Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ మహామారీవిద్యా

ఈశ్వర ఉవాచ :

మహామారీం ప్రవక్ష్యామి విద్యాం శత్రువిమర్దినీమ్‌.

ఓం హ్రీం మహామారి, రక్తాక్షి, కృష్ణవర్ణే, యమస్యాజ్ఞాకారిణి, సర్వభూతసంహార కారిణి, అముకం హనహన

ఓం దహ దహ ఓం పచ పచ, భిన్ద భిన్ద, ఓం మారయ మారయ, ఓం ఉత్సాదయ ఉత్సాదయ, ఓం

సర్వవశంకరి, సర్వకామికే హూం ఫట్‌ స్వాహేతి, ఓం మారి హృదయాయ నమః. ఓం మహామారి

శిరసే స్వాహా. ఓం కాలరాత్రి శిఖాయై వౌషట్‌. ఓం కృష్నవర్ణే ఖః కవచాయ

హూం. ఓం తారకాక్షి విద్యుజ్జిహ్వే సర్వసత్త్వభయఙ్కరి రక్ష రక్ష సర్వకార్యేషు హ్రాం త్రినేత్రాయ

వషట్‌. ఓం మహామారి సర్వభూతదమని మహాకాలి అస్త్రాయ హుం ఫట్‌.

ఏష న్యాసో మహాదేవి కర్తవ్యః సాధకేన తు |

శవాదివస్త్రమాదాయ చతురస్రం త్రిహస్తకమ్‌ | కృష్ణవర్ణాం త్రివక్త్రాం చ చతుర్బాహుం సమాలిఖేత్‌. 2

పటే విచిత్రవర్ణైవ్చ ధనుః శూలం చకర్తృకామ్‌ | ఖట్వాఙ్గం ధారయన్తీం చ కృష్ణాభం పూర్వమాననమ్‌. 3

తస్య దృష్టినిపాతేన భక్షయేదగ్రతో నరమ్‌ | ద్వితీయం యామ్యభాగే తు రక్తజిహ్వం భయానకమ్‌. 4

లేలిహానం కరాలం చ దంష్ట్రోత్కటభయానకమ్‌ | తస్య దృష్టినిపాతేన భక్షమాణం హయాదికమ్‌. 5

తృతీయం చ ముఖం దేవ్యాః శ్వేతవర్ణం గజాదినుత్‌ |

గన్ధ పుష్పాది మధ్వాజ్యైః పశ్చిమాభిముఖం యజేత్‌. 6

మన్త్రస్మృతేరక్షిరోగశిరోరోగాది నశ్యతి | వశ్యాః స్యుర్యక్షరక్షాంసి నశామాయాన్తి శత్రవః. 7

సమిధో నిమ్బవృక్షస్య హ్యజారక్తవిమిశ్రితాః | మారయేత్ర్కోధసంయుక్తో హోమాదేవ న సంశయః. 8

పరసైన్యముఖో భూత్వా సప్తాహం జుహుయాద్యది | వ్యాధిభిర్గృహ్యతే సైన్యభఙ్గో భవతి వైరిణః. 9

సమిధోష్టసహస్రం తు యస్య నామ్నా తు హోమయేత్‌ |

అచిరాన్ర్మియతే సోపి బ్రహ్మణా యది రక్షితః. 10

ఉన్మత్తసమిధో రక్తవిషయుక్త సహస్రకమ్‌ | దినత్రయం ససైన్యశ్చ నాశయాయాతి వై రిపుః. 11

రాజికాలవణౖర్హోమాద్భఙ్గోరెః స్యాద్దినత్రయాత్‌ | ఖరరక్తసమాయుక్తహోమాదుచ్చాటయేద్రిపుమ్‌. 12

కాకరక్తసమాయోగాద్ధోమాదుచ్చాటనం హ్యరేః | వధాయ కురుతే సర్వం యత్కిఞ్చిన్మనసేప్సితమ్‌. 13

అథ సంగ్రామ సమయే గజారూఢస్తు సాధకః | కుమారీద్వయసంయుక్తో మన్త్రసన్నద్దవిగ్రహః. 14

దూరశంఖాదివాద్యాని విద్యయా హ్యభిమన్త్రయేత్‌ | మహామాయాపటం గృహ్య ఉచ్ఛేత్తవ్యం రణాజిరే. 15

పరసైన్యముఖో భూత్వా దర్శయేత్తం మహాపటమ్‌ | కుమారీర్భోజయేత్తత్ర పశ్చాత్పిణ్డీం చ భ్రామయేత్‌.

సాధకశ్చిన్తయేత్సైన్యం పాషాణమివ నిశ్చలమ్‌ | నిరుత్సాహం విభగ్నం చ ముహ్యమానం చ భావయేత్‌.

ఏష స్తమ్భో మయా ప్రోక్తో న దేయో యస్య కస్య చిత్‌ | త్త్రైలోక్యవిజయా మాయా దుర్గైవం భైరవీ తథా.

కుబ్జికా భైరవీ రుద్రో నారసింహపటాదినా |

ఇత్యాదిమహాపురాణ యుద్ధజయార్ణవే మహామారీవిద్యా నామ సప్తత్రింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు చెప్పెను : దేవీ; ఇపుడు నేను శత్రుమర్దని యగు మహామారీవిద్యను గూర్చి చెప్పెదను. ''ఓం హ్రీం మహామారి.. హూం ఫట్‌ స్వాహా'' అనునది (మూలోక్తమంత్రము) మహామారీమంత్రము. (మూలోక్తము లైన) ''ఓం మహామారి హృదయాయనమః.. అస్త్రాయహుంఫట్‌'' అనునవి అంగన్యాసాదులు. సాధకుడు ఈ అంగన్యాసమును తప్పక చేయవలెను. శవముపై కప్పిన వస్త్రము తీసికొని వచ్చి చుతరశ్రముగా ఖండించవలెను. దాని పొడవు వెడల్పులు మూడేసి హస్తములుండవలెను. ఆ వస్త్రముపై అనేక విధములైన రంగులతో నల్లని దేవీఆకారాము చిత్రించవలెను. మూడు ముఖములు, నాలుగు భుజములు ఉండవలెను. హస్తములలో ధనస్సు, శూలము, కర్తరి, మంచము కోడు ధరించియుండును. ఆ దేవి ప్రథమముఖము పూర్వదిశాభిముఖమై తన కాంతిచే ప్రకాశింపచేయుచు,దృష్టి పడగనే ఎదుట నున్న మనుష్యుని తినివేయునట్లు ఉండవలెను. రెండవ ముఖము దక్షిణభాగమునందుండవలెను. ఆమె నాలుక ఎఱ్ఱగా, చూచుటకు భయంకరముగా నుండవలెను. వికృతమైన ఆమె ముఖము కోరలతో భయంకరముగా నుండవలెను. నాలుకతో చెక్కిళ్ళు నాకు చుండవలెను. దృష్టి పడగానే ఎదుట నున్న గుఱ్ఱములు మొదలుగువాటిని తినివేయునట్లు ఉండవలెను. దేవి మూడవ ముఖము పశ్చిమాభిముఖమై తెల్లగా ఉండవలెను. దృష్టి పడగనే ఏనుగలు మొదలైనవాటిని తినివేయు నట్లు ఉండవలెను. గంధపుష్పాదులతోను, తేనె నెయ్యి మొదలగు నైవేద్యములతోను దానిని పూజించవలెను, పూర్వోక్తమంత్రమును స్మరించి నంతమాత్రముననే నేత్రశిరోరోగాదులు నశించును. యక్షరాక్షసులు కూడ వశ మగుదురు. శత్రవులు నశింతురు. మనుష్యుడు క్రోధముతో వేపచేట్టు పుల్లలు హోమము చేసినచో తన శత్రువలును చంపగలడు; ఇందు సందేహము లేదు. శత్రుసేనాభిముకుడై ఒక సప్తాహము ఈ సమిధలతో హోమము చేసినచో శత్రుసైన్యము నానావిధరోగపీడితమై నశించును. ఎవని పేరు పెట్టి వెయ్యి సమిధల హోమము చేయబడునో వాడు బ్రహ్మ రక్షించినను మరణించక తప్పదు. వెయ్యి ధత్తూరసమిధలను, రక్తము, విషము కలిపి మూడు దినములు హోమము చుసినచో శత్రువు సైన్యనమేతముగ నశించును ఆవాలు ఉప్పు హోమము చేయగా శత్రుసైన్యమునందు కలవరము పెట్టి శత్రువు పారిపోవును. దానిని గాడిదరక్తముతో కలిపి హోమము చేసినచో శత్రువును పారద్రోలును. పారిపోవలె నని ఆతని మనస్సునందు తావ్రముగ కోరిక పుట్టును. కాకి రక్తము కలిపి హోమము చేసినచో శత్రువును పెకలించివేయవచ్చును. సాధకుడు ఆతనిని చంపుటకు సమర్థుడగును. సాధకుని మనస్సులో కలుగు కోరిక లన్నియు సఫల మగును. సాధకుడు యుద్ధసమయమున ఇరువురుకన్యలతో గజము నెక్కి, పూర్వోక్తమమంత్రముచే అభిమంత్రించి, మహామాయాప్రతిమ ఉన్న వస్త్రమును, యుద్ధరంగమునందు, ఎత్తునుండి ఎగురవేసి, శత్రుసేనాభిముఖుడై ఆ పటమును వారికి చూపవలెను. పిదప ఆ కన్యలకు భోజనము పెట్టవలెను. పిదప మరల పిండిని త్రిప్పుచు శత్రుసైన్యము శిల వలె నిశ్చల మైపోయి నట్లు భావన చేయవలెను. శత్రుసైన్మమున యుద్ధము చేయు ఉత్సాహము పోయి నట్లును, భయముతో పారిపోవుటకు సిద్ధముగా నున్నట్లును కూడ భావన చేయవలెను. ఇట్లు చేయుటచే శత్రుసేనాస్తంభనము కలుగును. నేను చెప్పిన ఈ స్తంభనప్రయోగము ప్రతివానికిని ఉపదేశించరాదు. ఈమె మూడు లోకముల పైనను విజయము నిచ్చు 'మాయ', ఆమె ఆకారముచే చిత్రిత మైన పటము ''మాయాపటము'' దుర్గా-భైరవీ-కుబ్జికా-రుద్రదేవ-నృషింహుల మూర్తులను గూడ ఈ విధముగనే వస్త్రముపై చిత్రించవచ్చును. ఇట్టి పటములచే గూడ స్తంభనప్రయోగము చేయవచ్చును.

అగ్ని మహాపురాణమునందు మహామారీవిద్యావర్ణన మను నూట ముప్పదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madhagni Mahapuranamu-1    Chapters