Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథత్త్య్రశీతితమో7ధ్యాయః

అథ నిర్వాణదీక్షా:

ఈశ్వర ఉవాచ:

అథ నిర్వాణదీక్షాయాం కుర్యాన్మూలాదిదీపనమ్‌ | పాశబన్దన శక్త్యర్థం తాడనాదికృతేన వా. 1

ఏకైకయా తదాహుత్యా ప్రత్యేకం తత్త్రయేణ వా | బీజగర్బశిఖార్థం తు హూం ఫడన్తధ్రువాదినా. 2

ఓం హ్రూం హ్రౌం హౌం హూం ఫడితి మూలమన్త్రస్య దీపనమ్‌ |

ఓం హ్రూం హ్రౌం హూం ఫడితి హృదయ ఏవం శిరోముఖే. 3

ప్రత్యేకం దీపనం కుర్యాత్సర్వస్మిన్‌ క్రూరకర్మణి | శాన్తికే పౌష్టికే చాస్య వషడన్తాదినాణునా. 4

వషడ్వౌషట్సమోపేత్తెః సర్వకామ్యోవరిస్థితైః | హవనం సంవరైః కుర్యాత్సర్వత్రాప్యాయనాదిషు. 5

తతః స్యసవ్యభాగస్థం మణ్డలే శుద్ధ విగ్రహమ్‌ | శిష్యం సంపూజ్య తత్సూత్రం సుషుమ్నేతి విభావితమ్‌. 6

మూలేన తచ్ఛిఖాబన్ధం పాదాఙ్గుష్ఠాన్తమానయేత్‌ | సంహారేణ మముక్షోస్తు బధ్నీ యాచ్ఛిష్యకాయకే. 7

పుంసస్తు దక్షిణ భాగే వామేనార్యా నియోజయేత్‌ | శక్తిం చ శక్తిమన్త్రేణ పూజితాం తస్య మస్తకే. 8

సంహారముద్రయాదాయ సూత్రం తేనైవ యోజయేత్‌ |

నాడీం త్వాదాయ మూలేన సూత్రే న్యస్య హృదార్చయేత్‌. 9

అవకుణ్ఠ్యతు రుద్రేణ హృదయేనాహుతిత్రయమ్‌ | ప్రపద్యాత్సన్నిధానార్థం శక్తావప్యేవమేన హి. 10

శివుడు పలికెను: పిమ్మట నిర్వాణదీక్షయందు, పాశబంధనశక్తి కొరకును, తడనాదుల కొరకును మూలమంత్రాదుల దీపనము చేయవలెను. ఒక్కొక్కదానికి, ఒక్కొక్కహోమము, లేదా మూడేడి హోమములు చేసి మంత్రదీపము చేయవలెను. మొదట ప్రణవమును, మధ్య బీజ-గర్భ-శిఖాబంధస్వరూపము లగు మూడు 'హూం' లను ఉచ్చరించవలెను. దీనివలన మూలమంత్రదీపన మగును. "ఓం హూం హూం హూం ఫట్‌" అని దీపనము. దేనిచేతనే "ఓం హూం హూం హూం ఫట్‌ హృదయాయ నమః" అని హృదయదీపన మగును పిమ్మట "ఓం హూం హూం హూం ఫట్‌ శిరసే స్వాహా" ఇత్యాదులచే శిరస్సు మొదలగు అంగముల దీపనము చేయవలెను. క్రూర కర్మ లన్నింటియందును మూలాది దీవనము ఈ విధముగనే చేయవలెను. శాంతి-పుష్టి-వశీకరణ కర్మలయందు మొదట నున్న ప్రణవము చివర 'వషట్‌' చేర్చి ఒక్కొక్కదానిని ఆ మంత్రముచేతనే దీపనము చేయవలెను. ఆప్యాయనాది కర్మ లన్నింటియందును 'వషట్‌' 'వౌషట్‌' లతో కూడిన, సంపూర్ణ కామ్యకర్మలపై నున్న శంబరమంత్రములతో హోమముచేయవలెను. తన ఎడమ ప్రక్క నున్న మండలముపై ప్రకాశించుచున్న పరిశుద్ధ శరీరవంతు డగు శిష్యుని పూజించి, ఒక ఉత్తమసూత్రమును సుషుమ్నావాడిగా భావన చేసి, మూలమంత్రముతో దానిని శిఖాబంధమువరకును తీసికొని పోయి, అచటినుండి కాళ్ళబోటనవ్రేళ్ళవరకును తీసికొని రావలెను. పిదప, సంహారక్రమముచే దానిని మరల మముక్షు వగు శిష్యుని శిఖవద్దకు తీసికొని పోయి అచటనే కట్టవలెను. పురుషునకు కుడి ప్రక్కను, స్త్రీకి ఎడమ ప్రక్కను కట్టవలెను. శిష్యుని శిరస్సుపై శక్తిని శక్తి మంత్రముచే పూజించి, ఆ శక్తిని సంహార ముద్రచే తీసికొని వచ్చి ఆ సూత్రమునందు, ఆ మంత్రముతోడనే, కలపవలెను. సుషుమ్నానాడిని గ్రహించి, దానిని మూలమంత్రముతో ఆ సూత్రముపై న్యాసము చేసి, హృదయమంత్రముతో దానిని పూజించవలెను. కవచమంత్రముచే ఆచ్ఛాదించి, హృదయమంత్రముతో మూడు హోమములు చేయవలెను. ఈ హోమములు నాడీసంవిధానముకొరకు చేయబడినవి. శక్తిసంవిధానముకొరకుగూడ ఈ విధముగనే హోమమును చేయవలెను.

ఓం హాం వర్ణాధ్వనే నమో హాం భువనాధ్వనే నమః |

హాం ఓం కలాధ్యనే నమః శోధ్యాధ్వానం హి సూత్రకే. 11

న్యస్యాస్త్రవారిణా శిష్యం ప్రోక్ష్యాస్త్రమన్త్రితేన చ | పుష్పేణ హృది సన్తాడ్య శిష్య దేహే ప్రవిశ్య చ. 12

గురుశ్చ తత్ర హూంకారయుక్తం రేచకయోగతః | చైతన్యం హంసబీజస్థం విశ్లిష్యేదాయుధాత్మనా. 13

ఓం హౌం హూం ఫట్‌.

ఆచ్ఛిద్య శక్తిసూత్రేణ హాం హం స్వాహేతి చాణునా |సంహారముద్రయా సూత్రేనాడిభూతే నియోజతాత్‌.

ఓం హాం హం హామ్‌ ఆత్మనే నమః

వ్యాపకం భావదేయేదేనం తనుత్రేణావకుణ్ఠయేత్‌ | ఆహుతిత్రితయం దద్యాద్ధృదా సన్నిధిహేతవే. 15

విద్యాదేహం చ విన్యస్య శాన్త్యతీతావలోకనమ్‌ | తస్యాభిమతతరత్వాద్యం మన్త్రభూతం విచిన్తయేత్‌. 16

ఓం హాం హౌం శన్త్యాతీతకలాపాశాయ నమ ఇత్యనేనావలోకయేత్‌.

ద్యే తత్త్వే మన్త్రమప్యేకం పదం వర్ణాశ్చ షోడశ | తథాష్టౌభువనాన్యస్యాం బీజనాడీకథద్వయమ్‌. 17

విషయం చ గుణం చైకం కారణం చ సదాశివమ్‌ | సితాయాం శాన్త్యతీతాయామన్తర్భావ్య ప్రపీడయేత్‌. 18

ఓం హౌం శాన్త్యతీతకలాపాశాయ హూంఫట్‌ | సంహారముద్రయాదాయ విదధ్యాత్సూత్రమస్తకే. 19

పూజయేదాహుతీన్తిస్రో దద్యాత్సన్నిధిహేతవే | తత్త్వే ద్వే అక్షరే ద్వే చ బీజనాడీకథద్వయమ్‌. 20

గుణౌ మన్త్రౌ తథాబ్జస్థమేకం కారణమీశ్వరమ్‌ | పదాని భానుసంఖ్యాని భువనాని దశ సప్తచ.

