Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ నవమో7ధ్యాయః

అథ సున్దనకాణ్ణవర్ణనమ్‌.

నారద ఉవాచ:-

సమ్పాతి వచనం శ్రుత్వా హనుమానఙ్గదాదయః | అభ్ది దృష్ట్వా బ్రువం స్తే7బ్దిం ల ఙ్ఘయేత్‌ కో ను జీవయేత్‌.

హనుమంతుడును, అంగదాదులను నంపాతి మాటలు విని, సముద్రమును చూచి "ఈ సముద్రమును దాటి ఎవరు మనలనందరిని జీవింపచేయగలరు?" అని అనుకొనిరి.

కపీనాం జీవనార్థాయ రామకార్య ప్రసిద్ధయే | శతయోజన విస్తీర్ణం పుప్లువే7బ్ధి స మారుతిః 2

హనుమంతుడు కపులు జీవీంచుటకును, రామకార్యము సిద్ధించుటకును నూరు యోజనముల విస్తారము గల సముద్రమును లంఘించెను.

దృష్ట్వోత్థితం చ మైనాకం సింహికాం వినిపాత్య చ | లఙ్కాందృష్ట్వారాక్షసానాం గృహాణి వనితాగృహే.

దశగ్రీవస్య కుమ్భస్య కుమ్భకర్ణస్య రక్షసః | విభీషణస్యేన్ద్ర7జితో గృహేన్యేషాం చ రక్షసామ్‌. 4

నాపశ్యత్పానభూమ్యాదౌ సీతాం చిన్తాపరాయణః | అశోకవనికాం గత్వా దృష్టవాఞ్ఛంశపాతలే. 5

రాక్షసీరక్షితాం సీతాం భవ భార్తేతి వాదినమ్‌|రావణం శింశపాస్థో7థ నేతి సీతాం తు వాదినీమ్‌. 6

భవ భార్యా రావణస్య రాక్షసీర్వాదీనీః కపిః |

పైకి(సముద్రమునుండి) లేచిన మైనాకపర్వతమును చూచి, సింహికను చంపి, లంకను చూచి, రాక్షసుల గృహములను కూడ చూచెను. అచట రావణుని ఇంటి అంతఃపురము నందును, కుంభ - కుంభకర్ణ-విభీషణ-ఇంద్ర జిత్తలు గృహమునందును, ఇతర రాక్షసుల గృహములందును, పానభూమి మొదలగు ప్రదేశములందును కూడ సీతను చూడజాలకపోయెను. అపుడు ఆ హనుమంతుడు చింతాక్రాంతుడై అశోకవనమునకు వెళ్ళి శింశపావృక్షము నెక్కి దాని క్రింద రాక్షస స్త్రీలచే రక్షింపబడుచున్న సీతను, "నా భార్యవు కమ్ము" అని పలుకుచున్న రావణుని, అందులకు నిరాకరించుచునన సీతను, ''రావణునికి భార్యవగుము" అని చెప్పుచున్న రాక్షసస్త్రీలను చూచెను.

గతే తు రావణ ప్రాహ రాజా దశరథో7భవత్‌. 7

రామో7స్య లక్ష్మణః పుత్రౌ వనవాసం గతౌ వరౌ | రామపత్నీ జానకీ త్వం రావణన హృతే బలాత్‌. 8

రామః సుగ్రీవ మిత్త్రస్త్వాం మార్గయున్‌ పై#్రషయచ్చ మామ్‌ |

సాభిజ్ఞానం చాఙ్గులీయం రామదత్తం గృహాణ వై. 9

రావణుడు వెళ్ళిపోయిన పిమ్మట హనుమంతు డిట్లు పలికెను. దశరథుడనెడు రాజు ఉండెను. అతని శ్రేష్ఠు లైన పుత్రులు, రామలక్ష్మణులు, అరణ్యమునకు వెళ్ళిరి. రామ భార్య లైన సీత యగు నిన్ను రావణుడు బలాత్కార మున అపహరించెను. నుగ్రీవుని మిత్రుడైన రాముడు నిన్ను అన్వేషించుచు, నన్ను పంపెను. అనవాలుతో కూడిన, రాము డిచ్చిన ఉంగరమును గ్రహింపుము.

సీతాజ్గులీయం జగ్రాహ సాపశ్యన్మారుతిం తరౌ | భూయో7గ్రే చోపవిష్టం తమువాచ యది జీవతి.. 10

రామః కథం న నయతి శఙ్కితామబ్రవీత్కపిః |

సీత వృక్షముమీద ఉనన వానరుని చూచెను. ఆ ఉంగరమును తీసికొనెను. ఇంకను ఎదుట కూర్చొని ఉన్న అతనితో ఇట్లనెను- "రాముడు జీవించి ఉన్నచో నన్నేల తీసికొని వెళ్ళుటలేదు?" ఈ విధముగ శంకించుచున్న ఆమెతో హనుమంతు డిట్లు పలికెను.

