Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters   

నూట అరువది మూడవ అధ్యాయము - యాత్రాశకున వర్ణనము

రామః - భగవన్‌ ! సర్వధర్మజ్ఞః సర్వశాస్త్రవిదాం వర! | యాత్రాకాల విధానంమే కథయస్వ మహీక్షితామ్‌ ||

పుష్కరః యదా మన్యేత నృపతి రాక్రందేన బలీయసా | పార్షిగ్రాహేణా7 భిభూతస్తదా యాత్రాం ప్రయోజయేత్‌ |

పుష్టా మే7ద్య భృతాభృత్యా ప్రభూతంచ బలం మమ | మూల రక్షా సమర్థో7స్మి తదాయాత్రాం ప్రయోజయేత్‌ ||

పార్షిగ్రాహాదికం సైన్యం మూలే నిక్షిప్యవా వ్రజేత్‌ | చైత్రం వామార్గశీర్షంవా యాత్రాం యాయా న్నరాధిపః ||

క్రీచైత్యాం సస్యంహి నందాద్యం హన్తి పుష్టించ శారదం | ఏతదేవ విపర్యస్తం మార్గశీర్ష్యాం నరాధిపః ||

పరశురాముడు భగవంతుడా! సర్వధర్మజ్ఞ! నర్వశాస్త్ర విద్వరిష్ఠ రాజులు యాత్ర (దండయాత్ర) చేయవలసిన కాల మానతిమ్మన పుష్కరుండిట్లనియె. రాజు ఆ బలవంతుడైన ఆక్రందునిచేత = పార్షి గ్రాహుని చేత శత్రువు పరాభూతుడైనట్లు గ్రహించిన తఱివానిపై దండయాత్ర సాగించ వలెను. ఇప్పుడు నా భృత్యులు నాచే బోషింపబడి పుష్టిగా నున్నారు. నాసేన సర్వ సమృద్ధిగా నున్నది. మూలబల రక్షణము నందు నేను సమర్థుడనై యున్నానని యనుకొన్నపుడు దండయాత్రను గావింప వలెను. లేదా పార్షి గ్రాహుడైన రాజుయొక్క సైన్యము కంటె నెక్కువ సేనను మూలమందు (తన సేనాస్థాన మందు) ఉంచియేని దెండెత్త వలెను. చైత్రమున మార్గశీర్షమున యుద్ధయాత్రకు వెడలవలెను.

శత్రోర్వా వ్యసనే యాయా త్కాలఏవ సుదర్లభః | దివ్యాంతరిక్షక్షితిజై రుత్పాతైః పీడితం భృశమ్‌ ||

షడృక్ష పీడనా త్తృప్తం పీడితంచ తధా గ్రహైః | ప్రజ్వలన్తి తధైవోల్కా దిశం యస్య ప్రపద్యతే ||

భూకంపోయాం దిశం యాతి యాంచకేతుః ప్రధూమయేత్‌ | నిర్ఘాతః శ్రూయతే యత్ర తాం యాయా ద్వసుధాధిపః ||

శత్రు విబ్బందులలో నున్నపుడు దండెత్తుట చాల మంచిది. అట్టి సమయము మిక్కిలి దుర్లభము. అది లభించినేని అంతకంటె నుత్తమము లేదన్నమాట. దివ్యములు అంతరిక్షములు భౌమములునైన యుత్పాతములచే మిక్కిలి పీడలో నున్న అఱు నక్షత్రముల కూట మేర్పడి బాధించుచున్నందున గ్రహములారింటి కూడికచే నసంతృప్తుడై తఱి శత్రువు మీదికి దండెత్తవలెను. ఏదిక్కున కొఱవులు పడి మంట లెగయునో, యేదిక్కున భూకంపము బయలు దేరునో, యేదిక్కున కేతుగ్రహము పొగలు రేపునో, పిడుగుపాటు వినిపంచునో యాదిశను రాజు దండెత్తి పోవలెను.

స్వబల వ్యసనోపేతం తధా దుర్భిక్షపీడితమ్‌ | సంభూతాంతర కోపంచ క్షివ్రం యాయా దరిం నృపః ||

యూకా మాక్షిక బహుళం బహు విఘ్నం తధా బిలమ్‌ | నాస్తికం భిన్న మర్యాదం తధా మంగళవాదిచ ||

అపేత ప్రకృతించైవ నిరాశరోంచ తధా జయేత్‌ | విష్టినాయకకం సైన్యం త థాభిన్న పరస్పరమ్‌ ||

వ్యసనాసక్త నృపతిం బలం రాజా నియెజయేత్‌ | గచ్చేత్తు పశ్చా ధర్మజ్ఞ! పురస్తాత్తు విగర్హితైః ||

క్వయాసిః తిష్ఠః మాగచ్ఛః కింతత్ర గమనస్యచ | అన్యేశబ్దాశ్చ యే దృష్టాః తేవిపత్తికరా అపి ||

సైన్యములు బాధలకు లోనై రాజ్యము కఱవునకు గుమిలి ప్రజలు మంత్రులు సామంతులు మొదలగు వారు శత్రురాజునెడ పగగొన్న తఱి నయ్యరిపై వెంటనే యుద్ధ యాత్రచేయవలెను. శత్రుసేన పేలు, ఈగలతో ముసరుకొను చున్నపుడు సేన యనేకములగు విఘ్నములకు గురియగు తఱిని నాస్తక మయినపడు (దైవములేదను భావమునకు వశ##మైనపుడు) హద్దు మీరినపుడు అమంగళములు పలుకునదైనపుడు నైజము తప్పిపోయినపుడు, నిరాశకు వశ##మై దిగులుపడి యున్నపుడు. విష్టినాయకము, వెట్టిచాకిరీ చెయించుకొను నాయకులు గలదియైనపుడు ఒండొరులకు పడకున్న దైనపుడు వ్యసనములకులోనై యున్నపుడు శత్రు రాజుపై సైన్యమును నడిపింపవలెను. యాత్రకెదురుగా చెడ్డది కనిపించినపుడు వినిపించినపుడు రాజు వెనుకకు బోవలెను. ముందునకు యాత్ర నడుపరాదన్న మాట. ఎక్కడికి వెళ్ళుచున్నావు? నిలబడు! పోకు అక్కడ వెళ్ళుట కేమి పనియున్నది? అను నీలాటి అపశ్రుతులు, మాటలు యేవి గోచరించినను యాత్ర వెడలరాదు. వెళ్ళెనో యని విపత్తు దెచ్చిపెట్టగలవు.

ధ్వజాదిషు తధాస్థానం క్రవ్యాదానాం విగర్హితమ్‌ | స్ఖలనం వాహనానాంచ వస్త్రసంగ స్తధైవచ ||

వినిర్గతస్య ద్వారాద్యైః శిరస శ్చాభిఘాతనమ్‌ | ఛత్రధ్వజాది వస్త్రాణాం పతనంచ తథా7శుభమ్‌ ||

దృష్త్వా నిమిత్తం ప్రథమ మమంగళ్యం వినాశనమ్‌ | కేశవం పూజయే ద్విద్వాంస్తధైవ మధుసూదనమ్‌ ||

ద్వతీయేతు తతోదృష్టే ప్రతీపే ప్రవిశేద్గృహమ్‌ | అధేష్టాని ప్రవక్ష్యామి మంగళ్యాని తవానఘః ||

టెక్కము (జెండా) మొదలైన వానమీద గ్రద్ధలు వ్రాలినచో వాహనములు గుఱ్ఱములు, ఏనుగులు రథములు మొదలైనవి తొట్రు పాటొందినను వానిలో వస్త్రమిఱుకు కొన్నను గొడుగు, ధ్వజము, ఉత్తరీయము క్రింద పడిపోయినను నశుభము. అశుభము వినాశకరమునైన శకునము తొలిసారి చూచి వెంటనే మధుడను రాక్షసుని జంపిన కేశవుని బూజింపవలెను. రెండవ యపశకునము గమనించిన మెనుకకు వచ్చి యింటిలో బ్రవేశింప వలెను. యాత్ర సేయరాదన్నమాట. ఇక మంగళ కరములు మనసునకిష్టమగునవియునగు శకునములం దెల్పెద --

శ్వేతాః సుమనసః శ్రేష్టాః పూర్ణకుంభం తధైవచ | జలజాని చ మత్స్యానాంమాంసం మత్స్యాశ్చ భార్గవః ||

గావస్తురంగమా నాగాబద్ధ ఏకఃపశుస్తతః | త్రిదశాః సుహృదో విప్రాః జ్వలితశ్చ హుతాశనః ||

గణికాశ్చ మహాభాగాః పూర్వాచార్యాది గోమయమ్‌ | రుక్మ రౌవ్యంతధా తామ్రం సర్వరత్నాని చాప్యధ ||

ఔషధాని చ సర్వజ్ఞః వచా సిద్ధార్ధకం తధా | నృవర్ధమానం యానంచ భద్రపీఠం తధైవచ ||

ఖడ్గం ఛత్రం పతాకంచ మృదమాయుధమేవచ | రాజలింగాని సర్వాణి

శవం రుదిత వర్జితమ్‌ ||

ఘృతందధి పయ శ్చైవ ఫలాని వివిధానిచ | స్వస్తికం వర్ధమానంచ నంద్యావర్తం సకౌస్తుభమ్‌ ||

నద్యశ్చ చిత్ర విన్యస్తా మంగళ్యా న్యపరాణి చ | అక్షతాశ్చ తధా ముఖ్యాస్తధా దర్పణ మేవచ ||

అంజనం రోచనం చైవ శృంగారో మాక్షికం తధా | శంఖ ఇక్షుస్తధా భక్ష్యా వాచశ్చైవ తధా శుభాః ||

తెల్లని పువ్వులు, పూర్ణకుంభము, తామర పూవులు, చేపలు, మాంసము, గోవులు, గుఱ్ఱములు, ఏనుగులు, పలువునం గట్ట మడిన యొక్క పశువు, దేవతలు సుహృత్తులు (మంచి హృదయము గల వారు) మిత్రులన్న మాట, విప్రులు ప్రజ్వలించు నగ్ని వార స్త్రీలు, ఆవుపేడ, బంగారము, వెండి, సర్వరత్నాలు, ఔషధములు, వస, ఆవాలు, నృవర్ధమానమైన యానము (నరులు మోయు వాహన మన్నమాట) భద్రపీఠము, ఖడ్గము, గొడుగు, మట్టి, ఆయుధము, రాజలింగము లన్నియును ఏడుపు వినపింప కుండ శవము నెయ్యి, పెఱుగు, పాలు, వివిధములయిన ఫలములు స్వస్తికము కౌస్తుభము చిత్తరువునందు వ్రాయబడిన నదులు చిత్ర విన్యాసములు మఱి యంగల మంగళ ద్రవ్యమలు అక్షతలు, అద్దము, కాటుక, గోరోచనము, శృంగారము=తేనే, శంఖము, చెఱకు భక్ష్యము శుభవచనములు.

వాదిత్రాణాంసుఖః శబ్దో గంభీరశ్చ మనోహరః | గాంధార షడ్జబుషభాః యానేశస్తా స్తధాస్వరాః ||

వాయుస్సశర్కరో రూక్షః సచదిగ్భ్యః సమర్థితః | ప్రతిలోమ స్తధా నీచో విజ్ఞేయో భయకృద్ద్విజః ||

అనుకూలో మృదుస్నిగ్ధః సుఖస్వర్శః సుఖావహః | ఋక్షా స్వరాఖడ్గాః క్రవ్యాదాశ్చ విగర్హితాః ||

మంగళ వాద్యముల గంభీర మనోహర ఘోషము గాంధార (గ) షడ్జ (స) ఋషభములు (రి) అను మూడు స్వరములు వినిపించుట ప్రయాణము నందు శుభకరములు ప్రశస్తములు. ధూళిలో పరుషముగా వీచు గాలి అదికూడ నలుదిక్కుల ప్రతిలోమము గాను నీచముగాను వీచునది భయము గల్గించును. అనుకూలముగ మృదువుగ చల్లగ సుఖస్పర్శమై వీచు గాలి సుఖము గల్గించును. ఎలుగుబంట్లు వాని వలె నఱచు ఖడ్గమృగములు గ్రద్ధలు క్రూర జంతువులు నింద్యములు.

వేఘాః శస్తాఘనాః స్నిగ్ధాః గజబృంహిత సన్నిభాః | అనులోమా తడిచ్ఛస్తా శక్రచాపం తధైవచ ||

అప్రశ##స్తే తధా7జ్ఞేయే పరివేష ప్రవర్షణ | అనులోమా గ్రహఃశస్తాది వికృతిస్తు విశేషతః ||

దట్టములయి ఏనుగుల ఘీంకార మట్లు గర్జించు స్నిగ్ధములయిన మేఘములు చక్కని ఛాయగల్గియున్నవియై కనిపించుట శుభశకునము. మెఱపు, ఇంద్రధనుస్సు అనులోమముగ నుండుట శుభము. అవి వెనుకంగాక ముందు గనిపింపవలె నన్నమాట. పరివేషము (సూర్యుని చుట్టు గుడి కట్టుట) విపరీత వర్షముం గురియుట అప్రశస్తములు. గ్రహములనులోమముగ నున్నచో శుభము. విశేషించి యాయా దిక్పాలురును అనులోమముగ గనిపించుట మంచిది.

అస్తిక్యం శ్రద్ధధానత్వం తధా పూజ్యా7భిపూజనమ్‌ | శస్తాన్యేతాని ధర్మజ్ఞ! యచ్చస్యా న్మనసః ప్రియమ్‌ ||

మనస స్తుష్టి రేవాత్ర పరమం జయలక్షణమ్‌ | ఏకత స్సర్వ లింగాని మనస్తుష్టి రధైవతః ||

యానోత్సుకత్వంమనసః ప్రహర్షః సుస్వప్నలాభో మనసః ప్రసాదః |

మాంగళ్య లబ్ధిశ్రవణం చ రామ! జ్ఞేయాని నిత్యం విజయావహాని ||

ఇతివిష్ణు ధర్మోత్తరే ద్వతీయ ఖండే యాత్రాశకున వర్ణనం నామ త్రిషష్ట్యుత్తర శతతమో7ధ్యాయః ||

అస్తిక్యము శ్రద్ధ గల్గియుండుట పూజ్యలం బూజించుట అనునివి ప్రశస్తతమము. మనఃప్రియమైనది. మనస్తుష్టి యొక్కటే పరమోత్తమ విజయలక్షణము. ఈమున్నుజెప్పిన సర్వశుభశకునములోక యెత్తు మనస్తుష్టి యొక్కటి ఒక యెత్తు ''మనోజవంతుమాండవ్యః'' అనుమాట ప్రసిద్ధము. వాహనములుత్సాహ భరితములగుట లేక ప్రస్థానము (ప్రాయాణము) సేయురోజు మనస్సు హర్షభరితముమగుట స్వప్నలాభముమనస్సు ప్రసన్నముగ నుండుట మాంగళ్యవస్తుటాభశ్రవణముననునివి విజయప్రదములని యెప్పుడునెఱుగ నయినవి.

ఇది శ్రీ విష్ణుధర్మోత్తర మహాపురాణమందు ద్వితీయఖండమున యాత్రాశకున వర్ణనమను నూట యరువదిమూడవ అధ్యాయము.

Sri Vishnudharmottara Mahapuranamu-2    Chapters