ఏకం చ విషయం శాన్తౌ కృష్ణాయామచ్యుతం స్మరేత్‌. 21

"ఓం హాం తత్త్వాధ్వనీ నమః" "ఓం హాం పదాధ్వనే నమః" "ఓం హాం వర్ణానాధ్వనే నమః" "ఓం హాం మన్త్రాధ్వనే నమః", "ఓం హాం కలాధ్వనే నమః" "ఓం హాం భువనాధ్వనే నమః" అను వర్ణా మంత్రములచే, సూత్రముపై ఆరు అధ్వల న్యాసము చేసి అస్త్రమంత్రముచే అభిమంత్రించిన ఉదకముతో శిష్యుని ప్రోక్షించవలెను. అస్త్రమంత్రము జపించుచు పుష్పము గ్రహించి శిష్యుని హృదయమును కొట్టవలెను. పిమ్మట హుంకారయుక్త రేచక ప్రాణాయామముతో శిష్యుని శరీరమునందు ప్రవేశించి, దాని లోపల హంసబీజములో జీవచైతన్యమును, అస్త్రమంత్రమును జపించుచు, అచటినుండి తొలగించవలెను. పిమ్మట "ఓం హః హూం ఫట్‌" అనుశక్తిసూత్రముచేతను, "హాం హాం స్వాహా" అను మంత్రముచేతను సంహారముద్రతో, వాడి యైన ఆ సూత్రమునందు విడదీసిన జీవచైతన్యమును నియమించవలెను, "ఓం హాం హాం హోమాన్మనే నమః" అను మంత్రము జపించుచు జీవాత్మ వ్యాపక మని భావన చేయవలెను. పిదప కవచమంత్రముచే దానిని ఆచ్ఛాదించి దాని సాన్నిధ్యమును కోరుచు హృదయమంత్రముచే మూడు హోమములు చేయవలెను. పిమ్మట విద్యాదేహన్యాసము చేసి దానిలో శాంత్యతీతకళను చూడవలెను. ఇతర తత్త్వములతో కూడిన ఆత్మ ఆ కళయందు అంతర్గతమై యున్నట్లు భావన చేయవలెను. ''ఓం హూం శాన్త్యతీతకలాపాశాయ నమః'' అను మంత్రముచే ఆ కళను చూడవలెను. రెండు తత్త్వములు, ఒక మంత్రము, ఒక పదము, పదునారు వర్ణములు, ఎనిమిది భువనములు, క ఖ మొదలైన బీజములు, నాడులు, రెండు కళలు, విషయములు, గుణములు, ఏకమాత్రకారణభూతుడైన సదాశివుడు - వీటినన్నింటిని శ్వేతవర్ణయగు శాంత్యతీతకలలో అంతర్బూతము చేసి ''ఓం హూం శాన్త్యతీత కలాపాశాయ హూం ఫట్‌'' అను మంత్రముచే ప్రతాడనము చేయవలెను. కలాపాశమును సంహారముద్రతో తీసికొని, సూత్రము శిరస్సుపై నుంచి దానిని పూజించవలెను. దాని సాంనిధ్యముకొరకై వెనుకటివలెనే మూడు హోమములు చేయవలెను. 'హూం' అనునది శాంత్యతీతకళాబీజము, రెండు తత్త్వములు, రెండు అక్షరములు, బీజములు, నాడి, క ఖ అను అక్షరములు, రెండు గుణములు, రెండు మంత్రములు, కమలములో నున్న ఏకమాత్రకారణభూతు డైన ఈశ్వరుడు, పండ్రెండు పదములు, ఏడు లోకములు, ఒక విషయము-వీటి నన్నింటిని కృష్ణవర్ణయగు శాంతికళలోపల భావన చేయవలెను.

తాడయిత్వా సమాదాయ ముఖసూత్రే నియోజయేత్‌ | జుహుయాన్ని జబీజేన సాన్ని ధ్యాయాహుతిత్రయమ్‌ . 22

విద్యాయాం సప్త తత్త్వాని పదానామేకవింశతిమ్‌ | షడ్వర్ణాన్సఞ్చరం చైకం లోకానాం పఞ్చవింశతిమ్‌. 23

గుణానాం త్రయమేకం చ విషయం రుద్రకారణమ్‌ | అన్తర్భావ్యాతిరిక్తాయాం బీజనాడీకథ (ఖ) ద్యయమ్‌.