హనుమానువాచ:-

రామః సీతే న జీనితే జ్ఞాత్వా త్వాం స నయిష్యతి.

రావణం రాక్షసం హత్వా సబలం దేవి మా శుచః | సాభి జ్ఞానం దేహి మే త్వం మణిం సీతా7దదాత్కపౌ.

ఉవాచం మాం యథా రామో నయే చ్ఛీఘ్రం తథా కురు| కాకాక్షిపాతనకథాం ప్రతియాహి హి శోకహ. 13

హనుమంతుడు పలికెను: ఓ సీతాదేవీ! రామునికి నీ జాడ తెలియలేదు. ఇపుడు తెలిసకొని, సేనాసహితుడైన రావణుని సంహరించి నిన్ను తీసికొని వెళ్ళగలడు. ఓ దేవీ! విచారించకుము. అనవాలుతో కూడిన దేదైన నాకిమ్ము." అపుడు సీత హనుమంతునకు మణిని ఇచ్చెను. " నన్ను రాముడు శీఘ్రముగా తీసికొని వెళ్ళిపోవు నట్లు చేయుము" అని చెప్పెను. అతనికి కాకి కంటి కథను కూడ చెప్పి, "ఓ శోకవినాశకుడా! తిరిగి వెళ్ళుము" అని పలికెను.

మణిం కథాం గృహీత్వాహ హనూమానేష్యతే పతిః | అథవా తే త్వరా కాచిత్‌ పృష్ఠమారోహ మే శుభే. 14

అద్య త్వాం దర్శయిష్యామి ససుగ్రీవం చ రాఘవమ్‌| సీతా7బ్రవీద్ధనూమన్తం నయతాం మాం హి రాఘవః.

హనుమంతుడు ఆ కథ విని, మణిని తీసికొని, ఇట్లు పలికెను. "ఓ శోభనస్వభావము గల దేవీ! నీ భర్తరాగలడు. లేదా, నీకు తొందర ఉన్నచో నా వీపు పైన ఎక్కుము. ఇపుడే నీకు సుగ్రీవసహితుడైన రాముని చూపించెదను. ఆ మాటలు విని సీత హనుమంతునితో - "రాముడే నన్ను తీసికొని వెళ్ళుగాక" అని పలికెను.

హనుమాన్స దశగ్రీవదర్శనోపాయ మాకరోత్‌ | వనం బభఞ్జ తత్పాలాన్‌ హత్వా దన్తనఖాదిభిః 16

హత్వా తు కిఙ్కరావన్‌ సర్వాన్‌ సప్త మన్త్రిసుతానపి | పుత్రమక్షం కుమారం చ శక్రజిచ్చ బబన్ద తమ్‌. 17

నాగపాశేన పిఙ్గాక్షం దర్శయామాస రావణమ్‌ | ఉవాచ రావణః కస్త్వం మారుతిః ప్రాహ రావణమ్‌. 18

అపుడు హనుమంతుడు రావణుని చూచుటకై ఒక ఉపాయమును చేసెను. దంతములు నఖములు మొదలగు వాటితో ఉద్యానపాలకులను చంపి, ఆ ఉద్యానవనమును విరచెను. కింకరులను అందరు రాక్షసులను, ఏడుగురు మంత్రి కుమారులను, రావణుని పుత్రుడైన అక్షకుమారుని కూడ చంపెను. ఇంద్రజిత్తు నాగపాశముచే అతనిని బంధించి రావణునికి చూపెను. " నీవెవ్వడవు?" అని రావణుడు ప్రశ్నింపగా మారుతి రావణునితో ఇట్లనెను.

హనుమానువాచ:

రామదూతో రాఘవాయ సీతాం దేహి మరిష్యసిర్రాయబాణౖర్హతః సార్థం లఙ్కాస్థై రాక్షసైర్ధ్రువమ్‌. 19

హనుమంతుడు పలికెను. "నేను రాముని దుతను. సీతను రామున కిచ్చి వేయుము.

ఇవ్వకున్నచో, లంకలో నున్న రాక్షసులతో గూడ, రామబాణములచే కొట్టబడి మరణింపగలవు. తప్పదు.

రావణో హన్తుముద్యుక్తో విభీషణనివారితః | దీపయామాస లాజ్గూలం దీప్తపుచ్ఛః స మారుతిః 20

దగ్ధ్వా లఙ్కాం రాక్షసాం శ్చ దృష్ట్వా సీతాం ప్రణమ్య తామ్‌ | సముద్రపారమాగత్య దృష్టా సీతేతి చాబ్రవీత్‌.

అఙ్గదాదీనఙ్గదాద్యైః పీత్వా మధువనే మధు | జిత్వా దధిముఖాదీంశ్చ దృష్ట్వా రామం చ తే7బృవన్‌. 22

దృష్టా సీతేతి రామో7పి హృష్టః పప్రచ్ఛ మారుతిమ్‌ |

రావణుడు హనుమంతుని చంపుటకు ఉద్యమించగా విభీషణుడు నివారించెను. హనుమంతుని తోకకు నిప్పు అంటింపచేసెను. ఆ హనుమంతుడు మండుచున్న తోకతో లంకను, రాక్షసులను కాల్చి సీతను చూచి నమస్కరించి, సముద్రము దాటి వచ్చి, ' సీతను చూచితిని' అని అంగదాదులుతో చెప్పెను. అంగదాదులతో కలిసి, దధిముఖాదులను ఓడించి, మధువనములోని మధువును త్రాగెను. వారందరును రాముని వద్దకు వెళ్ళి "సీతను చూచితిమి" అని పలికిరి. రాముడు సంతసించి హనుమంతునితో ఇట్లనెను.

శ్రీరామ ఉవాచ:

కథం దృష్టా త్వయా సీతా కిమువాచ చ మాం ప్రతి. 23

సీతాకధామృతేనైవ సిఞ్చ మాం కామవహ్నిగమ్‌ |

శ్రీ రాముడు పలికెను _"నీవు సీతను ఎట్లు చూచితివి? ఆమె నాతో ఏమని చెప్పమన్నది? మన్మథాగ్నిలో పడి ఉన్న నన్ను సీతా కథా మృతముచే తడుపుము."

నారద ఉవాచ:

హనుమానబ్రవీద్రాం లఙ్ఘ యిత్వాబ్ధిమాగతః

సీతాం దృష్ట్వా పురీం దగ్ధ్వా సీతామణిం గృహాణవై | హత్వాతం రావణం సీతాం ప్రాప్స్యసే రామ మా శుచః.

నారదుడు పలికెను. హనుమంతుడు రామునితో ఇట్లు పలికెను. " రామా! సముద్రము లంఘించి, సీతను చూచి, లంకను కాల్చి వచ్చినాను. సీత ఇచ్చిన మణిని తీసికొనుము. ఆ రావణుని సంహిరంచి సీతను పొందగలవు. దుఃఖింపకుము.

గృహీత్వా తం మణిం రామో రురోద విరహాతుర ః | మణిం దృష్ట్వా జానకీ మే దృష్టా సీతాం నమస్వమామ్‌.

తయా వినా న జీవామి సుగ్రీవాద్యైః ప్రబోధితః | సముద్రతీరం గతవాం స్తత్ర రామం విభీషణః. 27

గతిస్తిరస్కృతో భ్రాత్రా రావణన దురాత్మనా | రామాయ దేహి సీతాం త్వమిత్యుక్తేనాసహాయవాన్‌. 28

రాముడా మణిని గ్రహించి, సీతావిరహముచే దుఃఖితుడై ఏడ్చెను. "మణిని చూడగనే సీతను చూచినట్లున్నది. నన్ను సీతవద్దకు తీసికొని వెళ్ళుము. అమెను విడచి జీవింపజాలను" అని పలికెను. సుగ్రీవాదులు ఓదార్చిరి. పిమ్మట సముద్రతీరము చేరెను. "సీతను రామునకు ఇచ్చివేయుము" అని విభీషణుడు రావణునకు ఉపదేశింపగా ఆ దురాత్ముడు అతనిని అవమానించెను. అందుచేత విభీషణుడు అసహాయుడై రామునివద్దకు వెళ్ళెను.

రామో విభీషణం మిత్రం లజ్కైశ్వర్యే7భ్యషేచయత్‌ | సముద్రం ప్రార్థయన్‌ మార్గంయదా నాయాత్త దా శ##రైః.

భేదయామాన రామం చ ఉవాచాబ్ధిః సమాగతః|

రాముడు మిత్రుడైన విభీషణుని లంకారాజ్యమునందు అభిషిక్తుని చేసెను- మార్గమిమ్మని సముద్రుని ప్రార్థింపగా అతడు ఇవ్వలేదు. అపుడు బాణములచే భేదించెను. సముద్రుడు రాముని వద్దకు వచ్చి పలికెను.

సముద్ర ఉవాచః

నలేన సేతుం బద్ధ్వాబ్ధౌ లఙ్కాం వ్రజ గభీరకః 30

అహం త్వయా కృతః పూర్వం రామో7పినలసేతునా | కృతేన తరుశైలాద్యైర్గతః పారం మహోదధేః 31

వానరైః స సువేలస్థః సహలఙ్కాందదర్శవై.

ఇత్యాది మహాపురాణ అగ్నేయే రామాయణ సున్దరకాణ్డవర్ణనం నామ నవమో7ధ్యాయః

సముద్రుడు పలికెనుః "నాపై నలునిచే సేతువు కట్టించి లంకకు వెళ్ళుము. నన్ను లోతైన వానినిగా పూర్వము చేసినది నీవేకదా"! వృక్షములు, శైలములు మొదలైన వాటితో నలుడు కట్టిన సేతువుపై రాముడు వానరులతో సముద్రమును దాటి నువేల పర్వతముపై నిలచి, లంకను చూచెను.

అగ్ని మహాపురాణములోని సుందరకాండ వర్ణనమను నవమాధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters