక తప్పినది కాదు. అనఁగా నీవల్లనే నిఖి లేశుఁడను గౌరవమును తనకుఁగల్గు సంకల్పములు నెఱవేఱునపుడును ఆదిమ విద్యవైన నీకుఁగాక మఱవ్వరికి స్వాంకారోహణాధికార మీయంగలఁడు? బ్రహ్మవిష్ణురుద్రాదుల శక్తులు అన్నియు నీవే యనుటకే శ్రుతి పురాణాదులందు నిన్నిటులు వర్ణించుట. అట్టి నీవు సర్వోత్కృష్టవై ప్రకాశింతువు గాక.

అమ్మా! నీవు సర్వసంపత్కరివి. సర్వసంపత్కరివైన శ్రీవి. లోకమునందేదేని యధికముగాఁ బొందఁబడినపుడది సంపద యనఁబడును. ఎల్లరకు సమస్తమైన సంపదల నిచ్చుదాన వగుటచే నెల్లరు నిన్నాశ్రయింతురు. కనుక నీవు శ్రీవి. అక్షరాధిగమనమునకగు విద్య బ్రహ్మవిద్య యనఁబడును. అది శ్రీ శబ్దవాచ్యమనియు బ్రహ్మవిద్యారూప సరస్వతిశ్రీపంచమి యనపేరఁబరఁగు చైత్రశుద్ధపంచమి మొదలుగాఁ బూర్ణిమాంతముగా సమర్చింపఁబడుననియు జగత్ర్పసిద్ధము. అట్టి బ్రహ్మవిద్య నీయాశ్రితులయెడఁ దొల్త నీవు సంపత్కరీరూపమున వెలయకున్న నీ శ్రీరూప మనుభూతము కాదు. సంపత్కరీ యనఁగా ''సుఖసంపన్మయీ చిత్తవృత్తిః'' - అని శాస్త్ర నిర్వచనము. కేవల విషయసుఖములు సైతము అనగా విషయములను దెచ్చిపెట్టు నింద్రియములవల్లనగు సుఖము సైతము నీస్వరూపమే యని తెలియఁబడినపుడు చిత్తవృత్తి విషయేంద్రియ సంయోగమున నగు తుచ్ఛసుఖమునే గాక యథార్థ శాశ్వత సుఖమును తెచ్చిపెట్టఁగలదు, ఆవిధముగా సంపత్కరివగు నిన్నా శ్రయింపక తప్పదు. కనుక నే మంత్ర పూర్వ పాదమందు నీవే విద్యవనియు, నిచట సపత్కరివనియు; శ్రీవియనియు; వర్ణింపఁబడితివి. అట్టి నీవు సర్వోత్కృష్టవై వెలయుదువు గాక. (ఈ సందర్భమున '' సంపత్కరీ సమారూఢసింధుర వ్రజసేవితా'' యను నామవ్యాఖ్యను శ్రీభాసురానందనాథ లలితాసహస్రనామ భాష్యమందుఁజూడఁదగును.

శ్లో|| జయతు జయతు దేవీ దేవసంఘాభిపూజ్యా

జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా,

జయతు జయతు నిత్యా నిర్మలజ్ఞానవేద్యా

జయతు జయతు సత్యా సర్వభూతాంతరస్థా. 19

వి|| అమ్మా! నీవు స్వయంప్రకాశశీలవు. క్రీడన శీలవు. వేల్పుమూకలచేఁ బూజింపఁబడుదానవు. అమ్మా ! నీవు భద్రవు (మంగళస్వరూపవు) నీవు భార్గవివి. భాగ్య రూపవు. త్రికాలాబాధ్యవు. రజస్తమస్సంపర్కములేని తెలివిచేతనే తెలియఁబడుదువు. మఱియు నీవు శాశ్వతవు. సర్వభూతములందుండు దానవు. అమ్మా! నిన్ను నీవు సర్వజగదాకారముతో బయల్పెట్టుకొని, వానితో సృష్ట్యాదికము లైన యైదాట లాడుకొనుచుందువు. సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములనెడి యయిదు కృత్యములే యైదాటలు, సర్వశక్తిస్వరూపవు. సర్వశక్తి సంపుటవునైన నీ వివిధ శక్తులై దేవనామముతో వ్యవహరింపఁబడి బ్రహ్మవిష్ణ్వాది నామములతోను, నిదాగ్నియమాది నామములతోను; బ్రసిద్ధములు, ఆ దేవత లెల్లరు, లోకమునందు గౌరవపాత్రులగుట నీశక్తి చేతనే. కనుక నీవు దేవసంఘపూజ్యవు. అఖండ చైతన్యస్వరూపవు. మఱియు నీవే ఖండఖండ చైతన్యవర్గముగానై ప్రత్యేక దేవతా నామములతో ఁ బూజింబడుచున్నావని యభిప్రాయము. గణశులు, గ్రహములు, నక్షత్రములు, రాసులు, సర్వము నీశక్తిస్వరూపములు, ఇంద్రియాధిష్ఠాన దేవతలనెడి చైతన్యవర్గము నీస్వరూపము. కనుక పూజ్య వస్తువ నీవొక్కతవే. కనుక సర్వోత్కృష్టవైప్రకాశింతువుగాక! అమ్మా! నీవు భద్రవు. కళ్యాణస్వరూపవు. సుఖస్వరూపవు. భద్రశబ్దము పరమాత్మకు శ్రుతులందు ఁ బ్రసిద్ధము తచ్ఛక్తివి కావునను నీవు భద్రవు, ''భద్రం కర్ణేభిః శ్రుణ యామ'' శ్రుతి.

అమ్మా ! నీవు భార్గవివి. భర్గశక్తివి. మఱియు భ్‌ + ర్‌ + గ్‌ అను మూడు ధాతువుల చేరి భర్గ శ్శబ్దము నిష్పన్నమైనది. భేతి=భాసయతే లోకాన్‌ ; రేతి రంజయతే జనాన్‌; గఇత్యాగచ్ఛతే7 జస్రం భరగో భర్గ ఉచ్యతే, జగత్తులను వెలిఁబెట్టుట, వానిని రంజింపఁజేయుట, మరల లోనికిఁగొనుట యను మూడు శక్తులు భర్గునివి. తచ్ఛక్తివి కనుక నీవు భార్గవివి. ఈశబ్దమే గాయత్రీమంత్రమున ''తేజస్స'' నెడి యర్థమున ''భర్గస్‌'' అని సకారాంతముగా వ్యవహరింపఁబడినది. ''భర్గో దేవస్యధీమహి'', శ్రుతి, కనుక సృష్ట్యాదికార్యములు చేయు దేవుని శక్తివి నీవే యగుట భార్గవివి. కామకాలాదులను గాలపాకము నొందించువాఁడు భర్గుఁడు; పరమేశ్వరుఁడు, ఆతని శక్తివి నీవు గనుక భార్గవివి. నిన్ను ధ్యానించుటచేతన, బుద్ధివృత్తిప్రచోదనము చేయుటచేతను, మంత్రజపరూపమైన గానము చేయువారికిఁ ద్రాణము (రక్షణము) నొసంగుటచేత నీవే గాయత్రివి.

అమ్మా ! నీవు భాగ్యరూపవు. భగమే భాగ్యము. భగమనఁగా షడైశ్వర్య సంపత్తి. సర్వజ్ఞిత్వము, నిత్యతృప్తి, అనాదిబోధము, స్వతంత్రత్వము, నిత్యాలు ప్తత్వము, అనంతత్వము - అనునీయారు శక్తులును భగమనుఁబడును. భగసంపత్తియేభాగ్యము. ఈషడ్గుణౖశ్వర్యసంపత్తి నీస్వరూపము. ''ఉత్పత్తిం, ప్రళయం చైవ భూతానా మాగతిం గతిం, అవిద్యా విద్యయో స్తత్వం వే త్తీతి భగవత్యసౌ'' (దేవీ భాగవతము) జగదుత్పత్తివినాశములు, భూతముల రాకవోకలు, విద్యావిద్యల తత్త్వజ్ఞానము;- అను నారిఁటి సముదాయ మునకును భగమని పేరు. అట్టి భగసముదాయము భాగ్యము. షడైశ్వర్య సంపత్తి నీస్వరూపము కనుక నీవు భాగ్యరూపవు. మఱియు శుభాశుభకర్మఫలమునకుఁగూడ భాగ్యమని పేరు. తద్రూపమున వెలయుదానవు గాన నీవు భాగ్యరూపవు. మఱియు ''ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్యయశసః శ్రియః, జ్ఞానవిజ్ఞానయోశ్చైవ షణ్ణాం భగితీరితః'' వెలితిలేని యైశ్వర్యము, ధర్మము, యశస్సు, శ్రీ, జ్ఞానము, విజ్ఞానము- అనునారింటికి భగమని పేరు. ఈ భగసముదాయమైన భాగ్యము నీ రూపము. కావునను నీవు భాగ్యరూపవు. అమ్మా! భద్రా! భార్గవీ! భాగ్యరూపనామములతో వెలయు నీవుసర్వోత్కృష్టవై వెలయుదువు గాక. అమ్మా! నీవు నిత్యవు- శాశ్వతవు. అమృతస్వరూపిణివి. భాగ్యరూవను మాటయందే నీనిత్యత్వమును నీయమృతత్వమును నిమిడి యున్నవి. భాగ్యశబ్దముచే దెలియఁబడు కర్మఫల మమృత సుధా శబ్ధములచే శాస్త్రములందుఁబ్రసిద్ధము. శ్రీ శంకరా చార్యులను గర్మఫలము నమృతమనిరి. ఉపనిషత్తులును ''అన్నాత్ర్పాణో మన స్సత్యం లోకాః కర్మసు చామృతమ్‌''అని వర్ణించినవి. కర్మఫలాత్మక భాగ్యరూపవు నీవగుట చేత నక్షరవు నిత్యవు. విధ్యుక్త కర్మముల ఫలము నిర్మల జ్ఞానప్రకాశ##మే. కర్మఫల (భాగ్య) రూపవు నీవైనపుడు జ్ఞానప్రకాశ##మే దాని ఫల మనునపు డట్టి నిర్మల జ్ఞానఫలము నిన్నెరుంగుటే. కావున మంత్రమందు నిర్మలజ్ఞానవేద్యవని స్తుతింపఁబడితివి. అట్టి నీవు సర్వోత్కృష్టవై ప్రకాశింతువు గాక ! అమృతమనెడి కర్మఫలబీజముయొక్క యంకుర మే జగత్తు. కర్మ ఫలబీజసం గ్రహము చేసియే నీవుజగత్తును సృష్టించుచున్నావు. ఈ గ్రంథమునందురెండవ మంత్రమున ''బీజాపూరం కనకకలశం మేహపద్మేదధానాం'' అను నీమూర్తి వర్ణనమున బీజపూర ధారణము (విత్తులతో నిండినపండు నొక చేతఁదాల్చుట) సృష్టి కాధారమగు కర్మఫలబీజసంచయము నీచేతిదనుట నుద్దేశించియే చెప్పఁబడినది. దీనినిబట్టి నీజగద్రూపనిత్యత బోధనమునకు వచ్చును.

అమ్మా ! నీవు సత్యవు. త్రికాలాబాధ్యవు. నీవు లేకుండుట యెన్నఁడును లేదు. సర్వభూతములయందును జిత్స్వరూపమున నాత్మస్వరూపమున నేనను పేరనంతటనల్లుకొనియున్నావు. 'చేతన, ఆత్మ, అహం-' అను వేళ్లతో నొప్పెడినీ సత్యత్వము శ్రుతిస్మృతి పురాణాదులయదుఁబ్రసిద్ధము. జగద్రూపమున నిత్యవై నిర్మల జ్ఞానవేద్యవైన నిన్నెఱింగెడివారికి సర్వభూతాంతస్థవైన నిసత్యత్వానుభవము అరచేతి రేగుపండు. ఇట్టి నిన్నెఱుంగకున్న వారేనిన్న వమానించెడి మూఢాత్ములు. అమ్మా! అపరాప్రకృతి రూపిణివైవెలినిజగద్రూపముతోను, సర్వమందు జ్ఞానస్వరూపమున నాత్మపేరను వెలయు నీవు సర్వోత్కృష్టవై వెలయుదువు గాక!

శ్లో|| జయతు జయతు రమ్యారత్నగర్భాంతరస్థా

జయు జయతు శుద్ధా శుద్ధజాంబూనదాభా|

జయతు జయతు కాన్తా కాన్తిమద్భాసితాంగీ

జయతు జయతు శాన్తాశీఘ్రమాయాహి సౌమ్యే||

ఈ మంత్రము మొద లనేకమంత్రములందు ¸°గికో పాసనార్థము స్ఫురించును. సాధకులు గమనింతురు గాక.

వి|| అమ్మా! నీవు సుందరివి. శ్రేష్ఠవస్తువులు కడుపునఁగల భూమిలో నున్న దానవు. నీస్వరూపము జ్ఞానము. నీవే జాగ్రత్‌ స్వప్నసుషుప్తులనెడి మూడవస్థల రూపమునఁ బ్రకాశించుచు వానికి సాక్షిణివై నేననుచు జ్ఞానస్వరూపమున శోభించుచున్నావు. ఈ ముడవస్థలే మూడు పురములుగా (శరీరములుగా) వర్ణింపఁబడినవి. ఇవే త్రిపురుములు. ఈత్రిపురములయందును నేననుచుజ్ఞానస్వరూపిణివై. సాక్షిణివై శోభించుచున్నావు. కనుకనే నీవు త్రిపురుసుందరివి. మఱియుఁజిత్రవిచిత్రజగాదాకారముతో ననఁగా శివాది క్షితిపర్యంతమైన షట్‌ త్రింశత్‌ తత్త్వసముదాయరూపవిశ్వాకారముతో వెలయుచున్నావు. కనుకను నీవు సుందరివి. నీ వేమనోమయివై ముప్పదియారవ తత్త్వమైన క్షిత్యాకారముతో వెలసి యనర్ఘశ్రేష్ఠవస్తులైన రత్నస్వర్ణరజతాదులను నీగర్భమందుచుకొని రత్నగర్భానామవై వెలయుచు నందు సర్వరసమయివై శోభిల్లుచున్నావు. కనుకను నీవు సుందరివి.

అమ్మా! మనోమయివై బహుత్వమును, బహురూపత్వమును గామించినంతనే యాకాశాదిపంచభూతముల రూపమున వెలసి పంచీకృతపంచమహాభూతాత్మికవై నామరూప క్రియాసహిత బ్రహ్మాండజాలాకారవై యందు నీవే సమష్ఠి కుండలినీరూపమహాశక్తివై వెలయుచున్నావు.

బ్రహ్మాండమే పిండాండము, పిండాండవిషయమునను సర్వము నీవెయై యందు వ్యష్టికుండలినీమహాశక్తివై మహాలక్ష్మీనామమున వెలయుచున్నావు. బ్రహ్మాండమునందు వలెనే పిండాండమందును బాంచభౌతికతత్త్వవిశిష్టత యమరియున్నది. రత్న గర్భాంతరమందు (భూమిలోపల) బిలమందు గుడంలినివలె నీవును భూతత్వవిశిష్టమైన మూలాధారగతి కులకుండమందుఁ జైతన్యమయివైన నీవే కుండలినీపరాశక్తివై కులసుందరీనామమునఁ బ్రసిద్ధమై సర్వకర్త్రివై శోభిల్లుచున్నావు. కనుక నీవు రమ్యవు. సుందరివి.

నీతత్త్వము నెఱింగిన సాధకోత్తములుప్రాణాయాన హఠాదిప్రయత్నముననో, భావదార్ఢ్యముననో, జాగరితవై కులనామముతో యోగశాస్త్రప్రసిద్ధమైన మూలాధారాది సహస్రారపర్యంతమైన సుషుమ్నాపథమందు నీవుచర్చించునపు%ుడ అనఁగా స్వాధిష్ఠానాదికులపద్మములను భేదించుకొని పోవునపుడు నీరమ్యత వర్ణనీయము. అది మంత్రమందలి యీతరువాతి మాటలయందు వ్యక్తమగును. అమ్మ శుద్ధ. అనఁగా నవిద్యాసంబంధమైన యాణవ మాయికకార్మికమలములు లేనిది. సంకల్పరహితయై యున్నంతసేఁపు పరిశుద్ధయే. "అహం బహూస్యామ్‌" అను సంకల్పముకలుగఁగానే రజోగుణమయి ఏనాఁడు సంకల్పసహిత మయ్యెనో యనఁగా నొక యవస్థావిశేషము నందెనో;(స్వత్త్వరజస్తమస్సులనెడి యవస్థలకే గుణములని పేరు. నా సాధనసామగ్రియందు గుణత్రియ వివరణము చూచునది.) అఖండజ్ఞానస్వరూపిణి; పరిశుద్ధ బహుత్వమును సంకల్పించెనో; యపు డవిద్యామయియైనది. అవిద్య యనఁగా నల్పాల్పజ్ఞానస్వరూపము. బహుత్వవాంఛ కలుగఁగానే పంచతన్మాత్రలుగాఁదానే యయినది. అదే యమ్మగారి యవిద్యారూపము. (ఖండఖండజ్ఞానస్వరూపము) మూలాధారమందు జాగరితయై క్రియాశీలయైనపుడే యమ్మ ధ్యానగమ్య. ఇఁకఁ బిండాండమందు సుషుమ్మా మార్గసంచారశీల కాఁగనే సాధకునిలోఁ గులపథమం దేడనెట్లు తోఁచునో మంత్రమందు వర్ణించుచున్నాఁడు. మూలా ధారమందు శుద్ధజాంబూనదాభగ పుటము పెట్టిన బంగారు కాంతివంటి కాంతి గలదిగా వర్ణింపఁబడినది. ఇది శ్రీసూక్త మందుఁ బ్రథమమంత్రమున "హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం | చంద్రాం హిరణ్మయీం లక్ష్మీ చజాతవేదో మమావహ" యనియు, మూలాధారోమందు హిరణ్యవర్ణ గాను, అనాహతమందు వెండి బంగారు గొలుసులు ధరించినదిగాను, ఆజ్ఞాయందు చంద్రకాంతివంటి కాంతిగలదిగాను వర్ణింపఁబడినది. ఇఁక సౌభాగ్యలక్ష్మీహృదయమందు "యోనౌ కగనకపుజాభం హృది విద్యుచ్చయోజ్జ్వలం|ఆజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి" - మూలమందు తప్తకనక వర్ణశోభిగాను, అనాహతమందు మెఱుపుల గుంపువలె మఱయునదిగాను, (అదియే శ్రీసూక్తహబుక్కు నందు సువర్ణరజతస్రగ్ధారణముగా వర్ణింపఁబడినది) ఆజ్ఞయందుఁ జంద్రకాంతివలెను; నీతేజస్సు ప్రత్యక్షమగునని వర్ణింపఁబడిది. అట్టి కేజోమయియైన యమ్మ సర్వోత్కృష్టయై వెలయుఁగాక!

అమ్మా! నీవు కాంతవు. ఎల్లరకును గమనీయవు. కోరంందగినదానవు. జగద్విగ్రహవైన నీవు క మాకుఁగమనీయ వగునప్పుడే నీతత్త్వము బోధపడును. నీవే జగద్విగ్రహబ్రహ్మస్వరూపిణివి. అమ్మా! నీవు కాన్తిమద్భాసితాంగివి. నీజగదాకారశరీరము నీప్రతీకములైన కాంతిమద్వస్తువులైన గ్రహనక్షత్రాదులచే భాసిల్లును గాన నీవు కాంతి మద్భాసితాంగివి.

అమ్మా! మూలాధారమును విడిచి కులపథమును దూసికొని మీదికిఁబోవునపుడు నీతేజోమయాంగము మెరపుఁదీవవలె శోభిల్లుటయు, వాయుతత్త్వ కేంద్రమైన యునాహత చక్రమందు మెఱపులగుంపువలె శోభిల్లుటయు, సంతర్యాగనిపుణులైన సాధకోత్తములకు ననుభూతమగును గాన నటులు వర్ణింపఁబడినది. అమ్మా! నీవు సౌమ్యపు, చక్కని తల్లివి. చటంద్రునిబోలి చల్లని తల్లివి. నీవు శాంతవు. ఇంద్రియసంక్షోభమింతయు లేని దానవు. నీసుతులమైనమాకును శాంతావస్థను బిట్టి రక్షింప వడిగా లేచి రమ్ము. నీకృపచే మాకును శాంతావస్థను గలిగింపవలఁతివి నీవే. సర్వేంద్రియాధిష్ఠానచైతన్యవర్గరూపమున నున్న దానవు. గాన నీనెనరున్నచో మా ఇంద్రియములువిషయాకర్షణమనెడివిక్షోభము లేక నీయఖండ చైతన్యస్వరూపము వైపే మఱిలిపోవును. అదే మాకోరిన శాంతావస్థ. సర్వస్వరూపములతో నున్న దానవు నీవే యనియు, సర్వకర్తృత్వము నీదే యనియు నెఱుంగకుండుటచేతనే నీశాంతమూర్తిని గుర్తింప లేకున్నాము. గుర్తింపఁగల్లినపుడు మాసంక్షోభము లెల్ల నణచిచంద్రుని బోలి సుఖపెట్టు చల్లని తల్లివి నీవేకనుక "సౌమ్యే" యని పిలచుచున్నాము. అమ్మా! వేగరమ్ము. సర్వోత్కృష్టవైవెలయుము.

ఈ మంత్రమందలి తొలి మూడు పాదములందును గులామృత్తెకరసికయైన యమ్మనుగుండలినీపరాశక్తిస్వరూప మహాలక్ష్మినినిన్ను లేపి యుచ్చరింపఁజేయునపుడు సాధకుఁడు సౌషుమ్నపథమందు నీమహస్సునెట్లు ప్రత్యక్షముచేసికొనునో కొంత వర్ణింపఁబడినది. అనాహతవిశుద్ధములను దాఁటి యాజ్ఞాచక్రముభేదించుకొనిపోవునప్పటినీచరిత్రము "శాంతా శీఘ్రమాయాపిసౌమ్యే" అను నాప్రార్థనారూపవాక్యమందే గంభీరముగానున్నది. నీవాజ్ఞాచక్రమును బ్రవేసించినంతనే మనస్తత్త్వస్వరూపిణివైన నీయనుగ్రహమువలన సాధకుని యింద్రియాశ్వములు క్షోభ##పెట్టకుండ సారథివై యాజ్ఞాపింతువు. కనుకనే భ్రూమధ్యస్థానమైన యాద్విదళపద్మమునకు నాజ్ఞాచక్రమును పేరు సార్థకము. హృషీకేశత్వమునీది. నీవావిభుత్వమును వెలయించునప్పుడే మాకు శాంతావస్థలభించును. మంత్రజపస్తుతిరూపగానము చేయువారి కీవిధముగాఁద్రాణము నీవలనఁగల్లును. కనుకనేనీవు గాయత్రివి. గాయత్రీధ్యానశ్లోకమందుఁబదింట నొక చేతితో ఁ దాల్చిన కశ (చబుకు) నీ హృషీకేశత్వమునో బోధించును. అపుడే నీ శాంతాసౌమ్యానామములు సార్థకములు. ఇఁక నీ సౌమ్యత కులామృత్తెకరసికత్వము సంగ్రహముగా వర్ణించుట యప్రస్తుతము కాదు.

అమ్మా! నీవు వ్యష్టిసమష్టికుండలీనీరూప పరాశక్తివని మున్నంటిని. నీవ్యష్టికుండలినీచరిత్రమే యిపుడీమంత్రమందు సాగుచున్నది. మూలాధార స్వాధిష్ఠానమధ్యమందలి నీయర్చిస్సును (ఆగ్నేయ తేజస్సును) అనాహత విశుద్ధముల నడుమనైన నీసూర్యజ్యోతియను వర్ణింపఁబడినవి. ఇఁక నాజ్ఞాసహా స్రారముల నడుమనైన నీచాంద్రమహస్సు వర్ణింపఁబడును. అదే నీసౌమ్యరూపము. సోముఁడనఁగా జంద్రుఁడు. సోమునకు సంబంధించినది సౌమ్యము. అమ్మా! నీవాడుఁబాము రూపమున మూలాధారము నాశ్రయించి కుండలినియనుపేరితోఁదామరతూఁడు విఱువఁగా సాగెడి తంతువువలె తనీయసివై కడుంగృశాకారముతో ననఁగా నతిశయసూక్ష్మాకారముతో ంబ్రకాశింతువు. ఈవిషయమునే శ్రుతి "నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా" అని నివ్వరిధాన్యపు ముల్లువలెఁగడుసూక్ష్మాకారముతో ఁబ్రకాశించు నగ్నిశిఖగా వర్ణించుచున్నది. సాధకుఁడు వాయువు నాకుచింతముఁజేసి దానిని బైపైకి నడిపి కుంభకము అనగాఁ బ్రాణాయాను ప్రక్రియయందు (నీకంటె వేఱుకాని ప్రాణశక్తిని విస్తరింప జేయుపనియందు) పూరించిన వాయువును నిల్పుట యనెడి కుంభకక్రియయందు మనసు నిల్పి స్వాధిష్ఠాన గతాగ్ని తత్త్వమును గుంభింపఁడిన వాయుఘాతముచే రగిల్చిన యగ్ని ఘాతముచేతను, ఆ వాయుఘాతముచేతను (కుండలినీ) రాపశక్తివైన నిన్ను లేవఁగొట్టును. అపుడునీవు బ్రహ్మగ్రంథిని విడగొట్టి తరువాత విష్ణుగ్రంథిని భేదింతువు. తరువాత నాజ్ఞాచక్రమందలి రుద్రగ్రన్థిని భేదించుకొని యనఁగా మూలాధారరాద్యాజ్ఞాంతమైన యారు కమలములను వేధించి సహస్రదళకమలందు నీవు శివునితో ఁగూడి యానందింతువు. ఆ యవస్థకే పరావస్థ యనిపేరు. అదే సాధకునకు నిర్వృతిని, (సిద్ధిని) గలగించును. అరుణోపనిషత్తునందును "ఉత్తిష్ఠమాస్వపత అగ్నిమిచ్ఛధ్వం భారతాః | రాజ్ఞస్సోమస్య తృప్తాసః సూర్యేణ సయుజోషసః" ఓ భారతులారా (భాయాంరతా)ః స్వయంప్రికాశవస్తూపాసనమందు నాసక్తికలవారలారా! లెండు! నిదురమానుఁడు. అప్రమత్తులరగుఁడు. స్వాధిష్ఠాన; గతాగ్నిని రగుల్పుఁడు. మీరు భారతియందాసక్తులు. భారతీ సరస్వతీ శబ్దములు రెండును బ్రహ్మవిద్యార్థకములు. కనుక భారతులారా! శ్రీ విద్యోపాసకులారా! యని సంబోధించి చెప్పుచున్నాడు. ఇచ్ఛాదండముతోఁగొట్టి లేపుఁడు. అనాహతవిశుద్ధ్యంతరసూర్యునితోఁగూడిన యాయగ్నిచేత ద్రవించిన సోమునియొక్క (చంద్రునియొక్క) మఱియు నుమతోఁగూడుకొన్న యనఁగా రాజరాజేశ్వరితోఁగూడుకొన్న రాజరాజేశ్వరునియొక్క యనఁగా సహస్రారమందలి చంద్రమండలములోని యమృతముచేఁదనివి నొందుఁడు. పిండితార్థమేమనఁగా నగ్నికుండలినిని లేవఁగొట్టి నూర్య కుండలినితోఁజేర్చి వానిజేఁజంద్రుమండలమును శివశక్తిసామరస్యముచే ద్రవింపఁజేసి యాచంద్రమండలమునుండి స్రవించునమృతధారలచే డెబ్బదిరెండువేల నాడీమార్గములను నించి తనివినొందుఁడని యర్థము. అమ్మా! సాధకులను దనివి నొందించు నీయాచరణముఁబట్టియే నీవు సౌమ్యనామమునఁబరఁగితివి. సౌమ్యఁగా నిన్న నుబవించుటే సాధకాపేక్షణీయచరమఫలము. తొలుత నీవర్చిష్మతివి. తరువాత జ్యోతిష్మతివి. ఆజ్ఞను దాఁటి సహస్రారమునఁగా మేశ్వరునితో మోదింపఁబోవునపుడు మహస్వతివి. కుమారమనెడి పేరఁబరఁగు కులకుండమునువీడి మంద్రనవాదముతో లేచివచ్చునపుడు కుమారివి. అనాహతమును మీఱిపోవునపుడు తరుణివి. ఆజ్ఞనుదాఁటి సహస్రారమునకుఁబోవునపుడు పతివ్రతవు. ఇంకను నీయీచరితమును విశేషించి యెఱుఁగఁగోరిన సాధక పుత్రులతో బిడ్డలారా! సద్గురు నాశ్రయించి నావి శేషచరిత్రము నరుణోపనిషత్తు, సనత్కుమారసంహిత, వశిష్టసంహిత మున్నగు నుత్తమమంత్రములందు నేర్చికొని యానందామృత ధారాప్యాయితులరైనచో శాశ్వతముగా నాయెడిని నిలువంగలరని నీవే చెప్పివేయును. శాంతవు. సౌమ్యవునైన నిన్ను దర్శించుట నీనోర నీమాటలు వినుట కే "శ్రీఘ్రమాయాహి" -"వేగరమ్ముతల్లీ" యని ప్రార్థించు చున్నారము. నీవు లలితవై ప్రకాశింతువు గాక!

శ్లో|| యస్యాః కలాయాః కమలోద్భవాద్యా

రుద్రాశ్చశక్రప్రముఖాశ్చ లేఖాః|

జీవన్తిసర్వే7పిసశక్తయస్తే

ప్రభుత్వమాపుః పరమాయుషస్తే||

ఏమె శ్రేష్ఠశక్తివలన బ్రహ్మదేవుఁడు మున్నగువారును నేకాదశరుద్రులును శతక్రతుఁడు (ఇంద్రుఁడు) మున్నగు వేల్పులును, వివిధ శక్తులతోఁ గూడుకొన్నవారై ప్రభుత్వము నొందిరో పరమాయుష్మంతులైరో యట్టి సకలజనని మహాలక్ష్మిని సేవింతును.

అమ్మా! "కలాతు శ్రేష్ఠశక్తిఃస్యాత్‌" నీవు పరశివశ్రేష్ఠశక్తివి. బిందునాదావస్థలకు మూలమైన కలాస్వరూపిణివి. చంద్రకళలయందుఁ బదునాఱవకళ నీస్వరూపము. "చద్‌+రక్‌=చది ఆహ్లాదనే, రకిదీప్తౌ" అను నర్థము నిచ్చు రెండు ధాతువుల చేరికచే నయినది చంద్రశబ్దము. ఆనందము దీప్తి (జ్ఞానము) అనునవియే స్వరూపముగాఁగల పరమాత్మను దెల్పును. కనుక నీవుపరమాత్మకంటె భిన్న కాని శ్రేష్ఠశక్తిని. నీవల్లనే స్రష్టయనఁగా సృష్టికర్తయైన బ్రహ్మస్థితిక ర్తయైన విష్ణువు, సంహారకర్తయైన రుద్రుఁడు, మున్నగువారు శక్తిమంతులైరి. కనుకనే శ్రీ జగద్గురు శఁకరాచార్యులవారును సౌందర్యలహరియందు "అతస్త్వామారాద్యాం హరిహరవిరించాదిభిరపి" యని స్తుతించిరి. ఆదిశబ్దముచేతఁ దిరోధానకర్త మహేశ్వరుఁడు అనుగ్రహకర్త సదాశివుఁడుఁగా బేర్కొనఁబడిరి. ఈ పంచవిధశక్తులను పురుషులనుగా భావించి శ్రుత్యాదులు బ్రహ్మాది నామములతో వ్యవహించినవి. సృష్టిస్థితిలయతిరో ధానానుగ్రహము లనెడి కృత్యములైదును గళాస్వరూపిణివై ననీవెయె. అన్నిఁటిని మీఱి ప్రకాశించుదానవని బోధించు లలితానామప్రసిద్ధవైన నిన్ను "పంచకృత్యపరాయణా" యని యాగమ తంత్రాదులన్నియు నుగ్గడించినవి. రుద్రులును - ఏకాదశరుద్రులు-అజుఁడు, ఏకపాదుఁడు, అహిర్బుంధ్న్యఁడు, త్వష్ట, రుద్రుఁడు, హరుఁడు, శంభుఁడు, త్ర్యంబకగుఁడు, అపరాజితుఁడు ఈశానుఁడు, త్రిభువనుఁడు- అనెడు నామములతో వివధ శివవిభూతులే యేకాదశరుద్రనామములతో వెలయును. పరమాత్మయొక్క సర్వవ్యాపకత్వమును దెలుపు విష్ణుఁడే కారణ బ్రహ్మముగా నెన్నినవారిచే బహువిభూతులే వ్యూహములుగా నెన్నఁబడినట్లే రుద్రుఁడీ యేకాదశనామములతో నేకాదశరుద్రులుగా నెన్నఁబడెను. శివని విశిష్టభూతులై రుద్రనామమునఁ బరుఁగు నీపదునొకండు శక్తులును నీవియే.

శతక్రతుఁడు (నూరు యాగములు చేసినవాఁడు) ఇంద్రుఁడు-మున్నగాఁగల దేవతలెల్రును బ్రత్యేకశక్తి మంతులై ప్రత్యేక నామములతో మనుచున్నారు. ఆయాదేవతాశక్తులన్నియు నీవియే. చంద్రకళా, బ్రహ్మకళా, సాదాకళా, కామకళా,మహావైసర్గికీకళా, బ్రహ్మకళా, సాదాకళ, కామకళా, మహావైసర్గికీకళా యను పేళ్ళవెలయు శ్రేష్ఠశక్తినొందియే వివిధ ప్రాభవములతోఁగూడిన వారై పరమాయుష్మంతులైరి.

ఈమంత్రమందు "పరమాయుషః" నిరవధికాయుష్మంతులనునపుడు పైనిజెప్పిన వారెల్లరు లేఖశబ్దవాచ్యులే. మంత్రమందు "లేఖాః" అనుపదమునకు బదులు" దేవాః" అని ప్రయోగించినను చందోభంగము కాదు. కాని ప్రాణుల శుభాశుభఫలములను వ్రాయువా రను నర్థమిచ్చు "లేఖాః" అను దేవపర్యాయపదమును బ్రయోగించిన ప్రయోజనము వక్ష్యమాణశ్లోకమందుఁగనవచ్చును.

అమరులనఁగాఁజావులేనివారు, హద్దులేని యాయువు కలవారని తెలియును. ఇఁక అమ్మా! నీవాయుఃస్వరూపవు. ''విశ్వమసి విశ్వాయుః'' ''సర్వమసి సర్వాయుః'' శ్రుతి. "విశ్వమనఁగా శివాది క్షితిపర్యంతమైన ముప్పదియారు తత్త్వములచే విరచితమైన బ్రహ్మాండజాలముంతయు విశ్వము. ఆ విశ్వము నీస్వరూపము. మఱియు నీవిశ్వముయొక్క యాయుస్వరూపమున నున్నదానవు. నీవు.జడముగాఁగనవచ్చుసమస్తము నఖండ చైతన్య స్వరూపిణివైన నీ శరీరము. చైతన్యస్వరూపిణివైన నీవు జడాత్మికవుగాఁదోఁచుట నీశక్తి లీలావి శేషము. జడాత్మకముగాఁగానవచ్చు దానియందంతట నీచైతన్యస్వరూపము నిల్చియుండు కాల మాయువనఁబడును. కనుక నీ వాయుఃస్వరూపిణివి. ఇది సమష్టి బ్రహ్మాండ విషయము.

"సర్వమసి సర్వాయుః " అను మాట రసాదిసప్తధాతువులు నేకాదశేంద్రియములు మున్నగువాని సంహతితోనైన పిండాండవిషయము. ఈపిండాండమందు దర్శన, శ్రవణ, గంధగ్రహణ, రసగ్రహణాది వివిధశక్తిస్వరూపముతో నుండి యాయాయింద్రియములచేఁ బనిచేయించుచున్నంతకాలము వాని యాయుష్కాలము. అనఁగా నఖండచైతన్య స్వరూపవగు నీవు వానితోఁదొలఁగకున్నంతకాలము వాని యాయుష్కాలము. రోమములు చర్మముతో నంటియున్నంత కాలము వాని యాయుఃకాలము. అది మొదలు సర్వమును బిండాండ విషయముఁన జూచుకొనునది. దేవశబ్దము చక్షురాదీంద్రియములకును, బ్రాణాదివాయువులకును జెల్లు ననియు వాని వివిధశక్తులు నీవియే యనియుఁదెల్పుటకే గాయత్రిసంధ్యేత్యాదినామవ్యవహృతవైన నిన్నే " దేవానాం ధామ నామాసి" యని సంధ్యావందనభాష్యములు వర్ణించినవి.

అమ్మా! ఆయూరూపమున నిన్ననుభవించి నీస్వరూపమేయైన యాయుః కాలము నభివృద్ధి చేసికొనఁదలచినవారు నీ తెలివితో నిన్నే యజింతురు. ఆయూరూపమున వెలయునిన్ను యజించి సుష్ఠిగా ననుభవజ్ఞానముతోఁ జెప్పఁబడిన గ్రంథ మాయుస్సూక్తమనుపేర శ్రుతియందుఁబ్రసిద్ధము. అందొక బూక్కునందు నాయువు నీవేయనియు నాయుర్లాభముకొఱకు నీయాథర్థ్యము నుగ్గడించుచు నిన్నే తృప్తి నొందింపఁదగుననియు వివరింపఁబడినది. భర్గోరూపవైన నీకు స్తుతిరూపవందనము లాచరించి మూలాధారమునుండి సహస్రారమునకు వత్తువు గాక యని "ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మసమ్మితం" అని ప్రార్థించి మూలాధారము నుండిసహస్రరామునకుఁదెచ్చి, "బ్రాహ్మాణభ్యో7భ్యను జ్ఞాతా గచ్ఛ దేవి యంథాసుఖం" అని బ్రహ్మలోకమనఁబడు మూలాధారమునకు మఱలిపోవ ననుజ్ఞ నిచ్చునపు డాశ్రిత సర్వదవైన నిన్ను సాధకద్విజుడు "ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా" - అని తొలుదొల్తఁబరమాయువునే యాచించి తరువాత ద్రవిణమును (ఆత్మజ్ఞానమనెడి ధనమును) పిమ్మట దానివల్ల నగు బ్రహ్మవర్చస్సును యాచించుట లోకవిదితము.

"ఓంశ్రియం లక్ష్మీమౌపలా మంబింకా గాం షష్ఠీం జయా మింద్రసేనేత్యుదజాహుః | తాం విద్యాం బ్రహ్మయో నిగ్‌ం సరూపామిహాయుషే తర్పయామో ఘృతేన" (శ్రుతి)

అమ్మా! ప్రణస్వరూపిణివియు శ్రియం=ఎల్లరచే నాశ్రయింపఁబడుదానవును, లక్ష్మీ=సర్వలక్షణలక్షితవును భక్తుల నొకకంటలక్షించుదానవును; గాం =భూస్వరూపవును (ఉపలక్షణముచే మహాభూతస్వరూపవును, సూర్యాది సర్పపవును, అంబికాం = కసలజననివియు ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తిసమష్టిరూపిణివియు, షష్టీం=షష్ఠము అనఁగా డైశ్వర్యసమూహము కలదానవును, మఱియుఁగోశ పంచకములోపల బ్‌ర్హమానందస్వరూపిణివై అహమ్మను పేరంబరఁగుచున్న దానవగుటచే షష్ఠివియు బ్రహ్మాది సదాశివాంతమైన పంచతత్త్వములకుఁబైదైన పరమశివస్వరూప తత్త్వము నీదే యగుటే షష్ఠివి. నీసంచారభూమియైన శ్మశానమందు - (కులమార్గమందు) సుషుమ్నపథమందు మూలాధారాదిగా నాజ్ఞాంతమైన యారుచక్రములయందును సృష్టిశక్త్యాదిగా నైదవదైన యనుగ్రహశక్తిని మీఱిన మన స్తత్త్వవిశిష్టమైన యాజ్ఞాచక్రమందుఁ బరమాత్మతత్త్వస్వరూపిణివగుటచే షష్టీనామప్రసిద్ధవును, జయానామముతో బ్రసిద్ధయైన దుర్గానామవు నీవెయనియు సార్థకమగుచున్నది. జయశబ్దము ప్రణవార్థకము "తతో జయముదీర యేత్‌"- అనునపుడు జయమనఁగా నోంకారమని భాష్యకారలు వ్రాయుటడచే జయవును, జయస్వరూపిణియుఁదృతీయాష్టమీచతుర్దశులు జయతిథులగుటచేఁ దత్తత్తిధిస్వరూపిణివియు నీవే యని యుగ్గడించుటకే యింద్రసేనవు. అనఁగా నింద్రుని సర్వైశ్వర్యస్వరూప పరమేశ్వరుని సేన యనఁగా జగత్కారణ వస్తువులుగాఁ బరిగణింపఁబడిన శివాది క్షితిపర్యంతమైన ముప్పదియారుత త్త్వములును నీవే యనియు గొంతెత్తి శ్రుతులు పలుకుచున్నవి.

మఱియు"యయా దతక్షరమధిగమ్యతే సావిద్యా" ఏ జ్ఞానమచేత నక్షరపరమాత్మ పొందఁబడునో యట్టివిద్యవు ( బ్రహ్మవిద్యవు) అనఁగా మోక్షసాధన విద్యవును. గౌడపాదీయసూత్రములందు "చైతన్యరూపా శక్తిః విద్యాపదేన తేజోనిష్ఠకళావి శేషపదేనచ పరామర్శితా విద్యాఅని చెప్పఁబడుటచేతను "యావైకర్తనమండలం వపురపక్షిప్త్వా ప్రతీకాన్‌ స్వకాన్‌ భ్రాంత్యా స్వీయపదే చిరాయద్దిశతునో భద్రాణి విద్యాదిమా" తన ప్రతీకములైన గ్రహనక్షత్రాదుల నాకాశమం డాడాడ నెగురువైచి తనమాట చొప్పనఁ గట్టుఁబాటు తప్పక భ్రమంపఁజేయుచుఁ గ్రీడించుచున్నదో యా యాదిమవిద్య శుభములను మాకిచ్చటుఁగాక! యని వరాహమిహిరాచార్యుఁడు చెప్పియుండుటచేత సృష్టికిమున్న తత్కారణరూపవుగానుండి కామకళాస్వరూవపవైన నిన్ను విద్యాశబ్దముచేతనే యుగ్గడించుటచటేతను "బ్రహ్మయోనిం" బ్రహ్మకును జన్మస్థానమవగుచేతను "సరూపాం" అనఁగా బ్రహ్మసమ్మితవు అనఁగా నధిష్ఠానావస్థానానుష్ఠాన నామరూపములందు బ్రహ్మముతో సమానమవగుట చేతను తాం= పరమాత్మస్వరూపిణివైన నిన్నీ లోకమందుఁబర మాయుర్లభ్దికై జపస్తుతిహోమాదులచే స్నేహముతోఁ దృప్తి నొందించుచున్నారమని యాయుస్సూక్తమంత్రము గొంతెత్తి పలికినది.కనుక శ్రీమాతా పరమాయుర్లాభాము నీవల్లనే మాకుఁ గావలయును.

శ్లో|| లిలేఖ నిటలే విధిర్మమ లిపం విసృజ్యాన్తరం

త్వయా విలిఖితవ్యమేతదితి తత్ఫలావాప్తయే|

తదన్తం ఇహ స్ఫుటం కమలవాసిని శ్రీరిమామ్‌

సమర్పయ స్వముద్రికాం సకలభాగ్యసంసూచికం||

తా|| అమ్మా! కమలవాసినీ! శ్రీదేవీ! బ్రహ్మదేవుఁడు నానొసఁట నేదో వ్రాత వ్రాసినాఁడు. అడ్డులేక "నీవిది వ్రాయవలయు" నని దాని ఫలము నొందుటకుఁగా నాతని మనస్సునందు రూఢిపడుటకుఁగా నిపుడు సర్వభాగ్యములను విరజిల్లు జాడ తెలుపునట్టి 'శ్రీ' యనెడి నీపేరు గుర్తుగాఁగల నీయుంగరమును నాకిమ్ము.

అమ్మా! నీవు హృదయపద్మమందుండు దాన వనఁగా నిన్ను నాహృదయముందేనాడును విడువ లేదు. ఎల్లరచేత నాశ్రయింపఁబడుదానవు. జ్ఞానానందస్వరూపపరాశక్తివి. కర్మఫళ మవిలంఘ్యము. లేఖులలో మొదటివాఁడైన (శుభాశుభఫలముల వ్రాయువారిలో మొదటివాఁడైన) బ్రహ్మ దేవుఁడు నానొసఁట నీయాజ్ఞానుసారముగా వ్రాయవలసిన వాఁ డడ్డులేనట్లువ్రాసినాఁడు. అంతయు విడిచి "నీవిది వ్రాయవలయు" నని దానిఫలము నొందుటకుఁగాను వాని మనస్సునకుఁదేఁటపడునట్లుగా సర్వభాగ్యములనుసూచించు నది నీయుంగరము కనుక యీనీయుంగరమును నాకిమ్ము.

దీనికంటె వెనుకటిశ్లోకమునందు "లేఖాః" శుభాశుభఫలములను వ్రాయువారలను దేవపర్యాయము ప్రయోగింపబడినది. దేవతలు శుభాశుభఫలములను వ్రయా%ువారే కాని యిచ్చువారు కారు. నీవో కర్మఫలమప్రదాత్రివి. సర్వస్వతంత్ర పరమాత్మవు. ఒకపనిని చేయున, మానను, చేసినదానిని మార్పను సమర్థవు. కనుకనే యాతఁడు వ్రాసిన యాపంక్తులను విడిచి (తుడిచి) యీవిధముగా వ్రాయవలయునని గుర్తుగా నీయుంగర మిమ్మని యాశ్రిత సాధకుఁడు చనవున నడుగుచున్నాఁడు.

శ్లో|| తదిదం తమిరం ఫాలే స్ఫుటం కమలవాసిని|

శ్రియం సముద్రజాం దేహి సర్వభాగ్యస్య సూచికాం||

తా|| అమ్మా! పైని జెప్పిన కారణమువలన నా నొసఁట దారి తెలియనీయనిచీఁకటి స్పష్టముగా నున్నది. కనుక సముద్రముఁదు బుట్టినట్టియు, సఖలభాగ్యమును సూచించునట్టుయు శ్రీని (లక్ష్మిని) నాకిమ్ము.

వి|| అమ్మా! నీవు తామరయందు వసించుదానవు. లక్ష్మిని నిన్నా శ్రయించినవారి కెట్టి దారిద్ర్యము లుండవు. జ్ఞానదారిద్ర్యమును దొలఁగించి, యజ్ఞానమనెడి చీఁకటిని మాపఁగల జ్ఞానజ్యోతిర్మయివి. కర్మఫలవశమున విధి నానొసఁట, ముందు జాడ కానరానియాని యజ్ఞానాంధకారమును బెట్టి నాఁడనుట స్పష్టము. నీవు సర్వస్వతంత్రవు. బ్రహ్మాదులకును నారాధ్యవు. వారు నీ మాట దాటలేరు. నీ ప్రాభవముచే నీయాశ్రితులకు భోగ మోక్షప్రదసాధనములు చూపఁగలవు. కావుననే సర్వభాగ్యమును సూచించునట్టియు, సముద్రము నందుఁబుట్టినట్టియు, శ్రీని నాకిమ్మని వేడుచున్నాను. అమ్మా! నేను గోరునది నిన్నే. నీవే సముద్రజవు. సహజా నందకరలక్షణముతో ఁగూడినవాఁడు సముద్రుఁడు; పరమే శ్వరుఁడు. సముద్రము రసపూర్ణము. రసమనఁగా నానందము. ఆనందమయ పరమాత్మనుండిపుట్టినదానవు. కనుక నీవును నానందమయివే. సర్వజ్ఞత్వ నిత్యతృప్త్యాదులైన షడైస్వర్యసమూహమే భగము. నీతండ్రి సముద్రుఁడు భగవంతుఁడు. నీవు భగవతివి. కనుక నిన్ను భాగ్యసూచిక యని సాధక పుత్త్రుఁడు పేర్కొనుటలో రసస్వరూపిణి! ఆనందమయి! ఎంత సారస్యమున్నదమ్మా! ఆసముద్రమందుఁబట్టిన్న శ్రీవినీవు. అఖండనిశ్చలజ్ఞానానందస్వరూపుఁడైన నీతండ్రియందు జరిగిన మథనము సంకల్పరూపనిశ్చలానందమయమే. నిర్మల జ్ఞానమయమే. శవర్ణ, రేఫ, ఈకారములుచేరి యయిన శ్రీశబ్దము నీకుఁజెల్లినది. శవరఅణ మానందమును, రేఫము జ్ఞానమును, ఈకారము శక్తిని దెల్పును. ఈకారవాచ్యయైనయాశక్తి సామాన్యశక్తికాదు. అది కలాశబ్దవాచ్య. "కలాతు శ్రేష్ఠశక్తిః స్యాత్‌" సృష్టిని గామించినపుడే భగదవంతుఁడు కాముఁడైనాఁడు. వాని కళ కామకళ. నీశ్రీనామమందలి ఈకారము సర్వశ్రేషశక్తివై న లక్ష్మిని నిన్నే తెల్పును. నిను వర్ణించిన శ్రీసూక్తమనెడి శ్రతి భాగము " చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం (ప్రద్మినీమ్‌+ఈమ్‌) శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వావృణ"- అనియు "తామికారాక్షరోద్ధారాం సారాత్సారాం పరాత్పరాం ప్రణమామి మహాదేవీం పరమానందరూపిణీమ్‌" అమ్మా! సర్వశ్రేష్ఠమైన ఈంకారమే నీనామమనియు, జ్ఞానా నంగదమయ పరమాత్మస్వరూపిణివి నీవే యనియు వేదాగమతంత్రాదు లుగ్గుడించుచున్నవి. కనుక నీవు 'ఈంకార' వాచ్యవు. నీనామమైన 'ఈం' శవర్ణ రేఫయుక్తమైనను గాకున్నను కామకళాపదవాచ్యమైన నీకేచెల్లును.కావుననే "ఈంశరణమహం ప్రపద్యే" అని శ్రుతిపల్కినది. నామము సారాత్సారము. నీవుపరాత్పరవు. మహాదేవివి. పరమానందవిద్యోపాసకమహర్షులు శ్రీచక్రమధ్యగతబిందు (పరమాత్మ) స్థానమున 'ఈం' కారమునేనిల్పిరి.

తల్లీ! శ్రేష్ఠారాధ్యవస్తువు నీవే యైనపుడు,జగజ్జనివి నీవేయైనపుడు, అమ్మా! 'నీవే కావలయు'నని కోరుటే సాధక ధర్మము. నీవే కావలయునన్నను నీస్వరూపములైన జ్ఞానానందములే పెట్టుమన్నను భావయొక్కటే కదా!

శ్లో|. కలయా తే యథా దేవి జీవన్తి సచరాచరాః|

తథా సంపత్ప్రదేలక్ష్మి సర్వదాసంప్రసీద మే|| 21

తా|| ఓదేవీ! నీశక్తిచేతనే స్థావరజంగమాత్మకములు జీవించుచున్నవి. నీవు సంపత్ప్రదవు. లక్ష్మివి ఎల్లపుడును నాయెడఁబ్రసన్నవై యుండుము.

వి|| అమ్మా! నీవు దేవివి. స్వేచ్ఛతో స్థావరజంగ మాత్మకతనువుతో నిన్ను నీవు వెలయించుకొంటివి. నీశ్రేష్ఠశక్తిచేతనే వానిని జీవింపఁజేయుచున్నావు. జీవన శక్తి నీస్వరూపము (ప్రాణధారణశక్తి నీస్వరూపము). ప్రత్యేకభూతమందును నీవు పరాప్రకృతిరూపముతో వెలయుచున్నావు. అదియు నీకళ##యే. జీవనదానము చేయునది యమృతవస్తువు. అమృతమనఁగా నానందము. అమృతాకళ##కే బ్రహ్మకళా, సాదాకళా, మహావైసర్గికీకళా యని వేళ్ళు. చరాచరాత్మకమైన దంకతయును నీవిసర్గకార్య స్వరూపమే. కనుక దానిని నీకళ చేతనే మనుచుట నీపని, నీవు చంద్రకళా స్వరూపవు. చద్‌+రక్‌-అహ్లాదనము. దీప్తిని, అనఁగా నానందము, జ్ఞానము నెవ్వని స్వరూపమో యాపరమాత్మయే చంద్రుఁడు. వాని కళవు నీవు. చంద్రషోడశీకలాత్మకవైన నిన్ను దాదాత్మ్యముతో నంతర్యాగ క్రమమున నారాధించు సాధకోత్తముని సహస్రారమనెడి చంద్రమండలమునుండి నీ కళ##యే యానందామృతమును గురియుచు నతని చరాచరమైన యనఁగాఁగదలెడి గదలదని డెబ్బదిరెండువైల నాడు నాప్లావితముఁజేయును. నీవు లక్ష్మివి. సాధక పత్త్రుల నొకకంట లక్షించుదానవు. సర్వసంపదలను (పొందఁదగినవానినన్నింటిని) బొందిచంచుదానవు. అమ్మా! నాకుఁబ్రసన్నురాలవగుము.

శ్లో|| యథా విష్ణౌ ద్రువే నిత్యం స్వకలాం సన్న్యవేశ యః |

తథైవ స్వకలాం సమ్యఙ్మయి లక్ష్మి సమర్పయ|| 22

తా|| సనాతనుఁడై యంతట నాత్మస్వరూపముతో వ్యాపించియున్న విష్ణువనెడి పరమాత్మయందు నీ శ్రేష్ఠశక్తిని నీశోభను నెలకొల్పినట్టులే ఓలక్ష్మీ దేవీ! నాయందును నీకళనుంచుము. నీవు లక్ష్మివి. శక్తిస్వరూపిణివైన నిన్నే హరిలక్షించుచుండుటచేతను, సర్వమును నీచే లక్షింపఁబడు చుండుటచేతను నీవు లక్ష్మివి. నీ సంతానమేయైన సర్వమును నీవు లక్షింతువు కనుక లక్ష్మివి. జ్ఞానానందస్వరూపమైన నీకళను (శోభను) నాయందు నిల్పును. అనఁగా "నీవు ధ్రువుఁడవు. అనఁగా శాశ్వతుఁడవు. అనిత్యుఁడవు కావు. ఆత్మస్వరూపుఁడవు. జ్ఞానానంములే నీ స్వరూపము" అని మాకుఁదెలియుఁజెప్పుచు ఆ మాస్వరూపమును మాచేతననుబవింపఁజేయుము. ఈలాభము నర్థించియే నిన్నుఁ బిలుచు చున్నాము.

శ్లో|| సర్వసౌఖ్యప్రదే దేవి భక్తానా మభయప్రదే|

అచాలం కురు యత్నేన కలాం మయి నివేశితామ్‌||

తా|| అమ్మా! దేవి! నీవు సర్వసౌఖ్యముల నిచ్చు దానవు. నీభక్తులకు నభయము నొసంగుదానవు. కురణించి నీవు మాయందుంచిన కళను (శోభను) జెదరనిదానిఁగా జేయఁబ్రయత్నింపుము.

వి|| దేవీ! నీవు లక్ష్మీనామప్రసిద్ధ వెందులకైతివో నివేదించుకొంటిని. నీవెల్లరకు నెల్లసౌఖ్యముల నిచ్చుదానవు. నిన్నాశ్రియించువారికి ధనధాన్యపుత్త్రపౌత్త్రాది సంపత్సౌఖ్యములనిచ్చుటే కాక తుదకు మోక్షసౌఖ్యమును సైతము కూర్చుదానవు. మఱియునీభక్తులకునిన్నంటిపెట్టుకొని యుండి సేవించువారలకు ననఁగాఁదాదాత్మమ్యబుద్ధితో ("నీవే నే" ననెడి యబేదబుద్ధితో) సేవించువారలకు నభయము నిత్తువు. అనఁగా ఁగామక్రోధాదిశత్రుభయము లేకుండఁజేయుదువు. సాధకపుత్త్రుల నిత్యత్వమును (సత్యత్వమును) బోధించి సత్య ప్రతిష్ఠితులఁజేసి మృత్యుభయమును దొలఁగించి క్రమముఁగాఁబ్రాణ (చిత్‌) ప్రతిష్ఠితులను నానందప్రతిష్ఠుతులను జేసి యభయములను జేయుదువు. ఇదే నీకలానివేశనము. భక్తలను నీ స్వకలానివేశనముచేఁ గరుణింతువు. పో! ఆశోబను జెదరనిదానిఁగాఁజేయు నీవే యత్నింపవలయును. ఏలన యుగయుగాంతరములనుండి జన్మజన్మాంతరములనుండి, నిన్ను లక్షింపని కారణముచేతనే మాసత్యత్వచిత్త్వానందత్వములు విస్త్రతములై యనుభూతములు కాకపోయినవి. కనుక కరుణించి మాస్వరూపానుభవము నిశ్చలమగున్టలు చేయు భారము వహింప నిన్నేప్రార్థించుచున్నాను.

శ్లో|| సదాస్తా మత్ఫాలే పరమపదలక్ష్మీః స్ఫుటకలా

సదా వైకుంఠ శ్రీ కర్నివసతు కలా మే నయనయోః|

వసేన్మర్త్యే లోకోమమ వచసి లశ్రక్ష్మీ వరకలా

శ్రియః శ్వేతద్వీపే నివసతు కలా సాస్వకరయోః|| 24

తా|| అమ్మా! పరమపదలక్ష్మివైన నీకళ నానొసఁటనెల్లప్పుడు నిల్చుఁగాక! వైకుంఠలక్ష్మీవైన నీస్ఫుటకళ నా కన్నులయందెల్లప్పుడు నిల్చుఁగాక! ఈమర్త్యలోకమందు మానషశరీరముతో నేనుంతకాలము నీశ్రేష్ఠకల నా వాక్కునందు నిల్చుఁగాఁక! శ్వేతద్వీపవాసినివైన శ్రీ దేవీ! సుప్రసిద్ధమైన నీకళ నాచుతులయందు నివసించుఁగాక!

వి|| అమ్మా! వైకుంఠమనియు, బృందావనమనియు వైష్ణువులును, గైలాసమని శైవులును, బరమపమని యోగులును, వ్యవహరించు సహస్రారమందు నీ స్ధకమపుత్త్రుఁడు (నేను) అనుభవించు నీశోభ నాఫాలమందుసుస్థిరముగా నుండుఁగాక! సంకల్పితకార్యములయందు నలసత, వికుంఠత (మొక్కవోకుండుట) ప్రతిఘాతములేని శ్రీదేవిని. అమోఘసంకల్పమైన శ్రీదేవిని. జ్ఞానానందస్వరూపశక్తిని. అట్టి నీకళ నాఫాలమందు నిల్చుగాక! అమ్మా! నీయమోఘుసంకల్పమే జగత్సృష్టి, అందు నీకళ##యే నాకు గోచరించు చుండుఁగాక! నీవు సంకల్పించి పొందిన నీవిగ్రహమే యీ స్వరూపమూర్తి నెఱుంగుటకు మున్ను మాచేయు సాధనము నీజగద్విగ్రమహమును గాంచునపుడు నూశ్రేష్ఠశక్తి నామరూప క్రియాసహితమవస్తువల నెందెందు వెలయునో కాంచి నీయాది మమూర్తి నెఱుంగుటకే మాగీ కన్నుల నిచ్చితివి. ఆపని వానిచేఁజేయించుటే మాకన్నులయందుఁ గలవానివాసము. జగత్తంతయు శ్రీకలామయముఁగాఁగనఁగల్గువాఁడే యథార్థ శ్రీమూర్తి నెఱుంగఁగలఁడు.

మఱియు వాగ్రూపమంతుయ ఘనీభావ మొందినపుడు అనఁగా నాకారాకారితమైన పుడేలిపి యనఁబనుడు. అపుడే నీవు పుస్తకరూపిణీసరస్వతివి-బ్రహ్మవిద్యవు. ఋషుల రూపమున నీవే వలెసి నీతత్త్వము నెఱింగించు బ్రహ్మనుభూతి వాక్యములే వేదములు. అవి శ్రవణంద్రియముచే గ్రహింపఁబడునపుడు శ్రుతులనఁబడునుచ. అవే ఘనీభూతములైనపుడు అనఁగా లిపిరూపము నొందినపుడు పుస్తకములనఁబడును. తద్రూపముతోను నీవే వెలయుదువు. అపుడే నీవు పుస్తక రూపిణీసరస్వతివి. జగచ్ఛరీరిణివియైన నిన్నభిధ్యానించుటకును నీవిచ్చిన కన్నులేమాకాధారము. అవి యాత్మార్పణశీలురను నీయొడకింజేర్చు సాధనములు. కనుకనే నయనములు. వానియందు దర్శనశక్తిశోభను మిత్రనామఖ్యాతితో నిల్పుమని ప్రార్థించుచున్నాను.

భాషాదేవీ! మాతృకావర్ణస్వరూపిణీ! నీవీ వచో వికాససౌభాగ్యమును దనుజమనుజులమైన మాయందే పెట్టితిని. అదేనీవరకల. శ్రేష్ఠశోభ. వరవచశ్శోభారూపమున వెలయని మనుజశరీరములైనను నింద్యములో యగుచున్నవి. నీపెట్టిన శ్రేష్ఠవాక్కళాసహాయముననే యథాశక్తిగా నిన్ను సార్థవాక్కులతో నుతింపఁగల్గుచున్నాము. నీవైఖరీరూప వాక్సహాయముతో నర్థులకు నిన్నుధదెలియఁజెప్పఁగల్గు చున్నాను. జయక్రియందు మాలో మధ్యమావాగ్రూపవైన నీశ్రేష్ఠశోబచేతదనే మానసికజపము నొనర్చి నీకళను (శోభను) అనుభవించి కడు మేలొందఁగల్గుచన్నాము, కనుక నీ భాషారూపశ్రేష్ఠకళ నా వాక్కునందు నిల్చి యున్నచో మేము తరించి పరులను దరింపఁజేయుఁగలను. దానిచే విద్యాదానఫలరూయశస్సు నొందఁగలము. నీవు చేయించిన జ్ఞాన స్తన్యపానముచేధన్యుఁడైన నసాధకపుత్త్రుఁడు "యశో జనే7సాని స్వహా" యని యాశించుట వింతయా?

అమ్మా! రజస్తమస్సంపర్కము లేని శుద్ధజ్ఞానానందమయివైన నీవు మాసహస్రారమున (శ్వేతద్వీపమున) అను సంధానింపఁబడినపుడు శ్వేతద్వీపనివాసినివి. శ్రీదేవిని. "సా" శబ్దముచే వ్యవరింపఁబడదువు. బ్రహ్మమునకు రూఢమైనన తచ్ఛబ్దము స్త్రీలింగరూపము"సా" కనుక నీవు పరమాత్మ స్వరూపిణివి. అట్టి నీకళ నాచేతులయం దింద్రిశబ్దముతో వ్యవహింపఁబడు గ్రహణశక్తిరూపమున నీవు వెలయకున్న రెండు చేతులు మోడ్చి నిన్ను మ్రొక్కుటకుఁగాని; జపాదులందు శరీరము మంతర్మయము చేసికొనుటకై మంత్రాలను దాకుటకుఁగాని, నిన్ను సంకీర్తించునపుడు కరతాళములు వేయటకుఁగాని, యోన్యాదిముద్రావిరచనమునకు గాని, నీ పారమ్యమహిమాదులను శాశ్వతపరోపకారమునకే లిపిరూపము నొందించుటకుఁగాని, తుదకు నీస్థూలపూజాదులను జేయుటకు నుపచారక్రియలు చక్కఁగాజరు పుటకుఁజాలియుండవు గదా! కనుకనే శ్రీదేవీ జ్ఞానానందస్వరూపశక్తియుతపరమాత్మస్వరూపిణీ! నీశోభను ఫాలనేత్ర వచఃకరములయందు లెస్స నిల్పుమని ప్రార్థించుచున్నాను.

శ్లో|| తావన్నిత్యం మమాం గేషు క్షీ రాబ్ధౌ శ్రీకలా వసేత్‌|

సూర్యచంద్రమసౌచ యావద్యావల్లక్ష్మీపతిఃశ్రియా||

తా|| అమ్మా! సూర్యచంద్రు లునన్నంతకాలము, శ్రీదేవితో విష్ణు వున్నంతకాలమును నాసర్వాంగములు యందును క్షీరాబ్ధియందును (సహస్రారమునందును) నీ శ్రీకళ నిత్యము చెదరుకుండఁగాక!

వి|| జ్ఞానాందస్వరూపశక్తియుతపరమాత్మశ్కతి నా సర్వాంగములయందును ¸°గికభాషలో క్షీరాంబుధిగా భవింపఁబడు సహస్రారమందును శ్రీకళ శాశ్వతముఁగా నుండుగాక! యని సాధకుఁడు కోరచున్నాఁడు . కాని శరీరమనిత్యమ, కావున శాశ్వతత్త్వము పొసఁగదు. ఇపుడు 'సూర్యచంద్రులున్నంతకాలము, శ్రీతో లక్ష్మీపతి యున్నంతకాలము'-అనుమాటల యథార్థ్యమును సమన్వయించు కొనవలసియును. శరీరమందు ,సూర్యచంద్రులున్నంతకాలమనఁగా బింగళానాడియు (సూర్యనాడియు) ఇడానాడియు (చంద్రనాడియు) నడచుచున్నంతకాలమని యర్థము. హం బీజము సూర్యానాడిని, సహబీజము చంద్రనాడిని దెలుపును. సమస్తమున హం+సః=హంసః; యగును. కాఁగా సూర్యచంద్రురూపశ్వాసములు నడుచుచున్నంతకాలమని యర్థము ఇఁక శ్రీతో లక్ష్మీపతి యుండునంతవఱకు శ్రీతో ననఁగా "నేను" తో లక్ష్మీపతి-ప్రాణనాథుఁడున్నంతవఱకు అని చెప్పవలయును.బ్రహ్మమనస్సుగాను, లక్ష్మీపతి యనఁబడు విష్ణువు ప్రాణముగా ననఁగాఁజైతన్యముఁగాని, శివుఁడు జ్ఞానముఁగాను, శ్రుతులు వర్ణించినవి. ప్రాణము కేవలము వాయురూపవస్తువు కాదు. చైతన్యమే ప్రాణశబ్దవాచ్యము అఖండచైతన్యమే ఖండఖండచైతన్యవర్గముగా నై సర్వేంద్రియులములకడ నింద్రియాధిష్ఠానచైతన్యమునుచు మిత్ర, వరుణ, అశివన, ఇంద్ర, చంద్ర, విష్ణు, ప్రజాపతి మున్నగు నామములతో జ్ఞానకర్మేంద్రియముల యధిష్ఠానమై వానిచే దర్శనశ్రవణరసగ్రహణాదికార్యములను జేయించుచుండును. అదియే "నేను"తో సర్వేంద్రియాధిష్ఠానచైతన్యముండుట, అదియే శ్రీతో లక్ష్మీపతి యుండుట. కాఁగా "అహం" వస్తు వింద్రియములతోఁగూడి పని చేయుచున్న కాలము మొత్తముపై నింద్రియశక్తులు నశింపక శ్వాసము లెగిరిపోక సాగుచుండునంతవఱకు-మరలణమనెడి యారవవికారము శరీరమునకు రానంతవఱకని యర్థము.

నాసుషుమ్నాంగములై మూలధారాదులందును. సహస్రారమందును. శక్తిశక్తిమంతులు లక్ష్మీనారాయణలు- పార్వతీపరమేశ్వరులు నాయనుభవమునకు వచ్చు చుందురు గాక. గాయత్ప్రుపాసనమందును సాధకులు "బాహ్మణభ్యో7భ్యనుజ్ఞాతా గచ్ఛ దేవి యథాసుఖం" అని "ఆయాతు వరదా దేవీ" అని పిలిచిసహస్రారమందు శ్రీకలాచిరావస్థానమునే కోరుకొనుచుందురు. మఱియు "యావత్‌ కంఠగతాః ప్రాణా యావన్నస్యతి చేంద్రియం తావన్మే శ్రీకలా తిష్ఠేద్ధృది పర్వతమూర్థని" - ఇచట సహస్రారమే పర్వతమూర్థము. మూలాధారమునుండి లేపఁబడి స్వాధిష్ఠానాదుల నతిక్రమించి సహస్రారమందుధజేర్చుటే ¸°గిక సాధకుని ప్రయత్నము. అదే వాని ప్రార్థనము.

శ్లో|| సర్వమంగళసంపూర్ణా, సర్వైశ్వర్యసమన్వితా,

ఆద్యాదిశ్రీర్మహాలక్ష్మి త్వత్కళామయి తిష్ఠతు||29

తా|| అమ్మా! మువురమ్మల మూలమైన యమ్మా!మహాకాళీ, మహాలక్ష్మి,మ హాసరస్వతులనెడి యాద్యలకాదివి నీవు. కనుకనే మహాలక్ష్మివి. (ఈవిషయమున విశేషమునకై నా 'సప్తశాత్యుపాసనాక్రమము' చూచున్నది.) సర్వమంగళ ములతో నిండినట్టియు, సర్వసామర్థ్యములను గలిగించునట్టియు నీశ్రేష్ఠశక్తి నాయందు నిల్చుగాక.

మంగళశబ్దము కనేకార్థములుగలవు. ఈజగమందెన్ని మంగళములున్నవో యామన్నిటియందు నిండియున్నది నీకళ##యే. లోకమందు మంగళము, లేనిమిది. బ్రాహ్మాణుడు, గావు, హుతాశనుఁడు, హిరణ్యము, ఘృతము, ఆదిత్యుఁడు, జలము, రాజు- ఈయన్నింటికిని మంగళవిధానకారిణి నీకళ##యే, కనుకనే నీకళ సర్వమంగళసంపూర్ణ. సుఖమునిచ్చుట, యరిష్టమును దొలగించుట, శ్రేయశ్కరత్వము, శుభకరత్వము, కోరికల నీడేర్చుట. చెడుగునుదొలఁగించుట మున్న గునవన్నియు మంగళములే ఇవన్నియు నీ శ్రేష్ఠశక్తియందే యున్నవి. అమ్మా! నీవు సర్వమంగళ సంపూర్ణవు. అనునపుడు ముఖ్యతరార్థమొకటి స్ఫురించును. సర్వమందను మంగళస్వరూపముతో నిండియున్న దానవు. నీచైతన్యమయరూపమే మంగళము. పరాప్రకృతి నామముతో'నే' ననుచునంతట నిండియున్న దానవునీవే. 'సర్వత్రఅతతీతి ఆత్మ'-అంతట చేతనరూపముతో )నేనను రూపముతో) నిండియున్నదానవు నీవే. జ్ఞానానందమయివైననీవే 'అహం' అను పేరితో నుపాధులయందుండుటే మంగళము. నీవులేచిపోవుటే యమంగళము. మనుజశరీరములయందు నీవున్నంతకాలము పాధికెట్టి సంజ్ఞ పెట్టుకొన్నను దానికి మున్ను నీపేరు 'శ్రీ' చేర్పకతప్పదు. ఈ 'శ్రీ'సంజ్ఞ చతుర్వర్ణములవారి పేళ్ళ ముందు క్రమముగా బ్రహ్మశ్రీ, మహారాజశ్రీ, రాజశ్రీ, శ్రీయని వర్ణజ్ఞానమునకై చేర్పఁబడును. నాల్గింటియందును శ్రీకారముతప్పదు. తరువాతఁదీసివయుట తప్పదు. ఇదే నీ సర్వమంగళ సంపూర్ణత.

అమ్మా! నీవు సర్వైశ్వర్యములతోఁగూడిన దానవు. సంకల్పమమోఘమగుటచే సమర్థఁడైనవాఁ డీశ్వరుఁడు ఈశ్వరభావమే (ఈశ్వరుఁడైన యుండుటే) ఐశ్వర్యము. అనఁగా సామర్థ్యము. దీనికే విభూతి, భూతి యని వ్యవహారము. కేవల దేవసంబంధమైన యైశ్వర్యము లాఱు. సర్వజ్ఞత్వ, నిత్యతృప్తిత్వ, అనాదిబపోధత్వ, స్వతంత్రత్వఃనిత్యములు ప్తత్వ, అనంతత్వములు. అణిమాదిసిద్ధులునైశ్వర్యములే. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకారమ్యము, ఈశత్వము, వశత్వము-అనునవి. ఇవి గాక కేవల జాగతికైశ్వర్యము లేనిమిది. నిన్ను సేవించువారికి లభించునవి. దాసీధన ధాన్య భృత్య వస్త్ర వాహన బంధు సుతులు. ఇందు మొదటి తెగకుఁజెందిన యాఱును ననన్యసాధారణమైన ధీకళావిశేషములుకేచెల్లును. రెండవ తెగవి యణిమాదులు.అంతర్యాగక్రమమున నిన్నారాధించు సాధకులకుఁగల్లును. మూడవతెగవి జాగతిభోగవాంఛతో స్తూలపూజాస్తుత్యాదుల నినుఁగొల్చి మెప్పించువారికిఁగల్గును. ఇన్నివిధముల నైశ్వర్యరూపమున నీకళ##యే వెలయుచున్నది. అది యెప్పుడేవిధమున వెలయఁదగియున్నదో యప్పుడా విధమున నాయందు నిల్చుఁగాక! అని సాధకుఁడు ప్రార్థించుచున్నాఁడు.

శ్లో|| అజ్ఞానతిమిరం హన్తు శుద్ధజ్ఞానప్రకాశికా

సర్వైశ్వర్యప్రదామే7 స్తుత్వత్కలామయి సుస్థిరా||

తా|| అమ్మా! నీకళ యజ్ఞానాంధాకరమును దొలఁగించు శుద్ధజ్ఞానమును బ్రకాశింసఁజేయునది. ఆనీకళ నా యందుఁజెదరనిదై యుండి నాకు సర్వైశ్వర్యములు నిచ్చునది యగుఁగాక!

వి|| ఏజ్ఞానము శబ్దస్పర్శరూపరసగంధాత్మకమైన ఖండఖండజ్ఞానముఁగాఁ (అల్పాల్పజ్ఞానముఁగా) జెలఁగుచుఁదుచ్ఛానందమునే (అల్పాల్పనందమునే) కలిగించునో యదే యజ్ఞానము. అశుద్ధజ్ఞానము. అదే మంచిసెడ్డల ననఁగా నాత్మానాత్మవస్తువులను వివేకింపనీయదు. కనుక నేచీఁకటిగా నెన్నఁబడినది. శుద్ధజ్ఞానమనఁగా సర్వేంద్రియముల కడనింద్రియాధిష్ఠాన చైతన్యవర్గ మనుపేర నకండవిశుద్ధచైదతన్యమే వెలయుచుడను బహుత్వసంకల్పముచేతఁదానే వివధ విషయాకారమున వెలయుచు వానినిఁదన రూపమేయైన బుద్ధికడుకుఁదెచ్చుకొనుచుఁ దానే నేత్రాదిజాల కోపాంతములందు హృత్పద్మాసనలీలతో ఁగూర్చుఁడి తానే "అహం" (నేను) అనుపేర మధువుగా సేవించుచున్నది. గాన"నేను" విశుద్ధాఖండచైతన్యముకంటె వేఱుకాదు. అని బహుమానించుట విశుద్ధజ్ఞానము. ద్వివ్టివలె నిట్టి తెలివి వలయుటే యజ్ఞానతిమిరనాశము. అప్పుడేవ మానుషతనువు నాశ్రయించియున్న నేనునకు యథార్థోపనయన సంస్కారసిద్ధియైనదని యెన్నవలయును. అది యైనప్పుడే బ్రహ్మకళాభామయి సద్వైశ్వర్యములు నబ్బును. ఈయైశ్వర్యప్రదానశీలము శ్రీదేవిదేయనెడి శ్రద్ధావిశ్వసములతో సాధకోత్తముఁడమ్మను గళాలాభము వర్ధించుచున్నాఁడు. సర్వైశ్వరప్రదానశీల మమ్మదే కనుక శ్రీమాతృకళను దనయందు సుస్థిరము జేయుమనుచున్నాఁడు.

ఇచటఁ గళాశబ్దవిమర్శ మప్రస్తుతముకాదు. క్‌++ల్‌++అ- క కరాము ఆకాశమును , ఆకారముదానియందు నిహితమైన చైతన్యమును, లాకారముపృథివిని, అకారము దానియందుంచఁబడిన చైతన్యమును, దుది ఆకారము శుద్ధచైతన్యమును దెలుపును. పృథివి మొదలాకాశపర్యంతముగాఁ బరిదృశ్యమాన (ఇంద్రియాదులచే ననుభవింపఁబడుచున్న) సర్వప్రపంచము బ్రహ్మమే. "సర్వంఖల్విదం బ్రహ్మ" శ్రుతి. శివాద్యవని పర్యంతముషట్త్రింశత్‌ తత్త్వరూపమునఁ బరదృశ్యమానమగు సర్వప్రపంచమున కధిష్టానమైన నిర్విశేషమైన బ్రహ్మమునే నేను. (అహం బ్రహ్మస్మి) అనెడి యఖండాత్మానుసంధానమే కళ.

అది నాయందు సుస్థిరమైనపుడు సర్వైశ్వర్యప్రదమగును. అది నీకరణ కధీనము. షట్త్రింశత్తత్త్వసంచయవివరణముగూర్చి నా యనువదించున 'సిద్ధాంతశిఖామణిని' 'సౌందర్యలహరిని'జూచునది.

శ్లో|| అలక్ష్మీం హరతు క్షిప్రం తమః సూర్యప్రభాయథా|

వితనోతు మమ శ్రేయస్త్వత్కళామయిసుస్థిరా||28

తా||అమ్మా! (వెనుకటిశ్లోకమందు వివరింపఁబడిన)నీకళ నాయందు సుస్థిరయైన ప్రొద్దువెలుఁగు చీఁకటినివలె నాయలక్ష్మిని దొలఁగించినాకు శ్రేయస్సును కలగించుఁగాక!

వి|| సూర్యప్రభాప్రకాశ##మైనంత నేచీఁకటి తొలఁగుట తప్పుదు. అటువలె నీకళ నయందుఁ జెదరక నిల్చినపుడు నాయలక్ష్మి యనఁగా నాదౌర్భాగ్యము తప్పక తొలఁగును. అంతేకాక నాకు సర్వశ్రేయస్సులును లభించును. ధనధాన్య రత్నపుత్త్రాదిపార్థివశభ లేకుండుటే యలక్షఅమి కాదు; దౌర్భాగ్యమి కాదు. 'అపస్మృతి, విషయానుధావనము, జాగ్రదాద్యవస్థల నభిమానించుటచేనగు రాగద్వేషాదులు మున్నగునవియే యలక్ష్మి. వెనుకటి శ్లోకమున వివరించిన శ్రీకళ బ్రహ్మానుసంధానభాగ్యము లభించిన యదిస్థిరపడినపుడే యీదౌర్భాగ్యము తొలఁగును. జ్ఞానాందమయ శక్తిస్వరూప శ్రీదేవి. ఎల్లరచతే నాశ్రయింపఁబడునది కనుక శ్రీ. ఈయాశ్రయణము పైన వివరించిన దౌర్భాగ్యము తొలఁగుటకే కావలయును. అట్టి దౌర్భాగ్యము వడిగా నడంగుటకే దానిచేఁబీడింపఁబడిన సాధకుఁడు లక్ష్మీదేవిని గళాభ్యర్థియగుచు నాశ్రయించును. ఈవిషమును సమగ్రవివరణమునకై నావ్రాసిన శ్రీసూక్తరహస్యార్థ మందలి "చంద్రాం ప్రభాసాం (తుదినిజూడఁడు) పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనశ్యతాం త్వాం వృణ" అను ఋగ్వివరణముఁజూచునది.

ఈదౌర్భాగ్యము. శ్రీకళాస్థిరత్వముచే నడఁగుటే సౌభాగ్యము. అదే శ్రేయస్సు. కనుకనే సాధకుఁడు "వితనోతుమన శ్రేయః" అని తరువాతిలాభ##మైన శ్రేయస్సు నర్థించుచున్నాఁడు శ్రేయ్సస్సు; నిశ్రేయసము, స్వశ్రేయసము, సమానార్థకములే. మోక్షమను నర్థము నిచ్చునవియే సాధకజీవునందు శ్రీకలాస్థిరత్వము కలుగునపుడే పైని వివరించిన దౌర్భాగ్యము తొలఁగుటయు దానివలననే శ్రేయోలాభమును (అమృతత్వమనెడి ముక్తియు) కలుగును. కావుననే తొలుత దౌర్భాగ్యనిరహరణము నర్థించి తమ్మాలముగా ముక్తి నర్థించుచున్నాఁడు. సాధకజీవునందు శ్రీదేవి కరుణచేఁగలావస్తుస్థిరతయైనపుడే శరీరేంద్రియములవలన నాత్మ విడువఁబడుట యనెడి ముక్తి. సంసారబంధమోక్షణ మనెడి భాగ్యము. శరీరేంద్రియములతో నెడసిన యాత్మ యద్వితీయమైన యుండుట యనెడి కైవల్యము, దుఃఖాదులు జీవునుండి నిర్గమతమైన పోవుట యని%డి నిర్వాణము. మరణము లేకుండుట యనఁగా జననము లేకుండుట యనెడి యమృతము. ఆత్మను సంసాకరపాశమునుండివిడిపించుట యనెడి మోక్షము లభించును. ఇదియే నిశ్చితమైన యవిచలితమైన శ్రేయస్సు. శ్రీదేవీకళాప్రతిష్ఠచేనగు నీ సౌభాగ్యము%ు నే యీ మంత్రమందు సాధకుఁడర్థించుచున్నాఁడు.

శ్రీసూక్తమంత్రము:- శ్లో|| చంద్రాం ప్రభాసం యశసా

జ్వలంతీతం శ్రియంలోకే దేవజుష్టాముదారాం తాం

పద్మినీమీం శరణమహం ప్రపద్యే7లక్ష్మిర్మేనశ్య

తాం త్వాం వృణ||

శ్లో|| ఐశ్వర్యమంగళోత్పత్తి స్త్వత్కలాయానిధీయతే|

మయి తస్మాత్కృతార్థో7స్మి పాత్రమస్మి, స్థితేస్తవ||

అమ్మా! నాయందు నీకళాప్రతిష్ఠవలన నైశ్వర్యమంగళోత్పత్తి నిల్కడనొందుటచేఁగృతార్థుఁడనైతిని. ఇంక దగిన తావైతిని. ఈమంత్రమందుఁగా ననగు నైశ్వర్యముంగళశబ్దముల వివృతి 26వ మంత్రముక్రిందఁబూర్తిగాఁజేయఁబడినది.కనుక వానివివరణమునక్కఱలేదు. సాధకుఁడు కృతార్థుఁడై తనయందు శ్రీదేవీస్థితి నెంచి మరియుచున్నాఁడు.

శ్లో|| భవాదావేశభాగ్యర్హో భాగ్యవా నస్మి భార్గవి!

త్వత్ప్రసాదాత్పవిత్రో7హంలోకమాతర్న మో7స్తుతే||

తా|| భార్గవీ! నీవు నాయందుఁజొఱవఁజేయుటయనెడిసంపత్తికిఁదగినవాఁడనైతిని.కనుక నేనుసర్వసంపన్నుఁడనే. నీవునాయెడఁబ్రసన్నరాలవగుచేఁబవికత్రుఁడనైతిని. నీవు సర్వలోకజననివి. తల్లీ! నీకు నమస్కారము.

లక్ష్మీకళ యావేశించిన సాధకుఁడు తన ధన దౌర్భాదన పరిపూర్ణసంతుష్టిని జగన్మాతతో ఁజెప్పకొనుచున్నాఁడు.

తొలుత "భార్గవీ" యని సంబోధించుచున్నాఁడు కామకాలపరిపాకము చేయుటచే భర్గుఁడనఁబడు భగవంతుని శక్తివి అని యభిప్రాయము, ఇంతకాలమునకు నాసత్కర్మపరిపాకముచేసి సౌభాగ్యలక్ష్మివైన నీవు నీ కళను నాయందు స్థిరపఱచితివి. ఇదే సాధకజీవుడాశించు సంపత్తి. కనుక నేను సంపన్నుఁడను. లక్ష్మీ కలాసంపద యబ్బునపుడు దాని ఫలము పవిత్రతయే అనఁగా ఆణవ కార్మిక మాయికము లనెడి మలత్రయము తొ లఁగిపోవుటయే అపుడే పాపసంపర్కము తొలఁగు నన్నమాట. అపుడే జీవుఁడు పవిత్రుఁడగును. పవివలనఁద్రాణము నొందినవాఁడు. వియనఁగా మృత్యుభయము. అది తొలఁగిపోయినవాఁడు పవిత్రుఁడు జనన మున్నప్పుడు మరణము తప్పదు. కనుక మృత్య.%ు భయము లేనివాఁడు, అనఁగా జననమరణమరూపమభము మఱిలేనివాఁడనైతినని తన ధీరతకు మరియుచన్నాఁడు నీప్రసన్నతయే యీనాపవిత్రతకు హేతువు. ఆబ్రహ్మకీట జననివి నీవు. మమ్ముఁగన్నదానవు. బిడ్డలయెడ నిట్టి ప్రసన్నత నీకు సహజము. అమ్మా! నీకు జోహారు.

శ్లో|| పునాసి మాం త్వం కలయైప యస్మా

దతః సమాగచ్ఛ మమాగ్రతస్త్వం|

పరం పదం శ్రీర్భవ సుప్రసన్నా

మయ్యచ్యుతేన ప్రవిశాదిలక్ష్మి||

తా|| ఆదిశక్తీ! నీకలను నాయందుఁ బ్రవేశ##పెట్టి నన్ను బవిత్రునొనర్చితివి. కావున నీలు నాదుటికిరమ్ము. మఱియు నీవు నాయెడ సుప్రసన్నవై పరమపదమ వగుము. అచ్యుతుఁడైన నీభర్తతో నాయందుఁబ్రవశింపుము.

వి|| ఇపుడు సాధకుఁడ తన పవిత్రతత నెచి శ్రీకలాప్రవేశము తనయందు ననుభవిం%ిచి యంతర్యాగమనెడి పవిత్రతరసాధనము నుపక్రమించుచున్నాఁడు. అమ్మా! నీవు నాయొదుటికి రమ్ము. ఎదుట కనఁగా మూలాధారమునుండిలేచి యాజ్ఞాచక్రమునకని తాత్పర్యము. శ్రీదేవీ! నాయెడలఁ బ్రసన్నవై శ్రేష్ఠమైన వ్యాపకశక్తిరూపము నొందుము. నీనాథుఁడు నీతో నచ్యుతుఁడనఁగా నీతో నేనాఁడునువిడియుండఁడు. కనుకనే యచ్యుతఁడు.శక్తిశక్తిమంతుల కనినభావసంబంధము. కనుక నీవు వానితోఁబ్రవేశింపుమనుచున్నాఁడు. అనఁగా మీయిరువురయందును నాకు సమబుద్ధియే. మఱియు నీమంత్రమందు సాధకుఁడు తొలుతఁ దనయెదుటికి రమ్మని యమ్మనర్థించినాఁడు. అమ్మయొదుటికి వచ్చుట యనఁగాఁ బ్రత్యక్షమగుట. ప్రత్యక్షము, సాక్షాత్కారము, అనుభవిము- అనుమాటలు సమానార్థకములే. బ్రహ్మసాక్షాత్కారమన్నను, బ్రహ్మానుభవమన్నను, నొక్కటియే అనఁగా "త్వమేవాహం" అనెడి భావము కల్గుటేయమ్మ ప్త్యక్షమగుట. అదే పరమపదము. నీవచ్యుతునింగూడి నాయందుఁబ్రవిశింపుము అనఁగా నేనాఁడును నాలో నుండిచ్యుతి లేకుండ ననఁగాఁదొలఁగికస్థిరముగా నుండుమని కోరుచున్నాఁడు. ఆదిలక్షఅమియని సంబోధించు భావమేమనఁగాజగత్కార్యమునకంటెమున్నుగారణముగానున్న పరశక్తివి నీవే-యని యుగ్గడించుట.

శ్లో|| శ్రీవైకుంఠస్థితే లక్ష్మిసమాగచ్ఛమమమాగ్రతః|

నారాయణ సహ మాం కృపాదృష్ట్యావలోకయ|| 32

తా|| శోభాయుక్తమైన కుంఠమందున్న యోలక్ష్మీదేవీ! నాకుఁబ్రత్యక్షమగును. ఆవచ్చట నారాయణునితో వచ్చి నన్ను దయతోఁజూడుము.

వి|| వైకుంఠఁడు విష్ణువు. వైకుంఠము విష్ణులోకము "శ్రీవైకుంఠస్థితే" యను పదమునకు వైకుంఠమందున్న దానా యనియు, విష్ణువునందుస్థిరముఁగా-అనినాభావసంబంధమతో నుండుదానా యనియు నర్థము చెప్పకొనవచ్చును. విష్ణునిదెల్పునదే నారాయణపదము. నారాయణ పదమునకు వివిధార్థములున్నను నిచట సాధకునకుందోడ్పడు నర్థములు రెండు మాత్రమే గ్రహింతము. "నారం అయనం యస్య సః", నరసముదాయమేనారము. ఇచ్చట నరశబ్దము సర్వభూతోపలక్షకము. సర్వభూతములందు నెలకొన్న నారాయణః" -జ్ఞానము తన్నుఁజేరు దారిగాఁగలవాఁడు అనఁగా జ్ఞానగమ్యుఁడు.ఆత్మజ్ఞానమే భగవంతునిఁజేర్చుదారి. ¸°గికార్థ మేమనఁగా వైకుంఠము, శ్వేతద్వీపము, శ్వేతగిరి, మేరుగిరి, క్షీరసాగరము, కైలాసము, సత్యలోకము- మొదలగు కొన్ని మాటలు సహస్రారమను నర్థము నందురూఢముగాఁదంత్రాదులందు సుప్రసిద్ధములు. కావున వెనుకటి మంత్రమందు నా యాజ్ఞాచక్రమందు నిలిచిదర్శమిమ్మనిన సాధకుఁడు పరాశక్తి దర్శనము సహస్రారమందుఁగోరుచున్నాఁడు.

"శ్రీవైకుఁఠస్థితే" యను సంబోధనమందే విష్ణునితోఁగూడి యుండుదానవు అను నర్థమగుచున్నను విశేషించి "నారాయణన సహమాంకృపాదృష్ట్యావలోకయ" అనుటయందలి విశేషమనఁగా నాత్మజ్ఞానమొసంగి యదే సాధనముగా సాధకులను దనలోఁజేర్చుకొనువాఁడనియు భగవంతుఁడెక్కడనుండియోరాఁబనిలేక సాధుకనిలోనే పరాప్రకృతి రూపముతో "నేను" అనుపేరితో నెలకొన్నవాఁడును, అని యర్థము తేలుచున్నది. "కృపాదృష్ట్యా" యను మాటయందు సమానార్థకమైన దయయను మాట ప్రతీతమగుటచే రక్షణము దీనిచేఁగల్గునని స్పష్టపడుచున్నది. కనుకఁదద్రక్షణము మీవల్లనే యగునని స్పష్టముగా ధ్వనించుచున్నది. భయమున్నప్పుడే రక్షణము కోరఁబడును. భయమనఁగా మృత్యుభయమే. మృత్యుభయమువలన రక్షణమనఁగా జననమరణరూపసంసారభయము తొలఁగించుట యనియే భావము. సాధకునకు లక్ష్మీనారాయణదర్శనభాగ్యము సహస్రారమందగునపుడే ముక్తి యని తెలియుచున్నది. మొత్తముపై యోగసాధకుఁడు సుషుమ్నాపథమునఁగుండలీనీ పరాశక్తని సహస్రారమునకుఁగొనిపోయి, యానందమయుఁడు కావలయునని సాధనరహస్యము.

శ్లో|| సత్యలోకస్థితే లక్ష్మి త్వం సమాగచ్ఛస్రన్నిధిం |

వాసుదేవేన సహితా ప్రసీద వరదా భవ|| 33

తా|| సత్యలోకమందున్న లక్ష్మీదేవి! వాసు దేవునితోఁగూడి నాసన్నిధికి రమ్ము. ప్రసన్నురాలవగుము. వరద వగుము.

వి|| అమ్మా! శాశ్వతుఁడడైన పరమేశ్వరుని లోకమందుండు దానవు. నీవు లక్ష్మివి. ఆతనిచే నెల్లప్పుడును లక్ష్మింపఁబడుచుండ దానవు. అతఁడు వాసుదేవుఁడు. లోవెలుల నన్నిరూపములతో నున్నవాఁడతఁడు కనుక వాసువు. సర్వజగద్రూపమున విరాజమానుఁడై యుండి వానితో సృష్ట్యాదిక్రీడలు చేయువాఁడు. కనుక వాసుదేవుఁడు. నీసాన్నిధ్యవశముననే యాతని మాటలు సాగుచున్నవి. వాసుదేవుఁడు నీతో నెల్లప్పుడు నచ్యుతుఁడు (విడియుండనివాఁడు) కావున నాతనితోఁగూడి వచ్చిన నాకుఁ బ్రసన్నురాలవగుము. అంతేకాదువరదమగుము. నాకోర్కుల నిచ్చుదాన వగుము. నీవు ప్రసన్నవగుదువేని కోరినచో నీవరునే యిచ్చివేయుదువు. అనఁగాఁబరమాత్మజ్ఞానము నిత్తువు. అదిమూలముగావరమము (శ్రేష్ఠమైన మోక్షము) నిత్తువు. సాధకపుత్రులనిన్నివిధముల ధన్యులను జేయుదువు కావుననే సాన్నిధ్యమిమ్మని ప్రార్థించుచున్నాను. నీవు పెట్టిన తెలివిచే సాహస్రదళపద్మాంతమైనయేఁడు శక్తి కేంద్రములను భూరాది సత్యాంతమైన సప్తలోకములుగా నెన్నుకొనుచున్నాము. సత్యలోకమనెడి సహస్రారమందు నీదర్శనమగు నపుడేపైనిజెప్పిన మూడువిధములుగా మాయెడవరదవగుదు వనుచేదరని విశ్వాసముతో నిన్ను బిల్చుచున్నాను. అ%ిసాధకుఁడు తనచే నెల్లప్పడు లక్ష్మిపఁబడు లక్షఅమీదేవిని బ్రార్థించుచున్నాఁడు.

శ్లో|| శ్వేతదీపస్థితే లక్ష్మి శ్రీఘ్రమాగచ్ఛ సువ్రతే|

విష్ణునా సహితే దేవి జగన్మాతః ప్రసీద మే|| 34

తా|| ఓ లక్ష్మీ దేవీ! శ్రేష్ఠమైన వ్రతము కలదానా! నీవు విష్ణువుతోఁగూడి వడిగా వచ్చి నాకుఁబ్రసన్నరాలవగుము.

వి|| ఓజగముతల్లీ! విష్ణునితోఁగూడి శ్వేతద్వీపమం దుండుదానవు. నీవును నీభర్తియు సత్త్వగుణరాసులు. అదేమీ శ్వేతద్వీపనివాసము. రజస్తమస్సుల సంపర్కము లేని మీ శుద్ధసత్వస్థితియే శ్వేతద్వీపము. నీవు సువ్రతవు. శ్రేష్ఠమైన వ్రతము కలదానవు. నీ శ్రేష్టవ్రత మత్మార్పణము చేసి శరణాగతులైన పుత్రుల ప్రార్థనములను విని, యాలసింపక దర్శన మిచ్చి కోర్కులఁజెల్లించుటయే. నీది సువ్రతము. 'సు' శబ్దము నీభర్తకొక్కనికే చెల్లును. దోషరహిత్యము సత్వమయుఁడైన నీభర్తవిష్ణునిదే. అతనితో ననసాయినివై యుండుటే నీవ్రతము. నీవు మాకన్నతల్లివి. కనుక నీబిడ్డలను దొలుత సాత్వికులను జేసి, ప్రసన్నవైవారి కోర్కులను జెల్లింతువు. అటులు చేసియే మమ్మలను సువ్రత మందు ననఁగాఁబరమాత్మ పరత్వమందు జాఱనిపట్టుదల కల వారినిగాఁ జేయుదువు. గాన మముఁగన్న తల్లివైన నిన్ను బ్రార్థించు చున్నాను. జన్మజన్మాంతరములనుండి రజస్తమ స్సంపర్కము వీడక శుద్ధసత్వప్రకాశము లేకపోవుటచేతనే యీజననమరణములనెడి తిరుగఁటిఱాళ్ళలోఁబడి నలఁకువను సహింపలేక నీ సువ్రతమును స్మరించి యిపుడు విలంబున కోర్వక ప్రసన్నవై వడిగారమ్మని పుత్త్రవత్సలవైన నిన్ను బ్రార్థించుచున్నాను. క్షితితత్వవిశిష్టమూలమధారులను వీటడి తపోలోకమనెడి మనస్తత్వవిశిష్ఠమైన యాజ్ఞాచక్రమును సైతముమీఱి శ్వేతద్వీపమనఁబడు సహస్రారమును జేరి నన్నాందమయునిజేసి, జననమరణరూపఘరట్టగ్రావసంవేషణక్లేశము (తిరుగంటిరాళ్లలోననలుగుట) లేకుండఁజేయుమని సాత్వికసాధక పుత్రుఁడు జగజ్జననిని బ్రార్థించుచున్నాఁడు.

శ్లో|| క్షీరాంబుదిస్థితే, లక్ష్మిసమాగచ్ఛ సమాధవే|

త్వత్కృపాదృష్టిసుధయా శ్రాంతం మామభి షేచయ||

తా|| అమ్మా! లక్ష్మీ! పాలకడలింయదు నెలకొన్న దానవు. నీధవుఁడైన విష్ణునితోఁగూడి రమ్ము, సంసారవేషణముచే శ్రాంతుఁడైనన నన్ను నీనెరుఁజూపుపేరియమృతయముతో నశ్రాంతము నన్నబిషేకింపుము.

వి|| బహుయోనివిచారముచేనలసిపోయినవారిచో నెల్లప్పుడు లక్షింపఁబడుచుందువు. గాన నీవు లక్ష్మివి. లోకమాతవగు నూవునీధవుఁడైన వష్ణునితోఁగూడి పాలకడలినివసింతువు. కావున నిన్ను గుండెను. గట్టుకొన్నయాత నితో వేగ రమ్ము. నీదయాదృష్టియనెడి యమృతముతో బహుమలినభావులమైన మమ్ముస్నాతులఁజేయింపుము. అటు చేయింపకున్న మాసంసారతాపము తొలఁగదు. మా యలయిక తీఱదు. అమృతత్వము మాకు లభింపదు.కావున సుధామయీ! శుద్ధసత్వప్రధానసుధాసముద్రముగా నెన్నఁబడుసహస్రారమున మాకు దర్శనమిచ్చి రక్షింపుమని సత్వసంపన్నుఁడైన సాధకుఁడు ప్రార్థింంచుచున్నాఁడు.

శ్లో|| రత్నగర్భస్థితే లక్ష్మి పరిపూర్ణే హిరణ్మయి|

సమాగచ్ఛ సమాగచ్ఛ తిష్ఠ స్వపురతో మమ|| 39

తా|| రత్నగర్భమందున్నదానా! ఎందును లోటు పడనిదానా! ఓహిరణ్మయీ! లక్ష్మీదేవీ! రమ్ము రమ్ము. నా యెదురు నిలువుము. (దర్శనమిమ్ము.)

వి|| ఇప్పుడ సాధకుండు రత్నగర్భస్థితా యని యమ్మను బిలచుచున్నాఁడు. రత్నగర్భయనఁగా భూమి. భూతత్వవిశిష్ఠము మూలాధారము. మూలాధారమందజు వ్యష్టికుండలినీ రూపమున నెలకొన్న విష్ణశక్తిని. స్వాశ్రితుల నెల్లప్పుడు లక్ష్మించుచుండుదానిని, పరాశక్తిని రమ్ము రమ్మని యాతృత తోఁజనవుతోఁబిలుచున్నాడు. శ్రీసూక్తమందు"హిరణ్మయీం లక్ష్మీ జాతవేదో మమావహ" అని స్వాధిష్ఠాన గతాగ్నిహోత్రునినాకే లక్ష్మిని బిలువుమని ప్రార్థించినవాఁడిచట తానేపిలుచున్నాఁడు. "అమ్మా! లనీవు పరిపూర్ణవు. అనగాఁ బూర్ణకామవు. కనుక మమ్ముల నేమియుఁగోరక మాకోర్కెలు తీర్చుటే శీలముగాఁగాలదానవు." అని యుగ్గడించుచున్నాఁడు మఱియుసమష్టికుండలినీరూపమున బ్రహ్మండమంతట నిండియుండుటే గాక వ్యష్టికండలినీరూపమునఁ బిండామంతటను నిండియున్నావు.గావున నీవు పరిపూర్ణవు. శ్రద్ధావిశావసము లనెడివే సాధకుని బలము. అబలముకరూడ శ్రీదేవీరూపమే. కనుకనేసధ్యావందన గ్రంథధమందు సహితము "అమ్మ! నిన్ను 'గాయత్రీ, యని, 'సావిత్రీ' యని. 'సరస్వతీ' యని, 'శ్రీ' యని పిలుచుటే గాక "బలమావాహయామి" యనియు సాధకుఁడ పిలుచు చున్నాఁడు. సర్వశక్తిపరిపూర్ణవు నీవున్నావనెడి శ్రద్ధయూ, ననుఁబోలు- నాశ్రితులెందఱో పిలిచినంతనే వచ్చిసంరక్షించితివనెడి విశ్వాసము గలవాఁడే బలముగల సాధకుఁడు కనుక నిచ్చట రుద్రస్వరూపాగ్నిని గోరక తానే పిలుచు చున్నాఁడు. శ్రద్ధావిశ్వాసరూపబలవంతుఁడు సాధకుఁడు సర్వశక్తిపూర్ణ యగు శ్రీదేవిని బిలుచుటకు రుద్రరూపాగ్నిని గోరక ప్రాణాయామాది ప్రయత్నముల నూనక కేవలభక్తి భావదార్ఢ్యముతో నేపిల్చినపుడు తన కోరిక చెల్లింపకపోదని మూలాధారకులకుండమునువీడి రమ్ము రమ్మని త్వరపెట్టు చున్నాఁడు.

సాధకసోదరులారా! ఈసందర్భమున నావ్రాసిన శ్రీసూక్తరహస్యార్థమందలిప్రథమమఋగ్వివరణము నెత్తి వ్రాసి మాయెదుటఁబెట్టుట యప్రస్తుతముకాదు. అది పన దణమునకుఁబో లేదు. ఇందలి హిరణ్మయీశబ్దము నొక్క దానినే వివరించి విడుచుటకంటెఁబూర్తిగావ్రాసినచో సాధకుల కిందలి పలుమంత్రములందుఁదోడగును.

శ్రీసూక్తప్రథమర్గ్వివరణము

ఓం హిరణ్యవర్ణాం హరిణీంసువర్ణరజతస్రజామ్‌|

చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ||

శ్రీకాముఁడైన సాధకుఁడు శ్రీరూపయైన మహాత్రిపురసుందరి సాన్నిద్యమును గోరి యగ్నినిఁబిలుమను చున్నాఁడు ఎచ్చటనున్న యామెను బిలువమనుచున్నాఁడు? త్రిపాద్విభూతితో బ్రహ్మాండమున సమష్టికుండలినీనామముతోను. ఏక పాదాంశముతోఁబిండాండమందు వ్యష్టికుండలినీ పరాశక్తినామముతో నండియున్నట్టియు, బ్రహ్మాణి,వైష్ణవి,. రుద్రాణి, కాళి, దుర్గ, చండిశివ, త్రిపురసందురీత్యాది నామములతదో వ్యవహరింపఁబడునట్టియు నాపరబ్రహ్మశక్తినే, యాసౌభాగ్యలక్ష్మినే, బిలుమనుచయున్నాఁడు, స్తుతించుచున్నాఁడు, ప్రార్థించుచున్నాఁడు.

శ్రీసూక్తమంత్రములందు సాధకుఁడు కొన్నింట శ్రీదేవిని నాకొఱకుఁబిలువమనిపరమేశ్వరరూపజాతవేదుని (అగ్నిని) వేఁడుచున్నాఁడు. కొన్నిఁటఁదానే పిలుచు చున్నాఁడు. కొన్నింట నుపాసనాసిద్ధులైన వారి తోడు గురుచున్నాఁడు.

తాను బిలిచుట యుక్తమే. కాని "కరుణారససాగర, భక్తిప్రియు, భక్తవశ్య, సులభ, (నామస్మృతి)యైన భగవతియను గ్రహమును గోరువాని కితరుల ప్రాపేల?" యని మీరనవచ్చును. చూడుఁడు. ప్రత్యేకనిత్యనైమిత్తిక కర్శముల నాచరించునపుడుపలుకు సంకల్పవాక్యములందు "భగవదనుజ్ఞయా" యనుట కలదు కదా! దానివలన నీశ్వరానుగ్రహము లేక, యేకార్యమును నిర్విఘ్నపరిసమాప్తి నొందని, ప్రధానాధిదైవమును సాయముఁగోరుట సాధక ధర్మము గావునను, ఉపాసనాసిద్ధులకును ఉపాస్యదేవతకును భేదము లేకుండుటచే మంత్రసిద్దులు, మంత్రద్రష్టలు, మంత్ర స్రష్టలు నైనవారి యాత్మబలప్రసన్నతలు తనకార్యసిద్ధికిఁదోడగునను విశ్వాసముతోడి యీ యాచార మనాసిద్ధము. కావున నట్లుచేయుచున్నాఁడు. ఇంతేల? సదస్సులందు వేదగానమునకో, యుపన్యాసమునకో, మఱి యేవిద్యాప్రదర్శనమునకో కడంగు పండితులును, సభయందున్న పెద్దల వైపయి "అనుజ్ఞయా" యనుట నిత్యముంగను చున్నారమ.%ు ఇందులకే కాదా?

ఈమొదటి ఋక్కునందు జాతవేదుని (అగ్నిని) సాయమన్నపుడు బాహ్యముగా నాధానము చేయఁబడు వైతికాగ్నియా? యనిన, నంతర్యాగక్రమము నెఱంగనట్టియు, దానిని సాధించు సామర్థ్యము లేనట్టియు భక్తులకు సమిధలచే రగుల్పఁబడు వైదికాగ్నియే శరణము. ఉపనయన కాలమునుండియో యిటీవలసద్గురువలసన శ్రీవిద్టయోపదేశమొందిన నాఁటినుండిటయో, ప్రాణాయామాభ్యాసము, షట్చక్రజ్ఞానమును మంత్రార్థమననమును, మేళవించి యుపాసించు సాధకులఁగట్టెలచో రగుల్పఁబడు వైదికాగ్ని యపేక్ష లేదు. వారపేక్షించి యాధానము చేయునది పిండాండమందు (శరీరమందు) సర్వాద సిద్ధముగానుండు స్వాధిష్ఠానచక్రగతరుద్రరూపాగ్నియే.

మఱి దీని రగుల్చు టెటులందు రేని బ్రాణాయామక్రియ యందుఁబూరింపఁబడి కుంభింపఁంబడెడి వాయువే సర్వదేహమందును సూక్ష్మ సూక్ష్మతర సూక్ష్మతమ స్రోతస్సులందుఁజొచ్చి సంచరించునపుడు స్వాధిష్ఠానచక్ర (ఇదియగ్నితత్వపూర్ణము) మందు సర్వసిద్ధముగా నుండు రుద్రరూపజాత వేదుఁడు కట్టెలు వీవనలు లేకే ప్రజ్వలించును. ఆయగ్ని జ్వలనమువఱకే ప్రాణాయనుసాధకుని ప్రయత్నము తప్ప నిది. ప్రాణ+ఆయామ=ప్రాణాయామ, అనగాఁజైతన్యశక్తి యొక్క విస్తారము. ఈప్రాణాయామవిపులవివృతినిగూర్చి నావ్రాసిన సాధనసామగ్రియందుఁజూచునది. ఆవెనుక వీని ప్రయత్నమక్కఱపడకయే, యాజ్వలితాగ్నిచే స్వాధిష్ఠాన సమీపమందలిదైయైన మణిపూర (ఇది జలతత్వపూర్ణము) చక్రమందలి తేమ యాఱిపోవుటయు, నా దిగువ దేయైన మూలాధారకులకుండమందుండి మణిపూరమందలి తేమచే సదా తనియుచుండు కుండలినీపరాశక్తి కాతేమ యంతక పోఁగానే బుస్సుమను చిన్న సీత్కారముతో లేచును. యోగశాస్త్రతమందు భూతత్వవిశిష్టమైన మూలాధారమందలి కులకుకండమునకు కుమారమను పేరు ప్రసిద్ధము. అందునుండి జాగృతయై లేదు. కుండలినీశక్తికి 'కమారీ' యని పేరు. చిన్నబిడ్డ నిదురునుండి లేచునప్పుడు చిన్న ధ్వని చేయుచూ లేచునట్లే యీశక్తియు ధ్వనిచేయుచు లేచును. ఈవిషయమే శాస్త్రమందు "యత్కుమారీ మంద్రయతే" అనువాక్యము వవలనఁదెలియును. అపుడే కుండలినీశక్తికిఁ 'గుమారీ' యను పేరు సార్థకమైనది. ఆమెను బరాశక్తి భావముతోఁబూజించుటే "కుమారీపూజ" యనఁబడినది.

ఆశక్తిసుషుమ్నాంతర్గత సూక్ష్మతమమార్గమున నడ్డులేక మీదికిఁబోవంగడఁగి, యేనాఁడును దేమ యాఱనిదియు క్షీరసముద్రకైలాస చంద్రమండలహిమగిరి సంజ్ఞలతో నొప్పునదియు నైన శిరోగతసహస్రారకములమువైపు మెరపువలె, బాణమువలెఁ బురుగెత్తును. అపుడె సుషుమ్నాబద్ధము లైన వివిధచక్రములందు వివిధా కాంతులతోను, వివధ నాదములతోను, సాధకున కనుభూతమగును. ఇదియె కుండలి న్యుత్థాపనము. అనఁగా శ్రీదేవిని మేల్కొల్పి ప్రసన్నను జేసికొనుట. ప్రస్తుతమందు సాధకుఁడీ ప్రసన్నతేనేకోరి "రత్నగర్భస్థితే లక్ష్మీ సమాగచ్ఛ....తిష్ఠస్వ పురతో మమ" యనుచున్నాఁడు.

ఈ ప్రయత్నము తొలుత సాధకుఁడు 10 దినములు గురుసన్నిధినుండి తెలిసికొనియభ్యసింపవలసినదే.

ఆచిచ్ఛక్తిస్వరూపశ్రీదేవియే శ్రూసూక్త మంత్రములతో నర్థింపఁబడి, వికసించి తన త్రిపాద్విభూతితోఁగలిసి యను గ్రహించి, వరములనిచ్చి ప్రోచునది. ఈ ప్రసన్నతకైన ప్రాణాయామప్రయత్నమందు స్వాధిష్ఠానగతరుద్రరూపాగ్నియే తోడుపడువాఁడు గాన నాతనినే సాధుకఁడుతొలుతఁ బ్రార్థంచుచున్నాఁడు.

''అగ్నిస్తుష్టో యజమానాయ శ్రియం ప్రయచ్ఛతి'' అగ్ని సంతసించినవాఁడై యజమానునకు శ్రీనిచ్చుచున్నాఁడు. (శ్రుతి) ''అగ్నిర్నారాయణో భగవాన్‌'' అను శ్రుతినిబట్టి శ్రీదేవి భర్తయైన నారాయణుఁడే యీ యగ్ని యని వైష్ణవులును, ''రుద్రో వా ఏష అగ్నిః'' అనుశ్రుతినిబట్టి మహాత్రిపురసుందరీ, ఉమా, పార్వతీ, దుర్లేత్యాది నామములతోఁ జెల్లు శ్రీ దేవి భర్తయైన రుద్రుఁడే యీయగ్నియని తదితరులును గైకోనుచున్నారు. రుద్రనారాయణులకుఁబరమార్థము భేదమే లేదు. ''శ్రీశ్చతే లక్ష్మీశ్చ హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ'' అను రెండు పాఠములందునుంగల హ్రీ, శ్రీ శబ్దములకు గుఱియైనది. యామహాత్రిపురసుందరియే. శ్రీదేవియే.

ప్రకటార్థము

ఓయగ్ని దేవుఁడా! బంగారువన్నవంటి వన్నెగలదియు, భక్తుల పాపములను హరించునదియు, పచ్చని వన్నెగలదియు నొకప్పు డాడు లేడి రూపమును దాల్చినదియు (దక్షాధ్వర ధ్వంసకథను జూడుఁడు) బంగారు వెడిపూలదండలు (గొలుసులు) దాల్చినదియు, వెన్నెలవలెఁబ్రకాశించునదియు, వాహ్లూదపెట్టునదియు, బంగారు తన రూపముగాఁగలదియునగు లక్ష్మీదేవిని నాకోఱకుఁబిలువుము.

ఈ శ్రుత్యర్థము నెఱింగికొని రహస్యార్థముం జదువునది- శ్రుతిః- ''ఉత్తిష్ఠత మా స్వప్త అగ్నిమిచ్ఛధ్వం భారతాః రాజ్ఞాః సోమస్య తృప్తాసహ సూర్యేణ సయజోషనహ|''

హేభారతాః = ఓ భారతులారా ! భా + రతాః= భారతాః - జ్యోతీరూపిణియైన శ్రీవిద్యనుపాసించు నాసక్తి గలవారలారా! ఉత్తిష్ఠత - లెండు, ఉపాసనమున కుపక్రమింపుఁడు - మాస్వప్త = నిదురపోకుఁడు - అప్రమత్తులరగుఁడు. అగ్ని మిచ్ఛధ్వం=స్వాధిష్ఠా నగతాగ్ని నిబ్రజ్వలింపఁజేయుండు - రాజ్ఞః సోమస్య = ఉమతోఁగూడి ప్రకాశించుచు రంజింపఁజేయువాఁడైన (చంద్రమండలాంతర్గత సహస్రార మందలి బైందవస్థానము నొందియుండుటచే సోమశబ్దసిద్ధి) చంద్రుని యమృత స్రావములచే. తృప్తాసహ=తనిసినవారలుకండు. - సూర్యేణ = అనాహతవిశుద్ధ చక్రమధ్య గత సూర్యునితో, సయుజూ = కూడిన, రాజ్ఞా = రాజుచే, తృప్తాసహ=తృఫ్తులరగుఁడు - ఉషసః = ఉషఃకాలముందు ధ్యానరతులై, ఏమనఁగా ఉషఃకాలమే భగవతీ నిదిధ్యాసనాదులకు యోగ్యమైనది గావున, నప్పుడే పైని జెప్పినటుల ధ్యానవిధిని నెఱపి యమృతపానము (సేచనమున) దనియుఁడు.

రహస్యార్థము

హేజాతవేదః=ఓయగ్నిస్వరూపరుద్రుండా! (పరమేశ్వరా) వేదశబ్దము అసుప్రత్యయాంతము వేదవాచకము ''వేదాస్త్వదర్థం జాతాశ్చ జాతవేదా స్తతోహ్యసి'' -మహా భారతము. గాన రుద్రుండే యనుఁడు. నారాయణుఁడే యనుఁడు. స్వాధిష్ఠానగత యజ్ఞపురుషుఁడే.

హిరణ్యవర్ణాం = బంగరువన్నెవంటి వన్నె గలట్టియు ''హిరణ్యం విష్ణురాఖ్యాతం తస్య వర్ణన్తు వైష్ణవీ లక్ష్మీ హిరణ్యవర్ణేతి శ్రూయతే కనకప్రభా'' శ్రీపురాణము. హిరణ్యమనఁగా సర్వవ్యాపకుండైన విష్ణుఁడు. అతనివర్ణము, అనఁగా తేజస్సు లక్ష్మీదేవి ''హిరణ్యవర్ణా'' యనఁబడేనది. మరియు వర్ణశబ్దమున కాకారమని యర్థము చెప్పి, పరమేశ్వరాకార యనఁగాఁదదభిన్న యనియుఁజెప్పికొనుఁడు.

హిరిణీం = ఉపాసకులపాపములను, దారిద్ర్యములను హరించునది. పసుపువన్నె కలది.

సువర్ణరజతస్రజాం = బంగారు వెండి గొలుసులు ధరించినది. వానివలెఁబ్రకాశించునది. అనఁగాఁబలువన్నెలతో వెల్గనది యని తోఁచును గదా. 'తప్తస్వర్ణ సవర్ణాభాం' శ్రీపురాణము. పుటము పెట్టిన బంగారు పసుపు నెఱుపును గల్గియుండును. వెండి తెల్లనిది. గాన నాగొలుసులు దాల్చినది యనంగా వాని కాంతులు గలది యనుట.

చంద్రాం = ఆహ్లాదపెట్టునది. ''చది ఆహ్లాదనే రకిదీప్తౌ'' అనుటవలన నానందము జ్ఞానము స్వరూపముగాఁగలది. వెన్నెలవలె శోభిల్లునది. చెద్రకాంతి. ''చాంద్రీ, చంద్రికా, చంద్రా'' యని సుశ్రుతము. చంద్రమండలమందు (సహస్రారమందు) ధ్యానింపఁబడునది. ''అహమగ్నిశిరో నిషస్త్వం సోమశిరసి స్థితా| ఆగ్నీషోమాత్మకం విశ్వమానాభ్యాం సమధిష్ఠితం'' శివపురాణము. నేనగ్నిశిరస్సునందుండు వాఁడును. నీవు చంద్రశిరస్సునందుండు దానవు. మన యిర్వుర చేతనే విశ్వము (బ్రహ్మాండము పిండాండమును) అధిష్ఠింపఁబడినది. కావుననే సౌందర్యలహరియందు ''ప్రపంచం సించంతీ'' యనుచోట లక్ష్మీధరాచార్యాదు లుపాసకుని 72వేల నాడుల నమృతముతోఁదడపునది యని వ్రాసిరి. ఇపుడు జాతవేదుఁడన స్వాధిష్ఠానగతాగ్ని శివస్వరూపుండనియు చంద్రమండలమందుండునది యన్నను, దత్స్వరూపిణియన్నను సహస్రారమందమృతవర్షిణియగుపరాశక్తియనియు రహస్యము. హరిణ్మయీం శివశక్తిని ''హిరమ్య రేతసఃశంభోః శక్తిఃప్రోక్తా హిరణ్మయీ| ధనార్ధిభి రుపాసై#్యషా జాతనేదని సర్వదా'' శ్రీపురాణము. తేజస్సే వీర్యముగాఁగల శివుని శక్తియే హిరణ్మయి. ధనకాములు (ప్రియతమ వస్తువును గోరువారు) మర్త్యులకుఁబ్రియతమవస్తువు ముక్తియే గాన దానిని గోరువారు జాత వేదునందు (రపమశివునందు) స్వాధిష్ఠానగతాగ్నియం దుపాసింపవలయును.

అయ్యా! శివశక్తియైన ఉమనే లక్ష్మిగాఁబల్కుట యుక్తమా యందు రేని ''లలితా శారదా లక్ష్మీ రేకైవ భగవత్యుమా| తత్తల్లక్షణసంయుక్తా పురుషార్థప్రదానృణాం''-అను దేవీపురాణోక్తిని బట్టి లక్ష్మి లలితా శారదా నామములతో నొప్పునది. శివశక్తియైన శ్రీమహాత్రిపుర సుందరియే యాయాలక్షణములతోఁగూడినధై యుపాసకుల కాయాపురుషార్థముల నిచ్చు త్రిపురసుందరి యను పదమున కెన్ని విధములుగానో లక్ష్మియను నర్థము చెప్పవచ్చు నైనను బ్రకృతార్థము. త్రిపురములు = బ్రహ్మ విష్ణు శివశరీరములు ఎవనియందున్నవో (యెవ్వనివో) యతఁడు త్రిపురుఁడు పరమశివుఁడు. అతని సుందరి మహాత్రిపురసుందరి. అంతయు శ్రీమాతయే ''జ్ఞానమాత్మని భా సూర్యే, చంద్రేజ్యోత్స్నా చ ఖే ధ్వనిః| వర్ణో హిరణ్య పయసి ఘృతంత్వమసి మాతృకే'' మాతృకాస్తుతి. ''ఆత్మయందు జ్ఞానము, సూర్యునందు వెల్గు, చంద్రునందు వెన్నెల, ఆకసమందు ధ్వని, బంగారునందు వన్నె, పాలయందు నేయియు, తల్లీ! నీవే చుమా''- అనఁగా నీవే జ్ఞానస్వరూపిణివి. సూర్య మండలమనెడి యనాహత చక్రమందలి తేజస్సు నీవే. ఆజ్ఞాది సహస్రారాంతమైన చంద్రమండలమందలి కాంతి నీవే. హృదయాకాశమందు శ్రవణాకాశమందు గోచరించు వీణా వేణుమృదంగా దిశబ్దము నీవే. లేదా, అకారాదిక్షకారాంతమై వైఖరీవాగ్రూపమునఁ జెవికి గోచరించు ధ్వని నీవే. హిరణ్య మందు వర్ణమనునపుడు సర్వవ్యాపక పరమేశ్వరశక్తివి నీవే యని పైనే వివరింపఁబడ్డది. క్షిరసముద్రమనఁబడు సహస్రారమునందుఁ బుట్టు ఘృతమనెడి యమృతము నీవే యని రహస్యార్థము.

''ఘృతం మిమిశ్రిరే ఘృతమస్య యోనిః| ఘృతే శ్రితో ఘృతమవశ్యధామ'' అనునపుడును బరమార్థమిదియే. ''ఇపుడు నీచెప్పినదాన రహస్యార్థ మేమున్నదనినఁజూడుఁడు. ఒక్క లక్ష్మీవ్యక్తియే యెన్నో వర్ణములు గలదిగా వర్ణింపఁబడుట యసంభవము. దానిచే మనమూహింపఁదగిన దేమైయుండును? ఒకప్పుడొకచోట నొకవన్నెతోను, వేఱొకప్పుడు వేఱొకచోట వేఱొకవన్నెతోను, శోభిల్లుచుండునని చెప్పుటకే యీవర్ణన మనక తప్పదు. సాధకుఁడు పరమేశ్వరు ననుజ్ఞాసహాయములు గొని ప్రాణాయామ క్రియకుఁబూనుకొని వాయుకంభన చేయఁగా శ్రీ దేవి మూల కుహరమును వీడి సహస్రారమునకకుఁ బ్రయాణము చేయునపుడు సుషుమ్నామార్గమున వివిధచక్రములందు వివిధవర్ణములతోఁగానవచ్చును. అందుస్వాధిష్ఠానముదాఁకనైన యాగ్నేయఖండమంధుఁ బుటము పెట్టిన బంగారువలెను, అనాహతాంతమువఱకునైన సూర్యమండలమందుఁ బసుపు నెఱుపుఁ దెలుపుఁ గలిసిన మెఱుముల మొత్తమువలెను, ఆజ్ఞాది సహస్రారాంతమువఱకునైన చంద్రమండలమునందుఁ జంద్రికవలెను శ్రీదేవీక మనీయమహస్సుల ననుభవించు రహస్యమిదియే.

ఇదే సౌభాగ్యవిద్యాహృదయమందు-''యోనౌ కనక పుంజాభాం హృది విద్యుచ్చయోజ్జ్వలమ్‌| ఆజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి'' ఓసౌభాగ్యలక్ష్మీ నీతేజస్సు మూలాధారముందుబంగారుముద్దసొంపును. అనాహతమందు మెఱపుల మొత్తపు మిలమిల చెలువును, ఆజ్ఞాచక్రమనఁ జందురు తేజును, గల్లియుండు ననెడి యీ యోగానుభవమే గదా యీబుక్కునం దిమిడియున్నది.

దిగువనున్న యాగ్నే యమండలమునుండి పుటము పెట్టిన బంగారుకాంతులవంటి కాంతులు మీదికి వ్యాపించుచుండఁగా ననాహతమనెడి (హృదయము) సూర్యమండలమునుండి సూర్యకాంత లనంటి పలు తేజస్సులు క్రిందు మీదులకు వ్యాపించుచుండఁగా నాజ్ఞాదిసహస్రారాంతమైన చంద్రమండలమునుండి వెన్నెలవంటిజిగులు క్రిందికి వ్యాపించుచుండఁగా నివియన్నియుంగలిసి హృదయమందుఁజిత్రముఁగా మెఱుపుల మొత్తపుమిలమిలవలె నుపాసకునకు గోచరించుటయే, శ్రీదేవి బంగారు వెండిగొలుసులను దాల్చినది (అనఁగా నాశోభను నహించినది.) యను వర్ణనము.

ఇచటఁ జదువరులు సాధకులై యించుకంత షట్చక్ర వివేకముఁ బ్రాణాయామాభ్యాసముఁగలవారైలనపుడే నా యీవ్రాతలు నచ్చి, యానందావహములగును. పరమేశ్వరి శ్రీసూక్తజపనిరతులగు పాఠకులలోఁ గొందఱికే నీయానందము గొలఁదికాలమున నేకలిగించుఁగాక, అదిలేక యే భారతలోకము మొదలికిఁజెడినది, చెడుచున్నది. ఇంతే కాదు. భగవద్వస్తువును స్త్రీరూపముగానో, పుంరూపముగానో, ఆ యా మంత్రజాసముతో నుపాసించునపుడు మంత్రబిజముల నర్థజ్ఞానముతోఁ జక్రములందు విన్యసించుకొనుటయు మంత్రి మంత్రమంత్ర దేవతల కభేదమ నెడి దృఢభావమును, దక్కు నియమములన్నింటికంటె ముఖ్యములు. వాయుకుంభన కౌశలముతో నివి చేర్చి జపించుట సమగ్రఫలదము. అటు గాక కేవలోచ్చారణమాత్రజాపమే యైనచోభక్తిమాత్ర జన్యాల్పఫలమునే చిరమున కందఁగలఁడు. పక్షికి గగన సంచారమునరెండు రెక్కలుఁదోఁకయుఁదోడ్పడునటులే సాధకుని సిద్ధికిఁ బైమూడును దోడ్పడును. నినేదనమున వివరించితిని జూడుఁడు.

శ్రీదేవి రహోయాగక్రమారాధ్య కావునఁ బైని వివరించినటు లాంతరోపాసనముం జేసినపుడు, పిండాండమున నంశరూపజీవాత్మచిచ్ఛక్తివికాసము నొందఁగానే బ్రహ్మాండ పూర్ణమై యున్న యామె త్రిపాద్వభూతియు వచ్చి చేరును. అదియే భగవదనుగ్రహ మందురు.

కొంద ఱంత జపము చేసినను, ఎన్ని మ్రొక్కులు మ్రొక్కినను భగవదనుగ్రహము కలుగకున్నదని పగతురు. భగవదనుగ్రహమననెట్టిదో తెలిసి చేసి, దానిని సంపాదించుకొనగల్గు వారలార్తివేళ నిటు వగచుపని యుండదు. ప్రారబ్ధ వశమునఁబాపప్రతిబంధములున్ననువానిబలమును వేగమును నడలిపోయి సుఖింపఁగలరు. అటులైనపుడు ప్రకట గాయత్రియే కానిండు; గుప్తగాయత్రియే కానిండు; సాధకుని యుపాసనము పితృభావముతోనే కానిండు; మాతృభావముతోనే కానిండు, ఆ యవ్యాజకరుణామూర్తి శక్తి యను గ్రహించి సర్వసిద్ధులను బ్రసాదించి తన గాయత్రీనామము నన్వర్థము చేసికొనక పోదు.

''అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహంః

(గీతాస్మరుణము)

అనన్యాః - అన్నచోట, దేవా నీకును, నాకును వేఱులేదను మహావాక్యబోధముతో ననుటయే, అటులు నిత్యము ననుసంధానము చేయు జీవులకుఁ గావలసినవన్నియు నేనిత్తును ఇచ్చినవానిని జెడకుండఁ గాపాడుదునని భగవంతుని ప్రతిజ్ఞ

ఈ సక్రమోపాస్తి యుపనయనకాలమునుండియే యుప దేశింపఁబడవలసినది. దుష్కాలమహిమముచే నది యుపేక్షింపఁబడుటనే మంత్రోపాసనమహిమజన్యత్రాణము లేకున్నది. అభిమతార్థసిద్ధి కాకున్నది. వీర్యవంతములైన యోషధులను నిర్దిష్టకాలమున నుద్ధరించి తెచ్చి శాస్త్రోక్తములైన యితరద్రవ్యములతో యోగము చేసి, క్రమసిద్ధము చేసినపుడు వానియందున్న పరమ్వేర ప్రత్యక్షశక్తి మహౌషధమై రోగనిర్మూలనసమర్థ మెటులగుచున్నదో యట్లే యా భగవానుఁడు క్రమోపాసితుఁడైనపుడు సర్వసిద్ధులను, భుక్తి ముక్తులను నీయకుండునా?

శ్లో|| స్థిరా భవ మహాలక్ష్మి నిశ్చలా భవ నిర్మలే

ప్రసన్నే, కమలే, దేవి, ప్రసన్నహృదయా భవ||

é తా|| ఎట్టి మాలిన్యములు లేనిదానా! లక్ష్మీదేవీ! నాయెడఁ జిరముండుదాన వగుము. కదలనిదాన వగుము. ప్రసన్ను రాలా! ప్రసన్నమైన చిత్తము కలదాన వగుము.

వి|| అమ్మా! ఆణవాదులైన యెట్టిమాలిన్యములును లేని దానవు నీవే. నీవు మహాలక్ష్మివి. సంశ్రితులచే నెల్లప్పుడును లక్షింపఁబడుచుండుదానవు. కనుకను సంశ్రితులను సదా లక్షింపఁబడుచుండుదానవు కనుకను నీవు మహాలక్ష్మివి. నా యెడనుండి, నాలోనుండి నీనిలుకడను దొలఁగనీయకుము. మూలాధారమునుండి ప్రయత్నముతో, భక్తితో జాగరితవై నాయెడం గరుణించి, యాజ్ఞాచక్రమును మీఱి సహస్రామునకు వచ్చిన నీవు నిశ్చలవై నన్ననుగ్రహింపుము. స్వభావము చేతనే నీవు భక్తులయెడ దయగలదాను. కనుకనే నీకుఁబ్రసన్నాపదము సార్థకము. జ్ఞానతృషార్తులైన భక్తులు నిన్నే కోరుచుందురు. కావున నీవేకమలవు. మూలాధారాది కమలములయందు సంచరింతువు కావునను నీవు కమలవు. శక్తిరూపవైన నీవేవిష్ణువునకలంకారమవుగాన నీవుకమలవు. తల్లీ! నీవు దేవశక్తివి. స్వయంప్రకాశనశీలవు, క్రీడనశీలవు నగు నీవు జగదాకారముతో నిన్ను నీవు బయల్పెట్టుకొను దానవగుటయే గాక సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములనెడి యైదాటల నాడుకొనుదాన వగుట నీవు దేవివైతివి. ప్రసన్నాత్మవైన యోదేవీ! నాయెడ నిర్మలమైన దయగలదాన వగుము.

శ్లో|| శ్రీధరే శ్రీమహాభూతే త్వదంతస్థం మహానిధిం|

శీఘ్రముద్ధృత్య పురతః ప్రదర్శయ సమర్పయ||

తా|| అమ్మా|| నీవు శ్రీధరవు, శ్రీమహాభూతవు. నీలో నున్న మహానిధిని వేగముగా వెలికి దీసి (లేవ నెత్తి) నాకిమ్ము.

వి|| లక్ష్మీదేవీ! సకలసంపదలను ధరించినదానవు. కనుక జ్ఞానానందస్వరూపశక్తివై విశ్వమును ధరించినదానవు. కనుకను శ్రీధరునిశక్తివి కనుకను, శ్రీధరే! యని పిల్చుచున్నాను. సకలైశ్వర్యములను ధరించుట చేతనే కాదు. రత్నస్వర్ణాధిపార్థివసంపదను ధరించుటచేతనే కాదు. పద్మ మహా పద్మ శంఖ మకర కచ్ఛపాది నవనిధులను ధరించుటచేతనే గాదు; ఒక గొప్పవిశిష్టతచే నీవు శ్రీమహాభూతవు, అనంగా సర్వాశ్రయణీయ పూజనీయవై యున్నావు. శవర్ణ రేఫేకారములచే శ్రీ-జ్ఞానానందస్వరూపశక్తివగుట చేతను, (శ్రీ) బ్రహ్మవిద్యారూపసరస్వతివగుట చేతనుమహాభూతవు. అనఁగాఁ బూజార్హవై యున్నావు. మఱియు నీవు శ్రీమహవైయున్నావు. బ్రహ్మవిద్యయనెడి పుష్టికర స్తన్యమును గామ ధేనువువలె సాధక పుత్రులకుఁబెట్టుదానవు. కనుక శఅరీమహా భూతేయ నినిన్నుఁ బిలుచుచున్నాను. మఱియుశ్‌ + ర్‌ + ఈ - శవర్ణముచే ఆనందమును, రేఫముచే తేజస్సును (జ్ఞానమును) నీస్వరూపమని తెలియుటేగాక ఈకారముచే సారాత్సారవు, పరాత్పరవు, మహాదేవివి, పరమానందస్వరూపిణివియునై నీతత్వమును సాధకులకు బోధించుచూ నీనెలవైన చక్రముందు బిందుస్థానమున (శక్తియుతపరబ్రహ్మస్థానమున) శ్రీయనెడి నీవే రేయుంచి పూజిం చెడి సాధకులు పరమాపూజా ర్హవైన నిన్ను 'శ్రీమహాభూతే' యని పిలువకుండురా? జగద్గురు శ్రీశంకరాచార్యులు నిన్ను భువనేశ్వరిగా మన్నించుచూ ''నమస్తే నమస్తేశి బిందుస్వరూపే'' యని యుగ్గడించిరి.

నీవు శ్రీధరవు. నీయందున్న మహానిధి మేము చూడంగోరెడిది, పొందఁగోరెడిది 'శ్రీ'- బ్రహ్మవిద్యయన్నదే. అమ్మా! ఘనీభూత బ్రహ్మవిద్యవై పుస్తకరూపిణివైన నిన్ను శరత్కాలాదిని రమోత్సవములను పేర నవరాత్రములును బూజించి యాశ్వినాదిగ నారునెలలు నీతో సహవాసము చేయుసాధకులు నీపుస్తకరూపమునుబూజికొఱకే పూజించుచు చైత్రశుద్ధపంచమి యనఁగా శ్రీపంచమి మొదలు పూర్ణిమాంతముగాఁగేవలబ్రహ్మవిద్యాస్వరూపిణిగా నెచి పూజించి శ్రీస్వరూపులై యానందమయు లగుదురు. కనుకనే యారునెలలు సహవాసము చేసినచో 'వీరు వారగుదు రను సామెత పుట్టినది. అమ్మా! శ్రీమహాభూతే! యని సంబోధించునపుడు జ్ఞానానందమయివైన నీయానందస్పంద స్వరూపసంకల్పశక్తిచేనే జగత్సృష్టి యైనదను శ్రుతిభాషితమును విశ్వసించి నీవే నిమిత్తకారణమును తదుపాదాన కారణముగాఁ బంచమహాభూతరూపమున నీవే వెలసితి వనియుఁజెప్పక తప్పదు.

జగన్మాతా! బ్రహ్మజ్ఞానమనెడి నిధినే నీయనుగ్రహ మునుఁజూచి పొందఁగోరుచున్నాను. ఆలసింపకుము తల్లీ యని సాధకుఁడు పునరావృత్తి రాహిత్య కారణమగు దానికై నిన్నే యాశ్రయింపవలయును. కనుకనే నీవు శ్రీవి. ఎన్ని సారులు నీప్రసిద్ధనామమగు శ్రీకారము నుచ్చరించినను దనివి తీఱదు.

శ్లో|| వసుంధరే శ్రీవసుధే వసుదోగ్ధ్రి కృపామయి

త్వత్కుక్షిగతసర్వస్వం శీఘ్రం మే సంప్రదర్శయ||

తా|| అమ్మా! నీవు వసుంధరవు, వసుధవు, వసుదోగ్ధ్రివి, నీవు కరుణాస్వరూపవు, నీలోఁబ్రచ్ఛన్నముగానున్న సమస్తమైన ధనమును వడిగా నాకుఁజూపుము.

వి|| అమ్మా!నీవు వసుంధరవు. వసువులను ధరించినదానవు. మాకు వలయు ధనములన్నియు ననంగా నిష్టవస్తువులన్నియు నీలో నున్నవి. జాగతికములైన సువర్ణరజతరత్నాదులను గామించు సాధకులు నిన్నాశ్రయింతురు; పో.శ్రీవసుధవును నీవే యని విశ్వసించి శ్రీవసుధే యని సంబోధింతుము. శ్రీశబ్దమునకు జాగతికైశ్వర్యమనియే యర్థము. కాక బ్రహ్మవిద్యయనియు నర్థమని మున్నెన్నిసారులో చెప్పికొంటిమి. నీవువసుధవు. వసుదధాతీతివసుధా ''దాఞ్‌ ధారణ పోషణయోః'' అను వివరణముచే ధరించుట పోషించుట యని యర్థమునిచ్చును. కనుక నీవు శ్రీవసుధవు. బ్రహ్మ విద్యనెడి ధనమును బోషించుదానవు. బ్రహ్మజ్ఞానమనెడి ధనము నాశ్రితుల కిచ్చుచు ధనవంతులనుఁజేసియే బ్రహ్మ వర్చస్సును బెట్టి 'జ్ఞానాదేవ ముక్తిః' అను మాటను సార్దకముచేయుదువు. దానినే పోషింతువు. అనఁగా నిచ్చిన బ్రహ్మవిద్యాధనమునుదఱుగకుండనీ వేచూచుకొనుచుందువు. నిన్నుఁగోరవచ్చిన, నిన్నాశ్రయింపవచ్చిన; సాధక పుత్త్రులకు మోక్షమనెడి ధనమును నభిష్టవస్తువును ఈనిన యావుపాలను వలె నిత్యము నిచ్చి పోషింతువు. కనుక నిన్ను 'వసుదోగ్ధ్రి' యని పిలుచుచున్నాను.

నీవు శ్రీవి. అనంగా నెల్లరచేతను నాశ్రయింపఁబడు దానవు. జాగతికతుచ్ఛధనమున కేగాని, నిన్నెఱింగికొని నీయొడిలోనికి దుముకంగల బలమునిచ్చు జ్ఞాన స్తన్యమునకే గానీ, నిన్నే యాశ్రయింపవలయును. కనుక నే వసుధారణము, వసుపోషణము, వసుదానము, నీపనులని మూడు విధములు గాను నిన్ను సంబోధింపక తప్పదు. ఎవ్వరేయాశతో నిన్నాశ్రయించినను. కాదనక ఆయాబిడ్డల కాయాధనముల నిచ్చుట కృపావిగ్రహవు కావున ధీరతతో 'గృపామయి' యని సంబోధించుచున్నాను.

దయామయీ! నీకుక్షిలో నింకేమేమి సొమ్ములున్నవో తెలియఁగల శక్తియు, నేర్పును మాకులేదు. కృపామయివి గావునను, బహిష్కరించుటే స్వభావముగాంగలది నీకుక్షి గావునను, ఆసొమ్ములనెల్ల వెలిని బెట్టి చూపవలసినదే పిల్లల కిచ్చుటకే తల్లి ధనములను దాచును. తల్లి సొమ్ములన్నియుఁ బిల్లలవే. కనుక సర్వస్వము నాకుంజూపుము. అని చనవునఁ బ్రార్థించుచున్నాను. సహజమైన నీపుత్త్రస్నేహము సాధక పుత్రులను సర్వవసుసంపన్నులను జేయఁగలదను విశ్వాసమే నిన్నిన్నివిధముల సంబోధింపఁజేసినది.

అమ్మా! నీ పెట్టు వసువులే మావాంఛించు శక్తులు అవి భూతత్వవిశిష్టమైన నీమూలనిలయము మొదలు ఆజ్ఞా చక్రాంతమైన శక్తి కేంద్రములందే నీకృపచేఁ జూడఁగలము అదె మా యథార్థమైన సర్వస్వదర్శనవాంఛ, మాకోరిక తీర్పుము.

శ్లో|| విష్ణుప్రియే, రత్నగర్భే, సమస్తఫలదే, శివే|

త్వద్గర్భగత హేమాదీన్‌, ప్రదర్శయ, ప్రదర్శయ.||

తా||అమ్మా! నిన్ను సార్థకములగు నెన్నినామములతోఁబిలిచినను దనివి తీరదు. నీవు విష్ణుప్రియవు, రత్నగర్భవు, సమస్త ఫలములనిచ్చుదానవు, శివవు, నీగర్భమందున్న హేమాదులను నాకుఁజూపుము; చూపుము.

వి|| అంతటను జ్ఞానాకారముతో వ్యాపించియున్న విష్ణువనెడి పరమాత్మకు నీవు వల్లభవు. సర్వశక్తివైన నీయండ నాతఁడును గోరుచుండును. శక్తిమంతుఁడు శక్తినే చూచుచుండును. రత్నము లనంగా శ్రేష్ఠవస్తువులు, మఱియు రత్నము లనఁగా విద్యలు, ధనములు, అవి గర్భమందుఁగల దానవు. కనుక రత్నగర్భవు. వెలగల వస్తువులు లోనంగలది కనుకనే భూమి రత్నగర్భయైనది. అనఁగా నీవు భూస్వరూపిణి వనుట.

ఈవిషయమే శ్రీసూక్తమందు - ''ఉపైతు మాందేవసఖః కీర్తిశ్చ మణినా సహ'' - దేవసఖుఁడైన శివసఖుఁడైన ధనదుఁడు అనఁగాఁ గుబేరుఁడును నాతని పుత్త్రికయైన కీర్తిదేవియును 'మణినా నహ' రత్నముతొఁగూడ, అనఁగా నీతత్త్వముఁదెల్పు పంచదశాక్షరీమహావిద్యతోఁ గూడి 'ఉపైతు' నన్ను సమీపించుంగాక! అని చెప్పంబడినది. పంచదశాక్షరీమహావిద్య నుపాసించిన కాముఁడు, విష్ణువు, శివుఁడు, అగస్త్యుఁడు, లోపాముద్ర మున్నగు పదునైదు గురిలో ధనదుఁడు (జ్ఞానధనము నొసఁగువాఁడు) అనంగాఁ గుబేరుఁడొకఁడు. ఈయుపాసకులఁగూర్చివరివస్యారహస్యముంజూచునది.

తంత్రములయందలి దేవతాధ్యానశ్లోకములయందు రత్నకలశధారణము పలుతావులఁగానవచ్చును. అట్టిచోట సాధకర్షు లాదేవత తన్‌%ాశ్రయించిన భక్తులకు సర్వవిద్యల నిచ్చునది యని భావమునే వ్రాసిరి. కనుక రత్నశబ్దమునకు విద్యార్థముంజెప్పుట యుక్తమే గదా! భూదేవీస్వరూపవైన నీవు నీసంతానమైన సర్వమునకును దత్తదనుకూలపోషణ ద్రవ్యములను సస్యఫలాదులను బెట్టి పెంచుచున్నావు. స్థూల శరీరమును బెంచు సస్యాదులనే గాక సూక్ష్మశరీరమును బెంచు సర్వవిద్యల నెడి ఫలములను నీవే పెట్టుకున్నచో నీబిడ్డ లేనాఁటికిని నిన్నుఁజేరు బలమును కన లేక చెడుదురు. ధర్మార్థకామములనెడి ఫలత్రయమునే గాక, తురీయపురు షార్థమైన మోక్షమనెడి ఫలమును సైతముఁ బెట్టఁగల దిట్టవు. కనుక నే నిన్ను ''సమస్తఫలదే'' యని సంబోధించుచున్నాను.

సాధకపుత్త్రుల యెల్లకోర్కుల ఫలింపఁజేయుదానవు, ఇహపరసాధకములైన యెట్టికోర్కులైనను నీబిడ్డలకు నీవల్లనే తీరవలయును. నీవు శివశక్తివి. అనంగాఁబరమాత్మ శక్తివి. మంగళస్వరూపవు. విశుద్ధాఖండజ్ఞానస్వరూపపరమ శివునికంటె నీవు భిన్నవు కావు. కనుకనే శివవు.

ఓజననీ! నీగర్భమందున్న హేమాదుల ననంగా బంగారు మున్నగు శ్రేష్ఠవస్తువులను, సమస్తవిద్యలను నాకుఁ జూపుము. జననీ నాకుంజూపుము అని మఱిమఱి యర్థించి సాధకుఁడు తన కౌతుకమును వెల్లడిచేయుచున్నఁడు. తల్లిని బ్రార్థించుటయే గద సాధక పుత్త్రధర్మము. అనంగా మూలాధారము మొదలు ఆజ్ఞాచక్రాంతమైన శక్తి కేంద్రములందు హేమాదులను (స్వర్ణకాంతులను) గాంచునట్లు చేయుమని సాధకుండు తనసాధన కమ్మసాయము నర్థించుచున్నాఁడు.

ఇమ్మంత్రమందు| ''సమస్తఫలదే''యను చోట సరసమైన మఱొక యర్థమును జెప్పికొనవచ్చును. ''దా-ఖండనే'' అను ధాత్వర్థమును గ్రహించి సమస్తఫలములను ఖండించు దానా! అనవలయును. సుకుకర్మఫలము లన్నియు ఖండింపఁబడునపుడే మఱి పుట్టుక యుండదు. ఏకర్మఫలము మిగిలినను దాని భోగించుట కై జన్మము తప్పదు. ''కర్మనాశే జన్మనాశః'' అను సిద్ధాంతమును నమ్మిసాధకుఁడిట్టి యర్థముఁ జెప్పికొనుట సహజమే సరసమే.

శ్లో|| రసాతలగ తే లక్ష్మీ శీఘ్రమాగచ్ఛ మత్పురః|

న జానేపరమం రూపం మాతర్మే సంప్రదర్శయ||

తా|| రసాతలమందున్న దానా ఓలక్ష్మీదేవీ! నాయెదుటికి వడిగా రమ్ము. నీపరమ రూపమును నేనెఱుఁగను. అమ్మా! నాకు దానిని వేగఁజూపుము.

వి|| భూమియందుఁ బ్రతిష్టనొందియుండుదానా! అనఁగా భూమిలో సువర్ణరత్నాదివసురూపమున నిల్చియున్నదానా! నీవు నాయెదుటికి వడిగా రమ్ము. అనఁగాఁ బార్థివసంపత్స్వరూపముతో వచ్చినన్ననుగ్రహింపుము. అందు నీశ్రేష్ఠమైన రూపమెట్టిదో నేనెఱుఁగను. నీవే కటాక్షించి నాకది చూపవలయును. ¸°గికార్థమేమనఁగా భూగర్భమందు ననంగా మూలాధారకులకుండమందు వ్యష్టికుండలినీరూపమున నిల్చియున్నదానా! నీవు లేచి యుచ్చరించి నాయాజ్ఞాచక్రమందు నిలుపుము. ''ఆజ్ఞాయాం చంద్రసంకాశం మహస్తవ మహేశ్వరి'' (సౌభాగ్య లక్ష్మీహృదయము) కనుక నీవు చంద్ర కాంతితో నాకు దర్శనమిమ్ము, ఇంతదాఁక, అదే నీపరమ రూపమనీ వినుటయేగాని నాకు సాక్షాత్కరింపలేదు. పరమ రూపమనంగా ''పరం మాతీతి పరమః''- మోక్షమును గల్గించునది పరమము. నీవు మూలాధారమునుండి జాగృతవై లేచి స్వాధిష్ఠానాది చక్రములను మీఱి వచ్చి యాజ్ఞాచక్రమందఁ జండ్రకాంతితో దర్శన మిచ్చినప్పుడే మాకు భవపాశవిమోచనమగును. చంద్రుఁడనంగా జ్ఞానానంద స్వరూప పరమాత్మ. చద్‌ +రక్‌ = ఆహ్లాదనదీప్తులని యర్థము. ఆహ్లాదన మానందార్థకము. దీప్తి జ్ఞానార్థకము. కాంగాఁ జంద్రుఁడు పరమాత్మ. అదే నీస్వరూపము. మూలాధారాది చక్రములలో నాజ్ఞానచక్ర మాఱవది. ఈశరీరమును రాష్ట్రముగా భావించినపు డాఱవదియైన యీచక్ర మవంతీనామ పట్టణమగును. అయోధ్య మూలాధారము. ''యోద్ధుమ శక్యా అయోధ్యా'' దానిపైకిఁబోయి యుద్ధము చేసి గెల్చుట యశక్యము. అనంగా మూలాధారకులకుండమందు నిదురించు సర్పమువలెనున్న కుండలినీపరాశక్తిని లేపి తెచ్చుటే కష్టము. కుండలినీమహాలక్ష్మి యయోధ్యయనెడి మూలాధారమును విడిచి యుచ్చరించి యాజ్ఞవఱకు నచ్చినపుడు సాధకజీవున కవనము-అనంగా రక్షణము కల్గును. కనుకనే యాచక్ర ''మవంతీ''యను పేరంభరగినది. ఆరక్షణ మెట్టిదనఁగా నాజ్ఞాచక్రము మనస్తత్త్వ విశిష్టము. ఇంద్రియాశ్వములను బ్రచోదించు మనస్సే సారధి. ఆ సారథిచేతి నింద్రియములు తమ స్వభావసిద్ధచాంచల్యము నొందకుండ నాజ్ఞ పెట్టంబడి సాధకున కననము గల్గించును. కనుక భ్రూమధ్యమందలి చక్రము కాజ్ఞ, అవంతి యను నామములు సార్థకము లైనవి. అపుడే చంద్రుఁడనెడి జ్ఞానప్రద జ్ఞానస్వరూపశివుఁడు తనస్థానమై శిద్వారకయనెడి యేడవ నగరమునుండి సాధకజీవున కాజ్ఞల నిచ్చుచుండును. అనంగాఁ దన్నఁజేర ననుజ్ఞ. నిచ్చి సహస్రారమునకుఁ గైకొనును. పిండోత్పత్తిక్రమమందు బ్రహ్మవస్తువు ప్రవేశించిన ద్వారము సహస్రారమధ్యమందలిది. కనుకనే దానికి బ్రహ్మద్వారము. ద్వార కానగరము అని పేరు. అట్టి సౌభాగ్యము నొందిన సాధక జీవునకు మోక్షమే ఫలము. కావున నాజ్ఞాది సహస్రారాంతము చంద్రమండలముగాఁ జెప్పఁబడినది. కనుకనే యాస్థానము పరమము (మోక్షప్రదము) అనంభడినది. సాధకుండు చంద్రజ్యోత్స్నా సదృశకాంతితోఁ బరాశక్తిని సాక్షాత్కరించుకొను పరమావస్థనే యాశించిదానినే ప్రార్థించుచున్నాఁడు. మూలాధారాదిసప్తపద్మము లనే పిండాండమనెడి రాష్ట్రమందు అయోధ్యా, మధురా, మాయా, కాంచీ, కాశీ, అవంతికా, ద్వారవతీ యనెడి సప్తపుణ్యతమ పట్టణములుగా భావించి ''సపై#్తతా మోక్షదాయకాః'' అని ప్రశంసించిరి.

శ్లో|| ఆవిర్భవ మనోవేగా చ్ఛీఘ్రమాగచ్చ మత్పురః

మావత్స!భైరి హేత్యుక్త్వా కామగౌరివ రక్ష మమ్‌||

తా|| పుత్త్రవత్సలా! జగదంబ! మనోవేగముతో నావిర్భవించి నాయోదుటికి వడిగా రమ్ము. ''బిడ్డా!'' భయపడకు' మనుచు కామధేనువువలె ననుఁ గాపాడుము.

వి|| మనోవేగముతో నావిర్భవింపు మనంగాఁదలంచి నంతనే నీవు బయల్పడుము. కులకుండమందు నిదురించు పామువలెనున్న కుండలినీ పరాశక్తీ! నీమూలస్థానము విడిచి చప్పున స్వాధిష్ఠానాదిచక్రముల మీఱి యాజ్ఞాచక్రమందు దర్శన మిమ్ము. దీని వెనుకటి శ్లోకమందును నీవిషయమే విస్తరించి వ్రాయఁబడినది. ఆజ్ఞాచక్రమందు దర్శనమిచ్చి 'అబ్బీ! భయపడకు' మనుము. వత్సా! అని పిలుచుటందే యమ్మ పుత్త్రస్నేహవిమూఢయని తెలియుచున్నది. మఱియు మాబైః = భయపడకుము, అనిసాధకపుత్త్రుఁ డభయ మిమ్మను చున్నాఁడు. భయము దేనివలన? ''ఆథ తస్య భయంభవతి''

అనెడి తైత్తిరీయ శ్రుతివాక్యమువలన మృత్యువు వలననే భయమని తెలియుచున్నది. భయమనంగా జనన మరణరూపసంసారమువలననే భయము. శ్రీమాతయే యాత్మార్పణశీలురైన బిడ్డలను బవినిబోలిన యనంగా వజ్రాయుధమువలె భీకరమైన మృత్యువువలనఁ ద్రాణము నీయవలయును. ''ముకుందా ముక్తిరూపిణీ''- (లలితాసహస్రనామస్తృతి).

అమ్మా కటాక్షము బహుపవిత్రము. పవిత్రమనంగాఁ బిడుగువంటి మృత్యుభయమువలన రక్షించునది అని యర్థము. అమ్మకును ముక్తిదానమునకుఁ బరికరమైన జ్ఞానమును బెట్టక భవపాశవిమోచనము సాధ్యముకాదు. ఆపరికరము జ్ఞానమే. ''జ్ఞానాదేవ ముక్తిః''-''జ్ఞానవాన్‌ లభ##తే ముక్తిం''-''జ్ఞానాగ్నిస్సర్వకర్మాణి భస్మసాత్‌ కురుతేర్జున''- ఇట్టి శ్రుతి స్మృతిప్రమాణము లనేకము లుండుటచేత జ్ఞానమే దీనికిఁ బరికరము, ఈపరికరము నాసించియే సాధకుఁడు ''కామగౌరివ రక్షమాం'' = ''కామధేనువులె నన్ను రక్షింపు'మనుచున్నాఁడు. ధేనువువలన లభించు వస్తువుక్షీరము, స్తన్యము. జ్ఞానమును బోషణద్రవ్యముగా నెన్నునపుడు క్షీరమనియో స్తన్యమనియో నిరూపించి చెప్పిరి. భక్తుల కోర్కులను సమస్తము లేదనక యిచ్చునది. కనుకఁ గామధేనువు. ''ముందుగాముక్తి సాధనమైన యాత్మజ్ఞానము పెట్టి రక్షింపు''మని సాధక పుత్రుఁడు కోరుచున్నాఁడు.

అంతర్యాగ క్రమమందు మూలాధారకులకుండమునుండి పరాశక్తిని లేపి యాజ్ఞాచక్రమునకుఁ గొనిపోవు సామర్థ్యము కల్గినపుడు సాధక పుత్రులకు విఘ్నవినాశమనెడి రక్షణమునే గాక యాత్మజ్ఞానదానముచే సైతము రక్షణము కలుగునని సాధక పుత్త్రుఁడు పరమశ్రద్ధతోఁ బరిపూర్ణ విశ్వాసముతోనమ్మ నర్థించుచున్నాఁడు.

శ్లో|| దేవి; శీఘ్రం సమాగచ్ఛ ధరణీగర్భసంస్థితే|

మాత స్త్వద్భృత్యభృత్యోహం మృగయే త్వాం

కుతూహలాత్‌||

తా|| ఓశ్రీదేవీ! భూగర్భమందున్నాదానా! వేగముగా రమ్ము. నేను నీ భృత్యులకును భృత్యుండను. అపూర్వవస్తువవైన మనోహరవస్తువవైన నిన్నుంజూచుటయందలి కోరికతో నిన్ను వెదకికొనుచున్నాను.

వి|| ధరణీగర్భమందున్నదానా! అని లక్ష్మీదేవిని సంబోధించుటలోని విశేషమేమనఁగా భూతత్త్వవిశిష్టము మూలా ధారము. దాని గర్భమనఁగా లోపలిభాగము, అదే కులకుండము. భూతత్త్వవిశిష్టమూలాధారకులకుండమందు లక్ష్మీదేవి పేరి వ్యష్టికుండలినీపరాశక్తి యున్నదనెడి మాట యందు శ్రద్ధావిశ్వాసములు కలవాండు మాత్రమే వీఁడు కనుకనే రమ్మనియు, నపూర్వవస్తువవు, మనోహరవస్తువవునైన నిన్నుఁజూచు కోరికతో వెదకికొనుచున్నాఁడ ననుచున్నాఁడు. ఈశ్రద్ధావిశ్వాసములు ఫలించి భక్తిభావదార్ఢ్యముతోఁ బరాశక్తిని శ్రీమాతను లేవఁగొట్టి స్వాధిష్ఠానాది చక్రములందు దర్శించి యుపాసించిన సాధకులు యథార్థ భృత్యులు. ''నిన్ను వెదకికొనుచున్నాను రమ్ము'' - అనుచు నర్థించిన యీ సాధకుఁడింక నాజ్ఞాసహస్రారములందమ్మను దర్శించినవాఁడు కాఁడు. కనుకనే ''అమ్మా! అంతర్యాగ సమారాధనమందు త్తీర్ణులైన నీభృత్యులకు నేను భృత్యుఁడను.'' అని తననైచ్యము ననఁగా నారాధనమందు వెనుకఁ బడియుండుటను జెప్పికొనుచుచన్నాఁడు. పక్షాంతరము, ''తద్భృత్యభృత్యోహమ్‌'' 'నీభృత్యులలో నేనొక భృత్యుఁడ'నని చెప్పుటలో నేనును ఒక భృత్యుఁడనే ఉత్తీర్ణభృత్యుఁడనే యని నైచ్యానుసంధానము నెపమున నిన్ను వెదకుట నాకలవాటే. కనుక నేనిన్నుఁ జక్రాంతరముల యందుఁజూచు వేడుకతో నిత్యము వెదకికొనుచున్నానని తన నిత్యానుసంధానప్రయత్నమును వెల్లడించుచున్నాఁడనియుఁజెప్పికొనవచ్చును. ఈప్రయత్నమందారి తేరిన వాఁడు కనుకనే ''శీఘ్రం సమాగచ్ఛ'' ''వేగము రమ్ము''- అని చనవునఁ జిన్నబిడ్డఁడు తల్లిని రమ్మని తెమ్మని శాసించునట్లు కోరుచున్నాండు.

శ్లో|| ఉత్తిష్ఠ జాగృహి త్వం మే సముత్తిష్ట సుజాగృహి|

అక్షయాన్‌ హేమకలశాన్‌ సువర్ణేనసుపూరితాన్‌||

శ్లో|| నిక్షేపాన్‌ మే సమాకృష్య సముద్ధృత్య మమాగ్రతః|

సమున్నతోన్న తాభూత్వాసమృద్ధ్యైత్వంధ రాంతరాత్‌||

శ్లో|| మత్సన్నిధిం సమాగచ్ఛ మదాహిత కృపారసాత్‌|

ప్రసీద శ్రేయసాం దోగ్ధ్రి లక్ష్మీర్మే నయనాగ్రతః||

తా|| ఓలక్ష్మీదేవీ! నీవు మేలుకొనుము. లెమ్ము. నాకొఱకు లెమ్ము. తరుగులేనట్టియు, సువర్ణముతో నిండినట్టియు, భూమి యందుఁబూడ్పఁబడినట్టియు, బంగారుగిండ్లను భూగర్భము నుండి పైకిలాగిపూర్తిగాఁబై కెత్తి నాసమృద్ధికొఱకు నాసన్ని ధినిగూర్చి నాసమీపమునకు రమ్ము. నాయందు నీకుఁగల కృపారసమువల శ్రేయస్సులను దెంపులేక యిచ్చుదానా! లక్ష్మీదేవీ! ప్రసన్నరాలవగుము.

వి|| కలశములతో సువర్ణములను నింపి భూమిలోపల నిక్షేపిచుట, యితరులకుఁదెలియకుండ దాచియుంచుట పూర్వ కాలమందు సుప్రసిద్ధము. వలసినపుడు మఱల నాపూడ్పులను జైకితీసి యుపయోగించుటకే కాదనియు, భూరూపయగు దేనిని నావిధముఁగాఁబూజించుటకే యనియు, నిష్కామముగా నెవరివల్లను బ్రతిఫలాపేక్ష లేక యటులు నిక్షేపించిన ద్రవ్యము కాలాంతరమున గృహకూపతటాకాదినిర్మాణము నకైత్రవ్వినపు డెవ్వరికే నవి లభించినచో వారి యాశీర్వాదము పడయుదుమనియు, ధర్మాశనానుసారము భూపాలకుల కది సమర్పింపఁబడినపు డాధనము ప్రజోపయోగిధర్మ కార్యములకు వినియోగింపఁబడుటచే దానివలన నగు పుణ్యము తమపూర్వాపరవంశ్యులకు సైతము కలుగుననియు నందులకై యజ్ఞాతముఁగా ధనములు భూగర్భమందు నిక్షేపింపఁబడుననియఁ బెద్దలందరు. కనుకనే నేఁటికిని నిక్షేపములు పలుతావులందుఁ బలువురకు లభించుటఁ కనుచున్నాము. వినుచున్నాము. ఇది జాగతికసువర్ణాది ధనరూపసంపల్లా భార్థము.

ఇఁక ¸°గికార్థము-కుండలినీపరాశక్తిరూపశ్రీదేవిని నిష్కామసాధకుండు భక్తిభావదార్ఢ్యముతోనో, ప్రాణాయా మాద్యుపాయాంతరములతోనో, మేల్కొల్పి స్వాధిష్ఠానాది చక్రములను దాటించి యాజ్ఞానచక్రమువర కుచ్చరింపజేయఁబూని ప్రార్తించునపు డాశించిన లాభముల నిందువర్ణించుచున్నాఁడు.

