Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page

సదాశివబ్రహ్మేన్ద్రస్తుతిః

పరతత్త్వ లీనమనసే

ప్రణమద్భవబన్ధ మోచనాయాశు |

ప్రకటిత పరతత్త్‌వాయ

ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రాయ||

పరమశివేన్ద్రకరామ్బుజ -

సంభూతాయ ప్రణమ్రవరదాయ |

పదధూత పఙ్కజాయ

ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రామయ||

తృణపఙ్కలిప్త వపుషే

తృణతో7ప్యధరం జగద్విలోకయ తే|

వనమధ్యవిహరణాయ

ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రాయ||

నిజగురుపరమశివేన్ద్ర -

శ్లాఘిత విజ్ఞానకాష్టాయ |

నిజతత్త్వ నిశ్చలహృదే

ప్రణతిం కుర్మః సదాశివేన్ద్రాయ||

-శ్రీమచ్చి దానన్ద శివాభినవ

నృశింహభారతీస్వామి

శృఙ్గేరి.

మండలి మాట

పశూనాం పతిం పాపనాశం పరేశం

గజేన్ద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్‌ |

జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం

మహాదేవ మేకం స్మరామి స్మరారిమ్‌||

-శ్రీశఙ్కర భగవత్పాదాః.

ఎన్ని యున్నను మానవుడు 'అదికావలె-నిదికావలె'నని అంగలార్చుచునే యుండును. ఈ ప్రవృత్తి ఆత్మోపలబ్ధిచే మాత్రమే పరిపూర్ణముగా శాంతించును. ఆత్మానుభవసంపన్నుడు హర్షశోకముల కతీతుడై ప్రకాశించును. అందుచే ఆత్మలాభముకంటె గొప్ప లాభము వేరొకటి లేదు.

ఈ లాభమునకు శివారాధనము మార్గము.

భగవదారాధనము మూడుమెట్లుగా సాగుచుండును. తనకంటె వేరుగా - మృద్దారుశిలావిగ్రహాదులయందు భగవద్భావమును నిలిపి, ధ్యాన - ఆవాహనాదులైన ఉపచారములతో అర్చనసాగించుట మొదటిమెట్టు.

ఇవే ఉపచారములను ప్రత్యక్షముగా గాక - భావనాదార్ధ్య ముచే మనఃకల్పితద్రవ్యములతో - మనసునందే సుప్రతిష్టుతుడైన భగవంతు నర్చించుట రెండవ మెట్టు.

భగవంతునియొక్క సర్వాతిశయమైన మహామహిమాతి శయము - తెఱతొలగి - ఆత్మాభిన్నముగా అనుభవమునకు అందినపుడు - ఆశ్చర్యచకితులై - ఆహా! నేనెంత వెఱ్ఱివాడను ! విశ్వమయుడైన పరమేశుని ధ్యానించుట ఎట్లు సాధ్యము? అంతటను నిండియున్నవానిని ఆహ్వానించుట ఎట్లు? నేనింతవరకు ఉపచారముపేర భగవదపచారమునే సాగించితినని చింతించి చింతించి, పరమేశుని అద్వయస్థితియందు సుప్రతిష్ఠితుడై మౌనము వహించుట మూడవమెట్టు.

పరమాత్మను గూర్చిన స్తోత్రములుకూడ ఈమూడు మార్గములను అనుసరించినవి. మొదటిబాటలో సాగిన స్తుతుల సంఖ్య బహుళము. వానికంటె రెండవమార్గము ననుసరించినవి, వానికంటె మూడవదారిలో ప్రవర్తిల్లినవి సంఖ్యచే అల్పములు - మహిమచే అధికములు.

ఈశివమానసిక పూజాస్తోత్రము ఆమూడవమార్గమును అనుసరించి సాగిన స్తుతిరత్నములలో నొకటి. శ్రీసదాశివబ్రహ్మేంద్ర సరస్వతీస్వామి రచించిన స్తుతి ఇది. దాదాపు నూరు, నూట ఏబదేండ్ల వెనుక తమిళ##దేశమును విశేషించి కావేరీతీరమును తమబ్రహ్మ తేజముచే బ్రకాశింపజేసిన మహాత్ములు వారు.

పిచ్చుకుప్పిస్వామి - అనునది వారి నామాంతరము. వారి పాండిత్యమునకు సారము లేదు. వారి మహిమకు హద్దులు లేవు.

ఒకసారి వరదవచ్చిన కావేరిలో అందరును చూచుచుండగా స్వామి కొట్టుకొనిపోయినారు. 'స్వామి నిర్యాణము చెందినారు. ఇక మనకు స్వామి లేరు' అనియే లోకులు తలంచినారు.

వరదలు తగ్గినకొన్ని నెలలకు కావేరిప్రవాహముసన్న బడినది. ఇసుకతిన్నెలు బయల్పడ సాగినవి ఒకనాడొకచాకలి బట్టల నుడుకబెట్టుటకై పొయ్యినిర్మించుకొనదలంచి కావేరీతీరమందలి ఇసుకదిబ్బలోని ఇసుకను పారతో సరిచేయుచుండగా - బ్రహ్మ తేజముతో స్వామి బయల్పడినారు.

శ్రీరంగములో రంగనాథునకు జరుగు నీరాజనోత్సవమును చూడగోరినవానిని కనులుమూసుకొమ్మని అచటకు చేర్చినారనియు - ఒక జడుని నాల్కపై మంత్రాక్షరమును లిఖించి - పండిత శేఖరునిగామార్చినారనియు - ఇట్లు ఆస్వామి మహత్వము లనేకములు.

ఆస్వామి రచించిన రచన లనేకములు. వానియందీ స్తుతి చాలదొడ్డది. ఆస్వామిని గూర్చిన స్తుతిసముదాయముకూడ తక్కువకాదు.

'బ్రహ్మీభూత మహం సదాశివ (పర) బ్రహ్మాభిధానం భ##జే' స్వామిరచించిన ఈస్తుతి శ్రీశంకరభగవత్పాదుల 'పరాపూజాస్తోత్రము'వంటిది. దానికిని దీనికిని చాల సాదృశ్యము లున్నవి.

''అఖండే సచ్చిదానందే - నిర్వికల్పైకరూపిణీ

స్థితే7ద్వితీయభావే7స్మిన్‌ - కధం పూజా విధీయతే

పూర్ణస్యావాహనం కుత్ర - సర్వాధారస్య చాసనం

స్వచ్ఛస్య పాద్యమర్ఘ్యంచ - శుద్ధస్యాచమనం కుతః

ప్రదక్షిణా హ్యనంతస్య - హ్యద్వయస్య కుతో నతిః

వేదవాక్యై రవేద్యస్య - కుతః స్తోత్రం విధీయతే''

-పరాపూజా.

సదాశివబ్రహ్మేంద్రులవారు శ్రీశంకరభగవత్పాదులు వంటివారు అనుట అత్యుక్తికాదు.

స్వామి యొక్క ఈస్తుతిని అర్థతాత్పర్యవివరములతో భక్తలోక సమ్ముఖమం దుంచవలయునని సహృదయులైన ఒక శివభక్తాగ్రణులయొక్క ఆర్ధిక సహాయ ప్రేరణముతో ఈస్తుతిని మండలిలో అచ్చువేసినాము.

ఈస్తుత్యర్థమును గ్రహించి - భావించి - మననము సేయుట ఆత్మానందానుభూతికి ఒక అద్భుతమైన మార్గమును నిర్మించు కొనుట అని తెలియజేయుచున్నాము.

శ్రీముఖ- ఇట్లు

కార్తీక పూర్ణిమ బులుసు సూర్యప్రకాశశాస్త్రి

తెనాలి వ్యవస్థాపకుడు

సాధన గ్రంథ మండలి

శ్రీః

శ్రీ శివ మానసికపూజా స్తుతిః

అనుచిత మపలపితం మే

త్వయి నను శంభో తదాగసః శాన్త్యై

అర్చాం కథమపి విహితా

మఙ్గీకురు సర్వమఙ్గలోపేత|| 1

పతిపదార్థము:

నను-శంభో=ఓయి శంకరా! త్వయి=నీయెడ, మే=నాయొక్క (నాచే), అనుచితం-అపలపితం=అనుచితం భాషింపబడెను, తత్‌+ఆగసః-శాన్త్యై=ఆ పాపముయొక్క పరిహారమునకై, సర్వమంగళ+ఉపేత=సర్వమంగళతో గూడిన స్వామీ!, కథమపి=ఏదోరీతిగా, విహితాం=ఆచరింపబడిన, అర్చాం=పూజను, అఙ్గీకురు=స్వీకరింపుము.

తాత్పర్యము:

స్వామీ! శంకరా! నేనింతవరకు నిన్ను గూర్చి అనుచితములే భాషించి పాపమునే మూట గట్టితిని. ఓ సర్వమంగళాపతీ! ఇదుగో! ఆ పాప పరిహారమునకై నాబుద్ధికి దోచిన విధానమున (అది అశాస్త్రీయమే కావచ్చును) నిన్ను అర్చింప బూనుకొంటిని. నాయీ పూజను స్వీకరింపుము

వివరము:

ధ్యానము - ఆవాహనము - ఆసనము - పాద్యము మున్నగు ఉపచారములు సాధారణులయెడ జెల్లును. విశ్వమయుడు, చిన్మయుడు అయిన పరమేశునియెడ ఇట్టి ఉపచారములు ఆస్వామియొక్క సర్వవ్యాపకత్వమునకు - మనోవాగతీతస్థితికి - అద్వయత్వమునకు భంగము కలిగించుట లేదా! అందుచే - ధ్యాయామి - ఆవాహయామి - ఆసనం సమర్పయామి' ఇత్యాదులు శివుని విషయమున అనుచిత క్రియలే - అనుచిత భాషణములే.

స్తుతికర్తలు శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులవారు - లోక మొనర్చు షోడశోపచార రూపమైన శివపూజనమును తనయందారోపించుకొని 'అనుచిత మపలపితం మే' అనినారు.

శివుని సర్వతిశయ స్వరూపమును సాక్షాత్కరింప జేయుచు వారు పలుకబోవు స్తుతికి - ఇది అవతారిక వంటిది.

ధ్యాయామి కథమివ త్వాం ధీవర్త్మ విదూర దివ్యమహిమానమ్‌ |

ఆవాహనం విభోస్తే

దేవాగ్ర్య! భ##వేత్‌ ప్రభో! కుతః స్థానాత్‌ || 2

ప్రతిపదార్థము:

దేవాగ్ర్య=సర్వదేవతలకును ఆదియైన ఓ ప్రభూ! ధీవర్త్మ..... మహిమానం ధీవర్త్మ...మహిమానం. ధీవర్త్మ=బుద్ధియొక్క మార్గమునకు, విదూర=మిక్కిలి దూరమందున్న, దివ్య మహిమానం=దివ్యమైన మహత్త్వముగల, త్వాం=నిన్ను, కథమివ=ఎట్లుగా, ధ్యాయామి=ధ్యానింతును; విభోః=సర్వవ్యాపకుడవై అంతటను నిండియున్న, తే=నీయొక్క, ఆవాహనం=ఆవాహనము. కుతః స్థానత్‌=ఏచోటనుండి, భ##వేత్‌=సంభవమగును.

తాత్పర్యము:

సనాతనమూర్తీ! బుద్ధి వైభవమునకు అందని మహామహిమగల నిన్ను ధ్యానించుట ఏవిధముగ సాధ్యమగును? సర్వవ్యాపివై అంతటను నిండియున్న నిన్ను ఏచోటనుండి ఎచటకు రమ్మని ఆహ్వానింతునయ్యా ప్రభూ! అదికూడ సంభవము కాదు.

వివరము :

పరమాత్మ స్వరూపమును వాక్కులచే వర్ణించుట - మనసుచే చింతించుట సాధ్యముకాదు 'యతో వాచో నివర్తన్తే అప్రాప్య మనసా సహ' - అని శ్రుతి.

సర్వేంద్రియములతో సహ అంతః కరణవృత్తులన్నియు శాంతించిన మీదట మాత్రమే తెలియవచ్చు మహిమగల వానిని - ధీవృత్తిని జాగృతమొనర్చి ధ్యానమున జిక్కబట్టుదుననుట' అవివేకము అనుచితము.

ఒకచోట నున్నవానిని 'అయ్యా! ఇటు దయసేయుము అని లేనిచోటకు ఆహ్వానించుట ఉచితమే. కాని అంతటను నిండియున్న వానిని 'ఇటు దయసేయుమయ్యా! అని ఆహ్వానించుటలో ఔచిత్యమేమున్నది?

ఆ పిలువబడు ప్రభువు - మనము ఎచటనుండి రమ్మను చున్నామో - ఆచోటనే కాక - మనమెచటికి రమ్ననుచున్నామో - ఆతావునగూడ - మనము పిలుచుటకు ముందే నిండి యున్నాడు గదా!

అట్టియెడ - 'అచ్చట ఉన్న స్వామీ! ఇచ్చటకు రావయ్యా!' అని ఆహ్వానించుట యుక్తమా?

వాస్తవ మిట్లుండుటచే పరమేశుని గూర్చిన ధ్యానము' ఆవాహనము - రెండును అసంభవములే.

పరమేశుని మనోవాచామగోచరత్వమును, సర్వవ్యాపకత్వమును భావించి అనుభవించుట మత్రమే మనము చేయగల పని.

కియదాససం ప్రకల్ప్యం

కృతాసనస్యేహ సర్వతో7పి శివ|

పాద్యం కుతో7ర్ఘ్యమపివా

77పాద్యం సర్వత్ర పాణిపాదస్య|| 3

ప్రతిపదార్థము:

శిన=శివా, సర్వతః+అపి=అంతటను, కృత+ఆసనస్య=విరచితాసనుడవైన నీకు, ఇహ - ఇచట, కియత్‌+ఆసనం=ఎంత ఆసనము, ప్రకల్ప్యం=కల్పింపదగినది, సర్వతఃపాణి పాదస్య=అంతటను కాలుసేతులుగల నీకు, కుతః=ఎటనుండి పాద్యం వా =కాళ్ళు కడుగుకొనుటకైన నీరుకాని, అర్ఘ్యం+అపివా = చేతులు శుభ్రపరచుకొనుటకైన, జలముకాని, ఆపాద్యం=తీసుకొనివచ్చి ఏర్పాటు చేయవలయును?.

తాత్పర్యము:

ఇచట - అచట అనికాక అంతటను స్థిరాసనాసీనుడైన స్వామికి ఎంత ఆసనమును కల్పించుట? దానిని ఎచటనుండి తెచ్చుట? ఇవి రెండును అసంభవములే!

స్వామి పాదములు ఇచట ఉన్నవి, అచట లేవు - అని లేదు. అట్లే ఆయన చేతులును. ఆయన సర్వతఃపాణిదుడు. అట్టివానికి అర్ఘ్య - పాద్యములు నెచటనుండి తెచ్చి ఆపాదింపగలము?

వివరము:

'సర్వతః పాణిపాదం తత్‌ సర్వతో7క్షి శిరోరుహమ్‌' - అనిశ్రుతి. సాధారణుల విషయమున 'ఇవి కాళ్ళు-ఇవి చేతులు' అని నిర్దేశించి చూపగలము. అంతటను పాణిపాదములతో నిండి యున్న వాడు పరమాత్మ. అందుచే ఆ స్వామికి అర్ఘ్య. పాద్య సమర్పణము అసంభవమే, ఆయన మహిమను అవమానించు టయే - అగును.

'అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణఃస్థితః' లోన - వెలుపల అంతటను వ్యాపించి నారాయణు డున్నాడు అని శ్రుతి. (నారాయణుడు శివుని కంటె వేరుకాదు) అట్టి మహేశుని గూర్చి - 'ఆసనం సమర్పయామి' అనుట అవి చారిత రమణీయమేకాని సుసంగత మెట్లగును?

స్వామియొక్క నిభుత్వమును భావించి అనుభవింపవలె నని ఉపదేశము.

ఆచమనం తే స్యాదపి

భగవన్‌! భవ సర్వతోముఖస్య కథమ్‌|

మధు పర్కో వా కథమిహ

మధువైరిణి దర్శితప్రసాదస్య|| 6

ప్రతిపదార్థము :

భగవన్‌-భవ=దేవా! శంకరా!, సర్వతః+ముఖస్య, తే=అన్ని యెడల ముఖములున్న నీకు, ఆచమనం+అపి = ఆచమనార్థమైన జలమైనను, కథం = ఎట్లు, స్యాత్‌=సమకూడును?, మధువైరిణి=మధువుతో విరోధించిన వానియందు (శ్రీహరియందు), దర్శితప్రసాదస్య=చూపబడిన అనుగ్రహముగల నీకు, మధుపర్కోవా=మధుపర్కమైనను (పెరుగుతో కలిపిన తేనె), ఇహ = ఇచట, కథం=ఎట్లుతగును?

తాత్పర్యము :

స్వామీ! విశ్వముఖుడవైన నీకు ఆచమనార్ధజలమైనను - సమర్పించుట ఎట్లు సాధ్యము?

మధువిరోధి యెడ ప్రీతిని గనబరచిన నీకు' మధుపర్క సమర్పణము మాత్రము సమంజసమా?

వివరము :

'చమ - భక్షణ' అని ధాతువు. లెస్సగా త్రాపబడునది యగుటచే ఆచమనము. ఒకటో రెండో నోళ్ళున్నవానికి ఆచమనమునకు జలమందిపగలము. కాని అన్ని యెడలను మొగములున్నవానికి - మనమిచ్చు జలములో - మనచేతిలో కూడ మొగములున్నవానికి ఆచమనమునకై జలమిచ్చుట సంభవమా? ఈ హేతువుచే - పరమేశునిగూర్చిన షోడశోపచారపునిధియందు 'ఆచమనీయం సమర్పయామి' అనుట అనుచిత మే అగుచున్నది.

'మధువు' అనగా తేనె, అంతేకాక అది ఒక రాక్షసుని నామధేయము కూడ. ఆ రాక్షసుని హరి సంహరించెను. అందుచే హరి మధువైరి - మధుసూదనుడు అని పేరొందెను.

శివుడు మధువిరోధి (హరి) యెడ ప్రసన్నుడు. అనగా మధువునకు శత్రుపక్షమువాడు. అట్టివానికి మధుపర్క సమర్పణము - అనిష్టవస్తువు నిచ్చుట యగుచున్నదికదా! అను భావము ఇచట శ్లేషచే సంపాదింపబడెను.

ఇట్లీ స్తుతియందంతటను మనముసాగించు పరమేశుని గూర్చిన షోడశోపచారపూజనము - అకృతమతియైన బాలకుని చర్యవంటిదే కాని, అర్హమైన చర్య కాదనియు, పరిశీలింపగా ఈ ఉపచారములు ఆస్వామియెడ జేయు అపచారముల వంటివే అనియు నిరూపించుచు -

శివ స్వరూపము, తన్మహిమము అనుభ##వైకవేద్యము లని తెల్లముసేయబడెను.

స్నానేన కిం విధేయం

సలిలకృతేనేహ నిత్యశుద్ధస్య|

వస్త్రేణా పి న కార్యం!

దేవాధిపతే! దిగంబరస్యేహ||. 5

ప్రతిపదార్థము:

నిత్యశుద్ధస్య=సదా పరిశుద్ధుడవైయుండు పరమేశునకు నీకు, ఇహ =ఇచట, సలిలకృతేన = ఉదకముచే విరచితమైన స్నానేన=స్నానముచే, కిం, విధేయం=ఆచరింపదగినదే మున్నది? దేవాధిపతే=వేలుపుల నేలుసామీ, దిక్‌+అంబ రస్య=దిక్కులే కట్టుబట్టగాగలనీకు, ఇహ=ఇట, వస్త్రేణ+అపి=వస్త్రముతో గూడ నకార్యం=పని లేదు.

తాత్పర్యము :

ఓ పరమేశా! నిత్యము శుద్ధుడవైయుండు నీకు స్నాన ముతో బని యేమున్నది?

దిగంబరుడవుగానుండు నీకు వస్త్రముతో బని ఏమున్నది.

వివరము :

'స్నానం సమర్పయామి - వస్త్రం సమర్పయామి' అని రెండు పూజోపచారములు. అవి శివుని విషయమున వ్యర్ధము లని ఇందు నిరూపింపబడె.

మాలిన్యము అంటినచోట దానిని తొలగించుటకుగదా స్నానము? మాలిన్యము లేశ##మైనను ఎన్నడును ఎవనికి అంటదో - అట్టి నిత్యశుద్ధునకు స్నానమేమి క్రొత్త ప్రయోజనము కలిగించును?

స్వామి దిగంబరుడు. అట్టివానికి వస్త్రము దేనికి! అందుచే అదియును నిరర్ధకమే.

దిగంబర శబ్దమునకు దెసలే కట్టుబట్టగాగలవాడని, నగ్నుడనిఅర్ధము. దిక్కులు స్వామికి వస్త్రము గనుక - దిక్పాలురు స్వామియొక్క కట్టుబట్టకు కావలివారగుచున్నారు.

ఒకానొక కవి 'శాటీపాలాః - శతముఖముఖాః' అనినాడు. అనగా 'ఇంద్రాదులు శివుని గోచీని కావలికాయువారు' అని అర్ధము.

కాగా పరమేశునకు వస్త్రముతో బనిలేదు. అనంతుడైన ఆయన శరీరమును జుట్టి వచ్చుటకు తగిన వస్త్రమును సమర్పించుట కూడ అసంభవమే.

శివుని అనంతమైన మహిమా విభవమును దెలియజేయుటయే స్తుతికర్తల ఆశయం.

స్ఫురతి హి సర్పాభరణం

సర్వాఙ్గే సర్వమఙ్గళాకార!

అతివర్ణాశ్రమిణస్తే

7స్త్యుపవీతే నేహ కశ్చిదుత్కర్షః || 6

ప్రతిపదార్థము :

సర్వమఙ్గ ళాకార = సర్వ విధముల శుభాకృతివై ఓ మహేశా!. సర్వాఙ్గే=నీ సర్వాంగములయందును, సర్పాభరణం=సర్పాభరణము, స్ఫురతిహి=మెఱయుచున్నదికదా!, అతివర్ణాశ్రమిణః-తే=వర్ణములను - ఆశ్రమములను మీణియున్న నీకు, ఇహ=ఇచట, ఉపవీతే=ఉపవీత సమర్పణమున, కశ్చిత్‌=ఒకానొక, ఉత్కర్షః=గొప్పదనము, న=లేదు.

తాత్పర్యము :

శివా! శుభాకృతివైన నీకు సర్వాంగములయందును సర్పాభరణములు ముందుగనే వెలసియున్నవి. ఇట్టి నీకు నాగాభరణ సమర్పణములో అర్ధమేమున్నది?

బ్రాహ్మణాది వర్ణములను - బ్రహ్మచర్యాది ఆశ్రమ ములను మీరి ప్రకాశించు నీకు యజ్ఞోపవీతము తెచ్చు ఘనత ఏమున్నది?

వివరము :

శివపూజనమున 'నాగాభరణం సమర్పయామి' అని ఒక ఉపచారము. పాదాంగదములుగా - మొలత్రాడుగా - కరకం కణములుగా - భుజకీర్తులుగా - కంఠహారములుగా - కర్ణకుండలములుగా - జటాబంధముగా పాములనే సొమ్ములుగా దాల్చి యున్న వానికి నాగాభరణసమర్పణము ఉపచారమెట్లగును?

నాలుగు వర్ణములకు - నాలుగాశ్రమములకు అవ్వలివాడై ప్రకాశించు మహేశునకు, యజ్ఞోపవీతము నిచ్చుట ద్వారా ఆయనను వర్ణాశ్రమములలోనికి దెచ్చి నట్లై ఆ స్వామి ఘనతను తగ్గించినటు లగుచున్నది. భావింపగా ఇదియును తగిన ఉపచారము కాదనిపించుచున్నది.

స్వామియొక్క మహిమాతిశయమును గ్రహించి చింతించి శివో7హం భావనచే తరింపుడని ఉపదేశము.

గంధవతి హి తనుస్తే

గంధాః కిం నేశ పౌనరుక్త్యాయ ?

పుష్కర ఫలదాతారం

పుష్కరకుసుమేన పూజయే కిం త్వామ్‌ ||

ప్రతిపదార్థము :

ఈశ=ఓప్రభూ, తే, తనుః=నీ శరీరము, గంధవతీహి=సుగంధముగలది కదా (అట్టినీకు), గంధాః=గంధసమర్పణము, సౌనరుక్త్యాయ=పునరుక్తికై, నకిం=కాదా?, పుష్కర ఫలదాతారం=పుష్కలముగా ఫలితమును బ్రసాదించు, త్వాం=నిన్ను, పుష్కరకుసుమేన=తామరపూవుతో, కిం పూజయే=ఏమి పూజింతును?

తాత్పర్యము :

ఓ పరమేశా! నీశరీరమే సహజముతో పరిమళించు చుండగా నేనర్పించు ఈ గంధము దేనికి? ఇది పునరుక్తి యేగదా!

పుష్కలముగా ఫలదాతవైన నిన్ను పుష్కరముతదో తామరపూవుతో పూజించుట ఎట్లు ఉచితమగును?

వివరము :

చెప్పినదానినే చెప్పుట పునరుక్తి. ఇది దోషము దీని ఫలితార్ధమును గ్రహించి - ఉన్న దానినే ఇచ్చుట యందును ఈ శబ్దమును వాడుచుందురు.

పరమేశుని శరీరము సహజసుగంధయుక్తము. దానికి గంధ సమర్పణము పునరుక్తి యేకదా! అది దోషమేకదా!

'పుష్కరము' అనగా తామరపూవు. సంస్కృత భాషలో ర '-ల'లకు భేదము లేదు. అనగా పుష్కర - పుష్కల శబ్దాలకు భేదము లేదు.

శివుడున్నాడు. ఆయన తన్ను సేవించువారలకు పుష్కర ఫలితమును, ప్రసాదించును. ఆయన ఇచ్చునది 'పుష్కరఫలం' అయినపుడు మనము సమర్పించునది పుష్కర పుష్పం అయినపుడు ఈ సమర్పణ యుక్తమా? 'ఫలమాయన - పూవు మనము' అనుచితముగా లేదా?

'ఇలా భావించి సాధారణ షోడశోపచారపూజకంటె పై మెట్టుకు చేరుకొమ్ము' అన్నది స్తుతికర్తల ఉపదేశము.

శమధన మూలధనం త్వం

సకలేశ్వర! భవసి ధూపితః కేస |

దీపః కథం శిఖావాన్‌

దీప్యేత పురః స్వయంప్రకాశస్య|| 8

ప్రతిపదార్థము :

పరమేశ = ఓ మహేశా! త్వం=నీవు, శమధన మూల ధనం. శమధన=శాంతియే ధనముగాగల మునులకు, మూలధనం=మూల విత్తమై యున్నావు. (అట్టినీవు), కేన=దేనిచే, ధూపితః=ధూపితుడవగుదువు?, స్వయం ప్రకాశస్య=ఇతరాపేక్ష లేకయే ప్రకాశించు నీయొక్క, పురః=పురోభాగమున, దీపః=దీపము, కథం=ఎట్లు, దీప్యేత=ప్రకాశించును?

తాత్పర్యము :

మునులు శమధనులు. వారికి మూలధనమైయున్న నీకు ఓ స్వామీ! ఏ విధమున ధూప మర్పింపగలను? ఎట్లు ధూపిత నొనర్పగలను?

స్వయం ప్రకాశశీలివైన నీ యెదుట కొడిగట్టు దీపమేమి వెలుగులు జిమ్మగలదు?

వివరము :

తాము సంపాదించుకొను విత్తము చెల్లిపోయినపుడు మూలధనమును కదిపి సమస్యను నివారించుకొనుచుందురు, ఇది లోకపరిపాటి.

మునులకు శమమే ధనము. శమమనగా శాంతి. దానికి లోపము వచ్చినపుడు వారుకూడ తమ మూలధనమును (శివుని) ఆశ్రయింతురు. ఆశ్రయించి తిరిగి శమధనులు అగుచుందురు.

'ధూపం సమర్పయామి' అని అగురువత్తి వెలిగించు చుందుము. 'ధూప-సంతాపే' ధూపమనగా తపింపజేయునది. బాలెంతలకు, పసిబిడ్డలకు స్నానానంతరము సాంబ్రాణి ధూపముతో జుట్టు తడి ఆర్చుచుందురు.

శమథనులు శమమునకు లోపము కలిగిన భర్తీచేయు వాడు శివుడు. అట్టి శమ స్థానమును దేనితో ధూపితము (తాపితం) చేయగలము!.

కాగా ఈ ఉపచారం హిమనదములో అగ్గి పుల్ల విసురుట వంటిది.

ఇక 'దీపందర్శయామి' అనే ఉపచారమున్నది. సూర్యుడుదయించెనో లేదో తెలిసికొనుటకు దీపముతీసికొని వెళ్ళరు. అలాగే ఎవనిచే సూర్యచంద్రులు ప్రకాశించుచున్నారో, 'యస్యభాసా సర్వమిదం విభాతి' అట్టి స్వయం ప్రకాశశీలుని ఎదుట కొడిగట్టే దీపముంచుట ఏమి ఉపచారము?

'పరమేశ్వరుడు నీ దేవతార్చన పెట్టెలో ఇమిడిఉన్నాడు'. అనుకొంటే - నీవు సాధనలో 'ఒ.న. మ'ల లోనే ఉన్నట్లు. ఆయన మహిమాతిశయాన్ని గుర్తించు. లే! మేలుకో! అద్వయానంద ప్రాప్తికైన మార్గములో దృఢముగా అడుగుపెట్టు. అని ఉపదేశము.

అమృతాత్మకమపి భగవన్‌

అశనం కిం నామ నిత్యతృప్తస్య |

త్వయ్యామ్రేడిత మేతత్‌

తాంబూలం యదిహ సుముఖరాగే7పి|| 9

ప్రతిపదార్థము :

భగవన్‌=ఓ స్వామీ, నిత్యతృప్తస్య - నిత్యతృప్తుడ వైన నీకు, అమృతాత్మకం+అపి=అమృతము వంటిదే అయినను, అశనం=ఆహారము, కిం నామ=ఎందులకు?, సుముఖరాగే=చక్కని ముఖరక్తిమగల, (సజ్జనులయందనురాగముగల), త్వయి=నీ విషయమున. ఇహ యత్‌ తాం బూలం=ఇచట ఏ తాంబూల సమర్పణము జరుగుచున్నదో. ఏతత్‌+అపి=ఇదికూడ, ఆమ్రేడితం=పునరుక్తియే!.

తాత్పర్యము :

స్వామీ! అమృతాహారమైనను - నిత్యతృప్తుడవైన నీకు క్రొత్తగా కలిగించు ప్రయోజన మేమున్నది? చక్కని ముఖరాగముగల నీకు తాంబూలము పునరుక్తియే.

వివరము :

'ఆకలితో నున్నవానికి అన్నము తృప్తినిచ్చును' - 'తృప్తాఃస్థ? తృప్తాః స్మః' అన్నట్లు కడుపునిండి తృప్తి చెంది యున్న వారికి, అమృతమైనను అక్కరలేనిదే.

పరమేశుడు నిత్యతృప్తుడు. ఆయనకు మన మర్పించు అన్నాది నివేదనము -కడుపునిండిన వానియెదట పెట్టబడిన కదన్న కబళ##మే. (కదన్నము=కుత్సితాన్నము) అందుచే - నైవేద్యంసమర్పయామి' అనెడి ఉపచారము ఈశుని ఎదుట నిరర్థకమే అగుచున్నది.

'సుముఖరాగే' - సుముఖులు అనగా చక్కని ముఖము గలవారు. శివుని గీర్తించు ముఖమే సుముఖము. శివభక్తులే సుముఖులు. వారియందనురాగముగలవాడని ఒక అర్థము. చక్కని ముఖరక్తిమ గలవాడని వేరొక అర్ధము.

సుముఖరక్తునకు అన్నపుడు శ్లేషచే రెండర్ధములును సమావిష్టములగును. వానికి తాంబూలము 'ఆమ్రేడితము, కాగలదన్నాము. 'ఆమ్రడితం ద్విస్త్రిరుక్తం' ఒకేదానిని రెండుమూడుమారులు పలుకుట ఆమ్రేడితము. ఎఱ్ఱనిదానిపై ఎఱుపురంగు ఆమ్రేడితమేకదా!

సుముఖరక్తునకు తాంబూలము తెచ్చిపెట్టు క్రొత్త శోభ ఏమియును లేదు. అందుచే ఇదియును ఉపచారము కాదు.

ఈ విధముగా శివపూజలో - 'ధ్యానము మొదలు తాంబూలము' పర్యంతము సర్వోపచారములు బాలక చేష్టిత ములే - అనిచారిత రమణీయములే - అని నిరూపించి నీరాజన విషయమున స్తుతికర్త క్రొత్తదారిని త్రొక్కుచున్నారు.

ఉపహారీ భూయా దిద

ముమేశ యన్మే విచేష్టిత మశేషమ్‌ |

నీరాజయామి తమిమం

నానాత్మానం సుహాఖిలైః కరణౖః || 10

ప్రతిపదార్థము :

ఉమేశ=ఓ పార్వతీపతీ, మే=నాయొక్క, అశేషం=సమస్తమైన, విచేష్టితం=విశేషక్రియ, యత్‌=ఏది కలదో ఇదం=ఇదంతయు, ఉపహారీభూయాత్‌=నీకు ఉపహారమగు గాక, నానా+ఆత్మానం=అనేక రూపములతో నున్న, తం+ఇమం=ఆయీ నిన్ను, అఖిలైః కరణౖః, సహ=నా అన్ని ఇంద్రియములతోడను, నీరాజయామి=ప్రకాశింపజేయు చున్నాను.

తాత్పర్యము :

ఓ ఉమాపతీ! నా సర్వమైన చేష్టలను (కదలికలను) నీకు కానుక పెట్టుచున్నాను.

నానారూపములతో గోచరించు నిన్ను ఇదుగో! నాసర్వేంద్రియములతో డను నీరాజితు నొనర్చుచున్నాను.

వివరము :

తినుట-తిరుగుట-నిద్రించుట-భాషించుట-ఇత్యాదులు మన చేష్టలు-అపుడు మనము 'నేను తినుచున్నాను, నేను త్రావుచున్నాను,' అనియే భావించుచున్నాము.

అట్లుకాక ఓ స్వామీ! నా యీ 'నేను' నీవే. నాయీ సంచారము నీకొనర్చు ప్రదక్షిణమే. (తిరుగుచున్నవాడు.) దేనిచుట్టును దిరుగుచున్నామో అదియును శివాదన్యముకాదు. 'నేను తినుట - నీకు ఆహుతిని సమర్పించుట', 'నానిద్ర నిన్నొందుటకైన సమాధి.' అని భావించుటయే సర్విచేష్టితములను శివునకు కానుకపెట్టుట. ''ఆత్మాత్వం గిరిజామతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం సంచారః పదయోః ప్రదక్షిణవిధిః.... .....

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్‌.''

-శ్రీ శఙ్కరభగవత్పాదాం.

పరమేశుడు నానాత్ముడు. శబ్ద - స్పర్శ - రూప - రస గంధాత్మకమైన ప్రపంచము, తదితరము సర్వము శివరూపమే.

కన్ను చూచుచున్నది. చెవి ఆలకించుచున్నది. అను కొనుచున్నాము. కాని వాస్తవమునకు చూచునది కన్ను కాదు. ఆలకించునది చెవికాదు. అవి కేవలం గోళకములు.

పొయ్యిమీద పెట్టగా అన్నము ఉడుకుచున్నది. కాని ఉడికించునది పొయ్యికాదు, అగ్ని. పొయ్యిలో జ్వలించిన అగ్నియే పచనక్రియను సాగించుచున్నది.

అట్లే కంటిలో దూరి చూచుచున్నవాడు శివుడే, చెవిలో దూరి ఆలకించుచున్నది పరమేశు తేజమే. ఇట్లే సర్వేంద్రియ క్రియలును సాగుచున్నవి. ఇది యథార్థము - ఈ భావనను చెదర నీయక సాగించుటయే - ఈశ్వరు నింద్రియములతో నీరాజించుట.

''నేత్రాది జాలకోపాన్తే హృత్పద్మాసన లీలయా |

వారం వారం త్వయా దేవి రూపాదిమధు సేవ్యతే ''

అమ్మా! నీవే కన్ను అనెడి కిటికీ వద్ద పద్మాసనా సీనవై సర్వమును తిలకించుచున్నావు.' అని నాడొక సిద్ధుడు.

సుమనశ్శేఖర భవతే

సుమనో7ంజలి రేషకో భ##వేచ్ఛంభో !

ఛత్రం ద్యుమన్‌ ద్యుమూర్ధ్నః

చామరమపి కిం జితశ్రమస్య తవ || 11

ప్రతిపదార్థము :

సుమనః శేఖర=దేవదేవా, శంబో - శంభూ. ఏషః, సుమనో7ంజలిం=ఈ పుష్పాంజలి, భవతే=నీకై, కః-భ##వేత్‌=ఏమగునుగనుక, ద్యుమన్‌=సర్వాకాశవ్యాప్త విగ్రహుడవైన స్వామీ, ద్యుమూర్ద్నః=ఆకాశ##మే శిరముగాగల నీకు, ఛత్రం=గొడుగు, జితశ్రమస్య-తవ=శ్రమనుజయించిన నీకు, చామరం+అపి=వింజామరము కూడ, కిం=ఏమగును. (ఏమి ప్రయోజనము కలిగించును).

తాత్పర్యము :

దేవ దేవుడవైన నీకీ పుష్పాంజలి సర్పించుటచే ఏమిచ్చి నటులగును?

సర్వమైన ఆకాశమును వ్యాపించియున్న నీకు - ఆకాశ##మే శిరము గాగల నీకు ఛత్రధారణమెవడు సేయఁగలడు?

జితశ్రమునకు నీకు చామరవీజనము ఏమి ప్రయోజనము కలిగించును?

వివరము :

పుష్పాంజలి సమర్పయామి - ఛత్రం ధారయామి - చామరేణ వీజయామి - అనెడి ఉపచారములు వాస్తవమైన శివస్వరూపమును గుర్తించనంతవరకే ఉపచారములని ఇందు నిరూపించినారు.

సుమనశ్శబ్దమునకు 'దేవతలు, పూవులు' అని రెండర్థములున్నవి. 'సుమనశ్శేఖర' అనగా 'దేవశిరోమణి-అద్భుత పుష్పరాజము' అని అర్థములు.

సుమనశ్శేఖర విషయమున సుమనో7ంజల్యర్పణము ఉచితక్రియ ఎట్లగునని శ్లేషచే సాధించిన ఆక్షేపణము.

'ఆకాశశ్చికురాయ తే దశదిశాభోగో దుకూలాయతే' అని ఆకాశము స్వామియొక్క జుట్టుగా కీర్తింపబడినదిగదా! ఆకసమే శిరముగా గలవానికి గొడుగు పట్టుట ఎట్లు? అని ఛత్ర ధారణమును గూర్చియు -

శ్రమపడినవానికి వింజామరము సుఖమిచ్చును. అసలు శ్రమయే లేనివానికి వింజామరము దేనికి? అని చామర వీజనమును గూర్చియు ఆక్షేపణము.

నృత్యం ప్రథతాం కథమివ

నాథ! తవాగ్రే మహానటస్యేహ|

గీతం కిం పురవైరిన్‌

గీతాగమ మూల దేశికస్య పురః || 12

ప్రతిపదార్థము :

మహానటస్య, తవ=నటరాజువైన నీయొక్క, అగ్రే=ఎదుట, ఇహ=ఇచట, నృత్యం=నృత్యము, కథ మివ, ప్రథతాం=ఎట్లు ప్రసిద్ధమగును? పురవైరిన్‌=ఓత్రిపురద్వేషీ?, గీతాగమ మూల దేశికస్య పురః. గీత=గానము చేయబడిన, ఆగమమూల=వేదమూలముగల, దేశికస్య=గురుడవైన నీ యొక్క, పురః=ఎదుట, గీతం - కిం=గీతము (పాట) ఏమిటయ్యా?

తాత్పర్యము :

నటరాజువైన నీ యెదుట నాట్యమా! అదేమి విలువను దెచ్చును? ఆగమమూలమెవ్వనిచే గీతమో, అట్టి దేశికేంద్రుని ఎదుట గీతమా? అదేమి పేరుదెచ్చును?

వివరము :

'నృత్యం దర్శయామి - గీతం శ్రావయామి' అను ఉపచారముల వ్యర్ధత ఇందు నిరూపింపబడెను.

స్వామి నటరాజు. స్వామి గీతాగమ మూల దేశికుడు. గీతాగమము అనగా సామవేదమనియు అర్థము. సామవేదము నుండియే సంగీతము పుట్టెను. అట్టి సామవేదమునకే మూల మైనవాడు స్వామి. 'యస్య నిశ్వసితం వేదాః' - అని శ్రుతి (వేదములు పరమేశుని నిట్టూర్పులు).

అందుచే నృత్యదర్శనము - గీత గానము అనునవి స్వామి యొక్క మహామహిమను గుర్తింపనంతవరకే ఉపచారములని తెల్లము చేసినారు.

వాద్యం డమరుభృతస్తే

వాదయితుం వా7పరే7స్తి కాశక్తిః |

అపరిచ్ఛిన్నస్య భ##వే

దఖిలేశ్వర! కః ప్రదక్షిణవిధి స్తే || 13

ప్రతిపదార్థము :

డమరుభృతః=డమరువును దాల్చిన, తే=నీకు (నీ ఎదుట), వాద్యం, వాదయితుం=వాద్యము వాయించుటకు, అపరే=ఇతరునియందు, కా-శక్తిః-అస్తి=సామర్ధ్యమేమున్నది? అఖిలేశ్వర=సర్వేశ్వరా, అపరిచ్ఛిన్నస్య=అనంతుడవైన, తే=నీకు, ప్రదక్షిణవిధిః=ప్రదక్షిణమొనర్చుట, కః=ఏమిటయ్యా,

తాత్పర్యము :

ఎల్లవేళల డమరువును ధరించు వాద్యవిద్యాచార్యుడ వైన నీ ఎదుట వాద్యమెవరు వాయింపగలరు?

అనంతుడవైన నిన్ను ప్రదక్షిణించుట ఎట్లు?

వివరము :

వాద్యోపచారము - ప్రదక్షిణక్రియ - ఇందు ఆక్షేపింపబడెను. ఇతరము స్పష్టము.

స్యుస్తే నమాంసి కథమివ

శఙ్కర పరితో7పి విద్యమానస్య |

వాచామగోచరే త్వయి

వాక్ర్పసరో మే కథం ను సంభవతు || 14

ప్రతిపదార్థము :

శఙ్కర=ఓ శంకరా!, పరితః=అంతటను, విద్య మానస్య=ఉన్న, తవ=నీకు, నమాంసి=నమస్కారములు, కథమివ స్యుః=ఎట్లు అగును (కుదురును), వాచాం+అగోచరే=వాక్కులకందని, త్వయి=నీ యెడ, మే=నాయొక్క వాక్ప్రసరః=వాక్ర్పసారము, కథం ను=ఎట్లు, సంభవతు=సంభవించును !

తాత్పరయము :

శంకరా! అంతటను నిండియున్న నీకు నమస్కరించుట - వాక్కులకందని నీయెడ వాగ్వినియోగము సాధ్యమా?

వివరము :

మన ఎదుటనున్నవానికి మనము మ్రొక్కగలము. మన ఎదుట - వెనుక - పార్శ్వములయందు - ఊర్ధ్వాధో భాగముల మాత్రమే గాక - మనయందును నిండియున్నవానికి మ్రొక్కుట ఎట్లు?

మన ఇంద్రియములున్నవి. వానివెనుక మనస్సు - దాని వెనుక బుద్ధి - 'బుద్ధేరాత్మామహాన్‌ పరః' బుద్ధికి వెనుక ఆత్మ (శివుడు) ఉన్నారు.

వాక్కు అనునది ఇంద్రియము. అది బహిఃప్రసరణ శీలము. అది తానెటనుండి ఆవిర్భించుచున్నదో, దానికిని దవ్వైనచోటనున్న వాని యందెట్లు ప్రసరించును?

'యతో వాచో నివర్తన్తే - అప్రాప్య మనసా సహ' - శ్రుతి. ఇట్లు నమస్కారము - వాక్కులచే వర్ణించుట - అనునవి సర్వేశ్వరు మహామహిమము గుర్తించినపుడు ఉపచారములు కానేరవని ఇందు నిరూపింపబడెను.

నిత్యాననాయ నమో

నిర్మల విజ్ఞాన విగ్రహాయ నమః |

నిరవధి కరుణాయ నమో

నిరవధి విభవాయ తేజసే7స్తు నమః || 15

ప్రతిపదార్థము :

నిత్యానన్దాయ=సదా ఆనందమయుడైనవానికై, నమః=నమస్కారము, నిర్మల విజ్ఞాన విగ్రహాయ=నిర్మల జ్ఞానమే రూపుగాగల సామికై, నమః=దండము, నిరవధి-కరుణాయ=అపారకరుణామూర్తికై, నమః=ప్రణామము, నిరవధి విబవాయ=హద్దులేని వైభవముగల, తేజసే=తేజము కొరకు, నమః అస్తు=ప్రణిపాతము అగుగాక!.

తాత్పర్యము:

అనవరత మానందమయుడైనవానికి దండము - నిర్మల జ్ఞాన శరీరికి మ్రొక్కు. నిస్సీమ కరుణామూర్తికి దోయిలి. అవధిలేని విభవముగల స్వామికి అంజలి.

వివరము :

ఇపుడే కదా అనంతుడైన మహేశునకు మ్రొక్కుట అసంభవము అనినారు. మరల వెంటనే ఈ నమస్కారములేమి? అనిశంక.

'నమః' అను శబ్దమును రెండుగా విడదీసి-(న+మః) 'మః=జీవుడు, న=కాను' అని అర్ధము చెప్పుదురు. నమశ్శబ్దమునకు వెనుకనున్న చతుర్థీ విభక్తికి ఏకత్వమును అర్థముగా చెప్పుదురు. 'చతుర్థ్యైక్యై'.!

'శివాయనమః అన్నపుడు-మః=జీవుడు, న=కాను, శివాయ (ఏకత్వముచే)-శివుడనే అని అర్థము. ఇచటను అట్టి అర్థమునే గ్రహింపవలెను. (వెనుకటి ఆక్షేపణము సాధారణార్థముననే చెల్లును)

నిత్యానందమే నేను, నేను జీవుడనుకాను. నిర్మలజ్ఞానమే నారూపు. నిస్సీమ కరుణామూర్తితో - అపారవైభవస్ఫూర్తితో నాకు ఏకత్వము. అని భావము.

సరసిజ విపక్ష చూడః

సగరతనూజన్మ సుకృత మూర్ధా7సౌ |

దృకకూలంకషకరుణో

దృష్టిపథే మే7స్తు ధవళిమా కో7పి || 16

ప్రతిపదార్థము :

సరసిజవిపక్షచూడః. సరసిజ=తామరలకు, విపక్ష=శత్రువైనవాడు (చంద్రుడు), చూడః=జడలయందుగలవాడు.

సగర.... .... మూర్ధా.

సగర=సగరుని, తనూజన్మ=పుత్రులపాలిటి, సుకృత=పుణ్యమైనది (గంగ), మూర్ధా=శిరమునల, అసౌ=ఈ, దృక్‌+కూలంకష కరుణః. దృక్‌=కన్నుల, కూలం కష = కడ లనురాయు, కరుణః = కరుణగల, కః+అపి=ఒకానొక, దశళమా=ధావళ్యము (తెల్లదనము), మే=నా యొక్క, దృష్టిపథే=దృష్టిమార్గమున, అస్తు=వెలయునుగాక!.

తాత్పర్యము :

జడలలో చంద్రుని తురుముకొన్నది. సగరపుత్రుల సుకృతపరీపాకమైన గంగను తలపై ధరించినది - కరుణచిందు కన్నులుగలది - అయిన ధవళ##తేజమొకటి నా కనుల యెదుట సాక్షాత్కరించుగాక!

వివరము :

ఇంతవరకు విశ్వమయుడు ఆత్మాభిన్నుడు అయిన మహేశుని మహిమాతిశయమును గీర్తించి - ఇపుడు కొంచెము దిగి వచ్చి, పురాణకథా ప్రసిద్ధమైన మహేశమూర్తిని తన పురోభాగమున ఉన్నట్లు భావించి స్తుతించుచున్నారు.

కపిలుని కోపాగ్నికి బూదిగా మారిన సగరకుమారులు భగీరథుడు తెచ్చిన గంగచే తరించిరి. అందుచే గంగ సగర కుమారుల సుకృత పరీపాకమైనది.

పరమేశుడు తెల్లనివాడు. 'ఇది ఇట్టిది' అని నిర్వచించుటకు వీలుకానిదగుటచే ''కో7పి'' ఒకానొక - అని పేర్కొన బడెను. పరమేశుని ధావళ్యము పరమేశునకు ఉపలక్షకము.

జగదాధార శరాసం

జగదుత్పాద ప్రవీణ యన్తారమ్‌ |

జగదవన కర్మఠ శరం

జగదుద్ధారం శ్రయామి చిత్సారమ్‌ || 1

ప్రతిపదార్థము :

జగదాధార శరాసం.

జగత్‌+ఆధార=లోకములకు ఆధారమైనది (మేరువు), శరాసం=విల్లుగాగలవానిని, జగదుత్పాద....యన్తారం. జగత్‌=లోకములను, ఉత్పాద ప్రవీణ=సృష్టించుటయందు నేర్పుగలవాడు (బ్రహ్మ), యన్తారం=సారధిగాగలవానిని, జగదవన... ... శరం, జగత్‌=లోకములను, అవన కర్మఠ =రక్షించు పనిలో, శూరుడైనవాడు (హరి), శరం=బాణముగా గలవానిని, జగత్‌+ఉద్ధారం, =లోకోద్ధారకుని, చిత్సారం=జ్ఞానసారుడైన శివుని, శ్రయామి=ఆశ్రయించుచున్నాను.

తాత్పర్యము :

మేరు పర్వతమును విల్లుగాబూని, నారాయణుని బాణముగా చేగొని - సృష్టికర్తను రథసారథిగా స్వీకరించి - త్రిపురా సురులపై దండెత్తిన - జగదుద్ధారకుని, జ్ఞానసారుని నేనాశ్రయించుచున్నాను.

వివరము :

లోకములన్నియు మేరువును ఆధారముగాను గొని నిలిచిన యున్నవి. భూలోకమునకే కాదు, స్వర్గాది ఊర్ధ్వలోకములకు, పాతాళమువరకైన అధోలోకములకుకూడ మేరువే ఆధారము.

తిప్రురాసుర సంహారమునకు సన్నద్ధుడైన మహేశుని చేతిలో ఆమేరువే విల్లై వంగినది. భూమి రథమై - సూర్య చంద్రులు రథచక్రములై- వేదములు ఆ రథమును లాగు గుఱ్ఱములై ఒప్పినవి. సృష్టికార్యదక్షుడైన బ్రహ్మరధసారధి కాగా - లోకరక్షాధురీణుడైన నారాయణుడే స్వామి చేతిలో శరణమయ్యెను.

ఇదంతయు త్రిపురాసురసంహారమునకైన స్వామి సంగ్రామ యాత్రా సన్నాహము.

స్థూల - సూక్ష్మ - కారణ శరీరములే త్రిపురములు. వాని యందు 'నేను - నేను' అను తాదాత్మ్య భావనలే అసురులు. సాధకుని వెన్నుపూసయే మేరువు. 'ఇడ-పింగళ' నాడులే సూర్యచంద్రులు, మనసే బ్రహ్మ. మూలాధారమునుండి సాగు ప్రణవనాద ప్రశాంతావస్థయే నారాయణుడు.

అనగా ఉత్తమ సాధకుడు సమకాయ శిరోగ్రీవుడై కూర్చుండి - ఏకాగ్రచిత్తుడై మూలాధారమునుండి సహస్రారమువరకు ఎడతెగక ఓంకారనాదమును అనుసంధానము చేయుచువచ్చినచో - సూల - సూక్ష్మ - కారణ శరీరములతో వానికి అంతవరకు సజీవముగానున్న తాదాత్మ్యము - అసుర త్రయము రాలిపోవును. వాడు జాగ్రత్‌ - స్వప్న - సుషుప్తులకు అవ్వలిదైన తురీయమును జేరి భవబన్ధవియుక్తుడై ప్రకాశించును.

ఈ సాధనమందు మనస్సే (మనో-బుద్ధి-చిత్త-అహంకార రూపమైన అంతఃకరణమే) చతుర్ముఖ బ్రహ్మ,

గుఱ్ఱములు రథమును లాగినట్లు సాధకమనోనివిష్టమైన వేదధర్మాచరణ ప్రవృత్తియే ఈ పనిని ముందుకు సాగించును.

ఇట్లు స్థూలమైన మఱియు సూక్ష్మమైన త్రిపురాసుర కథాసారము ఇందు సంస్మరింపబడెను.

'శ్రి - శ్రయే' ఆశ్రయించుట. అనగాపట్టుకొఉటకాదు, తాను - అది ఒకటి అగుట, ఉత్తమ సాధకుడు దృఢదీక్షతో సాధనమార్గమున బ్రవర్తిల్లి తురీయావస్థను జేరుకొన్ననాడు ఆసాధకుడు శివుడే అగును.

స్తుతికర్తలైన శ్రీ సదాశివ బ్రహ్మేంద్రులవారు - తమకు నిత్యానుభవసిద్ధమైన - 'స్థూల - సూక్ష్మ - కారణ శరీరము లను దాటి తురీయమును జేరుకొనుట కైన సాధనవిధానముననే ఇందానందుమతో వర్ణించియున్నారు.

కువలయ సహయుధ్వగళైః

కులగిరి కూటస్థ కుచభీరార్ధా ఙ్గైః |

కలుషవిదూరైశ్చేతః

కబలిత మేతత్‌ కృపారసైః కైశ్చ || 18

ప్రతిపదార్థము :

కువలయ - నల్ల కలువలతో, సహయుధ్వ=పోటీపడు, గళైః=కంఠముగల, కులగిరి .... ... ర్థాంగైః కులగిరి=కుల పర్వతములకు, కూటస్థ=మూలపురుషుడైన మేరువువంటి' అర్ధాఙ్గైః=అర్థ శరీరముగాగల, కలుషవిదూరైః=కాలుష్య మునకు మిక్కిలి దవ్వున నున్న, కైశ్చ-కృపారసైః=అని ర్వచనీయ, కృపారస ప్రవాహములచే, మే=నా యొక్క, ఏతత్‌ ఈ చేతః=మానసము, కబళితం=కబళముగా గొనబడెను (మింగబడెను - తినబడెను)

తాత్పర్యము :

నల్లకలువలతో పోటీపడు కంఠచ్ఛాయతో బంగరు కొండలవంటి రొమ్ముల జంటతో నొప్పుచున్న ఉమాదేవిచే ఆక్రాంతమైన అర్థదేహముతో - పాప దూరమై ప్రకాశించు అనిర్వచనీయ కృపాప్రవాహములు - నా చిత్తమును కబళించినవి.

వివరము :

నా చిత్తమును ఉమేశుడాహరించినాడు. కాగా నాకు వేరే చిత్తములేదు. చిత్తమే లేదుగాన శివాదన్యమైన భావము లేశమును నాయందు లేదు'. అని స్తుతికర్తలు అనుచున్నారు.

''తల్లియొక్క రొమ్ము బలముగా ఎత్తుగా ఉండుట - బిడ్డకు కావలసిన పోషకద్రవ్యము సమృద్ధిగా కలదని సూచించును. జగజ్జనని యైన ఉమాదేవికి ఈ లోకమంతయు సంతానమే. అట్టి తన సంతానమైన జగత్తును లౌకికముగా ఆధ్యాత్మికముగా పోషించుటకు తగిన ద్రవ్యము ఆమెయందు నిండుగా ఉన్నదనుటకై - రొమ్ములను అలా ఎత్తుగా వర్ణించుట జరిగినది - ఇదంతయు జగత్పోషక ద్రవ్య సమృద్ధి సూచకము.

స్వస్వరూపము కంటె అన్యమైనదానితోడి సంపర్కము కాలుష్యము.

అనగా - మసిగిన్నెను శుభ్రముగా తళతళ మెఱయునట్లు తోమి కడిగినాము. గిన్నె యందు మసిలేదు. కాలుష్యము తొలగినది అనుకొనుచున్నాము.

కాని గిన్నె కంటె వేరైన నీటితడిదానికంటి యున్నంత వరకు అది'శుద్ధము' అనబడదు.

అటులే సంసారాసక్తిని బెంచు కామక్రోధములే కాదు - వానిని పరిహరించుటకు ఉపయోగించు చిత్తవృత్తికూడ దూష్యమైనదే, అదికూడ శాంతింపవలెను.

ఏ చీపురుతో గదిని శుభ్ర మొనర్చినారమో - ఆ చీపురును మూలబడవేసి చేతులు కడుగుకొనవలెను. సాధకుడు వైరాగ్య ప్రబోధకమైన ఏ చిత్తవృత్తిని రేకెత్తించి - కామ క్రోధములను సంసారాసక్తిని అవ్వలకు నెట్‌ఇవేసినాడో - ఆవైరాగ్య ప్రబోధక చిత్వవృత్తి కూడ కాలుష్యమే. స్వస్వరూప ఉపలబ్ధియందు ప్రతిబంధకమే. అదికూడ శాంతింపవలెను.

పరమేశుడు 'కలుషవిదూరుడు' అనగా నిస్తరంగ సముద్ర మువలె శాంతుడు అని అర్థము.

వసనవతే కరికృత్త్యా

వాసవతే రజతశైలశిఖరేణ |

వలయవతే భోగభృతా

వనితార్ధాంగాయ వస్తునే7స్తు నమః|| 19

ప్రతిపదార్థము :

కరికృత్త్యా=గజచర్మముచే, వసనవతే=వస్త్రముగలదై, రజతశైలశిఖరేణ=వెండికొండ కొమ్ముచే, వాసవతే=నివాసవంతమై, భోగభృతా=పడగగలవానిచే, (సర్పముచే) వలయవతే=కంకణవంతమై, వనితార్ధాంగాయ=ఆడుదానిచే, అర్ధదేహియైన, వస్తునే=వస్తువుకొరకు, నమః-అస్తు-నమస్కార మగుగాక!.

తాత్పర్యము :

గజచర్మాంబరధరము, కైలాసశిఖరావాసము - సర్పకంకణము - అర్ధాంగీకృతదారము అగు వస్తువును బ్రస్తుతించు చున్నాను.

వివరము :

శబ్ద - స్పర్శ - రూప - రస గంథములు విషయములు. అడవు లలో వృక్షవైవిధ్యమున్నది. అట్లే వీనియందును వైవిధ్య మున్నది. అందుచే ఇవి విషయారణ్యములు.

అడవిలోనికి బోవు మదగజమువలె నిలుపరానిదై మానసము విషయారణ్యములయందు విమరించుచుండును.

అట్టి మనోరూపమైన మత్తగజము నిష్ర్పాణమై - నిశ్చల తను భజించిన ఉత్తరక్షణమందే స్వామి సాక్షాత్కరించును. అనుభవమునకు వచ్చును. అంతవరకు తలఎత్తి ఉన్న 'నేను' అంతర్థానమై - ఆనందసాగరము నందనంత విహారమారంభమగును.

అందుచే స్వామిని గజచర్మధరుడన్నారు. 'సర్పకంకణుడు - వనితార్ధాంగుడు' వీని వివరము సాధకుడు కొన్ని మెట్లెక్కి వచ్చినపుడు మాత్రమే తెలియును.

సరసిజ - కువలయ జాగర

సంవేశన జాగరూక లోచనతః |

సకృదపి నా7హం జానే

సుర మితరం భాష్యకారమఞ్జీరాత్‌ || 20

ప్రతిపదార్థము :

సరసిజ... .... .... లోచనతః,

సరసిజ=తామరపూవులను, కువలయ=కలువ పూవులను, జాగర=మేలుకొలుపుటయందు, సంవేశన-నిద్ర బుచ్చుటయందు, జాగరూక=జాగ్రత్తవహించిన వారు (సూర్యచంద్రులు), లోచనతః=కన్నులు గాగలవానికంటె, భాష్యకార=వేదాంతభాష్యకారులైన, మఞ్జీరాత్‌=పాదాం గదములుగల స్వామికంటె, ఇతరం సురం=వేరుదైవమును, అహం-న-జానే=నేనెఱుగను.

తాత్పర్యము :

సూర్యచంద్రులే కన్నులుగాగల - వేదాంత సూత్ర భాష్యోక్తులను నినదించు కాలి అందెలు గల - వేలుపుదొరకంటె, వేఱుదైవతమును నేనెఱుంగను.

వివరము :

సూర్యుడుదయింపగా తామరలు వికసితములగును. కలువలు ముకుళితములగును. చంద్రుడుదయింపగా తామరలు వికాసమును గోల్పోయి, కలువలు, వికసితములగును.

అట్టి సూర్యచంద్రులే స్వామి కన్నులు. ఈ సూర్యచంద్రులు స్థూలజగత్తునందే కాదు, సాధకుని పిండాండమునగూడ ఉన్నారు.

''హృదయస్థా రవిప్రఖ్యా

శిరః స్థితా చంద్రనిభా''

-లలితాసహస్రము

సాధకుడు తన పిండాండమున సూర్యచంద్రులను దర్శింప గల్గెనేని, మహేశుని ప్రసన్న దృక్కులు వానిపై బ్రసరించినటులే.

ఎవరైన వచ్చుచున్నపుడు వారిరాకకంటె ముందుగా వారి కాలి సవ్వడి కర్ణగోచరమగును. బ్రహ్మసూత్రభాష్యోక్తులు పరమేశుని పాదమంజీరధ్వనులే. అనగా - సూత్రభాష్య మందాసక్తి - పరమేశుని రాకకు సూచకము.

ఆ పాటల జాటానా

మానీలచ్ఛాయ కంధరా సీమ్నామ్‌ |

ఆపాండు విగ్రహాణాం

ఆదృహిణం కిఙ్కరా వయం మహసామ్‌ ||

ప్రతిపదార్థము :

ఆ పాటల జాటానాం=అంతటను ఎఱుపువన్నెకు దిరిగిన జడలుగల, ఆనీల+ఛాయకంధరాసీమ్నాం. ఆనీలచ్ఛాయ=అంతటను నలుపు వన్నె నాకలించుకొన్న, కంధరాసీమ్నాం=కంఠదేశముగల, ఆపాండు విగ్రహాణాం. ఆపాండు=అంతటను తెలుపువన్నెతో ఒప్పుచున్న, విగ్రహాణాం=ఆకృతిగల, మహసాం=తేజములకు, ఆద్రుహిణం=బ్రహ్మకల్పపర్యంతము' వయం=మేము, కింకరాః=కింకరులము - (సేవకులము).

తాత్పర్యము :

జడలయందెఱుపు - కంఠమున నలుపు - దేహమున తెలుపు అయిన తేజములను - బ్రహ్మదేవుని ఆయువు చెల్లిపోవు వరకు మేము సేవింతుము.

వివరము :

'తెలుపు - ఎఱుపు - నలుపు' సత్వ-రజ-స్తమో గుణ సూచకములు.

శివుడు కదలని తమోగుణము - వెలవెలబాఱిన రజోగుణము - తళతళలాడు సత్వగుణము కలవాడని అర్థము.

సాధకునియందు తమోగుణము చలనరహితమైనపుడు - రజోగుణము దాదాపు నిర్జీవమైనపుడు - శుద్ధ సత్వము ధగధగ మెఱయజొచ్చినప్పుడు మాత్రమే శివసాయుజ్యలాభమని ఉపదేశము.

ముషిత స్మరావలేపే

మునితనయాయుర్వదాన్య పదపద్మే |

మహసి మనో రమతాం మే

మహతి దయాపూర మేదురాపాఙ్గే || 22

ప్రతిపదార్థము :

ముషిత స్మర+అవలేపే. ముషిత=హరింపబడిన, స్మర=మదనుని, అవలేపే=గర్వముగల-, ముని ... ... పద్మే. మునితనయ=ముని కుమారునకు (మృకండు పుత్రునకు), ఆయుః+వదాన్య=ఆయువును దానము చేసిన, పదపద్మే=పాదపద్మముగల, దయా=ఆపూర... పాంగే. దయాపూర=కరుణారసముచే, మేదుర=దట్టమైన, అపాఙ్గే=కడగంటి చూపులుగల, మహతి, మహసి=గొప్ప వెలుగులో, మే మనః=నామానసము, రమతాం=క్రీడించుగాక!.

తాత్పర్యము :

కాముని గర్వాతి శయమును కాలరాచిన వెలుగులో - మార్కండేయున కమితాయుర్దాయము ననుగ్రహించిన మహస్సులో - కరుణారసముట్టిపడు కడగంటి చూపులున్న కాంతి పుంజములో - నా మానసము రమించుగాక !.

వివరము :

శివారాధనము సేయక కామమును నిర్జింపలేడు; అపమృత్యుడవును దొలగించుకొనలేడు, ఆయువును పెంచుకొనలేడు.

శర్మణి జగతాం గిరిజా

నర్మణి సప్రేమ హృదయ పరిపాకే |

బ్రహ్మణి వినమద్రక్షణ

కర్మణి తస్మి న్నుదేతు భక్తిర్మే || 23

ప్రతిపదార్థము :

జగతాం, శర్మణి=లోకములకానందమై, గిరిజానర్మణి=ఉమాదేవియొక్క శృంగారపరీహాసమున, సప్రేమ...పాకే. సప్రేమ=ప్రేమతోగూడిన, హృదయ పరిపాకే=హృదయ పరిపాకమై, వినమత్‌... కర్మణి. వినమత్‌=మ్రొక్కువారిని, రక్షణకర్మణి=రక్షించుపనిగలదైన, తస్మిన్‌=ఆ, బ్రహ్మణి=బ్రహ్మమందు, మే=నాకు, భక్తిఃఉదేతు=భక్తి ఉదయించుగాక!.

తాత్పర్యము :

జగదానందమై - ఉమాదేవి యొక్క నర్మోక్తికి ప్రేమతో నిండిన యెడదగలదై - మ్రొక్కువారి చిక్కులు దీర్చికాచు ఆశివాఖ్యపరబ్రహ్మమునందు నాలో భక్తిభావము తల ఎత్తుగాక!

వివరము :

'శంభుః శం భవతి యస్మాత్‌ సః' ఎవని నుండి సుఖముదయించునో వాడు శంభువు. అనగా శివుడు సుఖస్వరూపి; ఆనందమే రూపుగా గలవాడు.

మనమనుభవించు లౌకికానందము లన్నియును సుఖకందము, ఆనందమయమునగు శివరూపమునుండి వెలువడిన తుంపరలే.

ఏకాగ్రచిత్తముతో శివునకు వినతుడైనవాడు శివుడే అగుచున్నాడు. అపుడు వానిని చిక్కులెట్లు వెంబడింపగలవు?

శివారాధనము చేసితిని, చిక్కులు వదలలేదు - అనుమాట దబ్బఱ. ఎచ్చట శివుడు తప్ప అన్యమేమియును లేదో. అంత వరకు నీ చిత్తమును బలవంతుమగా నెట్టుకొని పొమ్ము. అచట మరి చిక్కులుండునా?

ఓయీ! శివుని వరకు నీ చిత్తమే నీతోడ రానేరదు చిక్కులకచట ప్రవేశ##మేదయ్యా! ఒకసారి శివస్థానమును అనుభవించి, వెనుదిరిగివచ్చి చూడుము. నీ చిక్కులు నీకు వెదకినను కానరావు. 'శుద్థాంతఃకరణముతో శివునారాధింపుము' అని ఉపదేశము.

అస్మిన్నపి సమయే మమ

కంఠచ్ఛాయా విధూత కాలాభ్రమ్‌ |

అస్తు పురో వస్తు కిమ

ప్యర్థాఙ్గేదారమున్మిషన్నిటలమ్‌ || 24

ప్రతిపదార్థము :

కంఠ.... .... భ్రం.

కంఠచ్ఛాయా=కంఠమందలి నలుపురంగుచే. విధూత=దూరమునకు నెట్టబడిన. కాలాభ్రం=కాలమేఘముగల, ఉన్మిషత్‌+నిటలం=ఱప్పలల్లార్చు ఫాలభాగముగల, అర్థ+అఙ్గేదారం=ఒడలిలోని సగము ఆలికిచ్చిన, వస్తు=వస్తువు, అస్మిన్‌+అపి. సమయే=ఇపుడైనను, మమ-పురః-అస్తు=నాఎదుట దోచుగాక!.

తాత్పర్యము :

మబ్బుల నల్లదనమును డిల్లవడజేయు నీలకంఠము - తన యింతికి సగము మేను ధారవోసిన ఫాలనేత్రము - ఆ అనిర్వచనీయ వస్తువు ఇపుడైనను నా ఎదుట వెలయుగాక!

వివరము :

భగవత్ప్రాప్తికైన సాధనలో ఫలానుభవమునకై తొందర ఉండవచ్చును. విసువన్నది పనికిరాదు. అట్టివాడే గమ్యము జేరును, అని ఉపదేశము.

జటిలాయ మౌళిభాగే

జలధర నీలాయ కన్దరా77భోగే |

ధవళాయ వపుషి నిఖిలే

ధామ్నే స్యాన్మామకో నమో వాకః|| 25

ప్రతిపదార్ధము :

మౌళిభాగే=శిరోదేశమున, జటిలాయ=జడలుగల, కంధరాభోగే=కంఠదేశమున, జలధరనీలాయ=మబ్బువలె నల్లనైన, నిఖిలే వపుషి=సర్వశరీరమున, ధవళాయ=తెల్లనైన, ధామ్నే=తేజముకొఱకై, మామకః=నా యొక్క, నమోవాకః=నమస్కారము, స్యాత్‌=అగుగాక!.

తాత్పర్యము :

తపలై జడలు - గొంతులో నలుపు - దేహమున తెలుపు అయియున్న తేజమున నామ్రొక్కు చెల్లుగాక!

వివరము :

భగవద్విషయమున పునరుక్తి దోషము కాదు. గుణము.

అకర విరాజత్‌ సుమృగై

రవృషతురఙ్గై రమౌళిధృత గఙ్గైః |

అకృతమనోభవ భ##ఙ్గైః

అల మన్యైర్జగతి దైవతాపశ##దైః || 26

ప్రతిపదార్థము :

అకరవిరాజత్‌ సుమృగైః=కరమున శోభించు లేడి లేని, అకృతమనోభవ భ##ఙ్గైః=మదనుని భంగపాటు పాల్సే యని, అమౌళి ధృత గఙ్గైః=తలపై గంగను ధరింపని, అన్యైః దైవతాపశ##దైః=ఇతరములైన నీచదైవతములచే, జగతి=లోకమున, అలం=చాలును.

తాత్పర్యము :

కరమున లేడిని, శిరమున గంగను ధరింపని - వృషభ వాహనరూఢము కాని - కామున ఇగీటడంపని బక్క దైవము లతో నాకు పనిలేదు.

వివరము :

వృషభము ధర్మమునకు సంకేతము. స్వామికి ధర్మమే వాహనము. ధర్మము తప్పని చోట స్వామి ప్రకాశించును. 'కరమున లేడి' ఖగోళమునందలి చుక్కలలో శివుని దర్శించుట జ్యోతి శ్శాస్త్రకర్తలు ఆకస మందొకచో కానవచ్చు చుక్కలను ఊహారేఖలతో గలిపి - శివుని - ఆయన చేతిలో లేడిని మార్చి ప్రస్తావించినారు. విశ్వమంతయు శివస్వరూపమే ! ఆకసమందలి తారకలున్నూ శివునకు వేరుకావు. అది ఇచట నిరూపింపబడెను.

సరిగా ఇట్టిదే దుర్వాసోముని ప్రణీతమైన ఒక శ్లోకము పరమేశ్వరీ స్తుతిపరము ఉన్నది.

''అలమల మకుసుమ బాణౖ-రబింబశోణౖ రపుణ్డ్ర కోదణ్డౖః

అకుముద బాన్ధవచూడై-రన్యైరిహ జగతిదైవతమ్మన్యైః''

'చెఱకువిల్లు - పూవుటమ్ము'లేని - చంద్రచూడము, బింబశోణము (దొండపండువలె ఎఱ్ఱనిది) కాని - 'మేమును వేల్పులమే' అనుకొనువారితో మాకు బనిలేదు, పనిలేదు.

శ్లోకము యొక్క పోలిక శ్రీ సదాశివేంద్రులు

దుర్వాసునకు సములని నిరూపించుచున్నది.

కసై#్మ వచ్మి దశాం మే

కస్యేదృగ్‌ హృదయ మస్తి శక్తిర్వా|

కన్యబలం చోద్ధర్తుం

క్లేశాత్‌ త్వా మన్తరా దయాసిన్ధో ||. 2

ప్రతిపదార్థము :

దయాసిన్ధో=దయాసాగరా, శివా, మే దశాం=నాదుర్వశను, కసై#్మ వచ్మి=ఎవనికి జెప్పుకొందును?, ఈదృగ్‌+హృదయం=ఇట్టి హృదయము, వా=లేక, శక్తిః=సామర్ధ్యము, కస్య, అస్తి=ఎవనికున్నది, త్వామన్తరా=నీవు తప్ప, కస్య=ఎవనికి, క్లేశాత్‌=కష్టము నుండి, ఉద్ధర్తుం=ఉద్ధరించుటకు, బలం, అస్తి=బలమున్నది?.

తాత్పర్యము :

కరుణా సాగరా! స్వామీ! శివా! నేనెవ్వరితో నాదుర్దశను మొఱవెట్టుకొందును? నీవలె జాలిగల గుండె ఎవనికున్నది? విపద్విముక్తుని గావించుటకు నీవుతప్ప ఇతరుల కెవ్వరికి బలసామర్థ్యములున్నవయ్యా?

వివరము :

శివానుగ్రహముచే మాత్రమే భవబాధావిముక్తి.

యాచే హ్యనభినవం తే

చన్ద్రకళోత్తంస! కిఞ్ఛిదపి వస్తు |

మహ్యం ప్రదేహి భగవన్‌

మదీయమేవ స్వరూప మానన్దమ్‌ || 28

ప్రతిపదార్థము :

చన్ద్రకళోత్తంస=చంద్రరేఖ శిరోభూషణముగాగల స్వామీ, తే=నీయొక్క, అనభినవం=క్రొత్తది కాని (సనాతనమైన), కఞ్చిత్‌+అపి వస్తు=ఒకానొక వస్తువును, యాచే=నేను యాచించుచున్నాను. భగవన్‌=ఓ దేవా, మదీయం=ఏవ స్వరూపం=నాస్వరూపమే అయిన, ఆనన్దం=ఆనందమును, మహ్యం=నాకై, ప్రదేహి=ప్రసాదింపుము.

తాత్పర్యము :

చంద్రకళాధరా! నేనేమీ క్రొత్త వస్తువు నడుగుట లేదయ్యా! చాల పురాతనమైన, సనాతనమైన, నీ వస్తువు నర్థించుచున్నాను.

వాస్తవమున కది నీది మాత్రమే కాదు, నాది కూడ. నా దైన ఆనందరూపమును నాకు అనుగ్రహింపవయ్యా!

వివరము :

ద్వైతభావనయందు 'తే నమః' 'నీకు నమస్కారము'.

అద్వైతభావనయందు మహ్యంనమః

నాకు నమస్కారము.

''జీవో బ్రహ్మైవ నాపరః'' జీవుడు పరబ్రహ్మమే. వేరు కాదు. సర్వజీవకోటి యొక్క మూలరూపము ఆనందమే, ఆనందమే పరబ్రహ్మము.' 'ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్‌;, ఆనందాద్ధ్యేన ఖల్విమాని భూతాని జాయన్తే' అని శ్రుతి. ఆపరబ్రహ్మము సనాతనము, దానికంటె ప్రాతదిలేదు. క్రొత్త వస్తు వునిచ్చుటకు వెనుకాడుదురు. అడుగుటకును సంశయింతురు. ప్రాతదానిని ఇచ్చుటకు వెనుకాడ బనిలేదు. అందున ఆవస్తువు యాచించువానిదే అయినపుడు తిరస్కరించు నక్కఱయే ఉండదు'. అన్నది ఇచటి సారస్యము.

నందమయమైన శివాఖ్యపరబ్రహ్మమునుండి - అజ్ఞాన ముచే వేరైనటులున్న జీవకోటికి - శివారాధనానుగ్రహములచే మాత్రమే స్వరూపోపలబ్ధి - అని ఉపదేశము.

భగవన్‌ బాలతయా వా

7భక్త్యావా7ప్యాపదాకులతయా వా|

మోహావిష్టతయా వా

మా7స్తు చ తే మనసి యద్దురుక్తం మే|| 29

ప్రతిపదార్థము :

భగవన్‌=ఓదేవా, బాలతయా వా=బాలభావముచే గాని, అభక్త్యావా=భక్తి లేకపోవుటచేగాని, ఆపత్‌+ఆకుల తయా వా=విపత్తులవలని కలవరపాటుచేగాని, మో హావిష్ట తయా వా=అజ్ఞానావిష్టుడ నగుటచేగాని, మే=నాయొక్క, దురుక్తం యత్‌=దుర్భాషణమేదైన ఉన్నచో అది, తే మనసి=నీ మనసున, మా అస్తు=నిలువకుండుగాక!

తాత్పరయము :

స్వామీ! బాలభావము చేతనో - భక్తి రాహితయము చేతనో - ఆపదలవలని ఆకులపాటు చేతనో - అజ్ఞానముచేతనో - నానుండి ఏమైన దురుక్తులు వెడలినచో వానిని నీమనసున నిలుపకుము.

వివరము :

పరమేశ్వర ప్రాప్తికైన సాధనలో మొదటి మొట్టుమీదనే ఉండుట బాలభావము. అపుడు పరమేశుని వినుతించుటకు తగిన జ్ఞానము లేక దోసములు దొరలవచ్చును.

లోకము ధనమునో సమస్యానివృత్తినో వాంఛించి శివుని పాదములు పట్టుకొనును. అపుడు వారిదృష్టి తమదైన సమస్యా విముక్తి మీద నిలుచును. అది భక్తివలె దోచునేకాని భక్తి కాదు. అపుడును శివారాధనమున దురుక్తులు వెల్వడవచ్చును.

అజ్ఞానము, విపత్తుకారణముగా విలవిలలాడుట అనునవి కూడ ఇట్టివే.

సాధకుడై నవాడు అనుపదము తన చిత్తము దేనియందు నిలిచియున్నదో పరిశీలించి దానిని సరిచేసుకొనుచుండవలెనని ఉపదేశము.

యది విశ్వాధికతా తే

యది నిగమాగమ పురాణ యాధార్ధ్యమ్‌ |

యది వా భ##క్తేషు దయా

తదిహ మహేశాశు పూర్ణకామః స్యామ్‌ || 30

ప్రతిపదార్థము :

మహేశ=ఓ పరమేశా, తే=నీకు, విశ్వాధికతాయది=అన్నిటికంటె ఆధిక్యమున్నచో, నిగమా... ... ర్థ్యమ్‌. నిగమ=వేదముల, ఆగమ=దేవపూజాదికమును వివరించు శాస్త్రముల, పురాణ=పురాణముల, యాధార్థ్యంయది=సత్యత్వమున్నచో వా=లేదా, భ##క్తేషు=భక్తులయందు, దయా=దయ యున్నచో, తత్‌+ఇహ=అందువలన నిచ్చట, ఆశు=శీఘ్రముగా, పూర్ణకామః, స్యాం=కోరికలన్నియును దీరినవాడ నగు దునుగాక!.

తాత్పర్యము :

ఓ మహేశా! నీవు సర్వధికుడవు. వేదములు, ఆగమ ములు, పురాణములు అసత్యము పలుకుటలేదు. నీవు దయా మయుడవు. ఇదంతయు నిజమే అయినచో ఓస్వామీ! నాకు పూర్ణకామతను బ్రసాదింపుము.

వివరము :

సాధక భక్తుని మానసమున పరమేశుని అస్తిత్వదయా విశేషములను గూర్చిన సంశయ ముండరాదు. అని ఉపదేశము.

ఆత్మోపలబ్ధిచే మాత్రమే పూర్ణకామత,

''ఆత్మానంచే ద్విజానీయా దయ మస్మీతి పూరుషః

కిమిచ్ఛన్‌ కస్య కామాయ శరీర మను సంజ్వరేత్‌''

'ఇదుగో! నా ఆత్మస్వరూపము ఇది' - అని గ్రహించి -

ఆత్మజ్ఞానసంపన్నుడైనవానికి - పాంచభౌతిక దేహముతో అంత వరకు గల తాదాత్మ్యము రాలిపోవును. అంతేకాదు, అతడు ఇంద్రియములకంటె - మనసుకంటె - బుద్ధికంటె తనను వేరుగా అనుభవించును.

శరీరమును - ఇంద్రియములను - మనసును - బుద్ధిని అంటిపెట్టుకొని, వానితో తాదాత్మ్యము కలిగియున్నంతవరకు కోరికలు ఉండును. శరీరముతో సంబంధము (తాదాత్మ్యము) తొలగిపోయినపుడు కోరికలేమి ఉదయించును? దేనిని గూర్చి ఉదయించును?

అనగా 'ఆత్మజ్ఞాన సంపన్నునకు కోరికలుండవు; వాడే పూర్ణకాముడు - అనియు -పూర్ణకాముడగుటకు శివపదమే శరణ్యము' అనియు ఉపదేశము.

శ్రీ పరమహంస పరివ్రాజకాచార్యులు

శ్రీపరమశివేంద్ర పూజ్యపాదులశిష్యులు - అయిన

శ్రీ సదాశివబ్రహ్మేంద్రులు

రచించిన శ్రీ శివమానస పూజా స్తోత్రము

సంపూర్ణము.

lll

Sri Shiva manasika pooja stuthi    Chapters    Last Page