అస్త్రమాదాయ దద్యాచ్చ పదం ద్వ్యధికవింశతిమ్‌ | లోకానాం చ కలానాం చ షష్టిం గుణచతుష్టయమ్‌. 25

మన్త్రాణాం త్రయమేకం చ విషయం కారణం హరిమ్‌ | అన్తర్భావ్య ప్రతిష్ఠాయాం శక్తాయాం తాడనాదికమ్‌.

విధాయ నాభిసూత్రస్థాం సన్నిధాయాహుతీర్యజేత్‌ | హ్రీం భువనానాం శతం సాగ్రం పదానామష్టమింశతిమ్‌.

బీజనాడీ సమీరాణం ద్వయోరిన్ద్రియయోరపి | వర్ణం తత్త్వం చ విషయమేకైకం గుణపఞ్చకమ్‌. 28

హేతుం బ్రహ్మాణ్డమన్త్రస్థం శమ్వరాణాం చతుష్టయమ్‌ | నివృత్తౌ పీతవర్ణాయామన్తర్భావ్య ప్రతాడయేత్‌. 29

అదౌ యత్తత్త్వభాగేన్తే సూత్రే విన్యస్య పూజయేత్‌ | జుహుయాదాహుతీస్తిస్రః సన్నిధానాయ పావకే. 30

పిమ్మట వెనుకటి వలెనే తాడనము చేసి సూత్రముఖ భాగమున వీటి నన్నింటిని కూర్చవలెను. సాన్నిధ్యము కొరకే శాంతికలాబీజమంత్రముతో (హూం హూం) హూడు హోమములు చేయవలను. ఏడుతత్త్వములు, 'ఇరువదియొక్క పదములు, ఆరు వర్ణములు, ఒక శంబరము, ఇరువదియైదు లోకములు, మూడు గుణములు, ఒక్క విషయము, రుద్రరూపకారణతత్వము, బీజము, నాడాలు, క ఖ అను కళలు- వీటినన్నింటిని మిక్కిలి ఎఱ్ఱని రంగు గల విద్యాకళలో అంతర్భూతములు చేసి, ఆవాహాన సంయోజనపూర్వకముగా వెనుక చెప్పిన సూత్రము హృదయభాగమున స్థాపించి, తన మంత్రముచే పూజించి, వీట అన్నింటి సన్నిధికొరకై వెనుకటివలెనే మూడు ఆహుతు లీయవలెను. ఆహుతి చేయు బీజమంత్రము ''హూం హూం హూమ్‌'', ఇరువది నాలుగు తత్త్వములు, ఇరువది యైదు వర్ణములు, బీజములు, నాడులు, క ఖ అను కళలు, ఇరువది రెండు పదములు, అరువది లోకములు, అరువది కళలు, నాలుగు గుణములు, మూడు మంత్రములు, ఒకవిషయము కారణరూప శ్రీహరి-వీటినన్నింటిని శుక్లవర్ణ మగు ప్రతిష్ఠాకళలో అంతర్భూతములు చేసి, తాడనాదికము చేయవలెను. మరల వీటినన్నింటిని సూత్రనాభిభాగమున సంయోజనము చేసి, సంన్నిధానకరణమునకై, ''హూం హూం హూం హూం'' అను మంత్రముచే మూడు హోమములు చేయవలెను. నూట ఎనిమిది భువనములు, ఇరువది యెనిమిది పదములు, బీజములు రెండు నాడులు, రెండు సమీరములు, రెండు ఇంద్రియములు, ఒక వర్ణము, ఒక తత్త్వము, ఒక విషయము, ఐదు గుణములు, కారణరూపకమలాసనబ్రహ్మ, నాలుగు శంబరములు- వీటి నన్నంటిని పీతవర్ణ మగు నివృత్తికళలో అంతర్భూతములు చేసి తాడనము చేయవలెను. వీటిని గ్రహించి, సూత్రచరమభాగమునందు స్థాపించి, పూజించి, వీటి సాన్నిధ్యముకొరకై ''హూం హూం హూం హూం హూం'' అను బీజమంత్రముతో మూడు హోమములు చేయవలెను.

