Sri Madhagni Mahapuranamu-1    Chapters   

అథ షట్త్రింశదుత్తర శతతమోధ్యాయః

అథ నక్షత్రచక్రమ్‌

ఈశ్వర ఉవాచ :

అథ చక్రం ప్రవక్ష్యామి యాత్రాదౌ చ ఫలప్రదమ్‌ | అశ్విన్యాదౌ లిఖేచ్చక్రం త్రినాడీపరిభూషితమ్‌. 1

అశ్విన్యార్ద్రాదిభిః పూర్వా తతశ్చోత్తరఫల్గునీ | హస్తో జ్యేష్ఠా తథా మూలం వారుణం చాప్యజైకపాత్‌. 2

నాడీయం ప్రథమాచాన్యా యామ్యం మృగశిరస్తథా |

పుష్యం భాగ్యం తథా చిత్రా మైత్రం చాప్యం చా వాసవమ్‌. 3

అహిర్భుధ్న్యం తృతీయాథ కృత్తికా రోహిణీ హ్యహిః | చిత్రా స్వాతీ విశాఖా చ శ్రవణా రేవతీ చ భమ్‌.

నాడీత్రితయసఞ్జుష్టగ్రహాద్‌ జ్ఞేయం శుభాశుభమ్‌ | చక్రం ఫణీశ్వరం తత్తు త్రినాడీపరిభూషితమ్‌. 5

రవిభౌమార్కరాహుస్థమశుభం స్యాచ్ఛుభం పదమ్‌ | దేశగ్రామయుతా భర్తృభార్యాద్యా ఏకశః శుభాః. 6

అ, భ,కృ, రో, మృ, ఆ, పు, పు, ఆ, మ, పూ, ఉ, హ, చి, స్వా, వి, అ, జ్యే, మూ, పూ, ఉ, శ్ర,

ధ, శ, పూ, ఉ, రే, అత్ర సప్తవింశతి నక్షత్రాణి జ్ఞేయాని.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ యుద్ధ జయార్ణవే నక్షత్రచక్రం నామ షట్త్రింశదధిక శతతమోధ్యాయః.

పరమేశ్వరుడు పలికెను : దేవీ ! ఇపుడు నక్షత్రముల త్రినాడీచక్రమును గూర్చి చెప్పెదను. ఇది యాత్రాదులలో ఫలదాయకము. అశ్విన్యాది నక్షత్రములలో మూడు నాడులచే భూషిత మగు చక్రమును గీయవలెను. మొదట అశ్వినీ-ఆర్ద్రా-పునర్వసువులను, పిదప ఉత్తరఫల్గునీ-హస్త-జ్యేష్ఠా-మూల-శతభిషక్‌-పూర్వాభాద్రలను వ్రాయవలెను. ఇది ప్రథమనాడి, రెండవ నాడియందు భరణీ-మృగశీర్ష-పుష్య-పూర్వఫల్గునీ, చిత్రా, అనూరాధా-పూర్వాషాడా-ధనిష్ఠ-ఉత్తరాభాద్రలును, మూడవ నాడియందు కృత్తికా-రోహిణీ- ఆశ్లేషా-మఘా-స్వాతీ-విశాఖా-ఉత్తరాషాఢా-శ్రవణ-రేవతులును ఉండును. ఈ మూడు నాడులందున్న నక్షత్రములతో సంబంధించిన గ్రహముల ద్వారా శుభాశుభఫలములు తెలిసికొనవలెను. ఈ త్రినాడీచక్రమునకు ఫణీశ్వరచక్ర మని పేరు. ఈ చక్రమునందలి నక్షత్రములందు సూర్య-కుజ-శని-రాహువు లున్నచో అది అశుభము. ఇతర గ్రహము లున్నచో ఆ నక్షత్రము శుభప్రదము. దేవ-గ్రామ-భ్రాతృ-భార్యాదులు తమ తమ నామముల ఆద్యక్షరములు ననుసరించి ఒకే నాడీచక్రమునం దున్నచో అది శుభకరము. ఇచట నక్షత్రము లనగా అశ్విని మొదలు రేవతి వరకును ఉన్న ఇరువది ఏడునక్షత్రము లని గ్రహించవలెను.

అగ్ని మహాపురాణమునందు నక్షత్రచక్రవర్ణన మను నూటముప్పదియారవ అధ్యాయము సమాప్తము.

అ (49)

Sri Madhagni Mahapuranamu-1    Chapters