అమ్మా! భక్తుల నొకకంట లక్షించుచుండు లక్ష్మీ దేవీ! వేగ మేల్కొని నాయెదుటికి రమ్మని వెనుకటి శ్లోకముల యందును జేసిన ప్రార్థనమును దెలిసికొంటిమి. ఇపుడు లేచి వచ్చునపుడు నాకన్నుల యెదుటికి వచ్చునపుడనంగా నాజ్ఞాపద్మమునందు దర్శన మిచ్చునపు డూరక వచ్చుటకాక స్వభావముచే నీబిడ్డలకై శ్రేయస్సంపాదనమే చేయుదానపు కనుక భూగర్భము (మూలాధారగర్భము) నుండి నీవు లేచి వచ్చునపుడు సువర్ణపూరితములైన హేమకలశములననంగా శ్రేష్ఠమైన మాత్రుకావర్ణములతో నిండిన స్వాధిష్ఠానాది శక్తికేంద్రముల నిచట సుషుమ్నయందలి యీశక్తి కేంద్రములు పద్మచక్రాదినామములతోనే కాగ, కలశములుగాను వర్ణించుచున్నాఁడు. స్వాధిష్ఠానాది కేంద్రములను దాకుచు వచ్చినపుడు తెమ్మని సాధకుఁడు కోరెడి ధన, మాయాశక్తులే కనుక స్తుతిపాత్రములైన శక్తిసిద్ధులే సువర్ణములు, అవే సాధకవిషయమున నిక్షేపములు. వాని నుద్ధరించి తెచ్చి నాయెదుటఁబెట్టుమనఁగా నాయాశక్తులను నా యనుభవమునకుఁదెమ్మని యర్థించుచున్నాఁడు. ఆకాశతత్త్వ విశిష్టమైన విశుద్ధచక్రమువఱకే సాధకునికి వివిధశక్తులాశ. మనస్తత్త్వవిశిష్టమైన యాజ్ఞను జేరుకొన్నప్పుడు నిర్విఘ్నపరిసమాప్తమగు జ్ఞానమనెడి ధనమే లభించును. ఆపైనిసహస్రారమునకుఁబోయినంతనే చరమసిద్ధిమెక్షమే. ఈవిషయమునే యీతరువాతి శ్లోకముందుఁదెల్చుచున్నాఁడు.

శ్లో|| అత్రో పవిశ్య లక్ష్మిత్వం స్థిరా భవ హిరణ్మయి|

సుస్థిరా భవ సంప్రీత్యా ప్రసన్నా వరదా భవ||

తా|| ఓహిరణ్మయీ! లక్ష్మీ! నీవిచ్చటంగూరుచుండి స్థిరముగా నుండుము. నాయందైన నెనరుచేఁ జాంచల్యమును బూర్తిగా విడిచి ప్రసన్నవును వరదవును గమ్ము.

వి|| ఓకాంతిమతీ! లక్ష్మీ! నీవు నాయాజ్ఞానచక్రమందు నిల్కడతో నుండుము. నాయందలి నెయ్యముచే నీస్వభావ సిద్ధచాంచల్యమును బొత్తిగా విడువుము. సాధకుఁడు సుషుమ్నామార్గసంచారిణియైన కుండలినీపరాశక్తియొక్క స్వభావ సిద్ధచాంచల్యము ననుభవించిన వాఁడగుటచే నాకన్నుల యెదుట ననఁగా నాజ్ఞాచక్రమందుఁ జలింపక నిలువుమని ప్రార్థించుచున్నాఁడు. ఆజ్ఞాచక్రమే ధ్యానయోగ్యస్థానము. ఆజ్ఞానహస్రారములనెడి రెండు కేంద్రములయందే గాయత్రీ (కుండలినీ) స్థిరత్వము నాశింతురు. మూలాధారమునుండి లేవఁగొట్టుటయు, నాజ్ఞయందు నిల్పుటయు, నను సాధనములే కష్టతరములు, కావుననే యీ వేఁడుకోలు, నీవు నా ప్రార్థనము నంగీకరించి, మరలఁ జప్పున నీమూలనిలయమునకు దిగిపోకుండుటే నీప్రసన్నత; నీ నిర్మలకరుణాలుత యని చెప్పి, వరద వగుమనెడి ప్రార్థనమందు సహస్రారమునుఁ జేరుటయు, దానిఫలము వరదానమని సూచించుటయు, విస్పష్టముఁగాఁదోఁచుచున్నది. కైలాసమనెడి శివుస్థానమే సహస్రారము అక్కడ శివునితో శ్రీదేవిచేరుటయే సాధన చరమఫలము. శ్రీశంకరాచార్యులవారును, దమసౌందర్య లహరియందు ''మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్ఠానే హృది మరుతమాకాశముపరిమనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారేరమ్యే సరహసి పత్యావిహరసే''.

అమ్మా! నీవు మూలాధారాది షట్చక్రములను మీఱిమనోహరమైన సహస్రారమందు నీపతితో నీవు కేళిసల్పుదువు. ''కేలీనాం సమూహః కైలమ్‌. కైలం అత్ర అస్తీతి కైలాసః'' సహస్రారము పర్వతమూర్థమందలి యుత్తము భూమికగానే సంధ్యావందనముఖ్యాంగ గాయత్య్రుపాసనమందు వర్ణింపఁబడినది.ఇచ్చట శ్రీలక్ష్మిపేరి పరాశక్తిని గోరిన కోరికనే సంధ్యోపాననమందును సాధకుఁడు కోరినాఁడు ఇచట శ్రీదేవి యనుపేర నుపాసింపఁబడిన కుండలినీపరా శక్తియే గాయత్ర్యుపాసనమందలి వస్తువు. అచట సంధ్యా (సమ్యక్‌ ధ్యాయతే ఇతి సంధ్యా) చక్కగా ధ్యానింపంబడినదియు, ''భృవోర్ఘ్రాణస్య చ యా శంధిః తత్త్రైవోపాస్యతే యోగిభిరితి సంధ్యా''. కనుబొమలు ముక్కును గలియు చోటేసంధి. అదియే యాజ్ఞాచక్రము. అచ్చట యోగులచే నుపాసింపఁబడునదియుఁగాఁగా ''సంధ్యా'' యనంబడినది. ఇచ్చటి యుపాసనమే సమనావస్థ. ఇది దాటిపోవునపుడున్మన్యవస్థ. సహస్రారమును జేరినపైని సర్వేంద్రియములతో మనస్సు, నేను సైతము శివస్థానమందు లయమైపోవును. అదియే సాధకుని వరము. అందులకే (శ్రయతే సర్వైరితి శ్రీః) యెల్లరచే నాశ్రయింపఁబడునది కనుక శ్రీ. ఈయవస్థ యందు నేను మఱిలేదు. ఆయవస్థయం దనుభవింపఁ బడునది. యనుభవించువాఁడు. అనుభవము అనెడి త్రిపుటీజ్ఞానము లేని యానందావస్థ. ఇదియే స్వస్థ, సమాహిత, సమాధియను మాటలతో వర్ణింపఁబడిన యవస్థ. ఇదియే వరము-శ్రేష్ఠము. ఈశ్రేష్ఠావస్థయే మోక్షము. కనుకనే సంధ్యోపాసకుండు 'గాయంతం త్రాయత ఇతి గాయత్రీ'- మంత్రజపరూపగానము చేయువానిని రక్షించునది. అనఁగా భయమువల్లనే రక్షణము. మృత్యుభయమే. భవభయమే భయము. అనఁగా సంసారభయమే భయము. దానివలని విడుదలయే మోక్షము. అదే వరము. సర్వశ్రేష్ఠమైన కోరిక. దాని నిచ్చునదియే వరద| )ఇది చతుష్పదాగాయత్రీమంత్రో పాసకుఁ డాశింపవలసినదిగానే తోఁచును) శ్రేష్ఠమైన మోక్షమునిచ్చునది యని భావము. ఈమంత్రభావసహాయముతో నుపాసించువాఁడునీ వేసావిత్రివి. సవితృశక్తివి. అనఁగాఁబ్రాణిప్రసవకారిణివి. అమ్మా! నీవే సరస్వతివి. అనఁగా నాదబ్రహ్మస్వరూపిణివి. బ్రహ్మవిద్యాస్వరూపిణివి. అకారాది క్షకారాంత వర్ణమాలాఘటిత పదవాక్యరూప భాషాసతివి. నీవే యెల్లర చేత బ్రహ్మవిద్యాలబ్ధికొఱకును దాని ఫలమగు మోక్షలాభమునకును నాశ్రయింపఁబడుదువు. కనుకనే శ్రీదేవి. శ్రీశబ్దము ధనధాన్యాదిరూపపార్థివలక్ష్మికిని, బ్రహ్మ విద్యారూపలక్ష్మికిని జెల్లును. అమ్మా! ఛందస్సులు-అనఁగా వేదములు. అనఁగా నాత్మానుభవవాక్యములు. శ్రీదేవి యెవరినోళ్లనుండి బ్రహ్మానుభవవాక్యరూపమున వెలువడునో వారే ఋషులు. ''ఋష్‌ధర్మనే'' (చూచుట) బ్రహ్మమును వెలిని జగద్రూపముగాను, లోన ''నేను'' - ''అహం'' రూపముగాను ననుభవింతురో వారే ఋషులు. కనుకనే యమ్మా! ఆవేదములను, వానిని బ్రకాశింపఁజేసిన ఋషులను నీస్వరూపమే యని యుగ్గడించుచు సంధ్యా, గాయత్రీ, సావిత్రీ, సరస్వతీ, శ్రీ, ఛందర్షీ యను పేళ్ళతో ''ఆవాహయామి=పిలుచుచున్నాను''. అనెను. నీవు దేవివి. అనంగా స్వయంప్రకాశ శీలవు. క్రీడనశీలవు. నీవేజగదాకారముతో వెలసి, దానితో సృష్టిస్థితిలయాదిక్రీడలు చేయుదువు. నీవు అక్షరవు. తొలఁగు బాటు లేనిదానవు. నీవు బ్రహ్మసమ్మితవు. పరమాత్మతో అధిష్ఠాన, అవస్థాన, అనుష్ఠాన నామరూపములయందు సమానవు. కనుక బ్రహ్మసమ్మితవు. అనంగా పరమాత్మ కంటె నభిన్నవు నగుచు నీవిషయములందైన శ్రద్ధావిశ్వావాసములే బలముగా సాధకునందు వెలయుదువు. కనుకనే నిన్ను ''బలమావాహయామి'' ''బలమా! యని పిలుచుచున్నాను'' అనుచుఁ గుండలినీమహాలక్ష్మిని భర్గస్సును సృష్టిస్థితిలయములను జేయు బ్రహ్మశక్తివని స్తుతిరూపవందనము చేయుచుముఖ్యముగా ''ఆయాతు=వచ్చునుగాక''. సంధ్యావందన గ్రంథమం దెక్కడినుండి యెక్కడికి వచ్చుటో వస్పష్టముగా నీలక్ష్మీహృదయగ్రంథమందువలె జెప్పఁబడి యుండలేదు. కాని విస్పష్టప్రార్థనమంత్రము వైదిక ఋషుల కాలమం దుండి యుండును. 'మన దౌర్భాగ్యముచే నీకాలమున విలుప్తములై పోయినవి. సందర్భమునుబట్టి చూడ మూలాధారము నుండి సహస్రారమునకు వేగ రమ్మనియే సాధకుని యర్థనము. ''ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మసమ్మితం'''. అనుచు వచ్చి ''ఉత్తమేశిఖరే జాతే భూమ్యాం పర్వతమూర్థని బ్రాహ్మణభ్యోభ్యనుజ్ఞాతా గచ్ఛదేవి యథాసుఖం'' కైలాసము, శ్వేతగిరి, హిమగిరి మున్నగు పేళ్లతో వేదా గమతంత్రాదులలోఁబ్రసిద్ధమైన చోటికి రమ్మనియే కదా 'ఆయాతు'=వచ్చుఁగాక అనియు, బ్రహ్మజ్ఞానసంపత్తికొఱఖు తంటాలు పడుచున్న మావలనఁ బూర్తిగా ననుజ్ఞనొంది, దేవీ! నీవు తొట్రుపాటు లేకుండ నీమూలస్థానమునకు దిగి పోవుము. నీవే నాస్తుతిరూపవందనము నంగీకరించి, అపాన ప్రాణమవాయుప్రచోదనము చేసి నాకోరిన చోటికి వచ్చితివి. నీవు వేదమాతవు. జ్ఞానమును గల్గించుదానవు. వచ్చితివి. నేను నిన్ను యాచించునది యాయువు, (నీవీశరీరమందు నిల్చియుండు కాలము) దాని నభివృద్ధి నొందింపుము. ద్రవిణ మనఁగా ధనము, ఇపుడు నాకోరినది తుచ్ఛధనము కాక జ్ఞానధనమే. తత్ఫలముగా నగు బ్రహ్మవర్చస్సుననెడి నీమూడింటినే నాకిచ్చి సుఖముగా నీస్థానమును జేరుము. ఈమంత్రమందు గాయత్రీనామకమహాలక్ష్మీని భక్తిదార్ఢ్యముతోఁ బ్రాణాయామాదిప్రయత్నముతో మూలాధారమునుండి లేవఁ గొట్టి యాజ్ఞయందు నిల్పి, ధ్యానించి, సహస్రారమునకుఁ గొనిపోయి పూర్ణకాముఁడై యనఁగా నైక్యలాభముచే నానందమయుఁడై యుండి మఱల స్వస్థతకు వచ్చి, అమ్మను ఆయుర్ద్రవిణబ్రహ్మవర్చస్సులను యాచించి విడిచినాఁడు. ఇదే యేదేవతపేరు పెట్టి భారతితో బ్రహ్మోపాసనము చేసినను భారతులు పొందఁదగు చరమలాభము. సిద్ధి.

శ్లో|| ఆనీతాంస్తాన్‌ త్వయా దేవి నిధీన్మే సంప్రదర్శయ|

అద్య క్షణన సహసా దత్వా సంరక్ష మాం సధా||

తా|| ఓలక్ష్మీదేవీ! నీవు వచ్చునపుడు తేఁబడిన యానిధులను నాయెదురఁబెట్టుము. అంతేకాదు, తెచ్చిన యుత్తర క్షణమందే నాకిచ్చివేసి నన్నెప్పటికిని సంరక్షింపుము అనంగా శాశ్వతముగా సంరక్షింపుము.

వి|| అమ్మా! నిధులను బెల్లగించి తెచ్చి నాయెదుటం బెట్టుమని మున్నె ప్రార్థించితిని. అనంగా మూలాధారణి చక్రములను మీఱి నచ్చునపుడు ఆయాయీ స్వాధిష్ఠఆనాది కేంద్రములను నీవు త్రొక్కుకొని వచ్చినప్పుడు, అనంగా నీవు తాకుచు వచ్చినపుడు వివిధ కేంద్రములయందు వివిధ శక్తు లుత్పన్నములగును. వానిని నన్ననుభవింపనిమ్ము''. అని భావము, అంతేకాక అవ్యవధానముగా ఆశక్తులను నాకుఁబెట్టి, యనఁగా నాచేననుభవింపఁజేసి, శాశ్వతముగానన్ను సంరక్షింపుము, ఇట సాధకుండు కోరినది శాశ్వతసంరక్ష, అదియే యపునర్భవము. మోక్షము. యథార్థముగా కుండలినీపరాశక్తి ఆజ్ఞవఱ కుచ్చరించునపుడు శక్తులనుభూతములు కాకపోవు. వానిని గ్రమముగాఁదా ననుభవించునపుడే కొంచెకొంచెముగా నానందానుభవ మగుచుండును. అనఁగా స్వస్వరూప చ్ఛాయ లనుభవింపఁబడును. జాగతికానుభవములు మఱుగువడుచుండును. ఆజ్ఞను జేరఁగానే యింద్రియచాంచల్యము బొత్తిగా నణఁగిపోయి ''నేను'' మాత్రము కొంత మిగులును, పైమంత్రముల యందుఁజెప్పినట్లు, అమ్మ యాజ్ఞాచక్రమందు నిల్చుటయే భాగ్యవశమునఁ బ్రత్యక్షమగునపుడు, మఱి తడవు లేక పరశివస్థానము (సహస్రారము) నుండి రమ్మని యాజ్ఞవచ్చును, అనఁగా తన నిర్మలానందావస్థ యిట్టే పత్యక్షమగును. అపుడు 'నేను' అనునది పూర్తిగా లోపించి యానందమే దేనిరూపమో ఆవస్తువే తాండవించును. అనఁగా సాధకుండు తాను తానై నిల్వఁగల్గును. ఇదే ముక్తా వస్థ, ఇదే సాధకుఁడు కోరుకొన్న సంరక్ష. ఎపుడైనను, భయమున్నప్పుడే సంరక్షను గోరుట. భయమనఁగా పునర్భవభయమే. ఈభయము మఱి లేకుడఁ జేయుటకు ¸°గికముగా నింత సాధనము కావలయును. శ్రీదేవివలన నింత యుపకారము, ననఁగా నభయము నొందనపుడే శ్రీదేవి వరద యనఁబడును. నిధులను దెచ్చి యిచ్చుట, చూపుట యను నుపకారములు జరుగుచున్నంత కాలము సైతము అమ్మ వరదయే. అప్పుడు అమ్మచేయునది జాగతిక వరదానము మాత్రమే. ప్రార్థింపఁబడి సేవింపఁబడినపుడు సాధకునకు జాగతిక వరదానములు చేయుచు, ఆశ##పెట్టుచుఁ గ్రమముగా నర్హత నొందినపుడు వరవరద యగును. అనఁగా శ్రేష్ఠవరమైన మోక్షము నిచ్చును. స్వస్వరూపానందానుభవముఁ జేయించును.

శ్లో|| మయి తిష్ఠ తథా నిత్యం యథేంద్రాదిషు తిష్ఠసి|

అభయం కురు మే దేవి మహాలక్ష్మి నమోస్తుతే||

తా|| మహాలక్ష్మీ! అమ్మా! ఇంద్రుండు మున్నగు వారి యందు నీవెట్లు నిల్చియుందువో, యటులే నాయందును నిల్వుము. నాకభయమిమ్ము. నీకు నమస్కారము.

వి|| అమ్మా! ఇంద్రుఁడు (ఇధ్‌ = ఐశ్వర్యే) ఐశ్వర్యవంతుఁడు. ఐశ్వర్యమనఁగా నీశ్వరభావము. అమోఘసంకల్పుండే యీశ్వరుఁడు. అట్టివాఁడై యుండుటే యీశ్వరత్వము. ఐశ్వర్యము. ఇంద్రాదులు అనఁగా దేవనాయకుఁడుమున్న గువారైశ్వర్యవంతులు. ఇంద్రుఁడు, విష్ణుఁడు, శివుఁడు, కుబేరుఁడు మున్నగు వారనేకులు శ్రీదేవి నుపాసించియే యైశ్వర్యవంతులైరి. అనఁగా బహువిధసామర్థ్యములు గల వారైరి. నీయుపాసనవలనఁగలిగిన యాసామర్థ్యములు తొలఁగిపోయెడివి కావు. అట్టి సామర్థ్యరూపముతోనే యాబ్రహ్మేంద్రాదులయందు నీవుందువు. అట్లే నాయందును అష్టైశ్వర్యరూపముతో నెల్లప్పుడు నిల్వుము.

దేవతలే చక్షురాదీంద్రియశక్తులు. ఇంద్రియాధిష్ఠానచైతన్యవర్గముగా ననఁగాఁదత్తదింద్రియశక్తులుగా నఖండచైతన్యమయివైన నీవే యున్నావు. ఇంద్రియములకు నాయకుఁడైన మనోరూపముగాను నీవే యున్నావు. ''ఇంద్రియాణాం మనశ్చాస్మి'' యని కృష్ణవేషముతో గీతల యందు నీవే చెప్పికొన్నావు. కనుక మనస్సు నీరూపమే, అనఁగా సర్వేంద్రియశక్తుల రూపముగా నీవే శోభించుచున్నావు. అదే నీవింద్రాదులయందు స్థిరముగా నుండుట. 'ఆవిధముగానే నాయందును నిల్వుము' - అనుదాని భావమేమనంగా సర్వేంద్రియాధిష్టానచైతన్యవర్గమునకు నీవే నాయుకవై ''యీ ఖండఖండచైతన్యవర్గము నాకంటె వేఱుకా''దని నిత్యము నీవు మాకు బోధించుటయే నిత్యము సర్వేంద్రియములను నీకడకు నయనము చేయట యనునదియే మాకోరిక.

అమ్మా! నీవు నాకభయమిమ్ము. అఖండజ్ఞానాగ్ని శిఖాకారవగు నీవైదువిధములైన ఖండఖండజ్ఞానశిఖలుగా ననఁగా శబ్దస్పర్శాద్యల్పాల్పజ్ఞానరూపపంచశిఖలుగా వేలయుచున్నావు. ఈవిషయమునే శ్రీశంకరభగవత్పాదులు దక్షిణామూర్తిస్తవమునఁ బేర్కొనిరి.

శ్లో|| నానాచ్ఛిద్రఘటోదరస్థితమహాదీపప్రభాభాస్వరం

జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహిఃస్పందతే,

జానామీతి తమేవ భన్తమనుభాత్యేతత్‌ సమస్తం జగత్‌

తసై#్మశ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

ఈసత్యమును మేమెఱింగికొనఁగల్గినపుడే యఖండజ్ఞానమహాదీపాకారమున లోన 'నే'నను పేరు నీవే యున్నావనెడి సత్యము మా తల కెక్కినపుడే జీవత్వాహంకారము తొలఁగి 'నేను' పేరితో నున్న దెవ్వరో పూర్తిగా నెఱింగికొని ''ఇదమహం మామమృతయోనౌ సూర్యే జ్యోతిషి జుహోమి స్వాహా'' అనుచు ఈబుచ్చి నేనును (మహాలక్ష్మియనెడి) నీవే యనెడి పెద్దనెను నందుఁ జేర్చివేయుదుము, నిన్నీవిధముగా నారాధించి స్వస్వరూపజ్ఞానము నొందినపుడే శరీరమనెడి పురమందు ఇంద్రియములనెడి జనమే కాక కామక్రోధాదులనెడి సర్వశత్రువులు లోఁగిపోవుదురు. ఇంద్రియవిజయమే ప్రధానసాధనమై కామాదులకుఁజిక్క నీయక సంసారభయము తొలఁగుటకైన పరికరము నందిచ్చును. ఆపరికరమే ''నేను, నాది''యనెడి యహంకారమమకారములఁదోలఁగించి, సర్వము అమ్మయే - సర్వము అమ్మదియే యను యథార్థజ్ఞానమును గలిగించి అమ్మయే 'నేను', ''నేనే'' యమ్మయనెడి యథార్థజ్ఞానముఁ గల్గించును ఆజ్ఞానమందు నిల్చుటే అభయము, ఇదియే స్వస్వరూపజ్ఞాన సిద్ధి, దీని ఫలముగానే సంసారమువలనిభయము తొలఁగుట, ''అమ్మా! ఈయభయమునే నాకిమ్ము'' - అని యాత్మార్పణము చేయుచున్నాఁడు.

శ్లో|| సమాగచ్ఛ మహాలక్ష్మి శుద్ధజాంబూనదప్రభే|

ప్రసీద పురతః స్థిత్వా ప్రణతం మాం విలోకయం||

తా|| శ్రీదేవీ! మహాలక్ష్మీ! పుటముపెట్టిన బంగారు కాంతివంటి కాంతిగలదానా! రమ్ము; నాకుఁబ్రసన్నురాల వగుము. నాయెదురు నిల్చి ప్రణతుఁడనైన నన్నుఁజూడుము.

వి|| శుద్ధజాంబూనదప్రభకలదానా! పుటము పెట్టిన బంగారుకాంతి యెఱ్ఱగా నుండును, ఇదియే శ్రీసూక్తమందు తొలిమంత్రమున 'హిరణ్యవర్ణాం' అని వర్ణింపంబడినది. ''హిరణ్యం విష్ణురాఖ్యాతం, తస్యవర్ణస్తు వైష్ణవీ'' హీరణ్య మనఁగా విష్ణువు. సర్వత్ర ప్రకాశవిమర్శశక్తిస్వరూపమున వ్యాపించియున్నవాఁడు పరమేశ్వరుఁడు, అతనిశక్తి హిరణ్యవర్ణ, అనఁగా పరమేశ్వర శక్తియని యర్థము, మహాత్ములైన బ్రహ్మాదులచే సైతము లక్షింపఁబడునది, కనుకనే మహాలక్ష్మీ, బ్రహ్మాదులశక్తులన్నియు నీమెవే, సృష్టిస్థిత్యాది కార్యములకుఁ గారణభూతయైనది యీమెయే. అనఁగా సృష్టిస్థితిలయతిరోధానానుగ్రహములనెడి శక్తులను బురుషులనుగా గౌరవించి వానినే బ్రహ్మవిష్ణురుద్రమ హేశ్వర సదాశివులని పేర్కొనిరి, సర్వకారణభూతశక్తియై, పరమేశ్వరునికంటె భిన్న కాని యీలక్ష్మియే శ్రీగురుడు ''శ్రీగురు స్సర్వకారణభూతా శక్తిః'' పిండాండమందు మూలాధారమున నెలకొని భక్తుల నెల్లరను లక్షించుచుండు ఈమహా లక్ష్మియనెడి పరాశక్తి యామూలాధారమందు సాధకులచే హిరణ్యవర్ణగానే యనుభవింపఁబడును. సౌభాగ్యలక్ష్మీ హృదయమందును ''యోనౌ కనక పుంజాభం హృది విద్యుచ్చయోజ్జ్వలం, ఆజ్ఞాయాం చంద్రసంకాశం, మహస్తవ మహేశ్వరి'' యని వర్ణింపఁబడినది. అమ్మా! నీ తేజస్సు మూలాధారమందు బాంగారుముద్దవంటి కాంతి కలదిగాను, హృదయమందు మెఱుపుఁదీవల గుంపువంటిది గాను, ఆజ్ఞాచక్రమందు (కనుబొమల నడుమ) చంద్రకాంతివంటిది గాను శోభిల్లును. ఈవిషయమే శ్సీసూక్తప్రథమబుక్కునందు సరిగా వర్ణింపఁబడినది. ఒక చోట హృదయమందు మెఱపుల గుంపువలె నున్నదే, ఒక చోట (సువర్ణ రజతస్రజాం) బంగారు వెడిగొలుసులను ధరించినది యని వర్ణింపఁబడినది. కనుకనే సాధకుండు మూలాధారమునుండి లేచి రమ్మని ప్రార్థించుచు, అక్కడ జాంబూనద ప్రభ కలదానా! యని పిలుచుచున్నాఁడు. నాకుఁ బ్రసన్నవై నాయెదుర నిల్వుము అనఁగా మన స్తత్వవిశిష్టమైన యాజ్ఞాచక్రమునందు దర్శనమిమ్ము. అచ్చటో చంద్రకాంతివంటి కాంతితో దర్శనమిచ్చుటే అమ్మ ప్రసన్నత. ఆజ్ఞాచక్రాదిగా సహస్రారాతమువఱకునైన భాగమే చంద్రమండలముగా శ్రుతి, తంత్రాదులయందు వర్ణితము, పరాశక్తి యావిధముగా నచ్చట ననుభవింపఁబడినపుడే ప్రణతుఁడై పోవును. అనంగా నాత్మార్పణశీలుఁడై పోవును. అనఁగా 'అమ్మా! ఉన్నది నీవే; ఈనేను మఱి లేదు.' అను నిశ్చయజ్ఞానమునకు వచ్చును. ప్రణామతత్వమునుగూర్చి విపులముగా వ్రాసిన మాటలను నా ''సాధనసామగ్మరి'' యను పుస్తకమునందును, 'దేవపూజారహస్య' మను గ్రంథమందునుజూచునది. అటులు నీకుఁ బ్రణామముచేసిన, అనఁగా నాత్మార్పణము చేసిన నన్నుఁజూడుము. నీయనుగ్రహమునకుఁబాత్రుఁడై నవానిగాఁ గైకొని నీయొడియందుఁజేర్చికొనుము అని భావము.

శ్లో|| లక్ష్మీ, భువి గతా భాసి, యత్ర యత్ర హిరణ్మయి|

తత్ర తత్ర స్థితా త్వం, మేతవ రూపం ప్రదర్శయం||

తా|| ఓశివశక్తీ! కాంతిస్వరూపిణీ! భూమియందున్న దానవు. నీవెక్కడెక్కడ నడుగిడుదు%ో యాయాచోట్ల నిల్చినదానవై నీరూపమును నాకుఁజూపుము.

వి|| ఓశివశక్తీ! (హిరణ్యరేతసః శంభోః శక్తిః ప్రోక్తా హిరణ్మయీ) అమ్మా! మాచే స్తుతింపఁబడి భూతత్వవిశిష్టమైన మూలాధారమునుండి లేచి వచ్చునపుడు సుషుమ్నయనెడి నీమార్గమందు నాడాడ నిల్చి నీరూపమును మాకుఁజూపుము. సంధ్యావందనగ్రంథమందు సైతమిదే సాధకుల ప్రార్థనము, (స్తుతా మయా వరదా వేదమాతా ప్రచోదయంతీ పవ నే ద్విజాతా) ఈవిషయమును మున్ను వివరించితిని. అమ్మ మనస్తోత్రమును విని, తానే యపానప్రాణములనెడి వాయుశక్తులను ప్రేరణము చేసి లేచును. ఈరెండుశక్తుల ప్రేరణము లేక పరాశక్తి యుచ్చరింపదని తోఁచుచున్నది. ఆపనియు నామెదే. ఆమె వేదమాత, స్వరూపజ్ఞానమును గలిగించుటే ఆమెపని. అందులకే మనమును ''ఆయాతువరదా దేవి'' అని పిలుచుట, స్వరూపజ్ఞానమును గల్గించినంగాని వరదానము-అనఁగా మోక్షదానము జరుగదు. ఆమె బ్రహ్మసమ్మిత, వరదానాధికార మామెదే. స్వరూపజ్ఞానలబ్ధి కాక మోక్షమబ్బదు (జ్ఞానా దేవ ముక్తిః). సుషుమ్నాపథమందలి యామె మెట్టు చోట్లు స్వాధిష్ఠానాది కేంద్రములే. ఏచోట నిల్చినను స్వరూపజ్ఞానమును గల్గించుటకే.

''ద్రవిణం బ్రహ్మవర్చనం దత్వా ప్రయాతు'' - అని యచ్చటను సైతము జ్ఞానమనెడి ధనమును దానివననగు బ్రహ్మవర్చస్సు మాత్రమే ప్రార్థింపఁబడినవి. ఈమంత్రమందును నదే ప్రార్థనము. ఆయాతావులందు నిలిచి; నీరూపమును జూపుమనుచున్నాఁడు. అనఁగాఁగ్రత్యేకశక్తి కేంద్రమందును బరాశక్తిని నిల్పంగలిగినపు డచ్చటి ప్రత్యక్షత స్వరూపజ్ఞాన లాభమునకే యగును. మూలాధారమునుండి వేచిన శక్తి మెఱుపుఁదివలఁజప్పున నడ్డులేక యుచ్చరించునందురు. అచ్చటచ్చట నాగుట సహజమా? యందు రేమో, అటు కాదు. పరాశక్తిని బ్రార్థించి, లేనగొట్టి, యాయాయీ పద్మములందు నిలిపి, వివిధమాననసికోపచారములను అమ్మయనుగ్రహమునకై చేయుటయే సమయాచారము, ఆవిధానము సనత్కుమార విశిష్ఠసంహితా గ్రంథములందు విపులముగాఁ జూడనగును. ''సమయా, సమయాంతస్థా, సమయాచారతత్పరా''-యని లలితాసహస్రనామస్తోత్రము. ఈ యాచారమును సాధకుఁడు ప్రయత్నముతో సభ్యసింపవలసినదే, ఆజ్ఞాచక్రమందమ్మ నిల్చునపుడే నీరాజనోపచారము తిరుగును. ఇచ్చటనే యంతర్జ్యోతిర్బహిర్జ్యోతు లేకీకృతములగుట. అదే ''నితరాం రాజనే''నీరాజనం. ఇప్పటికి సాధకుని కోర్కి సిద్ధించిన దన్నమాట. ఒక్కొక్క కేంద్రమందు నిల్పియుపచరించినపుడు స్వరూపజ్ఞాన మింతయో, యంతయో, క్రమముగాఁ బొందుచునే యుండి సాధకుఁడు లాభము నొందుచు మంత్రపుష్పమును సమర్పించును. అనఁగా మననస్థానమైన మనస్సును సమర్పించును. అనఁగా మనోలయమై పోవును. అదే సువర్ణమంత్రపుష్పసమర్పణము. త్వమేవాహమ్మనెడి సువర్ణముతో ననఁగా శ్రేష్ఠమైన జ్ఞానముతోఁ గూడిన మనస్సనెడి మంత్రపుష్పమును సమర్పించును. ఆపైని బ్రణామ, మనంగా నాత్మార్పణము. అప్రయత్నముగా సిద్ధించును. ఆత్మార్పణమన్నను, శరణాగతియన్నను, బ్రణామమన్నను, ఒక్కటే. ఆత్మార్పణ మాస్థితికి వచ్చునపుడు 'తానే నేను'- అనుట దక్క వేఱొక్కటి లేదు. ఉన్నదంతయు నమ్మయే. ఇక్కడికి జీవుఁడు యాత్రచేసి, చేసి, శరణాగతుఁడైనాఁడు. అనఁగాఁదన యింటికిఁదాను వచ్చినాండు. అనఁగా బ్రహ్మస్వరూపానుభవసిద్ధి నొందినాండు. నాసాధనసామగ్రియందీవిషయము ప్రణామతత్తవమను శీర్షిక క్రింద వ్రాయఁబడినది. తరువాత మఱి యుపచారములే లేవు. ఇదే సమయాచారము. సమయానామక బ్రహ్మశక్తినర్చించి కృతార్థుఁడగుట.

శ్రీదేవీస్వరూపసందర్శననమైచరమలాభమునొందుట, అమ్మ నిలుచు సర్వ కేంద్రములయందును గానవచ్చుననిదీని చేఁదెలియుచున్నది. శరీరమే రాష్ట్రముగాను, ఈకేంద్రములే పట్టణములుఁగాభావింపఁబడి ''అయోధ్యామధురా, మాయా, కాంచీ కాశీ, అవంతికా, ద్వారవతీ''యనెడి వేళ్లతోఁ బేర్కొనఁబడినవి. అవి యన్నియు మోక్షదాయకములే, అనఁగా నాత్మజ్ఞానసిద్ధిదాయకములే. కనుకనే ''సపై#్తతా మోక్షాదాయకాః''అని చెప్పఁబడినది. కనుకనే సాధకుఁడు ''తత్ర తత్ర స్థితా త్వం మే తవ రూపం ప్రదర్శయ''-అని ప్రార్థించినాఁడు. ఈవిషయము మున్నొకచోట వివరింపఁబడినది.

శ్లో|| క్రీడసి త్వం చ బహుధా పరిపూర్ణకృపామయి|

మమ మూర్ధని తే హస్త మవిలంబిత మర్పయ||

తా|| వెలితి లేని నెనరే (బిడ్డ నెయ్యమే) రూపముగాంగల దానా! నీవు బహువిధములుగా నాడుకొనుచుందువు. నా తలపైని నీచేతిని జాగు చేయక పెట్టుము.

వి|| శ్రీదేవీ! నీవు లోకజ్ఞానము కలిగించుటకు బిడ్డలతోఁగన్నతల్లివలె నాడుకొనుచుండువు. నీవు తిరోధానము చేసియుంచి (కొన్నాళ్ళు కానరాకుండ నీలోపలికే తీసికొని అవ్యక్తముగా నుంచి) సృష్టించిన జగజ్జా-జాలముతోఁ బైకి విడిచిన బ్రహ్మాండములతో నయిదాట లాడుకొనుచుండువు. అవే సృష్టిస్థితిసంహారతిరోధానానుగ్రహములు. ఇవి నీలీలలు. ఈయాటలన్నియు మామేలునకే, స్వరూపజ్ఞానమును బెట్టుటకే. మాకు బుద్ధియోగమునిచ్చుటకే (బుద్ధిగఱపుట కే)| విచారసాధనమును మప్పి క్రమముగా స్వరూపజ్ఞానమును గలిగించుటకే.

అయినను వేదమాతవై నీసాధకపుత్త్రుల నవిలంబితముగా నొడిని జేర్చుకొనుటకు బుత్త్రస్నేహముచే ముగ్ధవైజాగుచేయక పరమకృపతో నీ కృపామయత్వమును సార్థకము చేయుచుందువు. మఱి యొక తల్లిపాల యాశ##లేకుండు నట్లు స్వరూపజ్ఞానమనెడి స్తన్యపానము చేయింతువు. నీవు నీబిడ్డలతోఁగూడి కులమందే (ఇంటియందే) యుందువు. కులము. శ్మశానము అనువేళ్ళు సుషుమ్నామార్గమునకే యోగశాస్త్రప్రసిద్ధములు. ఇంటనే నిన్ను జూచుకొనిక ''మాయమ్మ యేదీ?'' యనుచు నిటునటుఁబరుగు లెత్తు మూర్ఖసంతానము నుపేక్షించి యింటనే నిన్ను జూచుచు నీవు నీమేడ నెక్కి దిగి వచ్చుటకైన సోపానములను లక్షించుచునది గాక సర్వదా నీవు రాకపోకలు చేయుచుండు ద్వార ములయందు లక్ష్యముంచుచు మేమింటనే గూరుచున్నప్పుడు నీదర్శనము సహజముగా నైపోవుచుండును. అట్టివారి ననంగా నీరూపముగా కనఁగోరి కులమందే వెదకుచున్న బిడ్డలను గుర్తించి ఆశీఃపూర్వకముగా నభయదానపూర్వకముగా వారి మస్తకములయందు నీహస్తము నుంతువు. మేము సర్వకారణభూతశక్తిస్వరూపవైన నీవే శ్రీగురుఁడవని (''శ్రీగురుఃసర్వకారణభూతా శక్తిః'') నమ్మి యున్నాము. మేము గురుకులమును విడువము. కులమును విడువకయార్జించుకొను విద్యయే విద్య. ''పలువిద్య లెన్నియైనను గులవిద్యకు సాటి రావు గువ్వలచెన్నా'' యనిన కవివర్యునికి నమస్కారము. ఈకులవిద్య నాసించిన యథార్థసాధక పుత్త్రుండే ''అమ్మా! వేగవచ్చి నాతలపైనీ చేయుంచుము'' అని ధీరముగా మొఱపెట్టుకొనఁగలవాఁడు. అనఁగాఁగులకుండ మనఁబడెడి మూలాధారమునుండి కన్యా, కుమారీ, బాలా శబ్దవాచ్యత్రిపురసుందరివై శోభిల్లి, మణిపురము నతిక్రమించి క్రమముగాఁభ్రౌఢవై మహాత్రిపురసుందరివై ప్రశస్తినొంది యాజ్ఞాను దాటి లలితవై (సర్వమతీత్య లలతీతి లలితా) సహస్రారమునకు వచ్చి నీలలితాశబ్దమును సార్థకము చేసికొనినపుడే శరణాగతుఁడును, ఆత్మార్పకుఁడునునై మఱియొక తల్లిపాల యాశ లేకుందును. అనఁగా ముక్తి నొందుదును.

ఇంద్రియములు=శ్రీదేవి సదా రాకపోకలు చేయుదారులు.

(1) కులకుండాలయా (2) కులయోగీనీ (3) కౌళమార్గతత్పరసేవితా (4) కులోత్తీర్ణా (5) కులరూపిణీ (6) కులాంతస్థాయీ మోదలగు నామములు అమ్మగారి కులసంచారము ననుసరించియే కలిగినవని స్పష్టము.

(1) కులకుండాలయా:- మూలాధారము స్థానముగాఁగలది.

(2) కులయోగినీ:- కులమనెడి సుషుమ్నామార్గమందలి ఆరు పద్మములయందును హాకిని, సాకిని, కాకిని, లాకిని, రాకిని, డాకిని యను పేర్లతోఁబిలువఁబడు శక్తుల రూపముతో నుండునది.

(3) కౌళమార్గతత్పరసేవితా :- సుషుమ్నామార్గ మందు అమ్మను సేవించు నాసక్తిగలవారలచే నారాధింపంబడినది. అనఁగా సమయాచారతత్పరలచేఁ బూజింపఁబడునది.

(4) కులోత్తీర్ణా:- కులమనెడి సుషుమ్నామార్గమును గడచి సహస్రారమునకుఁ బోవునది.

(5) కులరూపిణీ:- సుషుమ్నయే రూపముగాఁగలది,

(6) కులాంతస్థా:- సుషుమ్నయందే సంచరించుచు నుండునది.

ఇమ్మాటల విపులవ్యాఖ్య నెఱుంగఁగోరువారు శ్రీభాసురానందనాథుని వ్యాఖ్యానమును జూచునది.

శ్లో|| ఫలద్భాగ్యోదయే లక్ష్మి సమస్తపురవాసిని|

ప్రసీద మే మహాలక్ష్మి పరిపూర్ణమనోరథే||

తా|| నీవు సుప్రసిద్ధపురములందెల్ల నుందువు. కర్మ ఫలరూపమున ఫలించు భాగ్యముగా నుదయించుదానవు. నెరవేరిన కోర్కులుగలదానా! నాకుఁబ్రనన్నురాలవగుము.

వి|| భక్తుల నొకకంటఁజూచుచుండు లక్ష్మీదేవీ! నీవు సర్వశరీరములయందు నుండుదానవు. ''ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్‌'' - నేనీరాష్ట్రముందుఁ బ్రాదుర్భవించితిని - అపుడు రాష్ట్రమందలి ముఖ్యపట్టణములుగా నెన్నఁబడిన అయోధ్యాదులైన యేడు నగరములే, మూలాధారాదులైన యేడుశక్తి కేంద్రములు. అవియే యేడు పద్మములు. పరాశక్తి యీనగరములందన్నింటను బైనిఁ జెప్పిన హాకినీ, సాకినీత్యాది యోగినీనామములతో వసించునది. (కులయోగిని) కులమనెడి సుషుమ్నామార్గమున వెలయు శక్తి కేంద్రములే అయోధ్యాది నగరములని మున్నే చెప్పితిమి. అమ్మ వానియందున్నింటను వివిధశక్తుల రూపమునఁ జేరి యుండును. శరీరము పురనామప్రసిద్ధము. అన్ని శరీరములందును నాత్మరూపమున వ్యాపించి యున్నది. కనుకనే సమస్తపురవాసిని యని సాధకుఁడు సంబోధించినాఁడు. వాని యందు వసించియుండు శ్రీదేవి పుణ్యకర్మఫలజన్యభాగ్యరూపమున నుదయించును. వృద్ధి నొందును. ఆయాకేంద్రములయందు వివిధశక్తిరూపమున నెలకొన్న యామె నారాధించుటచే సాధకుల మనోరథములు నెరవేరును. సాధకమనోరథము యోగసిద్ధియే. అనఁగా 'నేను' అనెడి యల్పాహంత వస్తు వమ్మయనెడి వరాహంతారూపమందుఁజేరిపోవుటే ఇదే పరిపూర్ణమనోరథము. ఈయోగము పరిపూర్ణమగుటే మోక్షము. శివశ##క్త్యైక్యము. పరిపూర్ణమనోరథే - ఎవ్వని మనోరథము పరిపూర్ణమో వాఁడు పరిపూర్ణమనోరథుఁడు. మంత్రమందు 'పరిపూర్ణమనోరథే'యని దేనిని సంబోధించి నాఁడు-శ్రీదేవి తానెట్టి మనోరథమ లను లేనిది కదా, ఈసంబోధనము తగిగ యున్నదా? అమ్మ కోరికలు కలదేయైనచో దేహకారణములైన మనోరథము లమ్మను సైతము బహుయోనిసంచారిణినగాఁజేసియే యుండును. ఆమె అజ, జీవుఁడు మాత్రమే మనోరథజుష్టుఁడు. కనుకనే తనయుభీష్టమైన యజత్వమునకు జన్మరాహిత్యసిద్ధికై సాధన మారంబించును. కృపామయి కనుక సాధనసిద్ధికై సర్వకాలసర్వావస్థలయందును దనవైపే మొగముంచి నిరంతరయాత్రచేయ సాధకుని మనోరథము సిద్ధింపంజేయుటే శ్రీమాతృమనోరథము. కావున నీమనోరథము స్వార్థము కాదు. కనుకనే యమ్మకు దేహాకారణము కాదు. కను నెరవేర్పఁబడిన భక్తిమనోరథములు కలదియని యర్థము చేసికొనందగును.

నాయెడఁబ్రన్నవగుమనఁగా దయచేసి నాకు మోక్షమిమ్ము - అని భావము. ఇదే భక్తమనోరథము. ఇదే ఫలద్భాగ్యోదయము.

శ్లో|| అయోధ్యాదిషు సర్వేషు సమాస్థితే.

వైభ##వైర్వివిధై ర్యుక్తాసమాగచ్ఛ బలాన్వితా||

తా|| అయోధ్యాప్రముఖములైన పట్టణములయందెల్లనున్నదానా! పలువిధములైన సామర్థ్యములతో శక్తులతో ఁగూడినదానవై బలముతో ఁగుడినదానావై రమ్ము.

వి|| అయోధ్యమున్నగు నగరముల నేవో, శ్రీ దేవి యుండుట సంచరించుట యననేమో, వచ్చుట యననేమో, మున్నగు విషయములు వెనుకటి మంత్రములయందు వర్ణింపఁబడినవి. ఇందును సాధకుని ప్రార్థనవిషయము విశేషించ లేదు. కాని ''నీసేనతోఁగూడిర''మ్మనుచున్నాఁడు.

శ్రీ| నూ|| ప్రాదుర్భూతోస్మిరాష్ట్రేస్మిన్‌'' - తన శరీరమును రాష్ట్రముగాజెప్పి శ్రీదేవి, శ్రీమహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి, రాజారాజేశ్వరి, చక్రవర్తిని గనుక లెక్క లేని పలువిధములైన విభవములు కలదనియు నూచించి ''అమ్మా! నీసేనలతో ఁగూడిర''మ్మని యీమంత్రమందుఁ బ్రార్థించుచున్నాఁడు. రాష్ట్రమే శరీరము. అమ్మ శరీరమైన మూలాధారాదిసహస్రారాంతమై%ాన సుషుమ్న యేరాష్ట్రము. రాష్ట్రమ నఁగాఁ బలు దేశములు పలుపట్టణములు కలిగి శోభించునది. అందందు బహువిధములైన విభవములతోఁ గూడియుండునది. బలముతో (సేనలతో) నుండుట చక్రవర్తినికి సాజము, విభుత్వమమ్మది. ఈవర్ణనము సాధనవిషయమునమనో హారము. మూలాధారాదిచక్రములయందు వర్తించునది కనుకనే అమ్మ చక్రవర్తిని. ఈ చక్రములే యయోధ్యాదులైన నగరములని మున్ను చెప్పియుంటిని. వీనియందుండుటయు, సంచరించుటయు, వివిధవిభవములతోనే యనఁగా విభూచితసర్వసామర్థ్యములతోనే, కనుక ఆసామర్థ్యములతోఁగూడియే యున్నదని యమ్మను గొనియాడుటే గాక, ''నీసేనతోర''మ్మని కోరుచున్నాఁడు. శ్రీమాత రాజారాజేశ్వరి, చక్రేశ్వరి కావున తనముఖ్యపట్టణములయందుఁ దా నున్నప్పుడును, దనరాష్ట్రమందుసంచరించునప్పుడును, సర్వరాజ్యాంగములతోను సేనలతోను గూడియే యుండును. మూలాధారాదిచక్రములయందు శ్రీమాతృసామర్ధ్య్ములు వివిధముగా సాధుకునిచే ననుభవింపఁబడును. ఒక చోట విద్యాస్రదశక్తి, ఒకచోట ఆరోగ్యప్రదశక్తి, ఒకచోట విజ్ఞానప్రదశక్తి, ఒకచోట కామక్రోధాదిశత్రూచ్చాటనశక్తి, ఒకచోట నానందప్రదశక్తి, ఒకచోట వైరాగ్యప్రదశక్తి, ఒకచోట మోక్షప్రదశక్తి, ఈవిధముగా లెక్కలేనన్ని శక్తులను జక్రములయందైన యమ్మ యునికినిబట్టి సాధకుఁడు పొందఁగలఁడు. ''నీవు వచ్చునపుడు బలముతో ఁగూడి రమ్మా!'' యనుచున్నాఁడు. బలమనఁగా సేన, శ్రీరాజరాజేశ్వరియైన దేవి సృష్ట్యాదిమహాశక్తులేగాక ఆశక్తులను బ్రదర్శించునప్పుడు ఒక్కొక్క కార్యమందు లెక్కలేని శక్తులతో విరాజిల్లవలసియుండును, కనుక సేనాసహితవై రమ్మనుచున్నాఁడు అనఁగా ''నేను గోరునపు డెప్పు డేశక్తిరూపమున సంరక్షింపఁదగియుండునో, పోషింపఁదగియుండునోయాశక్తి రూపమున వచ్చిన నన్నాదరింపు'' మని సాధకుని భావము.

ఇపుడు సాధకులైన పాఠకులు శ్రీచక్రవిషయమును గురువువలన సమగ్రముగా శిక్షింపఁబడి బైందవస్థానాది భూపురాంతమువఱకునైన యావరణములందలి శక్తులు దేవతలు, మాతలు, వాగ్దేవతలు, నిత్యలు, యోగినులు మున్నగు పేళ్లతో శ్రీదేవీఖడ్గమాలయందుఁ గల పరివార దేవతల రహస్యము లెఱింగికొన్నచో, సమ్మగారి విభవుములు, సేనలు మున్నగువాని పరమార్థమంతము హృదయంగమమై ఆనందమయ లగుదురు. భావనోపనిషత్తునందున వివిధావరణలతో ఁగూడి వివిధశక్తి సాహిత్యము, విభవసంపన్నత మున్నగువానినిగూర్చిన యాథార్ధ్యమును గురుముఖమువలనఁ జక్కఁగా నెఱుంగవలెను.

శ్లో|| సమాగచ్ఛ సమాగచ్ఛ మమాంగే భవ సుస్థిరా|

కరుణారసనిష్యంది నేత్రద్వయవిలాసిని||

తా|| అమ్మా! రమ్ము! రమ్ము! దయరసమొలుకు రెండు కన్నులతో విలసిల్లుదానా! నాయంగమందు నిశ్చలవై నిలువుము.

వి|| అమ్మ రెండు కన్నులు గలదిగాను, ఆరెండు కన్నులు దయారసమొలుకునవిగాను వర్ణింపఁబడినవి. జ్ఞానసిద్ధికొఱకుఁ దన్నాశ్రయించిన వారి యజ్ఞానమును దొలగించి జ్ఞానదృష్టిని బెట్టి ముందునకు నడిపించునవి. కనుకనే యవి నేత్రములు. అనంగా నాధ్యాత్మికమార్గమందు ముందడుగు పెట్టించునవి. అవి యేవి యనంగాఁ దనజగదాకార వ్యాప్తియును, ఆత్మాకారవ్యాప్తియునుగా నెన్నందగును. అనఁగాఁగాదా నేజగత్తుగా మారుట, అందు జ్ఞానస్వరూపాత్మా కారముగా వ్యాపించి యుండుట ఈరెండు వ్యాపకత్వములను మనము విచారించి చూచునపుడు నేత్రములై గమ్యమునకుఁ బగతిని జూపునవియే. ఆత్మవ స్తుజ్ఞానలబ్ధికి రెండే మార్గదర్శులు. అమ్మ రూపమేయైన ''జగత్తు'', 'నేను'. ఈ రెండు విధములుగా వ్యాపించి ప్రకాశించువాఁడే విష్ణువు. తచ్ఛక్తిమనయమ్మ వైష్ణవి. తన్నాశ్రయించిన భక్తులయెడ దయామయియైన శ్రీదేవి. యజ్ఞానముచే గమ్యమునకు దారి వెదకుకొనుచున్న భక్తుల నీరెండు కన్నులతో ఁజూచియే జీవుని యథార్థశరణమునకుఁ గొనిపోవును.

మఱియు అమ్మను జగచ్ఛరీరిణిగాఁజూచినపుడు సూర్య చంద్రులే నేత్రములు. విశ్వముగాఁ దానే పరిణతినొంది సర్వోపాధులయందు ''నేను'' పేరితో ఁబ్రవేశించి తనకు మధువైన జగత్తును గాంచుచు నానందించుటకు ఁదానే సూర్యచంద్రులుగా వెలయుటకు సంకల్పించిది. ''సూర్యా చంద్రుమసౌ ధాతా యథాపూర్వ మకల్పయత్‌'' (శ్రుతి) చూచుటకు రెండు కన్నులు కావలయును. ఎల్లప్పుడు నొక్కవిధమైన జ్యోతిగానే ప్రకాశింపక యుష్ణజ్యోయతియైన జ్యోతిగాఁ గొంతసేపును, మఱియంతసేపు శీతకిరణజ్యోతిగాను, దానే వెలసి మార్గదర్శనసాధనములైన నేత్రములుగా వెలయుచున్నది. కేవల సూర్యుని జగదుపకారము చేయు తచ్ఛక్తులను విచారించినను ఆత్మతత్త్వము నెఱింగికొని ముందడుగు పెట్టఁగలము. స్వాశ్రితులయెడనైన దయ నొలికించుచుదారిఁజూపునవి యివియే.

ఈరెండు నేత్రములతో విలసిల్లుచు నాయంగమందు నాశరీరమందు స్థిరముగా నిల్వుము. శరీరమందఁ జంద్రసూర్యప్రకాశము ఇడాపింగళానాడీస్వరూపముననేయుగును చైతన్యమయమైన యీ చంద్రసూర్య నాడీప్రసారము లేనప్పుడే మరణము. ఈచైతన్యమయవస్తువే హంసశబ్దముచే వ్యవహృతము, హకారము సూర్యవాచకము (పింగళా) సకారము చంద్రవాచకము (ఇడా) ఇదే పిండాండమ నుండి హంస లేచిపోవుట (మరణము) కనుక సాధకుఁడు చైతన్యమయియైన అమ్మ స్వరూపము ననుభవించుటకై చిరాయువు వర్థించుచున్నాఁడు. ఆరెండు చంద్రసూర్యనాడుల ప్రచారము నాధారము చేసికొనియే ప్రాణాయామము ననఁగాఁజైతన్య శక్తివిస్తారమును బొంది పరాశక్తిని మూలనిలయమునుండి సహస్రారమునకుఁగొనిపోగల్గుచున్నాఁడు. సాధకులు తొల్త నర్థించునది యాయువే. సంధ్యానామక శ్రీదేవికి వందనము చేసి ''ఆయుఃపృథివ్యాం ద్రవిణాం బ్రహ్మవర్చనం మహ్యందత్వా ప్రయాతు'' - అని యర్థించుట సుప్రసిద్ధము. కనుక సూక్తములందెన్నిఁటనో యాయుర్లాభ##మే ముందుగాఁగోరంబడును. ఆలాభ మబ్బుటచే ద్రవిణాలాభమునకు ననంగా జ్ఞానధనలబ్ధికిఁ గడు నవకాశము చిక్కును. జ్ఞానధనము లభించినంతనే యవిలంబముగా బ్రహ్మవర్చస్సు లభించును. కనుక అమ్మ యిడాపింగళా (చంద్రసూర్య) నాడీహవనేత్ర ద్వయమార్గమునఁ గృపారసమొలికించుచున్నదనుట మనోజ్ఞవర్ణనము గదా.

అంగమనఁగా నుత్తమాంగము. అనఁగా శీర్షము ¸°గికముగా సహస్రారమని భావము. అమ్మా! కృపారస మొలుకు నీ రెండు నేత్రములతో విలసిల్లుదానవై సహస్రార మందు నిశ్చలయముగా నుందువేని నేనానందమయుఁడు నగుదును, నీనేత్రములనుండి యొలుకు రసమే యానందరసము, రసమనంగా నానందమని శ్రుతులందును సుప్రసిద్ధము. ''రసో వై సః'' - ఈవిధముగా నన్ననుగ్రహించునపుడు నాకు మరణమే లేదు. అనఁగా జననమరణరూపసంసారబంధమే లేదు. అని సాధక పుత్త్రుఁడు తృప్తినొందుచున్నాఁడు.

శ్లో|| సన్నిధత్స్వ మహాలక్ష్మి త్వత్పాణిం మమ మస్తకే|

కరుణాసుధయా మాం త్వమభిషించ స్థిరం కురు||

తా|| మహాలక్ష్మీ! నాశిరస్సునందు నీచేతి నుంచుము. నీకరుణామృతముచే నన్నభిషేకింపుము.

వి|| శ్రీమాతా! నామస్తకమునందు నీపాణినుంచుము. పుత్రాదుల నోదార్చునది కనుకనే చేతికి పాణియను నామము సార్థకమయ్యెను. తల్లిదండ్రులు మున్నగు పెద్దలు పరమాప్తులు మస్తకమందుఁ బాణి నుంచినపుడు మనమనుభవించు చల్లదనమును మంచుగడ్డయుఁగల్గింపఁజాలదు. యథార్థముగాఁ బరమాప్యాయనము గలిగించు నాశక్తి పాణికిఁజెందినది కాదు. దయానామకరస మెక్కడఁబుట్టునో యక్కడిది. ఆరసము ప్రసరించు మార్గము పాణి (చేయి) చేతివ్రేళ్ల కొనఅయఁధుఁ బలువిధములైన శక్తులను మఱియొకవస్తువు నందుఁ బాతము చేయు సామర్థ్యము కలదు. ఈశక్తిపాత సాధనములు రెండే. అవి చక్షువు, పాణి యనునవి. కృపామృతమునో, వ్యాధినిరహరణశక్తినో, శరీరాంతరముందుఁ బాతము చేయుటకై యుపయోగించు చిమ్మనగొట్టములు వంటివి. కావుననే మంత్రపూర్వకముగా విషహరణ వ్యాధిహరణాదిశక్తులను బరశీరములయందుఁబడఁజేసి సుఖమును గలిగించుటకై తఱచుగాఁదమపాణ్యగ్రములనే సాధనముగాఁ గైకొందురు. మంత్రపూర్వకముగాఁగాకపోయినను ఆశీరూప సుఖకరోశక్తిని బిల్లలయందుఁ బ్రసరింపఁజేయుటకు మూర్థమును (మస్తకమును) దాకుట, మూర్కొనుట, గడ్డమును బుణుకుట, వెన్ను నిమురుట, పాణ్యగ్రములతోఁ బాణ్యగ్రమును బట్టుకొనుట మున్నగునవెన్నో యప్రయత్నముగా జరుగుచుండును. మెస్మరిజం, హిప్‌ నాటిజం, అను విచిత్ర కార్యములందుసాధకుఁడు పరశరీరమందుఁదెలివినిదప్పింపఁగల శక్తిని హస్తాగ్రముల దారిని శక్తిపాతము చేయుట మనము కనుచున్నాము. స్వపరదేశీయవైజ్ఞానికులయందు నిట్టి శక్తి సంపన్ను లెందఱో కలరు. మంత్రదీక్షాదానము చేయు సమర్థగురువులు చక్షుర్మార్గమునఁ బరచక్షవులయందును, పాణిమార్గమున మస్తక మునందును శక్తిపాతము (తమలోసంచితము చేసికొన్న తపశ్శక్తిపాతమును) జేయుట తప్పదు, శక్తిపాతవేళ##నైన స్పందనము శిష్యశరీరమందంతటను సూక్ష్మవిద్యుల్లేఖలవలెఁ బ్రసరించి కుండలినీశ క్తిని ఇట్టే మేల్కొల్పును. సమర్థతరులైన గురువులు హస్తమస్తక సంయోగము చేయకయే కేవలసునిశితదృష్టిప్రసారముచేతనే శక్తిపాతము చేయుదురు. సమర్థతములైన గురుమహా శయులు కొందఱు పరమకరుణాపూర్వకముగా స్థలాంతరముందున్న శిష్యమూర్తులయందు సయితము శక్తిపాతము చేయుట నేనెఱుఁగుదును. శక్తిపాతమననఁగాఁ దపశ్శక్తిని శిష్యశరీరములయందుఁబడ వేయుట యను నర్థమే కాక, కుండలినీ శక్తిని జప్పున లేవఁగొట్టు యనియు, నొక రహస్యార్థము గలదు. ఈవిషయమున నెంతో వ్రాయఁదగియున్నది. కాని యిచ్చట నింతతోఁజాలింతము. (అమ్మ కృపచేఁ ద్వరలోనే వెలువడనున్న ''శక్తిపాత'' మనెడి గ్రంథమందీ విషయము సమగ్రముగాఁ జూడఁగలరు.)

ఇమ్మంత్రమందుసాధకుఁడర్థించినది తన మస్తకమందు అమ్మపాణిని జక్కఁగా నిల్పుటే. మస్తకమందుఁ బాణ్యగ్ర సంఘట్టనఫలము సాంత్వనమే. పుత్త్రాదులు పెద్దలవలన నపేక్షించునది యదియే. త్రివిధములైన తాపములతో నుడుకెత్తి యాందోళితమగుచున్న సాధకచిత్తమును జల్లఁ బఱచి స్థిర పెట్టునది శ్రీమాతృపాణిమస్తకసంయోగమే. అనఁగా గొంతతడవు పరాశక్తి సహస్రారమందు నిల్పుటే యని రహస్యార్థము.

సాధకుని రెండువ కోరిక శ్రీమాతృకృపామృతముచే నభిషిక్తుఁడగుట. సుఖముకొఱకుఁ బానము చేయుఁబడునది సుధ. ఆనందలాభము దేనివలన నగునో యది సుధ, మరణము రాకుండఁజేయునది యమృతము, భవమున్ననే మరణము. అభవమన్నను, అమృతమన్నను ఒక్కటియే భవమరణములు లేకుండఁజేయునది నీకరుణయే. కావున నీకరుణారసముచే స్నానమాడింపుము. పూర్తిగా నన్నుదడుపుము. నీవు హస్తమస్తకసంయోగము చేయుటచే నా కమృతాభిషేకమే యగును. నీవమృతేశ్వరివి. అనఁగా నానందమయివి. అమృతస్రావిణివి. నీయంగుళ్యగ్రములు నామస్తకము నంటినంతనే నాకమృతాభిషేకమగును. నా డెబ్బది రెండు వేల నాడులును నాప్యాయితము లగును. అపుడు మస్తకస్పర్శము చేసిన యానందమయవస్తువు తక్క మఱదియుఁ గానరానంతగా జగత్తు మిథ్యగానే యుండును. అమ్మా! పొరపాటు క్షమింపుము. అట్టి యానందమయా వస్థలో నీవు తక్క మఱదియు లేదనునప్పుడు అనుభవించువాఁడు. అనుభవింపఁబడునది. అనుభవము ననెడి త్రిపుటీ జ్ఞాన మణఁగిపోయి యీ 'నేను' సయితము లేనియపుడు జగన్మిథ్యాత్వమును మాత్రము నేనెట్లు స్థిరీకరింపఁగలను? అపుడానందము - ఆనందము.

అమ్మా! కరుణామృతస్నానము చేయించుటే కాదు. నన్ను స్థిరునిగాఁజేయుము. సాధకుఁడీమాట ప్రత్యేకించి చెప్ప నక్కరలేదు. ఏలన నానందాభిషేకఫలము స్థిరత్వమే. అమ్మ పాదములయందు నాత్మార్పణము చేయువాని కిదియే ఫలమని శ్రీశంకరాచార్యులు మున్నగు సాధకోత్తములే యనిరి.

''ఈశత్వనామకలుషాః కతి నామ సంతి|

బ్రహ్మాదయః ప్రతిభవం ప్రళయాభిభూతాః|

ఏక స్సఏవ జగతి స్థిరసంస్థఆస్తే

యః పాదయోస్తవ సకృత్ప్రణతిం కరోతి||

(శంకరాచార్యకృత పంచదశీస్తవము)

ప్రళయాభిభవ మేనాఁడును లేనివాఁడు స్థిరుఁడు. అట్టివాఁడు శివుఁడొక్కఁడే. శివస్వరూపుఁడై యుండుట యనఁగా శివైక్యము నొందినవాఁడై యుండుట. సారాంశ మేమనఁగా మూలాధారమునుండి మహాలక్ష్మిని సహస్రారమునకుఁ గొనిపొఁగల్లు సాధక పుత్త్రులకు స్థిరత్వమనెడి ముక్తస్థితి తప్పకగునని భావము.

శ్లో|| దీనస్య మస్తకే హస్తం మమ త్వం కృపయార్పయ|

ఆద్యాది శ్రీర్మహాలక్ష్మి విష్ణువామాంక సంస్థితే||

తా|| ఓమహాలక్ష్మీ! ఆద్యులనంబడువారికి నాదివైన దానా! విష్ణు నెడమతోడయందు స్థిరముగా నున్న దానా! దీనుఁడనైన నామస్తకమందు నీచేతిని దయతో నుంచుము.

వి|| అమ్మా! మహాలక్ష్మీ! ఆద్యులనఁబడు బ్రహ్మాదులకును నీవాదివి. అనఁగా బ్రహ్మవిష్ణ్వాదులకంటెను ముందున్న దానవు నీవే. ఆదిశక్తివైన నీవల్లనే బ్రహ్మాదులు గలిగిరి. అనఁగా సృష్టిస్థితిసంహారతిరోధానానుగ్రహములనెడి శక్తులు నీవియే. ఈశక్తులను బురుషులుగా నెంటి వానిని బ్రహ్మ విష్ణురుద్రమహేశ్వరసదాశివులని పేర్కొనిరి. ఈయెల్లరకును నీపంచవిధప్రధానశక్తులకును నాదిమూలమైనదానవు. నీవు సర్వకారణభూతశక్తివి. నీపేరు శ్రీ. శవర్ణ రేఫేకారములు చేరి యైనమాట శ్రీ. శవర్ణము ఆనందమును, రేఫము తేజోవాచకము జ్ఞానమును, ఈకారము శక్తిని దెల్పును. కాఁగా జ్ఞానానందమయసర్వకారణభూతశక్తివి. కనుకనే యెల్లరు నిన్నాశ్రయింతురు. ''శ్రయతే సద్వై రితిశ్రీః'' పైని జెప్పిన బ్రహ్మాదులే కాదు; సర్వదేవమనుష్యాదులును నిన్నే యాశ్రయింతురు. కనుక నీవు శ్రీవి. నీవు విష్ణువు నెడమ తొండయందు సుస్థిరముగా నుండుదానవు. విష్ణువనఁగా నంతట వ్యాపించియున్నవాఁడు. వెలిని నామరూప క్రియాసహిత సకలజగదాకరాముతోను, లోన జ్ఞానరూపమున నాత్మరూపమున నన్నిటను నేననుచు వ్యాపించి యున్ని వాఁడునైన పరమాత్మతో నేనాఁడును విడియుండని వాఁడునైన విష్ణువి వామాంకమందు (ఎడమ తొడయందు) నిల్చుదానవు. లేదా విష్ణుని సుందరమైన యంకముగా (చిహ్నముగా) నున్నదానవు. అనఁగాఁబరమాత్మతో ననపాయినివి. విడి యుండని దానవు. స్థిరవై యుండుదానవు. మఱియు విష్ణుని వెడలఁగ్రక్కు (స్వరూపమును వెలిని బెట్టు) లక్షణముగా నున్నదానవు. అనఁగా విష్ణుతత్త్వము నెల్లరకుంజెప్పువచ్చును. అట్టి మహాలక్ష్మీ! దీనుఁడనైన, జ్ఞానదరిద్రుఁడనైన, దుర్గతిలోఁబడిన నాతలపైని దయతో నీచేతి నుంచుము. అనఁగా నాసహస్రారమును జేరుము. సాధకుఁడు సహస్రారమందు కుండలినీపరాశక్తిస్వరకూపశ్రీదేవి చేరినపుడు% సకల దారిద్ర్యములు తొలఁగి సంసారదుర్గతి లేక ముక్తుఁడగు నని భావము.

శ్లో|| భవభీతి పరిత్రస్తభక్తత్రాణ పరాయణ|

ప్రత్యక్షం కురు రూపం మే రక్ష మామ్‌ శరణాగతమ్‌||

తా|| సంసాగరభయముచే నుద్వేగము నొందిన బక్తులను రక్షించుటే పనిగాఁగలదానా శ్రీదేవి! నాకు నీరూపమును సాక్షాత్కరింపఁజేయుము. రక్షణమునకై వచ్చిన నన్ను రక్షింపుము.

వి|| భవభీతి పరిత్రాణమునకైన (సంసారభయము వలన రక్షణమునకైన) యుపాయము కుండలినీ పరాశక్తి రూప శ్రీదేవిని "ఆయాతు వరదా దేవి అక్షరం బ్రహ్మసమ్మితం" అనుచు మంత్రజవస్తవసంకీర్తన నాదులతో గానము చేయువారికని రక్షించునది. కనుక నే సార్థకగాయత్రీ నామముచే నొస్పు శ్రీదేవిని బిలిచి మేరూత్తమశిఖరమనఁబడు సహస్రారమునకు మూలస్థానమునుండి లేవఁదీసి తెచ్చిస్వరూపదర్శనము చేయింపుమని ప్రార్థించుటే యని సాధకుఁడు మున్నెన్నిసారులో సూచించెను. ఇప్పుడును నదే ప్రార్థనము. ఆప్రార్థనము తప్పక చెల్లించెను. ఇప్పుడును నదే ప్రార్థనము. ఆప్రార్థనము తప్పక చెల్లించుటే శ్రీదేవి శీలము. స్వరూపదర్శనమనఁగా నేమి? దాని ప్రత్యక్షత యనఁగా నేమి? శ్రీదేవీస్వరూపము సత్యజ్ఞానానందములే. అద్వయ బ్రహ్మస్వరలూపములేయైన పంచకోశాంతరస్థితయై, "అహం" (నేను) అనుపేర వెలయుచున్నది. కావున "నేను" అనుదాని స్వరూపము సైతము సత్యజ్ఞానానందములే కావలయును. వాని నీ నేనుఅనుబవింపవలయును. అదేప్రత్యక్షత. సాక్షాత్కారము. "అహం సత్యం" "అహం చిత్‌" "అహమానందః" - అని తెలిసికొని తన సత్యత్వ, చిత్త్వ (జ్ఞానస్వరూపత్వ) ఆనందత్వముల ననుభవింపవలయును. అనఁగా సత్యప్రతిష్ఠితుఁడును, చిత్ప్రతిష్ఠితుఁడును, నానందప్రతిష్ఠితుఁడును గావలయును. ఈవిషయమున నావ్రాసిన "మాతృబోధసంగీతము" పేరి చిన్న పుస్తకమును జూచునది. ఈ మహోపకరాము గాయత్రీదేవి కృపచేతనే కావఆయును. ఆగాయత్రీదేవి సాధకుని మస్తకముందు హస్తముఁజేర్చినపుడే తప్పకగును. వేగముగా నగును. ఈనిస్ఛయముతోనే సాధకపుత్త్రుఁడు తన యథార్థమైన యానందస్వరూపము ననుభవింపఁగోరి "అమ్మా! నాశిరమున నీ చే యుంచుము" అ%ి మాటిమాటికిఁగోరుచున్నాఁడు "అమ్మా! నేను శరణాగతుఁడను. అనఁగా రక్షణమునకై వచ్చినాఁడను. శరణమనఁగా నిల్లు., ఇంటికి వచ్చినాఁడను. సత్యజ్ఞానానందములే నాస్వరూపమని యెఱింగికొన్నాఁడను. సాధకపుత్త్రుల కీయుపకారము చేయఁగరుణించుట పుత్త్రస్నహముగ్ధవగు నీపని. భవభీతిపరిత్రస్తులైన భక్తులను రక్షించుటే పనిగాఁగల దాన" వని మఱియొక్క సారి ఘోషించినాఁడు.

శ్లో|| సర్వరాజగృహాల్లక్ష్మీ! సమాగచ్ఛ గుణాన్వితా|

స్థిత్వాతు పురతో మే7ద్య ప్రాసాదేనాభయం కురు||

తా|| లక్ష్మీదేవీ! సర్వరాజగృహములసముదాయము నుండి నీవు గుణములతోఁగూడినదానవై రమ్ము. వచ్చి, నాయెదురు నిలిచి నేఁడు (ఇపుడు) దయతోఁబ్రసన్నవైనా కభయ మిమ్ము.

వి|| భక్తుల నొకకంట లక్ష్మించుదానా! భక్తులచే లక్షింపఁబడుదానా! రాజగృహసముదాయమునుండియనఁగా రాజగృహసముదాయమును మీరి యనఁగా రాజులనఁబడెడి( రాజులుగానెన్నఁబడిన) బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివుల నివాసములైన మూలాధారాది చక్రములను దాటి నీకు సహజగుణములైన దయళుత దీనరక్షాపరాయణత, అర్జవము, మార్దవము, పుత్త్రస్నేహవిమూఢతమున్నగు కుణములతోఁగూడినదానవై వచ్చి నీయెదుర నిలిచి యనఁగా నాజ్ఞయందు నిలిచి క్రమముగా సహస్రారమును జేరి నాకభయమిమ్ము. నన్ను నిర్భయమునిగాఁజేయుము. ఆనందమయునిగాఁజేసి జనమరణరూపసంసారపీడ తొలఁగింపును.

"గుణాన్వితా" యను చోట నీగుణములతోఁగూడిన దానవైయనఁగా నీయభ్యాసముతోఁగూడినదానవై భక్తులచేఁబ్రార్థితవైచిమ్మఁబడిన బాణమువలె మూలాధారాదులను వీడి యాజ్ఞకును, నాజ్ఞను వీడి సహస్రారమునకును, బోవుటే నీయభ్యాసము. అదే నీగుణమనియును జెప్పికొనవచ్చును.

శ్లో|| ప్రసీద మే మహాలక్ష్మి సుప్రసీద మహాశివే|

అచలా భవ సుప్రీత్యా, సుస్థిరా, భవ మద్గృహే. 9

తా|| ఓమహాలక్ష్మీ! నాకుఁబ్రసన్ను రాలవగము. మహాశివా! నాయెడ మిగులఁబ్రసన్నవగుము. మిగులఁబ్రేమతో నాగృహమందుఁజలనము లేనిదానవైయుండుము. మిక్కిలి స్థిరవై యుండుము.

వి|| పరమపూజ్యమైన లక్షణములు కలదానవును, మహచ్ఛబ్దవాచ్యుఁడైన నారాయణునిచే లక్ష్మింపఁబడుదానవును కనుక నీవు మహాలక్ష్మివి. నీవు మహాశివవు. మిక్కిలి మంగళస్వరూపవు. కనుకను, మహాశివుని శక్తివి కనుకను, శివాదిక్షితిపర్యన్తమైన ముప్పదియారు తత్త్వములకు మూల మైనవాఁడగు పరమాత్ముని (పరమశివుని) శక్తివి కనుకను మహాశివవు. మిక్కిలి పూజ్యమైన శివము మంగళము. అదియే మోక్షము. శివశక్తులయేక్యమే మోక్షము. అదే స్వరూపముగాఁగలదానవు. కనుకను నీవు మహాశివపు. "శివశ##క్తైక్యరూపిణీ" (లలితా సహస్రము). అఖండజ్ఞానస్వరూపిణివి. నాయెడల సర్వదా ప్రసన్నురాలవగుము. నిర్వికారబ్రహ్మానందస్వరూపిణివి కనుకను నీవు మహాశివవు. నీవే యాత్మార్పణశీలురైన భక్తులయెఁడబ్రసన్నవు కాకున్న మాకు ముక్తి యెటులబ్బును? కనుకనే నీప్రసన్నతకొఱకే పలుమఱు ప్రార్థించుచున్నాను.

అమ్మా! నాయింట నతీవప్రేమతోఁజాంచల్యము లేకుండుము. మిక్కిలి నిల్కడ గలిగియుండుము. నాహృదయమందుఁజాపల్యమును వీడి నిలువుము. చాంచల్యము, అశ్థిరత్వముగలవానినే యచలులై స్థిరులై యుండుఁడని కోరుట. సాధకుఁడు అమ్మ యుచ్చారము మెఱపుఁదీవలెనే సాగుట ననుభవించినవాఁడు కావుననే యతిప్రేమతో నిశ్చలవైయుండమని ప్రార్థించుచున్నాఁడు ఈచాంచల్యము. శ్రుతి యందును సుప్రసిద్ధమే. " విద్యుల్లేఖేవ భాస్వరా" కాంతిమత్త్వమే కాక చంచలత్వము సహితము మెరపుఁదీవ లక్షణమే. కావున సాధకుఁడు నిత్యము నమ్మయొక్క స్థిరత్వమును బ్రార్థించుచునే యుండును.

శ్లో|| యావత్తిష్ఠంతి దేవాశ్చ యావత్త్వన్నామ తిష్ఠతి|

యావద్విష్ణుశ్చ యావత్త్వం తావత్కురుకృపాంమయి||

తా|| అమ్మా! మహాలక్ష్మీ! ఎంతదాఁక దేవతలుందురో, యెంతదాఁక నీపేరు నిల్చి యుండునో, సర్వవ్యాపక శీలుఁడైన నీభర్తవిష్ణు వెంతవఱకుండునో, నీవెంతవఱకుందువే, యంతదాఁక నాయెడ దయఁజూపుచునే యుండుము.

వి|| అమ్మా! శ్రీదేవి! దేవత లెంతదనుక నుందురో-వేలుపు లమరులు. వారు లేక పోవు టెప్పుడు? అనఁగా శాశ్వతముగా నన్నుఁగరుణింపుము. పక్షాంతరమున దేవులనఁగా నఖండచైతన్యస్వరూపిణియైన పరాశక్తియొక్క ఖండఖండచైతన్యవర్గమే. వారే యింద్రియాధిష్ఠానదేవతలు. వారుండునంతదాఁక ననఁగా నాయింద్రియములు నశింపకుండు నంతదనుఁక, ననఁగా నీశరీరమునుక మరణమనెడి యాఱవ వికారము రాకుండనంతదాఁక నని భావము.

నీపేరు లోకమున నిల్చియుండు నంతదాఁక లోకమందు శ్రీదేవి పేరుండకుండ టెప్పుడు? అనఁగా నమ్మజగదాకారముతోను, నుపాధులందు 'నే' నను పేరితోను, శ్రీదేవెలయుచున్నది. కనుక "నేను" అనెడి విస్తువుశరీరమందు నిల్చియున్నంతదాఁక నని భావము.

"యావద్విష్ణుశ్చ తిష్ఠతి" -సర్వవ్యాపకశీలుఁడైన పరమాత్మయే విష్ణువు. అనఁగా వెలినినామరూపక్రియా సహితజగదాకారముతోను, లోన "నేను" పేరితో విమర్శశక్తిస్వరూపముతోను నుండువాఁడు పరమాత్మ. అంతఁడు లేక పోవుటెప్పుడు? అనఁగా శాశ్వతముగా నని భావము.

"యానత్త్వం తిష్ఠసి" నీవెంతదాఁక నుందువో పరమాత్మశక్తియైన శ్రీదేవి లేకపోవుటెప్పుడు? పరమేశ్వరునితో శ్రీదేవియనపాయిని. ఏనాఁడును విష్ణు నెడఁబాయనిది. బ్రహ్మసమ్మితయైన శ్రీమాత విష్ణువున కభిన్న. "శక్తిశక్తిమతో రభేదః" - అని శ్రుతి. విష్ణువు వలెనే నిత్య, "ఉభావప్యనాదీ, ఉభావప్యనంతౌ, ఉభావపినిత్యౌ" -శ్రుతి. ఇరువురును సనాతనులు. కనుక శాశ్వతముగా నని భావము.

శక్తి శక్తిమంతులు సత్యులు. పైని జగత్తుండునంత దాఁక ననుమాటయందు జగత్సత్యత్వము దోఁచును. జగత్తుసత్యమాయను శంక వొడమవచ్చును. సత్యమే. "బ్రహ్మసత్యం జగత్సత్యం" అనవలసినదే. "జాయతే గచ్ఛతే ఇతి జగత్‌." రాకవోకలుచేయుచున్న దే కాని జగత్తు లేకపోవుట లేదు. "సర్వం ఖల్విదం బ్రహ్మ" అనునప్పుడును నీజగత్తు నకు సత్యత్వకల్పనముతప్పదు. దీనికి సత్యత్వమును నిరసించి నప్పుడు బ్రహ్మమునకునుసత్యత్వము లేదనిచెప్పవలసినవచ్చును అదతి యసంభవము. లయకాలమందుఁబరమాత్మలో బీజాకారమున నుండునేకాని; లేకపువోట లేదు. తిరోహితమైయుండును. మయూరాండరసన్యాయముగ నెక్కాలమందును నిల్చియుండును. కనుక శైవాగములు జగత్సత్యత్వమునే ప్రతిపాదించినవి. సత్యమైన బ్రహ్మము నామరూప క్రీయసహిత జగదాకారపరిణతి నొందినదేకనుక జగత్తు సత్యమే. బ్రహ్మము తన జగదాకారమున సంహరించు కొనును. కాని, బీజరూపమున నయ్యది లేకపోలేదు. మయారాండము (నెమలిగ్రుడ్డు) నందు రసము మఱలఁజిత్రవిచిత్రవర్ణములతో సావయవముగా వెలికి వచ్చునట్లే సృష్టికాలమందు బ్రహ్మము నామరూపక్రియాసహితచిత్ర జగత్తుగాఁబ్రకాశించును సాకారము, నిరాకారము నురెండవస్థలే కాని దాని సత్యత్వమునకు భంగము లేదు. "బ్రహ్మ సత్యంజగన్మిథ్యా" -యను మాటకు గతి యేమి? యనవచ్చును. ఈవాక్యము శ్రుతులందుఁ గానరాదు. సరేవంద్రియగోచరమైనప్పుడును గాకున్నప్పుడును నున్నదే కాని, లేకపోవుటలేదు. కనుక జగత్తు సత్యమే. శ్రీశంకరాచార్యుల యిమ్మాట- వారు తురీయతురీయాతీతావస్థలోఁగొంత సేపుండి మఱల గదిగివచ్చినప్పు%ు వ్రాసి నస్వానుభవమును దెలిపినది. కనుక" యావత్త్వన్నామతిష్ఠతి" యని శ్లోకమందుఁజెప్పఁబడినది. నామమున్నప్పుడురూపముండును. ఈ రెండు నున్నప్పుడు క్రియతప్పదు. కనుక నామరూపక్రియాసహితవై యనఁగా నామరూపక్రియాసహిత జగదాకారవై నీవుండనంతదాఁక యని వ్యాఖ్యానింపక తప్పదు.

శ్లో|| చాంద్రీకలా యథా శుక్లే వర్థతే సాదినేదినే|

తథా తయా తే మయ్యేవ వర్థతా మబివర్థతామ్‌|| 92

తా|| అమ్మా! మహాలక్ష్మీ! ఆచంద్రకళ మాసశుక్లపక్షమందు దినముల వరుస నెట్లు పెంపొందునో యటులేనీనెనరు నాయందే మఱిమఱిఁబెంపొందుఁగాక!

వి|| ఇచట "సాచాంద్రీకలా" ఆచంద్రకళ యనునపుడు మున్ను సుప్రసిద్ధముగా లోకమెఱింగిన చంద్రకళయను నర్థముండఁగాఁబరమాత్మకంటె వేఱుకానిపరమాత్మస్వరూపమేయైన 'చంద్రకళ' యనియు నర్థము చెప్పుకొనవలయును. చాంద్రీ=చంద్రసంబంధమైన.'చది'-'రకి' యను ధాతువువలన (చది=ఆహ్లాదనే; రకి=దీప్తౌ) ఆనందము, జ్ఞానము నను నర్థము లిచ్చు రెండు ధాతువులవలనఁ జంద్ర శబ్ద మేర్పడినది. దీప్తి యనఁగా నిచట జ్ఞానము. జ్ఞానానుదములే స్వరూపముగాఁగల బ్రహ్మముయొక్క కళ, అనఁగా శ్రేష్ఠశక్తి. ఈకారము కామకళావాచకము. శ్రీసూక్తమందు "పద్మినీం ఈం శరణమహం ప్రపద్యే" యను హక్తిలో ఈకారముచే లక్ష్మియనెడిబ్రహ్మశక్తియే చెప్పఁబడినది.

"తామీకారాక్షరోద్ధారాం సారాత్సారాం పరాత్పరామ్‌ | ప్రణమామి మహాదేవీం పరమానందరూపిణీమ్‌" -అని మాతృకాస్తుతియందుఁజెప్పఁబడియుండుటచే మహాదేవుని శక్తి సారాత్సారము, పరాత్పరము, పరమానందమే స్వరూపముగాఁగలది యని విస్పష్టమగుచున్నది. శ్రీశబ్దవాచ్యయైనయాబ్రహ్మకళ పరమానందస్వరూప శ్రీవిద్యయందీ చంద్రకళను సాదాకళ, బహ్మకళ, మహావైసర్గీకీకళ, యనుపేళ్ళు సుప్రసిద్ధములు. ప్రతిపదాదిపూర్ణిమాంతముగా దినముల వరుసన బైకిఁబదునేనుకళలు విడువఁబడుచుండును. కనుకఁ జంద్రుని పరాత్పరకళ##యే (శక్తియే) జగద్విసర్గము చేయుచుండును. కనుక "మహావైసర్గికీ" యనఁబడెను. దినదినక్రమవిసర్జతములగు పదునేను కళలు నితక్యాకళలనియు, శ్రీకళ యనఁగాఁ బదునారవకళ మహానిత్యయనియుఁ జెప్పఁబడినది. శవర్ణ, రేఫ, ఈకారములు చేరి యైనది శ్రీశబ్దము. శవర్ణ మానందమును, రేఫము తేజస్సును, ఈకారము పరమాత్మ కళను దెలుపును. జీవించియున్న ప్రత్యేకమనుజనామమునకు ముందుగా శ్రీశబప్దము చేర్చఁబడును. బ్రహ్మముకంటె వేఱుగాని శ్రీదేవియే సర్వశరీరములందు 'నేను' అను పేరితో వెలయుచున్నంతకాలము నా మపూర్వమందు శ్రీశబ్దము చేర్చి గౌరవించుటయే గాక, "నేను" "అహం" అను పేరితో వెలయునది బ్రహ్మమే సుమాయని మహావాక్యార్థబోధము విస్మృతము కాకుండఁ జేయుటకే యొండొరుల నామములను శ్రీశబ్దపూర్వముగానే వ్యవహరింతురు. 'తత్త్వమసి' నీవు తచ్ఛబ్దవాచ్యయైన బ్రహ్మమవేయైయున్నావు. "అహంబ్రహ్మాస్మి" నేను బ్రహ్మమనే యైయున్నాను. అన మేధయెప్పటికి కప్పుడే జాఱిపోవుచుండును. "బ్రహ్మాహమస్మీతి స్మృతిరేవ మేధా" యని శంకరులునిర్వచించిరి. సర్వవిధోపాసనము లీతెలివి తొలఁగిపోకుండ నిల్చుటచకే పుట్టినవి. జగద్విసర్గమ %ుచేయు మహాదేవశక్తిని దెల్పువర్ణము%ు మంత్రశాస్త్రమందు ఆకార, ఈకార, ణకారములు. "శక్తిః కుండలినీతి యా నిగదితా '__' సంజ్ఞా జగన్నిర్మాణ సతతోద్యతా" (త్రిపురరాసారము) మహాదేవీశక్తియే చంద్రకళ##యే జగన్మిర్మాణాది సర్వకారణభూత యని యచాంద్రీశబ్దమందలి తుది"ఈకారము" బోధించును. కనుకనే శ్రీవిద్యకు "ఈకారవాచ్య చంద్రకళావిద్య" యని వేదతంత్రాదులందు సుప్రసిద్ధము. అది నాయందు దినదినము వర్థిల్లుఁగాక యని ప్రార్థింపఁగోరి చాంద్రీకళావృద్ధిని చాంద్రీకళోపమానమునుసార్ధకముఁగాబెట్టెను.

మఱియు "మయ్యెవ" అనఁగా నాయందే యనుమాటయందలి సారార్థము నెఱుంగవలయును, సాధకుఁడీ మంత్రమందు శ్రీదేవికృప తనయందే వర్థిఁల్లుఁగాక! యనునపుడు తనయోగ్యతను (అధికారమును) విస్పష్టముగాఁజెప్పలేదు. శ్రీశంకరులు తమ పంచదశీస్తవమందు "అమ్మా! నీచూపులు నాపైనే పడుఁగాక! ఇతరునిపైఁబడకుండుఁగాక!" యనుచు నందులకై తనుకుఁగల యోగ్యతను గారణమును 'సరోరూపహాక్షి' అనునపుడు తామరలవంటి కన్నులు గలదానా! యనియే కాక "సరోరూహణ్యక్షోతీతి- సరోరూహక్షి" తామరలయందు వ్యాపించుదానా! యను నర్థమునఁబ్రయగించి మూలధారాది కులపద్మములయందమ్మనువ్యాపించునట్లు జేయఁదనకుఁగల సామర్థ్యము నఁనగాఁగులవిద్యోత్తీర్ణతను సూచించుకొనిరి. ఇచ్చట సయితము సాధకుఁడు "సా చాంద్రీ కలా యథా శుక్లే దినేదినే వర్థతే" అను దృష్టాంతమును జూపినాఁడు. ఈచాంద్రీకలోపమానము, పైని యథాశక్తి వివరింపఁబడినది. నీవు"బ్రహ్మసమ్మితవు" అనుచు నది దినదినాభివృద్ధి నొందుననుచు నీవే కామకళవని యుగ్గడించు నప్పుడు చంద్రఖండ మనఁబడు నాజ్ఞాదిసహస్రారాంతమైన భాగమున శ్రీదేవిని వెన్నెల వంటి కాంతి కలదానిఁగా సాక్షాత్కరించుకొన్నట్లును, నట్టి యోగ్యత తనకుఁ గలిగినట్లును, కులవిద్యోత్తీర్ణత తనకుఁగలిగినట్లును, మనకుఁ దెలియనును. కనుకనే "నీకృపనాయెడ మిగులఁబెంపొందుఁగాక! " అనఁగల్గినాఁడు. శంకరాచార్యులవారి "సరోరూహాక్షి" అను సంబోధనమందుఁదమ యోగ్యత నిమిడ్చి చెప్పినట్లే యీసాధకుఁడను మంత్రమందలిప్రథమపాదమునఁగలయుపమానమందే యిమిడ్చి నాఁడని యెరుంగునది.

ఇచ్చట శ్రీశంకరుల శ్లోకమునెత్తి చదువరుల తృప్తికై వ్రాయుచున్నాను. "సపత్కరాణిసకలేంద్రియనందనాని, సామ్రజ్యాదాననిరతాని సరోరుహాక్షి! తద్వీక్షితాని దురితాహరణోద్యతాని, మామేవ మాతరనిశం కలయంతు నాన్యం"

శ్లో|| యధా వైకుఁఠనగరే యథా వైక్షీరసాగరే|

తథా మద్భవనే తిష్ఠస్థిరం శ్రీవిష్ణునా సహ|| 93

తా|| విష్ణునితోఁగూడి వైకుఁఠనగరమందును, క్షీర సాగరమందునువలె నాయింటఁజిరముండుమమ్మా!

శ్లో||యోగినా హృదయే నిత్యం యథా తిష్ఠతి విష్ణునా|

తథా మద్భవనే తిష్ఠస్థిరం శ్రీవిష్ణునా సహ|| 94

తా|| మఱియు విష్ణువుతోఁగూడి యోగుల హృదయమందు నిత్యము నెటులుందవో యటులే నాయింటను స్థిరముగా నుండుము.

వి|| వైకుంఠనగరము-వికుంఠ యను నామె యందొకప్పుడు పుత్రత్వము నొందినవాఁడు కావున వైకుఁఠుండు. (విష్ణుఁడు) ఇది పురాణగాధానుసారముగానైన వ్యుత్పత్యర్థము. వైకుంఠని నగరము వైకుంఠ నగరము. మఱియు కుంఠయనఁగాఁగ్రియలయందు మందతకలది. వికుంఠయనఁగా గ్రియలయందు మందతలేనిది. సృష్టిస్థితిలయాదిక్రియలయందు మందత (అలసత) లేనిది వికుంఠ ఆమెయే శక్తి. ఆమె యందుఁబుట్టినవాఁడువైకుంఠుఁడు. క్రియామాంద్యము లేక సాగునట్టి సర్వవ్యాపకత్వశక్తిని బురుషుఁడుగా భవించినప్పుడదే వైకుంఠుఁడనఁబడను. జ్ఞానస్వరూపమున నంతట వ్యాపించు విశిష్ఠసక్తియే విష్ణుఁడు. "వ్యాప్నోతీతి విష్ణుః" ఆవైకుంఠుని నగరము పిండాండమనెనడి నాశరీరమునందు విష్ణువనెడి వ్యాపకశక్తితో నీవు చిరము నిలువుము.

క్షీరసాగరము-ఇది యమ్మ పుట్టినిల్లు; నివసించునిల్లు. పిండాండమందీవైకుంఠనగర మనాహతపద్మముగా నెన్నఁబడినది. మూలాధారాదిమణిపురాంతమైనది బ్రహ్మఖండము. మణిపురాద్యాజ్ఞాంతమైనది విష్ణుఖండము. ఈవిష్ణుఖండంమందలి ముఖ్యనగర మనాహతమనెడి హృదయపద్మము. ఇదే కాంచీక్షేత్రము. ఈహృదయపద్మవర్ణనము మంత్రపుష్పవర్ణనగ్రంథమందుఁజక్కఁగా జేయఁబడినది నాభికిఁదొమ్మిదంగుళముల మీదుఁగా బద్మకోశప్రతీకాశ##మై హృదయముండుననియుఁ దేజోమాలాకులమై విశ్వుఁడను నాత్మ కది నిలయమనియు, నధోముకముగా వ్రేలియున్న యాహృదయపద్మము మీది కొనను మిగుల సూక్ష్మమైన రంధ్రమున్నదనియు, దాని నడుమఁదేజశ్శిఖయున్నదనియు, నాశిఖామధ్యమునఁబరమాత్మ యుండుననియు, నతనికే బ్రహ్మ, విష్ణువు, శివుఁడు, ఇద్రుఁడు, అక్షరుఁడు, పరముఁడు, స్వరాట్టుమున్నగుపేళ్ల చెల్లుననియు, వర్ణింపఁబడినది. కనుకనదియే విష్ణుపురమనియు, వైకుఁఠపురమనియుఁ బేర్కొనఁబడుచున్నది. "తద్విష్ణోః పరమం" పదగ్‌ం సదా పశ్యంతిసూరయః" జ్ఞానులు విష్ణుని యాశ్రేష్ఠమైన పదము ననఁగా వ్యాపకశక్తినిఁజూచుదురు. అనఁగా ననుభవింతురు. అది 'పరమమ్‌' అనఁగా "పరం మాతీతి పరమమ్‌" -మోక్షము నిచ్చునది. కనుకఁబరమమము. కనుకనే యాత్మస్వరూపమున హృదయమందు వ్యాపించినయున్న "సః" (వాఁడు) ఆత్మగానే "నేను" అను పేరితో నున్న వాఁడని యనుభవింతురని భావము.

మఱియు సహస్రారమునకు యోగశాస్త్రముల యందును. బలుతంత్రము యందును వైకుఁఠము, క్షీరసాగరము, కైలాసము, బృందావనము ననుమాటల వ్యవహారము సుప్రసిద్ధము. ఏక్రియందునుమొరవోని యావిష్ణుశక్తి సహస్రారమునకు వ్యాపించునపు డాస్థానమే వైకుఁఠనగరమనగును. అది పరమపదము. ఆవ్యాపకశక్తి ననుభవించు సూరులు (విద్వాంసులు) పరము (మోక్షము) నొందుదురు. కనుకనేయదిపరమపదము. ఇఁక క్షీరసాగరము లక్ష్మి వొడమినచోట. క్షీరమమృతముగాను నమృతము క్షీరముగాను గ్రంథములందు వర్ణింపఁబడుట మనము పలుతావులఁగనుచుందుము. రసము, అమృతము, సుధా-యను శబ్దములతో నానందము వర్ణింపఁబడుటయు మన మెఱుఁగుదుము. "రసోవైసః" "తదమృతం" అని పలుశ్రుతులయందును గానవచ్చును మఱియు క్షీరాబ్ధి మథన కథారహస్యార్థమందుసహస్రారమేక్షీరాబ్ధి, మఱియు "సుధాసింధోర్మధ్యే" యనెడి సౌందర్యలహరి శ్లోకపు రహకస్యార్థమందుసహస్రారమేసుధాసింధువనియుగ్గడింపఁబడనది. కావన క్షీరసాగరమందునునప్పుడు సహస్రారమనియే భావము. క్షీరసాగరమందువిష్ణువు శయనించుట. జ్ఞానానందస్వరూపపరమాత్మ విష్ణు వటనుండునపు డతనితో నిత్యానపాయినియైన పరాశక్తియు నుండుట సహజము కనుక విష్ణువుతో సుస్థిరముగా నుండునట్లు నాభవనమందు ననఁగా నా సహస్రారమందు నిలువుమని సాధకుఁడు ప్రార్థించుచున్నాఁడు.

ఇంతే కాక యోగుల హృదయమందు విష్ణువుతోఁ గూడిననీవు నిత్యము నెట్టులుందువో, యనుటలోభావమేమి? యోగులనఁగా 'నేను' అనెడి యల్పాహంతను, "సః" (వాఁడు) అనెడి పూర్ణాహంతలోఁజేర్చి వేయువారు వీరే సాధకులు. సర్వకాల సర్వావస్థలయందును బరమాత్మతో భిన్నతనెన్నక యాత్మ నర్పించివేయుటే సాధనము. సర్వహృదయములయందును బరమేశ్వరుఁడున్నాఁడు. కాని యాయుండుట ''నే'' నను పేరితోనే సర్వదా యున్నాఁడు. ఈవిధముగా సర్వవ్యాపకపరమాత్మతత్వము నెఱింగి నేను నేనైయుండుటే యోగము. ఇది యెఱుంగకుండుటే మనము పరమాత్మకుఁజేయు నవజ్ఞ. కనుక నే భగవంతుఁడు గీతయందు "అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం" -అని "నేను" అనెడి వస్తువు "పరాహంతాస్వరూపుఁడునైననాతో భిన్నముగా నెన్నువారే ముఢు" లనెను. "ఇతఃకో7న్వస్తిమూఢాత్మాయస్తు స్వార్థే ప్రమాద్య" తన ప్రయోజన మందు సైతము ప్రమాదపడువానికంటె మతిపోయిన వాఁడు (ముఢుఁడు) మఱవ్వఁడు? మనువుసర్వేంద్రియజ్ఞానసంపూర్ణమైన యీమానుషశరీరముతో వచ్చినప్పుడే తన్నుఁదా నెఱింగికొని యనఁగాఁ'అహం బ్రహ్మాస్మి'యనెడి మేధాసిద్ధినొంది తరింపనివాఁడే ముఢాత్మఁడు. అట్టి మౌఢ్యము నన్నంటకుండ నీవాత్మజ్ఞానస్వరూపమున నాహృదయమందు సదా నిల్వుమని సాధకపుత్రుఁడు ప్రార్థించుచున్నాఁడు. నా ''సాధనసామాగ్రి" యను గ్రంథమందు "యోగమనమేమి?" యను శీర్షికక్రింద వివరణమును జూచునది.

శ్లో|| నారాయణస్య హృదయే భవతీ యథాస్తే

నారాయణో7పి తవ హృత్కామలే యథాస్తే|

నారాయణస్త్వమపి నిత్యముభౌతథైవ

తౌతిష్ఠతాం హృది మమాపి దయాపతి శ్రీః||95

తా|| దయావతీ! శ్రీదేవీ! నారాయణుఁడును నీవును నొండొరుల హృదయకమలములయందు స్థిరముగా నున్న యటులే మీరుభయులును నా హృదయమందు స్థిరముగా నుందురు గాక!

వి|| తమత యబిష్ఠసిద్ధికి నెల్లరు నిన్నేయాశ్రయింతురు. కనుక నీవు శ్రీదేవివి. జగజ్జననివి. కనుక నిరుపాధికదయాళుత్వము నీకు సహజము కనుక నీవు దయావతివి. నరుల (సర్వభూతముల ) సముదాయమే నారము, అది అయనముగా (స్థానముగా) నున్నవాఁడు నారాయణుఁడు. అనఁగా అన్నిటియందును ఆత్మయను పేరితో వ్యాపించియున్న వాఁడు నారాయణుఁడు మఱియు నారము (జ్ఞానము) అది ఆయన ముగా (తన్నుఁజేరు దారిగా) గలవాఁడు. అనఁగా "అహం బ్రహ్మస్మి" "తత్త్వమసి" మున్నగు మహావాక్యముల యర్థజ్ఞానమే జ్ఞానము. అట్టి స్వరూపజ్ఞానందు నిల్చుటయే భగవంతుని జేరు దారి. కనుకనే భగవంతుఁడు నారాయణుఁడు. అట్టి నారాయణుని హృదయమందు నీవును నీ హృదయమందు నారాయణుడుస్థిరముగా నిల్చి యుందురట. అవును. పురుషుఁడు ప్రకృతిని, బ్రకృతి పురుషుని విడిచి యుండవు. శక్తివైన నిన్ను సర్వదా చేర్చుకొని యుండకున్నఁబురుషుని యాశయములు నెఱవేఱవు. నీప్రాపేలేకున్నచో, నిన్ను గుండెను సర్వదా కట్టుకొనకున్నచో, అతని కెందునన గర్తృత్వమే యుండదు. కదలనైనను గదలలేఁడు. "శివః శక్త్యాయుక్తోయది భవతిశక్తః ప్రబవితుం,న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి" (సౌందర్యలహరి) క్రియావతివైన నీవు సృష్టిస్థితిలయాదిప్రకృష్ఠకృతుల యందే పరాయణవై యుందువు. అలసత యణుమాత్రము లేక పురుషునిచేఁగృతులు జేయించుచునే యుందువు. ఈ విధముగా శక్తశక్తిమంతులైన మీకు అనినాభావసంబంధమే కాక అభిన్నతయుఁబ్రత్యక్షము. "శక్తిశక్తిమతో రభేదః" శ్రుతి. మీరు నారాయణీ నారాయణులు. ఆశ్రయించిన వారికి ఆత్మజ్ఞానప్రదానము మీశీలము. ఆత్మపేరితో నుపాధి యందు నిల్చిన "నేను నీవే" యనెడి జ్ఞానము నాయందు నిత్యముగా దయతో నిల్పుమనియు, అది తక్క మిమ్ముఁజేరు దారి మఱియొకటి లేదనియుఁజెప్పికొని సాధకఁడు ప్రార్థించుచున్నాడు.

శ్లో|| విజ్ఞానవృద్ధిం హ-దయే కురు శ్రీః

సౌభాగ్యసిద్ధిం కురు మే గృహే శ్రీః|

దయాసు పుష్టిం కురుతాం మయిశ్రీః

సువర్ణవృద్ధిం కురు మే కరేశ్రీః|| 99

తా|| శ్రీదేవీ! నాహృదయమందు విజ్ఞానమును బెంపొందింపుము. నాయింట సౌభాగ్యము సిద్ధింపజేయుము. నా యందు నీదయను బెంపోందింపుము. నాచేత సువర్ణమును బెంపొందింపుము.

వి|| శ్రీదేవీ! యని పిలిచి ప్రార్థనరూపకమగు నీశ్లోకమందుఁదనలో విజ్ఞానమును, సౌభాగ్యమును, దయను, సువర్ణమును బెంపొందింపుమని కోరికొనుటచేఁదాఁజేసిన సాధనమువలన (సాధనఫలముగా) అవన్నియు నింతో యంతో లభించి యున్నను, ఆయుదృచ్ఛాలాభముతో సంతుష్టినొందక వానిని బొంపొందింపు మనుచున్నాఁడు. వెనుకటి శ్లోకములయందుఁగొన్నిఁట సాధనచరమఫలమైన మోక్షమునే కోరినావఁడు మఱల నిపుడు విజ్ఞానాదుల పెంపునుగోరుట యసమంజసముగాఁదోచును. కాని శరీరధారియైవచ్చి జాగతిక సంస్కారసంపర్కము పూర్తిగా విడిపోకున్నవాఁడు భగవతి నిటుర్థించుచుండుటయు నొక సాధనవిశేషమే యని సమర్థించుచుందము. విజ్ఞానమనఁగా శాస్త్రజ్ఞానము. శాస్త్రజ్ఞానము దోడ్పడుచుండును కనుక దానిని నాహృదయమందుఁబెంపొందింపుమని కోరికొనుట యుక్తమే.

మఱి సౌభాగ్యమన నేమో మునెన్ని సారుల వివిరించితిమి. ఆసర్వత్వాదిశక్తులారును గలదియే సౌభాగ్యవతి శ్రీదేవి. వాని సిద్ధి సక్వసాధకాశ్రయమైన శ్రీదేవివలననే కావలయును. కనుక తనగృహమందు అనఁగా శరీరముతో నున్న తనలో వాని సద్ధి గుర్తింపఁబడినపుడు సర్వజ్ఞత్వాది షడైశ్వర్యధామయైన శ్రీదేవితోడి యైక్యము సుగమమని యోఱింగినవాఁడు కావుననే సౌభాగ్యసిద్ధిని గోరినాఁడు.

అమ్మా! నాయందు నీవు దయ చూపుచునేయున్నావు. కావుననే నాయందు విజ్ఞానసౌభాగ్యాదులు కొంతవట్టు నాకనుబూతములుగానున్నవి. నీవు నాయందు దయను బోషించినచో వలసినంత యైశ్వర్యవృద్ధి నాయందగునను విశ్వాసముతో దయాపుష్టి నర్థించుచున్నాఁడు.

శ్రీ దేవీ! నాచేతియందు సువర్ణవృద్ధినిజేయుము. శాస్త్రజ్ఞానాదులను గోరినవాఁడు తుచ్ఛమైన బంగారును గోరఁడు. కావన నిచట సువర్ణమనఁగా శ్రేష్ఠమైనస్తుతి. స్తుతి బ్రహ్మచర్యము, జ్ఞానము, అనువానిలో ఒకటిగాని, మూడునుగాని కోరుకొనును. మున్ను దాఁగోరిన మోక్షము నకుఁ బరికరము లివియే. అమ్మను జక్కఁగా స్తుతించునేరపు మొదటిది. అమ్మ స్తోత్రప్రియ. బ్రహ్మసమ్మితయైన బ్రహ్మాభిన్నయైన శ్రీదేవియందే చరించుట బ్రహ్మచర్యము. సర్వము అనఁగాఁదానును దనకంటె వేఱుగాఁదోఁచు జగత్తును శ్రీమయమే, బ్రహ్మమయమే యనెడి తెలివితో వర్తించుటయేవర్ణము .అదే బ్రహ్మచర్యము. ఆతెలివిని బెంపొందించి అది తనయదీనమందు నిల్పుమని కోరుటయే నాల్గవ యర్థము (కోరిక)

శ్లో|| నమాంత్యజేథాః శ్రితకల్పవల్లి!

సద్భక్త చింతామణి కామధేనో!

విశ్వస్య మాతర్భవ సుప్రసన్నా

గృహేకళ త్రేషు చ పుత్త్రవర్గే|| 9

తా|| శ్రీదేవీ! నీవు నన్ను విడువకుమా, నీవు నీయాశ్రితులయెడఁగల్పలతవు. భక్తులయెడఁజింతామణివి. కామధేనువవు. విశ్వమును గన్నతల్లివి. నా ఇల్లు ఇల్లాలు బిడ్డలు అనువారియెడ సుప్రసన్నవగుము.

వి|| సాధకుఁడు శ్రీదేవి యాశ్రితపక్షపాతిని యని కడునమ్మియున్నవాఁడు. కనుకనే యాజ్ఞాభంగము కాదను విశ్వాసముతో నే ఈమంత్రమం దర్థించుచున్నాండు. అమ్మ కృష్ణవషముతో గీతయందు "నాభక్తుఁడునన్ను విడువఁడు. నేనాతనిని విడువను" అని యబయాదనాము చేసిన మాట స్మరించుకొనియే భక్తచింతామణీ! అశ్రితలకల్పవల్లీ! కామగవీ! యని పిలుచుచున్నాఁడు. ఈమూడును స్వర్గమందుండు ఆశ్రితసర్వకామప్రదములగు వస్తువులను ప్రసిద్ధి. అమ్మవిశ్వమాత కావున ఇమ్మూడుసైతము తాను గన్నవే. తన సంతానమైన కొన్ని జడవస్తువులయందును, బశువలయందును సైతము ఆశ్రితకామపూర్మలక్షణవదాన్యత్వముతో వెలసినవి. పౌరాణికగాథ ననుసరించి ఒక కవి శ్రీదేవిని గొనియాడుచు-

"నీతోడ& జనియించి కాదె వెలసె& నిస్తుల్యమౌ కీరితిన్‌ ఢాత్రీజంబును ఱాయి పెయ్యయు వదాన్యత్వంబపున నీమహాదాతృత్వంబు నుతంప నాతరమె? చింతాసింధునిర్మగ్నుఁడన్‌ ఖ్యాతిన్‌ మానము నిల్పుమమ్శ! శ్రితభక్తస్వర్గవీ! భార్గవీ! అని వ్రాసెను.

సముద్రమథనకాలమందు నీతోఁబుట్టవులైన ఱాతికిఁజెయ్యకుఁబెట్టునకు, వదాన్యత్వము సిద్ధమైనపుడు వానిని గన్నతల్లివైన నీయెడ నది వింతయా? యనెడి విశ్వాసముతో వర్థించినాఁడు.

శ్రీదేవీ! నాగృహమందును, గలత్రమునందును, దుత్త్రవర్గమునందును, మిగులఁబ్రసన్నవగుము. ఇచట యథార్థసాధకుని భావమేమనఁగా నీసేవకై నాయిభౌతిక శరీరమును సుషుమ్నాపథమనెడి (కులము) గృహమును నిన్ను సేవించి సంపాదించిన కళత్రములను, అనఁగా శక్తులను ఆకళత్రముతోఁగూడఁగాఁబుట్టిన పుత్త్రవర్గమును అనఁగావివేకజ్ఞానాదిసంపదను జెడకుండఁబ్రసన్నరాలవై సంరక్షింపుమను భావము.

శ్లో|| ఆద్యాదిమాయే! త్వమజాండబీజం

త్వమేవ సాకారనిరాకృతిశ్చ|

త్వయా ధృతాశ్చాబ్జభవాండసంఘా

శ్చిత్రం చరిత్రం తవ దేవి విష్ణోః ||

తా|| శ్రీదేవీ! నావాద్యపు; ఆదిమాయవు., నీవు బ్రహ్మాం డమునకు బీజమువు. నీవే సాకారవు. నీవే నిరాకారవు. ఈ బ్రహ్మాండజాలమంతయును నీచేతనే ధరింపఁబడుచున్నది. బ్రహ్మాండజాలమంతుయును నీచేతనే ధరింపఁబడుచున్నది. సర్వవ్యాపినినైన దేవీ! నీచరిత్రము చిత్రము వింతగొల్పునది.

వి|| అమ్మా! ఆద్యులనఁబడు బ్రహ్మవిష్ణురుద్రాదులకును ఆదివైన బ్రహ్మశక్తిని, వారినందఱిని గన్నదానవు. ఏనాఁడు నీకు సృష్టివాంఛ కలిగినదో; నిర్గుణవు. నిష్కాకామవునైన నీకు మాతృత్వవాంఛ కలిగినదో; అపుడే నీవు "మాయ" వైతివి. సర్వకారణభూతశక్తివి నీవు. బ్రహ్మాండమునకెల్లను బిజమునీవనే. అనఁగా గారణమవు. చెట్టంతయు సూక్ష్మరూపమున విత్తునందిమిడి యున్నటులే, బ్రహ్మాండజాలమంతయు నీలో నిమిడి యుండును. దానిని సృష్టించు అనఁగా వెలినిబెట్టు వాంఛ నీకుఁగలగానే నీవు మాతృత్వమునొంది మాతవు, మాయవు, అనిపించుకొందువు. "మాతృత్వం యాతీతి మాయా" వృక్షబీజదృష్టాంతమును గ్రహించి నిన్ను అజండబీజమ వంటిమి. సమస్తజగత్తులు; అనంత కోటిబ్రహ్మాండములు, ఆయనాదిసృష్టిచక్రమునకు సంబంధించిన పరివర్తినశీలపదార్థముల కన్నిటకి నీవొక్కతవే కారణమవు. కారణము రెండు విధములు- నిమిత్తము, ఉపాదానము. ఈరెండును నీవే. మేము స్వప్నదృష్టాంతముచేనిది యించుక తెలియఁగలము. స్వప్నమందుఁగాన వచ్చు పదార్థములకు నిమిత్తము అనఁగాఁగర్తయు; ఉపాదానము అను రెండును మనస్సుకంటెను వేఱమిఁయుగానట్టులే, యీజాగ్రవస్థయందుఁగానవచ్చు (అనుభవింపఁబడు) జగత్ప్రంచమునకు నిమిత్తోపాదానములు రెండును నీవే. ఆత్మవు మాయమ్మవు నివే. నిన్నుఁగొన్ని వంతులుగాఁ జేసికొని ద్రష్టగాను, దృశ్యముగాని వెలయుచున్నావు.

అమ్మా! ఒకప్పుడు జ్ఞానవృద్ధులైన నీబిడ్డలు కొందఱు "ఆత్మ జగత్కారణముకాదు. ఆత్మ నిర్గుణము, నిష్క్రియము, దానియందెట్టి కారణత్వముండజాలదు. జగత్తున కుపాదానకరాణము జడప్రకృతి; చైతన్యస్వరూపాత్మకు సమీపముగా నుండుటవల్ల, నీజడప్రకృతియందగు పరిణఆమమే యీజగత్తు, మఱి నిమిత్త కారణమును నీయాత్మయందు లేదు ఏలనఁబ్రకృతికగు జగద్రూపపరిణామమును దర్శించుటయు నాత్మధర్మముకాదు. దానియందెట్టి కోరికయు లేదు. స్వప్రకాశస్వరూపమైన యాత్మయొక్క సమీపతావశమునఁబ్రకృతియందుఁజైతన్యధర్మముభాసింపఁజొచ్చును. దాని పరిణామమే యీజగత్తు" అందురు. ఇటులనెడి వారితో మాకెట్టి విరోధమును లేదు. మేము వారి ధిక్కారములను సైతము సత్యజ్ఞానముతో స్వీకరింతుముగాని అమ్మా! నీవు మాయెదుటఁగేవలము ఇట్టి భావముతో నిన్ను వెలయించు కొనలేదు. గురురూపముతో నావిర్భవించి విశిష్టభావముతోఁ గానవత్తువు. ఆజడప్రకృతియు. నీవే ఆత్మా! మాయమ్మా! ఆత్మయే మాయమ్మకనుకనే ప్రకృతిరూపముతో జగదుపాదనమును నీవే; కాని మఱదియుఁగాదు.

పరమాత్మా! మాయమ్మా! నీవు చైతన్యస్వరూపవు. చిచ్ఛిక్తివికదా. నీప్రకృతిజడము, అచేతనము నగునవి యెటులంగీకరింతుము? ఎటుల నమ్ముదుము? చేతనమైన ఆత్మయొక్క ప్రకృతి అచేతనము కాఁజాలదు. సరి కదా అచేతనాకారమునఁజేతనయొక్కప్రత్యక్షజ్ఞానమును గలిగింపఁగలది. త్రిగుణప్రకృతి ఆత్మంకటె వేఱుగా నుండఁజాలదని కనుగొనునప్పుడే జడసత్తాభాసము కాదు. (జడసత్తప్రకాసింపదు) సూర్యునకుఁగిరణములుకుంబపోలి ప్రకృతికి నాత్మకును అవినాభావవ్యాప్తి కలదు. అపుడు మఱి దానిని జడమెటలందుము. అమ్మా! ఈయాలోచన ముండునంత తాఁకనే "నేను" ఉండునంతదాఁకనే, నీవు త్రిగుణప్రకృతివి. "నాప్రకృతి" యని నోర నందురే కాని; వాస్తవముగా "నేనే" ప్రకృతి. "రాహువుశిరస్సు" అనఁగానే రాహువు కంటె శిరస్సువేఱనుకొనునట్లే ఇమ్మాటయునున్నది. పురుషప్రకృతులు, బ్రహ్మమాయులు; ఆత్మశక్తులు మున్నగు యుగ్మవాచకశబ్దములు (జంటలను దెలుపు మాటలు) ప్రయోగింపఁబడినను వాస్తవముగానవి కైవల మభిన్నములు. ఆత్మేయే ప్రకృతిరూపముతో, శక్తి రూపముతో వెలయునపుడే యది ప్రకృతి, మాయ, శక్తియనఁబడును.

ఒక శంక కలుగవచ్చును-విశుద్ధబోధ "జ్ఞ" స్వరూపాత్మజడప్రకృతిరూపమున అనఁగాఁ ద్రిగుణాకారమున నాకారిత మగునా? యని దీనికి సమాధాన మేమనగా- ఆ "జ్ఞ" వస్తువందు జ్ఞాతృజ్ఞేయజ్ఞానములనెడి మూడు విశిష్ఠభావములు వెలయును. నిర్గుణావస్థయందది యవ్యక్తముగా నుండును. కనుక ప్రకృతికి మఱియొక పేరు "అవ్యక్తము" "జ్ఞ" నుండియే జ్ఞాతృజ్ఞేయాదిదర్మములు వెలయును. అవే త్రిగుణములు, జ్ఞానము-సత్త్వగుణము, జ్ఞాత- రజోగుణము, జ్ఞాయము- తమోగుణము. ఈమూడు వస్తువులును ఎక్కడనో మఱియొక చోటినుండి రావు. ఆ "జ్ఞ" వస్తువునుండియే ప్రకాశితము లగును. మూడవస్థలుగాను "జ్ఞ" ఆత్మవస్తువు సరిగా అటులే యుండును. ఇఁక ఆత్మయందే జ్ఞాతృజ్ఞేయాది ధర్మముల ప్రకాశించి నామరూపమాత్మక జగత్తు ప్రత్యక్షమగును. కనుక అమ్మా? ఏవైపు చూచిన నావైపేఏచటఁజూచిన నచ్చటనే నీవిచిత్రవికాసమును గాంచి ముగ్ధుల మగుచున్నాము. కనుకనే ఎచట నమ్మా! యని మేము పిలిచినను అచటనే "ఓ-ఆఁ" యనెడి నీబదులుమాట విని నీస్నేహాదరముల గర్వమున నుభవించుచున్నాము. కనుకనే దేవతలు నిన్ను స్తుతించునపుడు "హేతుః సమస్తజగతాం త్రిగుణా"యని ప్రకృతిరూపిణివైన నీయరుణచరణములందు వ్రాలిరి.

అమ్మా! నీవు త్రిగుణమూర్తితో జగద్రూపమునఁ బ్రత్యక్షమగు యింత సత్యమైనపుడు మేమను దేవతలవలె నిన్ను జగద్రూపముగా నెందులకుఁజూడము? కుండ, కూజా చూచుటతోనే మన్ను గనవ్చచునుగదా; కుండలములు చూచుటతోనే బంగారు కానవచ్చును గదా; అటులే యీజగత్తును గాంచినంతనే నీదర్శన మెందులకఁగాదు? చిన్మయీ! నీవే జగత్తయినచో, నీవే నామరూపము లయి నచో, నిన్నెదులకఁగనలేరు?

దోషముల కారణముగా నిన్నెఱుంగరు. దోషము లేవి? మొట్టమొదటిదోషము సంశయము; రెండవది అవిశ్వాసము మేము కేవల నామరూపములనే చూడఁగోరుదుము. మేమెల్లప్పుడును బరివర్తనరూపమైన జడజగద్రూపముగానే దీనిఁజూచు నభిలాషము గలవారము. కనుకనే నిన్నుఁగానలేము. మఱి యెపుడేని మెఱుపు మెరసినట్లు క్షణస్థాయియై అమ్మదర్శనముచేయు నిచ్ఛ రవ్వంత పొడమినను ఎంత సందేహము! ఎంత యవిశ్వాసము! కన్నుల దుమ్ము కొట్టి యెదురు నిల్చి ఏమైనది ? ఈజడమృత్తిక అమ్మాయా? యనుచుడును. అయ్యా! ఈజడజలముచిన్మయి అమ్మ కాఁగలదా? అనుచుండును ఈవిధముగా మమ్ముల నారెండును (దౌర్బల్యములు) మోసపుచ్చుచున్నవి. అదే నీయీప్రకటవిశ్వమూర్తివిషయమున జడత్వమనెడి దట్టమైన తెరను వ్రాల్చుచున్నవి. కనుక రవ్వంత కోరిక కలిగినను వింతలో నంతరించి పోవుచున్నది.

అమ్మా! ఇంకెంతవఱరు నీ త్రితాపదగ్ధజీవకులమును మోసపుత్తువు? నీవే దోషములను సృజింతువా? నీవే నీయవయవములను దోషములతో నడ్డుపెట్టి యుంతవా? సరే, దీనివల్లనే నీవు మాకుఁబట్టువడవు, నిన్ను దోషమయినిగాఁజూచుటే మాకన్నులకుఁజిరకాలమునుండి యాలవాటైనది కనుక గుణమయినిగాఁగనలేకున్నాము. దోషములను గూడ అమ్మరూపములుగానే తలంపఁగల్గుదుమేని మాయను గూడ అమ్మరూపముగా నంగీకరింతుమేనిఁ, బ్రకృతిని గూఁడ బురుషుఁడనియే గ్రహింతుమేని, మనసును గూడఁ బ్రాణమనియే యాదరింతుమేని, విషయములను గూడ భక్తృరూపమున భోగింతుమేని, దృశ్యమును గూడ ద్రుష్ట్రిస్వరూపముగా దర్శింతుమేని, జడమును గూడఁ డజేతనమునుగా ననుభవింతుమేని, దప్పక అమ్మా! నీదోషావరణము దూరమైనపోవును. తల్లీ! నీవు తక్క మిగిలిన దంతయు దోషమే. సర్వరూపములతో నీవొక్కతెవే యున్నావని తెలియంగల్గిన సైని దోషమెక్కడిది? దోషము నీకంటె నేదో వేఱుగా నుండునంతవఱకే నీవు "న జ్ఞాయసే" -తెలియఁబడవు. ఇదిగో! అమ్మా! ఈదోషములను మిథ్య యని, భ్రాన్తి యని, అధ్యాసమని, కల్పనామాత్రమని, తలంచి కేవలము నీవైపు నకే చూపు సారించువారియందు సైతము ఇంతో యంతో దోషము నిల్చిపోయినది. మిథ్యే యనుము; భ్రాంతియే యనుము; దోషదర్శనమే యగును. కనుక దోషములను నీకంటె వేఱుగా-అనఁగా నీకావరణముగాఁన్నంతదాఁకనే నీవు "నజ్ఞాయసే" అంత వఱకే నీవావృతవై యుందువు. అమ్మా! గీతయందు "నీవేకదాపొగచే నగ్నిక్రమ్మఁబడి నట్లు ధూళి తెరచనద్దము క్రమ్మఁబడినట్లునమావిచేగర్భము చుట్టఁబడి యున్నటులు అజ్ఞానమే దోషము; అజ్ఞానముండు నంత దాఁక జ్ఞానము ప్రకాశింపదు ఇది సత్యమే కాని, పొగ అగ్గితోనేపుట్టిన (సహజాత) దోషమైనటులే, ధూళి తెర యద్ధమునకుఁ దప్పకంటు నాగంతుకదోషమైనటులే, మావిగర్భమును సంరంక్షించు సహజగర్భావరణదోషమైనటులే యజ్ఞానము జ్ఞానమునకుఁదప్పకగు సహజదోషము. ఆజ్ఞానము కూడజ్ఞానమే యని తెలిసకొనుటతోనేదోషము దూరమైన పోవును. జ్ఞాన ముదయించును. అపుడే మఱి నీవు "న జ్ఞాయసే" కావు "జ్ఞాయసే" యగుదువు. అనఁగా అపుడు నీవు జ్ఞానరూపముతో నేనిన్ను వెలయించుకొందువు. అమ్మా! అజాండబీజమవును నీవే. సాకార నిరాకారవును నీవే అని నిర్ణియించు పనియందు నిన్నుఁదెలియుటెట్లు? పైని జెప్పిన వానిలోఁగొండంత రహస్య మిమిడియున్నది. అది హృదయంగమము కానప్పుడు నీ నిరాకారత, సాకారతయు హృదయంగమములు కావు.

సర్వాశ్రయా! అమ్మా! ఇంత లతెలియరానిదనవైనను మేము హతాశులము కాము. అగు హేతువు లేదు. ఏలన నీవు సర్వశ్రయవు. నీవు సర్వమునకును నాశ్రయమైయున్నావు. మేము నీయాశ్రితులము. సాధారణ సంభాషణమందు "నీవు మమ్ముల నొడి నుంచుకొన్నావు" అందుము. నీవుసర్వాశ్రయవు మేము నీయాశ్రితులము. మేమే కాదు. అబ్జభావండసంఘము లన్నియు నిన్నాశ్రయించి నీయొడిలోనే యున్నవి. నీవే సర్వసత్తారూపముగా వ్యాపంచియున్నావు. అన్నిఁటిని ధరించిచున్నావు. తల్లితన సంతానమున కాశ్రయమైన దానిని ధరించుట యెన్నడును దప్పనిదిక దా. కనుకనే మంత్రమందు "త్వయా ధృతాశ్చాబ్జభవాండసంఘాః" అని సత్టయము ప్రతిపాదింపఁబడినది. నీవు దేవివి. సర్వరూపము లోతఁబ్రకాశింతువు. ప్రకాశితమగు సర్వమును ధరించుట పెంచుట మున్నగు పనులు నీవి. నీవువిష్ణువవను. (వ్యాప్నోతీతి విష్ణుః) జగదాకారముతోను, అందాత్మాకారముతోను వ్యాపించియున్నావు. కనుకనే విష్ణులలైన సర్వవ్యాపినివైన నీచరిత్రము చిత్రము, అని సాధకుఁడుగ్గడించిన ఈమంత్రము చిరస్మరణీయము.

శ్లో|| బ్రహ్మరూద్రాదయో దేవా వేదాశ్చా7పినశక్నుయుః|

మహిమానం తవ స్తోతుం మందో7హం శక్నుయాం కథమ్‌||99

తా|| బ్రహ్మరుద్రాదులైనదేవతలును. వేదములును, నీమహిమమును స్తుతించుటకు సమర్థములు కావు. జడుఁడనైన (బుద్ధిహీనుఁడనైన) నేను నిన్ను స్తుతింపఁజాలుదునా?

వి|| ఆద్యులు ప్రభువుల నను విశేషణములతో నుగ్గడింపఁ బడువారులు సైతము నిన్నుఁగొనియాడఁజాలరు. వారు నీ పెద్దకొడుకులు. యథార్థముగా నిన్ను నుతింపఁగలవారలు వారలే. వస్తువుతో ఁబూర్ణపరిచయమును,దాని జ్ఞానమును గలవారలే దానిని స్తుతింపఁగలరు. అట్టివారలే నీస్తుతియందసమర్థులఁట. వారి యెడ నిన్ను స్తుతింపఁజాలని దోషము లుండవలసియును,ఆదోషమేమైనయుండును? మొట్టమొదటి దోషము సంశయము, రెంవది. అవిశ్వాసము.

అమ్మా! మేము నిన్నుఁదెలియుటెట్లు? నీవు మాకే యజ్ఞేయువు కావు. బ్రహ్మవిష్ణురుద్రాదుల ధ్యానమునకును నీవగమ్యవు. కనుకనే నీవు మాస్తుతుల కందవు. ధ్యాత, ధ్యేయము, ధ్యానము, స్తోత, స్తుత్యము, స్తుతి, జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము, అనెడి త్రిపుటి ఉండునంతదాఁక నీయథార్థస్వరూపము వెల్లడికాదు. హరియని, హరుఁడని విశిష్ఠబోధముండునంతదాఁక నీపరమాత్మస్వరూప మెటులు ప్రకాశించును? అమ్మా 'నేను' ఉండునంతదాఁక నీవురావు. 'నేను' తొలఁగిపోయిన తరువాత నపుడు నీవు వత్తువు. అపారచిత్సముద్రమందు విశిష్టమైన ఈ "నేనును" బూర్తిగా నొక్కసారి ముంచివేయనంతదాఁక నేవిధముగాను నీవాత్మరూపముతోఁబ్రకటవు కావు. కనుకనే నీవు స్తుతికందకున్నావు. వేదములు అనఁగా ఆత్మానుభవజ్ఞానమును వెల్లడించు మాటలు వానియందైన స్తుతి నిన్నుఁగూర్చి వెల్తిలేక యున్నదా? యన్నచో "యతో వాచో నివర్తనై అప్రాప్య మనసా సహ" వేదవాక్కులును మనస్సుతో నిన్నుఁబొందఁజాలక వెనుకకు మఱిలిపోయినవఁట. నీవు వేదవేద్యవని వినుచుందుమే. ఇందసత్యమేది? మనసున నేదేనిఁజిన్నదోషమంటియుండకున్న నది నిన్నేల పూర్తిగా నెఱుఁగజాలదు. నిన్నుఁగూర్చిన లక్ష్యార్థము దానికిఁబూర్తిగా గోచరింపలేదేమో అవును దానినంటియుండు "నేను" చిత్సముద్ర రూపిణివైన నీలో మూడుమున్కలు పెట్టి యుండదు. ఆణవాది మాలిన్యములు పరిశోధితములై యుండవు. ఆవాక్యములు నిన్నెంచి చెప్పఁబోయిఇది కాదు. ఇది కాదు ( నేతినేతి) యన్ననే కాని, ఇదే-ఇదే యనలేక పోయినవి. యుయుగాంతరములనుండి, జన్మజన్మంతరములనుండి, ఆ నేతి నేతి వాక్యభావములను సహితము, హృదయంగమమొనర్చుకొనలేని నేను నిన్నెట్లు నుతింపఁగలను. నీవు భాషా రూపిణివయ్యు భాషాతీతవు;' జాగద్రూషిణివయ్యు జగదతీతవు; గుణమయివయ్యు గుణాతీతవు. లలితవు. "సర్వమతీత్యలలతీతి లలితా" అన్నిఁటిని మీఱి ప్రకాశించుదానవు. అట్టి నిన్ను స్తుతింపఁబూనుటన జేనతో నాకాశమున గొల్వఁబూనుట వంటిదే. కనుక దేవీ! నాజచీవత్వాహంకారమును జంపి మానసికదోషములైన సంశ##యైవిశ్వాసములను దుడిచి వేసియపుడు వెలితి లేని బాషాసంపదను బ్రసాదించి నిన్నించుకంత స్తుతింప వలతిఁగా జేయుమనుచుఁబ్రార్థించుచున్నాఁడు.

శ్లో|| అంబ! త్వద్వత్సవాక్యాని సుక్తాసూక్తాని యానిచ|

తాన %ిస్వీకురు సర్వజ్ఞే! దయాళుత్వేన సాదరమ్‌|| `Åò

తా|| అమ్మా! నీయీబిడ్డని మాటలు సూక్తములైనను ఆసూక్తములైనను నీసహజదయాళుత్వముతోను గన్నబిడ్డలయెడనైనన సహజాదరముతో గైకొనుము. (అంగీరింపుము).

వి|| శ్రీదేవీ! నీవంబవు. (ఆఁ=పదమాత్మానం, బమతీతి= వెడలఁగ్రక్కునది=(తెలియఁజూపనది) అనంఁగా ఆత్మజ్ఞానమును గల్గించునది. అంబ యనెడి సంబోధనముచే మా యాత్మవైన నీ తెలివిని నీవే పెట్టవలయును. "బుద్ధియోగం దదామ్యహమ్‌" అని ఒకప్పుడు నీవే యభయప్రదానము చేసితివి. కావున నిన్నుఁదెలుపు అని యచులు విలిచితిని. దయాళుత్వాదరములు అమ్మసొమ్ములు. ఈశబ్దమొక మహామంత్రము. (అమ్మతో ముచ్చటలు అను నాగ్రంథమందు దనిని గూర్చి వ్రాసిన ఒకపద్యమును జూచునది) అమ్మా! ప్రేమమే నీస్వరూపము. అందఱు నీబిడ్డలు. అయినను వచ్చియు రాని తొక్కపలుకులతో నుతింపఁబూను బిడ్డఁడనైన నేను నీపరమప్రేమదయాళుత్వములకుఁబాత్రుఁడను. ఇంతవఱకు నేనాడిన మాటలలో సూక్తములు, నసూక్తములును గలవు. అవి ఎట్టివైనను నీవంగీకరింపఁదగు నను చున్నాఁడు. సూక్తములనఁగాఁజక్కఁగా అనుభవజ్ఞానముతో అన్వర్థముగా వెలువడుమాటలు. సు++ఉక్తము=చక్కఁగా మహావిద్యేశ్వరినిగూర్చి చెప్పబడినది "మహావిద్యేశ్వరీ శాంతిర్భూరూర్వాణీ మహేశ్వరః" (మంత్రాభిదానము) ఊకారమునకు మహావిద్యేశ్వరి అని, మహావిద్యేశ్వరుఁడని అర్థములు గనుక జగజ్జననివియు, మహావిద్యేశ్వరివియు అయిన నిన్నుఁగూర్చి (మహాలక్ష్మినిగూర్చి) అనుభవజ్ఞానముతోఁజెప్పఁబడిన శక్తికంటె వేఱుకాని మహేశ్వరుని గూర్చియు లెస్సగాఁజెప్పఁబడినమాటలు. సూ+ఉక్తము=తల్లినిగూర్చి చెప్పఁబడినమాటలు. ఇఁక అసూక్తాని=+సు ఉక్తాని=ఆకారము విష్మువును దెల్పును. ఆ=-బ్రహ్మశక్తి వైన ""శబ్దము చేఁజెప్పఁబడునిన్ను గూర్చి సు=లెస్సగా జెప్పఁబడినది, సమిష్టవ్యష్టికుండలినీస్వరూపవైన నిన్నుఁగూర్చి చెప్పఁబడినది. "శక్తిః కుండలినీతి యా నిగదితాఆ, ఈ మసంజ్ఞా జగన్నిర్మాణ సతతోద్యతా (త్రిపురాసారము)సు+ఉక్తాని=కనుక విష్ణువునుగూర్చి" చక్కఁగాఁజెప్పఁబడిన మాటలు. అ+సూ+ఉక్తానిగజ్జనకులైన లక్ష్మీనారయణులను గూర్చిన మాటలు, ఇన్నివిధముల భావములతో సాధకుఁడు "సూక్త, అసూక్త" అను మాటలను బ్రయోగించి నాఁడు.అమ్మా! నామాటలు కొన్ని సూక్తములు కావు అను నభిప్రాయముతో ఁగాదు. లక్ష్మీనరాయణులనెడిపేళ్ళఁ బరఁగు అభిన్నశక్తిశక్తమంతులైన మిమ్ములఁగూర్చి యనఁబడటన మాటలని యభిప్రాయము, కనుకనే నీ సహజదయాళు తాదరములతోఁగైకొనుమని ప్రార్థించుచున్నాఁడు.

శ్లో|| భవతీం శరణం గత్వాకృతార్థఃస్యుః పురాతనాః|

ఇతి సంచింత్య మనసా త్వామహం శరణం వ్రజే||

తా|| అమ్మా! మున్నింటి సాధకులు మహర్షులు మున్నగువారు నిన్ను శరణు సొచ్చియో కృతార్థులైరనుట నెఱంగిఅదియే పలుమారులు చింతించియే నేనను నిశరణము నొందుచున్నాను.

వి|| పురాతనులనఁగా ఉపనిషదృషులు, వంశర్షులు, తదితరులు నాకంటె ముందుఁడినవారుసర్వాశ్రయనీయమైన లయని యాత్మార్పణము చేసి మోక్షలాభమనెడి ప్రయోజనము నొంది ధన్యులైరి. పరదేవతాశ్రితులకుఁ జరమఫలమిదియే.

శ్లో|| అనంతానంతసుఖిన స్త్వద్భక్తా స్త్వత్పరాయణాః|

ఇతి వేదజప్రమాణాద్ధి దేవీ! త్వాం శరణం వ్రజే|| 2

తా|| శ్రీదేవీ! నీభక్తులు-నీయందే పరానురక్తిచూపువారు మనుజులు ఒకవస్తువునందో, ఒకవ్యక్తియందో, విషయములందో, నిరంతరాసక్తి చూపి చూపి; దానియందు సుఖముకానక ఆవిషయములు, ఆవస్తువులు, ఆవ్యక్తులు, సర్వము నెవ్వరి స్వరూపములో యాసత్యమును గనునంత దాఁక, సుఖముపేర దుఃఖమునే యనుభవించి ఆత్మజ్ఞానధుర్యజనతతో నపుడపుడు తాము చేయు సాంగత్య సంభాషణములవలన మేలొందుచుగ్రమముగా సర్వము "శ్రీ" జ్ఞానానందస్వరూపశక్తియే- నీవే యనియెఱింగికొన్నపుడు, కర్తృత్వభోక్తృత్వాదులన్నియు నీవియే యని కన్నువిడు నపుడు, తమదృష్టి, మనస్సు, ఆలోచనము, మున్నగున వన్నియు, మున్ను వేనియందాసక్తములయ్యెనో ఆ విషయాదులనుండి మరిలిపోయి నీయెడనేనిలచిపోవును. అపుడదే భక్తియనఁబడును,అదే పరానురక్తి యనఁబడును. అపారనురాగము గలవారే నీభక్తులు. ఇఁకఁ గ్రమముగా సర్వమందు నిన్నే చూచుచు నీవు కానిది.యు, నీవులేనిదియు లేదనెడి నిశ్చయగ్రహణముచేసి సర్వకర్మములు నీయందే యర్పించి నీయందే ప్రీతిఁజూపుచు, ఆప్రీతి, అనురక్తి, యనెడిది తమలోఁబెంపొంది "శ్రీస్సర్వం" ఈనేనుసహితము "నీవే"యనెడినికురు మఱివిడకున్న వారేత్వత్పరాయణులు.అట్టివారు పొందెడి ఫలము అనంతానంతసుఖమే. అనంతములేనిఅందమే. బ్రహ్మానందమే. శ్రియానందమే. జ్ఞానానందము తేస్వరూపముగాఁగల నిన్నాశ్రయించిన సాధకులకు నిరానందచ్ఛాయ యైనను లేని నీ కాత్మార్పణము చేసిన భక్తులకు ఆనంతానందలాభ##మే ఫలమని వేఱ చెప్పనేల? అది సిద్ధము. దీని ననుభవించి చెప్పిన ధన్యతముల మాటలే వేదములు. బ్రహ్మభూతులైనవారు అనుభవజ్ఞానముతో లోకానుగ్రహకాంక్షతో వ్రాసి యుత్తకసంతతుల మేలంచి విడిచన మాటలుకూర్పలే గ్రంథములే వేదములు.

అమ్మా! లోకమాతా! విశ్వసనీయములు, అనుసరణీయములునైన యామాటలే నాకఁబ్రమాణములై రక్షణము నీవల్లనే యనియు అనఁగా భవభయము తొలఁగటు నీవల్లనే యనియ నేను జేరఁదగిన కొంప నీవే యనియునిన్నాశ్రయించితిని. "అన్యథా శరణం నాస్తి త్వమేవ శరమణం మమ"

శ్లో|| తవ ప్రతిజ్ఞా మద్భక్తాన నశ్యంతీత్యపిక్వచిత్‌|

ఇతి సంచింత్య సంచింత్య ప్రాణాన్‌ సంధారయామ్యహమ్‌||

తా|| అమ్మా! నీభక్తులేనాఁడునునిన్నెడఁబాసియుండరు, అనెడి మాటనే చింతిచంచుచుఁబ్రాణమును ధరించియున్నాను.

వి|| అమ్మా! నీవొకప్పుడు శ్రీకృష్ణవేషముతో నర్జునునితో "అన్నిఁటను ననేనేచూచుచు నాయందే యంతయునుఁజూచు నాభక్తులను నేనెట్టి యనస్థయందును, ఎట్టి వేళను, విడిచియుండును" అని నీవనిన మాటటయే మాకుఁబ్రాణధారకమైన యభయవాక్కు. నీయెడ యథార్థమైన భక్తి నిల్పుటకు పాటిలేని యుపాయమును అట్టి భక్తులకగు ఫలమును బోధించుచు, నీవనిన యమ్మాట యెంతో మనోహరము. తల్లీ! అనీయభయవాణి యెల్లప్పుడును స్మరణీయమే. మాబృదయములందుఁదైలధారవలె నిరంతరముగా నదే చింపింపఁబడుచుండును. నిన్ను స్మరించినంతనే ఆయభయవాక్కే మాహృదయగుహలయందు మాఱుమ్రోగుచుండును. ఆ యుపాయమే, అనీ యభయవాణియే, ప్రాణధారకము గాకున్న నేడాఁడో నీతో నెడసిపోయి నిరాలంబులమై, వ్యర్థజీవులమై చెడియుందుము. ఏనాఎడో భక్తులోకమునుండి బహిష్కరింపఁబడి యుందుము. సర్వాశ్రయనీయవు, ధారణాశక్తిరూపిణి వియునైన నీవే మాలో సుస్మృతిరూపమునలిచ్చి రక్షింపుము.

శ్లో|| త్వదధీనస్త్వహం మాతస్త్వత్కృపామయి విద్యతే|

యావత్సంపూర్ణకామః స్యాం తావద్దేహి కృపానిధే!||

తా|| అమ్మా! నేను నీక లోఁబడినవాఁడను. (అధీనుండను) నీకృప నాయెడఁగలదు. నేను సంపూర్ణకాముఁడ నగుదుఁగాక; నీయాకృప నాయందతుఁ బెట్టుచుండుము.

వి|| అమ్మా! నీవే నాయేలికవు. ఏలికవైన నీకు లోఁబడి నీనియంత్రణమునే పాలించుచుచుందురు. పైమంత్రమందు నీవు చూపిన యూపాయమును అనఁగా అంతట నిన్నే చూచుట, ప్రత్యేకపరమాణువు నిన్నుఁగానే చూచుట, నీ యందే సర్వమును జూచుట, సర్వమునకు నీవే గుత్తగా నున్నావని యనుభవించుట యను పరమోపాయమును మఱువకాచరించుటయే పనిగా నున్నవాఁడను. ఏలికవైన నీమాటకే లోఁబడియున్న భక్తుఁడను ఇట్‌%ి యధీనత్వము నీకృపచేతనే కలిగినది. నీకృప నాయందున్నదని కృతజ్ఞుఁడ నగుచున్నాను. అనీ కృపయే నాయెడ లేకున్నచో నింతకు విశృంఖలుఁడనై చెడియే యుందును. అంతట నిన్నుఁజూచుచు అంతయు నీయందుఁజూచుచుండు నేర్పు నీకృప లేనివారికిఁగలుగదు. నీకృప నాయెడఁ జెదరకుండుట యనుభవించుచున్నాను. కావున నాప్రబ్వివైన నీకృప నేను బూర్ణకాముఁడ వగునంతదాఁక నాయభిష్టము పండుదాఁక అనఁగా నాకు ముక్తి లభించుదాఁక, జార నీకుమా, నీవు కృపాఖనివి. తరగువేని దయయే నీస్వరూపము. అదియే సర్వమును లోఁబడఁజేయును.

శ్లో|| క్షణమాత్రమం న శక్నోమి, జీవితుం త్వత్కృపాం వినా|

నా జీవింతీహ జలజా జలం త్యక్త్వా జలగ్రహాః || 5

తా|| అమ్మా! నీదయలేనిచో క్షణమాత్రకాలమైనను బ్రతుకఁజాలను. లోకమున జలమందుఁబుట్టి జలమునే యాశ్రయించి యుండనని జలమును వీడి బ్రతుకఁజాలవు.

వి|| అమ్మా! నీకధీనుఁడనని, నీవే యేలికవగుటచేత నీకట్టుబాటులను మీఱక బ్రతుకుచన్నానని, నీకృపనాయందు నుండుట నిశ్చయమని ఆకృపాధార తెగకుండఁజచూడమా యని చెప్పియుంటిని. ప్రాణమయివి, ప్రాణశ్వరివి, నీకృపయే లేకున్న నాప్రాణము నిల్వదు. శవర్ణము, రేఫము, ఈకారము, అనువాని ఘటనమే శ్రీశబ్దము జ్ఞానానంద స్వరూపశక్తివైననీవే "నేను"అనెడి పేరితో నిందున్నంత కాలమే యాపేరిముందు శ్రీకారముండును. తరువాత నెట్టి మహాత్ముని పేరును శ్రీ పూర్వముగా నుండదు. నీవే మాయా శ్రయము . నీవే సర్వాశ్రయనీయవు. మఱియుఁగృపాయమయి వైన నీలోనే పుట్టితిమి. నీలో నేయున్నాము. నీకృప లేనిచో జన్మియింవైన నీబిడ్డఁడు తానను జిన్మయుఁడని తెలిసికొన లేక శవప్రాయుఁడుగానే యుండును. ఎప్పటికప్పుడు మరణ భీతినొందుచునే యుండును. దేహమే తాననుకొనుచుండును. తన సత్యజ్ఞానానందరూపమును దెలియక క్లేశపడుచుండును. నీవే కరుణించి బుద్ధియోగమును బ్రసాదించి నా నిత్యత్వ చిత్త్వజ్ఞానము సడలనీయకున్నచో నా యానందరూపమపుడే తెలియఁబడును. అదియంతయు నీకృచేతనే కలుగును. నీకృపయే మాకాధారము. ఈ విషయమునందుఁబరిపూర్ణవిశ్వాసము మాకుఁగల్గించుటే నీసృష్టియందు జలముఁబుట్టి జలమునే యాశ్రియించి యున్న జంతువులు ఆజమును వీడినంతనే చచ్చుచుండుట మాకుఁబ్రత్యక్షము చేయచున్నావు. ఇచట జలజశబ్దమునకుఁదామరలని చెప్పఁబూనినచో నది పొసఁగదు. ఏలనఁ దామరలను ద్రుంచి అనంగా నీటినుండి తప్పించునపుడు వాడిపోయిన చెడుట చూచుచున్నాము. కాని నీటినుండి తప్పింపక యుట్లే యుంచినను గొన్ని ఋతువలలో నవి తమంతనే శోబచెడి దళములు రాలిపోయి నాళములు సహితము ఎండిపోవుట చూచుచున్నాము. కనుక జలజంతువులని గ్రహించుటయుక్తము.

ఎటుచూచినను బరదేవీకృప గడింపనివాఁడు నిరాశ్రయుఁడై స్వస్వరూపజ్ఞానమును బొందఁజాలఁడనియు అది లేనప్పుడు పూర్ణకాముఁడు కాఁజాలఁడనియు నిశ్చయమను మాట సాధకుఁ డుగ్గడించుచున్నాఁడు.

శ్లో|| హితా హి పుత్త్రవాత్సల్యాజ్జననీ ప్రస్నత స్తనీ|

వత్సం త్వరిత మాగత్య సంప్రీణయతి వత్సలా||9

తా|| శ్రీదేవీ! స్వభావము చేతనే తల్లి బిడ్డమేలు కోరునదికదా బిడ్డ నెనరుబికినంతనే తల్లి చన్నులు చేఁపును అంతనే పరుగున వత్సమును సమీపించి పాలించిచ తనువును.

వి|| కన్నతల్లీ! నీబిడ్డల మొఱ్ఱ నీచెనివి బడినంతనే నీచన్నులు చేఁపును. స్వభావముచే మాతృధర్మమది. కన్నదానవు కావునఁ బెంచెడిపని నీదియే. పోషణద్రవ్యము నీతో సిద్ధముగా నుండును. ఆపోషణద్రవ్యము తరుగని స్తన్యమునెడి జ్ఞానమే. అదిల నీస్వరూపమే. ఇప్పటి మాయాఁకలి తీర్చుటకు జ్ఞానస్తన్యమే కావలయును. అది పెట్టి నీవే పోషింపకున్న మాకు శుష్క భావమేర్పి (చిక్కిపోయి) నిన్నుఁబిల్వనైనను జాలనంతగా నీరసపడిపోదుమని నీవుచక్కఁగా నెఱుఁగుదువు. కావననే పిల్పు సారమునుబట్టి నిజముగా నాఁకలి గొన్నవాఁడెవ్వఁడో యెఱింగికొనితనివితీఱఁబాలిత్తవు%ు. లోకములయాఁకటిమొఱ్ఱ విన్నంతనే నీమతి పోవును. కనుకనే పరుగున వత్తువు. ఇది నీశీలము. మమ్ములను సత్యమందుఁబ్రతిష్ఠించి తొల్త బుద్ధియోగము నొసంగఁబూనుటే నీపాలచేఁపు ఆపాళమునఁబురుగున వచ్చి తనివార స్తన్యపానము చేయించుటే యథార్థస్వరూపజ్ఞానమును బెట్టుట. అప్పుడు మఱి మేము చిక్కిపోము. జ్ఞాన స్తన్యపానముచే నైన ప్రీణనముతఱుగదు. ఆశ్రద్ధ, అవిశావసము, సంశయము, ననెడి దౌర్బల్యములు మఱి మాకఁదోపవు. అమ్మా! నీవే జ్ఞానస్తన్యసానము చేయింపకున్న "త్వమేవాహం" అనెడి సత్య మందేనాఁటికైన నిల్వఁగల్గుదుమా? జననమరణచపేటముల వలనఁదప్పుకొనఁగల్గుదుమా? తల్లీ! జ్ఞాన స్తన్యపోషణచే మమ్ము రక్షింపుము. మామేలు కోరుదానవు నీవొక్క తెవే కదా.

శ్లో|| యదిస్యాం తవ పుత్త్రో7హం మాతా త్వం యది మే రమే.

పయోధర స్తన్యయా సదాభిరభిసించ మామ్‌| `ò`ò

తా|| అమ్మా! రమాదేవీ! నేనే నీకొడుకునేనినీవే నాతల్లివేని జగజ్జననీ! నీపాలిండ్లవలన నుట్టు స్తన్యమనెడి దయామృతముచే నన్నాడింపుము.

వి|| లోకమందు మనుజునకెట్టి దుఃఖము కల్గినను అమ్మా! యని తొల్తఁదల్లినే తలంచుట మాకనుభూతము. లెక్కలేని యోనులనుండి వెడలుచువచ్చుచున్నాము. తల్లు లెదఱౖరో తండ్రులెందఱౖరో చెప్పఁజాలము. శరీరధారులు దుఃఖము కల్గినపుడెల్ల అమ్మనే స్మరించుచున్నారు. కాని, తల్లిసాధారణదుఃఖములను బోఁగొట్టగలది కావచ్చును. కాని, సంసారదుఃఖములను బోఁగొట్టగదలది కాఁజాలదు. ఆపని సకలజననియైన శ్రీదేవిదే సనుకనే "రమే" - జన్మస్థితిలయతిరోధానానుగ్రహరములనెడి యైదు జగత్క్రీడలు చేయుచు ఆనదించుదానా! యని పిల్చుచున్నాఁడు. సాధకఉండు వెనుకటి మంత్రముందు స్తన్నపానము చేయించి తన్నుఁదనుపుమనెను. ఇపుడు అమ్మ పాలనెడిదయనే అమృతముగా భవించి దానితోఁదన్నభిషేఖింపు మనుచున్నాఁడు. జ్ఞానమనెడి స్తన్యముపెట్టి తనియింపు మనుటతో సాధకుఁడు దృప్తి నొందలేతు. ఏలనఁదెలివిపాలు త్రావి తనయవచ్చును గాని కాలకర్మవశమున ఆ తెలివి జాఱపోనటుల శ్రీమాత దయఁజూడకున్న నీతని కోరిక విఫలము కావచ్చును.కావునఁ దన్నింటిన ఆణవాదిమాలిన్యలేశము నిశ్శేయముఁగా గడిగి వేయఁజాలినవి దేవీకృపామృతధారలే యగుటను వానితో స్నానము చేయింపుమనుచున్నాఁడు. అప్పుడే సంపూర్ణ కాముఁడు కాఁగలఁడు. జననమరణబాధ మఱి కలుగనీయ నిదే అమృతము. అది శ్రీమాతృదయయే.

శ్లో|| మృగ్యో న గులేశోపి మయి దోషైకమందిరే|

పాంసూనాం వృష్టిబిందూనాం దోషాణాం చ నమే

మితిః|| 8

తా|| అమ్మా! కొలలకే నెలవైన నాయందు వెదకఁదగిన సుఘుణము రవ్వంతయైనను లేదు. ధూళిరేణువులకును వానచినుకులకును నాపాపములకును మేర లేదు.

వి|| సాధకునకు దేవీసన్నిధిని నైచ్యానుసంధానము కంటె దయార్జనమునకును, దురితక్షయమునకును, వేఱొక యుపాయము లేదు. తన తప్పులను దానొప్పుకొనుటకంటె ప్రభుదయార్జనోపాయము త్రాణకారణము మఱియొకటి లేదు. కనుకనే ఎట్టి దేవీపూజయందును జేయు సంకల్ప వాక్యములందే దురితక్షయద్వారముననేభగవత్ర్పీతి కలుగు ననుచుఁబూజావసానమందు ''పాపో7హంపాకర్మా7హంపాపాత్మా పాపసంభవః| త్రాహిమాం కృపయా దేవీ! శరణాగతవత్సలే|| అన్యాధా శరణం నాస్తిత్వమేవ శరణం మమ| తస్మాత్కారుణ్యభావేనరక్ష రక్ష మహేశ్వరి! యాని కాని చ పాపాని జన్మాంతకరృతాని చ| తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పడే పదే...'' అని తనపాపముల నొప్పుకొని శరణాగతవత్సలయైన దేవిసన్నిధిని దయాత్రాణములకై వేఁడుకొనుచున్నాము. ఇది నిత్యపూజలలో నొక విధిగా సాగుచున్నది. పాపనిర్హరణమునకు అపరాధక్షమార్పణముతో దేవీకృపార్థనమేకర్తవ్యమని యెంచి యేశ్రీశంక రాచార్యాదులైన సాధకోత్తములు అపరాధక్షమాకృపాభ్యర్థనమూలమే తరణోపాయమనుచు స్తోత్రగ్రంథము లెన్నో వ్రాసిరి.

శ్లో|| పాపినా మహమేవాగ్ర్యో దయాళూనాం త్వమగ్రణీః|

దయనీయో మదన్యో7స్తి తవ కో7త్ర జగత్త్రయేః

తా|| అమ్మా! పాపులలో నేనుమొట్టమొదటివాఁడను. దయాళువులలో నీవగ్రగణ్యవు. ఈముజ్జగములయందును నీకు దయనీయుఁడైనవాఁడు మఱొక్కఁడేడీ? నీషడైశ్వర్యములలోను సర్వజ్ఞత్వము మొదటిది. కనుక పాపిసంఘమందు బ్రప్రథముఁడను నేనే యనుటకు మఱొక్క సాక్ష్య మక్కఱలేదు. నీవే యెఱుఁగుదువు. నన్నుఁబోలిన పాపపంకనిమగ్నుల నందఱనో దయతో నీవుద్ధరించుట విని కనియున్నాను. కాని డయాసుధాభిషేచనముచే రక్షితులైన వారటుండగా బాససిసంఘము వెలితి లేకుండఁ బెరిగిపోవుచునే యున్నది. అటులైనను నాయగ్రస్థానమును సంపాదించుకొనఁగల పాపిమఱవ్వఁడును ముందునకు రాలేదు. దయామృతాభిషేకము చేసి రక్షింపఁగల యైశ్వర్యము నాది యనుచు మఱవ్వరును ముందునకు రాలేదు. కనుకనే నాకంటె నీకు దయజూపఁ దగిన పాపి మఱవ్వఁడును లేఁడని మనవి చేయుచు రక్షణమును గోరుచున్నానని నైచ్యానుసంధానపూర్వకముగా సాధకుఁడు ప్రార్థించుచున్నాఁడు. అమ్మా! అర్జునునకు బోధించునెపమున దయాపూర్వకము నీయభయహస్తము నెత్తి దయావనధివైన నీవు, పాపానపరాయణవైన నీవు, పుత్త్రాపరాధక్షమానిరతవైన నీవు పలికిన యభయదాన వాక్కులన్నియు మాకు ధీరత గొల్పుటకే కదా. తల్లి వాత్సల్యము తఱుగనిదని విశ్వసించుట కే కదా. ''అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణంమమ'' యనెడి యాత్మజాక్రందనము నిన్నుఁబుత్త్రస్నేహవిమూఢను జేసి పరువెత్తించి తెచ్చి దయాసుధాసారాభిషేచనపూతుఁజేయు ననియే కదా మాయింత వేడికోలు.

శ్లో|| విధనాహం న సృష్టశ్చేన్న స్యాత్త్వ దయాళుతా|

ఆమయో వాన సృష్టశ్చే దౌషధస్య వృధోదయః||

తా|| దయావతీ! బ్రహ్మచేత నేనే సృష్టింపఁబడి యుండనిచో నీదయాళుత్వమునకు సార్థక్యమే లేకపోవును. లోక మందు వ్యాధులే లేకపోయినచో వ్యాధినిర్హరణశక్తి గల యోషధుల పుట్టుకయే వ్యర్థము.

వి|| నీసృష్టియందలి పదార్థములు సహజముగాఁబరస్పరా పకారకములు, పరస్పర ద్వేష్యములు, పరస్పర మైత్ర్యములునైనవి కానవచ్చును. ఆదిని ''బహుస్యాం'' అనుచు నీవు చేసిన బహుత్వసంకల్పమే ఇందులకుఁగారణము. ఈవైచిత్ర్యము నీచిత్రలీల జగదుపాదానకారణములైన తత్త్వముల యందే యున్నది. పరస్పరవిరుద్ధములైన ద్వంద్వములే లేకుఁ బనఃసృష్టికి బీజములే లేకపోయి నీ చేతిఁదగినంత పనియే లేకపోయెడిది.

అన్నిఁటిమాట ఏల? పాపపుణ్యములు దయాళుతా నిష్టురతలు, అను నీద్వందద్వముల విషయమేమనకుఁ బ్రస్తుతము. అంతయుఁబపమేయైనను, అంతయుఁబుణ్యమే యైనను, నీ చిత్రలీలకుఁ దావే లేదు. కనుకనే దయాళుతానిష్టురతలు పరస్పరాపేక్షితములు కాక పోయెడివే. ఇంత యూహించి నీదయాళుత్వమునకు సార్థకతగల్పింప నిస్సమపాపప్రకృతిగా నీవే ఈజీవునియందు వెలసితివి. కనుక నిప్పుడు దయాళుతకుఁ బనిపెట్టుము. అటు చేసితివేనిఁ బాపుపుణ్యములనెడి రెండును లేని నీకమ్మని యొడిలో హాయిగా నిద్రింతుము. నీబిడ్డలసకు హాయిని (ఆనందమును) గల్గించునది నీదయాశీలమే అను నిశ్చయముతోనే పలుమాఱు నీదయనే కోరుచున్నాను. అఖండసచ్చిదానందరూపిణివైయును, అజ్ఞానము, నిరానందము, పాపము - పుణ్యము, పగ, చెలిమి, చలువ, వేడి, సుఖము - దుఃఖము, వెలుగు - చీకటి అను నీవేషములు నీబహుత్వసృష్టివాంఛచే నైనవే. నీస్వరూపమైన యానందమందే పుట్టితిమి; ఆనందమందేయున్నాము; ఆనందమదే చేరిపోవుదము. ద్వంద్వదోషములను దొలఁగించి ఆనందమయివైన ''నీవేనేను''అనెడి మాట మాలోనిల్వఁబెట్టినన్నకులమునందుఁ జేర్పఁగలది నీదయాళుతయే, యనెడి నిశ్చయ విశ్వాససభావములు ఇప్పటికిఁ గుదిరినవి. కావుననే ''తస్మాత్కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరి'' యని ఆత్మార్పణము చేసి నిన్నింతగాఁ బ్రార్థించితిని.

శ్లో|| కృపా మదగ్రజా కిం తే హ్యహం వా కిం తదగ్రజః|

వుచార్య దేహి మే విత్తం తవ దేవి! దయానిధే! 1

తా|| ఓనెనరుగనీ! శ్రీదేవీ! నీకృప నాకంటె ముందు పుట్టినదా? నేనుదానికంటెముందు పుట్టితినా? ఇది చక్కఁగాఁదలచుకొని నాకు విత్తము నిమ్ము.

వి|| అమ్మా! తరుగని దయయే నీస్వరూపమని నారద భక్తిసూత్రములు, భాగవతము, మున్నగు పురాణములు, స్తోత్రగ్రంథములు, నెన్నియో వేనోళ్ళఁజాటుచున్నవి. జన్మాం తరజ్ఞానము నాకు లేకున్నను ఈపుట్టువునందు మాటిమాటికి నీదయనే యనుభవించుచు నానందించుచున్న నీబిడ్డఁడను గనుక నిన్నుఁ గృపానిధీ! యని పిలుచుచున్నాను. సర్వజ్ఞవు, విశుద్ధాఖండ జ్ఞానస్వరూపవు నైన నీమహిమాదులను దీనార్తి విచ్ఛేదనము, దానదక్షత మున్నగు ననన్యసాధారణశీలమును నీకుఁదలఁపించుటయు నొక దేషమే యైనను దీనుఁడు దయ నీయుఁడు నైనవాఁడిటుల ప్రార్థింపకుండఁజాలఁడు. శ్రీదేవివి, ఆదిమవిద్యాస్వరూపిణివియైన నిదయ ముందు పుట్టినదా? నేను ముందు పుట్టితినా? విచారింపుమా యనుటలోనే పరమప్రేమస్వరూపిణివైన నీదయయే ముందు పుట్టినదినెడి నాపరమవిశ్వాసము ప్రతీతమగుచున్నది. కనుక ''అహంబహుస్యాం'' అనుచు నీచేసిన సంకల్పానంతరమే ఈ ''యల్పాహంత'' ''నేను'' పుట్టుటైనది, కనుకనేజగత్కారణమవైన నిన్నమ్మా! యని మాటిమాటికి సంబోధించుటమాకుఁ దప్పదు. ''అమ్మా!'' యనఁగానే నీసహజదయా మూర్తి మాహృదయములయందుఁబ్రతిఫలించును. బొట్టెఁడు కోరునది పెట్టుటే అమ్మపని. దేహి యని సమీపించిన బిడ్డనికి ''నాస్తి'' యననిది కన్నతల్లియొక్క తే. నీవు శ్రీమాతవు కావున నిన్ను నేను గోరునది విత్తమే. జాగతికధనధాన్యాదికము సైతము విత్తమే; కాని ఏవిత్తము నీవలన లభించినపుడు ''భక్తసామ్రాజ్యదాయినీ''యనెడి నీప్రసిద్ధనామము సార్థకమగునో ఆవిత్తమే ''శ్రీ'' యనెడి పేరితో వెలయి బ్రహ్మవిద్య. విత్‌ +త- కనకనే ''తవ విత్తం దేహి'' యనుచున్నాను. ఏవిత్తము తుచ్ఛమైక్షణస్థాయియో ఆవిత్తము కాదు నా వాంఛితము. ఆవిత్తమును వలసినంత తొల్తఁ బెట్టియే నాకు అబ్బీ! నీవు కోరఁదగినది నాయధార్థవిత్తము. బ్రహ్మవిద్యారూపము సుమాయని దానినే నన్నుడుగునమ నెడివృత్తిరూపమున నిపుడు నామనసున వెలసి అడిగించితివి. ''యాదేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా'' నమస్తసై#్య, సమస్తసై#్య, నమస్తసై#్య, నమోనమః'' యనెడి మహామంత్రము మఱువకు త్రికరణసుద్ధిగా నీకు మ్రొక్కుచు బ్రహ్మజ్ఞానమనెడి విత్తమును నాకుఁబెట్టి మోక్షసామ్రాజ్యా భిషిక్తుని జేసి నీశ్రీమాతృనామమును సార్థకముఁజేసికొమ్మని ప్రార్ధించుచున్నాడు. (దీని వ్యాఖ్యకై నాసాధనసామగ్రి నాలవమూటఁజూచునది).

శ్లో|| మాతా పితా త్వం గురు సద్గతీ శ్రీః

త్వమేవ సంజీవన హేతుభూతా|

అన్యం న మన్యె జగ దేకనాథే!

త్వమేవ సర్వం మమ దేవి! సత్యం||

తా|| శ్రదే­d! నీవే మాతల్లివి, మాతండ్రివి, మా గురుఁడవు, మానద్గతివి. నీవే మాసంజీవనమునకు హేతువవు. ఓజగన్నాయికా! నిన్నుఁదక్క వేఱొక్కరిని దలంపను నా సర్వము నీవే, ఇది నిజము.

వి|| అమ్మా! సర్వాశ్రయనీయ! సకలాంబా! నీవేనా తల్లివి. నాకే నీవు తల్లివి కావు సర్వమునకు నీవు తల్లివే. నీవు ప్రకృతిరూపముతో - శక్తిరూపముతో నీజగత్తును గర్భమందు ధరింతువు. ప్రసవింతువు, పోషింతువు, గనుక నీవే తల్లివి. అమ్మా! నీవు నాకే పితవు గావు సర్వమునకుఁబితవు నీవే, బిజప్రదుఁడైన తండ్రివి నీవే. ప్రకృతిగర్భమునఁ జిత్ర్పతిబింబరూపమున బిజప్రదానము చేయుదువు. కనుకనే నీవు పితవు. అమ్మా! పరమాత్మస్వరూపవైన నీయందేనాఁడు సృష్టివాంఛ స్పందించినదో ఆనాటినుండి నీవే సగుణపరమాత్మవు. తల్లివి. బిజరూపముగా నీలేనో నీవిముడ్చుకొన్న జగత్తును మఱల సృష్టించునపుడు, అనఁగా వెలికి విడుచునపుడు నీవే జగములఁగన్న తల్లివి. వానిని బరిపాలించు పోషించుట నీపనియే. మఱల నోనికీడ్చుకొని బీజరూపమున నుంచి నపుడు నీవే తండ్రివి. కనుక ''నీవే తల్లివి తండ్రివి.'' అనుచున్నాను. ఇదేనీమాతృత్వము. జగత్తును బరిపాలించుటయు అనఁగా ఈశ్వరివై మామేలుకొఱకే నియమించుటయు నీ సనియే కనుక జగన్నాయికే! జగన్నాథే! యని పిలుచుచున్నాను.

నీవే మాగురుఁడవు. గర్భమున ధరించుట ప్రసవించుటే కాక హృదయమందు ధరించి జ్ఞానస్తన్యము చేఁబరిపోషించుట పూర్ణజ్ఞానావస్థకుఁదెచ్చి మనమాతృపుత్త్ర సంబంధమును బోధించి మాకన్నులు విప్పి ''నీవే నేనని'' యనుభ వింపఁజేయదువు. కావున నీవే మాగురుఁడవు. ఇది తెలియక జన్మజన్మాంతరములనుండి విస్మృతమైన దాని స్మరింపఁజేసి జననమరణరూపవచ పేటములను దప్పించుదానవు. మాయధార్థస్వరూపమైన యమృతత్త్వమును గురుఁడవై తలపించి సంజీవన హేతుభూత వగుచున్నావు.

అమ్మా! నీవే మాసద్గతివి. ప్రతిజీవుఁడును, బ్రతిక్షణ మందును నీవైపున కే పరుగున వచ్చుచున్నాఁడు. సచ్ఛబ్ద వాచ్యమైన బ్రహ్మమవు నీవే. ఉపలభ్యమానగతిరూపమున నీవే వెలయుచున్నావు. నీవు స్వరూపముచే నిర్వి కారవు. నీవు నిత్యస్థిరవైనను జీవుల గతిరూపమున భాసిల్లుచున్నావు. అంధజీవులు నీయీగతిమూర్తిని గానలేకుండుటచే హతాశులై, భగ్నోద్యములై, విషణ్ణులై చెడుచున్నారు; తెలిసియో తెలియకో జీవుఁడు నీవైపున కెవచ్చుచున్నాఁడనుట తెలియ లేకుండుట చేతనే స్వజనముతోనో, విత్తముతోనో, యెడ బాటు కల్గినపుడు దుఃఖపడి చెడుచున్నాఁడు. జీవుఁడు నిన్ను మఱచుచున్నాఁడు. గాని శ్రీగురు రూపిణి వైన నీవు మాత్రము జీవులను మఱువవు. జీవుఁడు నీగతిమూర్తిని జూచి యుద్యను లుండు కాఁగోరెనేని వానిలోలోనె యొక యసంంతృప్తి యొక యపూర్ణత సర్వదా తలయెత్తుచునే యుండును. అదే నీగతిమూర్తి. నిన్నుఁజూచి యాదరించి ప్రణమిల్లి దుర్‌జ్ఞేయనుగా నెంచి మోసపోవుచున్నాఁడు. నీవెంత సులువుగా దొరుకుదానవో తెలియు లేకున్నాఁడు. తనకోరిన వస్తువొకటి లభించిన యుత్తరక్షణ మందే మఱల జీవునిలో నసంతృప్తి తలయెత్తుచుండును. ఈయసంతృప్తి నీయెడనే పరిసమాప్తి నొందును, నీయందుఁ బూర్ణముగా నాత్మవిస్మృతి కలుగనంతదాఁక మాయసంతృప్తి యణఁగదు. సుద్ధబోధస్వరూపవైన నీయందుఁ జేరిపోఁగల్గుట చేతనే మాయతృప్తి తోలఁగి పరితృప్తిలభించును. ఈయవస్థను జేరఁజాలనంతదాఁక నీవే గతిరూపమైన జననమరణ పరంపరను దాటించుకొని పోవుచుందువు. కనుకనే గురువు సద్గతియు నీవయై యున్నావని తెలిసి నీకాత్మార్పణము చేయఁ గల్గునపుడు సంజీవన హేతుభూతవును నీవయై చేయూఁత నిచ్చి నీమణిమందిరములోనికఁ గొంపోవుదువు.

తల్లీ! ఇప్పుడు నిన్ను జగదేకనాథా! యని పిలువ మానఁగలమా? నిన్ను పేక్షించి యమృతత్వలబ్ధికై మఱియొకరిని దలంచి చేసాఁపఁగలమా? కనుక నే నిజముగా నీవే మాసర్వమని విన్నవించుకొనుచున్నాము. ఇది సత్యము.

శ్లో|| ఆద్యాదిలక్ష్మీ ర్భవ సుప్రసన్నా

విశుద్ధవిజ్ఞానసుఖైకదోగ్ధ్రి!

అజ్ఞానహంత్రి త్రిగుణాతిరిక్తే!

సుజ్ఞాననేత్రే భవ సుప్రసన్నా||

తా|| ఆద్యులకును ఆదివైన లక్ష్మీ దేవీ!నీవునాయెడలఁ గడుఁ బ్రసన్నవగుము. రజస్తమస్సుల సంపర్కము లేని విజ్ఞానమును సుఖమును మాకుఁగోరినపుడు పుష్కలముగా నిచ్చుదానా! అజ్ఞానము నణఁచివేయుదానా! త్రిగుణాతీతా! సుజ్ఞాననేత్రా! మాకు మిగులఁ బ్రసన్నవగుమూ.

వి|| సాధకుఁడు శ్రీదేవితత్త్వపారమ్యాదులను దెలుపునైదు విశేషణములతో ఁబిలుచుచు నామె సుప్రసన్నతనే యాచించుచున్నాఁడు.

అమ్మా! నీవు త్రిగుణాతిరిక్తవు; అనఁగా గుణాతీతవు. అనఁగా సత్త్వరజస్తమస్సు లనెడి మూఁడు గుణములను అనఁగా మూఁడవస్థలను మీఱియున్న దానవు.

అమ్మా! త్రిగుణప్రకాశిక! అమ్మా! సత్త్వము, రజస్సు, తమస్సుననెడి మూఁడు గుణములచేత నీవ్యష్టిసమష్టిప్రకృతి వెల్లడి యగుచున్నది. అమ్మా! నిర్గుణా! నీవు మొట్టమొదట నేకత్వబోధముతో సంబుద్ధ వగునపుడు ఏకగుణితవైతివి; అదే సత్త్వగుణము. మఱి నీవు అనేక మగుటకుఁ గ్రియా శక్తిని బ్రకాశింపఁ జేసినపుడు ద్విగుణితవైతివి. అదే రజోగుణము. మఱి నీవు అనేక మగుటకుఁగోరుటే కాక నీచైతన్యమయస్వరూపమును జగదాకారమున బరిణమిపఁజేసినపుడు మూడవసారి గుణితవైతివి. అదే తమోగుణము. సత్త్వగుణముగా నీసత్‌, రజోగుణముగా నీచిత్‌, తమో గుణముగా నీయానందము ప్రకాశించును, సచ్చిదానందమయీ! అమ్మ! నీవు విశిష్టభావములతోఁ ద్రిధా నిన్ను విభజించుకొని మూఁడుగుణములతో గుణితవై, సమష్టిచే మహతివై ఆసురీదైవీప్రకృతిరూపముతోను, వ్యష్టిచే జీవప్రకృతి రూపముతోను, బ్రకాశింతువు. ఇట్టిదనరాని యవ్యక్తస్వరూపవయ్యును, నీవు పుత్త్రస్నేహప్రేరణముచే గుణత్రయమును వెలయింపఁజేయు ప్రకృతివి. దర్శనకారులు మూఁడు గుణముల సామ్యావస్థయే ప్రకృతి యందురు. అది యవ్యక్తము కావున నసాధ్యము. నిన్ను మేము స్థూలేంద్రియములతో భోగింపఁగోరుదము. స్థూలులమైపోతిమి. కనుక నీస్థూలభావమును సేవించి తృప్తినొందుచున్నాము. కానఁద్రిగుణాత్మికయైన నీవ్యష్టిమూర్తియే మాకారాధ్యము. ఇంక సమష్టిజాడ నెఱిఁగినవారు హిరణ్యగర్భులు. వార లున్న తాధికారులు. వారు నీసమష్టి ప్రకృతిమహాదేవీమూర్తిని బూజింతురు. మేము క్షుద్రులము. తెలివిలేని శిశువులము. ఆటబొమ్మలను బ్రేమింతుము. కనుక సర్వభావమయము, సర్వేంద్రియయుక్తమనైన నీవ్యష్టిప్రకృతియనెడి మూర్తియే మాకుఁబ్రియము. కావున నీవు మాయెడ గుణత్రయప్రకాశినివే యగుము. నీయీమూర్తిని బూజింపఁగల్గునపుడే నీ మహతీమూర్తి జాడ దొరుకునని మేమెఱుఁగుదుము. ఏమన ఈ మూఁడుగుణములను బూర్తిగా లయమొనర్చుటకే నీవు కాలరాత్రి, మహారాత్రి, మోహరాత్రిరూపమున వెలయుదువు. ఈరాత్రిరూపమున వెలయుదువు. ఈరాత్రిరూపమున వెలయుటే గుణాతీతావస్థ, త్రిగుణాతిరిక్తావస్థ.

ఎచ్చటఁ గాలము సైతము ప్రకాశింపదో యది కాలరాత్రి, సత్త్వగుణము లయించు చోటినే కాలరాత్రి యందురు. ఇటులే రజోగుణలయస్థానమునే మహారాత్రి యనియు, తమోగుణలయస్థానమును మోహరాత్రియనియుఁ బేర్కొందురు. మోహము, తమోగుణముయొక్క బహిర్వికాసము. దాని రాత్రి యనఁగా అప్రకాశము, లయస్థానము.

గుణత్రయ ప్రకాశినీ! తల్లీ! వ్యష్టిప్రకృతిరూపముతో నీవు మాతల్లివే. మఱవ్వరి తల్లివికావు. మాతల్లివే యనియటులు నిన్ను (మాయమ్మను) బూజింపఁగా నీమూఁడు రూసములుఁ గనుగొందుము. ఇచ్చటనే యామూడింటి పూర్ణాభాసము చేసితివి. నీయామూఁడురూపములు నందే భాసించినవి. నీకాలరాత్రిరూపమున వెలిసిన మాకాలజ్ఞామును దొలఁగింపుము. భూతభవిష్యద్వర్తమానములనెడి త్రివిధ కాలప్రతీతి, గంభీరము, నంధకారమునగు క్షేత్రమందు (అప్రకాశయోగ్యమందు) విలీనమగుఁగాక, సర్వమును వర్తమానముగానే ప్రతీతమగును. అపుడు నేను గాలా తీతుఁడనై మృత్యంజయుఁడ నగుదును. నీయరుణచరణములను హృదయమందుంచుకొని శివుఁడనగుదును. జీవత్వము పూర్తిగాఁదొలఁగిపోవును. ఇదే సత్త్వగుణలయము. మఱి మహారాత్రిరూపముతో వెలసి నీవు మామహత్తత్త్వపర్యంతము విలయుమొనర్చుము. అపుడు నాక్రియాశీలత (రజోగుణమువలనఁ గలిగిన చాంచల్యము) లోపించిపోవును. నాకు నైష్కర్మ్యము లభించును. అపుడు నేను గేవలచైతన్యమయమైన యాత్మబోధమందే మెలఁగుచుందును. మఱి మోహరాత్రిరూపముతో వెలసి నాజగన్మోహము సంసారభయమును బూర్తిగా విలుప్తము చేయుము. అపుడు నేను జయింపరానిమోహమును జయించి నిత్యచిన్మయమూర్తి యందే ఎల్లప్పుడును మోహితుఁడ నగుచుందును.

అమ్మా! నీయీమూడుమూర్తులు దారుణములు; బహుభయంకరములు. అచటఁ గాలశక్తి రుద్ధము; జగత్ర్పకాశము సుప్తము, మోహశక్తి విముగ్ధము. నీకాల (కృష్ణ) రాత్రిమూర్తిని స్మరించినంతనే జీవుఁడు భయంపడును. అమావాస్యనాఁటి ఘోరకృష్ణ మేఘము క్రమ్ముకొన్న రాత్రి సూచీభేద్యంధ కారమునందును రవ్వంత వెలుఁగుండును గాని, అమ్మా! నీయాకృష్ణమూర్తియందదియు నుండదు. సర్వవిధముల వికాసము లుప్తమైపోవును. (''న తత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాంతి కుతో7యమగ్నిః''అదెట్టిదారుణమూర్తియో! అయిననదిస్వయంప్రకాశము. అనంతశాంతిమయము. అహంకారశరీరము నంటియున్న సర్వవిధజంజాలమును దొలఁగించి మనోబుద్ధిచిత్తా హంకారముల రాజత్వమును విడిపించి కేవలాత్మబోధమునకు గొంపోయి యచ్చట నిల్పుము. రాత్రిరూపిణీ! తల్లీ! నీయీ మధుమయాంక మెంత లోభనీయము. దానిని మాటలతో వర్ణించుటెట్లు? దేవీపురాణమందొక శ్లోకమునఁ గానఁ బడును. ''బ్రహ్మమాయాత్మికా రాత్రిఃపరమేశలయాత్మికా'' జీవుని మాట లెక్క యేమి. పరమేశ్వరపర్యంతము విలీనమైపోవును. ఆబ్రహ్మమాయ యొక్కటే నీస్వరూపము. నీవు త్రిగుణలయమునకై జీవభానపక్షమున నత్యంతభయప్రదములగు కాలరాత్రి మహారాత్రి మోహరాత్రిస్వరూపములతో| బ్రకాశింతువు.

విశుద్ధచైతన్యమందు అనఁగా నిర్వికల్పనిరజంనపర మాత్మసత్తయందుఁ గొంచెముగా ననాదిసిద్ధమైన యజ్ఞానముండును. ఆయజ్ఞానస్వరూపము ''నేను నన్నెఱుఁగను'' అను నీయదియు జ్ఞానముపైనే యున్నది. ఏలన ''ఎఱుఁగను'' అను నీయజ్ఞానము సైతము వాస్తవముగా నొక జ్ఞానమే. ఈజ్ఞానమును అజ్ఞానమును నపూర్వముగా ననాదిసిద్ధముగాఁ జేరియుండుటే మాయ, లీల పురుషప్రకృతిసంయోగము అనఁబడును. జ్ఞానమే దేనిస్వరూపమో యది మనసునందు ''నేనెఱుఁగను'' అన్నచో మనసు చేయు నావిచారమును లీలయేయననలయును. నవయువకుఁడైన తండ్రి తనజ్ఞాన గౌరవమును మఱచిపోకున్నను, శిశువులైన తనబిడ్డలతోఁ దాను నొక బాలకుని బోలి యాటలాడి నిర్మలానందము ననుభవించునటులే యిదియుఁగదా; సరే యగుఁగాక; పరమాత్మ-చిన్మయి అమ్మా ''నన్నునేనెఱఁగను'' అని యెఱుంగుటకై యొక్క సారి యులికిపడును. అనఁగా ఆత్మస్వరూపము నెఱుఁగుటకై యొక్కసారి స్వేచ్ఛచేనగు నొకస్ఫురణము నొందును. (అదరునొందును) ఒక చంచలత కానఁబడును. దీనిపేరే రజోగుణము.

ఈమొదటి స్పందనముతోనే దాని యిరువంకల మఱి రెండు స్పందనములు బయలు దేఱును. ఒకటి ప్రకాశము రెండవది స్థితి. ఆప్రథమస్పందనము చేఁబరమాత్మయందుఁ బ్రకాశించు విశిష్టభావమువలన దన్నుదాఁ దెలియుట వేరే స్రకాశము. సత్త్వగుణు. ఆప్రకాశాత్మకరజోగుణమునిల్పి వేయఁగల స్పందనము వేరే స్థితి - తమోగుణము.

ఇమ్మూడును నొండొటి సంసర్గము గలవి. ఒకదానిని విడిచి రెండవది యండఁజాలదు. ఒకటి మఱియొక దానిని బూర్తిగా నణఁచి వేయఁబ్రయానపడుచుండును. ఇమ్మూఁడు గుణములును బహిర్ముఖస్పందనధర్మమునంగలవి. జ్ఞానాజ్ఞానములు రెండును జేరియున్న సత్త్వముపై నే ఈ త్రివిధస్పందనములగును. కనుకనే వీనికి అజ్ఞానమువంక వికాస మున్నట్లే, జ్ఞానము వంకనుంగలదు. ఏస్పందనములు అజ్ఞానమును - దన్నుదాఁ దెలియుకుండుటను దెలిపినవో, వాని పేరే ''అసురులు''. మఱి ఏస్పందనములు జ్ఞానమును - ఆత్మసత్తను జాగృతమును జేయుటకు సాయపడునో అవే ''దేవతలు''. (దైవీసంపత్తి) ఈవిషయము కేవలము సులభము కాదు. దార్శనికతత్త్వవిచారమందభ్యాసము లేని వారలకిది తెలియుట కష్టమే. కావున సంక్షేపము గాను, సులభముగాను మును జెప్పిన విషయమునే యాలోచింతము.

''నన్ను నేనెఱుఁగను'' అనుకొని తెలిసికొనుటకై చేయు నుద్యమముపేరే రజోగుణము. ఈప్రయత్నఫలముగాఁ గొంచకొంచము తెలియుటయే సత్త్వగుణము. అందాబోధమునుబట్టియుంచుటయే తమోగుణు. అవే యోగశాస్త్రమందుఁబ్రఖ్యాప్రవృత్తిస్థితులనియు, శాంతఘోరమూఢావస్థలనియు వ్యవహరింపఁబడినవి. ఇవేగీతలందుఁబ్రకాశప్రవృత్తి మోహములను పేళ్ళతోఁజెప్పఁబడినవి. 14 అధ్యా|| 22శ్లో|| చక్కఁగా నెమ్మదిగా నీత్రిగుణస్వరూపమును మనసునకుఁ బట్టించుకొనుటతప్ప దేవాసురసంగ్రామరహస్యము నెఱుంగుటకు మఱియొక యుపాయము లేదు. సత్త్వగుణము ప్రకాశ్యలభావము; రజోగుణము - క్రియాశీల భావము; తమోగుణము-ఈ రెండింటిని ధరించియుంచు (నిల్పియంచు) భావము. ఇవి యెల్లప్పుడునుఁబరిణామములు - పరివర్తనశీలములు, జడజగత్తు ఈమూఁడుగుణముల పరిణామమే. బ్రహ్మ మొదలు జడపరమాణుపర్యంతము నంతయు నీమూఁడు గుణముల సంయోగ వియోగముల సమ్మిశ్రణములు తక్కమఱమియుఁగాదు.

సుఖదుఃఖాదులును ద్రిగుణాత్మకములే. ఎక్కడ అత్యధిక క్రియాశీలత (చేష్ట) వలన అత్యల్పమైన యాత్మబోధస్ఫురణమగునో, దానినే లోకమందు దుఃఖమందురు. ఏల నఁగా అచటఁ గ్రియాభావ మధికము. ప్రకాశభావము తక్కువ. ఎచ్చట సత్త్వగుణక్రియ-అనఁగాఁబ్రకాశభావము అధికమును, రజోగుణక్రియ (చంచలత) తక్కువయో అదే సుఖము. మఱి తమోగుణక్రియ ప్రబలమై ప్రకాశభావము బొత్తిగానుండక సుఖదుఃఖము లింతయుఁదెలియఁబడనప్పుడు దానిపేరే మోహము. సత్తత్వగుణముయొక్క చరమపరిణామముఅఖండప్రకాశముఅనఁగాఁగేవలాత్మబోధస్ఫురణము దానినే విశుద్ధాత్మబోధమందురు. ఆయవస్థను జేరునపుడే రోజుగుణముయొక్కయును. జరమపరిణామమగును. దీని వేరే పరవైరాగ్యము. అనగా ''నేనెవరు'' అనుదాని నెఱుంగుటకైన యుద్యమము మఱి లేకుండుటయే. ఇట్టి తమోగుణముయొక్క చరమపరిణతినిరోధము; అనఁగా మఱి రజోగుణము (జాగృతముకాకుండ) లేవకుండ నడ్డగించి యుంచుటే.

ఈవిధముగా మూఁడు గుణములకు రెండు వైపులేర్పడినవి. ఒకవైపు సృష్టిస్థితిప్రలయములు, జీవజగత్తు, జననమరణములు, సుఖదుఃఖములు, మున్నగునవి. ఇఁక రెండవవైపు --అఖండప్రకాశము; పరవైరాగ్యము, నిరోధము ఇంకను సరళముగాఁజెప్పుచో--ఒక వంక భోగము; రెండవవంక అసవర్గము, (ముక్తి) మూఁడుగుణముల భోగాభిముఖగతిపేరే అసురభావము. అపనర్గాభిముఖగతి వేరే దేవభావము. ఏనాఁడీ సంగ్రామము సమాప్తమగునో యా వాఁడే జీవుఁడు గుణాతీతుఁడై పోవును. భోగాప వర్గములు, బంధనముక్తులు, అనుభ్రమము పూర్తిగాఁ దొలగిపోవు.

అమ్మా! ఈత్రిగుణాతిరిక్తావస్థయే యథార్థసాధకుఁడు కోరునది. నీవు ప్రసన్నవైనపుడేమాలో ననుక్షణము జరుగుదేవాసురయుద్ధము శాంతించి మాసర్వభ్రమములు నణఁగిపోవును. కాని దానికగు పరికరమును నీవు పెట్టవలసివదే. కనుకనే ''విశుద్ధ విజ్ఞానసుఖైకదోగ్ధ్రి!'' నిర్మలజ్ఞానానందా మృతథారలచే మమ్ములను దనువు కామధేనువ వని నీ యనన్యసాధారణ పుత్త్రస్నేహమును స్తుతించుచున్నాను. నీ ప్రసన్నతయే మా తెలివి కంటిని విప్పి యాత్ర తుదముట్టించిమఱలిరా నక్కర లేని నీ మణిమందిరమును జేర్చును.

శ్లో|| అశేషవాగ్జాడ్య మలాపహారిణి

ననం నవం స్పష్టసువాక్ర్పదాయిని!

మమైహి, జహ్యాగ్రసురంగనర్తకి!

భవ ప్రసన్నా వదనే చ మే శ్రీః||

తా|| భక్తుల వాగ్జాడ్యమును బోఁగొట్టుదానా! ఎప్పటి కప్పుడే కొత్తలును గోమలములునైన మేలిమాటల నిచ్చుదానా! మేలిమాటల రూపమున మానోర నుదయించు దానా! నానాలుక యనెడి రంగముందు నాట్యము చేయు దానా! రమ్ము. శ్రీదేవీ! ప్రసన్నవగుము.

వి|| సాధకుండు క్రొత్తక్రొత్తమాటలతోను, బ్రాఁతప్రాఁత మాటలతోను నింతవఱకుఁ జేసినది స్తుతియే యైనను, స్తోత్రప్రియయైన శ్రీదేవిని స్తుతించియుఁ దనివి తీఱక భాషాస్వరూపిణియైన వాగ్దేవతవు నీవే యనుచు స్తుతిరూపమైన దేవీ ప్రసన్నత్వలాభొపాయమును గొప్పగాఁ బెట్టమనుచుఁ గోరుచున్నాఁడు.

లో నిముడని యానందము వెలిని నాట్యరూపముననే వెల్లడియగుట యెల్లరకు ననుభూతము. అమ్మ యానందమయి, వాగ్రూపిణి. ఆమె ప్రసన్నతను గోరి భక్తుఁడు స్తుతింపనెంచినపుడు మనోహరములైన యర్థయుక్తములైన మేలిమాటలే కదా; సాధనములు, ఆమాటలు సైతము శ్రీదేవీస్వరూపమే. స్తుతిసంకల్పము సైతము పరావాగ్రూపిణియైన యమ్మదే. ఏలన ''నేను'' రూపముతో నున్నదమ్మయే. సంకల్పము కలిగినంత నది తడవు లేక పశ్యంతీ మధ్యమావైఖరీ క్రమమున నుచ్చరించును. కనుకనే ''స్మరామి తాం పరాం వాచం పశ్యంత్యాదిక్రమాశ్రయాం నానావిధమహాకార రసానుభవకారణాం'' (సౌభాగ్య లక్ష్మీ హృదయస్తుతి) అమ్మా! పలువిధములైన యాకారములతో వెలయు శృంగారహాస్యకరుణాది నవరసముల యనుభవమునకుఁ గారణభూతమైనట్టియు, నానావిధమహ కారములతో వెలయు (రస) ఆనందస్వరూపబ్రహ్మము ననుభవించుటకు హేతువైనట్టియుఁ, బశ్యంత్యాదిక్రమము నాశ్ర యించి మూలాధారమునుండి యుచ్చరించి విశేషరూపమున శ్రోతృకర్ణవేయముగా వైఖరీనామముతో వెలువడునట్టియు నిన్ను స్మరింతునని సౌభాగ్యలక్ష్మిని శివానంద యోగీంద్రుఁడు పరావాగ్రూపిణిని శ్రీదేవిని స్తుతించెను. పరాశక్తియే మనుష్యునందు సంకల్పము కలిగినంతనే అకారాదిక్షకారాంత మాతృకావర్ణమాలారూపమును దద్వర్ణఘటనమైన పదరూపమును దత్పదఘటనమైన వాక్యములుననువాని రూపముతో దానే వెలసి వాజ్ఞ్మయరూపిణియై సర్వరసానుభవకారణమై యొప్పుచున్నది.

భాషోచ్చారణాధికారులైన మనుష్యుల జిహ్వలన్నియు భాషారూపిణివైన నీవు నర్తించుటకుఁదగిన రంగములే. నీ నాట్యరంగమైన నానాలుక సర్వదా నిన్ను స్తుతింపనే సిద్ధముగానుండి లాలసపడుచుండును. ఘల్లు ఘల్లుమనుచు సార్థములైన వాక్కుల వేషముతో వెడలుటే నీనాట్యము, నర్తకివి నీవే, నర్తనము నీవే, సిద్ధపురుషుఁడైన పోతన కవియు ''తల్లీ నిన్ను దలంచి పుస్తకము చేతం బూనితి&; నీవు నా-యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్‌ సుశబ్దంభు శో-భిల్లం బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్‌'' అని ప్రార్థించెను. శబ్దమయీ! నానోర నీవును నటులే వెలువడి యర్థయుక్త మృదుమధుర శబ్దములరూపమునఁ దాండవించుటకుఁ బ్రసన్నవై రమ్ము. అపుడే మనసార నోరార నిను స్తుతించి కృతార్థుఁడ నగుదును.

శ్లో|| సమస్తసంపత్సు విరాజమానా

సమస్త తేజస్సు విరాజమానా|

విష్ణుప్రియే! త్వం భవ దీప్యమానా

వాగ్దేవతా మే భవనే ప్రసన్నా||

తా|| ఓ విష్ణువల్లభా! శ్రీదేవి ఎల్లసంపదల రూపమున విరాజిల్లుదానవును; సర్వతేజస్సుల రూపమునను శోభిల్లు దానవును; వాగ్దేవతారూపమునఁ బ్రకాశించుదానవును, నీవు ప్రసన్ను రాలవై నాయింట నిలువుము.

వి|| ఎట్టి సాధకజీవుఁడును మోక్షమునేకోరుచుండును, కనుక సాధకుండు మోక్షార్థియైనవానికి ఆవశ్యక పరికరమనుచు నీవే శ్రీకృష్ణవేషముతో నర్జునునకు వివరించిన దైవీసంపదను (1) మృత్యుభయము లేకుండుట. (2) అంతః కరణశుద్ధి. (3) ఆత్మజ్ఞానము కలిగియుండుట. (4) సాత్త్విక దానము. (5) బాహ్యేంద్రియనిగ్రహము. (6) తెలివితోడి ఈవి - ఇచ్చువాఁడు; పుచ్చుకొనువాఁడు; ఇచ్చుట; ఈయఁబడినది; యను నిమ్మూఁడును నీస్వరూపమే అను తెలివి. (7) వేదశాస్త్రరతి. (8) తపస్సు (9) నిష్కాపట్యము (10) ఏప్రాణికిని బాధ కలిగింపకుండుట (11) సత్య సంధత (12) కోపము లేకుండుట (13) కర్మఫలము నాశింపకుండుట (14) శాంతము (15) కొండెములు చెప్పకుండుట, (16) భూతదయ (17) విషయములందనాసక్తి (18) మృదుత్వము (19) లోకనిందితకార్యములయెడ సిగ్గు (20)చంచల స్వభావము లేకుండుట (21) ప్రతిభ (22) ఓరిమి (23) ధైర్యము (24) బాహ్యాభ్యంతర శుచిత్వము (25) ద్రోహచింత లేకుండుట (26) అనభిమానముఁగోరుచున్నాఁడు.

తేజస్సునకు మనము చెప్పికొనఁదగిన ప్రదానార్థము జ్ఞానము, మఱియు బలము. సాధకునకు వలసినది శ్రద్ధా విశ్వాసములనెడి బలము. సర్వేంద్రియాధిష్ఠాన చైతన్యవర్ణముగానుండి సకలకార్యక్షమముగా దాని నుంచుట యమ్మపనియే. కనక అట్టితేజోరూపముతో నాలోఁబ్రకాశింపుమని కోరుచున్నాఁడు. సర్వవ్యాపకశీలుఁడై విష్ణునామమున వెలయు పరమేశ్వరునకు నీవు. వల్లభవు. శక్తి శక్తిమంతులైన మీక భేదమని యెఱింగియే, ''విష్ణుప్రియే!'' యని పిలుచుచున్నాను. దీప్యమానా = జాగతిక విషయాసక్తిని హరించు జ్ఞానరూపమున వెలుగుచున్నదాన వగుచు నాయెడఁ బ్రసన్నవై నాయింట-(నాభవనమందు) వాగ్దేవతవై నిలువుము. అనఁగా స్తుతించి స్తుతించియుఁ దనివితిఱకున్న నాలో నీవు వాగ్దేవతాస్వరూపమున నిల్చి మృదువులు; అర్థ్యములు; స్తుతియోగ్యములునైన మాటల కలిమిగా వెలయ దయఁజూడుము. అని యర్థించుచున్నాఁడు.

శ్లో|| భక్త్యా నతానాం కలార్థదేత్వం

ప్రభాసు లావణ్యదయాసు దోగ్ధ్రి|

సువర్ణదే! త్వం సుముఖీ భవ శ్రీః

''హిరణ్యయే! మే భవ సుప్రసన్నా||

తా|| శ్రీదేవీ! భక్తితో నమస్కరించువారికి నాలుగు పురుషార్థములు నిచ్చుదానా! దయను బుష్కలముగా నొలికించుదానా! కాంతి నిచ్చుదానా! జ్ఞానమును బెట్టుదానా! నాయెడఁ బెడమొగము పెట్టకుము. శివశక్తీ! ప్రసన్నురాలవగుము.

వి|| ఆత్మార్పణము చేయు భక్తులకు ధర్మార్థ కామ మెక్షములనెడి పురుషార్థములను సిద్ధింపఁజేయుదువు. జ్ఞానమనెడి కాంతిని బెట్టి ముఖమున బ్రహ్మ వర్చస్సును వెలయింతువు. సువర్ణాదిజాగతికధనము నిచ్చుటే కాక శ్రేష్ఠమైన జ్ఞానము నిత్తువు. నీవు శివశక్తివి; హిరణ్మయివి; ''హిరణ్యరేతసః శంభోః శక్తిః ప్రోక్తా హిరణ్మయీ! ధనార్ధిభి రుపాసై#్యషా జాతవేదసి సర్వదా'' (శ్రీపురాణము) తేజస్సో వీర్యముగాఁగల శివుని శక్తియే హిరణ్మయి. ధనకాములు ప్రియతమవస్తువును గోరువారు మర్త్యులకుఁ బ్రియతమవస్తువు ముక్తియేగాన; దానిని గోరు వారు జాతవేదునందు (పరమశివునందు) = స్వాధిష్ఠాన గతాగ్నియం దుపాసింపవలయును.

అయ్యా! శివశక్తియైన ఉమయే లక్ష్మిగాఁ బల్కుటయుక్తమా యందురేని - ''లలితా శారదా లక్ష్మీ రేకైవ భగవత్యుమా తత్తల్లక్షణసంయుక్తా పురుషార్థప్రదానృణాం'' అను దేవీపురాణోక్తినిబట్టి లలితా, శారదా, లక్ష్మీ నామములతో నొప్పునది శివశక్తియైన శ్రీమహాత్రిపురసుందరియే ఆయాలక్షణములతోఁగూడినదై యుపాసకుల కాయా పురుషార్థముల నిచ్చును, కనుకనే ''సకలార్థదే'' యని పిలిచినాఁడు. లక్ష్మియే త్రిపురసుందరి. సౌభాగ్యలక్ష్మీ హృదయమును వ్రాసిన శివానందయోగీంద్రుఁడును ఈ లక్ష్మినే ''త్రిపురసుందరీ'' యని సంబోధించినాఁడు. త్రిపుర సుందరి యనుపదమున కెన్ని విధములుగానో లక్ష్మియను నర్థము చెప్పవచ్చు నైనను బ్రకృతార్థము = త్రిపురమునఁగా జాగ్రత్‌ స్వప్నసుషుప్తులనెడి స్థూలసూక్ష్మకారణ దేహములు. వానియందు విశ్వ, తైజస, ప్రాజ్ఞనామములతో జ్ఞానస్వరూపమున వ్యాపించి యుండువాఁడే, విష్ణునామముతో వెలయు పరమేశ్వరుఁడు. అతని సుందరియే లక్ష్మి. కావున, నామమాత్రభేదమే కాని, లక్ష్మీ, పార్వతీ, సరస్వతీ త్యాదినామము లన్నియు బ్రహ్మశక్తికిఁజెల్లుట శాస్త్రము లందెల్లెడఁ గానవచ్చుచున్నది.

శ్లో|| సర్వార్థదా సర్వజగత్ర్పసూతిః

సర్వేశ్వరీ సర్వభయాపహంత్రీ|

సర్వోన్నతా త్వం సుముఖీభవ శ్రీః

హిరణ్మయే మే వదనే ప్రసన్నా||

తా|| శ్రీదేవీ! సర్వార్థముల నిచ్చుదానవు; సర్వజగత్తును గన్న దానవు; సర్వమునకును ఈశ్వరివి; సర్వభయములను బోఁగొట్టుదానవు. సర్వమును మీఱియున్న దానవు; నీవు నాయెడ సుముఖివై యుండుము. హిరణ్మయీ! నానోర నీవు ప్రసన్నవగుము.

వి|| అమ్మా! నీవు మాకోరిన కోర్కుల నన్నిఁటిని ధర్మార్థకామమోక్షములనెడి పురుషార్థముల నిచ్చుదానవు. సమస్తజగములను గన్నదానవు. నీసంకల్పమాత్రముననే సర్వజగత్తులు పుట్టినవి. కనుక నీవే జగముల కన్నతల్లివి. ఈసర్వమునకు అధిపతివి నీవు అనఁగా నీ చేసిన కట్టుబాటు అకేలోఁబడి ఈజగజ్జాలము నడుచున్నది. నూర్యాది గ్రహములు నీకట్టుబాటు తప్పకయే నడుచుచున్నవి. వాయువు నీకట్టుబాటు తప్పకయే వీచుచున్నది. ఇంద్రాగ్ని యమాదులైన దిక్పాలకులు నీకట్టుబాటుల మన్నించియే పాలించుచున్నారు. అనఁగా నీవే ఆయానామములతో జగత్పరిపాలనము చేయుచున్నావు. మృత్యువు సహితము నీ యాజ్ఞకు లోఁబడియే పరువెత్తును. కనుక జగత్పరిపాలనము నీదియే. అమ్మా! జాగరికములైన సామాన్యభయములనే కాక సర్వాసురీభావభయమును గామక్రోధాదికాంతఃశత్రు భయమును దుదకు జననమరణరూప సంసారభయమును సయితము బోఁగొట్టుదానవు. తల్లీ! నీవే సర్వోన్నతవు. అన్నిఁటిని మీఱి ప్రకాశించు లలితవు. రాజరాజేశ్వరివి. నీవు నాయెడ నెన్నఁడును బెడమొగము పెట్టుకుండుము మాయక్కఱలు దీరుటకై యొక్కసారి మావైపై మా మొఱలను వినుము. నీవు హిరణ్మయివి. బ్రహ్మశక్తివి. కావున శారదాస్వరూపమును నీదియే. కావున నీవు శారదారూపమున సర్వదా నానోర వెలసి మృదుమధురార్థ యుక్తమైన వాక్సంపద నొసంగి నిన్ను మెప్పింపఁదగు స్తుతులరూపమునఁ బ్రసన్నవగుము.

శ్లో|| సమస్త విఫ°్నఘవినాశ కారిణీ!

సమస్త విఘ్నోద్ధరణ విచక్షణా|

అనంతసౌభాగ్య సుఖప్రదాయినీ

హిరణ్మయే! మే వదనే ప్రసన్నా||

తా|| విఘ్నముల సముదాయమును దొలగఁగించుదానవు. మావిపరీతపు టూహలను ఎత్తిచూపుటయందు నేర్పుకలదానవు. విఘ్నముల నునూలించుటయందు నేర్పుకల దానవు. అంతము లేని సౌభాగ్యమును ఆనందమును ఇచ్చు దానవు. శారదారూపశివశక్తీ! నానోర నీవు ప్రసన్ను రాలవగుము.

వి|| అమ్మా! శ్రీవిద్యయందు అనఁగా బ్రహ్మవిద్యావాప్తిసాధనమందు మాకగు నంతరాయములను దొలఁచు దానవు నీవే. స్తుతిముఖములైన మాచేయు సేవలయందు మాకగు విపరీతపుటూహలను దొలఁగించుదానవు. కావున అట్టి దొసఁగులను దొలంచి అంతము లేని సౌభాగ్యానందమును బెట్టుదానవు నీవే. కావున నానోర వెడలు స్తుతిరూప కార్యమందు అనన్వయదూరాన్వయాది దోషములను దొలఁగించి మావిపరీతపుటూహలను ఎత్తిచూపి దిద్ది మాస్తుతికృతిని అడ్డులేక సాగింపుము. అనఁగా నానోర నిర్దుష్టస్తుతిరూపమునఁ బ్రనన్నురాలవై నీవే వెడలవలయునని ప్రార్థించుచున్నాఁడు.

శ్లో|| దేవి! ప్రసీద దయనీయతమాయ మహ్యం

é దేవాధినాధ భవ, దేవగణాభివం ద్యే!

మాత స్తథైవ భవ సన్నిహితా దృశోర్మే

పత్యాసమం మను ముఖే భవ సుప్రసన్నా||

తా|| దేవీ! దయఁ జూడఁ దగినవారిలో మొదటి వాఁడవైన నాయెడఁ బ్రసన్నవగుము. దేవనాయకునిచేతను; శివుని చేతను, దేవగణములచేతను, నమస్కరింపఁ బడు దానా! తల్లీ! నాకన్నుల యొదుట సన్నిహిత వగుము.

వి|| నీపతితో ఁగూడి నాముఖమందుఁ బ్రనన్నురాలవగుము. అమ్మా! నీనెనరుఁజూపులకై యాశపడి వేచియున్నవారు; నీవు కటాక్షింపఁదగినవారు పెక్కు ఱున్ననునందు నేను ముఖ్యుఁడను. యాచకుఁడు ప్రభుసన్నిధిని దానే దయాపాత్రమని మొఱ్ఱపెట్టుచుండుట సహజము. అమ్మా! నీకు హరిహరాదులును వేలుపుమూఁకలు మ్రొక్కుచుందురు. వారును నీకు దయనీయులే యైనందుననే దేవత్వము నొంది దిగధీశత్వాదిపదవులను నీవల్ల నందుకొని పూజ్యులైరి. నాకట్టి పదవుల యాశ లేశ##మైనను లేదు. నేను గోరినపుడెల్ల నా కన్నుల యెదుట నిలువుము. నీపతియైన నారాయణునితోఁగూడి నామొకమునఁ బ్రసన్నవై నిలువుము. స్తుతింపఁగోరినపుడెల్ల నానోర భారతీరూపవై వెలయుచుండుము. తల్లీ! నీకభివందనము చేసి దయాపాత్రులై పదవుల నందుకొన్నవారు దయనీయతములో; పదవులను ధిక్కరించి సర్వకాల సర్వావస్థలయందును నీదర్శనమునే కోరుచు నిను స్తుతించు ప్రయత్నమందు వాక్సంపదనే కోరుచుండు నేను దయనీయతముఁడనో, సర్వజ్ఞవు నీవు ఎఱుంగనిది కాదు, అని సాధకుఁడు చతురముగాఁ బ్రార్థించుచున్నాఁడు. శ్రీశంకరాచార్యులును బంచదశీస్తోత్రమందు ''లక్ష్యేషు సత్స్వపి కటాక్షనిరీహకానామాలోకయ త్రిపురసుందరి! మాం కథంచిత్‌; మానం మయాతు సదృశః కరుణౖకపాత్రం జా తో జనిష్యతి జనో న చ జాయతే వా''

అమ్మా! నీదయతోఁడి చూపునకై ఎదురు చూచు వారు లక్షలకొలఁదియున్నను రక్షకుఁడు లేని నను జూడుము. దయైకపాత్రమైన నాయట్టి దీనుఁడు పుట్టి పోయినవారిలో నుండలేదు; పుట్టి యున్నవారిలో మఱి యొకండు లేఁడు; పుట్టఁబోయెడు వారిలో నుండఁడు, అని సాధకజనసహజమైన స్తుతినే చేసిరి.

శ్లో|| మా వత్స! భై రభయదానకరో7ర్పితస్తే

మౌళౌ మమేతి మయి దీనదయానుకంపే!

మాతఃసమర్పయ ముదా కరుణాకటాక్షం

మాంగళ్యబీజమహిమానుసృతం మమాంతః.

తా|| ''బిడ్డా! ఇదిగో! నాయభయహస్తము. నీశిరస్సుపై నుంచితిని భయపడకుము'' అని నాయందు దీనరక్షణభావమును వాత్సల్యముచేనైన రవ్వంత కదలికయుఁ దేఁటపడు నట్లు మనస్సు సుఖాపాదికారణమైన నీగొప్పతనము ననుసరించునట్లుగా నీనెయ్యంపుఁ గ్రేగంటిచూపు నాపైఁ బఱపుము.

వి|| అమ్మా! దీనులయెడల రక్షణభావమును వాత్సల్యముచేనగు నించుకంత హృదయకంపనమును; నీకు సహజములు, నీ వొక్కసారి ''బిడ్డా బయపడకుము. ఇదిగో నా యభయహస్తమును నీతల నుంచుచున్నాను.'' అనుచు నెనరితోఁడి క్రేగంట నన్నొక్కసారి చూడుము. అప్పుడే ఆనందకారణమైన నీగొప్పతనమును నామనస్సు విడిచి యుండదు. భయమువల్లనేరక్షణము. భవభయమేభయము. శ్రీదేవియొక్క దీనరక్షణశీలము దీనులు పెట్టు మొఱ్ఱలచే నించుకంత హృదయకంపనము అనునవి అమ్మయందుబికినపుడే; ఆమె ఆర్తభక్తుల తలను జే యుంచును. అనఁగా సాధకపుత్త్రల సహస్రారమును జేరి సుఖానుభూతి కల్గించును, అంతకంటె మాంగళ్యకారణము మఱి లేదు. సంసారభయము తొలఁగిపోవుటే జీవుని పక్షమున మంగళము. దానికి బీజమైనది మూలకారణమైనది నీకృపాకటాక్షమే. దీనభక్తులయెడల నది ప్రసరింపఁజేయుటే నీగొప్పతనము, అది యితరులవలనఁగారానిది. అట్టి నీగొప్పతనము నా మనస్సునంటియే యుండును, అని యోగసాధనఫలమునిచట మఱల నర్థించుచున్నాఁడు. ఇచట మఱియొక మనోహరార్థము. ''మాంగళ్య బీజమహిమానుసృతం కటాక్షం'' మాంగళ్యబీజము ''శీం'' సద్గురూపదిష్టవిధమున నీ బీజాక్షరమును బ్రణవపూర్వముగాను; నమోంతముగాను; నుపాసించినచో దానిఫలము శ్రీదేవి కృపాకటాక్షలాభ##మే యనియు సాధకుఁడు ఉపాయము నందిచుచున్నాఁడు.

శ్లో|| కటాక్షఇహ కామధుక్‌ తవ మమాస్తు చింతామణిః

కరః సురతరుః; సదా నననిధిస్త్వమేవేందిరే!

భ##వేత్తవ దయారసో రసరసాయనం త్వన్వహం

ముఖం తవ కలానిధి ర్వివిధవాంఛితార్థప్రదమ్‌.||

తా|| శ్రీదేవీ! నీ కడగంటిచూపు నాకుఁ గామధేనువును జింతామణియు నగుఁగాక. నీచేయి నాయెడఁ గల్ప వృక్షమే యగుఁగాక. ఇందిరాదేవి! నాకు నీవే నవనిధి స్వరూపమవు. నీదయారసము నిత్యము నాయెడ రసరసాయనమే యవుఁగాక. తఱుఁగని కళలుగల నీ మొగము పలువిధములైన కోర్కుల పంట నిచ్చునది ¸°ఁగాక. సాధకుండు వెనుకటి మంత్రములలో నర్థించిన తల్లి నెనరుతోడి కడగంటిచూపు ఎట్టిదో చెప్పుచున్నాఁడు. కామదేనువు (స్వర్గమందున్న యాఁబెయ్య) దానిని స్మరించినంతనే సర్వవాంఛితములను బెట్టునది యని ప్రసిద్ధము. అటులే చింతామణి యను పేర స్వర్గమందొక విలువఱాయి కలదఁట. అదియు స్మరించినంతనే చింతితార్థములు నిచ్చునదని ప్రసిద్ధము. నీ కటాక్ష మట్టిదయై చింతితార్థములను సమకూర్చునదనుచుఁదనివిశఅవాసమును వెల్లడించి దానిని దనపైఁ బఱపుమనుచున్నాఁడు. ఎట్టిసాధకుండును దేవీదయావీక్షణమును అర్థింపకుండఁడు. ఎట్టిసాధకుఁడును దేవీదయావీక్షణమును అర్థింపకుండఁడు. శ్రీశంకరులును బంచదశీస్తవమందు అంబాకటాక్షము నెంతగాఁ గొనియాడిరో చూడుఁడు. ''లబ్ధ్వా సకృత్త్రిపురసుందరి తావకీన కారుణ్యకందళిత కాంతిభరం కటాక్షం| కందర్పభావసుభగాఃఖలు భక్తిభాజః సమ్మోహ యంతి తరుణీర్భువనత్రయో7పి'' త్రిపురసుందరీ! శ్రీదేవీ! కరుణావికాసముగల నీకడగంటిచూపు ఒక్కసారి ప్రసరించిన భక్తులు మన్మథత్వము నొంది సుందరులై ముల్లొకముల యందలి స్త్రీలను మోహింపఁజేయుదురు. శ్రీశంక రాచార్యుని బోలిన సాధక శేఖరుఁడు దేవీకృపాకటాక్షము నర్థించుట; తాను మన్మథునివలె సుందరుఁడగుటకును ముజ్జగమందలి ముద్దియలను మోహింపజేయుటకే కాదు, ఇఁక పరమార్థమేమనఁగా మన్మథపర్యాయములైన కామ, కందర్పమనోభవ కామరాజాదులు, శివపర్యాయములుగానే తంత్రాదులందుఁ జెల్లుచున్నవి. కావున శివభావము నొందిన వారలై సర్వశక్తులను లోఁబఱచుకొనఁగల వారగుదురని చెప్పఁదగును. ఇఁక అమ్మచేయి కల్ప వృక్షమనుచున్నాఁడు. దేవలోకమునందలి వృక్షములలో నిది యొకటి. అదియుఁ బ్రార్థింపఁబడినపుడు కామధేను చింతామణులు వలెనే భక్తాభీష్టసిద్ధి నీయఁగలది యనెడి గట్టినమ్మకము గలవాఁడై తనతలపై దేవీకరము నుంచుమనుచున్నాఁడు. వెనుకటి మంత్రమందును దేవీ కటాక్షమును హస్తమస్తక సంయోగమునే కోరికొన్నాఁడు. విశేషించి అమ్మదయారసమును నిత్యసేద్యమగు రసాయనముగా నెన్నుచున్నాఁడు, ''యజ్జరావ్యాధివిధ్వంసి తద్రసాయన ముచ్యతే'' ముసలితనమనెడి వ్యాధిని బోఁగోట్టుమందు రసాయనము. అంతియే కాని పాదరసముతోఁ జేయుఁ బడిన మందు మాత్రమే కాదు. రసరసాయన మనుచున్నాఁడు. రసమనఁగా ఆనందము. అమ్మదయను రసముగా ఆనందస్వరూపముగా అమృతస్వరూపముగా నెన్నుచు దాని నిత్యసేవ నపేక్షించుచున్నాఁడు. అనఁగా సర్వకర్మానాశమగు వఱకుఁ జిరకాలము ఉపాసనాసమర్థముగా ముసలితనము క్రమ్మకుండఁ జేయుమని ప్రార్థించుచున్నాండు. తన యమృతకిరణములచే నాప్యాయనము చేయు కలానిధిని (చంద్రుని) బోలిన నీముఖము నాకోరిన వన్నియు నొసంగు గాక. అనఁగా అమ్మా! నీవు కరుణించి నాయాజ్ఞయందు దేజోరూపమునఁ గానవత్తువేని దాని కెడముగా లేని నాసహస్రారమును జేరుదువేని నాకిహపరములయందు వెలితి రాదని తనగాఢవిశ్వాసమును వెలిపుచ్చుచున్నాఁడు, నీవు ఇందిరవు. సర్వైశ్వర్యసార్థ్యకవితవు. నీవే నాకు నవనిధిస్వరూపిణివి. సౌభాగ్యవిద్యతో నిన్నుపాసించియే సాధకోత్తముఁడైన కుబేరుఁడు నవనిధుల కధిపతి యైనాఁడు. తఱుగని యైశ్వర్యములను బడసినాఁడు. కావుననే ఇతఁడీశ్వరసఖుఁడని వ్యవహరించుట. సారార్థమేనఁగా రమా దేవిని దాదాత్మ్యముతో నుపాసించు సాధకులకు ఐహికాముష్మికసంపద అరచేతిదని భావము.

శ్లో|| యథారసస్పర్శనతో7యసో7పి

సువర్ణతా స్యాత్‌ కమలే! తథా తే|

కటాక్షసంస్పర్శనతో జనానా

మమంగళానామపి మంగళత్వమ్‌||

తా|| అమ్మా! కమలాదేవీ! స్పర్శవేదిరసము నంటిన ఇనుము సైతము సువర్ణత్వము నొందునట్లు నీకడగంటి చూపు పడినభక్తజనులయమంగళములన్నియుసుమంగళములగును.

వి|| ఈమంత్రమందు శ్రీదేవిని ''కమలా'' యని పిలిచినాఁడు. రెండు చేతులందును గమలములుగల స్త్రీ మూర్తిగా భావింపఁబడునపుడు తన్నాశ్రయించినవారికి ధనధాన్యాదిజాగతికలక్ష్మి నిచ్చునదియు, బ్రహ్మవిద్యనుబెట్టి తన్మూలకమైన యశస్సును గమల గంధమునువలె దెసలకుఁ బ్రసరింపఁజేయునది యనియు, భావిపఁదగును. కమలా! అందరిచేతను గొరఁబడునది. ధనధాన్యాదులు గోరువారు ఆత్మజ్ఞానము గోరువారు, అమ్మనే (శ్రీదేవినే) యాశ్రయింతురు. కనుకనే కమలానామము సార్థకము. కం = బ్రహ్మమును; అలతి = అలంకరించునది = భూషించునది - అనఁగా బ్రహ్మమునకుఁదనశక్తియైన లక్ష్మియే యలంకారముగనక కమల; ¸°గికార్థ మేమనఁగా మూలాధారాది సహస్రదళకమలము వఱకునైన కమలములను (శక్తి కేంద్రములను) వ్యాపించునది యునుట. ఈ యర్థమునుద్దేశించియే ''కమలా'' యని పిలిచెను. శ్రీదేవినిగుండలినీ రూపపరాశక్తిని జాగృతను జేసి స్వాధిష్ఠానాది పద్మములను దాటించి సహస్రదళకమలమునకుఁ గొవిపోఁగల సాధకుని యమంగళములు మంగళత్వమునే పొందును జీవుని అంగళములు = అభూతి, అసమృద్ధి, కామక్రోధాదులు, వెననుకటి మంత్రదుందఁ జెప్పిన ఆసురీసంస్కారములు ఆత్మవస్తువిముఖత విషయలోలత మున్నగునవి. వీని మంగళత్వము అనఁగా విషయవిముఖత, శాంతము, నిర్లోభము, శౌచము, దయ; ఆర్జవము మున్నగునవి. ఆ యూసురీసంపద తొలఁగి దైవీసంపద యలవడుటే అమంగళములకు మంగళత్వము లభించుట అమ్మ వైపుమొగ మైనంతనే ఈయమంగళములు మంగళములై పోవును. ''అపిచేత్సుదురాచారో భజతే మామనన్యభాక్‌ క్షిప్రం భవతి ధర్మాత్మా'' మిగుల దురాచారుఁడైనను ననన్య భక్తితోఁగొల్చువాఁడు తడవు లేకయే ధర్మాత్ముఁడగును. (గీత) జీవుఁడాత్మాభిముఖుండు కాకుండుటయే అమంగళము. ఆంతరములు, బాహిరములునైన యలక్ష్ములు తొలగఁగుటకు శ్రీదేవ్యారాధనమే అనఁగా గాయత్రీనామక శ్రీదేవిని అంతర్యాగ సమారాధ్యను జేయుటయే యుపాయము. శ్రీసూక్త మందలి ''ఆదిత్యవర్ణేతి'' మంత్రమును జూడుఁడు. శ్రీదేవీ తేజస్సువలనఁబుట్టిన మారేడుకాయకే బాహ్యాభ్యంతరము లైన యలక్ష్ములను దొలఁగించు సామర్థ్యము గల దన్నప్పుడు శ్రీదేవీకరుణాకటాక్షప్రసారశక్తిమాట చెప్ప నేల, పరశువేది యంటినంతనే ఇనుముయొక్క నికృష్టత తొలంగి తడవు లేకయే ఉత్కృష్టత లభించుచున్నట్లు శ్రీవిద్యోపాసకుఁడు మంగళపాత్రఁడగును. జ్ఞానలాభము తన్మూలకమైన మోక్షము అనునవే యథార్థమంగళములు. ఈమంత్రమందీయఁబడిన దృష్టాంతమును జూచి రసస్పర్శనమాత్రము ఆయసఖండమునకు సువర్ణత్వ మబ్బుట కేవలపు స్తకజ్ఞాన మందురో? కాదు నేఁటికిని లోహాంతరములకు సువర్ణత్వమును దెచ్చిపెట్టఁగలవారున్నారనుట బహుజనవిదితము.

శ్లో|| దేహీతి నాస్తీతి వచఃప్రవేశా

ర్భీతో రమే! త్వాం శరణంప్రసన్నః|

అతఃసదా స్మిన్నభయప్రదా త్వం

సహైవ పత్యా మను సన్ని ధేహి.||

తా|| ఓమంగళ##దేవతా! ఎక్కడ దేహి యన్నంత నాస్తి యను మాట పుట్టఁగలదో యనుభయముచేనీకే శరణు చొచ్చితిని. నీవో ఎల్లప్పుడును అభయప్రదవే. ఈ నీ బిడ్డినియెడ నభయప్రదవేయై యున్నావు. నీపతియైన నారాయణునితో ఁగూడి సన్నిధానము నిమ్ము.

వి|| అమ్మా! భక్తుల హృదయమందే రమించుట నీ శీలము. అడిగిన యాశ్రితునకు లేదనకిచ్చుటే నీవ్రతము, శ్రీశబ్దము నీ కే చల్లినది. కామధేను, కల్పవృక్ష, చింతామణులఁబోలి యాశ్రితవాంఛితముల నప్పుడే యీయఁగల దానవు నీ వేయని మున్నే యంటిని. నీయభయప్రదానన్రతమును భక్తరక్షణపరాయణతను మున్నెన్ని సారులో యుగ్గడించితిని. శ్రద్ధావిశ్వాసరూపమైన బలముగా నీవే నాలో నుదయించి నా మొగము నీవైపునకే త్రిప్పికొనుచున్న నిన్ను మాని నే నేడకుఁబోయి చే సాఁచినను నాస్తివాదమే వినఁ బడునను భయము తప్పదను శంకగల్గుట సహజము. నిన్నా శ్రయించిన వారి కామక్రోధాద్యమంగళములు తొలఁగిపోవుట నాకనుభూతములు. కావున నీ వెల్లప్పుడును నాకభయ ప్రదవే యను గట్టినమ్మకముతో నిను వేడ వీడకున్నాను. సకలజననివైన నీవు పుత్త్రస్నేహవిమూఢవై లౌకిక భయములనే కాక పునర్భవభయమును సహితము తొలఁగింపఁగలవు. నీవు నారాయణ; హృషీకేశ, దైత్యాది, పుండరీకాక్ష, గోవిందేత్యాదిసార్థకనామ ప్రసిద్ధుఁడైన నీపతితో సదాసన్నిహితవై యుండుము. ఇంతే నాకోరిక. నారాయణుఁడు= జ్ఞానమే తన్నుఁ జేరు మార్గముగాఁ గలవాఁడు; హృషీకేశుఁడు = ఇంద్రియములను బాలించువాఁడు; దైత్యాది = దైత్యాది = అసురసంపద నణఁచువాఁడు; పుండరీకాక్షుఁడు = హృదయ పుండరీకమందు వ్యాపించువాఁడు, గోవిందుఁడు = ఇంద్రియములను బరిపాలించువాఁడు - జ్ఞానమును బొందించువాఁడు.

శ్లో|| కల్పద్రుమేణ మణినా సహితా సురమ్యా

శ్రీస్తే కలాం మయి రసేన రసాయనేన|

ఆస్తాం యతో మమ న దృక్ఛిరపాణిపాద

పృష్ఠాః సువర్ణవపుషః స్థిరజంగమాః స్యుః||

తా|| సర్వాశ్రయనీయ చితిరూపా! కల్పవృక్షముతోను, జింతామణితోను, గూడినదై మిక్కిలి మనోహరమైన నీకళ రసాయనమై రసముతో నాయందు నిల్చుఁగాక ; ఏలనఁగా దానివలన నానేత్రములు, శిరస్సు, చేతులు, పాదములు, వెన్ను అనునవి తేజోవంతములై స్థిరములయ్యు జంగమములు కాఁగలవు.

అమ్మా! చంద్రకళ, బ్రహ్మకళ, సాదాకళ. మున్నగు పేళ్ళతోఁ బ్రసిద్ధమైన నీ శేషశక్తి అనఁగా షోడశీ కళ నాయందు నిల్చుఁగాక; ఊరక నిల్చుట కాదు ఆశ్రితులకుఁ గల్పవృక్షమైన అనఁగా నెల్లకోర్కెలఁదీర్చు మణితోను, అనఁగా సౌభాగ్యవిద్య, చంద్రకళావిద్య, యను పేళ్లతో ఉపనిషత్తంత్రాదులందుఁ బ్రసిద్ధమైన సౌభాగ్యవిధ్యాతోఁగూడ బహుమనోహరమైనది. అదే మాజరా మరణాదివ్యాధులఁ దొఅఁగించు మందైన యానందమే స్వరూపముగాఁగలది. అట్టి యానందామృతరసాయనముచే నాదృష్టులు జ్ఞానస్థానమైన నాశిరస్సు, గ్రహణశక్తియుతములైన నా చేతులు, గమనశక్తియుతములైన నాపాదములు, మూలాధారమునుండి నీపతిమందిరమైన విష్ణురాజధానియైన సహస్రారమునకు నిన్ను జేర్చు మార్గమైనసుషుమ్నయుఁ, దేజోవంతములై స్థిరచైతన్యవంతములై వెలయఁగలవు. అనఁగా నిన్ను గాంచుటకు నిన్ను గూర్చిన యాలోచనమునకు నీకైన నమస్కారాదిసేవలకు నిన్ననుసరించుటకుఁదగు చైతన్యశక్తివంతములై వెలయఁగలవు.

సారాంశ మేమనఁగా - బ్రహ్మకళాస్వరూపిణియైన శ్రీదేవిని సౌభాగ్యవిద్యతో సేవించు సాధకోత్తములు సర్వాంగములను జైతన్యవంతములై శ్రీదేవీ సేవాపరాయణములై యానందామృతరసపానముచే జరామరణముఅను దొలఁగింపఁగలవి కాఁగలవని అమ్మకళ నేస్తుతించుచున్నాఁడు.

మూలమందలి మణిశబ్దమునకు శ్రూసూక్తభాష్యకారులైన పృధ్వీధర, విద్యారణ్యస్వాములు, సౌభాగ్య విద్యయనియే వ్యాఖ్యానించిరి. ''ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణినా సహ'' అని శ్రీసూక్తము, కళ యనునది కామకళ##యే. గుప్తమహాసారస్వతబీజము ఈంకారము.

శ్లో|| ఆద్యాతివిష్ణోః స్థిరధర్మపత్నీ

త్వమంబ! పత్యా మమ సన్నిధేహి|

ఆద్యాదిలక్ష్మీ స్త్వదనుగ్ర హేణ

పదేపదే మే నిధిదర్శనం స్యాత్‌ ||

తా|| అంబ! నీవాద్యవు. ఆదివిష్ణువనఁబడు బ్రహ్మమునకు అనపాయినివైన ధర్మపత్నివిగాఁ బ్రశంసింపఁబడిన దానవు. నీవు నీపతితో సన్నిహితవగుము. ఆద్యవు ఆది లక్ష్మివి. నీయనుగ్రహముచే నాకు మాటిమాటికి విధులఁ గాంచు భాగ్యమబ్బుఁగాక.

వి|| వెనుకటి మంత్రములందు ఆద్యాదిశ్రీ| ఆద్యాది లక్ష్మీ. ఆద్యాదిమాయే; మున్నగు సంబుద్ధులకుఁ బలుతావుల వ్యాఖ్యానము వ్రాయఁబడినది. నీవు అంబవు. కన్న తల్లివి. అం=బమతీతి, వమతీతి=అంబా=పరమాత్మను వెడలఁ గ్రక్కుదానవు. అనఁగా ఆత్మతత్త్వమును దెలియఁజూపు దానవు. ఆద్యులనఁబడు బ్రహ్మాదులకును ఆదియైసర్వవ్యాపక లక్షణుఁడైన పరమేశ్వరుఁ (బ్రహ్మము) నేనాఁడును విడియుండని సహధర్మచారిణివి. నీవు సర్వవిధముల బ్రహ్మాభిన్నవు. అధిష్ఠాన, అవష్ఠాన, అనుష్ఠఆన నామరూపములందు బ్రహ్మసమ్మితవు అనుమాట చిననాఁడే నేర్చుకొంటిమి. ''ఆయాతు వరదా; దేవీ అక్షరం బ్రహ్మసమ్మితం'' (సంధ్యావందనము) సాధకుఁడు ఇచ్చట శ్రీత్యాదినామములతోఁ భిలువఁబడు గాయత్రీ దేవిని మూలాధారమునుండి సహస్రారమునకుఁ (మేరుపర్వత మూర్థమునకు) రమ్మని కోరుచున్నాఁడు, ప్రార్థించిన భక్తులకు సన్నిధానమునిచ్చుటే నీపతిధర్మమైనపుడు అదియు నీధర్మమే కదా.

నీవు ఆద్యవు, జగత్సృష్టికిఁ బూర్వమందున్నదానవు, సృష్టి=బీజరూపజగత్తును వెలికి విడుచుట నీపనియే కావున ఆద్యులకును ఆదివై నీసంతానమైన సమస్తమును లక్షించుచుందువు. నీసంతానముచేతను, నీపతిచేతను, లక్షింపఁబడు చుందువు కావున నీవు లక్ష్మివి, సంకల్పము నెఱవేఱుటకు నెంతవారును నీవైపు మొగము త్రిప్పకతప్పదు. కనుకను లక్ష్మివి. నీకరావలంబముచే నడుగడుగునకును నిధిని గనుభాగ్యమే నాకబ్బుఁగాక. నిధియనఁగాఁదరుగని ధనము, (ద్రవిణము) ఉపనయనసంస్కారము నాఁటినుండియు నీస్వరూపమేయైన జ్ఞాననిధినే కోరి కొనుట మాకులగురువులు నేర్పిరి. ''ఆయుర్ద్రవిణం బ్రహ్మవర్చనం మహ్యం దత్వా ప్రయాతు'' ఇది మాకుఁగడువల వాటు నైపోయినది. మూలాధారమును వీడి నీవుచ్చరించునపుడు ప్రత్యేశక్తి కేంద్రమును దాకుచు మీరాజధానియైన సహస్రారమునకుఁ జేరఁబోవునంతలోఁబలువిధముల జ్ఞానశక్తివికాసమును అనుభవించు సాధకపుత్రుఁడు ''అమ్మా'' యని చేసాఁచునపుడు అర్థించునది జ్ఞాననిధియే.

శ్లో|| ఆద్యాదిలక్ష్మీహృదయం పఠేద్యః

స రాజ్యలక్ష్మీమచలాం తనోతి|

మహాదరిద్రో7పి భ వేద్ధనాఢ్య

స్తదన్వయే శ్రీః స్థిరతాం ప్రయాతి||

తా|| శ్రీమహాలక్ష్మీహృదయస్తోత్రమము బఠించుసాధకుఁడు చలనము లేని రాజ్యలక్ష్మిని బొందును. పరమదరిద్రుఁడైనను ధనాఢ్యుఁడగును. అతనివంశమందు శ్రీదేవి స్థిరముగా నుండును.

వి|| ఈ లక్ష్మీహృదయమును బ్రకటరహస్యార్థజ్ఞాన సహితముగాఁ బఠించువానికి రాజ్యలక్ష్మి సహజచంచలయైనను నిలుకడ గలదియై యతని నానందపెట్టును. జరామరణవర్జితుఁడై నపుడు గదా రాజ్యలక్ష్మీస్థిరత; ఏలనఁగా శ్రీశబ్దమునకు ధనధాన్యాదిరూపతుచ్ఛలక్ష్మియే అతఁ డుద్దేశించినది విషయభోగలాలానుఁడైన వాని లక్ష్మీస్థిరత శరీరస్థితికాలమాత్రముతోడిదే.

ఇఁక సద్గురునివలన సాధనరహస్యముల నెఱింగికొని మంత్రపరమార్థజ్ఞానముతో భావశుద్ధితో భావుకుఁడై రసికుఁడై శ్రీశబ్దమునకు జ్ఞానానందస్వరూపపరాశక్తి యనునర్థమునే గ్రహించి అంతర్యాగశమారాధ్యనుగాఁ జేయఁగల నిష్కామసాధకునిలో దైవీసంపల్లక్ష్మిగానుండి సాధనతీవ్రతనుబట్టి త్వరగానో, విలంబముగానో, మోక్షసామ్రాజ్య లక్ష్మినే యతనికిచ్చును. నకామసాధకుఁడుకటు లేవడిగొట్టినను గొన్నాళ్ళకుఁ జంచలలక్ష్మీరూపమైన ధనధాన్యాదులను మాత్రమే యనుభవింపఁగలఁడు.

నిష్కామసాధకుఁడు మంత్రచైతన్యమనెడి యర్థజ్ఞానముతో శ్రీదేవిని గులమార్గమున (సుఘమ్నాపథమున) విష్ఠురాజధానియైన సహస్రారమునకుఁ గొనిపొఁగల సామర్థ్యము గలవాఁడై ప్రలయాభిభూతుండు కాక స్థిరమోక్ష సామ్రాజ్యలక్ష్మినే యనుభవింపఁగలఁడు.

సకానుసాధకుని యుపాసనము తీవ్రతమమైనపుడు వానిపుత్త్ర పౌత్‌త్త్రాదులు సయిత మనుభవింపఁగలంతగా లక్ష్మీ సంపన్నుఁడగును.

నిష్కామసాధకుని సాధనము తీవ్రతరతీవ్రతమముగా సాగినపుడు తనకబ్బిన మోక్షసామ్రాజ్యలక్ష్మిని దదన్వయము వారెల్లరును స్థిరముగా ననుభవిపఁగలట్లు చేయఁగలఁడు. ఇచట ''తదన్వయము'' అనఁగా శ్రీశబ్దమునకు జ్ఞానానందస్వరూపపరాశక్తియే యనియు, ఆమెయే మహాలక్ష్మియనియు, శ్రీశబ్దవాచ్యబ్రహ్మవిద్యారూపనరస్వతియేయనియు, ఈపిండాండమందే యామె నివాసమనియు, ఆమెను దర్శించి యామో కృపను గడించుటకు నెక్కడికో పోనక్కఱ లేదనియుఁజెప్పి ఆంతర్యాగక్రమమును జక్కఁగా బోధించి మనమాశింపవలసినది మోక్షసామ్రాజ్యమే యనియు, నచ్చఁజెప్పి అంతర్యాగక్రమము నభ్యసింపఁజేసి తనవెనుక విడుఁబడినవారే వానిపుత్త్రులు. వారివలన ''పలువిద్యలెన్నియైనను గులవిద్యకు సాటి రావు గువ్వల చెన్నా!''యని యనుభవపూర్వకముగా బోధించి యానందమయులైనవారే యానిష్కామసాధకుని పౌత్త్రులు. ఇదే వాని యన్వయము. వారే యడుగడుగున లక్ష్మీనారాయణ సన్నిధ్యము ననుభవించుచు జ్ఞాననిధిదర్శనము చేయుచుఁదరింపఁగలవారు. ఇదే ఈమంత్రార్థము.

శ్లో|| యస్య స్మరణమాత్రేణ తుష్టాస్యాద్విష్ణువల్లభా|

తస్యాభీష్టం దదాత్వాశు తం పాలయతి పుత్త్రవత్‌||

తా|| విష్ణుప్రయమైన మహాలక్ష్మిఁ న్మరణమాత్రము చేత యెవనియెడ సంతుష్ట యగునో వానికిఁదడవు లేక కోరినది పెట్టి కన్న బిడ్డనువలెఁ బాలించును.

వి|| సర్వవ్యాపక చక్రవర్తియైన మహావిష్ణువునకుఁ బ్రియకారిణియైన వరాశక్తిని మహాలక్ష్మిని స్మరించినంత మాత్రముననే సంతోషించి స్మర్తయైన సాధకుని కోర్కులన్నియు నెఱవేర్చి కన్నకొడుకును వలెఁ బాలించును. ఇచ్చట స్మరణనఁగా ఏనాండో మఱచిన విషయము మఱలఁ దలంపునకు వచ్చుటయే. యుగయుగాంతరముల నుండి జన్మజన్మాంతరములనుండి అమ్మా! ''త్వమేవాహం'' అనెడి పరమసత్యము విస్మృత మగుటచేతనే జీవునకు జనన మరణములనెడి తిరుగటిరాళ్లలోఁబడి నలిగిపోవుట తప్పకున్నది. భగవన్నామములలో నొక్కనామమును అర్థజ్ఞానమనెడి చైతన్యము జారిపోకుండ ''నీవే నేననెడి'' మహా వాక్యార్థము మఱలఁ దలంపునకు వచ్చుటే స్మరణము. ఇదియే మేధాజననము. శ్రీశంకరులును, ''బ్రహ్మాహమస్మీతి స్మృతిరేవ మేధా'' యని నిర్వచించిరి. సాధకుని యభీష్టము మోక్షమే, అది జ్ఞానమువల్లనే లభ్యము. బ్రహ్మజ్ఞానమే జ్ఞానము, అదే పరావిద్య. జ్ఞానలాభమనఁగా నిచ్చటమున్ను లేనిది క్రొత్తగా వద్చుట కాదు. మున్నండినదే చిరమై మఱపైనది ఇపుడు మఱల స్మృతమైనది. తలంపునకు వచ్చినది. అదియుఁ బరమాత్మానుగ్రహమువల్లనే కాఁగలదు. ఉపా సనాప్రక్రియలన్నియు ఈ మేధాలబ్ధికే, అది నిల్చి స్వస్వరూపానుభవము కలుగుటకే ''నామస్మరణా దన్యోపాయం నహి పశ్యామో భవతరణ'' అను నపుడు భగవంతుని దెల్పు విశేష్యములందలి విశేషములను గ్రహించుచు ఈ విశేషములుగల ''నీవే నేను'' అని ముంచుచుండుటే యథార్థనామస్మరణము.అది సార్థకముకానప్పుడు యథార్ధస్మరణము కాలేదన్నమాటయే. ఒక్కనామముతో భగవంతుని బిల్చి ఈవిశేషములుగల ''నీవే నేను'' అనుచు ''త్వమేవాహం త్వమేవాహం త్వమేవాహం న సంశయః'' అని తలంచి తరించిన శ్రీకాళిదాసుని స్వరముతో స్వరము కలిపిన సాధకజీవుఁడే లక్ష్మీకృపకుఁ బాత్రుండై యథార్థతనుజుఁడై సకలజనని యొడినుండి మఱల దిగిరాఁడు. ఇదే యథార్థస్మరణాలాభము. అది లేక ఆకాశము బ్రద్దలగునట్లు భగవన్నామము వఱచుచు స్తుతిసంకీర్తనములు చేయుచుఁజెవులు గింగురువోవఁ జప్పటలు చఱచుచు మిథ్యాసంతుష్టి నొందుచున్నంతకాలము విష్ణవల్లభ సంతుష్ట కాదు. అభీష్టము సిద్ధింపదు. అమ్మతో నైక్యనిష్పాలన స్మరణము నడలి పోనట్టులే. జపసంకీర్తనాదులు సాగవలయును. ఈయుపాసనా రహస్యమును సాధకపుత్త్రుఁడిందు మనోహరముగా జూపినాఁడు.

శ్లో|| ఇదం రహస్యం హృదయం సర్వకామఫలప్రదం|

జపః పంచసహస్రం తు పరశ్చరణముచ్యతే||

తా|| ఈలక్ష్మీహృదయము సాధకునెల్లకోర్కుల నిచ్చునది. ఈహృదయమంత్రజప పరశ్చరణసంఖ్య అయిదు వేలుగాఁ జెప్పఁబడినది.

శ్లో|| త్రికాలమేక కాలం వా నరో భక్తిసమన్వితః|

యఃపఠేచ్ఛృణుయాద్వాపి సయాతి పరమాం శ్రియమ్‌||

తా|| ప్రతిదినము మూఁడుసంధ్యాకాలములయందేని, అశక్తుఁడైనచో నొక్క వేళ##యే కానీ, భక్తితోఁ గూడిన వాఁడై ఈలక్ష్మిహృదయమంత్రజపము చేయువాఁడు, శ్రేష్ఠమైన సంపదను బొందును. ఇచట ముక్కాలములయందు అన్నప్పుడు మూఁడుసంధ్యాకాలము లనియేగ్రహింపవలయు.

వి|| ఈమహాలక్ష్మియేగాయత్రీమంత్రోక్తభర్గస్సు ''సమ్యక్‌ధ్యాయతే ఇతి సంధ్యా'' చక్కఁగా ధ్యానింపఁబడునది. సంధ్య; అహర్నిశాసంధ్యాకాలములే సమ్యగ్ధ్యానమునకు యోగ్యములని మహర్షినిర్ణయము. భక్తిసమన్వితః'' అనునపుడు జ్ఞానపూర్వక దేవపరానురక్తయే భక్తి, జ్ఞానమే భక్తికి మూలము. శ్రీశంకరులును దమయుప దేశసాహస్రియందు జ్ఞానమే భక్తి యనిరి. జ్ఞానమనఁగా వస్తుజ్ఞానమే. అదిస్థిరపడినపుడే భక్తి యనఁబడును. అనఁగా ఈభక్తియు సో7హం సో7హం భావస్థితియే, ''పరమాం శ్రియం'' అనుచోట శ్రేష్ఠమైన ధనధాన్యాదితుచ్ఛలక్ష్మీ యని సకామసాధకుని పక్షమునను, నిష్కామ సాధకుని పక్షమునఁ బరమును (మోక్షమును) గల్గించునట్టి శ్రియం=బ్రహ్మవిద్య యనియుఁ దెలియవలయును.

శ్లో|| మహాలక్ష్మీం సముద్దిశ్య నిశి భార్గవవాసరే

ఇదం శ్రీహృదయం జప్త్వా పంచవారం ధనీ భ##వేత్‌.

తా|| మహాలక్ష్మి నుద్దేశించి ''శ్రీమహాలక్ష్మీ పరదేవతాప్రీత్యర్ధం'' అనఁగా నాకు మహాలక్షియందుఁబ్రీతియనెడి భక్తియే ప్రయోజనముగా భార్గవ (శుక్ర) వారము రాత్రి ఈలక్ష్మిహృదయమును 5 సార్లు జపించినవాఁడు ధనవంతుఁడగును.

వి|| సాధకజీవునకు దేవునియందైన గొప్పయను రాగమే భక్తి. అది యున్ననాఁడు పరమప్రేమమే స్వరూపమైన భగవంతునివలన మఱల సాధకుఁడందుకొనునది ప్రీతియే కావునఁ ''బరమేశ్వరప్రీత్యర్థం'' అనుచోట భగవంతునియందు నాకుభక్తి నిచ్చుట కేయని చెప్పుకొనవలయును. ఈసందర్భమున నావ్రాసిన ''దేవపూజారహస్యము'' అనుగ్రంథమున డోలోత్సవము అనుదాని రహస్యముఁజూచుకొనునది.

శుక్రవారమురాత్రి యనుదాని విశేషము నెఱుంగవలయును. ఆదిత్యాదివారము లేడును. ఏడుప్రధానగ్రహములు నధిదైవతములుగాఁ జెప్పఁబడినవి. శుక్రగ్రహము జ్ఞానప్రదానసమర్థమైనది. శుక్రుఁడు బ్రహ్మజ్ఞానప్రదాత. గీతావిభూతియోగమందు భగవంతుఁడు శ్రీకృష్ణుఁడు తన విభూతు లెందెందు విశిష్టములో చెప్పికొనునపుడు నేను బ్రహ్మవేత్తలలో ఉశనసుఁడను (కవిని) శుక్రఁడను ఉశవసుఁడనఁగా దైత్యుల శ్రేయస్సును గోరువాఁడు. దితి సంతానమైనవారు దైత్యులు. దితిపరమాత్మతో నెడసియుండు నవస్థయే దితి. ఆయవస్థయందున్నవారే దైత్యులు. వారి యజ్ఞానమును దొలఁగించువాఁడే శుక్రుఁడు. భగవంతుఁడే గురుఁడై యజ్ఞానమును దొలఁగించును గనుకనే ధైత్యగురుఁడైన శుక్రాచార్యుఁడను నేనే యన్నాఁడు శుక్రశబ్దము పరమాత్మకే చెల్లును. మఱియు నీదినము రుద్రతేజో వంతమైనదని ప్రసిద్ధి. కనుక నీదినము భక్తులకు దేవ దేవ్యనుగ్రహము నాపాదించునది. మఱియు నిశియందు జాగతికవ్యాపారములన్నియుఁ జిత్తమునుండి తొలఁగియుండును. కావుననే వ్రతము లనేకములు నిశావసరమున నాచరించుటే శ్రేయస్కరమని విధింపఁబడినది. ముఖ్యముగా శక్తి (దేవీ) పూజలు రాత్రివేళ నగుచుండుట మన మెఱుగనిది కాదు. ఈఫలస్తుతియందుఁజెప్పినట్లు అయిదుసారులు ప్రత్యేకశుక్రవారము రాత్రి జరుపువాండు ధననంతుఁడగును ధనమనఁగా అభిష్టవస్తువు. సాధకుని అభీష్టవస్తువు జ్ఞానమే. దానివలన మోక్షమే.

శ్లో|| అనేన హృదయేనాన్నం గర్భిణ్యాయాభిమంత్రితం|

దదాతి తత్కులే పుత్త్రోజాయతే శ్రీపతిః స్వయమ్‌||

తా|| లక్ష్మీహృదయమాలా మంత్రముతో నభిమంత్రింపఁబడిన యన్నమును గర్భిణికి భుజింపఁజేసినచో ఆవంశమందు శ్రీనాథుఁడు తానే పుత్త్రఁడై పుట్టును.

వి|| అనఁగాలక్ష్మిహృదయాభిమంత్రితాన్నమునుభుజించిన స్త్రీయందుఁబుట్టువాఁడులక్ష్మీవంతుఁడగునని యభిప్రాయము. ఇది సంభవమా యని శంకింపవలదు. మంత్రజపవిధుల నెఱింగి ఇష్టదైవతా తాదాత్మ్యముతో మంత్రశాస్త్రమందుప దేశింపఁబడిన ఆయావస్తువులను బట్టుకొని జపించునపుడు జపవేళ సాధకునిలోఁబుట్టు నాదస్పందనములు వానియందు సంక్రమించి సంకల్పిత కార్యములను ఫలింపఁజేయు శక్తిగల వియై మహోపకారములగుట ఈయవిశ్వాసికాలమందును మనము సాక్షాత్కరించుకొనుచున్నాము. ఎందఱో మంత్ర సిద్ధులు భస్మము, అక్షతములు, జలము, క్షీరము, పుష్పములు, ఫలములు, ఓషధులు మున్నగువానిని జేతఁబట్టుకొని మంత్రశక్తివంతములుగాఁజేసి ప్రయోగించి సర్పవృశ్చి కాది విషహరణము, వ్యాధినాశనము, గ్రహపైశాచికాది పీడాశాంతి, శత్రుమారణము, స్తంభనము, విద్రానణముమున్నగు కార్యములను ఇంతగా ననర్చుట నేఁడును గనుచున్నాము. వినుచున్నాము. అభిమంత్రించునపుడు సాధకుఁడు గురు మంత్ర మంత్రిదేవతా మనః ప్రాణముల యైక్యనిష్ఫాలము చేయఁగలవాఁడగునేనిఁ దప్పక యభీష్టసిద్ధి నొందఁగలఁడు. ఇది అనుభ##వైకనేద్యము. ఈవిషయమున నాయనుభవము లెన్నియో వ్రాయఁదగియున్నది. కాని గ్రంథకళేబరము పెరిగిపోవునని విడిచితిని.

శ్లో|| నరేణా7ప్యథవా నార్యా లక్ష్మీహృదయమంత్రితే|

జలే చ పీతే తద్వం శే మందభాగ్యోన జాయతే||

తా|| అఁడు దేని, మగవాఁడేని లక్ష్మీహృదయ మంత్రపూతమైన జలమును నిత్యము ద్రాగుచుండునేని వారివంశమున సౌభాగ్యవంతులే కాని మందభాగ్యులు పుట్టరు. లక్ష్మీ హృదయమంత్రపూతమైన పవిత్రజలము త్రాగఁబడునపుడు అందలి పరమాణువులన్నియు ఆసాధకుల శరీరములందు సుజీర్ణములై శక్తివంతములగుటచే సప్తధాతువులను శారీరక సర్వపరమాణువులను లక్ష్మీకరములుగాఁ జేయుటవలన వారివారి రజశ్శుక్రధాతు సంయోగమువలనఁ బుట్టిన సంతానము సౌభాగ్యవంతమగుట వింత కాదు.

శ్లో|| య ఆశ్వినే మాసి చ శుక్లపక్షే

రమోత్సవే నన్నిహితైకభక్త్యా|

పఠేత్తదేకోత్తరవారవృద్ధ్యా

లభేత సౌవర్ణమయీం చ వృద్ధిమ్‌||

తా|| ఏసాధకుఁడు ఆశ్వినమానశుక్లపక్షమున రమోత్సవములు (మహాలక్ష్మీపూజలు) దశరాత్ర; (దశాహర్‌) అను మాటలనుండి పుట్టినది దసరాపదము. భారతదేశమున విరివిగా జరుగుట ఎల్లపరెఱిఁగినదే. రమాశబ్దవాచ్యమహాలక్ష్మీ. జగత్సృష్ట్యాదిక్రీడలు చేయుచు నానందిచునది. కావున రమా; ఆపరాశక్తియే; మహాలక్ష్మి ముగురమ్మల మూలమైన మహాలక్ష్మి. ఆమె నుద్దేశించి పూజలు జరుపు వారు ఆపరాశక్తిని సరస్వతి, దుర్గ, కాలి మున్నగు వివిధనామములతోఁ బూజింతురు. ఈసందర్భమున ఈ దుర్గా, మహాలక్ష్మీపూజావిషయము కడు విపులముగా గర్భితరహస్యోద్ఘాటనముతో సాధకులకఁ దెలియుఁదిగిన పెక్కు విషయములతో వ్రాయఁబడినది. దేవపూజారహస్యమందుఁ బదునాఱుపుటలుగా ముద్రితమైన దాని నంతటిని నిటఁజేర్చినచో గ్రంథమూర్తి మిగులఁబెరుగునని వెఱచి ఇందు వడిచి దీనితో ననేక దేవపూజారహస్యములను జదువరులు నా దేవపూజారహన్య గ్రంథమునఁజూచి మేలొందఁ గల రనియు నాశించి విడుడుచున్నాను. (నారచనలన్నియు గుంటూరుజిల్లా, తెనాలి, సాధనగ్రంథమండలి యందులభింపఁగలవు.)

ఏకోత్తరవారవృద్ధిగాఁ బఠించుటవలని లాభ##మేమనఁగా జడత్వవిశిష్టమైన క్షితిత త్త్వప్రాధాన్యముగల యా ఋతువునందు ఏకభకిత్తో మానవచిత్తముల నాక్రమించు డజత్వము తొలఁగి చిత్తమునందు రజస్తమస్సంపర్క మణఁగిపోయి సత్త్వగుణవికాసమేయగును. విద్యామయియుఁ జైతన్యమయియు నైన శ్రీదేవి నర్చించు ఫలముగాసాధకు లాత్మజ్ఞానదురంధరు లగుదురు. ఏకోత్తరవృద్ధిగాఁ బదిదినములు లక్ష్మీహృదయపాఠము అర్థజ్ఞానముతో అనఁగా మంత్రచైతన్యముతో శతార్థాధికముగా సాగును. సాధకుడంతర్యాగ సమారాధనజనితానంద నిష్ణాతుఁడై విజయవంతుండగును. అదిమొదలు విజయభేరి మ్రోగించుచు ఆర్నెలలు విధ్యుక్తముగా లక్ష్మీహృదయ పాఠము చేయుచుఁబోఁగా ''శ్రీపంచమి'' యనుపేరఁబరగు చైత్రశుద్ధపంచమి నాఁటికి బ్రహ్మభూతుఁడై ''ఆణ నెలలు సహవాసము చేయుదురేని వీరు వారగుదురు'' అనెడి సామెతను సార్థకము చేసి ''సకలం భద్రమశ్నుతే బ్రహ్మైవష సన్‌ బ్రహ్మాప్యేతి'' యనెడి ఫలమునుబూర్తిగాఁ బొందుదురు. ఇదే సకామముగా నైనపుడు ''లభేత సౌవర్ణమయీం చ వృద్ధిం'' బంగారుమున్నగు క్షణికానందకరధనవృద్ధి నొందుదురు. కేవలము మముక్షువులై చేయువారు సువర్ణమయవృద్ధిని అనఁగా బ్రహ్మనర్చో రూపధనవృద్ధి నొంది శ్రీదేవివలన మోక్షసామ్రాజ్యాభిషిక్తులగుదురు. సుశబ్దము బ్రహ్మమునకును. వర్ణశబ్దము వర్చస్సునకును జెల్లును. ''ఆయుః పృధివ్యాం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా'' అని శ్రీదేవిని నర్థించినది తప్పక చేపడును.

శ్లో|| య ఏకభక్తో7న్వహమేకవర్షం

విశుద్ధధీః సప్తతివారజాపీ|

స మందభాగ్యో7పి రమాకటాక్షా

ద్భవేత్సహస్రాక్ష శతాధికశ్రీః||

తా|| ఏసాధకుఁడు కేవలరమాదేవియందే భక్తిగల వాఁడై నిర్మలచిత్తుఁడై యొకసంవత్సరము దినమునకు డెబ్బదిసార్లుగా లక్ష్మిహృదయపారాయణము చేయునో; యతఁడు మందభాగ్యుఁడై యుండినను శ్రీదేవి కడగంటి చూపువలన వేఁగన్నులవాని యైశ్వర్యముకంటెను నూఱింతల సిరి ననుభవించును.

వి|| ఈమంత్రమందు అవిచ్ఛిన్నపాఠము, తీవ్రతర పాఠము, అధిక సంఖ్యాక పాఠము అనువాని ఫలమును అతిశ యించి చెప్పుచున్నాఁడు. దినమునుకు డెబ్బదిసార్లు పాఠము చేయుఁబూనుటయందుఁ దీవ్రత యుదయించునపుడే సర్వజాగతిక కార్యములయందును విముఖత ఏర్పడి ఆగ్రహముతోఁ జేయుటకు నధమము పండ్రెండుగంటలకాలము వెచ్చపడును. విద్యుక్తములుగాఁ ద్రికారణములను వత్సర కాలము శ్రీదేవీసేవ కే యొప్పించునపుడు సాధకుఁడు రమా కటాక్షపాత్ర మగుననుట వింత కాదు. అతిశయోక్తి కాదు. తాదాత్మ్యముతో జపము చేయు సాధకుఁడు సర్వైశ్వర్యసంపన్నుఁడగు నింద్రుని సిరికంటెను శతాధికైశ్వర్యము నొందుట సహజమే కాని అతిశయోక్తి కాదు. ఇచట సహస్రాక్షశబ్దమునకుఁ బురుషోత్తముఁడనియే యర్థము చెప్పికొన్నను ''లక్ష్యతే హరిణతి లక్ష్మిః'' అను వ్యుత్పత్యర్థమువలన భగవంతుఁడును దనసంకల్పసిద్ధికై తన కంటె వేరుకాని తనశక్తియైన లక్ష్మినే లక్షించువాఁడగుటచే ఇమ్మంత్రమందుఁ చెప్పఁబడినట్లు సాధనముచేయు వాఁడు తానను లక్ష్మీస్వరూపుఁడే యగుటచే శతాధికైశ్వర్య వంతుఁడగుటయు నతిశయోక్తి కాదు. ఈవిధముగా శ్రీశంకరరామానుజాద్యాచార్యులు తమచేసిన పెక్కు స్తుతులందు భగవత్కటాక్షప్రసారమహిమమును అతిశయోక్తులు కాని సూక్తులతో వర్ణించిరి.

శ్లో|| శ్రీశాంఘ్రిభక్తిం హరిదాసదాస్యం

ప్రసన్నమంత్రార్థ దృడైకనిష్ఠాం|

గురోస్మృతిం నిర్మలబోధబుద్ధిం

ప్రదేహి మే దేహి పరం పదే శ్రీః||

తా|| ఇమ్మంత్రమందు శ్రీదేవి నుద్దేశించి మున్ను చేసిన పలువిధముల యభ్యర్ధనములతో ఁదనివినొందక మఱి మూఁడుపద్యములతో అమ్మ నేమేమో యడిగికొను చున్నాఁడు. తల్లిచెంత నిది తనయులకు సహజమే.

వి|| శ్రీమాతా!నీపతియైనమహావిష్ణునిపాదభక్తినినాకిమ్ము. నేను దరించుటకుం బ్రకాశవిమర్శరూపవ్యాపకశక్తులే విష్ణుని రెండుపాదములు, సంతతము వాని యాలోచనము వాని ధ్యానమే నాతరణోపాయము. కావున విష్ణుపాదభక్తినిచ్చుటకుఁ దచ్ఛక్తివైన నిన్నే యాశ్రయించుచున్నాను. అది నన్ను విడకుండుటకు సంతతము హరిదాసులైవారికి దాసుఁడనై యుండుటే రెండవ యుపాయము. అది నాకుఁ బెట్టుము. అంతేగాక జపస్తుత్యాదులందు జాఱని యర్థజ్ఞానము తొలఁగకుండుటే యుపాయము. ''తజ్జపస్తదర్థభావనం, మధ్యే అర్థమనుస్మరన్‌'' అను నిట్టి శాస్త్రోపదేశములెన్నో యున్నవి. కావున మంత్రార్థజ్ఞాననిష్ఠ సాధకునకు మహోపకారిణి. కావున నిది నాకుఁబెట్టుము. ఇది లభించుటకు శ్రీహృదయమంత్రో పదేశము చేసిన శ్రీగురుని సంతతస్మరణమే యుపాయము. అది నాయందు నడలనీయకుము. వీనిచే నాబుద్ధియందు నిర్మలాత్మజ్ఞానము పాదుకొనును. నీకటాక్షవీక్షణముచే నిన్నిటి లాభము కల్గినపుడు పరమపదమనెడి మోక్షము సహితము నీవే యీఁగలవు. ఈ చరమ సిద్ధిప్రదానము నీపనియే. కనుక నిన్నంతగా నర్థించుచున్నాను.

శ్లో|| పృథ్వీపతిత్వం పురుషోత్తమత్వం

విభూతివాసం వివిధార్థసిద్ధిం|

సంపూర్ణసిద్ధిం బహువర్షభోగ్యాం

ప్రదేహి మేదేహి పరాంబికేత్వమ్‌||

తా|| శ్రీదేవీ! నాకు భూపాలకత్వము నిమ్ము. సాధకుఁడు అస్థిరభూపతిత్వమే కోరినప్పుడు రమాదేవి తప్పకీఁగలదు. కాని అంతర్యాగ సమారాధన చణుఁడైన సాధకుఁడు కేవల భూపతిత్వము నర్ధించుట హాస్యాస్పదము. ¸°గికసాధనమందు ఆరితేరిన సాధకుండు ముందుగాఁ గోరునది పృథ్వీతత్తవవిశిష్టమైన మూలాధారవిజయమే కోరును, కనుకనే సాధుకుల దానిని బిండాండారాష్ట్రమందుఅయోధ్యానగరముగా రూపించిరి. ''యోద్ధుమశక్యా అయోధ్యా'' భూతత్త్వవిశిష్ట మూలాధారమునుండి కుండలీనీపరాశక్తిని భక్తిభావదార్ఢ్యముతోఁ బ్రాణాయామాది విశిష్టప్రయత్నముతో జాగరితను జేయఁగలుగుటే పృథ్వీపతిత్వము, ఆపైని విశిష్టప్రయత్నము లేకయే సాధకునకుఁ బురుషోత్తమత్వము లభించును.

వి|| ఎటులనఁగాఁ బరాశక్తి తనస్థానమునువీడి వైకుఁఠము, కైలాసము, సత్యలోకము మున్నగు పేళ్ళతో వెలయు సహస్రారమున కిట్టె మెఱపుఁదీగవలెఁ బోవును. సాధనమంధంతగా నుత్తీర్ణుఁడైనవాఁడే పురుషోత్తముఁడు. విష్ణుఁడే పురుషోత్తముఁడు. సాధనచరమఫలముగా శ్రీతాదాత్మ్యము నొందిన వానికే విష్ణుత్వమబ్బుట వింతకాదు. ఈవిషయమున శ్రీశంకరులు సౌభాగ్యలక్ష్మీయుపాననసిద్ధినొందిన సాధకుని గొప్పతనము జిత్రముగా వర్ణించిరి.

శ్లో|| ''సముద్భూతస్థూలస్తనభరముర, శ్చారుహసితం

కటాక్షే కందర్పాః కతిచన కదంబద్యుతివపుః|

హరస్య త్వద్ర్భాంతిం మనసి జనయంతిస్మ విమలాః

భవత్యా యే భక్తాః పరిణతి రమీషామియముమే||

(నా తెనిగింపు)

బలిసిన చన్నుదోయినగుఁ బర్వున నొప్పు

నురంబు, రమ్యమౌ

నెలనగవూన్‌, గనుంగొనల నెందఱ మారులు,

éకడ్మిసౌరుతోఁ

బొలిచెడి మేనుఁగూడి శివుబుద్ధికి నీవను భ్రాంతిఁ

గొల్పిని

ర్మలులగు నీదు భక్తులకు రాజిలు మార్పిదియే

సదాశివా!''

తా|| అమ్మా! లక్ష్మీహృదయపాఠసాధనముచే నగువిభూతులు అనఁగా గొప్పతనము నాయందు నిల్వవలయును. పురుషోత్తమత్వలాభము కంటెను గొప్ప సిద్ధి మఱి యొకటి లేదు. అయినను ఐశ్వర్యమును గోరుచున్నాఁడు. ''యస్యామోఘసంకల్పస్స ఈశ్వరః'' ఎవ్వని కోరిక వ్యర్థము కాదో వాఁడీశ్వరుఁడు. అట్టివాఁడై యుండుట ఐశ్వర్యము. (విభూతి) మఱియు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి; ప్రాకామ్యము, ఈశత్వము, వశిత్వము అనునవి అష్ఠవిభూతులు, (సామర్థ్యములు) మోక్షార్థియైన సాధకునకుఁ దుచ్ఛములైన ఈ సిద్ధుల నర్థించుటేలయని శంకింపరాదు. ఏలన గృహస్థుఁడు ఎప్పుడు దేనిపనిపడునో యని తనకు నిత్యోప యోగులుగాకున్నను గడ్డపార, బొరిగె, కత్తి మున్నగు వస్తువుల సంగ్రహించుకొనునట్లే భౌతికశరీరముతో నున్నవాఁడు గావున నీశక్తులను ఇష్ట దేవత నాశ్రయించి సంగ్రహించుకొని యంచుకొనుట తప్పనిదిగానె తలఁచును. కావుననే చరమపురుషార్థమైన మోక్షముతోఁదనకై విభూతులను సయిత మర్థించుచున్నాఁడు '''వివిదార్థసిద్ధం' అన్నప్పుడు విలువిధములైన ప్రయోజనములనియే కాదు, తనయుపాస్య దేవతాస్తుతిసంకీర్తనములను రమ్యముగాఁజేసి దేవతోషణమును జేయఁదగిన రమ్యశబ్దార్థములను సయితము శ్రీదేవి వలనఁ గోరికొనుచున్నాఁడు ఇదియ సమజసమే. మఱియు సుచిరభోగ్యమైన సంపూర్ణసిద్ధిని అనఁగా ముక్తిసాధనమగు జ్ఞానసిద్ధిని సయితము పరవస్తుజ్ఞానమును బెట్టు తల్లీ! శ్రీమాతా! యని హృదయము కడు దయార్ద్రమగునట్లు ప్రార్థించుచున్నాఁడు.

శ్లో|| వాగర్థసిద్ధిం బహులోకవశ్యమ్‌

వయఃస్థిరత్వం లలనాసుభోగం

పౌత్త్రాదిలబ్ధిం సకలార్థసిద్ధిం

ప్రదేహి మే భార్గవి! జన్మజన్మని||

తా|| శ్రీవిద్యోపాసనము పురుషులకుఁ బరమజన్మమందె యబ్బునని కాళిదాసశంకరాచార్యాదులు పల్కిరి. ఇట నీ సాధకుఁడు ప్రారబ్ధ శేషభోగమునకై ఇంకం గొన్ని జన్మములు కాఁబోలునని యెంచియు అమ్మా! జన్మజన్మముల యందును నాకివి యిమ్మా యని యర్థించుచన్నాఁడు. నిన్ను స్తుతించుటకు యోగ్యమైన వాక్సంపదను, రమ్యార్థ సంపదను నాకుఁబెట్టుము. లోకుల నేకులు నాకు వశపడునట్లు చేయుము. మఱియు భూలోకజన్మినైన నాకు భువరాదిసత్య లోకపర్యంతము నునికి సిద్ధించునట్లు చేయుము; అనియుఁజెప్పవచ్చును. ''వయఃస్థిరత్వం'' అనఁగా అమరత్వమును సిద్ధింపఁజేయుము. ''లలనాసుభోగం'' అనఁగా విలాసవతులైన స్త్రీలతోడి భోగము నిమ్ము అనునపుడు జరావ్యాధినన్నాక్రమింపఁజేయకుండఁజేసి లలనాసంభోగలాభమును గూర్చపుమని కాదు. నీయుపాసనమువలఁగలుగు శక్తు అనుభవింపఁజేయుము; అని చెప్పుట తగును. ''పౌత్త్రాదిలబ్ధి'' మనుమలు, ముమ్మనుమలు పుట్టి నాకు జాగతికానందముఁ గూర్పఁ జేయమనియే కాదు. నావంశమందలి శ్రీవిద్యాసంప్రదాయమును నావలనఁబడయు శిష్యప్రశిష్యుల సంఖ్య పెంపొందింపుమని ఈకోరికయందలి రహస్యము; ఋషియుగమున బ్రహ్మవిద్యార్థులైన శిష్యులు పుత్రులుగానే వ్యవహరింపఁబడెడివారు. నైష్ఠికబ్రహ్మచారియైన కణ్వమహర్షి శకుంతలను దుష్యంతుఁడు తన యింటికిఁగొనిపో మఱలివచ్చునని వేచివేచి ఎప్పిటికిని రామికి సైఁపలేక పుత్త్రులను దోడిచ్చి దుష్యంతు నింటికిం బోఁబంపెనని కాళిదాసకృతియందుఁ గానవచ్చును. నైష్ఠిక బ్రహ్మచారియైన యామహర్షికి ఔరసపుత్త్రులుండుట యసంభవము. కావున నీసందర్భమున శిష్యలనే పుత్త్రులని పల్కినాఁడు. పైని బేర్కొనిన వన్నియు సిద్ధించుటే నకలార్థసిద్ధి యని తెలియవలయును.

శ్లో|| సువర్ణవృద్ధిం కురు మే గృ హే శ్రీః

కల్యాణవృద్ధిం కురు మే గృ హే శ్రీః|

విభూతివృద్ధిం కురు మే గృ హే శ్రీః

సౌభాగ్యవృద్ధిం కురు మే గృ హే శ్రీః ||

తా|| శ్రీమాతా! నాయింట బంగారును బెంపొందించుము. సువర్ణము రజతరత్నాదులకు నుపలక్షకము. సాధకవిషయమున నాలో శ్రేష్ఠమైన జ్ఞానమును బ్రహ్మర్చస్సును బెంపొందింపుము.

వి|| నాయింట శుభములను బెంపొందింపుము. సాధకవిషయమున అతీవశుభమతియు జ్ఞానమును, గామక్రోధాదిరాహిత్యమును దైవీసంపదయు మాత్రమే మంగళములు. అవి నాలోఁబెంపొందింపుము. సాధకలభ్యములగు శక్తుల గొప్పతనమే విభూతి దానిని బెంపొందింపుము. వెనుకటి మంత్రమున విభూతివిషయము విశేషించి చెప్పఁబడినది.

నాయింటి మంచి యైశ్వర్యము గీర్తి బెంపొందింపుము. సాధకపక్షమున సర్వజ్ఞత్వము, నిత్యతృప్తి, శ్రేష్ఠబోధము, అలుప్తి, సాధనపరాక్రమము, స్వతంత్రతమున్నగునవియే సౌభాగ్యము దానిని బెంపొందింపుము.

ఈలక్ష్మీహృదయస్తోత్రమందు గ్రంథకర్త సాధకుఁడు పరాశక్తిని శ్రేదేవిని అడిగినదే యడుగుటయఁజేసిన స్తుతియే చేయుటయఁ, గానవచ్చును, ఇది పునరుక్తిదోషము కాదు. యథార్థసాధకుఁడు శ్రీదేవీసాన్నిధ్యమును గల్పించుకొని స్తుతించి యాచించునపుడు తృప్తి నొందలేఁడు. సాధకొత్తములైన శ్రీశంకరాచార్యాదులు చేసిన స్తుతులయందు సహితము ఇట్టి పునరుక్తులు ఎన్నియో కానవచ్చును. కాని భక్త్యావేశముచేతను, భగవన్మహిమచింతనము సదాయగుచుండుటచేతను మైమఱచి తృప్తిలేక యడిగినదే యడుగుచుండును. కోరిన దేకోరుచుండును, చెప్పినదే చెప్పుచుండును. ఇది సాధకజనసహజము. నామతమున దోషము కాదు.

ఈహృదయస్తుతియందు ''ఆద్యాది లక్ష్మీహృదయం పఠేద్యః'' అనెడి మాటతో నారంభమగు తొంబదియాఱవ శ్లోఖమువ మొదలు నూటనాలుగువఱకు నైన ఫలస్తుతిప్రయోగాదులు గల శ్లోకములు తుది నుండవలసివి. వాని తరువాత మఱి నాలుగు ప్రార్థనపద్యములు చేరియుండుట కాన వచ్చును. ఇది లిఖితగ్రంథమందలి లేఖకుల పొరపాటొ, ముద్రాపకుల పొరపాటొ అయియుండును. కనకఁ దుది నాలుగుశ్లోకములను ఫలశృతిశ్లోకములకు అనఁగా శ్లోకములకు మున్నే ప్రయోగాదులు చదువుట సమంజసముగాఁ దోఁచును.

ఇది దేవ్యధర్వణరహస్యమందు

లక్ష్మీహృదయస్తోత్రము

సంపూర్ణము.

వ్యాఖ్యాత

శ్రీకాకుళవాసి

శ్రీ శ్రియానందనాథుఁడు

ఈశ్వర సత్యనారాయణ శర్మ.

*--*--*

Sri Laxmihrudayamu    Chapters