ఇత్యాదాయ కలాసూత్రే యోజయేచ్చిష్యవిగ్రహాత్‌ | సబీజాయాం తు దీక్షాయాం సమయాచానమాగతః. 31

దేహారమ్భకరక్షార్థం మన్త్రసిద్దిఫలాదపి ఇష్టాపూర్తాది ధర్మార్థం వ్యతిరిక్తం ప్రబన్దకమ్‌. 32

చైతన్యబోధకం సూక్ష్మం కలానామన్తరే స్మరేత్‌ | అమునైవ క్రామేణాథ కుర్యాత్తర్పణదీపనే. 33

ఆహుతిభిః స్వమన్త్రేణ తిసృభిస్తిసృభిస్తథా |

ఓం హౌం శాన్త్యతీతకలాపాశాయ స్వాహేత్యాది తర్పణమ్‌ |

ఓం హాం హ హాం శాన్త్యతీతకలాపాశాయ హుం ఫడిత్యాది దీపనమ్‌ |

తత్సూత్రం వ్యాప్తిబోధాయ కలాస్థానేషు పఞ్చసు. 34

సంగృహ్య కుఙ్కుమాజ్యేన తత్ర సాఙ్గం శివం యజేత్‌ |

హూం ఫడన్తైః కలామన్త్రైర్భిత్త్వా పాశాననుక్రమాత్‌ . 35

నమోన్తైశ్చ ప్రవిశ్యాన్తః కుర్యాద్గ్రహణబన్ధనేవ |

ఓం హూం హాం హాం హాం ఫట్‌ శాన్త్యతీతకలాం గృహ్లామి

బధ్నామి చేత్యాది మన్త్రైః కలానాం గ్రహణబన్ధనాదిప్రయోగః |

పాశాదీనాం చ స్వీకారో గ్రహణం బన్ధనం పునః. 36

పురుషం ప్రతి నిఃశేషవ్యాపార ప్రతిపత్తయే | ఉపవేశ్యాథ తత్సూత్రం శిష్యస్కన్దే నివేశ##యేత్‌. 37

విస్తృతాఘప్రమోషాయ శతం మూలేన హోమయేత్‌ | శరావసంపుటే పుంసః స్త్రియాశ్చ ప్రణితోదరే. 38

హృదస్త్రసంపుటం సూత్రం విధాయాభ్యర్చయేర్థృదా |

సూత్రం శివేన సాఙ్గేన కృత్వా సంపాతశోధితమ్‌. 39

నిదధ్యాత్కలశస్యాధో రక్షాం విజ్ఞాపయేదితి | శిష్యం పుష్పం కరే దత్త్వా సంపూజ్య కలశాదికమ్‌. 40

ప్రణమయ్య బహిర్యాయద్యాగమన్దిర మధ్యతః |

ఈ విధముగ, సూత్రమునం దున్న ఐదు కళలను తీపి శిష్యుని శరీరమునం దుంచవలెను. సబీజ దీక్షయందు, సమయాచార పాశముకంటెను, దాహారంభకధర్మముకంటెను, మంత్రసిద్ధి ఫలము కంటెను, ఇష్టాపూర్తాదిధర్మముకంటెను భిన్న మైన చైతన్యరోధక సూక్ష్మ ప్రబంధకములను కళలలో భావన చేయవలెను. వాటి వాటి మంత్రములతో మూడేసి హోమములు చేసి తర్పణ-దీపనములు చేయవలెను. ''ఓం హూం శాన్త్యతీత కలాపాశాయ స్వాహా''ఇత్యాది మంత్రములచే తర్పణములు, ''ఓం హూంహూం శాన్త్యతీతకలాపాశాయ హూం హూం ఫట్‌'' ఇత్యాది మంత్రములచే దీపనము చేయవలెను. వ్యాప్తిబోధకొరకై, సూత్రమును, సురక్షాపూర్వకముగ ఐదు కళాస్థానములపై నుంచి, దానిపై కుంకుమాదులచే అంగదేవతా సమేతుడైన శివుని పూజించవలెను. కలామంత్రముల చివర 'హుం ఫట్‌' అను పదములు చేర్చి ఉచ్చరించుచు పాశ భేదనము చేసి, నమస్కారాంతకలామంత్రములతో వాటి లోపల ప్రవేశము చేయవలెను. కళాగ్రహణబంధనములు కూడ చేయవలెను. ''ఓం హూం హూం హూం శాన్త్యతీతకలాం గృహ్ణామి బధ్నామి'' ఇత్యాదిమంత్రములు గ్రహణ బంధనములందు వినియోగింపబడును. ఒక్కొక్క కళ విషయమునను తప్పక పాశాది వశీకరణమును, గ్రహణమును, బంధనమును, పురుషుని విషయమున సకల వ్యాపారనిషేధమును చేయవలెను. శిష్యుని కూర్చుండబెట్టి, సూత్రమును వాని బుజమునుండి చేతిలో ఉంచి జ్ఞాతాజ్ఞాత పాపపరిహారార్థమై నూరు పర్యాయములు మూలమంత్రముతో హోమము చేయవలెను. పురుషుని సూత్రము అస్త్రమంత్రసంపుటమునందును, స్త్రీ సూత్రమును ప్రణవసంపుటమునందును ఉంచి, హృదయమంత్రముతో సంపుటిత మొనర్చి, ఆ మంత్రముతోనే దాని పూజ చేయవలెను. సూత్రమునకు సాంగ శివునిచే సంపాతశోధనము చేసి, దానిని కలశ క్రింద ఉంచి, దాని రక్షకొరకై ఇష్టదేవతా ప్రార్థన చేయవలెను. శిష్యుని చేతిలో పూవులిచ్చి, కలశకు పూజా ప్రణామాదులు చేసిన పిమ్మట యాగశాలనుండి బైటకు రావలెను.

మణ్డలతిత్రయం కృత్వా ముమూక్షూనుత్తరాననాన్‌ | 41

భుక్తయే పూర్వవక్త్రాంశ్చ శిష్యాం స్తత్ర నివేశ##యేత్‌ | ప్రధమే వఞ్చ గవ్యస్వ ప్రాశ##యేచ్చుంకత్రయమ్‌. 42

పాణినా కుశయుక్తేన అర్చితానన్తరా న్తరమ్‌ | చరుం తతస్తృతీయే తు గ్రాసత్రితయసంమితమ్‌. 43

అష్టగ్రాసప్రమాణం వా దశనస్పర్శవర్జితమ్‌ | పాలాశపుటకే ముక్తౌ భుక్తౌ పిప్పలపత్రకే. 44

హృదా సంభోజనం దత్త్వా పూతై రాచామయేజ్జలైః | దన్తకాష్ఠం హృద కృత్వా ప్రక్షిపేచ్ఛోభ##నే శుభమ్‌. 45

న్యూనాదిదోషమోషాయ మూలేనాష్టోత్తరం శతమ్‌ | విధాయ స్ఠణ్డిలేశాయ సర్వకర్మసమర్పణమ్‌. 46

పూజావిసర్జనం చాస్య చణ్ణశస్య చ పూజనమ్‌ | నిర్మాల్యమపనీయూథ శేషమగ్నౌ యజేచ్చరోః. 47

కలశం లోకపాలాంశ్చ పూజయిత్వా విసృజ్య చ | విసృజేద్గణమగ్నిం చ రక్షితం యది బాహ్యతః. 48

బాహ్యతో లోకపాలానాం దత్త్వా సంక్షేపతో బలిమ్‌ |

భస్మనా శుద్ధతోయైర్మా స్నాత్వా యాగాలయ విశేత్‌. 49

గృహస్థాన్‌ దర్భశయ్యాయాం పూర్వశీర్షాన్‌ సురక్షితాన్‌ |

హృదాసర్భస్మశయ్యాయాం యతీన్‌ ధక్షిణమస్తకాన్‌. 50

శిఖాబద్దశిఖానస్త్ర సప్తమాణవకాన్వితాన్‌ | విజ్ఞాయ స్నాపయేచ్ఛిష్యాన్‌ తతో యాయాత్పునర్భహిః. 51

ఓం హివి హివి త్రిశూలపాణయే స్వాహా.

పఞ్చగవ్యం చరుం ప్రాశ్య గృహేత్వా దన్తధావనమ్‌ |

సమాచత్యు శివం ధ్యాత్వా శయ్యామాస్థాయ పావనీమ్‌. 52

దీక్షాగతం క్రియాకాణ్డం సంస్మరన్సంలిశేద్గురుః | ఇతి సంక్షేపతః ప్రోక్తో విధిర్దీక్షాధివాసనే. 53

ఇత్యాదిమహాపురాణ అగ్నేయే నిర్వాణదీక్షాయామధివాసనవిధిర్నామ త్త్రశీతితమో7ధ్యాయః.

అచట మూడు మండలములు చేసి ముక్తికాము లగు పష్యులను ఉత్తరాభిముఖముగను, భోగకముకలను పూర్వాభి ముఖముగను కూర్చుండబెట్టవలెను. ముందుగా, కుశయుక్త మగు చేతిలో మూడు చాళుకములు పంచగవ్యము త్రాగించవలెను. మధ్య ఆచమనము చేయరాదు. పిమ్మట ఒక్కొక్క శిష్యునికిని మూడు లేదా ఎనిమిది గ్రాసములు చరువు ఇవ్వవలెను. ముక్తికామునకు పలాశపత్రముల దొన్నెయందును,భుక్తికామునకు రావియాకుల దొన్నెయందును చరువు ఇవ్వవలెను. అతడు దంతస్పర్శ కలుగకుండ దానినిభక్షించవలెను. గురువు చేతులు కడిగికొని పవిత్రజలముతో ఆ శిష్యులచే ఆచమనము చేయించవలెను. హృదయ మంత్రముచే దంతధావనము చేసి ఆ కాష్ఠమును పారవేయవలెను. దాని ముఖము శుభదిశ వైపున పడినచో శుభఫలము కలుగును. న్యూనతాదోషపరిహారార్థమై మూలమంత్రముతో నూటఎనిమిది పర్యాయముల హోమము చేయవలెను. కర్మనంతను స్థండిలేశ్వరునకు సమర్పించవలెను. పిమ్మట ఆ శివుని పూజించి, విసర్జించి చండేశుని పూజించవలెను. నిర్మాల్యమును తొలగించి మిగిలిన చరువును అగ్నిలో హోమము చేయవలెను. కలశమునకును, లోకపాలకులకును పూజవిసర్జనములు చేసి, గణములును, అగ్నియు బాహ్య దిక్కున ఉంచబడినచో వాటిని కూడ విసర్జించవలెను. మండలము వెలుపల లోకపాలకులకు కూడ సంక్షిప్తముగ బలి సమర్పించి, భస్మ-శుద్ధ జలములతో స్నానముచేసి యాగమండలమును ప్రవేశించవలెను. గృహస్థులైన శిష్యులను అస్త్రమంత్రముచే రక్షించి కుశశయ్యపై నిద్రింపచేయవలెను. వీరి తల తూర్పు వైపు ఉండవలెను. విరక్తులైన శిష్యులను హృదయమంత్రముచే భస్మశయ్యపై దక్షిణశిరస్కులనుగా పరుండబెట్టవలెను. ఆ శిష్యులందురును ఆస్త్రమంత్రముచే రక్షితులై, శిఖామంత్రముచే తమ తమ శిఖలను బంధించుకొనవలెను. పిమ్మట గురువు వారికి స్వప్నమానవుని గూర్చి చెప్పి మండలమునుండి బైటకు రావలెను. పిమ్మట ''ఓం హిలి హిలి శూలపాణయే నమః స్వాహా'' అను మంత్రముచే పంచగవ్య-చరువల ప్రాశనము చేసి, దంతధావనానంతరము ఆచమనము చేయవలెను. శివుని ధ్యానించుచు దీక్షకు సంబంధించిన కర్మకాండను స్మరించుచు పవిత్రశయనముపై శయనించవలెను. ఈ విధముగ దీక్షాధి వాసనవిధి సంక్షిప్తముగ చెప్పబడినది.

అగ్ని మహాపురాణమున నిర్వాణదీక్షాధివాసనవిధి యను ఎనుబదిమూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters