Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

ఇరువదినాలుగవ యధ్యాయము - రాజసహాయసంపత్తి

రామః- రాజ్ఞో7 భిషిక్తమాత్రస్య కింను కృత్యతమం భ##వేత్‌ | ఏతన్మే సర్వమాచక్ష్వ సర్వం వేత్తి యతో భవాన్‌ || 1

పుష్కరః- అభిషేకార్ద్ర శిరసా రాజ్ఞా రాజీవలోచన! | సహాయవరణం కార్యం తత్ర రాజ్యం ప్రతిష్ఠితమ్‌|| 2

యదప్యల్పతరం కర్మ తదధై తేన దుష్కరమ్‌ | పురుషేణా7సహాయేన కింతు రాజ్యం మహత్పదమ్‌|| 3

తస్మా త్సహాయా స్వరయే త్కులీనాన్‌ నృపతిః స్వయమ్‌ | శూరానుత్తమజాతీయా న్బలయుక్తాన్‌ శ్రుతా7న్వితాన్‌|| 4

రూప సత్త్వ గణౌదార్యసంయుక్తాన్‌ క్షమయా యుతాన్‌ | క్లేశక్షమాన్‌ మహోత్సాహాన్‌ ధర్మజ్ఞాంశ్చ ప్రియంవదాన్‌|| 5

హితోపదేశికాన్‌ ప్రాజ్ఞాన్‌ స్వామిభక్తాన్‌ యశోర్థినః | ఏవంవిధాన్‌ సహాయాంస్తు శుభకర్మణి యోజయేత్‌|| 6

గుణహీనా నపి తథా విజ్ఞాయ నృపతి స్స్వయమ్‌| కర్మస్వేవ నియంజీత యథాయోగ్యేషు భార్గవ! || 7

కులీనా శ్సీల సంపన్నాః ధనుర్వేద విశారదాః | హస్తిశిక్షా7 శ్వశిక్షాసు కుశలా శ్ల్శక్‌ష్ణ భాషితైః || 8

నిమిత్తే శకున జ్ణానే విత్త వైద్య చికత్సకే| పురుషాంతర విజ్ఞానే షాడ్గుణ్యన వినిశ్చితాః|| 9

కృతజ్ఞాః కర్మణాం శూరాః తథాక్లేశసహా ఋజుః | వ్యూహతత్త్వ విధానజ్ఞః ఫల్గుసారవిశేషవిత్‌|| 10

పరుశురాముడనియె: పట్టాభిషిక్తుడయినంతనే రాజున కనంతర కర్తవ్యమేమో వచింపుమన పుష్కరుడిట్లనియె. అభిషేకా7ర్ద్రశిరస్కుడయిన రాజు సహాయులయిన వారిని గోరుకొనవలెను. వారియందున రాజ్య మాధారపడి యుండును. లేనిచో చిన్న పని కూడ రాజునకు దుష్కరమే యగును. అసహాయునికి రాజ్యాధికార మింకను దుర్లభము, అందువలన రాజుత్తమకులము వారిని శూరులను, ఉత్తమ జాతీయులను, బలసంపన్నులను, పాండిత్యము గలవారిని, రూపము, సత్త్వము గుణసంపద ఔదార్యము క్షమ కలవారిని క్లేశమున కోర్చుకొన గలవారిని, మహోత్సాహులను, ధర్మజ్ఞులను, ప్రియవచనులను, హితోపదేశికులను, ప్రాజ్ఞులను, స్వామిభక్తులను, యశోవాంఛ గలవారిని తనసహాయులనుగా నెన్నికొని మంచిపనులందు వారిని నియోగింపవలెను. గుణము లేనివారిని గూడ గుర్తించి రాజు స్వయముగా వారి కుచితమయిన పనులందేర్పరుపవలెను.

కులీనులు, శీలవంతులు, దనుర్వేదవిశారదులు, హస్తి, హయ శిక్షాశాస్త్ర నిపుణులు, మృదువుగ మాట్లాడువారు, నిమిత్తములు శకునములు తెలిసినవారు, ధనము లెక్కలు తెలిసినవారు, వైద్యులు, సంధివిగ్రహాది షాడ్గుణ్య ప్రయోగము ద్వారమున యోగ్యులని నిర్ధారణగా తెలిసికొనబడినవారు, కృతజ్ఞులు, క్రియాశూరులు, క్లేశసహులు, సహనశీలురు, ప్యూహములను బన్నుటలోని రహస్యము లెరింగినవారు సారాసారగ్రహణ సమర్థులు సేనాపతి సహాయలుగా గ్రహింపనగును.

రాజ్ఞాం సేనాపతిః కార్యో బ్రాహ్మణః క్షత్రియో7థవా | ప్రాంశు స్సురూపో దక్షశ్చ ప్రియవాదీ న చోద్ధతః|| 11

చిత్తగ్రాహశ్చ సర్వేషాం ప్రతీహారో విధీయతే| యథోక్తవాదీ ధూర్త స్స్యాత్‌ దేశభాషావిశారదః || 12

శాబ్దక్లేశసహో వాగ్మీ దేశకాల విభాగవిత్‌ | విజ్ఞాయ దేశం కాలం వా హితం య త్స్యాన్మహీక్షితః|| 13

వక్తా7పి తస్య యః కాలే స దూతో నృపతే ర్భవేత్‌ | ప్రాంశవో వ్యాయతాః శూరా దృఢభక్తా నిరాకులాః || 14

రాజ్ఞా తు రక్షిణః కార్యా స్తదా క్లేశసహా హితాః| అహార్యాశ్చా నృశంసాశ్చ దృఢభక్తాశ్చ పార్థివే|| 15

తాంబులధారీ భవతి నారీ చా7ప్యథ తద్గుణా| షాడ్గుణ్యవిధి తత్త్వజ్ఞో దేశభాషా విశారదః || 16

సంధివిగ్రహకః కార్యో రాజ్ఞో నయవిశారదః | అయవ్యయజ్ఞో లోకజ్ఞో దేశోత్పత్తివిశారద || 17

కృతా7 కృతజ్ఞో భృత్యానాం జ్ఞ్యేయ స్స్యా ద్దక్షరక్షితా | సురూప స్తరుణ శ్శూరో దృఢభక్తః కులోచితః|| 18

శూరః క్లేశసహశ్చైవ ఖడ్గదారీ ప్రకీర్తితః | శూరశ్చ బహుయు క్తశ్చ గజా7శ్వరథకోవిదః|| 19

కోశధారీ భ##వే ద్రాజ్ఞః సదాక్లేశ సహశ్చ యః | నిమిత్త శకున జ్ఞాన హయ శిక్షా విశారదః || 20

హయా7యుర్వేద తత్త్వజ్ఞో భూమిభాగవిశేషవిత్‌ | బలా7 బలజ్ఞో రధినాం స్థిరదృష్టి ర్విశారదః|| 21

శూరశ్చ కృతవిద్యశ్చ సారథిః పరికీర్తితః| అనాహార్యః శుచి ర్దక్షః చికిత్సకవచోరతః || 22

సూదశాస్త్ర విధానజ్ఞ స్సూదాధ్యక్షః ప్రశస్యతే| సూదశాస్త్ర విధానజ్ఞా పరా7భేద్యా7కులోద్గతాః||23

సర్వే మహానసే కార్యాః నీచకేశనఖా జనాః | నమశ్శత్రౌ చ మిత్రే చ ధర్మశాస్త్ర విశారదః|| 24

విప్రముఖ్యః కులీనశ్చ ధర్మాధికరణో భ##వేత్‌ | కార్యా స్తథావిధా స్తత్ర ద్విజ ముఖ్యా స్సభాసదః ||25

సర్వదేశాక్షరాభిజ్ఞాః సర్వశాస్త్రవిశారదాః | లేఖకాః కథితా రామః సర్వా7ధికరణషు వై || 26

శీర్షోపేతాన్‌ సుసంపూర్ణాన్‌ సమద్రోణీగతాన్‌ సమాన్‌ | అక్షరాన్‌ విలిఖేద్యస్తు లేఖక స్స వర స్మృతః || 27

ఉపాయవాక్యకుశలః సర్వశాస్త్రవిశారదః | బహ్వర్థవక్తా చా7ల్పేన లేఖక స్స్యాత్‌ భృగూత్తమ! ||28

సేనాపతీ బ్రహ్మణుడుగాని క్షత్రియుడుగాని గావలెను. అతడు ఎత్తయినవాడు రూపవంతుడు దక్షుడు ప్రియవచనుడు నిగర్వి అందరి మనసు గ్రహింపగలవాడునై యుండవలెను. ద్వారపాలకుడు చెప్పినట్లుచేయువాడు, ధూర్తుడు (ఉద్ధతుడు) దేశభాషలు తెలిసినవాడు, శబ్దక్లేశమును (ఎదుటివాడు విపరీతముగా మాట్లాడినను) సహించువాడు, మంచి వక్త, దేశ కాల విభాగములు తెలిసినవాడునై రాజునకు హితవుసేయువాడు, సమయములో చెప్పదగిన మాట చెప్పగలవాడుగా నుండవలెను. ఎత్తు గలవారు, కండపుష్టి గలవారు, శూరులు, దృఢభక్తులు, అందోళన లేనివారు, పరులు లోభ##పెట్టిన లొంగనివారు ఉదారగుణ సంపన్నులు రాజునందు దృఢభక్తిగలవారు రాజున కంగరక్షకులుగా నుండవలెను. తాంబూలధారి పురుషుడుగాని ఆడుది గాని యుత్తమగుణ సంపత్తి గలిగి యుండవలెను. సంధి విగ్రహాది షాడ్గుణ్య సంపత్తి గలవాడు దేశభాషలో నిపుణుడు సంధిని విగ్రహమును దెలిసినవాడు రాజులకు నీతి నిపుణుడుగా నుండవలెను. ఆదాయ వ్యయములు తెలిసినవాడు, లోకజ్ఞానము కలవాడు, ఆయాదేశముల యుత్పత్తి బాగుగా నెరిగినవాడు, భృత్యులు చేసినది చేయనిది యగు పనిని తెలిసికొనువాడు, దక్షులను రక్షించువాడు, సురూపి, వయసువాడు, శూరుడు, దృఢభక్తుడు, ఉన్నతకులుడు, క్లేశసహుడు, ఖడ్గధారియై యుండవలెను. రాజు వెంట కత్తి చేబట్టి యంగరక్షకుడుగా నుండువాడు (సుబేదారు) శూరుడు బహుయుక్తుడు గజాశ్వరధ నిపుణుడు క్లేశసహుడు కోశధారిగా నుండవలెను. నిమిత్తములు శకునములు తెలసినవాడు గజాశ్వశిక్షా నిపుణుడు ఆశ్వాయుర్వేదము బాగుగా నెరిగినవాడు భూమిభాగ వివేకముగలవాడు (భూగోళజ్ఞుడు) రధికులబలాబలములు గ్రహింపగలవాడు, స్థిరదృష్టిగలవాడు, నేర్పరి, శూరుడు, రథవిద్యలో నారితేరినవాడు సారథిగా నుండవలెను. సూదాధ్యక్షుడు (వంటవాండ్రకు నాయకుడు) ఇతరులవలలో పడనివాడు, (అనాహార్యుడు) శుచి, దక్షుడు, వైద్యుల సలహాయెడ నాసక్తి గలవాడు, పాకశాస్త్ర విధానములు తెలిసినవాడు పాకశాలా ధ్యక్షుడిగా నుండవలెను. విశేషించి పాకాధ్యక్షులు రాజశత్రవుల బేధమునకు లొంగనివారుగా నుండి తీరవలెను. మంచి కులమువారు గావలెను. వంటశాలలో వారికి తోడుగా నున్నవారికి జుట్టు, గోళ్ళు మిక్కిలిగా నుండరాదు. శత్రు మిత్ర భేధము లేనివాడు ధరశాస్త్రజ్ఞుడు విప్రముఖ్యకులుడు ధర్మాధికారిగా నుండవలెను. ధర్మస్థానములో (న్యాయస్థానమందు) సభాసదులు ద్విజముఖ్యు లుండవలెను. సర్వదేశాక్షర (లిపి) జ్ఞానము గలవారు సర్వశాస్త్రవిశారదులు సర్వాధికరణములందు (సర్వరాజ్యాంగశాఖలందు) లేఖకులుగా వ్రాతగాండ్రు (గుమస్తాలు) నుండవలెను. మంచి లేఖకునిలక్షణము లేమనగా, అతడు వ్రాయు నక్షరములు తలకట్లు సరిగ నిండుగల్గి సమద్రోణిగతములై సమములుగా నుండవలెను. (ద్రోణి యనగా నిక్కడ వర్తులాకారముగ వట్రసుడులు గుడులు) అవి సమముగ ఒకవైపు హెచ్చు ఒకవైపు తక్కువ లేకుండా నుండవలెను. ఉపాయవాక్య కుశలుడు సర్వ శాస్త్రజ్ఞుడు కొలదిలో బహుళార్ధమును చెప్పగలవాడుగా లేఖకుడుగా నుండవలెను.

పురుషాంతరతత్వజ్ఞాః ప్రాంశవశ్చా7 ప్యలోలుపాః | ధర్మా7ధికరణ కార్యాః జనా7హ్వానకరాః నరాః || 29

ఏవంవిధా స్తథా కార్యా రాజ్ఞో దౌవారికా జనాః | లోహ వస్త్రాదిధాతూనాం రత్నానాం చ విభాగవిత్‌ || 20

విజ్ఞాతా ఫల్గు సారాణాం త్వనాహార్యః శుచి స్సదా| నిపుణశ్చా7 ప్రమత్తశ్చ ధనా7ధ్యక్షః ప్రకీర్తితః|| 31

ఆయద్వారేషు సర్వేషు ధనా7ధ్యక్ష్య సమా నరాః | వ్యయద్వారేషు సర్వేషు కర్తవ్యాః పృథివీక్షితా|| 32

పరం పారం గతోయ స్స్యాత్‌ అష్టాంగేషు చికిత్సితే | అనాహార్య స్స వైద్య స్స్యా ద్ధర్మాత్మా చ కులోద్గతః || 33

ప్రాణా7చార్య స్స విజ్ఞేయో వచనం తస్య భూభుజా | రామ! స్నేహాత్సదా కార్యం యథా కార్యం పృథగ్జనైః || 34

ఎదుటివారి హృదయము తెలిసికొనగలవారు ఉన్నతులు అలోలుపులు (లోభపడని వారు లంచములు మొదలయిన వానిపై నాశపడనివారు) జనుల నాహ్వానించి రప్పింపగలవారు ధర్మాధికరణ మందు న్యాయాధిపతులుగా నుండవలసిన వాడు రాజు మొక్క దౌవారికులు గూడ (ద్వారపాలురు) యీ చెప్పిన న్యాయాధీశుల లక్షణములు గలవారై యుండవలెను. లోహములు వస్త్రములు ధాతువులు రత్నములు నను వాని విభాగములు బాగ తెలిసినవాడు వస్తువులలో నాణములలో ఫల్గువేదో (నిస్సారము చెల్లనిది) సారమేదో తెలిసినవాడు, అనాహార్యుడు (లంచములు మొదలైనవానిచే లోభ##పెట్టి లోబరుచు కొనుటకు లొంగని వాడు) శుచి, నిపుణుడు జాగరూకుడు (అప్రమత్తుడు)నై ధనాధ్యక్షుడు (కోశాగారాధిపతి) ఉండవలెను. ఆయద్వారమందు జమలు సేసికొనుట యందెల్లెడ కోశాగారములందు (ట్రెజరీలలో) ధనాధ్యక్షునితో సమానులుండవలెను. వ్యయద్వారమందు పైని చెప్పిన లక్షణములు గలవారినే నియోగింపవలెను. (ఆయము = క్రెడిట్‌, వ్యయము = డెబిట్‌) వైద్యశాస్త్రమందు అష్టాంగమందు పారంగతుడు అనాహార్యుడు (ఇతరులకు లొంగనివాడు) ధర్మాత్ముడు కులోన్నతుడు రాజునకు వైద్యుడుగా నుండవలెను. అతడు రాజునకు ప్రాణాచార్యుడని యెరుంగ నగును. రాజు తక్కిన ప్రజలట్లు స్నేహముతో నాతని మాట నక్షరశః పాటించి తీరవలెను.

హస్తిశిక్షా విధానజ్ఞో వనజాతివిశారదః | క్లేశక్షమ స్తథా రాజ్ఞో గజాధ్యక్షః ప్రశస్యతే|| 35

ఏతై రేవ గుణౖ ర్యుక్తో స్వాధీనశ్చ విశేషతః | గజారోహో నరేంద్రస్య సర్వకర్మసు శస్యతే||36

హయశిక్షావిధానజ్ఞో స్తచ్చికిత్సితపారగః | అశ్వాధ్యక్ష్యో మహీభర్తుః స్వాసనశ్చ ప్రశస్యతే|| 37

అనాహార్యశ్చ శూరశ్చ తథా ప్రాజ్ఞః కులోద్గతః | దుర్గాధ్యక్షః స్మృతో రామ ఉద్యుక్త స్సర్వకర్మసు|| 38

వాస్తువిద్యా విధానజ్ఞో లగ్నహస్తో జితశ్రమః | దీర్ఘదర్శీ చ శూరశ్చ స్థపతిః పరికీర్తితః|| 39

యంత్రముక్తే పాణిముక్తే అముక్తే ముక్తధారితే | అస్త్రాచార్యో నియుద్ధే చ కుశలశ్చ తథేష్యతే || 40

పంచాశదధికా నార్యః పురుషాః సవ్తతి స్తథా | అంతః పురచరాః కార్యా రాజ్ఞా సర్వేషు కర్మసు|| 41

స్థవిరా జాతి తత్త్వజ్ఞాః సతతం ప్రతిజాగ్రతః | రాజ్ఞః స్యా దాయుధా7గారే దక్షః కర్మసు చోద్యతః||42

కర్మాణ్యపరిమేయాని రాజ్ఞాం భృగుకులోద్వహ! | ఉత్తమా7ధమ మధ్యాని బుద్ధ్వా కర్మాణి పార్ధివః|| 43

గజశిక్షా విధాన మెఱిగిన వాడు వనగజజాతుల దెలిసిన నిపుణుడు క్లేశసహుడు గజాధ్యక్షుడుగా నుండవలెను. ఈ లక్షణములతో కూడి రాజునకు స్వాధీనుడైన గజారోహకుడు సర్వకార్యములందు ప్రశస్తుడై యుండవలెను. అశ్వశాస్త్రము అశ్వశిక్షా విధానము గూడ తెలిసినవాడు అశ్వచికిత్సయందు కడుసమర్థుడైనవాడు అశ్వాధ్యక్షుడుగా నుండవలెను. అతడశ్వారోహణమందు గూడ సమర్ధుడగునేని ప్రశస్తుడగును. దుర్గాధ్యక్షుడు అనాహార్యుడు (పరుల భేధ తంత్రములకు లొంగనివాడై శూరుడై ప్రాజ్ఞుడై కులోన్నతుడై సర్వరాజ కార్యము లందు నుద్యుక్తుడై యుండువాడు) స్థపతి (శిల్పి) వాస్తు విద్యా విధానములు తెలిసి శ్రమకు తట్టుకొని దీర్ఘదర్శియు శూరుడైన లగ్నహస్తుడు (బాగుగా శిల్పమందుమెదలినచేయిగలవాడు) గావలెను. ఆస్త్రాచార్యుడు యంత్రప్రయోగమందు హస్తప్రయోగమందు సర్వవిధప్రయోగమందు శత్రువు ప్రయోగించిన దానిని తట్టుకొనుటలో యుద్ధమందు కుశలుడై యుండవలెను. అంతఃపుర చారులుగా నేబది మందికి మించి స్త్రీలు డెబ్బది మందికి మించి పురుషులను నేర్పరుప వలెను. వారందరు పెద్దవాండ్రు జాతి తత్త్వ మెఱిగినవారు నిరంతర జాగరూకులునై రాజు కార్యములం జక్కబెట్టువారై యుండవలెను. రాజు యొక్క ఆయుధశాల యందు మంచి సమర్ధుడై పనులయందు గట్టిగ నెప్పుడు సంసిద్దుడుగా నుండవలెను. రాజుయొక్క మాధమకార్యక్రమము లనేకములుత్తమ మధ్యమాధమములుగా నుండును గాన వానియందుత్తమమధ్యమాధములను నియోగింపవలెను.

ఉత్తమా7ధమ మధ్యాంస్తు పురుషాన్‌ వినియోజయేత్‌ | యత్కర్మణి విపర్యాసా ద్రాజా నాశ మవాప్నుయాత్‌|| 44

నియుక్తపురుషే భక్తిం శ్రుతం శౌర్యం బలం కులమ్‌ | జ్ఞాత్వా వృత్తిర్విధాతవ్యా పురుషాణాం మహీక్షితా|| 45

పురుషాంతర విజ్ఞానే తత్త్వ మాత్ర నిబంధనా | నరేంద్ర లక్ష్మ్యా ధర్మజ్ఞా స్తత్రా7యత్తో భ##వే న్నృపః|| 46

స్వభృత్యాశ్చ తథా పుష్టాః సతతం ప్రతిమానితాః| రాజ్ఞా సహాయాః కర్తవ్యాః పృథివీం జేతు మిచ్ఛతా|| 47

యథార్హం చా7థసుభృతా న్రాజా కర్మసు యోజయేత్‌| ధర్మిష్ఠాన్‌ ధర్మకార్యేషు శూరాన్‌ సంగ్రామ కర్మణి|| 48

నిపుణా నర్థకృత్యేషు సర్వత్ర చ తథా శుచీన్‌| స్త్రీషు షణ్డా న్ని యుంజీత తీక్షాన్‌ దారుణకర్మసు|| 49

ధర్మే చార్థే చ కామే చ భ##యే చ భృగునందనః | రాజా యథార్హం కుర్యా త్తాన్‌ హ్యుపధాభిః పరీక్షితాన్‌ || 50

సమతీతో యధార్హాయాం కుర్యా ద్ధస్తివనేచరాన్‌ | ఉత్పాదాన్వేషణ యత్తా నధ్యక్షాంస్తత్ర కారయేత్‌ || 51

అట్లుగాక అయాపనులు తారుమారు సేయువారేని రాజు నష్టపడును, ఆయా పనుల యందు నియోగింపబడు వాని యందు స్వామిభక్తి శ్రుతము (వినుకరి) పాండిత్యము శౌర్యము బలము కులమునుం దెలిసి వానికి వృత్తి (ఉద్యోగము) విధింపవలెను. వారు మునుష్యుల లోతుపాతులు తెలియుటలో మంచి లోతయినభావము గలిగి రాజ్యలక్ష్మి యొక్క ధర్మము నెఱింగిన వారై యుండవలెను. అట్టివారి మీద రాజాధార పడి యుండవలెను. రాజుయొక్క చారులు (భృత్యులు) పుష్టిగా నుండవలెను. ఎల్లప్పుడు రాజుచే గౌరవింప బడుచుండవలెను. పృథివిం గెలువగోరు రాజున కట్టి భృత్యవర్గము సహాయులై యుండవలెను. తగిన రీతి భరింపబడువారిని మాత్రమే (భ్యత్యులకు) తన కార్యక్రమములందు - యుద్ధకార్యక్రమమందు ఆర్ధిక వ్యవహారములయందును నియోగింపవలెను. వారందరు శుచిత్వము గలవారు గావలెను. (శుచియనగా నిక్కడ పరోక్షముగా ప్రత్యక్షముగా వారి వారి యోగ్యత పరీక్షించి వీరు పరిశుద్ధులే యని తేల్చుకొనబడినవారు, దారుణములయిన పనులలో తీవ్ర స్వభావులైన స్త్రీరూప నపుంసకులను నియోగింపవలెను. (పేడి-కొజ్జాలు అని వీరి నందురు) ధర్మమునందు అర్ధమునందు కామమునందును ముందు జాగ్రత్తగా పరీక్షించినవారినే గ్రహింపవలెను. యథావిధిగా సత్కరించుటలో నందరి నతిక్రమించి రాజు గజవనమందు సంచరించువారిని నియోగించి గజ సముత్పాదనమందు జలలను వెదకుటలోను నిమగ్నులైన వారినందరిని గజబలాధ్యక్షులుగా నియోగింపవలెను.

ఏవమాదీని కర్మాణి యత్నైః కార్యాణి భార్గవ! | సర్వథా 7న్వేషతే రాజ్ఞః తీక్షోణపకరణక్షయః|| 52

పాపసాధ్యాని కర్మాణి యాని రాజ్ఞాం భృగూత్తమ! | సంత స్తాని న కుర్వంతి తస్మా త్తాన్‌ భిభృయా న్నృపః|| 53

నేష్యతే పృధివీశానాం తీక్షోపకరణ క్షయః| యస్మిన్‌ కర్మణి యస్య స్యా ద్విశేషేణ చ కౌశలమ్‌|| 54

తస్మిన్‌ కర్మణి తం రాజా పరీక్ష్య వినియోజయేత్‌ | పితృపైతామహాన్‌ భృత్యాన్‌ సర్వకర్మసు యోజయేత్‌|| 55

వినా దాయాదకృత్యేషు తత్ర తే హి సమాసతః | రాజా దాయాదకృత్యేషు పరీక్ష్య స్వకృతా న్నరాన్‌|| 56

నియుంజీత మహాభాగః తస్యతే హితకారిణః | పరరాజగృహాత్‌ ప్రాప్తాన్‌ జనసంగ్రహకామ్యయా|| 57

దుష్టన్వా7 ప్యధవా7దుష్టాన్‌ సంశ్రయేత ప్రయత్నతః | దుష్టం విజ్ఞాయ విశ్వాసం న కుర్యా త్తత్ర భూమిపః|| 58

వృత్తిం తస్యా7పి వర్తేత జనసంగ్రహ కామ్యయా | రాజా దేశాంతర ప్రాప్తం పురుషం పూజయేత్‌ భృశమ్‌|| 59

సహాయం దేశసంప్రాప్తం బహుమానేన చిన్తయేత్‌ | కామం భృత్యార్జనం రాజా నైవ కుర్యా ద్భృగూత్తమః || 60

న వైవాసం విభక్తంతు భృత్యం కుర్యా త్కథంచన | శస్త్ర మగ్నిం విషం సర్పాన్‌ నిస్త్రింశ మపి చైకతః|| 61

భృత్యా మనుజ శూర్దూలః కుభృత్యాశ్చ తథైకతః తేషాం చారేణ విజ్ఞానం రాజా విజ్ఞాయ నిత్యశః || 62

గుణినాం పూజనం కుర్యాత్‌ నిర్గుణానాం చ శాసనమ్‌ | కథితా స్సతతం రామ ! రాజానశ్చారచక్షుషః || 63

స్వదేశే పరదేశే చ జాతిశీలాన్‌ విచక్షణాన్‌ | అనాహార్యాన్‌ క్లేశసహాన్‌ నియుంజీత సదా చరాన్‌ || 64

జనస్యా7విదితాన్‌ సౌమ్యాన్‌ తథా7జ్ఞాతాన్‌ పరస్పరమ్‌ | వణిజో మంత్రకుశలాన్‌ సాంవత్సర చికిత్సితాన్‌ || 65

తథా ప్రవ్రజితా7కారాన్‌ రాజా చారా న్నియోజయేత్‌ | నైకస్య రాజా శ్రద్దధ్యా చ్చారస్యౌ7పి చ భాషితమ్‌|| 66

ద్వయో స్సంవాద మాజ్ఞాయ సందధ్యాత్‌ నృపతి స్తతః | పరస్పరస్యా 7విదితౌ యది స్యాతాం నతా వుభౌ || 67

తస్మా ద్రాజా ప్రయత్నేన గూఢాం శ్చారాన్‌ ప్రయోజయేత్‌ | రాజ్యస్య మూల మేతావత్‌ యద్రాజ్ఞః చారదృష్టితా ||

చారాణా మపి యత్నేన రాజ్ఞా కార్యం పరీక్షణమ్‌ | రాగా7 పరాగౌ భృత్యానాం జనస్య చ గుణా7గుణాన్‌ || 69

శుభానా మశుభానాం చ విజ్ఞానం రామః కర్మణామ్‌ | సర్వం రాజ్ఞాం చరా7 యత్తం తేష్వా7యత్త స్సదా భ##వేత్‌ || 70

కర్మణా కేన మే లోకే జన స్సర్వో7నురజ్యతే |

విరజ్యతే తథా కేన విజ్ఞేయం తన్మహీక్షితా | విరాగజననం సర్వం వర్జనీయం ప్రయత్న తః || 71

జనా7నురాగ ప్రభవో హి లక్ష్యో | రాజ్ఞాం యతో భార్గవవంశచంద్రః | 72

తస్మా త్ప్రయత్నేన నరేంద్ర ముఖ్యైః | కార్యో7నురాగో భువి మానవేషు ||

ఇతి శ్రీ విష్ణుధర్మోత్తరే - ద్వితీయఖండే సహాయసంపత్తిర్నామ చతుర్వింశో7ధ్యాయః.

రాజు ఈచెప్పిన సహాయభృత్య సంగ్రహమందు ప్రయత్న పూర్వకముగ నాయా పనలు చేసి తీరవలెను. తీక్‌ష్ణపకరణ క్షయము రాజునకు సర్వథా పనికి రాదు. భృత్యాదిసాధనమలు తీక్‌ష్ణకార్య కరణ సమర్థములు, వాని నేమాత్రము తగ్గించుకొనరాదు. రాజుయొక్క పనులు కొన్ని పాపులచే సాధింపవలసి యుండును. అట్టి పాపసాధ్యములయిన పనులను (ఉరితీయుట మొదలయిన కార్యక్రమాలను) సత్పురుషులు చేయరు. కావున నందులకు కటిక వాండ్రును చేర్చుకొనుట రాజునకు విధి. వారిని భరించి తీరవలెను. రాజు వారిని తగ్గింపరాదు. ఏ పని యందెవనికి నేర్పుండునో దానియందే వానిని పరీక్షించి నియోగింపవలెను. ఏ పనుల యందైనను పితృపితామహాదుల దగ్గరనుంచి పని చేసిన వారిని నియోగింప వచ్చును. అయినను జ్ఞాతుల తోడివ్యవహారము లందు మాత్రము వారిని నియోగింపరాదు. (ఆ జ్ఞాతులతో రాజబంధువలతో వారికి చిరకాల సంబంధ ముండుటం బట్టియది ప్రమాదము గావచ్చునన్న మాట). జ్ఞాతులతోడి పనులయందు తాను బాగుగా పరీక్షించిన వారినే నియమింప వలెను. వారే రాజునకు హిత మాచరింతురు. శత్రురాజ గృహముల నుండి వచ్చిన భృత్యులను మాత్రము రాజు జననం గ్రహము కోరి దుష్టలయినను ఆ దుష్టులైన వారిని తాను ప్రయత్నముతో నాశ్రయింపవలెను. ఆ శత్రుగృహాగతుడు దుష్టుడని తోచెనేని వాని యొడ నమ్మకము గొనరాదు. అయినను జనసంగ్రహ మవసరము గావున వానికి గూడ వృత్తి(ఉద్యోగ) కల్పనము చేయవలెను. దేశాంతరమునుండి వచ్చిన మనుష్యుని రాజు లెస్సగా బూజింపవలెను. సబహుమానముగ వానిం భావింపవలెను. (వానివలన పరరాజ రహస్యములు తెలిసికొనుట కవకాశముండును) అట్లని హద్దుమీరి భృత్యార్జనమును రాజు సేయరాదు. భృత్యుని వైవాసుని (దేశమునుండి పరవాసము పంపబడిన వానిని) జేయరాదు. వానిని వివిక్తునిగ (ఒంటరిగా నేకాంతమందు బంధితుని) కూడ చేయరాదు. అది ప్రమాదమునకు కారణము. అట్లు-వివాసము-వివిక్తము చేయకూడని వస్తువులు శస్త్రము-అగ్ని-విషము సర్పము-కత్తియునైయున్నవి. వీని వివాస మొనరించినచో ( ఉన్న చోటుందప్పించి వివాసముగావించినచో) లేక ఒంటరిగ నుంచినచో వానివలన ప్రమాదము రాక తప్పదు. కావున ఆ వస్తువులలో భృత్యులును జేరుదు రన్నమాట.) ఓ పురుషోత్తమ! భృత్యుడెవడో కుభృత్యు డెవడో చారుల వలన నృపతి తెలిసికొన గుణవంతులం బూజించి గుణహీనులను శాసింపవలెను. అందులకే రాజులు చారచక్షువు లని చెప్పబడినది. రాజులకు చారులే కండ్లన్నమాట. తన దేశమున పరదేశమున జాతి శీలురను విచక్షణులను లంచములు మొదలయిన వాని చేత లోబరుచుకొనవీలు గాని వారిని క్లేశసహులనునగు చారులను నియోగింపవలెను. ఆచారులు రహస్య రక్షకభటులు (అనగా జనమునందు విస్తృతులుగాని వారు) అనగా జనములో పరిచయముగా దిరుగువారు గాకూడుదు. సౌమ్యులై వారిలో వారి నెఱింగినవారు గాకుండ వలెను. వర్తకులు మంత్ర కుశలురు జ్యోతిషికులు వైద్యులు, సన్యాసులు వేషమున నున్న వారలను చారులుగా నియోగింపవలెను. ఆచారులలో గూడ నొక్క చారుని మాటను రాజు నమ్మ కూడదు దానినే యిద్దరు ముగ్గురు చారులౌనని బలపరచిన యెడల నమ్మవలెను. అందువలననే రాజు గూఢచారుల నెర్పరుపవలెను. చారదృష్టిత్వమిది రాజ్యమునకు మూలము. రాజు ప్రయత్నపూర్వకముగ చారలక్షణ పరీక్ష చేయవలెను. భృత్యుల రాగము అవరాగము గుణము అగుణమును ఆయా పనుల శుభాశుభ విజ్ఞానము నంతయు చారాయత్తమై యున్నది. తానే పని చేసిన సర్వజనము తన యందనురక్త మగునో విరక్త మగునో, మహీపతి తప్పక యెఱుగ వలెను. జనము విరక్త మగునన్న పని యత్నపూర్వకముగా మానవలెను. జనుల యనురాగ సంభవము రాజు తప్పక తెలిసికొన వలెను. గావున మేదినీశుడు సర్వప్రయత్నములచే ప్రజల యెడ యనురాగము చూప వలెను.

ఇది శ్రీవిష్ణుధర్మోత్తర మహాపురాణము ద్వితీయఖండమున రాజసహాయసంపత్తియను నిరువదినాల్గవ యధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters